Mark
Mark front
మార్కు సువార్త యొక్క పరిచయము
భాగము 1: సాధారణ పరిచయము
మార్కు సువార్త యొక్క విభజన
- పరిచయము (1:1-13)
- గలిలయలో యేసు పరిచర్య
- ప్రారంభ పరిచర్య (1:14-3:6)
- యేసు ప్రజలలో మరింత ప్రాచుర్యం పొందాడు (3:7-5:43)
- గలిలయ నుండి దూరంగా వెళ్ళటం మరియు తిరిగి రావటం (6:1 -8:26)
- యేరుషలేము ఎడల అభివృద్ధి, యేసు తన మరణమును గురించి పదేపదే ప్రవచించినప్పుడు; శిష్యులు అపార్థం చేసుకుంటారు, మరియు యేసు తనను అనుసరించడం ఎంత కష్టమో వారికి బోధిస్తాడు (8:27-10:52)
- పరిచర్య యొక్క చివరి రోజులు మరియు యేరుషలేములో చివరి విభేదముకు సిద్ధపాటు (11:1-13:37)
- క్రీస్తు యొక్క మరణం మరియు ఖాళి సమాధి (14:1-16:8)
మార్కు సువార్త దేనిని గురించి వివరించుచున్నది?
యేసు క్రీస్తు జీవితమును వివరించే క్రొత్త నిబంధనలోని నాలుగు పుస్తకములలో మార్కు సువార్త ఒకటి. సువార్త రచయితలు యేసు ఎవరు మరియు ఆయన ఏమి చేసారు అనే విభిన్న అంశాల గురించి వ్రాసారు. యేసు సిలువపై బాధను మరియు మరణమును గురించి మార్కు ఎక్కువగా వ్రాసాడు. హింసించబడుతున్న తన చదవరులను ప్రోత్సాహించుటకు అతను ఇలా చేసాడు. మార్కు యూదుల ఆచారాలను మరియు కొన్ని అరామిక్ మాటలను కూడా వివరించాడు. మార్కు తన మొదటి చదువరులలో ఎక్కువ మంది అన్యజనులని అనుకున్నాడని ఇది తెలియచేస్తుంది.
ఈ సువార్త యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?
తర్జుమా చేయువారు ఈ సువార్తను “మార్కు సువార్త” లేక “మార్కు ప్రకారంగా వ్రాయబడిన సువార్త” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేక “మార్కు వ్రాసిన యేసు గురించిన సువార్త” అని స్పష్టంగా కనిపించే పేరును వారు ఎంచుకోవచ్చు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
మార్కు సువార్తను ఎవరు వ్రాసారు?
ఈ సువార్తలో రచయిత పేరు ఇవ్వబడలేదు. ఏదేమైనా, ప్రారంభ క్రైస్తవ కాలం నుండి, మార్కు ఈ సువార్త యొక్క రచయిత అని చాలా మంది క్రైస్తవులు భావించారు. మార్కును యోహాను మార్కు అని కూడా పిలిచేవారు. అతడు పేతురుకు సన్నిహితుడు. యేసు చెప్పినదానికి మరియు చేసినదానికి మార్కు సాక్ష్యమివ్వకపోవచ్చు. యేసు గురించి పేతురు చెప్పినదానిని మార్కు వ్రాసాడని చాలా మంది పండితులు భావించారు.
\nభాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు
యేసు యొక్క బోధన పద్ధతులు ఏమిటి?
ప్రజలు యేసును రబ్బీగా భావించారు. రబ్బీ అనగా దేవుని ధర్మశాస్త్ర బోధకుడైయున్నాడు. యేసు ఇశ్రాయేలీయులలోని ఇతర మత బోధకుల మాదిరిగానే బోధించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనను అనుసరించే విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులను శిష్యులని పిలచేవారు. ఆయన తరచుగా ఉపమానములను చెప్పాడు. ఉపమానాలంటే నీతిని నేర్పించే కథలైయున్నవి. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం మరియు శిష్యుడు, శిష్యులు మరియు ఉపమానము, ఉపమానములు)
భాగము 3: ముఖ్యమైన తర్జుమా ఇబ్బందులు
సంక్షిప్త సువార్తలు అంటే ఏమిటి? మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలను సంక్షిప్త సువార్తలు అం పిలుస్తారు ఎందుకంటే అవి చాలా సారూప్య వాక్య భాగాలను కలిగి ఉన్నాయి. “సంక్షిప్తం అనే మాటకు “ కలిసి చూడటం” అని అర్థం.
రెండు లేక మూడు సువార్తలలోని మాటలు ఒకేలా లేక దాదాపుగా ఒకేలా ఉన్నప్పుడు “సమాంతరంగా” పరిగణించబడతాయి. సమానమైన భాగాలను తర్జుమా చేయునప్పుడు తర్జుమా చేయువారు ఒకే రకమైన మాటలను ఉపయోగించాలి మరియు వాటిని సాధ్యమైనంత సారూప్యత కలిగి ఉండేలా చేయాలి.
యేసు తనను తాను “మనుష్య కుమారుడు” అని ఎందుకు తెలియచేసాడు?
సువార్తలలో యేసు తనను తాను “మనుష్య కుమారుడు” అని పిలుచుకున్నాడు. ఇది దానియేలు 7:13-14 యొక్క సూచనయైయున్నది. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి “మనుష్య కుమారుడు” గా వర్ణించబడ్డాడు. అంటే ఆ వ్యక్తి మనుష్యులవలె కనిపించే వ్యక్తియైయున్నాడు. దేశాలను శాశ్వతంగా పరిపాలించుటకు దేవుడు మనుష్య కుమారునికి అధికారము ఇచ్చాడు. మరియు ప్రజలందరూ ఆయనను శాశ్వతంగా ఆరాధిస్తారు.
యేసు కాలపు యూదులు ఎవరికీ “మనుష్య కుమారుడు” అనే పేరును ఉపయోగించలేదు. అందువలన తాను నిజంగా ఎవరో అని అర్థం చేసుకొనుటకు యేసు తనకు తానూ ఈ పేరును ఉపయోగించుకున్నాడు. (చూడండి: మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు)
”మనుష్య కుమారుడు” అనే పేరును అనేక భాషలలో అనువదిచడం కష్టతరము అవుతుంది. చదువరులు అక్షర అనువాదమును తప్పుగా అర్థం చేసుకోవచ్చు. తర్జుమా చేయువారు “మనుష్యుడైన ఒకడు” వంటి ప్రత్యామ్నాయాలను పరిగణించవచ్చు. పేరును వివరించుటకు ఒక ఫుట్ నోట్ ను చేర్చడం కూడా సహాయపడుతుంది.
తక్కువ వ్యవధిని సూచించే మాటలను మార్కు ఎందుకు తరచుగా ఉపయోగిస్తాడు?
మార్కు సువార్తలో “వెంటనే” అనే మాట నలభైరెండు సార్లు ఉపయోగించబడింది. సంఘటనలను మరింత ఉత్తేజకరమైన మరియు స్పష్టమైనదిగా చేయుటకు మార్కు దీనిని చేస్తాడు. ఇది చదువరిని ఒక సంఘటన నుండి మరొక సంఘటనకు త్వరగా తీసుకువెళ్ళుతుంది.
మార్కు పుస్తకం యొక్క వచనములోని ప్రధాన సమస్యలు ఏమిటి?
క్రింది వచనాలు పరిశుద్ధ గ్రంథము యొక్క పాత తర్జుమాలలో కనుగొనబడ్డాయి కాని ఆధునిక తర్జుమాలలో ఎక్కువగా చెర్చబడలేదు. ఈ వచనాలను అనువదించవద్దని తర్జుమా చేయువారికి సూచించారు. అయినప్పటికీ, తర్జుమా చేయువారి ప్రాంతంలో ఈ వచనాలను కలిగివున్న పరిశుద్ధ గ్రంథం యొక్క పాత తర్జుమాలు ఉంటే, తర్జుమా చేయువారు వాటిని చేర్చవచ్చు. \nఅవి అనువదించబడితే, అవి బహుశా మార్కు సువార్తకు నిజముగా సంబంధించినవి కాదని సూచించడానికి చదరపు బ్రాకెట్లలో [] ఉంచాలి.
- “ఎవరికైనా వినుటకు చెవులు ఉంటె, అతనిని విననివ్వండి.” (7:16)
- “నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు” (9:44)
- “నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు” (9:46)
- మరియు ‘ఆయన నేరము చేసినవారితో లెక్కించబడ్డాడు’ అని చెప్పే లేఖనము నెరవేరింది. (15:28)
ప్రారంభ వ్రాత పుస్తకములలో ఈ క్రింది భాగం కనుగొనబడలేదు. చాలా పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యభాగమును కలిగి ఉన్నాయి కాని ఆధునిక పరిశుద్ధ గ్రంథములు బ్రాకెట్లలో ([]) ఉంచాయి లేక ఈ వాక్య భాగము మార్కు సువార్తకు అసలైనదిగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. తర్జుమా చేయువారు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆధునిక తర్జుమాల మాదిరిగా ఏమైనా చేయమని సలహా ఇస్తారు.
- “వారంలో మొదటి రోజు, ఆయన లేచిన తరువాత, ఆయన మొదట తాను ఏడు దయ్యములను వదలించిన మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు. వారు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి ఆయనతో ఉన్న వారితో చెప్పింది. ఆయన బ్రతికి ఉన్నాడని మరియు ఆమె ఆయనను చూసిందని వారు విన్నారు, కాని వారు నమ్మలేదు. ఈ విషయాల తరువాత ఆయన గ్రామమునకు నడచి వెళ్ళుతున్నప్పుడు వారిలో ఇద్దరికీ వేరే రూపం లో కనిపించాడు. వారు వెళ్లి మిగిలిన శిష్యులకు చెప్పారు, కానీ వారు నమ్మలేదు. యేసు పదకొండు మంది శిష్యులకు బల్ల యెద్ద భోజనం చేస్తూ ఉండగా వారికి కనిపించాడు, మరియు తానూ తిరిగి బ్రతికిన విషయం కొందరు చెప్పినా వారు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం మరియు హృదయ కాఠిణ్యం బట్టి వారిని గద్దించాడు. ఆయన వారితో, సర్వ లోకానికి వెళ్ళి సృష్టిలో అందరికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్ష అనుభవిస్తారు. నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి: వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. క్రొత్త భాషలు మాట్లాడతారు. వారు తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు, విషం తాగినా వారికి ఏ హాని కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగు పడతారు. ప్రభువు వారితో మాట్లాడిన తరువాత, దేవుడు ఆయనను పరలోకమునకు స్వీకరించి, ఆయన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. శిష్యులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రభువును ప్రకటించారు, ప్రభువు వారికి తోడై వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా స్థిరపరచాడు.” (16:9-20)
(చూడండి: మూల గ్రంథం వైవిధ్యాలు)
Mark 1
మర్కు సువార్త 01వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 1:2-3 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దినిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు
“మీరు నన్ను పవిత్ర పరచవచ్చు”
కుష్టురోగం అనేది ఒక వ్యక్తిని అపవిత్రంగా మరియు దేవునిని క్రమముగా ఆరాధించలేని ఒక చర్మ వ్యాధియైయున్నది. ప్రజలను శారీరికంగా “పవిత్రంగా” లేక ఆరోగ్యకరంగా అదే విధంగా ఆధ్యాత్మికంగా “పవిత్రంగా” లేక దేవునితో సరైనదిగా చేయగల సామర్థ్యం యేసు కలిగి ఉన్నాడు. (చూడండి: శుద్ధమైన, కడుగు)
“దేవుని రాజ్యం సమీపంగా ఉంది”
ఈ సమయంలో “దేవుని రాజ్యం” ఉందా లేక ఇంకా వస్తున్నదా అని పండితులు చర్చించారు. ఆంగ్ల తర్జుమాలు తరచూ “చేతిలో” అనే మాటను ఉపయుగిస్తాయి, కాని ఇది తర్జుమా చేయువారికి ఇబ్బందిని కలిగిస్తుంది. ఇతర తర్జుమాలు “వస్తున్నాయి” లేక “దగ్గరకు వచ్చాయి” అనే వాక్యమును ఉపయోగిస్తాయి.
Mark 1:1
యేసు బాప్తిస్మము తీసుకున్న బాప్తిస్మమిచ్చు యోహాను రాక గురించి ప్రవక్తయైన యషయా ముందే చెప్పడంతో మార్కు సువార్త ప్రారంభం అవుతుంది. దీని రచయిత మార్కు, అతను నాలుగు సువార్తలలో మరియ అని చెప్పబడిన మరియ అనే అనేక మంది మహిళలలో ఒకరి కుమారుడైయున్న ఇతనిని యోహాను మార్కు అని కూడా పిలుస్తారు. ఇతను బర్నాబాకు మేనల్లుడు కూడా.
Υἱοῦ Θεοῦ
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 1:2
πρὸ προσώπου σου
ఇది ఒక భాషీయమైయున్నది అంటే “మీ ముందు’’ అని దీని అర్థం. (చూడండి: జాతీయం (నుడికారం))
προσώπου σου…τὴν ὁδόν σου
ఇక్కడ “మీరు” అనే మాట యేసు గురించి తెలియచేస్తుంది మరియు అది ఏకవచనమైయున్నది. మీరు దీనిని తర్జుమా చేయునప్పుడు “మీ” అనే సర్వనామం ఉపయోగించండి ఎందుకంటే ఇది ప్రవక్తనుండి ఉల్లేఖించ బడింది మరియు ఆయన యేసు పేరును ఉపయోగించలేదు. (చూడండి: ‘మీరు’ రూపాలు)
ὃς
ఇది దూత గురించి తెలియచేస్తుంది
κατασκευάσει τὴν ὁδόν σου
ఇలా చేయడం ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధ పరచడం గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాక కోసం ప్రజలను సిద్ధం చేస్తాడు” (చూడండి: రూపకం)
Mark 1:3
φωνὴ βοῶντος ἐν τῇ ἐρήμῳ
దీనిని వాక్యంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నయ తర్జుమా: “అరణ్యములో ఒకరు పిలిచే కేక వినబడుతుంది” లేక “అరణ్యములో ఎవరో పిలిచే శబ్దమును వారు వింటారు”
ἑτοιμάσατε τὴν ὁδὸν Κυρίου, εὐθείας ποιεῖτε τὰς τρίβους αὐτοῦ
ఈ రెండు వాక్య భాగములు ఒకే విషయమైయున్నవి. (చూడండి: సమాంతరత)
ἑτοιμάσατε τὴν ὁδὸν Κυρίου
ప్రభువు మార్గం సిద్ధం చేయండి. ఇలా చేయటం వలన ఆయన వచ్చినప్పుడు ప్రభువు సందేశము సిద్ధముగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రజలు తమ పాపములకు పశ్చాత్తాపం పొందడం ద్వారా దీనిని చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను వచ్చినప్పుడు ప్రభువు సందేశమును వినుటకు సిద్ధపరచండి” లేక “పశ్చాత్తాపపడి ప్రభు రాకకు సిద్ధంగా ఉండండి” (చూడండి: రూపకం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 1:4
ఈ వచనాలలో “అతను,” అతనిని” మరియు “అతని యొక్క” మాటలు యోహాను గురించి తెలియచేస్తాయి.
ἐγένετο Ἰωάννης
మునుపటి వచనంలో యషయా ప్రవక్త చెప్పిన దూత యోహాను అని మీ చదువరి అర్థం చేసుకున్నాడని నిర్ధారించుకోండి.
Mark 1:5
πᾶσα ἡ Ἰουδαία χώρα καὶ οἱ Ἱεροσολυμεῖται πάντες
“మొత్తం ప్రాంతం” అనే మాటలు ప్రాంతంలో నివసించే ప్రజలకు ఒక రూపకఅలంకారమైయున్నది మరియు ప్రతి ఒక వ్యక్తికీ కాకుండా, చాలా మంది వ్యక్తులను గురించి తెలియచేసే సాధారణికరణయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా మరియు యేరుషలేము నుండి చాలా మంది” (చూడండి: రూపకం మరియు అతిశయోక్తి)
ἐβαπτίζοντο ὑπ’ αὐτοῦ ἐν τῷ Ἰορδάνῃ ποταμῷ, ἐξομολογούμενοι τὰς ἁμαρτίας αὐτῶν
వారు ఒకే సమయములో ఈ పనులు చేసారు. ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాపపడినందున వారు బాప్తిస్మము పొందారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చేసిన పాపాలకు పశ్చాత్తాపపడినప్పుడు, యోహాను వారికి యోర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 1:7
ἐκήρυσσεν
యోహాను ప్రకటించాడు
οὗ οὐκ εἰμὶ ἱκανὸς, κύψας λῦσαι τὸν ἱμάντα τῶν ὑποδημάτων αὐτοῦ
యేసు ఎంత గొప్పవాడో చూపించుటకు యోహాను తనను ఒక సేవకుడితో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చెప్పులు విప్పే అణుకువగల పని చేయుటకు కూడా నేను తగను” (చూడండి: రూపకం)
τὸν ἱμάντα τῶν ὑποδημάτων αὐτοῦ
యేసు భూమియందు ఉన్న సమయంలో తరచూ తోలుతో తయారు చేసిన చెప్పులను ధరిస్తారు మరియు తోలు పట్టిలతో వారి పాదాలను కట్టారు.
κύψας
వంగు
Mark 1:8
αὐτὸς δὲ βαπτίσει ὑμᾶς ἐν Πνεύματι Ἁγίῳ
ఈ రూపకఅలంకారము యోహాను యొక్క నీటి బాప్తిస్మమును భవిష్యత్తులోని పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో పోలుస్తుంది. దీని అర్థం యోహాను యొక్క బాప్తిస్మము వారి పాపాలను ప్రతీకాత్మకంగా పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ప్రజలను వారి పాపాల నుండి నిజంగా పవిత్రపరుస్తుంది. వీలైతే రెండిటి మధ్య పోలికను ఉంచుటకు మీరు యోహాను యొక్క బాప్తిస్మము కొరకు ఉపయోగించిన “బాప్తిస్మము” అనే అదే మాటను ఉపయోగించండి. (చూడండి: రూపకం)
Mark 1:9
ἐγένετο ἐν ἐκείναις ταῖς ἡμέραις
ఇది కథాంశంలోని క్రొత్త సంఘటన ప్రారంభమును సూచించుచున్నది. (చూడండి: కొత్త సంఘటన)
ἐβαπτίσθη…ὑπὸ Ἰωάννου
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహాను ఆయనకు బాప్తిస్మము ఇచ్చాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 1:10
τὸ Πνεῦμα ὡς περιστερὰν καταβαῖνον ἐπ’ αὐτόν
సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది ఒక ఉపమాలంకారము, మరియు ఒక పావురం ఆకాశం నుండి భూమి వైపుకు దిగుతున్నట్లుగా ఆత్మ యేసు పైకి దిగి వచ్చింది లేక 2) ఆత్మ యేసు పైకి దిగినప్పుడు అక్షరాలా పావురం వలే కనిపించింది. (చూడండి: ఉపమ)
Mark 1:11
φωνὴ ἐγένετο ἐκ τῶν οὐρανῶν
ఇది దేవుడు మాట్లాడుటను గురించి తెలియచేస్తుంది. కొన్ని సార్లు ప్రజలు దేవుని గౌరవంచడం వలన నేరుగా ఆయనను ప్రస్తావించకుండా ఉంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడు” (చూడండి: అన్యాపదేశము మరియు సభ్యోక్తి)
ὁ Υἱός…ὁ ἀγαπητός
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. ఆయన పట్ల దేవునికున్న శాశ్వతమైన ప్రేమ కారణంగా తండ్రి యేసును తన “ప్రియమైన కుమారుడు” అని పిలుస్తాడు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 1:12
యేసు బాప్తిస్మము తీసుకున్న తరువాత, ఆయన 40 రోజులు అరణ్యములో ఉన్నాడు తరువాత తన శిష్యులకు బోధించుటకు మరియు వారని పిలచుటకు గలిలయకు వెళ్తాడు.
αὐτὸν ἐκβάλλει
యేసును బయటకు వెళ్ళమని బలవంతం చేసాడు
Mark 1:13
ἦν ἐν τῇ ἐρήμῳ
ఆయన అరణ్యములోనే ఉన్నాడు
τεσσεράκοντα ἡμέρας
40 రోజులు (చూడండి : సంఖ్యలు)
ἦν μετὰ
ఆయన వారిలో ఉన్నాడు
Mark 1:14
μετὰ…τὸ παραδοθῆναι τὸν Ἰωάννην
యోహానును చెరసాలలో వేసిన తరువాత. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యోహానును బంధించిన తరువాత” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κηρύσσων τὸ εὐαγγέλιον
సువార్త గురించి చాలా మందికి చెప్పడం
Mark 1:15
πεπλήρωται ὁ καιρὸς
కాలం సమీపించింది
ἤγγικεν ἡ Βασιλεία τοῦ Θεοῦ
దేవుడు తన ప్రజలను పరిపాలించుట ప్రారంభించుటకు దాదాపుగా సమయం దగ్గర పడింది
Mark 1:16
εἶδεν Σίμωνα καὶ Ἀνδρέαν
యేసు సీమోను మరియు అంద్రెయలను చూసాడు
ἀμφιβάλλοντας ἐν τῇ θαλάσσῃ
ఈ వివరణ యొక్క పూర్తి అర్థమును స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేపలను పట్టుకొనుటకు నీటిలో వల వేయటం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 1:17
δεῦτε ὀπίσω μου
నన్ను అనుసరించండి లేక “నాతో రండి”
ποιήσω ὑμᾶς γενέσθαι ἁλιεῖς ἀνθρώπων
ఈ రూపకఅలంకారము అంటే సీమోను మరియు అంద్రెయ దేవుని నిజమైన సందేశమును ప్రజలకు బోధిస్తారు, కాబట్టి ఇతరులు కూడా యేసును అనుసరిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేపలను సేకరించినట్లు నా కొరకు మనుష్యులను సేకరించుట నేను మీకు నేర్పుతాను” (చూడండి:రూపకం)
Mark 1:19
ἐν τῷ πλοίῳ
ఈ పడవ యాకోబు మరియు యోహానులకు సంబంధించినదని ఉహించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి పడవలో” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καταρτίζοντας τὰ δίκτυα
వలలను బాగు చేయటం
Mark 1:20
ἐκάλεσεν αὐτούς
ఇది యాకోబు మరియు యోహానులను ఎందుకు పిలిచాడో స్పష్టంగా చెప్పుటకు సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన వెంట రమ్మని వారిని పిలిచాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τῶν μισθωτῶν
వారి కోసం పనిచేసిన సేవకులు
ἀπῆλθον ὀπίσω αὐτοῦ
యాకోబు మరియు యోహాను యేసుతో వెళ్ళారు
Mark 1:21
యేసు విశ్రాంతి దినాన కపెర్నహుము అనే పట్టణములోని సమాజ మందిరములో బోధిస్తాడు. ఒక మనిషి నుండి దయ్యమును వెళ్ళగొట్టడం ద్వారా ఆయన గలిలయ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను ఆశ్చర్య పరుస్తాడు.
εἰσπορεύονται εἰς Καφαρναούμ
కపెర్నహుముకు వచ్చారు
Mark 1:22
ἦν γὰρ διδάσκων αὐτοὺς ὡς ἐξουσίαν ἔχων, καὶ οὐχ ὡς οἱ γραμματεῖς
“అధికారం కలిగిన వ్యక్తి” మరియు “శాస్త్రుల” గురించి మాట్లాడునప్పుడు “బోధించు” అనే ఆలోచన స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారికి అధికారం కలిగిన వారిలాగా బోధించాడు కాని శాస్త్రులు బోధించినట్లుగా బోధించలేదు” (చూడండి: శబ్దలోపం)
Mark 1:24
τί ἡμῖν καὶ σοί, Ἰησοῦ Ναζαρηνέ?
దయ్యాలు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుతాయి అంటే వాటిని అడ్డగించుటకు ఎటువంటి కారణం లేదు మరియు అవి వాటిని విడచిపెట్టాలని అవి కోరుకుంటాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నజరేతువాడవైన యేసూ, మాతో మీకేమి పని! మమ్మును ఒంటరిగా వదలివేయండి. (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἦλθες ἀπολέσαι ἡμᾶς
తమకు హాని చేయవద్దని యేసును కోరుటకు దయ్యాలు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్మల్ని నాశనం చేయవద్దు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 1:26
σπαράξαν αὐτὸν
ఇక్కడ “అతడు” అనే మాట దయ్యము పట్టిన వ్యక్తిని గురించి తెలియచేస్తుంది.
φωνῆσαν φωνῇ μεγάλῃ
ఏడుస్తున్నది మనిషిలో ఉన్న దయ్యం కాని మనిషి కాదు.
Mark 1:27
συνζητεῖν πρὸς αὐτοὺς λέγοντας, τί ἐστιν τοῦτο? διδαχὴ καινή κατ’ ἐξουσίαν!…ὑπακούουσιν αὐτῷ!
ప్రజలు రెండు ప్రశ్నలు ఉపయోగించి వారు ఎంత ఆశ్చర్య పోయారో చూపించారు. ప్రశ్నలను ఆశ్చర్యార్థకాలుగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒకరినొకరు ‘ఇది అద్భుతమైనది! ఆయన కొత్త ఉపదేశమును ఇస్తాడు మరియు ఆయన అధికారంతో మాట్లాడతాడు! ... మరియు ఆయనకు అవి లొంగుతున్నాయి!’” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐπιτάσσει
“ఆయన” అనే మాట యేసును గురించి తెలియచేస్తుంది.
Mark 1:29
దయ్యాల బారిన పడిన వ్యక్తిని స్వస్థపరచిన తరువాత, యేసు సిమోను అత్తగారిని మరియు అనేక మంది ప్రజలను స్వస్థపరచాడు.
Mark 1:30
ἡ δὲ πενθερὰ Σίμωνος κατέκειτο πυρέσσουσα
“ఇప్పుడు” అనే మాట సిమోను యొక్క అత్తగారిని కథకు పరిచయం చేస్తుంది మరియు ఆమె గురించి సందర్భ సమాచారామును ఇస్తుంది. (చూడండి: పాలు పంచుకొనే పాత వారూ, కొత్త వారి గురించిన పరిచయం)
Mark 1:31
ἤγειρεν αὐτὴν
ఆమె నిలువబడుటకు కారణమైంది లేక ‘ఆమె మంచము నుండి లేవగలిగింది”
ἀφῆκεν αὐτὴν ὁ πυρετός
ఆమెను ఎవరు స్వస్థపరచారో మీరు స్పష్టంగా చెప్పాలనుకోవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు జ్వరం నుండి ఆమెను స్వస్థపరచాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
διηκόνει αὐτοῖς
ఆమె ఆహారమును వడ్డించిందని మీరు స్పష్టంగా చెప్పాలనుకోవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె వారికి ఆహారము మరియు పానీయాలను అందించింది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 1:32
ఇక్కడ “ఆయనను” మరియు “ఆయన” అనే మాటలు యేసును గురించి తెలియచేస్తున్నాయి
πάντας τοὺς κακῶς ἔχοντας καὶ τοὺς δαιμονιζομένους
“అన్ని” అనే మాట అధిక సంఖ్యలో వచ్చిన ప్రజల గురించి నొక్కి చెప్పుట అతిశయోక్తియైయున్నది. ప్రత్యమ్నాయ తర్జుమా: “రోగులు లేక దయ్యం పట్టిన చాలా మంది” (చూడండి: అతిశయోక్తి)
Mark 1:33
ἦν ὅλη ἡ πόλις ἐπισυνηγμένη πρὸς τὴν θύραν
“పట్టణం” అనే మాట పట్టణంలో నివసించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ఇక్కడ “సమస్తమైన” అనే మాట పట్టణం నుండి చాలా మంది ప్రజలు గుమిగూడారని నొక్కి చెప్పుటకు సాధారణీకరణయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ పట్టణం నుండి చాలా మంది తలుపు బయట గుమిగూడారు” (చూడండి: అన్యాపదేశము మరియు అతిశయోక్తి)
Mark 1:35
ఇక్కడ “ఆయన” మరియు “ఆయనను” అనే మాటలు యేసును గురించి తెలియచేస్తున్నాయి
ప్రజలను స్వస్థపరిచే సమయ౦లో యేసు ప్రార్థన చేయడానికి సమయ౦ తీసుకుంటాడు. తరువాత ఆయన బోధించుటకు, స్వస్థపరచుటకు మరియు దయ్యములను వెళ్ళగొట్టుటకు గలిలయలోని పట్టణాలకు వెళ్ళును.
ἔρημον τόπον
ఆయన ఒంటరిగా ఉండగల ప్రదేశం
Mark 1:36
Σίμων καὶ οἱ μετ’ αὐτοῦ
ఇక్కడ “అతను” అనేది సీమోను గురించి తెలియచేస్తుంది. అలాగే అతనితో పాటు అంద్రెయ, యాకోబు, యోహాను మరియు ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు.
Mark 1:37
πάντες ζητοῦσίν σε
“అందరూ” అనే మాట యేసును వెతుకుతున్న చాలా మంది వ్యక్తులను గురించి నొక్కి చెప్పుట అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా మంది మీ కోసం వెతుకుతున్నారు” (చూడండి: అతిశయోక్తి)
Mark 1:38
ఇక్కడ “ఆయన” మరియు “నేను” అనే మాటలు యేసును గురించి తెలియచేస్తున్నాయి.
ἄγωμεν ἀλλαχοῦ
మనం వేరే ప్రాంతాలకు వెళ్ళాలి. ఇక్కడ యేసు సీమోను, అంద్రెయ, యోకోబు మరియు యోహానులతో పాటు తన గురించి తాను తెలియచేయుటకు “మాకు” అనే మాటను ఉపయోగిస్తాడు.
Mark 1:39
ἦλθεν…εἰς ὅλην τὴν Γαλιλαίαν
“అన్నిటిలోనూ” అనే మాటలు యేసు తన పరిచర్యలో ఎక్కువ ప్రాంతాలకు వెళ్ళాడని నొక్కి చెప్పుటకు అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన గలిలయలోని చాలా ప్రాంతాలకు వెళ్ళాడు” (చూడండి: అతిశయోక్తి)
Mark 1:40
ἔρχεται πρὸς αὐτὸν λεπρὸς, παρακαλῶν αὐτὸν καὶ γονυπετῶν λέγων αὐτῷ
ఒక కుష్ఠురోగి యేసు దగ్గరకు వచ్చాడు. అతను మోకరిల్లి యేసును వేడుకుంటున్నాడు
ἐὰν θέλῃς, δύνασαί με καθαρίσαι
మొదటి వాక్యభాగంలోని “నన్ను బాగుచేయుట” అనే మాటలు రెండవ వాక్యభాగం వలన అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను బాగు చేయుట నీకిష్టమైతే, అప్పుడు నీవు నన్ను బాగు చేయవచ్చు” (చూడండి: శబ్దలోపం)
θέλῃς
అక్కర లేక “కోరిక”
δύνασαί με καθαρίσαι
పరిశుద్ధ గ్రంథము యొక్క కాలంలో కొని చర్మ వ్యాధులు ఉన్న వ్యక్తి తన చర్మం తగినంతగా స్వస్థత నొందేవరకు అపవిత్రంగా భావించబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను స్వస్థపరచవచ్చు” (చూడండి: రూపకం)
Mark 1:41
σπλαγχνισθεὶς
ఇక్కడ “కదలిన” అనే మాట మరొకరి అవసరం గురించి భావోద్వేగమును అనుసరించుటకు ఒక భాషీయ అర్థమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు, అతనిపై జాలిపడి” లేక “ఆ మనిషి పట్ల జాలిని అనుభవించాడు కాబట్టి ఆయన స్వస్థపరచాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
θέλω
ఇది యేసు ఏమి చేయుటకు ఇష్టపడుతున్నాడో చెప్పుటకు సహాయ పడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను బాగు చేయటం నాకిష్టమే స్వస్థత పొందు” (చూడండి: శబ్దలోపం)
Mark 1:43
ఇక్కడ ఉపయోగించిన “అతనిని” అనే మాట యేసు స్వస్థపరచిన కుష్ఠురోగిని గురించి తెలియచేస్తుంది.
Mark 1:44
ὅρα μηδενὶ, μηδὲν εἴπῃς
ఎవరితోనూ ఏమియూ చెప్పవద్దు సుమా
σεαυτὸν δεῖξον τῷ ἱερεῖ
తన కుష్ఠురోగిం నిజంగా పోయిందా అని యాజకుడు తన చర్మం వైపు చూసేలా తనను తాను యాజకునికి కనపరచుమని యేసు చెప్పారు. ప్రజలు అపవిత్రంగా ఉంటే తమను యాజకులకు చూపించాలని మోషే ధర్మశాస్త్రం కోరింది అయితే ఇక అపవిత్రత లేదు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
σεαυτὸν δεῖξον
ఇక్కడ “నిన్నే” అనే మాట కుష్ఠురోగి చర్మమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ చర్మమును చూపించు” (చూడండి: ఉపలక్షణము)
μαρτύριον αὐτοῖς
వీలైతే, మీ భాషలో “వాటిని” అనే సర్వనామం ఉపయోగించడం మంచిది సాధ్యమయ్యే అర్థాలు 1) “యాజకులకు సాక్ష్యం ఇవ్వాలి లేక 2) “ప్రజలకు సాక్ష్యం ఇవ్వాలి.”
Mark 1:45
ὁ δὲ ἐξελθὼν
“అతను” అనే మాట యేసు స్వస్థపరచిన వ్యక్తిని గురించి తెలియచేస్తుంది.
ἤρξατο…διαφημίζειν τὸν λόγον
ఇక్కడ “వార్తలను అధికముగా చాటించుట” అనేది జరిగిన విషయమును గురించి చాలా చోట్ల ప్రజలకు చెప్పుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు చేసిన దాని గురించి అనేక ప్రాంతాల ప్రజలకు చెప్పడం ప్రారంభించాడు” (చూడండి: రూపకం)
ὥστε
ఆ వ్యక్తి ఈ విషయమును ఎంతగానో చాటించాడు
ὥστε μηκέτι αὐτὸν δύνασθαι φανερῶς εἰς πόλιν εἰσελθεῖν
ఆ మనిషి ఈ విషయమును అంతగా చాటించిన ఫలితం ఇది. ఇక్కడ “బాహాటముగా” అనేది “బహిరంగముగా” అనేదానికి ఒక రూపకఅలంకారమైయున్నది. యేసు పట్టణములలోనికి ప్రవేశించలేక పోయాడు ఎందుకంటే ఆయన చుట్టూ చాలా మంది గుమిగూడారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ఇకపై ఆ పట్టణములోనికి బహిరంగముగా ప్రవేశించలేదు” లేక “యేసు ఇకపై చాలా మంది ప్రజలు చూసే విధంగా పట్టణములలోకి ప్రవేశించలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐρήμοις τόποις
ఒంటరి ప్రదేశాలు లేక “నిర్జన ప్రదేశాలు”
πάντοθεν
“ప్రతిచోట” అనే మాట ప్రజలు వచ్చిన అనేక ప్రాంతాల గురించి నొక్కిచెప్పుటకు ఉపయోగించే అతిశయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని ప్రాంతాల నుండి” (చూడండి: అతిశయోక్తి)
Mark 2
మర్కు సువార్త 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
“పాపులు”
యేసు కాలపు ప్రజలు పాపుల గురించి మాట్లాడినప్పుడు, వారు మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపని దొంగతనం లేక లైంగిక పాపాలవంటి పాపాలకు పాల్పడిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. తాను “పాపులను’’ పిలచుటకు వచ్చానని యేసు చెప్పినప్పుడు తాము పాపులమని నమ్మే వ్యక్తులు మాత్రమే తన శిష్యులు కాగలరని ఆయన అర్థం. చాలా మంది ప్రజలు తాము “పాపులు” అని భావించకపోయినా ఇది నిజం. (చూడండి: పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఉపవాసం మరియు విందు
ప్రజలు విచారంగా ఉన్నప్పుడు లేక దేవునికి తమ పాపాల గురించి క్షమాపణ చూపిస్తున్నప్పుడు ప్రజలు ఉపవాసం చేస్తారు లేక ఎక్కువ సేపు ఆహారం తినరు. వారు సంతోషంగా ఉన్నప్పుడు వివాహాల మాదిరిగానే వారు విందులు లేక భోజనం చేస్తారు, అక్కడ వారు ఎక్కువ ఆహారం తింటారు. (చూడండి: ఉపవాసం, ఉపవాసం ఉండడం)
\nఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
అలంకారిక ప్రశ్నలు
యేసు చెప్పిన మరియు చేసిన పనుల వలన యూదు నాయకులు కోపంగా ఉన్నారని మరియు అయన దేవుని కుమారుడని వారు నమ్మలేదని చూపించుటకు వారు అలంకారిక ప్రశ్నలను ఉపయోగించారు. (మార్కు 2:7). యూదు నాయకులు ఆహంకారులని చూపించుటకు యేసు వాటిని ఉపయోగించాడు (మార్కు 2:25-26). (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 2:1
గలిలయ అంతట బోధించి ప్రజలను స్వస్థపరచిన తరువాత, యేసు కపెర్నహుముకు తిరిగి వస్తాడు అక్కడ పక్షవాత రోగిని స్వస్థపరచి అతని పాపమును క్షమించాడు.
ἠκούσθη ὅτι ἐν οἴκῳ ἐστίν
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన అతని ఇంట్లో ఉంటున్నట్లు అక్కడి ప్రజలు విన్నారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 2:2
καὶ συνήχθησαν πολλοὶ
“అక్కడ” అనే మాట యేసు కపెర్నహుములో బస చేసిన ఇంటిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయా తర్జుమా: “చాలా మంది గుమిగూడారు” లేక “చాలా మంది ఇంటికి వచ్చారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μηκέτι χωρεῖν, μηδὲ τὰ
ఇది ఇంటి లోపల స్థలం లేదని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోపల వారికి ఎక్కువ చోటు లేదు’’ (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐλάλει αὐτοῖς τὸν λόγον
యేసు తన ఉపదేశమును వారితో చెప్పాడు
Mark 2:3
αἰρόμενον ὑπὸ τεσσάρων
వారిలో నలుగురు అతనిని మోస్తున్నారు. ఆ సమయంలో నలుగురికంటే ఎక్కువ వ్యక్తులు ఆ వ్యక్తిని యేసుని యొద్దకు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.
φέροντες…παραλυτικὸν
నడవలేని లేక చేతులు ఉపయోగించలేని వ్యక్తిని తీసుకువస్తున్నారు
Mark 2:4
μὴ δυνάμενοι προσενέγκαι αὐτῷ
యేసు ఉన్న చోటికి చేరుకోలేకపోయారు
ἀπεστέγασαν τὴν στέγην…χαλῶσι
యేసు నివసించిన ఇల్లులు మట్టితో చేసిన చదునైన పైకప్పులు మరియు పలకలతో కప్పబడి ఉన్నాయి. పైకప్పులో సందు చేసే విధానమును స్పష్టంగా వివరించవచ్చు లేక మరింత సామాన్యమైనదిగా చేయవచ్చు తద్వారా ఇది మీ భాషలో అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసు ఉన్న చోట పైకప్పు భాగం నుండి పలకలను తొలగించారు. మరియు మట్టి పైకప్పు గుండా త్రవ్వినప్పుడు, వారు అతనిని దించారు లేక “వారు యేసు ఉన్న చోట పైకప్పులో సందు చేసారు తరువాత అతనిని దించారు”
Mark 2:5
ἰδὼν…τὴν πίστιν αὐτῶν
ఆ మనుష్యుల విశ్వాసమును చూసి. సాధ్యమయ్యే అర్థాలు 1) పక్షవాత మనిషిని మోసిన మనుష్యులు మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారు లేక 2) పక్షవాత మనిషి మరియు అతనిని మోసుకొని వచ్చిన మనుష్యులందరూ విశ్వాసం కలిగి ఉన్నారు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τέκνον
ఇక్కడ “కుమారుడా” అనే మాట తండ్రి కుమారుని చూసుకున్నట్లు యేసు ఆ మనిషిని చూసాడని చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కుమారుడా” (చూడండి: రూపకం)
ἀφέωνται σου αἱ ἁμαρτίαι
వీలైతే మనిషి చేసిన పాపాలను ఎవరు క్షమించారో యేసు స్పష్టంగా చెప్పని విధంగా దీనిని తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ పాపములు తొలగిపోయాయి” లేక “నీ యొక్క పాపముల కొరకు చెల్లించాల్సిన అవసరం లేదు” లేక “నీ పాపములు నీకు వ్యతిరేకంగా లెక్కింపబడవు”
Mark 2:6
διαλογιζόμενοι ἐν ταῖς καρδίαις αὐτῶν
ఇక్కడ “వారి హృదయాలు” అనేది ప్రజల ఆలోచనలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ గురించి తాము ఆలోచిస్తున్నారు. (చూడండి: అన్యాపదేశము)
Mark 2:7
τί οὗτος οὕτως λαλεῖ?
“నీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పినప్పుడు వారి కోపమును చూపించుటకు శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషి ఈ విధంగా మాట్లాడకూడదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τίς δύναται ἀφιέναι ἁμαρτίας, εἰ μὴ εἷς ὁ Θεός
దేవుడు మాత్రమే పాపాములను క్షమించగలడు కాబట్టి “మీ పాపములు క్షమించబడ్డాయి” అని యేసు చెప్పకూడదని శాస్త్రులు ఈ ప్రశ్నను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాత్రమే పాపములను క్షమించగలడు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 2:8
τῷ πνεύματι αὐτοῦ
తన అంతరంగములో లేక “తనలో”
διαλογίζονται ἐν ἑαυτοῖς
ప్రతి ధర్మశాస్త్ర పండితుడు (శాస్త్రులు) తనలో తానూ ఆలోచిస్తూ ఉండేవాడు; వారు ఒకరితో ఒకరు మాట్లాడుట లేదు.
τί ταῦτα διαλογίζεσθε ἐν ταῖς καρδίαις ὑμῶν
యేసు ఈ ప్రశ్నను శాస్త్రులకు వారు అనుకున్నది తప్పు అని చెప్పుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆలోచిస్తున్నది తప్పు” లేక “నేను దైవ దూషణ చేస్తున్నానని అనుకోకండి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ταῦτα…ἐν ταῖς καρδίαις ὑμῶν
“హృదయాలు” అనే మాట వారి అంతరంగ ఆలోచనలు మరియు కోరికలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మీ లోపల” లేక “ఈ విషయాలు” (చూడండి: అన్యాపదేశము)
Mark 2:9
τί ἐστιν εὐκοπώτερον, εἰπεῖν τῷ παραλυτικῷ…ἆρον τὸν κράβαττόν σου καὶ περιπάτει?
శాస్త్రులు నిజంగా పాపములను క్షమించగలడా లేదా అని నిరూపించగల దాని గురించి ఆలోచించేలా చేయుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆ పక్షవాత రోగితో ‘నీ పాపములు క్షమించబడ్డాయి అని ఇప్పుడే చెప్పాను.’ లేచి నీ పడక ఎత్తుకొని నడువు అని చెప్పడం కష్టమని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నేను అతనిని స్వస్థపరచగలనా లేదా అనే దానికి రుజువు అతను లేచి నడుస్తాడో లేదో అని చూపిస్తుంది.” లేక “పక్షవాత రోగిని ‘నీ పాపములు క్షమించబడ్డాయి’ అని చెప్పడం కంటే ‘లేచి నీ పడక ఎత్తుకొని నడువు’ అని చెప్పడం చాలా సులభమని మీరు అనుకోవచ్చు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 2:10
ἵνα δὲ εἰδῆτε
కాని మీరు తెలుసుకోవాలి. “మీరు” అనే మాట ధర్మశాస్త్ర పండితులను మరియు జనసమూహమును గురించి తెలియచేస్తుంది.
ὅτι ἐξουσίαν ἔχει ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου
యేసు తనను తానూ “మనుష్యకుమారుడు” అని తెలియచేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనుష్యకుమారున్ని మరియు నాకు అధికారం ఉంది” (చూడండి: ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
Mark 2:12
ἔμπροσθεν πάντων
అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు
Mark 2:13
యేసు గలిలయ సముద్ర ప్రక్కన ఉన్న ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు మరియు తనను అనుసరించమని లేవిని పిలుస్తాడు.
τὴν θάλασσαν
ఇది గలిలయ సముద్రం, దీనిని గన్నేసరేతు సరస్సు అని కూడా పిలుస్తారు.
ὁ ὄχλος ἤρχετο πρὸς αὐτόν
ప్రజలు ఆయన ఉన్న చోటికి వెళ్లారు
Mark 2:14
Λευεὶν τὸν τοῦ Ἁλφαίου
అల్ఫయి లేవి తండ్రి. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 2:15
ఇది ఇప్పుడు తరువాత రోజు, మరియు యేసు భోజనమునకు లేవి ఇంట్లో ఉన్నాడు.
τῇ οἰκίᾳ αὐτοῦ
లేవి యొక్క నివాసము
ἁμαρτωλοὶ
మోషే ధర్మశాస్త్ర౦ పాటి౦చని ప్రజలు, కానీ ఇతరులు అనుకున్నది చాలా చెడ్డ పాపాలు అని భావించిన వ్యక్తులు
ἦσαν γὰρ πολλοὶ, καὶ ἠκολούθουν αὐτῷ
సాధ్యమయ్యే అర్థాలు 1) “యేసును వెంబడించిన వారిలో చాలా మంది పన్ను వసూలు చేసేవారు మరియు పాపులు ఉన్నారు” లేక 2) “యేసుకు చాలా మంది శిష్యులు ఉన్నారు మరియు వారు ఆయనను వెంబడించారు.”
Mark 2:16
μετὰ τῶν τελωνῶν καὶ ἁμαρτωλῶν ἐσθίει?
యేసు అతిథి సత్కారమును తాము అంగీకరించలేదని చూపించుటకు శాస్త్రులు మరియు పరిసయ్యులు ఈ ప్రశ్న అడిగారు. దీనిని ప్రకటనగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పాపులతో మరియు పన్ను వసూలు చేసేవారితో భోజనం చేయకూడదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 2:17
పన్ను వసూలు చేసేవారితో మరియు పాపులతో తినడం గురించి శాస్త్రులు తన శిష్యులతో చెప్పిన దానికి యేసు స్పందిస్తాడు.
λέγει αὐτοῖς
ఆయన శాస్త్రులతో చెప్పాడు
οὐ χρείαν ἔχουσιν οἱ ἰσχύοντες ἰατροῦ, ἀλλ’ οἱ κακῶς ἔχοντες
వారు పాపులమని తెలుసిన వారు మాత్రమే యేసు తమకు అవసరమని తెలుసుకుంటారు అని అనారోగ్యంతో ఉన్నవారి గురించి మరియు వైద్యుల గురించి యేసు ఈ సామెతను ఉపయోగించాడు. (చూడండి: సామెతలు)
ἰσχύοντες
ఆరోగ్యంగా
οὐκ ἦλθον καλέσαι δικαίους, ἀλλὰ ἁμαρτωλούς
సహాయం కోరుకునే వారి కోసం తాను వచ్చానని తన శ్రోతలు అర్థం చేసుకోవాలని యేసు ఆశిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాపులమని అర్థం చేసుకున్న వ్యక్తుల గురించి నేను వచ్చాను కానీ తాము నీతిమంతులని నమ్మే వ్యక్తుల గురించి కాదు” (చూడండి: వ్యంగ్యోక్తి)
ἀλλὰ ἁμαρτωλούς
“నేను పిలువడానికి వచ్చాను” అనే మాటలు దీనికి ముందున్న వాక్యభాగం నుండి అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని నేను పాపాత్ములను పిలవడానికి వచ్చాను” (చూడండి: శబ్దలోపం)
Mark 2:18
యేసు తన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు ఉపవాసం చేయకూడదో చూపించుటకు ఉపమానాలను చెపుతాడు. (చూడండి: ఉపమానాలు)
οἱ Φαρισαῖοι νηστεύοντες…οἱ μαθηταὶ τῶν Φαρισαίων
ఈ రెండు వాక్యభాగాలు ఒకే వ్యక్తుల సమూహమును గురించి తెలియ చేస్తాయి కాని రెండవది మరింత నిర్దిష్టంగా ఉంటుంది. ఇద్దరూ పరిసయ్యుల మత అనుచరులను గురించి తెలియచేస్తారు కాని వారు పరిసయ్యుల నాయకుల పై దృష్టి పెట్టరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉన్నారు ... పరిసయ్యుల శిష్యులు”
ἔρχονται
కొందరు మనుష్యులు. ఈ మనుష్యులు ఎవరో ఖచ్చితంగా చెప్పకుండా ఈ వాక్యభాగమును అనువదించడం మంచిది. మీ భాషలో మీరు మరింత నిర్దిష్టంగా ఉండాలి, సాధ్యమయ్యే అర్థాలు 1) ఈ మనుష్యులు యోహాను శిష్యులలో లేక పరిసయ్యుల శిష్యులలో లేరు. లేక 2) ఈ మనుష్యులు యోహాను శిష్యులలో ఉన్నారు.
ἔρχονται καὶ λέγουσιν αὐτῷ
వచ్చి యేసుతో అన్నాడు
Mark 2:19
μὴ δύνανται οἱ υἱοὶ τοῦ νυμφῶνος ἐν ᾧ ὁ νυμφίος μετ’ αὐτῶν ἐστιν νηστεύειν?
యేసు ఈ ప్రశ్నను ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాలను జ్ఞాపకం చేయుటకు మరియు దానిని తనకు మరియు తన శిష్యులకు వర్తింప చేయుటకు వారిని ప్రోత్సహించుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెళ్ళి కొడుకు వారితో ఉన్నప్పుడు వివాహ పరిచారకులు ఉపవాసం ఉండరు బదలుగా వారు పండుగ చేస్తారు మరియు విందు చేస్తారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 2:20
ἀπαρθῇ…ὁ νυμφίος
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెళ్ళి కొడుకు వెళ్ళిపోతాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀπαρθῇ ἀπ’ αὐτῶν…νηστεύσουσιν
“వారిని” మరియు “వారు” అనే మాట వివాహ పరిచారకుల గురించి తెలియచేస్తుంది.
