Acts
Chapter 1
1 ప్రియమైన థెయోఫిలా,నేను నీకు రాసిన మొదటి పుస్తకంలో, 2 యేసును దేవుడు పరలోకంలో చేర్చుకొనే సమయం వరకు యేసు భోదించినవీ,చేసినవీ చాలా విషయాలు నీకు వ్రాసాను.ఆయన పరలోకానికి వెళ్లకముందు,శిష్యులు తెలిసికొనవలసిన విషయాలను పరిశుద్దాత్మద్వారా వారికి ఆజ్ఞాపించాడు. 3 ఆయన శ్రమపడి, సిలువలో చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు. తర్వాత నలభై రోజులు ఆయన చాలామందికి కనపడినప్పుడు,ఆయనను అపోస్తలులు చాలాసార్లు చూసారు.తాను తిరిగి లేచినట్లు ఆయన చాలా రకాలుగా వారికి రుజువు చేసాడు.తన రాజ్యంలో దేవుడు ప్రజలను ఎలా పరిపాలిస్తాడో వారికి చెప్పాడు.
4 ఒకసారి ఆయన వారితో ఉన్నప్పుడు, ఇలా ఆజ్ఞాపించాడు "యేరూషలేమును విడిచి వెళ్ళవద్దు. అందుకు బదులుగా తండ్రి మీకు ప్రమాణం చేసిన పరిశుదాత్మను పొందేవరకు యేరుషలేము లోనే ఉండండి. ఆ సంగతిని గురించి నేను మీతో చెప్పడం మీరు విన్నారు. 5 యోహాను మీకు నీళ్ళతో బాప్తిస్మం ఇచ్హాడు గాని కొన్ని రోజుల్లో దేవుడు మీకు పరిశుదాత్మతో బాప్తీస్మం ఇస్తాడు."
6 ఒకరోజు,అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు ఆయనను ఇలా అడిగారు,"ప్రభువా,నీవు ఇప్పుడు,ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అవుతావా ?" 7 ఆయన ఇలా జవాబిచ్చాడు "ఆ కాలాలను, సమయాలను తండ్రి మాత్రమే నిర్ణయిస్తాడు.వాటిని మీరు తెలుసుకోనక్కర లేదు. 8 అయితే, పరిశుద్దాత్మ మీమీదకు వచ్చినపుడు మీకు శక్తి వస్తుంది.అప్పుడు మీరు నా గురించి యెరూషలేములోను,యూదయ,సమరయ రాష్ట్రాల్లో మరియు ప్రపంచమంతా నా గురించి సాక్ష్యం చెప్తారు."
9 ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఇంక కనపడకుండా ఒక మేఘం ఆయన్ను కప్పివేసింది. 10 అపోస్తలులు ఆకాశం వైపు ఆయన కోసం తీవ్రంగా చూస్తుండగా తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు మనుష్యులు అకస్మాతుగా వారి ప్రక్కన నిల్చున్నారు. వారు దేవదూతలు. 11 వారిలో ఒకరు ఇలా చెప్పారు "ఓ గలలియ మనుష్యులారా, మీరు ఇలా ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? పరలోకానికి వెళ్ళడం మీరు చూసిన ఈ యేసే ఒకరోజున తిరిగి భూమ్మీదకు వస్తాడు.ఆయన ఎలా పరలోకానికి వెళ్ళడం ఇప్పుడు మీరు చూసారో అలాగే తిరిగి వస్తాడు."
12 ఆ దేవదూతలు వారి వద్దనుండి వెళ్ళిపోయిన తరువాత ఆ అపోస్తలులు ఒలీవల కొండనుండి యెరూషలేము తిరిగివెళ్లారు.ఆ పట్టణం అక్కడికి తక్కువ దూరమే. 13 వారు పట్టణంలోకి వెళ్లి వారు ఉంటున్నమేడగది లోనికి. వెళ్లారు. వారెవరంటే పేతురు,యోహాను, యాకోబు,ఆంద్రెయ,ఫిలిప్పు,తోమా,బర్తోలోమయి,మత్తయి,వేరొక యాకోబు;ఇతడు అల్ఫయి కుమారుడు,సీమోను;ఇతడు జెలోతే అని పిలవబడ్డాడు,మరియు యూదా;ఇతడు వేరొక యాకోబు కుమారుడు. 14 ఈ అపోస్తలులందరూ ఎల్లప్పుడూ కలిసి ప్రార్థించడం ప్రారంభించారు.వారితో ప్రార్ధించిన ఇతరులు ఎవరంటే,యేసుతో ఇదివరకు ఉండిన స్త్రీలు,యేసు తల్లి మరియ మరియు ఆయన తమ్ముళ్ళు.
15 ఆ రోజుల్లో 120 మంది యేసు శిష్యులు అక్కడ ఉన్నారు. ఒకసారి పేతురు వారి మధ్యలో నిలబడి ఇలా చెప్పాడు 16 "నా సహోదరులారా,యూదా ఇస్కారియోతు గురించి దావీదు రాజు చాలాకాలం క్రిందట ప్రవచించిన మాటలు లేఖనంలో ఉన్నాయి.ఆ మాటలు నిజం కావలసిన అవసరం ఉండెను.అవి నిజమయ్యెను ఎందుకంటే ఏమి రాయాలో పరిశుదాత్మ దావీదుకు చెప్పాడు.
17 అతడు మనవలె అపోస్తలుడైనప్పటికీ, అతడు యేసుని బంధించి చంపినవారికి సహాయం చేసాడు." 18 అతడు ఈ దుర్మార్గాన్ని డబ్బుకోసం చేసాడు. ఆ డబ్బుతో అతడు ఒక పొలం కొన్నాడు. అక్కడ అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పైనుండి కిందపడి, పొట్టపగిలి,ప్రేగులు బయటికివచ్చి చనిపోయాడు. 19 యెరూషలేము ప్రజలందరూ ఆవార్త విని ఆ పొలానికి వారి అరమేయిక్ భాషలో 'అకల్డెమ' అని పేరుపెట్టారు. ఆ మాటకు 'రక్తభూమి' అని అర్థం, ఎందుకంటే,అది ఒకమనిషి చనిపోయిన స్థలం.
20 పేతురు ఇంకా ఇలాచెప్పాడు ''యూదాకు జరిగినవి కీర్తనలలో చెప్పబడిన ప్రవచనాలని నా నమ్మకం. ఆమాటలు: 'అతని కుటుంబం చనిపోవును గాక; అతని పొలంలో ఎవరూ ఉండక పోవుదురు గాక;' ఈ మాటలు కూడా అతని గురించే చెప్పబడినట్లున్నాయి:'అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక.'
21 కాబట్టి అపోస్తలులమైన మనం అత్యవసరంగా యూదాస్థానాన్ని భర్తీ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి. అతడు మొదటి నుండి మనతో ఉండినవాడై ఉండాలి. 22 అంటే,యోహాను చేత యేసు బాప్తిస్మం తీసుకొన్న రోజునుండి పరలోకానికి వెళ్ళిన సమయం వరకు ఆయనతో ఉండినవాడై ఉండాలి. యూదా స్థానాన్నిభర్తీ చేసే వ్యక్తి, యేసు మరణించి,తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినవాడై ఉండాలి." 23 అప్పుడు అపోస్తలులు,ఇతర విశ్వాసులు ఇద్దరిపేర్లు సూచించారు. వారిలో ఒకరు బర్సబ్బా అనబడిన యోసేపు,ఇతడికి యూస్తు అనే పేరు కూడాఉంది. రెండవ వ్యక్తి మత్తియ.
24 అప్పుడు వారిట్లు ప్రార్ధన చేసారు: "ప్రభువా, యూదా అపోస్తలుడుగా ఉండుటమాని, పాపం చేసి తనకు తగిన స్థలానికి వెళ్ళాడు.
25 ప్రతిమనిషి తన హృదయంలో ఏమి ఆలోచిస్తాడో నీకు తెలుసు.కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు యూదా స్థానంలో అపోస్తాలుడుగా ఉండాలని నీవు నిర్ణయించావో అతనిని మాకు తెలియచెయ్యి." 26 అప్పుడు వారు ఆ ఇద్దరిలోఒకరిని ఎన్నుకోడానికి చీట్లు వేసారు. చీటీ మత్తియ పేరున వచ్చింది. అప్పుడు అతడు ఇతర పదకొండు మంది అపోస్తలులతో కలిసి అపోస్తలుడయ్యాడు.
Chapter 2
1 యూదులు పెంతెకోస్తు పండుగ చేసుకొనుచుండగా, విశ్వాసులందరూ యేరూషలేములో ఒకచోట కూడుకొనిరి. 2 అకస్మాతుగా ఆకాశం నుండి ఒక బలమైన గాలి వంటి శబ్దము వారు వినిరి, ఆ ఇంటిలో కూర్చొనివున్న వారందరూ ఆ శబ్దమును వినిరి . 3 వారు అగ్ని జ్వాలల వంటి వాటిని చూచిరి. ఈ జ్వాలలు విభజింపబడి కూడి వున్నఒక్కొకరి తలలపై వ్రాలుట వారు చూచిరి. 4 విశ్వాసుల౦దరు పరిశుద్దాత్మ చేత నింపబడి, ఆత్మ వారికి శక్తినిచ్చిన కొలది వారికి తెలియని ఇతర భాషలలో మాట్లాడగల్గినారు .
ఆ కాలంలో ప్రపంచమంతటి నుండి వచ్చిన భక్తిగల యూదులు యేరూషలేములో ఉండినారు. 6 వారు ఈ శబ్ధం విని,విశ్వాసులు తమ తమ సొంత భాషలలొ మాట్లాడుట విని ఎంతో ఆశ్చర్యపడ్డారు .
ఆ రీతిగా ఆశ్చర్యపడి, వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, " ఇక్కడ మాట్లాడుతున్నవారందరూ గలీలయా నుండి వచ్చినవారే కదా, కానీ వీరికి మన భాషలు ఎలా తెలుసు?
8 "మనము పుట్టినపట్టినుండి నేర్చుకొనిన భాషలలో వీరు మాట్లాడుట వినుచున్నామే! 9 మనలో కొందరు పార్తీయులు,ఏలాము,మాదీయా,మెసొపొతమియా ప్రాంతీయులము మరియు యూదయ, కప్పదొకియా,పొంతు మరియు ఆసియలోనివారము. 10 మనలో మరికొందరము ప్రుగియ,పంపులియ,ఐగుప్తు,లిబియ,సిరియా మరియు రోమా ప్రాంతముల నుండి యెరూషలేమునకు వచ్చిన వారము. 11 మనలో స్థానిక యూదులు మరియు యూదులు కానివారు వున్నారు, యూదులైన మనము నమ్మినది వారును నమ్ముచున్నారు మరియు మనలో కొందరు క్రేతు దీవులనుండి వచ్చిన వారు కలరు మరియు అరేబియా ప్రాంతములనుండి వచ్చిన యూదులము మరియు గలలీయులైన వీరు., మన భాషలలో దేవుని గూర్చిన గొప్ప సంగతులను మాట్లాడుతున్నారు?"
12 ఆ ప్రజలు జరిగినదానినిబట్టి ఆశ్చర్యపడి ఏమి ఆలోచన చేయలేక, "ఇది ఏమిటో"? అని ఒకరితో ఒకరు అనుకోనుచుండిరి. 13 వారిలో కొందరు దీనిని చూచి విశ్వాసులను అపహాస్యం చేసి,"వీరు క్రొత్త మద్యముతో మత్తులై వున్నారు కాబట్టి ఇల్లా మాట్లాడుచునారు" అని చేప్పుకొనిరి.
14 అప్పుడు పేతురు మిగిలిన పదకొండు మంది అపోస్తులులతో కూడా నిలువబడి వారితో ఇలా అనెను, "యూదావారలారా మరియు యేరుషలేములో వున్నవారలారా, మీరందరు నా మాట వింటే నేను మీకు ఈ సంగతులను గూర్చి వివరించెదను! 15 మీరు అనుకొన్నట్లు మేము మద్యముతో మత్తులము కాలేదు. ఎవ్వడును ఉదయము తొమ్మిది గంటలకు మద్యముతో మత్తులై వుండరు అని మీకు తెలియును కదా!
16 అయితే, మాకు జరిగినది ఒక అద్బుతకార్యము. ఇది చాలా కాలము క్రిందట ప్రవక్త అయిన యోవేలు వ్రాసియుండెను. యోవేలు వ్రాసినది ఏమనగా: 17 దేవుడు, "అంత్యదినములలో నేను నా ఆత్మను అందరికి ఇస్తాను, అప్పుడు మీ కుమారులు, కుమార్తెలు నన్ను గుర్చిన వార్త అందరికి చెప్తారు, మరియు మీ యవనస్తులు నేనిచ్చు దర్శనాలు చూస్తారు, ముసలివారు నేనిచ్చు కలలు కంటారు,
18 అంత్యదినములలో నా పనివారిమీదకి నా ఆత్మను పంపెదను, వారు నన్ను గూర్చిన వార్తను అందరికి తెలియజేయుదురు. 19 ఆకాశములో అద్బుతములు , భూమిమీద వింతలు కలుగుజేసి గొప్ప సంగతులు జరుగును అని నేను మీకు చూపెదను. అప్పుడు ఈ భుమియంతట రక్తము, అగ్ని, పొగ ఉండును.
20 అప్పుడు ఆకాశములో వున్న సూర్యుడు నల్లబడుట మరియు చంద్రుడు ఎర్రబడుట ఈ భూమిమీద వున్నవారు చూచెదరు. ప్రభువైన నేను అందరికి తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు ఈ సంగతులు జరుగును. 21 మరియు నా సహాయము కొరకు ప్రార్థన చేసే వారిని నేను రక్షించేదను."
22 పేతురు తన మాటలను కొనసాగిస్తూ, " సహోదరులైన ఇశ్రాయేలియులారా, నా మాట వినండి! నజరేయుడైన యేసు మన మధ్య ఉండినప్పుడు, దేవుడు మన మధ్యకు ఆయనను పంపించియున్నాడని తన అద్బుత కార్యములు ద్వారా రుజువు పరచెను. ఇదంతయు మనకు తెలియును. 23 ఇది మీకు తెలిసినప్పటికి , మీరు ఈ యేసును శత్రువులకు అప్పగించితిరి . అయినను దీనిని గూర్చి దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగియుండెను. ధర్మశాస్త్రమునకు లోబడనివారికి ఆయనను చంపుటకు మీరు అప్పగించితిరి . వారు ఆయనను మేకులతో సిలువకు కొట్టిరి. 24 ఆయన చనిపోయెను, కానీ దేవుడు ఆయనను మరణమునుండి లేపెను, ఎందుకనగా మరణము ఆయనను దాచి ఉంచలేకపోయెను. దేవుడు యేసును సజీవునిగా లేపెను.
25 చాలాకాలం క్రిందట రాజైన దావీదు, మెస్సియ చెప్పిన దానిని వ్రాసెను - ప్రభువా, నీవు ఎల్లప్పుడు నా మనవిని ఆలకిస్థావని, ఎల్లప్పుడు నీవు నా కుడివైపున ఉన్నావని ఎరిగి నేను నా శత్రువులకు భయపడుట లేదు. 26 నీవు ఎల్లప్పుడు నాకు సహాయము చేయువాడవు కాబట్టి నేను నా హృదయమందు సంతోషించుచున్నాను.
27 నీవు నన్ను మృతుల లోకంలో విడిచిపెట్టవు. నీవు నా శరీరమును కుళ్ళుపట్టనివ్వవు, ఎందుకనగా నేనుఎల్లప్పుడూ నీకు విధేయుడనై ఉన్నాను. 28 నేను తిరిగి సజీవునిగా అగుట ఎలాగో నీవు చూపినావు . నిరంతరము నీవు నాతో వుండెదవు అందుచేత నేను సంతోషి౦చుచున్నాను.
29 పేతురు ఇంకా మాట్లాడుచూ - నా తోటి యూదులారా, మన పుర్వికుడైన దావీదు రాజు చనిపోయేను, ప్రజలు ఆయనను పాతిపెట్టిరి అని మనకు తెలియును. ఆయన సమాధి ఎక్కడవుందో మనకు తెలియును. 30 రాజైన దావీదు ఒక ప్రవక్తగా - తన వంశమందు పుట్టినవాడు రాజుగా ఎల్లప్పుడూ ఉండును అని దేవుడు వాగ్దానం చేసిన దానిని ప్రవచించెను. 31 చాలా కాలము క్రిందట దేవుడు ఏమి చెయ్యనై ఉన్నాడో దావీదు ముందుగానే ఎరిగి, యేసు అనే మెస్సయ్య మరణించి తిరిగి బ్రతుకును అని చెప్పెను. దేవుడు యేసు అను మెస్సయ్యని మరణమునందు విడిచిపెట్టడని, కుళ్ళుపట్టనియ్యడు అని చెప్పెను.
32 యేసు అనే మానవుడు మరణిoచిన తరువాత దేవుడు తిరిగి జీవింపచేసెను. ఆయనను వెంబడించిన మేమందరము దానికి సాక్షులము. 33 దేవుడు, యేసును తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఆయనతో ఏలునట్లు ఆయనను బహుగా ఘనపరచెను . ఆయన మనకు పరిశుదాత్మను ఇచ్చెను, దానినే మీరు ఇప్పుడు ఈ దినమున చూస్తున్నారు , వింటున్నారు.
34 దావీదు, యేసు వలే పరలోకమునకు పోలేదు కనుక దావీదు తనను గుర్చి చెప్పుకోలేదు కానీ యేసును గూర్చి చెప్పుచున్నాడు అని మనకు తెలియును . అదియు కాక దావీదు తనను గూర్చి కాదు గాని యేసు అనే మెస్సియాను గూర్చి చేప్పుచునాడు: ప్రభువు నా ప్రభువైన మెస్సియాతో చెప్పునది ఏమనగా, 35 " నీ శత్రువులను జయించు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండి పరిపాలన చేయుము " అని చెప్పెను . 36 పేతురు తన మాటలను ముగించుచు, "మీరును మరియు ఇశ్రాయేలియుల౦దరు, సిలువవేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను, మెస్సియా గాను నియమించెను అని తెలుసుకొనవలెనని కోరుచున్నాను."
37 పేతురును మిగిలిన అపోస్తులులు చెప్పిన మాటలను ప్రజలు విని, వారు చేసినది తప్పు అని తెలుసుకొనిరి. ఆ ప్రజలు వారితో, "ఇప్పుడు మేము ఏమి చేయవలెను?" అని అడిగిరి. 38 అప్పుడు పేతురు, "మీలో ప్రతివాడును మీ పాపస్వభావమునుండి తిరుగవలెను. ఇప్పుడు మీరు యేసును నమ్మిన యెడల మేము మీకు బాప్తిస్మము ఇచ్చెదము. అప్పుడు దేవుడు మీ పాపములను క్షమించును, అప్పుడు ఆయన మీకు పరిశుద్దాత్మను ఇచ్చును . 39 ఇది మీకును , మీ పిల్లలకును మరియు దూరస్తులైన అందరికి, యేసు నందు విశ్వాసము ఉంచిన వారందరికి ఈ పరిశుద్దాత్మను అనుగ్రహించును అని దేవుడు వాగ్ధానము చేసెను. ప్రభువైన దేవుడు ఎందరినైతే తన పిల్లలుగా ఉoడుటకు పిలచేనో వార౦దరికి పరిశుద్దాత్మను అనుగ్రహించును".
40 పేతురు వారితో మరి ఎక్కువగా, బలముగా మాట్లాడెను. పేతురు ఇలాగున వారితో చెప్పెను , "యేసును తృణీకరించిన దుష్టులకు కలుగు శిక్ష మీకు కలుగకుండునట్లు మిమ్మును రక్షించమని దేవునిని వేడుకొనుడి. 41 కాబట్టి ఆ ప్రజలు పేతురు మాటలు విని బాప్తీస్మం తీసుకొనిరి. ఆ దినమందు విశ్వాసము౦చిన మూడు వేలమంది విశ్వాసుల గుంపులో చేర్చబడిరి. 42 వారు అపోస్తలులు చెప్పిన భోదకు లోబడుచూవుండిరి. ప్రతిదినము వారు మిగిలిన విశ్వాసులతో అనేక సార్లు కలుసుకొనుచు, ప్రార్దన చేయుచు, భోజన౦ చేయుచు౦డెడివారు.
43 దేవుడు అపోస్తలుల ద్వారా చేసిన గొప్ప కార్యములను యేరుషలేములో ఉన్న ప్రజలందరూ చూచి దేవునిని ఘనపర్చిరి. 44 యేసు నందు విశ్వాసము ఉంచిన వారందరు ఏక మనస్సు తరుచుగా కలసుకొనుచుండిరి. వారికీ కలిగిన దానిని ఇతరులతో పంచుకోనిరి. 45 కొందరైతే ఆయా సమయములలో వారికి కలిగిన భూములను, వస్తువులను అమ్మి, అవసరంలో వున్నవారితో పంచుకొనుచుండిరి .
46 ప్రతిదినము వారు ఆలయ ప్రాంగణములో కూడుకొనుచుండిరి, మరియు ప్రతిదినము తమ భోజనము ఇతరులతో సంతోసముగా పంచుకొనుచు, ప్రభు భోజనమును ప్రతి ఇంటిలో ఉత్సాహముగా జరుపుకొనిరి. 47 వారు ఆలాగు చేయుచు దేవుని స్తుతించిరి , యేరుషలేములో వున్నా ప్రజలందరి గౌరవమును పొందుచు౦డిరి. ఈ సంగతులు జరుగుచుండగా, ప్రభువైన యేసు, పాపశిక్ష నుండి రక్షించబడిన ప్రజల యొక్క సంఖ్యను వృద్దిపరచెను.
Chapter 3
1 ఒక రోజున పేతురు,యోహాను దేవాలయపు మండపములోనికి వెళ్లుచుండిరి. అది మధ్యాహ్నం మూడుగంటలకు జనులుప్రార్దించే సమయం. 2 అక్కడ, పుట్టినప్పుడినుంచి నడవలేని ఒక మనిషి సుందరమైన ద్వారము యొద్ద కూర్చుని ఉండెను. కొందరు అతనిని ప్రతి రోజు మోసుకునివచ్చి అక్కడ కూర్చుండబెట్టిరి. 3 పేతురు,యోహానులు దేవాలయములోనికి ప్రవేశించుచుండగా అతడు డబ్బులు భిక్షం అడుగుచుండెను.
4 పేతురు, యోహాను అతనిని సూటిగా చూసి, "మావైపు చూడు" అని పేతురు అనెను. 5 అందుకు అతడు కొంత డబ్బు వారి వద్ద నుండీ ఆశించి ఆశతో వారి వైపు చూచెను. 6 అప్పుడు పేతురు "మావద్ద డబ్బులేమి లేవు కానీ మేము ఏమి చేయగలమో అది చేయుదుము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీవు స్వస్థత పొంది లేచి నడువమని వానితో చెప్పెను."
7 అప్పుడు పేతురు అతని కుడి చేయి పట్టుకుని లేవనేత్తేగా అతడు లేచేను , ఆ క్షణంలో అతని కాళ్ళు, మడములు బలము పొంది 8 అతడు గెంతులు వేయుచు నడిచేను! అప్పుడు అతడు పేతురు, యోహానులతో కలిసి నడుస్తూ, గెంతులు వేస్తూ,దేవుణ్ణి స్తుతిస్తూ మందిరంలోనికి ప్రవేశించేను.
9 అతడు నడుచుటను, దేవునిని స్తుతించుచూ దేవాలయంలో ఉండుటను ప్రజలందరూ చూచి. 10 అతడు సుందరమైన ద్వారము వద్ద నున్నమండపములో కూర్చుని డబ్బులు అడుగుకొను వానిగా గుర్తించారు. కాబట్టి వారు అతనికి జరిగిన దానిని చూచి చాలా ఆశ్చర్యపోయారు.
11 అతడు పేతురును యోహనును అంటిపెట్టుకుని ఉండుట చూసి, ప్రజలందరూ ఆశ్చర్యపడి ఏమి చేయాలో తోచక, సొలోమోను మండపములో ఉన్న పేతురు, యోహానుల యొద్దకు పరుగెత్తుకెళ్ళారు. 12 వారు పరుగెత్తుకుంటూ వచ్చుట చూసి పేతురు ఇట్లనెను "తోటి ఇశ్రాయేలియులారా, ఇతనికి జరిగిన దానిని గూర్చి మీరు ఆశ్చర్య పడనవసరం లెదు. ఇతడిని నడిపించ గల శక్తి మాకుoదని మీరెందుకు అనుకుంటున్నారు?.
13 నిజముగా ఏమి జరిగిందో నేను మీకు తెలియపరుస్తాను. మన పూర్వీకులైన అబ్రహాము,ఇస్సాకు మరియు యాకోబు దేవుడిని ఆరాధించారు,అయితే ఇప్పుడు దేవుడు యేసుని గొప్పగా మహిమపరిచెను. మీ నాయకులు యేసుని పిలాతు దగ్గిరికి తీసికునివచ్చారు. సైనికులు ఆయని చంపాలని చూచిరి. పిలాతు సమక్షములో మీరు యేసుని తిరస్కరినిచినప్పటికి పిలాతు యేసుని విడుదలచేయాలని నిర్ణయించును. 14 యేసు ఇశ్రాయేలియులకు దేవుని మెస్సియ అయినప్పటికిని,మీరు, నీతిమంతుడిని వద్దని నరహoతకుడైన వాడిని విడుదల చేయమని కోరుకొనిరి.
15 మనుషులకు నిత్యజీవమునిచ్చు యేసుని మీరు చంపుదురని దేవుడు ఎరిగెను. కాబట్టి దేవుడు ఆయనని తిరిగి జీవిoప జేసెను. యేసు తిరిగిలేచిన తరువాత మేము అనేకసార్లు ఆయనను సజీవముగా చూసితిమి. 16 మేము యేసు నందు నమ్మకము ఉంచుట వలన, ఇతడును యేసు నoదు నమ్మకముంచిన వలన ఆతడు మరల బలముపొంది మీ అందరి ఎదుట నడుచుట మీరు చూచుచున్నారు.
17 నా తోటి సహోదరులారా, మీరును, మీ నాయకులును యేసు మెస్సియ అని తెలియక ఆయనను చంపితిరని మాకు తెలియును. 18 అయితే, మనుష్యులు యేసుని చంపుతారని దేవుడు ముందుగానే ఎరిగేను. మనుషులు మెస్సియను ఏమి చేయుదురో వాటినన్నిటిని చాలాముందుగానే దేవుడు ప్రవక్తలకు తెలియజేసి వ్రాయమని చెప్పెను. దేవుడు పంపిన మెస్సియా శ్రమపడి మృతి పొందునని ప్రవక్తలు వ్రాసిరి.
19 కాబట్టి మీరు, మీ పాపపు జీవితాలను విడిచిపెట్టి, దేవునివైపు తిరిగి బలము పొందాలని, మీ పాపములు పూర్తిగా క్షేమించమని, దేవునికి ఇష్టులుగా జీవిoచడానికి సహాయము చేయమని దేవుడిని వేడుకోనిడి, 20 మీరు అలా చేసినపుడు దేవుడు సహాయము చేయుట మీరు తెల్సుకుందురు. దేవుడు మీకూ అనుగ్రహించిన మెస్సియాను మరల తిరిగి భూమి మీదకు పంపినప్పుడు. ఆ వ్యక్తే యేసు అని మీరు తెలుసుకొండురు.
21 దేవుడు ఎన్నుకొనిన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా వాగ్ధానము చేసినవి నెరవేర్చి అన్నిటిని నూతన పరుచు వరకు యేసు పరలోకములోనే ఉండును. 22 ఉదాహరణకు, ప్రవక్త మోషే, మెస్సయను గూర్చి చెప్పిన దేమనగా- దేవుడు నా లాంటి ప్రవక్తని మీ మధ్యకు పంపును. ఆ ప్రవక్త చెప్పిన ప్రతీదీ మీరు గైకొనవలెను. 23 ఆ ప్రవక్త మాట విననివాడు మరియు ఆ మాటకు లోబడనివాడు దేవుని వాడు కానేరడు, మరియు దేవుడు వారిని నాశనము చేయును.
24 పేతురు ఇంకను మాట్లాడుచూ, "ఈ రోజుల్లో జరగబోవు సంగతులను గూర్చి, సమూయేలు మొదలుకొని ప్రవక్తలు అందరూ ముందుగానే చెప్పిరి. 25 దేవుడు మన పితరులను అశీర్వదిoచెదనని వాగ్దానము చేసినప్పుడే, మిమ్మును కూడా దీవించెదనని వాగ్దానము చేసెను. ఆయన మెస్సయాని గూర్చి అబ్రహాముతో చెప్పినప్పుడు 'నీ సంతానము చేయు పనిని బట్టి మనుష్యులందరినీ దీవిoచెదను అని అనెను. 26 కాబట్టి దేవుడు యేసుని, మెస్సయాగా భూమి మీదకు పంపెను, మొదటిగా ఇశ్రాయేలీయులను దీవించుటకును, వారు చేయు చెడు పనులు మాన్పివేయుటకును ఆయనను పంపెను" అని పేతురు ముగించెను .
Chapter 4
1 ఇది ఇలాగ వుండగా మందరపు ఆవరణములో కొందరు యజకులు వుండిరి మరియు దేవాలయపు భటుల అధికారి ఇంకా కొందరు సద్దూకయ్యల తెగపువారు ఉండిరి. పేతురు, యోహాను ప్రజల కొరకు ప్రసంగిస్తున్నప్పుడు వారందరూ వీరి దగ్గరకు వచ్చిరి. 2 అపొస్తలులు యేసును గూర్చి ప్రసంగిస్తున్నారు మరి ముఖ్యంగా చనిపోయిన యేసును మరలా తిరిగి లేవగలిగేలా చేసినది దేవుడే అని బోధిస్తునారు గనుక ఆ మనుష్యులు అత్యాగ్రహంతో నుండిరి 3 కాబట్టి వారు పేతురును యోహానును బంధించి చెరసాలలో వేసి సాయంకాలం అయిపోయినందున యూదుల పరిపాలన మండలిలో విచారణ కొరకు మరుసటి రోజు వరకు వేచియుండిరి. 4 యేమైనప్పటికిని పేతురు యేసుని నందు విశ్వాసమును గూర్చి బలంగా చెప్పుటను బట్టి ఇంచుమించు ఐదువేల మంది వరకు యేసు నందు విశ్వసించిరి.
5 మరుసటి దినమున ప్రధాన యాజకుడు, ఇతర ముఖ్య యాజకులను యూదుల ధర్మశాస్త్రోపదేశకులను మరియు ఇతర యూదుల పరిపాలనామండలి సభ్యులను పిలిపించి యేరూషలేములో ఒక చోటకూడుకొని యుండిరి. 6 మునుపటి ప్రధాన యాజకుడైన అన్న, ప్రస్తుత ప్రధాన యాజకుడైన కయప, యోహాను, అలెక్సందరు మరియు ప్రధాన యాజకుని సంబంధికులు అచటనుండిరి . 7 వారు అపొస్తలులను గదిలోనికి తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపించిరి. అప్పుడు వారు పేతురు యోహానును "కుంటివాడైన వ్యక్తిని స్వస్థ పరచుటకు మీకు ఆ శక్తిని ఎవరు ఇచ్చిరి" అని వారిని అడిగెను.
8 పరిశుద్ధాత్మ వారికి శక్తినివ్వటం బట్టి పేతురు వారితో ఇట్లనెను , "తోటి ఇశ్రాయేలీయుల పాలకులారా,ఇతర పెద్దలారా నేను చెబుతున్నది వినండి . 9 మేము చేసిన మంచి పని నిమిత్తము అదియే ఆ కుంటి వాని స్వస్థతను గూర్చి ఈ రోజున మమ్మును ప్రశ్నిస్తున్నారే ! మీరు మరియు ఓ ఇతర ఇశ్రేలియులరా! నేను చెప్పునది వినండి, 10 ఆ కుంటివాని స్వస్థత నజరేయుడగు యేసు నామము వలన జరిగినది గనుక అతను ఇప్పుడు మీఎదుట నిలువుటకు శక్తి కలిగియున్నాడు. ఎవరినైతే మీరు సిలువకు అప్పగించి మేకులు కొట్టించి చంచంపించితిరో, ఆయేసునే తిరిగిలేపించుటకు దేవుడే కారణమయ్యెను.
11 లేఖనములు ఎవరిగురించైతే మాట్లాడుచున్నవో ఆయనే నజరేతు వాడగు యేసుక్రీస్తు అయి ఉన్నాడు "ఇల్లు కట్టు వారు విసిరివేసిన రాయే ఇంటికి మూలరాయి ఆయెను" . 12 యేసు మాత్రమే మనలను రక్షించగలడు, దేవుడు మరియే ఇతర మనుష్యుని ద్వారా మన అపరాధ భావములనుండి మనలను రక్షింపజాలడు.
13 పేతురు యోహనులు ఇక ఎంతమాత్రము వారికి భయపడరని యూదుల నాయకులు గ్రహించిరి. మరియు వీరు సామాన్య ప్రజలైయుండి ఉన్నత విద్యాభాసం చేయని వారైఉన్నారని, యేసుతో వారు సమయమును గడిపి యుండిరని తెలిసుకొని వారు ఆశ్చర్యపడిరి. 14 అంతేకాకుండా పేతురు యోహానుతో పాటు స్వస్థత నొందిన కుంటివాడు కూడా అక్కడ నిలిచి యుండుట చూచిరి గనుక వారికి వ్యతిరేకముగా ఏమియు మాట్లాడలేకపోయిరి.
15 పేతురును,యోహానును గదినుండి బయటకు తీసుకువెళ్ళమని యూదులనాయకులు భటులకు ఆజ్ఞాపించిరి. అది జరిగిన పిమ్మట వారందరూ ఒకరినొకరు పేతురు యోహానును గురించి ఈ విధంగా మాట్లాడుకొనిరి. 16 "ఈ ఇద్దరి మనుష్యులను శిక్షించడానికి తగినది యేమియు లేదు, మనం ఏమియు చేయలేం కూడా ! యెరూషలేములో నివాసముంటున్న ప్రతిఒక్కరికి వారు చేసిన ఆశ్చర్యమైన అద్భుత కార్యము గూర్చి తెలుసు, గనుక ఆ అద్భుత కార్యము జరగలేదని మనము ఎంతమాత్రమును చెప్పలేము , 17 కాబట్టి ఇకమీదట యేసును గూర్చి ఇతర ప్రజలు ఖచ్చితంగా వినకుండునట్లు చేయగలగాలి. మరియు ఇకమీదట మీరు ఆ మనుష్యుని గూర్చి, ఎవరి వలననైతే మేము ఆ శక్తిని పొందుకొని కుంటివానిని స్వస్థ పరచితిమో అన్నసంగతిని కూడా ఇతర ప్రజలకు చెప్పకూడదని ఆ ఇద్దరికీ ఖచ్చితంగా చెప్పాలి, ఒకవేళ ఈ మాటను పాటించకపోతే శిక్షింపబడతారు అన్నసంగతిని కూడా చెప్పాలి." తర్వాత 18 యూదులనాయకులు ఆఇద్దరు అపొస్తలులను మరలా వారున్నగదిలోనికి తీసుకొనిరమ్మని భటులకుచెప్పిరి. భటులు వారినిలోపలకు తీసుకొనివచ్చిన తర్వాత అపొస్తలులకు యేసుని గురించి ఇకఎన్నడును మాట్లాడుటగాని బోధించుటగాని చేయకూడదని ఖండితముగా చెప్పిరి .
19 కానీ పేతురు మరియు యోహాను ఈవిధముగాచెప్పిరి." మీకు విధేయులుగాఉండి దేవునికి అవిధేయులుగా ఉండుట సరైనది అని దేవుడుభావిస్తాడా ?" ఏది సరైనదో మీరే నిర్ణయించుకోండి. 20 మేము మాత్రము మీకు విధేయులుగా ఉండలేము. యేసు చేసిన వాటిని గూర్చి, మేము విన్నమరియు చూసిన సంఘటనలు ప్రజలకు చెప్పకుండా ఆపలేము.
21 మాకు అవిధేయులుగా ఉండవద్దని యూదుల నాయకులు మరల పేతురుకి మరియు యోహానుకి చెప్పను, కాని వాళ్ళని శిక్షించకూడదని నిర్ణయించుకొనిరి, ఎందుకంటే నడవలేని వ్యక్తికి జరిగిన సంగతిని గూర్చి యెరూషలేము ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. 22 అతను నలభై సంవత్సములు పైబడిన వ్యక్తి, అతడు జన్మించిన రోజు నుండి నడవలేకపోయాడు.
పేతురు మరియు యోహాను యూదుల పరిపాలనా మండలి నుండి బయటకు వచ్చిన తరువాత ప్రధాన యాజుకులు మరియు యూదుల పెద్దలు చెప్పిన విషయములు ఇతర విశ్వాసులతో చెప్పిరి. ఇది విన్న తరువాత విశ్వాసులు కసిలి కూడుకొని ప్రార్ధన చేయుటకు అంగికరించిరి. " ఓ ప్రభువా ! ఆకాశమును, భూమిని మరియు సముద్రాలను అందులోఉన్న సమస్తమును సృజించితివి. మ తండ్రి అయిన దావీదు మహారాజు ఎవరితే మిమ్మల్ని సేవించాడో అతని నోట పరిశుధ్ధాత్మ చేత ఇట్లు పలికించెను "ఎందుకు ప్రపంచ ప్రజల గుంపులు కోపముతో మరియు ఇస్రాయెలీయులు దేవునికి వెతిరేకముగా వ్యర్ధమైన ప్రణాళిక చేసితిరి."
26 ప్రపంచములో ఉన్న రాజులు దేవుని పరిపాలకునికి వ్యతిరేకముగా పోరాటము చేయటానికి సిద్ధపడిరి, ప్రభువైన దేవునికి మరియు అయన ఎవరినైతే మెస్సయ్యా గా ఏర్పాటు చేసెనో వానిని వ్యతిరేకించుటకు పాలకులు కూడా వారితో జతకట్టిరి
27 ఇది సత్యము ! హేరోదు మరియు పొంతుపిలాతు అను యిద్దరు, యూదులు కానివారు మరియు ఇశ్రాయేలీయులప్రజలు కలిసి , యేసు, ఎవరైతే మెస్సయ్యాగా ఉండుటకు ఎంచుకొనబడ్డాడో అతనికి వ్యతిరేకముగా ఈ పట్టణమునకు వచ్చిరి. 28 పూర్వము ఇలా నెరవేరలని నీవు అనుకున్నదానినిబట్టి వారు ఈవిధముగా చేయుటకు అనుమతించితివి.
29 "కాబట్టి ఇప్పుడు, ప్రభువా, వారు మమ్మల్ని ఏవిధముగా శిక్షించబోతున్నారో చెప్పుతున్నారు ఆలకించుము ! నిన్ను సేవిo చుచున్న మేము ప్రతి ఒక్కరికి యేసునిగూర్చి చెప్పుటకు సహాయము చేయుము. 30 గొప్ప స్వస్థత కార్యములు, అధ్బుతాలు చేయుటకు పరిశుధ్ధ సేవకుడైన యేసు నామములో నీశక్తిని ఉపయోగించుము." 31 విశ్వాసులు ప్రార్థన ముగించేసరికి, వారుఉన్న స్థలమంతయు కంపించెను. దేవుడు చెప్పిన మాటలు ధైర్యముగా పలుకుటకు పరిశుధ్ధాత్మవాళ్ళకి శక్తినిచ్చెను, మరియు వారు ఆవిధముగా చేసెను.
32 యేసు నందు విశ్వాసము ఉన్న ప్రజలందరూ సంపూర్ణముగా ఒకే ఆలోచనతో వారు అనుకొన్న దానినిచేయుటకు అందరూ సమ్మతి కలిగి ఉండిరి. వారిలో ఏఒక్కరూ తమకు కలిగినది తమకు మాత్రమే సొంతo అ అ అని అనుకోలేదు. అంతేకాకుండా వారికున్న ప్రతిదియు ఒకరితో ఒకరు పచుకునిరి. 33 ప్రభువై యేసుని మరల తిరిగి లేచేలా దేవుడు చేసాడని అపోస్తులులు బలముగా ఇతరలుతో చెప్పటం కొనసాగించిరి. మరియు విశ్వాసులకు దేవుడు మరింతగా సహాయము చేస్తుండెను.
34 భూమియు మరియు యిండ్లను కలిగియున్న కొంతమంది విశ్వాసులు వారిఆస్తులను అమ్మెను. 35 అమ్మగా వచ్చిన సొమ్మును అపొస్తలులకు ఇచ్చెను. అప్పుడు అపొస్తలులు అవసరతలో ఉన్న విశ్వాసులకు ఇచ్చేవారు. కాబట్టి విశ్వాసులు జీవించుటకు సమస్తము కలిగియుoడిరి.
36 సైప్రస్ అనే దీవి నుండి లేవి గోత్రమునకు చెందిన యోసేపు అనే వ్యక్తి వచ్చెను.అపొస్తలులు అతనిని బర్నబా అని పిలిచెను; యూదుల బాషలో" ఇతరలను ఎల్లప్పుడు ప్రోత్సహించేవాడు" అని ఆ పేరుకి అర్ధము. 37 అతడు ఒక పొలమును అమ్మి ఆ సొమ్ముని విశ్వాసులకు ఇచ్చుటకై అపొస్తలులకు ఇచ్చెను.
Chapter 5
1 అచ్చట విశ్వసించిన అననీయ సప్పీరా అను భార్యభర్తలు ఉండిరి. 2 అతను తమ భూమి లో కొంత భాగమును అమ్మి అమ్మిన వెలలో కొ౦త సొమ్మును భార్యకు తెలిసే దాచుకొన్నాడు. అప్పుడు మిగిలిన సొమ్మును తెచ్చి, అపోస్తలులకు ఇచ్చాడు.
