తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Ruth

Ruth 1

Ruth 1:1-2

యూదు చరిత్రలో ఏ కాలంలో రూతు వృత్తాంతం చోటుచేసుకొంది?

న్యాయాధిపతులు పరిపాలించిన రోజులలో ఇది జరిగింది.

ఎలీమెలెకు తన కుటుంబంతో మోయాబుకు ఎందుకు వెళ్లాడు?

యూదా దేశంలో కరువు ఉన్న కారణంగా అతడు కదిలాడు.

Ruth 1:3-4

మోయాబులో ఎలీమెలెకుకు ఏమి జరిగింది?

అతడు మరణించాడు, నయోమిని ఒక విధవరాలుగా విడిచిపెట్టాడు.

Ruth 1:5

మోయాబులో నయోమి కుమారులకు ఏమి జరిగింది?

వారు చనిపోయారు, ఇద్దరు కోడళ్లను నమామి వద్ద విడిచి వెళ్ళారు.

Ruth 1:6-7

ఎందుకు నయోమి యూదాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది?

యెహోవా యూదా ప్రజలకు ఆహారం ఇచ్చాడని ఆమె విన్నది.

Ruth 1:8

నయోమి తన ఇద్దరు కోడళ్ళు ఎక్కడికి వెళ్లాలని కోరుకుంది?

వారు తమ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్లాలని నయోమి కోరుకుంది.

Ruth 1:9-15

తన ఇద్దరు కోడళ్ళు దేనిని కనుగొనాలని నయోమి కోరుకుంది?

వారు ఇతర భర్తలను కనుగొనాలని ఆమె కోరుకుంది.

Ruth 1:16

రూతు నయోమితో ఉన్నప్పుడు, రూతు నయోమికి ఏ వాగ్దానం చేసింది?

అయితే రూతు చెప్పింది, "నిన్ను విడిచిపెట్టడానికి లేదా నిన్ను అనుసరించడం నుండి వెనుకకు తిరగడానికి నన్ను ఒత్తిడి చెయ్య వద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ స్థలానికి నేను వస్తాను, మరియు నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను ఆ స్థలంలో ఉంటాను. నీ ప్రజలు నా ప్రజలై ఉంటారు, మరియు నీ దేవుడు నా దేవుడై ఉంటాడు. నువ్వు ఎక్కడ చనిపోతావో ఆ స్థలంలో, నేను చనిపోతాను, మరియు అక్కడ నేను పాతిపెట్టబడతాను. యెహోవా నాకు ఈ విధంగా చేస్తాడు గాక, మరణం నాకు మరియు నీకు మధ్య యెడబాటు చేసిన యెడల ఆయన ఈవిధంగా జతచేయును గాక."

Ruth 1:17-18

నయోమితో ఎంతకాలం ఉంటానని రూతు చెప్పింది?

వారు చనిపోయే వరకూ నయోమితోనే ఉంటానని రూతు చెప్పింది.

Ruth 1:19

నయోమి ఏ పట్టణానికి తిరిగి వచ్చింది?

ఆమె బేత్లెహేముకు తిరిగి వచ్చింది.

Ruth 1:20-21

నయోమి ఏ పేరుతో పిలువబడాలని కోరుకుంది?

ఆమె “మారా” (మారా అంటే “చేదు” అని అర్థం) అని పిలువబడాలని కోరుకుంటున్నట్లు వారికి చెప్పింది, ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆమెకు అధికమైన వేదనను కలిగించాడు.

Ruth 1:22

సంవత్సరంలో ఏ సమయంలో నయోమి మరియు రోత బేత్లెహేముకు వచ్చారు?

వారు యవల యొక్క పంటకోత యొక్క ఆరంభంలో బేత్లెహేముకు వచ్చారు.

Ruth 2

Ruth 2:1

చనిపోయిన నయోమి భర్తకూ బోయజుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

బోయజు నయోమి భర్తకు బంధువు.

