తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

రూతు

Chapter 1

1 ఇప్పుడు న్యాయాధిపతుల యొక్క పాలన యొక్క దినములలో ఇది జరిగింది, దేశంలో ఒక కరువు కలిగింది. మరియు ఒక మనుష్యుడు యూదా యొక్క బేత్లెహేము నుండి మోయాబు యొక్క పొలములలో నివసించడానికి వెళ్ళాడు, అతడు మరియు తన భార్య, మరియు అతని ఇద్దరు కుమారులు. 2 మరియు ఆ మనిషి యొక్క పేరు ఎలీమెలెకు, మరియు అతని భార్య యొక్క పేరు నయోమి. మరియు అతని యొక్క ఇద్దరు కుమారుల పేరులు మహ్లోను, మరియు కిల్యోను. వారు అందరు యూదా యొక్క బేత్లెహేము నుండి ఎఫ్రాతీయులు. కాబట్టి వారు మోయాబు యొక్క పొలాలకు ప్రయాణం చేసారు మరియు అక్కడ నివసించారు.

3 తరువాత నయోమి యొక్క భర్త ఎలీమెలెకు చనిపోయాడు. మరియు ఆమె మరియు ఆమె ఇద్దరు కుమారులు మిగిలిపోయారు. 4 మరియు తమ కోసం మోయాబు యొక్క స్త్రీల నుండి భార్యలను తీసుకొన్నారు; మొదటి స్త్రీ యొక్క పేరు ఓర్పా, మరియు రెండవ స్త్రీ యొక్క పేరు రూతు. మరియు వారు అక్కడ దాదాపు పది సంవత్సరాలు నివసించారు. 5 మరియు వారు ఇద్దరు, మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. మరియు ఆ స్త్రీ తన ఇద్దరు కుమారులు లేదా తన భర్త లేకుండా మిగిలిపోయింది.

6 అప్పుడు ఆమె మరియు ఆమె కోడళ్ళు మోయాబు యొక్క ప్రాంతముల నుండి తిరిగి వెళ్ళడానికి లేచారు, ఎందుకంటే ఆమె యెహోవా తన ప్రజలను దర్శించాడు, వారికి రొట్టెను ఇస్తున్నాడు అని మోయాబు యొక్క ఒక ప్రాంతములో విన్నది. 7 కాబట్టి ఆమె ఎక్కడ నివసిస్తూ ఉన్నదో ఆ స్థలం నుండి బయటికి వెళ్ళింది, మరియు ఆమె ఇద్దరు కోడళ్ళు ఆమెతో ఉన్నారు. మరియు వారు యూదా యొక్క భూమికి తిరిగి రావడానికి మార్గంలో ప్రయాణించారు. 8 అప్పుడు నయోమి తన ఇద్దరు కోడళ్ళకి చెప్పింది, “ప్రతీ స్త్రీ తన తల్లి యొక్క ఇంటికి తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారితో మరియు నాతో మీరు చేసిన విధంగా యెహోవా నిబంధన విశ్వాస్యతలో మీతో జరిగించును గాక. 9 మీలో ప్రతి స్త్రీ తన భర్త యొక్క ఇంటిలో విశ్రాంతిని కనుగొనేలా యెహోవా మీకు దయచేయును గాక.” అప్పుడు ఆమె వారిని ముద్దు పెట్టుకుంది, మరియు వారు వారి స్వరాలను పైకి ఎత్తారు మరియు ఏడ్చారు.

