తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

1 Thessalonians

1 Thessalonians 1

1 Thessalonians 1:2-3

తెస్సలోనికయుల గురించి పౌలు ఎల్లప్పుడూ దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకునేది ఏమిటి?

వారి విశ్వాస క్రియలనూ, వారి ప్రేమపూర్వక ప్రయాసనూ, ఓపికతో కూడిన నిరీక్షణనూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు (1: 3).

1 Thessalonians 1:4-5

తెస్సలోనికయుల దగ్గరకు ఏ నాలుగు విధాలుగా సువార్త వచ్చింది?

తెస్సలోనికయుల దగ్గరకు సువార్త మాటతో, ప్రభావంతో, పరిశుద్ధాత్మతో, గొప్ప నిబ్బరంతో వచ్చింది (1: 5).

1 Thessalonians 1:6-7

సువార్త వాక్కు వింటున్నప్పుడు తెస్సలోనికయులకు ఏమి జరుగుతున్నది?

అనేక బాధల్లో ఉండి తెస్సలోనికయులు వాక్కును విన్నారు (1: 6).

సువార్త వాక్కును విన్నప్పుడు తెస్సలోనికయుల వైఖరి ఏమిటి?

పరిశుద్ధాత్మ లోని ఆనందంతో తెస్సలోనికయులు వాక్కును స్వీకరించారు (1: 6)

1 Thessalonians 1:8-10

తెస్సలోనికయులు ప్రభువు వాక్కును స్వీకరించిన తరువాత ఏమి జరిగింది?

వారి విశ్వాసం వెళ్ళిన చోటల్లా వాక్కు ప్రతిధ్వనించింది (1: 8).

నిజ దేవుణ్ణి నమ్ముకోక ముందు తెస్సలోనికయులు ఎవరిని పూజించేవారు?

నిజ దేవుణ్ణి నమ్ముకోక ముందు తెస్సలోనికయులు విగ్రహాలను పూజించేవారు (1: 9)

పౌలు, తెస్సలోనికయులు దేని కోసం ఎదురు చూస్తున్నారు?

పౌలు, తెస్సలోనికయులు పరలోకం నుంచి యేసు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు (1: 10).

దేని నుండి యేసు మనలను విడిపిస్తాడు?

రానున్న ఉగ్రత నుండి విడిపిస్తాడు.

1 Thessalonians 2

1 Thessalonians 2:1-2

తెస్సలోనికకు రాక ముందు పౌలు అతని సహచరులు ఎలాటి అనుభవాలు పొందారు?

వారు బాధల పాలై, అవమాన కరమైన అనుభవాలు పొందారు (2: 2)

1 Thessalonians 2:3-4

పౌలు తన సువార్త బోధన మూలంగా ఎవరిని సంతోష పరచగోరుతున్నాడు?

పౌలు తన సువార్త బోధన మూలంగా దేవుణ్ణి మాత్రమే సంతోషపరచ గోరుతున్నాడు (2: 4- 6)

1 Thessalonians 2:5-6

పౌలు తన సువార్త ప్రకటనలో ఏది చేయలేదు?

పౌలు ముఖస్తుతి మాటలను, దురాశను కనుపరచలేదు.

1 Thessalonians 2:7-9

వారి మధ్య ఉన్నపుడు పౌలు తెస్సలోనికయుల పట్ల ఎలా ప్రవర్తించాడు?

తమ స్వంత పిల్లలతో తల్లి, తండ్రి ఎలా ఉంటారో అలా మృదువుగా పౌలు తెస్సలోనికయుల పట్ల ప్రవర్తించాడు [2:7-8,11].

తెస్సలోనికయులకు భారంగా ఉండకూడదని పౌలు అతని అనుచరులు ఏమి చేశారు?

తెస్సలోనికయులకు భారంగా ఉండకూడదని పౌలు అతని అనుచరులు పగలూ రాత్రీపని చేశారు [2:9].