Ruth 2:2-3

మొదటిసారి ధాన్యాన్ని సేకరించడానికి బయటికి వెళ్ళినప్పుడు ధాన్యం సేకరించేటప్పుడు రూతు ఎవరిని అనుసరిస్తానని చెప్పింది?

ఎవని కళ్ళల్లో ఆమె దయను కనుగొనునో వాని వెనుక ధాన్యం యొక్క వెన్నులు ఏరుకొంటానని చెప్పింది.

Ruth 2:4

బోయజు తన సేవకులకు ఎటువంటి శుభములు చెప్పాడు?

అతడు చెప్పాడు, "యెహోవా మీకు తోడుగా ఉంటాడు."

Ruth 2:5-7

రూతు గురించి బోయజు ఏమి తెలుసుకోవాలనుకున్నాడు?

రూతు ఎవరికి చెందినదో అతడు తెలుసుకోవాలనుకున్నాడు.

Ruth 2:8-9

రూతు ధాన్యాన్ని సేకరించడం విషయంలో బోయజు ఆమెకు ఎటువంటి హెచ్చరికలు చేసాడు?

రూతు మరొక పొలంలో ఏరుకోడానికి వెళ్ళ వద్దు అని చెప్పాడు అయితే యవనులైన స్త్రీ పనివారికి దగ్గరగా ఉంది పని చెయ్యమని చెప్పాడు.

Ruth 2:10

అనుకూలమైన హెచ్చరికలను స్వీకరించిన తరువాత రూతు బోయజును ఏమని ప్రశ్నించింది?

తన మీద శ్రద్ధ చూపించడానికి ఎందుకు తాను దయను పొందింది అని బోయజును అడిగింది.

Ruth 2:11

రూతు గురించి బోయజు ఎటువంటి మంచి నివేదికను విన్నాడు?

నయోమిని అనుసరించడానికి రూతు ఆమె ఇంటిని విడిచిపెట్టిందని అతడు విన్నాడు.

Ruth 2:12-14

ఎవరి రెక్కల క్రింద రూతు ఆశ్రయం పొందిందని బోయజు చెప్పాడు?

రూతు యెహోవా రెక్కల క్రింద ఆశ్రయమును కనుగొంది.

Ruth 2:15

భోజన సమయం తరువాత వారు తిరిగి పనికి వచ్చినప్పుడు బోయజు రూతుకు ఎటువంటి అదనపు సహాయాన్ని చూపించాడు?

రూతు పనల మధ్య కూడా ఏరుకోదానికి బోయజు అనుమతించాడు.

Ruth 2:16-18

బోయజు తన సేవకులకు రూతు కోసం ఏమి చేయమని తన సేవకులతో చెప్పాడు?

ఆమె ఏరుకోవడం కోసం పనల నుండి రూతు కోసం ధాన్యాన్ని బయటకు విడిచి పెట్టాలని చెప్పాడు.

Ruth 2:19

రూతు పెద్ద మొత్తంలో తిరిగి తీసుకొనివచ్చిన ధాన్యాన్ని నయోమి చూసినప్పుడు, ఆమె రూతును ఏ ప్రశ్న అడిగింది?

రూతు ఆ రోజు ఎక్కడ సేకరించిందో నయోమి అడిగింది.

Ruth 2:20-21

బోయజు రూతుకు సహాయం చేశాడని వినిన నయోమి అతనికి ఎటువంటి ఆశీర్వాదం కావాలి అని కోరుకుంది?

ఆమె చెప్పింది, "అతడు యెహోవా చేత ఆశీర్వదించబడాలి."

Ruth 2:22

బోయజు స్త్రీల సేవకులతో రూతు పనిచేయడం మంచిదని నయోమి ఎందుకు భావించింది?

అలా చేయడం ద్వారా, రూతుకు ఏ ఇతర పొలంలోనూ హాని కలిగించదు.

Ruth 2:23

బార్లీ పంట కోత కోసం రూతు ఏమి చేసింది?

ఆమె బోయజు సేవకులతో కలిసి పనిచేసింది, మరియు నయోమితో నివసించింది.

