2 Corinthians
2 Corinthians front
కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక పరిచయము
భాగము 1: సాధారణ పరిచయము
కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికయొక్క విభజన
- కొరింథీలో ఉన్న క్రైస్తవుల కొరకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చేయుచున్నాడు (1:1-11)
- పౌలు తన ప్రవర్తనను మరియు తన పరిచర్యను వివరించాడు (1:12-7:16)
- పౌలు యేరుషలేము దేవాలయమునకు ధనమును సమకుర్చుటను గురించి చెప్పుచున్నాడు. (8:1-9:15)
- పౌలు అపోస్తలుడుగా తన అధికారాన్ని కాపాడుకుంటున్నాడు.(10:1-13:10)
- పౌలు చివరి అభినందన మరియు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు (13:11-14)
కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికను ఎవరు వ్రాసారు?
పౌలు ఈ పత్రిక యొక్క రచయిత. అతను తార్సు పట్టణానికి చెందినవాడు. అతడు తన ప్రారంభ జీవితంలో సౌలు అని పిలువబడ్డాడు. అతడు క్రైస్తవులను హింసించాడు. పౌలు క్రైస్తవుడిగా మారటానికి ముందు, ఒక పరిసయ్యుడుగా ఉండేవాడు. క్రైస్తవుడిగా మారిన తరువాత, అతడు యేసుని గురించి ప్రజలకు ప్రకటిస్తూ రోమీయుల సామ్రాజ్యమంతట చాల సార్లు ప్రయాణము చేసాడు.
పౌలు కో కొరింథులో సంఘాన్ని ప్రారంభించాడు. అతను ఈ పత్రికను వ్రాసినప్పుడు ఎఫెసు పట్టణములో ఉన్నాడు.
కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక దేనిని గురించి వివరించుచున్నది?
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో కొరింథు పట్టణములోని క్రైస్తవుల మధ్య విభేదాల గురించి పౌలు వ్రాస్తూనే ఉన్నాడు. కొరింథీయులు అతని మునుపటి సూచనలను పాటించారని ఈ పత్రికలో స్పష్టమైంది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో, దేవుడిని సంతోష పెట్టే విధంగా జీవించమని పౌలు వారిని ప్రోత్సహించాడు.
సువార్త ప్రకటించడానికి యేసు క్రీస్తు తనను అపోస్తలుడిగా పంపించాడని పౌలు వారిని నమ్మించాడు. వారు దీనిని అర్థం చేసుకోవాలని పౌలు కోరుకున్నాడు, ఎందుకంటే యూద క్రైస్తవుల బృందం అతను చేస్తున్న పనిని వ్యతిరేకించారు. పౌలు దేవుని చేత పంపబడలేదనియు మరియు అతను ఒక తప్పుడు బోధను బోధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఈ యూద క్రైస్తవుల బృందం అన్యదేశములోని క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రమును పాటించాలని కోరుకున్నారు.
ఈ పత్రిక యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?
తర్జుమాచేయువారు ఈ పత్రికను “కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేక “కొరింథులో ఉన్న సంఘమునకు పౌలు వ్రాసిన 2వ పత్రిక” వంటి స్పష్టమైన పేరును ఎంచుకోవచ్చు.” (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు
\nకొరింథు పట్టణము ఎలా ఉండేది?
కొ రింథు పట్టణము ప్రాచీనమైన గ్రీసు దేశములోని ఒక ప్రధాన పట్టణమైయున్నది. ఇది మధ్యధర సముద్రము దగ్గర ఉన్నందున చాలా మంది ప్రయాణికులు మరియు వర్తకులు అక్కడ వస్తువులను కొనడానికి మరియు విక్రయించడానికి వచ్చేవారు. దీని ఫలితంగా పట్టణములో అనేక సంస్కృతుల ప్రజలు ఉన్నారు. అనైతిక మార్గాలలో నివసించే ప్రజలను కలిగి ఉండటానికి ఈ పట్టణం ప్రసిద్ది చెందింది. గ్రీకు ప్రేమ దేవత అయిన ఆఫ్రోడైటను ప్రజలు ఆరాధించేవారు. ఆఫ్రోడైటను గౌరవించే ఆచారంలో భాగంగా, ఆమె ఆరాధకులు ఆలయ వేశ్యలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారు.
“తప్పుడు అపోస్తలలు” అనగా ఏమని పౌలు చెప్పుచున్నాడు (11:13)?
వీరు యూద క్రైస్తవులు. క్రీస్తును అనుసరించడానికి అన్యదేశస్తులైన క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని వారు బోధించారు. క్రైస్తవ నాయకులు యెరుషలేములో సమావేశమై ఈ విషయం పై నిర్ణయం తీసుకున్నారు (చూడండి: అపోస్తలుల కార్యములు 15). ఏదేమైనా, యెరుషలేములో నాయకులు నిర్ణయించిన దానితో విభేదించే కొన్ని సమూహాలు ఇంకా ఉన్నాయని స్పష్టమైంది.
భాగము 3: ముఖ్యమైన తర్జుమా విషయాలు
ఏకవచనం మరియు బహువచనం “మీరు”
ఈ పత్రికలో, “నేను” అనే పదం పౌలును గురించి చెప్పబడింది. ఇక్కడ “నీవు” అనే పదం దాదాపుగా ఏకవచనమైయున్నది మరియు ఇది కొరింథులోని విశ్వాసులను గురించి తెలియచేస్తుంది. దీనికి రెండు మినహాయింపులు కలవు: 6:2 మరియు 12:9. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’ మరియు ‘మీరు’ రూపాలు)
యు.ఎల్.టి (ULT) లోని 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రికలో “పవిత్రం” మరియు “పరిశుద్ధపరచుట” అనే ఆలోచనలు ఎలా చెప్పబడుచున్నాయి?
వివిధ ఆలోచనలలో దేనినైన సూచించుటకు లేఖనాలు అలాంటి పదాలను ఉపయోగిస్తాయి. ఈ కారణంగా తర్జుమా చేయువారు వారి అనువాదంలో వాటిని బాగా తర్జుమా చేయడం చాల కష్టం అని చెప్పబడింది. ఆంగ్లలోకి తర్జుమా చేయడంలో యు.ఎల్.టి (ULT) ఈ క్రింది సూత్రాలను ఉపయోగిస్తుంది:
- కొన్ని సార్లు ఒక వాక్య భాగంలోని అర్థం నైతిక పవిత్రతను గురించి తెలియచేస్తుంది. విశేషముగా క్రైస్తవులు యేసు క్రీస్తుతో ఐక్యమైనందున దేవుడు క్రైస్తవులను పాపము చేయనివారిగా ఎంచటం సువార్తను అర్థం చేసుకోవడానికి చాల ముఖ్యమైనది. మరియొక సంబంధిత వాస్తవం ఏమిటంటే దేవుడు పరిపూర్ణుడు మరియు నిర్దోషియై యున్నాడు. మూడవ వాస్తవం ఏమిటంటే క్రైస్తవులు తమ జీవితంలో తమను తాము నిర్దోషులుగా, నిరపరాధులుగా వ్యవహరించాలి. ఈ సందర్భాలలో యు.ఎల్.టి (ULT) “పరిశుద్ధత” “పరిశుద్ధ దేవుడు” “పరిశుద్ధులు” లేక “పరిశుద్ద ప్రజలను” అనే పదాలను ఉపయోగిస్తుంది.
- 2వ కొరింథియులకు వ్రాసిన పత్రికలోని వాక్య భాగంలోని అర్థం ఎమిటంటే క్రైస్తవులు నింపిన ప్రత్యేక పాత్రను సూచించకుండా ఒక సాధారణ సంబంధం కలిగి ఉన్నారని చెప్పబడింది. ఈ సందర్భాలలో యు.ఎల్.టి (ULT) “విశ్వాసి” లేక “విశ్వాసులు” అనే పదాలను ఉపయోగిస్తుంది. (చూడండి: 1:1; 8:4; 9:1, 12; 13:13)
- కొన్నిసార్లు వాక్యభాగాములోని అర్థం ఎవరికైనా లేక దేవుని కోసం మాత్రమే వేరుగా ఉంచబడిన ఆలోచనను సూచిస్తుంది.\nఈ సందర్భాలలో, యు.ఎల్.టి (ULT) “వేరుచేయబడుట,” అంకితం చేయబడుట,” “ప్రత్యేకం చేయబడుట” లేక “పరిశుద్ధపరచబడుట.” అనే పదాలను ఉపయోగిస్తుంది.
తర్జుమా చేయువారు తమ స్వంత తర్జుమాలలో ఈ ఆలోచనలను ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నందున యు.ఎస్.టి (UST) తరచుగా సహాయపడుతుంది.
“క్రీస్తులో” మరియు “ప్రభువులో” అనే వాక్కుల అర్థం ఏమిటని పౌలు చెప్పుచున్నాడు?
ఈ రకమైన వాక్కులు 1:19, 20; 2:12, 17; 3:14; 5:17, 19, 21; 10:17; 12:2, 19; మరియు 13:4 అధ్యాయాలు కలిగియున్నవి. పౌలు క్రీస్తుతో మరియు విశ్వాసులతో ఐకమత్యముగా ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించి చెప్పాడు. అదే సమయములో, అతడు తరచుగా ఇతర అర్థాలను కూడా ఉద్దేశించి చెప్పాడు. ఉదాహరణకు “ప్రభువులో నా కోసం ఒక ద్వారం తెరువబడింది” (2:12)ఇక్కడ పౌలు చెప్పే మాటలకు అర్థం ప్రత్యేకంగా పౌలుకు ప్రభువు చేత ఒక ద్వారము తెరువబడిందని చెప్పుచున్నాడు.
ఈ రకమైన వాక్కుల గురించి మరిన్ని వివరాల కోసం రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క పరిచయమును చూడండి.
క్రీస్తులో “క్రొత్త సృష్టి” (5:17) అనే మాటకు అర్థం ఏమిటి?
ఒక వ్యక్తీ క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు క్రైస్తవులను “క్రొత్త ప్రపంచం”లో భాగం చేస్తాడని పౌలు సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడు పరిశుద్ధత, సమాధానము మరియు ఆనందం యొక్క క్రొత్త ప్రపంచాన్ని ఇస్తాడు. ఈ క్రొత్త ప్రపంచంలో విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన క్రొత్త స్వభావం ఉంటుంది. తర్జుమా చేయువారు ఈ ఆలోచనను వ్యక్తపరచడానికి ప్రయత్నించాలి.
2వ కొరింథియులకు వ్రాసిన పత్రికలోని కీలక విషయాలు ఏమిటి?
- “మరియు మీకు మా పట్ల ఉన్న ప్రేమలో” (8:7). యు.ఎల్.టి (ULT) మరియు యు.ఎస్.టి (UST) తో సహా చాలా తర్జుమాలు ఈ విధంగా చదవబడతాయి. అయినప్పటికీ, అనేక ఇతర తర్జుమాలు “మరియు మీ పట్ల మా ప్రేమలో” అని చదవబడ్డాయి. ప్రతి వాక్య భాగము నిజమైనదని బలమైన ఆధారాలు కలవు. తర్జుమా చయువారు తమ ప్రాంతంలోని ఇతర తర్జుమాలు ఇష్టపడే వాక్యాన్ని అనుసరించాలి.
(చూడండి: మూల గ్రంథం వైవిధ్యాలు)
2 Corinthians 1
2వకొరింథీయులకు వ్రాసిన పత్రిక 01 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
మొదటి భాగము పురాతనమైన తూర్పు దగ్గర ఒక పత్రికను ప్రారంభించడానికి ఒక సాధారణ మార్గాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రత్యేక అంశాలు
పౌలు యొక్క సమగ్రత
ప్రజలు పౌలును విమర్శిస్తూ ఆయనకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అతను ఏమి చేస్తున్నాడో తన ఉద్దేశాలను వివరిస్తూ వాటిని ఖండిచాడు.
ఆదరణ
ఈ అధ్యాయములో ఆదరణ అనేది కీలక విషయమైయున్నది. పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులను ఓదార్చుచున్నాడు. కొరింథీయులు బహుశ భాదపడియుంటారు మరియు వారిని ఓదార్చాల్సిన అవసరం ఉంది.
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
అలంకారిక ప్రశ్న
పౌలు చిత్త శుద్ధి లేని ఆరోపణకు వ్యతిరేకంగా తనను తానూ రక్షించుకొనుటకు రెండు అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
మనము
పౌలు “మనము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు.\n ఇది బహుశః తిమోతి మరియు తన గురించి తెలియచేస్తుంది. ఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.
అభయము
పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవుని నిత్యజీవానికి ప్రతిజ్ఞ లేక తక్కువ చెల్లింపు అని అభయమును ఇస్తున్నట్లు పౌలు చెప్పుచున్నాడు. క్రైస్తవులు నిశ్చయముగా రక్షించబడ్డారు. వారు చనిపోయిన తరువాతవరకు దేవుడు ఇచ్చిన వాగ్దానములన్నిటిని అనుభవించరు. ఇది జరుగునని పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగత అభయమైయున్నాడు. ఈ ఆలోచన వ్యాపారము అనే మాటనుండి వచ్చింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ధనమును తిరిగి చెల్లిస్తాడని “అభయంగా” కొంత విలువైన వస్తువును ఇస్తాడు. (చూడండి: నిత్యత్వం, శాశ్వతమైన, నిత్యమైన, శాశ్వతంగా మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
2 Corinthians 1:1
కొరింథీలోని సంఘానికి పౌలు వందన వచనము చెప్పిన తరువాత యేసు క్రీస్తు ద్వారా శ్రమ మరియు ఆదరణ గురించి వ్రాసాడు. తిమోతి అతనితో పాటు ఉన్నాడు. ఈ పత్రిక అంతట “మీరు” అనే పదం కొరింథీలోని సంఘస్తులను మరియు ఆ ప్రాంతములోని మిగిలిన క్రైస్తవులను గురించి తెలియచేస్తుంది. పౌలు చెప్పిన మాటలను తిమోతి తోలు కాగితముపై వ్రాసి యుండవచ్చు.
Παῦλος…τῇ ἐκκλησίᾳ τοῦ Θεοῦ τῇ οὔσῃ ἐν Κορίνθῳ
మీ భాష ఒక పత్రిక రచయితను మరియు దానిని ఉద్దేశించిన ప్రేక్షకులను పరిచయము చేయడానికి ఒక ముఖ్యమైన మార్గాన్ని కలిగి ఉండవచ్చు అని వ్రాయబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు అను నేను ... కొరింతుథీలో ఉన్న దేవుని సంఘములో ఉన్న మీకు ఈ పత్రికను వ్రాసాను”
Τιμόθεος ὁ ἀδελφὸς
పౌలు మరియు కొరింథీయులకు ఇద్దరికీ తిమోతి గురించి తెలుసు మరియు ఆయనను వారు ఆత్మీయ సహోదరుడిగా భావించారాని ఇది తెలియచేస్తుంది
Ἀχαΐᾳ
ఇది ఆధునిక గ్రీసు దేశముయొక్క దక్షిణ భాగములోని రోమన్ దేశములోని ఒక పేరై యున్నది (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Corinthians 1:2
χάρις ὑμῖν καὶ εἰρήνη
ఇది పౌలు తన పత్రికలో ఉపయోగించే సాధారణ అభినందనయై యున్నది.
2 Corinthians 1:3
εὐλογητὸς ὁ Θεὸς καὶ Πατὴρ τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవునికి మనము ఎల్లప్పుడూ స్తుతి చేల్లించుదుము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ Θεὸς καὶ Πατὴρ
తండ్రియైన దేవుడు
ὁ Πατὴρ τῶν οἰκτιρμῶν καὶ Θεὸς πάσης παρακλήσεως
ఈ రెండు వాక్యాలు ఒకే ఆలోచనను రెండు రకాలుగా వ్యక్తపరుస్తాయి. రెండు వాక్యాలు దేవుని గురించి తెలియచేస్తాయి. (చూడండి: సమాంతరత)
ὁ Πατὴρ τῶν οἰκτιρμῶν καὶ Θεὸς πάσης παρακλήσεως
సాధ్యమైయ్యే అర్థాలు 1) “దయ” మరియు “ “అన్ని విధాలా ఆదరణ” అనే పదాలు “తండ్రి” మరియు “దేవుని” స్వభావమును వివరిస్తాయి. లేక 2) “తండ్రి” మరియు “దేవుడు” అనే పదాలు “దయ” మరియు “అన్ని విధాలా ఆదరణ”కు మూలం అయిన వ్యక్తిని గురించి తెలియచేయబడింది
2 Corinthians 1:4
παρακαλῶν ἡμᾶς ἐπὶ πάσῃ τῇ θλίψει ἡμῶν
ఇక్కడ “మాకు” మరియు “మా” అనే పదాలలో కొరింథీయులు చేర్చబడ్డారు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
2 Corinthians 1:5
ὅτι καθὼς περισσεύει τὰ παθήματα τοῦ Χριστοῦ εἰς ἡμᾶς
క్రీస్తు బాధలను గురించి పౌలు అవి సంఖ్యలో పెరిగే వస్తువులవలె ఉన్నవని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మన కోసమే ఎంతో బాధ పడ్డాడు” (చూడండి: రూపకం)
τὰ παθήματα τοῦ Χριστοῦ
సాధ్యమైయ్యే అర్థాలు 1) పౌలు మరియు తిమోతి క్రీస్తును గురించిన సందేశాన్ని బోధించినందున వారు అనుభవించిన బాధలను ఇది తెలియచేస్తుంది లేక 2) ఇది వారి తరపున క్రీస్తు అనుభవించిన బాధలను తెలియచేస్తుంది.
περισσεύει…ἡ παράκλησις ἡμῶν
పౌలు ఆదరణను గురించి అది పరిమాణం అధికమయ్యే వస్తువులా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
2 Corinthians 1:6
εἴτε δὲ θλιβόμεθα
ఇక్కడ “మేము” అనే పదం పౌలు మరియు తిమోతిలను గురించి తెలియచేస్తుంది, కాని కొరింథీయులను గురించి కాదు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని జనులు మనలను బాధపెడితే” (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’ మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
εἴτε παρακαλούμεθα
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనకు ఆదరణ కలిగిస్తే” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῆς ὑμῶν παρακλήσεως, τῆς ἐνεργουμένης
మీరు సమర్థవంతమైన ఆదరణను అనుభవిస్తారు
2 Corinthians 1:8
οὐ…θέλομεν ὑμᾶς ἀγνοεῖν
దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము” (చూడండి: ద్వంద్వ నకారాలు)
ὅτι καθ’ ὑπερβολὴν ὑπὲρ δύναμιν ἐβαρήθημεν
పౌలు మరియు తిమోతి వారి నిరాశ యొక్క భావోద్వేగాలను వారు మోయవలసిన అధికమైన భారములాగా ఉన్నాడని తెలియచేస్తున్నారు. (చూడండి: రూపకం)
ὑπερβολὴν…ἐβαρήθημεν
“కృంగిపోవుట” అనే పదం నిరాశ భావనను తెలియపరుస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అనుభవించిన బాధలు మమ్మును పూర్తిగా కృంగదీసాయి” లేక “మేము పూర్తి నిరాశలో ఉన్నాము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 1:9
αὐτοὶ ἐν ἑαυτοῖς τὸ ἀπόκριμα τοῦ θανάτου ἐσχήκαμεν
పౌలు మరియు తిమోతి తమ నిరాశ భావనను మరణానికి ఖండించిన ఒకరితో పోల్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోవడాన్ని ఖండించిన వ్యక్తిలా మేము నిరాశలో ఉన్నాము” (చూడండి: రూపకం)
ἀλλ’ ἐπὶ τῷ Θεῷ
“మా నమ్మకాన్ని ఉంచండి” అనే పదాలు ఈ వాక్య భాగానికి దూరంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “బదలుగా, దేవునిపై మన నమ్మకం ఉంచడానికి” (చూడండి: శబ్దలోపం)
τῷ ἐγείροντι τοὺς νεκρούς
ఇక్కడ లేవనెత్తుట అనేది మరణించిన వ్యక్తిని మళ్ళి సజీవంగామార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన వారిని తిరిగి జీవించడానికి కారణమైయ్యేవారు” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 1:10
θανάτου
పౌలు తన నిరాశ భావనను వారు అనుభవించిన కష్టాల ఫలితంగా ఘోరమైన అపాయానికి లేక భయంకరమైన ప్రమాదానికి పోల్చారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిరాశ” (చూడండి: రూపకం)
ἔτι ῥύσεται
ఆయన మమ్మల్ని రక్షించడాని కొనసాగిస్తాడు
2 Corinthians 1:11
συνυπουργούντων καὶ ὑμῶν ὑπὲρ ἡμῶν
కొరింథీ సంఘస్తులు, మీరు కూడా మాకు సహాయం చేస్తున్నందున దేవుడు మమ్మల్ని ప్రమాదం నుండి రక్షిస్తాడు
τὸ εἰς ἡμᾶς χάρισμα
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు కృపగల అనుగ్రహమును మనకు ఇచ్చాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 1:12
ఈ వచనాలలో పౌలు తనను మరియు తిమోతిని మరియు వారితో పనిచేసిన ఇతరులను గురించి తెలియచేయుటకు “మనం”, “మన”, “మనమే” మరియు “మాకు” అనే పదాలను ఉపయోగిస్తాడు. ఈ మాటలలో అతను వ్రాస్తున్న వ్యక్తులను చేర్చలేదు. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
ἡ γὰρ καύχησις ἡμῶν αὕτη ἐστίν
ఇక్కడ “అతిశయం” అనే పదాన్ని ఏదో ఒకదానిలో గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవించే సానుకూల అర్థంలో ఉపయోగించబడింది.