Mark 2:21
οὐδεὶς ἐπίβλημα ῥάκους ἀγνάφου ἐπιράπτει ἐπὶ ἱμάτιον παλαιόν
పాత బట్టపై క్రొత్త బట్ట యొక్క భాగమును కుట్టటం వలన క్రొత్త బట్ట ముక్క ఇంకా ముడుచుకొనకపోతే పాత వస్త్రం పై రంద్రం మరింత దిగజారిపోతుంది. క్రొత్త బట్ట మరియు పాత బట్ట రెండు పాడై పోతాయి. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 2:22
యేసు మరొక ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఇది క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోకి కాకుండా పాత తిత్తులలోకి పోయడం గురించి వ్రాయబడింది. (చూడండి: ఉపమానాలు)
οἶνον νέον
ద్రాక్షారసం. ఇది ఇంకా పులియబెట్టని ద్రాక్షారసము గురించి తెలియచేస్తుంది. మీ ప్రాంతంలో ద్రాక్షాలు తెలియకపోతే పండ్లరసం కోసం సాధారణ పదమును ఉపయోగించండి.
ἀσκοὺς παλαιούς
ఇది చాలా సార్లు ఉపయోగించిన తిత్తులను గురించి తెలియచేస్తుంది.
ἀσκοὺς
ఇవి జంతువుల చర్మములతో తయారు చేసిన సంచులైయున్నవి. వాటిని “ద్రాక్షారస తిత్తులు” లేక “చర్మపు తిత్తులు” అని కూడా పిలుస్తారు.
ῥήξει ὁ οἶνος τοὺς ἀσκούς
క్రొత్త ద్రాక్షారాసము పులియబెట్టినప్పుడు విస్తరిస్తుంది, కాబట్టి ఇది పాతదై చినిగిపోయి తిత్తులు తెరచుకుంటాయి.
ἀπόλλυται
నాశనమవుతుంది
ἀσκοὺς καινούς
క్రోత్త తిత్తులు లేక “ద్రాక్షారస తిత్తులు.” ఇది ఎప్పుడూ ఉపయోగించని తిత్తులను గురించి తెలియచేస్తుంది.
Mark 2:23
శిష్యులు సబ్బాత్ దినమున ధాన్యం తీయడం ఎందుకు తప్పు కాదని చూపించుటకు యేసు ఒక లేఖనము నుండి పరిసయ్యులకు ఒక ఉపమానమును ఇస్తాడు.
τίλλοντες τοὺς στάχυας
ఇతరుల పొలాలలో ధాన్యం లాగడం మరియు తినడం దొంగతనముగా భావించలేదు. సబ్బాత్ దినమున దీనిని చేయడం న్యాయపరమైనదా అనే ప్రశ్న వచ్చింది. శిష్యులు వాటిలో గింజలు లేక విత్తనాలను తినుటకు ధాన్యం కంకులను తుంచారు. పూర్తి అర్థమును చూపించుటకు దీనిని మాటలలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధాన్యం కొంకులను తుంచి విత్తనములను తినండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοὺς στάχυας
“కొంకులు” అనేది గోధుమ మొక్క యొక్క పై భాగం, ఇది ఒక రకమైన పొడవైన గడ్డియైయున్నది. కొంకులు మొక్క యొక్క పరిపక్వ ధాన్యం లేక విత్తనాలను కలిగి ఉంటాయి.
Mark 2:24
శిష్యులు ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నను పరిసయ్యులు అడుగుతారు (23వ వచనము)
ποιοῦσιν τοῖς Σάββασιν ὃ οὐκ ἔξεστιν
ఇతరుల పొలాలలో ధాన్యం లాగడం మరియు తినడం (23వ వచనము) దొంగతనముగా భావించలేదు. సబ్బాత్ దినమున దీనిని చేయడం న్యాయపరమైనదా అనే ప్రశ్న వచ్చింది.
ἴδε, τί ποιοῦσιν τοῖς Σάββασιν ὃ οὐκ ἔξεστιν?
పరిసయ్యులు యేసును నిందించుటకు ఒక ప్రశ్నను అడుగుతారు. దీనిని ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చూడండి! వారు సబ్బాత్ గురించి యూదు ధర్మశాస్తమును ఉల్లంఘిస్తున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἴδε
ఇది చూడండి లేక “వినండి.” ఇది ఏదో చూపించుటకు ఒకరి దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించే మాటయైయున్నది. మీ భాషలో ఒక వ్యక్తి దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించే పదం ఉంటే మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.
Mark 2:25
యేసు పరిసయ్యులను ఒక ప్రశ్న అడగటం ద్వారా వారిని గద్దించడం ప్రారంభించాడు.
λέγει αὐτοῖς
యేసు పరిసయ్యులతో అన్నాడు
οὐδέποτε ἀνέγνωτε τί ἐποίησεν Δαυεὶδ…οἱ μετ’ αὐτοῦ?
సబ్బాత్ దినమున దావీదు చేసిన పనిని ధర్మశాస్త్ర పండితులకు మరియు పరిసయ్యులకు గుర్తుచేయుటకు యేసు ఈ ప్రశ్నను అడుగుతారు. ఈ ప్రశ్న చాలా పెద్దది కాబట్టి దీనిని రెండు వాక్యాలుగా విభజించవచ్చు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐδέποτε ἀνέγνωτε τί ἐποίησεν Δαυεὶδ…αὐτὸς
దీనిని ఆజ్ఞగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు చేసిన దాని గురించి మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి ... అతనిని.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἀνέγνωτε τί…Δαυεὶδ
పాత నిబంధనలో దావీదు గురించి చదవడం యేసు తెలియచేసారు. అస్పష్ట సమాచారమును చూపిస్తూ దీనిని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దావీదు ఏమి చేసాడో లేఖనములలో చదవండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 2:26
యేసు 25వ వచనంలో ప్రారంభించిన ప్రశ్న అడగడం ముగించారు.
πῶς εἰσῆλθεν εἰς τὸν οἶκον τοῦ Θεοῦ…τοῖς σὺν αὐτῷ οὖσιν?
ఇది 25వ వచనమునకు భిన్నమైన ప్రకటనగా వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను దేవుని ఇంట్లోకి వెళ్ళాడు ... అతనితో ఉన్నవారికి."" (చూడం”ి: అలంకారిక ప్రశ్న)
πῶς εἰσῆλθεν
“అతను” అనే మాట దావీదు గురించి తెలియచేస్తుంది.
τοὺς ἄρτους τῆς Προθέσεως
పాత నిబంధన కాలంలో ద్వేవునికి అర్పణగా లేక మందసంలో లేదా దేవాలయ భవనంలో బంగారు బల్లపై ఉంచిన పన్నెండు రొట్టెల గురించి ఇది తెలియచేస్తుంది.
Mark 2:27
τὸ Σάββατον διὰ τὸν ἄνθρωπον ἐγένετο
దేవుడు సబ్బాత్ ఎందుకు స్థాపించాడో యేసు వారికి స్పష్టం చేసాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్రాంతి దినం మనుష్యుల కోసం చేసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὸν ἄνθρωπον
మనిషి లేక “ప్రజలు లేక “ప్రజల అవసరములు.” ఇక్కడ ఈ మాట స్త్రీలను మరియు పురుషులు ఇద్దరి గురించి తెలియచేస్తుంది. (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
οὐχ ὁ ἄνθρωπος διὰ τὸ Σάββατον
“చేయబడింది” అనే మాట మునుపటి వాక్య భాగం నుండి అర్థమయ్యాయి. వాటిని ఇక్కడ పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల కోసం విశ్రాంతి దినం చేయబడలేదు” లేక “దేవుడు విశ్రాంతి దినం కోసం మనుష్యులను చేయలేదు” (చూడండి: శబ్దలోపం)
Mark 3
మార్కు సువార్త 03వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
విశ్రాంతి దినం
విశ్రాంతి దినమున పని చేయడం మోషే ధర్మ శాస్త్రమునకు విరుద్దమైయున్నది. పరిసయ్యులు విశ్రాంతి దినమున రోగియైన వ్యక్తిని స్వస్థపరచడం “పని” అని నమ్ముతారు, కాబట్టి వారు విశ్రాంతి దినమున యేసు ఒక వ్యక్తిని స్వస్థపరచినప్పుడు ఆయన తప్పు చేసాడని వారు చెప్పారు. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం)
“పరిశుద్దాత్మకు వ్యతిరేకంగా దైవదూషణ”
ఈ పాపం చేసినప్పుడు ప్రజలు ఏ చర్యలు చేస్తారు లేక వారు ఏ మాటలు చెపుతారో ఎవరికిని ఖచ్చితంగా తెలియదు. అయితే బహుశా వారు పరిశుద్ధాత్మను, ఆయన పనిని అవమానిస్తున్నారు. వారు పాపులని ప్రజలకు అర్థం చేసి చెప్పడం మరియు దేవుని క్షమాపణ వారికి అవసరమని చెప్పడం పరిశుద్ధాత్మ యొక్క పనిలో ఒక భాగమైయున్నది. అందువలన పాపం చేయుట ఆపుటకు ప్రయత్నించని ఎవరైనా బహుశా దైవదూషణకు పాల్పడవచ్చు. (చూడండి: దైవదూషణ, దూషించడం, దూషణకరమైన మరియు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ప్రభువు ఆత్మ, ఆత్మ)
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
పండ్రెండు మంది శిష్యులు
పండ్రెండు మంది శిష్యుల పేరులు ఈ క్రిందున్నవి:
మత్తయి సువార్తలో:
సిమోను (పేతురు), అంద్రెయ, జేబేదయి కుమారుడైన యాకోబు, జేబేదయి కుమారుడగు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, మత్తయి, అల్పయి కుమారుడైన యోకోబు, తద్దయి, కానానీయుడైన సిమోను మరియు ఇస్కరియోతు యూదా.
మార్కు సువార్తలో:
సిమోను (పేతురు), అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు మరియు జెబెదయి కుమారుడగు యోహాను (వీరికి ఆయన బోయనేర్గెసు అని పేరు పెట్టాడు, ఆ మాటకు ‘ఉరిమేవారు’ అని అర్థం), ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడైన యోకోబు, తద్దయి, కానానీయుడైన సిమోను మరియు ఇస్కరియోతు యూదా.
లూకా సువార్తలో:
సిమోను (పేతురు), అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడైన యోకోబు, సిమోను (ఆయనను కనానియుడని లేదా జలోతే అని పిలుస్తారు), యోకోబు కుమారుడైన యూదా, మరియు ఇస్కరియోతు యూదా.
తద్దయి బహుశా యాకోబు కుమారుడైన యూదా అయియుండవచ్చు.
సహోదరులు మరియు సహోదరీలు
చాలా మంది ఒకే తలిదండ్రులను కలిగి ఉన్న వారిని “సోదరుడు” మరియు సోదరి” అని పిలుస్తారు మరియు వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారు. చాలా మంది ఒకే తాతయ్య అవ్వలతో ఉన్నవారిని “సోదరుడు” మరియు సోదరి” అని కూడా పిలుస్తారు. ఈ అధ్యాయములో యేసు దేవునికి విధేయులైనవారు తనకు అతి ముఖ్యమైన వ్యక్తులని చెప్పారు. (చూడండి: సోదరుడు)
Mark 3:1
యేసు యూదుల సమాజమందిరంలో ఒక వ్యక్తిని స్వస్థపరచాడు మరియు సబ్బాత్ నియమాలతో పరిసయ్యులు చేసిన దాని గురించి ఆయన ఎలా భావిస్తున్నాడో చూపిస్తాడు. పరిసయ్యులు మరియు హేరోదీయులు యేసును చంపుటకు ప్రణాళికలు వేయడం ప్రారంభిస్తాడు.
ἄνθρωπος, ἐξηραμμένην ἔχων τὴν χεῖρα
చెయ్యి చచ్చు బడి ఉన్న వ్యక్తీ
Mark 3:2
παρετήρουν αὐτὸν, εἰ τοῖς Σάββασιν θεραπεύσει αὐτόν
కొంతమంది చచ్చు బడిన చేతిని యేసు స్వస్థ పరుస్తాడా అని నిశితంగా చూసారు.
παρετήρουν αὐτὸν
పరిసయ్యులలో కొందరు. తరువాత మార్కు 3:6లో, ఈ ప్రజలను పరిసయ్యులుగా గుర్తించారు.
ἵνα κατηγορήσωσιν αὐτοῦ
ఆ రోజు ఆ వ్యక్తిని స్వస్థపరచినట్లయితే, పరిసయ్యులు విశ్రాంతి దినాన పని చేయడం ద్వారా ఆయన ధర్మశాస్త్రమునును ఉల్లంఘించాడని నేరం మోపారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా వారు ఆయనపై తప్పు చేసినట్లు నేరం మోపవచ్చు” లేక “తద్వారా ఆయన ధర్మశాస్త్రమునును ఉల్లంఘించాడని నేరం మోపారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 3:3
εἰς τὸ μέσον
ఈ సమూహము మధ్యలో
Mark 3:4
ἔξεστιν τοῖς Σάββασιν ἀγαθοποιῆσαι…ἢ ἀποκτεῖναι?
వారిని హెచ్చరించుటకు యేసు ఈ మాటను చెప్పారు. విశ్రాంతి దినాన ప్రజలను స్వస్థపరచడం ధర్మబద్దమైనదని వారు అంగీకరించాలని ఆయన కోరుకున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
τοῖς Σάββασιν ἀγαθοποιῆσαι ἢ κακοποιῆσαι, ψυχὴν σῶσαι ἢ ἀποκτεῖναι
ఈ రెండు వాక్యభాగములలో రెండవది మరింత తీవ్రమైనది తప్ప ఈ రెండు వాక్యభాగములు అర్థములో సమానముగా ఉంటాయి. (చూడండి: సమాంతరత)
κακοποιῆσαι, ψυχὴν σῶσαι ἢ ἀποκτεῖναι
ఇది ధర్మబద్దమైనదా అని పునరావృతం చేయుటకు ఇది సహాయపడవచ్చు, ఎందుకంటే యేసు మరో విధంగా అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రాణమును రక్షించడం ధర్మమా లేక చంపడం ధర్మమా” (చూడండి: శబ్దలోపం)
ψυχὴν
ఇది సహజమైన జీవితము గురించి తెలియచేస్తుంది మరియు ఇది ఒక వ్యక్తీకి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా చనిపోకుండా లేక ఒకరి జీవితమునైన” (చూడండి: అన్యాపదేశము)
οἱ δὲ ἐσιώπων
కాని వారు ఆయనకు జవాబు చెప్పుటకు నిరాకరించారు
Mark 3:5
περιβλεψάμενος
యేసు చుట్టూ చూసాడు
συνλυπούμενος
తీవ్రంగా నొచ్చుకున్నాడు
ἐπὶ τῇ πωρώσει τῆς καρδίας αὐτῶν
ఏ రూపకాలంకారము చచ్చుబడిన చేతితో ఉన్న మనిషిని కరుణించుటకు పరిసయ్యులు ఎలా ఇష్టపడలేదని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే వారు ఆ మనిషిపై కరుణించుటకు ఇష్టపడలేదు” (చూడండి: రూపకం)
ἔκτεινον τὴν χεῖρα σου
నీ చెయ్యి చాపు
ἀπεκατεστάθη ἡ χεὶρ αὐτοῦ
దీనిని క్రీయాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అతని చేతిని బాగు చేసాడు లేక “ యేసు అతని చేతిని మునుపటి విధంగా చేసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 3:6
συμβούλιον ἐποίουν
ఒక కుట్ర పన్నడం ప్రారంభించారు
τῶν Ἡρῳδιανῶν
ఇది హేరోదు అంతిపాకు సహాయము చేసిన అనధికారిక రాజకీయ పార్టీ పేరు.
ὅπως αὐτὸν ἀπολέσωσιν
యేసును వారు ఎలా చంపవచ్చు
Mark 3:7
గొప్ప ప్రజల సమూహం ఆయనను వెంబడిస్తుంది మరియు ఆయన చాలా మందిని స్వస్థపరుస్తాడు.
τὴν θάλασσαν
ఇది గలిలయ సముద్రమును గురించి తెలియచేస్తుంది
Mark 3:8
τῆς Ἰδουμαίας
ఈ ప్రాంతం గతంలో ఇదూమియా అని పిలువబడింది, ఇది యూదయ దేశము యొక్క దక్షిణ భాగంలో ఉంది.
ὅσα ἐποίει
ఇది యేసు చేస్తున్న అద్భుతాల గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు చేస్తున్న గొప్ప అద్భుతాలు”
ἦλθον πρὸς αὐτόν
యేసు ఉన్న చోటికి వచ్చారు
Mark 3:9
తన చుట్టూ ఉనా పెద్ద జనసమూహాల కారణంగా, యేసు తన శిష్యులను ఏదో చేయమని చెప్పాడని 9వ వచనం చెపుతుంది. యేసు చుట్టూ ఇంత పెద్ద జన సమూహం ఎందుకు ఉందొ 10వ వచనం చెపుతుంది. ఈ వచనాలలోని సమాచారము యు.ఎస్.టిలో మాదిరిగా సంగతులను అవి జరిగిన క్రమంలో ప్రదర్శించుటకు క్రమమును మార్చవచ్చు. (చూడండి: సంఘటనల క్రమం)
εἶπεν τοῖς μαθηταῖς αὐτοῦ, ἵνα πλοιάριον…μὴ θλίβωσιν αὐτόν
పెద్ద సమూహం యేసు వైపుకు బలముగా తోయుచుండగా, ఆయన వారిచేత నలిగిపోయ్ ప్రమాదం ఉంది. వారు ఆయనను ఉద్దేశపూర్వకంగా నలిపివేయరు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు అంతే.
Mark 3:10
πολλοὺς γὰρ ἐθεράπευσεν, ὥστε…ἵνα αὐτοῦ ἅψωνται ὅσοι εἶχον μάστιγας
యేసును చాలా మంది ప్రజలు ఎందుకు చుట్టుముత్తారో ఇది చెపుతుంది.ప్రత్యామ్నాయ తజుమా: “ఎందుకంటే యేసు చాలా మందిని స్వస్థపరచాడు ప్రతి ఒక్కరిని ... ఆయనను తాకుటకు” (చూడండి: పదాలు మరియు పదబంధాలను కనెక్ట్ చేస్తోంది)
πολλοὺς γὰρ ἐθεράπευσεν
“చాలా” అనే మాటా యేసు అప్పటికే పెద్ద సంఖ్యలో స్వస్థపరచిన ప్రజలను గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చాలా మందిని స్వస్థపరచాడు” (చూడండి: శబ్దలోపం)
ἐπιπίπτειν αὐτῷ, ἵνα αὐτοῦ ἅψωνται ὅσοι εἶχον μάστιγας
యేసును తాకడం వలన తమకు స్వస్థత కలుగునని వారిని నమ్ముతారు. దీనిని స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోగులందరూ స్వస్థత పొందుటకు ఆయనను తాకాలన్న ప్రయత్నములో తోసుకోస్తున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 3:11
αὐτὸν ἐθεώρουν
యేసును చూసారు
προσέπιπτον αὐτῷ καὶ ἔκραζον λέγοντα
ఇక్కడ “వారు” అనేది అపవిత్రాత్మల గురించి తెలియచేస్తుంది. అవి తమ యెద్ద ఉన్న వ్యక్తులను పనులు చేయుటకు స్వాధీనంలో ఉంచుకొనుటకు కారణమవుతున్నారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవి తమ స్వాధీనంలో ఉన్న వ్యక్తులను ఆయన ముందు పడుటకు మరియు ఆయన ముందు కేకలు వేయుటకు అవి కారనమైయ్యాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
προσέπιπτον αὐτῷ
అపవిత్రాత్మలు యేసు ముందు పడలేదు ఎందుకంటే అవి ఆయనను ప్రేమిస్తాయి లేక ఆయనను ఆరాధించాలనుకుంటున్నాయి. అవి ఆయనకు భయపడినందున అవి ఆయన ముందు పడిపోయాయి.
σὺ εἶ ὁ Υἱὸς τοῦ Θεοῦ
యేసు “దేవుని కుమారుడ” అయినందున ఆయన అపవిత్రాత్మల పై అధీకారం కలిగి ఉన్నాడు
ὁ Υἱὸς τοῦ Θεοῦ
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 3:12
πολλὰ ἐπετίμα αὐτοῖς
యేసు దయ్యాలకు ఖండితముగా ఆజ్ఞాపించాడు
μὴ αὐτὸν φανερὸν ποιήσωσιν
ఆయన ఎవరో వెల్లడి పరచలేదు
Mark 3:13
యేసు తనకు అపోస్తలులుగా ఉండాలనే వారిని ఎన్నుకుంటాడు.
Mark 3:14
ἵνα ὦσιν μετ’ αὐτοῦ, καὶ ἵνα ἀποστέλλῃ αὐτοὺς κηρύσσειν
అందువలన వారు ఆయనతో ఉంటారు మరియు వాక్య సందేశమును ప్రకటించుటకు ఆయన వారిని పంపుతాడు
Mark 3:16
ἐπέθηκεν ὄνομα τῷ Σίμωνι, Πέτρον
రచయిత పండ్రెండు మంది శిష్యుల పేర్లను జాబితా చేయడం ప్రారంభిస్తాడు. జాబితా చేయబడిన మొదటి వ్యక్తీ సిమోను.
Mark 3:17
ἐπέθηκεν αὐτοῖς
“ఎవరికీ” అనే మాట జేబెదయి కుమారుడైన యాకోబు మరియు అతని సహోదరుడైన యోహోను ఇద్దరినీ గురించి తెలియచేస్తుంది
ὀνόματα Βοανηργές, ὅ ἐστιν υἱοὶ βροντῆς
వారు ఉరుములాంటివారు కాబట్టి యేసు వారిని ఇలా పిలిచాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోయనేర్గేసు అంటే ఉరుములాంటివారు” లేక “బోయనేర్గేసు అంటే ఉరిమేవారు” (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 3:18
Θαδδαῖον
ఇది మనిషి యొక్క పేరు (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 3:19
ὃς καὶ παρέδωκεν αὐτόν
“ఎవరు” అనే మాట యేసుకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదా గురించి తెలియచేస్తుంది.
Mark 3:20
καὶ ἔρχεται εἰς οἶκον
అప్పుడు యేసు తాను ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.
μὴ δύνασθαι αὐτοὺς μηδὲ ἄρτον φαγεῖν
“రొట్టె” అనే మాట ఆహారమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు అస్సలు తినుటకు వీలు కాలేదు” లేక వారు ఏమియూ తినలేదు” (చూడండి: ఉపలక్షణము)
Mark 3:21
ἐξῆλθον κρατῆσαι αὐτόν
ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు, తద్వారా వారు ఆయనను పట్టుకుని వారితో ఇంటికి రమ్మని బలవంతం చేసారు.
ἔλεγον γὰρ
“వారు” అనే మాటకు సాధ్యమయ్యే అర్థాలు 1) ఆయన బంధువులు లేక 2) సమూహములోని కొంత మంది.
ἐξέστη
ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడని వారు భావిస్తున్నారో వివరించుటకు యేసు కుటుంబం ఈ భాషీయమును ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెర్రితనం” లేక “మతి స్థిమితం లేని” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 3:22
ἐν τῷ ἄρχοντι τῶν δαιμονίων, ἐκβάλλει τὰ δαιμόνια
దయ్యాల అధిపతియైన బయల్జేబూలు శాల్తి ద్వారా యేసు దయ్యాలను తరిమివేస్తాడు
Mark 3:23
యేసు తానూ సాతాను చేత నియంతించబడ్డాడు అని ప్రజలు అనుకోవడం ఎందుకు అవివేకమని యేసు ఒక ఉదాహరణతో వివరించాడు. (చూడండి: ఉపమానాలు)
προσκαλεσάμενος αὐτοὺς
తన దగ్గరకు ప్రజలు రావాలని యేసు వారిని పిలిచాడు
πῶς δύναται Σατανᾶς Σατανᾶν ἐκβάλλειν?
బయల్జేబూలు చేత దయ్యాలను వేల్లగోట్టాడని ధర్మశాస్త్ర పండితులకు ప్రతీస్పందనగా యేసు ఈ అలంకారిక ప్రశ్నను అడిగాడు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను తనను తానూ వెళ్ళగొట్టలేడు!” లేక “సాతాను తన దుష్ట శక్తులకు వ్యతిరేకంగా వెళ్ళడు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 3:24
ἐὰν βασιλεία ἐφ’ ἑαυτὴν μερισθῇ
“రాజ్యం” అనే మాట రాజ్యంలో నివసించే ప్రజలకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక రాజ్యంలో నివసించే ప్రజలు ఒకరికొకరు విభజిస్తే” (చూడండి: అన్యాపదేశము)
οὐ δύναται σταθῆναι
ఈ వాక్య భాగం ఒక రూపకాలంకారమైయున్నది అంటే ప్రజలు ఇకపై ఐక్యంగా ఉండరు మరియు వారు పడిపోతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “భరించలేరు” లేక “పడిపోతారు” (చూడండి: రూపకం మరియు ద్వంద్వ నకారాలు)
Mark 3:25
οἰκία
ఇంట్లో నివసించే ప్రజలకు ఇది ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుటుంబం” లేక “గృహం” (చూడండి: అన్యాపదేశము)
Mark 3:26
εἰ ὁ Σατανᾶς ἀνέστη ἐφ’ ἑαυτὸν καὶ ἐμερίσθη
తనను తాను” అనే మాట సాతనును సూచించే ఆత్మార్థక సర్వనామం, మరియు ఇది అతని దుష్టశాక్తులకు కూడా ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతాను మరియు అతని దుష్టశక్తులు ఒకరితో ఒకరు పోరాడుతుంటే” లేక “సాతాను మరియు అతని దుష్టశక్తులు ఒకదానిపై ఒకటి విరుద్ధంగా లేచి విభజింపబడితే” (చూడండి: రిఫ్లెక్సివ్ సర్వనామాలు * మరియు అన్యాపదేశము)
ἐμερίσθη, οὐ δύναται στῆναι
ఇది ఒక రూపకాలంకారమైయున్నది అంటే అతను పడిపోతాడు మరియు భరించలేడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఐక్యంగా నిలిచిపోతుంది” లేక “భరించలేదు మరియు అంతమైపోతుంది” లేక “పడిపోతుంది మరియు ముగిసింది
Mark 3:27
διαρπάσει
ఒక వ్యక్తీ యొక్క విలువైన వస్తువులు మరియు ఆస్తులను దొంగిలించుటకు
Mark 3:28
ἀμὴν, λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది.
τοῖς υἱοῖς τῶν ἀνθρώπων
మనషి నుండి జన్మించిన వారు. ఈ మాట ప్రజల మానవత్వమును నొక్కి చెప్పుటకు ఉపయోగించబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు”
βλασφημήσωσιν
మాట్లాడు
Mark 3:30
ἔλεγον
ప్రజలు చెపుతున్నారు
πνεῦμα ἀκάθαρτον ἔχει
అపవిత్రాత్మ కలిగి ఉండటం ఒక భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మ కలిగి ఉన్నాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 3:31
καὶ ἔρχονται ἡ μήτηρ αὐτοῦ καὶ οἱ ἀδελφοὶ αὐτοῦ
అప్పుడు యేసు తల్లి మరియు సోదరులు వచ్చారు
ἀπέστειλαν πρὸς αὐτὸν καλοῦντες αὐτόν
వారు బయట ఉన్నారని ఆయనను వారి దగ్గరకు రమ్మని చెప్పుటకు వారు ఒకరిని లోపలి పంపారు
Mark 3:32
ζητοῦσίν σε
మీ కోసం అడుగుతున్నారు
Mark 3:33
τίς ἐστιν ἡ μήτηρ μου, καὶ οἱ ἀδελφοί μου?
ప్రజలకు బోధించుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిజంగా నా తల్లి మరియు సోదరులు ఎవరు అని నేను మీకు చెప్తాను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 3:35
ὃς…ἂν ποιήσῃ…οὗτος…ἐστίν
ఎవరు చేస్తారో ... వారే
οὗτος ἀδελφός μου καὶ ἀδελφὴ καὶ μήτηρ ἐστίν
ఇది ఒక రూపకాలంకారమైయున్నది అంటే యేసు శిష్యులు యేసు అధ్యాత్మీక కుటుంబమునకు చెందినవారు. ఆయన శారీరిక కుటుంబానికి చెందినా వారికంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తీ నాకు సోదరుడు, సోదరి, మరియు తల్లిలాంటివారు” (చూడండి: రూపకం)
Mark 4
మర్కు సువార్త 04వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
మార్కు 4:3-10 ఒక ఉపమానమును తెలియపరుస్తుంది. ఈ ఉపమానము 4:14-23లో వివరించబడింది.
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 4:12 లోని కావ్యాలతో యు.ఎల్.టి (ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు
ఉపమానములు
ఉపమానములు అనగా యేసు చెప్పే చిన్న నీతికథలైయున్నవి, తద్వారా ఆయన వారికి నేర్పించుటకు ప్రయత్నిస్తున్న పాఠమును ప్రజలు సులభంగా అర్థం చేసుకుంటారు. ఆయన కథలు కూడా చెప్పాడు తద్వారా తనను నమ్ముటకు ఇష్టపడని వారు నిజమును అర్థం చేసుకోలేరు.
Mark 4:1
యేసు సముద్ర తీరంలో ఉన్న పడవ ఎక్కి బోధించినప్పుడు విత్తనాలు చల్లెవాడి ఉపమానమును వారికి చెప్పాడు. (చూడండి: ఉపమానాలు)
τὴν θάλασσαν
ఇది గలిలయ సముద్రం
Mark 4:3
ἀκούετε! ἰδοὺ…ὁ σπείρων
వినండి! ఒక రైతు
σπεῖραι
రైతు విత్తిన విత్తనాలన్ని ఇక్కడ ఒకే విత్తనములా చెప్పబడ్డాయి. “అతని విత్తనాలు”
Mark 4:4
ἐν τῷ σπείρειν, ὃ μὲν ἔπεσεν παρὰ τὴν ὁδόν
అతను నేలమీద విత్తనం విసిరినప్పుడు. వివిధ సంస్కృతులలో విత్తనాలను భిన్నంగా విత్తుతారు. ఈ ఉపమానములో విత్తనాలను సిద్ధమైన భూమి పై విసిరి విత్తనములు వేసారు.
ὃ μὲν…κατέφαγεν αὐτό
రైతు విత్తిన విత్తనాలన్ని ఇక్కడ ఒకే విత్తనములా చెప్పబడ్డాయి. కొన్ని విత్తనములు ... వాటిని తినివేశాయి”
Mark 4:5
ἄλλο…οὐκ εἶχεν…ἐξανέτειλεν…τὸ μὴ ἔχειν
రైతు విత్తిన విత్తనాలన్ని ఇక్కడ ఒకే విత్తనములా చెప్పబడ్డాయి. ఇతర విత్తనములు ... అవి లేవు ... అవి పుట్టుకొచ్చాయి ... అవి లేవు”
ἐξανέτειλεν
రాతి నేలమీద పడిన విత్తనం త్వరగా పెరగడం ప్రారంభమైంది.
γῆν
ఇది మీరు విత్తనాలను నాటగల నేలమీద వదులుగా ఉన్న మట్టిని గురించి తెలియచేస్తుంది.
Mark 4:6
ἐκαυματίσθη
ఇది చిన్న మొక్కల గురించి తెలియచేస్తుంది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది చిన్న మొక్కలను మాడిపోయేలా చేసింది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
διὰ τὸ μὴ ἔχειν ῥίζαν ἐξηράνθη
చిన్న మోక్కల వేరులు లోతుగా లేనందున అవి ఎండిపోయాయి
Mark 4:7
ἄλλο…συνέπνιξαν αὐτό…οὐκ ἔδωκεν
రైతు విత్తిన విత్తనాలన్ని ఇక్కడ ఒకే విత్తనములా చెప్పబడ్డాయి. మార్కు 4:3. లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. “ఇతర విత్తనములు ... వాటిని అణచి వేసాయి ... అవి పంటకు రాలేదు”
Mark 4:8
αὐξανόμενα, καὶ ἔφερεν εἰς τριάκοντα, καὶ ἓν ἑξήκοντα, καὶ ἓν ἑκατόν
ప్రతి మొక్క ఉత్పత్తి చేసే ధాన్యం మొత్తమును అది పెరిగిన ఒకే విత్తనంతో పోల్చారు. వాక్య భాగములను తగ్గించుటకొరకు ఇక్కడ అండాకారమును ఉపయోగించబడుతుంది కాని వాటిని వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని మొక్కలు ఆ మనిషి విత్తిన విత్తనం కంటే కొన్ని ధాన్యాలు ముప్పై రెట్లు, కొన్ని అరవై రెట్లు మరికొన్ని మొక్కలు వంద రెట్లు ఎక్కువ ధాన్యమును పండిస్తాయి” (చూడండి: శబ్దలోపం)
τριάκοντα…ἑξήκοντα…ἑκατόν
30 ... 60 ... 100. వీటిని అంకెలుగా వ్రాయవచ్చు. (చూడండి: సంఖ్యలు)
Mark 4:9
ὃς ἔχει ὦτα ἀκούειν, ἀκουέτω
యేసు ఇప్పుడే తాను చెప్పినది ప్రముఖ్యమైనదని నొక్కి చెప్పాడు మరియు అర్థం చేసుకొనుటకు మరియు ఆచరణలో పెట్టుటకు కొంత ప్రయాస పడవచ్చు. ఇక్కడ “చెవులు గలవాడు” అనే వాక్య భాగమును అర్థం చేసుకొనుటకు మరియు పాటించుటకు ఇష్టపడుటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే వినుటకు, వినుటకు ఇష్టపడతారో”, లేక “ఎవరైతే అర్థం చేసుకొనుటకు ఇష్టపడతారో, అతనిని అర్థం చేసుకొని పాటించనివ్వండి” (చూడండి: అన్యాపదేశము)
ὃς ἔχει…ἀκουέτω
యేసు తన ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించుటకు ఇష్టపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినడానికి ఇష్టపడితే వినండి” లేక “మీరు అర్థం చేసుకొనుటకు ఇష్టపడితే అర్థం చేసుకొని పాటించండి” (చూడండి: ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
Mark 4:10
ὅτε ἐγένετο κατὰ μόνας
యేసు పూర్తి ఒంటరిగా ఉన్నాడని దీని అర్థం కాదు; బదలుగా జనసమూహం వెళ్ళిపోయింది మరియు యేసు పండ్రెండు మందితో మరియు ఆయన ఇతర సన్నిహితులతో మాత్రమే ఉన్నాడు.
Mark 4:11
ὑμῖν…δέδοται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. “దేవుడు మీకు ఇచ్చాడు” లేక “ నేను మీకు ఇచ్చాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐκείνοις…τοῖς ἔξω
కాని మీలో లేని వారికి. ఇది పండ్రెండు మందిలో లేక యేసు యొక్క ఇతర సన్నిహితులలో లేని ఇతర ప్రజలందరి గురించి తెలియచేస్తుంది.
ἐν παραβολαῖς τὰ πάντα γίνεται
యేసు ప్రజలకు ఉపమానములను ఇస్తున్నాడని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ప్రతీది ఉపమానాల రూపంలో మాట్లాడాను” (చూడండి: శబ్దలోపం)
Mark 4:12
βλέποντες…ἀκούοντες
యేసు ప్రజలతో ఆయన చూపించే దాని గురించి మరియు ఆయన చెప్పేది వినడం గురించి మాట్లాడుతున్నాడని ఇది ఊహించబడింది.ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఏమి చేస్త్యున్నానో వారు చూసినప్పుడు ... నేను చెప్పేది వారు విన్నప్పుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
βλέπωσι καὶ μὴ ἴδωσιν
ప్రజలు చూసేదానిని గ్రహించుటను గురించి యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చూస్తారు కాని గ్రహించలేరు” (చూడండి: రూపకం)
ἐπιστρέψωσιν
దేవుని వైపు తిరగండి. ఇక్కడ “తిరుగుట” అనేది “పశ్చాత్తాపం” కోసం ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాపక్షమాపణ పొందుతారు” (చూడండి: రూపకం)
Mark 4:13
యేసు తన శిష్యులకు విత్తనాలు చల్లేవాడి ఉపమానమును వివరిస్తాడు మరియు దాచిన విషయాలు తెలుస్తాయి అని చూపించుటకు దీపం ఉపయోగించడం గురించి వారికి చెపుతాడు.
καὶ λέγει αὐτοῖς
అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు
οὐκ οἴδατε τὴν παραβολὴν ταύτην, καὶ πῶς πάσας τὰς παραβολὰς γνώσεσθε?
తన ఉపమానమును శిష్యులు అర్థం చేసుకోలేక పోవడం ఎంత బాధగా ఉందో చూపించుటకు యేసు ఈ ప్రశ్నలను ఉపయోగించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఈ ఉపమానమును అర్థం చేసుకోలేకపోతే మిగతా అన్ని ఉపమానాలను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 4:14
ὁ σπείρων
తన విత్తనమును విత్తే రైతు ప్రాతినిధ్యం వహిస్తాడు
τὸν λόγον
“వాక్కు” అనేది దేవుని సందేశము గురించి తెలియచేస్తుంది. సందేశమును విత్తడం సందేశమును బోధించడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలకు దేవుని సందేశమును బోధించేవాడు” (చూడండి: అన్యాపదేశము)
Mark 4:15
οὗτοι δέ εἰσιν οἱ παρὰ τὴν ὁδὸν
కొంతమంది దారి ప్రక్కన పడే విత్తనాలలాగా లేక “కొంతమంది విత్తనాలు పడ్డ మార్గాములాంటివారు”
τὴν ὁδὸν
దారి
ὅταν ἀκούσωσιν
ఇక్కడ “ఇది” అనే మాట “వాక్కు” లేక “దేవుని సందేశమును గురించి తెలియచేస్తుంది.
Mark 4:16
οὗτοί εἰσιν…οἱ
మరియు కొంతమంది విత్తనాలలాగా ఉంటారు. కొంతమంది ప్రజలు రాతి నేలమీద పడిన విత్తనాలలాగా ఎలా ఉన్నారో వివరించడం ప్రారంభించాడు. (చూడండి: రూపకం)
Mark 4:17
οὐκ ἔχουσιν ῥίζαν ἐν ἑαυτοῖς
ఇది లోతుగా వేరు పారని చిన్న మొక్కలతో పోలియున్నది. ఈ రూపకఅలంకారము అర్థం ఏమనగా ప్రజలు ఈ మాటను స్వీకరించినప్పుడు, మొదట ఉత్సాహంగా ఉన్నారు, కాని వారు దానికి సమర్పించబడలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారు వేరు పారని చిన్న మొక్కలవంటివారు” (చూడండి: రూపకం)
οὐκ…ῥίζαν
వేరులు లోతుగా లేవని నొక్కి చెప్పుటకు ఇది ఒక అతిశాయోక్తియై యున్నది. (చూడండి: అతిశయోక్తి)
γενομένης θλίψεως ἢ διωγμοῦ διὰ τὸν λόγον
ప్రజలు దేవుని విశ్వాసించినందున కష్టం వస్తుంది అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుని సందేశమును విశ్వసించినందున కష్టం లేక హింస వస్తుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
σκανδαλίζονται
ఈ ఉపమానంలో, “తొట్రిల్లడం” అంటే “దేవుని సందేశము పై ఉన్న నమ్మకమును విడచిపెట్టడం” (చూడండి: రూపకం)
Mark 4:18
ἄλλοι εἰσὶν οἱ εἰς τὰς ἀκάνθας σπειρόμενοι
ముళ్ళ తుప్పల మధ్య పడిన విత్తనముల మాదిరిగా కొంతమంది ఎలా ఉన్నారో యేసు వివరించడం ప్రారంభించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఇతర వ్యక్తులు ముళ్ళ తుప్పల మధ్య నాటిన విత్తనాలలాగా ఉన్నారు” (చూడండి: రూపకం)
Mark 4:19
αἱ μέριμναι τοῦ αἰῶνος
ఈ జీవితంలోని చింతలు లేక “ఈ ప్రస్తుత జీవితం గురించి వ్యాకులము”
ἡ ἀπάτη τοῦ πλούτου
ధనవంతులవ్వాలనే కోరిక
εἰσπορευόμεναι, συνπνίγουσιν τὸν λόγον
ముళ్ళ తుప్పల మధ్య పడిన విత్తనములలాంటి వ్యక్తుల గురించి యేసు మాట్లాడటం కొనసాగిస్తున్నప్పుడు, కోరికలు మరియు చింతలు వారి జీవితలోని వాక్కుకు ఏమి చేస్తాయో అని వివరించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముళ్ళు చిన్న మొక్కలను అణచివేసినట్లు వారి జీవితంలో చింతలు కోరికలు ప్రవేశించి దేవుని సందేశమును అణచివేస్తాయి” (చూడండి: రూపకం)
ἄκαρπος γίνεται
వాక్కు వారిలో ఫలించదు
Mark 4:20
ἐκεῖνοί εἰσιν οἱ ἐπὶ τὴν γῆν τὴν καλὴν σπαρέντες
సారవంతమైన నేలపై నాటిన విత్తనాలలాగా కొంతమంది ఎలా ఉంటారో యేసు వివరించడం ప్రారంభించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సారవంతమైన నేలలో నాటిన విత్తనాల మాదిరిగా” (చూడండి: రూపకం)
τριάκοντα, καὶ ἓν ἑξήκοντα, καὶ ἓν ἑκατόν
ఇది మొక్కలు ఫలించే ధాన్యాలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని ముప్పై ధాన్యాలు, కొన్ని అరవై ధాన్యాలు, మరి కొన్ని వంద ధాన్యాలను ఫలింప చేస్తాయి” లేక “కొన్ని నాటిన ధాన్యాలు 30 రెట్లు ఫలింప చేస్తాయి, కొన్ని నాటిన ధాన్యాలు 60 రెట్లు ఫలింప చేస్తాయి, మరికొన్ని నాటిన ధాన్యాలు 100 రెట్లు ఫలింప చేస్తాయి” (చూడండి: శబ్దలోపం లేక సంఖ్యలు)
Mark 4:21
καὶ ἔλεγεν αὐτοῖς
యేసు జన సమూహముతో అన్నాడు
μήτι ἔρχεται ὁ λύχνος ἵνα ὑπὸ τὸν μόδιον τεθῇ, ἢ ὑπὸ τὴν κλίνην?
ఈ ప్రశ్న ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఖచ్చితంగా ఒక దీపమును తీసుకోని వచ్చి బుట్టలాంటి పాత్ర కింద లేక మంచం కింద ఉంచుటకు తిసుకోనిరాలేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 4:22
οὐ γάρ ἐστιν κρυπτὸν, ἐὰν μὴ ἵνα φανερωθῇ…ἔλθῃ εἰς φανερόν
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాచి ఉంచినవన్ని బహిర్గతమవుతాయి మరియు అన్ని రహస్యాలు బయట పడతాయి” (చూడండి: ద్వంద్వ నకారాలు)
οὐ…ἐστιν κρυπτὸν…οὐδὲ ἐγένετο ἀπόκρυφον
దాచబడినది ఏమియూ లేదు ... రహస్యముగా ఏదియూ లేదు అనే వాక్య భాగాలకు ఒకే అర్థం ఉంది. రహస్యమైనవన్నియూ తెలుస్తాయి అని యేసు నొక్కి చెప్పాడు. (చూడండి: సమాంతరత)
Mark 4:23
εἴ τις ἔχει ὦτα ἀκούειν, ἀκουέτω
యేసు ఇప్పుడే తాను చెప్పినది ప్రముఖ్యమైనదని నొక్కి చెప్పాడు మరియు అర్థం చేసుకొనుటకు మరియు ఆచరణలో పెట్టుటకు కొంత ప్రయాస పడవచ్చు. ఇక్కడ “వినుటకు చెవులు గలవాడు” అనే వాక్య భాగమును అర్థం చేసుకొని పాటించుటకు ఒక మారుపేరైయున్నది. (మార్కు 4:9) లో మీరు దీనిని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా వినడానికి ఇష్టపడితే వినండి” లేక “ఎవరైనా అర్థం చేసుకొనుటకు ఇష్టపడితే అర్థం చేసుకొని పాటించండి” (చూడండి: అన్యాపదేశము)
εἴ τις…ἀκουέτω
యేసు తన ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు ఇక్కడ రెండవ వ్యక్తిని ఉపయోగించుటకు ఇష్టపడవచ్చు. (మార్కు 4:9)లో మీరు దీనిని ఏలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: ““మీరు వినడానికి ఇష్టపడితే వినండి” లేక “మీరు అర్థం చేసుకొనుటకు ఇష్టపడితే అర్థం చేసుకొని పాటించండి” (చూడండి: ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
Mark 4:24
ἔλεγεν αὐτοῖς
యేసు జనసమూహముతో చెప్పారు
ἐν ᾧ μέτρῳ μετρεῖτε
సాధ్యమయ్యే అర్థాలు 1) యేసు అక్షరాల కొలత గురించి మాట్లాడుతునాడు మరియు ఇతరులకు ఔదార్యంగా ఇస్తున్నాడు లేక 2) ఇది యేసు “ అవగాహన” గురించి “కొలిచేటట్లు” మాట్లాడే ఒక రూపకఅలంకారమైయున్నది.” (చూడండి: రూపకం)
μετρηθήσεται ὑμῖν, καὶ προστεθήσεται ὑμῖν
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీ కోసం ఆ పరిమాణమును కొలుస్తాడు, మరియు అతను దానిని మీలో కలుపుతాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 4:25
δοθήσεται αὐτῷ…καὶ ὃ ἔχει ἀρθήσεται ἀπ’ αὐτο
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనికి దేవుడు ఎక్కువ ఇస్తాడు ... అతని నుండి దేవుడు తీసి వేస్తాడు లేక దేవుడు అతనికి ఎక్కువ ఇస్తాడు ... దేవుడు అతని నుండి తీసి వేస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 4:26
అప్పుడు యేసు ప్రజలకు దేవుని రాజ్యమును వివరించుటకు ఉపమానములను చెపుతాడు, తరువాత ఆయన తన శిష్యులకు వివరించాడు. (చూడండి: ఉపమానాలు)
οὕτως…ἄνθρωπος βάλῃ τὸν σπόρον
యేసు దేవుని రాజ్యమును విత్తనములను విత్తే రైతుతో పోల్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన విత్తనమును విత్తే రైతులాగే” (చూడండి: ఉపమ)
Mark 4:27
καθεύδῃ καὶ ἐγείρηται, νύκτα καὶ ἡμέραν
ఇది మనిషి వాడుకగా చేసే పనియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రతి రాత్రి నిద్ర పోతాడు మరియు ప్రతి రోజు లేస్తాడు” లేక “ అతను ప్రతి రాత్రి నిద్ర పోతాడు మరియు మరుసటి రోజున లేస్తాడు”
ὡς οὐκ οἶδεν αὐτός
విత్తనం ఎలా మొలకేత్తుతుందో మరియు ఎలా పెరుగుతుందో మనిషికి తెలియదు
Mark 4:28
χόρτον
కంకి లేక మొలకేత్తిన విత్తనం
στάχυν
కంకి తలపై లేక గింజలు కలిగి ఉన్న మొక్క యొక్క భాగం
Mark 4:29
εὐθὺς ἀποστέλλει τὸ δρέπανον
ఇక్కడ “కొడవలి” అనేది రైతు లేక ధాన్యం కోయుటకు రైతు పంపే వ్యక్తుల గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను వెంటనే పంటను కోయుటకు పొలంలోనికి వెళ్తాడు” లేక “అతడు వెంటనే ధాన్యం కోయుటకు కొడవలి ఉన్నవారిని పొలంలోనికి పంపుతాడు” (చూడండి: అన్యాపదేశము)
δρέπανον
వక్రమైన కత్తి లేక పంటను కత్తిరించుటకు ఉపయోగించే పదునైన కొక్కెము
ὅτι παρέστηκεν ὁ θερισμός
ఇక్కడ “వచ్చింది” అనే మాట పంట కోసం ధాన్యం పండినందుకు ఒక భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే పంట కోయుటకు సిద్ధంగా ఉంది” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 4:30
πῶς ὁμοιώσωμεν τὴν Βασιλείαν τοῦ Θεοῦ, ἢ ἐν τίνι αὐτὴν παραβολῇ θῶμεν?
యేసు ఈ ప్రశ్నను అడిగినప్పుడు ఆయనను వినువారు దేవుని రాజ్యం అంటే ఏమిటో అని ఆలోచించేలా చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ఉపమానంతో దేవుని రాజ్యం ఎలా ఉంటుందో నేను వివరించగలను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 4:31
ὅταν σπαρῇ
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా దానిని విత్తినప్పుడు” లేక “ఎవరైనా నాటినప్పుడు”
Mark 4:32
ποιεῖ κλάδους μεγάλους
ఆవగింజ చెట్టు కొమ్మలు పెద్దగా పెరుగుతాయి అని వర్ణించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెద్ద కొమ్మలతో” (చూడండి: మానవీకరణ)
Mark 4:33
ἐλάλει αὐτοῖς τὸν λόγον
ఇక్కడ వాక్కు అనేది “దేవుని సందేశం” యొక్క ఉపలక్షణమైయున్నది. “వారిని” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారికి దేవుని సందేశమును బోధించాడు” (చూడండి: ఉపలక్షణము)
καθὼς ἠδύναντο ἀκούειν
మరియు వారు కోన్నిటిని అర్థం చేసుకోగలిగితే, ఆయన వారికి మరింత చెపుతూనే ఉన్నాడు
Mark 4:34
κατ’ ἰδίαν
దీని అర్థం ఆయన జనసమూహమునకు దూరంగా ఉన్నాడు, కానీ తన శిష్యులు ఆయనతోనే ఉన్నారు.
ἐπέλυεν πάντα
ఇక్కడ “ప్రతిది అనేది ఒక అతిశాయోక్తియైయున్నది. ఆయన తన ఉపమానాలన్నిటిని వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన ఉపమానాలన్నిటిని వివరించాడు” (చూడండి: అతిశయోక్తి)
Mark 4:35
జనసమూహం నుండి తప్పించుకొనుటకు యేసు మరియు ఆయన శిష్యులు పడవలో వెళ్ళుతుండగా ఒక పెద్ద తుఫాను తలెత్తింది. గాలి మరియు సముద్రం ఆయనకు లోబడతాయని ఆయన శిష్యులు భయపడతారు.
