Mark
Mark 1
Mark 1:1-3
ప్రవక్త యెషయా ప్రభువు రాకడకు ముందు ఏమి జరుగుతుందని చెప్పాడు?
ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దంగా ఉండే ఒక దూతను పంపుతాడని యెషయా ముందుగా చెప్పాడు. (1:2-3).
Mark 1:4-6
ఏమి బోధించడానికి యోహాను వచ్చాడు?
పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడానికి యోహాను వచ్చాడు?1:4).
యోహాను చేత బాప్తిసము తీసుకున్న వారు ఏమి చేసారు?
యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారుతమ పాపాలు ఒప్పుకున్నారు. (1:5).
యోహాను ఏమి తినేవాడు?
యోహాను మిడతలను, అడవి తేనెను తినేవాడు. (1:6).
Mark 1:7-8
తన వెనుక వచ్చువాడు దేనితో బాప్తిస్మమిస్తాడని యోహాను చెపుతున్నాడు?
తన వెనుక వచ్చువాడు పరిశుద్దాత్మతో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు. (1:8).
Mark 1:9
యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న తరువాత బయటకు వచ్చినపుడుయేసు ఏమి చూసాడు?
బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆకాశము చీల్చ బడుటయు, పరిశుద్దాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు యేసు చూసాడు. (1:10).
యేసు బాప్తిసము తీసుకున్న తరువాత ఆకాశము నుండి వచ్చిన శబ్దము ఏమి చెప్పింది?
"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించు చున్నాను" అని ఆకాశము నుండి వచ్చిన శబ్దము పలికింది. (1:11).
Mark 1:10-11
భూమి మీద పాపాలను క్షమించే అధికారం తనకు ఉందని యేసు ఎలా కనుపరచాడు?
తన పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని యేసు పక్షవాత రోగితో చెప్పాడు, ఆ వ్యక్తి అలానే చేసాడు. (2:8-12).
Mark 1:12-13
యేసును అరణ్యము లోనికి త్రోసుకు వెళ్ళింది ఎవరు?
దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకు వెళ్ళాడు. (1:12).
అరణ్యములో యేసు ఎంత కాలము ఉన్నాడు? అక్కడ ఆయనకు ఏమి జరిగింది?
యేసు అరణ్యములో నలభై రోజులు ఉన్నాడు. ఆయన అక్కడ సైతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. (1:13).
Mark 1:14-15
యేసు ఏ సందేశాన్ని ప్రకటించాడు?
దేవుని రాజ్యం దగ్గరగా ఉంది, పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మండి అని యేసు ప్రకటించాడు. (1:15).
Mark 1:16-18
సీమోనును, అంద్రెయను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?
సీమోనును, అంద్రెయను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని యేసు చెప్పాడు. (1:17).
Mark 1:19-20
సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి ఏమిటి?
సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి చేపలు పట్టడం. (1:16,19).
Mark 1:21-22
యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఎందుకు ఆశ్చర్యపడేలా చేసింది?
యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఆశ్చర్య పడేలా చేసింది ఎందుకంటే ఆయన అధికారం కలవాడిగా ఉపదేశించాడు. (1:22).
Mark 1:23-26
సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు ఏ పేరు ఇచ్చింది?
సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు దేవుని పవిత్రుడు అనే పేరు ఇచ్చింది. (1:24).
Mark 1:27-28
యేసును గురించిన వార్తతో ఏమి జరిగింది?
యేసుని గురించిన వార్త చుట్టుపక్కలా అంతటా వ్యాపించింది. (1:28).
Mark 1:29-31
వారుసీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు ఎవరిని స్వస్థపరచాడు?
వారు సీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు అతని అత్తను స్వస్థపరచాడు. (1:30).
Mark 1:32-34
సాయంకాల సమయాన ఏమి జరిగింది?
సాయంకాల సమయాన ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టిన వారినందరిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. (1:32-34).
Mark 1:35-37
సూర్యోదయాన యేసు ఏమి చేసాడు?
సూర్యోదయాన యేసు లేచి నిర్జన స్థలానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. (1:35).
Mark 1:38-39
తాను ఏమి చెయ్యడానికి వచ్చాడని యేసు పేతురుతో చెప్పాడు?
దగ్గరగా ఉన్న గ్రామాలలో ప్రకటించడానికి తాను వచ్చాడని యేసు పేతురు?ో చెప్పాడు?(1:38-39).
Mark 1:40-42
స్వస్తపడాలని బ్రతిమిలాడడానికి తన వద్దకు వచ్చిన కుష్టరోగి పట్ల యేసు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు?
యేసు కుష్టరోగి పై జాలి పడి అతనిని బాగు చేసాడు. (1:40-42).
Mark 1:43-45
ఏమి చెయ్యమని యేసు కుష్టరోగికి చెప్పాడు, ఎందుకు?
సాక్ష్యంగా ఉండేందుకు మోషే ధర్మశాస్త్రం లో విధించిన వాటిని అర్పించమని యేసు కుష్టరోగికి చెప్పాడు. (1:44).
Mark 2
Mark 2:5-12
యేసు పక్షవాత రోగితో ఏమి చెప్పాడు?
"కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది" యేసు పక్షవాత రోగితో చెప్పాడు? (2:5).
యేసు చెప్పిన దానికి ధర్మశాస్త్ర పండితులు కొందరు?ందుకు అభ్యంతర పడ్డారు?
యేసు దేవదూషణ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు?క్కడే పాపాలు క్షమించగలవాడు అని కొందరు ధర్మశాస్త్ర పండితులు ఆలోచించారు. (2:6-7).
Mark 2:13-14
నా వెంట రా అని లేవీతో యేసు చెప్పినపుడు లేవి ఏమి చేస్తున్నాడు?
యేసు పిలిచినప్పుడు లేవి సుంకం వసూలు చేసే స్థానం లో కూర్చుని వున్నాడు. (2:13-14).
Mark 2:15-16
లేవి ఇంటిలో యేసు ఏమి చెయ్యడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది ?
లేవి ఇంటిలో యేసు పాపులతో, సుంకరులతో కలిసి భోజనం చేయడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది. (2:15-16).
Mark 2:17
ఎవరిని పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు?
పాపులను పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు. (2:17).
Mark 2:18-19
ఉపవాసము గురించి కొందరు యేసును ఏమని ప్రశ్నించారు?
యెహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసమున్నప్పుడు?న శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు అని కొందరు యేసును అడిగారు. (2:18).
Mark 2:20-22
ఉపవాసము గురించి యేసు ఎలా జవాబిచ్చారు?
పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండరు, అయితే పెళ్ళికుమారుడు వారి దగ్గరనుండి తీసి వేయబడివ్పుడు వారు ఉపవాసముంటారు అని యేసు వారితో చెప్పాడు. (2:19-20).
Mark 2:23-24
విశ్రాంతి దినాన్న పంట చేలలో యేసు శిష్యులు పరిసయ్యులను అభ్యంతర పరచే పని ఏమి చేసారు?
విశ్రాంతి దినాన్న యేసు శిష్యులు పంటచేలలో కంకులు తెంపుకొని తిన్నారు. (2:23-24).
Mark 2:25-26
ఆకలి గొని నిషిద్దమయిన రొట్టెను తినిన వాని గురించి ఎలాంటి ఉదాహరణ యేసు ఇచ్చాడు?
ఆకలి గొని యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి ఇచ్చిన దావీదును గురించిన ఉదాహరణ యేసు ఇచ్చాడు? (2:25-26).
Mark 2:27-28
విశ్రాంతి దినం ఎవరి కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు?
విశ్రాంతి దినం మనుషుల కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు? (2:27).
ఏ అధికారం తనకు ఉందని యేసు చెప్పుకునాడు?
తాను విశ్రాంతి దినమునకు కూడా ప్రభువని యేసు చెప్పాడు. (2:28).
Mark 3
Mark 3:1-2
సమాజ కేంద్రంలో విశ్రాంతి దినాన్న వారు?ందుకు యేసును చూస్తూ ఉన్నారు?
ఆయన మీద నింద మోపడానికి విశ్రాంతి దినాన్న యేసు స్వస్థత చేస్తాడేమో అని వారు చూస్తూ ఉన్నారు. (3:1-2).
Mark 3:3-4
విశ్రాంతి దినము గురించి యేసు వారిని ఏమని అడిగాడు?
విశ్రాంతి దినాన మేలు చేయడమా కీడు చేయడమా ఏది ధర్మం అని యేసు వారిని అడిగాడు. (3:4).
Mark 3:5-6
యేసు ప్రశ్నకు వారు ఎలా స్పందించారు, వారి పట్ల యేసుకున్న వైఖరి ఏమిటి ?
వారు నెమ్మదిగా ఉన్నారు, యేసు వారిని కోపగించుకున్నాడు. (3:4-5).
యేసు ఆ వ్యక్తిని స్వస్త పరచిన తరువాత పరిసయ్యులు ఏమి చేసారు?
పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపాలో అని కుట్ర పన్నారు. (3:6).