τὸ μαρτύριον τῆς συνειδήσεως ἡμῶν
పౌలు తన మనస్సాక్షి గురించి మాట్లాడగల వ్యక్తిలాగా ఉంటే తాను అపరాధ భావంతో మాట్లాడటం లేదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన మనస్సాక్షి ద్వారా మనకు తెలుసు” (చూడండి: మానవీకరణ)
οὐκ ἐν σοφίᾳ σαρκικῇ, ἀλλ’ ἐν χάριτι Θεοῦ
ఇక్కడ “మాంసం” అనేది మనుష్యులను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము లౌకిక జ్ఞానంపై ఆధారపడలేదు కాని దేవుని కృప పై అధారపడ్డాము” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 1:13
οὐ γὰρ ἄλλα γράφομεν ὑμῖν, ἀλλ’ ἢ ἃ ἀναγινώσκετε ἢ καὶ ἐπιγινώσκετε
దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీకు వ్రాసే సంగతులన్ని మీరు చదవవచ్చు మరియు అర్థం చేసుకోవచ్చు” (చూడండి: జంట వ్యతిరేకాలు)
2 Corinthians 1:14
καύχημα ὑμῶν
ఇక్కడ “గొప్పలు” అనే పదాన్ని ఎదో ఒకదానిలో గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవించే సానుకూల అర్థంలో ఉపయోగించబడింది.
2 Corinthians 1:15
పౌలు కొరింథీయులకు 3 పత్రికలను వ్రాసాడు. కొరింథీకు 2 పత్రికలూ మాత్రమే పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయబడ్డాయి.
పౌలు తన మొదటి పత్రిక తరువాత కొరింథీలోని విశ్వాసులను చూడటానికి మంచి ఉద్దేశ్యాలతో తన హృదయ పూర్వక నిరిక్షణను వివరించాడు.
ταύτῃ τῇ πεποιθήσει
“ఇది” అనే పదం కొరింథీయుల గురించి పౌలు యొక్క మునుపటి విమర్శలను తెలియచేస్తుంది.
δευτέραν χάριν σχῆτε
నేను మిమ్మల్ని రెండు సార్లు సందర్శించడం ద్వార మీరు ప్రయోజనం పొందవచ్చు
2 Corinthians 1:16
ὑφ’ ὑμῶν προπεμφθῆναι εἰς τὴν Ἰουδαίαν
యూదయకు వెళ్ళేటప్పుడు నాకు సహాయం చేయండి
2 Corinthians 1:17
μήτι ἄρα τῇ ἐλαφρίᾳ ἐχρησάμην?
కొరింథీయులను ఖండితముగా సందర్శించాలనే నిర్ణయం తనకు ఉందని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఒక ప్రశ్నకు ఆనుకున్న సమాధానం కాదు అని వ్రాయబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సందేహించలేదు.” లేక “నా నిర్ణయములో నాకు నమ్మకం ఉంది.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἢ ἃ βουλεύομαι, κατὰ σάρκα βουλεύομαι, ἵνα ᾖ παρ’ ἐμοὶ τὸ ναὶ, ναὶ, καὶ τὸ οὒ, οὔ?
పౌలు కొరింథీయులను సందర్శించాలనే తన ప్రణాళికలు నిజాయితీగా ఉన్నాయని నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మనుష్యుల ప్రమాణాల ప్రకారం విషయాలను యోచన చేయను... అదే సమయములో” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἢ ἃ βουλεύομαι, κατὰ σάρκα βουλεύομαι, ἵνα ᾖ παρ’ ἐμοὶ τὸ ναὶ, ναὶ, καὶ τὸ οὒ, οὔ?
పౌలు తానూ సందర్శిస్తాననియు మరియు అదే సమయములో సందర్శించనని రెండిటిని చెప్పలేదని దీని అర్థం. “అవును” మరియు “కాదు” అనే పదాలు నొక్కి చెప్పటం కోసం పునరావృతమౌతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను విషయాలను ఆలోచన చేయను ... తద్వారా ‘అవును నేను తప్పకుండ సందర్శిస్తాను’ మరియు ‘లేదు నేను నిశ్చయముగా సందర్శించను’ అని చెప్పాను!” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు జంటపదం)
2 Corinthians 1:19
ὁ τοῦ Θεοῦ γὰρ Υἱὸς, Ἰησοῦς Χριστός…οὐκ ἐγένετο ναὶ καὶ οὒ, ἀλλὰ ναὶ ἐν αὐτῷ γέγονεν.
యేసు దేవుని వాగ్దానాల గురించి అవును అని అంటాడు. అంటే అవి నిజమని ఆయన హామీ ఇస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారుని కోసం ... దేవుని వాగ్దానాలకు సంబంధించి ‘అవును’ మరియు ‘కాదు’ అని చెప్పలేదు. ప్రతిగా, అతను ఎల్లప్పుడూ ‘అవును’ అని చెప్పును.” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ τοῦ Θεοῦ…Υἱὸς
ఇది యేసును దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరైయున్నది (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
2 Corinthians 1:20
ὅσαι…ἐπαγγελίαι Θεοῦ, ἐν αὐτῷ τὸ ναί
దేవుని వాగ్దానాలన్నింటికి యేసు హామీ ఇస్తున్నాడని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాగ్దానాలన్ని యేసు క్రీస్తులో హామీ ఇచ్చాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν αὐτῷ τὸ ναί…δι’ αὐτοῦ…δι’ ἡμῶν
“అతడు” అనే పదం యేసు క్రీస్తును గురించి చెప్పబడింది
2 Corinthians 1:21
ὁ δὲ βεβαιῶν ἡμᾶς σὺν ὑμῖν εἰς Χριστὸν καὶ χρίσας ἡμᾶς Θεός
సాధ్యమయ్యే అర్థాలు 1) “మనం క్రీస్తులో ఉన్నందున దేవుడు ఒకరితో ఒకరికి మనకున్న సంబంధాన్ని స్థిరపరచును.” లేక 2) “క్రీస్తుతో మా సంబంధాన్ని మరియు మీ సంబంధాన్ని స్థిరపరచేది దేవుడే.”
χρίσας ἡμᾶς
సాధ్యమైయ్యే అర్థాలు 1) “సువార్తను ప్రకటించడానికి మనలను పంపాడు” లేక 2) “ఆయన మనలను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు.”
2 Corinthians 1:22
ὁ καὶ σφραγισάμενος ἡμᾶς
మనం ఆయనకు చెందినవారనడానికి సంకేతంగా దేవుడు మనపై ఒక ముద్ర వేసినట్లుగా మనము ఆయనకు చెందినవారని దేవుని గురించి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు తన యాజమాన్యము యొక్క ముద్రను మనపై వేసాడు” లేక “మనము ఆయనకు చెందినవారమని ఆయన చూపించాడు” (చూడండి: రూపకం)
δοὺς τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος ἐν ταῖς καρδίαις ἡμῶν
ఇక్కడ “హృదయాలు” అనే పదం ఒక వ్యక్తి యొక్క లోపలి భాగం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం జీవించడానికి ప్రతి ఒక్కరిలో ఆత్మను ఉంచాడు. (చూడండి: అన్యాపదేశము)
τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος
అతను నిత్యజీవానికి పాక్షికంగా చెల్లించునట్లుగా ఆత్మ చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
2 Corinthians 1:23
ἐγὼ δὲ μάρτυρα τὸν Θεὸν ἐπικαλοῦμαι ἐπὶ τὴν ἐμὴν ψυχήν
“నిరూపించు” అనే పదం వాదనను పరిష్కరించడానికి వారు చూసిన లేక విన్నవాటిని చెప్పే వ్యక్తిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పేది నిజమని చూపించమని దేవునిని అడుగుచున్నాను”
ὅτι φειδόμενος ὑμῶν
నేను మీకు ఎక్కువ నొప్పిని కలిగించక పోవచ్చు
2 Corinthians 1:24
συνεργοί ἐσμεν τῆς χαρᾶς ὑμῶν
మీకు ఆనందం కలిగించుట కోసం మేము మీతో కలిసి పని చేస్తున్నాము
τῇ…πίστει ἑστήκατε
“నిలచుట”అనే పదం మారనిదాన్ని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ విశ్వాసములో స్థిరంగా ఉండండి” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 2
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 02 అధ్యాయములోని సాధారణ గమనికలు
ప్రత్యేక అంశాలు
కఠినమైన రచన
ఈ అధ్యాయములో పౌలు ముందుగా కొరింథీయులకు వ్రాసిన పత్రికను గురించి తెలియచెసాడు. ఆ పత్రికలో కఠినమైన దిద్దుబాటుగల స్వరం ఉంది. మొదటి కొరింథీయులకు అని పిలువబడే పత్రిక తరువాత పౌలు దీనిని వ్రాసి ఉండవచ్చు మరియు ఈ పత్రిక ముందు అని చెప్పబడింది. తప్పు చేసిన సభ్యుడిని మందలించాల్సి ఉందని ఆయన సూచిస్తున్నారు. పౌలు ఇప్పుడు ఆ వ్యక్తీ పట్ల దయ చూపమని వారిని ప్రోత్సహిస్తున్నాడు. (చూడండి:కృప, కృపగల మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
సువాసన
తీయటి సువాసన ఒక ఆహ్లాదకరమైన వాసన. దేవునికి నచ్చే విషయాలను సువాసన కలిగి ఉన్నట్లు లేఖనం తరచుగా వివరించుచున్నది.
2 Corinthians 2:1
వారిపై ఆయనకున్న గొప్ప ప్రేమ కారణంగా, పౌలు తన మొదటి పత్రికలో తన మందలింపు (అనైతికత యొక్క పాపాన్ని వారు అంగికరించినందుకు మందలించడం) కొరింథీలోని సంఘస్తులకు మరియు అనైతిక మనిషికి మరియు అతనికి బాధ కలిగించిందని స్పష్టం చేస్తున్నాడు
ἔκρινα γὰρ ἐμαυτῷ
నేను నిర్ణయం తీసుకున్నాను
ἐν λύπῃ
మీకు బాధ కలిగించే పరిస్థితులలో
2 Corinthians 2:2
εἰ γὰρ ἐγὼ λυπῶ ὑμᾶς, καὶ τίς ὁ εὐφραίνων με, εἰ μὴ ὁ λυπούμενος ἐξ ἐμοῦ?
పౌలు వారి యొద్దకు రావడం వలన అతనికి లేక వారికి ప్రయోజనం ఉండదు అన్న అలంకారిక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు బాధ కలిగించినట్లయితే నేను బాధ పెట్టినవారే నన్ను సంతోషపరచగలరు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὁ λυπούμενος ἐξ ἐμοῦ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను బాధ పరచిన వ్యక్తి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 2:3
ἔγραψα τοῦτο αὐτὸ
కొరింథీలోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన అస్తిత్వములో లేని మరొక పత్రికను ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా మొదటి పత్రికలో నేను వ్రాసాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μὴ…λύπην σχῶ ἀφ’ ὧν ἔδει με χαίρειν
పౌలుకు మానసిక బాధను కలిగించే కొరింథీలోని విశ్వాసుల ప్రవర్తన గురించి పౌలు చెప్పుచున్నాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను సంతోష పెట్టేవారు నన్ను బాధించక పోవచ్చు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡ ἐμὴ χαρὰ πάντων ὑμῶν ἐστιν
నాకు సంతోషాన్ని కలిగించేది మీకు ఆనందాన్ని ఇస్తుంది
2 Corinthians 2:4
ἐκ γὰρ πολλῆς θλίψεως
ఇక్కడ బాధ అనే పదం మానసిక వేదనను గురించి తెలియచేస్తుంది
συνοχῆς καρδίας
ఇక్కడ “హృదయం” అనే పదం భావోద్వేగాల స్థానం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీవ్రమైన దుఃఖముతో” (చూడండి: అన్యాపదేశము)
διὰ πολλῶν δακρύων
అధికమైన కన్నిళ్ళతో
2 Corinthians 2:6
ἱκανὸν τῷ τοιούτῳ ἡ ἐπιτιμία αὕτη, ἡ ὑπὸ τῶν πλειόνων
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. “శిక్ష అనే పదానికి క్రియాపదాన్ని ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆధిక్యతగా ఆ వ్యక్తిని శిక్షించిన విధానం సరిపోతుంది అని వ్రాయబడింది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు భావనామాలు)
ἱκανὸν
సరిపోతుంది
2 Corinthians 2:7
μή…τῇ περισσοτέρᾳ λύπῃ, καταποθῇ
అధిక దుఃఖము యొక్క బలమైన భావోద్వేగ ప్రతిస్పందన అని దీని అర్థం. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిక దుఃఖం అతని ముంచివేయదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 2:8
పౌలు కొరింథులోని సంఘము ప్రేమను చూపించమని మరియు వారు శిక్షించిన వ్యక్తిని క్షమించమని ప్రోత్సహిస్తాడు. అతడు కూడా తనను క్షమించాడని వ్రాస్తాడు.
κυρῶσαι εἰς αὐτὸν ἀγάπην
దీని అర్థం వారు విశ్వాసులందరి సమక్షములో ఈ మనిషి పట్ల తమకున్న ప్రేమను స్థిరపరచాలి.
2 Corinthians 2:9
εἰς πάντα ὑπήκοοί ἐστε
సాధ్యమైయ్యే అర్థాలు 1) “మీరు అన్ని విషయాలలో విధేయులై ఉంటారు” లేక 2) “నేను మీకు నేర్పించిన ప్రతిదానికి మీరు విధేయులైయుంటారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 2:10
δι’ ὑμᾶς
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ కోసమే నేను క్షమించాను” (చూడండ్: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
δι’ ὑμᾶς
సాధ్యమైయ్యే అర్థాలు 1) “మీ పట్ల నాకున్న ప్రేమనుండి క్షమించబడింది” లేక 2) ”మీ ప్రయోజనం కోసం క్షమించబడింది.”
2 Corinthians 2:11
οὐ γὰρ αὐτοῦ τὰ νοήματα ἀγνοοῦμεν
పౌలు వ్యతిరేకతను నొక్కి చెప్పుటకు ప్రతికూల వాక్కులను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని ఆలోచనలు మనకు బాగా తెలుసు” (చూడండి: ద్వంద్వ నకారాలు)
2 Corinthians 2:12
పౌలు కొరింథులోని విశ్వాసులను త్రోయ మరియు మాసిదోనియ పట్టణాలలో సువార్త ప్రకటించడానికి తనకు లభించిన అవకాశాలను తెలియచేస్తూ వారిని ప్రోత్సహిస్తాడు
εἰς τὸ εὐαγγέλιον τοῦ Χριστοῦ, καὶ θύρας μοι ἀνεῳγμένης ἐν Κυρίῳ
పౌలు నడవడానికి అనుమతించిన ఒక ద్వారంలాగా అని తాను సువార్త ప్రకటించే అవకాశం గురించి మాట్లాడుతున్నాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నాకొక ద్వారము తెరిచాడు ... సువార్త ప్రకటించడానికి” లేక “ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు ... సువార్తను ప్రకటించడానికి” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 2:13
οὐκ ἔσχηκα ἄνεσιν τῷ πνεύματί μου
నా మనస్సు కలవార పడింది లేక “నేను చింతించాను”
Τίτον τὸν ἀδελφόν μου
పౌలు తీతును తన ఆధ్యాత్మిక సహోదరుడని చెప్పుచున్నాడు
ἀλλὰ ἀποταξάμενος αὐτοῖς
కాబట్టి నేను త్రోయ పట్టణపు ప్రజలను విడచిపెట్టాను
2 Corinthians 2:14
τῷ…Θεῷ…τῷ πάντοτε θριαμβεύοντι ἡμᾶς ἐν τῷ Χριστῷ
పౌలు విజయ సూచకమైన తన ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న విజయవంతమైన ప్రాముఖ్యమైన మరియు తనను మరియు అతని జతపనివారును ఆ ఊరేగింపులో పాల్గొనేవారిగా ఉన్నారని చెప్పబడ్డాయి. సాధ్యమైయ్యే అర్థాలు 1) “దేవుడు, క్రీస్తులో ఎల్లప్పుడూ ఉన్న మనకు తన విజయాలలో పాలు పంపులు ఇస్తాడు” లేక 2) “ దేవుడు, క్రీస్తులో ఉన్నవారిని ఎల్లప్పుడూ విజయం సాధించిన వారిలాగే మనలను విజయవంతం చేస్తాడు” (చూడండి: రూపకం)
τὴν ὀσμὴν τῆς γνώσεως αὐτοῦ, φανεροῦντι δι’ ἡμῶν ἐν παντὶ τόπῳ
పౌలు క్రీస్తు జ్ఞానం గురించి ఆహ్లాదకరమైన వాసన పరిమళంగా ఉందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధూపం వేయడం యొక్క తీయటి వాసన దాని దగ్గర ఉన్న ప్రతియొక్కరికి గుబాళించినట్లే, క్రీస్తు జ్ఞానం గురించి మనము చెప్పుట విన్న ప్రతి ఒక్కరికి గుబాళిస్తుంది” (చూడండి: రూపకం)
φανεροῦντι…ἐν παντὶ τόπῳ
అతడు వ్యాపిస్తాడు ... మనం వెళ్ళిన ప్రతి చోటు
2 Corinthians 2:15
Χριστοῦ εὐωδία ἐσμὲν τῷ Θεῷ
పౌలు తన పరిచర్య గురించి ఒకరు దేవునికి అర్పించే దహనబలి అని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
Χριστοῦ εὐωδία ἐσμὲν τῷ Θεῷ
సాధ్యమైయ్యే అర్థాలు 1) “క్రీస్తు జ్ఞానం అయిన తీయటి సువాసన” లేక 2) “క్రీస్తు అనుగ్రహించే తీయటి సువాసన.”
τοῖς σῳζομένοις
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు విమోచించిన వారిని” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 2:16
ὀσμὴ
క్రీస్తు జ్ఞానం అనేది ఒక సువాసనగా ఉన్నది. ఇది తిరిగి 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2:14 ను సూచిస్తుంది. ఇక్కడ పౌలు క్రీస్తు జ్ఞానం గురించి ఆహ్లాదకరమైన వాసన ఉన్న పరిమళంగా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ὀσμὴ ἐκ θανάτου εἰς θάνατον
సాధ్యమైయ్యే అర్థాలు 1) “మరణం” అనే పదం నొక్కి చెప్పుటకు పునరావృతమవుతుంది మరియు ఈ వాక్య భాగం యొక్క అర్థం “మరణానికి” కారణమైన సువాసన లేక 2) “మరణం యొక్క సువాసన మనుష్యులను మరణించేలా చేస్తుంది” (చూడండి: జంటపదం)
οἷς
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు విమోచిస్తున్న వారిని” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὀσμὴ ἐκ ζωῆς εἰς ζωήν
సాధ్యమైయ్యే అర్థాలు 1) 1) “జీవం” అనే పదం నొక్కి చెప్పుటకు పునరావృతమవుతుంది మరియు ఈ వాక్య భాగం యొక్క అర్థం “జీవమును ఇచ్చే సువాసన” లేక 2) మనుష్యులకు జీవమునిచ్చే సువాసన” (చూడండి: జంటపదం)
πρὸς ταῦτα τίς ἱκανός?