1 Thessalonians 2:10-12

తెస్సలోనికయులు ఎలా నడుచుకోవాలని పౌలు చెప్పాడు?

వారిని తన రాజ్యానికీ మహిమకు పిలిచిన దేవునికి తగినట్టుగా తెస్సలోనికయులు నడుచుకోవాలని పౌలు చెప్పాడు (2: 12)

1 Thessalonians 2:13

పౌలు తమకు బోధించిన దానిని తెస్సలోనికయులు దేనిగా స్వీకరించారు?

మానవ వాక్కుగా కాక దేవుని వాక్కుగా తెస్సలోనికయులు స్వీకరించారు (2: 13).

1 Thessalonians 2:14-16

నమ్మని యూదులు దేవునికి అయిష్టమైన పని ఏమి చేశారు?

నమ్మని యూదులు యూదయ లోని సంఘాలను హింసించారు. యేసును ప్రవక్తలను చంపారు. పౌలును వెళ్ళగొట్టారు. అతడు యూదేతరులతో మాట్లాడడం నిషేధించారు (2: 14- 16)

1 Thessalonians 2:17-20

అది తన కోరిక అయినప్పటికీ పౌలు తెస్సలోనికాకు ఎందుకు రాలేక పోయాడు?

సాతాను అతణ్ణి ఆటంక పరచినందువల్ల అతడు రాలేక పోయాడు (2: 17- 18).

ప్రభువు రాకడ సమయంలో పౌలు పాలిట తెస్సలోనికయులు ఎలా ఉంటారు?

ప్రభువు రాకడ సమయంలో తెస్సలోనికయులు పౌలు పాలిట నిరీక్షణ, ఆనందం, మహిమ కిరీటంగా ఉంటారు (2: 19- 20)

1 Thessalonians 3

1 Thessalonians 3:1-3

పౌలు ఎతెన్సులో ఉండి పోవలసి వచ్చినా ఏమి చేశాడు?

తెస్సలోనికలోని విశ్వాసులను బలపరచడానికి, ఆదరించడానికి తిమోతిని పంపాడు (3: 1: 2).

పౌలు తాను దేనికోసం నియమితుడయ్యాడని చెప్పాడు?

తాను బాధలు అనుభవించడం కోసమే నియమితుడయ్యాడని చెప్పాడు (3: 3).

1 Thessalonians 3:4-5

తెస్సలోనికయుల్లో దేని విషయం పౌలు అందోళనగా ఉన్నాడు?

తెస్సలోనికయులను శోధకుడు తప్పు దారి పట్టించాడేమోననీ, తన ప్రయాస అంతా వ్యర్థం అయిపోతుందేమో అనీ పౌలు అందోళనగా ఉన్నాడు (3: 5).

1 Thessalonians 3:6-7

తిమోతి తెస్సలోనికకు తిరిగి వచ్చినపుడు పౌలును ఏది ఆదరించింది?

తెస్సలోనికయుల విశ్వాస ప్రేమల గురించిన వార్త, వారు తనను చూడాలని ఆశిస్తున్నారనే వార్త విని పౌలు ఆదరణ పొందాడు (3: 6- 7)

1 Thessalonians 3:8-10

తెస్సలోనికయులు ఏమి చేస్తే తాను బతికిపోతానని చెప్పాడు?

వారు ప్రభువులో స్థిరంగా నిలబడితే తాను బతికిపోతానని పౌలు చెప్పాడు (3: 10).

పౌలు రేయింబవళ్ళు దేని కోసం ప్రార్థిస్తున్నాడు ?

తను తెస్సలోనికయులను చూడాలని, వారి విశ్వాసంలో కొరతగా ఉన్నదాన్ని పూర్తి చేయాలనీ పౌలు రేయింబవళ్ళు ప్రార్థిస్తున్నాడు (3: 10).

1 Thessalonians 3:11-13

తెస్సలోనికయులు దేనిలో ఎదిగి అభివృద్ధి చెందాలని పౌలు ఆశిస్తున్నాడు?