Mark 3:7-10
ఆయన సముద్రము వద్దకు వెళ్ళినపుడు ఎంత మంది ఆయనను వెంబడించారు??
గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు. (3:7-9).
Mark 3:11-12
అపవిత్రాత్మలు యేసుని చూచి ఏమని అరిచారు?
యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలు యేసుని చూచి అరిచారు. (3:11).
Mark 3:13-16
యేసు ఎంత మంది అపోస్తలులను నియమించాడు, వారు ఏమి చెయ్యాలి ?
వారు ఆయనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును యేసు పన్నెండు మంది అపోస్తలులను నియమించాడు. (3:14-15).
Mark 3:17-19
యేసును మోసగించబోవు అపోస్తలుడు ఎవరు?
యేసును మోసగించబోవు అపోస్తలుడు యూదా ఇస్కరియోతు. (3:19).
Mark 3:20-22
యేసు చుట్టూ ఉన్న జనసమూహము, సంఘటనలను గురించి ఆయన ఇంటివారు?మని తలంచారు?
ఆయనకు మతి చలించినదని ఆయన ఇంటివారు తలంచారు? (3:21).
శాస్త్రులు యేసుకు వ్యతిరేకంగా ఏ నింద వేసారు?
దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసును నిందించారు. (3:22).
Mark 3:23-27
శాస్త్రులు వేసిన నిందకు యేసు స్పందన ఏమిటి ?
తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యము నిలువనేరదని యేసు చెప్పాడు. (3:23-26).
Mark 3:28-32
ఏ పాపము క్షమాపణ పొందనేరదని యేసు చెప్పాడు?
పరిశుద్డాత్మకు వ్యతిరేకమైన దూషణ క్షమాపణ పొంద నేరదని యేసు చెప్పాడు? (3:28-30).
Mark 3:33-35
తన తల్లి తన సహోదరులు ఎవరని యేసు చెప్పాడు?
దేవుని చిత్తము జరిగించు వాడే తన తల్లియు తన సహోదరులును అని యేసు చెప్పాడు? (3:33-35).
Mark 4
Mark 4:1-2
యేసు బోధించడానికి దోనె ఎందుకు ఎక్కాడు?
ఆయన దగ్గర చాలా పెద్ద జనసమూహం సమకూడినందున యేసు బోధించడానికి దోనె ఎక్కాడు? (4:1).
Mark 4:3-5
త్రోవ ప్రక్కన పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?
పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. (4:4).
Mark 4:6-7
రాతి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది ?
మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచి ఎండి పోయాయి. (4:5-6).
ముండ్ల పొదలలో పడిన విత్తనాలకు ఏమి జరిగింది?
ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచి వేసెను. (4:7).
Mark 4:8-9
మంచి నేలను పడిన విత్తనాలకు ఏమి జరిగింది?
మంచి నేలను పడిన విత్తనాలు పెరిగి పైరై ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించెను. (4:8).
Mark 4:10-12
వెలుపల ఉండువారికి కాక పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పిన దేమిటి ?
దేవుని రాజ్య మర్మము తెలిసికొనుటకు బయటి వారికిగాక ఆ పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పాడు. (4:11).
Mark 4:13-15
యేసు ఉపమానంలో విత్తనము అంటే ఏమిటి ?
విత్తనము దేవుని వాక్యము. (1:10).
త్రోవపక్కన విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ?
వాక్యమును విత్తుచుండగా విను వారిని సూచిస్తుంది. అయితే సాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. (1:11).
Mark 4:16-17
రాతి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?
వాక్యమునును విని సంతోషముగా అంగీకరించు వారిని సూచిస్తుంది అయితే శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారు. (4:16-17).
Mark 4:18-20
ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది ? ?
వాక్యమును విను వారిని సూచిస్తుంది. అయితే ఈ లోక ఐహిక విచారాలు వాటిని అణచి వేస్తాయి. (4:18-19).
మంచి నేలను విత్తబడిన విత్తనము దేనిని సూచిస్తుంది?
వాక్యమును విని, అంగీకరించి ఫలమును ఫలించు వారిని సూచిస్తుంది. (4:20).
Mark 4:21-25
మరుగు చేయబడినవాటికి, రహస్యమయిన వాటికి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?
మరుగు చేయబడినవి, రహస్యమయినవి వెలుగు లోనికి తేబడతాయని యేసు చెప్పాడు?(4:22).
Mark 4:26-29
దేవుని రాజ్యము భూమిలో విత్తనము చల్లిన మనుష్యుని ఏ విధంగా పోలి ఉంది?
మనుష్యుడి విత్తనము చల్లుతాడు, అది పెరుగుతుంది, అతనికి తెలియకుండానే పంట వస్తుంది. దానిని అతడు సమకూరుస్తాడు. (4:26-29).
Mark 4:30-34
దేవుని రాజ్యము ఆవగింజను ఏ విధంగా పోలి ఉంది ?
ఆవగింజ భూమిలో విత్తబడినపుదు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కాని అది ఎదిగి గొప్పదై ఆకాశ పక్షులు దాని నీడను విశ్రమించును. (4:30-32).
Mark 4:35-37
యేసును ఆయన శిష్యులును నది దాటిపుడు ఏమి జరిగింది ?
పెద్ద తుఫాను రేగి దోనె నీటితో నిండి పోవునట్లుగా అలలు దోనెను కొట్టాయి. (4:35-37).
Mark 4:38-39
ఈ సమయములో దోనెలో యేసు ఏమి చేస్తున్నాడు?
యేసు నిద్ర పోతూ ఉన్నాడు. (4:38).
శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?
తాము నశించి పోతుండగా ఆయనకు చింత లేదా అని యేసును ప్రశ్నించారు. (4:38).
అప్పుడు యేసు ఏమి చేసాడు?
యేసు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళ పరచెను. (4:39).
Mark 4:40-41
ఈ విధంగా యేసు చేసిన తరువాత శిష్యుల స్పందన ఏమిటి ?
శిష్యులు మిక్కిలి భయపడ్డారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. (4:41).
Mark 5
Mark 5:1-2
వారు గెరాసేనల దేశమునకు వచ్చినపుడు యేసును కలుసుకున్నదెవరు?
అపవిత్రాత్మ పట్టినవాడొకడు యేసును కలుసుకున్నాడు. (5:1-2).
Mark 5:3-6
ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు ఏమిటి ?
ఈ వ్యక్తి సమాధులలో నివసించే వాడు, చేతి సంకెళ్ళను, కట్లను తుత్తునియలుగా చేసేవాడు. ఎల్లప్పుడూ కేకలు వేస్తూ తనను తాను రాళ్ళతో గాయపరచుకొనే వాడు. (5:3-5).
Mark 5:7-8
ఈ మనుష్యునితో యేసు ఏమి చెప్పాడు??
"అపవిత్రాత్మా, ఈ మనుష్యుని విడిచిపొమ్మని చెప్పాడు. (5:8).
ఈ అపవిత్రాత్మ యేసుకు ఏ పేరు ఇచ్చింది ?
ఈ అపవిత్రాత్మ యేసును సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని పిలిచింది. (5:7).
Mark 5:9-10
ఆ అపవిత్రాత్మ పేరు ఏమిటి ?
ఆ అపవిత్రాత్మ పేరు సేన, ఎందుకంటే వారు అనేకులు. (5:9).
Mark 5:11-13
ఆ మనుష్యుని నుండి అపవిత్రాత్మను బయటకు పంపివేసినపుడు?మి జరిగింది?
ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందుల గుంపులోనికి ప్రవేశించాయి. ప్రవేశింపగా అవి నిటారుగా ఉన్న ఆ కొండమీద నుండి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి చనిపోయాయి. (5:13).
Mark 5:14-15
ఆ అపవిత్రాత్మ వెడలిపోయిన తరువాత ఆ మనుష్యుని పరిస్థితి ఎలా ఉంది ?
ఆ మనుష్యుడు బట్టలు ధరించుకొని స్వస్త చిత్తుడై యేసుతో కూర్చుండెను. (5:15).
Mark 5:16-17
జరిగిన ఈ సంఘటనలకు ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందించారు? యేసును ఏమి చెయ్యమని అడిగారు?
ఆ ప్రజలు భయపడి తమ ప్రాంతాన్ని విడిచి పొమ్మని యేసును బతిమాలుకొన్నారు. (5:15-17).
Mark 5:18-20
సమాధులలో నివసించిన వానిని ఇప్పుడు ఏమి చెయ్యమని యేసు చెప్పాడు??
ప్రభువు తనకు చేసిన కార్యములను తన ఇంటి వారికి తెలియచెప్పమని అన్నాడు. (5:19).
Mark 5:21-24
సమాజ మందిరపు అధికారి యాయీరు యేసును ఏమని అర్ధించాడు?
వచ్చి చావ సిద్ధమై ఉన్న తన కుమార్తె మీద చేతులుంచ వలసిందని యాయీరు యేసును అడిగాడు. (5:22-23).
Mark 5:25-27
యేసు వస్త్రమును ముట్టిన స్త్రీకున్న సమస్య ఏమిటి ?
ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధ పడుతుంది. (5:25).