దేవుడు పిలిచినవారు పరిచర్య చేయుటకు ఎవరు యోగ్యులు కాదని నొక్కి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విషయాలకు ఎవరు యోగ్యులు కాదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
2 Corinthians 2:17
καπηλεύοντες τὸν λόγον τοῦ Θεοῦ
ఇక్కడ వాక్యం అనేది “సందేశానికి” మారు పేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుని సందేశాన్ని అమ్మెస్తారు”
εἰλικρινείας
మంచి ఉద్దేశ్యాలు
ἐν Χριστῷ λαλοῦμεν
మేము క్రీస్తుతో చేరిన వ్యక్తులుగా మాట్లాడతాము లేక “క్రీస్తు అధికారంతో మాట్లాడతాము”
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పంపిన వ్యక్తులుగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κατέναντι Θεοῦ
పౌలు మరియు అతని జతపనివారు దేవుడు వారిని చుస్తున్నడనే అవగాహనతో సువార్తను ప్రకటిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము దేవుని ఎదుట బోధిస్తాము” (చూడండి: శబ్దలోపం)
2 Corinthians 3
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 03 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
పౌలు తన రక్షణను కొనసాగిస్తున్నాడు. పౌలు కోరినట్లు క్రైస్తవులను తన పనికి రుజువుగా భావిస్తాడు.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
మోషే ధర్మశాస్త్రము
దేవుడు రాతి పలకలపై పది ఆజ్ఞలను ఇవ్వడం గురించి పౌలు ఉల్లేఖించుచున్నాడు. ఇది మోషే ధర్మశాస్త్రం గురించి తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము దేవునినుండి వచ్చినందున మంచిదైయున్నది. ఇశ్రాయేలీయులు దానికి అవిధేయత చూపినందున దేవుడు వారిని శిక్షించాడు. పాత నిబంధన ఇంకా తర్జుమా చేయబడక పోతే తర్జుమా చేయువారు ఈ అధ్యాయమును అర్థం చేసుకొనుట కష్ట తరంగా ఉంటుంది. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం మరియు నిబంధన మరియు బయలుపరచు, బయలు పరచబడడం, ప్రత్యక్షత)
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
రూపకఅలంకారాలు
పౌలు క్లిష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించుటకు ఈ అధ్యాయములో ఉపయోగించిన అనేక రూపకఅలంకారాలను ఉపయోగిస్తాడు. పౌలు బోధలను ఇది సులభతరం చేస్తుందా లేక అర్థం చేసుకోవడం చాల కష్టతరంగా ఉంటుందా అనేది అస్పష్టంగా ఉంది. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
“ఇది పత్రిక యొక్క నిబంధన కాదు కాని పరిశుద్దాత్మ యొక్క నిబంధనయైయున్నది.”
పౌలు పాత మరియు క్రొత్త నిబంధనలకు వ్యత్యాసము చూపుచున్నాడు. క్రొత్త నిబంధన నియమాల క్రమం వ్యవస్థ కాదు. ఇక్కడ “ఆత్మ” అనేది బహుశః పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియచేస్తుంది. ఇది ప్రకృతిలో “ఆధ్యాత్మికం”గా ఉన్న క్రొత్త నిబంధన అని కూడా తెలియచేస్తుంది. (చూడండి: ఆత్మ, గాలి, శ్వాస)
2 Corinthians 3:1
పౌలు క్రీస్తు ద్వారా చేసిన పనులను గురించి తాను గొప్పగా చెప్పుకోవడం లేదని వారికి గుర్తు చేస్తున్నాడు.
ἀρχόμεθα πάλιν ἑαυτοὺς συνιστάνειν?
పౌలు తమ గురించి గొప్పగా చెప్పుకోవడం లేదని నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మల్లి మమ్మును ప్రశంసించడం ప్రారంభించడం లేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἢ μὴ χρῄζομεν, ὥς τινες, συστατικῶν ἐπιστολῶν πρὸς ὑμᾶς ἢ ἐξ ὑμῶν?
పౌలు మరియు తిమోతికి ఉన్న మంచి పేరు కొరింథీయులకు ఇప్పటికే తెలుసనీ వ్యక్తపరచడానికి పౌలు ఇలా చెప్పాడు. ప్రశ్న ప్రతికూలమైన సమాధానాన్ని పురికొల్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంత మంది చేయునట్లుగా పరిచయ లేఖలు మీకు లేక మీ నుండి మాకు ఖచ్చితముగా అవసరం లేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
συστατικῶν ἐπιστολῶν
ఈ పత్రిక ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని పరిచయము చేయుటకు మరియు వారి అనుమతిని ఇవ్వడానికి వ్రాసే పత్రికయైయున్నది.
2 Corinthians 3:2
ἡ ἐπιστολὴ ἡμῶν ὑμεῖς ἐστε
పౌలు కొరింథీయుల గురించి పరిచయ లేఖలు వారే అని చెప్పుచున్నాడు. వారు విశ్వాసులుగా మారడం పౌలు పరిచర్యను ఇతరులకు స్థిరపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు మీరే మా పరిచయ లేఖలై యున్నారు” (చూడండి: రూపకం)
ἐνγεγραμμένη ἐν ταῖς καρδίαις ἡμῶν
ఇక్కడ “హృదయాలు” అనే పదం వారి ఆలోచనలను మరియు భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులు తమ పరిచయ లేఖ అని పౌలు మరియు అతని జతపనివారికి ఖచ్చితంగా తెలుసు లేక 2) పౌలు మరియు అతని జతపనివారు కొరింథీయుల పట్ల చాల లోతుగా శ్రద్ధ వహిస్తారు (చూడండి: అన్యాపదేశము)
ἐνγεγραμμένη ἐν ταῖς καρδίαις ἡμῶν
దీనిని క్రియాశీల రూపంలో “క్రీస్తు”తో సూచించబడిన అంశముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు మన హృదయాలపై వ్రాసాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
γινωσκομένη καὶ ἀναγινωσκομένη ὑπὸ πάντων ἀνθρώπων
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరికి తెలుసు మరియు వారు చదవగలరు. (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 3:3
ἐστὲ ἐπιστολὴ Χριστοῦ
పత్రిక వ్రాసింది క్రీస్తు అని పౌలు స్పష్టం చేసాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు క్రీస్తు వ్రాసిన లేఖయై యున్నారు. (చూడండి: రూపకం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
διακονηθεῖσα ὑφ’ ἡμῶν
మా ద్వార తీసుకొని వచ్చినవి
ἐνγεγραμμένη οὐ μέλανι…ἐν πλαξὶν καρδίαις σαρκίναις
కొరింథీయులు శారీరిక వస్తువులతో మానవులు వ్రాసే లేఖలాంటివారు కాదని, ఆధ్యాత్మిక లేఖలాంటివారని పౌలు స్పష్టం చేసాడు
ἐνγεγραμμένη οὐ μέλανι, ἀλλὰ Πνεύματι Θεοῦ ζῶντος
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు సిరాతో వ్రాసిన లేఖ కాదు గాని జీవం గల దేవుని ఆత్మతో వ్రాసిన లేఖ” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు శబ్దలోపం)
οὐκ ἐν πλαξὶν λιθίναις, ἀλλ’ ἐν πλαξὶν καρδίαις σαρκίναις
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు రాతి పలకలపై చెక్కిన లేఖ కాదు జీవం గల దేవుడు మానవ హృదయమనే పలకలపై వ్రాసిన లేఖయై యున్నది” (చూడండి : కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు శబ్దలోపం)
πλαξὶν καρδίαις σαρκίναις
పౌలు వారి హృదయాలను గురించి దానిపై అక్షరాలను చెక్కుకో గల చదునైన రాయి లేక మట్టి ముక్కలని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
2 Corinthians 3:4
πεποίθησιν δὲ τοιαύτην
ఇది పౌలు ఇప్పుడే చెప్పిన దానిని సూచిస్తుంది. కొరింథీయులు దేవుని ఎదుట ఆయన పరిచర్యకు సక్రమత అని తెలుసుకోవడం ద్వారా అతనికి విశ్వాసం వస్తుంది.
2 Corinthians 3:5
ἀφ’ ἑαυτῶν ἱκανοί
మనలో యోగ్యమైనది లేక “మనకు సరిపోయినది”
λογίσασθαί τι ὡς ἐξ ἑαυτῶν
ఇక్కడ “ఏదైనా” అనే పదం పౌలు అపోస్తలత్వపు పరిచర్యకు సంబంధించిన దేనిని గురించియైన తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిచర్యలో మనం చేసిన ఏదైనా మన స్వంత ప్రయత్నాల నుండి వస్తుంది అని వ్యాజ్యమాడగలరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἡ ἱκανότης ἡμῶν ἐκ τοῦ Θεοῦ
దేవుడు మనకు కావలసినంత సమృద్ధిని ఇస్తాడు.
2 Corinthians 3:6
καινῆς διαθήκης, οὐ γράμματος
ఇక్కడ “పత్రిక” అనే పదానికి వర్ణమాల యొక్క అక్షరాలు మరియు ప్రజలు వ్రాసే పదాలను గురించి తెలియచేస్తుంది. ఈ వాక్యాలు పాత నిబంధన ధర్మశాస్త్రమును ఉల్లేఖిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పురుషులు వ్రాసిన ఆదేశాల ఆధారంగా లేని ఒడంబడిక” (చూడండి: ఉపలక్షణము మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀλλὰ Πνεύματος
ప్రజలతో దేవుని ఒడంబడికను స్థాపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఆత్మ చేసేదాని ఆధారంగా ఒక ఒడంబడిక” అని వ్రాయబడింది (చూడండి: శబ్దలోపం)
τὸ…γράμμα ἀποκτέννει
పౌలు పాత నిబంధన నియమాల గురించి హత్యచేసే వ్యక్తి అని చెప్పుచున్నాడు. ఆ నియమాలను పాటించడం ఆధ్యాత్మిక మరణానికి దారి తీస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్రాత పూర్వకమైన ధర్మశాస్త్రము మరణానికి దారి తీస్తుంది” (చూడండి: మానవీకరణ మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 3:7
పౌలు పాత ఒడంబడిక యొక్క క్షిణిస్తున్న వైభవాన్ని క్రొత్త ఒడంబడిక యొక్క ఆధిపత్యం మరియు స్వేచ్చతో విభేదిస్తాడు. అతను మోషే యొక్క ముసుగును ప్రస్తుత ప్రకటనలను స్పష్టతతో విభేదిస్తాడు. మోషే కాలం ఇప్పుడు వెల్లడైన దాని గురించి తక్కువ స్పష్టంగా చిత్రీకరించబడినది.
εἰ δὲ ἡ διακονία τοῦ θανάτου…ἐγενήθη ἐν δόξῃ, ὥστε
ధర్మశాస్త్రము మరణానికి దారి తీసినప్పటికీ, అది ఇంకా చాల వైభవం గలదని పౌలు నొక్కి చెప్పాడు. (చూడండి: వ్యంగ్యోక్తి)
ἡ διακονία τοῦ θανάτου
మరణము యొక్క పరిచర్య. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన పాత నిబంధన ధర్మశాస్త్రమును గురించి ఇది తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణానికి కారణమైన సేవ ధర్మశాస్త్రముపై ఆధారపడి ఉంటుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν γράμμασιν ἐντετυπωμένη λίθοις
అక్షరాలతో రాళ్ళమీద చెక్కబడింది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అక్షరాలతో రాళ్ళమీద చెక్కాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐν δόξῃ, ὥστε
చాలా మహిమతో
διὰ
ఎందుకంటే వారు చూడలేక పోయారు
2 Corinthians 3:8
πῶς οὐχὶ μᾶλλον ἡ διακονία τοῦ Πνεύματος ἔσται ἐν δόξῃ?
పౌలు ఈ ప్రశ్నను “ఆత్మ చేసే సేవ” “ఉత్పత్తి చేసే సేవ”కంటే గొప్పగా ఉండాలి ఎందుకంటే అది జీవితానికి దారి తీస్తుంది అని నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఆత్మ చేసే సేవ మరింత గొప్పగా ఉండాలి” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἡ διακονία τοῦ Πνεύματος
ఆత్మ యొక్క పరిచర్య. ఇది క్రొత్త ఒడంబడిక గురించి చెప్పుచున్నది, అందులో పౌలు పరిచారకుడై యున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవితాన్ని ఇచ్చే సేవ అది ఆత్మ ఫై ఆధారపడి ఉంటుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 3:9
τῇ διακονίᾳ τῆς κατακρίσεως
ఖండించే సేవ. పాత నిబంధన ధర్మశాస్త్రమును గురించి ఇది తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సేవ ప్రజలను ఖండిస్తుంది ఎందుకంటే అది ధర్మశాస్త్రము పై ఆధారపడి ఉంటుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πολλῷ μᾶλλον περισσεύει ἡ διακονία τῆς δικαιοσύνης δόξῃ
ఇక్కడ “ఎలా” అనే పదం ఈ వాక్య భాగాన్ని ఆశ్చర్యార్థకంగా సూచిస్తుంది కాని ప్రశ్నగా కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు నీతి యొక్క సేవ చాల ఎక్కువ గొప్పగా ఉండాలి! (చూడండి: ఆశ్చర్యార్థకాలు)
περισσεύει ἡ διακονία τῆς δικαιοσύνης δόξῃ.
పౌలు “నీతి సేవ” గురించి అది మరొక వస్తువును ఉత్పత్తి చేయగల లేక హెచ్చించగల వస్తువులాగా ఉందని చెప్పుచున్నాడు. ఆయన అర్థం, “నీతి సేవ” శిక్షా విధికి కారణమైన సేవ కంటే చాలా గొప్పది, ఇది వైభవముతో నింపబడింది. (చూడండి: రూపకం)
ἡ διακονία τῆς δικαιοσύνης
నీతి యొక్క సేవ. ఇది క్రొత్త ఒడంబడిక గురించి చెప్పుచున్నది, అందులో పౌలు పరిచారకుడై యున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సేవ ప్రజలను నీతిమంతులుగా చేస్తుంది ఎందుకంటే అది ఆత్మ పై ఆధారపడి ఉంటుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 3:10
καὶ γὰρ οὐ δεδόξασται, τὸ δεδοξασμένον…εἵνεκεν τῆς ὑπερβαλλούσης δόξης
వైభవంగా ఉండే క్రొత్త నిబంధనతో పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని పోల్చినప్పుడు అది అంత వైభవంగా కనిపించదు.
τὸ δεδοξασμένον
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఒకప్పుడు ధర్మశాస్త్రమునకు వైభవమును ఇచ్చెను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐν τούτῳ τῷ μέρει
ఈ విధంగా
2 Corinthians 3:11
τὸ καταργούμενον
ఇది “ఖండించే సేవ”ను సూచిస్తూంది, ఇది అదృశ్యమైయ్యే సామర్థ్యం గల వస్తువులు ఉన్నట్లుగా పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది పనికిరానిదిగా మారింది” (చూడండి: రూపకం)
2 Corinthians 3:12
ἔχοντες οὖν τοιαύτην ἐλπίδα
ఇది పౌలు ఇప్పుడే చెప్పిన దానిని సూచిస్తుంది. క్రొత్త ఒడంబడికకు శాశ్వతమైన వైభవం ఉందని తెలుసుకోవడం ద్వారా అతనికి ఆశ వస్తుంది.
τοιαύτην ἐλπίδα
అటువంటి విశ్వాసం
2 Corinthians 3:13
τὸ τέλος τοῦ καταργουμένου
ఇది మోషే ముఖముమీద ప్రకాశించే వైభవం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే ముఖముమీద ఉన్న వైభవం పూర్తిగా క్షీణించింది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 3:14
ἀλλὰ ἐπωρώθη τὰ νοήματα αὐτῶν
కాని వారి మనస్సులు కఠినమైపోయాయి. పౌలు ఇశ్రాయేలీయుల మనస్సులను మూసివేసిన లేదా కష్టతరమైన వస్తువులని చెప్పుచున్నాడు. వారు చూసినవాటిని అర్థం చేసుకోలేకపోయారు అని ఇది వ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఇశ్రాయేలీయులకు వారు చూసింది అర్థం కాలేదు” (చూడండి: రూపకం)
ἄχρι γὰρ τῆς σήμερον ἡμέρας
పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న సమయానికి
τὸ αὐτὸ κάλυμμα ἐπὶ τῇ ἀναγνώσει τῆς παλαιᾶς διαθήκης μένει
మోషే ముఖమును ఒక ముసుగుతో కప్పినందున ఆయన ముఖములోని వైభవాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక పోయినట్లే, పాత ఒడంబడిక చదివినప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా నిరోధించే ఆధ్యాత్మిక ముసుకు ఉంది. (చూడండి: రూపకం)
ἐπὶ τῇ ἀναγνώσει τῆς παλαιᾶς διαθήκης
ఎవరైనా పాత ఒడంబడిక చదవడం వారు విన్నప్పుడు
μὴ ἀνακαλυπτόμενον, ὅτι ἐν Χριστῷ καταργεῖται
ఇక్కడ “ఇది” అనే పదం యొక్క రెండు సంఘటనలు “ఒకే ముసుగును” గురించి తెలియచేస్తాయి. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరూ ముసుగును తీసివేయలేరు ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 3:15
ἀλλ’ ἕως σήμερον
ఈ పదం పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న సమయాన్ని సూచిస్తుంది
ἡνίκα ἂν ἀναγινώσκηται Μωϋσῆς
ఇక్కడ “మోషే” అనే పదం పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి తెలియచేస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా మోషే గ్రంథాన్ని చదివినప్పుడేల్ల” (చూడండి: అన్యాపదేశము మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κάλυμμα ἐπὶ τὴν καρδίαν αὐτῶν κεῖται
ఇక్కడ “హృదయాలు” అనే పదం ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలియచేస్తుంది, మరియు శారీరిక ముసుగు వారి కళ్ళను కప్పినట్లు ప్రజలు పాత ఒడంబడికను అర్థం చేసుకోలేక పోవడంవలన వారి హృదాయాలను కప్పి ఉంచే ముసుగు ఉన్నట్లుగా తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వింటున్న దాన్ని అర్థం చేసుకోలేరు” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
2 Corinthians 3:16
ἡνίκα…ἐὰν ἐπιστρέψῃ πρὸς Κύριον
ఇక్కడ “మలుపులు” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది, అంటే దీని అర్థం ఒకరికి విధేయత చూపడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవుని ఆరాధించడం ప్రారంభించినప్పుడు” లేక “ఒక వ్యక్తి ప్రభువుపై నమ్మకం ఉంచడం ప్రారంభించినప్పుడు” (చూడండి: రూపకం)
περιαιρεῖται τὸ κάλυμμα
దేవుడు వారికి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆ ముసుగును తీసివేస్తాడు” లేక “దేవుడు వారికి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 3:18
ἡμεῖς δὲ πάντες
ఇక్కడ “మాకు” అనే పదం పౌలు మరియు కొరింథీయులతో సహా విశ్వాసులందరి గురించి తెలియచేస్తుంది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἀνακεκαλυμμένῳ προσώπῳ, τὴν δόξαν Κυρίου κατοπτριζόμενοι
మోషే ముఖములో ప్రతిబింబించిన దేవుని మహిమను ఒక ముసుగుతో కప్పినందున ఇశ్రాయేలీయులకు మాదిరి కాకుండా, దేవుని వైభవమును చూడకుండా మరియు అర్థం చేసుకోకుండా విశ్వాసులను నిరోధించడానికి ఏమియు లేదు. (చూడండి: రూపకం)
τὴν αὐτὴν εἰκόνα μεταμορφούμεθα
తనలాగే వైభవంగా ఉండటానికి విశ్వాసులను ఆత్మ మారుస్తోంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మనలను అదే వైభవపు తన పోలికగా మారుస్తున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀπὸ δόξης εἰς δόξαν
వైభవం యొక్క ఒక పరిమాణము నుండి మరొక వైభవ పరిమాణమునకు. దీని అర్థం ఆత్మ నిరంతరం విశ్వాసుల వైభవాన్ని పెంచుతుంది.
