తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

2 Thessalonians

2 Thessalonians 1

2 Thessalonians 1:3-5

తెస్సలోనిక సంఘంలో ఏ రెండు సంగతుల గురించి పౌలు దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు?

ఒకరిపట్ల ఒకరు కనపరచుకునే విశ్వాస ప్రేమల విషయంలో పౌలు దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు (1: 3).

తెస్సలోనికలో విశ్వాసులు ఎలాటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారు?

తెస్సలోనికలో విశ్వాసులు శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు (1: 4).

విశ్వాసులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల వల్ల కలిగిన మంచి ఫలితాలు ఏవి?

వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఎంచబడతారు (1: 5).

2 Thessalonians 1:6-8

విశ్వాసులను బాధలు పెడుతున్న వారిని దేవుడు ఏమి చేస్తాడు?

విశ్వాసులను బాధించే వారిని దేవుడు బాధిస్తాడు. అగ్ని జ్వాలల్లో శిక్షిస్తాడు (1:6, 8).

విశ్వాసులకు బాధలనుండి విడుదల ఎప్పుడు కలుగుతుంది?

యేసు క్రీస్తు పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు బాధలనుండి విడుదల కలుగుతుంది (1: 7).

2 Thessalonians 1:9-10

దేవుణ్ణి ఎరుగని వారికి శిక్ష ఎంతకాలం ఉంటుంది?

దేవుణ్ణి ఎరుగని వారికి శిక్ష శాశ్వత కాలం ఉంటుంది (1: 9).

దేవుణ్ణి ఎరుగని వారు తమకు కలిగే శిక్షలో భాగంగా దేని నుండి వేరై పోతారు?

దేవుణ్ణి ఎరుగని వారు తమకు కలిగే శిక్షలో భాగంగా దేవుని సన్నిధి నుండి వేరై పోతారు (1: 9)

క్రీస్తు తన దినాన రావడం చూసినప్పుడు విశ్వాసులు ఏమి చేస్తారు?

క్రీస్తు తన దినాన రావడం చూసినప్పుడు విశ్వాసులు అబ్బుర పడతారు (1: 10).

2 Thessalonians 1:11-12

దేవుని శక్తితో విశ్వాసులు జరిగించిన సత్క్రియల ఫలితం ఏమిటి?

దేవుని శక్తితో విశ్వాసులు జరిగించిన సత్క్రియల ఫలితంగా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది (1: 11-12).

2 Thessalonians 2

2 Thessalonians 2:1-2

ఇప్పుడు ఏ సంభవం గురించి తాను రాయబోతున్నట్టు పౌలు చెబుతున్నాడు?

ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు రాక గురించి తాను రాయబోతున్నట్టు పౌలు చెబుతున్నాడు (2: 1)

ఏమి నమ్మవద్దని వారికి పౌలు చెబుతున్నాడు?

ప్రభువు దినం గతంలోనే వచ్చిందని చెబితే నమ్మవద్దని పౌలు చెబుతున్నాడు (2: 2).

2 Thessalonians 2:3-4

ప్రభువు దినానికి ముందు ఏమి రావాలని పౌలు చెబుతున్నాడు?

ప్రభువు దినానికి ముందు పతనం సంభవించి ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 3).

ధర్మ విరోధి ఏమి చేస్తాడు?

ధర్మ విరోధి దేవుణ్ణి వ్యతిరేకించి తనను దేవునికి పైగా హెచ్చించు కుంటాడు. తనను దేవుడుగా ఎంచుకుని దేవాలయంలో కూర్చుంటాడు (2: 4)

2 Thessalonians 2:5-7

ధర్మవిరోధి ఎప్పుడు వెల్లడి అవుతాడు?

సమయం ఆసన్నమైనపుడు అతనిని అడ్డగించేది తొలిగి పోయినప్పుడు ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 6-7).

2 Thessalonians 2:8-10

యేసు ప్రత్యక్షమైనప్పుడు ధర్మవిరోధిని ఏమి చేస్తాడు?

యేసు ప్రత్యక్షమైనప్పుడు ధర్మవిరోధిని సంహరిస్తాడు (2:8).

ధర్మవిరోధి అద్భుతాలు, సూచనలు చేసేలా ధర్మవిరోధికి శక్తి ఇచ్చి అతనితో కలిసి పని చేసేదెవరు?

ధర్మవిరోధి అద్భుతాలు, సూచనలు చేసేలా ధర్మవిరోధికి శక్తి ఇచ్చి అతనితో కలిసి పని చేసేది సాతాను (2:9).

కొందరు ఎందుకు ధర్మవిరోధి చేతుల్లో మోసపోయి నశిస్తారు?

