2 Corinthians
2 Corinthians 1
2 Corinthians 1:1-2
ఈ పత్రిక ఎవరు రాశారు?
పౌలు, తిమోతి పత్రిక రాశారు[1:1].
ఎవరికోసం ఈ పత్రిక రాయడం జరిగింది?
కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, ఆకయ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికి ఈ పత్రిక రాయడం జరిగింది[1:1].
2 Corinthians 1:3-7
పౌలు దేవుని ఏవిధంగా వివరిస్తున్నాడు?
దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి, కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణను అనుగ్రహించే తండ్రి గా పౌలు వివరిస్తున్నాడు[1:3].
ఎందుకు దేవుడు మన కష్టాలలో మనలను ఆదరిస్తాడు?
దేవుడు ఏ ఆదరణతో మమ్మును ఆదరించుచున్నాడో అలాంటి ఆదరణతో ఎలాంటి కష్టాలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమవుటకు ఆయన మా కస్టాలన్నిటిలో మమ్మును ఆదరించుచున్నాడు [1:4].
2 Corinthians 1:8-10
పౌలు, అతని సహచరులును ఆసియాలో ఎలాంటి కష్టాలు పొందారు?
వారి బలానికి మించిన విపరీతమైన ఒత్తిడి వారి మీదికి వచ్చింది. వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు[1:8-9].
పౌలు అతని సహచరుల మీద మరణం విధించినట్టు అనిపించడానికి కారణం ఏమిటి?
తమ మీద కాక దేవుని మీద నమ్మకం ఉంచేలా వారికి మరణం విధించినట్టు అనిపించింది[1:9].
2 Corinthians 1:11
కొరింతు సంఘం తమకు ఏ విధంగా సాయపడిందని పౌలు చెపుతున్నాడు?
కొరింతు సంఘం వారి ప్రార్ధనల ద్వారా తమకు సాయం చేసిందని పౌలు చెప్పాడు[1:11].
2 Corinthians 1:12-14
పౌలు, అతని సహచరులు ఏ విషయం అతిశయపడ్డారని పౌలు చెప్పాడు?
వారు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండ, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, నిజాయితితో దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొన్నారని, ప్రత్యేకించి కొరింతు సంఘం విషయంలో నడచుకున్నారని వారి మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అతిశయపడుతున్నారు[1:12].
ప్రభువైన యేసు దినమందు ఏమి జరుగబోతున్నదని పౌలు స్థిరంగా ఉన్నాడు?
ఆ రోజున కొరింతు పరిశుద్ధులు అతిశయానికి కారణమౌతారని పౌలు, అతని అనుచరులు స్థిరంగా ఉన్నారు[1:14].
2 Corinthians 1:15-20
కొరింతు పరిశుద్దులను ఎన్ని సార్లు దర్శించాలని పౌలు సిద్ధపడ్డాడు?
పౌలు వారిని దర్శించాలని రెండు సార్లు సిద్ధపడ్డాడు[1:15].
2 Corinthians 1:21-22
క్రీస్తు మన హృదయాలలో ఆత్మను ఇవ్వడానికి ఒక కారణం ఏమిటి?
ఆయన మనకు ఇవ్వబోతున్న దానికి హామీగా మన హృదయంలో తన ఆత్మను అనుగ్రహించాడు[1:22].
2 Corinthians 1:23-24
ఎందుకు పౌలు కొరింతుకు రాలేదు?
వారిని నొప్పించడం ఎందుకని పౌలు కొరింతుకు రాలేదు[1:23].
పౌలు, తిమోతిను కొరింతు సంఘం విషయం తాము ఎలా ఉన్నాము అని పౌలు చెపుతున్నాడు?
వారి విశ్వాసం మీద పెత్తనం చెయ్యడం లేదని పౌలు చెపుతున్నాడు, అయితే వారి ఆనందం కోసం కొరింతు సంఘంతో కలసి పనిచేస్తున్నట్లు పౌలు వారికి చెప్పాడు[1:24].
2 Corinthians 2
2 Corinthians 2:1-2
కొరింతు సంఘం వద్దకు రాకుండా ఉండడం ద్వారా పౌలు ఎలాంటి పరిస్థితులను తప్పించాలని చూస్తున్నాడు?
బాధాకరమైన పరిస్థితులనుండి తప్పించుకోవడానికి పౌలు కొరింతు సంఘానికి రాకుండా అగుతున్నాడు[2:1].
2 Corinthians 2:3-4
పౌలు కొరింతు సంఘానికి తన ముందు ఉత్తరంలో రాసినట్టు ఎందుకు రాశాడు?
పౌలు వారి వద్దకు వచ్చినపుడు తనకు సంతోషాన్ని కలిగించవలసిన వారు విచారాన్ని కలిగించకూడదని ముందు అలా రాశాడు[2:3].
పౌలు కొరింతు సంఘానికి ముందు రాసినపుడు అతని మనసు స్థితి ఎలా ఉంది?
పౌలు ఎంతో బాధతో, హృదయవేదనతో ఉన్నాడు[2:4].
కొరింతు సంఘానికి పౌలు ఈ ఉత్తరం ఎందుకు రాశాడు?
కొరింతు వారిపట్ల పౌలుకున్న అత్యధిక ప్రేమ వారు తెలుసుకోవాలని వారికి రాశాడు[2:4].
2 Corinthians 2:5-7
వారు శిక్షించిన వాని పట్ల కొరింతు విశ్వాసులు ఇప్పుడు ఏమి చేయాలని పౌలు చెప్పాడు?
వారు అతనిని క్షమించి ఆదరించాలని పౌలు చెప్పాడు[2:6-7].
వారు శిక్షించిన వానిని క్షమించి అతనిని ఆదరించాలని పౌలు కొరింతు పరిశుద్ధులకు ఎందుకు చెప్పాడు?
వారు శిక్షించినవాడు అత్యధిక విచారంలో మునిగి పోతాడేమో అని పౌలు అలా చెప్పాడు[2:7].
2 Corinthians 2:8-9
కొరింతు సంఘానికి రాయడానికి మరొక కారణం ఏమిటి?
వారిని పరీక్షించడానికి, వారు అన్నింటిలో విధేయత కలిగి ఉంటారో లేదో అని తెలుసుకోడానికి పౌలు రాశాడు[2:9].