καθάπερ ἀπὸ Κυρίου
ఇది ప్రభువునుండి వచ్చినట్లే
2 Corinthians 4
2వ కోరింథీయులకు వ్రాసిన పత్రిక 04 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
ఈ అధ్యాయము “కాబట్టి” అనే పదంతో ప్రారంభమవుతుంది. ఇది మునుపటి అధ్యాయము బోధించిన వాటితో చేర్చబడింది. ఈ అధ్యాయాలు ఎలా విభజించబడ్డాయి అనేది చదవరులకు గందరగోళంగా ఉంటుంది.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
పరిచర్య
పౌలు క్రీస్తు గురించి చెప్పడం ద్వారా పరిచర్య చేస్తాడు. అతను ప్రజలను నమ్మించడానికి మోసము చేయడానికి ప్రయత్నించడు. సమస్య తుదకు అధ్యాత్మికమైనందున వారు సువార్తను అర్థం చేసుకోకపొతారు. (చూడండి: ఆత్మ, గాలి, శ్వాస)
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
వెలుగు మరియు చీకటి
పరిశుద్ధ గ్రంథము అనీతిమంతులైన వ్యక్తుల గురించి చెప్పుచున్నది, చీకటిలో తిరుగుతున్నవారు దేవునికి నచ్చినది చేయని వ్యక్తులని వ్రాయబడింది. ఆ పాపపు ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి, ఏతప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడానికి వీలు కల్పిస్తుంది. (చూడండి: నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత)
జీవము మరియు మరణము
పౌలు ఇక్కడ శారీరిక జీవము మరియు మరణం గురించి తెలియచేయుటలేదు. ఒక క్రైస్తవుడు యేసులో కలిగియున్న క్రొత్త జీవితాన్ని ఈ జీవము సూచిస్తుంది. మరణం అనేది యేసును విశ్వసించే ముందు పాత జీవన విధానాన్ని సూచిస్తుంది. (చూడండి: జీవం, జీవించు, జీవించుచున్న, సజీవమైన మరియు చనిపోవడం, చనిపోయిన, ప్రమాదకరమైన, మరణం మరియు విశ్వాసం)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
ఆశ
పౌలు పదే పదే మాదిరిని ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగిస్తాడు. అతను వివరించాడు. అప్పుడు అతను వ్యతిరేకమైన లేక విరుద్ధమైన వివరణను ఖండించాడు లేక మినహయింపు ఇస్తాడు. \nఇవన్ని కలసి క్లిష్ట పరిస్తితులలో చదవరులకు ఆశను ఇస్తాయి (చూడండి: నిరీక్షణ, నిరీక్షించిన)
2 Corinthians 4:1
తనను తానూ గొప్ప చేసుకొనకుండా, క్రీస్తును గురించి బోధించడం ద్వారా తన పరిచర్యలో నమ్మకమైనవాడని పౌలు వ్రాసాడు. కొరింథులో నున్న విశ్వాసులలో జీవితం పనిచేయడానికి వీలుగా యేసు మరణం మరియు జీవమును ఎలాగు జీవిస్తున్నాడో చూపిస్తాడు.
ἔχοντες τὴν διακονίαν ταύτην
ఇక్కడ “మేము” అనే పదం పౌలును మరియు తన జతపనివారిని గురించి తెలియచేస్తుంది కానీ కొరింథీయులను గురించి కాదు. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
καθὼς ἠλεήθημεν
ఈ వాక్య భాగం పౌలు మరియు అతని జతపనివారు “ఈ పరిచర్య ఎలా ఉందొ” వివరిస్తుంది. అది దేవుడు తన కనికరము ద్వారా వారికిచ్చిన బహుమతియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే దేవుడు మాకు కరుణను చూపించాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 4:2
ἀπειπάμεθα τὰ κρυπτὰ τῆς αἰσχύνης
దీని అర్థం పౌలు మరియు అతని జతపనివారు “సిగ్గుకరమైన రహస్య విషయాలను చేయడానికి నిరాకరించారు. వారు గతంలో ఈ పనులను చేసారని కాదు.
τὰ κρυπτὰ τῆς αἰσχύνης
“రహస్యం” అనే పదం ప్రజలు రహస్యంగా చేసే పనులను వివరిస్తుంది. సిగ్గుపడే విషయాలు వాటిని చేసేవారికి సిగ్గుకరంగా అనిపించాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు రహస్యంగా చేసే పనులు సిగ్గు కలిగించేవి” (చూడండి: విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు)
περιπατοῦντες ἐν πανουργίᾳ
మోసపూరితంగా జీవించండి
μηδὲ δολοῦντες τὸν λόγον τοῦ Θεοῦ
ఇక్కడ దేవుని వాక్యం దేవుని నుండి వచ్చిన సందేశానికి ఒక మారుపేరైయున్నది. సానుకూల ఆలోచనను వ్యక్తపరచడానికి ఈ వాక్య భాగం రెండు ప్రతికూల ఆలోచనలను ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు” లేక “మేము దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగిస్తాము” (చూడండి: జంట వ్యతిరేకాలు మరియు అన్యాపదేశము)
συνιστάνοντες ἑαυτοὺς πρὸς πᾶσαν συνείδησιν ἀνθρώπων
దీని అర్థం వారి బోధను విన్న ప్రతి వ్యక్తికి వారు సరైనది బోధించారా లేక తప్పు బోధను బోధించారా అని నిర్ణయించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తారు
ἐνώπιον τοῦ Θεοῦ
ఇది దేవుని సన్నిధి గురించి తెలియచేస్తుంది. పౌలు యథార్థతకు దేవుని అవగాహన మరియు ఆమోదం దేవుడు వాటిని చూడగలడనే దాని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ముందు” లేక “దేవునితో సాక్షిగా” (చూడండి: రూపకం)
2 Corinthians 4:3
εἰ δὲ καὶ ἔστιν κεκαλυμμένον τὸ εὐαγγέλιον ἡμῶν, ἐν τοῖς ἀπολλυμένοις ἐστὶν κεκαλυμμένον
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:14నుండి పౌలు చెప్పిన దానిని ఇది తిరిగి సూచిస్తుంది. పాత ఒడంబడిక చదివినప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా నిరోధించే ఆధ్యాత్మిక ముసుగు ఉందని అక్కడ పౌలు వివరించాడు. అదే విధంగా, ప్రజలు సువార్తను అర్థం చెసుకోలేరు. (చూడండి: రూపకం)
εἰ…ἔστιν κεκαλυμμένον τὸ εὐαγγέλιον ἡμῶν…ἐστὶν κεκαλυμμένον
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ముసుగు మన సువార్తను కప్పి వేస్తే, ఆ ముసుకు దానిని కప్పి వేస్తుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὸ εὐαγγέλιον ἡμῶν
మేము బాధించే సువార్త
2 Corinthians 4:4
ὁ θεὸς τοῦ αἰῶνος τούτου ἐτύφλωσεν τὰ νοήματα τῶν ἀπίστων
పౌలు వారి మనస్సులకు నేత్రాలు ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు, మరియు వారి మనోనేత్రములతో చూడలేక పోతున్నందున అర్థం చేసుకోలేకపోవడంలో వారు అసమర్థులైయ్యారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ లోక దేవుడు అవిశ్వాసులను దేవుని వైభవాన్ని అర్థం చేసుకోనివ్వకుండా అడ్డుకున్నాడు” (చూడండి: రూపకం)
ὁ θεὸς τοῦ αἰῶνος τούτου
ఈ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు. ఈ వాక్య భాగం సాతానును గురించి తెలియచేస్తుంది
μὴ αὐγάσαι τὸν φωτισμὸν τοῦ εὐαγγελίου τῆς δόξης τοῦ Χριστοῦ
మోషే ముఖమున ప్రకాశించిన దేవుని వైభవాన్ని ఇశ్రాయేలీయులు చూడలేక పోయారు, ఎందుకంటే అతను దానిని ఒక ముసుగుతో కప్పాడు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:13), అవిశ్వాసులు సువార్తలో ప్రకాశించే క్రీస్తు వైభవాన్ని చూడలేరు. దీని అర్థం “వారు క్రీస్తు వైభవం యొక్క సువార్తను అర్థం చేసుకోలేకపోతున్నారు” (చూడండి: రూపకం)
τὸν φωτισμὸν τοῦ εὐαγγελίου
సువార్తనుండి వచ్చే వెలుగు
τοῦ εὐαγγελίου τῆς δόξης τοῦ Χριστοῦ
క్రీస్తు వైభవమును గురించిన సువార్త
2 Corinthians 4:5
ἀλλὰ Ἰησοῦν Χριστὸν Κύριον, ἑαυτοὺς δὲ δούλους ὑμῶν
మీరు ఈ వాక్య భాగాల కోసం క్రియాపదమును అందించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని మేము క్రీస్తు యేసును ప్రభువును ప్రకటిస్తాము, మరియు మేము మీ పనివాళ్ళుగా ప్రకటించుకొంటాము” (చూడండి: శబ్దలోపం)
διὰ Ἰησοῦν
యేసు కోసం
2 Corinthians 4:6
ἐκ σκότους φῶς λάμψει
ఈ వాక్యముతో, ఆదికాండములో వివరించిన విధంగా పౌలు దేవుని వెలుగు సృష్టించడాన్ని గురించి తెలియచేస్తాడు.
ὃς ἔλαμψεν…πρὸς φωτισμὸν τῆς γνώσεως τῆς δόξης τοῦ Θεοῦ
ఇక్కడ “వెలుగు” అనే పదం అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని గురించి తెలియచేస్తుంది. దేవుడు వెలుగును సృష్టించినట్లే విశ్వాసులకు కూడా అవగాహన కల్పిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రకాశించాడు ... దేవుని వైభవమును అర్థం చేసుకోవడానికి మాకు సహాయ పడుతుంది” (చూడండి: రూపకం)
ἐν ταῖς καρδίαις ἡμῶν
ఇక్కడ “హృదయాలను” అనే పదం మనస్సు మరియు ఆలోచనలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన మనస్సులలో” (చూడండి: అన్యాపదేశము)
πρὸς φωτισμὸν τῆς γνώσεως τῆς δόξης τοῦ Θεοῦ
వెలుగు, ఇది దేవుని జ్ఞాన వైభవం గలది
τῆς δόξης τοῦ Θεοῦ ἐν προσώπῳ Ἰησοῦ Χριστοῦ
యేసు క్రీస్తు ముఖములో దేవుని వైభవం. దేవుని వైభవం మోషే ముఖముపై ప్రకాశించినట్లే (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:7), అది కూడా యేసు ముఖంలో ప్రకాశిస్తోంది. పౌలు సువార్తను ప్రకటించినప్పుడు, ప్రజలు దేవుని వైభవం గురించిన సందేశాన్ని చూడగలరు మరియు అర్థం చేసుకోగలరు (చూడండి: రూపకం)
2 Corinthians 4:7
ἔχομεν δὲ
ఇక్కడ “మేము” అనే పదం పౌలును మరియు తన జతపనివారిని గురించి తెలియచేస్తుంది కానీ కొరింథీయులను గురించి కాదు. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’) కొరింథు
ἔχομεν…τὸν θησαυρὸν τοῦτον ἐν ὀστρακίνοις σκεύεσιν
పౌలు సువార్తను ఒక సంపదలాగా మరియు వారి శరీరాలు మట్టితో చేసిన విచ్చిన్నమైన కుండలవలే ఉన్నాయని చెప్పుచున్నాడు. వారు బాధించే సువార్త విలువతో పోల్చితే అవి తక్కువ విలువైనవని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: రూపకం)
తద్వారా ఇది ప్రజలకు స్పష్టంగా తెలుసు లేక “తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలుసు”
2 Corinthians 4:8
ἐν παντὶ θλιβόμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మును అన్ని విధాలుగా బాధ పెడతారు. (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 4:9
διωκόμενοι, ἀλλ’ οὐκ ἐνκαταλειπόμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మనలను చిత్రహింసలు పెడతారు కాని దేవుడు మమ్మును విడచి పెట్టడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καταβαλλόμενοι, ἀλλ’ οὐκ ἀπολλύμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని కొట్టి పడేశారు కాని నాశనం చేయరు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καταβαλλόμενοι, ἀλλ’ οὐκ ἀπολλύμενοι
మేము తీవ్రంగా గాయపడ్డాము
2 Corinthians 4:10
πάντοτε τὴν νέκρωσιν τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι περιφέροντες
పౌలు తన బాధలను యేసు మరణం యొక్క అనుభవమని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరణించినట్లు మనము తరచుగా మరణించే ప్రమాదం ఉంది” లేక “యేసు మరణాన్ని మనం అనుభవించే విధంగా మనం ఎల్లప్పుడూ బాధపడతాం.” (చూడండి: రూపకం)
ἡ ζωὴ τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι ἡμῶν φανερωθῇ
సాధ్యమైయ్య అర్థాలు 1) యేసు సజీవంగా ఉన్నందున మన దేహాలు మళ్ళీ జీవిస్తాయి” లేక 2) యేసు ఇచ్చే ఆధ్యాత్మిక జీవితం కూడా మన దేహాలలో చూపబడుతుంది.”
ἡ ζωὴ τοῦ Ἰησοῦ ἐν τῷ σώματι ἡμῶν φανερωθῇ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులు మన దేహాలలో యేసు జీవితాన్ని చూడవచ్చు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 4:11
ἀεὶ γὰρ ἡμεῖς, οἱ ζῶντες, εἰς θάνατον παραδιδόμεθα διὰ Ἰησοῦν
యేసు మరణాన్ని మోయడం అనేది యేసుకు విధేయత చూపడం వలన మరణించే ప్రమాదం ఉందని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనలో సజీవంగా ఉన్నవారికి, మనం యేసుతో చేరినందున దేవుడు ఎల్లప్పుడూ మరణాన్ని ఎదుర్కోవటానికి దారి తీస్తున్నాడు” లేక “మనం యేసుతో చేరినందున ప్రజలు సజీవంగా ఉన్న మమ్మల్ని చనిపోయే ప్రమాదంలో పడేస్తున్నారు” (చూడండి: రూపకం)
ἵνα καὶ ἡ ζωὴ τοῦ Ἰησοῦ φανερωθῇ ἐν τῇ θνητῇ σαρκὶ ἡμῶν
యేసు జీవం మనలో చూపించబడాలని దేవుడు కోరుకుంటాడు సాధ్యమైయ్యే అర్థాలు 1) యేసు సజీవంగా ఉన్నందున మన దేహాలు మళ్ళీ జీవిస్తాయి” లేక 2) యేసు ఇచ్చే ఆధ్యాత్మిక జీవితం కూడా మన దేహాలలో చూపబడుతుంది.” 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:10లో మీరు ఈ వాక్య భాగాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.
ἵνα καὶ ἡ ζωὴ τοῦ Ἰησοῦ φανερωθῇ ἐν τῇ θνητῇ σαρκὶ ἡμῶν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:10లో మీరు ఈ వాక్య భాగాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఇతర వ్యక్తులు మన దేహాలలో యేసు జీవమును చూడవచ్చు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 4:12
ὁ θάνατος ἐν ἡμῖν ἐνεργεῖται, ἡ δὲ ζωὴ ἐν ὑμῖν
పౌలు మరణం మరియు జీవం గురించి వారు పనిచేయగల వ్యక్తులవలె ఉన్నారని చెప్పుచున్నాడు. కొరింథీయులు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలిగేలా వారు ఎల్లప్పుడూ శారీరిక మరణానికి గురి ఆవుతారని దీని అర్థం. (చూడండి: మానవీకరణ)
2 Corinthians 4:13
τὸ αὐτὸ πνεῦμα τῆς πίστεως
విశ్వాసం యొక్క అదే వైఖరి. ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక వ్యక్తి యొక్క వైఖరిని మరియు స్వభావము గురించి తెలియచేస్తుంది.
κατὰ τὸ γεγραμμένον
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ వాక్యమును వ్రాసిన వ్యక్తిగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐπίστευσα, διὸ ἐλάλησα
ఇది కీర్తనలనుండి ఉల్లేఖించబడింది
2 Corinthians 4:14
ὅτι ὁ ἐγείρας τὸν Ἰησοῦν…ἐγερεῖ
ఇక్కడ పైకి లేవడం అనేది చనిపోయిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా మార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసును తిరిగి బ్రతకడానికి కారణమైనవాడు” లేక “ప్రభువైన యేసును లేపిన దేవుడు” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 4:15
τὰ γὰρ πάντα δι’ ὑμᾶς
ఇక్కడ “అంతా” అనే పదం మునుపటి వచనాలలో పౌలు వివరించిన బాధలన్నిటిని గురించి తెలియచేస్తుంది.
ἡ χάρις πλεονάσασα διὰ τῶν πλειόνων
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన కృపను చాల మందికి విస్తరించినట్లు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὴν εὐχαριστίαν περισσεύσῃ
పౌలు కృతజ్ఞతలు తెలుపుట గురించి మాట్లాడుతూ అది స్వయంగా పెద్దదిగా మారే వస్తువులా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల మంది ప్రజలు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు” (చూడండి: రూపకం)
2 Corinthians 4:16
కొరింథీయుల ఇబ్బందులు చిన్నవి మరియు కనిపించని శాశ్వతమైన విషయాలతో పోల్చినప్పుడు చాలా కాలం ఉండవని పౌలు వ్రాసాడు.