λέγει αὐτοῖς
యేసు తన శిష్యులతో ఇలా అన్నారు
τὸ πέραν
గలిలయ సముద్రం యొక్క మరోక వైపు లేక “సముద్రం యొక్క మరొక వైపు”
Mark 4:37
γίνεται λαῖλαψ μεγάλη ἀνέμου
ఇక్కడ “ఉద్భవించుట” అనేది “ప్రారంభమైంది” అనే కోసం ఒక భాషీయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “హింసాత్మక గాలి తుఫాను మొదలైంది” (చూడండి: జాతీయం (నుడికారం))
ἤδη γεμίζεσθαι τὸ πλοῖον
పడవ నీటితో నిండి ఉందని చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పడవ నీటితో నిండే ప్రమాదం ఉంది” (చూడండి: శబ్దలోపం)
Mark 4:38
τῇ πρύμνῃ
ఇది పడవ వెనుక భాగంలో ఉంది. “పడవ యొక్క కఠినత్వము”
ἐγείρουσιν αὐτὸν
“వారు” అనే మాట శిష్యుల గురించి తెలియచేస్తుంది. ఇదే విధమైన ఆలోచనను తరువాతి వచనమైన 39 వచనములో, “ఆయన లేచాడు”. “ఆయన” అనేది యేసును సూచిస్తుంది
οὐ μέλει σοι ὅτι ἀπολλύμεθα?
శిష్యులు తమ భయమును తెలియచేయుటకు ఈ ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఏమి జరుగుతుందనే దాని గురించి శ్రద్ధ వహించాలి; మేమందరమూ చనిపోతున్నాము!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἀπολλύμεθα
“మేము” అనే మాటలో శిష్యులు మరియు యేసు ఇద్దరూ ఉన్నారు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Mark 4:39
σιώπα, πεφίμωσο
ఈ రెండు వాక్య భాగాలు సమానమైనవి గాలి మరియు సముద్రం ఏమి చేయాలని యేసు కోరుకుంటున్నాడో నొక్కి చెప్పుటకు ఉపయోగిస్తారు. (చూడండి: జంటపదం)
γαλήνη μεγάλη
సముద్రం మీద గొప్ప శాంతత లేక “సముద్రం మీద గొప్ప ప్రశాంతత”
Mark 4:40
καὶ εἶπεν αὐτοῖς
యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు
τί δειλοί ἐστε? οὔπω ἔχετε πίστιν
యేసు ఈ ప్రశ్నను తన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు వారు ఎందుకు భయపడుతున్నారో ఆలోచించేలా అడుగుతున్నారు. ఈ ప్రశ్నలను ప్రకటనలుగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు భయపడకూడదు. మీకు ఎక్కువ విశ్వాసం ఉండాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 4:41
τίς ἄρα οὗτός ἐστιν, ὅτι καὶ ὁ ἄνεμος καὶ ἡ θάλασσα ὑπακούει αὐτῷ?
శిష్యులు యేసు చేసిన ఈ పనిని చూసి ఆశ్చర్యముతో ఈ ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈయన సాధారణ మనుష్యులలగా కాదు; గాలి మరియు సముద్రం కూడా ఆయనకు లోబడి ఉంటాయి!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 5
మార్కు 05వ అధ్యాయము యొక్క సాధారణ గమనికలు
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
“తలితా కుమీ”
“తలితా కుమీ” అనే మాటలు (మార్కు 5:41) అరామిక్ భాషకు చెందినవి. వారు శబ్దం చేసే విధంగా మార్కు వ్రాస్తాడు మరియు తరువాత వాటిని అనువదిస్తాడు. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
Mark 5:1
యేసు గొప్ప తుఫానును శాంతింపచేసిన తరువాత, ఆయన ఎక్కువగా దయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరుస్తాడు. కాని గెరాసేనులోని స్థానిక ప్రజలు అతని స్వస్థత గురించి సంతోషంగా లేరు మరియు వారు యేసును విడచిపెట్టమని వేడుకుంటున్నారు.
ἦλθον
“వారు” అనే మాట యేసును మరియు ఆయన శిష్యులను గురించి తేలియచేస్తుంది
τῆς θαλάσσης
ఇది గలిలయ సముద్రమును గురించి తెలియచేస్తుంది.
τῶν Γερασηνῶν
ఈ పేరు గేరాసేనులో నివసించే ప్రజలను గురించి తెలియచేస్తుంది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 5:2
ἐν πνεύματι ἀκαθάρτῳ
ఇది ఒక భాషీయమైయున్నది అనగా మనిషి అపవిత్రమైన ఆత్మచే “నియంత్రించబడ్డాడు” లేక “కలిగి ఉన్నాడు” ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రమైన ఆత్మ కలిగి ఉన్న లేక అపవిత్రమైన ఆత్మ ద్వారా నియంత్రించబడుతుంది.”
Mark 5:4
αὐτὸν πολλάκις…δεδέσθαι
దీనిని క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు అతనిని చాలా సార్లు బంధించారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὰς πέδας συντετρῖφθαι
దీనిని క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను తన సంకెళ్ళను ముక్కలు చేసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
πέδαις
ఖైదీల చేతులు మరియు కాళ్ళ చుట్టూ ప్రజలు చుట్టే లోహపు ముక్కలు మరియు ఖైదీలు కదలలేకుండా కదలని వస్తువులకు గొలుసులతో జతచేయండి
οὐδεὶς ἴσχυεν αὐτὸν δαμάσαι
ఆ వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు మరియు అతనిని ఎవరూ అదుపు చేయలేరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను చాలా బలంగా ఉన్నందున అతనిని అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు”
αὐτὸν δαμάσαι
అతనిని అదుపు చేయండి
Mark 5:5
κατακόπτων ἑαυτὸν λίθοις
తరచుగా ఒక వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు, దయ్యం ఆ వ్యక్తిని తనను తాను కోసుకోవడంలాంటి స్వయం విద్వంసక పనులను చేయిస్తుంది.
Mark 5:6
καὶ ἰδὼν τὸν Ἰησοῦν ἀπὸ μακρόθεν
యేసు పడవనుండి బయటకు వచ్చేటప్పుడే, ఆ వ్యక్తి యేసును మొదట చూసాడు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
προσεκύνησεν
దీని అర్థం అతను భక్తి మరియు యేసును గౌరవించుటకు ఆయన ముందు మోకరిల్లాడు కానీ ఆయనను ఆరాధించుటకు కాదు.
Mark 5:7
ఈ రెండు వచనాలలోని సమాచారం యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, సంగతులు అవి జరిగిన క్రమములో ప్రదర్శించుటకు క్రమమును మార్చవచ్చు. (చూడండి: సంఘటనల క్రమం)
κράξας
అపవిత్రాత్మ ఏడ్చింది
τί ἐμοὶ καὶ σοί Ἰησοῦ, Υἱὲ τοῦ Θεοῦ τοῦ Ὑψίστου?
అపవిత్రాత్మ ఈ ప్రశ్నను భయంతో అడుగుతుంది. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నన్ను అడ్డగించుటకు ఎటువంటి కారణము లేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Ἰησοῦ…μή με βασανίσῃς
అపవిత్రాత్మలను బాధించే శక్తి యేసుకు ఉంది.
Υἱὲ τοῦ Θεοῦ τοῦ Ὑψίστου
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ὁρκίζω σε τὸν Θεόν
ఇక్కడ యేసును మనవి చేసుకోనుటకై అపవిత్రాత్మ దేవునిపై ప్రమాణము చేస్తుంది. మీ భాషలో ఈ రకమైన అభ్యర్ధన ఎలా జరిగిందో పరిశీలించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను దేవుని ముందు వేడుకుంటున్నాను” లేక “ నేను దేవుని పై ప్రమాణము చేసి నిన్ను వేడుకుంటున్నాను”
Mark 5:9
ἐπηρώτα αὐτόν
యేసు అపవిత్రాత్మను అడిగాడు
λέγει αὐτῷ, Λεγιὼν ὄνομά μοι, ὅτι πολλοί ἐσμεν.
ఒక ఆత్మ ఇక్కడ చాలా ఆత్మల గురించి మాట్లాడుతుంది. వారు 6,000 మంది సైనిక దళముతో కూడిన రోమన్ సైన్యలో ఒక భాగంవలే ఉన్నారని అతను వారి గురించి మాట్లాడాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు అపవిత్రాత్మ ఆయనతో ‘మమ్మల్ని సైన్యం అని పిలవండి, ఎందుకంటే మేము చాలా మంది మనిషి లోపల ఉన్నాము.” (చూడండి: రూపకం)
Mark 5:12
παρεκάλεσαν αὐτὸν
అపవిత్రాత్మలు యేసును వేడుకుంటున్నాయి
Mark 5:13
ἐπέτρεψεν αὐτοῖς
యేసు వాటికి ఏమి చేయమని అనుమతించాడో స్పష్టంగా చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మలు అవి అనుమతి కోరినట్లు చేయుటకు యేసు అనుమతించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
εἰς τὴν θάλασσαν, ὡς δισχίλιοι, καὶ ἐπνίγοντο ἐν τῇ θαλάσσῃ
మీరు దీనిని ప్రత్యేక వాక్యంగా చేయవచ్చు: “సముద్రంలోకి. సుమారు రెండువేల పందులు ఉన్నాయి, అవి సముద్రంలో మునిగిపోయాయి”
ὡς δισχίλιοι
సుమారు 2,000 పందులు (చూడండి: సంఖ్యలు)
Mark 5:14
εἰς τὴν πόλιν καὶ εἰς τοὺς ἀγρούς
ఆ మనుష్యులు తమ నివేదికను పట్టణం మరియు పల్లెప్రాంతాలకు ఇచ్చాడని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణంలోని మరియు పల్లెప్రాంతంలోని ప్రజలకు” (చూడండి: శబ్దలోపం)
Mark 5:15
τὸν λεγεῶνα
ఇది ఆ మనిషిలో ఉన్న అనేకమైన దయ్యాల పేరు. మార్కు 5:9లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
σωφρονοῦντα
ఇది ఒక భాషీయమైయున్నది అంటే అతను స్పష్టంగా ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాదారణ మనస్సు యొక్క” లేక “స్పష్టంగా ఆలోచించడం” (చూడండి: జాతీయం (నుడికారం))
ἐφοβήθησαν
“వారు” అనే మాట ఏమి జరిగిందో చూచుటకు బయలుదేరిన వ్యక్తుల సమూహమును గురించి తెలియచేస్తుంది.
Mark 5:16
οἱ ἰδόντες, πῶς ἐγένετο
ఏమి జరిగిందో చూసి సాక్ష్యమిచ్చిన ప్రజలు
Mark 5:18
ὁ δαιμονισθεὶς
ఆ మనిషి ఇకపై దయ్యం కలిగి లేనప్పటికీ, అతనిని ఇప్పటికి ఈ విధంగా వర్ణించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయ్యం పట్టిన వ్యక్తి”
Mark 5:19
καὶ οὐκ ἀφῆκεν αὐτόν
యేసు మనిషికి అనుమతించని దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఆయన వారితో వచ్చుటకు ఆ మనిషిని అనుమతించలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 5:20
τῇ Δεκαπόλει
ఇది పది పట్టణములు అని అర్థం ఉన్న ప్రాంతం పేరు. ఇది గలిలయ సముద్రం యొక్క ఆగ్నేయంలో ఉంది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
πάντες ἐθαύμαζον
ప్రజలు ఎందుకు ఆశ్చర్య పోయారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ మనిషి చెప్పినది విన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు” (చూడండి: శబ్దలోపం)
Mark 5:21
గెరాసేను ప్రాంతంలోని దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరచిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు సరస్సు మీదుగా కపెర్నహుముకు తిరిగి వస్తారు అక్కడ యూదుల అధికారులలో ఒకడు తన కుమార్తెను స్వస్థపరచమని అడుగుతాడు.
τὸ πέραν
ఈ వాక్య భాగమునకు సమాచారమును జతచేయుటకు ఇది సహాయ పడవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రం యొక్క మరొక వైపు” (చూడండి: శబ్దలోపం)
παρὰ τὴν θάλασσαν
సముద్ర తీరంలో లేక ‘’ఒడ్డులో”
τὴν θάλασσαν
ఇది గలిలయ సముద్రం.
Mark 5:22
Ἰάειρος
ఇది మనిషి పేరు (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 5:23
ἐπιθῇς τὰς χεῖρας
చేతుల మీద వేయడం అనేది ఒక ప్రవక్త లేక బోధకుడు ఒకరిపై చేయి వేసి స్వస్థత లేక ఆశీర్వాదం ఇవ్వడం. ఈ సందర్భంలో, తన కుమార్తెను స్వస్థ పరచమని యాయిరు యేసును అడుగుతున్నాడు.
ἵνα σωθῇ καὶ ζήσῃ
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెను స్వస్థపరచి ఆమెను బ్రాతికించండి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 5:24
καὶ ἀπῆλθεν μετ’ αὐτοῦ
కాబట్టి యేసు యాయిరుతో వెళ్ళాడు. యేసు శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి యేసు మరియు ఆయన శిష్యులు యాయిరుతో వెళ్లారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
συνέθλιβον αὐτόν
దీని అర్థం వారు యేసు చుట్టూ గుంపుగుంపులుగా ఉన్నారు మరియు యేసుకు దగ్గరగా ఉండుటకు తమకు తాము తొందర చేయబడ్డారు
Mark 5:25
ఆ మనిషి యొక్క పండ్రెండేళ్ల కూతురిని స్వస్థపరచేందుకు యేసు వెళ్ళుచుండగా, 12 సంవత్సరాల నుండి అనారోగ్యంతో ఉన్న ఒక స్త్రీ తన స్వస్థత కోసం యేసును తాకడం ద్వారా అంతరాయం కలిగింది.
καὶ γυνὴ οὖσα
ఇప్పుడు ఈ స్త్రీ కథకు పరిచయం అవుతుందని సూచింపబడింది. కథలో క్రొత్త వ్యక్తులు ఎలా పరిచయం చేయబడ్డారో మీ భాషలో పరిశీలించండి. (చూడండి: పాలు పంచుకొనే పాత వారూ, కొత్త వారి గురించిన పరిచయం)
ἐν ῥύσει αἵματος δώδεκα ἔτη
ఆ స్త్రీ బహిరంగంగా గాయం లేదు; బదులుగా ఆమె నెలసరి రక్త ప్రవాహం ఆగదు. ఈ పరిస్థితి గురించి తెలియచేయుటకు మీ భాషకు సభ్యత కలిగిన మార్గం ఉండవచ్చు. (చూడండి: సభ్యోక్తి)
δώδεκα ἔτη
12 సంవత్సరములు (చూడండి: సంఖ్యలు)
Mark 5:26
εἰς τὸ χεῖρον ἐλθοῦσα
ఆమె అనారోగ్యం మరింత పెరిగింది లేక “ఆమె రక్త స్రావం ఎక్కువ అయింది”
Mark 5:27
τὰ περὶ τοῦ Ἰησοῦ
యేసు ప్రజలను ఎలా స్వస్థ పరచాడో అనే సమాచారం గురించి ఆమె విన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ప్రజలను స్వస్థపరచాడు”
τοῦ ἱματίου
బాహ్య వస్త్రం లేక చొక్కాయి
Mark 5:28
σωθήσομαι
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నన్ను స్వస్థ పరుస్తుంది” లేక “ఆయన శక్తి నన్ను స్వస్థపరుస్తుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 5:29
ἴαται ἀπὸ τῆς μάστιγος
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అస్వస్థత ఆమెను విడచిపెట్టింది” లేక “ఆమె ఇక అస్వస్థతతో లేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 5:30
τὴν ἐξ αὐτοῦ δύναμιν ἐξελθοῦσαν
ఆ స్త్రీ యేసును తాకినప్పుడు తన శక్తి ఆమెను స్వస్థ పరుస్తుందని యేసు భావించాడు. ఆమెను స్వస్థపరచినప్పుడు ప్రజలను స్వస్థపరచే తన కోల్పోయే శక్తిని యేసు కోల్పోలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన స్వస్థతా శక్తి స్త్రీని స్వస్థపరచింది”
Mark 5:31
τὸν ὄχλον συνθλίβοντά σε
దీని అర్థం వారు యేసు చుట్టూ గుంపుగుంపులుగా ఉన్నారు మరియు యేసుకు దగ్గరగా ఉండుటకు తమకు తాము తొందర చేయబడ్డారు మార్కు 5:24 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
Mark 5:33
προσέπεσεν αὐτῷ
ఆయన ముందు మోకరిల్లింది. ఆమె గౌరవం మరియు సమర్పణ కార్యములో భాగంగా ఆమె యేసు ముందు మోకరిల్లింది.
εἶπεν αὐτῷ πᾶσαν τὴν ἀλήθειαν
“మొత్తం నిజం” అనే మాట ఆమె ఆయనను తాకి ఎలాగా బాగుపడిందో అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఆయనను ఎలా తాకిందో ఆ నిజం మొత్తం ఆయనతో చెప్పింది” (చూడండి: శబ్దలోపం)
Mark 5:34
θυγάτηρ
ఆ స్త్రీ ఒక విశ్వాసి అని తెలియచేయుటకు యేసు ఈ మాటను అలంకారికంగా ఉపయోగిస్తాడు.
ἡ πίστις σου
నా పై మీ విశ్వాసం
Mark 5:35
ἔτι αὐτοῦ λαλοῦντος
యేసు మాట్లాడుతున్నప్పుడు
ἔρχονται ἀπὸ τοῦ ἀρχισυναγώγου
సాధ్యమయ్యే అర్థాలు 1) ఈ ప్రజలు యాయిరు ఇంటినుండి వచ్చారు లేక 2) యాయిరు ఇంతకూ ముందు యేసును చూడమని ఈ ప్రజలకు ఆదేశం ఇచ్చాడు లేక 3) ఈ ప్రజలు యాయిరు లేకపోవడంతో సమాజ మందిర నాయకుడిగా అధ్యక్షత వహించిన వ్యక్తే వారిని పంపాడు.
τοῦ ἀρχισυναγώγου
యాయిరు సమాజ మందిరం యొక్క నాయకుడు
λέγοντες
యాయిరుతో మాట్లాడుతూ, సమాజమందిరము
τί ἔτι σκύλλεις τὸν διδάσκαλον?
ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇకపై గురువును ఇబ్బంది పెట్టి ఉపయోగం లేదు’’ లేక “ఇకపై గురువును ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὸν διδάσκαλον
ఇది యేసును గురించి తెలియచేస్తుంది
Mark 5:36
37 మరియు 38వ వచనాలలోని సమాచారం యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, సంగతులను అవి జరిగిన క్రమంలో తెలియపరచుటకు క్రమ పరచవచ్చు. (చూడండి: సంఘటనల క్రమం మరియు వచన వారధులు)
μόνον πίστευε
అవసరమైతే యేసు యాయిరును నమ్మకం ఉంచమని ఆజ్ఞాపించుటను మీరు పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ కుమార్తెను జీవింపచేసెదనని నమ్మండి”
Mark 5:37
οὐκ ἀφῆκεν
యేసు అనుమతించలేదు
μετ’ αὐτοῦ συνακολουθῆσαι
ఆయనతో వచ్చుటకు. వారు ఎక్కడికి వెళ్ళుతున్నారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనతో పాటు యాయిరు ఇంటికి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 5:38
θεωρεῖ
యేసు చూశారు
Mark 5:39
λέγει αὐτοῖς
యేసు ఏడుస్తున్న ప్రజలతో అన్నాడు
τί θορυβεῖσθε καὶ κλαίετε?
వారిలో ఉన్న విశ్వాసం కొరతను చూచుటకు యేసు ఈ ప్రశ్నను అడిగాడు. ఇది ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది గాబరా పడుటకు మరియు ఏడ్చుటకు సమయం కాదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὸ παιδίον οὐκ ἀπέθανεν, ἀλλὰ καθεύδει
యేసు నిద్ర కోసం సాధారణ పదమును ఉపయోగిస్తాడు మరియు ఆలాగే అనువాదం కూడా చేయాలి.
Mark 5:40
κατεγέλων αὐτοῦ
యేసు నిద్ర కోసం సాధారణ పదమును ఉపయోగించాడు (39వ వచనం). యేసు చెప్పే విషయమును విన్న ప్రజలు ఆయనను చూసి నవ్వుతారని చదవరి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి మరియు నిద్రపోతున్న వ్యక్తికి మధ్య వ్యత్యాసం వారికి నిజంగా తెలుసు మరియు ఆయన అలా చేయలేడని వారు భావిస్తారు.
ἐκβαλὼν πάντας
మిగతా వ్యక్తులందరినీ ఇంటి వెలుపలకి పంపారు
τοὺς μετ’ αὐτοῦ
ఇది పేతురు, యాకోబు మరియు యోహానులను గురించి తెలియచేస్తుంది.
εἰσπορεύεται ὅπου ἦν τὸ παιδίον
పాప ఎక్కడ ఉన్నదో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప పడుకున్న గదిలోనికి వెళ్ళాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 5:41
ταλιθὰ, κοῦμ!
యేసు చిన్న అమ్మాయితో తన భాషలో మాట్లాడాడు. ఇది అరామిక్ వాక్యమైయున్నది. మీ అక్షరాలలో ఉన్నట్లుగా ఈ పదాలను వ్రాయండి. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
Mark 5:42
ἦν…ἐτῶν δώδεκα
ఆమె వయస్సు 12 సంవత్సరములు (చూడండి: సంఖ్యలు)
Mark 5:43
διεστείλατο αὐτοῖς πολλὰ ἵνα μηδεὶς γνοῖ τοῦτο, καὶ
దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు ‘దీని గురించి ఎవరికీ తెలియకూడదు!’ లేక ‘నేను చేసిన పని గురించి ఎవరికీ చెప్పవద్దు!’ అప్పుడు” (చూడండి: ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
διεστείλατο αὐτοῖς πολλὰ
ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు
καὶ εἶπεν δοθῆναι αὐτῇ φαγεῖν
దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన ‘ఆమెకు తినుటకు ఏదైనా ఇవ్వండి’ అని చెప్పాడు.” (చూడండి: ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
Mark 6
మర్కు సువార్త 06వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
“తైలముతో అభిషేకం”
పురాతన తూర్పు ప్రాంతపు మనుష్యులు ఒలీవ తైలంను వేయుట ద్వారా అస్వస్థతగా ఉన్నవారిని స్వస్థ పరచుటకు ప్రయత్నిస్తారు.
Mark 6:1
యేసు తన స్వగ్రామానికి తిరిగి వస్తాడు, అక్కడ ఆయన అంగీకరించబడడు.
τὴν πατρίδα αὐτοῦ
ఇది యేసు పెరిగిన మరియు ఆయన కుటుంబం నివసించిన నజరేతు పట్టణమును గురించి తెలియచేస్తుంది. ఆయన అక్కడ భూమిని కలిగి ఉన్నాడని దీని అర్థం కాదు.
Mark 6:2
τίς ἡ σοφία ἡ δοθεῖσα τούτῳ
నిష్క్రీయాత్మక నిర్మాణమును కలిగి ఉన్న ఈ ప్రశ్నను క్రీయాశీల రూపంలో అడగవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సంపాదించిన జ్ఞానం ఎటువంటిది?”
διὰ τῶν χειρῶν αὐτοῦ γινόμεναι
ఈ వాక్య భాగం యేసు స్వయంగా అద్భుతాలు చేస్తాడని నొక్కి చెపుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన స్వయంగా పని చేస్తాడు”
Mark 6:3
οὐχ οὗτός ἐστιν ὁ τέκτων, ὁ υἱὸς τῆς Μαρίας, καὶ ἀδελφὸς Ἰακώβου, καὶ Ἰωσῆτος, καὶ Ἰούδα, καὶ Σίμωνος? καὶ οὐκ εἰσὶν αἱ ἀδελφαὶ αὐτοῦ ὧδε πρὸς ἡμᾶς?
ఈ ప్రశ్నను ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఒక సాధారణ వడ్రంగి మాత్రమే!, ఆయన మరియు అయన కుటుంబం మాకు తెలుసు. ఆయన తల్లియైన మరియ మాకు తెలుసు. ఆయన తమ్ముళ్ళు అయిన యాకోబు, యోసే, యూదా మరియు సీమోనులు మాకు తెలుసు” మరియు ఇతడి చెల్లెళ్ళు మాతో కూడా ఇక్కడ నివసిస్తున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 6:4
αὐτοῖς
జనసమూహముతో
οὐκ ἔστιν προφήτης ἄτιμος, εἰ μὴ
సానుకూల సమానమైన ప్రాముఖ్యతను సృష్టించుటకు ఈ వాక్యం రెట్టింపు వ్యతిరేకార్థకమును ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ప్రవక్త ఎల్లప్పుడూ గౌరవించబడతాడు, తప్ప” లేక “ప్రవక్త గౌరవించబడని ఏకైక ప్రదేశం” (చూడండి: జంట వ్యతిరేకాలు)
Mark 6:5
ὀλίγοις ἀρρώστοις, ἐπιθεὶς τὰς χεῖρας
ప్రవక్తలు మరియు గురువులు ప్రజలను స్వస్థ పరచుటకు లేక వారిని ఆశీర్వదించుటకు వారిపై చేయి ఉంచుతారు. ఈ సందర్భములో యేసు ప్రజలను స్వస్థపరచాడు.
Mark 6:7
8 మరియు 9వ వచనాలలోని యేసు సూచనలు యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లుగా, తానూ శిష్యులకు చేయవద్దని చెప్పినదాని నుండి చేయమని చెప్పినది వేరుపరచమని క్రమాన్ని మార్చవచ్చు. (చూడండి: వచన వారధులు)
యేసు తన శిష్యులను బోధించుటకు మరియు స్వస్థపరచుటకు రెండు గుంపులుగా పంపిస్తాడు.
προσκαλεῖται τοὺς δώδεκα
ఇక్కడ “పిలచిన” అనే మాటకు అర్థం ఆయన తన దగ్గరకు వచ్చుటకు పండ్రెండు మందిని పిలిచాడు.
δύο δύο
2 నుంచి 2 లేక “జతలుగా” (చూడండి: సంఖ్యలు)
Mark 6:8
μὴ ἄρτον
ఇక్కడ “రొట్టె” అనేది సాధారణంగా ఆహారం కోసం ఒక ఉపలక్షణమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహరం లేదు” (చూడండి: ఉపలక్షణము)
Mark 6:10
ἔλεγεν αὐτοῖς
యేసు పండ్రెండు మందితో అన్నాడు
μένετε ἕως ἂν ἐξέλθητε ἐκεῖθεν
ఇక్కడ “ఉండండి” అనేది ప్రతిరోజు ఆ ఇంటికి తిరిగి వెళ్లి తినుటను మరియు అక్కడే నిద్రించుతాను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆ స్థలం విడచేవరకు ఆ ఇంట్లోనే తినండి మరియు నిద్రించండి” (చూడండి: అన్యాపదేశము)
Mark 6:11
εἰς μαρτύριον αὐτοῖς
వారికి వ్యతిరేక సాక్ష్యంగా. ఈ చర్య వారికి సాక్ష్యంగా ఎలా ఉందో వివరించుటకు ఇది సహాయపడవచ్చు. అలా చేయడం ద్వారా వారు మిమ్మల్ని స్వీకరించలేదని మీరు సాక్ష్యమిస్తారు.
Mark 6:12
ἐξελθόντες
“వారు” అనే మాట పండ్రెండు మందిని గురించి తెలియచేస్తుంది మరియు ఇది యేసును కలిగి లేదు. అలాగే, వారు వివిధ పట్టణాలకు వెళ్ళారని చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వివిధ పట్టణాలకు వెళ్ళారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μετανοῶσιν
ఇక్కడ “దాని నుండి తిరగండి” అంటే ఎదో ఒక పనిని ఆపడమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపం చేయటం ఆపండి” లేక “మీ పాపాలకు పశ్చాత్తాప పడండి” అని ప్రకటించారు” (చూడండి: శబ్దలోపం)
Mark 6:13
δαιμόνια πολλὰ ἐξέβαλλον
వారు ప్రజలనుండి దయ్యాలను వదలించారని చెప్పడం సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ప్రజలనుండి ఎన్నో దయ్యాలను తరిమికొట్టారు” (చూడండి: రూపకం)
Mark 6:14
యేసు చేసిన అద్భుతాల గురించి యేసు విన్నప్పుడు అతను బాప్తిస్మమిచ్చు యోహానును మృతులలో నుండి ఎవరో లేపారని అనుకుంటాడు. (హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానును చంపుటకు కారణమయ్యాడు.)
ἤκουσεν ὁ βασιλεὺς Ἡρῴδης
“ఇది” అనే మాట యేసు మరియు ఆయన శిష్యులు వివిధ పట్టణాలలో చేయుచున్న ప్రతిదాన్ని గురించి తెలియచేస్తుంది ఇందులో దయ్యాలను వెళ్ళగొట్టడం మరియు ప్రజలను స్వస్థపరచడం కూడా ఉంది.
ἔλεγον, ὅτι Ἰωάννης ὁ βαπτίζων ἐγήγερται
కొంతమంది యేసును బాప్తిస్మమిచ్చు యోహాను అని చెప్పుచున్నారు. ఇది మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొందరు అతనిని బాప్తిస్మమిచ్చు యోహాను అని అంటున్నారు’’ (చూడండి: శబ్దలోపం)
Ἰωάννης ὁ βαπτίζων ἐγήγερται
ఇక్కడ తిరిగి లేచుట అనేది “మళ్ళీ జీవించుటకు కారణమైంది” అనుటకు ఒక భాషీయమైయున్నది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాప్తిస్మమిచ్చు యోహాను మళ్ళీ జీవించుటకు కారణమైయ్యాడు” లేక “దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును తిరిగి బ్రతికించుటకు కారణమైయ్యాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 6:15
ἄλλοι δὲ ἔλεγον, ὅτι ""Ἠλείας ἐστίν
It may be helpful to state why some people thought he was Elijah. Alternate translation: ""Some others said, 'He is Elijah, whom God promised to send back again.'"" (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం) అతను ఏలియా అని కొందరు ఎందుకు అనుకున్నారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరికొందరు, ‘అతడు దేవుడు తిరిగి పంపుతానని’ వాగ్దానం చేసిన ఏలియా అని అన్నారు.” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 6:16
17వ వచనంలో రచయిత హేరోదు ఎందుకు బాప్తిస్మమిచ్చు యోహానును శిరచ్చేదనం చేసాడు మరియు రచయిత హేరోదు గురించి సందర్భ సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. (చూడండి: నేపథ్య సమాచారం)
ὃν ἐγὼ ἀπεκεφάλισα
ఇక్కడ హేరోదు తన గురించి తానూ తెలియచేయుటకు “నేను” అనే మాటను ఉపయోగిస్తాడు. “నేను” అనే మాట హేరోదు సైనికులకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా సైనికులకు యోహాను తలను నరకమని చెప్పాను” (చూడండి: అన్యాపదేశము)
ἠγέρθη
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మళ్ళీ బతికి వచ్చాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 6:17
ὁ Ἡρῴδης, ἀποστείλας ἐκράτησεν τὸν Ἰωάννην, καὶ ἔδησεν αὐτὸν ἐν φυλακῇ
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహానును బంధించుటకు హేరోదు తన సైనికులను పంపించి, ఆతని ఖైదులో వేయించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀποστείλας
కలిగి ఉండాలని ఆదేశించారు
διὰ Ἡρῳδιάδα
హేరోదియా కారణంగా
τὴν γυναῖκα Φιλίππου, τοῦ ἀδελφοῦ αὐτοῦ
తన సోదరుడైన ఫిలిప్పు భార్య. హేరోదు సోదరుడైన ఫిలిప్పు అపోస్తలుల కార్యంలో ఉన్న సువార్తికుడు లేక యేసు పండ్రెండు మంది శిష్యులలో ఒకడైన ఫిలిప్పు ఒకరే కాదు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ὅτι αὐτὴν ἐγάμησεν
హేరోదు ఆమెను వివాహం చేసుకున్నాడు
Mark 6:19
ἤθελεν αὐτὸν ἀποκτεῖναι, καὶ οὐκ ἠδύνατο
హేరోదియా ఈ వాక్యభాగామునకు సంబంధించింది మరియు యోహాను’ను వేరొకరు ఉరితియాలని ఆమె కోరుకుంటున్నందున “ఆమె” అనేది ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా అతనిని చంపాలని కోరుకుంది కాని ఆమె అతనిని చంపలేదు” (చూడండి: అన్యాపదేశము)
Mark 6:20
ὁ γὰρ Ἡρῴδης ἐφοβεῖτο τὸν Ἰωάννην, εἰδὼς
హేరోదు యోహానుకు ఎందుకు భయపడ్డాడో మరింత స్పష్టంగా చూపించుటకు ఈ రెండు నిబంధనలను భిన్నంగా అనుసంధానించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “హేరోదు యోహానుకు తెలుసు కాబట్టి అతనికి భయపడ్డాడు” (చూడండి: పదాలు మరియు పదబంధాలను కనెక్ట్ చేస్తోంది)
εἰδὼς αὐτὸν ἄνδρα δίκαιον
యోహాను నీతిమంతుడని హీరోదుకు తెలుసు
ἀκούσας αὐτοῦ
యోహాను మాటలను వింటూ
Mark 6:21
రచయిత హేరోదు గురించి మరియు బాప్తిస్మమిచ్చు యోహాను శిరచ్చేదనం గురించి సందర్భ సమాచారం ఇస్తూనే ఉన్నాడు. (చూడండి: నేపథ్య సమాచారం)
δεῖπνον ἐποίησεν, τοῖς μεγιστᾶσιν αὐτοῦ…τῆς Γαλιλαίας
ఇక్కడ “అతను” అనే మాట హీరోడును గురించి తెలియచేస్తుంది మరియు ఇది భోజనం తయారు సిద్ధంచేయమని ఆజ్ఞాపించమని అతని సేవకునికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను తన అధికారుల కోసం ... గలిలయకు” లేక అధికారులను ... గలిలయలో తనతో కలసి తినుటకు మరియు విందు జరుపుకునేందుకు ఆహ్వానించాడు”
δεῖπνον
అధికారిక భోజనం లేక విందు
Mark 6:22
αὐτοῦ Ἡρῳδιάδος
“ఆమె” అనే పదం ఆత్మార్థక సర్వనామమైయున్నది, ఇది విందులో నృత్యం చేసిన హేరోదియా స్వంత కుమార్తె అని నొక్కి చెప్పడం విశేషం. (చూడండి: రిఫ్లెక్సివ్ సర్వనామాలు *)
εἰσελθούσης
గదిలోకి వచ్చింది
Mark 6:23
ἐάν με αἰτήσῃς…τῆς βασιλείας μου
నువ్వు అడిగినట్లయితే, నా స్వంత రాజ్యంలో మరియు నేను పరిపాలించే సగం రాజ్యము నీకు ఇస్తాను
Mark 6:24
ἐξελθοῦσα
గది నుండి బయటకు వెళ్ళింది
Mark 6:25
πίνακι
పలక మీద లేక “పెద్ద చెక్క వంటకం మీద”
Mark 6:26
διὰ τοὺς ὅρκους καὶ τοὺς συνανακειμένους
ప్రమాణం యొక్క పరిమాణం మరియు ప్రమాణం మరియు విందు అతిథుల మధ్య సంబంధమును స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతను ఆమె అడిగిన దేనినైనను ఆమెకు ఇస్తానని ప్రమాణం చేయుటను అతని విందు అతిథులు విన్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 6:28
ἐπὶ πίνακι
ఒక పళ్ళెంలో
Mark 6:29
ἀκούσαντες, οἱ μαθηταὶ αὐτοῦ
యోహాను శిష్యులు ఉన్నప్పుడు
Mark 6:30
శిష్యులు భోధన నుండి మరియు స్వస్థ పరచుట నుండి తిరిగి వచ్చిన తరువాత, వారు ఒంటరిగా ఉండుటకు ఎక్కడికో వెళ్ళుతారు కాని యేసు బోధను వినుటకు చాలా మంది ఉన్నారు. ఆలస్యం అయినప్పుడు ఆయన ప్రజలకు ఆహారం ఇస్తాడు మరియు ఆయన ఒంటరిగా ప్రార్ధించేటప్పుడు అందరిని దూరంగా పంపుతాడు.
Mark 6:31
ἔρημον τόπον
ప్రజలు లేని ప్రదేశం
ἦσαν…οἱ ἐρχόμενοι καὶ οἱ ὑπάγοντες πολλοί
ప్రజలు నిరంతరం అపోస్తలుల దగ్గరకు వస్తూ వారినుండి దూరంగా పోతున్నారని దీని అర్థం.
οὐδὲ…εὐκαίρουν
“వారు” అనే మాట అపోస్తలులను గురించి తెలియచేస్తుంది.
Mark 6:32
καὶ ἀπῆλθον
ఇక్కడ “వారు” అనే మాటలో అపోస్తలులు మరియు యేసు ఇద్దరూ ఉన్నారు.
Mark 6:33
εἶδον αὐτοὺς ὑπάγοντας
ప్రజలు యేసు మరియు అపోస్తలులు వెళ్ళడం చూసారు
πεζῇ
శిష్యులు పడవలో ఎలా వెళ్ళారో అనేదానికి భిన్నంగా ప్రజలు భూమిమీద కాలినడకన వెళ్ళుతున్నారు
Mark 6:34
εἶδεν πολὺν ὄχλον
యేసు గొప్ప జనసమూహమును చూసాడు
ἦσαν ὡς πρόβατα μὴ ἔχοντα ποιμένα
యేసు ప్రజలను గొర్రెలను నడిపించే గొర్రెల కాపరి లేనప్పుడు కలవరమునకు గురైన గొర్రెలతో పోలుస్తాడు. (చూడండి: ఉపమ)
Mark 6:35
καὶ ἤδη ὥρας πολλῆς γενομένης
దీని ఆర్థం పొద్దుపోయింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆలస్యం అవుతున్నప్పుడు” లేక “మధ్యాహ్నం ఆలస్యమైనప్పుడు” (చూడండి: జాతీయం (నుడికారం))
ἔρημός ἐστιν ὁ τόπος
ఇది ప్రజలు లేని నిర్జీవ స్థలమును గురించి తెలియచేస్తుంది. మార్కు 6:31లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
Mark 6:37
ὁ δὲ ἀποκριθεὶς εἶπεν αὐτοῖς
యేసు సమాధానం చెప్పి ఆయన శిష్యులతో ఇలా అన్నాడు
ἀπελθόντες, ἀγοράσωμεν δηναρίων διακοσίων ἄρτους, καὶ δώσομεν αὐτοῖς φαγεῖν?
ఈ జనసమూహమునకు తగినంత ఆహారం కొనడానికి తమకు మార్గం లేదని చెప్పుటకు శిష్యులు ఈ ప్రశ్న అడుగుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా దగ్గర రెండు వందల దేనారములు ఉన్నాప్పటికీ ఈ జనసమూహమునకు ఆహారం ఇచ్చుటకు మేము తగినన్ని రొట్టెలు కొనలేము!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
δηναρίων διακοσίων
200 దేనారాలు. “దేనారాలు” అనేది “దేనారి” అనే మాట యొక్క ఏకవచన రూపంమైయున్నది. ఒక దేనారం ఒక రోజు వేతనానికి సమమైన విలువగల రోమన్ వెండి నాణెమైయున్నది. (చూడండి: బైబిల్ డబ్బు మరియు సంఖ్యలు)
Mark 6:38
ἄρτους
ఆకారంలో మరియు కాల్చిన రొట్టె పిండి ముద్దలు
Mark 6:39
τῷ χλωρῷ χόρτῳ
ఆరోగ్యకరమైన గడ్డి కోసం మీ భాషలో ఉపయోగించిన రంగు మాటతో గడ్డిని వివరించండి ఇది పచ్చ రంగు కావచ్చు లేక కాకపోవచ్చు.
Mark 6:40
πρασιαὶ, κατὰ ἑκατὸν καὶ κατὰ πεντήκοντα
ఇది ప్రతి సమూహములోని వ్యక్తుల సంఖ్యను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొన్ని సమూహాలలో యాభై మంది మరియు కొన్ని సమూహాలలో వంద మంది ఉన్నారు” (చూడండి: సంఖ్యలు మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 6:41
ἀναβλέψας εἰς τὸν οὐρανὸν
దేవుడు నివసించి ఉన్న ప్రదేశంతో ముడిపడి ఉన్న ఆకాశం వైపు ఆయన చూసాడు.
εὐλόγησεν
ఆయన ఒక ఆశీర్వచనము చెప్పాడు లేక “ఆయన కృతజ్ఞతలు చెప్పాడు”
καὶ τοὺς δύο ἰχθύας ἐμέρισεν πᾶσιν
ఆయన రెండు చేపలను కూడా భాగం చేసాడు తద్వారా ప్రతి ఒక్కరూ కొంత కలిగి ఉంటారు
Mark 6:43
ἦραν
సాధ్యమైయ్యే అర్థాలు 1) “శిష్యులు చేపట్టారు” లేక 2) “ప్రజలు చేపట్టారు.”
κλάσματα δώδεκα κοφίνων πληρώματα
విరిగిన రొట్టె ముక్కలతో నిండిన పన్నెండు గంపలు
δώδεκα κοφίνων
12 గంపలు (చూడండి: సంఖ్యలు)
Mark 6:44
πεντακισχίλιοι ἄνδρες
5,000 పురుషులు (చూడండి: సంఖ్యలు)
ἦσαν οἱ φαγόντες τοὺς ἄρτους, πεντακισχίλιοι ἄνδρες
స్త్రీలను మరియు పిల్లల సంఖ్యను లెక్కించలేదు. స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారని అర్థం కాకపోతే, దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు రొట్టెలు తిన్నవారిలో ఐదువేలమంది పురుషులు ఉన్నారు. వారు స్త్రీలను మరియు పిల్లలను కూడా లెక్కించలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 6:45
εἰς τὸ πέραν
ఇది గలిలయ సముద్రమును గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గలిలయ సముద్రం యొక్క అవతలి వైపు (చూడండి: శబ్దలోపం)
Βηθσαϊδάν
ఇది గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్న ఒక పట్టణం. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 6:46
ἀποταξάμενος αὐτοῖς
ప్రజలు వెళ్ళినప్పుడు
Mark 6:48
శిష్యులు సరస్సు దాటుటకు ప్రయత్నిస్తుంటే ఎదురుగాలి లేచింది. యేసు నీటిమీద నడవటం చూసి వారు భయపడ్డారు. యేసు ఆ ఎదురుగాలిని ఎలాగు శాంతింప చేస్తారో వారికి అర్థం కాలేదు.
τετάρτην φυλακὴν
ఇది తెల్లవారుజాము 3 గంటలు మరియు సూర్యోదయానికి మధ్య సమయం
Mark 6:49
φάντασμά
చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ లేక ఇతర రకాల ఆత్మ
Mark 6:50
θαρσεῖτε…μὴ φοβεῖσθε
సమానమైన అర్థం కలిగి ఉన్న ఈ రెండు వాక్యాలు ఆయన శిష్యులకు భయపడాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పాయి. అసరమైతే వాటిని ఒకటిగా కలపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు భయపడకండి!” (చూడండి: సమాంతరత)
Mark 6:51
λείαν ἐν ἑαυτοῖς ἐξίσταντο
మీరు నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంటే, వారు ఆశ్చర్యపోయిన వ్వాటిని ఇది పేర్కొంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చేసిన పనికి వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 6:52
ἐπὶ τοῖς ἄρτοις
ఇక్కడ “రొట్టెలు” అనే మాట యేసు రొట్టెల సంఖ్యను రెట్టింపు చేసిన సమయము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు రొట్టెలను రెట్టింపు చేసాడు అనే దాని అర్థం ఏమిటి” లేక “యేసు కొన్ని రొట్టెలను చాలా రొట్టేలగుటకు కారణమయ్యాడు అనే దాని అర్థం ఏమిటి” (చూడండి: అన్యాపదేశము)
ἦν αὐτῶν ἡ καρδία πεπωρωμένη
కఠినమైన హృదయమును కలిగి ఉండి అర్థం చేసుకొనుట చాలా మొండిగా ఉండటమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అర్థం చేసుకొనుటకు చాలా మొండిగా ఉన్నారు” (చూడండి: రూపకం)
Mark 6:53
యేసు మరియు ఆయన శిష్యులు తమ పడవలో గెన్నేసరేతు అను ప్రాంతమునకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయనను చూస్తారు మరియు ప్రజలు స్వస్థత పొందుటకై వారిని ఆయన దగ్గరకు తీసుకొని వస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది.
Γεννησαρὲτ
ఇది గలిలయ సముద్రం యొక్క వాయవ్య దిశలో ఉన్న ప్రాంతం యొక్క పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 6:55
περιέδραμον ὅλην τὴν χώραν
వారు ఈ ప్రాంతం గుండా ఎందుకు పరుగేత్తారో చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అక్కడ ఉన్నాడని చెప్పుటకు వారు మొత్తం ప్రదేశమంతటా పరుగెత్తారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
περιέδραμον…ἤκουον
“వారు” అనే మాట యేసును గుర్తించిన ప్రజలను గురించి తెలియచేస్తుంది కాని శిష్యులను గురించి కాదు.
τοὺς κακῶς ἔχοντας
ఈ వాక్య భాగం ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోగులు” (చూడండి: నామకార్థ విశేషణాలు)
Mark 6:56
ὅπου ἂν εἰσεπορεύετο
యేసు ప్రవేశించిన చోటేల్ల
ἐτίθεσαν
ఇక్కడ “వారు” అనే మాట ప్రజలను గురించి తెలియచేస్తుంది కాని ఇది యేసు శిష్యులను గురించి తెలియచేయదు.
τοὺς ἀσθενοῦντας
ఈ వాక్య భాగం ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోగులు” (చూడండి: నామకార్థ విశేషణాలు)
παρεκάλουν αὐτὸν
సాధ్యమయ్యే అర్థాలు 1) “రోగి ఆయనను వేడుకున్నాడు” లేక 2) “ప్రజలు ఆయనను వేడుకున్నారు.”
ἅψωνται
“వారిని” అనే మాట రోగులను గురించి తెలియచేస్తుంది.
τοῦ κρασπέδου τοῦ ἱματίου αὐτοῦ
ఆయన అంగిని లేక “ఆయన వస్త్రపు అంచు”
ὅσοι ἂν
వారందరు
Mark 7
మర్కు సువార్త 07వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 7:6-7 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
చేతులు కడుగుకొనుట
పరిసయ్యులు మురికిగా ఉన్న చాలా వస్తువులను కడుగుతారు ఎందుకంటే వారు మంచివారని దేవుడు అనుకోవాలని ఇలా చేస్తారు. చేతులు మురికిగా లేకపోయినా వారు తినడానికి ముందు వారు చేతులు కడుగుకుంటారు. మరియు మోషే ధర్మశాస్త్రం కూడా వారు ఇది చేయవలసి ఉందని చెప్పలేదు. వారు చేసేది తప్పు అని యేసు వారితో చెప్పాడు. మరియు ప్రజలు సరైన పనులను ఆలోచించడం మరియు చేయడం ద్వారా దేవుని సంతోషపరుస్తారు. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం మరియు శుద్ధమైన, కడుగు)
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
“ఎఫ్ఫతా”
ఇది ఒక అరామిక్ పదమైయున్నది. మార్కు అది ధ్వనించే విధంగా గ్రీకు అక్షరాలను ఉపయోగించి వ్రాసాడు మరయు దాని అర్థం ఏమిటనేది వివరించాడు. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
Mark 7:1
యేసు పరిసయ్యులను మరియు ధర్మశాస్త్ర పండితులను ఖండించాడు.
συνάγονται πρὸς αὐτὸν
యేసు చుట్టూ గుమిగూడారు
Mark 7:2
3 మరియు 4 వచనాలలో యేసు శిష్యులు తినుటకు ముందే చేతులు కడుగుకొనలేదని పరిసయ్యులు ఎందుకు బాధపడ్డారో చూపించుటకు పరిసయ్యుల కడుగుకునే ఆచారాల గురించి రచయిత సందర్భ సమాచారం ఇస్తాడు. యు.ఎస్.టి(UST)లో ఉన్న విధంగా అర్థం చేసుకొనుటను సులభతరం చేయుటకు ఈ సమాచార క్రమమును మార్చవచ్చు. (చూడండి నేపథ్య సమాచారం మరియు వచన వారధులు)
ἰδόντες
పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర పండితులు చూసారు
τοῦτ’ ἔστιν ἀνίπτοις
శిష్యుల చేతులు ఎందుకు అపవిత్రం అయ్యయో “అశుద్ధమైన” అనే మాట వివరిస్తుంది. ఇది క్రీయాశీల రూపంలో వ్యక్తపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంటే, వారు కడగని చేతులతో” లేక “అంటే, వారు చేతులు కడుక్కొనలేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 7:3
τῶν πρεσβυτέρων
యూదుల పెద్దలు తమ సమాజ నాయకులు మరియు ప్రజలకు న్యాయము తీర్చేవారు కూడా అయియున్నారు.
Mark 7:4
χαλκίων
రాగి కొప్పెరలు మరియు “ఇత్తడి పత్రాలు”
Mark 7:5
διὰ τί οὐ περιπατοῦσιν οἱ μαθηταί σου κατὰ τὴν παράδοσιν τῶν πρεσβυτέρων, ἀλλὰ κοιναῖς χερσὶν ἐσθίουσιν τὸν ἄρτον?
ఇక్కడ నడవడం అనేది “పాటించడం”కు ఒక రూపకఅలంకారమైయున్నది. యేసు అధికారమును సవాలు చేయుటకు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర పండితులు ఈ ప్రశ్న అడిగారు. దీనిని రెండు ప్రకటనలుగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ శిష్యులు మా పెద్దల సాంప్రదాయాలకు అవిధేయత చూపిస్తారు! వారు మన ఆచారాలు ఉపయోగించి చేతులు కడుక్కోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు రూపకం)
ἄρτον
ఇది ఒక ఉపలక్షణమైయున్నది, ఇది ఆహారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం” (చూడండి: ఉపలక్షణము)
Mark 7:6
చాలా సంవత్సరాల క్రితం లేఖనము వ్రాసిన యెషయా ప్రవక్తను ఇక్కడ యేసు ఉల్లేఖిస్తున్నాడు.
τοῖς χείλεσίν
ఇక్కడ “పెదవులు” అనేది మాట్లాడుటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చెప్పేదాని ద్వారా” (చూడండి: అన్యాపదేశము)
ἡ δὲ καρδία αὐτῶν πόρρω ἀπέχει ἀπ’ ἐμοῦ
ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను లేక భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. ఇది ప్రజలు దేవునికి అంకిత భావంతో లేరని చెప్పే మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ వారు నిజంగా నన్ను ప్రేమించరు” (చూడండి: అన్యాపదేశము మరియు జాతీయం (నుడికారం))
Mark 7:7
μάτην δὲ σέβονταί με
వారు నాకు పనికిరాని ఆరాధన చేస్తారు లేక “వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు”
Mark 7:8
యేసు పరిసయ్యులను మరియు ధర్మశాస్త్ర పండితులను ఖండించడం కొనసాగిస్తూనే ఉన్నాడు.