10 అయితే వారు ఆమెకు చెప్పారు, "బదులుగా మేము నీతో నీ ప్రజల వద్దకు తిరిగి వస్తాము." 11 అయితే నయోమి చెప్పింది, “వెనుకకు తిరగండి, నా కుమార్తెలారా, మీరు నాతో ఎందుకు వస్తారు? మీ కోసం వారు భర్తలు కావడానికి అని నా కడుపులో నేను ఇంకా కుమారులను కలిగియున్నానా? 12 వెనుకకు తిరగండి నా కుమార్తెలారా, వెళ్ళండి. ఎందుకంటే నేను ఒక భర్తకు చెందియుండడానికి చాలా పెద్దదానిని. నేను నిరీక్షణ కలిగి యున్నానని చెప్పిన యెడల మరియు ఈ రాత్రి నేను ఒక భర్తకు చెందియున్న యెడల సహితం, మరియు సహితం నేను కుమారులకు జన్మ ఇచ్చిన యెడల, 13 కాబట్టి వారు పెద్దవాళ్ళు అయ్యే సమయం వచ్చే వరకు మీరు ఎదురుచూస్తారా? ఈ కారణం కోసం భర్తకు చెందియుండడం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకొంటారా? వద్దు, నా కుమార్తెలారా! ఎందుకంటే ఇది మీ విషయం కంటే నాకు అధికమైన చేదుగా ఉంది. ఎందుకంటే యెహోవా యొక్క చెయ్యి నాకు వ్యతిరేకం అయ్యింది. 14 అప్పుడు వారు వారి స్వరాలను పైకి ఎత్తారు మరియు మరల ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, అయితే రూతు ఆమెకు అంటి పెట్టుకుంది.

15 అప్పుడు ఆమె చెప్పింది, "చూడు, నీ తోడికోడలు తన ప్రజల వద్దకు, మరియు ఆమె దేవుళ్ళ వద్దకు తిరిగింది. నీ తోడికోడలి వెనుక తిరిగి వెళ్ళు.” 16 అయితే రూతు చెప్పింది, "నిన్ను విడిచిపెట్టడానికి లేదా నిన్ను అనుసరించడం నుండి వెనుకకు తిరగడానికి నన్ను ఒత్తిడి చెయ్య వద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ స్థలానికి నేను వస్తాను, మరియు నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను ఆ స్థలంలో ఉంటాను. నీ ప్రజలు నా ప్రజలై ఉంటారు, మరియు నీ దేవుడు నా దేవుడై ఉంటాడు. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో ఆ స్థలంలో, నేను చనిపోతాను, మరియు అక్కడ నేను పాతిపెట్టబడతాను. యెహోవా నాకు ఈ విధంగా చేస్తాడు గాక, మరణం నాకు మరియు నీకు మధ్య యెడబాటు చేసిన యెడల ఆయన ఈవిధంగా జతచేయును గాక."

18 అప్పుడు ఆమె తనతో రావడానికి నిశ్చయించుకున్నదని ఆమె చూసింది, మరియు ఆమెతో మాట్లాడటం మానుకుంది. 19 కాబట్టి వారు ఇద్దరు బేత్లెహేముకు వచ్చు వరకు ప్రయాణించారు. మరియు వారు బేత్లెహేముకు వచ్చిన వెంటనే ఇది జరిగింది, పట్టణం అంతా వారి విషయంలో చాలా ఉత్సహించారు. మరియు స్త్రీలు అన్నారు, "ఈమె నయోమి కదా?”

20 అయితే ఆమె వారికి చెప్పింది, "నన్ను నయోమి అని పిలవ వద్దు. నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నాకు అధికమైన వేదనను కలిగించాడు. 21 నా మట్టుకైతే, సమృద్ధిగా బయటికి వెళ్లాను, అయితే యెహోవా నన్ను ఖాళీగా తిరిగి తీసుకువచ్చాడు. నన్ను నయోమి అని మీరు ఎందుకు పిలుస్తారు? అయితే యెహోవా, ఆయన నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు, మరియు సర్వశక్తిమంతుడు నాకు కీడు కలుగజేశాడు. 22 కాబట్టి నయోమి ఆమె కోడలు మోయాబీయురాలైన స్త్రీ రూతుతో, మోయాబు యొక్క పొలాలనుండి తిరిగి వచ్చిన ఆ స్త్రీ, ఆమెతో, తిరిగి వచ్చింది. మరియు వారు యవల యొక్క పంటకోత యొక్క ఆరంభంలో బేత్లెహేముకు వచ్చారు.