διὸ οὐκ ἐνκακοῦμεν
దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మేము నమ్మకంగా ఉన్నాము” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ὁ ἔξω ἡμῶν ἄνθρωπος διαφθείρεται
ఇది వారి సహజమైన శరీరాలు క్షీణించడం మరియు మరణించడం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన సహజమైన శరీరాలు బలహీనపడి చనిపోతున్నాయి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ ἔσω ἡμῶν ἀνακαινοῦται ἡμέρᾳ καὶ ἡμέρᾳ
ఇది వారి లోపలి, ఆధ్యాత్మిక జీవితాలను శక్తివంతం చేయడాన్ని గురించి తెలియచేస్తుంది. ప్రత్యమ్నాయ తర్జుమా: “మనం ఆధ్యాత్మికంగా ఉండటం రోజురోజుకు శక్తివంతం అవుతుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ ἔσω ἡμῶν ἀνακαινοῦται ἡμέρᾳ καὶ ἡμέρᾳ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రతిరోజూ లోపలిభాగము మరింతగా పునరుద్ధరిస్తున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 4:17
τὸ γὰρ παραυτίκα ἐλαφρὸν τῆς θλίψεως ἡμῶν…αἰώνιον βάρος δόξης, κατεργάζεται ἡμῖν
పౌలు తన బాధలను, బరువును తూచబడ్డ వస్తువులాగా దేవుడు అతనికిచ్చే వైభవం గురించి చెప్పుచున్నాడు. వైభవం భాధలన్నిటిని మించినది. (చూడండి: రూపకం)
καθ’ ὑπερβολὴν εἰς ὑπερβολὴν
పౌలు అనుభవించే వైభవం ఎవరు కొలువలేనంత భారంగా ఉంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దానిని ఎవరు కొలువలేరు” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 4:18
τὰ βλεπόμενα…τὰ μὴ βλεπόμενα
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు కనిపించే విషయాలు ... మనకు కనిపించని విషయాలు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὰ δὲ μὴ βλεπόμενα
మీరు ఈ వాక్య భాగాల కోసం క్రియాపదమును అందించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం “కాని మేము కనిపించని విషయాల కోసం చూస్తున్నాము” (చూడండి: శబ్దలోపం)
2 Corinthians 5
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 05 అధ్యాయములోని సాధారణ గమనికలు
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
పరలోకములో క్రొత్త దేహాలు
పౌలు చనిపోయినప్పుడు చాల మంచి దేహాన్ని పొందుతాడని అతనికి తెలుసు. ఈ కారణంగా, సువార్త ప్రకటించినందుకు చంపబడతాడని భయపడడు. కాబట్టి ఇతరులను కూడా దేవునితో రాజీ పడవచ్చని ఆయన చెబుతాడు. క్రీస్తు వారి పాపములను తీసివేసి తన నీతిని వారికి ఇస్తాడు. (చూడండి: మంచి వార్త, సువార్త, సమాధానపరచబడు, సమాధానపరచబడెను, సమాధానపరచబడుట మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం మరియు నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత)
క్రొత్త సృష్టి
పాత మరియు క్రొత్త సృష్టి బహుశః పాత మరియు క్రొత్త స్వభావాన్ని పౌలు ఎలా వివరించాడనే దాన్ని గురించి తెలియచేస్తుంది. ఈ అభిప్రాయాలు పాత మరియు క్రొత్త మనిషికి సమానంగా ఉంటాయి. “పాత” అనే పదం బహుశా ఒక వ్యక్తి జన్మించిన పాపపు స్వభావం గురించి తెలియచేయదు. ఇది పాత జీవన విధానాన్ని లేక క్రైస్తవుడు పూర్వమందు పాపానికి కట్టుబడి ఉన్నాడని తెలియపరుస్తుంది. “క్రొత్త సృష్టి” అనగా క్రీస్తును విశ్వసించిన తరువాత దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే క్రొత్త స్వభావం లేక క్రొత్త జీవితమైయున్నది. (చూడండి: విశ్వాసం)
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
నివాసము
క్రైస్తవుని నివాసము భూలోకములో లేదు. ఒక క్రైస్తవుని నిజమైన నివాసము పరలోకములో ఉంది. ఈ రూపకఅలంకారాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ లోకములో క్రైస్తవుడి పరిస్థితులు తాత్కాలికమని పౌలు నొక్కి చెప్పాడు. ఇది బాధపడేవారికి నిరీక్షణను ఇస్తుంది. (చూడండి: పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకసంబంధమైన మరియు రూపకం మరియు నిరీక్షణ, నిరీక్షించిన)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
“సమాధాన సందేశము”
ఇది సువార్తను గురించి తెలియచేస్తుంది. దేవునికి విరోధులైన ప్రజలు పశ్చాత్తాపపడి తనతో సమాధానపడాలని పౌలు పిలుపునిచ్చాడు. (చూడండి: పశ్చాత్తాపపడు, పశ్చాత్తాపము)
2 Corinthians 5:1
పౌలు విశ్వాసుల భూసంబంధమైన శరీరాలను దేవుడిచ్చే పరలోకపు విషయాలతో విభేదిస్తూ కొనసాగుతున్నాడు
ἐὰν ἡ ἐπίγειος ἡμῶν οἰκία τοῦ σκήνους καταλυθῇ, οἰκοδομὴν ἐκ Θεοῦ ἔχομεν
ఇక్కడ తాత్కాలిక “భూసంబంధమైన నివాసం” అనేది ఒక వ్యక్తి యొక్క సహజమైన దేహానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ఇక్కడ శాశ్వతమైన “దేవుని నుండి భవనం” అనేది విశ్వాసులు చనిపోయిన తరువాత దేవుడు వారికిచ్చే క్రొత్త దేహానికి ఒక రూపకఅలంకారమైయున్నది. చూడండి: సమాధానపరచబడు, సమాధానపరచబడెను, సమాధానపరచబడుట
ἐὰν ἡ ἐπίγειος ἡμῶν οἰκία τοῦ σκήνους καταλυθῇ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం నివసించే భూ సంబంధమైన నివాసమును ప్రజలు నాశనం చేస్తే” లేక “ప్రజలు మన దేహాలను చంపినట్లయితే” (చూడండి: రూపకం)
οἰκίαν ἀχειροποίητον
ఇక్కడ “నివాసం” అంటే “దేవుని నుండి నిర్మించబడడం.” ఇక్కడ చేతులు అనేది మానవుని గురించి పూర్తిగా తెలియచేసే ఉపలక్షణమై యున్నది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మానవులు నిర్మించే నివాసం కాదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 5:2
ἐν τούτῳ στενάζομεν
ఇక్కడ “ఈ గుడారం” అంటే మనం నివసించే భూసంబంధమైన నివాసమైయున్నది. “మూలుగు అనే పదం ఒక వ్యక్తి మంచిదానిని కావాలని ఆతురతగా కోరుకునేటప్పుడు చేసే శబ్దమైయున్నది
τὸ οἰκητήριον ἡμῶν τὸ ἐξ οὐρανοῦ ἐπενδύσασθαι ἐπιποθοῦντες
“మన పరలోకపు నివాసం” అనే పదాలకు “దేవుని నుండి నిర్మించడం” అని అర్థం. పౌలు విశ్వాసులు చనిపోయిన తరువాత అందుకునే క్రొత్త దేహం గురించి మాట్లాడుతూ అది ఒక భవనం మరియు ఒక వ్యక్తి ధరించగలిగే దుస్తులుగా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: ఉపలక్షణము)
2 Corinthians 5:3
ἐνδυσάμενοι
మన పరలోకపు నివాసం మీద ఉంచడం ద్వారా
οὐ γυμνοὶ εὑρεθησόμεθα
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మమ్మల్ని నగ్నంగా చూడడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 5:4
οἱ ὄντες ἐν τῷ σκήνει
పౌలు సహజమైన దేహాన్ని “గుడారం” అని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ἐν τῷ σκήνει, στενάζομεν
“గుడారం” అనే పదం “మనం నివసించే భూసంబంధమైన నివాసం” గురించి తెలియచేస్తుంది. “మూలుగు అనే పదం ఒక వ్యక్తి మంచిదానిని కావాలని ఆతురతగా కోరుకునేటప్పుడు చేసే శబ్దమైయున్నది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5:2లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.
βαρούμενοι
పౌలు సహాజమైన దేహం అనుభవించే ఇబ్బందులను, మోసుకొని వెళ్ళడానికి కష్టతరమైన బరువైన వస్తులని వాటిని గురించి తెలియజేస్తాడు. (చూడండి: రూపకం)
οὐ θέλομεν ἐκδύσασθαι…ἐπενδύσασθαι
పౌలు దేహం గురించి అవి వస్త్రాలని చెప్పుచున్నాడు. ఇక్కడ “వస్త్రాలు ధరించడం” అనేది సహజమైన దేహము యొక్క మరణము గురించి తెలియచేస్తుంది; “వస్త్రాలు ధరించడం” అంటే దేవుడు ఇచ్చే పునరుత్థాన శరీరాన్ని కలిగి ఉండటం గురించి తెలియచేస్తుంది. (చూడండి: రూపకం)
ἐκδύσασθαι
వస్త్రాలు లేకుండా లేక “నగ్నంగా ఉండాలి”
ἵνα καταποθῇ τὸ θνητὸν ὑπὸ τῆς ζωῆς
పౌలు జీవాన్ని గురించి “మర్త్యమైన దానిని తింటున్న జంతువులా ఉందని చెప్పుచున్నాడు. చనిపోయే సహజ దేహం శాశ్వతంగా జీవించే పునరుత్థాన శరీరంతో భర్తీ చేయబడుతోంది. (చూడండి: రూపకం)
ἵνα καταποθῇ τὸ θνητὸν ὑπὸ τῆς ζωῆς
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా జీవం చావునకు లోనైనదానిని మ్రింగివేస్తుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 5:5
ὁ δοὺς ἡμῖν τὸν ἀρραβῶνα τοῦ Πνεύματος
అతను నిత్యజీవానికి పాక్షికంగా చెల్లించునట్లుగా ఆత్మ చెప్పుచున్నాడు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1:22లో మీరు ఈ సమానమైన వాక్య భాగాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.
2 Corinthians 5:6
విశ్వాసులు క్రొత్త దేహాన్ని కలిగి ఉంటారు మరియు పరిశుద్ధాత్మను ప్రతిజ్ఞగా కలిగి ఉంటారు కాబట్టి, వారు ప్రభువును ఆనంద పరచుటకు విశ్వాసంతో జీవించాలని పౌలు గుర్తుచేస్తాడు. 1) విశ్వాసులు తీర్పు తీర్చే ఆసనము యోద్ద కనిపిస్తారు మరియు 2) విశ్వాసుల కోసం మరణించిన క్రీస్తు పట్ల ప్రేమ కారణంగా ఇతరులను ఒప్పించమని ఆయన వారికి గుర్తు చేస్తూ కొనసాగుతున్నాడు.
ἐνδημοῦντες ἐν τῷ σώματι
పౌలు సహజ దేహం గురించి మాట్లాడుతూ అది ఒక వ్యక్తి నివసించే ప్రదేశంగా ఉందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఈ భూసంబంధమైన దేహంలో జీవిస్తున్నప్పుడు” (చూడండి: రూపకం)
ἐκδημοῦμεν ἀπὸ τοῦ Κυρίου
మనము ప్రభువుతో నివాసములో లేము లేక “మనము ప్రభువుతో పరలోకములో లేము”
2 Corinthians 5:7
διὰ πίστεως…περιπατοῦμεν, οὐ διὰ εἴδους
ఇక్కడ “నడక” అనేది “సజీవముగా ఉండడం” లేక “ప్రవర్తించటం” అనుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం చూసేదాని ప్రకారం కాకుండా విశ్వాసముతోనే నడచుకుంటున్నాము.
2 Corinthians 5:8
εὐδοκοῦμεν, μᾶλλον ἐκδημῆσαι ἐκ τοῦ σώματος
ఇక్కడ “దేహం” అనేది సహజ శరీరం గురించి తెలియచేస్తుంది
ἐνδημῆσαι πρὸς τὸν Κύριον
పరలోకములో ప్రభువుతో నివాసంలో
2 Corinthians 5:9
εἴτε ἐνδημοῦντες εἴτε ἐκδημοῦντες
“ప్రభువు” అనే పదాన్ని మునుపటి వచనాలనుండి అందించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ప్రభువుతో ఒకే నివాసములో ఉన్నాము లేక ప్రభువుకు దూరంగా ఉన్నాము” (చూడండి: శబ్దలోపం)
εὐάρεστοι αὐτῷ εἶναι
ప్రభువును సంతోషపరచుటకు
2 Corinthians 5:10
ἔμπροσθεν τοῦ βήματος τοῦ Χριστοῦ
క్రీస్తు తీర్పు తీర్చడానికి ముందు
κομίσηται ἕκαστος τὰ διὰ
ప్రతి వ్యక్తి తనకు యోగ్యమైన వాటిని పొందవచ్చు
τὰ διὰ τοῦ σώματος
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను సహజమైన దేహాలతో చేసిన పనులు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
εἴτε ἀγαθὸν εἴτε κακὸν
ఆ విషయాలు మంచివైనా లేక చెడ్డవైనా సరే
2 Corinthians 5:11
εἰδότες…τὸν φόβον τοῦ Κυρίου
ప్రభువుకు భయపడటం అంటే ఏమిటో తెలుసుకోవడం
ἀνθρώπους πείθομεν
సాధ్యమైయ్యే అర్థాలు 1) “మేము సత్య సువార్తను ప్రజలకు ఒప్పిస్తున్నాము” లేక 2) “మేము న్యాయమైన అపోస్తలులమని ప్రజలను ఒప్పిస్తున్నాము.” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Θεῷ…πεφανερώμεθα
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఎలాంటి వ్యక్తులమో దేవుడు స్పష్టంగా చూస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καὶ ἐν ταῖς συνειδήσεσιν ὑμῶν πεφανερῶσθαι
మీరు కూడా దాని గురించి నమ్ముతారు
2 Corinthians 5:12
ἵνα ἔχητε
కాబట్టి మీరు చెప్పడానికి ఏమైన ఉండవచ్చు
τοὺς ἐν προσώπῳ καυχωμένους, καὶ μὴ ἐν καρδίᾳ
ఇక్కడ “ప్రదర్శనలు” అనే పదం సామర్థ్యం మరియు స్థితి వంటి విషయాలను బహిరంగగా వ్యక్తపరచడాన్ని గురించి తెలియచేస్తుంది. “హృదయం” అనే పదం ఒక వ్యక్తి యొక్క లోపలి స్వభావమును గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి స్వంత కార్యాలను కొనియాడేవారే కాని వారు వారి లోపల స్థితిలో నిజముగా ఏమైయున్నారో పట్టించుకోరు.
2 Corinthians 5:13
εἴτε…ἐξέστημεν…εἴτε σωφρονοῦμεν
పౌలు తన గురించి మరియు అతని జతపనివారిని గురించి ఇతరులు ఆలోచించే విధానం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మాకు మతి తప్పింది అనుకుంటే ... ప్రజలు మేము స్థిర చిత్తులం అని అనుకుంటే” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 5:14
ἡ γὰρ ἀγάπη τοῦ Χριστοῦ
సాధ్యమైయ్య అర్థాలు 1) క్రీస్తు పట్ల మన ప్రేమ 2) మనపై క్రీస్తు ప్రేమ.”
ὑπὲρ πάντων ἀπέθανεν
ప్రజలందరి కోసం చనిపోయాడు
2 Corinthians 5:15
τῷ ὑπὲρ αὐτῶν ἀποθανόντι καὶ ἐγερθέντι
వారి కోసమే చనిపోయినవాడు లేక “వారు మరల జీవించడానికి దేవుడు కారణమయ్యాడు” లేక “క్రీస్తు, వారి కోసమే చనిపోయాడు మరియు దేవుడు తిరిగి లేచాడు”
ὑπὲρ αὐτῶν
సాధ్యమైయ్య అర్థాలు 1) ఈ పదాలు “చనిపోవుట” గురించి మాత్రమే తెలియచేస్తాయి లేక 2) ఈ పదాలు “చనిపోవుట” మరియు “తిరిగి లేచుట” రెండిటి గురించి తెలియచేస్తాయి.
2 Corinthians 5:16
క్రీస్తు ప్రేమ మరియు మరణం కారణంగా, మేము మానవ ప్రమాణాల ప్రకారం తీర్పు చెప్పలేము. క్రీస్తు మరణం ద్వారా దేవునితో ఎలా ఐక్యంగా ఉండి శాంతి పొందాలో మరియు క్రీస్తు ద్వారా దేవుని నీతిని ఎలా పొందాలో ఇతరులకు నేర్పడానికి మేము నియమించబడ్డాము.
ὥστε
స్వంతం కోసం జీవించే బదులు క్రీస్తు కొరకు జీవించడం గురించి పౌలు చెప్పినదానిని ఇది తెలియచేస్తుంది.
2 Corinthians 5:17
καινὴ κτίσις
దేవుడు క్రొత్త వ్యక్తిని సృష్టించినట్లుగా క్రీస్తును విశ్వసించే వ్యక్తిని గురించి పౌలు మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ఒక క్రొత్త వ్యక్తి” (చూడండి: రూపకం)
τὰ ἀρχαῖα παρῆλθεν
ఇక్కడ “పాత విషయాలు” అనేది క్రీస్తుని నమ్మకముందే వర్ణించే విషయాలను గురించి తెలియచేస్తుంది.
ἰδοὺ
ఇక్కడ “చూడండి” అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన వర్తమానం పట్ల శ్రద్ధ వహించమని హెచ్చరిస్తుంది.
2 Corinthians 5:18
τὰ…πάντα
దేవుడు ఈ పనులన్నీ చేసాడు. పాత విషయాల స్థానంలో క్రొత్త విషయాల గురించి మునుపటి వచనాలలో పౌలు చెప్పినదాని గురించి ఇది తెలియచేస్తుంది.
τὴν διακονίαν τῆς καταλλαγῆς
ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలను తనతో సమాధాన పరచే సేవ” (చూడండి: భావనామాలు)
2 Corinthians 5:19
ὡς ὅτι
దీని అర్థం
ἐν Χριστῷ κόσμον καταλλάσσων ἑαυτῷ
ఇక్కడ “లోకం” అనే పదం లోకములోని ప్రజలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో, దేవుడు ప్రజలను తనతో తానూ సమాధాన పరచుకుంటున్నాడు” (చూడండి: అన్యాపదేశము)
θέμενος ἐν ἡμῖν τὸν λόγον τῆς καταλλαγῆς
దేవుడు ప్రజలను తనతో తానూ సమాధాన పరచుకుంటున్నాడనే ఉపదేశాన్ని వ్యాప్తి చేసే బాధ్యతను దేవుడు పౌలుకు ఇచ్చాడు.
τὸν λόγον τῆς καταλλαγῆς
సమాధాన పరచడం గురించిన ఉపదేశం
2 Corinthians 5:20
ὑπὲρ Χριστοῦ οὖν πρεσβεύομεν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మమ్మును క్రీస్తు ప్రతినిధులుగా నియమించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Χριστοῦ οὖν πρεσβεύομεν
క్రీస్తు కొరకు మాట్లాడే వారు
καταλλάγητε τῷ Θεῷ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును తనతో సమాధానపరచుకోనివ్వండి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 5:21
τὸν μὴ γνόντα ἁμαρτίαν, ὑπὲρ ἡμῶν ἁμαρτίαν ἐποίησεν
దేవుడు క్రీస్తును మన పాపము కొరకు బలిగా మార్చాడు
ἡμῶν…ἡμεῖς
ఇక్కడ “మా” మరియు “మనం” అనే పదాలు రెండు కలసి విశ్వాసులందరి గురించి తెలియచేస్తుంది (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
τὸν μὴ γνόντα ἁμαρτίαν
క్రీస్తు ఎన్నటికి పాపమెరుగనివాడు
δικαιοσύνη Θεοῦ ἐν αὐτῷ
దేవుడు ఇలా చేసాడు ... క్రీస్తులో దేవుని నీతి
ἵνα ἡμεῖς γενώμεθα δικαιοσύνη Θεοῦ ἐν αὐτῷ
“దేవుని నీతి” అనే పదం దేవునికి అవసరమయ్యే మరియు దేవునినుండి వచ్చిన నీతిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని నీతి మనలో ఉండవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 6
2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 06 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధనలోని వచనాలైన 2 మరియు 16-18 వచనాలతో యు.ఎల్.టి(ULT) దీనిని చేస్తుంది.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
సేవకులు
పౌలు క్రైస్తవులను దేవుని సేవకులుగా తెలియచేస్తున్నాడు. దేవుడు క్రైస్తవులను అన్ని పరిస్థితులలో తనకు సేవ చేయుటకు పిలుస్తాడు. పౌలు మరియు అతని సహచరులు దేవునికి సేవ చేసిన కొన్ని క్లిష్ట పరిస్థితులను అతను వివరించాడు.
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
విభేదాలు
పౌలు నాలుగు జతల విభేదాలను ఉపయోగిస్తాడు: నీతికి ప్రతిగా అన్యాయానికి, వెలుగుకు ప్రతిగా చీకటికి, క్రీస్తుకు ప్రతిగా సాతానుకు మరియు దేవుని ఆలయానికి ప్రతిగా విగ్రహాలకు. ఈ విబేధాలు క్రైస్తవులకు మరియు క్రైస్తవులు కానివారి మధ్య వ్యత్యాసాన్ని చూపుతాయి. (చూడండి: నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత మరియు వెలుగు, తేజస్సు, మెరుపు, ప్రకాశింప జేయు, జ్ఞానంకలిగించడం మరియు చీకటి)
వెలుగు మరియు చీకటి
పరిశుద్ధ గ్రంథము తరచుగా అవినీతి పరులైన వ్యక్తుల గురించి దేవునికి నచ్చినది చేయని వ్యక్తుల గురించి వారు చీకటిలో తిరుగుతున్నట్లుగా ఉందని చెప్పుచున్నాడు. ఆ పాపపు ప్రజలు నీతిమంతులుగా మార్చడానికి, వారు ఏమి తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మరియు దేవునికి విధేయత చూపడం ప్రారంభించినట్లుగా ఇది వెలుగు గురించి చెప్పుచున్నది. (చూడండి: నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత)
అలంకారికి ప్రశ్నలు
పౌలు తన చదవరులకు నేర్పడానికి అలంకారిక ప్రశ్నల వరసను ఉపయోగిస్తాడు. ఈ ప్రశ్నలన్నియూ అతి ముఖ్యముగా ఒకే విషయాన్ని తెలియచెస్తాయి: క్రైస్తవులు పాపములో ఉన్నవారితో అన్యోన్యముగా సహవాసం చేయకూడదు. పౌలు ఈ ప్రశ్నలను నొక్కి చెప్పాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
మేము
పౌలు తిమోతి మరియు తనను సూచించడానికి “మేము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు. ఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.
2 Corinthians 6:1
2వ వచనములో పౌలు యెషయ నుండి కొంత భాగాన్ని ఉల్లేఖించాడు.
దేవునికోసం కలిసి పనిచేయడం ఎలా ఉంటుదో పౌలు వివరించాడు.