2 Corinthians 2:10-11
వారు ఎవరిని క్షమిస్తారో వారు క్రీస్తు సన్నిధిలో వారిని పౌలు కూడా క్షమిస్తాడని కొరింతు సంఘం తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
సాతాను వారిని ఏమాత్రం మోసపరచకూడదని పౌలు చెప్పాడు[2:11].
2 Corinthians 2:12-13
పౌలు త్రోయకు వెళ్ళినపుడు తనకు ఎందుకు మనసులో నెమ్మది లేదు?
త్రోయలో తన సోదరుడైన తీతు కనబడలేదు కనుక పౌలుకు మనసు నెమ్మది లేదు[2:13].
2 Corinthians 2:14-15
పౌలు అతని అనుచరుల ద్వారా దేవుడు ఏమి చేసాడు?
పౌలు అతని అనుచరుల ద్వారా దేవుడు ప్రతిచోట క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాడు[2:14-15].
2 Corinthians 2:16-17
పౌలు, అతని సహచరులు దేవుని వాక్యం వల్ల అక్రమలాభం సంపాదించే వారికి భిన్నమైనవారు అని ఎలా చెప్పాడు?
పౌలు, అతని సహచరులు దేవునినుండి వచ్చినవారు, పవిత్రమైన ఉద్దేశాలతో, దేవుని ఎదుటే క్రీస్తులో మాట్లాడేవారు[2:17].
2 Corinthians 3
2 Corinthians 3:1-3
ఎటువంటి సిఫారసు లేఖలు పౌలు, అతని సహచరుల వద్ద ఉన్నాయి?
మనుషులందరూ గుర్తించి చదవగలిగే కొరింతు పరిశుద్దులే వారి సిఫారసు లేఖ[3:2].
2 Corinthians 3:4-6
పౌలుకు అతని సహచరులకు క్రీస్తు ద్వారా దేవునిలో నమ్మకం ఏమిటి?
వారి సొంత సామర్ధ్యం మీద వారికి నమ్మకం లేదు కాని దేవుడు అనుగ్రహించిన సామర్ధ్యం మీద వారి నమ్మకం ఉంది[3:4-5].
దేవుడు పౌలు, అతని సహచరులను యోగ్యులుగా చేసిన నూతన నిబంధనకు ఆధారమేమిటి?
మనుష్యులను చంపు అక్షరం కాక జీవమునిచ్చు ఆత్మమీద నూత నిబంధన ఆధారపడింది[3:6].
2 Corinthians 3:7-8
ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని సూటిగా ఎందుకు చూడలేక పోయారు?
మోషే ముఖంమీద కనిపించిన మహిమా ప్రకాశం తగ్గిపోయేదైనా వారు చూడలేక పోయారు[3:7].
2 Corinthians 3:9-13
తగ్గిపోతున్న, శిక్షా విధికి కారణమైన పరిచర్య, లేక ఆత్మకు నీతికి కారణమైన నిత్యం నిలిచే పరిచర్య - దేనికి ఎక్కువ మహిమ ఉంది?
ఆత్మ సంబధమైన పరిచర్య ఎంతో మహిమ గలది. నీతికి కారణమైన పరిచర్య ఎంతో అత్యధిక మహిమ కలది. శాశ్వతమైన దానికి ఎక్కువ మహిమ ఉంది [3:8-11].
2 Corinthians 3:14-16
మోషే పాత నిబంధన చదివినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలకు నేటి వరకు ఉన్న సమస్య ఏమిటి?
నేటి వరకూ మోషే గ్రంథాన్నిచదివినప్పుడల్లా వారి హృదయాలకు ముసుకు ఉంది[3:15].
ఇశ్రాయేలు హృదయాలు ఎలా తెరచుకుంటాయి, వారి ముసుకు ఎలా తొలగిపోతుంది?
ఇశ్రాయేలు ప్రజలు ప్రభువువైపు తిరిగినప్పుడు మాత్రమే వారి హృదయాలు తెరచుకుంటాయి, వారి ముసుకు తొలగిపోతుంది [3:14,16].
2 Corinthians 3:17-18
ప్రభువ్హు ఆత్మతో ఉన్నదేంటి?
ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది[3:17].
ప్రభువు మహిమను చూచువారందరూ దేనిలోనికి మారుతూ ఉన్నారు?
వారు మహిమనుండి అధిక మహిమలోనికి ప్రభువైన ఆత్మ చేత ఆ ప్రభువు పోలికగా మారుతూ ఉన్నారు[3:18].
2 Corinthians 4
2 Corinthians 4:1-2
పౌలు, అతని సహచరులు ఎందుకు నిరుత్సాహపడరు?
వారు కలిగిఉన్న సేవను బట్టి, వారు పొందిన కరుణను బట్టి వారు నిరుత్సాహ పడరు[4:1].
పౌలు, అతని సహచరులు ఏయే విధానాలను విడిచిపెట్టారు?
అవమానకరమైన రహస్య విషయాలను విసర్జించారు. కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్కును వంచనగా బోధించలేదు[4:2].
పౌలు,, పౌలులాంటి వారును దేవుని సన్నిధిలో ప్రతివాని మనస్సాక్షి యెదుట తమ్మును తాము ఏవిధంగా సిఫారసు చేసుకుంటున్నారు?
సత్యాన్ని వెల్లడి చేస్తూ ఇలా చేస్తున్నారు[4:2].
2 Corinthians 4:3-4
ఎవరు సువార్త వెలుగును చూడలేకపోతున్నారు?
నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:3].
నశిస్తున్నవారు సువార్త వెలుగును ఎందుకు చూడలేక పోతున్నారు?
ఈ యుగదేవుడు విశ్వాసం లేని వారి మనసులకు గుడ్డితనం కలిగించాడు కనుక నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:4].
2 Corinthians 4:5-6
పౌలు, అతని సహచరులు యేసును గురించి తమను గురించి ఏమి ప్రచురిస్తున్నారు?
క్రీస్తు యేసు ప్రభువని, తాము యేసు కోసం కొరింతు సంఘానికి సేవకులమని ప్రచురిస్తున్నారు[4:5].
2 Corinthians 4:7-12
పౌలు, అతని సహచరుల ఐశ్వర్యం మట్టి పాత్రలలో ఎందుకుంది?