3 అప్పుడు పేతురు అననీయతో ఇలా అన్నాడు," నీవు పూర్తిగా సాతానుతో నడిపించబడ్డావు , అందుకే నీవు పరిశుద్దాత్ముని మోసం చేయాలనుకున్నావు, ఎందుకింత ఘోరం చేశావు ? అమ్మిన మొత్తం మా దగ్గరకు తీసుకురాకుండా కొంత ఎందుకు దాచుకున్నావు ? 4 అమ్మక మందు ఆ భూమి అంతా నీదే కదా దానిని అమ్మిన తర్వాత ఆ సొమ్ముకూడా నీదే, మరి ఎందుకింత బుద్దిలేని పని చేయాలని అనుకొన్నావు ? నీవు మమ్మును మాత్రమే మోసం చేయలేదు సుమా! దేవుణ్ణి సయితం మోసం చేయలనుకొన్నావు? . 5 ఈ మాటలు వినిన వెంటనే అననీయ అక్కడికక్కడే క్రింద పడి చనిపోయాడు.అననీయ మరణ వార్తను వినిన వారందరూ భయపడ్డారు. 6 తర్వాత కొంతమంది కుర్రవాళ్ళు ముందుకు వచ్చి అననీయ శవాన్ని గుడ్డలతో చుట్టి మోసుకెల్లి సమాధి చేసారు .
7 దాదాపు మూడు గంటల తర్వాత అతని భార్య అక్కడకు వచ్చింది. కాని అక్కడ ఏమి జరిగినదో ఆమెకు తెలియదు . 8 అప్పుడు పేతురు, అననీయ తీసుకు వచ్చిన సొమ్మును ఆమెకు చూపించి ఇలా అడిగాడు చెప్పు- మీరిద్దరు కలసి పొలమును అమ్మగా వచ్చిన సొమ్ము అంతా ఇంతేనా ? ఆమె - అవును ఇంతే వచ్చింది అన్నది.
9 కాబట్టి పేతురు ఆమెతో ఇలా అనెను- మీరిద్దరూ ఎంత ఘోరం చేసారు ,మీరిద్దరూ కలిసి దేవుని ఆత్మను మోసం చేయాలని అనుకొన్నారే ! మీ ఆయన శవమును పూడ్చిపెట్టి తిరిగి వస్తున్న వారి కాళ్ళచప్పుడును నీవు వింటున్నావా ?. వాళ్ళు ప్రస్తుతం ఈ గుమ్మం బయటనే వున్నారు, నిన్ను కూడా మోసుకొని పోతారు. 10 ఈ మాట సప్పీర వినిన వెంటనే అక్కడికక్కడే పేతురు కాళ్ల దగ్గర పడి చనిపోయెను. తర్వాత ఆ మనుష్యులు లోపలకు వచ్చి సప్పీర చనిపోయి ఉండుటచూచి ఆమె శవమును కూడా మోసుకొని పోయి ఆమె భర్త సమాధి ప్రక్కన పూడ్చిపెట్టారు. 11 దేవుడు అననీయ దంపతులకు జరిగించిన దానిని బట్టి యేరూషలేములో వున్న విశ్వాసులందరూ భయపడ్డారు.మరియు ఎవరైతే ఈ సంగతిని విన్నారో వారందరూ కూడా మిక్కిలి భయపడసాగిరి.
12 ప్రజల మధ్య అపొస్తలులు బోధించుచున్న సత్య వాక్యమును ఋజువు చేయుటకై దేవుడే అపోస్తలులకు తన శక్తిని ఇచ్చుట ద్వారా బహు గొప్పఅద్బుతాలు చేయుచుండెను. 13 విశ్వాసులందరూ దేవాలయ ప్రాంగణములో సొలోమోను ద్వారం దగ్గర క్రమము తప్పకుండా కూడుకొనుచుండిరి. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచని ఇతరులందరూ వీరిపట్ల భయముతో మెలుగుచుండిరి . అయినప్పటికీ, ఆప్రజలందరూ విశ్వాసులపై ఎంతో గౌరవ భావము కనుపరచుచుండిరి .
14 చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు యేసుక్రీస్తు నందు విశ్వసించుట మొదలు పెట్టిరి. మరియు విశ్వాస గుంపులలో చేర్చబడుచూ ఉండిరి. 15 దీని ఫలితముగా ప్రజలు రోగులను వీధులలోనికి మోసుకొని వచ్చి మంచాల పైన,చాపలపైన పడుకొనపెట్టారు. ఎందుకనగా పేతురు నడచి వచ్చినప్పుడు ఆయన నీడ పడి కొంతమంది అయినా స్వస్థపరచబడతారేమోనని. 16 యేరూషలేము చుట్టు ప్రక్కననున్న పట్టణములలోని ప్రజలు గుంపులు గుంపులుగా అపోస్తలుల యెద్దకు వచ్చుచుండిరి. వారు రోగులను, దురాత్మలచేత పట్టి పీడించబడుతున్న వారిని తీసుకొని వచ్చుచుండిరి. దేవుడు వారినందరిని స్వస్థపరచెను.
17 అప్పుడు ప్రధాన యాజకుడు మరియు అతనితోకూడా ఉన్న సద్దూకయ్యల తెగవారును అపోస్తలుల మీద మిక్కిలి అసూయతో నుండిరి. 18 గనుక వారు అపోస్తలులను బంధించి బహిరంగ చెరసాలలో ఉంచమని దేవాలయపు భటులకు ఆజ్ఞాపించిరి.
19 అయితే రాత్రివేళ దేవునిదేవదూత చెరసాలయొక్క తలుపులనుతెరచి అపొస్తలులను బయటకు తీసుకొనివచ్చి వారికి ఈవిధముగా చెప్పెను-" 20 మీరువెళ్లి దేవాలయపు ప్రాంగణములో నిలువబడి దేవుని నిత్యజీవమునుగూర్చిన వాక్కును ప్రజలకుప్రకటించుడి" 21 ఈ మాటలు వినినతర్వాత వారు ఇంచుమించు వేకువజామున దేవాలయప్రాంగణములోనికి ప్రవేశి౦చి మరలాప్రజలకు యేసునుగూర్చి చెప్పుటమొదలుపెట్టిరి. ఈమధ్యలో ప్రధానయాజకుడును అతనితోకూడావున్నవారును పరిపాలనామండలిని సమావేశపరచుటకుపెద్దలను పిలువనంపించిరి,వీరే ఇశ్రాయేలీయుల నాయకులు,వీరందరూ సమకూడిన తర్వాత అపొస్తలులను చేరసాలలోనుండి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించిరి.
22 అప్పుడు భటులు చెరసాల వద్దకు చేరుకొని అపొస్తలలు అచ్చట లేక పోవుట కనుగొనిరి కాబట్టి వారు తిరిగి వెళ్లి పరిపాలనా మండలి కి ఈ విధముగా నివేదించిరి. 23 -చెరసాల తలుపులు భద్రముగా తాళములు వేయబడి ఉండుటయు, కావలి వారు ద్వారముల యెద్ద నిలిచి ఉండుటయు మేము చూచితిమి. అప్పుడు మేము తలుపులు తెరచి ఆ మనుష్యులను తీసుకొని వచ్చుటకు వెళ్ళగా వారి జాడ అక్కడ లేదు.
24 దేవాలయపు భటుల నాయకుడు మరియు ఇతర ముఖ్య యాజకులకు ఈ సంగతి వినబడినప్పుడు వారు గొప్ప అయోమయములో పడిరి మరియు ఈ సంఘటనలు అన్నియు ఎక్కడకు ఏ దారి తీయునోయని కలవరిపడిరి. 25 ఇంతలో కొoదరువారి యొద్దకు వచ్చి వారికి తెలియజేసినది ఏమనగా, మీరు ఎవరినైతే చెరసాలలో బంధించితిరో వారు ఇప్పుడు దేవాలయపు ప్రాంగణములో నిలిచి ప్రజలకు బోధించుచుండిరి .
26 కాబట్టి దేవాలయపు భటుల నాయకుడు ఇతర అధికారులతో దేవాలయపు ప్రాంగణములోనికి వెళ్లి వారిని తీసుకొని పరిపాలన కార్యాలయమునకు వచ్చెను. ప్రజలు తమను ఎక్కడ రాళ్ళతో కొట్టి చంపుదురేమోనని వారిపట్ల దురుసుగా ప్రవర్తింపలేదు . 27 తర్వాత ఆ నాయకుడును అతని అధికారులు అపొస్తలులను పరిపాలనా కార్యాలయపు గదిలోనికి తీసుకొని వచ్చి పరిపాలన కార్యాలయపు సభ్యుల ముందు నిలుపమని వారిని ఆజ్ఞాపించిరి. 28 అప్పుడు ప్రధాన యాజకుడు వారిని ఈ విధంగా ప్రశ్నించెను -యేసు అను ఆ మనుష్యుని గూర్చి ప్రజలకు బోధించకూడదని మేము మీకు ఆజ్ఞాపించితిమి గదా మీరు మా మాటకు అవిధేయులై యెరూషలేములో నున్న ప్రజలందరిని ఆ బోధతో నింపిరి .అంతేకాకుండా, అతని మరణానికి కూడా కారణం మేమేనని మాపై అపరాధం మోపడానికి ప్రయత్నించుచున్నారు.
29 అప్పుడు పేతురు తనతో తాను మాట్లాడుకొనుచుండగా మిగిలిన అపొస్తలలు వారితో, దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయుటకు మేము విధేయులమైతిమి గాని ప్రజలు చెప్పునది చేయుటకు కాదు. 30 యేసును సిలువకు అప్పగించి మేకులు కొట్టి చంపించినది మీరే ! కాని మన పితరులు ఆరాధించుచున్న దేవుడే యేసును మరణము నుండి తిరిగి లేపెను. 31 ఆయన యేసును అందరికంటే ఎక్కువగా ఘనపరచెను. ఆయన ఈ యేసును మనకు రక్షకునిగాను పరిపాలకుని గాను చేసెను, ఇశ్రాయేలీయులు పాపములో ఉండకుండునట్లు ఆయన మాకు ఆయన వాక్కును ప్రకటించుటకు అనుమతిని ఇచ్చెను కాబట్టి ఆయన మన పాపములను క్షమించును . 32 యేసునకు జరిగిన సంఘటనలు మాకు తెలియును గనుక వాటిని మేము ప్రజలకు చెప్పున్నాము . దేవుడు పంపిన పరిశుద్ధాత్మకు మేము లోబడి ఉన్నాము మరియు ఆయన కూడా వీటిని సత్యమని అంగీకరించుచున్నాడు .
33 ఎప్పుడైతే యూదుల పరిపాలనా మండలి సభ్యులు ఈ మాటలను విన్నారో వెంటనే అత్యాగ్రహము పొందినవారై వారిని చంపాలని తలంచిరి. 34 కాని పరిపాలన మండలి సభ్యుడు ను మరియు పరిసయ్యుల తెగవాడు అయిన ఒక మనుష్యుడుండెను అతని పేరు గమలియేలు,అతను ధర్మశాస్త్రోపదేశకుడు, అతను యూదులందరి చేత ఘనత పొందినవాడు , అతను యూదుల పరిపాలనా మండలి గదిలో లేచి నిల్చుని అపొస్తలులను ఆ గది నుండి కొద్దిసేపు బయట ఉంచమని భటులకు ఆజ్ఞాపించెను.
35 అపొస్తలులను భటులు బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇతర సభ్యులతో ఈ విధంగా మాట్లాడెను-"ఇశ్రాయేలీయులారా ఈ మనుష్యులకు మీరు చేయాలనుకొంటున్న దాని గూర్చి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలెను , 36 ఎందుకనగా కొన్ని సంవత్సరముల క్రిందట థియోడస్ అను ఒకడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తనను తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించుకొన్నాడు మరియు ఇంచుమించు నాలుగు వందల మంది అతనిని వెంబడించిరి .కాని అతడు చంపబడ్డాడు. మరియు అతని అనుచరులు చెదరిపోయిరి, కాబట్టి వారి ప్రణాళికలన్నిటిని వారు అమలు చెయలెకపోయిరి , 37 ఆ తర్వాత పన్ను వసూలు చేయుటకు గాను జనాభా లెక్కల సమయంలో గలలీయ ప్రాంతమునకు చెందిన వాడైన యూదా అను ఒకడు తిరుగుబాటుదారుడై అనేకులను అతని వైపునకు త్రిప్పుకొనెను.కాని అతను కూడా చంపబడెను తర్వాత అతని అనుచరులు వివిధ మార్గములను అనుసరించినవారైతిరి .
38 కనుక నేను మీకు చెప్పునది ఏమనగా ! వీరిని బాధించవద్దు ! విడుదల చేయండి. నేను చెప్పుచున్నాను, ఇది కనుక మనుష్యుల ఆలోచనలలోనుండి రూపింపబడిన ప్రణాళిక అయితే దీనిని ఎవరైనా ఒకరు ఆపగలరు, లేదా వీరైనా విఫలమవుతారు. 39 ఒకవేల దేవుడే గనుక వీటిని చేయమని వారికి ఆజ్ఞాపిస్తే మీరు వారిని ఆపగలిగే సామర్ధ్యత పొందుకోలేరు , దీనివలన మీరు దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తున్నారు అనే సంగతి గ్రహించగలరు ! గమలియేలు చెప్పినదానికి యూదుల పరిపాలనమండలి సభ్యులు సమ్మతించిరి.
40 వారు అపొస్తలులను తీసుకొని వచ్చి కొట్టమని భటులుకు ఆజ్ఞాపించిరి. కాబట్టి వారు అపొస్తలులను పరిపాలన కార్యలములోనికి తీసుకొనివచ్చి కొట్టితిరి. అప్పుడు యూదుల పరిపాలనామండలి యేసుని గూర్చి ఇకఎన్నడూ చెప్పకూడదు అని ఆజ్ఞాపించి అపొస్తలులను విడిచిపెట్టెను. 41 కాబట్టి అపొస్తలులు అక్కడ నుండి వెళ్ళిపోయెను. వారు యేసుని వెంబడిస్తున్నారు అను కారణమును బట్టి అపహాస్యించబడ్డారు. అయితే ఇదే దేవుడు వారికి అనుగ్రహించిన ఘనతయని వారు తెలుసుకొని దేవుడు యందు సంతోషించిరి. 42 తరువాత వారు ప్రతీరోజు , దేవాలయ ప్రాంగణం లోను, ప్రజల ఇళ్ళలోనూ యేసే క్రీస్తు అని వారికి బోధించుచుండెను.
Chapter 6
1 ఆ దినములలో అనేక మంది ప్రజలు విశ్వాసులు గా మారుతున్నారు. ఆ సమయములో గ్రీకు మాటలాడే యూదులు ఇశ్రాయెలులో జన్మించిన యూదుల మీద ఫిర్యాదు చేసారు. ఎందుకనగా వీరు విధవరాండ్రకు ఇవ్వవలసిన అనుదిన ఆహారం సరిగా ఇవ్వలేదు. 2 అప్పుడు వారుచెప్పినది ఆ పన్నెండు మంది అపోస్తులు విని,వారు యేరుషలేములో వున్నా మిగతా విశ్వాసులనందరిని కలుసుటకు పిలువనంపిరి. అపుడు అపోస్తలులు ఈ విధంగా చెప్పియున్నారు "మనం ఆహారం పంచిపెట్టుట కొరకు దేవుని వాక్యమును ప్రకటన చేయుట మానివేయుట మంచిది కాదు. \ v 3 కాబట్టి తోటి సహోదరలారా జ్ఞానము కలిగి దేవుని ఆత్మచేత నడుచుకోనుచు,మిలొవున్న మీకుతెలిసిన ఏడుగురు మనుష్యులను జాగ్రత్తగా ఎన్నుకొనుడి,అప్పుడు వారు పనిచేయుటకు మేము సలహా ఇచ్చుదుము . \ v 4 ఆ మిగిలిన సమయమును మేము ప్రార్ధించుటకు, ప్రకటించుటకు,మరియు యేసు గూర్చి బోదించుటకు వుపయోగించుదుము.
5 అపొస్తలులు యొక్క నిర్ణయం ఇతర విశ్వాసులకు సంతోషం కలిగించింది. అపుడు వారు దేవుని బలముగా విశ్వసించిన, దేవుని ఆత్మచేత నడిపించబడిన నింపబడిన స్తెఫనును ఎన్నుకున్నారు. వారు ఫిలిప్పు, ప్రోకొరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, మరియు అంతియెకయ నుండి వచ్చిన నికోలాసు అను వారిని కూడా ఎన్నుకున్నారు. ఈ నికోలాసు యేసుని అంగీరరించక ముందు యూదుల మతమును పాటించాడు. 6 అపుడు విశ్వాసులు ఈ ఏడుగురిని అపోస్తలుల యొద్దకు తీసుకువచ్చారు. అపుడు వారు ప్రతివారి తల మీద చేతులుంచి ,ప్రార్థన చేసి వారిని ఆ పని కోసం ఏర్పరిచారు. 7 అప్పుడు విశ్వాసులు అనేకమందికి దేవునిసువార్తను చెపుతూ ఉండేవారు. యేరుసలేములో ఉన్న యేసుని నమ్మేవారి సంఖ్య వృద్ది పొంధుచుండెను.వారిలో, యేసు నందు విశ్వాసమును గురించిన సందేశమును నమ్మిన యూదుయాజకులు ఉన్నారు. 8 దేవుడు స్తేఫనుకు ప్రజల మద్య అనేకమైన అద్భుతములు చే చేసే శక్తిని ఇచ్చి యేసే నిజమైన దేవుడని తెలియపరచుచుండెను. అయినను కొద్ది మంది స్తేఫనును వ్యతిరేకించుచుండిరి.వారు: స్వతంత్రుల సినగోగ్ లో అనుదినము కలిసుకొనే యూదులు మరియు సైరేన్,అలెగ్జండ్రియా పట్టణములనుండి మరియు కిలికియ,ఆసియ ప్రాంతాలనుండి వచ్చినవారు.వీరందరూ స్తెఫనుతో తర్కించు చుండిరి.
10 11 10 11 ఎందుకనగా అతడు దేవుని ఆత్మ చేత నింపబడి వాక్య జ్ఞానముతో మాట్లాడుచుండి నందున, స్తేఫెన్ చెప్పిన దానిని వారుతప్పుఅని నిరూపించలేక పోయిరి. వారు రహస్యంగా స్టెఫెన్ ను నిందించుటకు కొంతమందిని పురికొల్పిరి. వారు ఈ రీతిగా అన్నారు "ఇతడు దేవున్నిమరియు మోషేను గూర్చితప్పుగా మాట్లాడుట విన్నాము".
12 13 14 15 12 13 14 15 12 13 14 15 వారు అనేక మంది యూధులను,పెద్దలను,యుదా మత భోదకులను స్తెఫను పై ఆగ్రహించులాగున ప్రేరేపించిరి. అపుడు వారు స్తెఫనును పట్టుకొని బలవంతంగా యూదుల సభ యొద్దకు తీసుకుని వచ్చిరి. అలాగునే వారు స్టెఫెన్ మీద నేరములు మోపుటకు కొంతమందిని తీసుకొని వచ్చిరి. వారు ఇలా చెప్పారు: ఇతడు ఈ పవిత్ర దేవాలయమునకు, మోషె దేవుని యొద్ద నుండి పొందిన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఇతడు నజరేయుడైన యేసు ఈ మందిరమును పాడుచేయును అనియు, మోషే మన పూర్వీకులకు చెప్పినవికాక ఇతర ఆచారములను పాటించాలనియు చెప్పుట మేమువిన్నామని అరిచారు. అప్పుడు స్తెఫను ముఖం దేవదూతల ముఖమును పోలియుండుట అక్కడ సభలో ఉన్న వారందరికి కనిపించింది.
Chapter 7
1 2 3 స్తేఫనుతో ప్రధాన యాజకులు " వారు నీగురించి చెప్పినది నిజమేనా" అని అడుగగా అందుకు స్తేఫను "నా తోటి సోదరులారా, తండ్రులారా,దయచేసి వినండి. మనము ఆరాధిస్తున్నగొప్పదేవుడు మన పూర్వీకుడైన అబ్రహాముకు, హారానుకు వెళ్లకముందే, మేసపోటేమియాలో ఉన్నప్పుడే కనపడ్డాడు. దేవుడు అతనికి ఇలా చెప్పాడు "నీ బందువులున్నఈ దేశం వదలి, నేను చూపించు దేశమునకు వెళ్ళు."
4 అపుడు అబ్రహాము కల్దీయుల స్థలమును స్వంతజనులను, మరియు బందువులను వదలి దేవుడు చూపించిన హరానుకు వెళ్ళాడు.తన తండ్రి చనిపోయిన తరువాత మనము నివసిస్తున్నఈ దేశమునకు వచ్చి నివసించెను. 5 అప్పటికి దేవుడు అబ్రహముకు సొంత స్థలము ఇవ్వలేదు,కొంచెంకూడా ఇవ్వలేదు .కానీ దేవుడు తర్వాత కాలంలో ఈ దేశాన్ని అతనికి, అతని వారసులకు మరియు ఇంకెప్పట్టికి వారికే ఇస్తానని ప్రమాణం చేసెను.కానీ అబ్రహాముకు ఆ సమయానికి కొడుకులు లేరు .
6 తర్వాత దేవుడు అబ్రహాముతో "నీ పిల్లలు ఒకదేశంలో పరదేశులుగా ఉంటారు.మరియు నాలుగు వందల ఏండ్లు అక్కడే ఉంటారు,ఆసమయంలో వారిని అక్కడ నాయకులు మీ వారిని భానిసలుగా చూస్తారు,వారిని బానిసలుగా చేసి పనిచేయమని బలవంతంచేస్తారు. 7 వారిని అలా చేసిన వారిని నేను శిక్షిస్తాను ,ఆ తరువాత ఆ దేశాన్నివదిలివేస్తారు.వారు వచ్చి ఈదేశమందు నన్నుఆరాధిస్తారు." 8 అప్పుడు దేవుడు అబ్రహాము తో నీ సంతానంలో ప్రతీ మగ పిల్లలకు తప్పకుండా సున్నతి చేయాలి. దీనినిబట్టి వారు దేవునికి చెందినట్లు నిరూపిస్తారు. తరువాత అబ్రహాముకు ఇస్సాకు అనే కొడుకు పుట్టాడు, ఎనిమిదో దినమున అతనికి అబ్రహాము సున్నతి చేసాడు. తర్వాత ఇస్సాకు కొడుకు యాకోబు పుట్టాడు.యాకోబు, యూదులమైన మనము పితరులని పిలుస్తున్న 12 మంది పూర్వీకులకు తండ్రి.
9 యాకోబు తనచిన్న కుమారుడయిన యోసేపును ఎక్కువగా ప్రేమించుటవలన యోసేపు మిధ తన సహోదరులు అసూయా పెంచుకొన్నారు, అందు.చేత వారు యోసేపును వ్యాపారులకు అమ్మారు,వారు 10 అతనిని ఈజిప్ట్ తీసుకెళ్ళారు,అక్కడ అతడు ఒక బానిస అయ్యాడు.కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి ఎంతో సహాయం చేసాడు, మనుషులు అతనిని భాదించినపుడు అతన్నిఅతన్ని రక్షించాడు, యోసేపుకు జ్ఞానమిచ్చి,ఈజిప్ట్ రాజైన ఫరో అతడిని అభిమానించునట్లు చేసాడు. కాబట్టి ఫరో అతడిని ఈజిప్ట్ ను పరిపాలించుటకు, ఫరో ఆస్తి ని కాపాడుటకు నియమించాడు.
11 యోసేపు అక్కడ పని చేస్తుండగా అదే సమయానికి ఐగుప్తు లోను మరియు కనానులోను గొప్ప కరువు కాలం వచ్చింది ,ఆహారం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుచుండెను. కనాను లో ఉన్న యాకోబు కుటుంబస్తులకు కూడా చాలినంత ఆహారధాన్యం దొరకపోవడంతో. 12 ఐగుప్తిలో ఆహార ధాన్యం అమ్ముచున్నారని తెలిసి యాకోబు యోసేపు యొక్క అన్నలను వాటి నిమిత్తము పంపెను,వారు వెళ్లి యోసేపు దగ్గరనే ఆహారధాన్యం కొన్నారు కానీ యోసేపును గుర్తుపట్టలేదు, వారు తిరిగి ఇంటికి 13 వెళ్ళిరి,యోసేపు సోదరులు రెండోసారివచ్చి ఆహార ధాన్యం కోన్నారు. అప్పుడు తాను ఎవరో యోసేపు తెలియపరచుకున్నాడు. ఆ రీతిగా ఫరోకు యోసేపు జనులు హెబ్రీయులని మరియు కానాను వచ్చినవారు అతని సోదరులని కూడా తెలిసికున్నాడు.
14 తరువాత యోసేపు తన సోదరులను తండ్రి దగ్గరకు తిరిగి పంపెను.వారు వెళ్లి తమ తండ్రి యాకోబుతో వారి కుటుంబమంతటిని యోసేపు ఐగుప్తి రమ్మన్నాడని చెప్పారు.ఆ సమయంలో యాకోబు కుటుంబంలో 75 మంది ఉన్నారు. 15 యాకోబు అది విన్నప్పుడు అతడు,అతని కుటుంబమంతా ఐగుప్తి వెళ్లారు. తర్వాతకాలంలో అక్కడ యాకోబు చనిపోయాడు,అతని కుమారులైన మన పూర్వీకులు కూడా చనిపోయారు. 16 వారి శరీరాలు మన దేశానికి తేబడి, షెకేమ్ లో నాహోర్ కుమారుల యొద్ధ అబ్రహాం కొన్నసమాధి పాతిపెట్టబడ్డారు.
17 మన పూర్వీకులు అక్కడ బహుగా విస్తరించెను,దేవుడు వారిని అబ్రహాంనకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని ఐగుప్తి నుండి రక్షించుటకు సమయం వచ్చింది. 18 అప్పటికి వేరొకరు రాజుగా ఉండెను.చాలాకాలం క్రిందట యోసేపు ఐగుప్తి ప్రజలకు చాలా సహాయం చేసాడని తెలియదు. 19 ఆ రాజు మన పూర్వీకులను క్రూరంగా తుడిచిపెట్టడానికి ప్రయత్నించాడు.అతడు వారిని అణచి, ఎంతో భాద పెట్టాడు. అంతేగాకుండా వారికి కొత్తగా జన్మించిన శిశువులు చనిపోవునట్లు వారిని బయట పారవేయుమని ఆజ్ఞాపించాడు.
20 అదే సమయం లో మోషె పుట్టెను.దేవుడు అతడును ఎంతో అందగాడుగా పుట్టించెను ,మోషె తనతల్లితండ్రులు రహస్యంగా మూడు నెలలు సొంత ఇంటిలో పెంచెను , 21 తరువాత అతడును ఇంటి బయట పంపవలసి వచ్చెను, ఆ శిశువును పెట్టెలో పెట్టి నీల్లలో వదిలగా రాజుగారి కూతురు గుర్తించి తీసుకెల్లి తన సొంత కుమారుని గా పెంచెను.
22 మోషే అక్కడ ఉండే అన్ని విద్యలయందు ప్రముఖుడుగా ఉండెను, మాట యందును బాష యందును మంచి నైపుణ్యుడిగా ఉండెను. 23 అలా నలుబది సంవత్సరంలు పెరిగిన తరువాత తన సహోదరులను చూడాలని ఉండి అక్కడికి వెల్లెను , 24 ఆ సమయంలో ఇద్దరు కొట్టుకొనుచుండగా తన వాడైన హెబ్రీయునికి సహాయం చేసి ఐగుప్తున్ని కోట్టి చంపెను 25 ,అందుకు దేవుడు ఇశ్రాయెలీయుల ప్రజలను రక్షించుటకు వచ్చాడని అతనితో ఉన్నవాడు నమ్మెను కానీ వారు (అనగా ఇస్రాయేలియులు) నమ్మలేదు, మరిము వారు అర్ధo చేసుకోలేదు.
26 ఆ తరువాత ఒక రోజు ఇద్దరు ఇశ్రాయేలియులు కొట్టుకోనుచుండగా మోషె వెళ్లి వారిని ఆపుటకు ప్రయత్నించి 27 మీరు ఇద్దరు ఇశ్రాయేలు సహోదరులు అయి ఉండి ఎందుకు ఒకరినొకరు హాని కలిగిoచుకొనుచున్నారు లేక కొట్టుకొనుచున్నారని వారిని అడుగగా? వారిలో ఒకడు మాపై అధికారం నీకు ఎవడు ఇచ్చాడు? 28 నన్ను కూడా నిన్నఒక్క ఐగుప్తియుని చంపినట్టు చoపుతావా? అని మోషెను అడిగాడు.
29 ఆ మాట ఎప్పుడైతే విన్నాడో మోషె భయపడి మిద్యాను దేశానికీ పారిపోయి అక్కడ కొంతకాలం గడిపెను అతను పెండ్లి చేసుకున్నాడు మరియు,అతనికి ఇద్దరు కుమారులు. 30 40 సంవత్సరముల తరువాత ఒక రోజు మోషె దేవుని దూత దర్శనం ఇచ్చెను సినాయ్ పర్వతం మీద ప్రభు దూత మోషెకి దర్శనంమిచ్చెను , పొద మండుచున్నది కానీ కాలిపోవడం లేదు.
31 32 మోషె ఆ పొద మండుట చూసి ఆశ్చర్యపడి ఇంకా కొంచెం దగ్గరకు వెళ్ళుతుండగా, ఆ పోధలోనుంది దేవుని ఒక స్వరం వినపడింది. "నేను దేవుడను అబ్రహం దేవుడను, ఇస్సాకు దేవుడను,యాకోబు దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు" అందుకు మోషె భయపడి వనికేను మరియు ఆ భయముతో పొదవైపు చూడలేకపోయేను కనుక అక్కడకు వెళ్ళడం మానేసాడు.
33 మోషె పొద దగ్గరకు వస్తునప్పుడు పొదలో నుండి దేవుడు చెప్పాడు నీ చెప్పులు విప్పుము ఎందుకనగా ఇది నా సన్నిధి పవిత్రమైనది రమ్ము, 34 ఐగుప్తిలో నా ప్రజల మోర నేను విని ఉన్నాను వారిని రక్షించడానికి ప్రణాళిక కలిగి ఉన్నాను కనుక నిన్ను మరలా ఐగుప్తికి పంపబోవుచున్నాను కనుక సిద్దంగా ఉండుము, నేను నీపక్షం గా ఉన్నాను
35 ఇశ్రాయేలు ప్రజలకు మోషేను నాయకుడుగా దేవుడే నియమించాడు కానీ వారు"మామీద నిన్ను ఎవడు అధికారిగా నియమించెను" అని ఆయనను తిరస్కరించారు. ఈ మోషెను దేవుడు ఇశ్రాయేలియులను బానిసత్వం నుండి విమోచించేవానిగా చేసాడు. 36 మోషె తన ప్రజలను ఐగుప్తిలో నుండి నడిపించాడు.దేవుడు తనతో ఉన్నాడని నిరుపించుటకు ఎర్రసముద్రం వద్ద,ఇశ్రాయేలియులు 40 సంవత్సరాలు అరణ్యంలో నివసించినప్పుడు వారి ముందు చాలా అద్బుత క్రియలు చేసాడు. 37 ఈ మోషేయే ఇశ్రాయేలియులతో ఇలా చెప్పాడు" నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలోనుంచి పుట్టిస్తాడు".
38 39 40 సినాయ్ పర్వతం మిధ తనతో మాట్లాడిన దేవదూత తోను పితరులతో అరణ్యమందు ఉండి దర్మశాస్త్రమును మనకిచ్చినవాడు ఇతడే. దేవుని దేవదూత ఆజ్ఞలు పొందినవాడు మోషేయే.మోషేయే దేవదూత మాటలు మనపుర్వీకులతో చెప్పినవాడు.దేవుని నిత్యజీవవాక్య సందేశమును పొంది మనకు తెలియచేసినవాడు ఇతడే. అయితే మోషేకు లోబడుటకు మన పూర్వీకులు తిరస్కరించిరి. మరియు వారు అతనిని నాయకుడుగా తిరస్కరించి ఈజిప్ట్కు తిరిగి వెళ్ళగోరిరి.కాబట్టి వారు మోషె అన్న అయిన ఆహారోనుతో "మాకు దేవుళ్ళుగాఉండి,నడిపించడానికి మాకు విగ్రహాలను చెయ్యి.మమ్మల్నిఈజిప్ట్ నుండి బయటికి నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు."
41 42 ఆ దినములలో వారు దూడ ఆకారంలో ఒక విగ్రహమును తయారు చేసుకొనిర. దానికి బలులు అర్పించిరి, వారు చేసిన దాని ముందర పాటలు పాడుచు అనందిచిరి. అందుకు దేవుడు వారిని సరిచేయడము అపివేశాడు. ఆకాశ సైన్యమును పాలించుటకు సూర్యుడుని చందమామను మరియునక్ష్త్రత్రాలను అరాదించుటకు వారిని వదిలిపెటేను. ప్రవక్తలు చెప్పిన రీతిగా ఓఇశ్రాయేలు ప్రజలారా మీరు నలబై ఏండ్లుగా అరణ్యంలో బొమ్మలకు జంతువులను చంపి బలులు అర్పించారు, మీరు చెసుకున్న ప్రతిమలు మాత్రమను దేవత విగ్రహాలను మోసుకొని పోయారిగాని నాకు బలులు గాని అర్పనలు గాని అర్పించితిరా?
43 మీరు ఆరాధించుటకు దేవతగా చేసుకున్న మేలేకు ప్రతిమను ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి ఆ విగ్రహాలను తీసుకెళ్లారు. రాఫెన్ అను నక్షత్రపు బొమ్మను కూడా మీతో తిసుకెల్లారు, నను ఆరాధించుటకు బదులు మీరు తయారుచేసిన విగ్రహాలను ఆరాధించారు,ఈ కారణమును బట్టి మిమ్మును మరలా బబులోనుకు అప్పగిస్తాను.
44 45 46 మన పితరులు అరణ్యంలో ఉండగా గుడారంలో దేవుణ్ణి పరిశుద్దతతో దేవుడు వారి మధ్య ఉన్నట్టుగానే అరాదించేవారు. దేవుడు మోసేకి ఆజ్ఞాపించిన రీతిగా వారు ఒక గుడారమును తాయారు చేసారు. మోషె కొండమీద చుసినట్టుగానే వారు ఆ గుడారమును తాయారు చేసారు. ఆ తరువాత మన పితరులు ఆ గుడారమును యేహోషువ నడపించిన స్థలానికి తిసుకేల్లారు, అది వారు ఈ స్థలాన్ని స్వంతం చేసుకున్న దినాలలో, ఆ స్థలంలో వారికి ముందు నివసించిన వారిని వెళ్ళగొట్టాడు. దావీదు పరిపాలన వరకు కూడా ఈ గుడారమును అలాగే ఉన్నది,దావిదు దేవుని హృదయనుసారుడుగా ఉండెను గనుక ఇశ్రాయేలిలు అందరు ఒకచోట ఆరాధించుటకు ఒక మందిరము కడతానని దేవుని అడిగెను.
47 కానీ దేవుడు దావీదు కుమారిడితో ప్రజలు నన్ను ఆరాధించుటకు ఒక మందిరం కట్టమని చెప్పెను. 48 ఏది ఏమైనపటికి మనకు తెలుసు దేవుడు అన్నిటికంటే గొప్పవాడు అని , ఆయన మనుసులు తయారుచేసిన గుడారం లో నివసించువాడు కాదు. ప్రవక్త యెషయ 49 చెప్పినట్లు, దేవుడు 50 "ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీటం నేనే భుమిని ఆకాశoను నిర్మించాను నాకొరకు మీరు గృహమును నిర్మించలేరు".
51 52 53 మీరు కూడా మీ పితరులవలె హృదయ కాఠీన్యం కలిగి ఉన్నారు! వారిలాగానే మీరు కూడా అన్నివిషయాల్లో ఉన్నారు!. వారి వలెనె ఎల్లప్పుడూ పరిశుద్ధత్మను వ్యతిరేకిస్తున్నారు!. ప్రతి ప్రవక్తను మీపితరులు శ్రమపెట్టారు. క్రీస్తు వస్తాడు అని ప్రకటించిన వారిని కూడా చంపారు,ఆయనే ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టాడు.తర్వాత క్రీస్తు వచ్చాడు! ఆయనను కూడా మీరు ఈమధ్య ఆయన శత్రువులకు అప్పగించి,చంపమని గట్టిగా కోరారు. మీరు దేవుని ఆజ్ఞలు పొందుకున్నవారు.ఆ ఆజ్ఞలు దేవుడు తన దూతల ద్వారా మీకిచ్చాడు. అయినను మీరు వాటికి విధేయత చూపించలేదు.
54 స్తెపను మాటలను బట్టి సమాజ మందిరం పెద్దలు వినిన తరువాత వారు చాలా ఆగ్రహానికి గురయ్యారు, వారు ఆయనపై పళ్ళు కోరికారు అంత కోపం తనపై ఉంది, కానీ స్తేపన్ పరిశుదాత్మ తో నిండిన వాడై పరిశుధాత్మ ఆదీనంలో ఉన్నాడు, 55 ఆయన పరలోకం వైపు కనులెత్తి చూడగా గొప్ప వెలుగును చూస్తూ,అతను యేసు తండ్రి కుడిపార్శం మీద ఉండి లేవడం చూసాడు. 56 అప్పుడు అతడు పరలోకం తెరవబడుటయూ యేసు తండ్రి దగ్గర కుడి పర్శమున కూర్చుని ఉండడం చూసాను అని చెప్పాడు.
57 యూదుల సభ సభ్యులు,పెద్దలు ఆ మాట విన్నప్పుడు, వారు గట్టిగా కేకలు వేసారు.అతడి మాటలు వినబడకుండా వారు తమ చెవులు మూసుకున్నారు, వెంటనే వారు అందరు అతనిదగ్గరకు పరిగెత్తుకొచ్చారు. 58 వారు స్టెఫన్ ను యేరూషలేము బయటకు తీసుకెళ్ళి,రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు.అతడిని నిందిస్తున్నవారు సులభంగా రాళ్లు విసరునట్లు తమ పైవస్త్రములు తీసివేసి,కాపలా కాయునట్లు వాటిని యవ్వనుడైన సౌల్ కి ఇచ్చారు .
59 వారు రాళ్ళు వేయుచుండగా, స్తేఫన్ ఇలా ప్రార్ధించాడు"ప్రభువైన యేసూ,నా ఆత్మను నీకు అప్పగిస్తునాను,స్వీకరించు!" 60 అప్పుడు స్తేఫన్ తన మోకాళ్ళ మీదపడి గట్టిగా ఇలా ప్రార్ధించాడు "ప్రభువా, ఈ పాపమునుబట్టి వారిని శిక్షించవద్దు!" ఇలాచెప్పి,అతడుమరణించాడు.
Chapter 8
1 2 స్తేఫన్ చనిపోయిన తరువాత కొంతమంది దేవుణ్ణి ప్రేమించువారు ఆయనను సమాధిచేసి,ఆయన కొరకు ఎంతో ఏడ్చారు. ఆ రోజునుంచి యెరూషలేములో ఉన్న విశ్వాసులను హింసించడం ప్రజలు ప్రారంబించారు. అందువల్ల అక్కడ ఉన్న యూదులలో చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నవారు ఇతర ప్రాంతాలకు అనగా యూదయ, సమరయ దేశాలకు పారిపోయారు. శిష్యులు మాత్రమే యెరూషలేములో ఉండిపోయారు. 3 స్తేఫన్ ను చంపుతున్న సమయంలో సౌలు అక్కడే ఉండి ఆ మరణానికి ఒప్పుకున్నాడు. అంతేగాక సౌలు యేసును నమ్మిన కూడా వారిని నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్లి ఆడవారిని, మగవారిని బయటకు లాక్కోచ్చి వారిని చెరసాలలో వేసేవాడు.
4 యెరూషలేములో విడిచిపోయిన విశ్వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లి, వారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలాల్లో కూడా యేసును గూర్చి ప్రకటించారు. 5 వారిలో ఒకడైన ఫిలిప్పు యెరూషలేములో నుండి సమరయ ప్రాంతం లోని ఒక పట్టణానికి వెళ్లాడు.అక్కడ యేసును గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు.
6 చాలా మంది ఫిలిప్పు మాటలను విని అతడు చేసిన అద్బుతాలు చూసారు, అందువల్ల అతని మాటలను శ్రద్దగా వినడానికి ఇష్టపడ్డారు. 7 ఉదాహరణకు, చాలామందిలో ఉన్న దెయ్యాలను బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు,అవి కేకలు వేస్తూబయటికి వచ్చాయి. అంతేగాక, చాలామంది పక్షవాతం గలవారిని,కుంటివారిని స్వస్థపరిచాడు. 8 అందువల్ల ఆ పట్టణంలో చాలా మంది సంతోషించారు.
9 అదే పట్టణంలో సీమోను అను గారడీ వాడు ఉన్నాడు.వాడు చాలాకాలంగా క్షుద్రవిద్యలను చేస్తుండేవాడు,తన గారడితో చాలా కాలంనుండి సమరయ జిల్లాలో ఉన్న ప్రజలను ఆశ్చర్య పరుస్తూ వచ్చాడు. "తాను చాలగోప్పవాడినని!" చెప్పుకుంటూ ఉండేవాడు. 10 ప్రజలందరూ, సామాన్యులే గాని,గొప్పవారే కానీ అతని మాటలను విన్నారు. "ఈ మనిషి దేవుని గొప్పశక్తిని కలిగిఉన్నాడు" అని చెప్పుకునేవారు. 11 వారు అతని మాటలు వినుట కొనసాగించారు ఎందుకంటే వాడు చాలాకాలం నుండి వారిని తన గారడీ తో ఆశ్చర్య పరిచాడు.