Ruth 3

Ruth 3:1-2

రూతు విషయంలో ఎటువంటి కోరికను నయోమి చెప్పింది?

రూతుకు విశ్రాంతి స్థలం ఉండాలని ఆమె కోరుకుంది, అంటే ఆమెను సరిగా చూచుకొనే వ్యక్తిని ఆమె కలిగి ఉండాలి.

Ruth 3:3

రూతు నూర్చెడు కల్లము వద్దకు వెళ్ళడానికి ముందు ఏమి చెయ్యాలని నయోమి రూతుతో చెప్పింది?

ఆమె తనను శుద్ధిచేసుకోవాలి, మరియు తన మీద వస్త్రం ధరించాలి అని నయోమి చెప్పింది.

Ruth 3:4

బోయజు నిద్రిస్తున్న చోటుకు రూతు వెళ్లినప్పుడు ఆమె ఏమి చేయాలి?

ఆమె ఆయన పాదాల మీద ఉన్న దుప్పటి తొలగించి అక్కడ పండుకోవలసి ఉంది.

Ruth 3:5-7

నయోమి సూచనల పట్ల రూతు వైఖరి ఏమిటి?

నయోమి తనకు చెప్పినవన్నీ చేస్తానని ఆమె చెప్పింది.

Ruth 3:8

అర్ధరాత్రి,సమయంలో దేనిని కనుగొని బోయజు ఆశ్చర్యపోయాడు?

ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకుని ఉండడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు!

Ruth 3:9

బోయజుకు రూతు చేసిన మనవి ఏమిటి?

అతడు “విడిపించగల సమీప బంధువు” కనుక తన వస్త్రాన్ని తనపై వేయమని ఆమె బోయజును కోరింది.

Ruth 3:10

రూతు కోసం యెహోవా ఆశీర్వాదాన్ని యోయాజు ఎందుకు అడిగాడు?

బోయజు రూతును ఆశీర్వదించాడు ఎందుకంటే ఆమె యువకులను కాకుండా బోయజును అనుసరించింది.

Ruth 3:11

రూతు మనవి విషయంలో తాను ఏమి చేస్తానని బోయజు చెప్పాడు?

రూతు అడిగినవన్నీ తాను చేస్తానని అతడు చెప్పాడు.

Ruth 3:12

రూతు కోసం విడిపించగల సమీప బంధువు యొక్క కర్తవ్యాన్ని వెంటనే చేయకుండా బోయజును ఏ అడ్డంకి నిరోధించింది?

బోయజు కంటే మరొక బంధువు-విమోచకుడు ఉన్నాడు.

Ruth 3:13

రూతు కోసం సమీప బంధువుగా ఎవరు వ్యవహరిస్తారో బోయజు ఏవిధంగా నిర్ణయించబోతున్నాడు?

విడిపించే సమీప బంధువు రూతును విడిపించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే బోయజు అతనిని ఆ విధంగా చేయనిస్తాడు. అయితే అతడు ఇష్టపడకపోతే, బోయజు విడిపించే సమీప బంధువుగా ఉంటాడు.

Ruth 3:14

ఎవరైనా ఆమెను గుర్తించడానికి ముందే ఎందుకు రూతు నూర్చెడు కళ్లమునుండి బయలు దేరింది?

రూతు నూర్చెడి కళ్లము వద్దకు వచ్చిందని మనుషులెవరికీ తెలియకూడదని బోయజు కోరాడు.

Ruth 3:15-17

రూతు నూర్చెడి కళ్లము నుండి బయలుదేరడానికి ముందు బోయజు ఏ బహుమతి ఇచ్చాడు?

అతడు రూతుకు ఆరు పెద్ద కొలతల యవలను

Ruth 3:18

ఏ సమయానికి బోయజు సమస్యను పరిష్కరిస్తాడని నయోమికి ఖచ్చితంగా తెలుసు?

అదే రోజు ముగించే సమయానికి అతడు దానిని పరిష్కరిస్తాడు.