అత్యధిక బలప్రభావం వారిది కాదు, అది దేవునిదే అని వెల్లడి అయ్యేలా వారి ఐశ్వర్యం మట్టి పాత్రలలో ఉంది[4:7].
పౌలు, అతని సహచరులు యేసు మరణాన్ని తమ శరీరాలలో ఎందుకు భరిస్తూ ఉన్నారు?
యేసు జీవం వారి శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణాన్ని తమ శరీరాలలో భరిస్తూ ఉన్నారు[4:10].
2 Corinthians 4:13-15
ప్రభువైన యేసును లేపినవాడు ఎవరిని లేపి తన సన్నిధిలో ఎవరిని నిలబెడతాడు?
ప్రభువైన యేసును లేపినవాడు తన సన్నిధిలో పౌలు, అతని సహచరులను, కొరింతు పరిశుద్ధులను తన ఎదుట నిలువబెట్టుకొంటాడు[4:14].
దేవుని కృప అనేకులకు వ్యాపిస్తూ ఉన్న ఫలితం ఏమిటి?
దేవుని కృప అనేకులకు వ్యాపిస్తూ ఉండగా ఆయన మహిమకు కృతజ్ఞతలు సమృద్ధిగా కలుగుతాయి[4:15].
2 Corinthians 4:16-18
పౌలు, అతని సహచరులును నిరుత్సాహపడటానికి కారణాలు ఎందుకు ఉన్నాయి?
వారు నిరుత్సాహపడటానికి కారణం ఉంది, ఎందుకంటే వారు శారీరకంగా క్షీణించి పోతున్నారు[4:16].
పౌలు, అతని సహచరులును ఎందుకు నిరుత్సాహపడరు?
వారు అధైర్యపడరు ఎందుకంటే అంతరంగ పురుషుడు దినదినం నూతనమౌతున్నాడు. క్షణికమైన, చులకనైన బాధలు వాటికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమ భావాన్ని కలిగిస్తున్నాయి. చివరిగా వారు నిత్యమూ ఉండే కనిపించని వాటినే గమనిస్తున్నారు[4:16-18].
2 Corinthians 5
2 Corinthians 5:1-3
భూమి మీద మన నివాసమైన గుడారం నాశనమైతే ఇంకా మనకు ఏమి ఉంటుందని పౌలు చెప్పాడు?
చేతులతో చేసినది కాని దేవుడు నిర్మించే శాశ్వత కట్టడం పరలోకంలో మనకుంటుందని పౌలు చెప్పాడు[5:1].
2 Corinthians 5:4-5
మనం ఈ "గుడారం"లో ఉన్నప్పుడు ఎందుకు మూలుగుతాం అని పౌలు చెప్పాడు?
మనం ఈ "గుడారం"లో ఉన్నప్పుడు, మనం భారంతో ఉంటాం, వస్త్రాలు ధరించుకోవాలని కోరుకుంటాం, తద్వారా చావుకు లోనయ్యేది జీవంలో మింగివేయబడుతుంది కనుక పౌలు ఇలా చెప్పాడు[5:4].
రాబోతున్నదానికి హామీగా దేవుడు మనకేం ఇచ్చాడు?
రాబోతున్నదానికి హామీగా దేవుడు మనకు తన ఆత్మను ఇచ్చాడు?[5:5].
2 Corinthians 5:6-8
శరీరంలో ఉండడం, ప్రభువుతో ఆయన నివాసంలో ఉండడంలో దేనిని పౌలు ఇష్టపడుతున్నాడు?
"శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో ఆయన నివాసంలో ఉండడమే మాకు ఇష్టం" అని పౌలు చెప్పాడు[5:8].
2 Corinthians 5:9-10
పౌలు లక్ష్యం ఏమిటి?
ప్రభువును సంతోషపెట్టడమే పౌలు లక్ష్యం[5:9].
ప్రభువును సంతోషపెట్టడమే పౌలు తన లక్ష్యంగా ఎందుకు చేసుకున్నాడు?
మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా కనపడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో చేసిన క్రియలకు - అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే - తగిన ప్రతిఫలం పొందాలి కనుక పౌలు ప్రభువును సంతోషపెట్టడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు [5:10].
2 Corinthians 5:11-12
పౌలు, అతని సహచరులు ప్రజలను ఎందుకు ఒప్పిస్తున్నారు?
వారికి ప్రభువు పట్ల భయభక్తులంటే ఏమిటో తెలుసు కనుక వారు ప్రజలను ఒప్పిస్తున్నారు [5:11].
వారి యోగ్యతలను మరల కొరింతు పరిశుద్దుల ఎదుట పెట్టడం లేదని పౌలు ఎందుకు చెపుతున్నాడు?
హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే గర్వపడే వారికి కొరింతు పరిశుద్ధులు జవాబు చెప్పగలిగేలా వారి విషయంలో కొరింతు వారికి అతిశయ కారణం కలిగిస్తున్నారు[5:12].
2 Corinthians 5:13-15
క్రీస్తు అందరికోసమూ చనిపోయాడు గనుక జీవించే వారు ఏమి చేయాలి?
జీవించు వారు తమ కోసం బ్రతకకుండా చనిపోయి మళ్ళీ సజీవంగా లేచిన వాని కోసం జీవించాలి[5:15].
2 Corinthians 5:16-17
మానవ ప్రమాణాల ప్రకారం మనమిక మీదట ఎందుకు తీర్పు తీర్చం?
ఎందుకంటే క్రీస్తు అందరికోసం చనిపోయాడు, మనమికమీదట మనకోసం జీవించం, క్రీస్తు కొరకే జీవిస్తాం[5:15-16].
క్రీస్తునందున్న వానికి ఏమి జరుగుతుంది?
అతడు నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇదిగో క్రొత్తవి వచ్చాయి[5:17].
2 Corinthians 5:18-19
దేవుడు క్రీస్తునందు మనుష్యులను తనతో సఖ్యపరచుకొన్నప్పుడు వారికోసం ఏమి చేస్తున్నాడు?
దేవుడు వారిమీద వారి అపరాధాలు మోపకుండా ఉన్నాడు, వారికి సఖ్యపరచే సందేశాన్ని అప్పగించాడు[5:19].
2 Corinthians 5:20-21
క్రీస్తు కోసం నియమితులైన రాయబారులుగా కొరింతు వారికి పౌలు, అతని సహచరుల యొక్క విన్నపం ఏమిటి?