Mark 5:28-29
ఆ స్త్రీ యేసు వస్త్రమును ఎందుకు ముట్టుకుంది ?
యేసు వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతాననుకొంది. (5:28).
Mark 5:30-32
ఆ స్త్రీ యేసు వస్త్రములను తాకినపుడు యేసు ఏమి చేసాడు?
యేసు తనలోనుండి ప్రభావము బయటకు వెళ్లిందని తనలో తాను గ్రహించి తనను తాకినదెవరో చూడడానికి చుట్టూ చూసాడు. (5:30,32).
Mark 5:33-34
జరిగిన సత్యమంతా ఆ స్త్రీ యేసుకు చెప్పినపుడు యేసు ఆమెతో ఏమి చెప్పాడు??
తన విశ్వాసము ఆమెను స్వస్థ పరచెను, సమాధానముతో వెళ్ళమని చెప్పాడు. (5:34).
Mark 5:35
యాయీరు ఇంటికి యేసు చేరినప్పుడు యాయీరు కుమార్తె పరిస్థితి ఎలా ఉంది ?
యాయీరు కుమార్తె చనిపోయింది. (5:35).
Mark 5:36-38
ఆ సమయంలో యేసు యాయీరుకు ఏమి చెప్పాడు??
భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని యేసు యాయీరుతో చెప్పాడు. (5:36).
Mark 5:39-40
యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు ఏమి అన్నారు?
యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు యేసుని చూచి అపహసించారు. (5:40).
ఆ చిన్నది ఉన్న గదిలోనికి యేసుతో పాటు ఎవరు వెళ్ళారు?
యేసు ఆ చిన్నదాని తండ్రిని, తల్లిని, పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళాడు. (5:37,40).
Mark 5:41-43
ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఎలా స్పందించారు?
ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఉక్కిరిబిక్కిరై ఎంతో విస్మయ మొందారు. (5:42).
Mark 6
Mark 6:1-3
యేసు స్వగ్రామ ప్రజలు యేసును చూసి ఎందుకు ఆశ్చర్య పడ్డారు?
ఈ బోధ, జ్ఞానం, ఆయన అద్భుతాలు యేసుకు ఎక్కడనుండి వచ్చాయి అని ప్రజలకు అర్ధం కాలేదు. (6:2).
Mark 6:4-6
ప్రవక్త ఎక్కడ ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు??
ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు. (6:4).
తన స్వగ్రామములోని ప్రజలలో దేనిని చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు??
తన స్వగ్రామములోని ప్రజలలోని అవిశ్వాసమును చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు?(6:6).
Mark 6:7-9
పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి ఏమి ఇచ్చాడు??
పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. (6:7).
పన్నెండుమంది శిష్యులు ప్రయాణము కొరకు వారితో ఏమి తీసుకొని వెళ్ళారు?
పన్నెండుమంది చేతికర్ర, చెప్పులు, ఒక అంగీని వారితో తీసుకొని వెళ్ళారు(6:8).
Mark 6:10-13
ఏ స్థలమందైనను వారిని స్వీకరించని యెడల ఏమి చెయ్యాలని పన్నెండు మంది శిష్యులకు యేసు చెప్పాడు?
వారిమీద సాక్షముగా ఉండుటకు వారి పాదముల క్రింద ధూళి దులిపి వేయాలని యేసు పన్నెండు మందికి చెప్పాడు. (6:11).
Mark 6:14-17
యేసు ఎవరని ప్రజలు అనుకొంటున్నారు?
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అని, ఏలియా అని, ప్రవక్త అని ప్రజలు అనుకొంటున్నారు. (6:14-15).
Mark 6:18-22
తాను చేయుచున్నది న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను దేని గురించి చెప్పాడు??
హేరోదు తన సహోదరుని భార్యను పెండ్లి చేసుకోవడం న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు? (6:18).
బాప్తిస్మమిచ్చు యోహాను సందేశాన్ని విని హేరోదు ఎలా స్పందించాడు?
యోహాను మాటలు వినిన ప్రతీసారి హేరోదు కలవరపడినా సంతోషముతో అతని మాటలు వినుచుండెను. (6:20).
Mark 6:23-25
హేరోదియకు హేరోదు ఇచ్చిన వాగ్దానం ఏమిటి?
తన రాజ్యములో సగము మట్టుకు తనను ఏమి అడిగినను ఇచ్చెదనని ఆమెకు ప్రమాణం చేసాడు. (6:23).
దేనికొరకు హేరోదియా అడిగింది ?
బాప్తిస్మమిచ్చు యోహాను తల ఒక పళ్ళెములో ఇప్పించమని అడిగింది.(6:25).
Mark 6:26-29
హేరోదియా మనవి పట్ల హేరోదు ఏ విధంగా స్పందించాడు?
హేరోదు బహుగా విచార పడ్డాడు, అయితే తన అతిధుల ఎదుట తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము ఆమె మనవిని నిరాకరించలేదు. (6:26).
Mark 6:30-32
యేసు, ఆయన అపోస్తలులును తమకు తాముగా విశ్రాంతి తీసుకోడానికి ప్రయత్నించినపుడు ఏమి జరిగింది ?
అనేకులు వారిని గుర్తుపట్టారు, పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. (6:31-33).
Mark 6:33-36
వారి కొరకు ఎదురు చూస్తున్న జన సమూహము పట్ల యేసు వైఖరి ఏమిటి ?
వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు. (6:34).
Mark 6:37-38
యేసు అడిగినప్పుడు ప్రజలకు ఆహారం పెట్టడానికి శిష్యులు ఏమి చెయ్యాలని ఆలోచించారు??
వారు వెళ్లి రెండు దేనారముల విలువైన రొట్టెలను కొనాలని తలంచారు. (6:37).
శిష్యుల వద్ద ఇంతకుముందే ఉన్న ఆహారం ఏమిటి ?
శిష్యుల వద్ద ఇంతకుముందే ఐదు రొట్టెలు, రెండుచేపలు ఉన్నాయి.
Mark 6:39-41
రొట్టెలను, చేపలను తీసుకొనినప్పుడు యేసు ఏమి చేసాడు?
రొట్టెలను, చేపలను తీసుకొని యేసు ఆకాశమువైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు. (6:41).
Mark 6:42-47
అందరు తినిన తరువాత ఎంత ఆహారం మిగిలింది ?
అందరు తిని తృప్తి పొందిన తరువాత చేపలును, రొట్టె ముక్కలును పండ్రెండుగంపలు మిగిలాయి. (6:43).
రొట్టెలు తినిన పురుషులు ఎంత మంది ?
ఆ రొట్టెలు తినిన వారు అయిదు వేల మంది పురుషులు. (6:44).
Mark 6:48-50
శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై ఎలా వచ్చాడు?
శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై నడుచుకుంటూ వచ్చాడు? (6:48).
తనను చూసినప్పుడు యేసు శిష్యులకు ఏమి చెప్పాడు?
ధైర్యము తెచ్చుకొని, భయపడకుడని యేసు తన శిష్యులకు చెప్పాడు?(6:50).
Mark 6:51-52
రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు ఎందుకు అర్ధం చేసుకోలేదు ?
వారి హృదయాలు బండబారిపోయి ఉన్నాయి కాబట్టి రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు అర్ధం చేసుకోలేదు. (6:52).
Mark 6:53-55
ఆ ప్రాంత ప్రజలు యేసును గుర్తు పట్టినప్పుడు ఏమి చేసారు?
రోగులను మంచాల మీద తీసుకొని వచ్చారు, ఆయన ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి చేరారు. (6:55).
Mark 6:56
కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న వారికి ఏమి జరిగింది ?
యేసు వస్త్రపు చెంగును ముట్టుకున్న వారు స్వస్థత పొందారు. (6:56).
Mark 7
Mark 7:2-5
పరిసయ్యులు, శాస్త్రులను అభ్యంతర పెట్టినట్లుగా యేసు శిష్యులలో కొందరు చేస్తున్న పని ఏమిటి ?
యేసు శిష్యులలో కొందరు అపవిత్రమయిన చేతులతో భోజనం చేస్తున్నారు. (7:2,5).
భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం ఎవరి ఆచారం ?
భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం పెద్దల ఆచారం (7:3-4).
Mark 7:6-10
కడుగుటను గురించిన భోధ విషయం లో యేసు పరిసయ్యులు, శాస్త్రులకు యేసు ఏమి చెప్పాడు??
పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు అనియు, వారు మానవ కల్పిత నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారని యేసు చెప్పాడు(7:6-9).
Mark 7:11-13
నీ తల్లి దండ్రులను ఘనపరచాలి అనే ఉపదేశాన్ని పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు ఏ విధంగా త్రోసివేస్తున్నారు?
వారి తల్లి దండ్రులకు ప్రయోజన కరమైన ధనమును అది కోర్బాను అని ఇచ్చే వారికి చెప్పడం ద్వారా దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. (7:10-13).
Mark 7:14-16
ఏది మనుష్యుని అపవిత్ర పరచదని యేసు చెప్పాడు?
వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్త్రునిగా చేయగలుగునది ఏదియు లేదని యేసు చెప్పాడు. (7:15,18-19).