ἀφέντες
పాటించుటను తోసిపుచ్చారు
κρατεῖτε
గట్టిగా పట్టుకోండి లేక “వాటిని మాత్రమే ఉంచండి”
Mark 7:9
καλῶς ἀθετεῖτε τὴν ἐντολὴν τοῦ Θεοῦ…τὴν παράδοσιν ὑμῶν τηρήσητε
దేవుని ఆజ్ఞలను విడచి మీరినందుకు యేసు తన శ్రోతలను గద్దించుటకు ఈ వ్యంగ్య ప్రకటనను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని ఆజ్ఞను తిరస్కరించి మీరు ఎంత బాగా చేసారని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు మీ స్వంత సంప్రదాయాలను పాటించవచ్చు, కాని మీరు చేసినది మంచిది కాదు” (చూడండి: వ్యంగ్యోక్తి)
καλῶς ἀθετεῖτε τὴν ἐντολὴν τοῦ Θεοῦ…τὴν παράδοσιν ὑμῶν τηρήσητε
మీరు ఎంత నైపుణ్యంగా తిరస్కరించారు
Mark 7:10
ὁ κακολογῶν πατέρα
శపించేవారు
θανάτῳ τελευτάτω
వారికి మరణ శిక్ష విధించాలి
ὁ κακολογῶν πατέρα ἢ μητέρα θανάτῳ τελευτάτω
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన తండ్రి లేక తండ్రి గురించి చేడుగా మాట్లాడే వ్యక్తిని అధికారులు ఉరితియాలి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 7:11
κορβᾶν, (ὅ ἐστιν δῶρον), ὃ ἐὰν ἐξ ἐμοῦ ὠφεληθῇς
దేవాలయమునకు ఒక సారి డబ్బు లేక ఇతర వస్తువులు వాగ్దానం చేయబడితే, వాటిని మరి ఎటువంటి ఇతర ప్రయోజనాలకై ఉపయోగించలేమని ధర్మశాస్త్ర పండితుల సంప్రదాయం తెలిపింది.
κορβᾶν
ఇక్కడ కోర్బాన్ అనేది ఒక హెబ్రీ పదమైయున్నది. ఇది ప్రజలు దేవునికి ఇస్తానని వాగ్దానం చేసే వస్తువులను గురించి తెలియచేస్తుంది. తర్జుమా చేయువారు సాధారణంగా లక్ష్య భాష వర్ణమాల ఉపయోగించి దీనిని ప్రతిలిఖిస్తారు. కొంత మంది తర్జుమా చేయువారు దాని అర్థాన్ని తర్జుమా చేస్తారు, ఆపై మార్కు యొక్క వివరణను అనుసరించే అర్థమును వదలివేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి బహుమతి” లేక “దేవునికి చెందినది” (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
δῶρον
ఈ వాక్యభాగం “కోర్బాన్” అనే హెబ్రీ పదం యొక్క అర్థమును వివరిస్తుంది. ఇది క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. మార్కు యూదులు కాని చదవరులకు యేసు చెప్పినదానిని అర్థం చేసుకొనుటకు దాని అర్థమును వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దానిని దేవుని ఇచ్చాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 7:12
11 మరియు 12వ వచనాలలో పరిసయ్యులు తమ తలిదండ్రులను గౌరవించమని దేవుని ఆజ్ఞను పాటించాల్సిన అవసరం లేదని ప్రజలకు ఎలా బోధిస్తారో యేసు చూపించారు. 11వ వచనంలో పరిసయ్యులు తమ ఆస్తుల గురించి చెప్పుటకు ప్రజలకు అనుమతించడమును యేసు చెపుతాడు. మరియు 12వ వచనంలో తలిదండ్రులకు సహాయం చేసే వ్యక్తుల పట్ల పరిసయ్యుల వైఖరిని ఇది ఎలా చూపిస్తుందో చెపుతుంది. తలిదండ్రులకు సహాయం చేసే వ్యక్తుల పట్ల పరిసయ్యుల వైఖరి గురించి మొదట చెప్పుటకు ఈ సమాచారమును క్రమపరచవచ్చు మరియు పరిసయ్యులు తమ ఆస్తుల గురించి చెప్పుటకు ప్రజలను అనుమతించే దానిలో ఆ వైఖరి ఎలా చూపబదతుందో చెప్పబడింది. (చూడండి: వచన వారధులు)
οὐκέτι ἀφίετε αὐτὸν οὐδὲν ποιῆσαι τῷ πατρὶ ἢ τῇ μητρί
ఇలా చేయడం ద్వారా, పరిసయ్యులు దేవునికి ఇస్తానని వాగ్దానం చేస్తే ప్రజలు తమ తలిదండ్రులకు ఇవ్వకూడదని వారు అనుమతిస్తారు. 11వ వచనంలోని “ఏ సహాయమైన” తో మొదలైయ్యే మాటల ముందు మీరు ఈ పదాలను క్రమపరచవచ్చు: ఒక వ్యక్తి తన తండ్రి లేక తల్లి కోసం ఏదైనా చేయుటకు మీరు ఇకపై అనుమతించరు మీరు నా నుండి ఏ సహాయం పొందినా కోర్బాన్.’ (కోర్బాన్ అంటే ‘దేవునికి సమర్పితమైనది’)” (చూడండి” ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:13
ἀκυροῦντες
కొట్టివేయబడింది లేక తీసివేయబడింది
παρόμοια τοιαῦτα πολλὰ ποιεῖτε
మీరు ఇలాంటి పనులను కూడా చేస్తున్నారు
Mark 7:14
యేసు ధర్మశాస్త్ర పండితులకు మరియు పరిసయ్యులకు ఏమి చెపుతున్నాడో అర్థం చేసుకొనుటకు వారికి సహాయపడునని ఒక ఉపమానమును చెప్పును. (చూడండి: ఉపమానాలు)
προσκαλεσάμενος
యేసు పిలిచాడు
ἀκούσατέ μου πάντες καὶ σύνετε
“వినండి” మరియు “అర్థం చేసుకోండి” ఒకదానికొకటి సంబంధించినవి. తానూ చెప్పేదానిని వినే వారు ఆయన చెప్పేదానికి చాలా శ్రద్ధ వహించాలని నొక్కి చెప్పుటకు వాటిని కలిపి ఉపయోగిస్తాడు. (చూడండి: జంటపదం)
σύνετε
అర్థం చేసుకొనుటకు యేసు చెప్పేటువంటి దానిని చెప్పడం సహాయ పడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు చెప్పబోయే దానిని అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి” (చూడండి: శబ్దలోపం)
Mark 7:15
οὐδέν…ἔξωθεν τοῦ ἀνθρώπου
యేసు ఒక వ్యక్తి తినే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది “వ్యక్తినుండి బయటకు వచ్చేదానికి” భిన్నంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తి వెలుపల నుండి తినగలిగేది ఏమి లేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τὰ ἐκ τοῦ ἀνθρώπου ἐκπορευόμενά
ఇది ఒక వ్యక్తి చేసే సంగతులు లేక చెప్పే సంగతులను గురించి తెలియచేస్తుంది. ఇది “తనలోకి ప్రవేశించే వ్యక్తికి వెలుపల ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది.” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి నుండి అతను చెప్పేది లేక చేసేది బయటకు వస్తుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:17
యేసు ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మరియు జనసమూహముతో చెప్పినది శిష్యులకు ఇప్పటికి అర్థం కాలేదు. యేసు తన ఉపమానాల అర్థమును చక్కగా వివరించాడు.
καὶ
ప్రధాన కథనా క్రమములో విరామమును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. యేసు ఇప్పుడు జనసమూహానికి దూరంగా తన ఇంట్లో ఉన్నాడు.
Mark 7:18
యేసు తన శిష్యులను ఒక ప్రశ్న అడగడం ద్వారా వారికి నేర్పించడం ప్రారంభిస్తాడు.
οὕτως καὶ ὑμεῖς ἀσύνετοί ἐστε?
వారు అర్థం చేసుకోలేదని తన నిరాశను వ్యక్తపరచుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పినది చేసిన తరువాత, మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 7:19
యేసు తన శిష్యులకు బోధించుటకు ఉపయోగిస్తున్న ప్రశ్న అడగటం ముగించాడు.
ὅτι…εἰς τὸν ἀφεδρῶνα ἐκπορεύεται?
18వ వచనంలోని “మీరు చూడలేదా” అనే పదాలతో ప్రారంభమైయ్యే ప్రశ్నలకు ఇది ముగింపు అయియున్నది. యేసు తన శిష్యులు ఇప్పటికే తెలుసుకోవలసిన విషయమును నేర్పించుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. బయటనుండి ఒక వ్యక్తి లోపల ప్రవేశించేది అతనిని అపవిత్రం చేయలేదని మీరు ఇప్పటికే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది అతని హృదయం లోనికి వెళ్ళదు, కాని అది అతని కడుపులోకి వెళ్ళి ఆపై బయటకు వెళ్ళుతుంది” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐκ εἰσπορεύεται αὐτοῦ εἰς τὴν καρδίαν
ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరైయున్నది. ఇక్కడ యేసు మాటల యొక్క అర్థం ఆహారం ఒక వ్యక్తి స్వభావమును ప్రభావితం చేయదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది అతని అంతరంగములోనికి వెళ్ళదు” లేక అది అతని మనస్సులోనికి వెళ్ళదు” (చూడండి: అన్యాపదేశము)
οὐκ εἰσπορεύεται
ఇక్కడ “ఇది” అనేది ఒక వ్యక్తిలోనికి ఏమైతే వెళ్ళుతుందో దానిని గురించి తెలియచేస్తుంది.
(καθαρίζων πάντα τὰ βρώματα
ఈ వక్యభాగం యొక్క అర్థము ఏమిటో స్పష్టంగా వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్నిఆహార పదార్థాలు పవిత్రంగానే ఉంటాయి, అంటే తినేవాడు అపవిత్రం అని భావించకుండా దేవుని విచారించకుండా ఏ ఆహారమునైనా తినవచ్చు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:20
ἔλεγεν
యేసు చెప్పాడు
τὸ ἐκ τοῦ ἀνθρώπου ἐκπορευόμενον, ἐκεῖνο κοινοῖ τὸν ἄνθρωπον
ఒక వ్యక్తిని అపవిత్రం చేసేది ఆ వ్యక్తిలో నుండి బయటకు వచ్చేది
Mark 7:21
ἐκ τῆς καρδίας…οἱ διαλογισμοὶ οἱ κακοὶ ἐκπορεύονται
ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంతరంగమునుండి చెడు ఆలోచనలు వస్తాయి” లేక “మనస్సునుండి చెడు ఆలోచనలు వస్తాయి” (చూడండి: అన్యాపదేశము)
Mark 7:22
ἀσέλγεια
ఒకరి కామ కోరికలను నియంత్రించడం లేదు
Mark 7:23
ἔσωθεν ἐκπορεύεται
ఇక్కడ “లోపల” అనే మాట ఒక వ్యక్తి హృదయమును గురించి వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి హృదయం నుండి వస్తాయి” లేక ఒక వ్యక్తి ఆలోచనల నుండి వస్తాయి” (చూడండి: శబ్దలోపం)
Mark 7:24
యేసు తూరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అద్భుతమైన విశ్వాసం ఉన్న అన్యజనుల కుమార్తెను స్వస్థపరుస్తాడు.
Mark 7:25
εἶχεν…πνεῦμα ἀκάθαρτον
ఇది ఒక భాషీయమైయున్నది అంటే ఆమె అపవిత్రాత్మ కలిగి ఉందని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మ కలిగి ఉంది” (చూడండి: జాతీయం (నుడికారం))
προσέπεσεν
ఆమె మోకరించింది. ఇది గౌరవం మరియు సమర్పణ చర్యయైయున్నది.
Mark 7:26
ἡ δὲ γυνὴ ἦν Ἑλληνίς, Συροφοινίκισσα τῷ γένει
“ఇప్పుడు” అనే మాట ప్రధాన కథాంశంలో నుండి విరామంను సూచిస్తుంది, ఎందుకంటే ఈ వాక్యం ఆ స్త్రీని గురించి సందర్భ సమాచారం ఇస్తుంది. (చూడండి: నేపథ్య సమాచారం)
Συροφοινίκισσα
ఇది స్త్రీ యొక్క జాతీయత పేరు. ఆమె సిరియాకు చెందినా ఫెనికయా ప్రాంతంలో పుట్టింది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 7:27
ἄφες πρῶτον χορτασθῆναι τὰ τέκνα; οὐ γάρ ἐστιν καλόν…τοῖς κυναρίοις βαλεῖν
ఇక్కడ యేసు యూదుల గురించి పిల్లలని మరియు అన్యజనుల గురించి కుక్కలని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇశ్రాయేలీయులు మొదట ఆహారం తినాలి. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్కలవలె ఉన్న అన్యజనులకు విసిరివేయడం తగదు” (చూడండి: రూపకం)
ἄφες πρῶτον χορτασθῆναι τὰ τέκνα
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మొదట ఇశ్రాయేలీయులకు ఆహారం తినిపించాలి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἄρτον
ఇది సాధారణంగా ఆహారమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం” (చూడండి: ఉపలక్షణము)
τοῖς κυναρίοις
ఇది పెంపుడు ప్రాణులుగా ఉంచబడిన చిన్న కుక్కలను సూచిస్తుంది
Mark 7:29
ὕπαγε
తన కుమార్తెకు సహాయం చేయమని అడుగుటకు ఆమె ఇకపై ఉండవలసిన అవసరం లేదని యేసు సూచిస్తారు. ఆయన అది చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఇప్పుడే వెళ్ళవచ్చు” లేక నీవు నిశ్చింతంగా ఇంటికి వెళ్ళవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐξελήλυθεν τὸ δαιμόνιον, ἐκ τῆς θυγατρός σου
యేసు ఆ స్త్రీ యొక్క దయ్యము పట్టిన కుమార్తెలో నుండి దయ్యమును వెళ్ళగొట్టాడు. దీనిని స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మను నీ కూతురునుండి వదిలిపెట్టి వెళ్ళేలా చేసాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:31
తూరులోని జనులను స్వస్థపరచిన తరువాత, యేసు గలిలయ సముద్రానికి వెళ్తాడు. అక్కడ ఆయన చెవిటి వ్యక్తిని బాగుపరుస్తాడు.
πάλιν ἐξελθὼν ἐκ τῶν ὁρίων Τύρου
తూరు ప్రాంతంను విడచిపెట్టాడు
ἀνὰ μέσον τῶν ὁρίων
సాధ్యమయ్యే అర్థాలు 1) “ఈ ప్రాంతలో” యేసు దెకపోలి ప్రాంతంలోని సముద్రం దగ్గర ఉన్నాడు లేక 2) “ఈ ప్రాంతం గుండా” యేసు దెకపోలి ప్రాంతం గుండా సముద్రం దగ్గరకు వెళ్ళాడు.
Δεκαπόλεως
ఇది పది పట్టణములు అని అర్థమున్న ప్రాంతం పేరు. ఇది గలిలయ సముద్రం యొక్క ఆగ్నేయంలో ఉంది. మార్కు 5:20 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 7:32
φέρουσιν
మరియు ప్రజలు తీసుకు వచ్చారు
κωφὸν
వినలేకపోయాడో వానిని
παρακαλοῦσιν αὐτὸν ἵνα ἐπιθῇ αὐτῷ τὴν χεῖρα
ప్రవక్తలు మరియు గురువులు ప్రజలను స్వస్థ పరచుటకు లేక వారిని ఆశీర్వదించుటకు వారిపై చేయి ఉంచుతారు. ఈ సందర్భములో ఆ మనిషిని స్వస్థపరచమని ప్రజలు యేసును వేడుకుంటున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తిని స్వస్థ పరచేందుకు తనపై చేయి వేయమని వారు యేసును వేడుకున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:33
ἀπολαβόμενος αὐτὸν
యేసు ఆ వ్యక్తిని జనములో నుండి తీసుకొని వెళ్ళాడు
ἔβαλεν τοὺς δακτύλους αὐτοῦ εἰς τὰ ὦτα αὐτοῦ
యేసు తన వేళ్ళను ఆ మనిషి చెవుల్లో ఉంచాడు.
πτύσας, ἥψατο τῆς γλώσσης αὐτοῦ
యేసు ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు.
πτύσας
యేసు తన వెళ్ళ మీద ఉమ్మివేసాడు అని చెప్పడం సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన వెళ్ళమీద ఉమ్మివేసిన తరువాత” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 7:34
ἀναβλέψας εἰς τὸν οὐρανὸν
దేవుడు నివసించే ప్రదేశంతో సంబంధం ఉన్న ఆకాశం వైపు ఆయన చూసాడని దీని అర్థం.
ἐφφαθά
ఇక్కడ రచయిత అరామిక్ పదము ద్వారా దేని గురించో తెలియచేస్తాడు. మీ వర్ణమాల ఉపయోగించి మీ భాషలోకి వచ్చినట్లుగా ఈ మాటను అనుకరించాలి. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
ἐστέναξεν
దీని అర్థం అతను నిట్టుర్పు విడచాడు లేక వినగలిగే సుదీర్ఘ లోతైన శ్వాసను విడచిపెట్టాడు. ఇది మనిషి పట్ల యేసుకున్న సానుభూతిని చూపిస్తుంది.
λέγει αὐτῷ
మనిషితో అన్నారు
Mark 7:35
ἠνοίγησαν αὐτοῦ αἱ ἀκοαί
అంటే అతను వినగాలిగాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని చెవులు తెరచుకున్నాయి మరియు అతను వినగాలిగాడు” లేక “అతను వినగలిగాడు”
ἐλύθη ὁ δεσμὸς τῆς γλώσσης αὐτοῦ
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన నాలుక మాట్లాడకుండా నిరోధించిన వాటిని యేసు తీసివేసాడు” లేక “యేసు అతని నాలుకను సడలించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 7:36
ὅσον…αὐτοῖς διεστέλλετο, αὐτοὶ
యేసును చేసిన దాని గురించి ఎవ్వరితోనూ చెప్పవద్దని వారిని ఆదేశించడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవ్వరితోను చెప్పవద్దని ఆతను వారికి ఆదేశించాడు” (చూడండి: శబ్దలోపం)
μᾶλλον περισσότερον
మరింత అధికముగా లేక “ఎక్కువగా”
Mark 7:37
ὑπέρ περισσῶς ἐξεπλήσσοντο
సంపూర్ణముగా ఆశ్చర్యపోయారు లేక “చాలా ఆశ్చర్యపోయారు” లేక “అంతులేని ఆశ్చర్యపోయారు”
τοὺς κωφοὺς…ἀλάλους
ఇవి ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెవిటి వ్యక్తులు ... మూగ ప్రజలు” లేక “వినలేని వ్యక్తులు ... మాట్లాడలేని వ్యక్తులు” (చూడండి: అన్యాపదేశము)
Mark 8
మర్కు సువార్త 08వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
రొట్టె
యేసు ఒక అద్భుతం చేసి పెద్ద జన సమూహమునకు రొట్టెలు అందించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆహారమును అందించాడని బహుశా వారు ఆలోచించారు.
\nమధు శిలీంద్రం అనేది రొట్టెలు కాల్చుటకు ముందే రొట్టెను పెద్దదిగా మార్చే పదార్థం. ఈ అధ్యాయంలో, ప్రజలు ఆలోచించే, మాట్లాడే మరియు పనిచేసే విధానమును మార్చే విషయాల కోసం మధు శిలీంద్రమును యేసు ఒక రూపకఅలంకారము వలే ఉపయోగిస్తాడు. (చూడండి: రూపకం)
“వ్యభిచారం చేసే తరం”
యేసు ప్రజలను వ్యభిచారం చేయు తరం అని పిలచినప్పుడు, వారు దేవునికి నమ్మకముగా లేరని ఆయన వారికి చెప్తున్నాడు. (చూడండి: విశ్వసనీయ, విశ్వాస్యత, అవిశ్వసనీయ, అవిశ్వాస్యత, నమ్మదగిన మరియు దేవుని ప్రజలు)
ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
అలంకారిక ప్రశ్నలు
శిష్యులకు బోధించే రెండింటి మార్గంగా (మార్కు 8:17-21) మరియు ప్రజలను గద్దించుటకు(మార్కు 8:12) యేసు అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగించాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
వైపరీత్యం
వైపరీత్యం అనేది అసాధ్యమైన దానిని వివరించుటకు కనిపించే నిజమైన ప్రకటనయైయున్నది. యేసు “తన ప్రాణమును కాపాడుకొనేవాడు దానిని కోల్పోతాడు, నా కోసం ప్రాణాలు పోగొట్టుకునేవాడు దానిని కనుగొంటాడు” అని చెప్పినప్పుడు యేసు ఒక శాస్త్ర విరుద్ధమైన మాటను ఉపయోగిస్తాడు. (మార్కు 8:35-37).
Mark 8:1
పెద్ద ఆకలితో ఉన్న జనసమూహం యేసుతో ఉంది. యేసు మరియు ఆయన శిష్యులు పడవలో వేరే ప్రాంతానికి వెళ్ళే ముందు కొన్ని రొట్టెలు మరియు కొన్ని చేపలను మాత్రమే ఉపయోగించి వాటిని వారికి తినిపించాడు
ἐν ἐκείναις ταῖς ἡμέραις
కథలో కొత్త సంగతిని పరిచయం చేయుటకు ఈ వాక్యభాగం ఉపయోగించబడుతుంది. (చూడండి: కొత్త సంఘటన)
Mark 8:2
ἤδη ἡμέραι τρεῖς προσμένουσίν μοι, καὶ οὐκ ἔχουσιν τι φάγωσιν
ఈ మూడు రోజుల నుండి ఈ ప్రజలు నాతో ఉన్నారు తినడానికి వారి దగ్గర ఏమి లేదు
Mark 8:3
ἐκλυθήσονται
సాధ్యమయ్యే అర్థాలు 1) అక్షరాలా, వారు తాత్కాలికంగా సొమ్మసిల్లపోవచ్చు” లేక 2) “వారు బలహీన పడవచ్చు” ఒక గొప్ప అతిశయోక్తియైయున్నది.” (చూడండి: అతిశయోక్తి)
Mark 8:4
πόθεν τούτους δυνήσεταί τις ὧδε χορτάσαι ἄρτων ἐπ’ ἐρημίας?
శిష్యులు తమకు తగినంత ఆహారం దొరుకుతుందని యేసు ఆశిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ప్రాంతం నిర్జీవంగా ఉంది ఈ ప్రజలను సంతృప్తి పరచుటకు మేము తగినంత రొట్టెలు పొందుటకు ఇక్కడ స్థలం లేదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἄρτων
పిండి ముద్ద రొట్టె ఆకారంలో మరియు కాల్చినదియైన రొట్టెయైయున్నది.
Mark 8:5
ἠρώτα αὐτούς
యేసు తన శిష్యులను అడిగాడు
Mark 8:6
παραγγέλλει τῷ ὄχλῳ ἀναπεσεῖν ἐπὶ τῆς γῆς
దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనగా వ్రాయవచ్చు. యేసు ప్రజలందరినీ “నేలమీద కూర్చోమని” ఆజ్ఞాపించాడు. (చూడండి: ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
ἀναπεσεῖν
కూర్చోవడం లేక క్రింద కూర్చోవడం వంటివి లేనప్పుడు ప్రజలు సాధారణంగా ఎలా తింటారు అనే దాని కోసం మీ భాష యొక్క మాటను ఉపయోగించండి.
Mark 8:7
καὶ εἶχαν
ఇక్కడ “వారు” అనే మాటను యేసు మరియు ఆయన శిష్యులను గురించి తెలియచేయుటకు ఉపయోగిస్తారు.
εὐλογήσας αὐτὰ
యేసు చేపల కోసం కృతజ్ఞతలు చేల్లిస్తాడు
Mark 8:8
ἔφαγον
ప్రజలు తిన్నారు
ἦραν
శిష్యులు తీసుకున్నారు
περισσεύματα κλασμάτων ἑπτὰ σπυρίδας
ఇది ప్రజలు తిన్న తరువాత మిగిలిపోయిన చేపలు రొట్టె ముక్కలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిగిలిన రొట్టె మరియు చేప ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:9
καὶ ἀπέλυσεν αὐτούς
ఆయన వారిని పంపివేసినప్పుడు స్పష్టం చేయుటకు సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తిన్న తరువాత యేసు వారిని పంపివేసాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:10
ἦλθεν εἰς τὰ μέρη Δαλμανουθά
వారు దల్మనూతా అనే ప్రాంతమునకు ఎలా వచ్చారో స్పష్టం చేయుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు గలిలయ ప్రాంతం చుట్టూ ఉన్న దల్మనూతా అనే ప్రాంతమునకు ప్రయాణించారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Δαλμανουθά
ఇది గలిలయ సముద్రం యొక్క వాయవ్య తీరంలో ఉన్న ప్రాంతం పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 8:11
దల్మనూతాలో యేసు మరియు ఆయన శిష్యులు పడవలో నుండి దిగి బయలుదేరడానికి ముందే పరిసయ్యులకు ఒక సూచనను చూపించుటకు నిరాకరించాడు.
ζητοῦντες παρ’ αὐτοῦ
వారు ఆయనను అడిగారు
σημεῖον ἀπὸ τοῦ οὐρανοῦ
యేసుని శక్తి మరియు అధికారం దేవుని నుండి వచ్చినవని నిరూపించే సూచనను వారు కోరుకున్నారు. సాధ్యమయ్యే అర్థాలు 1) “పరలోకం” అనే మాట దేవునికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి ఒక సూచన” లేక 2) “పరలోకం” అనే మాట ఆకాశమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశం నుండి ఒక సూచన” (చూడండి: అన్యాపదేశము)
πειράζοντες αὐτόν
యేసు దేవుని నుండి వచ్చాడని పరిసయ్యులు నిరూపించుటను పరీక్షించుటకు ప్రయత్నించారు. కొంత సమాచారమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను పంపించుటకు నిరూపించుటకు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:12
ἀναστενάξας τῷ πνεύματι αὐτοῦ
దీని అర్థం ఆయన నిట్టూర్పు విడిచాడు లేక వినగలిగే సుదీర్ఘ లోతైన శ్వాసను విడచిపెట్టాడు. పరిసయ్యులు తనను నమ్ముటను నిరాకరించినందున యేసు తీవ్ర బాధను ఇది చూపిస్తుంది. మార్కు 7:34 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
τῷ πνεύματι αὐτοῦ
తనలో తానూ
τί ἡ γενεὰ αὕτη ζητεῖ σημεῖον?
యేసు వారిని గద్దించాడు. ఈ ప్రశ్న ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ తరానికి సూచక క్రియ కనబడదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἡ γενεὰ αὕτη
యేసు “ఈ తరం” గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆ సమయములో అప్పుడు నివసించి ఉన్న ప్రజలను గురించి తెలియచేస్తున్నాడు. అక్కడ పరిసయ్యులు ఈ గుంపులో ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మరియు ఈ తరం ప్రజలు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
εἰ δοθήσεται…σημεῖον
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఏ సూచనను ఇవ్వను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 8:13
ἀφεὶς αὐτοὺς, πάλιν ἐμβὰς
యేసు శిష్యులు ఆయనతో వెళ్ళారు. కొంత సమాచారమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారిని విడచిపెట్టి తన శిష్యులతో మళ్ళీ పడవలో ఎక్కాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
εἰς τὸ πέραν
ఇది స్పష్టంగా చెప్పబడిన గలిలయ సముద్రం గురించి వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సముద్రం యొక్క మరొక వైపు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:14
యేసు మరియు ఆయన శిష్యులు పడవలో ఉన్నప్పుడు, పరిసయ్యులు మరియు హేరోదు చాల సూచనలను చూసినప్పటికీ వారి మధ్య అవగాహన లేకపోవడం గురించి వారు చర్చించారు.
καὶ
ప్రధాన కథనా క్రమములో విరామమును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. శిష్యులు రొట్టె తీసుకు రావడం మరచిపోతున్న సందర్భ సమాచారమును ఇక్కడ రచయిత చెపుతాడు. (చూడండి: నేపథ్య సమాచారం)
εἰ μὴ ἕνα ἄρτον
‘ఇక లేదు” అనే ప్రతికూల వాక్యమును వారు ఎంత తక్కువ మొత్తంలో రొట్టెలు కలిగి ఉన్నారో నొక్కి చెప్పుటకు ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకే రొట్టె” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Mark 8:15
ὁρᾶτε, βλέπετε
ఈ రెండు మాటలకూ సాధారణమైన అర్థం ఉంది మరియు నొక్కి చెప్పుట కోసం ఇక్కడ పునరావృతమవుతుంది. వాటిని కలపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గమనించండి” (చూడండి: జంటపదం)
τῆς ζύμης τῶν Φαρισαίων καὶ τῆς ζύμης Ἡρῴδου
ఇక్కడ యేసు తన శిష్యులతో అర్థం కాని రూపకఅలంకారములో మాట్లాడుతున్నాడు. యేసు పరిసయ్యుల బోధలను పులిపిండితో పోలుస్తున్నాడు, శిష్యులు దానిని అర్థం చేసుకోనందున మీరు దీనిని తర్జుమా చేయునప్పుడు మీరు దీనిని వివరించకూడదు. (చూడండి: రూపకం)
Mark 8:16
ὅτι ἄρτους οὐκ ἔχουσιν
ఈ ప్రకటనలో “ఇది” అనేది యేసు చెప్పిన దాని గురించి తేలియచేయుటకు సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన దగ్గర రొట్టెలు లేనందున ఆయన అలా చెప్పి ఉండాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἄρτους οὐκ ἔχουσιν
“లేదు” అనే మాట అతిశయోక్తియైయున్నది. శిష్యులు ఒక రొట్టె (మార్కు 8:14) ఉంది కాని, అది అస్సలు రొట్టెలు లేవు అనుటకు భిన్నంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల చిన్న రొట్టె” (చూడండి: అతిశయోక్తి)
Mark 8:17
τί διαλογίζεσθε ὅτι ἄρτους οὐκ ἔχετε?
ఇక్కడ యేసు చెప్పే విషయమును అర్థం చేసుకోవాలని ఆయన తన శిష్యులను కొద్దిగా మందలించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అసలు రొట్టెను గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὔπω νοεῖτε, οὐδὲ συνίετε?
ఈ ప్రశ్నలకు ఒకే అర్థం ఉంది మరియు అవి అర్థం కాలేదని నొక్కి చెప్పుటకు కలిపి ఉపయోగించబడతాయి. దీనిని ఒక ప్రశ్నగా లేక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఇంకా అర్థం కాలేదా?” లేక “నేను చెప్పే మరియు చేసే పనులను మీరు ఇప్పటికి గ్రహించి అర్థం చేసుకోవాలి” (చూడండి: సమాంతరత మరియు అలంకారిక ప్రశ్న)
πεπωρωμένην ἔχετε τὴν καρδίαν ὑμῶν?
ఇక్కడ “హృదయాలు” అనేది ఒక వ్యక్తి మనసుకు ఒక మారుపేరైయున్నది. “హృదయాలు చాలా నీరసంగా మారతాయి” అనే మాట దేనినో అర్థం చేసుకోకపోవడమును ఇష్టంకాక పోవడానికి ఒక రూపకఅలంకారమైయున్నది దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచన చాలా మందగించింది!” లేక “నా ఉద్దేశమును మీరు అర్థం చేసుకొనుటకు మీరు చాల నిదానముగా ఉన్నారు!” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
Mark 8:18
ὀφθαλμοὺς ἔχοντες, οὐ βλέπετε? καὶ ὦτα ἔχοντες, οὐκ ἀκούετε? καὶ οὐ μνημονεύετε?
యేసు తన శిష్యులను కొద్దిగా మందలించడం కొనసాగిస్తున్నాడు. ఈ ప్రశ్నలను ప్రకటనలుగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు కళ్ళు ఉన్నాయి కాని మీరు చూసేది అర్థం చేసుకోరు, మీకు చెవులున్నాయి కాని మీరు విన్నది మీరు అర్థం చేసుకోరు, మీరు గుర్తుంచుకోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 8:19
τοὺς πεντακισχιλίους
ఇది యేసు ఆహారం పెట్టిన 5,000 మంది ప్రజల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “5,000 మంది” (చూడండి: అన్యాపదేశము మరియు సంఖ్యలు)
πόσους κοφίνους κλασμάτων πλήρεις ἤρατε?
వారు రొట్టె ముక్కల గంపలను ఎప్పుడు సేకరించారు అని చెప్పుటకు సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి ఒక్కరూ తినడం పూర్తి అయిన తరువాత ఎన్ని గంపల నిండా విరిగిన రొట్టె ముక్కలను సేకరించారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:20
τοὺς τετρακισχιλίους
ఇది యేసు ఆహారం పెట్టిన 4,000 మంది ప్రజల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “4,000 మంది” (చూడండి: అన్యాపదేశము మరియు సంఖ్యలు)
πόσων σπυρίδων πληρώματα κλασμάτων ἤρατε?
వారు వీటిని ఎప్పుడు సేకరించారు అని చెప్పుటకు సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: ““ప్రతి ఒక్కరూ తినడం పూర్తి అయిన తరువాత ఎన్ని గంపల నిండా విరిగిన రొట్టె ముక్కలను సేకరించారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:21
πῶς οὔπω συνίετε?
ఇక్కడ యేసు చెప్పే విషయమును అర్థం చేసుకోలేదని తన శిష్యులను కొద్దిగా గద్దించాడు దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పే మరియు చేసే పనులు ఇప్పటికే అర్థం చేసుకోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 8:22
యేసు మరియు ఆయన శిష్యులు బెత్సయిదా దగ్గర తమ పడవనుండి బయటకు వచ్చినప్పుడు, యేసు గ్రుడ్డివానిని స్వస్థపరుస్తాడు.
Βηθσαϊδάν
ఇది గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్న ఒక పట్టణం. మార్కు 6:45 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἵνα αὐτοῦ ἅψηται
యేసు మనిషిని ఎందుకు తాకాలని వారు కోరుకుంటున్నారో చెప్పడం సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని స్వస్థ పరచుటకు అతనిని తాకాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:23
πτύσας εἰς τὰ ὄμματα αὐτοῦ…ἐπηρώτα αὐτόν
యేసు మనిషి కళ్ళపై ఉమ్మి వేసినప్పుడు ... యేసు ఆ వ్యక్తిని అడిగాడు
Mark 8:24
ἀναβλέψας
ఆ వ్యక్తి పైకి చూసాడు
βλέπω τοὺς ἀνθρώπους, ὅτι ὡς δένδρα ὁρῶ περιπατοῦντας
మనుష్యులు చుట్టూ తిరుగుతున్నట్లు ఆ వ్యక్తి చూస్తాడు, అయినప్పటికీ వారు అతనికి స్పష్టంగా తెలియరు కాబట్టి అతను వారిని చెట్లతో పోల్చాడు. ప్రత్యమ్నాయ తర్జుమా: “అవును నేను ప్రజలను చూస్తున్నాను, వారు చుట్టూ తిరుగుతున్నారు కాని, నేను వారిని స్పష్టంగా చూడలేను వారు చెట్లలాగా కనిపిస్తున్నారు” (చూడండి: ఉపమ)
Mark 8:25
εἶτα πάλιν ἐπέθηκεν
అప్పుడు యేసు మళ్ళీ
καὶ διέβλεψεν καὶ ἀπεκατέστη
“అతని దృష్టి తిరిగి ఇవ్వబడింది” అనే వాక్యభాగమును క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ వ్యక్తి దృష్టిని తిరిగి ఇచ్చాడు మరియు అతని కళ్ళు తెరిచాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 8:27
యేసు మరియు అతని శిష్యులు ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళేటప్పుడు యేసు ఎవరో మరియు ఆయనకు ఏమి జరుగునో అని మాట్లాడుతారు.
Mark 8:28
οἱ δὲ εἶπαν αὐτῷ λέγοντες
వారు ఆయనకు సమాధానం చెప్పారు
Ἰωάννην τὸν Βαπτιστήν
కొంతమంది యేసు అని చెప్పారని శిష్యులు సమాధానం ఇస్తారు. దీనిని మరింత స్పష్టంగా చూపించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు బాప్తిస్మమిచ్చే యోహానని కొంతమంది అంటున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἄλλοι…ἄλλοι
“ఇతరులు” అనే మాట ఇతర వ్యక్తుల గురించి తేలియచేస్తుంది. ఇది యేసు అడిగిన ప్రశ్నలకు వారి స్పందనలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులు మీరు అని ... ఇతర వ్యక్తులు మీరు అని అంటున్నారు” (చూడండి: శబ్దలోపం)
Mark 8:29
αὐτὸς ἐπηρώτα αὐτούς
యేసు తన శిష్యులను అడిగాడు
Mark 8:30
ἐπετίμησεν αὐτοῖς ἵνα μηδενὶ λέγωσιν περὶ αὐτοῦ
యేసు తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పమని ఆయన కోరలేదు. దీనిని మరింత స్పష్టంగా చేయవచ్చు. అలాగే దీనిని ప్రత్యక్ష్య ఉల్లేఖనంగా కూడా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు” లేక “’నేను క్రీస్తు అని ఎవరికిని చెప్పవద్దు’ అని యేసు వారిని హెచ్చరించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:31
τὸν Υἱὸν τοῦ Ἀνθρώπου
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ἀποδοκιμασθῆναι ὑπὸ τῶν πρεσβυτέρων…καὶ μετὰ τρεῖς ἡμέρας ἀναστῆναι
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెద్దలు ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్ర పండితులు ఆయనను తిరస్కరిస్తారాని మరియు మనుష్యులు ఆయనను చంపుతారని మూడు రోజుల తరువాత ఆయన లేపబడతాడని” వ్రాయబడింది (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 8:32
παρρησίᾳ τὸν λόγον ἐλάλει
అర్థం చేసుకోగలిగేలా ఆయన ఇలా అన్నారు
ἤρξατο ἐπιτιμᾶν αὐτῷ
మనుష్యకుమారునికి ఆయన చెప్పిన సంగతి జరుగుతుందని చెప్పినందున పేతురు యేసును మందలించాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులు చెప్పినందుకు ఆయనను మందలించడం ప్రారంభించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:33
యేసు మరణించి లేవాలని కోరుకోనందుకు పెతురును మందలించిన తరువాత యేసు తన శిష్యులకు మరియు ప్రజలకు తనను ఎలా అనుసరించాలో చెపుతాడు.
ὕπαγε ὀπίσω μου, Σατανᾶ, ὅτι οὐ φρονεῖς
పేతురు సాతను వలె ప్రవర్తిస్తున్నాడని యేసు చెప్పిన మాటల అర్థమైయున్నది, ఎందుకంటే దేవుడు యేసును పంపిన పనిని నెరవేర్చకుండా ఆయనను ఆపేందుకు పేతురు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా వెనుకకు వెళ్ళు, ఎందుకంటే నీవు సాతనులా వ్యవహరిస్తున్నావు! నీవు క్రమపరచటం లేదు” (చూడండి: రూపకం)
ὕπαγε ὀπίσω μου
నా నుండి దూరంగా వెళ్ళు
Mark 8:34
ὀπίσω μου ἀκολουθεῖν
ఇక్కడ యేసును అనుసరించడం అనేది ఆయన శిష్యులలో ఒకరిగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా శిష్యుడిగా ఉండు” లేక “నా శిష్యులలో ఒకరిగా ఉండు” (చూడండి: రూపకం)
ἀπαρνησάσθω ἑαυτὸν
తన కోరికలను వదలుకోవాలి లేక “తన కోరికలను విడచిపెట్టాలి”
ἀράτω τὸν σταυρὸν αὐτοῦ, καὶ ἀκολουθείτω μοι
తన సిలువ మోసుకొని నన్ను అనుసరించాలి. సిలువ అనేది బాధ మరియు మరణమును గురించి తెలయచేస్తుంది. సిలువ వేసుకోవడం అంటే బాధపడుటను మరియు మరణించుటకు సిద్ధంగా ఉండుటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ మరియు మరణము వరకు కూడా నాకు కట్టుబడి ఉండాలి” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
ἀκολουθείτω μοι
ఇక్కడ యేసును అనుసరించడం అనేది ఆయనకు విధేయత చూపించడమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను అనుసరించండి” (చూడండి: రూపకం)
Mark 8:35
ὃς γὰρ ἐὰν θέλῃ
కోరుకునే ఎవరైనా
τὴν ψυχὴν
ఇది సహజమైన జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం రెండింటిని గురించి తెలియచేస్తుంది.
ἕνεκεν ἐμοῦ καὶ τοῦ εὐαγγελίου
నా కోసం మరియు సువార్త కోసం. యేసు తనను మరియు సువార్తను అనుసరిస్తున్నందున ప్రాణాలు పోగొట్టుకునే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతను నన్ను అనుసరిస్తాడు మరియు ఇతరులకు సువార్తను ప్రకటిస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 8:36
τί γὰρ ὠφελεῖ ἄνθρωπον, κερδήσῃ τὸν κόσμον ὅλον καὶ ζημιωθῆναι τὴν ψυχὴν αὐτοῦ?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి ప్రపంచమంతా సంపాదించినా, అతను తన ప్రాణాలను పోగొట్టుకుంటే అది అతనికి ప్రయోజనం కలిగించదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
κερδήσῃ τὸν κόσμον ὅλον καὶ ζημιωθῆναι τὴν ψυχὴν αὐτοῦ
ఇది “అయితే” అనే మాటతో ప్రారంభమయ్యే స్థితిగా కూడా వ్యక్తపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రపంచమంతా సంపాదించి తన ప్రాణమును కోల్పోతే”
κερδήσῃ τὸν κόσμον ὅλον
“ప్రపంచమంతా” అనే మాట గొప్ప సంపాదనకు అతిశాయోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను కోరుకున్న ప్రతిదానిని ఎప్పుడైనా పొందుటకు” (చూడండి: అతిశయోక్తి)
ζημιωθῆναι
దేనినైనా విడచిపెట్టడం అంటే దానిని పోగొట్టుకొనడం లేక మరొక వ్యక్తి దానిని తీసుకువెళ్ళడం.
Mark 8:37
τί γὰρ δοῖ ἄνθρωπος ἀντάλλαγμα τῆς ψυχῆς αὐτοῦ?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వలేడు.” లేక “తన ప్రాణమునకు బదులుగా ఎవ్వరూ ఏమి ఇవ్వలేరు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τί…δοῖ ἄνθρωπος
మీ భాషలో “ఇవ్వడం” కు ఎవరైనా ఇచ్చినదానిని స్వీకరించాల్సిన అవసరం ఉంటే “దేవుడు” పుచ్చుకునేవాడు అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవునికి ఏమి ఇవ్వగలడు”
Mark 8:38
ἐπαισχυνθῇ με καὶ τοὺς ἐμοὺς λόγους
నాకు మరియు నా సందేశమునకు సిగ్గు
ἐν τῇ γενεᾷ ταύτῃ, τῇ μοιχαλίδι καὶ ἁμαρτωλῷ
యేసు ఈ తరమును “వ్యభిచారి” అని మాట్లాడుతాడు, అంటే వారు దేవునితో తమ సంబంధంలో నమ్మకద్రోహులు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం చెసిన మరియు చాలా పాపాత్ములైన ఈ తరం ప్రజలలో” లేక “ఈ తరం ప్రజలలో దేవునికి నమ్మక ద్రోహం మరియు చాలా పాపాత్ములైన వారు” (చూడండి: రూపకం)
ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ὅταν ἔλθῃ
అతను తిరిగి వచ్చినప్పుడు
ἐν τῇ δόξῃ τοῦ Πατρὸς αὐτοῦ
యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనకు తన తండ్రిలాగే మహిమ ఉంటుంది.
μετὰ τῶν ἀγγέλων τῶν ἁγίων
పవిత్ర దేవదూతలతో కలసి
Mark 9
మార్కు సువార్త 09వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
“రూపాంతరం”
దేవుని మహిమను అద్భుతమైన వెలుగుగా లేఖనం తరచుగా మాట్లాడుతుంది. ప్రజలు ఈ వెలుగును చూసినప్పుడు భయపడతారు. యేసు నిజంగా దేవుని కుమారుడని ఆయన అనుచరులు చూడగలిగేలా యేసు వస్త్రములు ఈ అధ్బుతమైన వెలుగుతో ప్రకాశించాయని మార్కు ఈ అధ్యాయములో చెప్పాడు. అదే సమయంలో, యేసు వారి కుమారుడు అని దేవుడు వారికి చెప్పాడు. (చూడండి: మహిమ, మహిమగల, మహిమ పరచు మరియు భయం, భయపడడం, భయపడు)
ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
అతిశయోక్తి
తన అనుచరులు అక్షరాల అర్థం చేసుకుంటారని తానూ ఉహించని విషయాలను యేసు చెప్పాడు. “మీ చేయి మీరు పొరపాట్లు చేయుటకు కారణమైతే దానిని కత్తరించండి” (మార్కు 9:43) అని చెప్పినప్పుడు అతను అతిశయోక్తి చేస్తున్నాడు, వారు ప్రేమించిన లేక వారు అవసరమని అనుకున్న పాపానికి కారణమైయ్యే దేనికైనా దూరంగా ఉండాలి అని అందువలన వారు తెలుసుకుంటారు.
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
ఏలియా మరియు మోషే
ఏలీయా మరియు మోషే ఆకస్మాత్తుగా యేసు, యాకోబు, యోహాను, పేతురులకు కనిపిస్తారు తరువాత వారు అదృశ్యమవుతారు. ఆ నలుగురు ఏలియా మరియు మోషేలను చూసారు, మరియు ఏలియా మరియు మోషే యేసుతో మాట్లాడినందున ఏలియా మరియు మోషే శారీరికంగా కనిపించారని చదువరి అర్థం చేసుకోవాలి
“మనుష్యకుమారుడు”
ఈ అధ్యాయములో తనను తానూ “మనుష్యకుమారుడు” అని చెప్పుకున్నాడు. (మార్కు 9:31). మీ భాష వారు వేరొకరిలాగా మాట్లాడుతున్నట్లుగా తనను తానూ మాట్లాడుటకు అనుమతించక పోవచ్చు. (చూడండి: మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు మరియు ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
ధర్మశాస్త్రవిద్ధమైన
ధర్మశాస్త్రవిరుద్ధం లేదా వైపరీత్యం అనేది అసలైన దానిని వివరించుటకు కనిపించే నిజమైన ప్రకటనయైయున్నది. ఎవరైనా మొదటివారిగా ఉండాలనికుంటే, అతను అందరికి చివరివాడు మరియు సేవకుడు” అని చెప్పినప్పుడు యేసు ఒక శాస్త్ర విరుద్ధమైన మాటను ఉపయోగిస్తాడు. (మార్కు 9:35).
Mark 9:1
యేసు తనను అనుసరించడం గురించి ప్రజలతో మరియు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆరు రోజుల తరువాత యేసు తన ముగ్గురు శిష్యులతో యేసు ఒక కొండపైకి వెళ్ళాడు అక్కడ దేవుని రాజ్యంలో ఆయన స్వరూపం ఎలా ఉంటుందో తాత్కాలికంగా ఒక రోజు ఆయన స్వరూపం మారుతుంది.
ἔλεγεν αὐτοῖς
యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు
τὴν Βασιλείαν τοῦ Θεοῦ ἐληλυθυῖαν ἐν δυνάμει
రాబోయే దేవుని రాజ్యం దేవుడు తనను తానూ రాజుగా చూపించడము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను తానూ రాజుగా గొప్ప శక్తితో చూపిస్తాడు” (చూడండి: అన్యాపదేశము)
Mark 9:2
κατ’ ἰδίαν μόνους
వారు ఒంటరిగా ఉన్నారని యేసు, పేతురు, యాకోబు మరియు యోహానులు మాత్రమే కొండ మీదికి వెళ్ళారని నొక్కి చెప్పుటకు రచయిత ఇక్కడ “తమను” అనే ఆత్మార్థక సర్వనామంను ఉపయోగిస్తున్నాడు. (చూడండి: రిఫ్లెక్సివ్ సర్వనామాలు *)
μετεμορφώθη ἔμπροσθεν αὐτῶν
వారు ఆయనను చూచినప్పుడు ఆయన స్వరూపం భిన్నంగా ఉంది.
μετεμορφώθη
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన స్వరూపం మారిపోయింది” లేక “ఆయన చాలా భిన్నంగా కనిపించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἔμπροσθεν αὐτῶν
వారి ముందు లేక “కాబట్టి వారు ఆయనను స్పష్టంగా చూడగలరు”
Mark 9:3
στίλβοντα
మెరుస్తున్న లేక “ప్రకాశమానమైన”. యేసు వస్త్రాలు చాలా తెల్లగా ఉన్నాయి అవి వెలువడుతున్నాయి లేక వెలుగును ఇస్తున్నాయి.
λείαν
సాధ్యమైనంత ఎక్కువ లేక చాలా ఎక్కువ
οἷα γναφεὺς ἐπὶ τῆς γῆς οὐ δύναται οὕτως λευκᾶναι
బ్లీచింగ్ మరియు అమ్మోనియా లాంటి రసాయనాలను ఉపయోగించడం ద్వారా సహజమైన తెల్లని ఉన్నిని కూడా తెల్లగా చేసే ప్రక్రియను తెలుపుచేయుట అనేది వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమిపై ఉన్న ఏ వ్యక్తియైన వాటిని తెల్లగా చేసేదానికంటే తెల్లగా ఉంటుంది”
Mark 9:4
ὤφθη…Ἠλείας σὺν Μωϋσεῖ
ఈ మనుష్యులు ఎవరో అని చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా కలం క్రితం నివసించిన ఇద్దరు ప్రవక్తలు, ఏలియా మరియు మోషే కనిపించారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἦσαν συνλαλοῦντες
“వారు” అనే మాట ఏలియా మరియు మోషేలను గురించి తెలియచేస్తుంది.
Mark 9:5
ἀποκριθεὶς ὁ Πέτρος λέγει τῷ Ἰησοῦ
పేతురు యోహానుతో చెప్పాడు. ఇక్కడ “సమాధానం” అనే మాటను సంభాషణలో పేతురును పరిచయం చేయుటకు ఉపయోగిస్తారు. పేతురు ప్రశ్నకు సంమాధానం ఇవ్వలేదు.
