John
John 1
John 1:1-3
ఆదియందు ఏమి ఉంది?
ఆదియందు వాక్కు ఉన్నాడు. (1:1)
వాక్కు ఎవరి వద్ద ఉన్నాడు ?
వాక్కు దేవుని వద్ద ఉన్నాడు. (1:1-2)
వాక్కు ఏమై ఉన్నాడు?
వాక్కు దేవుడై ఉన్నాడు.
వాక్కు లేకుండా ఏమైనా కలిగాయా?
సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదీ ఆయన లేకుండ కలుగలేదు. (1:3)
John 1:4-5
వాక్కులో ఏమి ఉంది?
ఆయనలో జీవమున్నది. (1:4)
John 1:6-9
దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుని పేరు ఏమిటి?
అతని పేరు యోహాను. (1:6)
ఏమి చెయ్యడానికి యోహాను వచ్చాడు?
అతని మూలముగా అందరు విశ్వసించునట్లుగా అతడు అ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షి గా వచ్చెను. (1:7)
John 1:10-11
యోహాను సాక్ష్యమిచ్చుటకు వచ్చిన వెలుగును లోకము తెలుసుకొన్నదా లేక స్వీకరించినదా?
యోహాను సాక్ష్యమిచ్చుటకు వచ్చిన వెలుగును లోకము తెలుసుకొనలేదు, ఆ వెలుగు స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. (1:10-11)
John 1:12-13
తన నామమందు విశ్వసించిన వారిని ఆ వెలుగు ఏమి చేసింది?
తనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (1:12)
ఆయన నామములో విశ్వసించిన వారు దేవుని పిల్లలు ఎలా అయ్యారు?
దేవుని మూలమున పుట్టినవారు కావడం ద్వారా వారు దేవుని పిల్లలు అయ్యారు. (1:13)
John 1:14-15
తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కును పోలిన ఇతర వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
లేదు! తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కు ఒకే ఒక విశిష్ట మైన వ్యక్తి. (1:14)
John 1:16-21
యోహాను సాక్ష్యమిచ్చిన ఈ వ్యక్తి పరిపూర్ణత లోనుండి మనము ఏమి పొందాము?
ఆయన పరిపూర్ణత లోనుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. (1:16)
యేసు క్రీస్తు ద్వారా ఏమి వచ్చింది?
యేసు క్రీస్తు ద్వారా కృపయు, సత్యమును కలిగెను. (1:17)
ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూసాడా?
ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. (1:18)
తండ్రిని మనకు బయలు పరచినది ఎవరు?
తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలు పరచెను. (1:18)
John 1:22-28
తాను ఎవరని అడుగుటకు యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, లేవీయులకు యోహాను ఏమి చెప్పాడు?
యెషయా ప్రవక్త చెప్పినట్టు "ప్రభువు త్రోవను సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము" అని యోహాను తన గురించి చెప్పుకొన్నాడు. (1:19-23)
John 1:29-31
యేసు తన వద్దకు రావడం యోహాను చూసినపుడు యోహాను ఏమి అన్నాడు?
"ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల" అని అన్నాడు. (1:29)
ఎందుకు యోహాను నీళ్ళతో బాప్తిస్మమివ్వడానికి వచ్చాడు?
దేవుని గొర్రెపిల్లయైన యేసు లోక పాపములు తీసివేయడానికి, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష్యమవడానికి, యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చాడు. (1:31)
John 1:32-36
యేసు దేవుని కుమారుడని బయలు పరచబడడానికి యోహానుకు ఇవ్వబడినన గురుతు ఏది?
ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అను గురుతు యోహానుకు ఇవ్వబడింది. (1:32-34)
John 1:37-39
యోహాను యేసు ను "ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అని పిలిచినప్పుడు యోహాను ఇద్దరు శిష్యులు ఏమి చేసారు?
వారు యేసును వెంబడించారు. (1:35-37)
John 1:40-42
యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకని పేరు ఏంటి?
ఆ ఇద్దరిలో ఒకని పేరు అంద్రెయ. (1:40)
అంద్రెయ తన సహోదరుడైన సీమోనుకు యేసును గురించి ఏమి చెప్పాడు?
"మేము మెస్సీయాను కనుగొంటిమి" అని సీమోను కు చెప్పాడు. (141)
సీమోను ఏమని పిలువబడతాడని యేసు చెప్పాడు?
సీమోను "కేఫా" (దాని అర్ధము "పేతురు") అని పిలువబడతాడని యేసు చెప్పాడు (1:42)
John 1:43-48
పేతురు, అంద్రెయల పట్టణము ఏది?
పేతురు, అంద్రెయల పట్టణము బేత్సయిదా. (1:42)
John 1:49-51
నతనయేలు యేసును గురించి ఏమి అన్నాడు?
"బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు" అని నతనయేలు అన్నాడు. (1:49)
నతనయేలు ఏమి చూస్తాడు అని యేసు అన్నాడు ?
ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని నతనయేలు తో చెప్పాడు. (1:51)
John 2
John 2:1-2
గలిలయ లోని కానా లోని వివాహములో ఎవరు ఉన్నారు ?
గలిలయ లోని కానా లోని వివాహములో యేసు, ఆయన తల్లి, ఆయన శిష్యులు ఉన్నారు. (2:1,11)
John 2:3-5
యేసు తల్లి "వారికి ద్రాక్షా రసము లేదు" అని ఎందుకు చెప్పింది ?
ఆ పరిస్థితి లో యేసు ఏదైనా చేస్తాడని ఆమె ఎదురు చూచి యేసుకు చెప్పింది. (2:5)
John 2:6-8
ఏ రెండు పనులు చెయ్యమని యేసు సేవకులతో చెప్పాడు ?
నీటి బానలను నీళ్ళతో నింపమని మొదట చెప్పాడు. తరువాత కొంచెము "నీరు" తీసుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. (2:7-8)
John 2:9-10
ద్రాక్ష రసముగా మారిన నీటిని రుచి చూసిన తరువాత ఆ విందు ప్రధాని ఏమన్నాడు ?
"ప్రతివాడును మొదట మంచి ద్రాక్షా రసము పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షా రసము ఉంచుకొని ఉన్నావు" అని విందు ప్రధాని అన్నాడు. (2:10)
John 2:11-12
ఈ అద్భుతమైన కార్యమును చూసిన శిష్యుల స్పందన ఏమిటి ?
ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాస ముంచిరి. (2:11)
John 2:13-14
యేసు యెరూషలేములోని దేవాలయము లోనికి వెళ్ళినపుడు ఏమి చూసాడు ?
రూకలు మార్చు వారిని, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని చూసాడు. (2:14)
John 2:15-16
అమ్మువారిని, రూకలు మార్చువారిని యేసు ఏమి చేసాడు ?
ఆయన త్రాళ్ళతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు జల్లివేసి, వారి బల్లలు పడద్రోసాడు. (2:15)
పావురములను అమ్మువారితో యేసు ఏమి చెప్పాడు ?
పావురములను అమ్మువారితో యేసు "వీటిని ఇక్కడ నుండి తీసికోనిపొండి, నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి" అని చెప్పాడు.(2:16)
John 2:17-19
దేవాలయము లో యేసు చేయుచున్న కార్యములను చూసి యూదుల అధికారులు ఎలా స్పందించారు ?
"నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను చూపుదువు" అని అడిగారు. (2:18)
యూదుల అధికారులకు యేసు ఎలా జవాబిచ్చాడు ?
"ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును" అని వారికి సమాధాన మిచ్చాడు. (2:19)
John 2:20-22
ఏ దేవాలయమును గురించి యేసు మాట్లాడుతున్నాడు ?
ఆయన తన సరీరమను దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. (2:21)
John 2:23-25
అనేకులు ఎందుకు యేసు నామము నందు విశ్వాసముంచిరి ?
అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. (2:23)
ఎందుకు యేసు తనను తాను ఇతరుల వశము చేసుకోలేదు ?
యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను తాను వారి వశము చేసుకోలేదు, మనుష్యుని ఆంతర్యమును గూర్చి ఎవరూ ఆయనకు చెప్పనవసరం లేదు. (2:24-25)
John 3
John 3:1-2
నికోదేము ఎవరు ?
నికోదేము పరిసయ్యుడు, యూదుల అధికారి. (3:1)
యేసును గురించి నికోదేము ఏమని సాక్ష్యమిస్తున్నాడు ?
"బోధకుడా, నీవు దేవునినుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుడుము, దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడు" అని నికోదేము యేసు తో అన్నాడు. (3:2)
John 3:3-8
ఎలాంటి ప్రశ్నలు యేసును అడగడం ద్వారా నికోదేము ఆశ్చర్య పడి, గందరగోళ పరచ బడ్డాడు అని మనకు కనపడుతుంది ?
"ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింప గలదు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింప గలడా?, ఈ సంగాతులేలాగు సాధ్యమగును?" అని నికోదేము యేసును ప్రశ్నించాడు. (3:4,9)
John 3:9-11
యేసు నికోదేమును ఏ విధంగా గద్దించాడు ?
"నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అని నికోదేమును గద్దించాడు, "భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు?" అని మరలా గద్దించాడు. (3:10-12)
John 3:12-13
పరలోకమునకు ఎక్కి పోయిన వాడు ఎవరు ?
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేదు. (3:13)
John 3:14-15
మనుష్య కుమారుడు ఎందుకు హెచ్చించ బడాలి?
విశ్వసించు ప్రతీవాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. (3:114-15)
John 3:16-18
దేవుడు తాను లోకమును ప్రేమించాడని ఏ విధంగా చూపించాడు ?
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన జనితైక కుమారుని ఈ లోకానికి ఇవ్వడం ద్వారా తన ప్రేమను కనుపరిచాడు. (3:16)
లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడా?
లేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడాయనను పంపెను. (3:17)
John 3:19-28
మనుష్యులు ఎందుకు తీర్పులోనికి తేబడ్డారు ?
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు చీకటినే ప్రేమించారు గనుక వారు తీర్పులోనికి తేబడ్డారు. (3:19)
దుష్కార్యములు చేయువారు ఎందుకు వెలుగు నొద్దకు రారు ?
దుష్కార్యములు చేయు ప్రతీవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండేలా వెలుగు నొద్దకు రారు. (3:20)
సత్య వర్తనులు ఎందుకు వెలుగు నొద్దకు వస్తారు ?
సత్య వర్తనులు తమ క్రియలు దేవునిమూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష్య పరచబడునట్లు వెలుగు నొద్దకు వస్తారు. (3:21)
John 3:29-36
యేసు బాప్తిస్మమిచ్చు చున్నాడని, ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని యోహాను శిష్యులు యోహానుతో చెప్పినపుడు యోహాను ఏమన్నాడు ?
"ఆయన హెచ్చవలసి యున్నది, నేను తగ్గవలసి యున్నది" అని అన్నాడు. (3:26,30)
John 4
John 4:1-3
యేసు ఎప్పుడు యూదయ విడిచి గలిలయకు వెళ్ళాడు ?
యోహాను కంటే యేసు ఎక్కువమంది శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిమమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ఆయనకు తెలిసినప్పుడు యేసు యూదయ విడిచి గలిలయకు వెళ్ళాడు (4:1-3)
John 4:4-5
గలిలయకు వెళ్ళుచున్న మార్గములో ఆయన ఎక్కడ ఆగాడు ?
సమరయ లోని సుఖారను ఊరిలో యాకోబు బావి వద్ద ఆగాడు. (4:5-6)
John 4:6-8
యేసు అక్కడ ఉన్నప్పుడు యాకోబు బావి వద్దకు ఎవరు వచ్చారు ?
ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. (4:7)
యేసు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. (4:8)
సమరయ స్త్రీతో యేసు మొదట ఏమన్నాడు ?
"నాకు దాహమునకిమ్మని" సమరయ స్త్రీని యేసు అడిగాడు. (4:7)
John 4:9-10
యేసు ఆమెతో మాట్లాడుటను బట్టి ఆమె ఎందుకు ఆశ్చర్య పడింది ?
యూదులు సమరయులతో సాంగత్యము చేయని కారణంగా ఆమె ఆశ్చర్య పడింది. (4:9)
సంభాషణను దేవుని వైపు మరల్చుటకు యేసు ఏమన్నాడు ?
దేవుని వరమును, తనకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవరో అదియు ఆమె ఎరిగియుంటే ఆమె ఆయనను అడుగును, ఆయన ఆమెకు జీవజలమిస్తాడని చెప్పాడు. (4:10)
John 4:11-14
యేసు మాటలలోని ఆత్మీయ స్వభావాన్ని అర్ధం చేసుకోలేదనే దానిని తెలియపరచే ఏ మాట ఆమె చెప్పింది ?
"అయ్యా ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును" అని జవాబిచ్చింది. (4:11)
John 4:15-16
తానిచ్చు జలమును గురించి యేసు ఆ స్త్రీ తో ఏమి చెప్పాడు ?
తానిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడని, ఆయన వాని కిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని యేసు ఆ స్త్రీ తో చెప్పాడు. (4:14)
యేసు ఇస్తున్న జలమును ఇప్పుడు ఈ స్త్రీ ఎందుకు కోరుకుంటుంది ?
ఆమె దప్పిగొనకుండునట్లు, చేదుకొనడానికి బావి వద్దకు రాకుండునట్లు ఆ నీళ్ళు దయ చేయుమని అడుగుతుంది. (4:15)
యేసు తన సంభాషణను మార్చుతున్నాడు. ఆ స్త్రీతో ఏమి చెప్పాడు ?
"నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము" అని ఆ స్త్రీతో చెప్పాడు. (4:16)
John 4:17-18
తన భర్త ను పిలుచుకొని రమ్మని చెప్పినపుడు ఆ స్త్రీ ఏ జవాబు చెప్పింది ?
తనకు పెనిమిటి లేడని ఆ స్త్రీ చెప్పింది. (4:17)
యేసు ప్రవక్త అని ఆమె నమ్మునట్లు యేసు చెప్పిన మాట ఏమిటి ?