12 కానీ ఆ తర్వాత ప్రజలు క్రీస్తును గూర్చిన ఫిలిప్పుసందేశం విని నమ్మారు. వారిలో క్రీస్తును నమ్మిన ఆడవారు,మగవారు బాప్తీస్మం పొందుకున్నారు. 13 సీమోను కూడా ఫిలిప్పు సందేశం నమ్మి బాప్తీస్మము పొందుకున్నాడు, అయితే సీమోను నిత్యము ఫీలిప్పు తో ఉండి అతడు చేసిన అద్బుతాలు చూసాడు,ఆ క్రియలు పిలిప్పు నిజమే ప్రకటిస్తునాడని చూపించేవి.
14 ఎప్పుడైతే సమరయ ప్రజలు దేవుని నమ్మి బాప్తిస్మము పొందుకుంటున్నారు అని యెరూషలేములో ఉన్న అపోస్తులులు విన్నారో అక్కడకు పేతురును యోహానును పంపించారు. 15 పేతురు యోహానులు సమరయకు వెళ్లి, కోత్తగా యేసును నమ్ముకున్న విశ్వసులపై చేతులు ఉంచి ప్రార్ధించినపుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 16 పరిశుద్ధాత్మ అంతకు ముందు వారి మీదకు రాలేదు దాని అర్ధం వారులో ఎవరు పొందుకోలేదు ఎందుకంటే వారు యేసు నామంలో బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నారు. 17 అప్పుడు పేతురు యోహానులు వారిమీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు.
18 అపోస్తలులు చేతులుంచినప్పుడు ప్రజలు పరిశుద్ధాత్మను పొందడం సీమోను చూసాడు. 19 అప్పుడు అతడు అపోస్తులకు డబ్బు ఇవ్వజూపి ఇలాచెప్పాడు--మీరు చేస్తున్నది నేను కూడా చేసేలాగున,నేనెవరి మీద చేతులు ఉంచితే వారందరూ పరిశుద్ధాత్మ పొందేలాగా నాకు సహాయం చెయ్యండి.
20 అప్పుడు పేతురు గారడీ సిమోనుతో--- నీ డబ్బు నాశనం అయిపోతుంది. ఎందుకంటే నీవు దేవుని బహుమానమును డబ్బుతో కొనాలనుకుంటున్నావు, 21 నీవు మాతో కలిసి పనిచేయ్యలేవు ఎందుకంటే నీ హృదయం దేవునితో సరిగా లేదు. 22 కాబట్టి అటువంటి దుర్మార్గపు ఆలోచనలను మానేసి దేవుణ్ణి వేడుకో, ఒకవేళ దేవునికి ఇష్టమైతే నీ దుర్మార్గపు ఆలోచన ను బట్టి నిన్ను క్షమిస్తాడు. 23 నీ పాపపు మర్గాల్లో నుండి తిరుగు ఎందుకంటే నీవు మా మీద అసూయతో ఉన్నావు,నీ పాపపు కోరికలకు నీవు దాసుడవై ఉన్నావు అని అతనితో చేప్పెను.
24 అప్పుడు సిమోను వారితో ఇలా మనవి చేసెను-- దయచేసి నాకు మీరు చెప్పినట్లు దేవుడు చెయ్యకుండా నా గురించి ప్రార్ధించoడి.
25 పేతురు యోహానులు ప్రజలతో దేవుని గురించి వారికి వ్యక్తిగతంగా తెలిసినవి చెప్పి, వారికి దేవుని సందేశాన్ని ప్రకటించి యేరుసలేము తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యంలో సమరయ జిల్లాలోని ప్రజలకు దేవుని వాక్యం ప్రకటిస్తూ వెళ్లారు.
26 ఒకరోజు ప్రభువైన దేవుడు పంపిన దూత ఫీలిప్పుకు ఇట్లు ఆజ్ఞాపించెను- దక్షిణం వైపున యెరూషలేము నుండి గాజా వెళ్ళే దారిలో వెళ్ళడానికి సిద్దపడు.ఆ దారి ఎడారి ప్రాంతంలో ఉంది. 27 కాబట్టి ఫిలిప్పు సిద్దపడి ఆ దారిలో వెళ్లాడు. అక్కడ ఇథియోపియా నుండి వచ్చిన ఒక వ్యక్తిని కలిసాడు. ఆయన ఇథియోపియా రాణి ధనము అంతటి మీద అధికారిగా ఉండిన ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన భాషలో ఆ రాణిని కాందేస్ అని పిలిచేవారు. 28 ఈయన దేవుని ఆరాధించుటకు యెరూషలేము వెళ్లి,తిరుగు ప్రయాణంలో రధంలో కుర్చుని ఉన్నాడు.అలా వెళ్తూ ప్రవక్తయైన యెషయ రాసిన గ్రంధం చదువు చుండెను.
29 అప్పుడు ప్రభు ఆత్మ రధం వద్దకు వెళ్లి,దగ్గరగా నడవమని ఫిలిప్పుకు చెప్పాడు. 30 అప్పుడు ఫీలిప్పు రధం దగ్గరకు వెళ్లి ఆ అధికారి ప్రవక్త యెషయ రాసినది చదువుతుండగా విని-- నీవు చదుతున్నది నీకు అర్ధము అవుచున్నదా ? అని అడిగెను. 31 దానికి అతడు-- నాకు వివరించేవారు ఎవరూ లేకుండా ఎలా అర్ధం చేసుకోగలను అని చెప్పెను.అప్పుడు ఆయన ఫిలిప్పుతో నా దగ్గరకు వచ్చి కూర్చుండమని చెప్పాడు.
32 యేషయ గ్రంధంలో ఆ అధికారి చదువుతున్న భాగం ఇది: '' వధకు తేబడిన గొర్రెపిల్ల వలే ఆయన మౌనంగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన నోరు మెదపలేదు. 33 ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయం దొరకక పోయెను, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది".
34 ఈమాటల గురించి చదువుతున్నప్పుడు ఈ మాటలు ఎవరి గురించి ప్రవక్త చెప్పాడో ఆ అధికారికి అర్ధం కాలేదు, అప్పుడు ఫిలిప్పు ను అడుగుతున్నాడు --ఈ మాటలు ప్రవక్త తన గురించి చెప్తున్నాడా,లేదా ఇతరుల గురించా? 35 అప్పుడు ఫిలిప్పు ఆయనకు జవాబు చెప్పాడు; ఆ వాక్య భాగంతో ప్రారంభించి ఆయనకు యేసు ప్రభును గుర్చిన సువార్తను ప్రకటించాడు.
36 37 ఆ దారిలో వారు ప్రయాణం చేస్తుండగా, మార్గమధ్య లో నీళ్ళు కనిపించగా,ఆ అధికారి ఫిలిప్పుతో --చూడు, అక్కడ నీళ్ళున్నాయి,నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి , బాప్తిస్మం తీసుకోకుండా నన్నుఏదీ ఆపలేదు. 38 అలా చెప్పి ఆ అధికారి రధసారధి తో రధాన్నిఆపమని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు,అధికారి ఇద్దరు నీళ్ళలోనికి దిగారు, పిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు.
39 వారు నీళ్ళలోనుండి బయటికి వచ్చిన తరువాత దేవుని ఆత్మ ఫిలిప్పును దూరంగా తీసుకెళ్ళింది. ఆ తరువాత ఆ అధికారి మరల ఫిలిప్పును ఎప్పుడు చూడలేదు. ఆ మార్గం లో ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. 40 అయితే దేవుని ఆత్మ తనను అధ్బుతంగా అజోతు పట్టణానికి తీసుకెళ్లిందని ఫిలిప్పు గ్రహించాడు. అతడు ఆప్రాంతంలో ప్రయాణిస్తూ యేసుని గూర్చిఅజోతు సీజరయ్యల మధ్య ఉన్నపట్టణాలలో ప్రకటించాడు. మరియు అతడు అలా సీజరయ్య వరకు ప్రకటించాడు.
Chapter 9
ଇତିମଧ୍ୟରେ ଶାଉଲ କ୍ରୋଧରସହ ପ୍ରଭୁଙ୍କ ଅନୁକାରୀମାନଙ୍କୁ ବଧ କରିବା ନିମନ୍ତେ ଧମକ ଦେବାରେ ଲାଗି ରହିଲା|ସେ ଯିରୁଶାଲମର ପ୍ରଧାନ ଯାଜକଙ୍କ ନିକଟକୁ ଗଲା ଏବଂ ଦମ୍ମେସକର ଯିହୁଦୀୟ ନେତୃବର୍ଗଙ୍କ ନିକଟରେ ନିଜକୁ ପରିଚିତ କରାଇବା ଉଦ୍ଦେଶରେ ଏକ ପତ୍ର ଲେଖାଯିବା ନିମନ୍ତେ ନିବେଦନ କଲା|ଯୀଶୁଙ୍କ ଦତ୍ତ ଶିକ୍ଷା ପଥର ଅନୁକାରୀ ହୋଇଥିବା କୌଣସି ପୁରୁଷ କିମ୍ବା ସ୍ତ୍ରୀମାନଙ୍କୁ ବାନ୍ଧି ସେମାନକୁ ବନ୍ଦୀ ରୁପେ ଯିରୁଶାଲମକୁ ଧରି ନେବା ନିମନ୍ତେ ଶାଉଲକୁ ଅଧିକାର ଦେବାପାଇ ପତ୍ରରେ ଦର୍ଶା ଯାଇଥିଲା, ଯେପରିକି ଯିହୁଦୀୟ ନେତାମାନେ ବିଚାର କରି ଦଣ୍ଡ ଦେଇପାରନ୍ତି|
3 సౌలు మరియు తనతోనున్నవారు కలిసి ప్రయాణం చేస్తూ దమస్కుకు సమీపముగా వచ్చిరి. అకస్మాత్తుగా ఆకాశమునుండి ప్రకాశవంతమైన వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించెను. 4 వెంటనే అతడు నేల మీద పడెను. అప్పుడు అతడు తనతో, " సౌలా, సౌలా, నీవేలా నన్ను గాయపరచటానికి ప్రయత్నిస్తున్నావు? " అని పలికిన స్వరమును అతను వినెను.
5 సౌలు ఆయనతో, " ప్రభువా, నీవు ఎవరివి?" అని అడిగెను. ఆయన సమాధానమిస్తూ, " నీవు గాయపరచుచున్న యేసును నేను. 6 ఇప్పుడు నీవు లేచి పట్టణానికి వెళ్ళు! నీవు ఏమి చేయాలని నేను కోరుకుంటున్నానో, అది నీకు అక్కడ ఒకరు తెలియచేస్తారు" అని చెప్పెను. 7 సౌలుతో కూడా ప్రయాణము చేస్తున్నవారు విస్మయముచెంది ఏమీ మాట్లాడలేకపోయిరి. వారు అలాగే నిలబడిపోయిరి. ప్రభువు మాట్లాడుట వారు విన్నారు కాని, ఎవరిని చూడలేదు.
8 9 అప్పుడు సౌలు నేలమీద నుండి లేచి నిలబడగా అతనికి కళ్ళు తెరచి చుడసగెను కానీ అతడు చుదలేకుండెను .అప్పుడు అతనితో ఉన్నవారు ఆయనను దమస్కు అనే పట్టణానికి చేపట్టి తీసుకొని వెళ్ళెను. తరువాత మూడు దినములు అతడు ఏమి చూడలేనివాడుగా ఉండి ఏమియు తినలేదు మరియు త్రాగలేదు .
10 11 12 దమస్కులో యేసుని వెంబడించే అననియ అనే ఒక శిష్యుడు ఉండేను .అతనికి యేసుక్రీస్తు దర్శనం ఇచి అతనితోమాటలడెను .అప్పుడు అననియ నీ దాసుడు అలకించు చున్నాడు మాట్లాడుము అనేను .అపుడు ప్రభువు ఈరీతిగా సెలవిచ్చెను. నీవు లేచి నీకు ఎదురుగా వున్న వీధిలో వున్న యుదా అనువాని ఇంటిదగ్గరికి వెళ్లి అక్కడ ఎవరిని అడుగుము తర్శిసు వాడైన సౌల్ గురించి ప్రార్దించుము . ఎందుకనగా యి సమయమందు అయన నాకు ప్రార్దన చేయుచున్నాడు.ఆ సమయమందు సౌలు ఒక దర్శనం చూసేను అదేమనగా అననియ అనే దైవసేవకుడు తాను వున్న ఇంటిలోనికి వచ్చి తనఫై చేతులు ఉంఛగా అతడు తిరిగి చూపు పొందునట్లు అతని కొరకు ప్రర్దించుము .
13 అననీయ సమాధానమిస్తూ, "కాని ప్రభువా, ఈ మనుష్యుని గురించి అనేకమంది నాకు చెప్పారు! యెరూషలేములో నీ యందు విశ్వాసముంచిన ప్రజలకు అనేకమైన కీడులను తలపెట్టియున్నాడు! 14 ఇక్కడ దమస్కులో కూడా నీయందు విశ్వాసముంచినవారిని బంధించుటకు ప్రధాన యాజకులు అతనికి అధికారము ఇచ్చియుండిరి!" అని చెప్పెను. 15 అయితే ప్రభువైన యేసు అననీయాతో, "సౌలు వద్దకు వెళ్ళు! నేను చెప్పినది చేయి, ఎందుకనగా యూదులు కాని ప్రజలకును వారి రాజులకును మరియు ఇశ్రాయేలు ప్రజలకును అతడు నన్ను గూర్చి ప్రకటించుచు నాకు సేవ చేయుటకు అతనిని నేను ఎన్నుకొంటిని. 16 నా గురించి ప్రజలకు ప్రకటించుటకు అతను తరచుగా శ్రమ పడవలసి యున్నదని నేనే అతనికి తెలియజేస్తాను" అని చెప్పెను.
17 కావున అననీయ వెళ్లి, సౌలు ఉన్న ఇంటిని కనుగొని అందులోనికి ప్రవేశించెను. అతను సౌలును కలిసిన వెంటనే అతని మీద తన చేతులుంచి, 'సౌలా సహోదరుడా , యేసు ప్రభువు నీ యొద్దకు వెళ్ళమని నాకు ఆజ్ఞాపించాడు. దమస్కునకు వచ్చు మార్గములో నీవు ప్రయాణము చేయుచుండగా నీకు కనిపించినది కూడా ఆయనే. నీవు మరలా చూపు పొందుకొని సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండునట్లు నీ యొద్దకు నన్ను పంపెను" అని చెప్పెను. 18 వెంటనే సౌలు కన్నులనుండి చేప పొలుసులు వంటివి రాలి పడిపోగా, అతడు చూడ గలిగెను. అప్పుడు అతను లేచి బాప్తీస్మం తీసుకొనెను. 19 సౌలు కొంత ఆహారము తీసుకొనిన తరువాత బలము పొందుకొనెను. ఇతర విశ్వాసులతో కూడా దమస్కులో సౌలు అనేక దినములు గడిపెను.
20 వెంటనే అతడు యూదుల సమాజ మందిరాలలో యేసుని గూర్చి ప్రకటించుట ప్రారంభించెను. యేసు దేవుని కుమారుడు అని వారికి తెలియచేసెను. 21 అతని బోధ వినిన వారందరూ ఆశ్చర్యపడిరి. మరికొందరు "ఈ మనుష్యుడు యెరూషలేములో విశ్వాసులను హింసించి ఇక్కడున్న వారిని కూడా యెరూషలేములోని ప్రధాన యాజకుల యొద్దకు ఖైదీలుగా తీసుకొని వెళ్ళటానికి వచ్చాడంటే మేము నమ్మటం కష్టముగా ఉంది" అని చెప్పుకొనిరి. 22 కాని సౌలు అనేక ప్రజలకు బోధించుచు వారిని ఒప్పించునట్లుగా దేవుడు అతనిని బలపరచెను. అతడు లేఖనములనుండి యేసే క్రీస్తని రుజువు చేయుచు వచ్చెను. కావున దమస్కులో ఉన్న యూదుల నాయకులు సౌలు చెప్పిన దానిని వ్యతిరేకించలేకపోయిరి.
23 కొంత కాలము తరువాత, అక్కడున్న యూదుల నాయకులు అతనిని చంపుటకు కుట్ర పన్నిరి. 24 పట్టణము యొక్క ద్వారముగుండా వచ్చుచూ పోవుచూ ఉన్న ప్రజలలో సౌలు కనబడునేమో, పట్టుకొని చంపుదాము అని ప్రతిదినము ప్రతి రాత్రి వెదకుచూ వచ్చిరి. అయినను వారేమి చేయబోవుచున్నారో కొంతమంది సౌలునకు చెప్పిరి. 25 కాబట్టి, అతను యేసునొద్దకు నడిపిన వారిలో కొందరు సౌలును పట్టణము చుట్టూ ఉన్న ఎత్తైన రాతి గోడ వద్దకు ఒక రాత్రివేళ తీసుకొని వచ్చెను. వారు అతనిని పెద్ద బుట్టలో పెట్టి మోకులు సహాయముతో గోడకున్న ఒక రంద్రముగుండా దింపి వేసిరి. ఈ విధముగా ఆతను దమస్కునుండి తప్పించు కొనెను.
26 సౌలు యెరూషలేమునకు వచ్చినప్పుడు, అతను అక్కడున్న విశ్వాసులను కలవాలని ప్రయత్నించెను. అయితే, అతను విశ్వాసిగా మారినట్లు వారు నమ్మలేదు గనుక, వారందరూ ఆయనంటేనే భయపడిపోయిరి. 27 అయితే బర్నబా అతనిని అపోస్తలుల దగ్గరకు తీసుకొని వచ్చెను. బర్నబా అపోస్తలుల వద్దకు వెళ్లి, సౌలు దమస్కునకు పోవు మార్గములో ప్రయాణిస్తుండగా అతను యేసు ప్రభువును చూచినప్పుడు అతనితో ఆయన ఎలా మాట్లాడెనో తెలియజేసెను. మరియు దమస్కులో నున్న ప్రజలకు సౌలు ఎంత ధైర్యముగా ప్రకటించెనో కూడా వారికి తెలియచేసేను.
28 కావున సౌలు యెరూషలేమంతటనున్న అపోస్తలులను ఇతర విశ్వాసులను కలుసుకోవటం ప్రారంభించెను, మరియు ప్రభువైన యేసును గూర్చి బహు ధైర్యముగా వారితో మాట్లాడెను. 29 గ్రీకు మాట్లాడ్లు యూదులతో కూడా సౌలు మాట్లాడుచూ, వారితో తర్కము చేయుచుండెను. కాని వారు సౌలును ఏలాగున చంపవలెనని ఎడతెగక ఒకటే ఆలోచన కలిగియుండెను. 30 వారు సౌలును చంపటానికి ఆలోచన చేస్తున్నారని ఇతర విశ్వాసులు విని, వారిలో కొంతమంది ఆయనను కైసరయ పట్టణమునకు తీసుకెళ్ళిరి. అక్కడ వారు ఆయనను తన స్వంత ఊరైన తార్సునకు పోవు ఓడ ఎక్కించిరి.
31 అప్పుడు, హింసించువారు లేనందున యూదయ గలిలయ సమరయ పట్టణములలోని విశ్వాసులు ప్రశాంతముగా ఉండిరి. పరిశుద్ధాత్మ వారిని బలపరచుచూ ప్రోత్సాహించుచుండెను. వారు ప్రభువును ఘనపరుచుచుండెను, మరియు పరిశుద్ధాత్మ ఇతరులు అనేకమందిని విశ్వాసులుగా మారునట్లు సహాయము చేయుచుండెను. 32 ఆ ప్రాంతముల గుండా పేతురు ప్రయాణించుచుండగా, తీర ప్రాంతమునున్న లుద్ద పట్టణములో నివసిస్తున్న విశ్వాసులను దర్శించుటకు వెళ్ళెను.
33 అక్కడ అతను ఐనెయ అనబడిన ఒక మనుషుని కలిసెను. ఐనెయ పక్షవాతము చేత ఎనిమిది సంవత్సరములు నుండి మంచం నుండి పైకి లేవలేనివాడై ఉండెను. 34 పేతురు అతనితో, "ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్తపరుస్తున్నాడు! పైకి లేచి నీ చాప చుట్టుకొనుము" అని చెప్పెను. వెంటనే ఐనెయ లేచి నిలువబడెను. 35 ఐనెయ స్వస్థపడిన తరువాత అక్కడ లుద్దలోను మరియు షారోను మైదానములోను ఉన్న ప్రజలు అతనిని చూచి, యేసు ప్రభువునందు విశ్వాసముంచిరి.
36 యొప్పే పట్టణములో తబిత అనే ఒక విశ్వాసి ఉండెను. ఆమె పేరునకు గ్రీకు భాష నందు దోర్కా అని అర్ధం. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేయుచూ పేదలకు సహాయము చేస్తూ వారి అవసరతలు తీర్చుతూ వచ్చేది. 37 పేతురు లుద్దలో ఉన్నప్పుడు ఆమె అనారోగియై మరణించెను. అక్కడున్న కొంత మంది స్త్రీలు యూదుల ఆచారము ప్రకారము ఆమె దేహమును కడిగిరి. తరువాత వారు ఆమె శరీరమును బట్టతో కప్పి ఇంటిపైన మేడ గదిలో ఉంచిరి.
38 లుద్ద యొప్పేకు సమీపముగా ఉండెను, కావున పేతురు ఇంకనూ లుద్దలోనే ఉన్నాడని శిష్యులు విని, వారు పేతురునొద్దకు ఇద్దరు మనుష్యులను పంపిరి. వారు పేతురు నొద్దకు వచ్చి "దయచేసి వెంటనే బయలుదేరి మాతో కూడా యొప్పేకు రమ్ము" అని అతనిని బ్రతిమాలిరి. 39 వెంటనే పేతురు సిద్ధపడి వారితో కూడా వెళ్ళెను. వారు యొప్పేలో ఉన్నఇంటికి వెళ్ళగానే, మేడమీద దోర్కా శరీరము ఉన్న గదిలోనికి ఆయనను తీసుకొని వెళ్ళిరి. అక్కడున్న విధవరాండ్రు అందరూ ఆయన చుట్టూ నిలువబడిరి. వారు ఏడ్చుచూ దోర్కా బ్రతికున్నప్పుడు ఆమె విధవరాండ్ర కోసము చేసిన వస్త్రములను చూపించుచుండిరి.
40 కానీ పేతురు వారినందరిని గదిలోనుండి వెలుపలికి పంపివేసి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసెను. తరువాత, చనిపోయిన శరీరము వైపు తిరిగి "తబితా, లేచి నిలబడు!" అని చెప్పెను. వెంటనే ఆమె తన కన్నులు తెరిచి, పేతురును చూసి, లేచి కూర్చుండెను. 41 ఆమె లేచి నిలువబడుటకు అతడు ఆమెకు తన చేతినందించెను. విశ్వాసులను ముఖ్యముగా విధవరాండ్రను అతడు పిలిచి ఆమె తిరిగి బ్రతికియున్నదని వారికి చూపించెను. 42 జరిగిన అద్భుతకార్యము గూర్చి యొప్పేలోని ప్రజలందరూ త్వరలోనే తెలుసుకొనిరి, ఫలితముగా అనేకమంది ప్రభువైన యేసునందు విశ్వాసముంచిరి. 43 పేతురు యొప్పేలో సీమోను అనే చర్ముకారుని ఇంట అనేకదినములు ఉండెను.
Chapter 10
1 2 కోర్నేలి అనే ఒక వ్యక్తి కైసరయ అనే పట్టణంలో నివసించేవాడు. ఇతడు ఇటలీ దేశములో , రోమా సైనికులలో వంద మందిపైన అధికారము కలిగిన ఒక అధికారి. అతడు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి ప్రయత్నించేవాడు. అతడు మరియు అతడి కుటుంబము యూదులు కాదు, వారు దేవుడిని అలవాటు ప్రకారముగా ఆరాధించేవారు. అతడు పేదవారైన యూదులకు తరచుగా సహాయం చేస్తుండేవాడు మరియు ప్రతిరోజు దేవునికి ప్రార్ధన చేసేవాడు.
3 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొర్నేలి ఒక దర్శనం చూసాడు. ఆ దర్శనం లో అతడు దేవుని చేత పంపబడిన ఒక దేవదూతను చూసాడు. ఆ దేవదూత అతని గదిలోనికి వచ్చి " కొర్నేలి " అని పిలచుట చూసాడు. 4 కొర్నేలి ఆ దేవదూతను చూసి భయపడ్డాడు. ఎంతో భయముతో " అయ్యా, మీకు ఏమి కావాలి?" అని అడిగాడు. దేవుని చేత పంపబడిన ఆ దేవదూత కొర్నేలితో " నువ్వు ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయుట మరియు పేదవారికి ధనము ఇచ్చి సహాయం చేయుట ద్వారా దేవునిని సంతోషపెట్టావు. అవి దేవునికి జ్ఞాపకార్ధ అర్పణగా ఉన్నాయి. 5 అయితే నువ్వు ఇప్పుడు యొప్పె అనే ప్రాంతానికి మనుష్యుల్ని పంపించి పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను అనే వ్యక్తిని పిలిపించు. 6 అతడు సీమోను అనబడే మరొక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. అతడు చర్మకారుడు. అతని ఇల్లు సముద్రం దగ్గర ఉంది" అని చెప్పెను.
7 కొర్నేలితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్ళిపోయిన తరువాత కొర్నేలి తన ఇంటిలో పనిచేసే ఇద్దరి పనివారిని, మరియు దేవునిని ఆరాధించువాడై తనకు సేవచేసే ఒక సైనికుడిని పిలిపించి. 8 దేవదూత తనకు ఏమి చెప్పిందో వారికి వివరించి చెప్పి, పేతురును కైసరయ కు పిలిపించడానికి వారిని పంపించాడు.
9 తరువాత రోజు మధ్యాహ్నం సమయం అయినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ప్రయాణము చేస్తూ యొప్పెకు సమీపించారు. వారు యొప్పెకు సమీపించినపుడు పేతురు ప్రార్ధన చేసుకోవడానికి మేడ పైకి ఎక్కాడు. 10 అతనికి ఆకలి వేసి ఏమైనా తిందామనుకున్నాడు. కొంతమంది ఆహారం సిద్ధం చేస్తూ ఉండగా పేతురు ఒక దర్శనం చూసాడు. 11 ఆ దర్శనంలో ఒక దుప్పటి ఆకాశము నుండి భూమి మీదకు వేయబడి దాని యొక్క నాలుగు మూలలు పైకి లేపబడి ఉంది. దానిలో అన్ని రకాల జీవులు ఉన్నాయి. 12 అందులో పక్షులు, జంతువులు మరియు మోషే ధర్మశాస్త్రములో తినకూడదు అని ఆజ్ఞాపించబడిన జంతువులు అన్నీఉన్నాయి. అందులో కొన్ని నాలుగు కాళ్ళ జంతువులు, మరికొన్ని నేలమీద ప్రాకేవి మరియు అడవి పక్షులు ఉన్నాయి.
13 తరువాత దేవుడు పేతురుతో " పేతురూ, నువ్వు లేచి ఈ జంతువులలో కొన్ని చంపుకొని తిను " అని అతనితో చెప్పగా విన్నాడు. 14 కాని పేతురు " ప్రభువా, నేను ఎప్పుడూ మోషే ధర్మశాస్త్రము అంగీకరించని మరియు నీవు నాకు తినకూడదని ఆజ్ఞాపించినవి ఎప్పుడూ తినలేదు " అని చెప్పాడు. 15 అంతట పేతురు దేవుడు తనతో రెండవసారి మాట్లాడడం విన్నాడు. దేవుడు " నేను దేవుడను, కాబట్టి నేను తినుటకు తయారు చేసిన వాటిని నువ్వు తినకూడదు అని చెప్పకూడదు " అనెను. 16 ఈలాగు మూడుసార్లు జరిగింది. తరువాత వెంటనే జంతువులు, పక్షులు ఉన్న ఆ దుప్పటి ఆకాశానికి ఎత్తబడింది.
17 పేతురు ఆ దర్శనమును అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా , కొర్నేలి పంపించిన ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారు సీమోను ఇంటికి ఎలా వెళ్ళాలి అని అక్కడ ఉన్న ప్రజల్ని అడిగారు. తరువాత వారు వచ్చి సీమోను ఇల్లు కనుక్కొని తలుపు దగ్గర నిల్చొన్నారు. 18 పేతురు అనే మారు పేరు కలిగిన సీమోను అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అడిగారు.
19 పేతురు ఇంకా ఆ దర్శనాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవుని ఆత్మ అతనితో " విను, నిన్ను చూడడానికి ముగ్గురు మనుష్యులు వచ్చారు. 20 కాబట్టి నువ్వు వెంటనే కిందకి దిగి వాళ్ళతో కూడా వెళ్ళు. వెళ్ళాలా వద్దా అని ఆలోచించొద్దు ఎందుకంటే నేనే వాళ్ళని ఇక్కడికి పంపించాను " అని చెప్పెను . 21 పేతురు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో, " వందనాలు, మీరు వెదుకుతున్న వ్యక్తిని నేనే. మీరు ఎందుకు వచ్చారు?" అని అడిగాడు.
22 వాళ్ళు పేతురుతో " రోమా సైన్యాధికారి అయిన కొర్నేలి మమ్మల్ని పంపించాడు. అతను చాలా మంచివాడు దేవుడిని ఆరాధిస్తాడు. అతని గురించి తెలిసిన యూదా ప్రజలు అందరు కూడా అతడు మంచివాడని చెప్తారు. దేవదూత అతనితో 'నువ్వు కొంతమంది మనుష్యుల్ని పంపించి పేతురుని ఇక్కడికి పిలిపించి అతను చెప్పే మాటలు నువ్వు విను' అని చెప్పాడు " అని సమాధానమిచ్చారు. 23 పేతురు వాళ్ళని లోపలికి రమ్మని ఆ రాత్రి వాళ్ళని అక్కడ ఉండమని చెప్పాడు. తరువాత రోజు పేతురు బయల్దేరి ఆ మనుష్యులతో కూడా వెళ్ళాడు. యొప్పెలో ఉన్న కొంతమంది విశ్వాసులు పేతురుతో కూడా వెళ్లారు.
24 తరువాతి రోజున వాళ్ళు కైసరయ పట్టణానికి చేరుకున్నారు. కొర్నేలి వారికోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కొర్నేలి తన బంధువుల్ని స్నేహితుల్ని కూడా రమ్మని ఆహ్వానించాడు, కాబట్టి వారు కూడా అతని ఇంటిలో ఉన్నారు.
25 26 పేతురు ఆ ఇంటిలోకి వెళ్ళగానే కొర్నేలి అతనిని కలిసుకొని, మ్రొక్కడానికి అతని దగ్గర వంగాడు. పేతురు తన చేతులతో అతనిని నిలబెట్టి " లేచి నిలబడు, నాకు మ్రొక్కవద్దు, నేను కూడా నీలాగా మనిషినే " అని చెప్పాడు.
27 పేతురు కొర్నేలితో మాట్లాడుతూ ఉండగా పేతురు మరియు అతనితో ఉన్నవాళ్లు ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ చాలా మంది కూడి ఉన్నట్లు గమనించారు. 28 పేతురు వాళ్ళతో " మేము యూదులు కానివారితో కలిసినా, వారిని దర్శించినా మేము యూదుల ధర్మశాస్త్రమునకు లోబడట్లేదని అనుకుంటామని మీకందరికీ తెలుసు. ఏది ఏమైనా దేవుడు నాకు దర్శనంలో కనబడి ఎవరినీ చెడిపోయిన వారని, అపరిశుద్ధులని, దేవుడు వారిని అంగీకరించడని చెప్పకూడదు అని చెప్పాడు. 29 అందుకని నువ్వు నాకోసం మనుషుల్ని పంపించగానే నేను అడ్డు చెప్పకుండా వచ్చాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావో చెప్పు?" అని అన్నాడు.
30 31 32 33 కోర్నేలి పేతురుతో "మూడు రోజుల కిందట, నేను ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు చేసినట్లుగానే ఇదే సమయంలో నా గృహంలో దేవునికి ప్రార్ధన చేసుకుంటూ ఉన్నపుడు అకస్మాత్తుగా మెరుస్తూ ఉన్న బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి నా ముందు నిలబడి .నాతో 'కోర్నేలి నీ ప్రార్ధన దేవుడు విన్నాడు. పేద ప్రజలకు సహాయం చేయుటకు నీవు ధనాన్ని ఇచ్చుట దేవుడు గమనించి ఎంతో సంతోషించాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు యొప్పె కు మనుషుల్ని పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించు, అతడు సముద్రము దగ్గర ఉన్నసీమోను అనబడే చర్మపు పని చేసే వేరొక వ్యక్తి ఇంటిలో ఉంటాడు ' అని చెప్పాడు. నేను వెంటనే కొంతమంది మనుషుల్ని పంపి మిమ్మల్ని పిలిపించాను. మీరు వచ్చినందుకు మీకు వందనాలు. ఇప్పుడు దేవుడు మాతో ఉన్నాడని యెరిగి దేవుడు మీకు చెప్పమని ఆజ్ఞాపించిన మాటలు అన్నీ వినుటకు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దయచేసి మీరు మాతో మాట్లాడండి" అని చెప్పాడు.
34 అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టి " దేవుడు ఒక ప్రత్యేకమైన జాతి వారి మీద మాత్రమే దయచూపించేవాడు కాదు. 35 కాని, ఏ జాతి ప్రజలలో అయినా ఆయనను ఘనపరచి ఆయనకు ఇష్టమైన పనులు చేసేవారిని అందరిని ఆయన అంగీకరిస్తాడనే సత్యాన్ని నేను ఇపుడు తెలుసుకున్నాను.
36 దేవుడు ఇశ్రాయేలీయులైన మాకు పంపిన సందేశం మీకందరికీ తెలుసు. ఆయన, యేసు క్రీస్తు చేసిన కార్యము ద్వారా ప్రజలందరినీ ఆయనతో సమాధానపరచుకోవడానికి మాకు సువార్తను ప్రకటించాడు. ఈ యేసు ఇశ్రాయేలీయులకు మాత్రమే ప్రభువు కాక ప్రజలనందరినీ పరిపాలించే ప్రభువై ఉన్నాడు. 37 ఆయన గలిలయలో మొదలుపెట్టి యూదయ ప్రాంతంలో చేసిన కార్యాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఆయన ఈ కార్యాలన్నీ కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను, ప్రజలకు బాప్తిస్మం ఇవ్వకముందు వారి పాపపు స్వభావము నుండి తిరగండి అని ప్రకటించిన తరువాత, చేయడం మొదలుపెట్టెను. 38 దేవుడు నజరేతు అనే పట్టణం నుండి వచ్చిన ఒక మనిషికి తన పరిశుద్ధ ఆత్మను ఇచ్చి అతనికి అద్భుతాలు చేయడానికి శక్తిని ఇచ్చాడని మీకoదరికీ తెలుసు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి అనేకమందికి సహాయం చేసి వారిని స్వస్థపరిచాడని మీకందరికీ తెలుసు. దయ్యములు చేత భాధపరచబడుచున్నవారినందరినీ ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగాడు
39 యెరూషలేములోనూ, ఇశ్రాయేలంతటిలోనూ యేసు చేయగా మేము చూసిన కార్యములన్నిటి గురించి ప్రజలకి చెప్తున్నాము. యెరూషలేములో ఉన్న నాయకులు సిలువకు మేకులు దిగగొట్టడం ద్వారా ఆయనను చంపారు. 40 అయినా కూడా ఆయన చనిపోయి మూడు రోజుల అయిన తరువాత దేవుడు ఆయనను లేపాడు. ఆయన బ్రతికియున్నాడని మేము తెలుసుకోవడానికి ఆయనను చూడడానికి దేవుడు మాకు సహాయం చేసాడు. 41 యూదులందరు ఆయనను చూడడానికి దేవుడు అంగీకరించలేదు కాని ఇతరులకు ఆయనను గురించి చెప్పడానికి ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్న అపోస్తులులమైన మాకు, ఆయనను మేము చూడడానికి అంగీకరించాడు. అపోస్తులులమైన మేము ఆయన తిరిగి లేచిన తరువాత ఆయనతో భోజనం చేసినవారము.
42 ఒకరోజున ప్రజలకందరికి తీర్పు తీర్చడానికి ఆయనను నియమించాడని ప్రజలకి చెప్పి భోదించడానికి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు . ఆ దినాన ఆయన చనిపోయినవారికి, బ్రతికియున్న వారికీ తీర్పు తీరుస్తాడు. 43 పూర్వకాలము ఆయన గురించి రాసిన ప్రవక్తలందరూ ప్రజలకి ఆయన గురించి చెప్పారు. ఆయన వారి కొరకు చేయబోయే కార్యాలను బట్టి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు వారి పాపాలనుండి క్షమిస్తాడు అని వారు వ్రాసారు.
44 పేతురు ఆ మాటలు ఇంకను మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఆ మాటలు వింటున్న యూదులు కాని వారి మీదకు అకస్మాత్తుగా దిగి వచ్చాడు. 45 దేవుడు యూదులు కాని వారి మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించడం చూసి యూదులు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
46 వాళ్ళు, వారికి తెలియని భాషలలో మాట్లాడుతూ దేవుడు గొప్పవాడని ఆయనని స్తుతించడం విని, ఇది దేవుడు చేసిన కార్యం అని యూదులైన విశ్వాసులు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న యూదులైన విశ్వాసులతో పేతురు 47 " దేవుడు యూదులైన మనకు ఇచ్చినట్లుగానే వీళ్ళకు కూడా పరిశుద్ధాత్మను ఇచ్చాడు కాబట్టి మీరందరూ నిశ్చయముగా వీరికి బాప్తిస్మం ఇవ్వడానికి అంగీకరిస్తారు" అని చెప్పెను. 48 తరువాత పేతురు యూదులు కానివారికి, యేసుక్రీస్తు నందు విశ్వాసులుగా మీరు బాప్తిస్మం పొందాలి అని చెప్పాడు. కాబట్టి వాళ్ళందరికీ వారు బాప్తిస్మం ఇచ్చారు. వాళ్ళు బాప్తిస్మంపొందిన తరువాత పేతురుని అక్కడ మరి కొన్ని రోజులు ఉండాలని కోరారు. కాబట్టి వారు అలాగే చేసారు.
Chapter 11
1 యూదులు కానివారు కూడా యేసుని గూర్చిన దైవ సందేశమును విశ్వసించిరని ప్రజలు చెప్పుకొనుట యూదయ ప్రాంతములోని ఆయా పట్టణాలలో నివసిస్తున్న ఇతర విశ్వాసులు మరియు అపోస్తలులు వినిరి. 2 అయితే యెరూషలేములోని కొందరు యూదా విశ్వాసులు మాత్రం క్రీస్తుని వెంబడించు వారందరు సున్నతి పొందవలెనని కోరిరి. పేతురు కైసరయ నుంచి యెరూషలేముకు తిరిగి వచినపుడు అందరు అతనిని కలుసుకొని విమర్శించిరి. 3 వారతనితో "యూదులు కానివారాగు సున్నతిలేని వారి ఇండ్లను నీవు దర్శించి చేసిన తప్పు మాత్రమే గాక వారితో కలిసి భోజనము చేశావని" విమర్శించిరి.
4 కావున పేతురు జరిగినదానిని వారికి తేటగా వివరించెను. 5 అతను, "యొప్పే పట్టణములో నేను ప్రార్థన చేసుకోనుచుండగా పరవశుడనై ఒక దర్శనము చూసితిని. అందులో ఒక పెద్ద దుప్పటి వంటిది ఒకటి దాని నాలుగు మూలలను పట్టుకొని ఆకాశమునుండి దిగుట చూచితిని, అది నేనున్న చోటుకు దిగి వచ్చెను . 6 నేను దానిలోనికి తేరి చూడగా కొన్ని సాధుపరచబడిన జంతువులూ, కొన్ని అడవి జంతువులూ, ప్రాకు పురుగులు, అడవి పక్షులు కనిపించినవి.
7 ఆ సమయములో "పేతురూ, లేచి వీటిని చంపుకొని తినుము!" అని దేవుడు నాకు ఆజ్ఞాపించుట వింటిని. 8 అందుకు నేను "ప్రభువా, నిశ్చయముగా నేను అలా చేయాలని నీవు కోరుకోవు, ఎందుకనగా వేటిని తినకూడదు అని మా ధర్మ శాస్త్రము చెప్పెనో వాటిని నేను ఎన్నడు తినలేదని" చెప్పితిని. 9 ఆకాశమునుండి రెండవ మారు దేవుడు నాతో మాట్లాడుతూ,"నేను దేవుడను, దేనినైన తినటానికి అంగీకారమైనదిగా నేను చేసినప్పుడు, దానిని అంగీకారమైనది కానిదిగా చెప్పవద్దు" అని నాతో చెప్పెను. 10 ఆ విధముగా మరొక రెండు సార్లు జరిగినది. అంతట ఆ జంతువులు పక్షులతో కూడిన ఆ దుప్పటి వంటిది ఆకాశమునకు ఎత్తబడెను.