క్రీస్తు నిమిత్తం దేవునితో సఖ్యపడాలని కొరింతు వారికి చేస్తున్నవారి విన్నపం[5:20].
దేవుడు క్రీస్తును ఎందుకు మన పాపానికి బలిగా చేసాడు?
క్రీస్తులో మనం దేవుని నీతి అయ్యేలా దేవుడు దీనిని చేశాడు[5:21].
2 Corinthians 6
2 Corinthians 6:1-3
పౌలు, అతని సహచరులు కొరింతు వారిని ఏమి చెయ్యవద్దని వేడుకొంటున్నారు?
వారు పొందిన కృపను వ్యర్ధం చెయ్యవద్దని కొరింతు వారిని వేడుకొంటున్నారు[6:1].
ఏది అనుకూల సమయం? ఏది రక్షణ దినం?
ఇదే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినం[6:2].
పౌలు, అతని సహచరులు ఎందుకు ఎవరి ఎదుట అడ్డంకులు పెట్టలేదు?
వారి సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఎవరి ఎదుటను అభ్యంతరాలు పెట్టారు[6:3].
2 Corinthians 6:4-7
పౌలు, అతని సహచరుల క్రియలు దేనిని రుజువు చేస్తున్నాయి?
వారు దేవుని సేవకులని వారి క్రియలు రుజువు చేస్తున్నాయి[6:4].
పౌలు, అతని సహచరులు సహించుకొన్నకొన్ని విషయాలేంటి?
వారు బాధలను, కష్టాలను, ఇరుకు పరిస్థితులను, దెబ్బలను, చెరసాలను, అల్లరులను, శ్రమను, జాగరణలను, ఆకలిని సహించుకొన్నారు[6:4-5].
2 Corinthians 6:8-10
పౌలు, అతని సహచరులు నమ్మకంగా ఉన్నప్పటికీ వారు దేని విషయం నిందకు గురయ్యారు?
వారు వంచకులు అనే నిందకు గురయ్యారు[6:8].
2 Corinthians 6:11-13
కొరింతు వారితో పౌలు ఎలాంటి ప్రతిఫలం కోరుతున్నాడు?
కొరింతు వారిపట్ల తమ హృదయాలు తెరచి యున్నాయి, దానికి ప్రతిఫలంగా కొరింతు వారి హృదయాలు పౌలు పట్లను అతని సహచరుల పట్లను తెరిచి యుంచాలని పౌలు వారిని కోరాడు[6:11,13].
2 Corinthians 6:14-16
కొరింతు విశ్వాసులు అవిశ్వాసులతో ఎందుకు జతగా ఉండకూడదో పౌలు ఇస్తున్న కారణాలు ఏమిటి?
పౌలు ఈ క్రింది కారణాలను చెపుతున్నాడు: న్యాయానికి అన్యాయానికి వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు బెలియాలు తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి?[6:14-16].
2 Corinthians 6:17-18
"వారిమధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేక పరచుకొని, అపవిత్రమైన దానిని ముట్టని..." వానికి ప్రభువు ఏమి చేస్తానని చెప్పాడు?
వారిని స్వాగతిస్తానని ప్రభువు చెప్పాడు. ఆయన వారికి తండ్రిగా ఉంటాడు, వారు ఆయనకు కుమారులు కుమార్తెలునై ఉంటారు[6:17-18].
2 Corinthians 7
2 Corinthians 7:1
దేని విషయంలో మనలను మనం పవిత్ర పరచుకోవాలని పౌలు చెపుతున్నాడు?
శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్ర పరచుకోవాలి[7:1].
2 Corinthians 7:2-4
కొరింతు పరిశుద్ధులు తన కోసం తన సహచరుల కోసం ఏమి చెయ్యాలని పౌలు కోరాడు?
"మీ హృదయములలో చేర్చుకొనుడి" అని పౌలు వారిని కోరాడు[7:2].
కొరింతు పరిశుద్ధుల పట్ల పౌలు ఎలాంటి ప్రోత్సాహపు మాటలు చెప్పాడు?
కొరింతు వారు తన హృదయంలోను, తన సహచరుల హృదయంలోను ఉన్నారని పౌలు చెప్పాడు, తామంతా కలసి చనిపోవాలి, కలిసి జీవించాలి. వారియందు గొప్ప నమ్మకం ఉన్నదని, వారిని బట్టి అతిశయపడుతున్నానని పౌలు చెప్పాడు[7:3-4].
2 Corinthians 7:5-7
పౌలు, అతని సహచరులు మాసిదోనియకు వచ్చినపుడు, ఎటువెళ్ళినా శ్రమలు పొందినపుడు - వెలుపట పోరాటాలు, లోపల భయాలు కలిగినపుడు దేవుడు ఇచ్చిన ఆదరణ ఏమిటి?
తీతు రాకను బట్టి దేవుడు వారిని ఆదరించాడు, కొరింతు పరిశుద్ధుల నుండి తీతు పొందిన ఆదరణను గురించిన మాట చేత, పౌలు కోసం కొరింతు వారి లోతైన ఆసక్తి, వారి శ్రద్ధ, వారి గొప్ప హృదయాభిలాష చేత దేవుడు వారిని ఆదరించాడు[7:6-7].
2 Corinthians 7:8-10
పౌలు రాసిన ముందు లేఖ కొరింతు పరిశుద్ధులలో ఏమి కలుగజేసింది?
పౌలు రాసిన ముందు లేఖ కొరింతు పరిశుద్ధులను దుఃఖపెట్టింది ఇది పౌలు రాసిన ముందు లేఖకు దైవసంబంధ స్పందన[7:8-9].
2 Corinthians 7:11-12
కొరింతు పరిశుద్ధులలో దైవసంబంధమైన విచారం దేనిని తీసుకొని వచ్చింది?
దైవసంబంధమైన విచారం వారిలో మారుమనస్సును తీసుకొనివచ్చింది, వారు నిర్దోషులని రుజువు పరచుకొనే గొప్ప సమర్పణను తీసుకొని వచ్చింది [7:9,11].
తన మొదటి లేఖను ఎందుకు రాశాడని పౌలు చెప్పాడు?