ఆమెకు ఐదుగురు పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడున్న వాడు ఆమె పెనిమిటి కాదు అని ఆయన చెప్పాడు. (4:18-19)
John 4:19-22
యేసు ప్రవక్త అని నమ్మేలా చేసిన యేసు మాట ఏమిటి ?
ఆమెకు ఐదుగురు పెనిమిటులున్నారు, ఇప్పుడున్నవాడు ఆమె పెనిమిటి కాదు అని ఆమెతో చెప్పాడు. (4:18-19)
ఆరాధన గురించి ఎలాంటి వివాద పూరితమైన వాదాన్ని ఆమె యేసు వద్దకు తీసుకొని వచ్చింది ?
సరైన ఆరాధనా స్థలం ఎక్కడ అనే వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వచ్చింది. (4:20)
John 4:23-24
తండ్రి వెదకుచున్న ఆరాధకుల గురించి యేసు ఆమెతో ఏమి చెప్పాడు ?
దేవుడు ఆత్మ, నిజమైన ఆరాధకులు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని చెప్పాడు. (4:23-24)
John 4:25-27
మెస్సీయ వచ్చినపుడు వారికి సమస్తమును తెలియజేయునని ఆమె చెప్పినపుడు యేసు ఏమి చెప్పాడు ?
ఆమెతో మాట్లాడుచున్న తానే మెస్సీయనని యేసు చెప్పాడు. (4:25-26)
John 4:28-33
యేసు సంభాషణ పూర్తి అయిన తరువాత ఆ స్త్రీ ఏమి చేసింది ?
ఆ స్త్రీ తన కుండ విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో "మీరు వచ్చి నేను చేసినవన్నియూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాదా" అని చెప్పింది. (4:28-29)
ఆ స్త్రీ చెప్పిన వార్తను విని ఆ ఊరి ప్రజలు ఏమి చేసారు ?
వారు తమ పట్టణమును విడిచి యేసు నొద్దకు వచ్చారు. (4:30)
John 4:34-38
తన ఆహారము ఏది అని యేసు చెప్పాడు ?
తనను పంపిన వాని చిత్తము నేరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయును తనకు ఆహారమై ఉన్నదని యేసు చెప్పాడు. (4:34)
పంట కోయుటలోని ప్రయోజనమేమి ?
విత్తువాడును, కోయువాడును కూడా సంతోషించు నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనును. (4:36)
John 4:39-40
ఆ పట్టణములోని సమరయులనేకులు యేసు నందు విశ్వాసముంచుటకు రెండు కారణాలు ఏమిటి ?
ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి, యేసు మాటలు వినినందున ఇంకనూ అనేకులు విశ్వసించారు. (4:39,41)
John 4:41-42
యేసును గురించి ఆ సమరయులలో అనేకులు ఏమి నమ్మారు ?
ఆయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్మారు. (4:42)
John 4:43-45
యేసు గలిలయకు వచ్చినపుడు గలిలయులు ఎందుకు ఆయనను అంగీకరించారు ?
యెరూషలేములో పండగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నియూ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినపుడు వారు ఆయనను చేర్చుకొనిరి. (4:45)
John 4:46-47
యేసు యూదయను విడిచి గలిలయకు తిరిగి వచ్చినపుడు యేసునొద్దకు ఎవరు వచ్చారు, అతడు కోరినదేమిటి ?
ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. అయన వచ్చి తన కుమారుణ్ణి స్వస్థ పరచవలేనని అతడు ఆయనను వేడుకొనెను. (4:46-47)
John 4:48-52
సూచక క్రియలు, మహాత్కార్యముల గురించి యేసు ఆ ప్రధానికి ఏమి చెప్పాడు ?
సూచక క్రియలు, మహాత్కార్యములు చూడకుంటే వారెంత మాత్రము నమ్మరని యేసు చెప్పాడు. (4:48)
యేసు ఆ ప్రధానితో వెళ్లక "నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి యున్నాడని" చెప్పినపుడు ఆ ప్రధాని ఏమి చేసాడు ?
ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. (4:50)
John 4:53-54
తన కుమారుడు బ్రతికి యున్నాడని తండ్రికి చెప్పిన తరువాత, "నీ కుమారుడు బ్రతికియున్నాడు" అని యేసు చెప్పిన కిందటి రోజు అదే గడియలో జ్వరము వానిని వదిలిపోయినదని తెలుసుకున్న తరువాత కలిగిన ఫలితమేమిటి ?
ప్రధాని యు అతని ఇంటివారుందరునూ యేసును నమ్మిరి. (4:53)
John 5
John 5:1-4
యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర అయిదు మంటపములు ఉన్న కోనేరు పేరు ఏమిటి ?
కోనేరు పేరు బేతస్థ (5:2)
బేతస్థ వద్ద ఉన్న దెవరు ?
ఆ మంటపము లో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచచేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. (5:3-4)
John 5:5-6
బేతస్థ వద్ద "స్వస్థపడ గోరుచున్నావా?" అని యేసు ఎవరిని అడిగాడు?
ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గలవాడై అక్కడ పడియుండుట చూచి, వాడప్పటికి బహు కాలమునుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి "స్వస్థపడ గోరుచున్నావా?" అని అడిగాడు. (5:6-7)
John 5:7-8
"స్వస్థపడ గోరుచున్నావా?" అని యేసు అడిగిన ప్రశ్నకు వ్యాధి గలవాని స్పందన ఏమిటి ?
ఆ రోగి "అయ్యా, నీళ్ళు కదిలించబడి నప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నా కంటే ముందుగా దిగునని" యేసుతో చెప్పాడు. (5:7)
John 5:9
యేసు "నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని" వానితో చెప్పగా అతనికి ఏమి జరిగింది?
వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. (5:8-9)
John 5:10-13
ఆ రోగి తన పరుపెత్తుకొని నడవడం యూదా నాయకులను ఎందుకు ఇబ్బంది పెట్టింది ?
విశ్రాంతి దినమందు అతను తన పరుపెత్తుకొన తగదే అని వారు ఇబ్బంది పడ్డారు. (5:9-10)
John 5:14-15
దేవాలయములో తాను స్వస్థ పరచిన వానిని యేసు చూసినపుడు ఏమని చెప్పాడు ?
"ఇదిగో స్వస్థత నొందితివి , మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము" అని అతనితో చెప్పాడు. (5:14)
పాపము చేయకుమని స్వస్థపడినవానితో యేసు చెప్పిన తరువాత వాడు ఏమి చేసాడు ?
వాడి వెళ్లి, తనను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియ చెప్పాడు. (5:15)
John 5:16-18
ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసిన కారణముగా యూదులు ఆయనను హింసించినందున యేసు ఎలా స్పందించాడు ?
"నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను" అని యేసు వారితో చెప్పాడు. (5:17)
యేసు చెప్పిన మాట ఎందుకు వారిని ఆయనను చంపేలా చేసింది ?
యేసు విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక (వారి ఆలోచన ప్రకారము), దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తనను దేవునితో సమానునిగా చేసికొనెను. (5:18)
John 5:19-20
యేసు ఏమి చేసాడు ?
తండ్రి ఏది చేయుట ఆయన చూచెనో దానినే చేసాడు. (5:19)
John 5:21-23
యూదుల నాయకులు ఆశ్చర్య పడునట్లు ఏ గొప్ప కార్యములను తండ్రి తన కుమారునికి చూపుతున్నాడు ?
తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. (5:20-21)
తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఎందుకు ఇచ్చాడు ?
తండ్రిని ఘనపర్చునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు. (5:22-23)
కుమారుని ఘనపరచని యెడల ఏమి జరుగుతుంది ?
కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. (5:23)
John 5:24-25
నీవు ఆయన మాట విని ఆయనను పంపినవానియందు విశ్వాసముంచిన యెడల ఏమి జరుగుతుంది ?
ఆ విధంగా విశ్వాసముంచిన యెడల నీకు నిత్య జీవముంటుంది, నీవు తీర్పు లోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నావు. (5:24)
John 5:26-27
సమాధుల్లో ఉన్న వారు తండ్రి స్వరం విన్నప్పుడు ఏమి జరుగుతుంది ?
కుమారుడు తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. (5:26)
John 5:28-29
సమాధులలో ఉన్న వారందరూ తండ్రి స్వరము వినినపుడు ఏమి జరుగుతుంది ?
సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. (5:28-29)
John 5:30-35
ఎందుకు యేసు యొక్క తీర్పులు యథార్థమైనవి ?
ఆయన తన ఇష్టప్రకారము గాక, తండ్రి చిత్త ప్రకారం చెయ్య డానికే చూస్తాడు గనుక ఆయన తీర్పులు యథార్థమైనవి. (5:30)
John 5:36-38
మనుష్యుల నుండి కాక ఏ రెండు విషయాలు యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి ?
నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను ఆయనకు ఇచ్చియున్నాడో ఆ క్రియలు యేసు దేవుని కుమారుడని సాక్ష్యమిస్తున్నాయి, అంతే కాకుండా ఆయనను పంపిన తండ్రియే ఆయనను గురించి సాక్ష్యమిస్తున్నాడు. (5:34-37)
ఏ కాలమందైనను ఆయన స్వరము వినని వారు, ఆయన స్వరూపమును చూడని వారు ఎవరు ?
యూదుల నాయకులు ఏ కాలమందైనను ఆయన స్వరము విననలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. (5:37)
John 5:39-42
యూదుల నాయకులు ఎందుకు లేఖనములను పరిశోధించుచున్నారు ?
లేఖనముల యందు వారికి నిత్య జీవమున్నదని తలంచుచు వారు లేఖనములను పరిశోధించుచున్నారు. (5:39)
లేఖనములు ఎవరి గురించి సాక్ష్యమిచ్చుచున్నవి ?
లేఖనములు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్నవి(5:39)
John 5:43-44
యూదుల నాయకులు ఎవరి మెప్పును కోరడం లేదు ?
యూదుల నాయకులు అద్వితీయ దేవుని మెప్పును కోరడం లేదు. (5:44)
John 5:45-47
యూదుల నాయకుల మీద తండ్రి యెదుట నేరము మోపువారు ఎవరు ?
మోషే యూదుల నాయకుల మీద తండ్రి యెదుట నేరము మోపును. (5:45)
యూదుల నాయకులు మోషే ను నమ్మిన యెడల ఏమి చేస్తారని యేసు చెపుతున్నాడు ?
యూదుల నాయకులు మోషే ను నమ్మిన యెడల వారు తనను నమ్ముదురు, ఎందుకంటే మోషే తన గురించి రాసాడు అని యేసు చెపుతున్నాడు (5:46-47)
John 6
John 6:1-3
గలిలయ సముద్రమునకు మరొక పేరేమిటి ?
గలిలయ సముద్రము తిబెరయ సముద్రము అని కూడా పిలుస్తారు. (6:1)
గొప్ప జనసమూహం ఎందుకు యేసుని వెంబడిస్తుంది ?
రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. (6:2)
John 6:4-6
యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండి కన్నులెత్తి ఏమి చూసాడు ?
బహు జనులు తన యొద్దకు వచ్చుట అయన చూసాడు. (6:4-5)
"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడు ?
ఫిలిప్పును పరీక్షించుటకు యేసు అతనిని అడిగాడు. (6:5-6)
John 6:7-9
"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు అడిగిన ప్రశ్నకు ఫిలిప్పు జవాబు ఏమిటి ?
"వారిలో ప్రతీవాడును కొంచెము కొంచెము పుచ్చుకోనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవు" అని ఫిలిప్పు చెప్పాడు. (6:7)
"వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుము" అని యేసు అడిగిన ప్రశ్నకు అంద్రెయ జవాబు ఏమిటి ?
"ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యెద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఏమాత్రము" అని చెప్పాడు. (6:8-9).
John 6:10-12
ఎంతమంది పురుషులు అక్కడ ఉన్నారు ?
దాదాపు ఐదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. (6:10)
రొట్టెలు, చేపలతో యేసు ఏమి చేసాడు ?
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, ఆలాగుననే చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. (6:11)
జనులు ఎంత వరకు భుజించిరి ?
వారు తమకిష్టమైనంత వరకు భుజించిరి. (6:11)
John 6:13-15
వారు భుజించిన తరువాత వారియొద్ద ఎంత ఆహారం మిగిలింది ?
వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగు చేసి పండ్రెండు గంపలు నింపిరి. (6:13)
మరల యేసు ఒంటరిగా కొండకు ఎందుకు వెళ్ళాడు ?
ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను (ఐదువేలమందికి ఆహారం పెట్టడం) చూచి రాజుగా చేయుటకు వారు తనను బలవంతంగా పట్టుకొనబోవుచున్నారని యేసు తెలుసుకొని అక్కడనుండి వెళ్ళిపోయాడు. (6:14-15)
John 6:16-18
శిష్యులు దోనె లోనికి ఎక్కి కపెర్నహోమునకు పోవుచున్నప్పుడు వాతావరణములో కలిగిన మార్పు ఏమిటి ?
అప్పుడు పెద్ద గాలి విసరగా, సముద్రము పొంగడం ఆరంభించింది. (6:18)
John 6:19-25
ఎందుకు శిష్యులు భయపడటం మొదలుపెట్టారు ?
యేసు సముద్రము మీద నడచుచు తమ దోనే దగ్గరకు వచ్చుట చూచి వారు భయపడిరి. (6:19)
యేసును దోనె మీద ఎక్కించు కొనుటకు శిష్యులు ఇష్టపడినపుడు యేసు వారితో ఏమన్నాడు ?
"నేనే, భయపడకుడి" అని వారితో చెప్పాడు. (6:20)
John 6:26-27
ఏ కారణము కొరకు జనులు తనను వెదకుచున్నారని యేసు చెప్పాడు ?
వారు సూచనలను చూచుట వలననే కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొండుటవలననే ఆయనను వెదకుచున్నారని యేసు చెప్పాడు. 61:26)
జనులు దేనికొరకు పనిచెయ్యాలి, దేని కొరకు పని చెయ్య కూడదు అని యేసు చెప్పాడు ?
క్షయమైన దానికొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని యేసు చెప్పాడు. (6:27)
John 6:28-31
దేవుని క్రియను జనులకు యేసు ఏ విధంగా నిర్వచించాడు ?
"ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ" అని జనులతో యేసు చెప్పాడు. (6:29)
John 6:32-34
జనసమూహము తమ పితరులకు అనుగ్రహింపబడిన పరలోకపు మన్నాను గురించిన సూచక క్రియను గురించి అడుగుతున్నప్పుడు యేసు ఏ ఆహారము గురించి మాట్లాడాడు ?
లోకమునకు నిత్య జీవమునిచ్చు దేవుని నుండి పంపబడిన నిజమైన జీవాహారము గురించి యేసు మాట్లాడుతున్నాడు. తరువాత తానే జీవాహారమని చెపుతున్నాడు. (6:30-35)
John 6:35-37
యేసు నొద్దకు ఎవరు వస్తారు ?
తండ్రి యేసుకు అనుగ్రహించువారందరూ ఆయన వద్దకు వస్తారు. (6:37)
John 6:38-42
యేసును పంపిన వాని చిత్తమేమిటి ?
తండ్రి యేసుకు అనుగ్రహించిన దాని యంతటిలో ఆయనేమియూ పోగోట్టుకొనక, తండ్రి ఆయనకు ఇచ్చిన వారందరికీ అయన నిత్య జీవం ఇవ్వాలనీ, అంత్య దినమున వారిని లేపుతాడని అయన చిత్తం. (6:39-40)
John 6:43-45
ఒక వ్యక్తి యేసు నొద్దకు ఎలా రాగలడు ?
జ తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేదు. (6:44)
John 6:46-49
ఎవరు తండ్రిని చూసారు ?
దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండ లేదు. (6:46)
John 6:50-51
లోకమునకు జీవము కొరకు యేసు ఇచ్చు ఆహారమేది ?
యేసు ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరమే . (6:51)
John 6:52-53
మీలో మీరు జీవము గలవారు కావలెనంటే ఏమి చెయ్యాలి ?
మీరు జీవము గలవారు కావలెనంటే మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగవలెను. (6:53)
John 6:54-56
యేసు మనలో ఎలా నిలిచి యుంటాడు, మనం ఆయనలో ఎలా నిలిచి యుంటాము ?
మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన యెడల ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి యుంటాము. (6:56)
John 6:57-63
ఎందుకు యేసు జీవించి యున్నాడు ?
తండ్రి మూలముగా యేసు జీవిస్తూ ఉన్నాడు.(6:57)
John 6:64-65
ఎవరైనా యేసు నొద్దకు ఎలా రాగలరు ?
తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేడు. (6:44)
John 6:66-69
"మీరు కూడా వెల్లిపోవలెనని యున్నారా ?" అని యేసు పన్నెండు మందిని అడిగినప్పుడు ఎవరు జవాబిచ్చారు? ఏమని చెప్పాడు ?
సీమోను పేతురు యేసుకు జవాబిచ్చాడు. "ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్దుడవని మేము విశ్వసించి ఎరిగియున్నాము" అని చెప్పాడు. (6:67-69)
John 6:70-71
పన్నెండు మందిలో ఒకడు సాతాను అని ఎవరి గురించి యేసు చెప్పాడు ?
సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడై యుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. (6:70-71)
John 7
John 7:1-2
యూదయలో సంచరించడానికి యేసు ఎందుకు ఇష్టపడలేదు ?
యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించడానికి ఇష్టపడలేదు. (7:1)
John 7:3-4
ఎందుకు యేసు సహోదరులు ఆయనను పర్ణశాలల పండుగకు యూదయకు వెళ్ళమని చెప్పారు ?
ఆయన చేయుచున్న క్రియలు ఆయన శిష్యులు చూచునట్లు ఆ స్థలము విడిచి యూదయకు వెళ్ళమని అడిగారు. (7:2-4)
John 7:5-9
పండుగకు వెళ్ళకుండా ఉండటానికి యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?
ఆయన సమయమింకను రాలేదు, ఆయన సమయము పరిపూర్ణము కాలేదు అని తన సహోదరులకు చెప్పాడు. (7:6,8)
లోకము యేసును ఎందుకు ద్వేషిస్తున్నది ?
లోకము క్రియలు చెడ్డవని యేసు సాక్ష్యమిచ్చినందున లోకము ఆయనను ద్వేషించుచున్నది. (7:7)
John 7:10-11
పండుగకు యేసు ఎలా, ఎప్పుడు వెళ్ళాడు ?
ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్ళాడు. (7:10)
John 7:12-13
జనసమూహములోని ప్రజలు యేసును గురించి ఏమన్నారు ?
""కొందరు ఆయనను మంచి వాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చు వాడనిరి. (7:12)
ఎందుకు ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటాడలేదు ?
యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. (7:13)
John 7:14-16
యేసు ఎప్పుడు దేవాలయములోనికి వెళ్లి బోధింప నారంభించెను ?
సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధింప నారంభించెను. (7:14)
John 7:17-18
యేసు చేసిన బోధ దేవుని వలన కలిగినదో, తనంతట తాను చేస్తున్నాడో ఎలా తెలుసుకుంటారని యేసు చెప్పాడు ?
ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయుంచుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, తనంతట తాను చేస్తున్నాడో తెలుసుకుంటారని యేసు చెప్పాడు. (7:17)
తనను పంపిన వాని మహిమను వెదకు వాని గురించి యేసు ఏమి చెప్పాడు ?
ఆ మనుష్యుడు సత్య వర్తనుడు, అతనిలో ఏ దుర్నీతియు లేదు అని చెప్పాడు. (7:18)
John 7:19-22
యేసు అభిప్రాయం ప్రకారం ధర్మశాస్త్రమును గైకొనువాడు ఎవరు ?
యేసు అభిప్రాయం ప్రకారం ధర్మశాస్త్రమును గైకొనువాడు ఎవడునూ లేదు. (7:19)
John 7:23-24
విశ్రాంతి దినమున స్వస్థత చెయ్యడం గురించి యేసు వాదన ఏమిటి ?
"మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు విశ్రాంతి దినమున మీరు సున్నతి చేస్తారు, నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందున మీరు నా మీద ఆగ్రహపడుచున్నారు" అని యేసు వాదన చేస్తున్నాడు. (7:22-23)
తీర్పు ఏ విధంగా చెయ్యాలని యేసు చెపుతున్నాడు ?
వేలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చాలని యేసు చెప్పాడు. (7:24)
John 7:25-29
యేసే క్రీస్తు అని విశ్వసించక పోవడానికి మనుష్యులు ఇచ్చిన కారణం ఏమిటి ?
యేసు ఎక్కడివాడో యెరుగుదుము, క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును యెరగడని మనుష్యులు చెప్పుకొనిరి. (7:27)
John 7:30-34
యేసును పట్టుకోడానికి అధికారులను ఎవరు పంపారు ?
ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును పట్టుకోడానికి అధికారులను పంపారు.(7:32)
John 7:35-38
"ఇంకా కొంత కాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును, మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉండునో అక్కడికి మీరు రాలేరు" అని యేసు అనిన మాటలను యూదులు అర్ధం చేసుకున్నారా ?
వారి సంభాషణలను బట్టి వారు యేసు మాటలను అర్ధం చేసుకోలేదని తెలుస్తున్నది. (7:35-36)
John 7:39-44
"ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొన వలెను. నాయందు విశ్వాససముంచువాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారును" అని దేనిని ఉద్దేశించి యేసు ఈ మాట చెప్పాడు ?
తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. (7:39)
John 7:45-49
"ఎందుకు మీరాయనను తీసికొని రాలేదు" అని ప్రధాన యాజకులు, పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు అధికారులు ఏమి జవాబు ఇచ్చారు ?
"ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరుడును ఎన్నడును మాటలాడలేదు" అని అన్నారు. (7:45)
John 7:50-53
యేసును పట్టుకొనుటకు వెళ్ళిన అధికారులతో పరిసయ్యులు "మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని, పరిసయ్యులలో గాని యెవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచారా?" అని అడిగినప్పుడు నికోదేము వారితో ఎలా సమాధానమిచ్చాడు ?
"ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును మన ధర్మశాస్త్రము తీర్పు తీర్చునా?"అని వారిని అడిగాడు. (7:50-51)
John 8
John 8:1-3
యేసు దేవాలయములో బోధించుచుండగా శాస్త్రులు, పరిసయ్యులు ఏమి చేసారు ?
వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి యేసు ఏమంటాడో అని ఆయనను అడిగారు. (8:2-3)
John 8:4-6
శాస్త్రులు, పరిసయ్యులు నిజముగా ఎందుకు ఈ స్త్రీని యేసు నొద్దకు తీసుకొని వచ్చ్చారు ?
ఆయన మీద నేరము మోప వలెనని ఆయనను శోధించడానికి ఆ స్త్రీను యేసునొద్దకు తీసుకొని వచ్చారు. (8:6)
John 8:7-8
వ్యభిచారములో పట్టబడిన స్త్రీని గురించి మాటి మాటికి అడుగుతున్నపుడు యేసు శాస్త్రులు, పరిసయ్యులతో ఏమి చెప్పాడు ?
"మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును" అని శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్పాడు. (8:7)
John 8:9-11
పాపములో పట్టబడిన ఆ స్త్రీ మీద మొదట రాయి వెయ్యండని యేసు చెప్పినపుడు ఆ ప్రజలు ఏమి చేసారు ?
వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. (8:9)
వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఏమి చెయ్యమని యేసు చెప్పాడు ?
వెళ్లి ఇక పాపము చేయ వద్దని యేసు చెప్పాడు. (8:11)
John 8:12-16
"నేను లోకమునకు వెలుగును, నన్నువెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును" అని యేసు చెప్పిన తరువాత పరిసయ్యులు మోపిన నేరమేమిటి ?
యేసు తనను గూర్చి తానే సాక్ష్యము చెప్పుకొనుచున్నాడు, ఆయన సాక్ష్యము సత్యము కాదని నేరము మోపారు.(8:13)
John 8:17-22
తన సాక్ష్యము సత్యము అని యేసు ఏ విధముగా చెప్పుకున్నాడు ?
వారి ధర్మ శాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని రాయబడి ఉన్నదని చెప్పాడు. తానును, తనను పంపిన తండ్రియు ఇద్దరు సాక్ష్యమిస్తున్నట్లు చెప్పాడు. (8:17-18)
John 8:23-24
దేనిని ఆధారం చేసుకొని పరిసయ్యులు చనిపోతారని పరిసయ్యుల గురించి యేసు మాట్లాడాడు ?
వారు క్రిందివారు అని, తాను పైనుండు వాడు అని ఎరిగి వారిని గురించిన ఆయన జ్ఞానమును బట్టి ఆయన మాటను ఆధారం చేసుకున్నాడు. (8:23-24)
పరిసయ్యులు తమ పాపముల నుండి ఏవిధంగా తప్పించుకోగలరు ?
నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములలోనే చనిపోవుదురని యేసు వారితో చెప్పాడు. (8:24)
John 8:25-27
ఏ సంగతులను యేసు లోకానికి చెప్పాడు ?
తండ్రి యొద్ద వినిన సంగతులనే ఆయన లోకానికి చెప్పాడు. (8:26-27)
John 8:28-30
యేసును పంపిన తండ్రి ఆయనను ఒంటరిగా విడిచి పెట్టక యేసుతోనే ఎందుకు ఉన్నాడు ?
తండ్రి కిష్టమైన కార్యములను ఎల్లప్పుడు చేయుచున్నందున తండ్రి యేసును ఒంటరిగా విడిచి పెట్టక తోడుగా ఉన్నాడు. (8:29)
John 8:31-33
తనను నమ్మిన యూదులు నిజముగా ఆయన శిష్యులని ఏవిధంగా తెలుసు కుంటారని యేసు చెప్పాడు ?
వారు తన వాక్యమందు నిలిచినవారైతే నిజముగా ఆయన శిష్యులుగా ఉంటారని యేసు చెప్పాడు. (8:31)
"...సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును" అని యేసు చెప్పినపుడు నమ్మిన యూదులు ఏమని తలంచారు ?
దాసులుగా ఉండడము, బందీలుగా ఉండడము గురించి యూదులు తలంచారు. (8:33)
John 8:34-36
"...సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును" అని యేసు చెప్పినపుడు ఆయన దేనిని ఉదాహరిస్తున్నాడు ?
పాపము నుండి దాసులుగా ఉండుట నుండి స్వతంత్రులగుట గురించి ఆయన మాట్లాడుతున్నాడు.(8:34)
John 8:37-38
యేసును చంపుటకు యూదులు వెదకుచున్నారను దానికి కారణం యేసు ఏమి చెప్పాడు ?
వారిలో ఆయన వాక్యమునకు చోటు లేని కారణంగా వారు ఆయనను చంపుటకు చూచుచున్నారు. (8:37)
John 8:39-41
వారు ఆబ్రాహాము పిల్లలు కాదు అని యేసు ఎందుకు చెప్పాడు ?
వారు అబ్రాహాము పిల్లలు కాదు ఎందుకంటే వారు అబ్రాహాము చేసిన క్రియలు చెయ్యక యేసును చంప చూచుచున్నారు. (8:39-40)
John 8:42-44
దేవుడొక్కడే మాకు తండ్రి అని యూదులు చెప్పినపుడు దానిని యేసు ఏవిధంగా ఖండించాడు ?
"దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చి యుండ లేదు, ఆయన నన్ను పంపెను" అని యేసు వారితో చెప్పాడు. (8:42)
ఈ యూదులకు తండ్రి ఎవరు అని యేసు చెప్పాడు ?
వారి తండ్రి అపవాది అని యేసు చెప్పాడు. (8:44)
అపవాది గురించి యేసు ఏమి చెప్పాడు ?
అపవాది ఆదినుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యేసు అపవాది గురించి చెప్పాడు. (8:44)
John 8:45-49
ఎవరు దేవుని మాట వినును ?
దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వినును. (8:47)
John 8:50-51
యేసు మాట గైకొనిన యెడల ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు.
యేసు మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడు. (8:51)
John 8:52-56
ఎన్నడు మరణము పొందడు అనే యేసు మాట దయ్యము పట్టినవాని మాటలా ఉందని యూదులు ఎందుకు అనుకొన్నారు ?