11 12 13 14 అదే సమయములో కైసరయనుండి పంపబడిన ముగ్గురు మనుషులు నేను ఉన్న ఇంటికి వచ్చిరి. వారు యూదులు కాకపోయినప్పటికి వారితో వెళ్ళుటకు వెనుకాడవద్దు అని దేవుని ఆత్మ నాతో చెప్పెను. నాతో పాటు ఆరుగురు యూదులు కూడా కైసరయకు వచ్చిరి, అప్పుడు మేము యూదుడు కానీ అతని ఇంటికి వెళ్ళాము. తన ఇంటిలో ఒక దూత నిలవబడియుండుట అతను చూసినట్లు మాతో చెప్పాడు. మరియు ఆ దూత అతనితో, "కొంతమంది మనుష్యులను యోప్పా కు పంపి సీమోను అను మారు పేరు గల పేతురును తీసుకొని రమ్మని చెప్పు. అతను వచ్చి నీవును నీ ఇంటి వారందరును ఏ విధముగా రక్షింప బడతారో దానిని మీకు తెలియ చేస్తాడు" అని చెప్పెను.
15 16 నేను వారితో మాటలాడుచుండగా పెంతెకోస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్ముడు మనమీదికి దిగి వచ్చిన రీతిగానే వారిమీదికిని అకస్మాత్తుగా దిగివచ్చెను. అప్పుడు నేను "ఇదిగో యోహాను మీకు నీళ్ళతోబాప్తీస్మమిచ్చెను గాని దేవుడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తీస్మమిస్తాడు" అని ప్రభువు చెప్పినది జ్ఞాపకము చేసుకొంటిని.
17 ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినపుడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మనే యూదులు కాని వారికిని దేవుడు అనుగ్రహించి యున్నాడు. దేవుడు వారికి పరిశుద్దాత్మను అనుగ్రహించినప్పుడు ఆయన తప్పు చేస్తున్నాడని నేను చెప్పలేకపోతిని. 18 పేతురు చెప్పిన దానిని వినిన యూదులైన విశ్వాసులు, అప్పటినుంచి అతనిని విమర్శించటం మానివేసిరి. పైగా " యూదులు కాని వారిని కూడా దేవుడు అంగీకరించి యున్నాడు, వారు తమ పాపపు జీవితము విడిచి మారుమనస్సు పొందిన యెడల వారు కూడా నిత్య జీవము పొందుకుంటారు" అని చెప్పి దేవునిని స్తుతించిరి.
19 స్తెఫను మరణము తరువాత యెరూషలేములో అనేకమంది విశ్వాసులు హింసింప బడుచున్నందున వారు యెరూషలేమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయిరి. ఎందుకనగా చుండిరి. వారిలో కొందరు ఫోయేనిసియకు వెళ్ళిరి, కొందరు కుప్ర దీవి వరకు వెళ్ళిరి. మరి కొందరు సిరియాలోని అంతియొకయ అను పట్టణమునకు వెళ్ళిరి. ఆ ప్రాంతాలలో వారు యేసును గూర్చిన సందేశమును మానక ప్రకటించుచు వచ్చిరి. అయితే, వారు కేవలము వేరే యూదులకు మాత్రమే చెప్పిరి. 20 విశ్వాసులలో కొంత మంది కుప్ర దీవి వాసులును ఉత్తర ఆఫ్రికాలోని కురేనీ అను పట్టణవాసులును ఉన్నారు. వారు అంతియొకయ వెళ్లి యూదులు కాని వారికి కూడా ప్రభువైన యేసును గూర్చి తెలియజేసిరి. 21 ఫలవంతముగా ప్రకటించునట్లు ప్రభువైన దేవుడు ఆ విశ్వాసులను బలపరచుచు వచ్చెను. ఫలితముగా అనేకమంది యూదులు కాని ప్రజలు వారి సందేశమును విశ్వసించి ప్రభువునందు విశ్వాసముంచిరి.
22 అంతియొకయలో అనేకులు యేసు ప్రభువును విశ్వసించిరని ప్రజలు చెప్పుకొనుచుండగా యెరూషలేములోని కొంతమంది విశ్వాసులు వినిరి. కాగా యెరూషలేములోని విశ్వాసుల నాయకులు బర్నబాను అంతియొకయకు పంపిరి. 23 అతను అక్కడికి వెళ్లి విశ్వాసుల పట్ల దేవుడు కనికరము చూపుచున్నాడని గ్రహించెను. అందుకు అతను మిగుల సంతోషించి, ప్రభువైన యేసునందు పూర్ణమైన నమ్మకమును కొనసాగించుమని వారిని ప్రోత్సహించుచు వచ్చెను. 24 బర్నబా పూర్తిగా దేవుని ఆత్మ చేత నడిపింప బడుచున్న ఒక మంచి వ్యక్తి. అతను దేవునియందు పూర్తిగా నమ్మకముంచిన వాడు. బర్నబా చేసిన పనులను బట్టి అక్కడ అనేక మంది ప్రజలు ప్రభువైన యేసును విశ్వసించిరి.
25 తరువాత బర్నబా సౌలును వెదకుతూ కిలికియలోని తార్సు పట్టణమునకు వెళ్ళెను. 26 బర్నబా ఆయనను కనుగొనిన తరువాత, అంతియొకయలోని విశ్వాసులకు బోధించుటలో సహాయముగా ఉండునట్లు అతను సౌలును అక్కడికి తీసుకొని వచ్చెను. సౌలు మరియు బర్నబాలు ఒక సవంత్సరమంతయు అక్కడ సంఘములో తరచుగా కలసుకొనుచు అనేకమంది ప్రజలకు క్రీస్తును గూర్చి బోధించిరి. అంతియొకయలో శిష్యులు మొట్ట మొదట క్రైస్తవులు అని పిలువబడిరి.
27 28 బర్నబా మరియు సౌలు అంతియొకయలో ఉన్నప్పుడు, యెరూషలేము నుండి కొందరు ప్రవక్తలైన విశ్వాసులు వచ్చిరి. వారు బోధించు చుండగా వారిలో అగబు అను నొకడు మాటలాడుటకు లేచి నిలవబడెను. త్వరలోనే అనేక దేశాలలో కరవు రాబోతుందని ప్రవచించునట్లు దేవుని ఆత్మ అతనిని బలపరచెను. (క్లౌదియ రోమా చక్రవర్తిగా ఉన్న కాలములో ఈ కరవు వచ్చింది.)
29 30 అగబు చెప్పినది అక్కడి విశ్వాసులు విని, యూదయలోని విశ్వాసులకు సహాయముచేయుటకు ధనము పంపించాలని తీర్మానము చేసుకొనిరి. ప్రతి ఒక్కరు తాము ఇవ్వగలిగినంత ధనము ఇవ్వటానికి తీర్మానించుకొనిరి. బర్నబా మరియు సౌలునకు ఆ ధనమునిచ్చి యెరూషలేములోని నాయకుల యొద్దకు వారిని పంపిరి.
Chapter 12
1 ఆ దినములలో రాజైన హేరోదు అగ్రిప్ప తన సైనికులను యెరూషలేములో నున్న విశ్వాసుల నాయకులను కొందరిని బందించమని పంపెను. ఆ సైనికులు వారిని బంధించి చెరసాలలో వేసెను. అతను విశ్వాసులను హింసించుటకు ఆ రీతిగా చేసెను. 2 అతను అపోస్తలుడైన యోహాను అన్నయగు, అపోస్తలుడైన యాకోబు తలను చేదించమని సైనికునికి ఆజ్ఞాపించెను. కావున సైనికుడు తనకు ఆజ్ఞాపించినట్లు చేసేను.
3 యుదా ప్రజలయొక్క నాయకులను సంతోష పెట్టెనని హేరోదు గ్రహించి నప్పుడు, పేతురును కూడా బంధించమని సైనికులకు ఆజ్ఞాపించెను. యూదులు పులియని రొట్టులను తిను పండుగ దినములలో ఇది జరిగెను. 4 వారు పేతురును బంధించి, సేరసాలలో వేసెను. వారు పేతురుకు కావలిగా ఉండుటకు నాలుగు సైనిక గుంపులకు ఆజ్ఞాపించెను. ఒకొక్క గుంపులో నలుగురు సైనికులు వుండిరి. పస్కా పండుగ అయిన తరువాత పేతురును చెరసాల నుండి బయటకు తీసుకొచ్చి యూద ప్రజలఎదుట తీర్పు తీర్చాలని హేరోదు తలంచాడు. ఆ తరువాత పేతురును చంపాలని ఆలోచన చేసేను.
5 చాలాదినములు పేతురు చెరసాలలో ఉండెను, అయితే యెరూషలేములోవున్న విశ్వాసులగుంపు పేతురుకు, దేవుడు సహాయము చేయాలని అత్యశక్తితో ప్రార్ధన చేయుచుండెను. 6 పేతురును బయటకు తీసుకొచ్చి బహిరంగముగా చంపాలనుకున్న రోజుకు ముందు రాత్రి, పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి, ఇద్దరి సైనికులమధ్య నిద్రించుచుండెను. మరొక ఇద్దరు సైనికులు ద్వారము నొద్ద కాపలా కాయుచుండెను.
7 అకస్మాత్తుగా ప్రభువైన దేవుని యొద్దనుండి దూత వచ్చి పేతురు ప్రక్కన నిలవబడగా, ఆ గదియంతయు వెలుగుతో నింపబడెను. ఆ దూత పేతురు ప్రక్కన తట్టి "త్వరగా లెమ్ము" అని చెప్పెను. పేతురుమేల్కొనుచుండగా తన చేతుకున్న సంకెళ్ళు ఊడిపెడేను. అయినను అక్కడ ఎమిజరుగుచున్నదో సైనికులకు తెలియదు. 8 అప్పుడు ఆ దూత అతనితో "నీ నడుముకు దట్టీ కట్టుకొని, చెప్పులు తొడుగుకొనుము" అని చెప్పగా, పేతురు ఆలాగు చేసేను. అప్పుడు ఆ దూత అతనితో "నీ పైవస్త్రము వేసుకొని నాతో రమ్ము" అని చెప్పెను.
9 కావున పేతురు తన పైవస్త్రము వేసుకొని చెప్పులు తొడుగుకొని ఆ దూతను వెంబడించుచు చెరసాల నుండి బయటకు వెళ్ళెను. కాని ఇదంతయు నిజముగా జరుగుచున్నట్లు తనకు తెలియదు. అయితే కల కంటున్నట్లుగా తాను భావించెను. 10 పేతురు మరియు దూత ద్వారము నొద్ద కావలి కాయుచున్న ఇద్దరిసైనికులమధ్య నుండి నడచి వెళ్ళిరి, కాని ఆ సైనికులు వారిని చూడలేదు. పట్టణములోనికి పోవు ఇనుప ద్వారము దగ్గరకు వారువచ్చిరి. తలుపు దానంతటకదే తెరుచుకొనెను, పేతురు మరియు దేవునిదూత చెరసాలనుండి బయటకు నడచి వెళ్ళెను. వారు ఒక వీధిగుండా కొంత దూరము వెళ్ళెన తరువాత, దూత అదృష్యమాయెను.
11 చివరకు ఇది దర్శనము కాదు అని , నేజమే అని పేతురు గ్రహించెను. కావున అతను "నిజముగా ప్రభువైన దేవుడు ఒక దూతను పంపి నాకు సహయము చేసెను. హేరోదు నాకు చేయాలనుకున్న దానినుండి, యూదుల నాయకులు నాకు జరగాలని ఉద్దేశించిన వాటన్నిటి నుండి దేవుడు నన్ను రక్షించెను అని నిజముగా గ్రహించెను" . 12 దేవుడు తనను కాపాడెనని పేతురు గ్రహించి, అతను మరియ ఇంట్టికి వెళ్ళెను. ఈమె యోహాను అను మారు పేరుగల మార్కు తల్లి. అనేకమంది విశ్వాసులు అక్కడ కూడివుండిరి, వారు అందరూ పేతురుకు ఎవిదముగానైన దేవుడు సహయము చేస్తాడని ప్రార్దించు చుండెను.
13 పేతురు వెలుపటి తలుపు తట్టినప్పుడు, రోదే అనబడిన ఒక పని పిల్ల తలుపు బయట ఎవరున్నారో చూచుటకు వచ్చెను. 14 పేతురు ఆమెకు బదులివ్వగా అతని స్వరమును ఆ చిన్నది గుర్తించెను, అయితే ఆ చిన్నది తలుపు తెరవకుండ అత్యంత సంతోషముతోను ఆనందముతోను నిండినదై, తిరిగి ఇంటిలోనికి పరుగెత్తుకుంటూ వెళ్ళెను. పేతురు తలుపు బయట నిలిచున్నాడని తక్కిన విశ్వాసులకు ఆమె చెప్పెను. 15 అయితే వారిలో ఒకరు ఆమెతో "నీవు పిచ్చిదానివా!" అని అనెను. కాని ఆమె ఇది నిజం అని చెప్పుచుండెను. అయితే వారు "కాదు, అది పేతురు కాదు. అది అతని దూత అయివుంటుంది" అనెను.
16 17 కాని పేతురు తలుపు తట్టుచునే ఉండెను.చివరిగా వారిలో ఒకరు తలుపు తెరవగా,వారు పేతురును చూచి,ఆశ్చర్యపడిరి. పేతురు వారిని మౌనముగాఉడమని తన చేతితో సైగ చేసెనుఅప్పుడు ప్రభువైన దేవుడు తనను ఆది ఏవిదముగా చెరసాలనుండి విడిపించేనో వారికి వివరించెను.మరియు అతను "మన తోటి నాయకుడైన యకోబుకు,మన ఇతర విశ్వాసులకు జరిగినదానిని తెలియ చెయుడి" అని వారితో చెప్పెను.తరువాత పేతురు వారిని విడిచి మరొక చోటికి వెళ్ళెను.
18 మరుసటిరోజు ఊదయకాలమున పేతురుకు కాపలాగా వున్న సైనికులు అతనికి ఎమిజరిగినదో తెలియక కలవర పడ సాగిరి. 19 అప్పుడు జరిగినది హేరోదు వినెను. కాగా పేతురును వెదకమని సైనికులకు ఆజ్ఞాపించెను, గాని వారు అతనిని కనుగోనలేకపోయిరి. అప్పుడు అతను పేతురుకు ఎవరు కాపలాగా వున్నారని ప్రశ్నించి, వారిని తీసుకెళ్ళి చంపివేయమని ఆజ్ఞాపించెను. తరువాత, హేరోదు యూదయనుండి కైసరియ పట్టణముకు వెళ్లి కొంత కాలము అక్కడ నివసించెను.
20 తూరు సీదోను పట్టణములలో నివసిస్తున్న వారిమీద హేరోదు రాజు కోపోద్రేకుడైయుండెను. ఒక రోజున వారికి చెందిన కొందరు హీరోదును కలవాలని కైసరయ పట్టణమునకు వచ్చిరి. వారు వచ్చి తమ పట్టణములు హేరోదు రాజుతో సమాధానము కోరుచున్నవని రాజుతో తెలియ చేయుటకు, హేరోదు క్రింది ముఖ్యాధికారులలో ఒకరైన బ్లాస్తును బతిమిలాడుకోనిరి . ఎందుకనగా వారు హేరోదు పాలిస్తున్న ప్రాంత ప్రజల వద్ద ఆహారము కొనుక్కోవాలి కావున వారితో వర్తకము చేయాలనుకున్నారు. 21 హేరోదు రాజు వారిని కలవాలనుకున్న దినమున, తాను రాజరికమును చూపించే విలువైన వస్త్రాలను ధరించెను. అప్పుడు అతను తన సింహాసనము మీద కుర్చుని అక్కడికి కూడి వచ్చిన అందరిని ఉద్దేశించి ఉపన్యాసము చేసెను .
22 అతని ఉపన్యాసము వినినవారు బిగ్గరగా "ఇది బోదిస్తున్నవాడు దేవుడే కాని మానవుడు కాదు" అని కేకలు వేసిరి. 23 అయితే ప్రజలు దేవుని కాక తనని స్తుతించులాగున హేరోదు చేసెను, గనుక వెంటనే ప్రభువైన దేవుని యెద్దనుండి ఒక దూత వచ్చి హేరోదును తీవ్రముగల రోగముచేత మొత్తెను. అనేకమైన పురుగులు అతని ప్రేగులను తినివేసినందున, వెంటనే తీవ్రమైన బాధతో మరణించెను .
24 విశ్వాసులు దేవునిగురించి అనేక స్థలాలలో బోధించుచుండిరి, విశ్వసించిన వారి సంఖ్య విస్తరించు చుండెను. 25 బర్నబా మరియు పౌలు యూదయ ప్రాంతములో నున్న యూదా విశ్వాసులకు ధనము ఇచ్చుట ముగించిన తరువాత, యెరూషలేము విడిచి సిరియలోనున్న అంతియోకియకు తిరిగి వెళ్ళిరి ,వారు తమతో కూడా యోహాను అను మారుపెరుగల మార్కును వెంట్టపెట్టుకుని వెళ్ళిరి .
Chapter 13
1 సిరియా ప్రాంతములోని అంతియొకయలో నున్న విశ్వాసులలో కొందరు ప్రవక్తలు ఉండిరి. వారు యేసు క్రీస్తు ను గురించి ప్రజలకు బోధించిరి. వారెవరనగా బర్నబా; నిగేరు అనబడిన సుమెయోను; కురేనేయుడైన లూకియ; రాజైన హేరోదు అంతిపతో కలసి పెరిగిన మనయేను మరియు సౌలు ఉన్నారు. 2 వారు ఉపవాసం ఉండి దేవున్నిఅరాదిస్తుండగా పరిశుద్దాత్మడు వారితో - "బర్నబా మరియు సౌలు నన్ను సేవించి, వెళ్లి నేను కోరుకొనిన పనిని వారు చేయుటకు వారిని ప్రత్యేకించుడి!" అని చెప్పెను. 3 వారు ఉపవాసముండి ప్రార్థన చేయుచూ ఉండిరి. వారు బర్నబా మరియు సౌలు మీద తమ చేతులు ఉంచి దేవుడు వారికి సహాయము చేయులాగున ప్రార్థన చేసిరి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి అజ్ఞాపించినది చేయునట్లు బర్నబా మరియు సౌలును పంపిరి.
4 బర్నబా మరియు సౌలు ఎక్కడికి వెళ్లవలసినది పరిశుద్దాత్ముడు వారికి తెలియజేసెను. వారు సముద్ర మార్గము మీదుగా అంతియొకయ నుండి సెలూకయకు వెళ్ళిరి. అక్కడనుండి ఓడలో కుప్ర అను ద్వీపములోని సలమి పట్టణానికి వెళ్ళెరి. 5 వారు సలమిలో ఉన్నప్పుడు యూదుల సమాజ మందిరములకు వెళ్ళిరి. అక్కడ వారు యేసును గూర్చిన దేవుని సందేశమును ప్రకటించిరి. యోహాను మార్కు వారితో కూడా సహాయము చేయటకు వెళ్ళెను
6 ఆ ముగ్గరు కలసి ఆ ద్వీపము అంతట తిరిగి పాఫు పట్టణముకు వెళ్ళిరి. అక్కడ వారు బర్ యేసు అను ఒక మాంత్రికుని కలిసిరి. అతడు ఒక యూదుడైయుండి తనను తాను అబద్దముగా ఒక ప్రవక్తనని ప్రకటించుకొను చుండెను. 7 అతడు ఆ ద్వీపమునకు అధిపతియైనట్టియు బాగా తెలివైనవాడునగు సెర్గు పౌలుతో పాటు ఉండెను. ఈ అధిపతి దేవుని వాక్యము వినగోరి, బర్నబా మరియు సౌలునొద్దకు ఒకరిని పంపెను. 8 అయినను గ్రీకులో ఎలుమ అనబడిన అ మాంత్రికుడు వారిని అడ్డగించటానికి ప్రయత్నించెను. యేసునందు విశ్వాసముంచవద్దని అతడు అధిపతిని మాటి మాటికి ఒత్తిడి చేయుచు వచ్చెను.
9 పౌలుగా పిలువబడుతున్న సౌలు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకొనిననవాడై, మాంత్రికుని వైపు తేరి చూసి "అపవాదిని సేవిస్తూ మేలైన ప్రతిదానిని అడ్డుకొనుచున్నావు! 10 నీవు ఎల్లప్పుడూ ప్రజలతో అబద్దములాడుతూ ఇతరములైన చెడ్డ పనులను చేయుచున్నావు. ప్రభువైన దేవుని గూర్చిన సత్యమును అసత్యము అని చెప్పటము మానుకోవాలి!
11 ప్రభువైన దేవుడు ఇప్పుడే నిన్నుశిక్షించును! నీవు గ్రుడ్డివాడవై కొంతకాలము సూర్యున్ని చూడవు" అని చెప్పెను. ఉన్నపలముగానే అతడు చీకటిలో ఉన్నవానివలె గ్రుడ్డివాడాయెను, ఎవరైనా వచ్చి తన చేయి పట్టుకొని నడిపిస్తారేమోనని అతడు తడవులాడుచుండెను. 12 ఎలుమకు జరిగినదానిని అధిపతి చూచినప్పుడు, యేసునందు విస్వాసముంచెను. ప్రభువైన యేసును గూర్చి పౌలు బర్నబాలు చేయుచున్న బోధకు అతడు ఎంతగానో ఆశ్చర్యపడెను.
13 అటు తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాఫునుంచి పంఫూలియ ప్రాంతములోని పెర్గ పట్టణమునకు వెళ్ళిరి. పెర్గలో యోహాను మార్కు వారిని విడిచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయెను. 14 తరువాత పౌలు బర్నబా పెర్గలో సంచరించుంచు గలతీయ ప్రాంతములోని పిసిదియా ప్రాంతములోనున్న అంతియొకయ అను పట్టణమునకు వచ్చిరి. విశ్రాంతి దినమున వారు సమాజమందిరములో ప్రవేశించి కూర్చుండెను. 15 ఒకరు ధర్మ శాస్త్రములో మోషే వ్రాసిన దానిని బిగ్గరగా చదివెను. తరువాత మరొకరు ప్రవక్తలు వ్రాసినదానినుండి చదివెను. తరువాత యూదుల సమావేశ స్థల నాయకులు పౌలు బర్నబా యొద్దకు వర్తమానము పంపి - "తోటి యూదులారా, ఇక్కడున్న ప్రజలను ప్రోత్సహిస్తూ మీలో ఎవరైనా ఒకరు మాట్లాడాలనుకుంటే, మాట్లాడవచ్చు" అని తెలిపిరి.
16 పౌలు నిలబడి తాను చెప్పబోవునది వినమంటూ అక్కడి ప్రజలకు చేతితో సైగ చేసెను. అప్పుడు అతను, "తోటి ఇశ్రాయేలీయులారా మరియు యూదులు కానప్పటికీ దేవుని ఆరాధించుచున్నవారలారా, 17 నా మాట ఆలకించుడి! ఇశ్రాయేలీయులమైన మనము ఆరాధించు దేవుడు మన పితరులను తన జనముగా ఎన్నుకున్నాడు; మరియు వారు పరదేశులుగా ఐగుప్తులో నివసిస్తున్నపుడు విస్తారమైన జనముగా చేసియున్నాడు. తరువాత దేవుడు వారిని బానిసత్వములోనుండి బయటకు తీసుకు రావటానికి బలమైన కార్యములు చేసాడు. 18 వారు మాటి మాటికి అవిధేయత చూపినప్పటికీ, అరణ్యములో నున్నప్పుడు దేవుడు వారిని నలువది సంవత్సరములపాటు పోషించెను.
19 కనాను ప్రాంతములో నివసిస్తున్న ఏడు జాతుల ప్రజలను జయించునట్లు ఆయన ఇశ్రాయేలీయులను బలపరిచాడు, మరియు వారి భూ భాగమును ఇశ్రాయేలీయులకు నిత్య స్వాస్త్యముగా ఇచ్చాడు. 20 ఈ సంగతులన్నియు వారి పితరులు ఐగుప్తునకు వెళ్ళిన 450 సంవత్సరముల తరువాత జరిగినవి."
21 22 దాని తరువాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు దేవుడు వారిలో కొందరిని న్యాదిపతులుగాను మరియు నాయకులుగాను ఎన్నుకున్నాడు. ఆ నాయకులు మన ప్రజలను పరిపాలిస్తూ వచ్చారు, వారిలో ప్రవక్తయైన సముయేలు చివరి న్యాయాధిపతిగా వారిని పరిపాలించాడు. సమూయేలు ఇంకనూ వారి నాయకునిగా ఉన్నప్పుడే, ప్రజలు తమను పరిపాలించుటకు వారి మీద రాజు నియమించమని కోరుకున్నారు. దేవుడు బెన్యామీను గోత్రమునుండి కీషు కుమారుడైన సౌలును వారి మీద రాజుగా ఏర్పరిచాడు. అతను వారిని నలువది సంవత్సరములు పాలించాడు. దేవుడు సౌలును రాజుగా తృణీకరించిన తరువాత, ఆయన వారి మీద రాజుగా దావీదును ఎన్నుకున్నాడు. దేవుడు అతని గురించి మాట్లాడుతూ, " నేను ఇష్టపడిన దానిని ఇష్టపడే వ్యక్తిగా యెష్షయి కుమారుడైన దావీదును నేను చూచితిని. అతను చేయాలని నేను అనుకొనిన దానినంతటిని అతడు చేస్తాడు" అని చెప్పెను.
23 దావీదుకు మన పితరులైన ఇతరులకు తానూ చేస్తానని వాగ్దానము చేసిన రీతిగా, మనలను రక్షించుటకు దావీదు సంతానములోనుండి ఒకరైన యేసును ఇశ్రాయేలీయులైన మన కొరకు దేవుడు పంపించాడు. 24 యేసు తన సేవను ప్రారంబించటానికి ముందు బాప్తిస్మము ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికి ప్రకటించుచూ వచ్చెను. అతను వారితో వారు తమ పాపపు ప్రవర్తన నుండి వెను తిరిగి క్షమించమని దేవుని వేడుకొనవలెనని చెప్పాడు. తరువాత అతను వారికి బాప్తీస్మము ఇచ్చాడు. 25 తాను చేయుటకు దేవుడి తనకు ఇచ్చిన పనిని యోహాను ముగించబోయేముందు అతను ఇలా అన్నాడు, 'పంపుతానని దేవుడు వాగ్దానము చేసిన మేస్సీయాను నేనే అని మీరనుకుంటున్నారా? కాదు, నేను కాదు. అయితే వినుడి! మెస్సీయా త్వరలోనే వస్తాడు. అతను నాకంటే గొప్పవాడు. అతని పాదములనుండి చెప్పులను తీయుటకైనను తగిన వాడను కాను.'"
26 అబ్రాహాము సంతానమైనట్టి నా తోటి ఇశ్రాయేలీయులారా, యూదులు కానీవారైనప్పటికీ దేవుని ఆరాధించేవారలారా, దయచేసి వినండి! ఇది మన అందిరికి చెందినది. ఏమనగా దేవుడు ప్రజలను ఏ విధముగా రక్షించ బోవుచున్నాడోననిన సందేశమును పంపించియున్నాడు. 27 యెరూషలేములో నున్న ప్రజలు వారి నాయకులు వారిని రక్షించుటకు ఈ మనుష్యుడైన యేసును దేవుడు పంపెనన్న సంగతి గ్రహించలేదు. ప్రతి విశ్రాంతి దినమున ప్రవక్తల వచనములు గట్టిగా చదవబడుచున్నప్పటికి, మెస్సీయాను గూర్చి ప్రవక్తలు వ్రాసినది వారు అర్థం చేసుకోలేదు. కాగా ప్రవక్తలు ముందుగానే ప్రకటించిన రీతిగా యూదుల నాయకులు యేసును మరణమునకు అప్పగించిరి.
28 యేసు చెడ్డ పనులను చేస్తున్నాడని అనేకమంది ప్రజలు ఆరోపించారు, కాని యేసు మరణ శిక్షకు తగిన దేనినైనా చేసినట్లు తగిన కారణములు ఎవరూ చుపించలేకపోయారు. యేసును మరణ శిక్ష వేయమని ప్రజలు అధిపతియైన పిలాతును అడిగారు. 29 ప్రజలు యేసునకు ఏమి చేస్తారని ప్రవక్తలు ముందుగానే వ్రాసియుంచిరో వాటన్నిటిని వారు ఆయనకు చేసిరి. వారు యేసును సిలువకు మేకులతో కొట్టి చంపిరి. తరువాత ఆయన శరీరమును సిలువపైనుండి క్రిందికి దింపి సమాధిలో పెట్టిరి.
30 అయినను దేవుడు మరణము నుండి ఆయనను తిరిగి లేపెను. 31 గలిలయ నుండి యెరూషలేమునకు తనతోపాటు వచ్చిన ఆయన అనుచరులకు తరుచుగా చాల దినములు కనిపించెను. ఆయనను చూచిన వారు ఇప్పుడు ప్రజలకు ఆయన గూర్చి సాక్షము చెప్పుచున్నారు.
32 ఇప్పుడు మేము ఆ సువార్తను మీకు ప్రకటించుచున్నాము. దేవుడు మన పితరులైన యూదులకు చేసిన వాగ్ధానములన్నిటిని ఆయన నెరవేర్చాడు అని మేము మీకు చెప్పదలిచాము. 33 ఇప్పుడు వారి సంతానమైన మన కొరకు మరియు యూదులు కాని వారి కొరకు యేసును మరణమునుండి తిరిగి లేపుట ద్వారా ఆయన ఆ వాగ్దానములను నెరవేర్చాడు. తన కుమారుని పంపుచున్నాడని దేవుడు చెప్పినట్లు దావీదు తన రెండవ కీర్తనలో ఇలా వ్రాసాడు: 'నీవు నా కుమారుడవు; నేడు నిన్ను నా కుమారునిగా చేసుకొనియున్నాను.' 34 దేవుడు మెస్సీయాను మరణమునుండి లేపియున్నాడు మరలా ఇక నెన్నటికిని ఆయనను మరణము పొందనీయడు. దాని విషయమై దేవుడు మన పితరులైన యూదులతో, ' నేను చేస్తాను అని దావీదుకు వాగ్దానము చేసినట్లు నిశ్చయముగా నేను నీకు సహాయము చేస్తాను.' అని చెప్పెను.
35 దావీదు వ్రాసిన మరొక కీర్తనలో మేస్సీయాను గూర్చి ఇలా చెప్పాడు: 'నీ పరిశుద్దుని యొక్క శరిరమును కుళ్ళు పట్టనీయవు'. 36 దావీదు జీవించుచున్నకాలములలో ఆయన చేయాలని దేవుడు చెప్పినదంతయు అతను చేసెను. ఆయన చనిపోయిన తరువాత తన పితరులు సమాధి చేయబడిన విధముగానే సమాది చేయబడెను మరియు అతని శరీరమును కుళ్లి పోయెను. కాబట్టి తన కీర్తనలో దావీదు తనగురించి మాట్లాడు కోలేడు. 37 అయితే మరణమునుండి యేసు ఒక్కడినే దేవుడు లేపెను , మరియు ఆయన శరీరము కుళ్ళిపోలేదు.
38 కాబట్టి నా తోటి ఇశ్రాయేలియులారా మరియు ఇతర స్నేహితులారా మన పాపములను నిమిత్తము యేసు చేసిన దానికి ప్రతిపలముగా దేవుడు మన పాపములను క్షమించును. మోషే ధర్మశాస్త్రము వలన క్షమింప బడని పాపల విషయములో కూడా ఆయన మిమ్ములను క్షమిస్తాడు. 39 యేసునందు విశ్వాసముంచిన వారు తాము దేవునికి అయిష్టముగా చేసిన పాపముల విషయమై అపరాదులుగా ఎంచబడరు.
40 కాబ్బట్టి ప్రవక్తలు చెప్పినట్లుగా దేవుడు మీకు తీర్పు తీర్చకుండా జాగ్రత్తగా ఉండుడి! 41 ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇలా చెప్పెను: 'నన్ను దూషించు మీరు నిశ్చయముగా నేను చేయబోవు కార్యమును చూచి ఆశ్చర్యపడతారు, మరియు తప్పక నశిస్తారు. మీరు జీవించుచున్నప్పుడే మీకు భయంకరమైనదానిని చేయబోవుచున్నాను గనుక మీరు ఆశ్చర్యపడతారు. అలా చేస్తాను అని మీతో ఒకరు చెప్పినను దానిని మీరు నమ్మరు.
42 పౌలు ఈ మాటలు ముగించి వెళ్ళుచుండగా, అక్కడున్నవారిలో అనేకమంది మరుసటి విశ్రాంతి దినమున కూడా వచ్చి ఈ సంగతులను మరలా చెప్పమని అడిగిరి. 43 సమావేశము ముగిసిన తరువాత, వారిలో అనేక మంది పౌలు మరియు బర్నబాలను వెంబడించిరి. వీరిలో యూదులు మరియు యూదులు కాకయే దేవుని ఆరాధించు వారును ఉండిరి. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుచూ, యేసు చేసిన కార్యమును బట్టి దేవుడు ప్రజల పాపములను దయతో క్షమించునని మానక నమ్మిక కలిగియుండుడని వారిని బ్రతిమాలికొనిరి.
44 మరుసటి విశ్రాంతి దినమున అంతియొకయాలో ఉన్న ప్రజలు అనేకమంది ప్రభువైన యేసును గూర్చి పౌలు బర్నబాలు చెప్పునది వినుటకు యూదుల సమావేశ స్థలమునకు వచ్చిరి. 45 అయితే పౌలు బర్నబాలు చెప్పునది వినుటకు వచ్చిన మహా జన సమూహమును చూచి యూదుల నాయకులు బహుగా అసూయ పడిరి. కావున వారు పౌలు చెప్పినదానికి వైరుధ్యాన్ని తీసుకొస్తూ హేళన చేసిరి.
46 47 అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యముగా మాట్లాడుతూ, అక్కడి యూదుల నాయకులతో ఇలా అనిరి: "యేసును గురించిన దేవుని సందేశమును, మేము యూదులు కాని వారికి ప్రకటించక ముందు యూదులైన మీకే ప్రకటించితిమి. ఎందుకనగా ముందుగా మీకే ప్రకటించమని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. కాని దేవుని సందేశమును మీరు తిరస్కరించారు. ఆవిధముగా చేసి నిత్య జీవమునకు యోగ్యులు కారని మిమ్మును మీరు చూపించుకున్నారు. కాబట్టి, మేము మిమ్మును విడిచిపెట్టుచున్నాము, ఇప్పుడు మేము దేవుని సందేశమును చెప్పుటకు యూదులు కాని వారి యొద్దకు వెళ్ళెదము. ఈ విధముగా చేయమని కూడా ప్రభువైన దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఆయన మాతో ఇలా చెప్పాడు, ' యూదులు కాని వారికి నన్ను గురించిన విషయములు తెలియచేయుటకు నేను మిమ్ముని ఎన్నుకొంటిని, అవి వారికి వెలుగు వలె ఉండును. ప్రపంచములోని ప్రతి ఒక్కరిని నేను రక్షించాలనుకుంటున్నట్లు మీరు వెళ్లి చెప్పుడి.'
48 అన్యజనులు ఆ మాటలు విని బహుగ సంతోషించి, యేసును గూర్చిన వర్తమానముకై దేవుని స్తుతించిరి. నిత్యజీవము కొరకు దేవుడు ఎన్నుకొనిన అన్యజనులందరూ ప్రభువైన యేసును గూర్చిన సందేశమును నమ్మిరి. 49 ఆ సమయములో విశ్వాసులలో అనేకమంది ఆ ప్రాంతమంతయు తిరిగి, వారు వెళ్ళిన ప్రతి చోట ప్రభువైన యేసును గూర్చిన సందేశమును ప్రచురము చేసిరి.
50 అయినప్పటికి, అక్కడ వారితో కూడా ఆరాధన చేస్తున్న ప్రముఖులైన స్త్రీలతోను, అదేవిధముగా పట్టణములోని ప్రముఖులైన పురుషులతోను యూదుల నాయకులలో కొందరు మాట్లాడిరి. పౌలు బర్నబాలను ఆపుచేయమని వారిని బలవంతము చేసిరి. కావున యూదులు కాని వారు అనేకమందిని పౌలు బర్నబాలకు వ్యతిరేకముగా లేపగా, వారు ఆ ప్రాంతములోనుండి పౌలు బర్నబాలను పంపివేసిరి. 51 ఆ ఇద్దరు అపోస్తలులు విడిచి వెళ్ళుచుండగా వారు తమ పాదముల ధూళిని దులిపి దేవుడు వారిని తృణీకరించెననియు తప్పక శిక్షిస్తాడు అనియు తెలియచేసిరి. 52 తరువాత వారు అంతియొకయ పట్టణమును విడిచి ఈకొనియ పట్టణముకు వెళ్ళిరి. ఈ మధ్యకాలంలో విశ్వాసులు ఆనందముతోను పరిశుద్ధాత్మ శక్తితోను నింపబడిరి.
Chapter 14
1 ఈకోనియంలో పౌలు మరియు బర్నబా యధావిధిగా యూదుల సమాజమందిరములోనికి వెళ్లి ప్రభువైన యేసును గూర్చి శక్తివంతంగా ప్రకటించిరి. అ వాక్యము వినిన అనేకమంది యూదులు మరియు యూదులు కానివారును యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిరి. 2 కాని కొంతమంది యూదులు ఆ సువార్తను తిరస్కరించిరి. మరియు అ మాటలను నమ్మవద్ధని యూదులు కానివారితో వారు చెప్పిరి; వారు అక్కడవున్న యూదులు కానివారు విశ్వాసులపై కోపపడేలా చేసిరి.
3 కావున పౌలు మరియు బర్నబాలు అనేక దినములు అక్కడేవుండి ప్రభువునిగూర్చి ధైర్యంగా ప్రకటించిరి, మరియు అనేకమైన అద్బుతములు చేయుటకు ప్రభువైన యేసు వారిని బలపరిచెను. ఈవిధముగా అ ప్రజలకు సువార్త సత్యమును, అనగా మనము యోగ్యులము కానప్పటికి ప్రభువు మనలను రక్షించెనని తెలియపరిచెను. 4 ఈకోనియలో నివసించు ప్రజలు రెండురకాల ఉద్దేశములను కలిగినవారై, కొంతమంది యూదులతో మరికొంతమంది అపోస్తులతో అంగికరించిరి.
5 అటుతర్వాత పౌలు మరియు బర్నబాలను వ్యతిరేకించిన యూదులు మరియు యూదులు కానివారును వారిని ఎలాగు అవమానపరచాలోనని తమలోతాము అలోచించుచుండిరి. అ పట్టణంలోని కొందరు ప్రముఖులు విరీకి సహాకరించుటకు అంగీకరించిరి. వీరందరూ కలసి పౌలు మరియు బర్నబాలను రాళ్ళతో కొట్టి చంపాలని నిర్ణయించుకొనిరి. 6 అయితే పౌలు మరియు బర్నబాలు వారి ఆలోచన తెలుసుకొని, వెంటనే అక్కడనుండి లుకయొనియ అనబడినజిల్లాకు వెళ్ళిరి. ఆ జిల్లాలోని లుస్త్ర, దేర్బే మరియు అ పరిసర ప్రాంతములకు వెళ్ళిరి. 7 వారు అ ప్రాంతంలో ఉన్నంతకాలం యేసు ప్రభువును గుర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచూవుండిరి.
8 లుస్త్రలో, కుంటి కాళ్ళు కలిగిన ఒకడు అక్కడ కుర్చునివుండెను. అతని తల్లి అతనికి జన్మనిచ్చినది మొదలుకుని, అతడు కుంటి కాళ్ళు కలిగినవానిగా ఉండెను, అతడు ఎన్నటికిని నడవలేకవుండెను. 9 పౌలు ప్రభువైన యేసుని గూర్చి ప్రకటించుండగా అతను వినెను. పౌలు అతని వైపు తేరి చూచెను, మరియు అతని ముఖంలో యేసు క్రీస్తు తనను స్వస్తపరచగలడు అనే విశ్వాసమును చూచెను. 10 కావున పౌలు - " లేచి నడువుము " అని బిగ్గరగా అతనితో చెప్పెను, ఆ మాటను వినిన వెంటనే అతడు గంతులువేస్తూ నడువసాగెను.
11 అక్కడవున్న జనసముహము పౌలు చేసినది చూచినప్పుడు, వారు పౌలు మరియు బర్నబాలను తాము ఆరాధించే ధైవములని అని బావించిరి. కావున వారు ఆశ్చర్యముతో ఈకోనియా భాషలో బిగ్గరగా, "చూడుడి! దేవుళ్ళు తమ్మునుతాము మనుష్యుల రూపంలో కనబడునట్లు చేసుకుని మనకు సహాయముచేయుటకు ఆకాశంనుండి దిగివచ్చిరి!" అని కేకలు వేసిరి. 12 వారు మాట్లాడుచూ బర్నబాను తమ ప్రధాన దేవుడైన ద్యుపతి అనుకున్నారు. మరియు పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు గనుక, పౌలును ఇతర దేవతలకు వర్తమానికుడైన హెర్మే అనుకున్నారు. 13 ఆ పట్టణ ద్వారమునకు వెలుపల దేవాలయములో ప్రజలు ద్యుపతిని ఆరాధించేవారు. అక్కడున్న పూజారి పౌలు మరియు బర్నాబా చేసిన కార్యములను విని, ఆ పట్టణపు ద్వారము వద్ద అప్పటికే కూడివున్న జనసముహము వద్దకు వచ్చెను. అతను పూలదండలతో అలకరిచిన రెండు ఎద్దులను తీసుకునివచ్చెను.పౌలు మరియు బర్నబాలను ఆరాధించుటలో భాగంగా, పూజారి మరియు జనసముహము కలసి ఆ ఎద్దులను వధించుటకు సిద్దపడిరి.