Chapter 2

1 ఇప్పుడు నయోమికి తన భర్త యొక్క బంధువు ఉన్నాడు, ఎలీమెలెకు యొక్క వంశం నుండి గొప్ప సంపద గల మనిషి. మరియు అతని పేరు బోయజు. 2 మరియు రూతు, మోయాబీయురాలైన స్త్రీ, నయోమితో చెప్పింది, "దయచేసి, నేను పొలమునకు వెళ్ళడానికి కోరుతున్నాను మరియు ఎవని కళ్ళల్లో నేను దయను కనుగొను వాని వెనుక ధాన్యం యొక్క వెన్నులు ఏరుకొంటాను." మరియు ఆమె ఆమెతో చెప్పింది, "నా కుమారి వెళ్ళు."

3 కాబట్టి ఆమె వెళ్ళింది మరియు కోయువారి వెనుక పొలంలో ఏరుకోడానికి వెళ్ళింది. మరియు అనుకోకుండా, ఆమె బోయజుకు చెందిన పొలం యొక్క భాగానికి వచ్చింది, అతడు ఎలీమెలెకు వంశం నుండి వచ్చినవాడు 4 అప్పుడు ఇదిగో బోయజు బేత్లెహేము నుండి వస్తున్నాడు! మరియు అతడు కోయువారితో చెప్పాడు, "యెహోవా మీతో ఉంటాడు." మరియు వారు అతనితో చెప్పారు, “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక.”

5 అప్పుడు బోయజు కోయువారి మీద నియమించబడిన వాడు అయిన తన సేవకునితో చెప్పాడు, "యవనురాలైన ఈ స్త్రీ ఎవరికీ చెందినది?" 6 అప్పుడు కోయువారి మీద నియమించబడిన సేవకుడు జవాబిచ్చాడు మరియు చెప్పాడు, “ఆమె మోయాబు యొక్క దేశం నుండి నయోమితో తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ఒక యవనురాలైన స్త్రీ. 7 మరియు ఆమె చెప్పింది, ‘దయచేసి నన్ను ఏరుకోవడం మరియు నేను కోయువారి తరువాత ధాన్యం యొక్క పనల మద్య పోగుచేసుకోవడం చెయ్యనివ్వండి. మరియు ఆమె వచ్చింది మరియు అప్పటి నుండి కొనసాగించింది, ఉదయకాలంలో, ఇప్పటి వరకు. కొంచెం సేపు ఇంటిలో ఇది ఆమె విశ్రాంతి."

8 అప్పుడు బోయజు రూతుతో చెప్పాడు, “నా కుమారి, నీవు నా మాట వినవా? మరొక పొలంలో ఏరుకోడానికి వెళ్ళ వద్దు, మరియు ఇక్కడ నుండి కూడా వెళ్ళ వద్దు. అయితే ఇది చెయ్యి: యవనులైన స్త్రీ పనివారికి దగ్గరగా అంటియుండు. 9 నీ కళ్ళను పొలం మీద ఉంచు, అక్కడ వారు పంటకోస్తున్నారు మరియు వారి వెనుక అనుసరించు. నిన్ను తాకకుండా ఉండాలని యవన పురుషులను నేను ఆదేశించ లేదా? మరియు నీకు దాహంగా ఉన్నప్పుడు, నీటికుండల దగ్గరికి వెళ్ళు మరియు యువకులైన పురుషులు చేదిన దానిలో నుండి తాగు.”

10 అప్పుడు ఆమె ముఖం మీద పడింది మరియు నేలకు కిందకు వంగింది మరియు అతనితో చెప్పింది, "నేను పరదేశీయురాలు అయినప్పటికి, నా మీద శ్రద్ధ చూపించడానికి నీ కళ్ళల్లో ఎందుకు నేను దయను కొనుగొన్నాను? . 11 అప్పుడు బోయజు జవాబిచ్చాడు మరియు ఆమెతో చెప్పాడు, "నీ భర్త యొక్క మరణం తరువాత నీ అత్తతో నీవు చేసినది అంతా పూర్తిగా నాకు నివేదించబడింది. నువ్వు నీ తండ్రిని మరియు నీ తల్లిని మరియు నీవు జన్మించిన దేశాన్ని విడిచిపెట్టావు, మరియు నిన్నటికి ముందు రోజు నీకు తెలియని ప్రజలైన వారి వద్దకు నీవు వచ్చావు. 12 యెహోవా నీ కార్యానికి ప్రతిఫలమిస్తాడు గాక, మరియు ఎవరి హస్తాల క్రింద ఆశ్రయం కోసం నువ్వు వచ్చావో ఆ ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా నుండి నీ పరిపూర్ణ బహుమతి వచ్చును గాక."

