తెలుగు: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS Draft Material

41. దేవుడు యేసును మృతులలోనుండి లేపడం

OBS Image

సైనికులు యేసును సిలువ వేసిన తరువాత యూదా నాయకులు పిలాతుతో ఇలా చెప్పారు, “ఆ అబద్ధికుడు, యేసు మూడు రోజుల తరువాత మృతులలో నుండి తిరిగి లేస్తానని చెప్పాడు. శరీరాన్ని సమాధిలోనుండి శిష్యులు ఎత్తికొనిపోకుండా దానిని కాపాడాలి. వారు ఆ విధంగా చేస్తే, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని చెపుతారు.”

OBS Image

పిలాతు ఇలా చెప్పాడు, “కొందరు సైనికులను తీసుకొని వెళ్ళండి, సమాధిని మీ చేతనైనంత వరకు భద్రపరచండి.” కనుక సమాధి మీద ఉన్న రాతి మీద ముద్ర వేసారు. దేహాన్ని ఎవరూ దొంగిలించకుండా సైనికులను కావలి యుంచారు.

OBS Image

యేసు చనిపోయిన మరుసటి రోజు సబ్బాతు దినం. ఏ ఒక్కరూ సబ్బాతు దినాన పని చెయ్యరు. కనుక యేసు స్నేహితులెవరూ సమాధి వద్దకు వెళ్ళలేదు. అయితే సబ్బాతు దినం మరుసటి రోజు ఉదయాన్నే అనేక మంది స్త్రీలు యేసు దేహాన్ని ఉంచిన సమాధి వద్దకు వెళ్ళడానికి సిద్దపడ్డారు. యేసు దేహానికి ఎక్కువ సుగంధ ద్రవ్యాలు పూయాలని కోరారు.

OBS Image

ఆ స్త్రీలు సమాధి వద్దకు రావడానికి ముందు సమాధి వద్ద గొప్ప భూకంపం కలిగింది. పరలోకం నుండి ఒక దూత వచ్చాడు. సమాధి ద్వారాన్ని మూసియుంచిన రాయిని తొలగించాడు. దాని మీద కూర్చుండి యున్నాడు. ఆ దూత మెరుపులా ప్రకాశమానంగా వెలిగిపోతున్నాడు. సమాధి వద్ద సైనికులు ఆ దూతను చూచారు. వారు చాలా భయపడ్డారు కనుక వారు చచ్చిన వారిలా నేల మీద పడిపోయారు.

OBS Image

ఆ స్త్రీలు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ దూత వారితో ఇలా చెప్పాడు, “భయపడకండి, యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధంగా మరణం నుండి తిరిగి లేచాడు! సమాధిలో చూడండి.” ఆ స్త్రీ యేసు దేహాన్ని ఉంచిన సమాధిలోనికి తొంగి చూసింది. ఆయన దేహం అక్కడ లేదు!

OBS Image

దూత ఆ స్త్రీతో ఇలా చెప్పాడు, “మీరు వెళ్ళండి, ‘మరణం నుండి యేసు తిరిగి లేచాడు, మీకు ముందుగా గలిలయకు వెళ్తాడని శిష్యులతో చెప్పండి.”

OBS Image

ఆ స్త్రీలు మిక్కిలో ఆశ్చర్యపడ్డారు, ఆనందించారు. సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పాడానికి వారు పరుగెత్తి వెళ్ళారు.

OBS Image

సంతోషకరమైన వార్తను శిష్యులకు చెప్పడానికి వారు పరుగున వెళ్తుండగా యేసు వారికి ప్రత్యక్ష్యం అయ్యాడు. వారు ఆయన పాదాల వద్ద మొక్కారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, “భయపడకండి. శిష్యులు గలిలయకు వెళ్ళమని చెప్పండి. ఆక్కడ వారు నన్ను చూస్తారు.”

మత్తయి 27:62-28:15; మారు 16:1-11; లూకా 24:1-12; యోహాను 20:1-18 నుండి బైబిలు కథ