ఏది మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు?
లోపలినుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు. (7:15,20-23).
Mark 7:17-19
ఏ రకమైన భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు?
అన్ని భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు. (7:19).
Mark 7:20-23
లోపలినుండి వెలుపలికి రాగలిగి మనుష్యుని అపవిత్రపరచు మూడు?ంశములేవి ?
దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము అనునవి లోపలినుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును. (7:21-22).
Mark 7:24-26
అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ యూదురాలా లేక గ్రీసు దేశస్థ్తురాలా ?
అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ గ్రీసు దేశస్థ్తురాలు. (7:25-26).
Mark 7:27-28
పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు అని యేసు చెప్పిన మాటకు ఆ స్త్రీ ఏ విధంగా స్పందించింది ?
కుక్క పిల్లలు కూడ బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును కదా అని ఆ స్త్రీ చెప్పింది. (7:28).
Mark 7:29-32
ఆ స్త్రీ కొరకు యేసు ఏమి చేసాడు?
అ స్త్రీ కుమార్తె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. (7:29-30).
Mark 7:33-35
చెవుడు, నత్తివానిని యేసు నొద్దకు తీసుకొని వచ్చినపుడు?ేసు ఏమి చేసాడు?
యేసు అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి చూసి, తెరువబడమని చెప్పాడు. (7:33-34).
Mark 7:36-37
ఆయన స్వస్థతలను గురించి ఎవరితోను చెప్పవద్దని వారితో చెప్పిన తరువాత అ ప్రజలు ఏమి చేసారు? ?
ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసారు. (8:1-2).
Mark 8
Mark 8:1-4
తనను వెంబడిస్తున్న జనసమూహము పట్ల యేసు ఎలాంటి జాలి చూపించాడు??
తనను వెంబడిస్తున్న జనసమూహము తినదానికి ఏమీ లేనందున వారి పట్ల యేసు జాలి చూపించాడు. (8:1-2).
Mark 8:5-6
శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి ?
శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి (8:5).
శిష్యుల రొట్టెలను యేసు ఏమి చేసాడు?
యేసు ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యుల కిచ్చెను. (8:6).
Mark 8:7-10
ఎంత మంది తిని తృప్తి చెందారు?
ఇంచుమించు నాలుగు వేల మంది పురుషులు తిని తృప్తి చెందారు. (8:9).
అందరు తిన్న తరువాత ఎంత భోజనం మిగిలింది ?
అందరు తిన్న తరువాత ఏడు గంపలనిండా భోజనం మిగిలింది (8:8).
Mark 8:11-13
ఆయనను పరీక్షించ దానికి పరిసయ్యులు యేసును ఏమి చెయ్యమని అడిగారు?
ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని పరిసయ్యులు యేసును అడిగారు. (8:11).
Mark 8:14-15
పరిసయ్యుల విషయంలో దేని గురించి యేసు తన శిష్యులను హెచ్చరించాడు?
పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు? (8:15).
Mark 8:16-17
దేని గురించి యేసు మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు?
తాము రొట్టెలు తేవడం మర్చిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు. (8:16).
Mark 8:18-21
ఆయన చెప్పిన అర్ధాన్ని అవగాహన చేసుకోడానికి వారికి తాను చేసిన ఏ అద్భుతాలను యేసు జ్ఞాపకం చేసాడు?
అయిదు వేల మందికి ఆహారం పెట్టడం, నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం గురించి వారికి జ్ఞాపకం చేసాడు. (8:19-21).
Mark 8:22-26
గుడ్డివాడు చూపు పూర్తిగా పొందటానికి యేసు చేసిన మూడు?ార్యాలు ఏమిటి ?
యేసు మొదట అతని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచాడు, తరువాత అతని కన్నుల మీద చేతులుంచాడు.(8:23-24).
Mark 8:27-28
యేసు ఎవరని జనులు చెప్పుకొంటున్నారు?
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా అనియు, ప్రవక్తలలో ఒకడని జనులు చెప్పుకొంటున్నారు?(8:28).
Mark 8:29-30
యేసు ఎవరని పేతురు చెప్పాడు?
యేసే క్రీస్తు అని పేతురు చెప్పాడు (8:29).
Mark 8:31-32
భవిష్యత్తులో జరిగే ఏ సంఘటనల గురించి యేసు తన శిష్యులకు స్పష్టంగా చెప్పడం ఆరంభించాడు??
మనుష్య కుమారుడు?నేక హింసలు పొందాలి, ఉపేక్షించ బడాలి, చంపబడాలి, మూడు దినములైన తరువాత లేపబడాలనే సంగతుల గురించి యేసు వారికి బోధించాడు. (8:31).
Mark 8:33-34
పేతురు తనను గద్దింప మొదలు పెట్టినపుడు యేసు పెతురుతో ఏమన్నాడు. ?
"సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను కాదు" అని యేసు పేతురుతో చెప్పాడు. (8:33).
తనను వెంబడించు ప్రతి ఒక్కరు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?
తనను వెంబడింప గోరువాడు తనను తాను ఉపేక్షించు కొని తన సిలువనెత్తుకోవాలని యేసు చెప్పా డు. (8:34).
Mark 8:35-37
లోకములోని వాటిని సంపాదించుకోవాలనే కోరిక ఉన్నవాని గురించి యేసు ఏమి చెప్పాడు?
"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?" అని యేసు అన్నాడు. (8:36).
Mark 8:38
తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?
ఆయన వచ్చునపుడు తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను సిగ్గుపడతాడని యేసు చెప్పాడు? (8:38).
Mark 9
Mark 9:1-3
దేవుని రాజ్యము బలముతో వచ్చునప్పుడు ఎవనిని చూస్తారు అని ఎవరి గురించి యేసు చెప్పాడు?
అక్కడ ఆయనతో నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని యేసు చెప్పాడు. (9:1).
ఆయనతో కలిసి పేతురు, యోహాను, యాకోబు ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్లినపుడు యేసుకు ఏమి జరిగింది ?
యేసు రూపాంతరం చెందాడు, ఆయన వస్త్రాలు ప్రకాశమానముగా మారాయి. (9:2-3).
Mark 9:4-6
కొండ మీద యేసుతో మాట్లాడుతున్నదెవరు?
ఏలియా, మోషేలు యేసుతో మాట్లాడుతున్నారు. (9:4).
Mark 9:7-8
కొండ మీద మేఘములోనుండి వచ్చిన శబ్ధము ఏమి చెప్పింది ?
"ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి" అని చెప్పింది. (9:7).
Mark 9:9-10
కొండమీద చూసిన దాని విషయంలో యేసు తన శిష్యులకు ఏమి ఆజ్ఞాపించాడు?
మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు వారు చూచిన దానిని ఎవరితోనూ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (9:9).
Mark 9:11-16
ఏలియా రావడం గురించి యేసు ఏమి చెప్పాడు?
ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క బెట్టునని, ఏలియా ముందే వచ్చాడని యేసు చెప్పాడు. (9:11-13).
Mark 9:17-19
ఆ తండ్రి కుమారులకు శిష్యులు ఏమి చెయ్యలేక పోయారు?
ఆ తండ్రి కుమారునిలో నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్ట లేక పోయారు. (9:17-18).
Mark 9:20-22
అపవిత్రాత్మ ఆ బాలుని దేని లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది ?
అపవిత్రాత్మ ఆ బాలుని అగ్నిలోనికి, నీళ్ళ లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. (9:22).
Mark 9:23-27
నమ్ము ప్రతీవానికి సమస్తమును సాధ్యము అని చెప్పినపుడు? తండ్రి ఎలా స్పందించాడు?
"నమ్ముచున్నాను, అపనమ్మకముండకుండ సహాయము చేయుమని" తండ్రి అడిగాడు. (9:23-24).
Mark 9:28-29
మూగదైన చెవిటి దయ్యమును ఆ చిన్నవానిలోనుండి శిష్యులు ఎందుకు వదలగొట్ట లేక పోయారు?
ప్రార్ధన వలననే దాని అది వెళ్ళ గొట్టబడును గనుక శిష్యులు దానిని వదలగొట్ట లేక పోయారు? (9:28-29).
Mark 9:30-32
తనకు ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్పాడు?
తాను మరణమునకు అప్పగింపబడతాడని, మూడు దినముల తరువాత తిరిగి లేస్తాడని వారికి చెప్పాడు. (9:31).
Mark 9:33-35
శిష్యులు మార్గమున వెళ్ళుచుండగా దేని గురించి వారు రోదించుచున్నారు??
వారిలో ఎవరు గొప్ప వారు?ని శిష్యులు వాదించుచున్నారు. (9:33-34).
ఎవరు మొదటి వాడు అని యేసు అన్నాడు?
అందరికీ పరిచారకుడైన వాడు మొదటివాడు అని యేసు అన్నాడు. (9:35).
Mark 9:36-41
యేసు నామం లో ఒక చిన్న బిడ్డను ఎవరైనా చేర్చుకొంటె వారు ఎవరిని చేర్చుకుంటున్నారు?