శరీరము యొక్క భౌతిక మరణము గురించి వారు తలంచారు, అబ్రాహాము, ప్రవక్తలును చనిపోయారు (వారి భౌతిక శరీరములు). (8:52-53)
John 8:57-59
అబ్రాహాము ఇంకను జీవించి ఉన్నాడు, యేసు అబ్రాహాము కంటే గొప్పవాడు అని చెపుతున్న యేసు మాట ఏది ?
"మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను" అని యేసు చెప్పాడు. "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు చెప్పాడు. (8:56-58)
John 9
John 9:1-2
ఆ మనుష్యుడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అనే దానికి శిష్యులు చేసిన తలంపు ఏమిటి ?
వాడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణము వాడు పాపము చేసి ఉండటం గాని వాని కన్నవారు పాపము చేసి ఉండటం గాని అయి ఉండవచ్చు అని శిష్యులు ముందుగా నిర్ధారించారు. (9:2)
John 9:3-5
వాడు గ్రుడ్డివాడుగా పుట్టడానికి కారణము ఏమిటని యేసు చెప్పాడు ?
దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్ష్య పరచబడుటకే వాడు గ్రుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్పాడు. (9:3)
John 9:6-7
ఆ గ్రుడ్డి వానికి యేసు ఏమి చేసాడు? అతనితో ఏమి చెప్పాడు ?
యేసు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని" యేసు చెప్పాడు. (9:6-7)
సిలోయము కోనేటిలో ఆ గ్రుడ్డివాడు కడుగుకొనిన తరువాత ఏమి జరిగింది ?
చూపు గలవాడయ్యాడు. (9:7)
John 9:8-12
అక్కడ కూర్చుండి భిక్ష మెత్తుకొనిన వాడు అతనా కాదా అనే వాదం వచ్చినపుడు అ మనుష్యుడు ఏమి సాక్ష్యమిచ్చాడు ?
అతడు ఆ వ్యక్తిని తానే అని సాక్ష్యమిచ్చాడు. (9:9)
John 9:13-15
ఇంతకు ముందు గ్రుడ్డివాడుగా ఉండి భిక్షమెత్తుకొనిన వానిని ప్రజలు ఏమి చేసారు ?
వారు ఆ మనుష్యుని పరిసయ్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. (9:13)
అ స్వస్థత ఎప్పుడు చోటు చేసుకుంది ?
గుడ్డి వానికి స్వస్థత విశ్రాంతి దినమందు జరిగింది. (9:14)
ఇంతకు ముందు గ్రుడ్డివాడుగా ఉన్నవానికి పరిసయ్యులు ఏమని అడిగారు ?
నీవు చూపు ఏ విధంగా పొందావు అని ప్రశ్నించారు. (9:15)
John 9:16-18
పరిసయ్యుల మధ్య కలిగిన బేధము ఏమిటి ?
కొందరు పరిసయ్యులు యేసు విశ్రాంతి దినము ఆచరించుట లేదు (విశ్రాంతి దినమున స్వస్థ పరచాడు) గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాదు అని అన్నారు, మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలు ఎలాగు చెయ్యగలడు అన్నారు. (9:16)
ఇంతకు ముందు గుడ్డివాడిని యేసు గురించి అడిగినపుడు వాడు ఏమి చెప్పాడు ?
"యేసు ఒక ప్రవక్త" అని ఇంతకు ముందు గుడ్డివాడు యేసును గురించి చెప్పాడు. (9:17)
చూపు పొందిన వ్యక్తి యొక్క తలిదండ్రులను యూదులు ఎందుకు పిలిచారు ?
వాడు గ్రుడ్డివాడై యుండి చూపు పొందెనని యూదులు నమ్మలేదు గనుక వారు అతని తలిదండ్రులను పిలిపించారు. (9:18-19)
John 9:19-21
వారి కుమారుని గురించి అతని తలిదండ్రులు ఏమి చేసారు ?
ఆ మనుష్యుడు నిజముగా వారి కుమారుడే అని అతడు పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టాడని చెప్పారు. (9:20)
ఆ మనుష్యుని తలిదండ్రులు వారికి ఏమి తెలియదని చెపుతున్నారు ?
ఇప్పుడు వాడు ఏలాగున చూచుచున్నాడో వారికి తెలియదు, ఎవడు వాని కన్నులు తెరిచినో అదియును తెలియదని చెప్పారు. (9:21)
John 9:22-23
"వీడు వయస్సు వచ్చిన వాడు, వీనినే అడుగుడి" అని ఆ మనుష్యుని తలిదండ్రులు ఎందుకు అన్నారు ?
వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పారు, ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజమందిరములోనుంది వెలివేతురని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. (9:22)
John 9:24-25
గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని పరిసయ్యులు రెండవ మారు ఎందుకు పిలిచారు ?
"దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి యని మేమెరుగుదుము" అని చెప్పారు. (9:24)
యేసు ఒక పాపి అని పరిసయ్యులు అనిన మాటకు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని స్పందన ఏమిటి ?
"ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుద్దివాడనై యుండి ఇప్పుడు చూచుచున్నాను" అని జవాబిచ్చాడు. (9:25)
John 9:26-31
గ్రుడ్డివాడై యుండిన మనుష్యుని పరిసయ్యులు ఎందుకు దూషించారు ?
"ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినక పోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరునూ ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి" అని వారిని అడిగినందుకు పరిసయ్యులు అతనిని దూషించారు.(9:26-28)
John 9:32-34
పరిసయ్యులు గ్రుడ్డివాడై యుండిన మనుష్యుని దూషించినపుడు వాడు ఇచ్చిన బదులు ఏమిటి ?
"ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగక పోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకించడని యెరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమియూ చేయ నేరడు" అని వారికి బదులిచ్చాడు. (9:30-33)
గ్రుడ్డివాడైన మనుష్యుని జవాబుకు పరిసయ్యుల స్పందన ఎలా ఉంది ?
నీవు కేవలం పాపివై పుట్టినావు, నీవు మాకు బోధింప వచ్చితివా అని అతనితో అన్నారు. తరువాత అతనిని సమాజమందిరము లోనుండి వెలివేసారు. (9:34)
John 9:35-38
గ్రుడ్డి వాడైన మనుష్యుని పరిసయ్యులు వేలివేసారని యేసు వినినప్పుడు యేసు ఏమి చేసాడు ?
అతనిని వెదకుచూ వెళ్లి అతనిని కను గొనెను. (9:35)
గ్రుడ్డి వాడైన మనుష్యుని కనుగొనిన తరువాత యేసు అతనితో ఏమి మాట్లాడాడు ?
నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నవా అని గ్రుడ్డి వాడైన మనుష్యుని యేసు అడిగాడు. (9:35-36)
యేసు దేవుని కుమారుడనే సమాచారానికి గ్రుడ్డి వాడైన మనుష్యుడు ఏవిధంగా స్పందించాడు ?
గ్రుడ్డి వాడైన మనుష్యుడు విశ్వసించుచున్నానని చెప్పాడు, యేసు ను ఆరాధించాడు. (9:38)
John 9:39-41
పరిసయ్యుల పాపములను గురించి యేసు ఏమి చెప్పాడు ?
"మీరు గ్రుడ్డి వారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి యున్నది" అని యేసు వారితో చెప్పాడు. (9:41)
John 10
John 10:1-2
యేసు చెప్పిన దాని ప్రకారం దొంగ, దోచుకొనువాడు ఎవరు ?
గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు, దోచుకొనువాడునై యున్నాడు. (10:1)
ద్వారమున ప్రవేశించు వాడు ఎవరు ?
ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. (10:2)
John 10:3-4
కాపరి పిలిచినప్పుడు ఎందుకు గొర్రెలు అతనిని వెంబడిస్తాయి ?
గొర్రెలకు అతని స్వరము తెలుసు గనుక అవి అతనిని వెంబడించును. (10:3-4)
John 10:5-6
గొర్రెలు అన్యుని వెంబడిస్తాయా ?
లేదు. గొర్రెలు అన్యుని వెంబడించవు. (10:5)
John 10:7-8
యేసుకు ముందు వచ్చినవారందరూ ఎలాంటి వారు ?
యేసుకు ముందు వచ్చినవారందరూ దొంగలును దోచుకొనువారునై యున్నారు. (10:7)
John 10:9-10
నేనే ద్వారమును అని యేసు చెప్పాడు, ఈ ద్వారము నుండి ప్రవేశించు వారికి ఏమి జరుగుతుంది ?
ద్వారమైన యేసు ద్వారా ప్రవేశించు వారు రక్షించబడుదురు, వారు లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేతను కనుగొంటారు. (10:9)
John 10:11-13
మంచి కాపరియైన యేసు ఏమి చెయ్యడానికి ఇష్టపడుతున్నాడు ? తన గొర్రెలకు ఏమి చేసాడు ?
మంచి కాపరియైన యేసు తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన గొర్రెలకు తన ప్రాణాన్ని అర్పించాడు. (10:11,15)
John 10:14-16
యేసుకు వేరే గొర్రెల గుంపు ఉందా ? ఉంటే వాటికేమి జరుగుతుంది ?
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఆయనకు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని రావాలని యేసు చెప్పాడు. అవి ఆయన స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. (10:16)
John 10:17-18
ఎందుకు తండ్రి యేసును ప్రేమించుచున్నాడు ?
యేసు మరల తీసుకొనునట్లు ఆయన తన ప్రాణమును పెట్టుచున్నాడు, ఇందు వలన తండ్రి ఆయనను ప్రేమించుచున్నాడు. (10:17)
ఎవరైనా యేసు ప్రాణమును తీసుకొనగలరా ?
లేదు. ఆయన అంతట ఆయనే తన ప్రాణమును పెట్టుచున్నాడు. (10:18)
తన ప్రాణమును పెట్టుటకును, దానిని తీసుకోనుటకును ఎక్కడినుండి అధికారము పొందాడు ?
తన తండ్రి వలన యేసు ఈ ఆజ్ఞ పొందాడు. (10:18)
John 10:19-21
యేసు మాటలను బట్టి యూదులు ఏమన్నారు ?
అనేకులు "వాడు దయ్యము పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి, మరికొందరు - ఇది దయ్యము పట్టినవాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలడా" అనిరి.(10:19-21)
John 10:22-24
దేవాలయములోని సోలోమోను మంటపము వద్ద యేసును యూదులు చుట్టుముట్టినపుడు యూదులు యేసుతో ఏమన్నారు ?
"ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పస్టముగా చెప్పు" అన్నారు. (10:24)
John 10:25-26
సోలోమోను మంటపము వద్ద యూదులకు యేసు ఎలా జవాబిచ్చాడు ?
అయన వారితో తాను (క్రీస్తునని) ఇంతకు ముందే చెప్పానని యూదులతో చెప్పాడు. వారు ఆయన గొర్రెలలో చేరినవారు కారు కనుక వారు నమ్మరని వారితో చెప్పాడు. (10:25-26)
John 10:27-28
యేసు తన గొర్రెలపట్ల తన శ్రద్ధ, కాపుదల గురించి ఏమి చెప్పాడు ?
తన గొర్రెలకు నిత్యజీవాన్ని ఇస్తాడని యేసు చెప్పాడు, అవి ఎప్పటికిని నశింపవు , ఎవడునూ వాటిని ఆయన చేతిలోనుండి అపహరింపడు. (10:28)
John 10:29-31
గొర్రెలను యేసుకు ఇచ్చినదెవరు ?
గొర్రెలను యేసుకు ఇచ్చినది తండ్రి (10:29)
తండ్రి కంటే గొప్పవాడున్నాడా ?
తండ్రి అందరికంటే గొప్పవాడు. (10:29)
John 10:32-33
"నేనునూ నా తండ్రియును ఏకమై యున్నామని " యేసు చెప్పినపుడు ఎందుకు యూదులు ఆయనను కొట్టవలెనని రాళ్ళు ఎత్తారు ?
యేసు దేవదూషణ చేయుచున్నాడు, తనను తాను దేవునితో సమానునిగా చేసుకొనుచున్నాడని యూదులు నమ్మారు. (10:30-33)
John 10:34-36
దేవదూషణకు వ్యతిరేకముగా యేసు తన ప్రతివాడికి ఇచ్చిన సమాధానమేది ?
"మీరు దైవ సమానులని నేనంటినని మీ ధర్మ శాస్త్రములో వ్రాయబడి యుండ లేదా ? లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యమెవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తనను ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా ?" అని తనని తాను సమర్ధించు కొన్నాడు. (10:34-36)
John 10:37-39
తనను నమ్మడానికి తీర్మానించుకోవడం కోసం యూదులు ఏమి చెయ్యాలని యేసు వారితో చెప్పాడు ?
తన క్రియలను చూడుడని యూదులతో యేసు చెప్పాడు, ఆయన తండ్రి క్రియలు చేయని యెడల తనను నమ్మకుడి అని చెప్పాడు, చేసిన యెడల తనను నమ్ముడని వారితో చెప్పాడు. (10:37-38)
యేసు చేసిన క్రియలను యూదులు గ్రహించి తెలిసికొన గల్గునట్లు యేసు ఏమి చెప్పాడు ?
తండ్రి యేసునందును, యేసు తండ్రి యందును ఉన్నారని వారు గ్రహించి తెలిసికొన గల్గునట్లు యేసు చేసిన క్రియలను నమ్ముడని చెప్పాడు. (10:38)
తండ్రి యేసునందును, యేసు తండ్రి యందును ఉన్నారను మాటకు యూదుల స్పందన ఏమిటి ?
వారు మరల ఆయనను పట్టుకొన చూసారు. (10:39)
John 10:40-42
ఈ సంఘటన జరిగిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు ?
యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన యొర్దాను అద్దరిని ఉన్న స్థలమునకు వెళ్ళాడు. (10:40)
యేసు వద్దకు వచ్చిన అనేకులు ఏమి చేసారు, ఏమి అన్నారు ?
అనేకులు ఆయన వద్దకు వచ్చి "యోహాను ఏ సూచక క్రియను చేయ లేదు గాని యీయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన"వనిరి, అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. (10:41-42)
John 11
John 11:1-2
లాజరు ఎవరు ?
