తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Colossians

Colossians 1

Colossians 1:1-3

క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు ఎలా అయ్యాడు?

క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు దేవుని చిత్తం వలన అయ్యాడు(1:1).

పౌలు ఎవరికి ఈ లేఖ వ్రాశాడు?

పౌలు ఈ లేఖ కొలొస్సయిలో ఉన్న దేవుని కోసం ప్రత్యేకపరచుకొనిన వారికీ, విశ్వాసులైన సోదరులకు వ్రాశాడు(1:1)

Colossians 1:4-6

ఇప్పుడు కొలొస్సయులు కలిగి ఉన్న నమ్మకమైన ఆశాభావం ఎక్కడ నుంచి విన్నారు?

కొలొస్సయులు కలిగివున్న నమ్మకమైన ఆశాభావం గూర్చి శుభవార్త అనే సత్య వాక్కులో విన్నారు(1:5).

శుభవార్త లోకంలో ఏం చేస్తూoదని పౌలు చెపుతున్నాడు?

శుభవార్త లోకంలో ఫలిస్తూ ఎదుగుతున్నదని పౌలు చెపుతున్నాడు(1:6).

Colossians 1:7-8

శుభవార్త కొలొస్సయులకు ఎవరు పరిచయం చేశారు?

శుభవార్త కొలొస్సయులకు నమ్మకమైన క్రీస్తు సేవకుడు ఎపఫ్రా పరిచయం చేశాడు(1:7).

Colossians 1:9-10

కొలొస్సయులు దేనితో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు?

కొలొస్సయులు ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తం గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు(1:9).

కొలొస్సయులు తమ జీవితంలో ఎలా నడుచుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు?

కొలొస్సయులు తమ జీవితంలో ప్రభువుకు తగిన విధంగా నడుస్తూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, దేవుని జ్ఞానంలో వృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు(1:10).

Colossians 1:11-12

దేవుని కోసం ప్రత్యేకించినవారు దేనికి యోగ్యులు?

దేవుని కోసం ప్రత్యేకించినవారు వెలుగులో ఉన్న వారసత్వంలో పాలిభాగస్థ్హులవటానికి యోగ్యులయ్యారు(1:12).

Colossians 1:13-14

ఆయన కోసం ప్రత్యేకించినవారిని తండ్రి వేటి నుంచి విడిపించాడు?

ఆయన కోసం ప్రత్యేకించినవారిని తండ్రి చీకటి పరిపాలన నుంచి విడిపించి ఆయన కుమారుని రాజ్యoలోకి తెచ్చాడు(1:13).

క్రీస్తులో మనకు విమోచన అంటే ఏంటి?

క్రీస్తులో విమోచన అంటే మన పాపాలకు క్షమాపణ(1:14).

Colossians 1:15-17

కుమారుడు ఎవరి స్వరూపం?

కుమారుడు కనిపించని దేవుని స్వరూపం(1:15).

యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం ఏం సృష్టించడం జరిగింది?

యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం అన్నీoటినీ సృష్టించడం జరిగింది(1:16).

Colossians 1:18-20

ఎలా దేవుడు తానే అన్నిటినీ సమాధానంతో సఖ్యపరచుకున్నాడు?

దేవుడు తానే అన్నిటిని తన కుమారుని రక్తం ద్వారా సమాధానంతో సంధి చేసుకొని సఖ్యపరచుకొన్నాడు(1:20).

Colossians 1:21-23

కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునితో ఎలాంటి సంబంధం కలిగియున్నారు?

కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునికి పరాయివారునూ, ఆయనకు శత్రువులైయున్నారు(1:21).

కొలస్సయులు నిరంతరం ఏం చేయాలి?

కొలస్సయులు నిరంతరం శుభవార్తలో నమ్మకముంచి విశ్వాసంలో స్థిరంగా ఉoడాలి (1:23).

Colossians 1:24-27

పౌలు దేని కోసం బాధలు పడుతున్నాడు, అతని వైఖరి ఏంటి?

పౌలు సంఘం కోసం బాధలు పడుతూ వాటిలో ఆనందిస్తున్నాడు(1:24).

యుగాల నుండి దాగి ఉండి ఇప్పుడు వెల్లడయిన రహస్యo ఏంటి?