పౌలు కోసం, అతని సహచారుల కొరకు కొరింతు పరిశుద్ధులకున్న శ్రద్ధ దేవుని యెదుట కొరింతు పరిశుద్ధులకు స్పష్టం కావాలని రాశానని పౌలు చెప్పాడు[7:12].
2 Corinthians 7:13-14
తీతు ఎందుకు సంతోషంగా ఉన్నాడు?
కొరింతు పరిశుద్ధుల వల్ల తీతుకు ఊరట కలిగింది[7:13].
2 Corinthians 7:15-16
కొరింతు పరిశుద్ధుల కోసం తీతు వాత్సల్యం ఎందుకు అధికమౌతుంది?
కొరింతు పరిశుద్ధులు భయందోళనతో స్వీకరించి విధేయత చూపిన సంగతి తీతు జ్ఞాపకం చేసుకొన్నప్పుడెల్ల వారి పట్ల తీతు వాత్సల్యం అధికమౌతుంది[7:15].
2 Corinthians 8
2 Corinthians 8:1-2
కొరింతు సోదరులు, సోదరీలు తెలుసుకోవాలని పౌలు కోరినదేంటి?
మాసిదోనియ వారికి దేవుడు అనుగ్రహించిన కృపను తెలుసుకోవాలని పౌలు వారిని కోరాడు[8:1].
2 Corinthians 8:3-5
మాసిదోనియలోని సంఘాలు అతి దరిద్రంలో ఉన్నప్పటికీ తీవ్రంగా పరీక్షించే కష్టాలలో ఏమి చేసారు?
వారు తమ ఆనంద సమృద్దిలోనుండి అధికమైన ఔదార్యంతో తమంతట తామే ఇవ్వగలిగినదంతా పరిశుద్ధుల పరిచర్యకు ఇచ్చారు[8:2-4].
2 Corinthians 8:6-7
తీతును ఏమి చెయ్యమని పౌలు వేడుకొన్నాడు?
కొరింతు పరిశుద్ధులలో తాను ఆరంభించిన ఉపకార క్రియను ముగించమని పౌలు తీతును వేడుకున్నాడు[8:6].
2 Corinthians 8:8-9
"ఈ ఉపకార క్రియలో కూడా అభివృద్ధి పొందేలా చూసుకోండి" అని పౌలు కొరింతు పరిశుద్ధులకి చెప్పాడు?
ఇతరుల శ్రద్ధాసక్తులతో సరిపోల్చుతూ వారి ప్రేమ భావం ఎంత వాస్తమైనదో రుజువు చెయ్యడానికి పౌలు ఇది చెప్పాడు[8:7-8].
2 Corinthians 8:10-12
దేనిని గురించి పౌలు మంచిది, అంగీకారమైనదని చెపుతున్నాడు?
పరిచర్య చెయ్యడంలో సిద్ధమైన మనస్సు మంచిది, అంగీకారమైనదని పౌలు చెపుతున్నాడు[8:12].
2 Corinthians 8:13-15
ఇతరులకు ఊరట కలిగించేలా కొరింతు పరిశుద్ధులకు భారమని అనిపించినా ఈ కార్యాన్ని పౌలు చెయ్యమని కోరాడా?
లేదు. ప్రస్తుతం వారికున్న సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి కొరింతు వారికి సహాయకరంగా ఉండాలని పౌలు భావన[8:13-14].
2 Corinthians 8:16-17
కొరింతు పరిశుద్దుల పట్ల పౌలుకున్న శ్రద్ధాసక్తులు దేవుడు తీతు హృదయంలో ఉంచిన తరువాత తీతు ఏమిచేశాడు?
పౌలు విన్నపాన్ని తీతు అంగీకరించాడు, వారి పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి తనకు తానే వారి వద్దకు వెళ్ళాడు[8:16-17].
2 Corinthians 8:18-21
వారు పోగు చేస్తున్నచందా విషయం ఎవరూ తప్పు పట్టే అవకాశంను తప్పించడానికి పౌలు అతని సహచరులు ఏమి చేసారు?
తీతును మాత్రమే కాక శుభవార్త సేవలో ప్రసిద్ధి గాంచిన మరొక సోదరుడిని పౌలు అతని సహచరులు పంపారు. ఈ సోదరుడు, పరీక్షించిన మరొక సోదరుడు ఈ సహాయాన్ని అందివ్వడానికి పంపడం జరిగింది[8:18-22].
2 Corinthians 8:22-24
ఇతర సంఘాలు పంపిన సోదరుల విషయం ఏమి చెయ్యాలని కొరింతు పరిశుద్ధులకు పౌలు చెప్పాడు?
సంఘాల ఎదుట బహింరంగంగా వారికి ప్రేమ చూపించాలని, తమపట్ల పౌలుకున్న అతిశయ కారణాన్ని రుజువు చేయాలని పౌలు కొరింతు సంఘానికి చెప్పాడు[8:24].
2 Corinthians 9
2 Corinthians 9:1-2
దేని విషయం కొరింతు పరిశుద్ధులకు రాయనవసరం లేదు అని పౌలు చెపుతున్నాడు?
పరిశుద్ధుల కోసం పరిచర్య గురించి వారికి రాయనవసరం లేదని పౌలు చెపుతున్నాడు[9:1].
2 Corinthians 9:3-5
ఎందుకు పౌలు సోదరులను కొరింతుకు పంపాడు?
కొరింతు పరిశుద్ధుల గురించి తనకున్న అతిశయం వ్యర్ధం కాకూడదని, తాను చెప్పినట్టే వారు సిద్ధంగా ఉండాలని పౌలు సోదరులను పంపాడు[9:3].
సోదరులను ముందుగా పంపి కొరింతువారు వాగ్దానం చేసిన చందా విషయం ఏర్పాట్లు చెయ్యడం ఎందుకు ప్రాముఖ్యం అని పౌలు తలంచాడు?
ఒకవేళ మాసిదోనియ వారిలో ఎవరైనా పౌలుతో వచ్చి కొరింతువారు సిద్ధంగా లేకపోవడం చూసి వారిపట్ల పౌలుకున్న నమ్మకంవల్ల పౌలుకు అతని సహచరులకు సిగ్గుకలుగుతుందని సోదరులను ముందుగా పంపడం అవసరమని తలంచాడు.[9:4-5].
2 Corinthians 9:6-9
వారి దాతృత్వంలో ఉన్న ప్రధాన అంశం ఏమిటి అని పౌలు చెపుతున్నాడు?