లాజరు బేతనియ అనే గ్రామానికి చెందిన వాడు. మరియ, మార్త అతని సహోదరీలు. ఈ మరియ ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియయే. (11:1-2)
John 11:3-4
లాజరు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు లాజరు, అతని వ్యాదిధిని గురించి యేసు ఏమన్నాడు ?
"యీ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది" అని చెప్పాడు. (11:4)
John 11:5-7
లాజరు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు ఏమి చేసాడు ?
యేసు తానున్న చోటనే ఇంక రెండు దినములు నిలిచెను. (11:6)
John 11:8-11
"మనము యూదయకు తిరిగి వెళ్ళుదుము" అని తన శిష్యులతో అని నప్పుడు శిష్యులు ఏమన్నారు ?
"బోధకుడా యిప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా?" అని యేసును అడిగారు. (11:8)
పగటివేళ నడవడం, రాత్రివేళ నడవడం గురించి యేసు ఏమి చెపుతున్నాడు ?
ఒకడు పగటివేళ నడచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక వాడు తొట్రు పడడు, అయితే రాత్రివేళ ఒకడు నడచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును అని యేసు చెప్పాడు. (11:9-10)
John 11:12-14
మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని యేసు తన శిష్యులతో చెప్పినపుడు వారు ఏమని తలంచారు ?
వారు లాజరు నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొని "ప్రభువా అతడు నిద్రించిన యెడల బాగుపడు"ననిరి.(11:11-12)
లాజరు నిద్రించెను అని చెప్పడములో యేసు ఉద్దేశమేమిటి ?
లాజరు నిద్రించెను అని చెప్పడములో యేసు లాజరు మరణము గురించి మాటలాడెను. (11:13)
John 11:15-16
లజరు చనిపోయినప్పుడు అక్కడ లేనందుకు యేసు ఎందుకు సంతోషిస్తున్నాడు ?
"లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండ లేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను" అని యేసు అన్నాడు. (11:15)
యేసుతో యూదయకు వెళ్ళినపుడు ఏమి జరగబోతున్నదని తోమాా ఆలోచించాడు ?
తామంతా చనిపోతామని తోమాా తలంచాడు. (11:16)
John 11:17-20
యేసు వచ్చే నాటికి లాజరు సమాధిలో ఎన్నిరోజుల నుండి ఉన్నాడు ?
నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడు.(11:17)
యేసు వచ్చుచున్నాడని మార్త వినినప్పుడు ఏమి చేసింది ?
యేసు వచ్చుచున్నాడని మార్త వినినపుడు ఆయనను ఎదుర్కొనడానికి బయటకు వెళ్ళింది. (11:20)
John 11:21-23
యేసు కొరకు దేవుడు ఏమి చేస్తాడని మార్త తలంచినది ?
"ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించును" అని మార్త యేసుతో అన్నది. (11:22)
John 11:24-26
"నీ సహోదరుడు మరల లేచును" అని యేసు మార్త తో అనినపుడు మార్త యొక్క స్పందన ఏమిటి ?
"అంత్య దినమున పునరుత్థానమున లేచునని ఎరుగుదునని" యేసు తో మార్త చెప్పింది. (11:24)
తన యందు విశ్వసించు వారికి ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు ?
ఆయన యందు విశ్వసించు వారు చనిపోయినను బ్రతుకును. బ్రతికి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు అని యేసు చెప్పాడు. (11:25-26)
John 11:27-29
యేసు ఎవరని మార్త సాక్ష్యం చెప్పింది ?
"అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని యేసు తో చెప్పింది. (11:27)
John 11:30-32
మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమెతో ఉన్న యూదులు ఆమె ఏమి చేయడానికి వెళ్ళుచున్నదని తలంచారు ?
ఆమెతో ఉన్న యూదులు ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లారు. (11:31)
మరియ ఎక్కడికి వెళ్ళుచున్నది ?
మరియ యేసును కలుసుకొనుటకు వెళ్ళుచున్నది. (11:29,32)
John 11:33-35
యేసు కలవరపడి ఆత్మలో మూలుగునట్లు చేసినది ఏది?
మరియ ఏడ్చుటయు ఆమెతో కూడివచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడు. (11:33-35)
John 11:36-37
యేసు కన్నీళ్లు విడవడం చూసి యూదులు ఏమనుకొన్నారు ?
యేసు లాజరును ఎలాగు ప్రేమించేనో చూడుడి అని యూదులు అనుకొన్నారు(11:36)
John 11:38-40
లాజరు ఉంచిన సమాధి రాయిని తొలగించమని యేసు ఆజ్ఞాపించినపుడు మార్త చెప్పిన అభ్యంతరమేమిటి ?
"ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని" ఆయనతో చెప్పింది. (11:39)
లాజరు ఉంచిన సమాధి రాయిని తొలగించమని యేసు ఆజ్ఞాపించినపుడు మార్త చెప్పిన అభ్యంతరమునకు యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?
"నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని మార్తతో అన్నాడు. (11:40)
John 11:41-42
సమాధి నుండి రాయి తీసివేయబడిన వెంటనే యేసు ఏమి చేసాడు ?
యేసు కన్నులెత్తి బిగ్గరగా తండ్రికి ప్రార్ధన చేసాడు. (11:41)
ఎందుకు యేసు తాను చేయుచున్న ప్రార్ధన బిగ్గరగా చేసాడు ?
తన చుట్టూ ఉన్న ప్రజల నిమిత్తము, తండ్రి తనను పంపెనని వారు నమ్మునట్లును యేసు బిగ్గరగా ప్రార్ధన చేసాడు. (11:42)
John 11:43-44
"లాజరూ, బయటకు రమ్ము" అని బిగ్గరగా అరచినప్పుడు ఏమి జరిగింది ?
చనిపోయిన వాడు ప్రేతవస్త్రములతో కట్టబడి, బయటకు వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. (11:44)
John 11:45-48
సమాధి నుండి లాజరు బయటకు రావడాన్ని చూసిన యూదుల స్పందన ఏమిటి ?
ఆయన చేసిన కార్యమును చూచినా యూదులలో అనేకులు ఆయనలో విశ్వాసముంచిరి, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. (11:45-46)
John 11:49-50
ప్రధాన యాజకులు, పరిసయ్యుల సభలో కయిఫా చేసిన ప్రవచనము ఏమిటి ?
మన జనమంతయు నశింపకుండు నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనుడని వారితో చెప్పాడు. (11:50-51)
John 11:51-53
ఆ దినమునుండి అ సభ చేసిన ప్రణాళిక ఏమిటి ?
వారు ఆయనను చంపనాలోచించు చుండిరి. (11:53)
John 11:54-55
లజరును లేపిన తరువాత యేసు ఏమి చేసాడు ?
యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరించక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశాములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. (11:54)
John 11:56-57
ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఏ ఆజ్ఞను జారీ చేసారు ?
ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియ జేయవలెనని ఆజ్ఞాపించారు. (11:57)
John 12
John 12:1-3
యేసు ఎప్పుడు బెతనియకు వచ్చాడు ?
బెతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. (12:1)
యేసు కొరకు ఏర్పాటు చెయ్యబడిన విందు లో మరియ ఏమి చేసింది ?
మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసికొని యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను.(12:3)
John 12:4-8
ఆ అత్తరు మూడువందల దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చని యేసు శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఎందుకన్నాడు ?
అతను చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయి యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. (12:4-6)
John 12:9-11
బేతనియ లో గొప్ప జనసమూహము ఎందుకు కూడి వచ్చినది ?
జనులు యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. (12:9)
ప్రధాన యాజకులు లాజరును ఎందుకు చంపాలని చూసారు ?
లాజరును బట్టి యూదులనేకులు తమ వారిని విడిచి యేసు నందు విస్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును చంపాలని చూసారు. (12:10,11)
John 12:12-13
పండుగ నాడు యేసు వచ్చున్నాడని విని జనసమూహము ఏమి చేసారు ?
ఖజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన బోయి "జయము, ప్రభువు పెరట వచ్చు చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింప బడును గాక" అని బిగ్గరగా కేకలు వేసారు. (12:13)
John 12:14-16
మొదట గ్రహింప లేక యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడినవనియు, వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకము చేసుకున్న అంశాలు ఏవి?
"సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్ల మీద ఆసీనుడై వచ్చు చున్నాడు" అని ఆయన గురించి వ్రాయ బడిన అంశములను జ్ఞాపకము చేసుకున్నారు. (12:13-16)
John 12:17-22
ఎందుకు జనసమూహము పండుగలో యేసును కలుసుకోడానికి ఎదురు వెళ్ళారు?
ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. (12:17-18)
John 12:23-24
గ్రీకులు కొందరు ఆయనను చూడడానికి వచ్చారు అని అంద్రెయ, ఫిలిప్పు యేసుతో చెప్పినపుడు యేసు మొదట ఏమి చెప్పాడు?
"మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది" అని యేసు వారితో చెప్పాడు. (12:23)
గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల దానికేమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?
గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల అది విస్తారముగా ఫలించును అని చెప్పాడు. (21:24)
John 12:25-26
ఈ లోకములో తన ప్రాణమును ప్రేమించు వానికి, తన ప్రాణమును ద్వేషించు వానికి ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు?
ఈ లోకములో తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ద్వేషించు వాడు దానిని నిత్య జీవము కొరకు కాపాడుకొనును అని యేసు చెప్పాడు. (12:25)
యేసును సేవించు వానికి ఏమి జరుగుతుంది?
తండ్రి అతని ఘనపరచును. (12:26)
John 12:27-29
"తండ్రి నీ నామము మహిమపరచుము" అని చెప్పినపుడు ఏమి జరిగింది ?
"నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును" అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. (12:28)
John 12:30-31
పరలోకము నుండి వచ్చిన ఆ శబ్దము యొక్క కారణం ఏమని యేసు చెప్పాడు?
"ఈ శబ్ధము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను" అని యేసు వారితో చెప్పాడు. (12:30)
ఇప్పుడు ఏమి జరుగుతున్నదని యేసు చెప్పాడు?
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాదికారి బయటకు త్రోసివేయబడును" అని యేసు చెప్పాడు. (12:31)
John 12:32-33
"నేను భూమి మీద నుండి పైకెత్త బడినపుడు అందరిని నా యొద్దకు ఆకర్షించు కొందును" అని యేసు ఎందుకు చెప్పాడు?
తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. (12:33)
John 12:34-36
"మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పు చున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరు" అని జనసమూహము అడిగినపుడు యేసు వారికి తిన్ననైన సమాధానం చెప్పాడా ?
లేదు. వారి ప్రశ్నలకు యేసు తిన్నగా సమాధానం చెప్పలేదు. (12:35-36)
వెలుగు గురించి యేసు ఏమి చెప్పాడు ?
"ఇంకా కొంత కాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి .....మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగు నందు విశ్వాసముంచుడి" అని యేసు చెప్పాడు. (12:35-36)
John 12:37-38
ఎందుకు జనులు యేసు నందు విశ్వాసముంచ లేదు ?
"ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడేవాడు? ప్రభువుయొక్క బాహువు ఎవరికీ యయలుపరచ బడెను" అని ప్రవక్తయైన యెషయా ప్రవచనము నెరవేర్చా బడునట్లు వారు ఆయన యందు విశ్వాసముంచ లేదు. (12:37-38)
John 12:39-40
ఎందుకు ప్రజలు యేసు ను విశ్వసించలేక పోయారు ?
యెషయా చెప్పినట్టు "వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడ కుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠిన పరచెను" అను కారణము గా వారు నమ్మలేక పోయిరి. (12:39-40)
John 12:41-43
యెషయ ఎందుకు ఈ సంగతులు చెప్పాడు ?
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. (12:41)
ఎందుకు ఆయనను విశ్వసించిన అధికారులు ఎందుకు దానిని ఒప్పుకొనలేక పోయారు ?
అధికారులలో కూడా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొన లేదు. (12:42-43)
John 12:44-45
తన గురించి, తన తండ్రి గురించి యేసు ఏమి చెప్పాడు ?
"నా యందు విశ్వాస ముంచు వాడు నా యందు కాదు నన్ను పంపిన వానియందే విశ్వాసముంచు చున్నాడు, నన్ను చూచు వాడు నన్ను పంపినవానినే చూచు చున్నాడు. (12:44-45)
John 12:46-47
ఏమి చెయ్య దానికి యేసు ఈ లోకానికి వచ్చాడని ఆయన చెపుతున్నాడు ?
ఈ లోకమును రక్షించుటకె వచ్చానని యేసు చెప్పాడు. (21:47)
John 12:48-50
యేసు ను నిరాకరించు వానిని, ఆయన మాటలు గైకొనని వానిని తీర్పు తీర్చునది ఏది ?
ఆయనను నిరాకరించి ఆయన మాటలను అంగీకరింపని వానిని యేసు పలికిన మాటయే అంత్య దినమందు తీర్పు తీర్చును. (12:48)
యేసు తనంతట తానే మాట్లాడునా ?
లేదు. తాను ఏమి మాట్లాడవలెనో దీనిని గూర్చి తనను పంపిన తండ్రియే ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. (12:49)
ఎందుకు యేసు తండ్రి చెప్పిన ప్రకారమే ప్రజలకు చెపుతున్నాడు ?
తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని యేసు ఎరుగును గనుక యేసు ఆ విధముగా చేయుచున్నాడు. (12:50)
John 13
John 13:1-2
తన వారిని యేసు ఎంత ప్రేమించాడు ?
వారిని అంతము వరకు ప్రేమించాడు. (13:1)
యూదా ఇస్కరియోతుకు అపవాది ఏమీ చేసాడు ?
ఆయనను అప్పగింప వలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచనను పుట్టించెను. (13:2)
John 13:3-5
తండ్రి యేసుకు ఇచ్చినదేమిటి ?
తండ్రి యేసు చేతికి సమస్తము అప్పగించెను. (13:3)
యేసు ఎక్కడినుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళు చున్నాడు ?