συνεργοῦντες
తానూ మరియు తిమోతి దేవునితో కలసి పని చేస్తున్నట్లు పౌలు తెలియచేస్తున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో కలసి పని చేయడం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καὶ, παρακαλοῦμεν μὴ εἰς κενὸν τὴν χάριν τοῦ Θεοῦ δέξασθαι ὑμᾶς
దేవుని కృప వారి జీవితాలలో ప్రభావవంతంగా ఉండటానికి పౌలు వారిని వేడుకుంటున్నాడు. దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని నుండి పొందిన కృపను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము” (చూడండి: జంట వ్యతిరేకాలు)
2 Corinthians 6:2
λέγει γάρ
దేవుడు అంటాడు. ఇది యెషయ ప్రవక్త నుండి చెప్పబడిన ఉల్లేఖనాన్ని పరిచయం చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు గ్రంథములో చెప్పాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἰδοὺ
ఇక్కడ “చూడండి” అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన వర్తమానము పట్ల శ్రద్ధ వహించమని హెచ్చరిస్తుంది.
2 Corinthians 6:3
μηδεμίαν ἐν μηδενὶ διδόντες προσκοπήν
ఒక వ్యక్తీ క్రీస్తును విశ్వసించకుండా నిరోధించే ఏదైనా అది ఆ వ్యక్తి జారి పడిపోయే వస్తువులాగా ఉంటాడని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా ఉపదేశాన్ని ప్రజలు నమ్మకుండా నిరోధించే ఏదైనా మేము చేయాలనుకోవడం లేదు” (చూడండి: రూపకం)
μὴ μωμηθῇ ἡ διακονία
“నింద” అనే పదం పౌలు చేసే సేవ గురించి చేడుగా మాట్లాడటం మరియు అతను ప్రకటించిన ఉపదేశానికి వ్యతిరేకంగా పని చేయడాన్ని గురించి తెలియచేస్తుంది . దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా సేవ గురించి ఎవరైనా చేడుగా మాట్లడగలరని మేము కోరుకోము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 6:4
పౌలు ఇక్కడ “మేము” అని ఉపయోగించినప్పుడు, అతను తనను మరియు తిమోతిని గురించి చెప్పబడిందని తెలియచేస్తున్నాడు
ἐν παντὶ συνιστάντες ἑαυτοὺς ὡς Θεοῦ διάκονοι
మేము చేసే పనులన్నిటి ద్వారా మేము దేవుని సేవకులమని నిరూపిస్తాము
Θεοῦ διάκονοι: ἐν ὑπομονῇ πολλῇ, ἐν θλίψεσιν, ἐν ἀνάγκαις, ἐν στενοχωρίαις
వారు దేవుని సేవకులని రుజువు చేసిన వివిధ క్లిష్ట పరిస్థితుల గురించి పౌలు ప్రస్తావించాడు
2 Corinthians 6:5
ἐν πληγαῖς, ἐν φυλακαῖς, ἐν ἀκαταστασίαις, ἐν κόποις, ἐν ἀγρυπνίαις, ἐν νηστείαις
వారు దేవుని సేవకులని రుజువు చేసిన వివిధ క్లిష్ట పరిస్థితుల గురించి పౌలు ప్రస్తావిస్తూనే ఉన్నాడు
2 Corinthians 6:6
ἐν ἁγνότητι…ἐν ἀγάπῃ ἀνυποκρίτῳ
వారు దేవుని సేవకులని రుజువు చేసే క్లిష్ట పరిస్థితులలో వారు నిర్వహించిన అనేక నైతిక సత్ప్రవర్తనలను పౌలు రుజువు చేసాడు.
2 Corinthians 6:7
ἐν λόγῳ ἀληθείας, ἐν δυνάμει Θεοῦ
దేవుని శక్తితో సువార్తను ప్రకటించడానికి వారి అంకిత భావం వారు దేవుని సేవకులని రుజువు చేస్తుంది.
ἐν λόγῳ ἀληθείας
సత్యం గురించి దేవుని ఉపదేశాన్ని చెప్పడం ద్వారా లేక “దేవుని సత్య వాక్యాన్ని చెప్పడం ద్వారా”
ἐν δυνάμει Θεοῦ
ప్రజలకు దేవుని శక్తిని చూపించడం ద్వారా
διὰ τῶν ὅπλων τῆς δικαιοσύνης τῶν δεξιῶν καὶ ἀριστερῶν
ఆధ్యాత్మిక యుద్ధాలలో పోరాడటానికి వారు ఉపయోగించే ఆయుధాలు లాగా పౌలు వారి నీతిని గురించి చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
τῶν ὅπλων τῆς δικαιοσύνης
నీతి మనకు కవచంగా ఉంది లేక “నీతి మనకు ఆయుధాలుగా ఉన్నాయి”
τῶν δεξιῶν καὶ ἀριστερῶν
సాధ్యమైయ్య అర్థాలు 1) ఒక చేతిలో ఆయుధం మరియు మరొక చేతిలో కవచం ఉందని చెప్పబడింది లేక 2) వారు యుద్ధానికి పూర్తిగా సిద్ధమైయ్యారు ఏ దిక్కునుండి అయిన దాడులు జరిగిన వాటిని తప్పించుకోగలరు.
2 Corinthians 6:8
ప్రజలు అతని గురించి మరియు అతని సేవ గురించి ఎలా ఆలోచిస్తారో పౌలు అనేక విపరితాలను జాబితా చేసాడు. (చూడండి: వివరణార్థక నానార్థాలు)
ὡς πλάνοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మమ్మల్ని మోసం చేస్తున్నామని నిందించారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 6:9
ὡς ἀγνοούμενοι καὶ ἐπιγινωσκόμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ప్రజలకు తెలియదు మరియు ఇంకా మేము ప్రజలకు బాగా తెలుసు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὡς παιδευόμενοι καὶ μὴ θανατούμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పనులకు ప్రజలు మమ్మల్ని శిక్షిస్తున్నట్లుగా మేము పని చేస్తున్నాము కాని వారు మాకు మరణ శిక్షను విధించడం లేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 6:11
కొరింతులోని విశ్వాసులను విగ్రహాలనుండి వేరు చేసి దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాలను జీవించాలని పౌలు ప్రోత్సహిస్తాడు.
τὸ στόμα ἡμῶν ἀνέῳγεν πρὸς ὑμᾶς
మీతో న్యాయముగా మాట్లాడారు
ἡ καρδία ἡμῶν πεπλάτυνται
పౌలు కొరింతియుల పట్ల తనకున్న గొప్ప అభిమానం గురించి మాట్లాడుతూ అది తెరచిన హృదయాన్ని కలిగి ఉన్నట్లు ఉందని చెప్పుచున్నాడు. ఇక్కడ “హృదయం” అనేది భావోద్వేగాలకు మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా : “మేము మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము (చూడండి : రూపకం మరియు అన్యాపదేశము)
2 Corinthians 6:12
οὐ στενοχωρεῖσθε ἐν ἡμῖν, στενοχωρεῖσθε δὲ ἐν τοῖς σπλάγχνοις ὑμῶν
కొరింథీయులకు తనపై ప్రేమ లేకపోవడం గురించి పౌలు మాట్లాడుతూ వారి హృదయాలు కఠిన అంతరంగములోనికి అదుమబడినట్లు ఉన్నాయని చెప్పుచున్నాడు. ఇక్కడ “హృదయం” అనేది భావోద్వేగాలకు మారుపేరై యున్నది. (చూడండి: రూపకం మరియు అన్యాపదేశము)
οὐ στενοχωρεῖσθε ἐν ἡμῖν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మిమ్మల్ని నిగ్రహించలేదు” లేక “మమ్మల్ని ప్రేమించడం ఆపడానికి మేము మీకు ఎటువంటి కారణం ఇవ్వలేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
στενοχωρεῖσθε…ἐν τοῖς σπλάγχνοις ὑμῶν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ మీ స్వంత హృదయాలు మిమ్మల్ని నిగ్రహించాయి” లేక “మీ స్వంత కారణాల వలన మీరు మమ్మల్ని ప్రేమించడం మానేశారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 6:13
πλατύνθητε καὶ ὑμεῖς
పౌలు కొరింథీయులను ప్రేమించినట్లుగా తనను ప్రేమించాలని కోరాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్మల్ని తిరిగి ప్రేమించండి” లేక “మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే మమ్మల్ని ప్రేమించండి” (చూడండి: రూపకం)
2 Corinthians 6:14
16వ వచనములో, పౌలు అనేక పాత నిబంధన ప్రవక్తలనుండి భాగాలను వ్యాఖ్యానించాడు: మోషే, జెకర్యా, ఆమోసు మరియు బహుశః ఇతరులు.
μὴ γίνεσθε ἑτεροζυγοῦντες ἀπίστοις
దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులతో మాత్రమే కట్టబడి ఉండండి” (చూడండి: జంట వ్యతిరేకాలు)
μὴ γίνεσθε ἑτεροζυγοῦντες
నాగలి లేక బండిని లాగడానికి రెండు పశువులను కట్టి వేసినట్లుగా పౌలు ఒక సాధారణ ప్రయోజనం కోసం కలిసి పని చేయడం గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనతో జట్టుకట్టండి” లేక “ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి” (చూడండి: రూపకం)
τίς γὰρ μετοχὴ δικαιοσύνῃ καὶ ἀνομίᾳ
ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతికి దుర్నీతితో సంబంధం ఉండదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἢ τίς κοινωνία φωτὶ πρὸς σκότος?
వెలుగు చీకటిని పారద్రోలుతుంది కాబట్టి వెలుగు మరియు చీకటి కలిసి ఉండలేవని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుతాడు. “వెలుగు” మరియు “చీకటి” అనే పదాలు నైతిక మరియు ఆధ్యాత్మిక స్వభావముల గురించి తెలియచేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెలుగుకు చీకటితో సహవాసము ఉండదు” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు రూపకం)
2 Corinthians 6:15
τίς δὲ συμφώνησις Χριστοῦ πρὸς Βελιάρ
ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తుకు మరియు సాతనుకు మధ్య ఎటువంటి ఒప్పందము లేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Βελιάρ
ఇది సాతాను యొక్క మరొక పేరైయున్నది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἢ τίς μερὶς πιστῷ μετὰ ἀπίστου?
ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక విశ్వాసి అవిశ్వాసితో సమానంగా ఏమి పంచుకోడు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
2 Corinthians 6:16
τίς δὲ συνκατάθεσις ναῷ Θεοῦ μετὰ εἰδώλων?
ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఆలయానికి విగ్రహాలకు మధ్య ఎటువంటి ఒప్పందం లేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἡμεῖς γὰρ ναὸς Θεοῦ ἐσμεν ζῶντος
క్రైస్తవులందరినీ దేవుడు నివసించడానికి ఒక ఆలయంగా ఏర్పరచుకుంటాడని పౌలు తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయా తర్జుమా: “మనము సజీవ దేవుడు నివసించే ఆలయం లాంటి వారము” (చూడండి: రూపకం మరియు అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἐνοικήσω ἐν αὐτοῖς, καὶ ἐνπεριπατήσω
ఈ పాత నిబంధన ఉల్లేఖనం దేవుడు ప్రజలతో రెండు రకాలుగా ఉండటం గురించి మాట్లాడుతుంది. “నివసించు” అనే పదాలు ఇతరులు నివసించే ప్రదేశం గురించి చెప్పుచుండగా, “నడచు” అనే పదాలు వారి జీవితాల గురించి చూచినప్పుడు వారితో ఉండటం గురించి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వారితో ఉంటాను మరియు వారికి సహాయం చేస్తాను” (చూడండి: సమాంతరత మరియు రూపకం)
2 Corinthians 6:17
పాత నిబంధన ప్రవక్తలైన యెషయా మరియు యెహేజ్కేలు చెప్పిన భాగాలను పౌలు ఉల్లేఖించాడు.
ἀφορίσθητε
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి” లేక “మిమ్మల్ని వేరు చేయడానికి నన్ను అనుమతించండి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀκαθάρτου μὴ ἅπτεσθε
దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పవిత్రమైన వాటిని మాత్రమే ముట్టండి” (చూడండి: జంట వ్యతిరేకాలు)
2 Corinthians 7
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 07 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
2-4 వచనాలలో, పౌలు తన సమర్థనను ముగించాడు. అప్పుడు అతడు తీతు తిరిగి రావడం గురించి మరియు అతడు తిరిగి వచ్చినందున కలిగిన ఆదరణ గురించి వ్రాస్తాడు.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
పవిత్రత మరియు అపవిత్రత
దేవుడు పాపమునుండి వారిని పవిత్ర పరిచాడు అంటే క్రైస్తవులు “పవిత్రంగా” ఉన్నారు అని దీని అర్థం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రంగా ఉండటానికి వారు విచారించాల్సిన అవసరం లేదు. భక్తీహినమైన జీవితం ఇప్పటికీ క్రైస్తవుడిని అపవిత్రం చేస్తుంది. (చూడండి: శుద్ధమైన, కడుగు మరియు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం)
బాధ మరియు విచారం
ఈ అధ్యాయములోని “విచారకరమైన” మరియు “బాధకరమైన” అనే పదాలు కొరింథీయులు పశ్చాత్తాపం చెందడానికి కలత చెందారని సూచిస్తున్నాయి. (చూడండి: పశ్చాత్తాపపడు, పశ్చాత్తాపము)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
మేము
పౌలు తిమోతి మరియు తనను సూచించడానికి “మేము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు. \nఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.
అసలు పరిస్థితి
ఈ అధ్యాయము మునుపటి పరిస్థితిని వివరంగా చర్చిస్తుంది. ఈ అధ్యాయములోని వర్తమానము నుండి ఈ పరిస్థితి యొక్క కొన్ని అంశాలను మనం గుర్తించవచ్చు. కాని ఈ రకమైన అస్పష్ట వర్తమానాన్ని అనువాదంలో చేర్చకపోవడమే మంచిది. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 7:1
పాపమునుండి వేరుచేయబడాలని ఉద్దేశపూర్వకంగా పరిశుద్ధతను కోరుకోవాలని పౌలు వారికి గుర్తు చేస్తూనే ఉన్నాడు.
ἀγαπητοί
నేను ప్రేమించే మీరు లేక “ప్రియమైన స్నేహితులు”
καθαρίσωμεν ἑαυτοὺς
దేవునితో ఒకరి సంబంధాన్ని ప్రభావితం చేసే ఏ విధమైన పాపనికి దూరంగా ఉండమని ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు.
ἐπιτελοῦντες ἁγιωσύνην
పరిశుద్దంగా ఉండటానికి ప్రయత్నించుదుము
ἐν φόβῳ Θεοῦ
దేవుని పట్ల లోతైన గౌరవంలో నుండి
2 Corinthians 7:2
ఈ కొరింథీ విశ్వాసులు ఇతర నాయకులను అనుసరించాలని వారు ప్రయత్నించారని కొరింథు ప్రజలకు ఇప్పటికే హెచ్చరించిన తరువాత, పౌలు ప్రజల గురించి తనకు ఎలా అనిపిస్తుందో గుర్తుచేస్తాడు
χωρήσατε ἡμᾶς
వారి హృదయాలను తెరవడం గురించి 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6:11నుండి పౌలు చెప్పిన దానిని ఇది తిరిగి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ హృదయాలలో మాకు చోటు కల్పించండి” లేక “మమ్మల్ని ప్రేమించండి మరియు మమ్మల్ని అంగికరించండి” (చూడండి: రూపకం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 7:3
πρὸς κατάκρισιν οὐ λέγω
మీరు తప్పు చేసారని ఆరోపించడానికి నేను ఇలా అనను. “ఇది” అనే పదం ఎవరికీ అన్యాయం చేయలేదు అనేదాన్ని పౌలు ముందే చెప్పాడని తెలియచేస్తుంది.
ἐν ταῖς καρδίαις ἡμῶν ἐστε
కొరింథీయుల పట్ల అతను మరియు అతని సహచరుల గొప్ప ప్రేమ గురించి పౌలు మాట్లాడుతూ వారు తమ హృదయాలలో వాటిని పెట్టుకోవాలని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మాకు చాలా ప్రీయమైనవారు (చూడండి: రూపకం)
εἰς τὸ συναποθανεῖν καὶ συνζῆν
పౌలు మరియు అతని సహచరులు ఏమి జరిగిన కొరింథీయులను ప్రేమిస్తూనే ఉంటారని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము జీవించడానికైనా లేక చావడానికైనా” (చూడండి: జాతీయం (నుడికారం))
εἰς τὸ συναποθανεῖν
మనము అనే పదంలో కొరింథులోని విశ్వాసులు చేర్చబడ్డారు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
2 Corinthians 7:4
πεπλήρωμαι τῇ παρακλήσει
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను ఓదార్చండి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὑπερπερισσεύομαι τῇ χαρᾷ
పౌలు ఆనందం గురించి మాట్లాడుతూ, అది ఒక ద్రవ రూపంలో ఉంటే పొంగిపోయే వరకు అతనిని నింపుతుందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చాలా ఆనందంగా ఉన్నాను” (చూడండి: రూపకం)
ἐπὶ πάσῃ τῇ θλίψει ἡμῶν
మా కష్టాలన్నీ ఉన్నప్పటికిని
2 Corinthians 7:5
ἐλθόντων ἡμῶν εἰς Μακεδονίαν
ఇక్కడ “మేము” అనే పదం పౌలు మరియు తిమోతిలను సూచిస్తుంది కాని కొరింథీయులను లేక తీతుని గురించి కాదు. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
οὐδεμίαν ἔσχηκεν ἄνεσιν ἡ σὰρξ ἡμῶν
ఇక్కడ “శరీరాలు” అనేది మొత్తం వ్యక్తిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు విశ్రాంతి లేదు” లేక “మేము చాలా అలసిపోయాము” (చూడండి: ఉపలక్షణము)
ἐν παντὶ θλιβόμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అన్నివైపుల నుండి కష్టాలను ఎదుర్కొన్నాము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἔξωθεν μάχαι, ἔσωθεν φόβοι
“వెలుపలకు” అనే పదానికి సాధ్యమైయ్యే అర్థాలు 1) “మా శరీరాల వెలుపల” లేక 2) “సంఘము వెలుపల.” “లోపల” అనే పదం వారి లోపలి భావోద్వేగాల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులతో విభేదాల ద్వారా మరియు మాలోని భయాల ద్వారా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 7:7
ἐν τῇ παρακλήσει ᾗ παρεκλήθη ἐφ’ ὑμῖν
కొరింథీయులు తీతును ఆదరించారని తెలుసుకున్న పౌలు ఆదరణ పొందాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీతు మీ నుండి పొందిన ఆదరణ గురించి తెలుసుకోవడం ద్వారా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 7:8
ఈ కొరింథు విశ్వాసులకు పౌలు వ్రాసిన మొదటి పత్రికగురించి ఇది తెలియ చేస్తుంది, అక్కడ తన తండ్రి భార్యతో ఒక విశ్వాసి లైంగిక అనైతికతను అంగీకరించినందుకు వారిని మందలించాడు.
పౌలు వారి దైవిక దుఃఖము, సరైన పని చేయాలని ఉత్సాహం మరియు అది తనకు మరియు తీతుకు తెచ్చిన ఆనందానికి ప్రశంసించాడు.
βλέπω ὅτι ἡ ἐπιστολὴ
నా లేఖను నేను తెలుసుకున్నప్పుడు
2 Corinthians 7:9
οὐχ ὅτι ἐλυπήθητε
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా లేఖలో నేను చెప్పినది బాధపెట్టినందున కాదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐν μηδενὶ ζημιωθῆτε ἐξ ἡμῶν
మేము మిమ్మల్ని మందలించినందున మీరు నష్టం పొందలేదు. ఈ లేఖ వారికి దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఇది వారి పశ్చాత్తాపానికి దారి తీసింది గనుక చివరికి వారు ఆ లేఖ నుండి ప్రయోజనం పొందారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మేము మీకు ఏ విధంగానైననూ హాని చేయలేదు” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 7:10
ἡ γὰρ κατὰ Θεὸν λύπη, μετάνοιαν εἰς σωτηρίαν
“పశ్చాత్తాపం” అనే పదం దాని సంబంధాన్ని దాని ముందు ఉన్నదానికి మరియు దానిని అనుసరించే వాటికి స్పష్టం చేయడానికి పునరావృతం కావొచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దైవిక విచారం పశ్చాత్తాపం కలిగిస్తుంది, మరియు పశ్చాత్తాపం రక్షణకు దారి తీస్తుంది” (చూడండి: శబ్దలోపం)
ἀμεταμέλητον
సాధ్యమైయ్య అర్థాలు 1) ఆ విచారం వారి పశ్చాత్తాపం మరియు రక్షణకు దారి తీసినందున పౌలు వారికి విచారం కలిగించాడని బాధపడటం లేదు లేక 2) అది వారి పశ్చాత్తాపం మరియు రక్షణకు దారి తీసినందున కొరింథీయులు విచారాన్ని అనుభవించినందుకు చింతించుట లేదు.