Ruth 4

Ruth 4:1

రూతు కోసం విడిపించగల సమీప బంధువు ఎవరు అనే సమస్యను పరిష్కరించడానికి బోయజు ఎక్కడికి వెళ్లాడు?

అతడు నగరం ద్వారం దగ్గరకు వెళ్లాడు.

Ruth 4:2

బోయజు ఎవరిని సాక్షులుగా కూర్చోమని అడిగాడు?

అతడు నగరంలోని పది మంది పెద్దలను అడిగాడు.

Ruth 4:3

బోయజు ఇతర సమీప బంధువుతో మొదట ఏమి మాట్లాడాడు?

ఎలీమెలెకుకు చెంది యున్న పొలం భాగాన్ని నయోమి అమ్ముతూ ఉందని అతడు చెప్పాడు.

Ruth 4:4

పొలం భాగం గురించి ఇతర సమీప బంధువు ఏమి చేయవలసి ఉందని బోయజు సూచించాడు?

ఇతర సమీప బంధువు దానిని విమోచించవచ్చని బోయజు సూచించాడు.

ఇతర సమీప బంధువు సమాధానం ఏమిటి?

అతడు దానిని విమోచించగలనని చెప్పాడు.

Ruth 4:5

బోయజు ఏ అదనపు అవసరం గురించి ఇతర సమీప బంధువుకు చెప్పాడు?

అతడు చనిపోయిన వాని యొక్క పేరును అతని స్వాస్థ్యము మీద నిలబెట్టడానికి అతడు రూతును కూడా వివాహం చేసుకోవాలని బోయజు అతనితో చెప్పాడు.

Ruth 4:6-7

అతడు రూతును వివాహం చేసుకోవలసి వస్తుందని తెలుసుకున్నప్పుడు ఆ ఇతర సమీప బంధువు యొక్క సమాధానం ఏమిటి?

అతడు ఆ పొలమును విమోచించలేనని చెప్పాడు.

తాను విమోచకుడను కాలేనని ఆ ఇతర సమీప బంధువు ఎందుకు చెప్పారు?

అది తన వారసత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.

Ruth 4:8

బోయజు విమోచకుడిగా ఉండాలని ఒప్పుకున్నట్లు చూపించడానికి ఇతర సమీప బంధువు ఏమి చేసాడు?

అతడు తన చెప్పును తీసాడు.

Ruth 4:9

పెద్దలు సాక్షులుగా ఉండేలా బోయజు చెప్పిన మొదటి ఒప్పందం ఏమిటి?

ఎలీమెలెకుకు చెందిన మొత్తం పొలమును బోయజు కొనుగోలు చేసినట్లు వారు చూశారు.

Ruth 4:10-11

పెద్దలు సాక్షులుగా ఉండేలా బోయజు చెప్పిన రెండవ ఒప్పందం ఏమిటి?

బోయజు రూతును తన భార్యగా సంపాదించాడని వారు చూశారు.

Ruth 4:12-14

బోయజు కోసం ప్రజలు ఏ ఆశీర్వాదం కోరుకున్నారు?

రూతు ద్వారా యెహోవా అతనికి ఇస్తున్న సంతానం నుండి, యూదాకు తామారును కనిన విధంగా ఉండాలని వారు కోరుకున్నారు.

Ruth 4:15

ఏడుగురు కుమారుల కంటే నయోమికి రూతు శ్రేష్టమైనదని స్త్రీలు ఎందుకు చెప్పారు?

నయోమి పట్ల రూతుకున్న ప్రేమ కారణంగా, రూతు నయోమి కోసం మనవడికి జన్మనిచ్చినందున వారు ఇలా చెప్పారు.

Ruth 4:16

రూతు కుమారునితో నయోమికి సంబంధం ఏమిటి?

నయోమి ఆయన దాది లేదా సంరక్షకునిగా మారింది.

Ruth 4:17-22

రూతు కుమారుని పేరు ఏమిటి?

అతని పేరు ఓబేదు.

ఓబేదు తండ్రి, తాత ఎవరినుండి వచ్చారు?

ఓబేదు యెష్షయి తండ్రి, దావీదు తాత.