καλόν ἐστιν ἡμᾶς ὧδε εἶναι
“మనము” అనే మాట పేతురు, యోహాను యాకోబులను గురించి మాత్రమే తెలియచేస్తుందా లేక యేసు ఏలీయా మరియు మోషేతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలియచేస్తుందా అనేది స్పష్టంగా లేదు. రెండు ఎంపికలు సాధ్యమైయ్యే విధంగా మీరు తర్జుమా చేయగలిగితే, ఆలా చేయండి. (చూడండి ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’ మరియు అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
σκηνάς
కూర్చోనుటకు లేక నిద్రించుటకు సరళమైన తాత్కాలిక ప్రదేశాలు
Mark 9:6
οὐ γὰρ ᾔδει τί ἀποκριθῇ; ἔκφοβοι γὰρ ἐγένοντο
ఈ నిక్షిప్త వాక్యం పేతురు యాకోబు మరియు యోహానుల గురించి సందర్భ సమాచారం చెబుతుంది. (చూడండి: నేపథ్య సమాచారం)
ἔκφοβοι…ἐγένοντο
వారు చాలా దిగులుపడ్డారు లేక “వారు చాలా భయపడ్డారు”
Mark 9:7
ἐγένετο…ἐπισκιάζουσα
కనిపించింది మరియు కప్పివేసింది
καὶ ἐγένετο φωνὴ ἐκ τῆς νεφέλης
ఇక్కడ “ఒక స్వరం వినిపించింది” అనేది ఎవరో మాట్లాడారు అననడానికి ఒక మారుపేరైయున్నది. ఎవరు మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు ఎవరో మేఘంలో నుండి మాట్లాడారు” లేక “దేవుడు మేఘం నుండి మాట్లాడారు” (చూడండి: అన్యాపదేశము మరియు )
οὗτός ἐστιν ὁ Υἱός μου, ὁ ἀγαπητός, ἀκούετε αὐτοῦ
తండ్రియైన దేవుడు తన “ప్రియమైన కుమారుడైన” దేవుని కుమారునిపై తన ప్రేమను వ్యక్తపరుస్తాడు.
ὁ Υἱός…ὁ ἀγαπητός
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 9:8
περιβλεψάμενοι
ఇక్కడ “వారు” అనేది పేతురు, యాకోబు, మరియు యోహానుల గురించి తెలియచేస్తుంది.
Mark 9:9
διεστείλατο αὐτοῖς ἵνα μηδενὶ…εἰ μὴ ὅταν ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου ἐκ νεκρῶν ἀναστῇ
ఆయన చనిపోయి తిరిగి బతికిన తరువాత మాత్రమే వారు చూసిన దాని ప్రజలకు చెప్పుటకు ఆయన వారికి అనుమతిస్తున్నాడని ఇది తెలియచేస్తుంది. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐκ νεκρῶν ἀναστῇ
మృతులలో నుండి లేచాడు. ఇది మళ్ళీ సజీవంగా మారడం గురించి చెప్పబడుతుంది “చనిపోయినవారు” అనే మాట “చనిపోయిన వ్యక్తుల” గురించి తెలియచేస్తుంది మరియు ఇది మరణమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణం నుండి లేచాడు” (చూడండి: అన్యాపదేశము)
Mark 9:10
ἐκ νεκρῶν ἀναστῆναι
మృతులలో నుండి లేవడానికి. ఇది మళ్ళీ సజీవంగా మారడం గురించి చెప్పబడుతుంది “చనిపోయినవారు” అనే మాట “చనిపోయిన వ్యక్తుల” గురించి తెలియచేస్తుంది మరియు ఇది మరణమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణం నుండి లేచాడు” (చూడండి: అన్యాపదేశము)
καὶ τὸν λόγον ἐκράτησαν πρὸς ἑαυτοὺς
ఇక్కడ “ఈ విషయమును తమలో తాము ఉంచుకున్నారు” అంటే వారు చూసిన దాని గురించి వారు ఎవరికీ చెప్పలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి వారు చూసిన దానిని ఎవరికీ చెప్పలేదు” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 9:11
మృతులలో నుండి లేవడం అంటే యేసు అర్థం ఏమిటని పేతురు, యాకోబు మరియు యోహానులు ఆలోచిస్తున్నప్పటికీ, వారు ఏలీయా రాక గురించి ఆయనను అడిగారు.
ἐπηρώτων αὐτὸν
“వారు” అనే మాట పేతురు, యాకోబు, మరియు యోహానుల గురించి తెలియచేస్తుంది
λέγουσιν οἱ γραμματεῖς ὅτι Ἠλείαν δεῖ ἐλθεῖν πρῶτον?
ఏలియా మళ్ళీ పరలోకము నుండి వస్తాడని ప్రవచనం చెప్పబడింది. అప్పుడు మనుష్య కుమారుడైన మెస్సియా పరిపాలించుటకు మరియు రాజ్యం చేయుటకు వస్తాడు. మనుష్య కుమారుడు ఎలా చనిపోయి తిరిగి లేస్తాడు అని శిష్యులు కలవరపడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెస్సియా రాక ముందే ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్తారు?” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:12
Ἠλείας μὲν ἐλθὼν πρῶτον ἀποκατιστάνει πάντα
ఇలా చెప్పడం ద్వారా ఏలియా మొదట వస్తాడని యేసు దృఢపరచాడు.
πῶς γέγραπται…ἐξουδενηθῇ?
మనుష్యకుమారుడు బాధపడాలి మరియు తృణీకరించబడాలి అని లేఖనాలు కూడా బోధిస్తున్నాయని యేసు తన శిష్యులకు గుర్తు చేయుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుని గురించి వ్రాయబడిన వాటిని కూడా మీరు పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చాలా విషయాలలో బాధపడాలి మరియు ద్వేషింపబడాలి అని లేఖనములు చెబుతున్నాయి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐξουδενηθῇ
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆయనను తిరస్కరిస్తారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 9:13
ἐποίησαν αὐτῷ ὅσα ἤθελον
ప్రజలు ఏలియాతో ఏమి చేసారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన నాయకులు వారు చేయాలనుకున్నట్లే అతనిని చాలా దుర్మార్గంగా చూసారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:14
పేతురు, యాకోబు యోహాను మరియు యేసు కొండపై నుండి దిగి వచ్చినప్పుడు శాస్త్రులు ఇతర శిష్యులతో వాదించడం వారు చూసారు
ἐλθόντες πρὸς τοὺς μαθητὰς
యేసు, పేతురు, యాకోబు మరియు యోహాను వారితో పాటు కొండ పైకి వెళ్ళని ఇతర శిష్యులు దగ్గరకు తిరిగి వచ్చారు.
εἶδον ὄχλον πολὺν περὶ αὐτοὺς
యేసు మరియు ఆ ముగ్గురు శిష్యులు ఇతర శిష్యుల చుట్టూ గొప్ప సమూహమును చూసారు
γραμματεῖς συνζητοῦντας πρὸς αὐτούς
శాస్త్రులు యేసుతో వెళ్ళని శిష్యులతో వాదిస్తున్నారు.
Mark 9:15
ἐξεθαμβήθησαν
వారు ఎందుకు ఆశ్చర్య పోయారో చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు వచ్చాడని వారు ఆశ్చర్య పోయారు” (చూడండి : ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:17
శాస్త్రులు మరియు ఇతర శిష్యులు ఏమి వాదించుచున్నారో వివరించుటకు దయ్యం పట్టిన ఒకని తండ్రి తన కుమారునికి దయ్యాన్ని వదిలించమని శిష్యులను కోరినట్లు చెప్తాడు, కాని వారు చేయలేక పోయారు. యేసు పిల్లవాడి నుండి దయ్యమును వెళ్ళగొట్టాడు. తరువాత శిష్యులు వారెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయారని అడుగుతారు.
ἔχοντα πνεῦμα
పిల్లవాడు అపవిత్రాత్మ పట్టినవాడైయున్నాడు అని దీని అర్థమైయున్నది. “అతనిలో అపవిత్రాత్మ ఉంది” లేక “అతనికి అపవిత్రాత్మ పట్టింది” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 9:18
ἀφρίζει
ఒక మూర్ఛ లేక నిర్భందించడం, ఒక వ్యక్తి శ్వాస తీసుకోవటంలో లేక మ్రింగడానికి ఇబ్బంది కలిగిస్తుంది. దీని వలన తెల్లని నురగ బయటకు వస్తుంది. మీ భాష దానిని వివరించుటకు మార్గమును కలిగి ఉంటే, మీరు దానిని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని నోటినుండి నురగ కారుతుంది”
ξηραίνεται
అతడు దృఢంగా మారిపోతాడు లేక “అతని శరీరం బిగిసిపోతుంది”
οὐκ ἴσχυσαν
శిష్యులు పిల్లవాడి నుండి దయ్యమును వెళ్ళగొట్టలేదని ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దానిని వెళ్ళగొట్టలేకపోయారు” (చూడండి: శబ్దలోపం)
Mark 9:19
ὁ…ἀποκριθεὶς αὐτοῖς
యేసుకు విన్నపము చేసిన వ్యక్తి పిల్లవాని తండ్రి అయినప్పటికీ, యేసు జనసమూహమంతటికీ ప్రతిస్పందిస్తాడు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు జనసమూహానికి స్పందించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὦ γενεὰ ἄπιστος
మీరు విశ్వాసం లేని తరమైయున్నారు. యేసు జనసమూహమునకు స్పందించడం ప్రారంభించినప్పుడు, ఆయన వారిని ఇలా పిలుస్తాడు.
ἕως πότε πρὸς ὑμᾶς ἔσομαι?…ἀνέξομαι ὑμῶν?
యేసు తన నిరాశను వ్యక్తపరచుటకు ఈ ప్రశ్నలను ఉపయోగిస్తాడు. రెండు ప్రశ్నలకు ఒకే అర్థం ఉంది. వాటిని ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ అవిశ్వాసం వలన నేను అలసిపోయాను!” లేక “మీ అవిశ్వాసము నన్ను అలసిపోయేలా చేస్తుంది! నేను మిమ్మలి ఎంత కాలం భరించాలి అని ఆశ్చర్యపోతున్నాను” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు సమాంతరత)
ἀνέξομαι ὑμῶν
మిమ్మల్ని భరించాలి లేక “మీతో సహకరించాలి”
φέρετε αὐτὸν πρός με
పిల్లవాణ్ణి నా దగ్గరకు తీసుకొని రండి
Mark 9:20
τὸ πνεῦμα
ఇది అపవిత్రాత్మను గురించి తెలియచేస్తుంది. మార్కు 9:17లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
συνεσπάραξεν αὐτόν
ఇది వ్యక్తికి తన శరీరం పై నియంత్రణ లేని పరిస్థితియైయున్నది మరియు అతని శరీరం హింసాత్మకంగా వణుకుతుంది.
Mark 9:21
ἐκ παιδιόθεν
అతను చిన్నపిల్లవాడు కాబట్టి. దీనిని పూర్తి వాక్యంగా చెప్పుటకు సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు చిన్నప్పటినుండి ఇలాగే ఉన్నాడు” (చూడండి: శబ్దలోపం)
Mark 9:22
σπλαγχνισθεὶς
కనికరం కలిగి
Mark 9:23
εἰ δύνῃ?
ఆ వ్యక్తి చెప్పినదానిని యేసు పునరావృతం చేశాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేయగలిగితే” అని మీరు నాతో చెప్పుచున్నారా?” లేక “’మీరు చేయగలిగితే’ అని ఎందుకు చెప్పుచున్నారు?” (చూడండి: శబ్దలోపం)
εἰ δύνῃ?
ఆ మనిషి యొక్క సందేహమును మందలించుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగించాడు. ఇది ఒక ప్రకటనగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “’మీరు చేయగలిగితే’ అని మీరు నాతో చెప్పకూడదు” లేక “నేను చేయగలిగితే అని మీరు నన్ను అడగండి. వాస్తావానికి చేయగలను.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
πάντα δυνατὰ τῷ πιστεύοντι
తనను నమ్మిన ప్రజల కోసం దేవుడు ఏదైనా చేయగలడు.
τῷ πιστεύοντι
వ్యక్తి కోసం లేక “ఎవరికైనా”
τῷ πιστεύοντι
ఇది దేవునిపై నమ్మకమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నమ్ముతారు”
Mark 9:24
βοήθει μου τῇ ἀπιστίᾳ
తన అవిశ్వాసమును అధిగమించుటకు మరియు తన విశ్వాసమును పెంచుటకు సహాయం చేయమని ఆ వ్యక్తి యేసును అడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అపనమ్మకముగా ఉన్నప్పుడు నాకు సహాయం చేయ్యి” లేక “నాకు మరింత విశ్వాసం కలిగి ఉండుటకు సహాయం చెయ్యి”
Mark 9:25
ἐπισυντρέχει ὄχλος
యేసు ఉన్న చోటికి ఎక్కువ మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారని, అక్కడి గుంపు పెద్దగ పెరుతుందని దీని అర్థం.
τὸ ἄλαλον καὶ κωφὸν πνεῦμα
“మూగ” మరియు “చెవిటి” అనే మాటలను వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అపవిత్రాత్మా, పిల్లవాడిని మాట్లాడలేకపోవడానికి మరియు వినలేకపోవడానికి కారణమైనావు”
Mark 9:26
κράξας
దయ్యం పెద్ద కేకలు పెట్టింది
πολλὰ σπαράξας, αὐτόν
పిల్లవానిని విలవిలలాడించింది
ἐξῆλθεν
పిల్లవాని నుండి ఆత్మ బయటకు వచ్చిందని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాని నుండి బయటకు వచ్చింది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐγένετο ὡσεὶ νεκρὸς
పిల్లవాని రూపమును చనిపోయిన వ్యక్తితో పోల్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాడు శవంలా కనిపించాడు” లేక “పిల్లవాడు చనిపోయిన వ్యక్తివలె కనిపించాడు” (చూడండి: ఉపమ)
ὥστε τοὺς πολλοὺς
కాబట్టి చాలా మంది
Mark 9:27
κρατήσας τῆς χειρὸς αὐτοῦ
దీని అర్థం యేసు పిల్లవాని చేతిని తన చేతితో పట్టుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాడిని చేతితో పట్టుకున్నాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
ἤγειρεν αὐτόν
అతను లేచుటకు సహాయపడింది
Mark 9:28
κατ’ ἰδίαν
దీని అర్థం వారు ఒంటరిగా ఉన్నారు
ἐκβαλεῖν αὐτό
అపవిత్రాత్మను వెల్లగొట్టండి. ఇది పిల్లవాని నుండి దయ్యమును వెళ్ళగొట్టడమును గురుంచి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లవాని నుండి అపవిత్రాత్మను వెల్లగొట్టండి” (చూడండి: శబ్దలోపం)
Mark 9:29
τοῦτο τὸ γένος ἐν οὐδενὶ δύναται ἐξελθεῖν, εἰ μὴ ἐν προσευχῇ καὶ νηστεία
“కాదు” మరియు “తప్ప” అనే మాటలు రెండూ ప్రతికూల మాటలైయున్నవి. కొన్ని భాషలలో సానుకూల ప్రకటనను ఉపయోగించడం సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో మాత్రమే బయటకు వెళ్ళగొట్టవచ్చు” (చూడండి: జంట వ్యతిరేకాలు)
τοῦτο τὸ γένος
ఇది అపవిత్రాత్మలను గురించి వివరిస్తుంది ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ రకమైన అపవిత్రాత్మ” (చూడండి: శబ్దలోపం)
Mark 9:30
ఆయన దయ్యం పట్టిన పిల్లవాడిని స్వస్థపరిచిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు వారు ఉంటున్న ఇంటిని విడచిపెడతారు. తన శిష్యులకు ఒంటరిగా బోధించుటకు సమయం పడుతుంది.
κἀκεῖθεν ἐξελθόντες
యేసు మరియు ఆయన శిష్యులు ఆ ప్రాంతమును విడచిపెట్టారు.
παρεπορεύοντο διὰ
ప్రయాణించారు లేక దాటిపోయారు
Mark 9:31
ἐδίδασκεν γὰρ τοὺς μαθητὰς αὐτοῦ
యేసు జనసమూహముకు దూరంగా తన శిష్యులకు ఏకాంతముగా బోధిస్తున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన శిష్యులకు ఏకాంతముగా బోధిస్తున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοται
దేనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో మనుష్యకుమారుని అప్పగిస్తారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου
ఇక్కడ యేసు తనను తానూ మనుష్యకుమారుడని చెప్పుకొనుచున్నాడు. ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. “నేను మనుష్య కుమారుడను,” (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
εἰς χεῖρας ἀνθρώπων
ఇక్కడ “చేతులు’’ అనేది నియంత్రణకు మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యక్తుల నియంత్రణలోనికి” లేక “తద్వారా వ్యక్తులు ఆయనను నియంత్రించగలుగుతారు” (చూడండి: అన్యాపదేశము)
ἀποκτανθεὶς, μετὰ τρεῖς ἡμέρας ἀναστήσεται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఆయనను చంపిన తరువాత మరియు మూడు రోజులు గడచిన తరువాత, ఆయన” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 9:32
ἐφοβοῦντο αὐτὸν ἐπερωτῆσαι
యేసు చెప్పిన ప్రకటన యొక్క అర్థం ఏమిటని అడుగుటకు వారు భయపడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీని అర్థం ఏమిటని ఆయనను అడుగుటకు వారు భయపడ్డారు” (చూడండి: శబ్దలోపం)
Mark 9:33
వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు, యేసు తన శిష్యులకు వినయ పూర్వకమైన సేవకులుగా ఉండటం గురించి బోధిస్తాడు. (చూడండి: కొత్త సంఘటన)
ἦλθον εἰς
వారు వచ్చారు. “వారు” అనే మాట యేసును మరియు ఆయన శిష్యులను గురించి తెలియచేస్తుంది.
διελογίζεσθε
మీరు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారా?
Mark 9:34
οἱ…ἐσιώπων
వారు చర్చిస్తున్న విషయాలను యేసుకు చెప్పుటకు సిగ్గు పడుతున్నందున వారు మౌనంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు సిగ్గుపడుతున్నందున వారు మౌనంగా ఉన్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τίς μείζων
ఇక్కడ “గొప్ప” అనేది శిష్యులలో “గొప్పవాడు” అనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిలో గొప్పవాడు ఎవరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:35
εἴ τις θέλει πρῶτος εἶναι, ἔσται πάντων ἔσχατος
ఇక్కడ “మొదటి” మరియు “చివరి” మాటలు ఒకదానికొకటి వ్యతిరేకమైన మాటలుగా ఉన్నాయి. యేసు “మొదటిది” అని “చాలా ముఖ్యమైన” దాని గురించి మాట్లాడాడు మరియు “చివరిది”గా అని తక్కువ ముఖ్యమైనది” గురించి తెలియచాసాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఒక వ్యక్తిని అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించాలని ఎవరైనా కోరుకుంటే అతను తనను తానూ అన్నిటికంటే అతి తక్కువ ముఖ్యమైనవాడుగా భావించాలి” (చూడండి; రూపకం)
πάντων
ప్రజలందరి ... ప్రజలందరి
Mark 9:36
ἐν μέσῳ αὐτῶν
వారందరిలో. వారు అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది.
ἐναγκαλισάμενος αὐτὸ
అంటే ఆయన చిన్న బిడ్డను కౌగలించుకున్నాడు లేదా అతని ఎత్తుకొని తన ఒడిలో ఉంచుకున్నాడు.
Mark 9:37
ἓν τῶν τοιούτων παιδίων
ఇలాంటి చిన్న బిడ్డ
ἐπὶ τῷ ὀνόματί μου
యేసు పట్ల ప్రేమ వలన ఏదో ఒకటి చేయమని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తాడు లేక “నా కోసమే” (చూడండి: జాతీయం (నుడికారం))
τὸν ἀποστείλαντά με
ఇది ఆయనను భూమికి పంపించిన దేవుని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను పంపించిన దేవుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:38
ἔφη αὐτῷ ὁ Ἰωάννης
యోహాను యేసుతో చెప్పాడు
ἐκβάλλοντα δαιμόνια
దయ్యాలను పంపివేయడం. ఇది మనుష్యుల నుండి దయ్యాలను వెళ్ళగొట్టడమును గురించి తేలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల నుండి దయ్యాలను వెళ్ళగొట్టడం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν τῷ ὀνόματί σου
ఇక్కడ ‘పేరు” అనేది యేసు అధికారం మరియు శక్తితో కలసి ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పేరిట అధికారం ద్వారా” మరియు “మీ పేరిట శక్తి ద్వారా” (చూడండి: అన్యాపదేశము)
οὐκ ἠκολούθει ἡμῖν
అతను వారి శిష్యుల సమూహంలో లేడని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మనలో ఒకడు కాదు” లేక “అతను మనతో నడువడు” చూడండి: జాతీయం (నుడికారం)
Mark 9:40
οὐκ ἔστιν καθ’ ἡμῶν
మమ్మల్ని వ్యతిరేకించడం లేదు
ὑπὲρ ἡμῶν ἐστιν
దీని అర్థం ఏమిటో స్పష్టంగా వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అదే లక్ష్యాలను సాధించుటకు ప్రయత్నిస్తున్నాము”
Mark 9:41
ποτίσῃ ὑμᾶς ποτήριον ὕδατος ἐν ὀνόματι, ὅτι Χριστοῦ ἐστε
ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఎలా సహాయపడతాడో అనుటకు యేసు ఒకరికి ఒక గిన్నెడు నీరు ఇవ్వడం గురించి మాట్లాడతాడు. ఒకరికి ఏ విధంగానైనా సహాయం చేయుటకు ఇది ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి:రూపకం)
οὐ μὴ ἀπολέσῃ
ఈ ప్రతికూల వాక్యం సానుకూల అర్థమును నొక్కి చెపుతుంది. కొన్ని భాషలలో సానుకూల ప్రకటనను ఉపయోగించడం మరింత సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా పొందును” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Mark 9:42
μύλος
ధాన్యమును పిండి చేయుటకు ఉపయోగించే పెద్ద తిరుగటి రాయి
Mark 9:43
ἐὰν σκανδαλίσῃ σε ἡ χείρ σου
ఇక్కడ “చేయి” అనేది మీ చేతితో మీరు చేసే పాపత్మకమైన పనిని చేయాలనుకోవడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ చేతులలో ఒకదానితో పాపం చేయాలనుకుంటే” అని వ్రాయబడియున్నది. (చూడండి: అన్యాపదేశము)
κυλλὸν εἰσελθεῖν εἰς τὴν ζωὴν
అంగవైకల్యం పొందడం మరియు తరువాత నిత్యజీవంలోకి ప్రవేశించడం లేక “నిత్య జీవంలోకి ప్రవేశించే ముందు అంగవైకల్యం పొందడం”
εἰσελθεῖν εἰς τὴν ζωὴν
మరణించడం మరియు తరువాత శాశ్వతంగా జీవించడం ప్రరంభమవుటను జీవములోకి ప్రవేశించడమని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్య జీవంలోకి ప్రవేశించడం లేక మరణించడం మరియు శాశ్వతంగా జీవించుటకు ప్రారంభించడం” (చూడండి: రూపకం)
κυλλὸν
శరీర భాగాలను తొలగించడం లేక గాయపడటం వలన శరీరంలో ఒక భాగం కోల్పోయియుండవచ్చు. ఇక్కడ ఇది ఒక చేతిని కోల్పోవడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చేయి లేకుండా” లేక “చేయిని కోల్పోయి”
εἰς τὸ πῦρ τὸ ἄσβεστον
అగ్నిని ఆర్పడం సాధ్యం కాదు
Mark 9:45
ἐὰν ὁ πούς σου σκανδαλίζῃ σε
ఇక్కడ “పాదము” అనే మాట మీరు వెళ్ళకూడని ప్రదేశామునకు వెళ్ళడం వంటి మీ పాదాలతో మీరు పాపాత్మకమైన పనిని చేయాలనుకునే మాటకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ కాళ్ళలో ఒకదానితో పాపాత్మకమైన పనిని చేయాలనుకుంటే” అని వ్రాయబడి ఉన్నది. (చూడండి: అన్యాపదేశము)
εἰσελθεῖν εἰς τὴν ζωὴν χωλὸν
కుంటివాడిగా ఉండటం మరియు తరువాత నిత్యజీవంలోనికి ప్రవేశించుటకు” లేక “నిత్యజీవంలోకి ప్రవేశించే ముందు కుంటివాడిగా ఉండుటకు”
εἰσελθεῖν εἰς τὴν ζωὴν
మరణించడం మరియు తరువాత శాశ్వతంగా జీవించడం ప్రరంభమవుటను జీవములోకి ప్రవేశించడమని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్య జీవంలోకి ప్రవేశించడం లేక మరణించడం మరియు శాశ్వతంగా జీవించుటకు ప్రారంభించడం” (చూడండి: రూపకం)
χωλὸν
సులభంగా నిలువలేక పోతున్నాను. ఇక్కడ ఇది ఒక అడుగు తప్పిపోయినందున బాగా నడవలేక పోవడమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక కాళ్ళు లేకుండా” లేక “కాళ్ళు లేవు”
βληθῆναι εἰς τὴν Γέενναν
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను నరకములోకి పడవేయడానికి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 9:47
ἐὰν ὁ ὀφθαλμός σου σκανδαλίζῃ σε, ἔκβαλε αὐτόν
ఇక్కడ “కన్ను” అనే మాట 1) ఏదో చూడడం ద్వారా పాపం చేయాలనుకోవడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఏదైనా చూడడం ద్వారా పాపాత్మకమైన పనులు చేయాలనుకుంటే, మీ కన్ను పీకి పారవేయండి” లేక 2) మీరు చూసిన దాని వలన పాపం చేయాలనీ కోరుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చూసే దానివలన పాపాత్మకమైన పని చేయాలనుకుంటే, మీ కన్ను పీకి పారవేయండి. అనేదానికి మారుపేరైయున్నది. (చూడండి: అన్యాపదేశము)
μονόφθαλμον εἰσελθεῖν εἰς τὴν Βασιλείαν τοῦ Θεοῦ, ἢ δύο ὀφθαλμοὺς ἔχοντα
ఇది ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని సహజ శరీరం యొక్క స్థితిని గురించి తెలియచేస్తుంది. ఒక వ్యక్తి తన శరీరమును తనతో పాటు నిత్యత్వములోనికి తీసుకువెళ్ళడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రెండు కళ్ళతో భూమిపై నివసించిన దానికంటే ఒకే కన్నుతో భూమిపై నివసించిన తరువాత దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
βληθῆναι εἰς τὴν Γέενναν
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిన్ను నరకములోనికి పడవేయుటకు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 9:48
ὅπου ὁ σκώληξ αὐτῶν οὐ τελευτᾷ
ఈ ప్రకటన యొక్క అర్థమును స్పష్టముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ ప్రజలను తినే పురుగులు చావవు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 9:49
πᾶς…πυρὶ ἁλισθήσεται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రతి ఒక్కరిని నిప్పుతో ఉప్పు చేస్తాడు” లేక ఉప్పు ఒక యాగమును పవిత్ర పరచినట్లే, దేవుడు ప్రతి ఒక్కరిని బాధ పెట్టుటకు అనుమతించుట ద్వారా వారిని పవిత్ర పరచును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
πυρὶ ἁλισθήσεται
ఇక్కడ “మంట” అనేది బాధలకు ఒక రూపకఅలంకారమైయున్నది మరియు ప్రజలపై ఉప్పు వేయడం వారిని పవిత్ర పరచుటకు ఒక రూపకఅలంకారమై యున్నది. కాబట్టి మంటలతో ఉప్పు వేయబడుతుంది అనేది బాధల ద్వారా శుద్ధి చేయబడుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ యొక్క మంట పవిత్ర్ర పరచును” లేక “ఒక యాగం ఉప్పుతో పవిత్రపరచబడినందున పవిత్ర పరచబడుటకు బాధపడతారు.” (చూడండి: రూపకం)
Mark 9:50
ἄναλον γένηται
దాని ఉప్పు రుచి
ἐν τίνι αὐτὸ ἀρτύσετε?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దానిని మళ్ళీ ఉప్పుగా చేయలేరు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἀρτύσετε
మళ్ళీ ఉప్పు రుచి
ἔχετε ἐν ἑαυτοῖς ἅλα
యేసు మంచి వస్తువులు ప్రజలు కలిగి ఉన్న ఉప్పువలే ఒకరికొకరు మంచి పనులు చేయడం గురించి మాట్లాడుతుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఉప్పు ఆహారమునకు రుచిని ఇస్తున్నట్లు ఒకరికొకరు మంచి చేయండి” (చూడండి:: రూపకం)
Mark 10
మర్కు సువార్త 10వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు పాత నిబంధన నుండి మిగిలిన వచనం కంటే పేజిలో కుడి వైపున ఉల్లేఖనాలను అమర్చుతాయి. యు.ఎల్.టి 10:7-8లోని విశేషమైన ఉల్లేఖనాలతో దీనిని చేస్తుంది.
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
విడాకుల గురించి యేసు బోధ
మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం మంచిదని యేసు చెప్పుటకు పరిసయ్యులు ఒక మార్గమును కనుగొనాలని కోరుకున్నారు, కాబట్టి వారు విడాకుల గురించి ఆయనను అడిగారు. విడాకుల గురించి పరిసయ్యులు తప్పుగా బోధించారని చూపించుటకు, దేవుడు మొదట వివాహమును ఎలా రూపొందించాడో యేసు చెపుతాడు.
ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
రూపకఅలంకారము
రూపకఅలంకారములు అదృశ్య సత్యాలను వివరించుటకు బోధకులకు కనిపించే వస్తువుల చిత్రాలైయున్నవి. యేసు “నేను త్రాగే గిన్నె” గురించి మాట్లాడినప్పుడు, ఆయన సిలువపై అనుభవించే బాధను ఒక గిన్నెలో చెడు విషపూరిత ద్రవంలా ఉందని మాట్లాడుతున్నాడు.
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
ధర్మశాస్త్రవిద్ధమైన
ధర్మశాస్త్రవిరుద్ధం అనేది అసలైన దానిని వివరించుటకు కనిపించే నిజమైన ప్రకటనయైయున్నది. “మీలో గొప్పవాడై ఉండాలని కోరుకునేవాడు మీ సేవకునిగా ఉండాలి” అని చెప్పినప్పుడు ధర్మశాస్త్ర విరుద్ధమైనదానిని ఉపయోగిస్తాడు. (మార్కు 10:43).
Mark 10:1
యేసు మరియు ఆయన శిష్యులు కపెర్నహూమును విడచిపెట్టిన తరువాత వివాహం మరియు విడాకుల విషయంలో దేవుడు నిజంగా కోరిన విషయాలను యేసు పరిసయ్యులతో పాటు ఆయన శిష్యులకు గుర్తుచేస్తాడు
ἐκεῖθεν ἀναστὰς
యేసు శిష్యులు ఆయనతో ప్రయాణిస్తున్నారు. వారు కపెర్నహూము నుండి బయలుదేరుతున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు కపెర్నహూమును విడచిపెట్టారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καὶ πέραν τοῦ Ἰορδάνου
మరియు యోర్దాను నదికి అవతల ఉన్న ప్రాంతానికి లేక “మరియు యోర్దాను నదికి తూర్పు ప్రాంతానికి”
πάλιν ἐδίδασκεν αὐτούς
“వారిని” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది.
εἰώθει
ఆయన ఆచారం లేక “ఆయన సాధారణముగా చేసాడు”
Mark 10:3
τί ὑμῖν ἐνετείλατο Μωϋσῆς?
మోషే వారి పూర్వీకులకు ధర్మశాస్త్రమును ఇచ్చాడు, ఇప్పుడు వారు కూడా అనుసరించాల్సి ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీని గురించి మోషే మీ పూర్వికులకు ఏమని ఆజ్ఞాపించాడు”
Mark 10:4
βιβλίον ἀποστασίου
ఇది ఒక స్త్రీ ఇకపై తన భార్య కాదని చెప్పే కాగితం.
Mark 10:5
ὁ δὲ Ἰησοῦς εἶπεν αὐτοῖς…ἔγραψεν ὑμῖν τὴν ἐντολὴν ταύτην
కొన్ని భాషలలో మాట్లాడేవారు ఎవరు మాట్లాడుతున్నారో చెప్పుటకు ఉల్లేఖనముకు అంతరాయం కలిగించరు. పూర్తి ఉల్లేఖన ప్రారంభంలో లేక చివరిలో ఎవరు మాట్లాడుతున్నారో వారు చెబుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు వారితో ‘దీనికి కారణం ... ఈ ధర్మశాస్త్రం అని చెప్పాడు” (చూడండి: ఉల్లేఖనాలు, ఉల్లేఖనాల అంచులు)
πρὸς τὴν σκληροκαρδίαν ὑμῶν, ἔγραψεν ὑμῖν τὴν ἐντολὴν ταύτην
ఈ సమయానికి చాలా కాలం ముందు యూదులు మరియు వారి వంశస్థుల కోసం వారి కఠినమైన హృదయాల గురించి మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసాడు. యేసు కాలపు యూదులకు కూడా కఠినమైన హృదయాలు ఉన్నాయి కాబట్టి యేసు “మీ” మరియు “మీరు” అనే మాటలను” ఉపయోగించడం ద్వారా వారిని చేర్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే ఆయన ఈ ధర్మశాస్త్రమును వ్రాసినట్లు మీ పూర్వీకులకు మరియు మీకీ కఠినమైన హృదయాలు ఉన్నాయి”
τὴν σκληροκαρδίαν ὑμῶν
ఇక్కడ “హృదయాలు” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరైయున్నది. “కఠినమైన హృదయాలు” అనే మాట మొండితనమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మొండితనం” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
Mark 10:6
ἐποίησεν αὐτούς
దేవుడు మనుష్యులను సృజించాడు
Mark 10:7
యేసు ఆదికాండములో చెప్పినదానిని ఉల్లేఖిస్తూనే ఉన్నాడు
ἕνεκεν τούτου
అందువలన లేక “దీని కారణంగా”
Mark 10:8
οἱ δύο εἰς σάρκα μίαν
యేసు ఆదికాండములో చెప్పినదానిని ఉల్లేఖించడంను ముగించాడు
οὐκέτι εἰσὶν δύο, ἀλλὰ μία σάρξ
భార్య భర్తలుగా వారి సన్నిహిత ఐక్యతను వివరించుటకు ఇది ఒక రూపకఅంలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిలా ఉన్నారు” లేక “ఇకపై వారు ఇద్దరు కాదు, కానీ వారిద్దరూ కలిసి ఏకశరీరమవుతారు” (చూడండి: రూపకం)
Mark 10:9
ὃ οὖν ὁ Θεὸς συνέζευξεν, ἄνθρωπος μὴ χωριζέτω
“దేవుడు కలిపిన వారు” అనే మాట పెళ్ళైన జంటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందువలన దేవుడు కలిపిన వారిని ఏ మనిషి వేరు చేయకూడదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 10:10
καὶ εἰς
యేసు మరియు ఆయన శిష్యులు ఉన్నప్పుడు
εἰς τὴν οἰκίαν
యేసు శిష్యులు ఆయనతో ఏకాంతముగా మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంట్లో ఒంటరిగా ఉన్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
περὶ τούτου ἐπηρώτων αὐτόν
“ఇది” అనే మాట విడాకుల గురించి యేసు పరిసయ్యులతో జరిపిన సంభాషణ గురించి తెలియచేస్తుంది.
Mark 10:11
ὃς ἂν
ఎవరైనా
μοιχᾶται ἐπ’ αὐτήν
ఇక్కడ “ఆమె” అనే మాట అతను వివాహం చేసుకున్న మొదటి స్త్రీని గురించి తెలియచేస్తుంది.
Mark 10:12
μοιχᾶται
ఈ పరిస్థితిలో ఆమె తన మునుపటి భర్తకు విరుద్ధంగా వ్యభిచారం చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె అతనికి వ్యతిరేకంగా చేస్తుంది” లేక “ఆమె మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 10:13
ప్రజలు తమ చిన్న పిల్లలను యేసు దగ్గరకు తిసుకువచ్చినందున శిష్యులు వారిని మందలించినప్పుడు, ఆయన పిల్లలను ఆశీర్వదిస్తాడు మరియు ప్రజలు దేవుని రాజ్యాములో ప్రవేశించుటకు చిన్నపిల్లలవలె వినయంగా ఉండాలి అని శిష్యులకు గుర్తుచేస్తాడు.
καὶ προσέφερον
ఇప్పుడు ప్రజలు తీసుకువస్తున్నారు. ఇది కథలోని తదుపరి సంఘటన. (చూడండి: కొత్త సంఘటన)
αὐτῶν ἅψηται
దీని అర్థం యేసు తన చేతులతో వారిని తాకి ఆశీర్వదిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన చేతులతో వారిని తాకి ఆశీర్వదించవచ్చు” లేక “ఆయన వారిపై చేయి ఉంచి వారిని ఆశీర్వదించవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐπετίμησαν αὐτοῖς
ప్రజలను గద్దించారు
Mark 10:14
ἰδὼν…ὁ Ἰησοῦς
“అది” అనే మాట పిల్లలను యేసుని దగ్గరకు తీసుకువచ్చిన ప్రజలను శిష్యులు గద్దించుటను గురించి తెలియచేస్తుంది.
ἠγανάκτησεν
ఆయనకు కోపము వచ్చింది
ἄφετε τὰ παιδία ἔρχεσθαι πρός με, καὶ μὴ κωλύετε αὐτά
ఈ రెండు నిబంధనలకు సారూప్య అర్థాలు ఉన్నాయి, నొక్కిచేప్పుట కోసం పునరావృతం అయింది. కొన్ని భాషలలో దీనిని మరొక విధంగా నొక్కి చెప్పడం మరింత సహజం. ప్రత్యామ్నాయ తర్జుమా: “చిన్న బిడ్డలను నా దగ్గరకు రానివ్వండి” (చూడండి: సమాంతరత)
μὴ κωλύετε
ఇది రెట్టింపు ప్రతికూల మాటగా ఉన్నది. కొన్ని భాషలలో సానుకూల ప్రకటనను ఉపయోగించడం సహజమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనుమతించు” (చూడండి: జంట వ్యతిరేకాలు)
τῶν γὰρ τοιούτων ἐστὶν ἡ Βασιλεία τοῦ Θεοῦ
ప్రజలకు చెందినా రాజ్యం వారితో సహా రాజ్యమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని రాజ్యం వారిలాంటి మనుష్యులదే” లేక “ఎందుకంటే వారిలాంటి మనుష్యులు మాత్రమే దేవుని రాజ్యంలో సభ్యులు” (చూడండి: రూపకం)
Mark 10:15
ὃς ἂν μὴ δέξηται…παιδίον, οὐ μὴ εἰσέλθῃ εἰς αὐτήν
ఎవరైనా స్వీకరించకపోతే ... పిల్లవాడు, అతను ఖచ్చితంగా దానిలోకి ప్రవేశించడు
ὡς παιδίον
ప్రజలు దేవుని రాజ్యమును ఎలా స్వీకరించాలి అనే విషయమును చిన్న పిల్లలు ఎలా స్వీకరిస్తారో అనే దానితో పోల్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదే విధంగా పిల్లల మాదిరిగా” (చూడండి: ఉపమ)
μὴ δέξηται τὴν Βασιλείαν τοῦ Θεοῦ
దేవునిని తమ రాజుగా అంగీకరించరు
οὐ μὴ εἰσέλθῃ εἰς αὐτήν
“ఇది” అనే మాట దేవుని రాజ్యం గురించి తెలియచేస్తుంది.
Mark 10:16
ἐναγκαλισάμενος αὐτὰ
ఆయన పిల్లలను కౌగిలించుకున్నాడు
Mark 10:17
ἵνα ζωὴν αἰώνιον κληρονομήσω
ఇక్కడ మనిషి “స్వీకరించడం” గురించి అది “వారసత్వంగా” ఉన్నట్లు అని చెప్పబడింది. స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుటకు ఈ రూపకఅలంకారము ఉపయోగించబడింది. అలాగే, ఇక్కడ “వారసత్వంగా” ఎవరైనా మొదట చనిపోవాలని కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శాశ్వత జీవం పొందుటకు” (చూడండి: రూపకం)
Mark 10:18
τί με λέγεις ἀγαθόν?
దేవుడు మంచివాడైన విధంగా ఏ మనిషి మంచివాడు కాదని గుర్తు చేయుటకు యేసు ఈ ప్రశ్నను అడుగుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను మంచివాడని పిలచినప్పుడు మీరు ఏమి చెపుతున్నారో మీకు అర్థం కావడం లేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἀγαθὸς, εἰ μὴ εἷς ὁ Θεός
మంచివాడు. దేవుడు మాత్రమే మంచివాడు
Mark 10:19
μὴ…ψευδομαρτυρήσῃς
ఎవరికీ వ్యతిరేకంగా అబద్ద సాక్ష్యం చెప్పకూడదు” లేక “న్యాయస్థానంలో ఒకరి గురించి అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు”
Mark 10:21
ἕν σε ὑστερεῖ
నీవు తప్పిపోయిన విషయం ఒకటుంది. ఇక్కడ “తక్కువ” అనేది ఏదైనా చేయవలసిన అవసరమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు చేయవలసినది ఒకటి ఉంది” లేక “నీవు చేయని ఒక విషయం ఇంకా ఉంది” లేక (చూడండి: రూపకం)
δὸς τοῖς πτωχοῖς
ఇక్కడ “ఇది” అనే మాట అతను విక్రయించిన వస్తువులను గురించి తెలియచేస్తుంది మరియు అతను వాటిని విక్రయించినప్పుడు అతను అందుకున్న ధనమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధనమును పేదవాళ్ళకు ఇవ్వు” (చూడండి: అన్యాపదేశము)
τοῖς πτωχοῖς
ఇది పేద ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేద ప్రజలు” (చూడండి: నామకార్థ విశేషణాలు)
θησαυρὸν
సంపద, విలువైన వస్తువులు
Mark 10:22
ἔχων κτήματα πολλά
చాల వస్తువులను కలిగి ఉన్నాడు
Mark 10:23
πῶς δυσκόλως
ఇది చాలా కష్టం
Mark 10:24
ὁ δὲ Ἰησοῦς πάλιν ἀποκριθεὶς λέγει αὐτοῖς
యేసు మళ్ళీ తన శిష్యులతో ఇలా అన్నాడు
τέκνα, πῶς
నా పిల్లలారా, ఇది ఎలా. ఒక తండ్రి తన పిల్లలకు నేర్పిస్తున్నట్లు యేసు వారికి బోధిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా స్నేహితులారా, ఇది ఎలా” (చూడండి: రూపకం)
πῶς δύσκολόν ἐστιν
ఇది ఎంతో కష్టం
Mark 10:25
εὐκοπώτερόν ἐστιν…εἰς τὴν Βασιλείαν τοῦ Θεοῦ εἰσελθεῖν
ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం ఎంత కష్టమో నొక్కి చెప్పుటకు యేసు అతిశయోక్తిని ఉపయోగిస్తాడు. (చూడండి: అతిశయోక్తి)
εὐκοπώτερόν ἐστιν κάμηλον
ఇది అసాధ్యమైన పరిస్థితి గురించి చెబుతుంది. మీరు దేనిని మీ భాషలో ఈ విధంగా చెప్పలేకపోతే, దానిని ఊహాత్మక పరిస్థితిగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒంటెకు ఇది సులభం అవుతుంది” (చూడండి: ఊహాత్మక పరిస్థితులు)
τρυμαλιᾶς ῥαφίδος
సూది యొక్క రంధ్రం. ఇది దారం దాని గుండా వెళ్ళే కుట్టుసూది చివరి రంద్రం గురించి తెలియచేస్తుంది.
Mark 10:26
οἱ δὲ περισσῶς ἐξεπλήσσοντο
శిష్యులు ఉన్నారు
καὶ τίς δύναται σωθῆναι?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అలా అయితే ఎవరూ రక్షింపబడరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 10:27
παρὰ ἀνθρώποις ἀδύνατον, ἀλλ’ οὐ παρὰ Θεῷ
అర్థం చేయబడ్డ సమాచారం అందింప చెయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు తమను తాము రక్షించుకోవడం అసాధ్యం కాని దేవుడు వారిని రక్షించగలడు. (చూడండి: శబ్దలోపం)
Mark 10:28
ἰδοὺ, ἡμεῖς ἀφήκαμεν πάντα καὶ ἠκολουθήκαμέν σοι
ఇక్కడ తరువాత వచ్చే మాటల దృష్టిని ఆకర్షించుటకు “చూడటం” అనే మాటను ఉపయోగిస్తారు. ఇదే విధమైన నొక్కి చెప్పే విషయమును ఇతర మార్గాలలో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అన్నిటిని విడచిపెట్టి నిన్ను అనుసరించాము”
ἀφήκαμεν πάντα
ప్రతీది వదలివేసాము
Mark 10:29
ἢ ἀγροὺς
లేక భూమి యొక్క భూ భాగములు లేక “అతను కలిగి ఉన్న భూమి”
ἕνεκεν ἐμοῦ
“నా కారణం కోసం” లేక “నా కోసం”
τοῦ εὐαγγελίου
సువార్తను ప్రకటించుటకు
Mark 10:30
ἐὰν μὴ λάβῃ
“విడచిపెట్టిన వారు ఎవ్వరూ లేరు” (29వ వచనం) అనే మాటలతో ప్రారంభమైన వాక్యమును యేసు ముగించాడు. వాక్యమంతటిని సానుకూలంగా చెప్పవచ్చు. “నా కోసం, సువార్త కోసం ఇల్లు, సోదరులు, సోదరీలు తల్లి తండ్రి పిల్లలు లేక భూములను విడచిపెట్టిన ప్రతీ ఒక్కరూ అందుకుంటారు” (చూడండి: జంట వ్యతిరేకాలు మరియు ద్వంద్వ నకారాలు)
ἐν τῷ καιρῷ τούτῳ
ఈ జీవితం లేక “ప్రస్తుత యుగం”
ἀδελφοὺς, καὶ ἀδελφὰς, καὶ μητέρας, καὶ τέκνα
29వ వచనంలోని పట్టికవలె, ఇది సాధారణంగా కుటుంబమును గురించి వివరిస్తుంది. 30వ వచనంలో “తండ్రులు” అనే మాట లేదు కాని ఇది అర్థమును గణనీయంగా మార్చదు.
μετὰ διωγμῶν, καὶ ἐν τῷ αἰῶνι τῷ ἐρχομένῳ, ζωὴν αἰώνιον
“హింస” అనే నిరుపయ నామవాచాకములోని ఆలోచనను “హింసించు” అనే క్రియతో వ్యక్తపరచే విధంగా దీనిని తిరిగి చెప్పవచ్చ. వాక్యం చాలా పొడవుగా క్లిష్టంగా ఉన్నందున “అందుకుంటుంది” అనేది పునరావృతం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ప్రజలు వారిని హింసించినప్పటికీ రానున్న లోకంలో వారు శాశ్వత జీవం పొందుతారు” (చూడండి: భావనామాలు)
ἐν τῷ αἰῶνι τῷ ἐρχομένῳ
రానున్న లోకంలో లేక “భావిష్యత్కాలములో
Mark 10:31
ἔσονται πρῶτοι ἔσχατοι, καὶ ἔσχατοι πρῶτοι
ఇక్కడ “మొదటి” మరియు “చివరి” అనే మాటలు ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముఖ్యమైనవి ముఖ్యమైనవి కావు, అప్రధానమైనవి ముఖ్యమైనవియైయున్నవి” (చూడండి: రూపకం)
ἔσχατοι πρῶτοι
“చివరిది” అనే మాట చివరి వ్యక్తుల గురించి తెలియచేస్తుంది. అలాగే ఈ నిబంధనలోని అర్థం చేసుకున్న క్రియను అందింప చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చివరివారు మొదటివారు అవుతారు” (చూడండి: నామకార్థ విశేషణాలు మరియు శబ్దలోపం)
Mark 10:32
ἦσαν δὲ ἐν τῇ ὁδῷ…ἦν προάγων αὐτοὺς ὁ Ἰησοῦς
యేసు మరియు ఆయన శిష్యులు దారిలో నడుస్తున్నారు ... మరియు యేసు తన శిష్యుల ముందు నడుస్తూ ఉన్నాడు
οἱ…ἀκολουθοῦντες
వారి వెనుక వారిని వెంబడించువారు. కొంతమంది యేసు మరియు ఆయన శిష్యుల వెనుక నడుస్తున్నారు.
Mark 10:33
ἰδοὺ
చూడండి లేక “వినండి” లేక “నేను మీకు చెప్పే దానిపై శ్రద్ధ వహించండి”
ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδοθήσεται
యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను, మనుష్యకుమారుడు,
ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδοθήσεται τοῖς
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో మనుష్యకుమారుని అప్పగిస్తారు” లేక “వారు మనుష్యకుమారుని అప్పగిస్తారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κατακρινοῦσιν
“వారు” అనే మాట ప్రధాన యజకులను మరియు శాస్త్రులను గురించి తెలియచేస్తుంది.
παραδώσουσιν αὐτὸν τοῖς ἔθνεσιν
“ఆయనను యూదేతరుల నియంత్రణలో ఉంచండి” (మార్కు 10:34).