13 అప్పుడు ఆమె చెప్పింది, “నా యజమాని, నీవు నన్ను ఆదరించావు కనుక, మరియు నీ యొక్క దాసీనైన నా హృదయంతో నువ్వు మాట్లాడావు కనుక, నీ కళ్ళల్లో నేను దయ కనుగొందును గాక. అయితే నా మట్టుకు, నేను నీ దాసీలలో ఒకదాని వలే కూడా నేను లేను" 14 తరువాత భోజన సమయంలో, బోయజు ఆమెతో చెప్పాడు, "ఇక్కడికి రమ్ము, మరియు రొట్టె నుండి తిను, మరియు నీ ముక్కను ద్రాక్షారసం పులుసులో ముంచుకొనుము.” కనుక ఆమె కోయువారి పక్కన కూర్చుంది, మరియు అతడు కాల్చిన ధాన్యమును కొంత ఆమెకు అందించాడు. మరియు ఆమె తినింది, మరియు ఆమె తృప్తిపడింది, మరియు ఆమె కొన్ని మిగిల్చింది.

15 అప్పుడు ఆమె పరిగె ఏరుకోడానికి లేచింది. అప్పుడు బోయజు తన యవన పురుషులకు ఆజ్ఞాపించాడు, చెప్పాడు, "ఆమెను పనల మధ్య కూడా ఏరుకోనివ్వండి. మరియు ఆమెను సిగ్గు పరచ వద్దు. 16 ఆమె కోసం కొన్ని పనల నుండి కొంత విడిచిపెట్టడానికి కూడా చూడండి మరియు ఆమె ఏరుకోవడం కోసం విడిచి పెట్టండి, మరియు ఆమెను గద్దించ వద్దు. 17 కాబట్టి ఆమె సాయంకాలం వరకూ పొలంలో ఏరుకుంది. తరువాత ఆమె ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది, మరియు ఇది దాదాపు యవల యొక్క ఒక ఏఫా అయ్యింది. 18 మరియు ఆమె దానిని ఎత్తుకొంది మరియు నగరం లోనికి వెళ్ళింది, మరియు ఆమె అత్త ఆమె ఏరుకున్న దానిని చూసింది. అప్పుడు ఆమె తృప్తి చెందిన తరువాత ఆమె తనతో ఉన్నవాటిని బయటికి తీసుకొచ్చింది, మరియు ఆమె వాటిని ఆమెకు ఇచ్చింది.

19 అప్పుడు ఆమె అత్త ఆమెతో చెప్పింది, “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు మరియు నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన వాడు ఆశీర్వదించబడును గాక! అప్పుడు ఆమె తన అత్తతో తాను ఎవరితో పనిచేసిందో చెప్పింది. మరియు ఆమె చెప్పింది, "నేను ఈ రోజు ఎవరితో పని చేసానో ఆ మనిషి యొక్క పేరు బోయజు.” 20 అప్పుడు నయోమి తన కోడలుతో చెప్పింది, “అతడు యెహోవా చేత ఆశీర్వదించబడతాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారు మరియు చనిపోయినవారు ఇద్దరితో తన నిబంధన విశ్వాస్యతను విడిచిపెట్ట లేదు." నయోమి ఇంకా ఆమెతో చెప్పింది, “ఆ మనిషి మనకు దగ్గర చుట్టం. మనలను విడిపించగల సమీపబంధువులలో ఒకడు." 21 అప్పుడు మోయాబీయురాలైన స్త్రీ రూతు చెప్పింది, “అంతే కాకుండా, అతడు నాతో చెప్పాడు,'నాకు చెందియున్న ఆ పంట అంతా వారు ముగించే సమయం వరకు నాకు చెందియున్న వారైన సేవకుల చెంత నీవు సమీపంగా ఉండాలి."