ἡ δὲ τοῦ κόσμου λύπη, θάνατον κατεργάζεται
ఈ విధమైన విచారం రక్షణకు బదులుగా చావునకు దారి తీస్తుంది ఎందుకంటే ఇది పశ్చాత్తాపం కలిగించదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకానుసారమైన విచారం ఎట్లైనను ఆధ్యాత్మిక చావుకు దారి తీస్తుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 7:11
ἰδοὺ γὰρ αὐτὸ τοῦτο
ఎలాంటి గొప్ప పట్టుదల మీరే చూడండి
σπουδήν: ἀλλὰ ἀπολογίαν
ఇక్కడ “ఎలా” అనే పదం ఈ వివరణను ఆశ్చర్యార్థకం చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నిర్దోషులని రుజువు చేసే మీ పట్టుదల చాలా గొప్పది!” (చూడండి: ఆశ్చర్యార్థకాలు)
ἀλλὰ ἀγανάκτησιν
మీ రోషం
ἀλλὰ ἐκδίκησιν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా న్యాయం చేయాలి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 7:12
τοῦ ἀδικήσαντος
చెడ్డ పని చేసినవాడు
τοῦ φανερωθῆναι τὴν σπουδὴν ὑμῶν, τὴν ὑπὲρ ἡμῶν πρὸς ὑμᾶς ἐνώπιον τοῦ Θεοῦ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మా పట్ల మీకున్న ఆసక్తి నిజాయితీ అని మీకు తెలుస్తుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐνώπιον τοῦ Θεοῦ
ఇది దేవుని సన్నిధి గురించి తెలియచేస్తుంది. పౌలు యథార్థతకు దేవుని అవగాహన మరియు ఆమోదం దేవుడు వాటిని చూడగలడనే దాని గురించి తెలియచేస్తుంది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఎదుట” లేక “దేవునితో సాక్షిగా” (చూడండి: రూపకం)
2 Corinthians 7:13
διὰ τοῦτο παρακεκλήμεθα
ఇక్కడ “ఇది” అనే పదం పౌలు మునుపటి లేఖకు కొరింథీయులు ప్రతిస్పందించిన విధానాన్ని అతడు మునుపటి కావ్యంలో వివరించినదాని గురించి తెలియచేస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇదే మమ్మల్ని ప్రోత్సాహిస్తుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀναπέπαυται τὸ πνεῦμα αὐτοῦ ἀπὸ πάντων ὑμῶν
ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక వ్యక్తి యొక్క స్వభావమును మరియు మనోవైఖరిని గురించి తెలియచేస్తుంది దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరందరూ అతని ఆత్మకు ఊరట కలిగించారు” లేక “మీరందరూ అతనిని చింతించకుండా చేసారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 7:14
ὅτι εἴ τι αὐτῷ ὑπὲρ ὑμῶν κεκαύχημαι
మీ గురించి నేనతనితో గొప్పగా చెప్పుకున్నాను
οὐ κατῃσχύνθην
మీరు నన్ను సిగ్గుపరచలేదు
ἡ καύχησις ἡμῶν ἡ ἐπὶ Τίτου ἀλήθεια ἐγενήθη
తీతుకు మీ గురించి మేము చెప్పిన గొప్పతనం వాస్తవమని మీరు నిరూపించారు
2 Corinthians 7:15
τὴν πάντων ὑμῶν ὑπακοήν
“విధేయత” అనే నామవాచకాన్ని “పాటించండి” అనే క్రీయ రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరందరూ ఎలా పాటించారో” (చూడండి: భావనామాలు)
μετὰ φόβου καὶ τρόμου ἐδέξασθε αὐτόν
ఇక్కడ “భయం” మరియు “వణుకు” ఒకే రకమైన అర్థాలను కలిగియున్నాయి మరియు ఇవి భయము యొక్క బలమును గురించి నొక్కి చెపుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అతని ఎంతో ఆదరణతో చేర్చుకున్నారు
μετὰ φόβου καὶ τρόμου
సాధ్యమైయ్య అర్థాలు 1) దేవుని పట్ల ఎంతో భక్తితో” లేక 2) తీతు పట్ల ఎంతో ఆదరణతో.”
2 Corinthians 8
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 08 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
8 మరియు 9 అధ్యాయములు క్రొత్త భాగాన్ని ప్రారంభిస్తాయి. గ్రీసు దేశములోని సంఘాలు \nయేరుషలేములోని నిరుపేద విశ్వాసులకు ఎలా సహాయపడ్డాయో పౌలు వ్రాసాడు.
కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి మిగిలిని వచనం అవతల పేజిలో కుడి వైపున ఈ ఉల్లేఖనాలను ఉంచుతాయి. యు.ఎల్.టి (ULT)ఇది చేస్తుంది 15వ వచనం ఉల్లేఖించిన పదాలతో దీన్ని చేస్తుంది.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
యేరుషలేము సంఘానికి బహుమతి
కొరింథులోని సంఘం యేరుషలేములోని పేద విశ్వాసులకు చందా ఇవ్వడానికి ఆయత్తపరచడం ప్రారంభించింది. మాసిదోనియలోని సంఘాలు కూడా ఔదార్యముతో ఇచ్చాయి. కొరింథీయులను దాతృత్వముతో ఇవ్వమని ప్రోత్సహించుటకు పౌలు తీతును మరియు మరో ఇద్దరు విశ్వాసులను కొరింథుకు పంపుతాడు. పౌలు మరియు ఆ చందాను యేరుషలేముకు తిసుకువేళతారు. ఇది న్యాయంగా జరుగుతుందని ప్రజలు తెలుసుకోవాలని వారు కోరుకుంటారు.
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
మేము
పౌలు తిమోతి మరియు తనను సూచించడానికి “మేము” అనే సర్వనామమును ఉపయోగిస్తాడు. ఇందులో ఇతర వ్యక్తులు కూడా ఉండవచ్చు.
శాస్త్రవిరుద్ధం
“శాస్త్రవిరుద్ధం” అనేది అసాధ్యమైనదాన్ని వివరించడానికి కనిపించే నిజమైన వివరణయై యున్నది. 2వ వచనములోని ఈ వాక్యాలు శాస్త్రవిరుద్దమైనవి: “వారి ఆనందం యొక్క సమృద్ధి మరియు వారి పేదరికం యొక్క తీవ్రత ఔదార్యము యొక్క గొప్ప సంపదను ఉత్పత్తి చేసారు. 3వ వచనములో వారి పేదరికం సంపదను ఎలా ఉత్పత్తి చేసిందో వివరిస్తుంది. పౌలు ధనవంతులు మరియు పేదరికాన్ని ఇతర విరుద్ధమైన విషయాలో కూడా ఉపయోగిస్తాడు. (2వ కొరింతియులకు వ్రాసిన పత్రిక 8:2)
2 Corinthians 8:1
తన మారిన ప్రణాలికను మరియు పరిచర్య లక్ష్యాన్ని వివరించిన పౌలు ఇవ్వడం గురిచి మాట్లాడతాడు.
τὴν χάριν τοῦ Θεοῦ τὴν δεδομένην ἐν ταῖς ἐκκλησίαις τῆς Μακεδονίας
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాసిదోనియ సంఘాలకు దేవుడు ఇచ్చిన కృప” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 8:2
ἡ περισσεία τῆς χαρᾶς αὐτῶν καὶ ἡ κατὰ βάθους πτωχεία αὐτῶν, ἐπερίσσευσεν εἰς τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν
పౌలు “ఆనందం” మరియు “పేదరికం” గురించి మాట్లాడుతూ అవి దాతృత్వమును ఉత్పత్తి చేయగల సజీవమైన వస్తువులవలే ఉన్నాయని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు గొప్ప ఆనందం మరియు విపరీతమైన పేదరికం కారణంగా వారు చాలా దాతృత్వముగలవారైయ్యారు. (చూడండి: మానవీకరణ)
ἡ περισσεία τῆς χαρᾶς αὐτῶν
పౌలు ఆనందం గురించి మాట్లాడుతూ అది సహజమైన వస్తువుల ఉంటే అది ఆకారము లేక పరిమాణములో పెరుగుతుంది. (చూడండి: రూపకం)
ἡ κατὰ βάθους πτωχεία αὐτῶν…τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν
మాసిదోనియా ప్రాంతములోని సంఘాలు బాధ మరియు పేదరికం యొక్క పరీక్షలను ఎదుర్కొన్నప్పటికిని, దేవుని కృప ద్వారా, వారు యేరుషలేములోని విశ్వాసుల కోసం చందా సమకూర్చగలిగారు.
τὸ πλοῦτος τῆς ἁπλότητος αὐτῶν
చాల గొప్ప దాతృత్వము. “గొప్ప ధనవంతులు” అనే పదాలు వారి దాతృత్వము యొక్క గొప్పతనాన్ని నొక్కి చెప్పుచున్నాయి.
2 Corinthians 8:3
κατὰ
ఇది మసిదోనియా ప్రాంతములోని సంఘాల గురించి తెలియచేస్తుంది
αὐθαίρετοι
స్వచ్ఛందంగా
2 Corinthians 8:4
τῆς διακονίας τῆς εἰς τοὺς ἁγίους
పౌలు యేరుషలేములోని విశ్వాసులకు చందాను అందించడం గురించి ప్రస్తావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేములోని విశ్వాసులకు అందించే ఈ పరిచర్య” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 8:6
προενήρξατο
యేరుషలేములోని విశ్వాసుల కోసం కొరింథీయులనుండి సమకూర్చిన చందాను గురించి పౌలు తెలియచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఇవ్వడాన్ని మొదటి స్థానం లో ప్రోత్సహించినవారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐπιτελέσῃ εἰς ὑμᾶς καὶ τὴν χάριν ταύτην
కొరింథీయులు చందా సమకూర్చుట పూర్తి చేయడానికి తీతు వారికి సహాయం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ దాత్రుత్వపు బహుమతిని సమకూర్చి ఇవ్వడం పూర్తి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి” అని వ్రాయబడింది (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 8:7
ἐν ταύτῃ τῇ χάριτι περισσεύητε
పౌలు కొరింథీ విశ్వాసులను గురించి మాటాడుతూ వారు సహజమైన వస్తువులను ఉత్పత్తి చెసినట్లు ఉన్నారని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేరుషలేములోని విశ్వాసుల కోసం ఇవ్వడంలో మీరు బాగా రాణిస్తున్నారని నిశ్చయించుకోండి” (చూడండి: రూపకం)
2 Corinthians 8:8
διὰ τῆς ἑτέρων σπουδῆς…δοκιμάζων
కొరింథీయులను మాసిదోనియా సంఘాల ఔదార్యముతో పోల్చడం ద్వారా దాతృత్వంగా ఇవ్వమని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 8:9
τὴν χάριν τοῦ Κυρίου ἡμῶν
ఈ సందర్భములలో, “కృప” అనే పదం యేసు కొరింథీయులను ఆశిర్వదించిన ఔదార్యమును నొక్కి చెపుతుంది.
δι’ ὑμᾶς ἐπτώχευσεν, πλούσιος ὤν
యేసు మానవ దేహాన్ని దాల్చాక ముందు ధనవంతుడని మరియు ఆయన పేద మనుష్యుడుగా మారడం గురించి పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ὑμεῖς τῇ ἐκείνου πτωχείᾳ πλουτήσητε
యేసు మనుష్యుడు కావడం వలన కొరింతియులు ఆధ్యాత్మికంగా ధనవతులైయ్యారు. (చూడండి: రూపకం)
2 Corinthians 8:10
ἐν τούτῳ
ఇది యేరుషలేములోని విశ్వాసులకు ఇవ్వడానికి వారు సమకూర్చిన చందా గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమకూర్చుటకు సంబంధించి” అని వ్రాయబడింది (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 8:11
καθάπερ ἡ προθυμία τοῦ θέλειν
ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఆశగా ఉన్నారు మరియు దీన్ని చేయాలనుకున్నారు” (చూడండి: భావనామాలు)
καὶ τὸ ἐπιτελέσαι
దాన్ని పూర్తి చేయండి లేక “దాన్ని ముగింపుకు తీసుకురండి”
2 Corinthians 8:12
εὐπρόσδεκτος
ఇక్కడ “మంచి” మరియు “ఆమోదకరమైన” అనే పదాలు ఒకే అర్థాలను పంచుకుంటాయి మరియు విషయం యొక్క మంచితనాన్ని నొక్కి చెపుతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల మంచి విషయం” (చూడండి: జంటపదం)
καθὸ ἐὰν ἔχῃ
ఇవ్వడం అనేది ఒక వ్యక్తికి ఉన్నదానిపై ఆధారపడి ఉండాలి
2 Corinthians 8:13
γὰρ
ఇది యేరుషలేములోని విశ్వాసుల కోసం చందా సమకూర్చాడాన్ని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చందా సమకూర్చే ఈ పని కోసం” అని చెప్పబడింది (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἵνα ἄλλοις ἄνεσις, ὑμῖν θλῖψις
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ఇతరులకు ఉపశమనం కలిగించి మీకు భారం కలిగేలా” అని వ్రాయబడింది (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐξ ἰσότητος
సమానత్వము ఉండాలి
2 Corinthians 8:14
ἵνα καὶ τὸ ἐκείνων περίσσευμα γένηται εἰς τὸ ὑμῶν ὑστέρημα
ప్రస్తుత సమయంలో కొరింథీయులు వ్యవహరిస్తున్నందున, భవిష్యత్తులో కొంత సమయం యెరుషలేములోని విశ్వాసులు కూడా వారికి సహాయం చేస్తారని సూచించబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భవిష్యత్తులో వారి సమృద్ది మీ అవసరాన్ని తీర్చడానికి ఇది కూడా కారణం”
2 Corinthians 8:15
καθὼς γέγραπται
ఇక్కడ పౌలు నిర్గమకాండము నుండి ఉల్లేఖించాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే వ్రాసినట్లు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οὐκ ἠλαττόνησεν
దీనిని సానుకూలంగా చెప్పవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను అవసరమైనవన్ని కలిగి యున్నాడు” (చూడండి: జంట వ్యతిరేకాలు)
2 Corinthians 8:16
τῷ διδόντι τὴν αὐτὴν σπουδὴν ὑπὲρ ὑμῶν ἐν τῇ καρδίᾳ Τίτου
ఇక్కడ “హృదయాలు” అనే పదం భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. తీతు వారిని ప్రేమించడానికి దేవుడు కారణమైయాడని దీని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చేసినంతగా తీతు మీ గురించి శ్రద్ధ వహించాడు” (చూడండి: ఉపలక్షణము)
τὴν αὐτὴν σπουδὴν
అదే ఉత్సాహము లేక “అదే లోతైన విచారము”
2 Corinthians 8:17
ὅτι τὴν μὲν παράκλησιν ἐδέξατο
కొరింథుకు తిరిగివచ్చి సమకూర్చటాన్ని పూర్తి చేయమని తీతును కోరినట్లు పౌలు ప్రస్తావిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా విన్నపాన్ని అంగికరించడమే కాక అతడు సమకూర్చుటకు మీకు సహాయం చేస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 8:18
μετ’ αὐτοῦ
తీతు తో
τὸν ἀδελφὸν, οὗ ὁ ἔπαινος ἐν τῷ εὐαγγελίῳ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు ప్రభువు సంఘాలన్నిటిలోను విశ్వాసులు ప్రసిద్ధి చేసే సహోదరుడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 8:19
οὐ μόνον
అన్ని సంఘాలలోని విశ్వాసులు అతనిని ప్రసిద్ది చేయడమే కాదు
καὶ χειροτονηθεὶς ὑπὸ τῶν ἐκκλησιῶν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘాలు కూడా అతనిని నియమించాయి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
σὺν τῇ χάριτι ταύτῃ τῇ διακονουμένῃ ὑφ’ ἡμῶν
దాతృత్వము యొక్క చర్యను కొనసాగించుటకు. విరాళమును యెరుషలేముకు తీసుకెళ్ళడాన్ని గురించి ఇది తెలియచేస్తుంది
προθυμίαν ἡμῶν
సహాయం చేయడానికి మా ఆసక్తిని ప్రదర్శించాలని
2 Corinthians 8:20
ἐν τῇ ἁδρότητι ταύτῃ τῇ διακονουμένῃ ὑφ’ ἡμῶν
విరాళమును యెరుషలేముకు తీసుకెళ్ళడాన్ని గురించి ఇది తెలియచేస్తుంది. ఔదార్యము అనే వియుక్త నామవాచకాన్ని విశేషణంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఈ దాతృత్వపు బహుమతిని నిర్వహిస్తున్న విధానాన్ని సంబంధించి” అని చెప్పబడింది (చూడండి: భావనామాలు)
2 Corinthians 8:21
προνοοῦμεν γὰρ καλὰ
ఈ బహుమతిని గౌరవప్రదంగా నిర్వహించడానికి మేము జాగ్రత్తగా ఉన్నాము
ἐνώπιον Κυρίου…ἐνώπιον ἀνθρώπω
ప్రభువు దృష్టిలో ... లేక మనుష్యుల దృష్టిలో
2 Corinthians 8:22
αὐτοῖς
“వారిని” అనే పదం తీతును మరియు గతంలో చెప్పబడిన సహోదరుడి గురించి తెలియచేస్తుంది.
2 Corinthians 8:23
κοινωνὸς ἐμὸς καὶ εἰς ὑμᾶς συνεργός
అతను మీకు సహాయం చేయడానికి అతడు నా సేవలో భాగస్తుడు
εἴτε ἀδελφοὶ ἡμῶν
ఇది తీతుతో పాటు వచ్చే మరో ఇద్దరు వ్యక్తుల గురించి తెలియచేస్తుంది.
ἀπόστολοι ἐκκλησιῶν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘాలు వారిని పంపించాయి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
δόξα Χριστοῦ
ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు దేవుని గౌరవించడానికి కారణమవుతారు” (చూడండి: భావనామాలు)
2 Corinthians 9
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 09 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలు చదవడానికి సులువుగా ఉండటానికి కావ్యంలోని ప్రతి పంక్తిని మిగిలిన వచనం కంటే కుడి వైపుకు అమర్చుతాయి. పాత నిబంధన నుండి ఉల్లేఖించబడిన 9వ వచనముతో యు.ఎల్.టి(ULT) దీన్ని చేస్తుంది.