"కొద్దిగా వెదజల్లే వాడు కొద్ది పంటను కోస్తాడు, విస్తారంగా చల్లేవాడు విస్తార పంటను కోస్తాడు" అని పౌలు తన ముఖ్య అంశం చెప్పాడు[9:6].
ప్రతి ఒక్కరు ఏవిధంగా ఇవ్వాలి?
ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి[9:7].
2 Corinthians 9:10-11
వెదజల్లే వానికి విత్తనాలు, తినడానికి ఆహారం దయచేసే వాడు కొరింతు పరిశుద్దుల కోసం ఏమి చెయ్య బోతున్నాడు?
అయన చల్లడానికి విత్తనాలు ఇచ్చి వృద్ధి చేసి, వారి నీతి అనే పంట కోతను పెంపొందించే వాడు. వారు అన్ని విషయాల్లో వర్థిల్లుతారు గనుక, వారు ఉదార భావంతో ఉండవచ్చు. [9:10-11].
2 Corinthians 9:12-15
కొరింతు పరిశుద్ధులు దేవుని ఎలా మహిమ పరచారు?
వారు ఒప్పుకొన్న క్రీస్తు సువార్తకు విధేయత చూపించడం, వారు ఉదారంగా ఇచ్చిన చందాను బట్టి వారు దేవుని మహిమ పరచారు[9:13].
పరిశుద్ధులు కొరింతు పరిశుద్ధుల కోసం ప్రార్ధిస్తూ వారిని చూడాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు?
దేవుడు వారి పట్ల చూపిన అత్యధిక కృపను బట్టి వారిని చూడాలని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు[9:14].
2 Corinthians 10
2 Corinthians 10:1-2
దేని విషయం పౌలు కొరింతు పరిశుద్ధులను వేడుకొంటున్నాడు?
తాను కొరింతు వారితో ఉన్నప్పుడు తాను ధైర్యశాలిగా ఉండకుండా వ్యవహరించాలని వారిని వేడుకొంటున్నాను[10:1].
ఏ సందర్భం కోసం పౌలు ధైర్యంగా ఉండాలని తలంచాడు?
పౌలు,, అతని సహచరులు శరీరానుసారంగా బ్రతుకుతున్నారని అనుకుంటున్నవారిపట్ల ధైర్యంగా వ్యవహరించాలని పౌలు తలంపు[10:2].
2 Corinthians 10:3-4
పౌలు, అతని సహచరులు యుద్ధం చేయాల్సివచ్చినపుడు వారు ఎలాంటి యుద్దోపకరణాలను ఉపయోగించరు?
పౌలు, అతని సహచరులు యుద్ధం చేయాల్సినపుడు వారు శరీరసంబంధమైన యుద్దోపకరణాలను ఉపయోగించరు[10:4].
2 Corinthians 10:5-6
పౌలు ఉపయోగించే యుద్దోపకరణాలు ఏమి చెయ్యడానికి శక్తిగలవి?
కోటలను పడగొట్టడానికి దేవుని ద్వారా బలప్రభావాలు గలవి - తప్పుదారి పట్టించేవాటిని వ్యర్థపరిచేవి. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఉన్నతమైన ప్రతి దానిని పడద్రోయగలిగినవి[10:4-5].
2 Corinthians 10:7-8
దేవుడు పౌలుకి అతని సహచరులకి ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు?
కొరింతు పరిశుద్ధుల అభివృద్ధి కోసం దేవుడు పౌలుకు అతని అనుచరులకు అధికారాన్ని ఇచ్చాడు[10:8].
2 Corinthians 10:9-10
పౌలు గురించి అతని లేఖల గురించి కొందరు ఏమనుకుంటున్నారు?
అతడి ఉత్తరాలు గంభీరమైనవి, తీవ్రమైనవి గాని అతడు శరీరరీత్యా దుర్భలుడు, అతడి ప్రసంగాలు కొరగానివి అనుకుంటున్నారు[10:10].
2 Corinthians 10:11-12
తన ఉత్తరాలు చెప్పేదానికి తాను భిన్నంగా కనిపిస్తాడని తలంచే వారికి పౌలు ఏమి చెప్పాడు?
పౌలు కొరింతుపరిశుద్ధులతో లేనప్పుడు ఉత్తరాలలో రాసిన మాటల ప్రకారం ఎలాంటివాడిగా ఉన్నాడో వారితో ఉన్నప్పుడు అలాంటి వాడుగానే ఉన్నాడని చెప్పాడు[10:11].
తమను మెప్పించుకొనే కొందరు తమకు గ్రహింపు లేదని కనపరచుకోడానికి ఏమి చేస్తారు?
తమలో ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుంటారు, ఒకడితో ఒకరు పోల్చుకుంటారు, వారికి గ్రహింపు లేదు[10:12].
2 Corinthians 10:13-16
పౌలు అతిశయానికి సరిహద్దులేవి?
పౌలు అతిశయం దేవుడు తనకు కొలిచి ఇచ్చిన సరిహద్దుల్లోనే ఉంటుంది, కొరింతువారు ఉన్న సరిహద్దులలోనే, సరిహద్దు దాటి ఇతరుల కష్టఫలంలో వారికి వంతు ఉన్నట్టు అతిశయంగా చెప్పుకోరు[10:13,15,16].
2 Corinthians 10:17-18
ఎవడు యోగ్యుడు?
ప్రభువు మెచ్చుకొనేవాడే యోగ్యుడు[10:18].
2 Corinthians 11
2 Corinthians 11:1-2
కొరింతు పరిశుద్ధుల కోసం దైవిక ఆసక్తి పౌలుకు ఎందుకుంది?
పౌలు వారిని ఒకే పురుషునికి ప్రధానం చేసాడు, వారిని క్రీస్తు కోసం పవిత్ర కన్యగా అప్పగించాలని వారిపట్ల దైవిక ఆసక్తి ఉంది[11:2].
2 Corinthians 11:3-6
కొరింతు పరిశుద్ధుల పట్ల పౌలుకున్న భయం ఏమిటి?
వారి ఆలోచనలు క్రీస్తు పట్ల ఉన్న నిజాయితి నుంచి పవిత్రభక్తి నుండి తొలగిపోతాయేమోనని భయపడ్డాడు[11:3].
కొరింతు పరిశుద్దులు దేనిని ఓర్చుకుంటారు?