తాను దేవుని యొద్ద నుండి వచ్చాడు, తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు. (13:3)
ఆయన భోజన పంక్తిలోనుండి లేచినపుడు ఏమి చేసాడు ?
ఆయన లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను, అంతట పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. (13:4-5)
John 13:6-9
తన పాదములను యేసు కడుగుటకు పేతురు అభ్యంతర పెట్టినపుడు యేసు ఏమన్నాడు ?
"నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదు" అన్నాడు. (13:8)
John 13:10-11
"మీలో అందరు పవిత్రులు కారు" అని యేసు ఎందుకు అన్నాడు ?
తనను అప్పగించు వానిని ఎరిగేను గనుక యేసు ఈ మాట అన్నాడు. (13:11)
John 13:12-15
ప్ర.శిష్యుల పాదాలను యేసు ఎందుకు కడిగాడు ?
తాను వారికి చేసిన విధముగా వారును చేయ వలెనని యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు. (13:14-15)
John 13:16-18
దాసుడు యజమాని కంటే గొప్పవాడా లేక పంపబడిన వాడు తనను పంపినవాని కంటే గొప్పవాడా ?
దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనను పంపినవాని కంటే గొప్పవాడు కాడు. (13:16)
యేసు కు విరోధముగా తన మడమను ఎత్తిన వాడు ఎవరు ?
ఆయనతో కూడా భోజనముచేయువాడు ఆయనకు విరోధముగా తన మడమ ఎత్తెను. (13:18)
John 13:19-22
"మీలో అందరు పవిత్రులు కారు", "నాతో కూడా భోజనముచేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను" అని యేసు తన శిష్యులతో చెప్పాడు ?
అది జరిగినప్పుడు నేనే ఆయననని వారు నమ్మునట్లు అది జరుగక మునుపు ఆయన వారికి చెప్పాడు (13:19)
యేసును చేర్చుకొనువాడు ఎవరిని చేర్చు కొనును ?
ఆయనను చేర్చుకొనువాడు తనను పంపిన వానిని కూడా చేర్చుకొనువాడగును. (13:20)
John 13:23-25
వారిలో ఒకడు తనను అప్పగించబోవుతున్నాడని యేసు చెప్పినపుడు సీమోను పేతురు ఏమి చేసాడు ?
ఎవరిని గురించి యీలాగు చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని అడిగాడు. (13:24)
John 13:26-30
వాడెవడని యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యేసును అడిగినప్పుడు యేసు ఎలా స్పందించాడు ?
"నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే" అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను.(13:20)
యేసు యూదాకు రొట్టె ముక్క ఇవ్వగానే యూదాకు ఏమి జరిగింది? అతడు ఏమి చేసాడు ?
వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, వెంటనే వాడు బయటికి వెళ్ళాడు. (13:20)
John 13:31-33
దేవుడు ఎలా మహిమ పరచబడ్డాడు ?
దేవుడు మనుష్యకుమారుని యందు మహిమ పరచబడి యున్నాడు, దేవుడును ఆయనయందు మహిమ పరచబడిన యెడల దేవుడు తనయందు ఆయనను మహిమ పరచును.(13:31)
John 13:34-37
యేసు తన శిష్యుల కిచ్చిన నూతన ఆజ్ఞ ఏది ?
వారు ఒకరినొకరు ప్రేమింప వలెనని వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. (13:34)
ఒకరిని ఒకరు ప్రేమింప వలెననెడి ఆజ్ఞకు లోబడిన యెడల ఏమి జరగబోతున్నదని యేసు చెప్పాడు ?
ఒకరిని ఒకరు ప్రేమింప వలెననెడి ఆజ్ఞకు లోబడిన యెడల దీనిని బట్టి వారు యేసు శిష్యులని అందరు తెలుసుకొంటారు. (13:35)
"నేను వెళ్ళు చోటికి నీవు రాలేవు" అని యేసు వారికి చెప్పిన మాటను సీమోను పేతురు అర్ధం చేసుకున్నాడా ?
లేదు. ఎందుకంటే "ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నా" వని యేసును అడిగాడు. (13:33-36)
John 13:38
"నీ కొరకు నా ప్రాణము పెట్టుదును" అని సీమోను పేతురు అనినప్పుడు యేసు ఏమి జవాబిచ్చాడు ?
"నా కొరకు నీ ప్రాణమును పెట్టుదువా ? అయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదు" అని యేసు జవాబిచ్చాడు.(13:38)
John 14
John 14:1-3
తండ్రి యింట ఏమున్నది ?
తండ్రి యింటి లో అనేక నివాసములు ఉన్నాయి. (14:2)
తన శిష్యులకు ఏమి చెయ్యడానికి యేసు వెళ్ళుతున్నాడు ?
యేసు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. (14:3)
శిష్యుల హృదయాలు ఎందుకు కలవరపడకూడదు ?
యేసు వారి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళు చున్నాడు. ఆయన యొద్ద ఉండుటకు వారిని తీసుకొని పోవడానికి ఆయన మరల రాబోతున్నాడు. (14:1-3)
John 14:4-7
తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గము ఏది ?
తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గము యేసు. (14:6)
John 14:8-9
శిష్యులకు చాలిన ఏ సంగతిని ఫిలిప్పు యేసును అడుగుతున్నాడు ?
"ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మా కంతే చాలును అని ఫిలిప్పు యేసును అడిగాడు. (14:8)
John 14:10-11
యేసు శిష్యులతో తనంతట తానే మాట్లాడు తున్నాడా ?
యేసు తనంతట తాను మాట్లాడడం లేదు తండ్రి ఆయన యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. (14:10)
యేసు తండ్రి యందు ఉన్నాడనియు, తండ్రి యేసునందు ఉన్నాడని శిష్యులు నమ్మాలని యేసు ఎందుకు చెప్పాడు ?
యేసు క్రియల నిమిత్తమైనను శిష్యులు దీనిని నమ్మాలని యేసు చెప్పాడు. (14:11)
John 14:12-14
తాను చేసిన దానికంటే తన శిష్యులు ఎక్కున చేస్తారని యేసు ఎందుకు చెప్పాడు ?
యేసు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు గనుక శిష్యులు గొప్ప కార్యములు చేస్తారని యేసు చెప్పాడు. (14:12)
శిష్యులు తన నామము లో అడిగితే యేసు ఎందుకు చేస్తాడు ?
తండ్రి కుమారుని యందు మహిమ పరచ బడునట్లు యేసు చేస్తాడు. (14:13)
John 14:15-20
మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు ఏమి చేస్తారని యేసు చెప్పాడు ?
మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొంటారని యేసు చెప్పాడు. (14:15)
శిష్యులతో నిత్యము ఉండునట్లు తండ్రి పంపబోవు వేరొక ఆదరణ కర్తను యేసు ఏమని పిలిచాడు ?
సత్య స్వరూపియగు ఆత్మ అని పిలిచాడు. (14:17)
సత్య స్వరూపియగు ఆత్మను లోకము ఎందుకు స్వీకరించ లేదు ?
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. (14:17)
సత్య స్వరూపియగు ఆత్మ ఎక్కడ ఉంటాడని యేసు చెప్పాడు ?
సత్య స్వరూపియగు ఆత్మ శిష్యులలో ఉంటాడని యేసు చెప్పాడు . (14:17)
John 14:21-24
ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వానికి ఏమి జరుగుతుంది ?
వారు యేసు చేత, ఆయన తండ్రి చేత ప్రేమించ బడతారు, ఆయన వారికి తనను తాను కనుపరచు కొంటాడు. (14:21)
John 14:25-27
తండ్రి పంపినపుడు ఆదరణ కర్త, పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తాడు ?
ఆదరణ కర్త, పరిశుద్ధాత్ముడు వారికి సమస్తమును బోధించి యేసు వారితో చెప్పిన సంగతులన్నిటినీ వారికి జ్ఞాపకం చేస్తాడు. (14:26)
John 14:28-29
యేసు తమను విడిచి వెళ్ళుచున్నందుకు శిష్యులు ఎందుకు సంతోషించాలి ?
యేసు తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు గనుక శిష్యులు సంతోషించాలి అని యేసు చెప్పాడు, తండ్రి యేసు కంటే గొప్పవాడు. (14:28)
John 14:30-31
శిష్యులతో ఇక మీదట విస్తరించి మాట్లాడనని చెప్పడానికి కారణం యేసు ఏమి చెప్పాడు ?
శిష్యులతో ఇక మీదట విస్తరించి మాట్లాడనని చెప్పడానికి కారణం లోకాధికారి వచ్చుచున్నాడని యేసు చెప్పాడు (14:30)
John 15
John 15:1-2
నిజమైన ద్రాక్షా వల్లి ఎవరు ?
యేసు నిజమైన ద్రాక్షా వల్లి. (15:1)
వ్యయసాయకుడు ఎవరు ?
వ్యయసాయకుడు తండ్రి (15:1)
క్రీస్తులో ఉన్న తీగెలతో తండ్రి ఏమి చేస్తాడు ?
ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరింత ఫలించు నట్లు దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. (15:2)
John 15:3-4
ఎందుకు శిష్యులు పవిత్రులై ఉన్నారు ?
యేసు వారితో చెప్పిన మాటను బట్టి వారు పవిత్రులై ఉన్నారు. (15:3)
John 15:5-7
తీగెలు ఎవరు ?
మనము తీగెలము. (15:5)
ఫలించాలి అంటే ఏమి చెయ్యాలి ?
ఫలించాలి అంటే యేసు లో నిలిచి యుండాలి. (15:5)
యేసు లో నిలిచియుండని యెడల ఏమి జరుగుతుంది ?
ఎవరైనను యేసు లో నిలిచియుండని యెడల వాడు తీగె వలె బయట పారవేయబడును. (15:6)
మన కిస్టమైన ప్రతీది పొందాలంటే మనము ఏమి చెయ్యాలి ?
ఆయన యందు మనము నిలిచి యుండాలి, మనయందు ఆయన మాటలు నిలిచి యుండాలి. అప్ప్దుడు మనకేది ఇష్టమో దానిని అడగాలి, అది మనకు అనుగ్రహించ బడుతుంది. (15:7)
John 15:8-9
తండ్రి మహిమ పరచ బడే రెండు మార్గాలు ఏమిటి ?
మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచ బదతాడు, మనము యేసు శిష్యులుగా ఉంటాము. (15:8)
John 15:10-11
ప్ర.యేసు ప్రేమలో నిలిచియుండునట్లు ఏమి చెయ్యగలం ?
ఆయన ఆజ్ఞలు గైకొనాలి ?(15:10)
John 15:12-13
ఒక వ్యక్తి కలిగియుండగలిగిన గొప్ప ప్రేమ ఏమిటి ?
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగాలవాడెవడును లేడు . (15:13)
John 15:14-17
మనము యేసు స్నేహితులమా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది ?
ఆయన మనకు ఆజ్ఞాపించు వాటన్నిటిని చేసిన యెడల మనము ఆయన స్నేహితులమగుదుము.(15:14)
యేసు తన శిష్యులను ఎందుకు స్నేహితులని పిలిస్తున్నాడు ?
ఆయన తన తండ్రి వినిన సంగతులన్నిటిని వారికి తెలియ చేసాడు కనుక వారిని స్నేహితులని పిలచుచున్నాడు. (15:15)
John 15:18-22
యేసును వెంబడించు వారిని లోకము ఎందుకు ద్వేషిస్తుంది ?
యేసు ను వెంబడించు వారు లోకసంభందులు కారు, యేసు వారిని లోకములోనుంది ఏర్పరచు కొన్నాడు. (15:19)
John 15:23-25
వారి పాపము విషయం లోకము తప్పించుకోలేకుండా ఉండటానికి యేసు ఏమి చేసాడు ?
వారి పాపము విషయం లోకము తప్పించుకోలేకుండా ఉండటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు, ఎవడునూ చెయ్యని క్రియలను చేసాడు. (15:24)
John 15:26-27
యేసు ను గురించి ఎవరు సాక్ష్యం ఇస్త్తారు ?
ఆదరణ కర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ, యేసు శిష్యులు ఆయన గూర్చి సాక్ష్య మిస్తారు. (15:26-27)
ఎందుకు శిష్యులు ఆయన గురించి సాక్ష్య మిస్తారు ?
వారు మొదటి నుండి ఆయనతో ఉండిన వారు గనుక వారును అయన గురించి సాక్ష్య మిస్తారు. (15:27)
John 16
John 16:1-2
ఎందుకు యేసు ఈ మాటలు శిష్యులతో చెపుతున్నాడు ?
వారు అభ్యంతర పడకుండు నట్లు యేసు ఈ మాటలు శిష్యులతో చెప్పుచున్నాడు. (16:1)
John 16:3-4
యేసు శిష్యులను ఎందుకు సమాజ మందిరములోనుండి వెలివేసి వారిలో కొందరిని చంపుతున్నారు ?
వారు తండ్రిని యేసును తెలుసుకోన లేదు గనుక ఈవిధంగా చేస్తారు. (16:3)
ఈ సంగతులను గురించి యేసు ముందు గానే ఎందుకు చెప్పలేదు ?
ఆయన వారితో ఉన్నాడు గనుక మొదట ఆయన ఈ సంగతులను వారితో చెప్పలేదు. (16:4)
John 16:5-7
యేసు వెళ్లి పోవడం ఎందుకు ప్రయోజనకరం ?
ఆయన వెళ్లి పోవడం వారికి ప్రయోజన కరం, ఆయన వెళ్ళని యెడల ఆదరణ కర్త వారి దగ్గరకు రాడు. ఆయన వెళ్ళిన యెడల ఆదరణ కర్త వారి వద్దకు వస్తాడు. (16:7)
John 16:8-11
ఆదరణ కర్త దేని విషయం లోకాన్ని ఒప్పింప చేస్తాడు ?
ఆదరణ కర్త పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, అంతిమ తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. (16:8)
John 16:12-14
సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు శిష్యుల కొరకు ఏమి చేస్తాడు ?
సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు వారిని సర్వ సత్యములోనికి వారిని నడిపించును, ఆయన తనంతట తాను ఏమియూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభావింప బోవు వాటిని వారికి బోధించును. (16:13)
సత్య స్వరూపియగు ఆత్మ యేసు ను ఏ విధంగా మహిమ పరచును ?