22 అప్పుడు నయోమి తన కోడలు రూతుతో చెప్పింది “నా కుమారి, ఇది మంచిది, ఆయన యవన పని కత్తెలతో నువ్వు బయటికి వెళ్ళాలి అని, తద్వారా వారు ఎటువంటి ఇతర పొలంలో నీకు హాని చెయ్యరు." 23 కాబట్టి ఆమె యవల యొక్క పంటకోత మరియు గోధుమ పంటకొత్త ముగిసే వరకు ఏరుకోడానికి బోయజు యవన పనికత్తెలకు సమీపంగా నిలిచింది. మరియు ఆమె తన అత్తతో నివసించింది.

Chapter 3

1 తరువాత నయోమి, ఆమె అత్త, ఆమెతో చెప్పింది, “నా కుమారి, నీ కోసం క్షేమంగా ఉండే విధంగా, నేను నీ కోసం ఒక విశ్రాంతి స్థలాన్ని వెదకవలసి ఉంది కదా? 2 కాబట్టి ఇప్పుడు ఎవరి యవ్వన పనికత్తెలతో నువ్వు పని చేస్తూ ఉన్నావో అతడు మన బంధువు బోయజు అయి ఉన్నాడు కదా? చూడుము, ఈ రాత్రి అతడు నూర్చెడు కల్లములో యవలు తూర్పారబట్టడం చెయ్యబోతున్నాడు. 3 ఇప్పుడు నిన్ను నీవు శుద్ధిచేసుకో, మరియు నీకు నీవు నూనె రాసుకో, మరియు నీ మీద వస్త్రం ధరించు, మరియు నూర్చెడు కల్లము వద్దకు వెళ్ళు. అతడు భోజనం చెయ్యడం మరియు త్రాగడం ముగించే వరకు ఆ మనిషికి నిన్ను నీవు తెలియపరచుకోవడం వద్దు. 4 మరియు అతడు పండుకొనినప్పుడు అది అలా ఉండనివ్వు, అతడు ఎక్కడ పండుకొంటున్నాడో ఖచ్చితమైన ఆ స్థలం నీకు తెలుసు. అప్పుడు వెళ్ళు మరియు అతని కాళ్ళను బయటికి తీయుము మరియు పండుకో. తరువాత అతడు, తానే నువ్వు ఏమి చెయ్యాలో అతడు నీకు చెపుతాడు." 5 మరియు ఆమె ఆమెకు చెప్పింది, “నువ్వు చెప్పినది అంతా, నేను చేస్తాను.”