14 కాని అపోస్తులులు అయిన బర్నాబా మరియు పౌలు ఆ విషయం విని, కలతచెంది, తమ వస్త్రములను చింపివేసుకొని. వారు జనసముహములోనికి వెళ్లి కేకలు వేయుచు 15 " ప్రజలారా మమ్ము ఆరాధించుటకు ఆ ఎద్దులను చంపవద్దు, మేము దేవుళ్లముకాము, మేమును మీలాంటి స్వభావము కలిగిన మనుష్యులమే. మేము మీకు సువార్తను! తెలియజేయుటకు వచ్చియున్నాము! మేము సర్వశక్తుడైన దేవుని గూర్చిప్రకటించుటకు వచ్చియున్నాము. మీరు ఇతర దేవుళ్ళను ఆరాధించవద్దని అయన కోరుకొనుచున్నాడు. ఎందుకనగా వారు మీకు సహాయము చేయలేరు. మేము ప్రకటిస్తున్న ఈ నిజ దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రములను మరియు సమస్తమును కలుగజేసెను. 16 పూర్వము యూదులు కాని మీరందరూ మీకు నచ్చిన దేవుళ్ళను ఆరాదించిరి. మీకు ఈ నిజమైన దేవుడు ఎవరో మీరు ఎరుగరు గనుక, ఆయన మిమ్మును ఆరాదింపనిచ్చేను.
17 అయితే అయన మనపై దయ కనపరచియున్నాడు. ఆయనే వర్షమును పంపువాడు, పంటలు ఫలిపంచేయువాడు. ఆయనే మీకు సమృద్ధిగా ఆహారమునిచ్చి మీ హృదయములో సంతోషం నింపేవాడు. 18 పౌలు చెప్పిన ఆ మాటలు ప్రజలు వినిరి , కాని ఆ ఎద్దులను వధించి అరాదింపతలచెను. కాని చివరకు ప్రజలు అలా చేయకూడదని నిర్ణయించుకొనిరి.
19 అయినప్పటికిని, కొంతమంది యూదులు అంతియోకయ మరియు ఈకోనియ నుండి వచ్చి పౌలు చెప్పిన మాటలు సత్యము కాదని లుస్త్ర ప్రజలను బలవంతముచేసిరి. ఆ యూదుల మాటలు నమ్మిన వారు పౌలుపై కోపపడిరి. వారు పౌలును స్పృహ కోల్పోవునట్లు రాళ్ళతో కొట్టుటకు యూదులను ప్రోత్సహించెను. వారందరూ పౌలు చనిపోయేనని తలంచి అతనిని పట్టణపు బయటకు ఈడ్చుకొనిపోయి వదలివేసేను. 20 కాని లుస్త్ర నుండి వచ్చిన కొంతమంది విశ్వాసులు నేలపై పడియున్న పౌలునొద్దకు వచ్చి చుట్టూ నిలవబడిరి. పౌలు స్ప్రుహలోనికి వచ్చెను! అతను నిలబడి విస్వాసులతో కలసి తిరిగి ఆ పట్టణములోనికి వెళ్ళెను.
మరునాడు పౌలు మరియు బర్నాబా లుస్త్ర పట్టణం విడచి దేర్బే పట్టనంనకు వెళ్ళిరి. 21 వారు అనేకమైన దినములు అక్కడనే ఉండి అక్కడ ప్రజలకు యేసుక్రీస్తును గూర్చిన సువార్తను బోధించుచుండెను. అనేకమంది విశ్వాసులుగా మార్పుచెందిరి. అటుతర్వాత పౌలు మరియు బర్నాబా తిరుగు ప్రయాణమై లుస్త్ర పట్టణమునకు వెళ్ళిరి. మరియు అక్కడ నుండి ఈనోనియకు అక్కడ నుండి పిసిదియా ప్రాంతంలోని అంతియోకియా పట్టణంకు వెళ్ళిరి. 22 ప్రతి ప్రాంతంలో వారు విశ్వాసులను యేసుక్రీస్తు నందు విడువక విశ్వాసముంచమని బ్రతిమలుకోనిరి. వారు ఆ ప్రజలతో " దేవుడు మనలను సదాకాలము పరిపాలించక మునుపు మనము అనేకమైన శ్రమలను అనుబవింపవలెను" చెప్పెను.
23 పౌలు మరియు బర్నాబా ప్రతి సంఘమునకు నాయకులను ఏర్పరిచెను. ప్రతి స్థలమును విడిచిపెట్టేముందు పౌలు మరియు బర్నాబా అక్కడి విశ్వాసులను సమకూర్చి వారితో ఉపవాసములోను ప్రార్ధనలోను సమయం గడిపిరి. మరియు పౌలు బర్నబాలు అక్కడి నాయకులను విశ్వాసులను వారి క్షేమము కొరకై, వారు విశ్వసించిన ప్రభువైన యేసునకు అప్పగించిరి. 24 పౌలు మరియు బర్నాబా ఆ పిసిదియా ప్రాంతమంతయు సంచరిచిన తరువాత దక్షిణముగా నున్న పంఫూలియ ప్రాంతమునకు వెళ్ళిరి. 25 అ ప్రాంతంలో పెర్గా అనే పట్టణమునకు అక్కడి ప్రజలకు ప్రభువైన యేసును గుర్చిన దేవుని వర్తమానమును బోధించిరి. తరువాత వారు అత్తాలియా పట్టణపు సముద్రతీరమునకు వెళ్ళిరి. 26 అక్కడనుండి ఓడ ఎక్కి సిరియా ప్రాంతోములోని అంతియోకయ పట్టణమునకు తిరిగివెళ్ళిరి. ఇక్కడ పౌలు బర్నబాలు ఇతర ప్రాంతములకు వెళ్లి సువార్తను ప్రకటించుటకును ప్రత్యేకింప బడిరి. పౌలు మరియు బర్నబాలు తాము ఇప్పుడు చేసి ముగించిన పనిలో దేవుడు తోడుగా ఉండాలని ఇక్కడి విశ్వాసులు దేవుని ప్రార్థించిన స్థాలమది.
27 వారు అంతియోకియ పట్టణమునకు వచ్చినప్పుడు,వారు అక్కడి విశ్వాసులనందరిని సమకూర్చిరి. పౌలు మరియు బర్నబా దేవుడు తమకు ఎలాగు సహాయము చేసెనో తెలియజేసిరి. ముఖ్యముగా ప్రభువైన యేసు నందు విశ్వాసముంచు విధముగా యూదులు కానివారిని దేవుడు ఎలా బలపరచేనో తెలిపిరి. 28 తరువాత పాలు మరియు బర్నాబా అక్కడున్న విశ్వాసులతో కలసి అనికమైన దినములు అంతియోకయలో గడిపిరి.
Chapter 15
1 అప్పుడు కొంతమంది విశ్వసించిన యూదులు యూదయ ప్రాంతము నుండి అంతియోకయకు వచ్చిరి. మోషే ధర్మశాస్త్రము నందు చెప్పబడినట్లుగా మీరు తప్పనిసరిగా సున్నతి పొంది దేవునికి చెందినవారైతే గాని రక్షణ పొందలేరని అక్కడ ఉన్న విశ్వసించిన యూదులు కానివారితో భోదించుట ప్రారంభించిరి. 2 పౌలు మరియు బర్నబా ఆ యూదులను ఎదిరించి వారితో వాదించుట మొదలుపెట్టిరి. కావున అక్కడ ఉన్న విశ్వాసులు ఈ విషయమును యెరూషలేములో ఉన్న అపోస్తులులు మరియు పెద్దల యొద్ద పూర్తిగా తెలిసికొనుటకు పౌలును,బర్నబా మరియు కొంతమంది విశ్వాసులను యెరూషలేమునకు పంపిరి.
3 పౌలు, బర్నబా మరియు విశ్వాసులు అక్కడనుండి అంతియోకయ విశ్వాసులచే పంపించబడి ఫోయెనిషీయా, సమరయ ప్రాంతములగుండా ప్రయాణము చేసిరి. వారు మార్గమద్యములో కొన్ని ప్రదేశములలో ఆగుచు వెళ్ళుచు చాలామంది యూదులు కానివారు నమ్మకముంచిరని విశ్వాసులకు తెలియజేయుచు వచ్చిరి. దాని ద్వారా ఆ ప్రాంతములలో ఉన్నవారు గొప్ప సంతోషముతో నింపబడిరి. 4 పౌలు, బర్నబా మరియు విశ్వాసులు యెరూషలేమునకు వచ్చినపుడు అపోస్తులులు, పెద్దలు మరియు అక్కడ వున్న విశ్వాసుల ద్వారా ఆహ్వనించబడిరి. పౌలు మరియు బర్నబా దేవుడు వారి ద్వారా అన్యజనులలో జరిగించిన కార్యములను తెలియజేసిరి.
5 అయితే వారిలో పరిసయ్యుల తెగకు చెందిన కొంతమంది విశ్వాసముంచిన యూదులు లేచి మోషే ధర్మశాస్రము నందు చెప్పబడినట్లుగా యేసునందు విశ్వాసముంచిన అన్యులు సున్నతి పొందవలెనని చెప్పిరి. 6 అపోస్తులులు,పెద్దలు కలసి ఈ విషయం మాట్లాడుటకు వచ్చిరి.
7 వారు చాలా సమయము దీనిని గూర్చి చర్చించిన తరువాత, పేతురు లేచి వారితో ఇలా మాట్లాడెను. నాతోటి సహోదరులారా చాలా కాలము క్రిందట దేవుడు నన్ను అపోస్తులలో ఒకనిగా ఎన్నుకొనెనని మీరు ఎరుగుదురు, కావున దేవుని ప్రేమను గూర్చిన విషయము యూదులు కానివారికి తెలియజేయవలసిన భాద్యత నాపై ఉన్నది. దీనిని బట్టి వారు దేవుని మీద నమ్మిక ఉంచెదరు. 8 దేవుడు అందరి హృదయములను బాగుగా ఎరుగును. దేవుడు మనలను పరిశుద్ధాత్మతో ఎలా నింపెనో అన్యజనులను కూడా పరిశుధాత్మతో నింపియున్నాడు. 9 దేవుడు మనకు వారికి ఏ భేదము లేకుండా వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుటద్వారా అంతరంగంలో పవిత్రత కలుగజేసియున్నాడు. ఆయన మనలను ఆలాగే పవిత్రపరిచాడు.
10 యూదులు కాని వారిని యూదుల ఆచారాలు ,పద్దతులు చేయమని మీరు వారిని ఎందుకు బలవంతపెట్టుచున్నారు? ఈ విధముగా చేయుట ద్వారా వారిమీద చాలాభారం మోపుతున్నాము, ఎందుకనగా మనమైనను,మన పూర్వీకులైనను ఈ దినము వరకు లోబడని ఆజ్ఞలను చేయుమని వారిని బలవంతం చేయుచున్నాము, దీనిద్వారా దేవునికి కోపము పుట్టించకుందుము! 11 ప్రభువైన యేసు చేసిన పని వలన యూదులమైన మనము మన పాపముల నుండి రక్షణ పొందియున్నాము. అలాగుననే అన్యజనులు ఆయనయందే విశ్వాసముంచుట ద్వారా దేవుడు వారిని కుడా మనవలె రక్షించునని మనమందరము ఎరుగుదుము.
12 పేతురు ఈ మాటలు చెప్పిన తరువాత ప్రజలందరు మౌనముగా ఉండిరి. అప్పుడు పౌలు మరియు బర్నబా అన్యజనులలో దేవుడు వారిద్వారా చేసిన మహా గొప్పకార్యములను గూర్చి వివరించిరి. దానిద్వారా దేవుడు వారిని అంగీకరించెనని అధ్బుతములు ద్వారా చూపబడెను.
13 పౌలు మరియు బర్నబా మాటలాడుట ముగించిన తరువాత యెరూషలేములో విశ్వాసుల నాయకుడు అయిన యాకోబు వారితో మాట్లాడెను. నా సహా విశ్వాసులారా వినుడని చెప్పెను. 14 సీమోను పేతురు దేవుడు మొదట అన్యజనులను ఎలాగు ఆశీర్వదించెనో చెప్పియున్నాడు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని తన ప్రజలైన వారి కొరకు ఇదంతయు చేసెను.
15 పూర్వకాలమందు దేవుడు మాట్లాడినవాటిని మరల తన ప్రవక్తలలో ఒక ప్రవక్త ద్వారా వ్రాయించిన ప్రకారము వాటిని అంగీకరించుడి. 16 "తరువాత నేను తిరిగి దావీదు సంతతిలో నుండి ఒక రాజును ఏర్పాటు చేసికొనెదను. ఇల్లు పడి పోయిన తరువాత మరల ఒకడు దాని కట్టినట్లు ఉండును. 17 నేను ప్రభువైన దేవుడనని ఇతర ప్రజలందరు ప్రయత్నించితెలుసుకొనునట్లు చేసెదను. ఇశ్రాయేలీయులు కానివారు కుడా నా వారిగా చేసికొందును. నేను పలికిన మాట ప్రకారము నేనే ఈ కార్యము చేసెనని మీరు తెలిసికొందురు. 18 పూర్వమునుండి ఉన్న నా ప్రజలు ఈ విషయములు తెలిసికొనునట్లు చేసెదను.
19 యాకోబు ఇంకా మాటలాడుచు పాపమునుండి దేవునివైపు తిరిగిన అన్యజనులను మనమికమీదట మన ఆజ్ఞలు మరియు ఆచారములు చేయవలెనని బలవంతము చేయకుందుమని నేను తలంచుచున్నాను. 20 దానికి బదులుగా మనమొక ఉత్తరము వ్రాసి అందులో ఈ నాలుగు విషయములు అనగా "విగ్రహములకు పెట్టిన దానిని తినకూడదని, వారు పెళ్ళిచేసి కొనిన భార్యతో లేదా భర్త తో తప్ప ఎవరితోనూ లైంగిక సంభంధం పెట్టుకోకూడదని, మెడ విరిచి చంపిన జంతువుల మాంసం తినకూడదని మరియు జంతువుల రక్తము తినకూడదని చెప్పుదము". 21 చాలా కాలమునుండి చాలా పట్టణములలో మోషే ధర్మశాస్త్రము వీటిని నిషేదించెనని ప్రకటించబడు చున్నది. యూదుల సమాజమందిరములలో విశ్రాంతి దినమందు ప్రకటించబడుచున్నది. కనుక యూదులు కాని విశ్వాసులు ఈ విషయములు గూర్చి యూదులు కూడుకొను స్థలములలో తెలుసుకోనవచ్చును అని చెప్పెను.
22 యెరూషలేములో ఉన్న అపోస్తులులు, పెద్దలు మరియు విశ్వాసులు యాకోబు పలికిన మాటలకు ఒప్పుకోనిరి. యెరూషలేములో ఉన్నపెద్దలు నిర్ణయించన విషయములు విశ్వాసులందరూ తెలిసికొనునట్లు వారిలో కొంతమందిని పౌలు మరియు బర్నబాతో కలసి అంతియోకయకు పంపించుటకు నిర్ణయించిరి. కనుక ఈ పని నిమిత్తము యూదా అనబడిన బర్సబాను మరియు సీలను పంపుటకు నిర్ణయించిరి. వీరిద్దరూ యెరూషలేములో ఉన్న విశ్వాసులకు పెద్దలుగా ఉండిరి. 23 అప్పుడు వారు ఈ క్రింది విధముగా వ్రాసి బర్సబాను మరియు సీలను తీసుకువెళ్ళమని చెప్పిరి. "అంతియోకయ, సిరియ మరియు సిలిసియాలో వున్న సహా విశ్వాసులకు యెరూషలేములో ఉన్న అపోస్తులులు, పెద్దలు యూదులు కాని మీకు వ్రాసి శుభాకాంక్షలు పంపిస్తున్నాము.
24 మేము పంపించక పోయినప్పటికీ కొంతమంది మా దగ్గరనుండి వచ్చి యున్నారు అని కొంతమంది ప్రజలు మాకు తెలియజేసిరి. వారు మిమ్ములను కలవరపెట్టియున్నారు అని మేము విన్నాము. 25 కనుక మేము కలసి నిర్ణయము తీసుకొనిన విషయాలు మీకు తెలియజేయుటకు మేము ప్రేమించి ఏర్పాటు చేసికొనిన కొంతమంది సహోదరులను ఏర్పాటు చేసుకొని పౌలు మరియు బర్నబా వెళ్ళవలెనని అడిగితిమి. 26 ఆ ఇద్దరు ప్రభువైన యేసును సేవించుటకు తమ ప్రాణములను ప్రమాధములో ఉంచుకొనిరి.
27 బర్సబాను మరియు సీలను మేము మీ దగ్గరకు పంపిస్తున్నాము. మేము ఏయే సంగతులను వ్రాసితిమో వాటినే మీకు వివరించెదరు. 28 మీకు భారమైన యూదుల ఆజ్ఞలకు మీరు లోబడనవసరం లేదని మాకును, పరిశుధాత్మకు తోచినది. 29 దానికి బదులుగా "విగ్రహములకు పెట్టినదానిని తినకూడదని,వారు పెళ్ళిచేసికొనిన భార్యతో లేదా భర్తతో తప్పఎవరితోనూ లైంగిక సంభంధం పెట్టుకోకూడదని, మెడ విరిచి చంపిన జంతువుల మాంసం తినకూదదని మరియు జంతువుల రక్తము తినకూడదని" ఆజ్ఞాపించుచున్నాము. ఇవి మానివేసినయెడల మీరు సరిగా చేసిన వారగుదురు. వీడ్కోలు."
30 ఏర్పాటు చేయబడిన ఆ నలుగురు యెరూషలేము నుండి అంతియోకయ వెళ్ళిరి. అక్కడ వున్న విశ్వాసులు కూడుకొనిన తరువాత ఆ ఉత్తరమును వారికి ఇచ్చిరి. 31 అక్కడ ఉన్న విశ్వాసులు చదివి చాలా సంతోషించి దాని ద్వారా ప్రోత్సహించబడిరి. 32 యూదా మరియు సీల ప్రవక్తలైయుండి చాలా విషయములు చెప్పి వారిని ప్రోత్సహపరచి, ప్రభువైన యేసుక్రీస్తునందు మరి ఎక్కువగా నమ్మికపెట్టుకోనుటకు సహాయము చేసిరి.
33 యూదా మరియు సీల కొన్ని దినములు వారి దగ్గర గడిపిన తరువాత యెరూషలేము వెళ్లుటకు సిద్దపడగా, 34 అంతియోకయ విశ్వాసులు వారి యోగక్షేమము చూడగా వారు వెళ్ళిరి. 35 అయినప్పటికి పౌలు మరియు బర్నబా అంతియోకయలోనే ఉండిరి. వారక్కడ ఉండి అనేక మందికి ప్రభువైన యేసును గూర్చి భోదించుచు, ప్రకటించుచు వచ్చిరి.
36 కొన్ని దినముల తరువాత పౌలు బర్నబాతో "మనము ఇంతకు ముందు ప్రభువైన యేసుని గూర్చి ప్రకటించిన నగరములలో విశ్వసించినవారిని దర్శించుదమని చెప్పెను. దాని ద్వార వారు యేసు క్రీస్తు విశ్వాసములో ఎంతవరకు కొనసాగుతున్నారో చూచుదమని చెప్పెను. 37 బర్నాబా పౌలుతో ఏకీభవించి వారితో కూడా యోహాను అను మారు పేరు గల మార్కును వెంట తీసుకొని వెళ్ళుదుమని పౌలుతో అనెను. 38 పంఫులియా ప్రాంతములో ఇంతకుముందు వెళ్ళినప్పుడు పనిలో ఉండకుండా వెనుతిరిగిన మార్కుని తీసుకొని వెళ్ళుట మంచిది కాదని పౌలు బర్నబాతో చెప్పెను.
39 ఈ విషయము గురుంచి పౌలు, బర్నబాల మద్య చాలా భేదము కలిగినందున, వారిద్దరూ ఒకరినుండి ఒకరు వేరైపోయిరి. బర్నబా తనతోకూడ మార్కును తీసుకొని వెళ్ళెను. వారు ఒక ఓడ ఎక్కి సైప్రస్ దీవులకు వెళ్ళిరి. 40 పౌలు, సీలను వెంటబెట్టుకొని వెళ్ళుటకు తీర్మానించుకొని అంతియోకయకు వెళ్ళెను. అక్కడ వున్న విశ్వాసులు పౌలుకు, సీలకు కృపతో సహాయము చేయుమని దేవుని వేడుకొనిరి. అప్పుడు వారు అంతియోకయ నుండి బయలు వెళ్ళిరి. 41 సిరియ, సిలిసియ ప్రాంతముల గుండా పౌలు సీలతో కలసి ప్రయాణము చేయుచుండెను. ఆ ప్రదేశములలో ఉన్న విశ్వసించిన వారికి దేవుని మీద మరి ఎక్కువగా నమ్మకముంచుటకు సహాయము చేయుచు వచ్చిరి.
Chapter 16
1 పౌలు, సీలలు దెర్బ్ మరియు లుస్త్రలో ఉన్నవిశ్వాసులను దర్శించుటకు వెళ్ళెను. లుస్త్ర లో తిమోతి అనే విశ్వాసి ఉన్నాడు.అతని తల్లి యూదురాలు,తండ్రి గ్రీకువాడు. 2 లుస్త్ర మరియు యూకోనియలో ఉన్న విశ్వాసులు తిమోతి చేసిన మంచి క్రియలును గురించి తెలిపిరి, 3 మరియు పౌలు వెళ్ళే ప్రాంతములకు తనతో పాటు తిమోతిని తీసుకునివెళ్ళుటకు తనకు సున్నతి చేయించెను. ఎందుకనగా ఆ ప్రాంతములో నివసించే యూదులు, అన్యజనుడైన తిమోతి తండ్రి, తిమోతికి సున్నతి చేయించలేదని ఎరుగుదురు. కావున తిమోతి సున్నతి పొందుట వలన ఆ ప్రాంతములో యూదులు ఆయనను అంగీకరించిరి.
4 కావున తిమోతి, పౌలు, సీలలతో కలసి వెళ్ళెను, మరియు వారు అనేక పట్టణములు గుండా పోయిరి. వారు వెళ్ళు ప్రతిచోట యెరు షలేములో ఉన్న అపోస్తులులు మరియు పెద్దలు విధించిన విధులను అక్కడ ఉన్న విశ్వాసులకు బోధించుచు వెళ్ళిరి. 5 వారు ఆయా పట్టణములో ఉన్నవిశ్వాసులు, ప్రభువైన యేసుక్రీస్తును మరింత బలముగా విశ్వసించుటకు సహాయపడిరి, మరియు అనుదినము మరి ఎక్కువమంది ప్రజలు విశ్వాసులైరి.
6 పౌలును, తనతో ఉన్నవారును ఆసియాలో దేవుని వాక్యమును మాట్లాడకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆపివేయబడిరి, కావున వారు ఫ్రుగియ, గలతియ మార్గములగుండా పోయిరి. 7 వారు మిసియా ప్రాంతపు సరిహద్దు లోనికి వచ్చి, బితూనియా ఉత్తర ప్రాంతమునకు వెళ్ళుటకు ఆశించిరి కానీ మరలా యేసు యొక్క ఆత్మ వారిని అక్కడకు వెల్లనియ్యలేదు. 8 కావున వారు మిసియా ప్రాంతము గుండా సముద్రపు దరినున్న త్రోయకు వచ్చిరి.
9 ఆ రాత్రి దేవుడు పౌలునకు ఒక దర్శనము ఇచ్చెను, ఆ దర్శనములో మాసిదోనియ ప్రాంతపువాడైన ఒక మనుష్యుని పౌలు చూచెను. ఆ మనుష్యుడు, మాకు సహాయము చేయుటకు మాసిదోనియకు రమ్మని పౌలును పిలుచుచున్నట్లు కనపడెను. 10 ఆ దర్శనము చూసిన వెంటనే, పౌలు లేచి మాసిదోనియకు వెళ్ళెను. ఎందుకనగా అక్కడ ప్రజలకు శుభవార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచియున్నాడని మేము నమ్మయున్నాము.
11 అటుతరువాత మేము త్రోయ నుండి సమొత్రాకేకునకు మరియు ఆ మరుసటి రోజు అక్కడినుండి పట్టణప్రాంతమైన నెయపొలికు వచ్చితిమి. 12 అటుతరువాత మేము నెయపొలిను విడిచి మాసిదోనియలో అతిప్రాముఖ్య పట్టణమైన ఫిలిప్పీ నకు వచ్చితిమి. ఈ పట్టణములో ఎక్కువమంది రోమీయులు నివసించుచున్నారు. మేము చాల రోజులు ఫిలిప్పీ పట్టణము లో ఉన్నాము. 13 విశ్రాంతిదినమున మేము నదీ తీరమున పట్టణపు ద్వారము దగ్గరకు వెళ్లియున్నాము. అక్కడ కొంతమంది యూదులు ప్రార్దించుటకు కూడిరి అని ఎవరో చెప్పగా వింటిమి. మేము అక్కడకి చేరినప్పుడు, ప్రార్ధించుటకు కూడుకొనియున్న కొంతమంది స్త్రీలను చూచితిమి, కావున మేము వారితో కూడా కూర్చొని యేసుని గూర్చిన మాటలు వారికి ప్రకటించుటకు మొదలుపెట్టితిమి.
14 పౌలు ప్రసంగించుచుండగా అచ్చట కూర్చున్న స్త్రీలలో తుయతైర పట్టణస్తురాలైన లూధియ అను దైవభక్తి గలిగిన స్త్రీ వినుచుండెను మరియు ఆమె ఉదారంగు బట్టలు అమ్ముచుండేది. దేవుడు ఆమె హృదయము తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన వాక్యమందు లక్ష్యముంచెను. 15 కావున వెంటనే ఆమెయు మరియు ఆమె కుటుంబమంతయును పౌలు, సీలల ద్వారా బాప్తీస్మము పొందిన తరువాత ఆమె పౌలు, సీలలతో ఈ విధముగా చెప్పెను, నేను దేవునియందు నమ్మకము గలదాననని మీరు విశ్వసించినట్లయితే నా ఇంటిలోనికి వచ్చి ఉండమని వారిని వేడుకొనెను. కావున ఆమె ఆ విధముగా చెప్పిన తరువాత మేము అక్కడ నివసిoచితిమి.
16 తరువాత రోజు ప్రజలు ప్రార్ధన చేయుటకు కూడుకొను స్థలమునకు మేము వెళ్ళుచుండగా, దయ్యములతో పట్టబడి ప్రజల భవిష్యత్ ను గూర్చిన విషయాలు చెప్తూ తన యజమానునికి సంపాదన తెస్తూ బానిసగా ఉన్న ఒక యవ్వనస్తురాలిని చూచితిమి. 17 ఆ యవ్వనస్తురాలు పౌలును, మిగిలిన వారిని వెంబడించుచు, "ఈ మనుషులు సేవించుచున్న దేవుడు దేవతలు అందరు కంటే గొప్పవాడుని, దేవుడు మిమ్మలను ఏ విధముగా రక్షించును" అని వారు మీకు తెలియ చేయుచున్నారని ఆమె బిగ్గరగా అరుచుచూ చెప్పుచుండెను. 18 ఆమె ఈ విధముగా అనేక దినములు చేసిన తరువాత పౌలు కోపపడి ఆమె వైపు తిరిగి ఆమె లో ఉన్న దురాత్మను యేసుక్రీస్తు నామములో గద్ధించగా వెంటనే దురాత్మ ఆమెను వదలిపోయెను.
19 దురాత్మ ఆ యవ్వనస్తురాలిని విడిచెనని మరియు ఆమె వలన ఇక సంపాదన పొందలేమని ఆమె ప్రజలు భవిష్యత్ ను యిక తెలపలేదని ఆమె యజమానులు గ్రహించి వారు మీద బహుగా కోపపడెను. పౌలు, సీలలను పట్టణ అధికారులు యొద్దకు ఈడ్చుకొనిపోయిరి. 20 ఆ యవ్వనస్తురాలి యొక్క యజమానులు వారిని పట్టణ పెద్దల యొద్దకు తీసుకువచ్చి, వారితో ఇట్లనిరి,"ఈ మనుష్యులు యూదులు, వీరు మన పట్టణస్తులకు గొప్ప సమస్యలు కలుగజేయుచున్నారు". 21 మీరు రోమీయులకు లోబడ కూడదని దానికి మన ధర్మశాస్త్ర నిబంధనలు మనకు అనుమతి యివ్వవని వారు భోధనలు చేయుచున్నారని పెద్దలతో చెప్పిరి.
22 అక్కడ ఉన్న ప్రజల గుంపులో చాలామంది పౌలు, సీలలను నిందించుచు, వారిని కొట్టుటకు మొదలుపెట్టిరి. తరువాత రోమా అధికారులు పౌలు, సీలలను బంధించి వారి పైవస్త్రములను చింపివేసి బెత్తముతో వారిని కొట్టమని సైనికులకు చెప్పిరి. 23 కావున సైనికులు పౌలు, సీలలను బెత్తములతో కొట్టి బహుగా హింసించి, తరువాత వారిని తీసుకొనివెళ్లి చెరసాలలో బంధించి, వారిని బయటకు విడిచిపెట్టవద్దని చెరసాల అధికారికి ఖండితముగా ఆజ్ఞాపించిరి. 24 పట్టణ అధికారులు, చెరసాల అధికారికి ఖండితముగా ఆజ్ఞాపించిరి గనుక చెరసాల అధికారి వారిని చెరసాల లోపలి గదిలో నేల మీద కూర్చుండబెట్టి రెండు కాళ్ళ మరియు మడమల మధ్యలో బహు బరువైన రెండు చెక్కలతో బిగించి కదలలేనంత కఠినముగా వారిని బంధించెను.
25 ఇంచుమించు అర్ధరాత్రి సమయములో పౌలు, సీలలు కలసి పాటలు పాడుచు, ప్రార్ధించుచు, దేవుని స్తుతించుచుండగా, మిగిలిన ఖైదీలు వినుచుండిరి. 26 అకస్మాత్తుగా పెద్ద భూకంపము వచ్చి చెరసాలను కుదిపినది. ఆ భూకంపము కలిగినపుడు చెరసాలలో ఉన్న అన్ని తలుపులు ఊడిపోయి, ఖైదీలకు ఉన్న సంకెళ్ళు మరియు బంధకాలన్నీ ఊడి పడిపోయినవి.
27 భూకంపముచేత చెరసాల అధికారి మేల్కొని చెరసాల తలుపులు ఊడియుండుట చూచి ఖైదీలు చెరసాల నుండి తప్పించుకొని పారిపోయిరని తలంచి, ఈ విషయము పట్టణ అధికారులకు తెలిసినయెడల తనను చంపుదురని గ్రహించి తన ఒరలో ఉన్నకత్తిని తీసుకొని తనను తాను చంపుకొనవలెనని ప్రయత్నము చేసెను. 28 అప్పుడు పౌలు చెరసాల అధికారిని చూచి గట్టిగా అరచి, నీవు ఏ హానియును చేసికొనవద్దు మేము అందరము ఇచ్చటనే ఉన్నామని సెలవిచ్చెను.
29 అంతట చెరసాల అధికారి ఎంతమంది ఖైదీలు మిగిలి ఉన్నారో చూచుటకు ఎవరైనా దీపములు తెమ్మని గట్టిగా అరచెను. ఖైదీలు ఒక్కరు కూడా తప్పించుకోలేదని చెరసాల అధికారి గ్రహించి భయముతో వణకుచూ పౌలు, సీలల ముందు సాష్టాంగపడెను. 30 అప్పుడు ఆ అధికారి పౌలు,సీలలను బయటకు తీసుకువచ్చి వారితో, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనని వారిని అడిగెను. 31 వారు ప్రభువైన యేసునందు నమ్మిక యుంచుము అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షింపబడెదరు అని అతనితో చెప్పిరి.
32 అప్పుడు పౌలును, సీలను యేసుక్రీస్తును గూర్చిన వర్తమానము అతనికిని మరియు అతని కుటుంబములోనున్న ప్రతీవారికిని తెలియజేసిరి. 33 అప్పుడు ఆ చెరసాల అధికారి ఆ మధ్యరాత్రిలోనే వారి గాయములను కడిగెను.అప్పుడు పౌలును, సీలయును అతనికిని మరియు అతని కుటుంబపువారికిని ఆ సమయములోనే బాప్తీస్మము ఇచ్చిరి. 34 అప్పుడు ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తీసుకుపోయి తినుటకు ఆహారము పెట్టిరి. కావున ఆ రాత్రి ఆ గృహములో ఉన్నవారందరు దేవుని యందు నమ్మిక ఉంచినందున చాల సంతోషించిరి.
35 మరుసటి ఉదయమున ఆ పట్టణపు అధికారులు కొంతమంది సైనికులను పిలిచి, మీరు చెరసాల అధికారి వద్దకు వెళ్లి పౌలును, సీలలను వదిలేయమని చెప్పమని పంపిరి. 36 ఆ వార్త విన్న చెరసాల అధికారి పౌలునొద్దకు పోయి పట్టణ అధికారులు మిమ్మును విడిచిపెట్టమని చెప్పిరని చెప్పి, కావున మీరు సమాధానముగా వెళ్లు డని వారితో చెప్పెను.
37 కానీ పౌలు ఈ విధముగా జైలు అధికారితో చెప్పెను, రోమా పౌరులమైన మమ్మల్ని ప్రజలందరియెదుట కొట్టి, చెరసాలలో వేయమని పట్టణపు అధికారులు ప్రజలుతో చెప్పిరి . కానీ ఇప్పడు ఎవరికీ తెలియుకుండా రహస్యముగా మమ్ములును పంపివేయాలనుకుంటున్నారే, ఆ పట్టణపు అధికారులే వచ్చి మమ్ములను చెరసాలనుండి విడిపిస్తే తప్ప దీనికి మేము అంగీకరించమని చెప్పిరి. 38 కాబట్టి ఆ సైనికులు వెళ్లి పౌలు చెప్పిన మాటలను ఆ పట్టణపు అధికారులకు చెప్పిరి. ఎప్పుడైతే పౌలు, సీలలు రోమా పౌరసత్వం కలిగిన వారని పట్టణ అధికారులకు తెలిసినదో అప్పుడు వారు చేసిన తప్పుకు భయపడిరి. 39 కావున పట్టణ అధికారులు పౌలు, సీలల వద్దకు వచ్చి వారికి చేసిన పనిన బట్టి వారిని క్షమించమని అడిగిరి. అప్పుడు పట్టణ అధికారులు వారిని చెరసాలనుండి బయటకు తెచ్చి ఊరు విడిచి వెళ్ళిపొమ్మని బ్రతిమలాడుకొనిరి.
40 తరువాత పౌలు సీలలు చెరసాలనుండి బయటకు వచ్చి లూదియా ఇంటికి వచ్చిరి. అక్కడ వారు ఆమెతో పాటు మరికొందరు విశ్వాసులను కలుసుకొనిరి మరియు అక్కడ ఉన్నవిశ్వాసులను ప్రభువైన యేసు నందు నమ్మకస్తులుగా ఉండవలెనని వారిని బలపరచి ఆ యిద్దరూ అపోస్తులలు ఫిలిప్పి పట్టణమును విడిచి వెళ్ళిరి.
Chapter 17
1 వారు అమ్ఫిఫోలి,అపోలోనియా పట్టణములు మీదిగా వెళ్లి తేస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. 2 విశ్రాంతి దినమున పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళెను . ఆయన మూడు వారములుగా.ప్రతి విశ్రాంతి దినమున వెళ్ళుచుచుండెను . యేసు క్రీస్తు అని ఎ విధంగా లేఖనములు తెలియచుయచున్నవో ప్రజలకు ప్రకటించుచున్నాడు
3 ప్రవక్తలు వ్రాసిన విధంగా మెస్సియా మరణింఛి తిరిగి లేచేనని ప్రవక్త వ్రాసిన లేఖనములను చూపిస్తూ యీ మనుషుడు యేసు క్రీస్తు అని తెలియజేయుచున్నాడు. 4 పాలు చెప్పిన విషయములు నమ్మిన వారుందరూ పౌలును మరియు సీలను కలుసుకోనేను.అనేక అన్యజనులను మరియు దేవునిని ఆరాదిం చుచున్న ఘనత వహించిన స్త్రీలును యేసు నందు విశ్వాసముంచి పౌలును , సీలను కలుసుకొనుచువచ్చిరి .
5 5. పౌలు చెప్పిన మాటలను యందు అనేకమంది యేసునందు విస్వసముంచటం బట్టి యూదులలో నాయకులైన కొందరు పౌలు మీద కోపపడిరి.వారిని సంత వీదులలో హిoసిచుటకు కొంతమంది దుష్టులనువారిని వెంబడించిరి. ఈ విధంగా యూదుల నాయకులు ప్రజలను పోగు చేచి చాలా అల్లరి చేసిరి . యుదులు మరియు ఇతరులు వారిని పట్టుకోనవలేనని పౌలు సీల ఉండిన యాసిను యింటికి పరుగెత్తి వెళ్ళిరి .వారు పౌలును సిలను జన సమూహము దగ్గరికి తీసుకొని రావలేనని తలంచిరి . 6 వారు ఆ ఇంటిలో లేరని తెలుసుకొని యాసోనును కనుగొని అతనిని ఈడ్చుకొని పోయిరి.మరియు వారు అతని తో ఉన్న మరి కొందరు విశ్వాసులను పట్టణపు అధికారుల యొద్దకు యిడ్చుకొని పోయిరి . భూలోకమును శ్రమపెట్టుటకు కారకులైన వారు ఇక్కడకి కూడా వచ్చియున్నారు మరియ 7 వారి తోటి పరిచారకుడైన యాసోను తన ఇంటిలో వారిని ఉండమని కోరెను . రాజుకి వ్యతిరేకమైన పనులు చేయుచున్నారు. యేసు అను పేరు కలిగిన వ్యక్తే నిజమైన రాజు అని వారు ప్రకటిస్తునారు .
8 బహు జన సమూహములు గుంపు కుడి ఉన్నారని పట్టణపు అధికారులు విని కోపోద్రికులైరి . 9 ఆ పట్టానపు అధికారులు యాసోను కు ఇతర విశ్వాసులకు జరిమానా విధించి పౌలు సీల మరియొకసారి యిటువంటి గలిబిలి చేయనటైతే మీరు చెల్లించిన జరిమానా సొమ్మును తిరిగి చెల్లించేదము అని చెప్పి యాసోనును మరియు ఇతర విశ్వాసులను విడిచిపెట్టిరి .
10 ఆ రాత్రి పౌలు ను సీలను విశ్వాసులు దేస్సలోనియా నుండి బెరియ పట్టణమునకు పంపివేసిరి . పౌలు సీల ఆ ప్రాంతమునకు చేరిన వెంటనే యూదుల సభ కు వెళ్ళిరి 11 .దేస్సలోనిక లో ఉన్న చాలా మంది యూదులు దేవుని వాక్యం వినుటకు సిద్డంముగా లేరు గాని బెరియలో ఉన్న యూదులు దేవుని వాక్యం పట్ల మరియు యేసు గురించిన బోధ పట్ల ఆశక్తి కనపరచిరి . పౌలు యేసు గురిచి చెప్పిన విషయాలు సత్యమైనవో కావో అని వారు ప్రతి రోజు లేఖనములను పరిశోధించుచున్నారు . 12 పౌలు బోధల కారణముగా అనేక మంది యూదులు యేసు నందు విశ్వాసముంచిరి మరియు యూదులు కానీ అనేక మంది స్త్రీ , పురుషులు కూడా ఆయన యందు విశ్వాస ముంచిరి .
13 యేసుని గురించి దేవుని వర్తమానము పౌలు బోధించుచున్నాడని దేస్సలోనికలో ఉన్న యూదులు వినిరి . వారు బెరియకు వెళ్లి జరిగిన సంగతులన్నిటిని ప్రజలతో చెప్పగా ,ప్రజలు పౌలు మీద కోపముగా యుండిరి . 14 బెరియలో ఉన్న కొందరు విశ్వాసులు పౌలును వేరొక పట్టణానికి పంపించుటకు సముద్ర తీర ప్రాంతానికి తీసుకొనివెల్లిరి.గాని సీలను తిమోతిను బెరయలోనే ఉండిరి. 15 పౌలు మరియు ఇతర మనుషులు తీరప్రాంతానికి చేరుకొని ఓడ ఎక్కి ఏథెన్స్కు వెళ్ళిరి .అప్పుడు పౌ లు తనతో వచ్చిన మనుషులతో సీలను తిమోతి ని త్వరగా ఏథెన్స్ కు రావలసినదిగా వారితో చెప్పెను .అప్పుడు వారు ఏథెన్స్ వదలి బెరియకు తిరిగి వెళ్ళిరి .
16 ఏథెన్స్ లో తిమోతి ,సీల రాక కొరకు పౌలు ఎదురుచూచు చున్నాడు .యీ సమయములో పౌలు ఆ పట్టణమంతా సంచరించుచున్నాడు . ఆ పట్టణములో ఉన్న అనేక విగ్రహములను చూచినప్పుడు పౌలు కలవరము చెందెను. 17 అతడు యూదుల సభ స్థలనికి వెళ్లి యూదులతోనూ మరియు యూదులు నమ్మిన దానిని విశ్వసించిన గ్రీకులు తో కూడా యేసు గురించి మాట్లాడ సాగేను.అతడు జన కూడలిలోనికి వెళ్లి అతని కలిసిన వారితో ప్రతి రోజు మాట్లాడ సాగేను .
18 ప్రజలు విశ్వసించిన దానిని గురించి కొందరు బోధకులతో పౌలు మాట్లాడుటకు ఇస్టపడెను .తత్వావేత్తలను జ్ఞానులను ప్రజలు పిలిపింఛి వారి నమ్మిన దానిని పౌలు కి చెప్పిరి . వారు పౌలు విశ్వసించిన దానిని గురించి అడిగిరి. వారిలో ఒకరితో ఒకరు మనకు తెలియని దేవ్వుల్ల గురించి మాట్లాడుచున్నాడని చెప్పుకొనిరి. పౌలు వారితో యేసు మరణించి తిరిగి లేచియున్నడని వారు చెప్పిరి .