ఒకడు వచ్చి పౌలు,, ఇతర సహచరులు ప్రకటించిన యేసును కాక వేరే యేసును ప్రకటిస్తే, వేరే శుభవార్తను ప్రకటిస్తే వారు ఓర్చుకున్నారు[11:4].
2 Corinthians 11:7-13
కొరింతు ప్రజలకు శుభవార్తను ఎలా ప్రకటించాడు?
కొరింతు ప్రజలకు శుభవార్తను ఉచితంగా ప్రకటించాడు[11:7].
ఇతర సంఘాలను పౌలు ఎలా దోచుకుంటున్నాడు?
ఇతర సంఘాలనుంచి జీతం తీసుకోవడం వల్ల వారిని దోచుకుంటున్నాడు[11:8].
2 Corinthians 11:14-15
పౌలుతోను, అతని సహచరులతోను సమానంగా అనిపించుకోవాలని కోరుకొనే వారి గురించి పౌలు ఎలా వివరిస్తున్నాడు?
వారు సాతాను సేవకులు, వాస్తవమైన క్రీస్తురాయబారులు కాదు, మోసకారులైన పనివారు, క్రీస్తురాయబారులు అనిపించుకోవాలని మారు వేషం వేసుకొనేవారు అని పౌలు వివరించాడు[11:13-15].
సాతాను తనని తాను ఎలా దాచి పెట్టుకుంటాడు?
సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు[11:14].
2 Corinthians 11:16-18
తనను తెలివితక్కువ వానిగా స్వీకరించాలని పౌలు ఎందుకు కొరింతు పరిశుద్ధులను అడిగాడు?
తాను అతిశయంగా కొంత చెప్పుకోనేలా తనను తెలివితక్కువవానిగా స్వీకరించాలని పౌలు కోరాడు[11:16].
2 Corinthians 11:19-21
కొరింతు పరిశుద్ధులు సంతోషంగా ఎవరిని ఓర్చుకుంటారని పౌలు చెప్పాడు?
వారు తెలివి తక్కువవారిని, వారిని బానిసలుగా చేసిన వారిని, వారి మధ్య విభజనలు చేసేవారిని, వారి నుండి లాభం కోరే వారిని, తమని తాము గోప్ప చేసుకోనే వారిని, వారి ముఖాల మీద కొట్టే వారిని సంతోషంతో చేర్చుకుంటారని పౌలు చెప్పాడు[11:19-20].
2 Corinthians 11:22-23
తాము అతిశయపడే వాటి విషయంలో పౌలుతో సమానంగా కనుపరచుకోనువారితో పోల్చుకొని పౌలు ఏమి అతిసయపడుతున్నాడు?
తాము యూదులమనీ, అబ్రాహాము సంతానమని చెప్పుకొనేవారితో సమానంగా పౌలు తానుకూడా తను అబ్రాహాము సంతానమని అతిశయ పడ్డాడు. వారి కంటే ఎంతో ఎక్కువగా క్రీస్తు సేవకుడిని అని, ఎక్కువగా ప్రయాసపడ్డానని, అనేక సార్లు ఖైదు పాలయ్యానని, లెక్కలేనన్నిసార్లు దెబ్బలు తిన్నానని, తరచుగా ప్రాణాపాయాలలో ఉన్నానని అతిశయించాడు[11:22-23].
2 Corinthians 11:24-26
పౌలు సహించిన కొన్ని ప్రత్యేకమైన ప్రమాదలేంటి?
పౌలు యూదుల చేత అయిదుసార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మూడుసార్లు బెత్తం దెబ్బలు తిన్నాడు. ఒకసారి రాళ్ళతో కొట్టడం జరిగింది. మూడుసార్లు తానున్న ఓడలు పగిలిపోయాయి. ఒకసారి పగలూ రాత్రి సముద్రంలో గడిపాడు. నదుల వల్ల అపాయాలు, దోపిడీ దొంగల వల్ల అపాయాలు, స్వజనం వల్ల అపాయాలు, ఇతరజనాలవల్ల అపాయాలు, పట్టణాలలో అపాయాలు, అరణ్యాలలో అపాయాలు, సముద్రంలో అపాయాలు, కపటసోదరుల వల్ల అపాయాలు. దమస్కు అధికారి నుండి కూడా పౌలుకు ప్రమాదం ఉంది[11:24-26,32].
2 Corinthians 11:27-29
పౌలు తనలో తాను మండిపడడానికి కారణం ఏమిటి?
ఎవరైనా పాపంలో పడే కారణం కలిగిస్తే పౌలు తనలో మండి పడతాడు [11:29].
2 Corinthians 11:30-33
ఒకవేళ పౌలు అతిశయాపడాల్సివస్తే దేని గురించి అతిశయ పడతాడు?
పౌలు తన బలహీనతల గురించిన విషయాలలోనే అతిశయ పడతాడు[11:30].
2 Corinthians 12
2 Corinthians 12:1-2
దేనిగురించి ఇపుడు పౌలు అతిశయ పడతాడని చెపుతున్నాడు?
ప్రభువు దర్శనాలను గురించి, ప్రత్యక్షతల గురించి అతిశయ పడతానని పౌలు చెప్పాడు[12:1].
2 Corinthians 12:3-5
పద్నాలుగేళ్ళ క్రితం క్రీస్తులోని ఒకనికి ఏమి జరిగింది?
అతణ్ణి మూడో ఆకాశం లోనికి తీసుకు వెళ్ళిపోవడం జరిగింది, పరమానంద నివాసం లోనికి తీసుకు వెళ్ళడం జరిగింది, వివరించడానికి వీలుకాని విషయాలు అతడు విన్నాడు[12:2-4].
2 Corinthians 12:6-7
తాను అతిశయ పడడం బుద్ధిహీనం కాదు అని పౌలు ఎందుకు అన్నాడు?
తాను అతిశయ పడడం బుద్ధిహీనం కాదు అని పౌలు అన్నాడు ఎందుకంటే పౌలు సత్యం పలుకుతున్నాడు[12:6].
పౌలు తనని తాను గొప్ప చేసుకోకుండా ఏమి జరిగింది?
పౌలు తనని తాను గొప్ప చేసుకోకుండా తన శరీరంలో ఒక ముల్లు ఉంచడం జరిగింది[12:7].