ఆయన యేసు లోనివి తీసుకొని వారికి తెలియ జేయును గనుక యేసు ను మహిమ పరచును. (16:14)
John 16:15-16
సత్య స్వరూపియగు ఆత్మ యేసు లోనివి వేటిని తీసుకుంటాడు ?
సత్య స్వరూపియగు ఆత్మ తండ్రి వాటిలోనుండి తీసుకుంటాడు, తండ్రికి కలిగియున్నవన్నియు యేసు కు చెందినవే. (16:15)
John 16:17-18
యేసును గురించిన ఏ సంగతులు శిష్యులకు అర్ధం కాలేదు ?
"కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాను ", "అని యేసు చెప్పిన మాటను వారు అర్ధం చేసుకోలేదు, (16:17-18)
John 16:19-21
శిష్యుల దు:ఖమునకు ఏమి జరుగుతుంది ?
శిష్యుల దు:ఖము సంతోషమౌతుంది. (16:20)
John 16:22-25
ఏ విషయం శిష్యులను సంతోష భరితులను చేస్తుంది ?
వారు యేసును మరల చూస్తారు, వారు సంతోషిస్తారు. (16:22)
అడిగి పొందండి అని యేసు తన శిష్యులతో ఎందుకు చెప్పాడు ?
వారి సంతోషము పరిపూర్ణమగునట్లు వారిని ఆ విధంగా చెయ్యమన్నాడు. (16:24)
John 16:26-31
ఎందు నిమిత్తం తండ్రి తానే యేసు శిష్యులను ప్రేమించుచున్నాడు ?
శిష్యులు యేసు ను ప్రేమించి ఆయన తండ్రి యెద్ద నుండి వచ్చాడని నమ్మారు గనుక తండ్రి తానే వారిని ప్రేమించు చున్నారు. (16:27)
యేసు ఎక్కడినుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళుచున్నాడు ?
యేసు తండ్రి దగ్గర నుండి బయలు దేరి లోకమునకు వచ్చి యున్నాడు, లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు. (16:28)
John 16:32-33
ఆ గడియలో శిష్యులు ఏమి చేయ్యబోతున్నారని యేసు చెప్పాడు ?
ఆ గడియలో వారిలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి యేసు ను ఒంటరిగా విడిచి పెడతారని యేసు చెప్పాడు. (16:32)
శిష్యులు ఆయనను విడిచి పెట్టినప్పుడు యేసుతో ఇంకా ఉండే దెవరు ?
తండ్రి యేసు తో ఉంటాడు. (16:32)
ఈ లోకములో వారికి శ్రమలు ఉన్నప్పటికీ ధైర్యము తెచ్చు కొనుడని యేసు ఎందుకు చెపుతున్నాడు ?
తాను లోకమును జయించి యున్నాడు గనుక ధైర్యము తెచ్చుకోనుడని శిష్యులతో చెపుతున్నాడు (16:33)
John 17
John 17:1-2
సర్వ శరీరుల మీద అధికారాన్ని యేసుకు తండ్రి ఎందుకిచ్చాడు ?
యేసు కు ఇచ్చిన వారికందరికీ నిత్య జీవము అనుగ్రహించు నట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారమును ఇచ్చాడు. (17:2)
John 17:3-5
నిత్య జీవ మనగా ఏమిటి ?
అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (17:3)
ఈ భూమి మీద యేసు తన తండ్రి ని ఏ విధంగా మహిమ పరచాడు ?
చేయుటకు తన కిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద దేవుని మహిమ పరచాడు. (17:4)
ఏ మహిమ ను యేసు కోరుతున్నాడు ?
లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయనకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను ఆయన కోరుతున్నాడు. (17:5)
John 17:6-8
తండ్రి నామమును యేసు ఎవరికి ప్రత్యక్ష్య పరచాడు ?
లోకమునుండి దేవుడు యేసు కు అనుగ్రహించిన మనుష్యులకు తండ్రి నామమును ప్రత్యక్ష్య పరచాడు. (17:6)
తండ్రి యేసుకు ఇచ్చిన మనుష్యులు యేసు మాటలకు ఎలా స్పందించారు ?
వారు యేసుని మాటలు అంగీకరించారు, ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని నిజముగా ఎరిగి తండ్రి ఆయనను పంపాడని వారు నమ్మారు. (17:8)
John 17:9-10
ఎవరికొరకు ప్రార్ధన చెయ్యడము లేదని యేసు చెప్పాడు ?
లోకము కొరకు ప్రార్ధన చెయ్యడము లేదని యేసు చెప్పాడు. (17:9)
John 17:11
తండ్రి తనకు ఇచ్చిన వారికి ఏమి చేయాలని యేసు తండ్రిని కోరాడు ?
వారు ఏకమై ఉండు లాగున తండ్రి నామమందు వారిని కాపాడుమని తండ్రిని అడిగాడు, దుష్టుని నుండి కాపాడుమని ప్రార్ధించాడు, సత్యమునందు ప్రతిష్టించుమని ప్రార్ధించాడు, వారు యేసు నందును, తండ్రి యందును ఉండునట్లు ప్రార్ధించాడు, తండ్రి ఆయనకిచ్చిన వారు అయన ఎక్కడ ఉండునో అక్కడను ఆయనతో ఉండునట్లు ప్రార్ధించాడు. (17:11,15,21,24.)
John 17:12-17
యేసు లోకములో ఉండగా తండ్రి తనకిచ్చిన వారికి ఏమి చేసాడు ?
యేసు వారిని కాపాడాడు. (17:12)
John 17:18-19
యేసు తనను ఎందుకు ప్రతిష్టించు కున్నాడు ?
తండ్రి తనకు ఇచ్చిన వారు సత్య మందు ప్రతిష్ష్టించబడునట్లు వారికొరకు తనను తాను ప్రతిష్టించు కొన్నాడు. (17:19)
John 17:20-21
ఇంకా ఎవరి కొరకు యేసు ప్రార్దిస్తున్నాడు ?
తండ్రి యేసు కిచ్చిన వారు వాక్యము వలన యేసు నందు విశ్వాసముంచిన వారందరును ఏకమై యుండవలెనని వారి కొరకు ప్రార్ధన చేయుచుండెను. (17:20)
John 17:22-24
తండ్రి యేసుకు ఇచ్చిన వారిని తండ్రి ఎలా ప్రేమిస్తున్నాడు ?
తండ్రి యేసు ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించాడు. (17:23)
John 17:25-26
తండ్రి యేసుకు ఇచ్చిన వారికి తండ్రి నామమును ఎందుకు తెలియ చేసాడు, ఇంకనూ ఎందుకు తెలియ చేస్తున్నాడు ?
తండ్రి యేసు నందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, యేసు వారి యందు ఉన్డునట్లును, వారికి ఆయన నామమును తెలియచేసాడు, (17:26)
John 18
John 18:1-3
ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత ఎక్కడికి వెళ్ళాడు ?
ఆయన తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి వెళ్లెను. (18:1)
యూదాకు ఆ స్థలము ఎలా తెలుసు ?
యేసు తన శిష్యులతో కలిసి తరుచుగా ఆ స్థలానికి వవెల్లుచుండే వారు. (18:2)
దివిటీలతోను, దీపములతోను ఆయుధములతోను ఆ తోటలోనికి ఎవరెవరు వెళ్ళారు.
యూదా, ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన సైనికులతో ఆ చోటికి వచ్చారు. (18:3)
John 18:4-5
ఆ తోటలోనికి వచ్చిన ప్రజలను యేసు ఏమి అడిగాడు ?
"మీరెవరిని వెదకుచున్నారు" అని వారిని అడిగాడు. (18:4)
John 18:6-7
"ఆయనను నేనే" అని నజరేయుడైన యేసు ను వెదకుచున్న వారితో యేసు చెప్పినపుడు ఏమి జరిగింది ?
వారు వెనకకు తగ్గి నేల మీద పడ్డారు. (18:6)
John 18:8-9
"నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న యెడల వీరిని పోనియ్యుడి" అని యేసు ఎందుకు చెప్పాడు ?
"నీవు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొన లేదని" అయన చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ మాట చెప్పాడు. (18:8-9)
John 18:10-11
ప్రధాన యాజకుని దాసుడు మల్కు యొక్క చెవిని పేతురు తెగనరికినపుడు యేసు ఏమి చెప్పాడు ?
"కత్తి ఒరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా" అని పేతురు తో యేసు చెప్పాడు. (18:10-11)
John 18:12-14
సైనికులు, శతాధిపతి, యూదుల బంత్రోతులు యేసును పట్టుకొని ఎక్కడికి తీసుకు వెళ్ళారు ?
అన్న వద్దకు తీసుకొని వెళ్ళారు. (18:13)
అన్న ఎవరు ?
అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. (18:13)
John 18:15-16
పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి లోనికి ఎలా ప్రవేశించాడు ?
ప్రధాన యాజకునికి పరిచయ మైన ఒక శిష్యుడు బయటికి వచ్చి ద్వారా పాలకునితో మాట్లాడి పేతురుని లోపలి తోడుకొని వెళ్ళాడు. (18:16)
John 18:17-18
యేసు తో ఉన్న శిష్యులలో ఒకడివి కాదా అని పేతురును ఎవరు అడిగారు ?
కావలి యొద్ద ఒక చిన్నది, కొందరు మంట వేసి చలి కాచుకొంతుండగా , వారిలో పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును ప్రదానయాజకుని దాసులలో ఒకడును, అందరునూ యేసు తో ఉన్న శిష్యులలో ఒకడివి కాదా అని పేతురును అడిగారు. (18:17)
John 18:19-21
ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి ఆయన బోధను గురించి యేసు ను అడిగినప్పుడు యేసు ఏమని సమాధానము ఇచ్చాడు ?
తాను బహిరంగముగా లోకమునకు మాటలాడితినని చెప్పాడు, తాను బోధించినది విన్న వారిని అడుగుమని ప్రధాన యాజకునికి చెప్పాడు. (18:19-21)
John 18:22-24
అన్న యేసు ను ప్రశ్నించిన తరువాత యేసు ను ఎక్కడికి పంపాడు ?
ప్రధాన యాజకుడైన కయప వద్దకు యేసు ను పంపాడు. (18:24)
John 18:25-27
యేసు తో ఉండటము గురించి పేతురు మూడవ సారి బొంకి నపుడు ఏమి జరిగింది ?
పేతురు నేనేరుగనని మూడవసారి బొంకి నపుడు వెంటనే కోడి కూసింది. (18:27)
John 18:28-30
యేసు ను తీసుకొని వెళ్ళిన వారు ఎందుకు అధికార మండపము లోనికి వెళ్ళ లేదు ?
వారు మైల పడకుండా పస్కాను భుజింప వలెనని అధికార మండపము లోనికి వెళ్ళ లేదు. (18:28)
"ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని" పిలాతు వారినడిగి నపుడు వారు ఏమి సమాధానమిచ్చారు ?
"వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండమని" చెప్పిరి. (18:29-30)
John 18:31-32
ఎందుకు యూదులు ఆయనకు తీర్పు తీర్చ కుండ పిలాతు వద్దకు తీసుకొని వెళ్ళారు ?
రోమా అధిపతులనుండి (పిలాతు) అనుమతి లేకుండా ఎవనికైనను మరణ శిక్ష విధించదానికి యూదులకు అధికారము లేదు. (18:31)
John 18:33-35
పిలాతు యేసు ను ఏమి అడిగాడు ?
యూదులకు నీవు రాజువా అని అడిగాడు, యేసు ఏమి చేసాడని అడిగాడు. (18:33-35)
John 18:36-37
తన రాజ్యము గురించి యేసు ఏమి చెప్పాడు ?
తన రాజ్యము ఈ లోక సంభంద మైనది కాదు, ఇహ సంబంధ మైనది కాదు అని చెప్పాడు. (18:36)
ఏ ఉద్దేశము కొరకు యేసు జన్మించాడు ?
రాజుగా ఉండుటకు ఆయన జన్మించాడు. (18:37)
John 18:38-40
యేసు తో మాట్లాడిన తరువాత పిలాతు ఇచ్చిన తీర్పు ఏమిటి ?
"అతని యందు ఏ దోషమును నాకు కనబడ లేదు" అని పిలాతు యూదులతో చెప్పాడు. (18:38)
యేసు ను విడుదల చేయుటకు మీకిస్టమా అని యూదులను పిలాతు అడిగినప్పుడు యూదులు ఏమని అరిచారు ?
"ఈ మనుష్యుడు కాదు మాకు బరబ్బా కావాలి" అని మరల బిగ్గరగా కేకలు వేసారు. (18:39-40)
John 19
John 19:1-3
పిలాతు యేసు ను కొరడాలతో కొట్టించిన తరువాత సైనికులు ఏమి చేసారు ?
వారు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి "యూదుల రాజా, శుభం" అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. (19:2-3)
John 19:4-6
పిలాతు యేసు ను తిరిగి ఎందుకు వెలుపలికి తీసుకొని వచ్చాడు ?
ఆయన యందు ఏ దోషము పిలతుకు కనబడ లేదని వారికి తెలియునట్లు యేసును వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. (10:4)
పిలాతు యేసు ను ప్రజల వద్దకు తీసుకొని వచ్చినపుడు ఆయన ఏమి ధరించుకొని ఉన్నాడు ?
ఆయన ముండ్ల కిరీటమును ధరించు కొని ఊదారంగు వస్త్రమును ధరించాడు. (19:5)
యేసు ను చూచినపుడు ప్రధాన యాజకులును, బంట్రౌతులును ఏమి చేసారు ?
"సిలువ వేయుము, సిలువ వేయుము" అని కేకలు వేశారు. (19:6)
John 19:7-9
పిలాతు భయపడునట్లు యూదులు ఏమన్నారు ?
"మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను" అని పిలాతుతో చెప్పారు. (19:7-8)
"నీవేక్కడి నుండి వచ్చితివి" అని పిలాతు యేసు ను అడిగినప్పుడు యేసు ఏమన్నాడు ?