తెస్సలోనికయులు ఒకరి పట్ల ఒకరు, అందరి పట్ల ప్రేమలో వర్థిల్లాలని ఆశిస్తున్నాడు (3: 12).

తెస్సలోనికయులు తమ హృదయాలను నిర్దోషంగా పవిత్రంగా ఉంచుకుని ఏ సంభవం కోసం ఎదురు చూడాలని పౌలు కోరుతున్నాడు?

యేసు ప్రభువు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చేటప్పుడు తెస్సలోనికయులు అయన రాక కోసం సిద్ధంగా ఉండాలని పౌలు కోరుతున్నాడు (3: 13).

1 Thessalonians 4

1 Thessalonians 4:1-2

తెస్సలోనికయులు ఎలా నడుచుకోవాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనే తన సూచనల విషయంలో వారు ఏమి చేయాలి అని పౌలు కోరుతున్నాడు?

తెస్సలోనికయులు దేవునితో నడక కొనసాగిస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ, దాన్ని మరింత ఎక్కువగా చేయాలని పౌలు కోరుతున్నాడు (4: 1-2).

1 Thessalonians 4:3-6

తెస్సలోనికయుల విషయంలో దేవుని సంకల్పం ఏదని పౌలు అన్నాడు?

తెస్సలోనికయుల విషయంలో దేవుని సంకల్పం వారు పరిశుద్ధులు కావడమేనని పౌలు అన్నాడు (4: 3)

భర్తలు తమ భార్యలను ఎలా చూసుకోవాలి?

భర్తలు తమ భార్యలను పరిశుద్ధతతో గౌరవపూర్వకంగా చూసుకోవాలి (4: 4).

లైంగిక అవినీతి విషయంలో తప్పటడుగు వేసిన సహోదరునికి ఏమి జరుగుతుంది?

లైంగిక అవినీతి విషయంలో తప్పటడుగు వేసిన సహోదరునిపై ప్రభువే ప్రతీకారం చేస్తాడు (4: 6).

1 Thessalonians 4:7-8

పరిశుద్ధతకై పిలుపును త్రోసిపుచ్చిన వ్యక్తి ఏమి చేస్తున్నాడు?

పరిశుద్ధతకై పిలుపును త్రోసిపుచ్చిన వ్యక్తి ప్రభువునే తిరస్కరిస్తున్నాడు (4: 8).

1 Thessalonians 4:9-12

దేన్ని మరింతగా చేయాలని తెస్సలోనికయులకు పౌలు కోరాడు?

తెస్సలోనికయులు మరింతగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని పౌలు కోరాడు (4: 9,10).

తమకేమీ కొదువ లేకుండా అవిశ్వాసుల ఎదుట యోగ్యంగా నడచుకోనేలా తెస్సలోనికయులు ఏమి చెయ్యాలి?

తెస్సలోనికయులు నెమ్మది గలిగి తమ స్వంత పనులు చూసుకుంటూ తమ చేతులతో పని చేస్తూ ఉండాలి (4: 11-12).

1 Thessalonians 4:13-15

ఏ విషయంలో బహుశా తెస్సలోనికయులు అపార్థంలో ఉన్నారు?

కన్నుమూసిన వారికి ఏమి అవుతుందనే విషయంలో బహుశా తెస్సలోనికయులు అపార్థంలో ఉన్నారు (4-1:13).

క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఎమి చేస్తాడు?

క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకు వస్తాడు (4:1- 4).

1 Thessalonians 4:16-18

ప్రభువు పరలోకం నుండి ఎలా దిగి వస్తాడు?

ఆర్భాటంతో దేవుని బూర శబ్దంతో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు (4: 1- 6).

మొదట లేచేదెవరు? ఆపైన వారితో బాటు లేచేది ఎవరు?