Mark 10:34
ἐμπαίξουσιν
”వారు హేళన చేస్తారు ప్రజలు హేళన చేస్తారు”
ἀποκτενοῦσιν
ఆయనను చంపివేయండి
ἀναστήσεται
ఇది మృతులలో నుండి లేవడము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తజుమా: “ఆయన చనిపోయి లేస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 10:35
θέλομεν…αἰτήσωμέν…ἡμῖν
ఈ మాటలు యాకోబు మరియు యోహానులను గురించి మాత్రమే తెలియచేస్తుంది (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
Mark 10:37
ἐν τῇ δόξῃ σου
మీరు మహిమపరచినప్పుడు. “మీ మహిమలో” అనే మాట యేసు మహిమపరచబడినప్పుడు మరియు అయన రాజ్య పరిపాలన గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ రాజ్యములో పరిపాలించినప్పుడు” (చూడండి: అన్యాపదేశము)
Mark 10:38
οὐκ οἴδατε
నీకు తెలియదు
πιεῖν τὸ ποτήριον ὃ ἐγὼ πίνω
ఇక్కడ “గిన్నె” అంటే యేసు బాధపడవలసిన దాని గురించి తెలియచేస్తుంది. బాధను తరచుగా ఒక గిన్నె నుండి త్రాగడం అని తెలియచేయబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను త్రాగే బాధ గిన్నెలోనిది త్రాగండి” లేక “నేను త్రాగే బాధ గిన్నెలో నుండి త్రాగండి” (చూడండి: రూపకం)
τὸ βάπτισμα ὃ ἐγὼ βαπτίζομαι βαπτισθῆναι
ఇక్కడ బాప్తిస్మము” మరియు బాప్తిస్మము తీసుకోవడం బాధలను గురించి తెలియచేస్తుంది. బాప్తిస్మము సమయంలో నీరు ఒక వ్యక్తిని కప్పినట్లే బాధ యేసును ముంచివేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బాధ పడే బాధ యొక్క బాప్తిస్మమును భరించండి” (చూడండి: రూపకం)
Mark 10:39
δυνάμεθα
వారు ఈ విధంగా స్పందిస్తారు, అంటే వారు ఒకే గిన్నెలోనిది త్రాగాగలుగుతారు మరియు అదే బాప్తిస్మమును భరిస్తారు. (చూడండి: శబ్దలోపం)
πίεσθε
మీరు కూడా త్రాగుతారు
Mark 10:40
τὸ δὲ καθίσαι ἐκ δεξιῶν μου…οὐκ ἔστιν ἐμὸν δοῦναι
కాని నేను ప్రజలను నా కుడి వైపున లేక ఎడమ వైపున కూర్చోవడానికి అనుమతించేది నేను కాదు
ἀλλ’ οἷς ἡτοίμασται
కాని ఆ స్థానాలు ఎవరికోసం సిద్ధం చేసి ఉన్నాయో వారి కోసమైయున్నాయి. “ఇది” అనే మాట ఆయన కుడి వైపున మరియు ఎడమ వైపున ఉన్న స్థానాలను గురించి తెలియచేస్తుంది.
ἡτοίμασται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దానిని సిద్ధం చేసాడు” లేక “దేవుడు వాటిని సిద్ధం చేసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 10:41
ἀκούσαντες,
“ఇది” అనే మాట యాకోబు యోహానులు యేసు యొక్క కుడి మరియు ఎడమ వైపున కూర్చోమని అడగటమును గురించి తెలియచేస్తుంది.
Mark 10:42
προσκαλεσάμενος αὐτοὺς ὁ Ἰησοῦς
యేసు తన శిష్యులను పిలిచాడు
οἱ δοκοῦντες ἄρχειν τῶν ἐθνῶν
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమయ్యే అర్థాలు 1) ప్రజలు సాధారణంగా ఈ ప్రజలను అన్యజనుల అధికారులుగా భావిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్యజనులకు అధికారిగా ఉండుటకు ప్రజలు పరిగణిస్తారు” లేక 2) అన్యజనులు ఈ ప్రజలను తమ అధికారులుగా పరిగణిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్యజనులు తమ అధికారిగా భావించేవారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κατακυριεύουσιν
నియంత్రణ లేక శక్తి కలిగి
κατεξουσιάζουσιν
వారి అధికరమును చాటుతూ విర్రవీగుతారు. దీని అర్థం వారు తమ అధికారమును అధికముగా చూపించడం లేక ఉపయోగించడం.
Mark 10:43
οὐχ οὕτως δέ ἐστιν ἐν ὑμῖν
ఇది అన్యజనుల అధికారం గురించి మునుపటి వచనమును గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే వారిలా ఉండకండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μέγας γενέσθαι
ఎంతో గౌరవించబడాలి
Mark 10:44
εἶναι πρῶτος
ఇది చాల ముఖ్యమైనది కావడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా ముఖ్యమైనది” (చూడండి: రూపకం)
Mark 10:45
γὰρ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου οὐκ ἦλθεν διακονηθῆναι
దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుడు ప్రజల చేత సేవ చేయించుకోడానికి రాలేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
διακονηθῆναι, ἀλλὰ διακονῆσαι
ప్రజలచే సేవ చేయబడాలి, కాని ప్రజలకు సేవ చేయాలి
ἀντὶ πολλῶν
చాలా మందికి
Mark 10:46
యేసు మరియు ఆయన శిష్యులు యేరుషలేము వైపు నడవడం కొనసాగిస్తున్నప్పుడు, యేసు గుడ్డి బర్తిమయిని స్వస్థపరుస్తాడు, అతనూ వారితో నడుస్తాడు.
ὁ υἱὸς Τιμαίου, Βαρτιμαῖος, τυφλὸς προσαίτης
తీమయి కుమారుడు, బర్తిమయి అనే గుడ్డి భిక్షగాడు. బర్తిమయి ఒక మనిషి పేరు. తీమయి అతని తండ్రి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 10:47
ἀκούσας ὅτι Ἰησοῦς…ἐστιν
ఆయన యేసు అని ప్రజలు మాట్లాడుకోవడం బర్తిమయి విన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన యేసు అని ప్రజలు చెప్పడం విన్నప్పుడు” (చూడండి: శబ్దలోపం)
Υἱὲ Δαυεὶδ
యేసు దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు ఎందుకంటే ఆయన దావీదు రాజు వంశస్తుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెస్సయా అయిన మీరు దావీదు రాజు వంశము నుండి వచ్చారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 10:48
ἐπετίμων…πολλοὶ
చాలా మంది గద్దించారు
πολλῷ μᾶλλον
ఇంకా ఎక్కువ
Mark 10:49
εἶπεν, φωνήσατε αὐτόν
దీనిని క్రీయాశీల రూపంలో లేక ప్రత్యక్ష ఉల్లేఖనగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతనిని పిలవమని ఇతరులకు ఆజ్ఞాపించాడు” లేక “‘అతణ్ణి ఇక్కడికి రమ్మని పిలవండి, అని ఆజ్ఞాపించాడు.” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
φωνοῦσι
“వారు” అనే మాట జనసమూహమును గురించి తెలియచేస్తుంది
θάρσει
ధైర్యంగా ఉండు లేక “భయపడవద్దు”
φωνεῖ σε
యేసు నిన్ను పిలుస్తున్నాడు
Mark 10:50
ἀναπηδήσας
గభాలున లేచి
Mark 10:51
ἀποκριθεὶς αὐτῷ
గుడ్డివాడు సమాధానం చెప్పాడు
ἀναβλέψω
చూడగలుగుతాడు
Mark 10:52
ἡ πίστις σου σέσωκέν σε
మనిషి యొక్క విశ్వాసమును నొక్కి చెప్పుటకు ఈ వాక్యభాగం ఈ విధంగా వ్రాయబడింది. యేసు ఆ మనిషిని స్వస్థ పరుస్తాడు ఎందుకంటే యేసు తనను స్వస్థ పరుస్తాడని అతను నమ్ముతాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నన్ను నమ్మినందున నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἠκολούθει αὐτῷ
అతను యేసును వెంబడించాడు
Mark 11
మర్కు సువార్త 11వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వాక్యాలైన 11:9-10, 17 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
గాడిద మరియు గాడిద పిల్ల
యేసు ఒక జంతువుపై కూర్చొని యేరుషలేములోనికి వెళ్ళాడు. ఈ విధంగా ఆయన ఒక ముఖ్యమైన యుద్ధములో గెలిచిన తరువాత ఒక పట్టణంలోనికి వచ్చిన రాజులా ఉన్నాడు. ఆలాగే పాత నిబంధనలోని ఇశ్రాయేలు రాజులు గాడిదలపై ప్రయాణించారు. ఇతర రాజులు గుర్రములపై ప్రయాణించారు. కాబట్టి యేసు తానూ ఇష్రాయేలీయుల రాజని ఇతరుల లాగా లేడని చూపిస్తున్నాడు.
మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులు అందరూ ఈ విషయమును గురించి వ్రాసారు. శిష్యులు యేసుకై గాడిదను తీసుకువచ్చారని మత్తయి మరియు మార్కులు తమ సువార్తలలో వ్రాసారు. యేసు గాడిదను కనుగొన్నాడని యోహాను తన సువార్తలో వ్రాసాడు. వారు ఆయనకు ఒక గాడిద పిల్లను తీసుకువచ్చారని లూకా వ్రాసాడు. యేసు గాడిదపై లేక గాడిద పిల్లపై ప్రయాణించాడో ఎవరికీ తెలియదు ఈ సంగాతులన్నితి యు.ఎల్.టి(ULT) లో కనిపించే విధంగా తర్జుమా చేయడం మంచిది. (చూడండి: మత్తయి 21:1- 7 మరియు మార్కు 11:1-7 మరియు లూకా 19:29-36 మరియు యోహాను 12:14-15)
Mark 11:1
καὶ ὅτε ἐγγίζουσιν εἰς Ἱεροσόλυμα, εἰς Βηθφαγὴ καὶ Βηθανίαν πρὸς τὸ Ὄρος τῶν Ἐλαιῶν
యేసు మరియు ఆయన శిష్యులు యేరుషలేము పట్టణమును సమీపించినప్పుడు వారు ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే మరియు బేతనియ దగ్గరకు వచ్చారు వారు యెరుషలేము పరిసరాల్లోని బేత్పగే మరియు బేతనియకు వచ్చారు
Βηθφαγὴ
ఇది ఒక గ్రామం పేరైయున్నది
Mark 11:2
τὴν κατέναντι ὑμῶν
మాకు ముందు
πῶλον
ఇది మనిషిని మోసేంత పెద్ద గాడిదను గురించి తెలియచేస్తుంది.
ἐφ’ ὃν οὐδεὶς ἀνθρώπων οὔπω ἐκάθισεν
దీనిని క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇప్పటివరకు ఎవరూ స్వారి చేయలేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 11:3
τί ποιεῖτε τοῦτο?
“ఇది” అనే మాట దేనిని గురించి తెలియచేస్తుందో స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకు మీరు విప్పారు మరియు గాడిద పిల్లను ఎందుకు తీసుకుంటున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
αὐτοῦ χρείαν ἔχει
ఇది అవసరం
εὐθὺς αὐτὸν ἀποστέλλει πάλιν ὧδε
యేసు దానిని ఉపయోగించడం పూర్తయిన వెంటనే దాన్ని తిరిగి పంపుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనకు ఇక అవసరం లేనప్పుడు వెంటనే దానిని తిరిగి పంపుతాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:4
ἀπῆλθον
ఇద్దరు శిష్యులు వెళ్ళారు
πῶλον
ఇది మనిషిని మోసేంత పెద్ద గాడిదను గురించి తెలియచేస్తుంది. మార్కు 11:2 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
Mark 11:6
οἱ…εἶπον
వారు స్పందించారు
καθὼς εἶπεν ὁ Ἰησοῦς
యేసు ప్రతిస్పందించమని చెప్పినట్లు. గాడిద పిల్లను తీసుకోవడం గురించి ప్రజల ప్రశ్నలకు స్పందించమని యేసు వారికి చెప్పినట్లు ఇది తెలియచేస్తుంది.
ἀφῆκαν αὐτούς
దీని అర్థం వారు ఏమి చేస్తున్నారో కొనసాగించుటకు వారు అనుమతించారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గాడిదను వారు తమతో తీసుకువెళ్ళనివ్వండి” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 11:7
ἐπιβάλλουσιν αὐτῷ τὰ ἱμάτια αὐτῶν, καὶ ἐκάθισεν ἐπ’ αὐτόν
వారి వస్త్రాలను వారు దాని వెనుక వస్త్రాలను పరిచారు కాబట్టి యేసు దాని పై స్వారి చేయవచ్చు. ఒక దుప్పటి లేక దాని వెనుక భాగంలో ఏదైనా ఉన్నప్పుడు గాడిద పిల్లను లేక గుర్రపు స్వారీ చేయడం సులభంగా ఉంటుంది.
τὰ ἱμάτια
కోట్లు లేదా “వస్త్రములు”
Mark 11:8
πολλοὶ τὰ ἱμάτια αὐτῶν ἔστρωσαν εἰς τὴν ὁδόν
ముఖ్యమైన వ్యక్తుల ముందు వారిని గౌరవించుటకు దారి పై వస్త్రాలు వేయడం ఒక సంప్రదాయమైయున్నది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను గౌరవించుటకు చాలా మంది తమ వస్త్రాలను దారి పొడవున పరిచారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἄλλοι δὲ στιβάδας κόψαντες ἐκ τῶν ἀγρῶν
ముఖ్యమైన వ్యక్తుల ముందు వారిని గౌరవించుటకు దారి పై తాటి కొమ్మలు వేయడం ఒక సంప్రదాయమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకొందరు ఆయనను గౌరవించుటకు పొలాలలోనుండి కొమ్మలను నరికి దారి పొడవున పరిచారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:9
οἱ…ἀκολουθοῦντες
ఆయను వెంబడించినవారు
ὡσαννά
ఈ మాటకు “మమ్మల్ని రక్షించండి” అని అర్థం, కాని వారు దేవుని స్తుతించాలనుకున్నప్పుడు ప్రజలు కూడా ఆనందంగా అరిచారు. మీరు దానిని ఉపయోగించిన ప్రకారం తర్జుమా చేయవచ్చు లేక మీ భాష యొక్క మాటను లేఖన పద్ధతిని ఉపయోగించి “హోసన్నా” అని వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుణ్ణి స్తుతించండి” (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
εὐλογημένος ὁ ἐρχόμενος
ఇది యేసును గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ధన్యుడవు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν ὀνόματι Κυρίου
ఇది ప్రభువు అధికారానికి ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు యొక్క అధికారం” (చూడండి: అన్యాపదేశము)
εὐλογημένος
దేవుడు దివించునుగాక
Mark 11:10
εὐλογημένη ἡ ἐρχομένη βασιλεία τοῦ πατρὸς ἡμῶν, Δαυείδ
రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. ఇది దేవుడు వచ్చుటను మరియు ఆయన పరిపాలించుటను గురించి తెలియచేస్తుంది. “ఆశీర్వదించడం” అనే మాట క్రీయాశీల క్రీయగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ రాజ్యం రావడం ధన్యమైయున్నది లేక “మీరు రాబోయే రాజ్యమును పరిపాలించేటప్పుడు దేవుడు నిన్ను ఆశిర్వదిస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τοῦ πατρὸς ἡμῶν, Δαυείδ
ఇక్కడ పరిపాలన చేసే దావీదు యొక్క వారసుడిని దావీదు అని పిలుస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా తండ్రి దావీదు యొక్క గొప్ప వారసుడు లేక “దావీదు యొక్క గొప్ప వారసుడు పరిపాలించేవాడు” (చూడండి: అన్యాపదేశము)
ὡσαννὰ ἐν τοῖς ὑψίστοις
సాధ్యమయ్యే అర్థాలు 1) “పరలోకములో ఉన్న దేవుణ్ణి స్తుతించండి” లేక 2) “పరలోకములో ‘హోసన్నా’ అని బిగ్గరగా కేకలు వేసారు.”
τοῖς ὑψίστοις
ఇక్కడ పరలోకం “సర్వోన్నత”మైనదిగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సర్వోన్నతమైన” స్థలం లేక “పరలోకం” (చూడండి: రూపకం)
Mark 11:11
ὀψίας ἤδη οὔσης τῆς ὥρας
ఎందుకంటే ఆ రోజుకే పొద్దుపోయినందున
ἐξῆλθεν εἰς Βηθανίαν μετὰ τῶν δώδεκα
ఆయన మరియు ఆయన పన్నెండు మంది శిష్యులు యేరుషలేమును విడచి బేతనియకు వెళ్ళాడు
Mark 11:12
ἐξελθόντων αὐτῶν ἀπὸ Βηθανίας
వారు బేతనియ నుండి యెరుషలేమునకు తిరిగి వెళ్ళుతున్నప్పుడు
Mark 11:13
యేసు మరియు ఆయన శిష్యులు యేరుషలేమునకు వెళ్ళుతున్నప్పుడు ఇది జరిగింది
εἰ…τι εὑρήσει ἐν αὐτῇ
దానిపై ఏదైనా పండు ఉంటే
οὐδὲν εὗρεν εἰ μὴ φύλλα
దీని అర్థం ఆయన అంజూరపు పండ్లను కనుగొనలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చెట్టు మీద ఆకులను మాత్రమే కనుగొన్నాడు మరియు అంజూరపు పండ్లు అందులో లేవు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు ద్వంద్వ నకారాలు)
ὁ…καιρὸς
సంవత్సర కాలం
Mark 11:14
εἶπεν αὐτῇ, μηκέτι εἰς τὸν αἰῶνα, ἐκ σοῦ μηδεὶς καρπὸν φάγοι
యేసు అంజూరపు చెట్టుతో మాట్లాడి దానిని శపించాడు. ఆయన శిష్యులు ఆయన మాట వినుటకు ఆయన దానితో మాట్లాడెను. (చూడండి: అపాస్ట్రొఫీ)
εἶπεν αὐτῇ
చెట్టుతో మాట్లాడాడు
ἤκουον οἱ μαθηταὶ αὐτοῦ
“ఇది” అనే మాట యేసు అంజూరపు చెట్టుతో మాట్లాడటం గురించి తెలియచేస్తుంది
Mark 11:15
ἔρχονται
యేసు మరియు ఆయన శిష్యులు వచ్చారు
ἤρξατο ἐκβάλλειν τοὺς πωλοῦντας καὶ τοὺς ἀγοράζοντας ἐν τῷ ἱερῷ
యేసు ఈ ప్రజలను దేవాలయం నుండి తరిమివేస్తున్నాడు. దీనిని స్పష్టంగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అమ్మేవారిని మరియు కోనేవారిని దేవాలయం నుండి తరిమి కొట్టడం ప్రారంభించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοὺς πωλοῦντας καὶ τοὺς ἀγοράζοντας
కొనుగోలు చేయువారు మరియు అమ్మకం చేయు ప్రజలు
Mark 11:17
నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థన ఆలయం అని దేవుడు తన మాటలలో యెషయా ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు.
οὐ γέγραπται, ὅτι ὁ οἶκός μου, οἶκος προσευχῆς κληθήσεται πᾶσιν τοῖς ἔθνεσιν?
ఆలయమును దుర్వినియోగం చేసినందుకు యూదు నాయకులను యేసు గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “’నా ఆలయమును అన్ని జాతుల ప్రజలు ప్రార్థించే ఆలయంగా పిలవాలని నేను కోరుకుంటున్నాను’ అని దేవుడు చెప్పినట్లు లేఖనాలలో వ్రాయబడి ఉంది.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὑμεῖς δὲ ἐποιήσατε αὐτὸν σπήλαιον λῃστῶν
యేసు ప్రజలను దొంగలతో, ఆలయమును దొంగల గుహతో పోల్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ మీరు నా ఆలయంను దొంగల గుహగా మార్చిన దొంగలుగా ఉన్నారు” (చూడండి: రూపకం)
σπήλαιον λῃστῶν
దొంగలు దాగిన గుహ
Mark 11:18
ἐζήτουν πῶς
వారు ఒక మార్గం కోరుకున్నారు
Mark 11:19
ὅταν ὀψὲ ἐγένετο
సాయంకాలమైనప్పుడు
ἐξεπορεύοντο ἔξω τῆς πόλεως
యేసు మరియు ఆయన శిష్యులు పట్టణం విడచి వెళ్ళారు
Mark 11:20
శిష్యులకు దేవునిపై విశ్వాసం ఉండాలని గుర్తు చేయుటకు యేసు అంజూరపు చెట్టు యొక్క ఉదాహరణను ఉపయోగిస్తాడు.
παραπορευόμενοι
ఆ దారిన నడుస్తున్నాడు
τὴν συκῆν ἐξηραμμένην ἐκ ῥιζῶν
చెట్టు ఎండిపోయిందని స్పష్టం చేయుటకు ఈ ప్రకటనను తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంజూరపు చెట్టు వేరులతో సహా ఎండిపోయియున్నది మరియు చనిపోయినది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐξηραμμένην
ఎండిపోయింది
Mark 11:21
ἀναμνησθεὶς ὁ Πέτρος
పేతురు జ్ఞాపకం చేసుకున్న సంగతిని చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంజూరపు చెట్టుతో యేసు చెప్పిన దానిని పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:22
ἀποκριθεὶς ὁ Ἰησοῦς λέγει αὐτοῖς
యేసు తన శిష్యులకు సమాధానం ఇచ్చాడు
Mark 11:23
ἀμὴν, λέγω ὑμῖν
నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మాట యేసు తరువాత చెప్పిన దానిని నొక్కి చెప్తుంది.
ὃς ἂν εἴπῃ
ఎవరైనా చెబితే
μὴ διακριθῇ ἐν τῇ καρδίᾳ αὐτοῦ, ἀλλὰ πιστεύῃ
ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నిజంగా తన హృదయములో విశ్వసిస్తే” లేక “అతను సందేహించక నమ్మినట్లయితే” (చూడండి: అన్యాపదేశము)
ἔσται αὐτῷ
దేవుడు జరిగేలా చేస్తాడు
Mark 11:24
διὰ τοῦτο λέγω ὑμῖν
కాబట్టి నేను మీకు చెప్తాను (చూడండి: పదాలు మరియు పదబంధాలను కనెక్ట్ చేస్తోంది)
ἔσται ὑμῖν
మీరు అడిగిన దానిని దేవుడు అందిస్తాడు కాబట్టి ఇది జరుగుతుందని అర్థమవుతుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: \n“దేవుడు దానిని మీకు ఇస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:25
ὅταν στήκετε προσευχόμενοι
దేవునిని ప్రార్ధించేటప్పుడు నిలబడటం హెబ్రీ సంస్కృతిలో సాధారణం అని ఇక్కడ తెలియపచడమైంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ప్రార్థన చేసినప్పుడు”
εἴ τι ἔχετε κατά τινος
మీకు ఎవరితోనైనా విరోధముంటే. ఇక్కడ “ఏమైనా” అనే మాట మీకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు లేక మరొకరిపై మీకు ఉన్న కోపమును మీరు ఎవరిపైనైన కలిగియున్న విరోధమును గురించి తెలియచేస్తుంది.
Mark 11:27
మరుసటి రోజు యేసు ఆలయానికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు మరియు పెద్దలకు డబ్బు మార్పిడి చేసేవారిని ఆలయ ప్రాంతం నుండి తరిమికొట్టడం గురించి వారి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు, మరొక ప్రశ్న అడగడం ద్వారా వారు సమాధానం ఇచ్చుటకు ఇష్టపడరు.
ἔρχονται…εἰς
యేసు మరియు ఆయన శిష్యులు వచ్చారు
ἐν τῷ ἱερῷ περιπατοῦντος αὐτοῦ
యేసు దేవాలయంలో నడుస్తూ ఉన్నాడని దీని అర్థం; ఆయన దేవాలయం లోపల నడవడం లేదు.
Mark 11:28
ἔλεγον αὐτῷ
“వారు అనే మాట ప్రధాన యజకులను, శాస్త్రులను మరియు పెద్దలను గురించి తెలియచేస్తుంది.
ἐν ποίᾳ ἐξουσίᾳ ταῦτα ποιεῖς? ἢ, τίς σοι ἔδωκεν τὴν ἐξουσίαν ταύτην, ἵνα ταῦτα ποιῇς?
సాధ్యమయ్యే అర్థాలు: 1) ఈ రెండు ప్రశ్నలకు ఒకే అర్థం ఉంది మరియు యేసు అధికారమును గట్టిగా ప్రశ్నించుటకు కలిపి అడుగుతారు మరియు కాబట్టి రెండింటిని కలపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” 2) అవి రెండు వేరు వేరు ప్రశ్నలు, మొదటిది అధికారం యొక్క స్వభావం గురించి మరియు అతనికి ఎవరు ఇచ్చారు అనే దాని గురించి. (చూడండి: సమాంతరత)
ταῦτα ποιεῖς
“ఈ పనులు” అనే మాట యేసు దేవాలయంలోని వ్యాపారుల బల్లలను తిప్పడం మరియు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు బోధించిన వాటికి వ్యతిరేకంగా మాట్లాడుటను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నిన్న ఇక్కడ చేసిన పనులవంటివి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:29
ἀποκρίθητέ μοι
నాకు సమాధానం చెప్పండి
Mark 11:30
τὸ βάπτισμα τὸ Ἰωάννου
యోహాను ఇచ్చిన బాప్తిస్మము
ἐξ οὐρανοῦ ἦν ἢ ἐξ ἀνθρώπων
ఈ అధికారం పరలోకం నుండి వచ్చిందా లేక మనుష్యుల నుండి వచ్చిందా
ἐξ οὐρανοῦ
ఇక్కడ “పరలోకం” దేవుని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి” (చూడండి: అన్యాపదేశము)
ἐξ ἀνθρώπων
మనుష్యుల నుండి
Mark 11:31
ἐὰν εἴπωμεν, ἐξ οὐρανοῦ
ఇది బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మూలాధారము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వేళ మనం ‘పరలోకం నుండి అని అంటే’” (చూడండి: శబ్దలోపం)
ἐξ οὐρανοῦ
ఇక్కడ “పరలోకం” దేవుని గురించి తెలియచేస్తుంది. మార్కు 11:30 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని నుండి” (చూడండి: అన్యాపదేశము)
οὐκ ἐπιστεύσατε αὐτῷ
అతడు అనే మాట బాప్తిస్మమిచ్చు యోహాను గురించి తెలియచేస్తుంది.
Mark 11:32
ἀλλὰ εἴπωμεν, ἐξ ἀνθρώπων
ఇది బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మూలాధారము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ ఒక వేళ మనం ‘మనుష్యుల నుండి అని అంటే’” (చూడండి: శబ్దలోపం)
ἐξ ἀνθρώπων
మనుష్యుల నుండి
ἀλλὰ εἴπωμεν, ἐξ ἀνθρώπων…ἦν.
ఈ సమాధానం ఇస్తే వారు ప్రజలతో బాధపడతారని మత పెద్దలు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల నుండి అని మనం చెప్తే అది మంచిది కాదు” లేక “కాని అది మనుష్యుల నుండి అని చెప్పుటకు మనం ఇష్టపడం.” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారంమరియు శబ్దలోపం)
ἐφοβοῦντο τὸν ὄχλον
యోహాను ఇచ్చే బాప్తిస్మము మనుష్యులనుండి వచ్చినది అని మతనాయకులు ఎందుకు చెప్పకూడదని రచయిత మార్కు వివరించాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. “ప్రజలకు భయపడడం వలన వారు ఒకరితో నొకరు ఇలా అన్నారు” లేక “యోహాను యొక్క బాప్తిస్మము మనుష్యుల నుండి వచ్చింది అని వారు చెప్పుటకు ఇష్టపడలేదు ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 11:33
οὐκ οἴδαμεν
ఇది బాప్తిస్మమిచ్చు యోహాను గురించి తెలియచేస్తుంది. ఈ అర్థం చేయబడ్డ సమాచారం అందింప చెయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహాను బాప్తిస్మము ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలియదు” (చూడండి: శబ్దలోపం)
Mark 12
మర్కు సువార్త 12వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 12:10-11, 36, లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
ఊహాత్మక పరిస్థితులు
ఊహాత్మక పరిస్థితులు వాస్తవానికి జరుగని పరిస్తితులై యున్నవి. ప్రజలు ఈ పరిస్థితులను వివరిస్తారు కాబట్టి వారు తమ శ్రోతలు మంచి మరియు చెడు లేక సరైనది మరియు తప్పు అని అనుకునే దానిని నేర్చుకుంటారు. (చూడండి: ఊహాత్మక పరిస్థితులు)
Mark 12:1
యేసు ఈ ఉదాహరణను ప్రధాన యాజకులకు, శాస్త్రులకు మరియు పెద్దలకు వ్యతిరేకంగా చెప్పుచున్నాడు. (చూడండి: ఉపమానాలు)
καὶ ἤρξατο αὐτοῖς ἐν παραβολαῖς λαλεῖν
ఇక్కడ “వారు” అనే మాట మునుపటి అధ్యాయంలో యేసు మాట్లాడుతున్న ప్రధాన యాజకులను, శాస్త్రులను మరియు పెద్దలను గురించి తెలియచేస్తుంది.
περιέθηκεν φραγμὸν
అతను ద్రాక్షాతోట చుట్టూ ఒక గోడ కట్టాడు. ఇది వరుస పొదలు, కంచే లేక రాతి గోడ కావచ్చు.
ὤρυξεν ὑπολήνιον
దీని అర్థం అతను రాయి మీద ఒక గోయ్యిని చెక్కాడు ఇది పిండిన ద్రాక్షారసమును సేకరించుటకు ఉపయోగించే గానుగ తొట్టి యొక్క దిగువ భాగం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గానుగ కోసం ఒక గోయ్యిని రాతిగా చెక్కారు” లేక “గానుగ నుండి రసం సేకరించుటకు ఒక తొట్టిని చేసాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐξέδετο αὐτὸν γεωργοῖς
యజమాని ఇప్పటికి ద్రాక్షాతోటను కలిగియున్నాడు, కానీ అతను ద్రాక్షారస రైతులకు దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి అనుమతించాడు. ద్రాక్షలు పండినప్పుడు, కొన్నిటిని యజమానునికి ఇచ్చి మిగిలిన వాటిని వారు ఉంచుకోవాలి.
Mark 12:2
τῷ καιρῷ
ఇది పంట కాలమును గురించి తెలియచేస్తుంది. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాక్ష పంట కోసే కాలం వచ్చినప్పుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:3
καὶ λαβόντες αὐτὸν
కాని ద్రాక్ష పండించే రైతులు ఆ సేవకుని తీసుకున్నారు
κενόν
అంటే వారు అతనికి ఏ ఫలము ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ ద్రాక్ష పండ్లు లేకుండా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:4
ἀπέστειλεν πρὸς αὐτοὺς
ద్రాక్షతోట యజమాని ద్రాక్ష పండించే రైతుల యొద్దకు పంపాడు.
κἀκεῖνον ἐκεφαλίωσαν
దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు అతని తలపై కొట్టారు మరియు వారు అతనిని తీవ్రంగా గాయం చేసారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:5
ἄλλον…πολλοὺς ἄλλους
ఈ వాక్యభాగాలు ఇతర సేవకులను గురించి తెలియచేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇంకొక సేవకుడు ... చాలామ౦ది ఇతర సేవకులు” (చూడండి: శబ్దలోపం)
Mark 12:6
υἱὸν ἀγαπητόν
ఇది యజమానుని కుమారుడు అని సూచించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ప్రియమైన కుమారుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:7
ὁ κληρονόμος
ఈయన యజమానుని వారసుడు, అతని తండ్రి మరణించిన తరువాత ద్రక్షాతోటను వారసత్వంగా పొందుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యజమానుని వారసుదారుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἡ κληρονομία
కౌలుదారులు ద్రాక్షతోటను “వారసత్వం” అనే దాని గురించి తెలియ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ద్రాక్షతోట” (చూడండి: ఉపలక్షణము)
Mark 12:8
λαβόντες
ద్రాక్ష పండించే రైతులు కుమారుని పట్టుకున్నారు
Mark 12:9
τί οὖν ποιήσει ὁ κύριος τοῦ ἀμπελῶνος?
యేసు ఒక ప్రశ్న అడుగుతాడు మరియు తరువాత ప్రజలకు బోధించుటకు సమాధానం ఇస్తాడు. ఈ ప్రశ్నను ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడో నేను మీకు చెప్పెదను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὖν
యేసు ఉదాహరణను చెప్పడం ముగించాడు మరియు ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలను అడుగుతున్నాడు. (చూడండి: పదాలు మరియు పదబంధాలను కనెక్ట్ చేస్తోంది)
ἀπολέσει
చంపు
δώσει τὸν ἀμπελῶνα ἄλλοις
“ఇతరులు” అనే మాట ద్రాక్షతోటను చూసుకునే ఇతర రైతులను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ద్రాక్ష తోటను ఇతరులకు కౌలుకిస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:10
ఈ లేఖనం దేవుని వాక్యంలో చాలా కాలం క్రితం వ్రాయబడింది.
οὐδὲ τὴν Γραφὴν ταύτην ἀνέγνωτε:
యేసు ప్రజలకు ఒక లేఖనం యొక్క వాక్య భాగమును జ్ఞాపకం చేస్తాడు. ఆయన వారిని గద్దించుటకు ఒక అలంకారిక ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఖచ్చితంగా మీరు ఈ లేఖనం ను చదివారు” లేక “మీరు ఈ లేఖనంను జ్ఞాపకం ఉంచుకోవాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐγενήθη εἰς κεφαλὴν γωνίας
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు తలరాయిగా చేసాడు”
Mark 12:11
παρὰ Κυρίου ἐγένετο αὕτη
ప్రభువు ఇది చేసాడు
ἔστιν θαυμαστὴ ἐν ὀφθαλμοῖς ἡμῶν
ఇక్కడ “మన దృష్టిలో” చూడడం అంటే ఇది ప్రజల అభిప్రాయానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము దీనిని చూసాము ఇది అద్భుతమైనదని అనుకుంటున్నాము” లేక “ఇది ఆశ్చర్యకరమైనదని మేము భావిస్తున్నాము” (చూడండి: రూపకం)
Mark 12:12
ἐζήτουν αὐτὸν κρατῆσαι
వారు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు మరియు పెద్దలను గురించి తెలియచేస్తారు. ఈ సమూహామును “యూదు నాయకులు” అని పిలుస్తారు
ἐζήτουν
కావలెను
καὶ ἐφοβήθησαν τὸν ὄχλον
వారు యేసును బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందోనని వారు జంకారు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను బంధిస్తే ప్రజల గుంపు ఏమి చేస్తుందో అని వారు జంకారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πρὸς αὐτοὺς
వారిని నిందించుటకు
Mark 12:13
యేసును వలలో వేసే ప్రయత్నంలో, కొంతమంది పరిసయ్యులు, హేరోదియులు, ఆపై సద్దుకయిలు ప్రశ్నలతో యేసు నొద్దకు వస్తారు.
καὶ ἀποστέλλουσιν
అప్పుడు యూదు నాయకులు పంపారు
τῶν Ἡρῳδιανῶν
ఇది హేరోదు అంతిపాకు సహాయం చేసిన అనధికారిక రాజకీయ పార్టి పేరు.
ἵνα αὐτὸν ἀγρεύσωσιν
ఇక్కడ రచయిత మోసగించుటను “ఆయనను వలలో వేస్తున్నట్లు” అని వర్ణించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను మోసగించుటకు” (చూడండి: రూపకం)
Mark 12:14
ἐλθόντες, λέγουσιν
ఇక్కడ “వారు” అనేది పరిసయ్యులు మరియు హేరోదియుల నుండి పంపబడిన వారి గురించి తెలియచేస్తుంది.
οὐ μέλει σοι περὶ οὐδενός
యేసు ఆందోళన చెందలేదని దీని అర్థం. తిరస్కారం బదలుగా క్రీయను పరివర్తించగలదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ప్రజల అభిప్రాయమును పట్టించుకోరు” లేక “ప్రజల అభిమానమును సంపాదించడంలో మీకు చింతలేదు” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Mark 12:15
ὁ…εἰδὼς αὐτῶν τὴν ὑπόκρισιν
వారు కుయుక్తిగా వ్యవహరిస్తున్నారు. దీనిని మరింత స్పష్టంగా వివరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకొనుటకు వారు నిజంగా ఇష్టపడరని యేసుకు తెలుసు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τί με πειράζετε?
యేసును యూదా నాయకులు మోసగించుటకు ప్రయత్నిస్తున్నందున వారిని గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నేను తప్పు చెప్పాలని తద్వారా మీరు నన్ను నిందించవచ్చు అని ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
δηνάριον
ఈ నాణెం ఒక రోజు వేతనమంత విలువైనది. (చూడండి: బైబిల్ డబ్బు)
Mark 12:16
οἱ δὲ ἤνεγκαν
పరిసయ్యులు హేరోదియులు ఒక దేనారమును తీసుకు వచ్చారు
ἡ εἰκὼν…καὶ ἡ ἐπιγραφή
బొమ్మ మరియు శాసనం
οἱ…εἶπαν αὐτῷ, Καίσαρος.
ఇక్కడ “సీజరు” అతని ఆకారము మరియు శాసనమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “’అవి సీజరు బొమ్మ మరియు శాసనమై యున్నది’ అని అన్నారు” (చూడండి: శబ్దలోపం)
Mark 12:17
τὰ Καίσαρος ἀπόδοτε Καίσαρι
పన్నులు చెల్లించడం ద్వారా తన ప్రజలు ప్రభుత్వమును గౌరవించాలని యేసు బోధిస్తున్నాడు. సీజరును రోమా ప్రభుత్వంగా మార్చడం ద్వారా ఈ భాషీయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రోమా ప్రభుత్వానికి చెందిన వస్తువులు రోమా ప్రభుత్వానికి ఇవ్వండి” (చూడండి: అన్యాపదేశము)
καὶ…τῷ Θεῷ
అర్థం చేయబడ్డ క్రియను అందింపవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు దేవునికివ్వండి” (చూడండి: శబ్దలోపం)
ἐξεθαύμαζον ἐπ’ αὐτῷ
యేసు చెప్పినదానికి వారు ఆశ్చర్యపోయారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఆయనపై మరియు ఆయన చెప్పిన దానిపై ఆశ్చర్య పడ్డారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:18
οἵτινες λέγουσιν ἀνάστασιν μὴ εἶναι
ఈ వాక్య భాగం సద్దూకయ్యుల గురించి వారు ఎవరో అని వివరిస్తుంది. దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మృతులలో నుండి పునరుత్థానం లేదని ఎవరు చెప్పారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:19
Μωϋσῆς ἔγραψεν ἡμῖν, ὅτι ἐάν τινος ἀδελφὸς ἀποθάνῃ
మోషే ధర్మశాస్త్రములో వ్రాసిన వాటిని సద్దూకయ్యులు ఉల్లేఖిస్తున్నారు. మోషే యొక్క ఉల్లేఖన పరోక్ష ఉల్లేఖనగా వ్యక్తపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకవేళ ఒక మనిషి సోదరుడు చనిపోతే మోషే మన కోసం ధర్మ శాస్త్రంలో వ్రాసాడు” (చూడండి: ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
ἔγραψεν ἡμῖν
మాకు యూదులు వ్రాసారు. సద్దూకయ్యులు అనేవారు యూదుల సమూహమైయున్నారు. ఇక్కడ వారు తమను మరియు యూదులందరి గురించి తెలియచేయుటకు “మాకు” అనే మాటను ఉపయోగిస్తారు.
λάβῃ ὁ ἀδελφὸς αὐτοῦ τὴν γυναῖκα
ఆ మనిషి తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకోవాలి
ἐξαναστήσῃ σπέρμα τῷ ἀδελφῷ αὐτοῦ
తన సోదరునికి కుమారుడు కలిగేలా చేయాలి. ఆ మనిషి యొక్క మొదటి కుమారుడు చనిపోయిన తన సోదరుని కుమారునిగా పరిగణించబడతాడు, మరియు కుమారుని వారసులు చనిపోయిన సోదరుడి వారసులుగా పరిగణించబడతారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన సోదరుడికి కుమారుడిగా పరిగణించబడే ఒక కుమారుడిని కలిగి ఉండాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:20
ἑπτὰ ἀδελφοὶ ἦσαν
సద్దూకయ్యులు వాస్తవంగా జరుగని పరిస్థితిని గురించి మాట్లాడతారు. ఎందుకంటే యేసు తాను అనుకున్నది సరైనదా మరియు తప్పు అని వారికి చెప్పాలని వారు కోరుకుంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకవేళ ఏడుగురు సోదరులు ఉంటే” (చూడండి: ఊహాత్మక పరిస్థితులు)
ὁ πρῶτος
మొదటి సోదరుడు
ὁ πρῶτος ἔλαβεν γυναῖκα
మొదట ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అంటే ఆమెను “తీసుకోవడం” గా చెప్పబడుతుంది.
Mark 12:21
ὁ δεύτερος…ὁ τρίτος
ఈ సంఖ్యలు ప్రతి సోదరుని గురించి తెలియచేస్తాయి మరియు అలాగే వ్యక్తపరచబడతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రెండవ సోదరుడు ... మూడవ సోదరుడు” (చూడండి: శబ్దలోపం)
ὁ δεύτερος ἔλαβεν αὐτήν
రెండవావాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అంటే ఆమెను “తీసుకోవడం” గా చెప్పబడుతుంది
ὁ τρίτος ὡσαύτως
“ఆ ప్రకారమే” అంటే ఏమిటో అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మూడవ సోదరుడు తన ఇతర సోదరుల వలే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, మరియు అతను కూడా సంతానం లేకుండానే చనిపోయాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:22
οἱ ἑπτὰ
ఇది అన్నదమ్ములందరి గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏడుగురు అన్నదమ్ములు” (చూడండి: శబ్దలోపం)
οἱ ἑπτὰ οὐκ ἀφῆκαν σπέρμα
వారిలో ప్రతి సోదరుడు ఆ స్త్రీని పెళ్ళి చేసుకున్నారు మరియు ఆమెతో సంతానం కలుగకుండానే చనిపోయారు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చివరికి ఏడుగురు సోదరులు ఒకరి తరువాత ఒకరు పెళ్ళి చేసుకున్నారు, కాని వారిలో ఎవరితోనూ ఆమెకు సంతానం కలుగలేదు మరియు వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:23
ἐν τῇ ἀναστάσει, ὅταν ἀναστῶσιν, τίνος αὐτῶν ἔσται γυνή
ఈ ప్రశ్న అడగడం ద్వారా సద్దూకయ్యులు యేసును పరిక్షిస్తున్నారు. మీ చదవరులు దీనిని సమాచారం కోసం అభ్యర్ధనగా మాత్రమే అర్థం చేసుకోగలిగితే, ఇది ఒక ప్రకటనగా వ్రాయబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారందరూ తిరిగి లేచినప్పుడు, ఆమె పునరుత్థానం లో ఎవరికి భార్యగా ఉంటుందో ఇప్పుడు మాకు చెప్పండి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 12:24
οὐ διὰ τοῦτο πλανᾶσθε…τὴν δύναμιν τοῦ Θεοῦ?
దేవుని ధర్మశాస్త్రమును పొరబడుతున్నందున సద్దూకయ్యులను యేసు గద్దించాడు. ఇది ఒక ప్రకటనగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పొరబడుతున్నారు ఎందుకంటే ... దేవుని శక్తి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ εἰδότες τὰς Γραφὰς
పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడియున్నది వారికి అర్థం కాలేదని దీని అర్థం.
τὴν δύναμιν τοῦ Θεοῦ
దేవుడు ఎంత శక్తిమంతుడు
Mark 12:25
ὅταν γὰρ…ἀναστῶσιν
ఇక్కడ ఉదాహరణ నుండి “వారు” అనే మాట అన్నదమ్ములను మరియు స్త్రీని గురించి తెలియచేస్తుంది.
ἀναστῶσιν
నిద్ర నుండి లేవడం మరియు నిద్ర లేవడం చనిపోయిన తరువాత సజీవంగా మారడమునకు ఒక రూపకఅలంకారమైయున్నది. (చూడండి: రూపకం)
ἐκ νεκρῶν
చనిపోయినవారందరి నుండి. ఈ మాట పాతాళములోని ప్రజలందరి గురించి తెలియచేస్తుంది. వారి నుండి లేవడం అనేది మళ్ళీ సజీవంగా మారడం గురించి తెలియచేస్తుంది.
οὔτε γαμοῦσιν οὔτε γαμίζονται
వారు వివాహం చేసుకోరు మరియు వారికి వివాహమునకు ఇవ్వబడరు
γαμίζονται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు వారికి వివాహమునకు ఎవ్వరూ ఇవ్వరు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τοῖς οὐρανοῖς
ఇది దేవుడు నివసించే స్థలమును గురించి తెలియచేస్తుంది.
Mark 12:26
ὅτι ἐγείρονται
ఇది క్రీయాశీల క్రీయతో వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే లేపబడతారో” లేక “తిరిగి బ్రతుకుటకు ఎవరైతే లేపబడతారో” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῇ βίβλῳ Μωϋσέως
మోషే వ్రాసిన పుస్తకం
τοῦ βάτου
ఇది మోషే పుస్తకములోని భాగమును గురించి తెలియచేస్తుంది, దేవుడు మోషేతో ఒక పొద నుండి మాట్లాడుతున్నప్పుడు ఆ పొద మండిపోతుంది కాని కాలిపోలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మండుతున్న పొద గురించిన వాక్యభాగం” లేక “మండుతున్న పొద గురించిన మాటలు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοῦ βάτου
ఇది చెట్టు కంటే చిన్నదిగా చెక్క మొక్కను గురించి తెలియచేస్తుంది.
πῶς εἶπεν αὐτῷ ὁ Θεὸς
దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు
ἐγὼ ὁ Θεὸς Ἀβραὰμ…Ἰσαὰκ…Ἰακώβ
అంటే అబ్రహాము, ఇస్సాకు మరియు యాకొబు దేవునిని ఆరాధిస్తారు. ఈ వ్యక్తులు శారీరికంగా మరణించారు కాని వారు ఇప్పటికీ అధ్యాత్మికంగా జీవించి ఉన్నారు మరియు ఇప్పటికీ దేవునిని ఆరాధిస్తున్నారు.
Mark 12:27
οὐκ…Θεὸς νεκρῶν, ἀλλὰ ζώντων
ఇక్కడ “చనిపోయినవారు” అంటే చనిపోయిన వ్యక్తులను గురించి తెలియచేస్తుంది. మరియు జీవించేవారు” అన్నది సజీవంగా ఉన్నవారి గురించి తెలియచేస్తుంది. ఆలాగే “దేవుడు” అనే మాటను రెండవ వాక్యభాగంలో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు కాని బ్రతికి ఉన్న వారి దేవుడు” (చూడండి: నామకార్థ విశేషణాలు మరియు శబ్దలోపం)
ζώντων
శారీరికంగా మరియు అధ్యాత్మికంగా జీవించే వ్యక్తులు ఇందులో ఉన్నారు.
πολὺ πλανᾶσθε
వారు పొరబడుతున్న వాటి గురించి చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయినవారు మళ్ళీ తిరిగి లేవరని మీరు చెప్పినప్పుడు మీరు చాలా పొరబడుతున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πολὺ πλανᾶσθε
పూర్తిగా పొరబడుతున్నారు లేక “చాలా తప్పు”
Mark 12:28
ἐπηρώτησεν αὐτόν
ధర్మశాస్త్ర పండితుడు యేసును అడిగాడు
Mark 12:29
πρώτη ἐστίν
అతి ముఖ్యమైనది అతి ముఖ్యమైన అజ్ఞను గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతి ముఖ్యమైన ఆజ్ఞ” చూడండి: నామకార్థ విశేషణాలు
ἄκουε, Ἰσραήλ, Κύριος ὁ Θεὸς ἡμῶν Κύριος εἷς ἐστιν
ఇశ్రాయేలు ప్రజలారా, వినండి! ప్రభువైన మన దేవుడు ఆ ప్రభువు ఒక్కడే
Mark 12:30
ἐξ ὅλης τῆς καρδίας σου, καὶ ἐξ ὅλης τῆς ψυχῆς σου, καὶ ἐξ ὅλης τῆς διανοίας σου, καὶ ἐξ ὅλης τῆς ἰσχύος σου
ఇక్కడ “హృదయం” మరియు “ఆత్మ” అనేవి ఒక వ్యక్తి యొక్క అంతర్గత జీవముకు లేక మనస్సుకు ఒక మారుపేరులైయున్నవి. ఈ నాలుగు వాక్యభాగాలు కలిసి “సంపూర్ణముగా” లేక “మనఃపూర్తిగా” అని అర్థం.” (చూడండి: అన్యాపదేశము)
Mark 12:31
ἀγαπήσεις τὸν πλησίον σου ὡς σεαυτόν
ప్రజలు తమను తాము ప్రేమిస్తున్నట్లుగానే ఒకరినొకరు ఎలా ప్రేమిస్తారో అదే ప్రేమతో పోల్చుటకు యేసు ఈ ఉపమాలంకారమును ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువానిని అంతగా ప్రేమించాలి” (చూడండి: ఉపమ)
τούτων
ఇక్కడ “ఇవి” అనే మాట యేసు ప్రజలకు ఇప్పుడే చెప్పిన రెండు ఆజ్ఞల గురించి తెలియచేస్తుంది.
Mark 12:32
καλῶς, Διδάσκαλε
మంచి సమాధానం, బోధకుడా లేక “బాగా చెప్పారు, బోధకుడా”
εἷς ἐστιν
దీని అర్థం దేవుడొక్కడే అని అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడొక్కడే” (చూడండి: జాతీయం (నుడికారం))
οὐκ ἔστιν ἄλλος
“దేవుడు” అనే మాట మునుపటి వాక్యభాగం నుండి అర్థమవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరే దేవుడు లేడని” (చూడండి: శబ్దలోపం)
Mark 12:33
ἐξ ὅλης τῆς καρδίας…ἐξ ὅλης τῆς συνέσεως…ἐξ ὅλης τῆς ἰσχύος
ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, భావనలు లేక అంతర్గత జీవముకు ఒక మారుపేరైయున్నది. ఈ మూడు వాక్యభాగాలు కలిసి “సంపూర్ణముగా” లేక “మనఃపూర్తిగా” అని అర్థం.” (చూడండి: అన్యాపదేశము)
τὸ ἀγαπᾶν τὸν πλησίον ὡς ἑαυτὸν
ఈ ఉపమాలంకారము ప్రజలు తమను ప్రేమిస్తున్న అదే విధమైన ప్రేమతో ఒకరినొకరు ఎలా ప్రేమించాలో పోలుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: \n“నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువానిని అంతగా ప్రేమించడం” (చూడండి: ఉపమ)
περισσότερόν ἐστιν
ఈ భాషీయము అనగా ఏదో ఒకదానికంటే చాలా ముఖ్యమైనది అని అర్థం. ఈ సందర్భములో ఈ రెండు ఆజ్ఞలు హోమాల కన్నా, బలుల కన్నా దేవునికి మరింత ఆనందంగా ఉన్నాయి. ఇది స్పష్టంగా వ్రాయబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్నిటికన్న చాల ముఖ్యమైనది” లేక “దేవునికి చాలా ఆనందంగా ఉంచేదాని కన్నా” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 12:34
οὐ μακρὰν εἶ ἀπὸ τῆς Βασιλείας τοῦ Θεοῦ
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ఇక్కడ దేవుని రాజ్యానికి శారీరికంగా దగ్గరగా ఉన్న వ్యక్తిగా రాజుగా దేవునికి సమర్పించుటకు సిద్ధంగా ఉన్న వ్యక్తి గురించి సహజమైన స్థలం ఉన్నట్లుగా యేసు మాట్లాడతాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు రాజుగా దేవునికి సమర్పించుటకు దగ్గరగా ఉన్నారు” (చూడండి: ద్వంద్వ నకారాలు మరియు రూపకం)
οὐδεὶς…ἐτόλμα
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరూ భయపడ్డారు” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Mark 12:35
ἀποκριθεὶς ὁ Ἰησοῦς ἔλεγεν διδάσκων ἐν τῷ ἱερῷ
కొంత సమయం గడచిపోయింది మరియు ఇప్పుడు యేసు ఆలయంలో ఉన్నాడు. ఇది మునుపటి సంభాషణలోని భాగం కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తరువాత, యేసు దేవాలయ ప్రాంతంలో, బోధించేటప్పుడు, అతను ప్రజలకు చెప్పాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πῶς λέγουσιν οἱ γραμματεῖς ὅτι ὁ Χριστὸς, υἱὸς Δαυείδ ἐστιν?