ఎవరైనా యేసు నామం లో ఒక చిన్న బిడ్డను చేర్చు కొంటె వారు చేర్చుకుంటున్నారు, అంతే కాకుండా యేసును పంపిన వానిని కూడా చేర్చుకుంటున్నారు. (9:36-37).
Mark 9:42-46
చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వానికి ఏమి జరగడం మేలు అని యేసు చెప్పాడు?
చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. (9:42).
నిన్ను అభ్యంతర పరచు దానిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?
నిన్ను అభ్యంతర పరచు దేనినైనను నరికి వెయ్యాలని యేసు చెప్పాడు. (9:47).
Mark 9:47-50
నరకంలో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?
నరకంలో వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని యేసు చెప్పాడు?9:48).
Mark 10
Mark 10:1-4
పరిసయ్యులు యేసును శోధించడానికి ఏ ప్రశ్న అడిగారు?
పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని పరిసయ్యులు యేసును అడిగారు. (10:2).
విడనాడుటను గురించి యూదులకు మోషే ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
ఒకడు పరిత్యాగ పత్రిక వ్రాయించి తన భార్యను విడనాడవచ్చునని మోషే సెలవిచ్చాడు. (10:4).
Mark 10:5-6
విడనాడుటను గురించిన ఆజ్ఞలను యూదులకు మోషే ఎందుకు ఇచ్చాడు?
వారి హృదయ కఠినత్వాన్ని బట్టి యూదులకు ఈ ఆజ్ఞలను మోషే రాసి ఇచ్చాడు. (10:5).
వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు చరిత్ర లో ఏ సంఘటనను ప్రస్తావిస్తున్నాడు?
వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు ఆరంభం లో స్త్రీ, పురుషుడు సృష్టి చెయ్యబడిన సంఘటనను ప్రస్తావించాడు. (10:6).
Mark 10:7-12
ఇద్దరు వ్యక్తులు అనగా పురుషుడు, స్త్రీ వివాహము అయిన తరువాత ఏమౌతారని యేసు చెప్పాడు??
వారిద్దరూ ఏక శరీరమౌతారని యేసు చెప్పాడు. (10:7-8).
వివాహములో దేవుడు జత పరచుటను గురించి యేసు ఏమీ చెప్పాడు?
దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని యేసు చెప్పాడు. (10:9).
Mark 10:13-14
తన వద్దకు చిన్న బిడ్డలను తీసుకొను వచ్చువారిని అభ్యంతర పరచిన వారి విషయం లో యేసు చూపిన ప్రతిచర్య ఏమిటి ?
యేసు శిష్యులను కోపగించుకున్నాడు, చిన్న బిడ్డలను తన వద్దకు రానివ్వమని వారితో చెప్పాడు. (10:13-14).
Mark 10:15-16
దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని ఎలా స్వీకరించాలని యేసు చెప్పాడు?
దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని చిన్నబిడ్డవలె అంగీకరించాలి అని యేసు చెప్పాడు. (10:15).
Mark 10:17-19
నిత్య జీవమునకు వారసుడగుటకు మొదట ఏమి చెయ్యాలని అతనికి యేసు చెప్పాడు?
నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని యేసు ఆ వ్యక్తికి చెప్పాడు. (10:19).
Mark 10:20-22
ఆ తరువాత యేసు అతనికి ఇచ్చిన అదనపు ఆజ్ఞలు ఏమిటి ?
తనకు కలిగినవన్నియు అమ్మి ఆయనను వెంబడించాలని చెప్పాడు. (10:21).
ఈ ఆజ్ఞ ఇచ్చినపుడు ఆ వ్యక్తి ఎలా స్పందించాడు, ఎందుకు?
అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ వ్యక్తి విచారపడుతూ వెళ్ళిపోయాడు. (10:22).
Mark 10:23-25
దేవుని రాజ్యం లోనికి ప్రవేశించాలంటే ఎవరికి కష్టం అని యేసు చెప్పాడు??
ఆస్థిపరులు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం కష్టతరం అని యేసు చెప్పాడు. (10:23-25).
Mark 10:26-28
ఆస్థిపరులు కూడా రక్షించబడగలరు అని యేసు ఎలా చెప్పాడు?
మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే అని యేసు చెప్పాడు. (10:26-27).
Mark 10:29-31
ఇంటిని, కుటుంబాన్ని, భూములనైనను యేసు కొరకు విడిచినవాడు ఏమి పొందుతాడని యేసు చెప్పాడు?
వారు ఐప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందును నిత్య జీవమును పొందుదురని చెప్పాడు. (1:10).
Mark 10:32-34
యేసును ఆయన శిష్యులును ఏ మార్గమున వెళుతున్నారు?
యేసును ఆయన శిష్యులును యెరుషలేము వెళ్ళు మార్గమున పోవుచున్నారు. (10:32).
తనకు యెరుషలేములో ఏమి జరగబోతున్నదని యేసు తన శిష్యులకు చెప్ప్పాడు?
తనకు మరణశిక్ష విధించబడబోతున్నదని, మూడు దినములైన తరువాత తిరిగి లేపబదతాడని తన శిష్యులకు యేసు చెప్పాడు. (10:33-34).
Mark 10:35-37
యాకోబు, యోహానులు యేసుకు చేసిన మనవి ఏమిటి ?
తన మహిమయందు ఆయన కుడివైపున ఒకడునును, ఎడుమవైపు ఒకడును కూర్చుండునట్లు దయచేయమని యేసును అడిగారు. (10:35-37).
Mark 10:38-40
యాకోబు, యోహాను ఏమి సహించవలసి ఉంది అని యేసు చెపుతున్నాడు?
తాను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, తాను పొందుచున్న బాప్తిస్మము తీసుకోనుట యైనను వారి చేతనగునాయని వారిని అడిగాడు. (10:39).
యాకోబు, యోహానుల మనవి యేసు అంగీకరించాడా?
లేదు. తన కుడివైపున, ఎడుమవైపున కూర్చుండ నివ్వడం తన వశములో లేదని చెప్పాడు. (10:40).
Mark 10:41-42
అన్యజనులలో అధికారులు తమ ప్రజలను ఏ విధంగా చూస్తారని యేసు చెప్పాడు?
అన్యజనులలోని అధికారులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారని ప్రభువు చెప్పాడు. (1:10).
Mark 10:43-45
శిష్యులలో గొప్పవాడిగా ఉండగోరిన వాడు ఏవిధంగా ఉండాలని యేసు కోరుతున్నాడు. ?
ఎవడైనను గొప్పవాడై ఉండగోరితే వాడు పరిచారము చేయవలెనని ప్రభువు చెప్పాడు. (10:43-44).
Mark 10:46-50
గుడ్డివాడైన బర్తిమయి మౌనంగా ఉండాలని అతనిని గద్దించినపుడు అతను ఏమి చేసాడు?
"దావీదు కుమారుడా నన్ను కరుణించు" మని మరి బిగ్గరగా కేకలు వేసాడు. (10:48).
Mark 10:51-52
బర్తిమయి గుడ్డితనం నుండి స్వస్థత పొందడానికి యేసు ఏమి చెప్పాడు?
బర్తిమయి విశ్వాసము అతనిని బాగు చేసిందని యేసు చెప్పాడు. (10:52).
Mark 11
Mark 11:1-3
యేసు వారికి ఎదురుగా ఉన్న గ్రామానికి ఇద్దరు మనుషులను పంపి వారిని ఏమి చెయ్యమని చెప్పాడు?
ఎవరూ ఎన్నడూ కూర్చుండని గాడిద పిల్లను తన వద్దకు తీసుకు రమ్మని వారిని పంపాడు. (11:2).
Mark 11:4-6
గాడిద పిల్లను విప్పుతున్నప్పుడు ఏమి జరిగింది ?
వారేమి చేయుచున్నారని కొందరు అడిగారు, అందుకు శిష్యులు యేసు వారికాజ్ఞాపించినట్టు చెప్పారు, అప్పుడు వారు దానిని పోనిచ్చారు. (11:5-6).
Mark 11:7-10
గాడిద పిల్ల మీద యేసు ఎక్కి ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఏమి పరచారు?
ప్రజలు తమ బట్టలను దారి పొడుగునా పరచారు, కొందరు పొలములో నరికిన కొమ్మలు పరచిరి. (11:8).
యేసు యెరూషలేము వైపుకు వెళ్తుండగా ప్రజల రానున్న ఏ రాజ్యము గురించి కేకలు వేస్తున్నారు?
తమ తండ్రి అయిన దావీదు రాజ్యము రాబోతున్నాదని కేకలు వేస్తున్నారు. (11:10).
Mark 11:11-12
దేవాలయ ప్రాంగణములోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?
చుట్టూ సమస్తమును చూచి బేతనియకు వెళ్ళాడు. (11:11).
Mark 11:13-14
ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేని అంజూరపు చెట్టుని చూసినపుడు యేసు ఏమి చేసాడు?
"ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని అంజూరపు చెట్టుతో అన్నాడు. (11:14).
Mark 11:15-16
ఈ సమయంలో యేసు దేవాలయంలోనికి ప్రవేశించిన తరువాత యేసు ఏమి చేసాడు?