6 కాబట్టి ఆమె నూర్చెడు కల్లము వద్దకు వెళ్ళింది మరియు ఆమె అత్త ఆమెకు హెచ్చరించిన ప్రతీదాని ప్రకారం చేసింది. 7 మరియు బోయజు భోజనం చేసాడు, మరియు త్రాగాడు, మరియు అతని హృదయం బాగుంది, మరియు అతడు ధాన్యం యొక్క కుప్ప చివరిలో పండుకోడానికి వెళ్ళాడు. అప్పుడు ఆమె రహస్యంగా వచ్చింది, మరియు అతని పాదాల మీద ఉన్న వస్త్రాన్ని తొలగించింది, మరియు పండుకొంది. 8 అప్పుడు రాత్రి యొక్క మధ్యలో ఇది జరిగింది, అని ఆ మనిషి ఉలిక్కిపడ్డాడు మరియు పక్కకు తిరిగాడు. మరియు ఇదిగో, ఒక స్త్రీ అతని పాదాల వద్ద పండుకొని ఉంది. 9 మరియు ఆయన అన్నాడు, "ఎవరు నువ్వు?” అప్పుడు ఆమె చెప్పింది, "నేను రూతు, నీ దాసీని. మరియు నువ్వు నీ వస్త్రం యొక్క అంచును నీ దాసీ మీద పరచగలవు, ఎందుకంటే నువ్వు విడిపించగల సమీప బంధువువి." 10 మరియు అతడు చెప్పాడు, “యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడి ఉన్నావు, నా కుమారి! పేదవారు గానీ లేదా ధనవంతులు అయిన యవనస్థుల వెంబడి వెళ్ళడం లేకుండుట చేత ఆరంభం వద్ద కంటే ముగింపు వద్ద నువ్వు నీ నిబంధన విశ్వాస్యతను శ్రేష్టమైనదిగా చేశావు. 11 కాబట్టి ఇప్పుడు, నా కుమారి, భయపడి ఉండ వద్దు! నువ్వు చెప్పినది అంతా నేను నీ కోసం చేస్తాను; ఎందుకంటే నా ప్రజల యొక్క ద్వారం అంతా నువ్వు యోగ్యురాలైన ఒక స్త్రీ అని ఎరుగుదురు. 12 మరియు ఇప్పుడు, వాస్తవంగా నేను ఒక విడిపించగల-సమీపబంధువు అనేది ఈ సంగతి నిజమై ఉంది, అయితే నాకంటే కూడా దగ్గరైన విడిపించగల-సమీపబంధువు ఉన్నాడు. 13 ఈ రాత్రి ఇక్కడ నిలిచిఉండు. మరియు అది ఉదయం అయినప్పుడు, అతడు నిన్ను విడిపించిన యెడల మంచిది, అతను నిన్ను విడిపించనివ్వు. అయితే అతడు నిన్న విడిపించడానికి కోరిక లేని యెడల, అప్పుడు నేను నిన్ను నేను విడిపిస్తాను, యెహోవా సజీవుడిగా ఉన్నవిధంగా. ఉదయం వరకు పండుకొనియుండు.

14 కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల వద్ద పండుకొని ఉంది, అయితే ఒక మనిషి తన స్నేహితుడిని గుర్తుపట్టడానికి ముందే ఆమె పైకి లేచింది. మరియు అతడు అన్నాడు, "నూర్చెడు కల్లముకు ఒక స్త్రీ వచ్చింది అని ఎవరికీ తెలియనియ్య వద్దు." 15 తరువాత అతడు చెప్పాడు, “నీ మీద ఉన్న ఆ వస్త్రాన్ని తీసుకురా, మరియు పట్టుకో." కాబట్టి ఆమె దానిని పట్టుకొంది. మరియు అతడు యవల యొక్క ఆరు కొలతలను కొలిచాడు మరియు ఆమె మీద దానిని పెట్టాడు. తరువాత అతడు నగరం లోనికి వెళ్ళాడు.

16 అప్పుడు ఆమె తన అత్త దగ్గరకు వచ్చింది, మరియు ఆమె చెప్పింది, "నీవు ఎవరివి, నా కుమారి?" అప్పుడు ఆమె తన కోసం ఆ మనిషి చేసిన ప్రతీదానిని ఆమెకు చెప్పింది. 17 మరియు ఆమె చెప్పింది, "అతడు ఈ ఆరు యవల కొలతలను నాకు ఇచ్చాడు, ఎందుకంటే అతడు చెప్పాడు, 'నీవు నీ అత్త దగ్గరకు ఖాళీగా ఖచ్చితంగా వెళ్ళ కూడదు." 18 అప్పుడు ఆమె చెప్పింది, "నా కుమారి ఈ సంగతి ఏవిధంగా సంభవిస్తుందో నీవు తెలుసుకొను సమయం వరకు కూర్చో. ఎందుకంటే అతడు ఈ సంగతిని ఈ రోజు ముగించేంత వరకు ఆ మనిషి విశ్రాంతి తీసుకోడు.