తానూ ఉల్లేఖించబోయే కీర్తన గురించి ప్రజలను లోతుగా ఆలోచించుటకు యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్పుచున్నారో పరిశీలించండి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
υἱὸς Δαυείδ
దావీదు వంశస్థుడు
Mark 12:36
αὐτὸς Δαυεὶδ
“స్వయంగా” అనే మాట దావీదు గురించి తెలియచేస్తుంది. మరియు అతనికి మరియు అతను చెప్పిన దానిని నొక్కి చెప్పుటకు దీనిని ఉపయోగిస్తారు” (చూడండి: రిఫ్లెక్సివ్ సర్వనామాలు *)
ἐν τῷ Πνεύματι τῷ ἁγίῳ
ఆయన పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొందాడని దీని అర్థం. అంటే, పరిశుద్ధాత్మచే దావీదు చెప్పినదానికి ఆజ్ఞాపించబడ్డాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొందాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
εἶπεν…εἶπεν ὁ Κύριος τῷ Κυρίῳ μου
ఇక్కడ దావీదు దేవునిని “ప్రభువు” అని పిలుస్తాడు మరియు క్రీస్తును “నా ప్రభువు” అని పిలుస్తాడు. దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నా ప్రభువుతో అన్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κάθου ἐκ δεξιῶν μου
యేసు ఒక కీర్తనను ఉల్లేఖిస్తున్నాడు. ఇక్కడ దేవుడు క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. “దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవం మరియు అధికారమును పొందే సంకేతిక చర్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా పక్కన గౌరవ స్థానంలో కూర్చో” అని వ్రాయబడింది (చూడండి: సంకేతాత్మకమైన చర్య)
ἕως ἂν θῶ τοὺς ἐχθρούς σου ὑποκάτω τῶν ποδῶν σου
ఈ ఉల్లేఖనలో, శత్రువులను ఓడించడమును దేవుడు ఒక పాదపీఠముగా మార్చాడు అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీ \nశత్రువులను పూర్తిగా ఓడించేవరకు” (చూడండి: రూపకం)
Mark 12:37
λέγει αὐτὸν, Κύριον
ఇక్కడ “ఆయన” అనే మాట యేసును గురించి తెలియచేస్తుంది.
καὶ πόθεν υἱός αὐτοῦ ἐστιν?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి యేసు దావీదు వంశీయుడు ఎలా అవుతాడో పరిశీలించండి” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 12:38
ἀσπασμοὺς ἐν ταῖς ἀγοραῖς
“నమస్కరించు అనే నామవాచకమును “నమస్కరించు” అనే క్రియతో వ్యక్తపరచవచ్చు. ఈ నమస్కార వచనాలు ప్రజలు శాస్త్రులను గౌరవించారని చూపించాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంత వీధుల్లో గౌరవముతో నమస్కరించాలి” లేక “ప్రజలు వారిని సంత వీధుల్లో గౌరవముతో నమస్కారము చేయాలి” (చూడండి: భావనామాలు మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:40
οἱ κατεσθίοντες τὰς οἰκίας τῶν χηρῶν
ఇక్కడ యేసు శాస్త్రులను విధవరాళ్ళను మోసం చేయడం మరియు వారి ఇళ్ళను దోచుకొనడం వారి ఇళ్ళను “పాడుచేయడం” గా వర్ణించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విధవరాళ్ళ నుండి వారి ఇళ్ళను దోచుకొనుటకు వారిని కూడా మోసం చేస్తారు” (చూడండి: రూపకం)
τὰς οἰκίας τῶν χηρῶν
“విధవరాళ్ళు” మరియ “ఇళ్ళు” అనే మాటలు నిస్సహాయంగా ఉన్నవారిని మరియు ఒక వ్యక్తి యొక్క అన్ని ముఖ్యమైన సంపాదనకు ఒక ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిస్సహాయ ప్రజలనుండి ప్రతీది” (చూడండి: ఉపలక్షణము)
οὗτοι λήμψονται περισσότερον κρίμα
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా శిక్షిస్తాడు” లేక “దేవుడు వారిని తీవ్రంగా శిక్షిస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
λήμψονται περισσότερον κρίμα
“తీవ్రంగా” అనే మాట పోలికను గురించి తెలియచేస్తుంది. ఇక్కడ శిక్ష అనుభవించిన ఇతర వ్యక్తులతో పోలిక ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తుల కంటే తీవ్రంగా శిక్షింపబడతారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 12:41
దేవాలయ ప్రాంతంలో, యేసు విధవరాలి కానుక యొక్క విలువ గురించి వ్యాఖ్యానించాడు.
τοῦ γαζοφυλακίου
ప్రతి ఒక్కరూ ఉపయోగించగల ఈ పెట్టె దేవాలయ కానుకలను కలిగి ఉంది.
Mark 12:42
λεπτὰ δύο
రెండు చిన్న రాగి నాణేలు. ఇవి తక్కువ విలువగల నాణేలు. (చూడండి: బైబిల్ డబ్బు)
ἐστιν κοδράντης
చాలా తక్కువ విలువ. ఒక పైసా విలువ చాలా తక్కువ. మీ భాషలో అతి చిన్న నాణెం పేరుతో “కాసు”ను అనువదించండి.
Mark 12:43
43వ వచనంలో ధనవంతుల కంటే విధవరాలు కానుకగా ఎక్కువ డబ్బులు వేసిందని యేసు చెప్పాడు మరియు 44వ వచనలో ఆయన అలా చెప్పడానికి తన కారణమును చెపుతాడు. ఈ సమాచార క్రమమును మార్చవచ్చు తద్వారా యేసు మొదట తన కారణమును చెపుతాడు మరియు యు.ఎస్.టి(UST) లో ఉన్నదానివలే విధవరాలు ఎక్కువగా వేసిందని చెప్పాడు. (చూడండి: వచన వారధులు)
προσκαλεσάμενος
యేసు పిలిచాడు
ἀμὴν, λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
πάντων…τῶν βαλλόντων εἰς
డబ్బు వేసిన ఇతర వ్యక్తులందరూ
Mark 12:44
τοῦ περισσεύοντος
చాలా సంపద, చాలా విలువైన వస్తువులు
τῆς ὑστερήσεως αὐτῆς
లేకపోవడం” లేక “ఆమె కలిగి ఉన్న చిన్నది”
τὸν βίον αὐτῆς
జీవించుటకు అని వ్రాయబడి ఉంది.
Mark 13
మర్కు సువార్త 13వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 13:24-25 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
క్రీస్తు తిరిగి రావడం
యేసు తిరిగి రాక ముందే జరగబోయే విషయాల గురించి చాలా చెప్పాడు (మార్కు 13:6-37). ఆయన తన శిష్యులతో చెడు విషయాలు జరుగునని మరియు ఆయన తిరిగి రాక ముందే వారికి చెడు విషయాలు జరుగుతాయని చెప్పాడు కాని ఆయన ఏ సమయములోనైనను తిరిగి వస్తాడు కాబట్టి వారు సిద్దంగా ఉండాలి.
Mark 13:1
వారు దేవాలయ ప్రాంతమును విడచిపెట్టినప్పుడు హేరోదు నిర్మించిన గొప్ప అద్భుతమైన దేవాలయమునకు భవిష్యత్తులో జరగబోయే దానిని యేసు శిష్యులకు చెపుతాడు.
ποταποὶ λίθοι καὶ ποταπαὶ οἰκοδομαί
“రాళ్ళు” అనేవి భవనమును నిర్మించిన రాళ్ళను గురించి తెలియచేస్తుంది.ప్రత్యామ్నాయ తర్జుమా: “అద్భుతమైన భవానాలు మరియు అవి సిద్ధపరచిన అద్భుతమైన రాళ్ళు “ (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:2
βλέπεις ταύτας τὰς μεγάλας οἰκοδομάς? οὐ μὴ…λίθος
ఈ ప్రశ్న కట్టడం యొక్క దృష్టిని ఆకర్షించుటకు ఉపయోగించబడుతుంది. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ గొప్ప కట్టడమును చూడండి! ఒక రాయి కూడా మిగలదు” లేక “మీరు ఇప్పుడు ఈ గొప్ప కట్టడలను చూస్తున్నారు కానీ ఒక రాయి కూడా మిగలదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐ μὴ ἀφεθῇ ὧδε λίθος ἐπὶ λίθον, ὃς οὐ μὴ καταλυθῇ
శత్రు సైనికులు రాళ్ళను కూల్చి వేస్తారని సూచించబడింది. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శత్రు సైనికులు వచ్చి ఈ కట్టడలను నాశనం చేస్తారు కాబట్టి రాయి మీద రాయి ఒక్కటికూడా నిలువదు” (చూడండి” ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారంమరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 13:3
దేవాలయ విద్వంసం మరియు ఏమి జరగబోతుందో అనే శిష్యుల ప్రశ్నలకు సమాధానంగా రాబోయే దినాలలో జరగబోయే దాని గురించి యేసు వారికి చెపుతాడు.
καὶ καθημένου αὐτοῦ εἰς τὸ Ὄρος τῶν Ἐλαιῶν κατέναντι τοῦ ἱεροῦ…Πέτρος
యేసు మరియు ఆయన శిష్యులు ఒలీవ కొండకు వెళ్ళారని స్పష్టంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయమునకు ఎదురుగా ఉన్న ఒలీవ కొండకు దగ్గరకు వచ్చిన తరువాత యేసు కూర్చున్నాడు. అప్పుడు పేతురు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κατ’ ἰδίαν
వారు ఏకాంతముగా ఉన్నప్పుడు
Mark 13:4
ταῦτα ἔσται…μέλλῃ…συντελεῖσθαι
దేవాలయ రాళ్ళకు ఏమి జరుగుతుందని యేసు చెప్పినదానిని గురించి ఇది తెలియచేస్తుంది. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులు దేవాలయ కట్టడలకు జరుగును ... దేవాలయ కట్టడలకు జరుగబోతున్నాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὅταν…ταῦτα…πάντα
అన్ని సంగతులు
Mark 13:5
λέγειν αὐτοῖς
ఆయన శిష్యులకు
ὑμᾶς πλανήσῃ
ఇక్కడ “మిమ్మును తప్పు దోవ పట్టిస్తుంది” అనేది నిజం కాని దానిని ఒకరిని ఒప్పించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును మోసం చేస్తారు” (చూడండి: రూపకం)
Mark 13:6
πολλοὺς πλανήσουσιν
ఇక్కడ “తప్పు దోవ పట్టించడం” అనేది నిజం కాని దానిని ఒకరిని ఒప్పించుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చాలా మందిని మోసం చేస్తారు” (చూడండి: రూపకం)
ἐπὶ τῷ ὀνόματί μου
సాధ్యమయ్యే అర్థాలు 1) “నా అధికారమును తనదని వాదిస్తారు” లేక 2) “దేవుడు వారిని పంపాడని చెప్పుకుంటారు” (చూడండి అన్యాపదేశము)
ἐγώ εἰμι
నేనే క్రీస్తును
Mark 13:7
ἀκούσητε πολέμους καὶ ἀκοὰς πολέμων
యుద్దాలు మరియు యుద్దాల గురించిన వార్తలు వింటారు. సాధ్యమయ్యే అర్థాలు 1) “దగ్గరగా ఉన్న యుద్దాల శబ్దాలు మరియు యుద్దాల వార్తలను వింటారు” లేక 2) “ప్రారంభమైన యుద్ధాల గురించి మరియు ప్రారంభించబోయే యుద్ధముల గురించి వార్తలు వింటారు”
ἀλλ’ οὔπω τὸ τέλος
కాని అది అంతం కాదు లేక “కాని అంతము వెంటనే జరుగదు” లేక “కాని అంతము తరువాత ఉంటుంది”
τὸ τέλος
ఇది బహుశా ప్రపంచ అంతమును గురించి తెలియచేస్తుంది.(చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:8
ἐγερθήσεται…ἐπ’
ఈ భాషీయము యొక్క అర్థం ఒకరిపై మరియొకరు పోరాడటం అయియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యతిరేకంగా పోరాడతారు” (చూడండి: జాతీయం (నుడికారం))
βασιλεία ἐπὶ βασιλείαν
“లేచును” అనే మాటలు మునుపటి వాక్యభాగం నుండి అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజ్యం మీదికి రాజ్యం లేచును” లేక “ఒక రాజ్య ప్రజలు మరొక రాజ్య ప్రజలకు విరుద్ధంగా పోరాడతారు” (చూడండి: శబ్దలోపం)
ἀρχὴ ὠδίνων ταῦτα
యేసు ఈ విపత్తులను ప్రసవించే ముందు కలిగే నొప్పులు లాంటివి అని మాట్లాడుతుంటాడు ఎందుకంటే వాటి తరువాత మరింత తీవ్రమైన విషయాలు జరుగుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులు స్త్రీ ఒక బిడ్డను ప్రసవించబోయే ముందు వచ్చే నొప్పులవలె ఉంటాయి” (చూడండి: రూపకం)
Mark 13:9
βλέπετε δὲ ὑμεῖς ἑαυτούς
ప్రజలు మీకు చేయబోయే దాని గురించి సిద్ధంగా ఉండండి
παραδώσουσιν ὑμᾶς εἰς συνέδρια
మిమ్మును తీసుకొని చట్ట సభలకు అప్పగిస్తారు
δαρήσεσθε
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మిమ్మును కొడతారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐπὶ…σταθήσεσθε
దీని అర్థం విశారణలో ఉంచి తీర్పు ఇవ్వాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ముందు విచారణకు గురవుతారు” లేక “విచారణకు తీసుకురాబడతారు మరియు తీర్పు ఇవ్వబాడతారు” (చూడండి: జాతీయం (నుడికారం))
ἕνεκεν ἐμοῦ
నా కారణంగా లేక “నన్ను బట్టి”
εἰς μαρτύριον αὐτοῖς
దీని అర్థం వారు యేసు గురించి సాక్ష్యమిస్తారు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా గురించి వారికి సాక్ష్యమివ్వండి” లేక “మరియు మీరు నా గురించి వారికి చెపుతారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:10
καὶ εἰς πάντα τὰ ἔθνη πρῶτον δεῖ κηρυχθῆναι τὸ εὐαγγέλιον
యేసు ఇంకా అంతం రాకముందే జరుగావలసిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని అంతానికి ముందు సువార్త అన్ని జాతులకూ ప్రకటింపబడాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:11
παραδιδόντες
ఇక్కడ దీని అర్థం ప్రజలను అధికారుల నియంత్రణలో ఉంచడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును అధికారులకు అప్పగిస్తారు” (చూడండి: జాతీయం (నుడికారం))
ἀλλὰ τὸ Πνεῦμα τὸ Ἅγιον
“మాట్లాడతారు” అనే మాటలు మునుపటి వాక్యభాగము నుండి అర్థమవుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు” (చూడండి: శబ్దలోపం)
Mark 13:12
παραδώσει ἀδελφὸς ἀδελφὸν εἰς θάνατον
ఒక సోదరుడు మరొక సోదరుడిని చంపే వ్యక్తుల నియంత్రణలో వేస్తాడు. లేక “సోదరులు తమ మరొక సోదరులను చంపే వ్యక్తుల నియంత్రణలో వేస్తారు.” ఇది చాల మంది వ్యక్తులకు చాలా సార్లు జరుగుతుంది. యేసు కేవలం ఒక వ్యక్తి లేక అతని సోదరుని గురించి మాట్లాడడం లేదు.
ἀδελφὸς ἀδελφὸν
ఇది సోదరులను మరియు సోదరీలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ... వారి తోబుట్టువులు” (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
πατὴρ τέκνον
మరణమునకు అప్పగిస్తుంది” అనే మాటలు మునుపటి వాక్యభాగంలో నుండి అర్థమవుతాయి. కొంతమంది తండ్రులు తమ పిల్లలకు ద్రోహం చేస్తారు, ఈ ద్రోహం వారి పిల్లలను చంపుటకు కారణమవుతుందని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రులు తమ కుమారులను మరణమునకు అప్పగిస్తారు” లేక “తండ్రులు తమ పిల్లలకు ద్రోహం చేసి చంపబడుటకు వారిని అప్పగిస్తారు” (చూడండి: శబ్దలోపం మరియు జాతీయం (నుడికారం))
ἐπαναστήσονται τέκνα ἐπὶ γονεῖς
దీని అర్థం పిల్లలు తలిదండ్రులను వ్యతిరేకిస్తారు మరియు వారికి ద్రోహం చేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లలు తలిదండ్రులను వ్యతిరేకిస్తారు” (చూడండి: జాతీయం (నుడికారం))
θανατώσουσιν αὐτούς
అంటే తలిదండ్రులకు మరణ శిక్ష విధించాలని అధికారులు శిక్షిస్తారు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తలిదండ్రులు మరణించుటకు అధికారులు శిక్షించుటకు కారణం” లేక “అధికారులు తలిదండ్రులను చంపుతారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 13:13
ἔσεσθε μισούμενοι ὑπὸ πάντων
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
διὰ τὸ ὄνομά μου
యేసు తన గురించి తాను తెలియచేయుటకు “నా పేరు” అనే మారుపేరును ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా వలన” లేక “ఎందుకంటే మీరు నన్న నమ్ముతారు” (చూడండి: అన్యాపదేశము)
ὁ…ὑπομείνας εἰς τέλος, οὗτος σωθήσεται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే చివరివరకు సహిస్తారో, దేవుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు” లేక “చివరివరకు భరించే వారిని దేవుడు రక్షిస్తారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ…ὑπομείνας εἰς τέλος
ఇక్కడ “సహించడం” అంటే బాధపడతున్నప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండటము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైతే బాధపడతారో మరియు చివరి వరకు నమ్మకంగా ఉంటారో” అని వ్రాయబడి ఉంది (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
εἰς τέλος
సాధ్యమయ్యే అర్థాలు 1) “అతని జీవితాంతము వరకు” లేక 2) “ఆ కష్ట కాలం చివరివరకు”
Mark 13:14
τὸ βδέλυγμα τῆς ἐρημώσεως
ఈ వాక్యభాగం దానియేలు గ్రంథము నుండి తీసుకోవడం జరిగింది. అతని శ్రోతలు ఈ వాక్యము మరియు హేయమైన వస్తువు గుడిలోనికి ప్రవేశించడం మరియు అపవిత్రత గురించి ప్రవచనం తెలిసి ఉండేది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వస్తువులను అపవిత్రం చేసే సిగ్గుతో కూడిన వస్తువు” (చూడండి: రూపకం)
ἑστηκότα ὅπου οὐ δεῖ
ఇది దేవాలయమును గురించి తెలియచేస్తుందని యేసుని ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నిలువబడ కూడని ఆలయంలో నిలువబడింది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ ἀναγινώσκων νοείτω
ఇది యేసు మాట్లాడుతున్నట్లు కాదు. చదవరుల దృష్టిని ఆకర్షించుటకు మత్తయి దీనిని కలిపాడు, తద్వారా వారు ఈ హెచ్చరికను వింటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరికకు శ్రద్ధ చూపవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:15
ἐπὶ τοῦ δώματος
యేసు నివసించిన మిద్దె సమతలమైయున్నది మరియు ప్రజలు వాటిపై నిలువబడగలరు.
Mark 13:16
μὴ ἐπιστρεψάτω εἰς τὰ ὀπίσω
ఇది అతను ఇంటికి తిరిగి రావడం గురించి తెలియచేస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ఇంటికి తిరిగి రాకూడదు” (చూడండి: శబ్దలోపం)
ἆραι τὸ ἱμάτιον αὐτοῦ
తన పై వస్త్రమును తెచ్చుకొనుటకు
Mark 13:17
ταῖς ἐν γαστρὶ ἐχούσαις
ఎవరైనా గర్భవతి అని చెప్పుటకు ఇది మర్యాదపూర్వక మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గర్భవతి”
Mark 13:18
προσεύχεσθε…ἵνα
ఈ సమయాలలో ప్రార్ధించండి లేక “ఈ విషయాల గురించి ప్రార్ధించండి”
χειμῶνος
చలికాలం లేక “చల్లని వర్షాకాలం.” ఇది చలిగా మరియు అసంతోషకరంగా ప్రయాణించడం కష్టంగా ఉన్న సంవత్సరమును గురించి తేలియచేస్తుంది
Mark 13:19
οἵα οὐ γέγονεν τοιαύτη
ఇంతకు ముందు కంటే గొప్పది. ఆ కష్టము ఎంత గొప్ప భయంకరమైనదో ఇది వివరిస్తుంది. ఇంతటి భయంకరమైన కష్టం ఎప్పుడు రాలేదు.
οὐ μὴ γένηται
మరియు మరెన్నడూ లేనంత గొప్పది లేక “ఆ కష్టాల తరువాత మరల ఇలాంటి కష్టం ఉండదు”
Mark 13:20
ἐκολόβωσεν…τὰς ἡμέρας
దేవుడు సమయమును తగ్గించాడు. ఏ “రోజులు” అని తెలియచేసి చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాధ యొక్క రోజులను తగ్గించాడు” లేక “బాధ యొక్క సమయమూ తగ్గించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐκ ἂν ἐσώθη πᾶσα σάρξ
“మాంసం” అనే మాట మనుష్యులను గురించి తెలియచేస్తుంది, మరియు “రక్షింపబడినది” శారీరిక రక్షణను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవ్వరూ రక్షింపబడరు” లేక “అందరూ చనిపోతారు” (చూడండి: ఉపలక్షణము)
διὰ τοὺς ἐκλεκτοὺς
ఎన్నుకున్నవారికి సహాయం చేయుటకు
τοὺς ἐκλεκτοὺς, οὓς ἐξελέξατο
ఆయన ఎన్నుకున్నవారు” అనే మాటకు “ఎన్నుకోబడినవారు అని అర్థం. ప్రతి ఒక్కరిగా, దేవుడు ఈ ప్రజలను ఎన్నుకున్నాడని వారు నొక్కి చెప్పారు. (చూడండి: జంటపదం)
Mark 13:21
21వ వచనంలో యేసు ఆజ్ఞ ఇస్తాడు, 22వ వచనంలో ఆ ఆజ్ఞకు కారణం చెపుతాడు. దీనిని మొదటి కారణం ద్వారా మళ్లీ ఆదేశించవచ్చు, మరియు రెండవ ఆజ్ఞ యు.ఎస్.టి(UST)లో ఉన్నట్లు ఉంటుంది. (చూడండి: వచన వారధులు)
Mark 13:22
ψευδόχριστοι
తాము క్రీస్తు అని చెప్పుకునే ప్రజలు
πρὸς τὸ ἀποπλανᾶν
మోసగించుటకు లేక “మోసగించాలనే ఆశతో” లేక “మోసగించుటకు ప్రయత్నిస్తూ”
πρὸς τὸ ἀποπλανᾶν εἰ δυνατὸν τοὺς ἐκλεκτούς
“ఎన్నుకోబడినవారు కూడా” అనే మాట కపట క్రీస్తులు మరియు కపట ప్రవక్తలు కొంతమందిని మోసం చేయాలని ఆశిస్తారని తెలియచేస్తుంది, కాని వారు ఎన్నుకోబడినవారిని మోసం చేయగలరో లేదో వారికి తెలియదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాధ్యమైతే మోసం చేయుటకు మరియు ఎన్నుకోబడినవారిని కూడా మోసం చేస్తారు” (చూడండి: శబ్దలోపం)
τοὺς ἐκλεκτούς
దేవుడు ఎన్నుకున్న ప్రజలు
Mark 13:23
ὑμεῖς δὲ βλέπετε
జాగ్రత్తగా ఉండండి లేక “ఆప్రమత్తంగా ఉండండి”
προείρηκα ὑμῖν πάντα
వారిని హెచ్చరించుటకు యేసు ఈ విషయాలను చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును హెచ్చరించుటకు ఈ విషయాలను మీకు ముందే చెప్పాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:24
ὁ ἥλιος σκοτισθήσεται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సూర్యుడు చీకటై పోతాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡ σελήνη οὐ δώσει τὸ φέγγος αὐτῆς
ఇక్కడ చంద్రుడు సజీవంగా ఉన్నట్లు మరియు మరొకరికి ఏదైనా ఇవ్వగలిగినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చంద్రుడు ప్రకాశించడు” లేక “చంద్రుడు చీకటిగా ఉంటాడు” (చూడండి: మానవీకరణ)
Mark 13:25
οἱ ἀστέρες ἔσονται ἐκ τοῦ οὐρανοῦ πίπτοντες
దీని అర్థం అవి భూమిపై పడతాయని కాదు కాని అవి ఇప్పుడు ఉన్న చొటనుండి పడిపోతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నక్షత్రాలు ఆకాశం నుండి వాటి స్థానాల నుండి పడిపోతాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
αἱ δυνάμεις αἱ ἐν τοῖς οὐρανοῖς σαλευθήσονται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశంలో ఉన్న శక్తులు కదలిపోతాయి” లేక “దేవుడు ఆకాశంలో ఉన్న శక్తులను కదలిస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
αἱ δυνάμεις αἱ ἐν τοῖς οὐρανοῖς
ఆకాశంలోని శక్తివంతమైన విషయాలు. సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది సూర్యుడు, చంద్రుడు, మరియు నక్షత్రాల గురించి తెలియచేస్తుంది లేక 2) ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవులను గురించి తెలియచేస్తుంది.
ἐν τοῖς οὐρανοῖς
ఆకాశంలో
Mark 13:26
τότε ὄψονται
అప్పుడు మనుష్యులు చూస్తారు
μετὰ δυνάμεως πολλῆς καὶ δόξης
గొప్ప శక్తితో మరియు ప్రభావంతో
Mark 13:27
ἐπισυνάξει
“అయన” అనే మాట దేవుని గురించి తెలియచేస్తుంది, మరియు ఆయన దేవదూతలకు ఒక మారుపేరైయున్నది, ఎందుకంటే వారు ఎన్నుకున్న వారిని పోగుచేస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పోగుచేస్తారు” లేక “ఆయన దేవదూతలు పోగుచేస్తారు” (చూడండి: అన్యాపదేశము)
τῶν τεσσάρων ἀνέμων
భూమియంతటిని “నాలుగు వాయువులు అని పిలుస్తారు ఇది నాలుగు దిశల గురించి తెలియచేస్తుంది: ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర” లేక “భూమి యొక్క నలువైపుల” (చూడండి: రూపకం)
ἀπ’ ἄκρου γῆς ἕως ἄκρου οὐρανοῦ
ఎన్నుకున్నవారు భూమియంతటి నుండి పోగుచేయబడతారని నొక్కి చెప్పుటకు ఈ రెండు కోణాలు ఇవ్వబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “భూమిపైని ప్రతి స్థలం నుండి” (చూడండి: వివరణార్థక నానార్థాలు)
Mark 13:28
యేసు ఇక్కడ రెండు చిన్న ఉపమానాలను ఇస్తాడు, ఆయన వివరిస్తున్న విషయాలు జరిగినప్పుడు మనుష్యులు తెలుసుకోవాలని గుర్తుచేస్తాడు. (చూడండి: ఉపమానాలు)
ὁ κλάδος αὐτῆς ἁπαλὸς γένηται, καὶ ἐκφύῃ τὰ φύλλα
“కొమ్మలు” అనే మాట అంజూరపు చెట్టు కొమ్మలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాని కొమ్మలు మృదువుగా మారి వాటి ఆకులు బయట పెడతాయి”
ἁπαλὸς
ఆకుపచ్చ మరియు మృదువైన
ἐκφύῃ τὰ φύλλα
ఇక్కడ అంజూరపు చెట్టు సజీవంగా ఉన్నట్లు మరయు దాని ఆకులు పెరుగుటకు ఇష్టపూర్వకంగా కారణమవుతుందని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దాని ఆకులు చిగురించడం ప్రారంభిస్తాయి” (చూడండి: మానవీకరణ)
τὸ θέρος
సంవత్సరం వెచ్చని భాగం లేక పెరుగుతున్న కాలం
Mark 13:29
ταῦτα
ఇది కష్టకాలమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విషయాలను నేను ఇప్పుడే వివరించాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐγγύς ἐστιν
మనుష్యకుమారుడు దగ్గరలో ఉన్నాడు
ἐπὶ θύραις
ఇది ఒక భాషీయము అంటే ఆయన దగ్గరలోనే ఉన్నాడు మరియు దాదాపుగా వచ్చాడు, పట్టణపు ద్వారాల దగ్గర ఒక ప్రయాణీకుడు దగ్గరగా ఉండటం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు దాదాపుగా ఇక్కడ ఉన్నాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 13:30
ἀμὴν, λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
οὐ μὴ παρέλθῃ
ఎవరైనా చనిపోతున్నారని మాట్లాడుటకు ఇది మర్యాదపూర్వక మార్గమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోరు” లేక “అంతం కారు” (చూడండి: సభ్యోక్తి)
μέχρις οὗ ταῦτα πάντα
“ విషయాలు” అనే మాటలు కష్ట కాలమును గురించి తెలియచేస్తుంది.
Mark 13:31
ὁ οὐρανὸς καὶ ἡ γῆ
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు గ్రహాలు మరియు భూమియంతా అకాశామంతటి గురించి తెలియచేయుటకు ఈ రెండు విపరీతాలు ఇవ్వబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశం, భూమి, మరియు వాటిలో ఉన్న సమస్తం” (చూడండి: వివరణార్థక నానార్థాలు)
παρελεύσονται
ఉనికి లో ఉండదు. ఇక్కడ ఈ వాక్యభాగం ప్రపంచ అంతము గురించి తెలియచేస్తుంది.
οἱ…λόγοι μου οὐ μὴ παρελεύσονται
యేసు మాటలు తమ శక్తిని కోల్పోకుండా, అవి శారీరికంగా ఎప్పుడూ చనిపోవు అనే విధంగా చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మాటలు ఎన్నటికీ గతించవు” (చూడండి: రూపకం)
Mark 13:32
τῆς ἡμέρας ἐκείνης ἢ τῆς ὥρας
ఇది మనుష్యకుమారుడు తిరిగి వచ్చే కాలమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ రోజు” లేక “మనుష్యకుమారుడు తిరిగి వచ్చే కాలం” లేక “నేను తిరిగి వచ్చే రోజు లేక కాలం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐδεὶς οἶδεν; οὐδὲ οἱ ἄγγελοι ἐν οὐρανῷ, οὐδὲ ὁ Υἱός, εἰ μὴ ὁ Πατήρ
ఈ మాటలు మనుష్యకుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని వారిలో కొందరికి తెలియచేస్తుంది, భిన్నంగా ఆయన ఎప్పుడు వస్తాడో తండ్రికి మాత్రమే తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరికీ తెలియదు- పరలోకములోని దేవదూతలకు లేక కుమారునికి తెలియదు-కాని తండ్రి” లేక “పరలోకంలోని దేవదూతలకు లేక కుమారునికి తెలియదు; తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు” (చూడండి: శబ్దలోపం)
οἱ ἄγγελοι ἐν οὐρανῷ
ఇక్కడ “పరలోకం” అంటే దేవుడు నివసించే స్థలమును గురించి తెలియచేస్తుంది.
εἰ μὴ ὁ Πατήρ
మనుష్యసంబంధమైన తండ్రిని గురించి తెలియచేయుటకు మీ భాష సహజంగా ఉపయోగించే అదే మాటతో “తండ్రి” అని అనువదించడం మంచిది. ఆలాగే ఇది శబ్దలోపమైయున్నది, కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో తండ్రికి తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని తండ్రికి మాత్రమే తెలుసు” (చూడండి: శబ్దలోపం)
Mark 13:33
πότε ὁ καιρός ἐστιν
“సమయం” అనేది ఇక్కడ దేని గురించి తెలియచేస్తుందో స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 13:34
ἑκάστῳ τὸ ἔργον αὐτοῦ
ప్రతి ఒక్కరికి తాము ఏ పనిచేయాలో చెప్పడం
Mark 13:35
ἢ ὀψὲ
ఆయన సాయంత్రం తిరిగి రావచ్చు
ἀλεκτοροφωνίας
కోడిపుంజు ఉదయాననే బిగ్గరగా కూస్తొంది అది అరిచే ఒక పక్షియైయున్నది.
Mark 13:36
εὕρῃ ὑμᾶς καθεύδοντας
ఇక్కడ యేసు “నిద్రపోవుటకు” సిద్ధంగా ఉండకండి అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తిరిగి వచ్చు వేళా మీరు సిద్దంగా లేరు” (చూడండి: రూపకం)
Mark 14
మర్కు సువార్త 14వ అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతారు. పాత నిబంధనలోని వాక్యాలైన 14:27, 62 లోని కావ్యాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
శరీరం తినడం మరియు రక్తం త్రాగడం
మార్కు 14:22-25 తన అనుచరులతో యేసు చేసిన చివరి చివరి భోజనమును గురించి తెలియచేస్తుంది. ఈ సమయములో వారు తింటున్నది మరియు త్రాగుతున్నది ఆయన శరీరం మరియు రక్తం అని చెప్పాడు. ఈ భోజనమును గుర్తుంచు కొనుటకు దాదాపుగా అన్ని క్రైస్తవ సంఘాలు “ప్రభు రాత్రి భోజనము” “కడపటి రాత్రి భోజనము” లేక “పవిత్ర కూటమి” జరుపుకుంటాయి.
ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
అబ్బా, తండ్రి
“అబ్బా”అనేది యూదులు తమ తండ్రులతో మాట్లాడే ఒక అరామిక్ పదమైయున్నది. మార్కు అది వినిపించే విధంగా వ్రాసాడు మరియు తరువాత దానిని తర్జుమా చేస్తాడు. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
“మనుష్యకుమారుడు”
ఈ అధ్యాయములో యేసు తనను తానూ మనుష్యకుమారుడు అని తెలియచేస్తున్నారు (మార్కు 14:20). మీ భాష వారు వేరొకరిలాగా మాట్లాడుతున్నట్లుగా తనను తానూ మాట్లాడుటకు అనుమతించక పోవచ్చు. (చూడండి: మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు మరియు ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
Mark 14:1
పస్కా పండుగకు రెండు రోజుల ముందు, ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు రహస్యంగా యేసును చంపుటకు కుట్ర చేస్తున్నారు.
ἐν δόλῳ
ప్రజలు గమనించకుండా
Mark 14:2
ἔλεγον γάρ
“వారు” అనే మాట ప్రధాన యజకులను మరియు శాస్త్రులను గురించి తెలియచేస్తుంది
μὴ ἐν τῇ ἑορτῇ
పండగ సందర్భంగా యేసును బంధించకూడదని ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పండగ సమయంలో మనం చేయకూడదు’’ (చూడండి: శబ్దలోపం)
Mark 14:3
యేసును అభిషేకించబడిందని కొందరు కోపంగా ఉన్నప్పటికీ, యేసు చనిపోయే ముందు ఆ స్త్రీ ఆయన శరీరమును పాతిపెట్టుట కొరకు అభిషేకించిందని చెప్పారు
Σίμωνος τοῦ λεπροῦ
ఈ వ్యక్తికి గతంలో కుష్టు వ్యాధి కలిగి ఉన్నాడు, కాని ఇప్పుడు అస్వస్థతగా లేడు. సిమోను పేతురు మరియు కనానీయుడైన సిమోనులు కాకుండా ఇతను వేరే వ్యక్తియైయున్నాడు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
κατακειμένου αὐτοῦ
యేసు సంస్కృతిలో ప్రజలు తినుటకు గుమిగూడినప్పుడు, వారు తమ వైపులకు ఆనుకొని చిన్న బల్ల పక్కన దిండులపై తమను తాము సరిచేసుకొని కూర్చున్నారు.
ἀλάβαστρον
ఇది చలువరాతినుండి తయారు చేయబడిన సీసా. చలువరాయి అనేది పసుపు-తెలుపు రాయియైయున్నది. ప్రత్యామ్నయ తర్జుమా: “ప్రశస్తమైన తెల్ల రాతి సీసా” (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
ἀλάβαστρον μύρου, νάρδου πιστικῆς πολυτελοῦς
అగరు అని పిలువబడే ఖరీదైన, సువాసనగల పరిమళం ఇదులో ఉంది. అగరు అనేది అత్తరు తయారికి ఉపయోగించే చాలా వెలగల తీపి వాసనగల నూనె. (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
αὐτοῦ τῆς κεφαλῆς
యేసు తలపై
Mark 14:4
εἰς τί ἡ ἀπώλεια αὕτη τοῦ μύρου γέγονεν?
యేసుపై అత్తరు పోసే ఆ స్త్రీని వారు అంగీకరించలేదని చూపించుటకు వారు ఈ ప్రశ్న అడిగారు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె ఆ అత్తరు వృధా చేయడం భయంకరమైనది!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 14:5
ἠδύνατο…τοῦτο τὸ μύρον πραθῆναι
అక్కడున్నవారు డబ్బు గురంచి ఎక్కువ శ్రద్ధ చూపించారని మార్కు తన చదువరులకు చూపించాలనుకుంటున్నాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఈ అత్తరును అమ్మవచ్చు” లేక “ఆమె ఈ అత్తరును అమ్మవచ్చు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
δηναρίων τριακοσίων
300 దేనారములు. దేనారాలు రోమా దేశపు వెండి నాణేలు. (చూడండి: బైబిల్ డబ్బు మరియు సంఖ్యలు)
δοθῆναι τοῖς πτωχοῖς
“పేద” అన్న మాట పేద ప్రజలను గురించి తెలియచేస్తుంది. అత్తరు అమ్ముటవలన వచ్చిన డబ్బును పేదలకు ఇవ్వడం గురించి ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేద ప్రజలకు ఇచ్చిన డబ్బు” (చూడండి: శబ్దలోపం మరియు నామకార్థ విశేషణాలు)
Mark 14:6
τί αὐτῇ κόπους παρέχετε?
ఆ స్త్రీ చేసిన పనిని ప్రశ్నించినందుకు యేసు అతిథులను గద్దించారు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమెను కంగారు పెట్టకండి!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 14:7
τοὺς πτωχοὺς
ఇది పేద ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పేద ప్రజలు”
Mark 14:9
ἀμὴν…λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
ὅπου ἐὰν κηρυχθῇ τὸ εὐαγγέλιον
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా అనుచరులు సువార్త ప్రకటించిన చోటల్ల” (చూడండి: నామకార్థ విశేషణాలు)
ὃ ἐποίησεν αὕτη, λαληθήσεται
ఈ స్త్రీ ఏమి చేసిందో కూడా మాట్లాడతారు
Mark 14:10
ఆ స్త్రీ యేసును అత్తరుతో అభిషేకించిన తరువాత, యూదా యేసును ప్రధాన యాజకులకు అప్పగిస్తానని వాగ్దానం చేసాడు.
ἵνα αὐτὸν παραδοῖ αὐτοῖς
యూదా ఇంకా యేసును వారికి అప్పగించలేదు, బదలుగా వారితో ఏర్పాటు చేయుటకు వెళ్ళాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను యేసును వారికి అప్పగించేలా వారితో ఏర్పాట్లు చేయుటకు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
αὐτὸν παραδοῖ
యేసును వారి దగ్గరకు తీసుకొని వెళ్ళితే వారు ఆయనను పట్టుకుంటారు
Mark 14:11
οἱ δὲ ἀκούσαντες
ప్రధాన యాజకులు విన్నది స్పష్టంగా చెప్పుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యాజకులు వారి కోసం ఏమి చేయుటకు అతను సిద్ధంగా ఉన్నాడో అని విన్నప్పుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:12
పస్కా భోజనమును సిద్ధం చేయుటకు యేసు ఇద్దరు శిష్యులను పంపుతాడు.
ὅτε τὸ Πάσχα ἔθυον
పులియని రొట్టెల పండుగ ప్రారంభంలో ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వడం ఆచారం. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వడం ఆచారం అయినప్పుడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
φάγῃς τὸ Πάσχα
ఇక్కడ “పస్కా” అనేది పస్కా భోజనమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పస్కా భోజనం తినండి”
Mark 14:13
κεράμιον ὕδατος βαστάζων
నీటితో నిండిన పెద్ద కుండను మోస్తూ ఉంటాడు
Mark 14:14
ὁ διδάσκαλος λέγει, ποῦ ἐστιν τὸ κατάλυμά μου…μετὰ τῶν μαθητῶν μου φάγω?
దీనిని పరోక్ష ఉల్లేఖనగా వ్రాయవచ్చు. ఇది మర్యాదపూర్వక మనవి కాబట్టి దీనిని తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా బోధకుడు తన శిష్యులతో కలసి పస్కాను తినేందుకు విడిది గది ఎక్కడ ఉంది అని \nతెలుసుకోవాలనుకుంటున్నారు.” (చూడండి:ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
τὸ κατάλυμά
సందర్శకుల కోసం ఒక గది
Mark 14:15
ἐκεῖ ἑτοιμάσατε ἡμῖν
వారు యేసు మరియు ఆయన శిష్యులకు తినుటకు భోజనం సిద్ధపరచవలసి ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ మనకు భోజనం సిద్ధం చేయండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:16
ἐξῆλθον οἱ μαθηταὶ
ఇద్దరు శిష్యులు వెళ్ళిపోయారు
καθὼς εἶπεν
యేసు చెప్పినట్లు
Mark 14:17
ఆ సాయంత్రం యేసు మరియు శిష్యులు పస్కా భోజనం తింటున్నప్పుడు వారిలో ఒకడు తనకు ద్రోహం చేస్తాడని యేసు వారికి చెపుతాడు
ἔρχεται μετὰ τῶν δώδεκα
వారు ఎక్కడికి వచ్చారో చెప్పుటకు ఇది సహాయ పడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పన్నెండు మందితో ఇంటికి వచ్చాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:18
ἀνακειμένων
యేసు సంస్కృతిలో ప్రజలు తినుటకు గుమిగూడినప్పుడు, వారు తమ వైపులకు ఆనుకొని చిన్న బల్ల పక్కన దిండులపై తమను తాము సరిచేసుకొని కూర్చున్నారు.
ἀμὴν, λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
Mark 14:19
εἷς κατὰ εἷς
దీని అర్థం ఒక సమయంలో ఒకరు” ప్రతి శిష్యుడు ఆయనను అడిగారు.
μήτι ἐγώ?
సాధ్యమయ్యే అర్థాలు 1) ఇది శిష్యులు సమాధానం లేదు అని నిరీక్షించబడ్డ ప్రశ్న లేక 2) ఇది ఒక అలంకారిక ప్రశ్న దీనికి ప్రతిస్పందన అవసరం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీకు ద్రోహం చేసేవాడిని నేను కాదు కదా!” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:20
εἷς τῶν δώδεκα
అతను మీ పన్నెండు మందిలో ఒకడు, ఇప్పుడున్న ఒకడే
ἐμβαπτόμενος μετ’ ἐμοῦ εἰς τὸ τρύβλιον
యేసు సంస్కృతిలో ప్రజలు తరచూ రొట్టెలను తింటారు, దానిని పచ్చడి లేక మూలికలతో నూనెలో వాటిని పంచుకుంటారు.
Mark 14:21
ὅτι ὁ μὲν Υἱὸς τοῦ Ἀνθρώπου ὑπάγει, καθὼς γέγραπται περὶ αὐτοῦ
ఇక్కడ యేసు తన మరణం గురించి ప్రవచించే గ్రంథాలను గురించి తెలియచేస్తాడు. మీ భాషలో మరణం గురించి మాట్లాడుటకు మీకు మర్యాదపూర్వక మార్గం ఉంటే, దానిని ఇక్కడ ఉపయోగించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే మనుష్యకుమారుడు లేఖనములు చెప్పిన విధంగా చనిపోతాడు”
δι’ οὗ ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου παραδίδοται
దీనిని మరింత నేరుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుని మోసం చేసేవాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:22
ἄρτον
ఇది పులియని రొట్టె యొక్క రుచిలేని రొట్టె, దీనిని పస్కా భోజనంలో భాగంగా తింటారు.
ἔκλασεν
శిష్యులు తినుటకు ఆయన రొట్టెను ముక్కలుగా విరిచాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని ముక్కలుగా విరిచాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
λάβετε, τοῦτό ἐστιν τὸ σῶμά μου
ఈ రొట్టెను తీసుకోండి. ఇది నా దేహం. రొట్టె యేసు దేహమునకు సంకేతమని మరియు అది అసలు మాంసం కాదని చాలా మంది దీనిని అర్థం చేసుకున్నప్పటికీ ఈ ప్రకటనను అక్షరాల తర్జుమా చేయటం మంచిది. \n(చూడండి: సంకేతాత్మక బాష)
Mark 14:23
λαβὼν ποτήριον
ఇక్కడ “పాత్ర” అనేది ద్రాక్షరసము యొక్క మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ద్రాక్షరస పాత్రను తీసుకున్నాడు” (చూడండి: ఉపలక్షణము)
Mark 14:24
τοῦτό ἐστιν τὸ αἷμά μου τῆς διαθήκης, τὸ ἐκχυννόμενον ὑπὲρ πολλῶν
నిబంధన పాప క్షమాపణ కోసం. దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది నిబంధనను స్థిరపరచే నా రక్తం, చాలా మంది పాపక్షమాపణ పొందుటకు వీలుగా రక్తం పోస్తారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοῦτό ἐστιν τὸ αἷμά μου
ఈ ద్రాక్షరసం నా రక్తం. ద్రాక్షరసం యేసు రక్తానికి సంకేతమని మరియు అది అసలు రక్తం కాదని చాలా మంది దీనిని అర్థం చేసుకున్నప్పటికీ ఈ ప్రకటనను అక్షరాల తర్జుమా చేయటం మంచిది. (చూడండి: సంకేతాత్మక బాష)
Mark 14:25
ἀμὴν, λέγω ὑμῖν
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
τοῦ γενήματος τῆς ἀμπέλου
ద్రాక్షరసం. ద్రాక్షరసం గురించి తెలియచేయుటకు ఇది వివరణాత్మక మార్గం.
καινὸν
సాధ్యమయ్యే అర్థాలు 1) “మళ్ళీ” లేక 2) “క్రొత్త విధంగా”
Mark 14:26
ὑμνήσαντες
ఒక కీర్తన అనేది ఒక రకమైన పాట. పాత నిబంధన కీర్తన పాడడం వారికి సంప్రదాయంగా ఉంది
Mark 14:27
λέγει αὐτοῖς ὁ Ἰησοῦς
యేసు ఆయన శిష్యులతో చెప్పారు
σκανδαλισθήσεσθε
ఇది ఒక భాషీయమైయున్నది అంటే వదలివేయడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను వదలివేస్తారు” (చూడండి: జాతీయం (నుడికారం))
πατάξω
చంపుటకు. ఇక్కడ “నేను” అనేది దేవుని గురించి తెలియచేస్తుంది.
τὰ πρόβατα διασκορπισθήσονται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొర్రెలను చెదరగొడతాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 14:28
యేసు స్పష్టంగా పేతురుతో అతను నిరాకరిస్తాడని చెప్తాడు. పేతురు మరియు శిష్యులందరూ నిశ్చయముగా తిరస్కరించరు.
ἐγερθῆναί με
ఈ భాషీయము యొక్క అర్థం యేసు మరణించిన తరువాత దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు. దీనిని క్రీయాశీల రూపంలో వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నన్ను మృతులలో నుండి లేపుతాడు” లేక “దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు” (చూడండి: జాతీయం (నుడికారం) మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
προάξω ὑμᾶς
మీ కంటే ముందుగ వెళ్తాను
Mark 14:29
εἰ καὶ πάντες σκανδαλισθήσονται, ἀλλ’ οὐκ ἐγώ
“ నేను నిన్ను విడచిపెట్టను” అని నేను పూర్తిగా వ్యక్తపరచలేను “నేను విడచిపెట్టను” అనే మాట రెట్టింపు ప్రతికూల మాటయైయుండి సానుకూల అర్థమును కలిగి ఉన్నది. అవసరం అయితే ఇది సానుకూలంగా వ్యక్తపరచబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిగతా అందరూ మిమ్మును విడచిపెట్టినా నేను మాత్రం మీతోనే ఉంటాను” (చూడండి: శబ్దలోపం మరియు జంట వ్యతిరేకాలు)
Mark 14:30
ἀμὴν, λέγω σοι
ఇక్కడ చెప్పబడిన ప్రకటన ప్రాముఖ్యంగా నిజమైనదని మరియు ముఖ్యమైనదని ఇది తెలియచేస్తుంది మార్కు 3:28 లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
ἀλέκτορα φωνῆσαι
కోడిపుంజు అనే ఒక పక్షి ఉదయాననే కూస్తుంది. “కూయడము” అది చేసే పెద్ద శబ్దమైయున్నది.
ἢ δὶς
రెండు సార్లు
σὺ…με ἀπαρνήσῃ
మీరు నాకు తెలియదని నీవు చెప్పెదవు
Mark 14:31
ἐὰν δέῃ με συναποθανεῖν
నేను చావవలసి వచ్చినా
ὡσαύτως…καὶ πάντες ἔλεγον
దీని అర్థం శిష్యులందరు పేతురు చెప్పినట్లే చెప్పారు
Mark 14:32
వారు ఒలీవ కొండలోని గెత్సెమనేకు వెళ్ళినప్పుడు యేసు తన ముగ్గురు శిష్యులను ప్రార్దించేటప్పుడు మెలుకువగా ఉండమని ప్రోత్సాహిస్తాడు. రెండు సార్లు ఆయన వారిని మేల్కొల్పుతాడు మరియు మూడవ సారి ఆయన వారిని మేల్కోమ్మని చెప్తాడు ఎందుకంటే ఇది ద్రోహముగా శత్రువులకు అప్పగించబడే సమయం.
ἔρχονται εἰς χωρίον
“వారు” అనే మాట యేసును మరియు ఆయన శిష్యులను గురించి తేలియచేస్తుంది.