క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టాడు, దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. (11:15-16).
Mark 11:17-19
లేఖనముల ప్రకారం దేవాలయము ఏవిధంగా ఉండాలని యేసు చెప్పాడు?
దేవాలయము సమస్తమైన జనములకు ప్రార్థన మందిరము అనబడును అని యేసు చెప్పాడు. (11:17).
శాస్త్రులు, ప్రధాన యాజకులు మందిరాన్ని ఏమి చేసారు?ని యేసు చెప్పాడు?
మందిరాన్ని దొంగల గుహగా చేసారని యేసు చెప్పాడు. (11:18).
ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఏమి చేయాలని ప్రయత్నించారు?
ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపడానికి ప్రయత్నించారు. (11:20).
Mark 11:20-23
యేసు మాట్లాడిన అంజూరపు చెట్టుకు ఏమి జరిగింది ?
యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి పోయింది. (11:20).
Mark 11:24-26
ప్రార్థనలో మనము అడుగువాటన్నిటి గురించి యేసు ఏమి చెప్పాడు?
ప్రార్థన చేయుచున్నప్పుడు మనము అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మాలి, అప్పుడవి మనకు కలుగును. (11:24).
పరలోకమందున్న తండ్రి కూడా క్షమించునట్లు మనము ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు?
పరలోకమందున్న తండ్రి మనలను క్షమించునట్లు ఒకని మీద విరోధ మేదైనను కలిగిఉన్నయెడల వారిని క్షమించాలి. (11:25).
Mark 11:27-28
మందిరములో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు నుండి ఏమి తెలుసుకోగోరారు?
ఏ అధికారము వలన తాను చేయుచున్న పనులను చేయుచున్నాడని తెలుసుకోగోరారు. (11:27-28).
Mark 11:29-30
ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను యేసు ఏమి అడిగాడు?
యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా అని అడిగాడు. (11:30).
Mark 11:31-33
యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను ఎందుకు చెప్పడానికి ఇష్టపడలేదు ?
యోహానును ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడని వారు జవాబు చెప్పలేదు. (11:31).
యోహాను బాప్తిస్మము మనుషుల నుండి కలిగినదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలను చెప్పడానికి ఎందుకు ఇష్టపడలేదు ?
వారు ప్రజలకు భయపడ్డారు, యోహాను ఒక ప్రవక్త అని వారు ఎంచారు గనుక వారు జవాబు చెప్పలేదు. (11:32).
Mark 12
Mark 12:1-3
ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ఏమి చేసాడు?
ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ప్రయాణమై వెళ్ళాడు. (12:1).
Mark 12:4-5
పంటలో భాగము తీసికొని రావడానికి తన దాసులను పంపినపుడు రైతులు ఏమి చేసారు?
ఆ రైతులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపి వేసారు. కొందరిని చంపివేశారు. (12:3-5).
Mark 12:6-7
యజమాని రైతుల వద్దకుకు చివరిగా ఎవరిని పంపించాడు?
యజమాని రైతుల వద్దకుకు చివరిగా తన ప్రియ కుమారుని పంపాడు. (1:10).
Mark 12:8-9
యజమాని చివరిగా రైతుల వద్దకు పంపిన వానిని ఏమి చేసారు?
ఆ రైతులు అతనిని పట్టుకొని, చంపి, ద్రాక్ష తోట వెలుపల పారవేసారు. (12:8).
ఆ రైతుల విషయంలో ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడు?
యజమాని వచ్చి అ రైతులను సంహరించి ఆ ద్రాక్షా తోటను ఇతరులకు ఇచ్చును. (12:9).
Mark 12:10-12
కట్టు వారు నిషేధించిన రాయికి ఏమి జరుగుతుందని లేఖనాలు చెపుతున్నాయి ?
కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అవుతుంది. (12:10).
Mark 12:13-15
పరిసయ్యులు, హేరోదియనులలో కొందరు యేసును ఏమి అడిగారు??
కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. (12:14).
Mark 12:16-17
వారి ప్రశ్నలకు యేసు ఎలా జవాబిచ్చాడు?
కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించమని చెప్పాడు. (12:17).
Mark 12:18-19
దేనియందు సద్దూకయ్యులు నమ్మకముంచరు?
సద్దూకయ్యులు పునరుత్థానములో నమ్మకముంచరు. (12:18).
Mark 12:20-23
సద్దూకయ్యులు చెప్పిన కథలో ఆ స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?
ఆ స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు?(12:22).
సద్దూకయ్యులు ఆ స్త్రీని గురించి యేసు ఏమని అడిగారు?
పునరుత్థానమందు వారిలో ఎవరికీ ఆమె భార్యగా ఉంటుంది అని అడిగారు. (12:23).
Mark 12:24-25
సద్దూకయ్యుల పొరపాటుకు యేసు ఏమి సమాధానం ఇచ్చాడు?
సద్దూకయ్యులు లేఖనములను గాని, దేవుని శక్తిని గురించి గాని ఎరుగరు అని చెప్పాడు. (12:24).
స్త్రీని గురించి సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకు యేసు ఏమని సమాధానం ఇచ్చాడు?
మృతులలో నుండి లేచునపుడు?ెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యబడరు అని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. (12:25).
Mark 12:26-27
పునరుద్ధానము ఉన్నదని లేఖనముల నుండి యేసు ఎలా చూపించాడు?
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు? అందరూ ఇంకా సజీవులుగానే ఉన్నారని దేవుడు చెప్పిన దానిని ప్రస్తావించాడు. (12:26-27).
Mark 12:28-29
ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు?
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (12:29-30).
యేసు చెప్పిన రెండవ ఆజ్ఞ ఏది?
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెననునది రెండవ ఆజ్ఞ అని యేసు చెప్పాడు (12:31).
Mark 12:30-34
ఇవన్నియు జరుగు వరకు ఏమి గతించదని యేసు చెప్పాడు?
ఇవన్నియు జరుగు వరకు అంతము గతింపదని యేసు చెప్పాడు. (13:30).
ఏమి గతింపవు అని యేసు చెప్పాడు?
ఆయన మాటలు గతింపవు అని యేసు చెప్పాడు. (13:32).
ఈ విషయాలు ఎప్పుడు నెరవేరుతాయని యేసు చెప్పాడు?
తండ్రి తప్ప మరి ఎవరికీ ఆ దినం గానీ, గంట గానీ తెలియవు అని చెప్పాడు (13:32).
Mark 12:35-37
దావీదు గురించి శాస్త్రులను యేసు ఏమని ప్రశ్నించాడు?
దావీదు క్రీస్తును ప్రభువని చెప్పుచున్నాడు, ఆయన ఏలాగు అతని కుమారుడగును అని యేసు అడిగాడు. (12:35-37).
Mark 12:38-42
శాస్త్రుల విషయంలో దేని గురించి జాగ్రత్త పడమని యేసు చెప్పాడు?
శాస్త్రులు మనుష్యుల చేత గౌరవింప బడాలని కోరతారు, అయితే వారు విధవరాండ్ర ఇండ్లు దిగ మింగుతారు, ప్రజలు చూడాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. (12:38-40).
Mark 12:43-44
పేద విధవరాలు కానుక పెట్టె లో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసిందని యేసు ఎందుకు చెప్పాడు??
ఆమె తన లేమిలో తనకు కలిగినదంతటిలో వేసింది అయితే ఇతరులు తమకు కలిగిన సమృద్దిలోనుండి వేసారు అని యేసు చెప్పాడు. (12:44).
Mark 13
Mark 13:1-2
దేవాలయము కట్టడములు, దానిలోని అద్భుతమైన రాళ్ళకు ఏమి జరగబోతుందని యేసు చెప్పాడు?
రాతిమీద రాయి యొకటియైనను నిలిచి యుండకుండ పడద్రోయబడునని యేసు చెప్పాడు. (13:2).
Mark 13:3-4
అప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?
ఇవి ఎప్పుడు పెరుగుతాయి, వాటి గురుతులు ఏవి అని అడిగారు. (13:4).
Mark 13:5-6
దేని విషయంలో శిష్యులు జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు?
ఎవడును వారిని మోసపుచ్చకుండా చూచుకోవాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. (13:5-6).
Mark 13:7-8
వేదనలకు ప్రారంభం అని వేటి గురించి యేసు చెప్పాడు?
వేదనలకు ప్రారంభం యుద్ధాలు, యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు అని యేసు చెప్పాడు. (13:7-8).
Mark 13:9-10
శిష్యులకు ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?
శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).
మొదట ఏమి జరగవలసి ఉన్నదని యేసు చెప్పాడు?
సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).
Mark 13:11-13
కుటుంబ సభ్యుల మధ్య ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు??
కుటుంబములోని ఒక సభ్యుడు మరొకరిని మరణానికి అప్పగిస్తారు?ని యేసు చెప్పాడు. (13:12).
ఎవరు రక్షించ బడతారు అని యేసు చెప్పాడు?
అంతము వరకు సహించిన వాడే రక్షించ బడును అని యేసు చెప్పాడు. (13:13).