యుగాల నుండి దాగి ఉన్న రహస్యం ఇప్పుడు మీలో ఉన్న క్రీస్తులో వెల్లడయ్యింది, ఆయనే మహిమకు ఆశాభావం(1:27).

Colossians 1:28-29

పౌలు ఉపదేశమూ హెచ్చరికల లక్ష్యం ఏంటి?

పౌలు ఉపదేశమూ హెచ్చరికల లక్ష్యం క్రీస్తులో ప్రతి ఒక్కరినీ సంపూర్ణులుగా సమర్పించడం (1:28).

Colossians 2

Colossians 2:1-3

దేవుని రహస్యం ఏoటి?

దేవుని రహస్యం క్రీస్తు(2:2).

క్రీస్తులో ఏం దాగి ఉన్నాయి?

క్రీస్తులో జ్ఞానవివేకాల నిధులన్నీ దాగి ఉన్నాయి(2:3).

Colossians 2:4-5

కొలొస్సయులకు ఏమి అవుతుందని పౌలు కలత చెందాడు?

కొలొస్సయులు ఒప్పింప చేసే మాటలతో మోసపోతారేమోనని పౌలు కలత చెందాడు(2:4).

Colossians 2:6-7

కొలొస్సయులు ఇప్పుడు క్రీస్తు యేసును స్వీకరించినందుకు ఏం చేయాలని పౌలు పిలిచాడు?

కొలొస్సయులు క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే నడుచుకోవాలని పౌలు పిలిచాడు(2:6).

Colossians 2:8-9

పౌలు కలత చెందుతున్నఅర్ధం లేని వట్టి మోసాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి?

అర్ధంలేని వట్టి మోసాలు, మానవ ఆచారాల పైన, లోకంలోని పాపభూయిష్టమైన వ్యవస్థలపైనా ఆధారపడి ఉన్నాయి(2: 8).

క్రీస్తులో ఏమి నివసిస్తున్నది?

క్రీస్తులో దేవుని స్వభావo సంపూర్తిగా నివసిస్తున్నది(2: 9).

Colossians 2:10-12

ప్రభుత్వాలకూ ఆధిపత్యాలకూ అధికారి ఎవరు?

ప్రభుత్వాలకూ ఆధిపత్యాలకూ అధికారి క్రీస్తు(2:10).

క్రీస్తు సున్నతి ద్వారా ఏమి తొలగించాడు?

క్రీస్తు సున్నతి ద్వారా శరీర సంబంధమైన పాప స్వభావాన్ని తొలగించాడు(2:11).

బాప్తిసంలో ఏం జరుగుతుంది?

బాప్తిసంలో ఒక వ్యక్తిని క్రీస్తుతో కూడా పాతిపెట్టడం జరిగింది(2:12).

Colossians 2:13-15

క్రీస్తు ఒకని సజీవంగా చేయక ముoదు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి?

క్రీస్తు ఒకని సజీవంగా చేయక ముoదు ఆ వ్యక్తి అపరాధాలలో చనిపోయి ఉన్నాడు(2:13).

మనకు విరోధంగా ఉన్న రుణపత్రంతో క్రీస్తు ఏం చేశాడు?

మనకు విరోధంగా ఉన్న రుణపత్రం తొలగించి దానిని సిలువకు మేకులతో కొట్టాడు(2:14).

క్రీస్తు ప్రధానులతో అధికారులతో ఏం చేశాడు?

క్రీస్తు ప్రధానులనూ అధికారులనూ తొలగించి జయోత్సం ఊరేగింపులో వారిని నడిపించి బహిరంగంగా కనపడేలాచేసాడు (2:15).

Colossians 2:16-17

రాబోయే వాటికి నీడలు ఏoటని పౌలు చెపుతున్నాడు?

రాబోయే వాటికి నీడలు అన్నపానాలు, పండుగలు, విశ్రాంతి రోజులని పౌలు చెపుతున్నాడు(2:17).

నీడలు ఏ వాస్తవాన్ని చూపుతున్నాయి?

నీడలు క్రీస్తులోని వాస్తవాన్ని చూపుతున్నాయి(2:17).

Colossians 2:18-19

ఎలా శరీరమంతా కలిపి అమర్చి ఉన్నది?

శరీరమంతా క్రీస్తు అనే శిరస్సు వలన కలసి అమరి ఉన్నది(2:19).