క్రీస్తులో మృతులు మొదట లేస్తారు. ఆపైన సజీవులు వారితో బాటు ఎత్తబడతారు (4:16-17).

లేచినవారు ఎవరిని కలుసుకుంటారు? ఎంతకాలం?

లేచిన వారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. శాశ్వతంగా వారు ఆయనతో ఉంటారు (4:17).

కన్నుమూసిన వారి గురించి తను చెప్పిన ఉపదేశంతో తెస్సలోనికయులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు ?

తన ఉపదేశంతో వారు ఒకరినొకరు ఆదరించుకోవాలని పౌలు చెప్పాడు (4:18).

1 Thessalonians 5

1 Thessalonians 5:1-3

ప్రభువు దినం ఎలా వస్తుందని పౌలు చెప్పాడు?

ప్రభువు దినం రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వస్తుందని చెప్పాడు (5:2).

హటాత్తుగా వినాశం తమ పైకి వచ్చినప్పుడు మనుషులు ఏమంటారు?

కొందరు వినాశం తమ పైకి వచ్చినప్పుడు "శాంతి, భద్రత" అంటూ ఉంటారు (:53).

1 Thessalonians 5:4-7

ప్రభువు దినం దొంగ వలే విశ్వాసులపైకి విరుచుకుపడకూడదని పౌలు ఎందుకు అంటున్నాడు?

ఎందుకంటే వారు చీకటిలో లేరు. వారు వెలుగు సంతానం. కాబట్టి ప్రభువు దినం దొంగ వలే విశ్వాసులపైకి విరుచుకుపడకూడదు (5:45).

రానున్న ప్రభువు దినం గురించి పౌలు విశ్వాసులకు ఏమి చెబుతున్నాడు?

మెలకువ గలవారై అప్రమత్తంగా ఉండి విశ్వాసం ప్రేమ నిరీక్షణలను ధరించుకోవాలని చెబుతున్నాడు (5:6- 8).

1 Thessalonians 5:8-11

దేవుని ఏర్పాటులో విశ్వాసుల అంతిమ గమ్యం ఏది?

యేసు క్రీస్తులో రక్షణయే విశ్వాసుల అంతిమ గమ్యం (5:9).

1 Thessalonians 5:12-14

ప్రభువులో తమపై ఉన్నవారి విషయంలో విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలి?

అలాటి వారిని విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రేమ పూర్వకమైన గౌరవం చూపాలి అని పౌలు అంటున్నాడు (5:12- 13).

1 Thessalonians 5:15-18

తమ పట్ల కీడు జరిగితే విశ్వాసులు ఎలా స్పందించకూడదని పౌలు చెప్పాడు?

తమకు కీడు జరిగితే ప్రతికీడు చేయకూడదని చెప్పాడు (5:15).

అన్ని విషయాల్లో విశ్వాసులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు? ఎందుకు?

అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలని పౌలు చెప్పాడు. ఎందుకంటే వారి విషయంలో అది దేవుని చిత్తం (5:18).

1 Thessalonians 5:19-22

ప్రవచనాల గురించి పౌలు విశ్వాసులకు ఎలాటి సూచనలు ఇచ్చాడు?

ప్రవచనాలను చులకన చేయవద్దని, అయితే అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని పరిగ్రహించాలని చెప్పాడు (5: 20-21).

1 Thessalonians 5:23-24

దేవుడు విశ్వాసులకు ఏమి చేయాలని పౌలు ప్రార్థించాడు?

ఆత్మలో మనసులో దేహంలో దేవుడు విశ్వాసులను పరిపూర్ణంగా పవిత్రపరచాలని పౌలు ప్రార్థించాడు (5: 23).

1 Thessalonians 5:25-28

విశ్వాసులతో ఏమి ఉండాలి అని పౌలు ప్రార్థించాడు?

యేసు క్రీస్తు ప్రభువు కృప విశ్వాసులతో ఉండాలి అని పౌలు ప్రార్థించాడు (5:28).