Mark 13:14-16
యూదయలో ఉన్నవారు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలవడం చూచినపుడు వారు ఏమి చెయ్యాలని యేసు చెప్పాడు??
నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు చూచినపుడు యూదావారు కొండలకు పారిపోవాలి అని యేసు చెప్పాడు. (13:14).
Mark 13:17-20
ఏర్పరచబడిన వారి నిమిత్తము వారు రక్షింపబడు నిమిత్తము ప్రభువు ఏమి చేయ్యబోతున్నాడని యేసు చెప్పాడు?
ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమల దినములను ప్రభువు తక్కువ చేసాడని యేసు చెప్పాడు. (13:20).
Mark 13:21-23
ఎవరు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు?
అబద్దపు క్రీస్తులు, అబద్దపు ప్రవక్తలు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు? (13:22).
Mark 13:24-32
ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత ఆకాశములోని శక్తులకు ఏమి జరుగుతుంది?
సూర్య చంద్రులను చీకటి కమ్ముతుంది, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ మందు శక్తులు కదిలించ బడతాయి. (13:24-25).
మేఘాలలో దేనిని మనుష్యులు చూస్తారు?
మనుష్య కుమారుడు మహా ప్రభావముతోను, మహిమతోను మేఘవాహనుడై వచ్చుట చూస్తారు. (13:26).
మనుష్య కుమారుడు వచ్చినపుడు ఏమి చేస్తాడు?
మనుష్య కుమారుడు వచ్చినపుడు భూమ్యంతము మొదలుకొని ఆకాశము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకోనిన వారిని పోగుచేయించును. (13:27).
Mark 13:33-37
ఆయన రాకడ గురించి తన శిష్యులకు యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు. (13:33,35,37).
Mark 14
Mark 14:1-2
ఏమి చెయ్యాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆలోచిస్తున్నారు?
మాయోపాయము చేత ఆయనను ఎలా పట్టుకొని చంపుదామా అని ఆలోచిస్తున్నారు. (14:1).
ప్రధాన యాజకులు, శాస్త్రులు పులియని రొట్టెల పండుగ సమయములో ఎందుకు యేసును పట్టుకొనలేదు ?
పండుగ సమయములో ప్రజలలో అల్లరి కలుగునేమో అని ఆందోళన చెందారు. (14:2).
Mark 14:3-5
కుష్టరోగి అయిన సీమోను ఇంటి వద్ద ఒక స్త్రీ యేసుకు ఏమి చేసింది ?
మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. (14:3).
ఎందుకు కొందరు ఆమెను గద్దించారు?
ఆ అత్తరు ఎక్కువకు అమ్మి ఆ డబ్బును బీదలకియ్యవచ్చు గదా, అని గద్దించారు. (14:5).
Mark 14:6-9
ఆ స్త్రీ తనకు ఏమి చేసిందని యేసు చెప్పాడు?
ఆ స్త్రీ తన భూస్థాపాన నిమిత్తము ఆయన శరీరమును అభిషేకించిందని యేసు చెప్పాడు. (14:8).
ఆ స్త్రీ చేసిన దాని విషయంలో యేసు ఏ వాగ్దానాన్ని చేసాడు?
సర్వ లోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింప బడునో అక్కడ ఆ స్త్రీ చేసినవి జ్ఞాపకార్ధముగా ప్రకటింపబడునని వాగ్డానము చేసాడు. (14:9).
Mark 14:10-11
ఇస్కరియోతు యూదా ఎందుకు ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు??
యేసును వారికి పట్టివ్వడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు? (14:10).
Mark 14:12-16
వారందరూ కలిసి పస్కాను భుజించడానికి శిష్యులు స్థలాన్నిఎలా కనుగొన్నారు?
వారు పట్టణములోనికి వెళ్లి అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న వానిని వెంబడించి, వారు భుజించుటకు విడిది గది ఎక్కడ అని అతనిని అడుగమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (14:12-14).
Mark 14:17-19
వారు బల్ల వద్ద కూర్చుని భోజనం చేయుచుండగా యేసు ఏమి చెప్పాడు??
శిష్యులలో ఒకడు తన్ను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:18).
Mark 14:20-21
ఏ శిష్యుడు తనను అప్పగింపబోతున్నాడని యేసు చెప్పాడు?
తనతో పాటు పాత్ర లో చెయ్యి ముంచు శిష్యుడే తనను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:20).
తనను అప్పగించబోతున్న వాని గమ్యము గురించి యేసు ఏమి చెప్పాడు?
ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు అని యేసు చెప్పాడు. (14:21).
Mark 14:22-25
విరువబడిన రొట్టెను శిష్యులకు ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?
"మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము" అని యేసు చెప్పాడు? (14:22).
పాత్రను శిష్యులకి ఇస్తున్నపుడు యేసు ఏమి చెప్పాడు?
"ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము" అని యేసు చెప్పాడు. (14:24).
ఈ ద్రాక్షారసమును ఎప్పుడు తాగుతాడని యేసు చెప్పాడు?
దేవుని రాజ్యములో ద్రాక్షా రసమును కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని యేసు చెప్పాడు. (14:25).
Mark 14:26-29
ఒలీవల కొండ వద్ద శిష్యుల విషయం ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?
తన నిమిత్తము శిష్యులందరూ అభ్యంతరపడతారని యేసు ముందుగా చెప్పాడు. (14:27).
Mark 14:30-31
తాను అభ్యంతరపడనని పేతురు చెప్పిన తరువాత యేసు పేతురుతో ఏమి చెప్పాడు?
ఆరోజు కోడి రెండు సార్లు కూయక ముందే తనను ఎరుగనని పేతురు మూడు సార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు. (14:30).
Mark 14:32-34
తాను ప్రార్థించుచుండగా తన ముగ్గురు శిష్యులను ఏమి చెయ్యమని యేసు చెప్పాడు?
వారు ఎక్కడ ఉండి ప్రార్ధించమని వారితో యేసు చెప్పాడు. (14:32-34).
Mark 14:35-36
దేని కొరకు యేసు ప్రార్ధించాడు??
ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్ధించాడు. (14:35).
తండ్రికి తాను చేసిన ప్రార్ధనకు వచ్చే జవాబుకు తన అంగీకారము ఏమిటి ?
తండ్రి చిత్తము ఏదైనప్పటికీ అంగీకరించడానికి యేసు ఇష్టం చూపాడు. (14:36).
Mark 14:37-39
తన ముగ్గురు శిష్యుల వద్దకు తాను వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??
తన ముగ్గురు శిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:37).
Mark 14:40-42
ప్రార్ధన నుండి రెండవ సారి వచ్చినప్పుడు యేసు ఏమి చూసాడు??
తన ముగ్గురు?ిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:40).
ప్రార్ధన నుండి మూడవ సారి వచ్చినప్పుడు ఏమి చూసాడు??
తన ముగ్గురు?ిష్యులు నిద్ర పోవడం ఆయన చూసాడు. (14:41).
Mark 14:43-46
యేసు గుర్తించడానికి యూదా ఏ గుర్తును ఇచ్చాడు?
యూదా యేసును ముద్దు పెట్టడం ద్వారా ఆ వ్యక్తి యేసు అని చూపించ గోరాడు. (14:44-45).
Mark 14:47-50
లేఖనము నెరవేరునట్లు తనను బంధించడములో ఏమి జరిగిందని యేసు చెప్పాడు?
బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను పట్టుకొన వచ్చినందున లేఖనము నేరవేరినదని యేసు చెప్పాడు. (14:48-49).
యేసు పట్టబడినపుడు ఆయనతో ఉన్నవారు ఏమి చేసారు??
యేసుతో ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయారు. (14:50).
Mark 14:51-52
యేసును వెంబడిస్తున్న పడుచువాడు యేసు పట్టబడినపుడు ఏమి చేసాడు?
ఆ పడుచువాడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయాడు. (14:51-52).
Mark 14:53-54
ప్రధాన యాజకుని వద్దకు యేసును తీసుకొని వెళ్ళినపుడు పేతురు ఎక్కడ ఉన్నాడు??
పేతురు సైనికుల కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొంటున్నాడు. (14:53-54).
Mark 14:55-59
మహాసభలో యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యంలో ఉన్న లోపము ఏమిటి ?
యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యం అబద్దము, అవి ఒకదానికొకటి సరిపడలేదు. (14:55-59).
Mark 14:60-62
యేసు ఎవరనే దాని విషయం ప్రధాన యాజకుడు యేసును అడిగాడు?
పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు తానేనా అని ప్రధాన యాజకుడు యేసును అడిగాడు. (14:61).
ప్రధాన యాజకుని ప్రశ్నకు యేసు ఇచ్చిన సమాధానమేమిటి ?
పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు తానేనని యేసు జవాబిచ్చాడు. (14:62).
Mark 14:63-65
యేసు సమాధానము వినిన ప్రధాన యాజకుడు యేసు దోషి అని చెప్పడానికి ఏమి చేసాడు??
దేవదూషణ చేసిన కారణంగా యేసు దోషి అని ప్రధాన యాజకుడు చెప్పాడు. (14:64).
మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరము మోపిన తరువాత యేసును ఏమి చేసారు?