19 పట్టణపు నాయకుల దగ్గరికి అతనిని తిసుకువేల్లిరి .వారు అక్కడికి చెరిన తరువాత వారు పౌలు ను నీవు ప్రజలకు బోధిస్తున్న కొత్త బోధను గురించి తెలియజేయమని అడిగిరి 20 .మాకు అర్ధము కానీ సంగతులను గురుంచి నీవు బోధిచుచున్న వాటి అర్ధములు మాకు తెలియజేయుమని అడిగెను 21 .ఏథెన్స్లో ప్రజలు మరియు ఇతర ప్రాంతముల నుంచి వచ్చిన ప్రజలు వారికీ తెలియని దాని గురించి ఇస్టపడిరి .
22 అప్పుడు పౌలు ప్రజలందరి ఎదుట నిలువ బడి వారితో యీలగు అనెను. ఎథెన్స్ ప్రజలారా మీరు చాలా మతాశక్తి కలిగిన వారని చూచాను. 23 నేను నడుస్తూ వేల్లుచుడగా మీ ఆరాదనను చూడగా నాకు ఒక బలిపిటం కనబడిగ దాని మీద వ్రాయబడిన తెలియబడని దేవ్వునికి మహిమ అనే మాటలు నాకు ఆశ్చర్యం కలిగించెను . మీరు ఆరాదించుచున్న తెలియబడని దేవుని గురించి ఇప్పుడు మీకు తెలేయజేయుచున్నాను.
24 భూమిని మరియు దానిలో ఉన్నసమస్తమును చేసినది దేవుడు . అతడు భూమిని ఆకాశము దానిలోఉన్నసమస్తమును ఏలుచున్నాడు మరియు ప్రజలు కట్టిన మందిరములలో నివాసముండడు. 25 ప్రజల ద్వార ఆయన దేనిని తన కొరకు కోరుకోడు.ఎందుకనగా మనుష్యులకు జీవమును ఊపిరిని మరియు వారికి కావలసిన సమస్తమును అనుగ్రహించును.
26 ఆదియందు దేవుడు ఒక దంపతులను చేసి వారి ద్వార భూమి మీద ప్రతి చోట జీవించుటకు అనేక ప్రజల గుంపులను దేవుడు కలుగచేసేను. దాని కాలము కొరకు దాని ప్రదేశములో ఒక్కొక ప్రజల గుంపును ఆయన నియమించియున్నాడు. 27 వారు ఆయన అవసరతను తెలుసుకొవాలని కోరుకొనుచున్నాడు.అప్పుడు ఆయనను వెదికి కనుగొనును. ఆయన మనకందరికి సమీపముగా ఉండినప్పటికి దేవుడు తనను వెదకువారి గురించి ఎదురుచుచుచూన్నాడు .
28 మీలో ఒకరు చెప్పిన రీతిగా మనము దేవుని పిల్లల్లమగుట వలన దేవుని మూలముగా మనము జీవించుచు ,కదలుచు మరియు ఉనికి కలిగియున్నాము 29 కాబట్టి మనమందరమూ దేవుని పిల్లలము . దేవుడు బంగారము తోనూ , వెండితోను లేదా మట్టితోను మనుషుడు చేతి పనితో చేయబడిన వాడు కాదని మీరు గ్రహించవలెను .
30 దేవుడు ప్రజలు ఏమి చేయాలని కోరుకొనెనో దానిని చేయలేని కాలములో ఆయన వారి చేసిన పనులను బట్టి వారిని శిక్షించలేదు కాని ఇప్పుడు దేవుడు సమస్త ప్రజలను వారి చెడు పనులను విడిచి తన వైపు తిరగవలెనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. 31 ఆయన ఏర్పాటుచేసికొన్న మనుషులను నీతి చేత ఆయన ఏర్పాటుచేసిన రోజున మనకందరికిని న్యాయము తీర్చువాడై యున్నిడని మరణము నుండి లేచిన వానిని అర్దము చేసికొనుట ద్వార మనము దీనిని గ్రహించవలెను .
32 ఒక మనుషుడు మరణించి తిరిగి లేచి యున్నాడని పౌలు చెప్పిన మాటలు విని అతని వైపు చూచి నవ్వేను. గాని కొందరు ఆయనను మరియొక రోజన వచ్చి తెలియ పరచవలసినదిగా కోరెను. 33 వారు ఆ మాటలు చెప్పిన తరువాత పౌలు వెళ్ళిపోయేను. 34 అటు తరువాత కొంతమంది ప్రజలు పౌలుతో వెళ్లి యేసుని గూర్చిన బోధ యందు విశ్వాసముంచిరి. యేసునందు విశ్వసించిన వారిలో దియోనిసు అను పేరు కలిగిన ఒక మనుష్యుడు ఉండెను. ఆయనను విశ్వసిం చిన వారిలో కొందరు ప్రజలును మరియు దమరిస్ అను పేరు కలిగిన స్త్రీ కూడా ఉండెను .
Chapter 18
1 అటుతరువాత పౌలు ఏథెన్స్ పట్టణమును విడిచి కొరిoధీ వచ్చెను. 2 ఆయన అక్కడ అకుల అను యూదుని తన భార్య ను కలిసెను , అకుల , ప్రిస్కిల్ల కొద్ది దినముల క్రితమే రోమా పటణము నుండి వచ్చారు అది ఇటలి దేశము లో ఉన్నది , వీరు రోమా చక్రవర్తి అయిన క్లౌదియ వలన బయటకు వచ్చేసారు ఈయన యుదులందరూ రోమావిడిచి బయటకు పోవలెనని అజ్ఞాపించెను . 3 ఆకుల్లా , ప్రిస్కిల్ల గుడరాములను కుట్టుకొంటు డబ్బులు సంపాదించు కొనేవారు. పౌలు కూడా గుడరములను తయారు చేసే వాడు,గనుక వారితో కలసి నివసిచాడు, వారు కలసిపని చేసారు.
4 6 ప్రతి విశ్రాంతి దినమున , పౌలు యూదులు కూడుకోను స్థలమునకు వెళ్ళి అక్కడ యుదులతోను యూదులు కాని వారి తో యేసుని గురించి బోదించే వాడు. 5 సిలయు, తిమోతి మసిదోనియ ప్రాంతము నకు చేరిన తరువాత , అప్పటి నుండి పౌలు గుడారాలు కుట్టట మానివెసాడు. తన సమయమంతా యేసుని గురించి యూదులకు బోదించే వాడు.. గాని వారు పౌలు కు వ్యతిరేకముగా ,అతనిమీద చెడ్ద మాటలతో పలికిరి అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు దేవుడు మిములను బట్టి సంతోషించడు, మరియు అతడు వారితో ఇలాగు నచెప్పెను, దేవుడు గనుక శిక్షిస్తే మిమ్ములను బట్టే గాని నావలన కాదు, ఇప్పటి నుండి నేను యూదులు కాని వారితో మాట్లాడెదను.
7 గనుక పౌలు యూదుల సమాజ మందిరమును విడిచి అక్కడనుండి బయలు దేరి దాని ప్రక్కనే ఉన్న ఇంటికీ వెళ్ళఅక్కడ, భోదించెను . ఆ ఇల్లు తీతు ,యూస్తు ది. అతడుదేవుని ఆరాదించు చున్నఒక్క అన్యుడు. 8 అటు తరువాత క్రిస్పు అనే యూదుల సమాజ మందిరపు అధికారి మరియు తనకుటుంబము వారందరూ ప్రభువైన యేసు నందు విశ్వాసముంచిరి. చాలామంది పౌలు వాక్యమును విన్న కొరింధి పట్టణస్తులు యేసు నందు విశ్వాసముంచి బాప్తీస్మము పొందిరి.
9 రాత్రి వేల పౌలుకి ఒక దర్శనాన్ని చూచెను, నిన్ను వ్యతిరేకించె ప్రజలను చూసి బయపడకు, నన్నుగురించి మాటలాడుతూనే వుండు. 10 ఇక్కడ ఎవరూ నీకు ఏ హానిచేయకుండా సహాయము చేస్తాను, వారితో నాగురించి మాటలడుతునే వుండు ఎందుకనగా ఈ పట్టణములో నావారు చాలామంది వున్నారు. 11 గనుక పౌలు ఒక్క సంవత్సరంన్నర కాలం కొరింది పట్టణములోనే వుండి పోయాడు. యేసుని గురించి దేవుడు బయలు పరచిన వర్తమానములు తెలియజేస్తూ ఉండెను.
12 గలియోను రోమకు అక్కయకు అధిపతిగా వున్నప్పుడు యూదా అధికారులందరూ పౌలుని చుట్టు ముట్టి బంధించిరి. వారు అతనిని అధికారి యెద్దకు తీసుకొని పోయి నేరములు మొపెను. 13 వారు ఈ వ్యక్తి మన యూదుల ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైన ఆరాధన చేయుటకు మన ప్రజలకు బోదిస్తున్నాడు అని చెప్పిరి.
14 పౌలు చెప్పడము మొదలు పెట్టగ, గలియో యూదులతో యీలగున చెప్ప సాగెను , ఈతడు మన రోమా ధర్మశాస్త్రమును తప్పు పట్టిన యెడల, మీరు దాని విషయమై ఏమి చెప్పాలనుకున్నారో చెప్పండి. 15 ఏది ఏమైనప్పటికీ మీరు మీ మాటలను గురించి మీ సొంత ధర్మశాస్త్రము ను గురించి మాటలాడు తున్నారు. కావున ఈ విషయం గురించి మీరే అతనితో మాటలాడు కొనుడి నేను దీని విషయములో తీర్పుతీర్చను.
16 గలియో వారికి ఈ మాటలు చెప్పిన తరువాత, అక్కడవున్న సైనికులతో యూదా అధికారులను న్యాయస్థానము వెలుపలకు తీసుకొని పొమ్మనెను. 17 అప్పుడు ప్రజలందరూ సమాజమందిరపు అధికారి అయిన సొస్తేనేసు ను న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయినను గలియో దాని గురించి ఏమియు చేయలేదు.
18 18 పౌలు మరి కొద్ది దినాలు కొరింది విశ్వాసులతో ఉండిన తరువాత అతను ఓడ ఎక్కి అక్కుల్ల ,ప్రేస్కిల్లలతో కలసి సిరియా వెళ్ళెను. తనకు మ్రొక్కుబడి ఉనందున్న తల వెంట్రుకలను కత్తిరించు కొనెను. 19 తరువాత వారు ఎఫెస్సి పట్టణమునకు చేరుకొనెను, అకుల్లా, ప్రిస్కీల్లలు అక్కడ ఉండిరి. పౌలు యూదా సమాజ మందిరములోనికి పోయి క్రీస్తు ను గురించి యూదుల తో మాట్లాడెను.
20 వారు పౌలుని కొంత కాలము తమతో ఉండమని కోరిరి. అందుకు పౌలు తిరస్కరించాడు. 21 వారిని విడిచి వెళ్ళె ముందు ఇలాగున చెప్పెను దేవుడు అనుమతి యిస్తే మరల మీ వద్దకు వచ్చెదనని వారితో చెప్పి ఓడ యెక్కి ఎఫేసి పట్టణము విడిచి పోయెను.
22 ఓడ కైసరియ పట్టణమునకు వచ్చినప్పుడు, పౌలు అక్కడ దిగెను. యేరూషలేము పట్టణములో నున్నవిశ్వాసులను కలసి వందనములు చెప్పెను. అక్కడ నుండి సిరియాప్రాంతములో గల అంతియోకియ పట్టణమునకువెళ్ళిను. 23 పౌలు కొంత కాలము అక్కడ ఉన్న విశ్వాసులతో గడిపి. అక్కడ నుండి బయలుదేరి గలలియ ప్రాంతములో నున్న అనేక పట్టణములను మరియు ప్రుగియ యందును సంచరించెను. యేసు ని గురించిన లేఖనములను మరి ఎక్కువగా విశ్వసించమని విశ్వాసులను వేడు కొనెను .
24 పౌలు గలిలయ మరియు ప్రుగియ ద్వారా వెలుచుండగా అపోలోష్ అను ఒక యూదుడు ఎఫేసి నుండి వచ్చేను. అతడు అలక్సంద్రియ పట్టణస్తుడు, మరియు లేఖనములను గురించి బహుగా తెలిసిన వాడు. 25 మిగతా విశ్వాసులు యేసు క్రీస్తు ఏలాగు జీవించ మని ప్రజలకు తెలిపెనో వారు అపోల్లో తో చెప్పిరి, మరియు అయన ఆ సంగతులను ప్రజలకు భోధించెను. ఏది ఏమైనప్పటికీ క్రీస్తుని గురించి పూర్తిగా బోదించలేదు, ఎందుకనగా ఆయనకు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాత్రమే తెలుసు. 26 అపోల్లో యూదుల సమాజ మందిరమునకు వెళ్ళెను, అక్కడ తాను నేర్చు కొన్న విషయములను గురించి చెప్పెను. అక్కుల్ల, ప్రిస్కిల్ల అతడు చెప్పినది విన్న తరువాత , వారు అతనిని వారి గృహమునకు ఆహ్వా నించి యేసుని గురించి మరి ఎక్కువగా అతనికి తెలియ చేసిరి.
27 అకయకు వెళ్ళుటకు అపోల్లోస్ నిర్ణయించు కొనెను, ,ఆలాగు చేయుట మంచిది అని ఎఫెసిలో ఉన్న విశ్వాసులు అతనితో చెప్పినారు. గనుక వారు అకయలో ఉన్న సంఘ విశ్వాసులకు అపోలోస్ను స్వికరించాలని ఉత్తరము వ్రాసిరి, ఆయన అక్కడికి వెళ్ళిన తరువాత యేసుని విశ్వసించిన వారికిప్రేమతో సహకరించెను. అనేకులు వినుచునుండగా 28 అపోల్లో అత్యదికమైన శక్తితో యూదా నాయకులతో లేఖనములను చదువుట ద్వారా యేసుక్రీస్తే మెస్సయ్యా అని చూపెను .
Chapter 19
1 అపొల్లో కొరింధులో ఉండగా, పౌలు పర్గియా గలతియా ప్రాంతాలను విడిచి ఆసియా గుండా ప్రయాణం చేసి ఎఫెస్సుకు చేరుకొనెను. విశ్వాసులము అని చెప్పుకొను కొంతమంది ప్రజలను కలిసెను. 2 మీరు దేవుని వాక్యము నందు విశ్వసించునప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నారా ?" అని వారిని అడిగెను. అయితే వారు "లేదు, పరిశుద్ధాత్మను గూర్చి మేము ఎన్నడును వినలేదని ఆయనతో చెప్పిరి.
3 "మీరు బాప్తిస్మము పొందినప్పుడు ఏమి తేలుసుకొనిరి?" అని పౌలు వారిని అడుగగా," బాప్తిస్మము ఇచ్చు యోహాను ఏమి బోధిoచెనో అదియే మేము నమ్మితిమి" అని చెప్పిరి. 4 అందుకు పౌలు మీరు దుష్టక్రియలనుండి తిరుగవలెనని యోహాను బాప్తిస్మము ఇచ్చెను. మరియు ఆయన తరవాత వచ్చు వానియందు విశ్వాసముoచుడి, అని ఆయనే యేసుక్రీస్తు."అని చెప్పెను.
5 కనుక వారు ఈ విషయం విన్న తరువాత యేసు క్రీస్తు నామమున బాప్తీస్మము పొందిరి. 6 దాని తరువాత పౌలు ఒకరి తరువాత ఒకరి తలల మీద చేతులుంచి ప్రార్థించగా వారిలో ప్రతి ఒక్కరిమీదకు పరిశుద్ధాత్మశక్తి దిగివచ్చెను. అప్పుడు వారు నేర్చు కొనని బాషలతో వారు మాట్లాడితిరి మరియు పరిశుద్ధాత్ముడు వారికిచ్చిన స౦దేశమును వారు మాట్లాడితిరి. 7 పరిశుద్ధాత్మ పొందుకొనిన ఆ పన్నె౦డుమంది పౌలు ద్వారా బాప్తీస్మము పొందిరి.
8 మూడు నెలల తరువాత పౌలు ఎఫెస్సులో ప్రతీ సబ్బాతు దినములలో యూదుల సమాజ మందిరములలో కూడుకొని వారికి యేసుని గురించి బోధించుచూ దేవుడు ఏలాగు రాజుగా బయలుపరచుకొనెనో వారికి తెలియ పరిచెను. 9 కొంత మంది యూదులు పౌలు మాటలను నమ్మక వ్యతిరేకించిరి. పౌలు బోధించు బోధ మంచిది కాదని మాట్లాడిరి. కాబట్టి పౌలు ఆ ప్రాంతమును విడిచి విశ్వాసులను తీసుకుని తురను అను ప్రాంతమునకు వెళ్ళెను. 10 రెండు సంవత్సరాలు పాటు అక్కడే సువార్త ప్రకటించెను. ఆలాగున చాలామంది యూదులును మరియు యూదులుకానివారును ఆసియా ప్రాంతములో కలసిపోయి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును వినిరి.
11 దేవుడు పౌలునకు అద్భుతములు చేయు శక్తిని ఇచ్చెను. 12 బలహీనులైనవారు పౌలు దగ్గరకి రాలేని పరిస్థితులలో వారు పౌలు తాకిన వస్త్రములు తీసుకొనివెళ్లి వ్యాధిగ్రస్తులైనవారు తాకునట్లు చేయగా వారు స్వస్థత పొందిరి మరియు దురాత్మలు వారిని విడిచి పోయెను.
13 కొంత మంది యూదులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం తిరుగుచు దురాత్మలను వెల్లగొట్టుచు సువార్త చేయసాగేను. కొంతమంది యూదులు దురాత్మలున్న వారిని ఈ లాగున ఆజ్ఞపించ సాగేను " పౌలు ప్రకటించు శక్తీ కలిగిన యేసు నామములో బయటకు పొమ్మనెను ". 14 ఏడుగురు ఇలాగు చేయసాగేను వారు సేవా అను ఒక యుదా మత బోధకుని కుమారులు.
15 కాని ఒక రోజు వారు దురాత్మలను వెల్ల గొట్టుచుండగ దురాత్మా వారి లో నుండి బయటకు పోలేదు, అంతే కాకుండగా ఆ దురాత్మా వారి తో ఇలాగు మాట్లాడేను "నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు కాని, మీకు ఏవరు ఏవిధమైన అధికారం ఇవ్వలేదు అనేను. 16 ఇది చెప్పిన తరువాత దురాత్మా పట్టిన వాడు సేవా కుమారులపై దూకి వారి బట్టలు చింపి వారిని గాయపరిచేను, వారు దురాత్మా ను ఎదుర్కొనలేక అక్కడ నుండి వస్త్రహీనులై పారిపోయెను. 17 ఎఫేసి ప్రాంతం లో వున్నా యూదులు మరియు యూదులుకానివారు అందరు ఈ వార్త వినిరి. వారు అంతా మిక్కిలి భయపడిరి. ఆ దురాత్మా కలిగిన వాడు చాల బలవంతుడుగా ఉన్నందున అందరు భయపడిరి, కానీ యేసు నామము అక్కడ మహిమ పరచబడేను.
18 ఆ సమయమున విశ్వాసులు వినుచుండగా, చాల మంది విశ్వాసులు వారు చేయుచున్న చెడు కార్యములు గురించి చెప్పిరి . 19 చేతబడి చేయు కొందరు వారి చేతబడి పుస్తకములులను అగ్నిలో వేసి కాల్చివేసేను. కొంత మంది వచ్చి మీ పుస్తకములు ఎంత ఖరీదు ఉ౦టుంది అని అడుగగా వారు యాబై వెండి నాణేములు అని చెప్పెను . 20 ఇలాగున చాల మంది యేసుని గూర్చిన వార్త విని ఆయన యందు విశ్వాసముంచిరి.
21 ఎఫేసు ప్రాంతం లో పని పూర్తియైన తరువాత దేవుని ఆత్మ పౌలు ను యెరుషాలేము పంపుటకు నియమించేను. కాని ముందుగా మసిదోనియా, అచయా ప్రాంతంలో వున్నా విశ్వాసులను కలవాలని తీర్మానము తీసుకొనెను. "నేను యెరుషాలేము వెళ్ళిన తరువాత రోమా కుడా వెళ్ళేదను" అని పౌలు అనేను. పౌలు తన ఇద్ధరు సహకారులు తిమోతి, ఎరాస్తులను మాసిదోనియకు పంపేను. 22 కాని పౌలు ఎఫేసు, ఆసియ ప్రాంతం లో ఉండిపోయెను.
23 ఇది యైన తరువాత, ఎఫేసు లో ఉన్న మనుష్యులు పౌలుకును యేసు గురించి చేయు బోధలకును వారు వ్యతిరేకముగా చాల సమస్యలు సృష్టించారు. 24 దేమేత్రి అనే ఒక వ్యక్తి ఉండేను. ఆయన డయానా అనే దేవత విగ్రహంను వెండి తో చేసేను. 25 దేమేత్రి వారి మనుష్యులను పిలిచి మనము ఈ విగ్రహాల ద్వార చాలా సొమ్ము చేసుకొనుచున్నాము కదా అనేను.
26 మనకు తెలిసినట్లుగ ఎఫేసు లో పౌలు మనము చేసిన విగ్రహాలను ఎవ్వరు కొనకూడదు అని చేప్పుచున్నాడు. ఇప్పటికే చాల మంది మనము చేసిన విగ్రహాలు కొనడంలేదు. ఇది ఇలాగే కొనసాగితే మన వ్యాపారం నష్టపోతుంది. మనము చేసి పూజిస్తున్న దేవుళ్ళు, దేవతలు అస్సలు నిజమైన దైవం కాదు అని పౌలు చెప్పుచున్నాడు. 27 ఒక వేళ పౌలు మాటలు ప్రజలు నమ్మేతే డయానా ను పూజించడానికి ఎవ్వరు రారు. ఆసియా, భూమియందంతట డయానా గురించి తెలిసినప్పటికిని, డయానా గొప్పతనం తగ్గిపోతు౦ది.
28 దేమేత్రి చెప్పిన మాటలు విని అక్కడ వున్నా ప్రజలు అంతా చాలా కోపముతో ఊగిపోయిరి. ప్రజలు అంత " డయానా చాల గొప్పదనేను". 29 ప్రజలు అందరు పౌలుపై, చాల కోపం తో నినాదాలు చేసిరి. మాసిదోనియా నుండి పౌలుతో ప్రయాణం చేసిన గాయు ను, అరిస్టర్కును కొంత మంది పట్టుకొని వారిని నగర లోని డయానా గోపురం దగ్గర వరకు యీడ్చుకొని వెళ్ళిరి.
30 పౌలు డయానా గోపురం దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడడానికి సిద్ద పడుచుండగా విశ్వాసులు పౌలును ఆపివేసిరి. 31 పౌలు కు తెలిసిన కొంత మంది నగర నాయకులు అక్కడ ఏమి జరుగుచున్నదో తెలుసుకొని పౌలును డయానా గోపురం దగ్గరకు వెళ్ళవద్దు అని కబురు పంపేను. 32 గోపురం లో ఉన్న ప్రజలు బిగ్గరగా కేకలు వేసిరి. కొందరు ఎందుకు అరుచుచున్నారో వారికి తేలియలేదు. కొంతమంది కి అసలు వారు అక్కడికి ఎందుకు వచ్చారో కూడా వారి కి తెలియదు.
33 అక్కడ ఉన్న యూదులలో ఒకని పేరు అలేక్షందర్. కొంత మంది యూదులు అలెక్షందర్ ను అందరి ముందుకు మాట్లాడడానికి తోసిరి. అతను వారితో యూదులు ఏమి తప్పు చేయ్యలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేయగ ప్రజలు బిగ్గరుగా అరిచేను. 34 అక్కడ వున్నా చాల మంది అలెక్షేందర్ యూదుడని తెలిసి యూదులు డయానా ను పూజించరని తెలిసి " ఎఫేసు లో ని డయానా గొప్పది" అని ప్రజలు బిగ్గరుగ అరిచేను.
35 అక్కడ ఉన్న నగర నాయకులలో ఒకడు ప్రజలను నిశబ్దపరచి. నా ప్రియ జనులార 36 " ఆకాశం నుండి డయానా దిగివచ్చినదని మనకు తెలుసు " ఎవరు దానిని కాదు అనలేరు . వీరిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు. 37 వారు ఏమి మన డయానా గుడారం లో దొంగలించలేదు, లోనికి రాలేదు. మన డయానా గురించి ఏమి చేడు మాట్లాడలేదు అనేను.
38 కాబట్టి దేమిత్రికిని ఆయన తోటి పనివారికిని ఎవరివలనైనను కష్టము కలిగిన యెడల సరియైన మార్గముగుండా అనగా మన ప్రభుత్వము మరియు దాని నియమములు ప్రకారము, అక్కడ ఉన్న న్యాయస్థానములు మరియు ప్రభుత్వము చేత ఏర్పరచబడిన న్యాయాధిపతుల యొద్ద చెప్పవలెను. 39 కానీ మీరు మరి ఏదైననూ అడగదలచిన యెడల మీ న్యాయాధిపతులు మీ యొద్దకు వచ్చునపుడు వారిని 40 అడుగవలెను.ఇది సరియైన విధానము కాదు గనుక మీరు సరియైన మార్గములో వేల్లుడి ఎందుకనగా ప్రభుత్వమును వ్యతిరేకించుటకు మాకు ఇష్టం లేదు. ఒక వేల న్యాయాధిపతుల అక్కడ ఎమి అల్లరి జరుగుచున్నదని నన్ను ఆడిగినయెడల నేను వారికీ సరియైన సమాధానము ఇయలేను. 41 ఈ విధముగా పట్టణపుఅధికారి అ ప్రజల సముహముతో చెప్పి అప్పుడు వారిని తమతమ ఇండ్లకు వెళ్ళమని చెప్పెను, కావున వారు తమతమ ఇండ్లకు వెళ్ళెను.
Chapter 20
1 ఎఫెస్సులో ఉన్న ప్రజల అల్లరి అణిగిన తరువాత, పౌలు విశ్వాసులoదరిని తనయొద్దకు రమ్మని పిలిచి, ఏసుక్రీస్తు నందు నమ్మికయుంచుమని వారిని వేడుకొనెను. ఇది అయిన తరువాత పౌలు వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియా ప్రాంతమునకు వెళ్ళెను. 2 ఆయన అక్కడకు చేరినతరువాత, ప్రభువైన యేసును స్థిరముగా నమ్ముమని వారితో చెప్పి గ్రీసు కు వెళ్ళెను. 3 గ్రీసులో ఆయన మూడు నెలలు గడిపి, సిరియ కు పడవ మీద వెల్లవలెనని ఉండగా అతనిని చంపవలెనని కొందరు యూదులు ఆతని కోసం కనిపెట్టిరి, అప్పుడు ఆయన మాసిదోనియ మీదుగా వెళ్ళవలెనని నిర్ణయిoచుకొనెను.
4 యేరూషలేమునకు పౌలు తో కూడా వెళ్ళిన వారు ఎవరు అనగా, బెరెయా ప్రాంతానికి చెందిన పుర్రు కుమారుడును, సోపత్రును , అరిస్తర్కును మరియు సేకుందును థెస్సలోనికకు చెందిన వారు , గాయి దెర్బేకు చెందినవారు , తిమోతి గలతియా ప్రాంతమునకు చెందినవారు , తుకికు మరియు త్రోఫిమను ఆసియ ప్రాంతము నకు చెందినవారు 5 . అ ఏడుగురు మాకు ముందుగా వెళ్ళిరి, మాసిదొనియా నుండి లూకా ఓడలో కలుసుకొనెను. వారందరు త్రోయకు చేరి మా ఇద్దరి కొరకు వేచివున్నారు. 6 నేను పౌలు ప్రయాణిoచి ఫిలిప్పి కు చేరుకున్నాము, యూదుల పులియని రొట్టెల పండుగ తరువాత మేము పడవలో ప్రయాణి౦చి, ఐదురోజుల తరువాత మేము త్రోయకు చేరుకొని, అక్కడ ఏడురోజులు ఉ౦టిమి.
7 ఆదివారం సాయంత్రంమున మేము మరియు యితర విశ్వాసులు కూడి ప్రభు రాత్రి భోజన విందు ఆచరించితిమి. పౌలు అర్థరాత్రి వరకు విశ్వాసులుకు బోదించెను , మరుసటి రోజు పౌలు ప్రయాణమై త్రోఅస్ కు వెళ్ళవలెను అని అలోచించించెను. 8 వారు కూడిన భవనం పై గది అనేక దీపములతో నిండియున్నది.
9 యూత్య్చుస్ అను పేరు గల ఒక యవ్వనస్తుడు, మూడవ అంతస్తులో తెరీచియున్న కిటికీలో కూర్చున్నాడు. పౌలు వీస్తరించి మాటలాడుచుండగా యూత్య్చుస్ నిద్రలో జోగి ఆ కిటికీలో నుండి నేలపై పడెను. కొందరు విశ్వాసులు వెంటనే క్రిందకుదిగి అతడిని ఫైకిలేపిరి , గాని అతడు అప్పటికే మరణించి యుండెను. 10 అప్పుడు పౌలు క్రిందికి దిగి వచ్చి ఆ యవ్వనస్తుని మీద చేతులుచాచి అక్కడ కూడినవారితో మీరు చింతించకండి అతను తిరిగి జీవించునని చెప్పెను.
11 అప్పుడు పౌలు, అక్కడ ఉన్నవారితో కలిసి మేడ గదికి తిరిగి వెళ్ళి ప్రభురాత్రిభోజనం తీసుకొనెను తరువాత పౌలు సూర్యుడుదయించువరకు వారికీ బోదించి, అక్కడనుండి వెళేను. 12 కొందరు, ఆ యవ్వనస్తుడు తిరిగి బ్రతికెనని నిశ్చయించికొని అతని ఇంటికి తీసుకొని వెళ్ళిరి.
13 మేము ఓడ దగ్గరకు బయలుదేరితిమి గాని పౌలు త్వరగా బయలుదేరి అస్సోస్ కు వెళ్ళేవలెనని మాతో కూడా రాలేదు. 14 మా ఓడ అస్సోస్ కు వచ్చినపుడు పౌలు మమ్మల్ని కలుసుకొనగా మేము మిలేతుస్ పట్టణమునకు చేరితిమి.
15 మరుసటిరోజు కు మిత్య్లేనేని చేరుకొని చిఒస్ వరకు ప్రయాణిచితిమి. ఆ మరుసటిరోజు సామోస్ ద్వీపము లోని మిలేతుస్ పట్టణం చేరుకున్నాము. 16 ఇది ఎఫేసుస్ నగరమునకు దక్షిణంగా ఉన్న ప్పట్టణము. ఆసియాలు సమయం వృదా చేయుట ఇష్ట పడనందున పౌలు ఎఫేసుస్ లో ఆగుటకు ఓప్పు కొనలేదు. జేరుసలమే లో జరుగు పెంతుకోస్తూ పండుగలో పాల్గోనవలేనని ఆసమయంకు జేరుసేలం చేరు కోనటకు నిశ్చయించుకోనేను.
17 ఓడ మిలేతునకు సమీపించినప్పుడు పౌలు ఒక వర్తమానికుని పిలిచి, నీవు వెళ్ళి నేను మాట్లాడునట్లు ఎఫెసులో ఉన్న విశ్వాసుల పెద్దలను రమ్మని చెప్పమని చెప్పెను. 18 పెద్దలు అతని యొద్దకు వచ్చినపుడు పౌలు వారితో ఇలా చెప్పెను "నేను ఆసియా ప్రాంతమునకు వచ్చిన మొదటి దినము నుండి నేను వెళ్ళిన చివరి దినము వరకు మీ మధ్యన ఉండిన కాలమంతయు ఏలాగు నడుచుకొంటినో మీకు తెలుసు. 19 నేను ఏ విధముగా తగ్గించుకొని, కొన్నిసార్లు కన్నీరు కారుస్తూ ప్రభువైన యేసును సేవించితినో మీకు తెలుసు. విశ్వసించని యూదులు తరుచుగా నాకు హాని చేయవలెనని ఉండగా నేను ఏ విధముగా భాదపదితినో అదికూడా మీకు తెలియును. 20 నేను మీకు దేవుని వాక్యము భోదించునప్పుడు, మీకు సహాయపడే దేనినైనను నేను వదిలిపెట్టలేదని మీకు తెలియును. అనేకమంది ప్రజలు ఉన్నపుడును మరియు మీ ఇండ్లకు కూడా వచ్చి దేవుని వాక్యమును అక్కడను భోదించితినని కూడా మీకు తెలియును. 21 వారి పాపపు ప్రవర్తన నుండి మార్పు చెంది మన ప్రభువైన ఏసుక్రీస్తును విశ్వసిoచులాగున నేను యూదులకును మరియు యూదులు కాని వారికి సహితము వాక్యమును భోదించితిని.
22 యెరూషలేము వెళ్ళమని పరిశుద్దాత్మ నాతో స్పస్టముగా చెప్పినందున నేను బయలుదేరి వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమిజరుగునో నాకు తెలియడు గనుక పరిశుద్ధాత్మకు లోబడి వెళ్ళుచున్నాము. 23 నేను ప్రవేశించిన ప్రతి పట్టణము నాకు తెలుసు. యేరూషలేము ప్రజలు నన్ను చెరసాలలలో వేసి హింసించేదరని పరిశుద్దాత్మ దేవుడు నాకు స్పష్టముగా భయలు పరచెను. 24 ప్రజలు నన్ను చంపినను నాకు భయము లేదు, నాకు మొదటిగా యేసుక్రీస్తు చెప్పిన పని ముగించుటయే నా కర్తవ్యము. మనము అర్హులము కాకపోయినను దేవుని యొక్క రక్షణ భాగ్యము ప్రకటించుటకు అయన నన్ను పెలిచెను.
25 దేవుడు రాజుగా ఎలా మహిమపర్చబడెనో నేను మీకు భోధించి యున్నాను. అయితే సహా విశ్వాసులు అయిన మీరు నన్ను చూచుట ఇది చివరి సమయమని నాకు తెలుసు 26 మీలో ఎవరైనను నేను చెప్పినది వినిన తరువాత కూడా ఏసుక్రీస్తును విశ్వసించకుండా చనిపోయినట్లయిన అది నా భాద్యత కాదని మీరు గ్రహించగలరు. 27 దేవుని యొక్క ప్రణాళిక మనమీద ఎలాగున్నదో నేను మీకు భోధించి యున్నాను.
28 నాయకులైన మీరు దేవుని వర్తమానము ద్వారా విశ్వాసము కలిగి విధేయులై యుండవలెను. ఇతర విశ్వాసులకు సహాయం చేయగలరు . కాపరి తమ గొర్రెలను కాపడునట్లు మీకు మీరే విశ్వాసులను కాపాడవలెను. దేవుడు తన కుమారుడు సిలువపై కార్చిన రక్తమును బట్టి వారిని కొనియుండెను. 29 నేను వెళ్ళిన తరువాత అబద్ద భోధకులు మీ మధ్యకు వచ్చి విశ్వాసులకు హాని కలిగించెదరు. వారు తోడేలు వలె వచ్చి మిమ్ములను చంపుదరు. 30 మీలో కొందరు నాయకులు అబద్ద భోధలు చేసి ఇతర విశ్వాసులను మార్చెదరు. కొంతమంది ప్రజలు వారియొక్క బోధలు నమ్మి వారిని వెంబడించెదరు.
31 యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన సత్య వాక్యము నుండి మిమ్ములను ఎవరును ఆటంక పరచకుండా చూచుకొనుడి . మూడు సoవత్సరములు రాత్రిం బగల్లు నేను కన్నీటితో మీకు భోధించి హెచ్చరించి ప్రభువుకు నమ్మకస్తులుగా చేసిన దానిని గుర్తించుకొనుడి. 32 నేను ఇప్పుడు మిమ్మును విడచి వెళ్ళుచున్నను రక్షించబడుటకు యే యోగ్యత లేని మనలను రక్షించిన వాని యందు మిమ్ములను కాపాడవలెనని దేవుని వేడుకొనుచున్నాను. దేవుని బోధయందు విశ్వాసముంచిన మీరు బలవంతులౌదురు గాక . దేవుని నమ్మినవారికి ఆయన వాగ్ధాన ప్రకారముగా ఎల్లప్పుడు దయకలిగి యుండుము.
33 నానిమిత్తమై నేను ఎవరి యెద్ద ఏవిదమైన ధనం గాని వస్త్రముగాని నేను ఆశించలేదు. 34 నాకును నాస్నేహితులకును అవసరానికి కావలసిన దానిని మేము మా చేతులతో సంపాదించు కొంటిమి . 35 ప్రతి విషయములో నేను మీకు మాదిరిగా చూపినట్లు మీ సంపాదనలో కొంత భాగం పేదవారికి సహాయం చేసే వారిగా యుండాలి . యేసు చెప్పినట్లు పుచ్చుకునే కంటే ఇచ్చుట మేలని గ్రహించగలరు.
36 పౌలు మాట్లాడుట ముగించిన తరువాత, సంఘపెద్దలతో మోకరించి వారి కొరకు ప్రార్ధించెను. 37 వారు పౌలును హత్తుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొనిరి . 38 వారు పౌలును మరల చూడరు గనుక వారు దుఖముకులై ఉండిరి. వారందరూ పౌలును సాగనంపుటకు ఓడ వద్దకు వచ్చిరి.
Chapter 21
1 మేము ఎఫెస్సులో ఉన్న పెద్దలయొద్ద సెలవు తీసుకొని, ఓడ ఎక్కి నీటి మీద ప్రయాణము చేయుచు కోసు అను ద్వీపమునకు వచ్చి,ఆ రాత్రి అక్కడ గడిపితిమి. ఆ మరుసటి రోజు మేము ఓడ ఎక్కి కోసు నుండి రొదు అను మరియొక ద్వీపమునకు చేరుకొని ఆ రాత్రి మరలా అక్కడ గడిపితిమి. తరువాతి రోజు మేము పతర అను పట్టణమునకు చేరుకొoటిమి, ఓడ అక్కడ ఆగినది. 2 పతర పట్టణములో ఫేనీకే ప్రాంతమునకు వెళ్ళు ఓడ ఉన్నదని ఎవరో తెలిపినందున మేము ప్రయాణించుచున్న ఓడను విడిచి, ఫేనీకే వెళ్ళు ఓడను ఎక్కి వెళ్లితిమి.
3 కుప్ర అను ద్వీపమును చూచునంత వరకు మేము సముద్రము మీద ప్రయాణము చేసితిమి. ఫేనీకే అను ప్రాంతమునకు చేరినంతవరకు తూరు అను పట్టణము మీదుగా, సిరియా ప్రాంతముగుండా సముద్ర ప్రయాణము చేయుచు దక్షిణ ద్వీప మార్గముగుండా మేము వెళ్లితిమి. పనివారు ఓడలో ఉన్న సరుకులు దించు నిమిత్తము కొన్నిరోజులు ఓడ అక్కడ ఆగినది. 4 తూరు అను పట్టణములో ఉన్న విశ్వాసులను గురించి కొంతమంది మాకు తెలియజేయగా, మేము వారియొద్దకు వెళ్లి ఏడురోజులు వారితో ఉంటిమి. యెరూషలేములో ఉన్న ప్రజలు పౌలును హింసించుదురని దేవుని ఆత్మ వారికి తెలియజేసినందున, వారు పౌలును యెరూషలేమునకు వెళ్ళవద్దని చెప్పిరి.
5 మరలా ఆ ఓడ తిరిగి బయలుదేరుచుండగా, యెరూషలేము వైపు వెళ్ళుటకు మేము సిద్ధపడితిమి. మేము తూరు పట్టణమును విడిచి వెళ్ళుచుండగా, అక్కడి పురుషులు మరియు వారి భార్య,పిల్లలును మాతో కూడా సముద్రతీరమునకు వచ్చిరి. మేము అందరమూ అక్కడ ఉన్న ఇసుక మీద మోకరించి ప్రార్ధించితిమి. 6 వారికి వీడ్కోలు చెప్పిన తరువాత, పౌలును అతనితో ఉన్నవారును ఓడలోనికి వెళ్ళగా, మిగిలిన విశ్వాసులు వారి వారి గృహములకు వెళ్ళిరి.
7 అటుతరువాత మేము తూరును విడిచి తొలెమాయి అను పట్టణమునకు అదే ఓడలో ప్రయాణించితిమి. అక్కడ కొంతమంది విశ్వాసులు ఉండిరి, మరియు మేము వారికి శుభములు తెలియజేసి ఆ రాత్రి వారితో గడిపితిమి. 8 ఆ మరుసటి రోజు తొలెమాయిను విడిచి కైసరయకు ప్రయాణము చేసి, అక్కడి ప్రజలకు యేసును ఏలాగు వెంబడిoచాలో తెలుపుతూ తన సమయాన్ని గడుపుతూ ఉన్న ఫిలిప్పు అను సహోదరుని ఇంటిలో ఉంటిమి. విధవరాలు క్షేమము కొరకు యెరూషలేములో ఎన్నుకొనబడిన ఏడుగురిలో ఈయన ఒకడు. 9 అతనికి నలుగురు వివహము కాని కుమార్తెలు ఉండిరి. పరిశుద్ధాత్మ వారికి తెలియజేసిన వర్తమానములను తరచుగా వారు ప్రకటించుచుoడిరి.