రక్షణ పొందేలా సత్యాన్ని గురించిన ప్రేమ కొందరిలో ఉండదు గనుక వారు మోసపోతారు (2: 10).

2 Thessalonians 2:11-12

మోసపోయి నాశనమవుతున్న వారు దేనిలో ఆనందిస్తారు?

మోసపోయి నాశనమవుతున్న వారు అవినీతిలో ఆనందిస్తారు (2: 12).

2 Thessalonians 2:13-15

సువార్త మూలంగా తెస్సలోనికయులు ఏమి పొందాలని దేవుడు ఎంపిక చేసాడు?

సువార్త మూలంగా తెస్సలోనికయులు యేసు క్రీస్తు ప్రభువు మహిమను పొందాలని దేవుడు ఎంపిక చేసాడు (2: 13-14).

తెస్సలోనికయులు ఇప్పుడు సువార్తను అంగీకరించారు గనక ఇప్పుడు వారు ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?

వారు నేర్చుకున్న సంప్రదాయాలను గట్టిగా చేపట్టి స్థిరంగా నిలబడాలని పౌలు తెస్సలోనికయులను కోరాడు (215).

2 Thessalonians 2:16-17

తెస్సలోనికయులు తమ హృదయాలలో దేనిపై స్థిరపడాలని పౌలు కోరాడు?

తెస్సలోనికయులు ప్రతి సత్క్రియలోను, వాక్కులోనూ స్థిరపడాలని పౌలు కోరాడు (2:17).

2 Thessalonians 3

2 Thessalonians 3:1-3

ప్రభువు వాక్కు విషయంలో తెస్సలోనికయులు ఏమని ప్రార్థన చేయాలని పౌలు కోరాడు?

ప్రభువు వాక్కు త్వరగా వ్యాపించేలా మహిమ పొందేలా తెస్సలోనికయులు ప్రార్థన చేయాలని పౌలు కోరాడు (3:2).

దేని నుండి తాను విడుదల పొందాలని పౌలు కోరాడు?

విశ్వాసం లేని దుష్టుల చేతుల్లో నుండి విడుదల పొందాలని పౌలు కోరాడు (3: 2).

2 Thessalonians 3:4-5

దేనిని కొనసాగించాలని పౌలు తెస్సలోనికయులకు చెప్పాడు?

తను వారికి ఆజ్ఞాపించిన క్రియలు కొనసాగించాలని పౌలు తెస్సలోనికయులకు చెప్పాడు (3: 4).

2 Thessalonians 3:6-9

సోమరితనంగా బ్రతికే సహోదరుని విషయం తెస్సలోనికయులు ఏమి చేయాలని పౌలు ఆజ్ఞాపించాడు?

సోమరితనంగా బ్రతికే సహోదరునికి తెస్సలోనికయులు దూరంగా ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 6).

తన పరిచర్య, పోషణ విషయంలో పౌలు తెస్సలోనిక వారికి ఏ ప్రమాణం ఉంచాడు?

పౌలు తాను ఎవరికీ భారంగా ఉండకూడదని తన పోషణ నిమిత్తం రేయింబవళ్ళు పని చేసేవాడు (3:7-9).

2 Thessalonians 3:10-12

పని చేయడానికి ఇష్ట పడని వారి విషయంలో పౌలు ఏమి ఆజ్ఞాపించాడు?

పని చేయడానికి ఇష్ట పడని వారు భోజనం చేయకూడదని పౌలు ఆజ్ఞాపించాడు (3: 10).

అలాటి వారు సోమరులుగా కాక ఏమి చేయాలని పౌలు ఆజ్ఞాపించాడు?

సోమరులు నెమ్మదిగా పని చేసుకుంటూ తమ స్వంత ఆహారం తింటూ ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 12).

2 Thessalonians 3:13-15

ఈ లేఖలో పౌలు రాసిన సూచనలను పాటించని వారి విషయంలో సహోదరులు ఏమి చేయాలి?

ఈ లేఖలో పౌలు రాసిన సూచనలను పాటించని వారితో సహోదరులు ఎలాటి పొత్తు పెట్టుకోకూడదు (3: 14).

2 Thessalonians 3:16-18

తెస్సలోనికయులకు దేవుడు ఏమి ఇవ్వాలని పౌలు కోరాడు?

తెస్సలోనికయులకు దేవుడు అన్ని కాలాల్లో శాంతి ఇవ్వాలని పౌలు కోరాడు (3: 16).

ఈ లేఖను తాను రాశానని చూపడానికి పౌలు ఏమి చేశాడు?

ఈ లేఖను తాను రాశానని చూపడానికి పౌలు తన స్వహస్తాలతో అభినందనలు చెబుతూ సంతకం చేశాడు (3: 17).