Chapter 4

1 ఇప్పుడు బోయజు ద్వారం వరకు వెళ్ళాడు మరియు అక్కడ కూర్చున్నాడు. మరియు ఇదిగో, ఇంతకు ముందు విడిపించగల సమీపబంధువు గురించి బోయజు చెప్పిన అదే మనిషి అటుగా వెళ్తున్నాడు. మరియు అతడు చెప్పాడు, "ఇటువైపు తిరుగు మరియు ఇక్కడ కూర్చో, ఒక నిశ్చితమైన వ్యక్తి" కాబట్టి అతడు పక్కకు తిరిగాడు మరియు కూర్చున్నాడు. 2 అప్పుడు అతడు నగరం యొక్క పెద్దల నుండి పదిమంది పురుషులను తీసుకొన్నాడు మరియు చెప్పాడు, "ఇక్కడ కూర్చోండి." కాబట్టి వారు కూర్చున్నారు.

3 తరువాత అతడు విడిపించగల సమీపబంధువుకు చెప్పాడు, “మోయాబు యొక్క పొలాల నుండి తిరిగి వచ్చిన స్త్రీ అయిన నయోమి, మన సోదరుడు ఎలీమెలెకుకు చెంది యున్న పొలం యొక్క భాగాన్ని అమ్ముతూ ఉంది. 4 ఇప్పుడు నా విషయమైతే, నేను నీ చెవిని బయట పెట్టాలి అని నేను చెప్పాను, చెపుతున్నాను, "ఇక్కడ కూర్చొని ఉన్న వారి యొక్క సమక్షంలో మరియు నా ప్రజల యొక్క పెద్దల యొక్క సమక్షంలో దానిని కొను,' నీవు దానిని విడిపించిన యెడల, దానిని విడిపించు. అయితే నీవు దానిని విమోచించడం చెయ్యకుండా ఉన్న యెడల, అప్పుడు నాతో చెప్పు తద్వారా నేను తెలుసు కొంటాను, ఎందుకంటే దానిని విమోచించడానికి నువ్వు కాకపోతే ఎవరూ లేరు, మరియు నీ తరువాత నేను ఉన్నాను, అప్పుడు అతడు చెప్పాడు, "నేను దానిని నేనే విమోచిస్తాను."

5 అప్పుడు బోయజు చెప్పాడు, “నువ్వు నయోమి యొక్క చేతి నుండి ఆ పొలాన్ని కొనుగోలు చేసిన రోజున, నువ్వు చనిపోయిన వాని యొక్క పేరును అతని స్వాస్థ్యము మీద నిలబెట్టడానికి మోయాబీయురాలైన స్త్రీ, చనిపోయిన మనిషి యొక్క భార్య, రూతును కూడా సంపాదించుకొన్నావు, 6 అప్పుడు విడిపించగల సమీపబంధువు చెప్పాడు, "నేను నా సొంత స్వాస్థ్యమును పాడు చెయ్య కుండా నా కోసం దానిని విడిపించడానికి నాకు సామర్ధ్యం లేదు. విడిపించడం యొక్క నా హక్కును నీ కోసం నువ్వు విడిపించు ఎందుకంటే దానిని విడిపించడానికి నాకు సామర్ధ్యము లేదు.

7 ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వ కాలములలో, విమోచించడం గురించి మరియు వస్తువుల మార్పిడి గురించి ఏ విషయమైన ఇది ఈ విధంగా స్థిరపరచబడుతుంది: ఒక మనిషి తన చెప్పు తీసివేస్తాడు మరియు దాని తన స్నేహితునికి ఇస్తాడు. కాబట్టి ఇది ఇశ్రాయేలులో చట్టబద్ధమైన ప్రమాణం యొక్క నమూనాగా ఉంది. 8 కాబట్టి విడిపించగల సమీప బంధువు బోయజుతో చెప్పాడు, "నీ కోసం దానిని కొను." మరియు అతడు తన చెప్పును తీసివేశాడు.