Colossians 2:20-23

లోకసంబంధమైన నమ్మకాల్లో ఏవి భాగాలని పౌలు చెబుతున్నాడు?

ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, తాకవద్దు అనే వాటికీ సంబంధించిన ఆజ్ఞలు లోకసంబంధమైన నమ్మకాల్లో భాగాలు (2: 20-22).

వేటితో పోల్చుకుంటే మానవ కల్పిత మత నియమాలకు విలువ లేదు?

శరీర వాంఛలతో పోల్చుకుంటే మానవ కల్పిత మతనియమాలకు విలువ లేదు (2:23).

Colossians 3

Colossians 3:1-4

ఎక్కడకు క్రీస్తు లేపబడ్డాడు?

క్రీస్తు దేవుని కుడి చేతి ప్రక్కన కూర్చోడానికి లేపబడ్డాడు(3:1).

విశ్వాసులు ఏం వెదకాలి, ఏం వెదకకూడదు?

విశ్వాసులు పైవాటిని వెదకాలి, భూలోక విషయాలు కాదు(3:1-2).

దేవుడు విశ్వాసి జీవాన్ని ఎక్కడ ఉంచాడు?

దేవుడు విశ్వాసి జీవాన్ని క్రీస్తులో దాచి ఉంచాడు(3:3).

క్రీస్తు కనిపించినపుడు విశ్వాసులకు ఏమవుతుంది?

క్రీస్తు కనిపించినపుడు విశ్వాసులు కూడా మహిమలో కనిపిస్తారు(3:4).

Colossians 3:5-8

విశ్వాసి వేటిని చంపెయ్యాలి?

విశ్వాసి భూసంబంధమైన పాప కోరికలను చంపెయ్యాలి(3:5).

దేవునికి అవిధేయులైన వారికి ఏమవుతుంది?

దేవునికి అవిధేయులైన వారి పైకి దేవుని ఉగ్రత వస్తుంది(3:6).

పాత స్వభావానికి సంబంధించి విశ్వాసులు ఏం వదులుకోవాలని పౌలు చెపుతున్నాడు?

పాత స్వభావానికి సంబంధించి విశ్వాసులు కోపం, ఆగ్రహం, చెడు ఉద్దేశ్యాలు, అవమానించడం, చెడు మాటలు, అబద్దాలు వదులుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:8-9).

Colossians 3:9-11

విశ్వాసులు నూతన స్వభావo ఎవరి పోలికలో సృష్టించడం జరిగింది?

విశ్వాసులు నూతన స్వభావo క్రీస్తు పోలికలో సృష్టించడం జరిగింది(3:10).

Colossians 3:12-14

నూతన స్వభావానికి సంబంధిoచి విశ్వాసులు ధరించాలిసినవి ఏంటని పౌలు చెపుతున్నాడు?

నూతన స్వభావానికి సంబంధిoచి విశ్వాసులు జాలి గల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:12).

విశ్వాసి ఏ విధానంలో క్షమిoచాలి?

ప్రభువు అతనిని క్షమిoచిన విధానంలో క్షమిoచాలి(3:13).

విశ్వాసుల మధ్య పరిపూర్ణమైన బంధం ఏంటి?

విశ్వాసుల మధ్య పరిపూర్ణమైన బంధం ప్రేమే(3:14).

Colossians 3:15-17

విశ్వాసి హృదయoలో ఏం పరిపాలిస్తూ ఉండాలి?

విశ్వాసి హృదయoలో క్రీస్తు శాంతి పరిపాలిస్తూ ఉండాలి(3:15).

విశ్వాసిలో ఏం సమృద్ధిగా జీవించాలి?

విశ్వాసిలో క్రీస్తు వాక్కు సమృద్ధిగా జీవించాలి(3:16).

విశ్వాసి వైఖరీ, పాట, మాట, పనులు దేవునికి ఇవ్వడంలో ఏ విధంగా ఉండాలి?

విశ్వాసి వైఖరి, పాట, మాట, పనులు దేవునికి ఇవ్వడంలో కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి(3:15-17).

Colossians 3:18-21

భార్య తన భర్తకు తగినట్టు ఎలా ఉండాలి?

భార్య తన భర్తకు లోబడి ఉండాలి(3:18).

భర్త ఏ విధంగా తన భార్యతో ప్రవర్తించాలి?