10 కొన్ని దినములు మేము ఫిలిప్పు గృహములో ఉన్న తరువాత, యూదా ప్రాంతమునుండి వచ్చిన అగబస్ అను పేరు గల ఒక విశ్వాసి కైసరయకు వచ్చెను. పరిశుద్ధాత్మ అతనికి తెలియజేసిన వర్తమానములను తరచుగా అతడు ప్రకటించుచుండెను. 11 మేము ఉన్న చోటికి అతడు త్వరితముగా వచ్చి, పౌలు నడికట్టును తీసివేసి, దానితో తన కాళ్ళు మరియు చేతులను కట్టుకొని ఈలాగు ప్రవచించెను. పరిశుద్ధాత్మ ఈలాగు చెప్పునది, యెరూషలేములో ఉన్న యూదా పెద్దలు ఈ నడికట్టు కలిగిన వ్యక్తి యొక్క కాళ్ళు, చేతులును కట్టివేసి యూదులు కాని ప్రజల చేతికి ఒక ఖైదీగా వారు అతనిని అప్పగించెదరు.
12 మిగిలిన మేమందరము ఆ మాటలు వినినప్పుడు, దయచేసి యెరూషలేమునకు వెళ్ళవద్దని, మేమును మరియు ఇతర విశ్వాసులును పౌలును వేడుకుంటిమి. 13 " దయచేసి మీరు ఏడ్వవద్దని మరియు అక్కడకు వెళ్ళవద్దని నన్ను నిరుత్సాహ పరచవద్దని పౌలు వారితో చెప్పెను. మీరు ఏడ్చి, నన్ను అక్కడకు వెళ్ళనివ్వకుండా ఎందుకు నిరుత్సాహ పరుచుచున్నారు?. నేను సేవిసించుచున్న ప్రభువైన యేసు కొరకు చెరసాలకు వెళ్ళుటకు మరియు మరణించుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నాను" అని వారితో చెప్పెను. 14 అతడు యెరూషలేమునకు వెళ్ళుటకు నిర్ణయిoచుకొనెనని మేము గ్రహించినప్పుడు అతడు వెళ్ళకుండా మేము ఏమాత్రమును ఆపలేదు, ప్రభువు చిత్తము జరుగును గాక అని చెప్పితిమి.
15 కైసరయలో కొన్ని దినములు ఉన్న తరువాత, మా స్థానములను సిద్ధపరచుకొని యెరూషలేమునకు వెళ్లితిమి. 16 కైసరయ నుండి కొందరు విశ్వాసులు మాతోకూడా వచ్చిరి. వారు మ్నాసోను అను పేరు గల ఒక మనుష్యుని ఇంటికి తీసుకొని పోయి మమ్మును అక్కడ ఉంచిరి. అతడు కుప్ర ద్వీపమునకు చెందినవాడు, మరియు అతడు యేసును గూర్చిన వర్తమానమును మొదటిగా విని విశ్వసించిన ప్రజలలో ఒకడు.
17 మేము యెరూషలేమునకు చేరినపుడు విశ్వాసులు సంతోషముగా మమ్మును చేర్చుకొంటిరి. 18 ఆ మరుసటి రోజు పౌలు మరియు మిగిలినవారు అక్కడ ఉన్న మందిరపు నాయకుడైన యాకోబుతో మాట్లాడిరి. మిగిలిన నాయకులు కూడా యెరూషలేము మందిరములోనే ఉండిరి. 19 పౌలు వారికి వందనములు చెప్పి యూదులు కాని ప్రజల మధ్య తన ద్వారా దేవుడు జరిగించుచున్న కార్యములన్నిటిని వారికి తెలియజేసెను.
20 వారు ఆ సంగతులను వినినప్పుడు యాకోబు మరియు మిగిలిన పెద్దలు దేవునికి వందనములు తెలియజేసిరి. అప్పుడు వారిలో ఒకరు అతనిని చూచి, సహోదరుడా, ప్రభువైన యేసునందు విశ్వసించిన అనేక వేలమంది యూదా ప్రజలు ఇక్కడ ఉన్నారు. మోషే మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమునకు లోబడి ఎంత జాగ్రత్తగా నడుచుకొనుచున్నామో అది మీకు తెలియును. 21 కానీ మాతోటి యూదా విశ్వాసులు మాతో చెప్పినది ఏమనగా, మోషే ధర్మశాస్త్రమునకు లోబడకూడదని యూదులుకాని వారి మద్యన ఉన్న యూదులకు మీరు భోదించుచున్నారు. యూదా విశ్వాసుల కుమారులకు సున్నతి చేయకూడదు, మిగిలిన పద్ధతులను ఆచరించకూడదు అని మీరు చెప్పుచున్నారని ప్రజలు మాకు తెలియజేసిరి. మీ గురించి వారు చెప్పిన మాటలలో సత్యము లేదని మేము నమ్ముచున్నాము.
22 గానీ మా తోటి యూదా విశ్వాసులు మీ రాక గురించి వినినప్పుడు, మీ మీద కోపముతో ఉండిరి. మీ గురించి ఏమైతే వారు వినియున్నారో అవి అసత్యములని వారికి మీరు తెలియపరచుకొనవలెను. 23 కావున దయచేసి మేము మీకు ఇచ్చిన సలహాను పాటించవలసినదిగా కోరుచున్నాము. దేవుని యెదుట ప్రమాణము చేసుకొనిన నలుగురు మనుష్యులు మాలో ఉండిరి. 24 ఆ మనుష్యులతో నీవు మందిరమునకు వెళ్లి, నీవును మరియు వారును మందిరములో ఆరాధించుటకు అవసరమైన ఆచారములు జరిగించవలసినదిగా కోరుచున్నాము. వారికి బలులు అర్పించు సమయము వచ్చినపుడు, వారు ఏమి కోరుదురో దానికి నీవు వెల చెల్లించవలెను. అటు తరువాత, వారికి చెప్పిన దానిని చేసితిమని తెలియపరచుట కొరకై వారు తమ తలలను గొరిగించుకొనవలెను. ఆ మనుష్యులతో దేవుని మందిరములో ప్రజలు నిన్ను చూచినప్పుడు, వారు నీ గురించి చెప్పిన మాటలు అసత్యములని తెలుసుకొందురు. దీనిని బట్టి మన యూదా ధర్మశాస్త్రమునకు నీవు లోబడియున్నావని వారందరు తెలుసుకొందురు.
25 మన ధర్మశాస్త్రమునకు వారు లోబడవలెనని యూదులు కాని వారి నిమిత్తము యెరూషలేములో ఉన్న పెద్దలందరము మాట్లాడుకొంటిమి, మేము ఏమైతే నిర్ణయించుయున్నామో దానిని పత్రిక ద్వారా వారికి తెలియపరచుచున్నాము. ప్రజలు విగ్రహమునకు బలిగా అర్పించిన మాంసమును తినకూడదని, జంతువు యొక్క రక్తమును తినకూడదని, మరియు గొంతు నులిమి చంపిన జంతువుల మాంసమును తినకూడదని మేము వారికి వ్రాసితిమి. మరియు వారు వివాహము చేసుకొనని వారితో జారత్వము చేయకూడదని కూడా తెలియజేసితిమి. 26 కావున వారు అడిగిన దానికి పౌలు సమ్మతించి, మరుసటి రోజు అతడు ఆ నలుగురు మనుష్యులను తీసుకొనివెళ్లి, తమ్మును తాము శుద్ధీకరించుకొనిరి. అటుతరువాత పౌలు మందిరమునకు వెళ్లి ఏ దినమున వారిలో ఉన్న ఒక్కొక్కరి కొరకు బలులర్పించిరో మరియు తమ్మును తాము ఏ దినమున శుద్ధీకరించుకొనిరో, యాజకునితో తెలిపెను.
27 తమ్మును తాము శుద్దీకరించుకొనిన ఏడు దినములు పూర్తి కావచ్చునప్పుడు, పౌలు మందిరమునకు తిరిగి వెళ్ళెను. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు అతనిని అక్కడ చూచి, వారు అతనిమీద బహుగా కోపపడిరి. మందిరములో ఉన్న అనేక మంది యూదులను వారు పిలిచి పౌలును పట్టుకొనవలెనని కోరిరి. 28 వారు బిగ్గరగా, " తోటి ఇశ్రాయేలు ప్రజలారా ఈ మనుష్యుని శిక్షించుటకు వచ్చి మాకు సహాయపడుడని కేకలు వేసిరి. ఈ మనుష్యుడు వెళ్ళిన ప్రతీచోట అతని భోదల వలన యూదా ప్రజలను చెరిపివేయుచున్నాడని, పరిశుద్ధ మందిరమును గౌరవించకూడదని, మోషే ధర్మశాస్త్రమునకు లోబడకూడదని ఇతడు ప్రజలకు భోదించుచున్నాడు. అతడు యూదులు కాని ప్రజలను దేవుని మందిరమునకు తీసుకొనివచ్చి, అపవిత్రపరచుచున్నాడు". 29 వారు యూదుడుకాని త్రోఫిముతో, పౌలు యెరూషలేము చుట్టూ తిరుగుచుండుట చూచినందువలన పై మాటలు పలికిరి. యూదులు కాని వారు మందిరములోనికి ప్రవేశించుటకు వారి ధర్మశాస్త్రము అంగీకరించదు. మరియు ఆరోజు పౌలు, త్రోఫీమును మందిర ఆవరణములోనికి తీసుకొనివచ్చెనని వారు తలంచిరి.
30 మందిరము వద్ద అల్లరి జరుగుచున్నదని పట్టణ ప్రజలు విని అక్కడకు పరుగెత్తుకొని వచ్చిరి. వారు పౌలును పట్టుకొని అతనిని మందిరము వెలుపలకు ఈడ్చుకొని వచ్చిరి. మందిరము లోపలి భాగములో ప్రజలు అల్లరి చేయకూడదని మందిరపు తలుపులు మూసివేసిరి. 31 వారు పౌలును చంపుటకు ప్రయత్నించుచుండగా, ఒక మనుష్యుడు మందిరము దగ్గరలో ఉన్న కోట యొద్దకు పరుగెత్తుకొని వచ్చి, యెరూషలేములో ఉన్న చాలామంది ప్రజలు మందిరము దగ్గర అల్లరి చేయుచున్నారని రోమా సైన్యాధిపతికి తెలియజేసెను.
32 ఆ సైన్యాధిపతి త్వరితముగా తనతోపాటు కొంతమంది అధికారులను మరియు చాలా మంది సైనికులను మందిరము దగ్గర కూడి ఉన్న జనసముహము వద్దకు తీసుకొనిపోయెను. పౌలుపై అరచుచూ, కొట్టుచూ ఉన్న ఆ జనసమూహము వారియొద్దకు సైన్యాధికారి మరియు సైనికులు వచ్చుట చూచి అతనిని కొట్టుట మానివేసిరి. 33 సైన్యాధికారి పౌలునొద్దకు వచ్చి అతనిని పట్టుకొని, అయన చేతులకు త్వరగా సంకెళ్ళు వేయుమని సైనికులకు ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన ఆ జనసముహముతో, " ఈయన ఎవరు మరియు ఇతడు చేసిన నేరము ఏమని వారిని అడిగెను"?.
34 ఆ జనసముహములో కొందరు ఒకలాగున మరికొందరు ఇంకొకలాగున కేకలు వేయుచుండిరి. వారాలాగున బిగ్గరగా అరచుచుండగా, వారు ఏమి చెప్పుచున్నారో సైన్యాదికారికి అర్ధము కాలేదు. కావున సైన్యాధికారి, పౌలును ప్రశ్నించుటకు కోటలోనికి తీసుకురమ్మని వారికి ఆజ్ఞాపించెను. 35 సైనికులు పౌలును కోటలోనికి తీసుకువెళ్లగా అనేకమంది ప్రజలు ఆయనను వెంబడించుచూ ఆయనను చంపుటకు ప్రయత్నించుచుండిరి. కావున పౌలును కోట మీది భాగమునకు తీసుకురావలసినదిగా సైన్యాధిపతి సైనికులకు ఆజ్ఞాపించెను. 36 ఆ జనసముహము అతనిని " చంపుడి! చంపుడి!" అని కేకలు వేయుచూ వారిని వెంబడించిరి.
37 పౌలును కోటలోనికి తీసుకొని వెళ్ళుచుండగా, గ్రీకులో పౌలు సైన్యాధిపతితో " నేను మీతో మాట్లాడవచ్చునా?" అని అడిగెను. అప్పుడు సైన్యాధిపతి, " నీవు గ్రీకు భాషలో మాట్లాడుచున్నావే!" అని ఆశ్చర్యపోయెను. 38 కొన్నాళ్ళ క్రిందట ప్రభుత్వము మీద తిరుగుబాటు చేసిన ఐగొప్తుకు చెందిన ఒక వ్యక్తి తనతోపాటు నాలుగు వేలమందిని తిరుగుబాటుదారులను ఏర్పరచుకొని మా నుండి తప్పించుకొని అడవిలోనికి పారిపోయిన ఆ తిరుగుబాటుదారులలో నీవును ఒకడివని తలంచితిని.
39 పౌలు ఈ విధముగా జవాబు ఇచ్చెను, " లేదు, నేను వాడిని కాను! నేను యూదుడను. కిలికియ ప్రాంతములో ముఖ్య పట్టణమైన తార్సులో నేను పుట్టితిని. దయచేసి నేను ప్రజలతో మాట్లాడుటకు అవకాశము ఇమ్మని అడిగెను. 40 అప్పుడు సైన్యాధిపతి పౌలు మాట్లాడుటకు అవకాశమిచ్చెను. కాబట్టి పౌలు ఆ కోట మెట్ల మీద నిలువబడి ప్రజలు నిశ్శబ్దముగా ఉండునట్లు చేతితో సైగ చేసెను. ప్రజలు నిశ్శబ్దముగా ఉన్న తరువాత పౌలు వారి స్వభాష అయిన హెబ్రీ భాషలో వారితో మాటలాడెను.
Chapter 22
1 పౌలు యూదుల పెద్దలతోను, తనతోటి యూదులతోను ఈలాగు చెప్పెను, ఇదిగో వినుడి నా మీద నేరారోపణ చేసిన వారితో నేను మాట్లాడుచుంటిని అని అనెను. 2 అక్కడ ఉన్న ప్రజల గుంపు పౌలు తమ స్వభాష అయిన హెబ్రీ బాషలో మాట్లాడుట విని నిశ్శబ్ధముగా వినసాగిరి. అప్పుడు పౌలు వారితో ఇట్లనెను,
3 నేను మీ వలే యూదుడను, నేను కిలికియ ప్రాంతములో ఉన్న తార్సు అను పట్టణములో పుట్టితిని, కానీ ఇక్కడనే యెరూషలేములో పెరిగితిని. మోషే మన పితరులకు ఇచ్చిన ధర్మశాస్త్రమును నేను బాల్యములో ఉండగానే నేర్చుకొంటిని. గమాలియేలు నాకు గురువు .దేవునికి నేను విధేయత చూపించాలని అనుకొనుచున్నాను గనుక ధర్మశాస్త్రమునకు లోబడితిని మరియు మీరును ధర్మశాస్త్రమునకు లోబడి వున్నారని నిశ్చయముగా నమ్ముచున్నాను. 4 అందువలన యేసుని గూర్చిన మాటలు నమ్మిన స్త్రీ పురుషులను బంధించి,హింసించి చెరసాలలో వేయటకు,మరియు వారిని చంపుటకు ప్రయత్నించితిని. 5 ఈ విషయము ప్రధానయాజకునికిని మరియు యూదుల పెద్దలకును తెలిసి దమస్కులో ఉన్న మిగిలిన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకువెళ్ళితిని. యేసునందు విశ్వాసముంచు ప్రజలను బంధించుటకు ఈ పత్రిక ద్వారా అధికారము పొందితిని. తద్వారా వారిని యెరూషలేమునకు ఖైదీలుగా తెచ్చి ఇచ్చట హింసింస వచ్చును.
6 కాబట్టి నేను దమస్కునకు వెళ్ళితిని. మద్యాహ్న సమయమున దమస్కు సమీపమునకు చేరుకొనుచుండగా, అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు నా చుట్టు మెరిసెను. 7 ఆ వెలుగు చాలా ప్రకాశవంతముగా ఉండినందున నేను భూమి మీద పడితిని. అప్పుడు ఆకాశామును నుండి ఒకరు నాతో మాట్లాడుచు సౌలా,సౌలా ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు అని చెప్పుట వింటిని . 8 ప్రభువా నీవు ఏవడవని అడిగితిని. నేను నీవు హింసించుచున్న యేసును అని అతడు నాకు సమాదానం చెప్పెను .
9 నాతో ప్రయాణం చేసిన మనుషులు ఆ యొక్క ప్రకాశమంతమైన వెలుగును చూచితిరి గాని, చెప్పబడిన ఆ స్వరమును వారు అర్ధం చేసుకోలేకపోయిరి. 10 తరువాత ప్రభువా నేను ఏమి చేయవలెనని అడిగితిని. లేచి దమస్కాకు వెళ్ళుము అని ప్రభువు నాతో చేప్పెను. నీవు ఏమీ చేయవలెనో అక్కడ ఒక మనుష్యుడు నీకు తెలియపరచును. 11 ఆ తరువాత ప్రకాశవంతమైన వెలుగును బట్టి నేను గ్రుడ్డివాడనైతిని కనుక నేను చూడలేక పోతిని. కాబట్టి నాతోవున్నవారు నాచేయిపట్టి ధమస్కునకు తీసుకొని వెళ్ళిరి.
12 అననియ అను పేరు కలిగినవాడు నన్ను చూచుటకు వచ్చెను. అతడు దేవుని ఘనపరచువాడును యూదుల ధర్మశాస్త్రమునకు విధేయుడు. ధమస్కు లో వున్న యూదులందరు ఆయన గురుంచి మంచిగా చెప్పుకొనుచుండెను . 13 ఆయన వచ్చి నా ప్రక్కన నిలువబడి " నా స్నేహితుడైన సౌలా, మరల చూడుము అనగా, వెంటనే నా ప్రక్కన అతడు నిలువబడి యుండుట నేను చూసితిని.
14 అప్పుడు అతడు మన పితరులను, మనమును ఆరాదించు దేవుడు నిన్ను ఏర్పరచుకొని మరియు నీవు ఏమి చేయవలెనో నీకు చూపించును అని చెప్పెను. 15 నీతో మాట్లాడిన నీతిమంతుడును మెస్సయ్యయైన యేసును నీకు కనపరచెను.ఆయన నీవు చూచినది,వినినది ప్రజలందరికీ తెలుపవలెను. 16 నీవు ఆలస్యం చేయక లేచి నీ పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుకు ప్రార్దించినచో నేను నీకు బాప్తిస్మము ఇచ్చెదను.
17 తిరిగి నేను యేరుషలేమునకు వచ్చిన తరువాత ఒక రోజున మందిర ఆవరణలో ప్రార్దించగ నేను ఒక దర్శనం చూచితిని. 18 నా గురించి నీవు చెప్పుచున్న విషయములు ప్రజలు నమ్ముటలేనందున నీవు ఇక్కడ ఉండక యేరుషలేమును విడిచి వెళ్ళుము అని ప్రభువు నాతో చెప్పెను.
19 అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములలో నీ యందు విశ్వాసముంచిన వారిని హింసించి, కొట్టి చెరసాలలో వేయుచు ఉంటినని వారికి తెలియును. 20 వారు సువార్త చెప్పుచున్న స్తేఫనును హింసించి చంపుచుండగా నేను అక్కడ నిలిచి వారు చేయుచున్న దానికి సమ్మతించితిని. అతనిని చంపిన వారి వస్త్రములకు కావలిగా వుంటిని. 21 అందుకు నీవు ఇక్కడ ఉండక యెరుషాలేమును విడిచి వెళ్ళుము, నేను నిన్ను దూరముగా యూదులు కాని వారి యొద్దకు పంపుచున్నానని ప్రభువు నాతో చెప్పెను.
22 అన్యజనుల మధ్యకు దేవుడు నన్ను పంపుచున్నాడని వారితో చెప్పిన మాటలను వారు విని " అతనిని చంపుడి, అతడు ఇకపై బ్రతకకూడదని" కేకలు వేసిరి. 23 వారు కోపముతో వారి పై వస్త్రములు తీసివేసి ఆకాశములోనికి ధూలి వేసిరి. 24 యూదులకు కోపము వచ్చుటకు పౌలు ఏమి చేసేనో ఆ కారణమును తెలుసుకొనుటకు పౌలును చెరసాలలో వేసి కొట్టవలే నని సైనికులకు ఆ అధికారి ఆజ్ఞాపించేను.
25 వారు పౌలును కొట్టుటకు చేతులను చాపి కట్టుచు౦డగా, ప్రక్కన వున్నా ఒక సైనికునితో "ఏ నేరము చేయ్యని రోమీయుడైన మనుషుని శిక్షించుట నేరము. నన్నుశిక్షించుటకు మీకు ఏవరు ఆధికారం ఇచ్చితిరి అని పౌలు వారిని అడిగేను. 26 ఈ మాటలు వినిన సైనికుడు తన అధికారితో ఈయన రోమియుడు, ఈయనను శిక్షించుటకు మనకు అధికారమున్నదా అని అడిగెను.
27 పౌలు రోమీయుడని ఆ సైన్యాధిపతి తెలుసుకొని ఆశ్యర్యపడి, తానే ఆ చెరసాల యెద్ధకు వెళ్లి, 28 నీవు నిజముగా రోమీయుడవా? అని అడిగేను. అందుకు పౌలు అవును అనేను. అప్పుడు ఆ సైన్యాధిపతి నేనును రోమీయుడనే, నేను రోమా పౌరసత్వం సంపాదించుటకు చాలా ధనం చెల్లించితిని అనేను. అందుకు పౌలు నేను రోమీయుడు గానే పుట్టియున్నాను అనెను. 29 పౌలు రోమీయుడు అని తెలుసుకొని అతన్ని బంధించినందున సైన్యాధిపతి కూడ భయపడేను.
30 యూదులు ఎందుకు పౌలు మీద నేరము మోపుచున్నారో అని సైన్యాదిపతి నిశ్చయముగా తెలుసుకొనగొరి, మరుసటి రోజు పౌలుకు వేసిన సంకెళ్ళు తీసి, ప్రధానయాజకులును యూదుల మహాసభవారందరిని కూడి రావలెనని ఆజ్ఞాపించి పౌలును తీసికొనివచ్చి వారి ఎదుట నిలువబెట్టెను.
Chapter 23
1 పౌలు యూదుల సమాజపు సభ్యులను చూచి ఈ విధముగా చెప్పెను,"నా సహా యూదులారా,నేను నా జీవిత కాలమంతయు మన దేవుని గౌరవిస్తూ వచ్చియున్నాను, నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేసి యుండలేదు". 2 ప్రధానయజకుడైన అననీయ పౌలు చెప్పినది వినినప్పుడు, పౌలు దగ్గరలో వున్న మనుష్యులను వాని నోటి మీద కొట్టుమని చెప్పెను. 3 అప్పుడు పౌలు అననియతో," వేషధారి, దాని నిమిత్తము దేవుడు నిన్ను శిక్షించును, దేవుడు మోషేకు ఇచ్చిన న్యాయముల ప్రకారము తీర్పుతీర్చుటకు కూర్చున్నావు. కాని నీవే ఆ న్యాయములను తప్పిపోతున్నావు ఎందుకంటే నా మీద మోపిన నేరము ఋజువుకాకుండా నన్ను కొట్టుమని ఆజ్ఞాపించుచున్నావు.
4 అంతలో పౌలుకు దగ్గరలో నిలువబడి ఉన్నవారు," మన ప్రధాన యాజకుడు, దేవుని దాసుడైన వానితో ఇతను చెడ్డగా మాట్లాడవచ్చా!" అనిరి. 5 అందుకు పౌలు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నా సహా యూదులారా నేను పలికిన మాటకు నన్ను క్షమించుడి.నన్ను కొట్టమని పలికినవాడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నాకు తెలిసియుంటే నేను ఆ విదముగా పలికియుండే వాడిని కాదు, మరియు "నీ ప్రజల నాయకులు ఎవరినైనను చెడుగా మాట్లడకుమని" యూదుల న్యాయములో వ్రాయబడియున్నదని నాకు తెలియును.
6 వారి సభ్యులలో కొంతమంది సద్దుకయ్యలు మరి కొంతమంది పరిసయ్యులని పౌలు తెలిసికొనెను. కనుక అతడు "నా సహ యూదులారా నేను నా పూర్వికులవలె పరిసయ్యుడను. దేవుడు చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తాడని నేనును నమ్మి ఎదురు చూస్తున్నాను, ఆ విషయము గురించే నేను నేరము మోపబడియున్నానని" బిగ్గరగా చెప్పెను. 7 ఆ విధముగా చెప్పగానే మరణించిన వారు మరల బ్రతుకుదురో లేదో అని పరిసయ్యులు మరియు సద్దుకయ్యలు ఒకరితో ఒకరు వాదులాడుకొనుట మొదలుపెట్టిరి. 8 మరణించిన వారు మరల బ్రతకరని సద్దుకయ్యలు నమ్ముదురు. మరియు వారు దేవదూతలుగాని, ఆత్మలు గాని లేవని నమ్ముదురు. పరిసయ్యులు వీటన్నిటిని నమ్ముదురు.
9 వారు బాగములుగా విడిపోయి, ఒకరిమీద ఒకరు అరుచుకొనుచు, వాదించు కొనుచుండిరి. వారిలో కొద్దిమంది పరిసయ్యలైన బోధకులు లేచిరి, ఒకడు మేము ఇతనిలో తప్పు ఏమియు కనుగొనలేదు,ఒకవేళ దూతైనను, మరియొక ఆత్మయైనను కనబడి అతనికి నిజము చెప్పెనేమో అనెను. 10 అంతట సద్దుకయ్యలు మరియు పరిసయ్యులు ఒకరితో ఒకరు కొట్టుకొను స్థాయికి చేరిరి. కనుక శతాధిపతి పౌలును ముక్కలుగా చీల్చివేయుదురేమోనని భయపడెను. చెఱసాల నుండి సభలోనికి దిగి పౌలును సురక్షిత ప్రాంతమునకు తీసుకొనిరండని సైనికులకు అజ్ఞాపించెను.
11 ఆ రాత్రి యేసుక్రీస్తు వచ్చి తన దగ్గర నిలచియుండుట చూచెను. " ధైర్యము కలిగియుండుము! యెరూషలేములో వున్న ప్రజలతో నా గురుంచి చెప్పినట్లే , రోమాలో ఉన్న ప్రజలతో కూడా చెప్పవలెను" అని చెప్పెను.
12 ఆ తరువాతి ఉదయం పౌలును ద్వేషించిన యూదులు కలుసుకొని అతనిని ఎలాగు చంపవలేనో మాట్లాడుకొనిరి. అతను మరణించేవరకు భోజనము, మంచినీళ్ళు ముట్టకూడదని చెప్పుకొనిరి. వారు చేసిన ప్రమాణము ప్రకారము చేయకపోతే శపించుమని దేవునికి విన్నపము చేసిరి. 13 నలువది మందికంటే ఎక్కువ మంది మగవారు పౌలును చంపుటకు తీర్మానించుకొనిరి.
14 వారు ప్రధాన యాజకుడు మరియు యూదుల పెద్దలయొద్దకు వెళ్లి, "అతను మరణించేవరకు భోజనము,మంచినీళ్ళు ముట్టకూడదని మేము చేసిన విన్నపం దేవుడు విన్నాడు. 15 కనుక యూదుల సమాజ పక్షమున మీరు శతాధిపతి దగ్గరకు వెళ్లి పౌలుతో ఇంకా కొంచెం మాట్లాడవలెనని అతనిని సభమధ్యలోనికి వారి యొద్దకు తీసుకుని రమ్మని బతిమాలుకొనిరి. మేము పౌలును చంపుటకు మార్గమధ్యములో కాచుకొని ఉందుమని చెప్పెరి.
16 కాని వారు చేయాలనుకున్న ప్రణాళికను పౌలు యొక్క సోదరి కుమారుడు విన్నాడు, కనుక కోటలోనికి వెళ్లి పౌలుతో ఈ సంగతి చెప్పెను. 17 పౌలు అది విననప్పుడు, ఒక అధికారిని పిలిపించి అతనితో, "దయచేసి ఈ కుర్రవాడిని శతాధిపతి దగ్గరకు తీసుకొని వెళ్ళుము ఎందుకనగా ఒక విషయము ఆయనతో చెప్పవలసి యున్నదని" చెప్పను.
18 కనుక ఆ అధికారి ఆ కుర్రవాడిని శతాధిపతి దగ్గరకు తీసుకొని వెళ్ళెను.ఆ అధికారి శతాధిపతితో,"ఖైధియైన పౌలు నన్ను పిలచి, "దయచేసి ఈ కుర్రవాడిని శతాధిపతి దగ్గరకు తీసుకొని వెళ్ళుము ఎందుకనగా ఒక విషయము ఆయనతో చెప్పవలసి యున్నదని చెప్పను". 19 శతాధిపతి ఆ కుర్రవాడిని చేయిపట్టుకొని తీసుకొనిపోయి," నీవేమి నాతో చెప్పతలుచుకున్నావని?" అతనిని అడిగెను.
20 అందుకు ఆ కుర్రవాడు,"కొంతమంది యూదులు పౌలును రేపు సభ యొద్దకు తీసుకురావలెనని యున్నారు. వారు మరికొన్ని ప్రశ్నలు పౌలును అడుగుతామని చెప్పుదురు. కాని అది నిజము కాదు. 21 వారు చెయ్యమన్నది మీరు చేయవద్దు, పౌలును చంపుటకు మార్గమద్యములో కాచుకొని నలువది మందికంటే ఎక్కువ మంది పురుషులు ఎదురు చూస్తున్నారు. అతనిని చంపువరకు భోజనము, మంచినీళ్ళు ముట్టకూడదని వారు ప్రమాణము చేసుకొనిరి. అది చేయుటకు వారు సిద్ధముగా ఉండి, మీరు ఆ విషయమును ఒప్పుకోనలేవని అడుగుటకు మీ కోసము ఎదురు చూస్తున్నారు" అని చెప్పెను.
22 "వారి ప్రణాళిక గురించి నాతో చెప్పినట్లు ఎవరితోనూ చెప్పవద్దని" ఆ కుర్రవానికి చెప్పి అతనిని పంపించివేసెను. 23 అప్పుడు శతాధిపతి ఇద్దరు అధికారులను పిలిపించి వారితో, " రెండువందలమంది సైనికుల గుంపును ప్రయాణమునకు సిద్ధపరచి, గుర్రముల మీద మరొక డెబ్బది మందిని, మరొక రెండువందలమంది బల్లెములు మోయువారిని సిద్దపరచుడి. ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళుటకు సిద్దపడుడి. 24 మరియు పౌలు పరిపాలనాధికారి ఫెలిక్స్ యొక్క కోటకు వెళ్ళుటకు అతనిని గుర్రముల మీద కాపలా ఉండి తీసుకొని వెళ్లుడని చెప్పెను.
25 అప్పుడు శతాధిపతి పరిపాలనాధికారికి ఒక ఉత్తరము వ్రాసి పంపెను. 26 "నేను క్లాడియస్ లిసియస్, మీకు వ్రాయునది. మీరు మేము గౌరవించే పరిపాలనాధికారి ఫెలిక్స్ అయిన మీకు మా శుభాకాంక్షలు. 27 నేను పౌలు అను ఈ మనుష్యుని మీ యొద్దకు పంపించితిని, ఎందుకనగా కొంతమంది యూదులు ఈ మనుష్యుని బంధించి చంపదలచిరి. కాని నేను ఈ వ్యక్తి రోమా పౌరుడని విని నేను నా సైనికులు ఇతనిని కాపాడితిమి.
28 ఈయన ఏ తప్పు చేశాడని ఆ యూదులు చెప్పుదురో తెలుసుకొనుటకు నేను ఈయనను యూదుల సమాజమునకు తీసుకొని వెళ్ళితిని. 29 నేను వారు ప్రశ్నలు అడుగుట మరియు ఈయన సమాధానము చెప్పుట వింటిని, వారు అతని మీద మోపిన నేరములు యూదుల ఆచారములకు సంభంధించినవి. పౌలు మన రోమియుల విధులను అతిక్రమించలేదు కనుక మన అధికారులు అతనిమీద ఏ చర్య తీసుకొనలేదు మరియు ఖైదులో పెట్టలేదు. 30 యూదులు అతనిని చంపదలచి ఉన్నారని నాకు ఒకరు తెలియజేయగా మీరు బాగుగా విచారించగలరని నేను అతనిని మీ యొద్దకు పంపించితిని. నేను యూదులతో కూడా కైసరయకు వెళ్లి మీ వాదమును వినిపించవచ్చని తెలియజేసితిని. మంచి వీడ్కోలు అని వ్రాసెను.
31 కనుక ఆ సైనికులు శతాధిపతి చెప్పినది చేసిరి. ఆ రాత్రి పౌలును వారితో కూడా తీసుకొని అంతిపత్రికి వెళ్లిరి. 32 ఆ తరువాత రోజు ఆ సైనికులు తిరిగి యేరుషలేముకు తిరిగి వచ్చిరి. 33 వారు కైసరయకు వెళ్ళినపుడు పరిపాలనాధికారికి ఆ ఉత్తరము ఇచ్చి పౌలును ఆయనముందు ప్రవేశపెట్టిరి.
34 పరిపాలనాధికారి ఆ లేఖను చదివి పౌలుతో ఇట్లనెను,"నీవు ఏ ప్రాంతపువాడవని?" అడిగెను. అందుకు పౌలు,"నేను కిలికియకు చెందినవాడనని జవాబిచ్చెను. 35 అప్పుడు పరిపాలనాధికారి, " నీ మీద నేరారోపణ చేసిన ప్రజలు వచ్చి నీ గురించి వారు ఏమి చెప్పుదురో నేను విని తరువాత నీకు తీర్పు తీర్చుదునని" పౌలుతో అనెను. అప్పుడు హేరోదు రాజు చేత కట్టబడిన రాజభవంతిలో పౌలును కావలిలో ఉంచవలెనని గవర్నర్ ఆజ్ఞాపించెను.
Chapter 24
1 అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయ, కొంతమంది యూదా పెద్దలతోను తెర్తుల్లు అనబడే ఒక న్యాయవాదితోను కలిసి యెరుషలేము నుండి అక్కడికి వెళ్ళిరి. పౌలు చేసిన వాటన్నిటిని వారు తప్పు అని భావించి అధిపతి యెదుట చెప్పిరి. 2 ఆ అధిపతి పౌలును లోపలి తీసుకురమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినవెంటనే, తెర్తుల్లు అతని మీద నేరారోపణచేయడం మొదలుపెట్టెను. అతను అధిపతితో " గౌరవనీయులైన అధిపతి అయిన ఫెలిక్సూ, మీరు ఈ రాజ్యములో పరిపాలించిన సంవత్సారాలన్నియు మేము క్షేమముగా జీవించాము. మీరు జ్ఞానముతో ప్రణాళిక వేయడం ద్వారా ఈ రాజ్యంలో ఎన్నోవిషయాలు బాగుపరిచారు. 3 అందునుబట్టి, అధిపతి అయిన ఫెలిక్సూ, మా అందరి కొరకు చేసిన ప్రతీ పనులన్నిటిని బట్టి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము.
4 మీ సమయాన్ని ఎక్కువగా తిసుకోను గాని, నేను చెప్పవలసిన విషయాలు దయతో వినమని మిమ్మల్ని కోరుచున్నాను. 5 ఈ మనుష్యుడు, వెళ్ళిన ప్రతి చోటా యూదులతో సమస్య కలుగజేస్తున్నాడని మేము గమనించాము. నజరేయులు అని ప్రజల చేత పిలవబడే గుంపును ఇతను నడిపిస్తున్నాడు. 6 ఇతను యెరుషలేములో ఉన్న ఆలయాన్ని అపవిత్రం చేసే పనులు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కాబట్టి ఇతనిని మేము బంధించాము.
7 కానీ, రోమా సామ్రాజ్యపు అధికారి అయిన లూసియా, తన సైనికులతో కూడా వచ్చి మా దగ్గరనుండి ఇతనిని తీసుకోని వెళ్ళిరి. 8 అంతేకాకుండా లూసియా, పౌలు మీద నేరం మోపిన వారితో, ఇక్కడికి వచ్చి మీ యెదుట పౌలును విచారించమని చెప్పెను. మీరే ఇతనిని స్వయముగా ప్రశ్నించినట్లైతే మేము ఆరోపించిన సంగతులు అన్నీ సత్యము అని మీరే తెలుసుకుంటారు" అనెను. 9 అక్కడ ఉన్న యూదా పెద్దలందరు తెర్తిల్లు చెప్పిన విషయాలు అన్నీ నిజమేనని అధిపతికి చెప్పిరి.
10 అప్పుడు ఆ అధిపతి పౌలు మాట్లాడడానికి తన చేతితో సైగ చేసెను. పౌలు ఆ అధిపతితో ఇలాగు బదులిచ్చెను"అధిపతి అయిన ఫేలిక్సూ, మీరు ఈ యూదా రాజ్యమునకు అనేక సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి నేను సంతోషముగా సమాధానము చెప్పగలను. గనుక మీరు నేను చెప్పునది విని నాకు న్యాయముగా తీర్పు తీరుస్తారని నాకు తెలుసు. 11 యెరూషలేములోని దేవాలయానికి ఆరాధించుటకు వెళ్లి పన్నెండు రోజులు కూడా కాలేదని మీకు తెలుసు. 12 నేను ఆలయ ఆవరణంలో ఎవరితోనూ వాదము పెట్టుకొనలేదు కాబట్టి ఎవరునూ నేను వాదము పెట్టుకొనగా చూసానని చెప్పలేరు. నేను యూదా సమాజమందిరములో ప్రజలను తిరుగుబాటు చేయుటకు మరియు యెరుషలేములో సమస్యలకు కారణము అయినట్లు చూసానని ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే నేను అలాగ చేయలేదు. 13 కాబట్టి, ఇప్పుడు వారు నామీద ఆరోపించిన విషయాలన్నీ వారు మీకు ఋజువుపరచలేరు.
14 కాని, నేను నా పితరులు ఆరాధిoచిన దేవుడిని ఆరాధిస్తున్నాననే సత్యాన్ని మీ యెదుట ఒప్పుకొనుచున్నాను. యేసు మాకు బోధించిన మార్గమును నేను వెంబడిస్తున్నాను అనేది సత్యము. దేవుడు మోషే కు ఇచ్చిన ధర్మశాస్త్రములో ఉన్నవి మరియు ప్రవక్తలందరూ తమ గ్రంధాలలో వ్రాసినవ్వన్నీ నేను నమ్ముతున్నాను. 15 ఈ మనుష్యులు నమ్మినట్లు, దేవుడు ఒక దినాన మంచివారినీ చెడ్డవారినందరినీ, మరణించినవారినందరినీ తిరిగి లేపునని నేను కూడా నమ్ముచున్నాను. 16 ఆ దినము వస్తుంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను ఎల్లప్పుడూ దేవునిని సంతోషపెట్టునవి మరియు ప్రజల దృష్టికి సరియైన వాటిని చేయడానికి ప్రయత్నిస్తున్నాను.
17 నేను వేరే ప్రాంతాలలో కొన్ని సంవత్సరాలు ఉన్న తరువాత పేదవారైన నాతోటి యూదుల కొరకు కొంత ధనము తీసుకురావడానికి యెరుషలేముకు తిరిగి వచ్చాను. 18 అక్కడ దేవుడిని ఆరాధించడానికి పాటించవలసిన పద్ధతులు అన్నీ పూర్తి చేసిన తరువాత ఆసియా నుండి వచ్చిన యూదులు నన్ను ఆలయ ఆవరణంలో చూసిరి. నాతో ఎవరూ లేరు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేయడానికి నేను కారణం అవ్వలేదు. 19 కాని అక్కడ ఉన్న యూదులే ప్రజలు తిరుగుబాటు చేయడానికి కారణం అయ్యారు. నేను ఏదైనా తప్పు చేసానని భావిస్తే వారే నా మీద నేరం మోపడానికి మీ ముందుకు రావాల్సింది.
20 కాని వారికి అది చేయడం ఇష్టం లేకపోతే, వారి న్యాయసభలో నేను మాట్లాడినప్పుడు నేనేమి తప్పు చేసానో ఇక్కడ ఉన్నయూదులు మీకు చెప్పవచ్చు. 21 'దేవుడు చనిపోయిన వారినందరినీ తిరిగి లేపుతాడని నమ్మినందుకు ఈరోజు మీరు నాకు తీర్పు తీరుస్తున్నారు' అని నేను అరచినప్పుడు నేనేదో తప్పు చేసానని వారు చెప్పవచ్చు."'
22 ప్రజలు చెప్పుకొనే యేసు అనే మార్గము గురించి ఫెలిక్సుకు బాగా తెలుసు. కానీ, అతను పౌలును కాని యూదులను కాని మాట్లాడనివ్వలేదు. దానికి బదులుగా, " అధికారి అయిన లూసియ వచ్చిన తరువాత, మీ వ్యాజ్యాన్ని నిర్ణయిస్తాను" అని వారితో చెప్పెను. 23 తరువాత అతను పౌలుకు కాపలాగా ఉండే అధికారితో, పౌలును తిరిగి జైలుకు తీసుకెళ్ళమని చెప్పెను మరియు పౌలు ఎల్లప్పుడూ కాపలాలో ఉండేలా చూడమని చెప్పెను. కాని అతను పౌలుకు సంకెళ్ళు వేయవద్దని, మరియు ఒకవేల పౌలును కలవడానికి అతని స్నేహితులు వచ్చినప్పుడు, వారు పౌలుకి ఏ విధమైన సహాయం చేయడానికైనా వారికి అనుమతి ఇవ్వాలని ఆ అధికారికి చెప్పెను.