9 అప్పుడు బోయజు పెద్దలకు మరియు ప్రజలందరికి చెప్పాడు, "ఎలీమెలెకుకు చెంది ఉన్న సమస్తము మరియు కిల్యోను, మరియు మహ్లోనుకు చెంది ఉన్న సమస్తమును నయోమి యొక్క చేతి నుండి ఈ రోజు నేను కొనుగోలు చేస్తున్నాను అని మీరు సాక్షులుగా ఉన్నారు. 10 మరియు రూతు, మోయాబీయురాలైన స్త్రీ, మహ్లోను యొక్క వితంతువు, నేను కూడా నా భార్య వలే సంపాదించుకొంటున్నాను, చనిపోయినవాని యొక్క పేరును అతని స్వాస్థ్యము మీద నిలబెట్టడం కోసం తద్వారా చనిపోయిన వాని యొక్క పేరు అతని సోదరుల మధ్య మరియు అతని స్థానం యొక్క ద్వారం నుండి కొట్టివేయ బడదు. ఈ రోజు మీరు సాక్షులుగా ఉన్నారు!”

11 మరియు ద్వారంలో ఉన్న ప్రజలు అందరు మరియు పెద్దలు చెప్పారు, "మేము సాక్షులం. నీ ఇంటి లోనికి వస్తున్న ఈ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు యొక్క ఇంటిని అభివృద్ధి చేసిన వారు ఇద్దరు, రాహేలు, మరియు లేయా మాదిరిగా చేస్తాడు గాక ఎఫ్రాతాలో ఘనతను సాధించుదురు, మరియు బెత్లెహేములో ప్రఖ్యాతి పొందుదురు. 12 మరియు ఈ యవనురాలైన స్త్రీ నుండి యెహోవా నీకు ఇస్తున్న సంతానం నుండి, యూదాకు తామారును కనిన వాడు పెరెసు యొక్క ఇల్లు వలే నీ ఇల్లు మారుతుంది గాక,

13 కాబట్టి బోయజు రూతును స్వీకరించాడు, మరియు ఆమె అతని భార్య అయ్యింది, మరియు అతడు ఆమె వద్దకు వెళ్ళాడు. అప్పుడు యెహోవా ఆమెకు గర్భధారణను అనుగ్రహించాడు, మరియు ఆమె ఒక కుమారుడిని కన్నది. 14 అప్పుడు ఆ స్త్రీలు నయోమితో చెప్పారు, "ఈ రోజు విడిపించగల సమీపబంధువు లేకుండా నిన్ను విడిచి పెట్టని వాడు యెహోవా స్తుతి నొందును. ఇశ్రాయేలులో ఆయన పేరు ప్రఖ్యాతి చెందుతుంది గాక. 15 ఇప్పుడు ఆయన నీ కోసం జీవితం యొక్క ఒక పునరుద్ధారకుడు మరియు ఒక నీ ముసలి వయసు యొక్క పోషకుడు అవుతాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే నీ కోడలు అతనిని కన్నది - ఆమె ఏడుగురు కుమారుల కంటే శ్రేష్టమైనదిగా నీకు ఉంటుంది."

16 మరియు నయోమి ఆ బిడ్డను తీసుకొంది మరియు అతనిని తన ఒడి మీదకు పెట్టుకొంది, మరియు ఆమె అతని దాది అయ్యింది. 17 కాబట్టి ఇరుగు పొరుగు స్త్రీలు "నయోమికి ఒక కుమారుడు పుట్టాడు" అని చెపుతూ అతని కోసం ఒక పేరు పిలిచారు. మరియు వారు అతని పేరును ఓబేదు అని పిలిచారు. అతడు దావీదు యొక్క తండ్రి అయిన, యెష్షయి యొక్క తండ్రి.

18 ఇప్పుడు పెరెసు యొక్క తరాలు ఇవి: పెరెసు హెస్రోనును కనెను. 19 మరియు హెస్రోను రామును కనెను; మరియు రాము అమ్మీనాదాబును కనెను; ; 20 మరియు అమ్మీనాదాబు నయస్సోనును కనెను; మరియు నయస్సోను శల్మోనును కనెను; 21 మరియు శల్మోను బోయజును కనెను; మరియు బోయజు ఓబేదును కనెను; 22 మరియు ఓబేదు యెష్షయిని కనెను; మరియు యెష్షయి దావీదును కనెను.