వారు ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దుచూ కొట్టారు. (14:65).
Mark 14:66-70
పేతురు యేసుతో ఉన్నవాడు అని చెప్పిన చిన్న బాలికతో పేతురు ఏమి అన్నాడు?
తనకు తెలియదనీ, ఆమె అంటున్నది తనకు బోధ పడలేదనీ పేతురు బాలికతో చెప్పాడు. (14:66).
Mark 14:71-72
యేసు శిష్యులతో ఉన్నవాడు అని పేతురును మూడవ మారు అడిగినప్పుడు పేతురు స్పందన ఏమిటి ?
యేసును ఎరుగనని శపించు కొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. (14:71).
మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత ఏమి జరిగింది ?
మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత రెండవ సారి కోడి కూసింది. (14:72).
కోడి కూత వినిన తరువాత పేతురు ఏమి చేసాడు?
కోడి కూత వినిన తరువాత పేతురు కృంగి పోయి ఏడ్చాడు. (14:72).
Mark 15
Mark 15:1-3
ఉదయం కాగానే ప్రధాన యాజకుడు ఏమి చేసారు?
ఉదయం కాగానే వారు యేసును బంధించి, పిలాతుకు అప్పగించారు. (15:1).
Mark 15:4-5
ప్రధాన యాజకులు యేసు పై అనేకమైన నిందలు మోపుచుండగా యేసు గురించి ఏది పిలాతును ఆశ్చర్య పడేలా చేసింది?
యేసు ఏ జవాబు చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడ్డాడు. (15:5).
Mark 15:6-8
పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఏమి చేస్తుండే వాడు?
పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఒక ఖయిదీని విడుదల చేస్తుండే వాడు. (15:6).
Mark 15:9-11
ఎందుకు పిలాతు యేసును జనసమూహము కొరకు విడుదల చెయ్య గోరాడు?
ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకున్నాడు. (15:10).
ఎవరిని విడుదల చెయ్యమని జనసమూహం కేకలు పెట్టారు, అతడు చెరసాలలో ఉండునట్లు ఏమి చేసాడు?
బరబ్బాను విడుదల చెయ్యమని వారు కేకలు వేసారు, అతడు హంతకుడు. (15:7,11).
Mark 15:12-15
యూదుల రాజుకు ఏమి చెయ్యాలని జనసమూహం అడిగారు?
యూదుల రాజు సిలువ వేయబడాలని జనసమూహం కేకలు వేసారు. (15:12-14).
Mark 15:16-18
అధిపతి సైనికులు యేసును ఏవిధంగా సిద్ధపరచారు??
సైనికులు యేసుకు ఊదారంగు వస్త్రాన్ని ధరింప చేసారు, ముండ్ల కిరీటాన్ని తలపై పెట్టారు. (15:17).
Mark 15:19-21
యేసు సిలువను ఎవరు మోశారు?
కురేనియుడైన సీమోను యేసు సిలువను మోయడానికి బలవంత పెట్టబడ్డాడు. (15:21).
Mark 15:22-24
యేసును సిలువ వెయ్యడానికి సైనికులు తీసుకొని వచ్చిన స్థలము పేరు ఏమిటి ?
యేసును సిలువ వెయ్యడానికి తీసుకొని వచ్చిన స్థలము పేరు గొల్గోత. (15:22).
యేసు వస్త్రములను సైనికులు ఏమి చేసారు?
యేసు వస్త్రముల కొరకు సైనికులు చీట్లు చేసారు?(15:24).
Mark 15:25-28
యేసుకు వ్యతిరేకంగా సైనికులు చెక్క పై ఏమి రాసారు?
సైనికులు ఆ చెక్క పై "యూదులకు రాజు" అని రాసారు. (15:26).
Mark 15:29-30
దారివెంట వెళుతున్న వారు యేసును ఏమి చెయ్య మని సవాలు చేస్తున్నారు?
తనని తాను రక్షించు కొని సిలువ మీద నుండి కిందికి దిగి రమ్మని ఆయనను సవాలు చేస్తున్నారు. (15:29).
Mark 15:31-32
తాము నమ్మునట్లు యేసును ఏమి చెయ్య మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు?
తాము నమ్మునట్లు యేసును సిలువ మీదనుండి దిగి రమ్మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు. (15:31-32).
యేసును హేళన చేస్తూ ప్రధాన యాజకులు ఆయనకు ఇచ్చిన బిరుదులు ఏమిటి ?
ప్రధాన యాజకులు ఆయనను క్రీస్తు అని, ఇశ్రాయేలుకు రాజు అని పిలిచారు. (15:32).
Mark 15:33-35
ఆరవ గంట సమయములో ఏమి జరిగింది ?
ఆరవ గంట సమయములో ఆ దేశమంతటను చీకటి కమ్మింది. (15:33).
తొమ్మిదవ గంట సమయంలో యేసు ఏమని అరిచాడు??
"నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి" అని బిగ్గరగా కేక వేసాడు. (15:34).
Mark 15:36-38
తాను చనిపోక ముందు యేసు ఏమి చేసాడు?
ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. (15:37).
యేసు చనిపోయినప్పుడు దేవాలయములో ఏమి జరిగింది ?
దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది. (15:38).
Mark 15:39-41
యేసు చనిపోయిన విధానాన్ని చూసిన శతాధిపతి ఏమని సాక్ష్యమిచ్చాడు?
నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. (15:39).
Mark 15:42-44
ఏ రోజున యేసు చనిపోయాడు?
విశ్రాంతి దినమునకు ముందు రోజున యేసు చనిపోయాడు? (15:42).
Mark 15:45-47
యేసు చనిపోయిన తరువాత అరిమతయి యోసేపు ఏమి చేసాడు?
అరిమతయి యోసేపు పిలాతును యేసు దేహమును తనకిమ్మని అడిగాడు, సిలువనుండి ఆయనను దించి, నార బట్టతో ఆయనను చుట్టి, సమాధి యందు ఆయనను ఉంచాడు, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. (15:43,46).
Mark 16
Mark 16:1-2
యేసు దేహాన్ని అభిషేకించడం కోసం స్త్రీలు సమాధి యొద్దకు ఎప్పుడు వెళ్ళారు?
వారంలో మొదటి రోజున సూర్యోదయమైనప్పుడు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు. (16:2).
Mark 16:3-4
సమాధి వద్ద పెద్ద రాయి ఉన్నప్పటికీ ఆ స్త్రీలు సమాధి లోనికి ఎలా ప్రవేశించారు?
సమాధి వద్ద ఉన్న రాయిని ఎవరో దొరలించి వేసారు. (16:4).
Mark 16:5-8
ఆ స్త్రీలు సమాధి లోనికి ప్రవేశించగానే ఏమి చూసారు?
తెల్లని అంగీ ధరించు కొనియున్న ఒక యువకుడు కుడి వైపున కూర్చుండుట చూసారు. (16:5).
యేసును గురించి యువకుడు ఏమి చెప్పాడు?
యేసు లేచి ఉన్నాడు, అక్కడ లేడు అని ఆ యువకుడు చెప్పాడు (16:6).
శిష్యులు యేసును ఎక్కడ కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు?
శిష్యులు యేసును గలలియలో కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు. (16:7).
Mark 16:9-11
యేసు పునరుత్థానుడైన తరువాత మొదట ఎవరికీ కనిపించాడు??
యేసు పునరుత్థానుడైన తరువాత మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. (16:9).
యేసు బ్రతికి ఉన్నాడని మరియ యేసు శిష్యులకు చెప్పినపుడు వారు ఏవిధంగా స్పందించారు?
శిష్యులు నమ్మలేదు. (16:11).
Mark 16:12-13
యేసు సజీవుడిగా చూసామని మరొక ఇద్దరు చెప్పినపుడు శిష్యులు ఏవిధంగా స్పందించారు?
శిష్యులు నమ్మలేదు (16:13).
Mark 16:14-16
యేసు శిష్యులకు ప్రత్యక్ష్యమైనపుడు వారి అపనమ్మకమును గురించి యేసు ఏమన్నాడు?
వారి అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించాడు. (16:14).
యేసు తన శిష్యులకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు?
సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ఆజ్ఞాపించాడు. (16:15).
ఎవరు రక్షించబడతారని యేసు చెప్పాడు?
నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడుదురని యేసు చెప్పాడు. (16:16).
ఎవరికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు?
నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు. (16:16).
Mark 16:17-18
నమ్మిన వారి వలన ఏ సూచక క్రియలు కనబడునని యేసు చెప్పాడు?
నమ్మిన వారు దయ్యములను వెళ్ళ గొట్టుడురు, కొత్త భాషలు మాట్లాడుతారు, మరణకరమైనదేదియు వారికి హాని చెయ్యదు. వారు ఇతరులను స్వస్థత పరచుదురు. (16:17-18).
Mark 16:19-20
శిష్యులతో మాట్లాడిన తరువాత యేసుకు ఏమి జరిగింది ?
శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).
అప్పుడు శిష్యులు ఏమి చేసారు?
శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).
అప్పుడు ప్రభువు ఏమి చేసాడు?
ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).