2 Corinthians 12:8-10
తన శరీరంలోని ముల్లును తీసివేయమని పౌలు అడిగినపుడు ప్రభువు ఏమిచెప్పాడు?
"నా కృప నీకు చాలు, నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే" అని ప్రభువు పౌలుకు చెప్పాడు[12:9].
ఎందుకు పౌలు తన బలహీనతల గురించి అతిశయపడడం మంచిదని చెప్పాడు?
క్రీస్తు బలప్రభావాలు తనలో నిలిచియుండేలా అది మంచిదని పౌలు చెప్పాడు[12:9].
2 Corinthians 12:11-13
పూర్తి సహనంతో కొరింతు వారి మధ్య ఏమి జరిగింది?
క్రీస్తు రాయబారుల సూచనలు, సూచక క్రియలు, వింతలూ, అద్భుతాలు పూర్తి సహనంతో వారి మధ్య జరిగాయి[12:12].
2 Corinthians 12:14-18
పౌలు కొరింతు వారికి భారంగా ఉండనని ఎందుకు చెపుతున్నాడు?
పౌలు వారి సొత్తును కోరడం లేదు. వారినే కోరుతున్నాడని వారికి కనపరచునట్లు వారికి చెప్పాడు [12:14].
పౌలు కొరింతు విశ్వాసులకోసం తాను సంతోషంగా ఏమి చేస్తానని చెప్పాడు?
వారి అత్మల కోసం ఎంతో సంతోషంతో ఖర్చు చేస్తానని, ఖర్చు అవుతానని పౌలు చెప్పాడు[12:15].
2 Corinthians 12:19
తాను మాట్లాడినదంతా కొరింతు పరిశుద్దుల కొరకే అని ఏ ఉద్దేశంతో చెప్పాడు?
కొరింతు పరిశుద్ధుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే పౌలు ఈ సంగాతులన్నీ చెప్పాడు12:19.
2 Corinthians 12:20-21
కొరింతు పరిశుద్ధులవద్దకు పౌలు తిరిగి వెళ్ళినపుడు దేనిని చూడాలని భయపడ్డాడు?
వారి మధ్యలో కలహం, అసూయ, కోపం, జగడాలు, అపనిందలు, గుసగుసలు, మిడిసిపాటు, కలతలు ఉంటాయేమోనని పౌలు భయపడ్డాడు[12 :20].
దేవుడు తనకు ఏమి చేస్తాడని పౌలు భయపడ్డాడు?
దేవుడు కొరింతువారి మధ్యలో తలవంపులు తెస్తాడేమోనని పౌలు భయపడ్డాడు[12:21].
ఏ కారణాన్నిబట్టి మునుపు పాపం చేసిన కొరింతు పరిశుద్దులనేకుల కోసం దుఃఖించాల్సి వస్తుందని పౌలు ఆలోచించాడు?
ఇంతకుముందు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, అల్లరి క్రియల నిమిత్తం మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని పౌలు భయపడుచున్నాడు[12:21].
2 Corinthians 13
2 Corinthians 13:1-2
కొరింతియులకు 2వ పత్రిక రాయడానికి ముందు పౌలు ఎన్నిసార్లు కొరింతు పరిశుద్ధుల వద్దకు వచ్చాడు?
కొరింతియులకు 2వ పత్రిక రాయడానికి ముందు పౌలు రెండు సార్లు కొరింతు పరిశుద్ధుల వద్దకు వచ్చాడు[13:1-2].
2 Corinthians 13:3-4
మునుపు పాపం చేసిన కొరింతు పరిశుద్దులకు, మిగిలిన అందరికిని, తాను తిరిగి వచ్చినపుడు ఏమాత్రం సహించనని పౌలు ఎందుకు చెపుతున్నాడు?
పౌలు ద్వారా క్రీస్తు మాట్లాడుతున్నాడనే దానికి రుజువుకోసం కొరింతు పరిశుద్ధులు వెతుకుచున్నారు కాబట్టి పౌలు ఇలా చెప్పాడు [13:3].
2 Corinthians 13:5-6
కొరింతు పరిశుద్ధులను పౌలు తమను తాము పరిశోధించుకొని పరీక్షించుకోవాలని పౌలు ఎందుకు చెప్పాడు?
వారు విశ్వాసంలో ఉన్నారో లేదో అంది కొరింతు పరిశుద్ధులను పౌలు తమను తాము పరిశోధించుకొని పరీక్షించుకోవాలని పౌలు చెప్పాడు[13:5].
పౌలు, అతని సహచరులలో కొరింతు పరిశుద్ధులు ఏమి కనుగొంటారని అతడు నిబ్బరంగా ఉన్నాడు?
తాము ఆమోదం లేనివారు కాదని కొరింతు పరిశుద్ధులు కనుగొంటారని అతడు నిబ్బరంగా ఉన్నాడు[13:6].
2 Corinthians 13:7-8
తాను, తన సహచరులు ఏమి చెయ్యలేమని పౌలు చెపుతున్నాడు?
వారు సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేమని చెప్పాడు[13:8].
2 Corinthians 13:9-10
వారికి దూరంగా ఉండి పౌలు ఈ సంగతులను కొరింతు పరిశుద్ధులకు ఎందుకు రాస్తున్నాడు?
తాను వారితో ఉన్నప్పుడు వారిని కఠినంగా చూడకూడదని పౌలు అలా చేసాడు[13:10].
కొరింతు పరిశుద్ధులకు సంబంధించి ప్రభువు ఇచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించాలని పౌలు కోరుతున్నాడు?
వారిని పడద్రోయ డానికి కాక వారిని కట్టుటకే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని వినియోగించాలని పౌలు కోరుతున్నాడు[13:10].
2 Corinthians 13:11-12
ముగింపులో కొరింతు వారిని పౌలు ఏమి చెయ్యమని కోరుతున్నాడు?
సంతోషించుడి, పరిపూర్ణులు కావడానికి ప్రయాసపడండి, ఏకమనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, పవిత్రమైన ముద్దుపెట్టుకొని వందనాలు చెప్పుకోండని పౌలు వారిని కోరుతున్నాడు[13:11-12].
2 Corinthians 13:13-14
కొరింతు పరిశుద్దులందరికి ఏమి ఉండాలని పౌలు కోరాడు?
అందరు ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలని పౌలు కోరాడు[13:14].