భర్త తన భార్యను ప్రేమిస్తూ ఆమెతో కఠినంగా ప్రవర్తించకూడదు(3:19).

పిల్లలు ఏ విధంగా తమ తల్లితండ్రుల పట్ల ప్రవర్తించాలి?

పిల్లలు తమ తల్లితండ్రులకు అన్నీ విషయాలలో విధేయులై ఉండాలి (3:20).

తండ్రి తన పిల్లలకు ఏం చేయకూడదు?

తండ్రి తన పిల్లలకు కోపం పుట్టించకూడదు(3:21).

Colossians 3:22-25

విశ్వాసులు చేసే పని ఏదైనా ఎవరికి చేయాలి?

విశ్వాసులు చేసే పని ఏదైన ప్రభువు కోసమే చేయాలి(3:23-24).

ఏం చేసిన ప్రభువు సేవ కోసం చేసేవాడు ఏం పొందుతాడు?

ఏం చేసినా ప్రభువు సేవ కోసం చేసేవాడు వారసత్వాన్ని పొందుతాడు (3:24).

అక్రమం చేసేవాడు ఏం పొందుతాడు?

అక్రమం చేసేవాడు తను చేసిన దానికి ప్రతిఫలం పొందుతాడు. (3:25).

Colossians 4

Colossians 4:1

భూసంబంధమైన యజమానులు ఏం కలిగియున్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు?

భూసంబంధమైన యజమానులకు కూడా పరలోకంలో యజమానుడొకడు ఉన్నాడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు(4:1).

Colossians 4:2-4

కొలొస్సయులు ఏ విషయంలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు?

కొలొస్సయులు ప్రార్థనలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు(4:2).

పౌలు దేని కోసం ప్రార్దించమని కొలొస్సయులను కోరుతున్నాడు?

క్రీస్తు రహస్యం, వాక్కు చెప్పుటకు ఆయన తలుపు తెరిచేలా ప్రార్దించమని పౌలు కొలొస్సయులను కోరుతున్నాడు(4:3).

Colossians 4:5-6

సంఘం బయట ఉన్నవారిని కొలస్సయులు ఎలా ఆదరించాలని పౌలు ఉపదేశిస్తున్నాడు?

సంఘం బయట ఉన్నవారి యెడల జ్ఞానంగా జీవిస్తూ దయతో మాట్లాడి ఆదరించాలని కొలస్సయులకు పౌలు ఉపదేశిస్తున్నాడు(4:5-6).

Colossians 4:7-9

తుకికుకూ ఒనేసిములకు ఏ పని పౌలు అప్పగించాడు?

తుకికుకూ ఒనేసిములకు పౌలు తనను గూర్చిన విషయాలు కొలొస్సయులకు తెలియజేసే పని అప్పగించాడు(4:7-9).

Colossians 4:10-11

పౌలు బర్నబా సమీప బంధువైన మార్కును గూర్చి ఏ విధమైన ఆదేశాలు ఇచ్చాడు?

కొలొస్సయుల దగ్గరకు మార్కు వస్తే అతన్ని స్వీకరించoడని పౌలు వారికీ చెప్పాడు (4:10).

Colossians 4:12-14

కొలొస్సయుల కోసం ఎపఫ్రా ఏమని ప్రార్ధిస్తున్నాడు?

కొలొస్సయులు దేవుని సంకల్పంలో పూర్తి నిశ్చయతతో సుస్థిరంగా నిలిచి ఉండాలని ఎపఫ్రా ప్రార్ధిస్తున్నాడు(4:12).

పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు ఏంటి?

పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు లూకా (4:14).

Colossians 4:15-17

లవొదికయ సంఘ సమావేశం ఎలాంటి స్థలంలో ఉన్నది?

లవొదికయలోని సంఘo ఇంట్లో సమావేశమయ్యేది (4:15).

ఏ ఇతర సంఘానికి కూడా పౌలు ఉత్తరం వ్రాయటం జరిగింది?

లవొదికయలోని సంఘానికి కూడా పౌలు ఉత్తరం వ్రాయటం జరిగింది (4:16).

Colossians 4:18

పౌలు ఏ విధంగా ఈలేఖ తన నుంచే కలిగిందని కనపరచాడు?

పౌలు ఈ లేఖ చివరన తన స్వదస్తూరితో సంతకం చేశాడు (4:18).