యేసు పిలాతు ఏ జవాబు ఇవ్వలేదు. (19:9)
John 19:10-11
పిలాతు కు యేసు మీద అధికారం ఎవరిచ్చారని యేసు చెప్పాడు ?
"పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు" అని యేసు చెప్పాడు. (19:11)
John 19:12-13
యేసు ను విడుదల చేయుటకు ప్రయత్నించి నప్పటికిని యూదులు అనిన ఏ మాట అతనిని అడ్డుకొన్నది ?
"నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకోను ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడు తున్నవాడే" అని యూదులు పిలాతుతో అన్నారు. (19:12)
John 19:14-16
సిలువ వేయబడుటకు పిలాతు యేసును యూదులకు అప్పగించే ముందు ప్రధాన యాజకులు ఏమన్నారు ?
"కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు" అని అన్నారు. (19:15-16)
John 19:17-18
యేసు ను ఎక్కడ సిలువ వేసారు ?
వారు యేసు ను గొల్గోత అనే స్థలం లో యేసు సిలువ వేసారు, గొల్గోత అనే మాట కు కపాల స్థలమని అర్ధం. (19:17-18)
ఆ రోజున యేసు ఒక్కడే సిలువ వేయబడ్డాడా ?
లేదు. ఇద్దరు వ్యక్తులు ఆయనకు ఇరువైపులా ఆయనతో పాటు సిలువ వెయ బడ్డారు. (19:18)
John 19:19-22
యేసు సిలువ మీద పిలాతు ఏమి రాయించాడు ?
"యూదుల రాజైన నజరేయుడగు యేసు" అను పైవిలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. (19:19)
సిలువ మీద రాయించిన గురుతు ఏ భాషలో రాయించాడు ?
అది హెబ్రీ, గ్రీకుం రోమా భాషలలో రాయబడి ఉంది. (19:20)
John 19:23-24
యేసు వస్త్రములను సైనికులు ఏమి చేసారు ?
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. కుట్టు లేకుండా ఉన్న అయన అంగీ కోసం చీట్లు వేశారు. (19:23-24).
యేసు వస్త్రములతో సైనికులు ఎందుకు ఆ విధంగా చేసారు ?
"వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి." అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. (19:23-24)
John 19:25-27
యేసు సిలువ దగ్గర నిలుచున్నా దెవరు ?
ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య యైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. (19:25-26)
యేసు తన తల్లియు తాను ప్రేమించిన సిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి తన తల్లి తో ఏమి చెప్పాడు ?
"అమ్మా యిదిగో నీ కుమారుడు" అని తన తల్లి తో చెప్పాడు. (19:26)
"యిదిగో నీ తల్లి" అని తాను ప్రేమించిన శిష్యునితో చెప్పినపుడు అ శిష్యుడు ఏమి చేసాడు ?
ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు కొనెను. (19:27)
John 19:28-30
"దప్పిగోనుచున్నాను" అని యేసు ఎందుకు అన్నాడు ?
లేఖనము నెరవేరునట్లు ఆయన అన్నాడు. (19:28)
ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినపుడు యేసు ఏమి చేసాడు ?
యేసు ఆ చిరక పుచ్చుకొని - "సమాప్తమైనది" అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (19:29-30)
John 19:31-33
శిక్ష విధించబడిన వారి కాళ్ళు విరగగోట్టించమని పిలాతు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు ?
ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినమున మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినము సిలున మీద ఉండకుండు నట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగిరి. (19:31)
సైనికులు యేసు కాళ్ళను ఎందుకు విరుగ గొట్టించ లేదు ?
ఆయన అంతకు ముందే మృతి నొందుట వారు చూచి అయన కాళ్ళు విరుగ గొట్టలేదు. (19:33)
John 19:34
యేసు చనిపోయాడని చూసిన తరువాత సైనికులు ఏమి చేసారు ?
సైనికులు ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. (19:34)
John 19:35-37
యేసు కాళ్ళు ఎందుకు విరుగగోట్టబడలేదు, యేసు ఎందుకు ఈటెతో పొడవాబడ్డాడు ?
"అతని ఎముకలలో ఒకటైనా విరువబడ లేదు" "తాము పొడిచిన వాని తట్టు చూతురు" అను లేఖనములు నెరవేరునట్లు ఇది జరిగెను. (19:36-37)
యేసు సిలువ కార్యములను చూచు వాడు ఎందుకు వారికి సాక్ష్యము చెప్పాలి ?
వారు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు. (19:35)
John 19:38-39
యేసు దేహమును తీసుకొని పోడానికి వచ్చిన వారు ఎవరు ?
యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసికోనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. (19:38)
యేసు దేహమును తీసికోనిపోవుటకు అరిమతయి యోసేపు తో వచ్చిన దెవరు ?
నికోదేము అరిమతయి యోసేపు తో వచ్చాడు. (19:39)
John 19:40-42
నికోదేము అరిమతయి యోసేపు యేసు దేహమును ఏమి చేసారు ?
వారు సుగంధ ద్రవ్వ్యములు యేసు దేహమునకు పూసి, నార బట్టలు చుట్టిరి. (19:40-41)
John 20
John 20:1
మగ్దలేనే మరియ సమాధి వద్దకు ఎప్పుడు వచ్చింది ?
ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి వద్దకు వచ్చింది. (20:1)
మగ్దలేనే మరియ సమాధి వద్దకు రాగానే ఏమి చూసింది ?
సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట ఆమె చూసింది. (20:1)
ఇద్దరు శిష్యులతో మగ్దలేనే మరియ ఏమన్నది ?
"ప్రభువును సమాదిలోనుండి ఎత్తి కొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగను" అని వారితో చెప్పింది. (20:2)
John 20:2-5
సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట మగ్దలేనే మరియ చూసినపుడు ఏమి చేసింది ?
ఆమె పరుగెత్తు కొని సీమోను పేతురు, యేసు ప్రేమించిన శిష్యుని వద్దకు వచ్చింది. (20:2)
John 20:6-7
సీమోను పేతురు సమాధి లో ఏమి చూసాడు ?
నార బట్టలు పడియుండుట పేతురు చూసాడు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టియుండుట చూచాడు. (20:6-7)
John 20:8-10
సమాధి లోనికి చూచిన మరొక శిష్యుని స్పందన ఏమిటి ?
అతడు చూచి యేసు ను నమ్మాడు. (20:8)
John 20:11-13
మరియ సమాధి లోనికి వంగి ఏమి చూసింది ?
తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. (20:12)
దూతలు మరియతో ఏమి చెప్పారు ?
"అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అని అడిగారు. (20:13)
John 20:14-15
మరియ వెనుకకు తిరిగి చూడగా ఆమె ఏమి చూసింది ?
ఆమె వెనుక తట్టు తిరిగి చూడగా యేసు నిలిచి యుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. (20:14)
యేసు ఎవరని మరియ తలంచినది ?
అయన తోటమాలి అని అనుకున్నది. (20:15)
John 20:16-18
మరియ ఎప్పుడు యేసును గుర్తుపట్టింది ?
"మరియా" అని యేసు పిలిచినపుడు ఆయనను గుర్తుపట్టింది. (20:16)
తనను తాక వద్దని యేసు ఎందుకు చెప్పాడు ?
తాను తండ్రి యొద్దకు ఇంకనూ ఎక్కిపోలేదు గనుక తనను ముట్ట వద్దని యేసు చెప్పాడు. (20:17)
తన సహోదరులకు ఏమని చెప్పమని యేసు మరియతో చెప్పాడు ?
"నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని " వారితో చెప్పమని చెప్పాడు.(20:17)
John 20:19-20
ఆదివారము సాయంకాలము శిష్యులు ఉన్న చోటున ఏమి జరిగింది ?
యేసు వచ్చి వారి మధ్యన నిలిచెను. (20:19)
యేసు తన శిష్యులకు ఏమి చూపించాడు ?
ఆయన తన చేతులను, ప్రక్కను వారికి చూపించాడు. (20:20)
John 20:21-23
యేసు తన శిష్యులను ఏమి చేయ బోవుచున్నాడని చెప్పెను ?
తండ్రి తనను పంపిన విధముగా తానును వారిని పంపుచున్నానని వారితో చెప్పాడు. (20:21)
ఆయన వారి మీద ఊదిన తరువాత వారితో ఏమి చెప్పాడు ?
"పరిశుద్దాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించ బడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిత్తురో అవి నిలిచి యుండును" అని వారితో చెప్పాడు. (20:22-23)
John 20:24-25
వారు యేసుని చూచినప్పుడు పండ్రెండు మంది శిష్యులలో ఏ శిష్యుడు వారి మధ్య లేదు ?
యేసు శిష్యుల మధ్య కు వచ్చినపుడు దిదుమ అనబడిన తోమా వారి మధ్య లేదు. (20:24)
తాను యేసు సజీవుడని నమ్మడానికి ఏమి చేస్తానని చెప్పాడు ?
తోమా యేసు చేతులలో మేకుల గురుతును చూచి తన వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి తన చేతిని ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మడని చెప్పాడు. (20:25)
John 20:26-27
తోమా యేసును ఎప్పుడు చూసాడు ?
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉన్నాడు, తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడు. (20:26)
యేసు తోమా తో ఏమి చెప్పాడు ?
"నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసి వై యుండుము" అని తోమా తో చెప్పాడు. (20:27)
John 20:28-29
తోమాా యేసు తో ఏమి చెప్పాడు ?
"నా ప్రభువా, నా దేవా " అని తోమాా అన్నాడు. (20:28)
ఎవరు ధన్యులు అని యేసు అన్నాడు ?
"చూడక నమ్మిన వారు ధన్యులు" అని యేసు అన్నాడు. (20:29)
John 20:30-31
గ్రంథమందు రాయ బడని ఇతర అద్బుతాలు యేసు చేసాడా ?
అవును. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను, అవి యీ గ్రంథమందు వ్రాయబడి యుండ లేదు. (20:30)
సూచక క్రియలు గ్రంథమందు ఎందుకు రాయబడ్డాయి ?
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందు నట్లును ఇవి వ్రాయబడెను. (20:31)
John 21
John 21:1-3
యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు ఎక్కడ ఉన్నారు ?
మరల యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు. (21:1)
ఏ శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు ?
సీమోను పేతురు, దిడుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలును, జేబెదయి కుమారులును, ఆయన శిష్యులలో ఇద్దరును అక్కడ ఉన్నారు. (21:2)
ఈ శిష్యులు ఏమి చేస్తున్నారు ?
వారు చేపలు పట్టడానికి వెళ్ళారు కాని వారికి చేపలు పడలేదు. (21:3)
John 21:4-6
శిష్యులను ఏమి చెయ్య మని యేసు చెప్పాడు ?
చేపలు దొరుకునట్లు దోనే కుడి ప్రక్కన వల వేయమని యేసు చెప్పాడు (21:6)
శిష్యులు వల వేసినపుడు ఏమి జరిగింది ?
వారు వల వేసినపుడు చేపలు విస్తారముగా పట్టి నందున వల లాగ లేక పోయిరి. (21:6)
John 21:7-9
"అయన ప్రభువు సుమీ" అని యేసు ప్రేమించిన శిష్యుడు అనినపుడు సీమోను పేతురు ఏమి చేసాసు ?
పేతురు వస్త్ర హీనుడిగా ఉన్న కారణముగా పై బట్ట వేసి సముద్రములోనికి దూకాడు. (21:7)
ఇతర శిష్యులు ఏమి చేసారు ?
తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనేలో వచ్చిరి. (21:8)
John 21:10-11
వారు పట్టిన కొన్ని చేపలను ఏమి చెయ్యమని యేసు చెప్పాడు ?
వారు అప్పుడే పట్టిన చేపలలో కొని తీసికొని రండని వారితో చెప్పాడు. (21:10)
John 21:12-14
యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ఎన్ని సార్లు ప్రత్యక్ష్య మయ్యాడు ?
యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్ష్య మైనది ఇది మూడవ సారి. (21:14)
John 21:15-16
వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని మొదట ఏమి అడిగాడు ?
సీమోను వీటికంటే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని యేసు అడిగాడు. (21:15)
John 21:17-18
నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని మూడవ సారి యేసు సీమోనును అడిగినప్పుడు సీమోను పేతురు ఇచ్చిన సమాధాన మేమిటి ?
మూడవ సారి యేసు సీమోనును అడిగినప్పుడు సీమోను పేతురు "ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని " అని యేసుకు సమాధానమిచ్చాడు. (21:17)
మూడవ సారి యేసు అడిగిన "నీవు నన్ను ప్రేమించుచున్నావ" అనే ప్రశ్న కు సీమోను పేతురు స్పందించినపుడు యేసు ఏమి చెప్పాడు ?
మూడవ సారి "నా గొర్రెలను మేపుము" అని యేసు పేతురు కు చెప్పాడు. (21:17)
పేతురు ముసలివాడైనపుడు తనకు ఏమి జరుగుతుందని యేసు పేతురు తో చెప్పాడు ?
పేతురు ముసలి వాడై నపుడు అతని చేతులు చాచుతాడు, వేరొకడు అతని నడుము కట్టి తనకు ఇష్టము కాని చోటికి తనను మోసికొని పోవును అని చెప్పాడు. (21:18)
John 21:19
పేతురు ముసలివాడైనపుడు పేతురుకు ఏమి జరుగుందని యేసు ఎందుకు చెప్పాడు ?
అతడు ఎలాటి మరణము వలన దేవుని మహిమ పరచునో దాని సూచింఛి ఆయన ఈ మాట చెప్పెను. (21:19)
John 21:20-23
యేసు ప్రేమించిన శిష్యుని విషయము యేసును పేతురు ఏమి అడిగాడు ?
"ప్రభువా ఇతని సంగతి ఏమగును?" అని అడిగాడు. (21:21)
"ప్రభువా ఇతని సంగతి ఏమగును?" అని పేతురు అడిగిన ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు ఏమిటి ?
"నీవు నన్ను వెంబడించుము" అని యేసు పేతురుతో చెప్పాడు. (21:22)
John 21:24-25
ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచూ గ్రంధమందు రాసినది ఎవరు ?
ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతనిసాక్ష్యము సత్యమని యెరుగుదుము. (21:24)