Mark 14:33
ἐκθαμβεῖσθαι
తీవ్రమైన దుఃఖములో మునిగిపోయాడు
ἀδημονεῖν
“తీవ్రంగా” అనే మాట యేసు తన ఆత్మలో చాలా బాధపడుతున్నడనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిక్కిలి శ్రమపడ్డాడు” (చూడండి: రూపకం)
Mark 14:34
ἐστιν ἡ ψυχή μου
యేసు తనకు తాను “ఆత్మగా” మాట్లాడతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను” (చూడండి: ఉపలక్షణము)
ἕως θανάτου
యేసు చాలా అతిశయోక్తిగా పలుకుచున్నాడు ఎందుకంటే ఆయన చాలా దుఃఖమును అనుభవిస్తున్నాడు ఆయన చనిపొతాడనిఅనిపిస్తుంది కాని అయినప్పటికీ సూర్యుడు ఉదయించేవరకు తను చనిపోడని అతనికి తెలుసు (చూడండి: అతిశయోక్తి)
γρηγορεῖτε
యేసు ప్రార్ధించేటప్పుడు శిష్యులు ఆప్రమత్తంగా ఉండాలి. యేసు ప్రార్థనను వారు చూడాలని దీని అర్థం కాదు
Mark 14:35
εἰ δυνατόν ἐστιν
దేవుడు అలా జరుగుటకు అనుమతిస్తే అని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దానికి అనుమతిస్తే” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
παρέλθῃ…ἡ ὥρα
ఇక్కడ “ఈ గంట” యేసు బాధపడుతున్న సమయము గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఈ బాధ సమయములో గుండా వెళ్ళవలసిన అవసరం లేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:36
Ἀββά
యూదు పిల్లలు తమ తండ్రిని సంబోధిచుటకు ఉపయోగించే మాటయైయున్నది. దీనిని తండ్రి అనుసరిస్తున్నందున ఈ మాటను ప్రతిలిఖించడం మంచిది. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
ὁ Πατήρ
ఇది దేవునికి ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
παρένεγκε τὸ ποτήριον τοῦτο ἀπ’ ἐμοῦ
యేసు బాధను ఒక గిన్నెవలె భరించాలి అని చెప్పుచున్నాడు. (చూడండి: అన్యాపదేశము)
ἀλλ’ οὐ τί ἐγὼ θέλω, ἀλλὰ τί σύ
యేసు దేవునికి ఇష్టమైనది చేయమని కోరుతున్నాడు మరియు యేసుకు ఇష్టమైనది కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని నాకు ఇష్టమైనది చేయవద్దు మీరు కోరుకున్నది చేయండి” (చూడండి: శబ్దలోపం)
Mark 14:37
εὑρίσκει αὐτοὺς καθεύδοντας
“వారిని” అనే మాట పేతురు, యాకోబు మరియు యోహానులను గురించి తెలియచేస్తుంది.
Σίμων, καθεύδεις? οὐκ ἴσχυσας μίαν ὥραν γρηγορῆσαι?
యేసు సిమోను పేతురును నిద్రిస్తున్నందుకు యేసు అతనిని గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “సిమోను మేల్కొని ఉండమని నేను చెప్పినప్పుడు నీవు నిద్రపోతున్నావు. నీవు ఒక గంట కూడా మేల్కొని ఉండలేరు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 14:38
ἵνα μὴ ἔλθητε εἰς πειρασμόν
యేసు సహజమైన ప్రదేశములోనికి ప్రవేశించినట్లుగా పరీక్షకు గురి అవుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పరీక్షింపబడరు” (చూడండి: రూపకం)
τὸ μὲν πνεῦμα πρόθυμον, ἡ δὲ σὰρξ ἀσθενής
యేసు సిమోను పేతురును తన స్వంత శక్తితో చెయాలనుకునేది బలంగా లేదని హెచ్చరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ ఆత్మలో సిద్ధంగా ఉన్నారు కాని మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని చేయుటకు చాలా బలహీనంగా ఉన్నారు” లేక “నేను చెప్పేది మీరు చేయాలనుకుంటున్నారు కాని మీరు బలహీనంగా ఉన్నారు”
τὸ…πνεῦμα…ἡ…σὰρξ
ఇవి పేతురు యొక్క వేర్వేరు అంశాల గురించి తెలియచేస్తాయి. ఆత్మ అతని అంతరంగిక కోరికలు. “శరీరం” అతని మానవ సామర్థ్యం మరియు బలమైయున్నది. (చూడండి: అన్యాపదేశము)
Mark 14:39
τὸν αὐτὸν λόγον εἰπών
అతను ముందు ప్రార్ధించిన దానిని మళ్ళీ ప్రార్ధించాడు
Mark 14:40
εὗρεν αὐτοὺς καθεύδοντας
“వారిని” అనే మాట పేతురు, యాకోబు మరియు యోహానులను గురించి తెలియచేస్తుంది
ἦσαν γὰρ αὐτῶν οἱ ὀφθαλμοὶ καταβαρυνόμενοι
ఇక్కడ రచయిత నిద్ర పోతున్న వ్యక్తి కళ్ళు తెరచి ఉంచడం చాలా కష్టమని “బరువైన కళ్ళు” ఉన్నట్లు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చాలా నిద్రలో ఉన్నందున వారు కళ్ళు తెరచి ఉంచుటకు చాలా కష్టపడుతున్నారు” (చూడండి: రూపకం)
Mark 14:41
ἔρχεται τὸ τρίτον
యేసు వెళ్లి మళ్ళీ ప్రార్థించాడు. అప్పుడు ఆయన మూడవ సారి వారి దగ్గరకు తిరిగి వచ్చాడు. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు ఆయన మళ్ళీ ప్రార్ధించాడు. ఆయన మూడవ సారి తిరిగి వచ్చాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καθεύδετε τὸ λοιπὸν καὶ ἀναπαύεσθε.
యేసు తన శిష్యులను మెలుకువగా ఉండనందుకు మరియు ప్రార్థన చేయనందుకు గద్దించాడు. అవసరమైతే మీరు ఈ అలంకారిక ప్రశ్నను ఒక ప్రకటనగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇంకా నిద్రపోతున్నారు మరియు విశ్రాంతి తిసుకుంటున్నారు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἦλθεν ἡ ὥρα
యేసు బాధపడే మరియు అప్పగింప బడే సమయం ప్రారంభం కానుంది.
ἰδοὺ
వినండి!
παραδίδοται ὁ Υἱὸς τοῦ Ἀνθρώπου
యేసు తన శిష్యులను తనను అప్పగించువాడు తమను సమీపించాడని హెచ్చరించాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను, మనుష్యకుమారుడను, అప్పగింపబడ్డాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 14:43
యేసును అప్పగించుటకు యూదు నాయకులతో యూదా ఎలా ఏర్పాట్లు చేసాడనే దాని గురించి 44వ వచనం సందర్భ సమాచారం ఇస్తుంది. (చూడండి: నేపథ్య సమాచారం)
యూడా యేసును ముద్దుతో అప్పగిస్తాడు, మరియు శిష్యులందరు పారిపోతారు.
Mark 14:44
δὲ ὁ παραδιδοὺς αὐτὸν
ఇది యూదాను గురించి తెలియచేస్తుంది
αὐτός ἐστιν
ఇక్కడ ఒకడు అనేది గుర్తించబోయే వ్యక్తిని గురించి తెలియచేస్తుంది. \nప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనే మీకు కావలసినవాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:45
κατεφίλησεν αὐτόν
యూదా ఆయనను ముద్దు పెట్టుకున్నాడు
Mark 14:46
ἐπέβαλαν τὰς χεῖρας αὐτῶν καὶ ἐκράτησαν αὐτόν
ఈ రెండు వాక్య భాగాలు యేసును స్వాధీనం చేసుకున్నాయని నొక్కి చెప్పుటకు ఒకే అర్థమును కలిగి ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మీద పడి ఆయనను పట్టుకున్నారు” లేక “ఆయనను పట్టుకున్నారు” (చూడండి: సమాంతరత)
Mark 14:47
τῶν παρεστηκότων
అక్కడ సమీపంగా నిలుచున్న వారిలో
Mark 14:48
ἀποκριθεὶς ὁ Ἰησοῦς εἶπεν αὐτοῖς
యేసు జనసమూహముతో అన్నాడు
ὡς ἐπὶ λῃστὴν ἐξήλθατε μετὰ μαχαιρῶν καὶ ξύλων συνλαβεῖν με?
యేసు జనసమూహమును గద్దించాడు. దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దోపిడీ దొంగలాగా, కత్తులతో, గదలతో నన్ను పట్టుకొనుటకు మీరు ఇక్కడికి రావడం హాస్యాస్పందంగా ఉంది!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 14:49
ἀλλ’ ἵνα
కాని ఇది జరుగవలసినది కాబట్టి
Mark 14:50
ἀφέντες αὐτὸν…πάντες
ఇది శిష్యుల గురించి తెలియచేస్తుంది.
Mark 14:51
σινδόνα
అవిసె మొక్క యొక్క నారనుండి తయారైన వస్త్రం
κρατοῦσιν αὐτόν
మనుష్యులు ఆ వ్యక్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు
Mark 14:52
ὁ δὲ καταλιπὼν τὴν σινδόνα
ఆ వ్యక్తి పారిపోవుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇతరులు అతని వస్త్రములను పట్టుకుని అతని ఆపుటకు ప్రయత్నిస్తున్నారు.
Mark 14:53
ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దల సమూహం యేసును ప్రధాన యాజకుని దగ్గరకు నడిపించిన తరువాత, పేతురు సమీపంలో చూస్తుండగా, కొందరు యేసుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పుటకు నిలువబడ్డారు.
συνέρχονται πάντες οἱ ἀρχιερεῖς, καὶ οἱ πρεσβύτεροι, καὶ οἱ γραμματεῖς
అర్థం చేసుకొనుటను సులభతరం చేయుటకు ఈ సమాచార క్రమమును మార్చవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ముఖ్య యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశమయ్యారు”
Mark 14:54
καὶ
రచయిత పేతురు గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు కథాంశంలో మార్పును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది.
ἕως ἔσω εἰς τὴν αὐλὴν τοῦ ἀρχιερέως
పేతురు యేసును వెంబడించగా, అతను ప్రధాన యాజకుని ఇంటి ఆవరణములో ఆగిపోయాడు. దీనిని స్పష్టంగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణము వరకు వెళ్ళాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἦν συνκαθήμενος μετὰ τῶν ὑπηρετῶν
పేతురు ఆవరణములో పనిచేస్తున్న భటులతోపాటు కూర్చున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను భటులతో పాటు ఆవరణములో కూర్చున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:55
δὲ
యేసును విచారణలో పెట్టడం గురించి రచయిత మనకు చెప్పడం కొన సాగిస్తున్నందున కథాంశంలో మార్పును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది.
εἰς τὸ θανατῶσαι αὐτόν
వారు యేసుకు మరణ శిక్ష విధించేవారు కాదు, బదలుగా వారు దీనిని వేరొకరు చేయమని ఆదేశిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసుకు మరణ శిక్ష విధించి ఉండవచ్చు” లేక “వారిలో ఎవరైనా యేసుకు శిక్ష విధించి ఉండవచ్చు” (చూడండి: అన్యాపదేశము)
οὐχ ηὕρισκον
వారు యేసును దోషిగా నిర్ధారించి చంపేందుకు ఆయనకు వ్యతిరేకముగా సాక్ష్యాలను కనుగొనలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఆయనను దోషిగా తేల్చే సాక్ష్యమును వారు కనుగొనలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:56
ἐψευδομαρτύρουν κατ’ αὐτοῦ
ఇక్కడ తప్పుడు సాక్ష్యం మాట్లాడడం అనేది ఎవరైనా తీసుకువెళ్ళగల సహజమైన వస్తువులా వర్ణించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనపై అబద్ద సాక్ష్యం చెప్పుట ద్వారా ఆయనపై ఆరోపణలు చేసారు” (చూడండి: రూపకం)
ἴσαι αἱ μαρτυρίαι οὐκ ἦσαν
దీనిని సానుకూల రూపంలో వ్రాయవచ్చు. “కాని వారి సాక్ష్యం ఒకదానికొకటి పొసగలేదు”
Mark 14:57
ἐψευδομαρτύρουν κατ’ αὐτοῦ
ఇక్కడ తప్పుడు సాక్ష్యం మాట్లాడడం అనేది ఎవరైనా తీసుకువెళ్ళగల సహజమైన వస్తువులా వర్ణించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనపై అబద్ద సాక్ష్యం చెప్పుట ద్వారా ఆయనపై ఆరోపణలు చేసారు” (చూడండి: రూపకం)
Mark 14:58
ἡμεῖς ἠκούσαμεν αὐτοῦ λέγοντος
యేసు చెప్పినట్లు మేము విన్నాము. “మేమ” అనే మాట యేసుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం తెచ్చిన వ్యక్తులను గురించి తెలియచేస్తుంది. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
τὸν χειροποίητον
ఇక్కడ “చేతులు” అనేది వ్యక్తుల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులచే తయారు చేయబడినది ... మనిషి సహాయం లేకుండా” లేక “మనుష్యులచే నిర్మించబడింది ... మనిషి సహాయం లేకుండా” (చూడండి: ఉపలక్షణము)
διὰ τριῶν ἡμερῶν
మూడు రోజుల్లో. అంటే మూడు రోజుల వ్యవధిలో ఈ ఆలయం నిర్మించబడుతుందని దీని అర్థం.
ἄλλον…οἰκοδομήσω
“దేవాలయం” అనే మాట మునుపటి వాక్యభాగము నుండి అర్థమవుతున్నది. ఇది పునరావృతం కావచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొక దేవాలయమును నిర్మిస్తాడు” (చూడండి: శబ్దలోపం)
Mark 14:59
οὐδὲ…ἴση ἦν
ఒకదానికొకటి పొసగలేదు. దీనిని సానుకూల రూపంలో వ్రాయవచ్చు.
Mark 14:60
తాను క్రీస్తు అని యేసు సమాధానం చెప్పినప్పుడు ప్రధాన యాజకులు మరియు అక్కడి నాయకులందరూ ఆయనను చనిపోవుటకు పాత్రుడని ఖండించారు.
ἀναστὰς…εἰς μέσον
కోపంగా ఉన్న జనం మధ్యలో మాట్లాడుటకు యేసు లేచి నిలబడ్డాడు. యేసు మాట్లాడుటకు నిలువబడినప్పుడు ఎవరు అక్కడ ఉన్నారనేదానిని చూపించుటకు దీనిని తర్జుమా చేయండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యాజకులు, శాస్త్రులు, మరియు పెద్దల మధ్య నిలబడ్డారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐκ ἀποκρίνῃ οὐδέν? τί οὗτοί σου καταμαρτυροῦσιν?
ప్రధాన యాజకుడు సాక్ష్యాలను చెప్పిన దాని గురించి యేసును సమాచారం అడగటం లేదు. సాక్ష్యులు చెప్పినది తప్పు అని నిరూపించమని అతను యేసుని అడుగుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవేమి సమాధానం ఇవ్వడంలేదేమి? ఈ మనుష్యులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సాక్ష్యానికి ప్రతిస్పందనగా నీవు ఏమి చెపుతావు?” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:61
ὁ…Υἱὸς τοῦ Εὐλογητοῦ
ఇక్కడ దేవునిని “ఆశీర్వదింపబడిన” అని పిలుస్తారు. మానవ తండ్రి యొక్క “కుమారుడి” గురించి తెలియచేయుటకు మీ భాష సహజంగా ఉపయోగించే అదే మాటతో “కుమారుడు” అని తర్జుమా చేయడం మంచిది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఆశీర్వదింపబడిన దేవుని కుమారుడు” లేక “దేవుని కుమారుడు” (చూడండి: నామకార్థ విశేషణాలు మరియు తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 14:62
ἐγώ εἰμι
దీనికి రెండు అర్థాలు ఉన్నాయి: 1) ప్రధాన యాజకుని ప్రశ్నకు స్పందించడం మరియు 2) పాత నిబంధనలో దేవుడు తనను తాను పిలచుకున్నట్లే , ఆయన తనను తానూ “నేనే” అని పిలచుటకు”
ἐκ δεξιῶν καθήμενον τῆς δυνάμεως
ఇక్కడ “శక్తి” అనేది దేవుని గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. . “దేవుని కుడి ప్రక్కన” కూర్చోవడం అనేది దేవుని నుండి గొప్ప గౌరవం మరియు అధికారమును పొందే సాంకేతిక చర్యయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని ప్రక్కన గౌరవ స్థానంలో కూర్చుంటాడు” (చూడండి: అన్యాపదేశము మరియు సంకేతాత్మకమైన చర్య)
ἐρχόμενον μετὰ τῶν νεφελῶν τοῦ οὐρανοῦ
యేసు తిరిగి వచ్చినప్పుడు మేఘాలు సహకరించునని వర్ణించబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఆకాశంలోనుండి మీఘాలపై వచ్చినప్పుడు” (చూడండి: రూపకం)
Mark 14:63
διαρρήξας τοὺς χιτῶνας αὐτοῦ
ప్రధాన యాజకుడు యేసు చెప్పిన దానిపై తన ఆగ్రహమును మరియు భయంకరత్వమును చూపించుటకు ఉద్దేశపూర్వకంగా తన బట్టలను చింపివేసాడు” ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆగ్రహముతో ఆయన బట్టలను చింపివేసాడు”
τί ἔτι χρείαν ἔχομεν μαρτύρων?
దీనిని ఒక ప్రకటనగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే ఎక్కువ మంది ప్రజలు మాకు ఖచ్చితంగా అవసరం లేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Mark 14:64
ἠκούσατε τῆς βλασφημίας
ఇది యేసు చెప్పినదాని గురించి తెలియచేస్తుంది, దీనిని ప్రధాన యాజకుడు దైవదూషణ అని పిలుస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతను దైవ దూషణ చేయడం మీరు విన్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οἱ…πάντες
గదిలోని ప్రజలందరూ
Mark 14:65
ἤρξαντό τινες ἐμπτύειν
గదిలో కొంతమంది వ్యక్తులు
περικαλύπτειν αὐτοῦ τὸ πρόσωπον
వారు ఆయన ముఖమును ఒక బట్టతో లేక కళ్ళకు గంతలు కట్టారు కాబట్టి ఆయన చూడలేకపోయాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ముఖమునకు కళ్ళగంతలతో కట్టినట్లు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
προφήτευσον
వారు ఆయనను ఎగతాళి చెసారు, ఆయనను ఎవరు కొట్టారు ప్రవచించమని అడిగారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ మిమ్మును కొట్టిన ప్రవచనం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οἱ ὑπηρέται
అధికారి ఇంటికి భటులైన వ్యక్తులు
Mark 14:66
యేసు ముందుగా చెప్పినట్లే , కోడి కూయక మునుపే పేతురు యేసును మూడు సార్లు నిరాకరించాడు.
κάτω ἐν τῇ αὐλῇ
బయట ఆవరణములో
μία τῶν παιδισκῶν τοῦ ἀρχιερέως
సేవకురాండ్రు ప్రధాన యజకుల కోసం పని చేసారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యజకుని పనిపిల్ల” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:68
ἠρνήσατο
దీని అర్థం ఏదో నిజం కాదని వాదించడం. ఈ సందర్భములో పేతురు పనిపిల్ల చెప్పినది నిజం కాదని చెప్పుచున్నాడు.
οὔτε οἶδα, οὔτε ἐπίσταμαι σὺ τί λέγεις
“తెలుసు” మరియు “అర్థం చేసుకోవడం” రెండూ ఇక్కడ ఒకే అర్థమును కలిగి ఉన్నాయి . పేతురు చెప్పుచున్న దానిని నొక్కి చెప్పుటకు ఈ అర్థం పునరావృతం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఏమి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలియదు” (చూడండి: జంటపదం)
Mark 14:69
ἡ παιδίσκη
ఇంతకు ముందు పేతురుని గుర్తించిన పనిపిల్ల ఆమె.
ἐξ αὐτῶν
ప్రజలు పేతురును యేసు శిష్యులలో ఒకరిగా గుర్తించారు. దీనిని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు శిష్యులలో ఒకరు” లేక “ఆయనను బంధించిన ఆ వ్యక్తితో ఉన్నవారిలో ఒకడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 14:71
ἀναθεματίζειν
మీ భాషలో మీరు ఒకరిని శపించే వ్యక్తికి పేరు పెట్టాలి అనుకుంటే దేవునిని పేర్కొనండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను శపించమని చెప్పడం” (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 14:72
εὐθὺς…ἀλέκτωρ ἐφώνησεν
కోడిపుంజు అనే ఒక పక్షి ఉదయాననే కూస్తుంది. “కూయడము” అది చేసే పెద్ద శబ్దమైయున్నది.
ἐκ δευτέρου
ఇక్కడ రెండవది క్రమసంఖ్యయైయున్నది. (చూడండి: వరుస క్రమాన్ని తెలియచేసే సంఖ్యలు)
ἐπιβαλὼν
ఇది ఒక భాషీయమైయున్నది అంటే ఆయన దుఃఖములో మునిగిపోయాడు” లేక “ఆయన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయాడు (చూడండి: జాతీయం (నుడికారం))
Mark 15
మర్కు సువార్త 15వ అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశములు
“దేవాలయలో తెర రెండుగా చినిగింది”
ప్రజలు వారి కోసం ఎవరైనా దేవునితో మాట్లాడవలసిన అవసరం ఉందని చూపించుటకు దేవాలయములోని తేర ఒక ముఖ్యమైన సంకేతమైయున్నది. ప్రజలందరూ పాపులని మరియు దేవుడు పాపమును ద్వేషిస్తున్నందునవారు నేరుగా దేవునితో మాట్లాడలేరు. ప్రజలు చేసిన పాపములకు వెల చెల్లించినందున యేసుని ప్రజలు ఇప్పుడు దేవునితో నేరుగా మాట్లాడగలరని దేవుడు తెరను చించి వేసాడు.
సమాధి
యేసుని పాతి పెట్టబడిన సమాధి (మార్కు 15:46). ధనవంతులైన యూదా కుటుంబాల వారు మరణించిన వారిని పాతిపెట్టే సమాధీయైయున్నది. అసలు ఇది ఒక రాతిలో కత్తిరించిన గదియైయున్నది. ఇది ఒక వైపున చదునైన స్థలమును కలిగియుంది, అక్కడ వారు దానిపై నూనె మరియు సుగంధ ద్రవ్యములు పోసి బట్టలో చుట్టిన తరువాత శరీరమును దానిలో ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద రాయిని చుట్టేవారు కాబట్టి లోపల ఎవరు చూడలేరు లేక ప్రవేశించలేరు.
ఈ అధ్యాయములోని ముఖ్యమైన భాషీయములు
వ్యంగ్యం
యేసును ఆరాధించినట్లు (మార్కు 15:19) మరియు ఒక రాజుతో మాట్లాడినట్లు నటించడం ద్వారా (మార్కు 15:18), సైమికులు మరియు యూదులు వారు యేసును ద్వేషించారని మరియు ఆయన దేవుని కుమారుడని నమ్మలేదు అని చూపించాడు. (చూడండి: వ్యంగ్యోక్తి మరియు యెగతాళి, యెగతాళి చెయ్యడం, యెగతాళి చేసారు, యెగతాళి చేస్తూండడం, యెగతాళి చేయువాడు, అపహాస్యం, అపహాస్యం, అపహాస్యం చెయ్యడం, వెక్కిరింత, వెక్కిరించడం)
\nఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు
ఎలోయి, ఎలోయి, లామా సబక్తాని?
ఇది అరామిక్ భాషలోని వాక్యమైయున్నది. మార్కు దాని శబ్దాలకు గ్రీకు అక్షరాలను వ్రాయడం ద్వారా ప్రతిలిఖిస్తుంది. అప్పుడు ఆయన దాని అర్థమును వివరిస్తాడు. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
Mark 15:1
ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు మరియు మహా సభకు చెందిన సభ్యులు యేసుని పిలాతుకు అప్పగించినప్పుడు వారు యేసు చాల చెడ్డ పనులు చేసారని ఆరోపించారు. వారు చెప్పినది నిజమేనా అని పిలాతు అడిగినప్పుడు, యేసు అతనికి సమాధానం చెప్పలేదు.
δήσαντες τὸν Ἰησοῦν, ἀπήνεγκαν
వారు యేసును బంధించమని ఆజ్ఞాపించారు, కాని సైనికులు ఆయనను బంధించి దూరంగా నడిపించేవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు యేసును బంధించమని ఆజ్ఞాపించారు, తరువాత ఆయనను తీసుకు వెళ్ళారు” లేక “వారు యేసును బంధించమని సైనికులకు ఆజ్ఞాపించారు మరియు వారు ఆయనను దూరంగా నడిపించేవారు” (చూడండి: అన్యాపదేశము)
παρέδωκαν Πειλάτῳ
వారు యేసును పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు మరియు తమ నియంత్రణలో ఉన్న యేసును అతనికి అప్పగించారు.
Mark 15:2
σὺ λέγεις
సాధ్యమయ్యే అర్థాలు 1) ఇలా చెప్పడం ద్వారా యేసు యూదుల రాజు అని పిలిచేవాడు పిలాతు కాని యేసు కాదు అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నువ్వే అంటున్నావా” లేక 2) ఇలా చెప్పడం ద్వారా యేసు తాను యూదుల రాజు అని సూచించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవును మీరు చెప్పినట్లు నేను యూదుల రాజునే” లేక “అవును, మీరు చెప్పినట్లే” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:3
κατηγόρουν αὐτοῦ…πολλά
వారు యేసుపై చాలా నేరాలు మోపారు లేక “యేసు చాలా చెడ్డ పనులు చేస్తున్నాడని వారు చెప్తున్నారు”
Mark 15:4
ὁ δὲ Πειλᾶτος πάλιν ἐπηρώτα αὐτὸν
పిలాతు యేసును మళ్ళీ అడిగాడు
οὐκ ἀποκρίνῃ οὐδέν?
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ దగ్గర జవాబు ఉందా”
ἴδε
చూడండి లేక “వినండి” లేక “నేను మీలు చెప్పబోయే దానిపై శ్రద్ధ వహించండి
Mark 15:5
ὥστε θαυμάζειν τὸν Πειλᾶτον
యేసు జవాబు ఇవ్వలేదు మరియు తానకుతానూ రక్షించుకోలేదు అనే విషయం పిలాతును ఆశ్చర్యపరచింది.
Mark 15:6
జనసమూహం యేసును ఎన్నుకుంటుదనే ఆశతో పిలాతు ఖైదీలను విడుదల చేయమని ప్రతిపాదించాడు కాని బదులుగా జనం బరబ్బ కోసం అడుగుతారు.
δὲ
పండుగలో ఖైదీలను విడుదల చేసే పిలాతు సంప్రదాయం గురించి మరియు బరబ్బను గురించి సందర్భ సమాచారమును రచయిత చెప్పుటకు మారినప్పుడు ప్రధాన కథనా క్రమములో విరామమును గుర్తించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది. (చూడండి: నేపథ్య సమాచారం)
Mark 15:7
ἦν δὲ ὁ λεγόμενος Βαραββᾶς, μετὰ τῶν στασιαστῶν δεδεμένος
ఆ సమయలో బరబ్బ అనే వ్యక్తి ఉన్నాడు అతను మరికొందరితో ఖైదులో ఉన్నాడు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారు హత్య చేసారు.
Mark 15:8
αἰτεῖσθαι καθὼς ἐποίει αὐτοῖς
పిలాతు పండుగలో ఖైదీని విడల చేయటము గురించి ఇది తెలియచేస్తుంది. ఈ విషయమును స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను గతంలో చేసినట్లు వారికి ఖైదీని విడుదల చేయుటకు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:10
ἐγίνωσκεν γὰρ ὅτι διὰ φθόνον παραδεδώκεισαν αὐτὸν οἱ ἀρχιερεῖς
ఇది యేసును పిలాతుకు ఎందుకు అప్పగించారనే దాని సందర్భ సమాచారమైయున్నది (చూడండి: నేపథ్య సమాచారం)
διὰ φθόνον…οἱ ἀρχιερεῖς
బహుశా చాల మంది ప్రజలు ఆయనను అనుసరిస్తూ ఆయన శిష్యులుగా మారారు కాబట్టి వారు యేసుపై అసూయపడ్డారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన యాజకులు యేసు పట్ల అసూయపడేవారు. అందువలన వారు” లేక “ప్రధాన యాజకులు ప్రజలలో యేసు యొక్క జనసమ్మతము చూసి అసూయపడ్డారు. అందుకే వారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:11
ἀνέσεισαν τὸν ὄχλον
ప్రధాన యాజకులు జనసమూహమును రెచ్చగొట్టడం లేక ప్రేరేపించడం గురించి ఆ జనసమూహము కదిలించే ఎదో ఒక గిన్నెవలె అని రచయిత మాట్లాడతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనసమూహమును రెచ్చగొట్టారు” లేక “జనసమూహమును ప్రేరేపించారు” (చూడండి: రూపకం)
μᾶλλον…ἀπολύσῃ
యేసుకు బదులుగా బరబ్బను విడుదల చేయాలని వారు కోరారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసుకు బదులుగా విడుదల చేయబడ్డాడు” (చూడండి: శబ్దలోపం)
Mark 15:12
జనసమూహం యేసు మరణమును అడుగుతుంది, కాబట్టి పిలాతు ఆయనను సైనికుల చేతికి అప్పగిస్తాడు, వారు ఆయనను ఎగతాళి చేస్తారు, ముళ్ళతో కిరీటం పెట్టారు, కొట్టారు మరియు సిలువ వేయుటకు బయటకు నడిపిస్తారు.
τί οὖν ποιήσω λέγετε τὸν Βασιλέα τῶν Ἰουδαίων?
బరాబ్బాను వారికి విడుదల చేస్తే యేసుని ఏమి చేయాలని పిలాతు అడుగుతాడు. దీనిని స్పష్టంగా వ్రాయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బరబ్బను విడుదల చేస్తే, ఈ యూదుల రాజును ఏమి చేయమంటారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:14
ὁ δὲ Πειλᾶτος ἔλεγεν αὐτοῖς
పిలాతు జనం తో అన్నాడు
Mark 15:15
τῷ ὄχλῳ τὸ ἱκανὸν ποιῆσαι
అతను ఏమి చేయుట ద్వారా జన సమూహమును సంతోషపరచగలడో దానిని చేసి వారిని సంతోషపరచాడు.
τὸν Ἰησοῦν φραγελλώσας
వాస్తవానికి పిలాతు యేసును కొట్టలేదు గాని అతని సైనికులు అలా చేసారు.
φραγελλώσας
కొరడా దెబ్బలు తిన్నాడు. “కొరడా దండన” అంటే ముఖ్యంగా బాధాకరమైన కొరడాతో కొట్టడం.
καὶ παρέδωκεν…ἵνα σταυρωθῇ
పిలాతు యేసుకు సిలువ వేయుటకు తన సైనికులకు అప్పగించాడు. దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను తిసుకువెళ్ళి సిలువ వేయండి అని అతని సైనికులతో అన్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 15:16
τῆς αὐλῆς, ὅ ἐστιν πραιτώριον
ఇది యెరుషలేములో రోమా సైనికులు నివసించిన ప్రాంతం, అధికారి యేరుషలేములో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సైనికుల నిలయముల ఆవరణం” లేక “అధికార భవనం యొక్క ఆవరణం”
ὅλην τὴν σπεῖραν
మిగిలిన సైనికులందరినీ
Mark 15:17
ἐνδιδύσκουσιν αὐτὸν πορφύραν
ఊదారంగు రాజులు ధరించే రంగు. సైనికులు యేసును రాజు అని నమ్మలేదు. ఆయన యూదుల రాజు అని ఇతరులు చెప్పినందున వారు ఆయనను ఎగతాళి చేయుటకు ఈ విధమైన వస్త్రాలను ధరింప చేస్తారు.
ἀκάνθινον στέφανον
ముళ్ళ కొమ్మలతో చేసిన కీరిటం
Mark 15:18
Χαῖρε, Βασιλεῦ τῶν Ἰουδαίων
పైకి లేపిన చేతులతో “అభివందనములు” అనే శుభాకాంక్షలు రోమా చక్రవర్తిని పలకరించుటకు మాత్రమే ఉపయోగించబడ్డాయి. యేసు యూదుల రాజు అని సైనికులు నమ్మలేదు. బదులుగా ఆయనను ఎగతాళి చేయుటకే వారు ఇలా అన్నారు” (చూడండి: వ్యంగ్యోక్తి)
Mark 15:19
καλάμῳ
కట్టె లేక “కర్ర”
τιθέντες τὰ γόνατα
మోకాళ్లను వంచే వ్యక్తి మోకాళ్లను వంచుతాడు కాబట్టి మోకరింపచేసే వారు కొన్నిసార్లు “మోకాళ్లను వంచుతారు” అని అంటారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోకరించారు” లేక “మోకాళ్ళు వంచారు” (చూడండి: రూపకం)
Mark 15:21
ἀγγαρεύουσιν…ἵνα ἄρῃ τὸν σταυρὸν αὐτοῦ
రోమా చట్ట ప్రకారం, ఒక సైనికుడు దారిపై వచ్చే వ్యక్తిని భారమును మోయమని బలవంతం చేయగలడు. ఈ సందర్భములో వారు సీమోనును సిలువ మోయమని బలవంతం చేసారు.
ἀπ’ ἀγροῦ
పట్టణం వెలుపల నుండి
καὶ ἀγγαρεύουσιν, παράγοντά…τὸν πατέρα Ἀλεξάνδρου καὶ Ῥούφου
సైనికులు సిలువను మోయమని బలవంతము చేసిన వ్యక్తి గురించి ఇది సందర్భ సమాచారమైయున్నది. (చూడండి: నేపథ్య సమాచారం)
Σίμωνα…Ἀλεξάνδρου…Ῥούφου
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Κυρηναῖον
ఇది ఒక స్థలం పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 15:22
సైనికులు యేసును గోల్గొతాకు తీసుకువస్తారు, అక్కడ వారు మరో ఇద్దరితో ఆయనను సిలువ వేస్తారు. చాలా మంది ఆయనను ఎగతాళి చేస్తారు.
Κρανίου Τόπος
కపాలస్థలం లేక “కపాలం యొక్క స్థలం.” ఇది స్థలం పేరు. అక్కడ కపాలాలు చాలా ఉన్నాయని కాదు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Κρανίου
కాపాలం అంటే తల ఎముకలు లేక దానిపై మాంసము లేని తల.
Mark 15:23
ἐσμυρνισμένον οἶνον
బోళము నొప్పిని తగ్గించే ఔశషధము అని వివరించుటకు ఇది సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోళము అనే ఔషధముతో కలిపిన ద్రాక్షరసం” లేక “బోళము అనే నొప్పిని తగ్గించే ఔషధముతో కలిపిన ద్రాక్షరసం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:25
ὥρα τρίτη
ఇక్కడ మూడవది అంటే క్రమ సంఖ్య. ఇది ఉదయం తొమ్మిది గంటలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఉదయం తొమ్మిది గంటలకు” (చూడండి: వరుస క్రమాన్ని తెలియచేసే సంఖ్యలు)
Mark 15:26
τῆς αἰτίας αὐτοῦ
వారు ఆయనపై ఆరోపణ చేసిన నేరం
Mark 15:27
ἕνα ἐκ δεξιῶν καὶ ἕνα ἐξ εὐωνύμων αὐτοῦ
దీనిని మరింత స్పష్టంగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకటి ఆయన కుడివైపున ఒక సిలుపై మరియు మరొకటి ఆయన ఎడమ వైపున ఒక సిలువపై” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:29
κινοῦντες τὰς κεφαλὰς αὐτῶν
ప్రజలు యేసును అంగీకరించలేదు అని చూపించుటకు ఇది ఒక చర్య.
οὐὰ
ఇది అపహాస్యం యోక్క ఆశ్చర్యార్థకమైయున్నది. మీ భాషలో తగిన ఆశ్చర్యార్థకమును వాడండి. (చూడండి: ఆశ్చర్యార్థకాలు)
ὁ καταλύων τὸν ναὸν καὶ οἰκοδομῶν ἐν τρισὶν ἡμέραις
ప్రజలు యేసును తానూ ముందే చేస్తానని ప్రవచించిన దాని ద్వారా సూచిస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ దేవాలయమును కూలదీసి మూడు రోజుల్లో కట్టిస్తా అని చెప్పిన మీరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:31
ὁμοίως
యేసు ముందు నడుస్తున్న ప్రజలు ఆయనను అపహాస్యం చేస్తున్న తీరును ఇది తెలియచేస్తుంది.
ἐμπαίζοντες πρὸς ἀλλήλους
తమలో తాము యేసును ఎగతాళి చేస్తున్నట్లు చెపుతున్నారు
Mark 15:32
ὁ Χριστὸς, ὁ Βασιλεὺς Ἰσραὴλ καταβάτω
యేసు క్రీస్తు మరియు ఇశ్రాయేలు రాజు అని నాయకులు నమ్మలేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తనను తాను క్రీస్తు అని ఇశ్రాయేలు రాజు అని పిలుస్తాడు. కాబట్టి ఆయనను దిగి రానివ్వండి” లేక “ఆయన నిజంగా క్రీస్తు మరియు ఇశ్రాయేలు రాజు అయితే, ఆయన దిగి రావాలి” (చూడండి: వ్యంగ్యోక్తి)
πιστεύσωμεν
యేసును విశ్వసించే సాధనాలు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను నమ్మండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὠνείδιζον
అపహాస్యం చేసారు, అవమానించారు
Mark 15:33
మధ్యాహ్నం మూడు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. యేసు పెద్ద స్వరముతో కేక వేస్తూ చనిపోతాడు. యేసు చనిపోయినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చినిగింది.
ὥρας ἕκτης
ఇది మద్యాహ్నం లేక 12 గంటలను గురించి తెలియచేస్తుంది.
σκότος ἐγένετο ἐφ’ ὅλην τὴν γῆν
ఇక్కడ భూమి భూమిపైకి వచ్చిన చీకటిలాగా బయట చీకటిగా మారిందని రచయిత వివరించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రదేశమంతా చీకటిగా మారింది” (చూడండి: రూపకం)
Mark 15:34
τῇ ἐνάτῃ ὥρᾳ
ఇది మద్యాహ్నం మూడు గంటల సమయమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మద్యాహ్నం మూడు గంటలకు” లేక “మద్యాహ్నం మధ్యలో”
Ἐλωῒ, Ἐλωῒ, λεμὰ σαβαχθάνει
ఇవి అరామిక్ పదాలు ఇవి మీ భాషలోనికి సారూప్య శబ్దాలతో ప్రతులని చేయాలి. (చూడండి: పదాలు నకలు రాయడం లేదా అరువు తెచ్చుకోవడం)
ἐστιν μεθερμηνευόμενον
అంటే
Mark 15:35
καί τινες τῶν παρεστηκότων, ἀκούσαντες ἔλεγον
యేసు చెప్పినదానిని వారు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అక్కడ నిలువబడి ఉన్న కొందరు ఆయన మాటలు విని తప్పుగా అర్థం చేసుకొని చెప్పారు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:36
ὄξους
చేదు చిరక
καλάμῳ
కర్ర. ఇది ఒక రెల్లు నుండి తయారైన ఒక కర్ర.
ἐπότιζεν αὐτόν
దానిని యేసుకు ఇచ్చారు. యేసు స్పాంజ్ నుండి ద్రాక్షరసం త్రాగుటకు ఆ వ్యక్తి కర్రను పట్టుకున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని యేసు వరకు ఉంచాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:38
τὸ καταπέτασμα τοῦ ναοῦ ἐσχίσθη εἰς δύο
దేవాలయపు తెరను దేవుడే చింపివేశాడని మార్కు చూపిస్తున్నాడు. దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు దేవాలయ తెరను రెండుగా చింపివేసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 15:39
ὁ κεντυρίων
యేసును సిలువ వేసిన సైనికులను పర్యవేక్షించిన శతాధిపతి ఇతనే.
ὁ παρεστηκὼς ἐξ ἐναντίας αὐτοῦ
ఇక్కడ “ముఖముగల” అనేది ఒక భాషీయమైయున్నది అంటే ఒకరి వైపు చూడడం అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ముందు నిలువబడినవారు” (చూడండి: జాతీయం (నుడికారం))
ὅτι οὕτως ἐξέπνευσεν
యేసు ఎలా మరణించెనో లేక “యేసు మరణించిన రీతిగా”
Υἱὸς Θεοῦ
ఇది యేసుకు ఒక ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Mark 15:40
ἀπὸ μακρόθεν θεωροῦσαι
దూరము నుండి చూచుచుండెను
ἡ Ἰακώβου τοῦ μικροῦ καὶ Ἰωσῆ μήτηρ
యాకోబు … మరియు యోసేల తల్లియైన. దీనిని కుండలీకరణాలు (బ్రాకెట్లు) లేకుండా వ్రాయవచ్చు.
Ἰακώβου τοῦ μικροῦ
చిన్న యాకోబు. యాకోబు అనే మరో పేరుగల వ్యక్తినుండి వేరుపరచుటకు “చిన్న” అనే పదము ఉపయోగించి ఈ మనుష్యుని సూచించుచున్నది.
Ἰωσῆ
ఈ యోసే మరియు యేసు చిన్న తమ్ముడైన ఆ వ్యక్తి ఒక్కరే కారు. మార్కు 6:3 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Σαλώμη
సలోమి ఒక స్త్రీ పేరైయున్నది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Mark 15:41
αἳ ὅτε ἦν ἐν τῇ Γαλιλαίᾳ ἠκολούθουν αὐτῷ…αὐτῷ εἰς Ἱεροσόλυμα
యేసు గలిలయలో ఉన్నప్పుడు ఈ స్త్రీలు ఆయనను…. ఆయనతో యెరూషలేము వరకు వెంబడించారు. దూరమునుండి యేసును సిలువవేసిన వైనమును చూచిన స్త్రీలను గూర్చిన నేపథ్య సమాచారముగా ఉన్నది. (చూడండి: నేపథ్య సమాచారం)
συναναβᾶσαι αὐτῷ εἰς Ἱεροσόλυμα
ఇశ్రాయేలులో వేరే స్థలములకంటే యెరూషలేము ఎత్తైన స్థలములో ఉండెను కాబట్టి, యెరూషలేముకు ఎక్కిపోవుట మరియు క్రిందికి దిగుట అని చెప్పుకోవడం సహజముగా ఉండును.
Mark 15:42
అరిమతయి వాడైన యోసేపు యేసు శరీరముకొరకు పిలాతును అడిగాడు, దానిని అతడు సన్నని నారబట్టతో చుట్టి మరియు సమాధిలో ఉంచాడు.
ὀψίας γενομένης
ఇక్కడ ఒక్క స్థలము నుండి మరొక స్థలముకు “వచ్చు” ఒక వస్తువుగా సాయంత్రమును గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది సాయంత్రమైయుండెను” లేక “అప్పుడు సాయంత్రమైయుండెను” (చూడండి: రూపకం)
Mark 15:43
ἐλθὼν Ἰωσὴφ ὁ ἀπὸ Ἁριμαθαίας, εὐσχήμων
“అక్కడికి వచ్చెను” అనే మాట పిలాతు దగ్గరకు యోసేపు రావడం గురించి సూచించుచున్నది, దీనిని నేపథ్య సమాచారము తర్వాత వివరించబడియున్నది, అయితే అతనిని కథలోనికి పరిచయం చేయడానికి అతడు వచ్చుచున్న సంగతిని నొక్కి చెప్పబడియున్నది. దీనిని చేయుటకు మీ భాషలో వేరే పద్ధతి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అరిమతయి వాడైన యోసేపు గౌరవనీయ” (చూడండి: పాలు పంచుకొనే పాత వారూ, కొత్త వారి గురించిన పరిచయం)
Ἰωσὴφ ὁ ἀπὸ Ἁριμαθαίας
అరిమతయి వాడైన యోసేపు. యోసేపు అనేది ఒక వ్యక్తి పేరు మరియు అరిమతయి అనేది అతడు నివసించుచున్న ప్రాంతము యొక్క పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
εὐσχήμων βουλευτής…τὴν Βασιλείαν τοῦ Θεοῦ
ఇది యోసేపును గూర్చిన నేపథ్య సమాచారమైయున్నది. (చూడండి: నేపథ్య సమాచారం)
εἰσῆλθεν πρὸς τὸν Πειλᾶτον
పిలాతుయొద్దకు వెళ్లి లేక “పిలాతు ఉన్న స్థలమునకు వెళ్లెను”
ᾐτήσατο τὸ σῶμα τοῦ Ἰησοῦ
దానిని పాతిపెట్టుటకు అతడు ఆ దేహమును తీసుకొనిపోవాలని ఉన్నట్లు దీనిని మీరు స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేహమును పాతిపెట్టుటకు అనుమతిని అడిగాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:44
ὁ δὲ Πειλᾶτος ἐθαύμασεν εἰ ἤδη τέθνηκεν; καὶ προσκαλεσάμενος τὸν κεντυρίωνα
యేసు చనిపోయియున్నాడని ప్రజలు చెప్పుకొనుట పిలాతు వినెను. ఇది అతడిని ఆశ్చర్యపరచెను, అందువలన అది నిజమా అని శతాధిపతిని అడిగాడు. దీనిని మీరు స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అప్పటికే చనిపోయెనని విని పిలాతు ఆశ్చర్యపడెను, అందుకు శతాధిపతిని పిలిచెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Mark 15:45
ἐδωρήσατο τὸ πτῶμα τῷ Ἰωσήφ
యేసు దేహమును తీసుకొనిపోవుటకు అతడు అనుమతించెను
Mark 15:46
σινδόνα
నార బట్ట అంటే అవిసె మొక్కనుండి తీయబడిన నార నుండి చేయబడిన ఒక రకమైన వస్త్రము. మార్కు 14:51 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.
καθελὼν αὐτὸν…καὶ προσεκύλισεν λίθον
యేసు దేహమును సిలువనుండి దింపుటకు, సమాధిని సిద్దపరచుటకు మరియు సమాధిని మూయుటకు వేరే వారి సహాయము యోసేపు తీసుకొనెనని మీరు స్పష్టము చేయవలసిన అవసరమున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు మరియు ఇతరులు ఆయనను క్రిందికి దింపి…. తరువాత వారు ఒక రాతిని దొర్లించిరి” (చూడండి: అన్యాపదేశము)
μνήματι ὃ ἦν λελατομημένον ἐκ πέτρας
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక బండలో పూర్వము ఒకరు తొలిచిన సమాధి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
λίθον ἐπὶ
దాని ముందు ఒక పెద్ద చదునైన బండ
Mark 15:47
Ἰωσῆτος
ఈ యోసే మరియు యేసు చిన్న తమ్ముడైన ఆ వ్యక్తి ఒక్కరే కారు. మార్కు 6:3 వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἐθεώρουν ποῦ τέθειται
దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోసేపు మరియు ఇతరులు యేసు దేహమును సమాధి చేసిన స్థలము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 16
మార్కు 16 సాధారణ విషయాలు
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యములు
సమాధి
యేసును ఉంచిన సమాధి ([మార్కు.15:46] (../../mrk/15/46.md)) ధనవంతులైన యూదా కుటుంబములవారు చనిపొతే పెట్టుకునెందుకు చేయించుకొనిన ఒక ప్రత్యేకమైన సమాధియైయుండెను. ఇది వాస్తవానికి రాతిలో తొలిపించుకొనిన గదియైయుండెను. దేహానికి సుగంధ ద్రవ్యములను పూసి, బట్టలు చుట్టిన తరువాత ఆ దేహమును ఉంచుటకు ఆ సమాధిలో ఒక చదునైన స్థలముండెను. దేహమును లోపల పెట్టి బయటకు వచ్చిన తరువాత సమాధిలోనికి ఎవరు ప్రవేశించకుండ ద్వారము వద్ద ఒక పెద్ద రాయిని దొర్లించి పెట్టుటకు ఉంచియుండిరి.
ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగములు
తెల్లని వస్త్రములు ధరించిన ఒక యౌవనస్తుడు
మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులందరూ యేసు సమాధివద్ద స్త్రీలతోపాటు తెల్లని వస్త్రములను ధరించుకొనిన దూతలను గూర్చి అందరు వ్రాసిరి. వారిలో ఇద్దరు రచయితలు మాత్రమే వారిని పురుషులు అని పిలిచిరి, కాని వారు మానవ రూపములో ఉన్నందువలననే అలా పిలిచారు. వారిలో ఇద్దరు రచయితలు ఇద్దరు దూతలను గూర్చి వ్రాస్తున్నారు గాని మరియొక ఇద్దరు రచయితలు మాత్రము వారిలో ఒకరిని గూర్చి మాత్రము వ్రాస్తున్నారు. వాక్యభాగములన్నియు ఒకే విషయాన్ని చెబుతున్నాయని చెప్పుటకు ఎటువంటి ప్రయత్నము చేయకుండా యుఎల్.టి(ULT)లో కనబడునట్లుగానే ఈ వాక్యభాగములలో ప్రతిదానిని తర్జుమా చేయడము చాలా మంచిది. (చూడండి: [మత్తయి.28:1-2] (../../mat/28/01.md) మరియు [మార్కు.16:5] (../../mrk/16/05.md) మరియు లూకా.24:4 మరియు [యోహాను.20:12] (../../jhn/20/12.md))
Mark 16:1
వారములో మొదటి రోజున, స్త్రీలందరూ ఉదయాన్నే వచ్చారు ఎందుకంటే వారు యేసు దేహమును అభిషేకించి సుగంధ ద్రవ్యములు పూయాలనుకున్నారు. అక్కడ నిలుచున్న ఒక యౌవనస్తుడు యేసు సజీవుడయ్యాడని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు, అయితే వారు భయపడ్డారు, వారు ఎవరికీ చెప్పలేదు.
καὶ διαγενομένου τοῦ Σαββάτου
వారములో ఏడవ రోజు సబ్బాతు ముగిసిన తరువాత, వారములోని మొదటి రోజు ఆరంభమైనది.
Mark 16:4
ἀποκεκύλισται ὁ λίθος
దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ఆ రాతిని దోర్లించారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Mark 16:6
ἠγέρθη
యేసు మరణమునుండి లేచియున్నాడని దూత గట్టిగా చెప్పింది. దోనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన లేచియున్నాడు!” లేక “దేవుడు ఆయనను మరణమునుండి లేపియున్నాడు!” లేక “ఆయన మరణమునుండి లేచియున్నాడు!” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)