24 కొన్ని రోజులైన తరువాత ఫెలిక్సు యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కూడా వచ్చి పౌలును తనతో మాట్లాడడానికి పిలిపించెను. పౌలు యేసుక్రీస్తు మీద విశ్వాసముంచుట గురించి చెప్పినప్పుడు ఫెలిక్సు వినెను. 25 దేవుడిని సంతోషపెట్టడానికి ప్రజలు ఏమి చేయాలని దేవుడు కోరుచున్నాడో అతనితో చెప్పెను. దేవుడు ఒకానొక దినాన ప్రజలందరికి తీర్పుతీర్చుననియు మరియు వారి ప్రవర్తనలో ఎలాగు క్రమశిక్షణ కలిగి ఉండాలో వివరించెను. ఈ విషయాలన్నీ విన్న తరువాత ఫెలిక్సు భయపడి పౌలుతో " ఈరోజుకి విన్నది చాలు, నాకు సమయం దొరికినపుడు నేను మరలా నిన్ను నా దగ్గరికి రమ్మని తెలియజేతును " అని చెప్పెను.
26 పౌలు ధనము ఇస్తాడేమోనని ఫెలిక్సు నిరీక్షించెను కాబట్టి అనేకసార్లు పౌలును తన వద్దకు పిలిపించెను. పౌలు అనేకసార్లు ఫెలిక్సుతో మాట్లాడెను, కాని పౌలు అతనికి ఎటువంటి ధనము ఇవ్వలేదు, మరియు ఫెలిక్సు పౌలును చెరసాల నుండి విడిచిపెట్టమని తన సైనికులతో చెప్పలేదు. 27 ఫెలిక్సు యూదా నాయకులను సంతోషపరచాలని ఉద్దేశించి పౌలును జైలు లోనే ఉండనిచ్చెను. కాని రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఫెలిక్సు స్థానంలో పోర్కియు ఫేస్తు అధిపతి అయ్యెను.
Chapter 25
1 ఫేస్టాస్ ఆ రాష్ట్రానికి అధికారిగా పరిపాలన ప్రారంభించాడు.మూడు రోజుల తర్వాత అతడు సీజరయ నుండి యేరుశాలెం వెళ్ళాడు. 2 అక్కడ ప్రధానయాజకులు, యూదునాయకులు ఆయన్ని ముందు నిలబడి పౌలు ఘోరమైన తప్పిదాలు చేసాడని చెప్పారు. 3 అతన్ని వెంటనే యేరుసాలెం రప్పించి,విచారించమని గట్టిగా అడిగారు. అయితే, నిజానికి, మార్గంలో పౌలుమీద దాడిచేసి,చంపాలని వారు కుట్ర చేసారు.
4 ఫేస్టాస్ ఇలా జవాబిచ్చాడు " పౌలు సీజరయలో కాపలాలో ఉన్నాడు. అతన్ని అక్కడ ఉండనిద్దాం. నేనే త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను". 5 "కాబట్టి, మీలో రాగల్గినవారు నాతో అక్కడికి రండి. మీకు పౌలు మీద నేరారోపణ ఏమైనాఉంటే, అది మీరు అక్కడ మోపవచ్చు."అన్నాడు.
6 ఫేస్టాస్ దేవాలయపు నాయకులతో కలిసి యేరుసాలెంలో దాదాపు ఎనిమిది,పది రోజులు ఉన్నాడు. తర్వాత ఆయన సీజరయకు తిరిగివెళ్ళాడు. తర్వాతి రోజున ఫేస్టాస్ న్యాయాధిపతి స్థానంలో కూర్చుని, పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 7 పౌలు న్యాయాధిపతి వద్దకు వచ్చిన తర్వాత యేరుసాలెంనుండి వచ్చిన యూదునాయకులు అతని చుట్టూ చేరి అతనిమీద తీవ్రమైన నేరాలు మోపడం ప్రారంభించారు, కానీ వాటిలో ఏ ఒక్కటి నిరుపించలేకపోయారు. 8 ఆతర్వాత పౌలు తన తరపున ఇలా మాట్లాడాడు " నేను యూదుల ధర్మశాస్త్రానికిగాని, దేవాలయానికిగాని, చక్రవర్తికిగాని వ్యతిరేకంగా ఏ నేరం చెయ్యలేదు."
9 ఫేస్టాస్ యూదునాయకులను సంతోషపెట్టాలని కోరుకొని, పౌలును ఇలా అడిగాడు " నీవు యేరుశాలెం వెళ్లి, అక్కడ నా చేత విచారింబడుట నీకిష్టమేనా?" 10 పౌలు ఇలా జవాబిచ్చాడు "అలా వద్దు. చక్రవర్తి ప్రతినిధి అయిన మీముందు ఇప్పుడు నేనున్నాను. నేను విచారింపబడవలసిన స్థలం ఇదే. నేను యూదులకు ఏ హానీ చెయ్యలేదు, ఆ విషయం మీకు బాగా తెలుసు.
11 నేను మరణానికి తగినదేదైన చేసినట్లైతే, చావుకు కు వెనుకతియ్యను; అయితే అట్టి శిక్షకు తగినదేదీ వారి నిందలలోలేదు. కేవలం వారిని సంతోషపెట్టడానికి ఎవరూ నన్ను శిక్షించలేరు. నన్ను విచారించమని నేను చక్రవర్తికే విన్నవించుకుంటున్నాను." 12 అప్పుడు ఫేస్టాస్ తన సలహాదారులతో సమావేశమైన తర్వాత ఇట్లు చెప్పాడు "నువ్వు సీజర్ కు విన్నవించుకున్నావు కాబట్టి నువ్వు సీజర్ దగ్గరికే వెళ్తావు!."
13 చాలారోజుల తర్వాత హేరోదు అగ్రిప్పరాజు తన సోదరి బెర్నీకేతో కలిసి కైసరయ వచ్చాడు. వారు ఫేస్తు ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. 14 హేరోదు అగ్రిప్పరాజు బెర్నీకేతో కైసరయలో చాలారోజులు ఉన్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆయనతో ఫేస్తు, పౌలు గురించిచెప్పాడు. ఇలాచెప్పాడు,"ఫేలిక్సు జైల్లో పెట్టించిన పౌలనే వ్యక్తి ఇక్కడఉన్నాడు. 15 నేను యెరూషలేము వెళ్ళినపుడు అక్కడి ప్రధానయాజకులు,యూదా నాయకులు నన్ను కలిసి అతనికి మరణశిక్ష విధించాలని కోరారు. 16 కానీ,నిందించబడిన ఏ వ్యక్తికీ వెంటనే శిక్ష విధించడం రోమీయుల పద్దతి కాదని,అందుకు బదులుగా, అతడు,తనని నిందించువారియెదుట తనని తాను సమర్ధించుకొనే అవకాశం ఇస్తుందని వారితో చెప్పాను.
17 కాబట్టి ఆ యూదులు ఇక్కడికి (కైసరయ) వచ్చిన తర్వాత నేను విచారణ ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. వారు వచ్చిన తర్వాతి రోజు నేను న్యాయాధిపతి స్థానంలో కూర్చుని, ఖైదీని తీసుకురమ్మని కాపలావానిని ఆజ్ఞాపించాను. 18 కానీ,యూదా నాయకులు అతని నేరాలు చెప్పాక,వారు చెప్పినవేవీ తీవ్రమైనవిగా నాకు అన్పించలేదు. 19 అంతేగాక,వారు అతనితో వాదించిన విషయాలు వారి మతానికి సంబంధించినవి మరియు చనిపోయిన యేసు అనువ్యక్తి గురించే. అతడు తిరిగి బ్రతికాడని పౌలు అన్నాడు. 20 ఈ విషయాలు నాకు అర్ధం కాలేదు మరియు సత్యం ఎలా కనుక్కోవాలో తెలియలేదు. కాబట్టి పౌలుతో ఇలా అడిగాను 'యెరూషలేము వెళ్ళుటకు నీకిష్టమేనా?ఈ విషయాలను నేను అక్కడ విచారించాలనుకున్తున్నాను.'
21 కానీ, పౌలు సీజరే తన వ్యాజ్యాన్ని విచారించాలని కోరాడు, కాబట్టి అతనిని సీజర్ దగ్గరికి పంపడానికి జైల్లో ఉంచమని ఆజ్ఞాపించాను." 22 అప్పుడు అగ్రిప్ప "నా అంతట నేనే పౌలు చెప్పేది వినాలనుకుంటున్నాను" అన్నాడు. అప్పుడు ఫేస్టాస్ " రేపు మీరు అతడు చెప్పేది వినడానికి సిద్ధం చేశాను." అన్నాడు.
23 తర్వాత రోజు అగ్రిప్ప,బెర్నిస్ లు న్యాయమందిరంలోకి ప్రవేశించినప్పుడు చాలామంది వారిని గౌరవించారు. కొంతమంది రోమన్ సైన్యాధిపతులు, సీజరయలో ముఖ్యులు వారితో వచ్చారు. అప్పుడు ఫేస్టాస్ పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 24 పౌలు వచ్చినతర్వాత, ఫేస్టాస్ ఇలా చెప్పాడు " అగ్రిప్పరాజా,ఇక్కడున్న ఇతరులారా, ఈ మనిషిని చూసారా!యేరుసాలెంలోను,ఇక్కడ ఉన్నచాలామంది యూదునాయకులు ఇతని ఎంతమాత్రమూ బ్రతకనియ్యవద్దని నన్నుకోరారు.
25 కానీ, అతనిలో మరణానికి తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అంతేగాక,అతడు తన వ్యాజ్యాన్ని విచారించమని కైసరును కోరాడు. కాబట్టి అతడిని రోమ్ పంపించాలని నిర్ణయించాను. 26 అయితే ఇతడి గురించి చక్రవర్తికి ఏమి రాయాలో నాకు సరిగా తెలియలేదు. అందుకే మీ అందరిముందు,ముఖ్యంగా అగ్రిప్పరాజా మీముందు అతడు మాట్లాడాలని అతడిని రప్పించాను! మీరు అతడిని ప్రశ్నించాలని ఇలా చేశాను. అప్పుడు,ఇతడి గురించి కైసరుకు ఏమి వ్రాయాలో తెలుస్తుంది. 27 ఎందుకంటే రోమన్ చక్రవర్తి వద్దకు విచారణ కొరకు ఒక ఖైదీని పంపించేటప్పుడు,ప్రజలు అతనిమీద ఏ నేరం మోపారో స్పష్టంగా వ్రాయకుండా పంపించడం సరికాదు అన్పించింది."
Chapter 26
1అప్పుడు అగ్రిప్ప పౌలు తో ఈ విదముగా చెప్పెను నివు మాటలాడుటకు సమయము ఇచ్చెదము అయితే నీకొరకు నివే మాట్లాడవలెను .అప్పుడు పౌలు చేయి చాపి మాట్లాడసాగెను,అతడు ఇలాగు చెప్పెను అగ్రిప్ప రాజ నేను తలంచుచున్నాను ఈ రోజు మీకు వివరించగలను ఎందుకు యూదుల అధికారులు నా మీద చెడు చెస్తునాను అని చెప్పినప్పుడు వారు అబద్దికులుగా మరతున్నారో అంతే కాకుండా ముక్యముగా నేను తలంచుచున్నాను మీకు యూదుల ఆచారములు మరియు మేము ప్రస్నించబోవుచున్న సంగతలన్నియు తెలుసునని ,నేను మిమ్ములను సహనముతో వినమని వేడుకొనుచున్నాను
4 నేను నా బాల్యము నుండి నేను ఏ విధమైన ప్రవర్తనను కలిగియున్నానో నా తోటి యూదులందరికి తెలియును. నేను పుట్టిన పట్టణములోను తరువాత యెరూషలేములోను నేను ఏవిధముగా జివించితినో వారికి తెలుయును. 5 వారు నన్ను గూర్చి మొదటినుండి యెరిగియున్నారు, నేను బాలుడనైనది మొదలుకొని మా మతము యొక్క కఠినమైన ఆచారములకు ఎంత జాగ్రత్తగా విధేయత చుపించియున్నానో వారికి తెలియును . వారు చెప్పాలనుకుంటే ఈ విషయం వారు చెప్పగలరు. ఇతర పరిసయ్యుల వలెనే నేనునూ జీవించితిని.
6 మా పితరులతో దేవుడు ఏదైతే వాగ్దానము చేసెనో దానిని అయన నిశ్చయముగా నేరవేర్చబోవుచున్నాడని విశ్వసించు చున్నందుకు ఈ రోజు నేను శ్రమలో యున్నాను. 7 మా పన్నెండు గోత్రములు దేవుని ఘనపరుచుచు మరియు ఆరాదించుచు దేవుడు మాతో చేసిన వాగ్దానము కొరకు ఎదురుచుచు చుండిరి. ఘనత వహించిన రాజా, దేవుడు చేసిన వాగ్దానమును నేరవేరుస్తాడని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. వారు కూడా దానిని నమ్ముచున్నారు. దేవుడు చేస్తాడని దేనినైతే నేను నమ్ముచున్నానో దానికే వారు నేను తప్పు చేస్తున్నాను అని అంటున్నారు. కాని నేను దేవుడు చేయమని చెప్పిన పనిని చేయగా వారు దానిని తప్పుగా భావించుచున్నారు. 8 ఓ రాజా , దేవుడు నిజముగా చనిపోయిన వారిని తిరిగి లేపగలడని నీవు నమ్ముట లేదా?
9 నజరేతు పట్టణపు వాడైన యేసును ప్రజలు ఎవరూ నమ్మకుండునట్లు గతంలో నేను కూడా ప్రజలను ఆటంక పరిచాను. 10 కావున యేరుషలేములో ఉన్నప్పుడు నేను చేసిన పని అది. అక్కడి ప్రధాన యాజకులు నాకు అధికారము ఇచ్చినందున నేను అనేకమైన విశ్వాసులను చెరసాలలో బంధించితిని. వారి ప్రజలు విశ్వాసులను చంపినపుడు నేను వారికి నా సమ్మతి తెలిపితిని. 11 ప్రతి సమాజమందిరములో తరచుగా నేను అనేకులను శిక్షించితిని. యేసు ను గూర్చిన జ్ఞాపకాలను హేళన చేయులాగున అనేక సార్లు వారిని బలవంతము చేసితిని. నేను వారిపై ఎంత కోపము గలవాడినై, వారిని కనుగొనుటకు ఇతర పట్టణములకు కూడా వెళ్ళితిని.
12 ప్రధాన యాజకులు దమస్కు లో వున్న విశ్వాసులను బంధించుటకు నాకు అధికారము ఇచ్చెను, గనుక నేను అక్కడికిని వెళ్ళితిని. నేను నా మార్గమున ప్రయాణము చేయుచుండగా, 13 ఆ మార్గములో ఇంచుమించు మద్యాహ్న సమయములో ఆకాశములో ప్రకాశమైన వెలుగును చూచితిని. అది సూర్యని కంటే ప్రకాశముగా ఉండెను. ఆ వెలుగు నాకును మరియు నాతో ప్రయాణము చేయుచున్న వారి చుట్టును ప్రకాశించేను. 14 మేమందరమూ నేలపై పడితిమి. అప్పుడు నేను మా మాతృ భాషయైన హీబ్రూ భాషలో మాట్లాడుచున్న ఒకని స్వరము వింటిని. అతను - నన్ను " సౌలా సౌలా నన్ను నీవు ఎందుకు గాయపరచు చున్నావు? ఎద్దు తన కాపరి ముల్లుగర్రకు ఎదురు తన్నినంత కష్టమైనది.
15 అప్పుడు నేను " ప్రభువా, నీవు ఎవరు? " అని అడిగితిని. ఆయన - నన్ను " నేను నీవు గాయపరచుచున్న యేసును. 16 నీవు లేచి నీ పాదములపై నిలువుము! నీవు చూచిన వాటికిని, యెరిగిన వాటికిని, మరియు నేను నీకు తరువాత చూపింపబోవు వాటికిని నిన్ను సేవకునిగాను మరియు సాక్షి గాను చేయుటకై ఇప్పుడు నిన్ను నేను దర్శించుచున్నాను. " అని చెప్పెను. 17 నేను నిన్ను పంపబోవు ప్రజల నుండి మరియు యూదులు కానివారి నుండి కాపాడెదను, 18 ఎందుకనగా వారి కనులను తెరుచుటకును, చీకటిలో నుండి వెలుగునకు త్రిప్పుటకును, శత్రు శక్తి నుండి దేవుని వైపు త్రిప్పుటకును నేను నిన్ను పంపుచున్నాను. విశ్వాసము ద్వారా నాకు చెందిన నా ప్రజల పాపములను క్షమించెదను మరియు నా ప్రజలకు శాశ్వతంగా ఉండు వాటిని వారికిచ్చేదను.
19 " కావున రాజైన అగ్ర్రిప్ప, దేవుడు నాకు దర్శనములో చేయమని చెప్పిన వాటినే నేను చేసితిని. 20 మొదట నేను దమస్కులో ఉన్న యూదులకు, తరువాత యేరుషలేములో ఉన్న యూదులకు మరియు యుదులు కాని వారికిని ప్రకటించితిని. పాపము చేయుట మాని దేవుని సహాయము వేడుకొనవలెనని నేను వారితో చెప్పితిని. మరియు వారు తమ పాపములను చేయుట మానివేసితిమని తెలియ చేయు పనులను చేయమని కూడా చెప్పితిని. 21 ఈ విదముగా ప్రసంగించుట చేత కొందరు యూదులు నేను దేవాలయము యొక్క అవరణములో ఉండగా నన్ను బంధించి, చంప ప్రయత్నిoచిరి.
22 అయినప్పటికీ, దేవుడు నాకు సహాయము చేయుచునే ఉన్నాడు, కావున నేను నేటికినీ ఈ విషయములను ప్రచురం చేయుచున్నాను. 23 ప్రవక్తలు మరియు మోషే ఖచ్చితమగా జరుగునని తెలియ జేసిన సంగతులనే నేను సామాన్యులకేమి ప్రధానులకేమి ప్రతిఒక్కరికి బోదించుచున్నాను. వారు క్రీస్తు శ్రమపడి, మరణించునని, మరియు మొదటిగా మరణము నుంచి ఆయనే తిరిగి లేచునని తెలియజేసిరి. మరియు వారు దేవుడు తన స్వంత ప్రజలను అలాగే యూదులు కాని వారిని రక్షించునని కూడా తెలియజేసిరి.
24 పౌలు ఇంకను మాటలడుచుండగా ఫేస్తు - '' పౌలా నీవు పిచ్చివాడవు ! నీవు ఎక్కువగా చదువుకొనుట వలన, ఆ చదువు నిన్ను వెఱ్రివానిగా చేసినది! " అనెను. 25 అప్పుడు పౌలు జవాబిస్తూ ,'' గొప్ప వాడివైన ఫేస్తూ, నేను వెఱ్రివాడను కాను! కాని, నేను చెప్పునది వాస్తవము, మరియు మంచి బుద్ధి గలిగిన మాటలనే చెప్పుచున్నాను! 26 నేను వేటిని గూర్చి మాట్లాడుచున్నానో అవి రాజైన అగ్రిప్పకు తెలియును. మరియు నేను వాటిని గూర్చి ధారాళముగా మాట్లాడగలను. వీటిలో ఎవియూ రహస్యముగా జరుగలేదు గనుక వీటిలో ఏదియు అతనికి తెలియకుండలేదని నేను ఎరుగుదును.
27 " రాజైన అగ్రిప్ప, ప్రవక్తలు వ్రాసిన వాటిని నీవు నమ్ముచున్నావా? అవి నీవు నమ్ముచున్నావని నాకు తెలియును ". 28 అప్పుడు అగ్రిప్ప పౌలునకు సమాధానమిస్తూ, " అతి తక్కువ సమయంలోనే నన్ను క్రైస్తవునిగా చేయుటకు నన్ను ప్రేరేపించితివి ". 29 పౌలు సమాధానమిస్తూ " తక్కువ సమయమా లేదా ఎక్కువ సమయమా అనేది ముఖ్యం కాదు. గాని, ఈ బంధకములు తప్ప నీవును, మరియు ఇక్కడ ఈ మాటలు వినుచున్నవారందరును నావలె మారవలెనని దేవునిని ప్రార్దించుచున్నాను.
30 అప్పుడు రాజు లేచి నిలువబడెను. బెర్నీకేయు అధిపతియు అందరు లేచి నిలవబడి ఆ గది నుండి వెళ్ళిపోయిరి. 31 వారు వెళ్లి, ఒకరితో ఒకరు - " ఇతనిని మరణమునకు గాని, లేక బంధించుటకు గాని తగిన కార్యమేమియు చేయలేదు" అని చెప్పుకొనిరి. 32 అగ్రిప్ప ఫేస్తుతో " చక్రవర్తి తనకు తీర్పు చెప్పాలని ఈ మనిషి (పౌలు) కోరుకోనక ఉండినట్లయితే, అతనిని విడుదల చేసియుండేవారము" అనెను.
Chapter 27
1 ఓడ లో ఇటలీ వెళ్లుటకు పరిపాలనాధికారి నిర్ణయించెను, పౌలును మరికొంత మంది ఖైదీ లను యూలి అను శాతాదిపతికి అప్పగించెను. అతను ఔగుస్తు పటాలమునకు శతాధిపతిగా ఉన్నాడు. 2 వారు ఆసియా లో ఉన్న అధ్రముత్తియ వెళ్ళు ఓడలో వెళ్లుట కు బయలుదేరితిమి, ఆ ఓడ ఆసియా మీదుగా సముద్ర మార్గమున ప్రయాణిoచెను. మాసిదోనియ లో నున్న థెస్సలోనికయ పట్టణస్తుడయిన అరిస్తార్కు కూడా మాతో వచ్చెను.
3 తరువాతి రోజున మేము సీదోనుకు చేరితిమి. యూలి పౌలు యందు కనికరము గల వాడుగా యున్నందున అతని స్నేహితులను పరామర్శించుటకు పౌలునకు అవకాశము కల్పించెను. 4 మేము అక్కడ నుండి బయలు దేరినప్పుడు ఎదురు గాలి వీస్తున్నందున కుప్ర మీదుగా ప్రయాణించితిమి. 5 తరువాత మేము కిలికియ మరియు పంపులియ వద్ద సముద్రము ను దాటి లుకియ లో నున్న మూర కు చేరితిమి. 6 మూర లో యూలి మమ్ములను ఇటలీ వెళ్ళు అలెక్సేంద్రియ పట్టణపు ఓడలో ఎక్కించెను.
7 మేము అనేక దినములు నెమ్మదిగా ప్రయాణించి క్నీదుకు వచ్చి నప్పుడు ఎదురు గాలి వీచి మమ్ములను ముందుకు వెళ్ళనియ్య లేదు. తరువాత గాలి మరింత బలముగా వీస్తునందున ఓడను పశ్చిమ వైపునకు తిన్నగా పోనియ్యనందున, మేము క్రేతు అను ద్వీపము వెంబడి సల్మోనే మార్గము లో నడిపించితిమి. 8 అయినప్పటికీ గాలి మరింత బలముగా వీస్తున్నందున ఓడను వేగముగా నడుపుటకు వీలు కలుగలేదు. అయితే నెమ్మదిగా ప్రయాణించి క్రేతు మరియు లసైయ అను పట్టణము దగ్గర నున్న మంచి రేవులు వద్దకు చేరితిమి.
9 కొంత కాలము తరువాత, యూదుల ఉపవాసదినము ఆప్పటికి గతించినది. సముద్రము మీద తుఫాను అదికమగుట చేతను ప్రయాణము చేయుట ప్రమాదకరమని పౌలు ఓడ లో ఉన్న వారితో చెప్పెను. 10 పౌలు ఓడలో ఉన్న వారితో చెప్పుచు - అయ్యా మనము ఇప్పుడు ప్రయాణము చేసిన యెడల మన సరుకులకును, ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా నష్టము కలుగునని చెప్పెను. 11 అయితే రోమ శతాధిపతి పౌలు చెప్పిన మాటలను నమ్మలేదు. కాని ఓడ యజమాని మరియు నావికుడును చెప్పినది నమ్మెను.
12 చలి కాలములో ఆ రేవు అనుకూలము కాదని సముద్రములో ముందు నున్న ఫీనిక్స్ కు వెళ్ళి అక్కడ చలి కాలమంతయు గడపడము మంచిదని అనేకమంది ప్రయాణికులు సలహా ఇచ్చిరి. ఫీనిక్స్ క్రేతు పట్టణము లోనిది. మేము నైరుతి మరియు ఈశాన్య దిక్కులనుండి వచ్చు గాలి చేత కొట్టబడి యున్నాము. 13 దక్షిణ వైపు నుండి గాలి నెమ్మదిగా వీస్తున్నందున, వారి ఆలోచన ప్రకారము ప్రయాణమునకు అనుకూలత ఉన్నందున లంగరును ఎత్తి క్రేతు ద్వీపము వైపునకు వారి ప్రయాణము సాగినది.
14 కొంత సేపు అయిన తరువాత పెనుగాలి క్రింద నుండి వచ్చి ద్వీపమును దాటి దక్షిణము వైపున ఓడను కొట్టెను.ఆ పెను గాలి పేరు ఊరకులొను. 15 యెదురు గాలి వలన ప్రయాణము చేయలేకపోయాము, ప్రయాణికులు అందరు గాలి వీస్తున్న వైపునకు కొట్టుకొని పోయితిమి. 16 తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపము వెంబడి ఓడ ను నడుపుతూ కాపాడుకొనుట చాలా కష్టమయినది.
17 తరువాత ప్రయాణికులు లంగరు వేయడమే కాకుండా త్రాళ్ళ తో ఓడను కదలకుండా బలముగా కట్టిరి. ప్రయాణికులు సూర్తిసు అను ఇసుక దిబ్బ మీద పడుదుమేమో అనుకున్నారు. లంగరును మరింత లోతునకు దించినప్పటికీ గాలి వీస్తున్న వైపునకు కొట్టుకొని పోయాము. 18 గాలి మరియు అలలు ఇంకను కొనసాగుతు ఓడను బలముగా కొట్టినందున, మరుసటి రోజు ప్రయాణికులు ఓడ లో ఉన్న సరుకులను పారవేసిరి.
19 తుఫాను మూడోరోజున ప్రయాణికులు ఓడను తేలిక పరచుటకు తమ చేతులతో ఓడ సామాగ్రిని పారవేసిరి. 20 చాల రోజులు గాలి బలముగా వీస్తూ, మరియు మబ్బులు పట్టి ఆకాశము అంతయు అంధకారముతో నిండిఉండుట వలన సూర్యుడును, నక్షత్రములును మేము చూడలేక పోయాము. మేము బ్రతుకుతామన్న ఆశను కోల్పోయాము.
21 మేము అందరమూ ఓడలో చాల రోజులు ఆహారము లేకుండా గడిపితిమి. పౌలు మా యెదుట నిలబడి - స్నేహితులారా నేను చెప్పిన మాట విని క్రేతులోనే ఉన్నట్లయుతే ఈ హాని కలిగేది కాదు. 22 అయితే ఇప్పుడైనా ధైర్యముగా ఉండుడి. మీ ప్రాణముకైనను, ఓడ కైనను హాని కలుగదు.
23 ఇది నాకు తెలుసు, నేను ఎవరి వాడినో, ఎవరిని సేవించుచున్నానో అ దేవుని దూత గత రాత్రి నా యెదుట నిలిచి ఉన్నది. 24 ఆ దూత ఈలాగు చెప్పెను- పౌలా భయపడకుము, నీవు తప్పనిసరిగా రోమ చక్రవర్తి ముందు నిలబడెదవు. అక్కడ నీకు తీర్పు తీర్చును, నీతో పాటు ఓడలో ప్రయాణము చేయుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడు. 25 కాబట్టి ధైర్యము తెచ్చుకొనుడి, దూత నాతో చెప్పిన ప్రకారము జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 26 ఏది ఏమైనా మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము పడతాము.
27 పద్నాల్గవ రోజు రాత్రి సమయములో ఆద్రియ సముద్రములో కొట్టుకొని పోవుచున్నాము. అర్ధ రాత్రి సమయములో ఓడ లో ప్రయాణం చేస్తున్నవారు భూమికి దగ్గర ఉన్నట్లు గుర్తించిరి. 28 అక్కడ తాడును లోపలికి వేసి కొలవగా నీరు నలబై మీటర్లు లోతు ఉండెను. మరి కొంత దూరం పోయి కొలత వేయగా ముపై మీటర్లు లోతు ఉండెను. 29 వారు రాళ్ళ పై పడుదుమేమోనని భయపడి నాలుగు లంగర్లను వేసి బిగించెను. ఓడ క్షేమముగా వెళ్ళ వలెనని ప్రార్ధించెను.
30 కొంత మంది ఓడ వారు ఓడను విడిచి పారిపోవుటకు ప్రయత్నము చేస్తూ లంగరును క్రిందికి దింపుతున్నట్లుగా చేసి పడవను సముద్రములోనికి దింపిరి. 31 కానీ పౌలు - మీరు ఓడలో ఉంటేనే గాని తప్పించు కొ లేరని సైనికులతోను, శతాధిపతి తోను చెప్పెను. 32 వెంటనే సైనికులు పడవకు ఉన్న త్రాళ్ళ ను కోసి పడవను సముద్రములో కొట్టుకు పోనిచ్చిరి.
33 కొద్దిగా తెల్లవారు చుండగా పౌలు ఏదైనా ఆహారము తినమని వారిని బ్రతిమాలుకొనెను. గత పద్నాలుగు రోజులుగా ఏమియు తినకుండా యెదురు చూచుచున్నారు. 34 ఇప్పుడైనా ఏదైనా ఆహారము తీసుకోమని మిమ్ములను బ్రతిమలాడుతున్నాను. ఇది మీ ప్రాణములను రక్షించుటకు ఉపయోగపడును. మీలో ఎవని తల వెంట్రుక అయినను నశించదు అనెను. 35 తరువాత పౌలు అందరు చూస్తుండగా ఒక రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తినెను.
36 అప్పుడ౦దరు ధైర్యము తెచ్చు కొని ఆహారము పుచ్చుకొనిరి. 37 ఓడలో మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము. 38 అందరు తినిన తరువాత,ఓడను తేలిక చేయుటకు గోధుమలను సముద్రములో పడ వేసిరి.
39 తెల్లవారినప్పుడు అది యే ప్రాంతమో వారు గుర్తుపట్ట లేకపోయిరి. కాని సముద్రపు ఒడ్డున ఒక కాలువలోనికి ఓడను పోనిచ్చుటకు అలోచించిరి. 40 లంగరులను, త్రాళ్ళ ను సముద్రములోనికి విడిచి పెట్టిరి. అదే సమయములో వేగముగా తెర చాపలను పైకి ఎత్తిరి. 41 ఓడ నావికుడు కంగారు పడి ఇసుకలోనికి నడిపించెను. ఓడ ముందు భాగము ఇరుక్కుపోయి ముందుకు కదలలేక పోయెను. ఓడ వెనుక భాగమును పెద్ద అలలు కొట్ట బడుచుండగా ఓడ బ్రద్ధలవసాగెను.
42 ఖైదీలలో యే ఒక్కరు ఈదుకొని పారిపోకుండా వారిని చంపవలెనని సైనికులు ఆలోచనకలిగి ఉండిరి. 43 శతాధిపతి పౌలును కాపాడ ఉద్దేశించి సైనికులు ఎవరిని చంపకుండా అతడు ఆపివేసెను. 44 అందును బట్టి ప్రతి వారు దూకి ఈదుకొని, ఓడ చెక్కలు బల్లలు పట్టుకొని ఒడ్డుకు చేర వలసినదిగా అతడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపించెను. అతను చెప్పిన రీతిగా మేమందరమూ క్షేమముగా ఒడ్డుకు చేరితిమి.
Chapter 28
1 మేము ఒడ్డుకు చేరిన తరువాత అది మాల్టా దీవి అని మేము తెలిసుకొoటిమి. 2 అక్కడ నివసించే ప్రజలు మాకు మంచి ఆతిధ్యం ఇచ్చిరి , వర్షం కురిసినందువలన చల్లగా ఉండుటను బట్టి వారు మంట వేసి మమ్మును పిలిచిరి .
3 పౌలు కొన్ని పుల్లలు ఏరి మంటలో వేయగా ,విషకరమైన పాము ఒకటి మంట వేడినుండి తప్పించుకొనుటకు బయటికి వచ్చి పౌలు చేతి మీద కరిచెను. 4 పౌలు చేతి నుండి రక్తం కారుట ఆ దీవీలో నివసించే ప్రజలు చూసి ,అతడు ఎవరినో చంపి ఉంటాడనుకోనిరి. అతడు సముద్రములోపడి తప్పించుకోనిననూ న్యాయముగల దేవుడు అతనిని వదలలేదు అని ఒకరితో ఒకరు అనుకోనిరి .
5 కానీ పౌలు తన చేతిని దులపగా ఆ పాముని మంటలో పడెను అతనికి ఏ ప్రమాదం జరగలేదు. 6 కొంత సేపటికి పౌలు జ్వరముతో తన శరీరం ఉబ్భి క్రింద పడి హటాత్తుగా చనిపోతాడని వారు ఉహించుకొంటిరి. అలా జరగనందున వారు వారి అలోచనను మార్చుకొని "అతను నరహంతకుడు కాదు! కానీ దేవుడు అనిరి!".
7 వారు ఉన్న చోటికి దగ్గరిలో, దీవికి ముఖ్యాధిపతి అయిన పొబ్లెదికి కొంత పోలముండెను. అతడు మమ్ములను తన ఇంటికి ఆహ్వానించి ఉండమని కోరెను . మూడు రోజులు మమ్ము చాల చక్కగా చూసేను . 8 ఆ సమయంలో పోభ్లె తండ్రి జోరము వీరోచానలుతో మంచము మీద పడియుండెను.కాబట్టి పౌలు అతని తోద్ధకు వెళ్ళి అతని కొరకు ప్రార్ధించెను . 9 పౌలు చేయీ అతని మీద ఉంచాగా అతడిని స్వస్థపరచబడెను . పౌలు అది చేసిన తరువాత ,ఆ దీవీలో అనారోగ్యంతోఉన్న మరి కొందరు మాదగ్గరకు వచ్చెను .పౌలు వారిని స్వస్థపరిహేను . 10 వారు మాకొరకు భహుమతులు తెచ్చ ఇచ్చి వారి గౌరవమును తెలిపిరి .మూడు నెలలు తరవాత మేమూ బయలు దేరుచుండగా వారు మాకు భహుమతులు ,ఓడలో మాకవసరమైన భోజనపదార్థములు తెచ్చి ఇచ్చిరి .
11 మేమూ మూడు నెలలు అక్కడ ఉండిన తరవాత, అలేక్సoడ్రియనుండి ఇటలి వెళ్లు ఓడ ఎక్కగా అది బయలు దేరెను . ఆ ఓడ ముందు భాగాన అశ్సిని, పోల్లుక్స్ అను కవల దేవతలు బొమ్మలు చెక్కి ఉండెను. 12 మేము సూరకుసైని చేరుకొని అక్కడ మూడు రోజులుoటిమి.
13 అప్పుడు మేము బయలుదేరి ఇటలీ లోని రేగియుకి చేరుకుంటిమి. మరుసటి రోజున గాలి దక్షిణ వైపునుండి వీచినందున రెండు రోజులలో పోతియొలికు చేరుకొంటిమి.అక్కడ ఓడను విడిచిపెట్టి . 14 పోతియొలిలో కొందరు విశ్వాసులను కలిసికోన్నాము. వారు మమ్ములను ఏడు రోజులు వారితో ఉండమని అడిగిరి. ఆ తరవాత చివరిగా రోమా చేరుకుంటిమి . 15 రోమా లో కొందరు విశ్వాసులు మాకోసం విని మమ్ములను కలవడానికి వచ్చిరి . కొందరు అప్పియా సంత వద్ద కలిసిరి, మరి కొందరు త్రిసత్రము వద్ద కలిసిరి . పౌలు ఆ విశ్వాసులును చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రోత్సహిoచబడెను .
16 మేము రోమాకు చేరుకొనిన తరువాత పౌలు ఒక ఇంటిలో నివసించుటకు అనుమతిoచబడెను. కానీ సైనికులు ఆయనకు కాపాలాగా ఉండిరి. 17 మూడు రోజులైన తరువాత పౌలు యూదుల నాయకులను తన వద్ధకు వచ్చి మాటలాడమని కబురు పంపెను. వారు అతని వద్దకు వచ్చినప్పుడు పౌలు వారితో ఈలాగు చెప్పెను, "నా ప్రియ సహోదరులారా, నేను మన ప్రజలను వ్యతిరేకించకపోయినను, మనపితరుల సంప్రదాయానికి వ్యతిరేకముగా మాట్లాడకపోయినను, యెరూషలేములో మన నాయకులు నన్ను బంధించిరి. కానీ వారు నన్ను చంపకముందు, ఒక రోమా సైన్యాధికారి నన్ను అక్కడ నుండి తప్పించి తరువాత రోమా అధికారులు నన్ను విచారణ చేయు నిమిత్తము కైసరయ పట్టణానికి పంపెను. 18 రోమా అధికారులు నన్ను ప్రశ్నించి, వారు నన్ను శిక్షించుటకు నేను ఏ తప్పును చేయలేదని తెలుసుకొని నన్ను విడిచిపెట్టాలని తలంచిరి.
19 కానీ అక్కడ ఉన్నటువంటి యూదా నాయకులు నన్ను విడిచిపెట్టాలని ఆశించిన రోమా అధికారులకు వ్యతిరేకముగా మాటలాడిరి గనుక రోమా చక్రవర్తి నాకు న్యాయము తీర్చాలని నేను వారిని వేడుకొంటిని. ఏవిషయంలోనూ మన నాయకులను నిందించాలని ఏమాత్రము నేను ఈవిధముగా చేయుటలేదు. 20 కాబట్టి నేను ఎందుకు చెరసాలలో ఉండవలసి వచ్చినదో మీకు తెలియజేయుటకు మిమ్మును ఇక్కడకు రమ్మని వేడుకొoటిని. దేవుడు మన కొరకు ఏమి చేయునో అని ఇశ్రాయేలు ప్రజలు నమ్మకముగా ఎదురుచూచుచున్నారో దానిని నేనును నమ్మినందువలన ఈ విధముగా చేయుచున్నాను.
21 అందుకు యూదా నాయకులు ఇట్లనెను ," యూదాలో ఉన్న మా తోటి యూదులధగ్గరనుండి నిన్నుగూర్చి ఎలాంటి పత్రిక మాకు అందలేదు, అంతేకాదు యూదా నుండి వచ్చిన ఏ యూధుడును నిన్నుగూర్చి ఏ మాత్రం తప్పుగా చెప్పలేదు. 22 కానీ, మీ గుంపును గురించి నీవు ఏమనికొనుచున్నావో మాకు వినాలని ఉన్నది, ఎందుకనగా అనేక చోట్ల ప్రజలు మీ గుంపును గురించి వ్యతిరేకముగా మాట్లాడుకొనుట మాకు తెలిసినది."
23 కావున వారు మరియొక రోజున వచ్చి పౌలు ఏమి మాట్లాడునో వినాలని నిర్ణయిoచుకొనిరి. ఆ రోజు వచ్చినప్పుడు మునుపటికంటే ఎక్కువమంది ప్రజలు పౌలు ఉన్నచోటికి వచ్చిరి. దేవుడు ప్రతి ఒక్కరిని ఎలా పరిపాలించునో పౌలు వారికి చెప్పెను; అప్పుడు పౌలు, మోషే ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తలును యేసును గూర్చి ఏమి చెప్పిరో వారికి చెప్పెను. ఉదయo నుండి సాయంకాలం వరకు వినినవారు అందరితో పౌలు మాటలాడెను. 24 యేసుని గూర్చి పౌలు చెప్పినది నిజమని కొందరు యూదులు నమ్మిరి మరి కొందరు నమ్మలేదు.
25 వారు ఒకరితో ఒకరు అంగీకరించక, మరియు వెళ్ళిపోవుటకు సిద్ధమగుచుండగా పౌలు వారితో మరియొక సంగతి చెప్పవలసి ఉన్నది అనెను, పరిశుద్ధాత్ముడు ప్రవక్తయైన యెషయాతో మాటలాడినప్పుడు మీ పితరులను గూర్చి సత్యమును తెలిపెను: 26 నీవు నీ ప్రజలవద్దకు వెళ్ళి వారికి ఈలాగు చెప్పుము: 'నీవు నీ చెవులతో విందువు, గానీ దేవుడు ఏమి చెప్పుచున్నాడో నీకు ఎన్నటికిని అర్ధము కాదు. నీవు నీ కన్నులతో చూచుదువు గానీ నిజముగా దేవుడు చేయుచున్న కార్యములు ఎన్నటికిని చూడలేవు.
27 వారు మొండివారైనందున వారు అర్ధము చేసుకొనరు. వారి చెవులు దాదాపుగా చెవిటివాయెను; మరియు వారికి చూచుటకు ఇష్టము లేనందున వారు కండ్లు మూసుకొనిరి. వారి హృదయములతో అర్ధము చేసుకొనుటకు కానీ మరియు వారి చెవులతో వినుటకు కానీ వారు ఇష్టపడరు, అయినను వారు నా యొద్దకు వత్తురు మరియు నేను వారిని స్వస్థపరతును.
28 అందువలన, యూదులు కాని వారికి దేవుడు రక్షణ ఇచ్చునని మీరు తెలుసుకొనుడి. 29 మరియు వారు దేవుని మాట విందురు.
30 పౌలు పూర్తిగా రెండుసంవత్సరములు అద్దె ఇంటిలో ఉండెను. అనేకులు పౌలును చూచుటకు వచ్చిరి, మరియు పౌలు వారిని ప్రేమతో పలకరించి, వారితో మాటలాడెను. 31 దేవుడు తనను తాను రాజుగా ఎలాగు కనపరచుకొనునో తెలుపుచూ, మరియు ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి పౌలు వారికి ప్రకటిoచెను. అతడు బహు ధైర్యముతో భోదిoచుట వలన అతనిని ఎవరును ఆపుటకు ప్రయత్నించలేదు.