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
రూపకఅలంకారములు
పౌలు మూడు వ్యవసాయ సంబంధమైన రూపకఅలంకారాములను ఉపయోగిస్తాడు. నిరుపేద విశ్వాసులకు ఇవ్వడం గురించి బోధించడానికి ఆయన వాటిని ఉపయోగిస్తాడు. ఔదార్యముతో ఇచ్చేవారికి దేవుడు ప్రతిఫలమిస్తాడని వివరించడానికి రూపకఅలంకారాలు పౌలుకు సహాయ పడతాయి. దేవుడు వారికి ఎలా లేక ఎప్పుడు ప్రతిఫలమిస్తాడో పౌలు చెప్పడు. (చూడండి: రూపకం)
2 Corinthians 9:1
పౌలు అకయ గురించి తెలియచేసినప్పుడు, అతడు దక్షిణ గ్రీసులో కొరింథు ఉన్న రోమ దేశం గురించి చెప్పుచున్నాడు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
పౌలు ఇవ్వడం అనే అంశం పై కొనసాగుతున్నాడు. యెరుషలేములోని నిరుపేద విశ్వాసుల కోసం సమర్పణలను సమకూర్చుట అతను రాక ముందే జరిగేల చూసుకోవాలి, తద్వారా అతను వాటిని సద్వినియోగం చేసుకున్నట్లు అనిపించదు. ఇవ్వడం ఇచ్చేవారిని ఎలా ఆశీర్వదిస్తుందో మరియు దేవుడు ఎలా మహిమ పరచాబడునో అని అతను చెప్పుచున్నాడు
τῆς διακονίας τῆς εἰς τοὺς ἁγίους
ఇది యెరుషలేములోని విశ్వాసులకు ఇవ్వడానికి చందా సమకూర్చుట గురించి తెలియ చేస్తుంది. ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరుషలేములోని విశ్వాసులకు సేవ” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 9:2
Ἀχαΐα παρεσκεύασται
ఇక్కడ అకయ అనేది ఈ ప్రాంతం లో నివసించే ప్రజలను మరియు ప్రత్యేకంగా కొరింథులోని సంఘ ప్రజల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అకయ ప్రజలు సిద్ధమవుతున్నారు” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 9:3
τοὺς ἀδελφούς
ఇది తీతును మరియు అతనితో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులను గురించి తెలియచేస్తుంది
μὴ τὸ καύχημα ἡμῶν, τὸ ὑπὲρ ὑμῶν, κενωθῇ
కొరింథీయులను గురించి తానూ గొప్పగా చెప్పిన విషయాలు అబద్ధమని ఇతరులు అనుకోవడాన్ని పౌలు కోరుకోడు
2 Corinthians 9:4
εὕρωσιν ὑμᾶς ἀπαρασκευάστους
మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు
2 Corinthians 9:5
τοὺς ἀδελφοὺς, ἵνα προέλθωσιν εἰς ὑμᾶς
పౌలు దృష్టికోణంలో, సహోదరులు వెళ్లుచున్నారు ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మీ దగ్గరకు వెళ్ళుదురు”
μὴ ὡς πλεονεξίαν
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మిమ్మల్ని ఇవ్వమని బలవంతము చేసినట్లు కాదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 9:6
ὁ σπείρων…ἐπ’ εὐλογίαις καὶ θερίσει
ఇచ్చే ఫలితాలను వివరించడానికి పౌలు ఒక వ్యవసాయము చేసేవాడు విత్తనాలు వేసే చిత్రాన్ని ఉపయోగిస్తాడు. వ్యవసాయం చేయువాడు అతడు ఎంత విత్తుకుంటాడో అనే దానిపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి కొరింథీయులు ఎంత దాతృత్వంగా ఇస్తారనే దానిపై దేవుని తక్కువైన లేక ఎక్కువైన ఉంటుంది. (చూడండి: రూపకం)
2 Corinthians 9:7
ἕκαστος καθὼς προῄρηται τῇ καρδίᾳ
ఇక్కడ “హృదయాలు” అనే పదం ఆలోచన మరియు భావోద్వేగాలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నిశ్చయించినట్లు ఇవ్వండి” (చూడండి: అన్యాపదేశము)
μὴ ἐκ λύπης ἢ ἐξ ἀνάγκης
ఈ వాక్యభాగాన్ని నోటిమాటలుగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను నేరాన్ని అనుభవిస్తున్నందువలన కాదు లేక ఎవరైనా అతని బలవంతము చేసినందువలన కాదు” (చూడండి: భావనామాలు)
ἱλαρὸν γὰρ δότην ἀγαπᾷ ὁ Θεός
తోటి విశ్వాసులకు అందించడానికి ప్రజలు సంతోషంగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు
2 Corinthians 9:8
δυνατεῖ δὲ ὁ Θεὸς, πᾶσαν χάριν περισσεῦσαι εἰς ὑμᾶς
కృప ఒక సహజమైన వస్తువైనట్లు మాట్లాడుతూ ఒక వ్యక్తి అతను ఉపయోగించగల దానికంటే ఎక్కువ కలిగి ఉంటాడు అని వ్రాయబడింది. ఒక వ్యక్తి ఇతర విశ్వాసులకు ఇస్తున్నట్లుగా, దేవుడు తనకు అవసరమైన ప్రతిదాన్ని కూడా ఇస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు” (చూడండి: రూపకం)
χάριν
ఇది ఇక్కడ క్రైస్తవునికి అవసరమైయ్యే సహజమైన విషయాల గురించి తెలియచేస్తుంది కాని, దేవుడు అతని పాపాలనుండి అతనిని రక్షించాల్సిన అవసరం లేదు.
περισσεύητε εἰς πᾶν ἔργον ἀγαθόν
తద్వారా మీరు మరింత మంచి పనులు చేయగలుగుతారు
2 Corinthians 9:9
καθὼς γέγραπται
ఇది వ్రాసినట్లే. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది రచయిత వ్రాసినట్లే ఉన్నది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 9:10
ὁ…ἐπιχορηγῶν
కావలసినది ఇచ్చే దేవుడు
ἄρτον εἰς βρῶσιν
ఇక్కడ “రొట్టె” అనే పదం సాధారణంగా ఆహారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తినడానికి ఆహారం” (చూడండి: అన్యాపదేశము)
χορηγήσει καὶ πληθυνεῖ τὸν σπόρον ὑμῶν
పౌలు కొరింథీయుల ఆస్తులను విత్తనాలలాగ మరియు ఇతరులకు విత్తనాలు విత్తుటకు ఇస్తాడని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆస్తులను కూడా అందిస్తుంది మరియు వృద్ధి చేస్తుంది తద్వారా మీరు వాటిని ఇతరులకు ఇవ్వడం ద్వారా వాటిని విత్తుకోవచ్చు” అని చెప్పబడింది. (చూడండి: రూపకం)
αὐξήσει τὰ γενήματα τῆς δικαιοσύνης ὑμῶν
కొరింథీయులు వారి దాతృత్వము నుండి పొందే ప్రయోజనాలను పంటతో పోల్చారు.ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ నీతి కోసం దేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు” (చూడండి: రూపకం)
τὰ γενήματα τῆς δικαιοσύνης ὑμῶν
మీ నీతి చర్యలనుండి వచ్చే పంట. ఇక్కడ నీతి అనే పదం కొరింథీయులు తమ సాధనములను యెరుషలేములోని విశ్వాసులకు ఇవ్వడంలో చేసిన నీతి కార్యాలను గురించి తెలియచేస్తుంది.
2 Corinthians 9:11
πλουτιζόμενοι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమ: “దేవుడు మీకు సర్వ సమృద్ధిని కలుగ చేస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἥτις κατεργάζεται δι’ ἡμῶν, εὐχαριστίαν τῷ Θεῷ
ఈ వాక్యం కొరింథీయుల యొక్క ఉదారతను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఉదారత కారణంగా, మేము తీసుకువచ్చే బహుమతులు అందుకున్న వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు” లేక మరియు మేము మీ బహుమతులు అవసరమైన వారికి ఇచ్చినప్పుడు, వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 9:12
ὅτι ἡ διακονία τῆς λειτουργίας ταύτης
ఇక్కడ “సేవ” అనే పదం పౌలును మరియు అతని సహచరులను యెరుషలేములోని విశ్వాసులకు అందించే సహకారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరుషలేములోని విశ్వాసుల కోసం మేము ఈ సేవ చేస్తున్నందుకు” అని వ్రాయబడింది. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀλλὰ καὶ περισσεύουσα διὰ πολλῶν εὐχαριστιῶν τῷ Θεῷ
కొరింథీయుల సేవ చర్యల గురించి పౌలు మాట్లాడుతూ అది ఒక ద్రవ రూపంలో ఉంటే ఒక పాత్రలో పట్టగలిగే దానికంటే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలిపే అనేక పనులకు కూడా కారణమవుతుంది” (చూడండి: రూపకం)
2 Corinthians 9:13
διὰ τῆς δοκιμῆς τῆς διακονίας ταύτης
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే ఈ సేవ మిమ్మల్ని పరీక్షించి నిరూపించబడింది “ (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
δοξάζοντες τὸν Θεὸν ἐπὶ τῇ ὑποταγῇ τῆς ὁμολογίας ὑμῶν εἰς τὸ εὐαγγέλιον τοῦ Χριστοῦ, καὶ ἁπλότητι τῆς κοινωνίας εἰς αὐτοὺς καὶ εἰς πάντας
కొరింథీయులు యేసుకు విశ్వాస పాత్రగా ఉండటం ద్వారా మరియు అవసరమైన ఇతర విశ్వాసులకు ఉదారంగా ఇవ్వడం ద్వారా దేవునిని మహిమపరుస్తారని పౌలు చెప్పాడు.
2 Corinthians 9:15
ἐπὶ τῇ ἀνεκδιηγήτῳ αὐτοῦ δωρεᾷ
అతని బహుమతి కోసం, ఏ పదాలు వర్ణించలేవు. సాధ్యమైయ్యే అర్థాలు 1) ఈ బహుమతి కొరింథీయులకు దేవుడిచ్చిన “గొప్ప కృప “ అని తెలియచేస్తుంది, అది వారిని ఉదారంగా నడిపించింది లేక 2) దేవుడు విశ్వాసులందరికి ఇచ్చిన ఈ బహుమతి యేసు క్రీస్తును గురించి తెలియచేస్తుంది.
2 Corinthians 10
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి మిగిలిని వచనం అవతల పేజిలో కుడి వైపున ఈ ఉల్లేఖనాలను ఉంచుతాయి. యు.ఎల్.టి(ULT) 17వ వచనం ఉల్లేఖించిన పదాలతో దీన్ని చేస్తుంది.
ఈ అధ్యాయములో, పౌలు తన అధికారాన్ని కాపాడుకోవడానికి తిరిగి వస్తాడు. అతడు మాట్లాడే విధానాన్ని మరియు వ్రాసే విధానాన్ని కూడా పోల్చాడు.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
గొప్పలు
”గొప్పలు” తరచుగా గొప్పగా భావించబడతాయి, ఇది మంచిది కాదు. కానీ ఈ పత్రికలో “గొప్పలు” అంటే ఆత్మవిశ్వాసంతో గెలిచి సంతోషంతో ఉప్పొంగడం లేక సంతోషించడం అని చెప్పబడింది.
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
రూపకఅలంకారము
3-6 వచనాలలో, పౌలు యుద్ధం నుండి అనేక రూపకాలంకారాములను ఉపయోగిస్తాడు. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా యుద్ధంలో ఉండటం గురించి పెద్ద రూపకఅలంకారంలో భాగంగా అతను వాటిని ఉపయోగిస్తాడు. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
మాంసం
”మాంసం” అనేది ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావానికి ఒక రూపకఅలంకారమై యున్నది. మన సహజ శరీరాలు పాపముతో కూడినవని పౌలు బోధించడం లేదు. క్రైస్తవులు జీవించి ఉన్నతకాలం (“మాంసంలో”), మనం పాపము చేస్తామని పౌలు బోధిస్తున్నట్లు తెలియచేస్తుంది. కాని మన క్రొత్త స్వభావం మన పాత స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. (చూడండి: శరీరం)
2 Corinthians 10:1
పౌలు ఈ విషయం బోధించకుండా తన బోధకు తన అధికారాన్ని దృడపరచడం నుండి మారుస్తాడు.
διὰ τῆς πραΰτητος καὶ ἐπιεικείας τοῦ Χριστοῦ
“సాత్వికం” మరియు “మృదుత్వం” పదం నైరూప్య నామవాచకాలై యున్నవి, మరియు మరొక విధంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అలా చేసినట్లు నేను సాత్వికంగా మరియు మృదుత్వంగా ఉన్నాను ఎందుకంటే క్రీస్తు నన్ను అలా చేసాడు” (చూడండి: భావనామాలు)
2 Corinthians 10:2
τοὺς λογιζομένους
ఎవరు అలా అనుకుంటారు.
ὡς κατὰ σάρκα περιπατοῦντας
“మాంసం” అనే పదం పాపాత్మకమైన మానవ స్వభావానికి ఒక మారుపేరై యున్నది. మేము మానవ ఉద్దేశ్యాలనుండి వ్యవహరిస్తున్నాము.
2 Corinthians 10:3
ἐν σαρκὶ…περιπατοῦντες
ఇక్కడ “నడక” అనేది “జీవించుటకు” రూపకఅలంకారమైయున్నది మరియు “మాంసం” అనేది శారీరిక జీవితానికి మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భౌతిక శరీరాలలో మన జీవితాలు జీవిస్తాం(చూడండి: అన్యాపదేశముమరియురూపకం)
οὐ…στρατευόμεθα
పౌలు సహజమైన యుద్ధం చేస్తున్నట్లుగా కొరింథీయులను తనను నమ్మమని ఒప్పించుటకు ప్రయత్నిస్తున్నాడు మరియు తప్పుడు బోధకులను కాదు అని చెప్పుచున్నాడు. ఈ పదాలను అక్షరాలా అనువదించాలి. (చూడండి: రూపకం)
κατὰ σάρκα στρατευόμεθα
సాధ్యమైయ్య అర్థాలు 1) మేము సహజమైన శరీరాలతో మా జీవితాలను జీవిస్తాము, ప్రత్యామ్నాయ తర్జుమా: “సహజమైన ఆయుధాలను ఉపయోగించి శత్రువులతో పోరాడండి” లేక 2) “మాంసం” అనే పదం పాపత్మకమైన మానవ స్వభావానికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపాత్మకమైన మార్గాలలో యుద్ధం చేయండి” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 10:4
τὰ…ὅπλα τῆς στρατείας ἡμῶν…λογισμοὺς καθαιροῦντες
మనుష్యుల జ్ఞానం తప్పుడు అని చూపించే దేవుని జ్ఞానం గురించి అది శత్రువుల కోటను నాశనం చేస్తున్న ఆయుధంలాగా ఉందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా యుద్ధ పరికరాలు ... మన శత్రువులు చెప్పేది పూర్తిగా తప్పు అని ప్రజలకు చూపించండి” (చూడండి: రూపకం)
పౌలు సహజమైన యుద్ధం చేస్తున్నట్లుగా కొరింతియులను తనను నమ్మమని ఒప్పించుటకు ప్రయత్నిస్తున్నాడు మరియు తప్పుడు బోధకులను కాదు అని చెప్పుచున్నాడు. ఈ పదాలను అక్షరాలా అనువదించాలి. (చూడండి: రూపకం)
οὐ σαρκικὰ
సాధ్యమైయ్య అర్థాలు 1) “మా౦సం సంబంధమైన” అనే పదం కేవలం శారీరికంగా మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “శారీరికమైనవి కావు. లేక 2) “మాంసం సంబంధమైన” అనే పదం పాపాత్మకమైన మానవ స్వభావానికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తప్పు చేయడానికి మాకు సహాయం చేయవద్దు” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 10:5
πᾶν ὕψωμα ἐπαιρόμενον
పౌలు ఇప్పటికి “దేవుని జ్ఞానం” ఒక సైన్యం మరియు “ప్రతి గొప్ప విషయం” సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజలు చేసిన గోడ అని యుద్ధం గురించి ఒక రూపకాలంకారములా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గర్వించదగిన ప్రజలు తమను తాము రక్షించుకొవాలని భావించే ప్రతి తప్పుడు వాదన” అని వ్రాయబడింది
πᾶν ὕψωμα
గర్వించే వ్యక్తులు చేసే ప్రతీది
ἐπαιρόμενον κατὰ τῆς γνώσεως τοῦ Θεοῦ
పౌలు వాదనలను గురించి అవి ఒక సైన్యానికి వ్యతిరేకంగా ఎత్తయిన గోడలా ఉన్నాయి అని చెప్పుచున్నాడు. “తేలుట” అనే పదాల అర్థం “పొడవైనది” అనే కానీ “ఎత్తయిన విషయం” అంటే గాలిలో తేలుతున్నట్లు కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఉపయోగిస్తారు కాబట్టి దేవుడు అంటే ఎవరో వారికి తెలియదు” (చూడండి: రూపకం)
αἰχμαλωτίζοντες πᾶν νόημα εἰς τὴν ὑπακοὴν τοῦ Χριστοῦ
పౌలు ప్రజల ఆలోచన గురించి వారు యుద్ధం లో పట్టుకున్న శత్రు సైనికులని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ ప్రజలు కలిగి ఉన్న అన్ని తప్పుడు ఆలోచనలు ఎంత తప్పో అని మేము చూపిస్తాము మరియు క్రీస్తుకు విధేయత చూపించమని ప్రజలకు బోధిస్తాము” (చూడండి: రూపకం మరియు అన్యాపదేశము)
2 Corinthians 10:6
ἐκδικῆσαι πᾶσαν παρακοήν
“అవిధేయత చర్య” అనే పదాలు ఆ పనులకు పాల్పడే ఒక వ్యక్తులకు మారు పెరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు అవిధేయత చూపే ప్రతి ఒక్కరినీ శిక్షించండి” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 10:7
τὰ κατὰ πρόσωπον βλέπετε
సాధ్యమైయ్య అర్థాలు 1) ఇది ఒక ఆజ్ఞయై యున్నది లేక 2) ఇది ఒక వివరణయై యున్నది, మీరు మీ కళ్ళతో చూడగలిగేదానిని మాత్రమే చూస్తున్నారు.” ఇది ఒక అలంకారిక ప్రశ్న అని కొందరు అనుకుంటారు, అది కూడా ఒక వివరణగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ముందున్న వాటిని స్పష్టంగా మీరు చూస్తున్నారా?” లేక “మీ ముందున్నవాటిని స్పష్టంగా చూడలేకపోతున్నారు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
λογιζέσθω πάλιν ἐφ’ ἑαυτοῦ
అతను గుర్తుంచుకోవాలి
καθὼς αὐτὸς Χριστοῦ, οὕτως καὶ ἡμεῖς
క్రీస్తు చేసినట్లే మనం కూడా ఆయనకు చెందినవాళ్ళం
2 Corinthians 10:8
εἰς οἰκοδομὴν καὶ οὐκ εἰς καθαίρεσιν ὑμῶν
ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా క్రీస్తును గురించి బాగా తెలుసుకోవడానికి కొరింథీయులకు సహాయం చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యొక్క మంచి అనుచరులు అవ్వాలని మీకు సహాయము చేస్తాము మరియు మీరు అతని అనుసరించడం మానేయ్యకుండా ఉండాలని మిమ్మల్ని నిరుత్సాహ పరచలేదు” (చూడండి: రూపకం)
2 Corinthians 10:9
ἂν ἐκφοβεῖν ὑμᾶς
నేను మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను
2 Corinthians 10:10
βαρεῖαι καὶ ἰσχυραί
గట్టిగా అడుగుట మరియు బలమైన
2 Corinthians 10:11
τοῦτο λογιζέσθω ὁ τοιοῦτος
అలాంటి వారు అవగాహన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను
οἷοί ἐσμεν τῷ λόγῳ δι’ ἐπιστολῶν ἀπόντες, τοιοῦτοι καὶ παρόντες τῷ ἔργῳ
మేము మీతో ఉన్నప్పుడు మేము అదే పనులను చేస్తాము అని మేము మీ నుండి దూరంగా ఉన్నప్పుడు మా ఉత్తరాల్లో వ్రాసాము
ἐσμεν
ఈ పదాల యొక్క అన్ని ఉదాహరణలు పౌలు సేవ బృందాన్ని గురించి తెలియ చేస్తాయి కాని కొరింథీయులను గురించి కాదు. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
2 Corinthians 10:12
ἐνκρῖναι ἢ συνκρῖναι ἑαυτούς
మేము అంత మంచివాళ్ళం అని చెప్పడానికి
αὐτοὶ ἐν ἑαυτοῖς, ἑαυτοὺς μετροῦντες καὶ συνκρίνοντες ἑαυτοὺς ἑαυτοῖς
పౌలు అదే విషయాన్ని రెండు సార్లు చెప్పుచున్నాడు. (చూడండి: సమాంతరత)
αὐτοὶ ἐν ἑαυτοῖς, ἑαυτοὺς μετροῦντες
పౌలు మంచితనం గురించి మాట్లాడుతూ అయినప్పటికీ దీని పొడవు ప్రజలు కొలవగలరు అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఒకరినొకరు చూసుకొని, ఎవరు మేలైనవారో చూడటానికి ప్రయత్నిస్తారు” (చూడండి: రూపకం)
οὐ συνιᾶσιν
ప్రతి ఒక్కరూ తమకు ఏమీ తెలియదని చూపించండి
2 Corinthians 10:13
పౌలు తనకున్న అధికారం గురించి మాట్లాడుతూ అది అతను పరిపాలించే భూమి, సరిహద్దుల్లో ఉన్నట్లు తనకు అధికారం ఉన్న విషయాల గురించి చెప్పుచున్నాడు లేక అతని భూమి యొక్క “పరిమితులు” మరియు అతని అధికారం క్రింద లేనివి “పరిమితులకు” మించినవి. (చూడండి: రూపకం)
οὐκ εἰς τὰ ἄμετρα καυχησόμεθα
ఇది ఒక భాషియమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు అధికారం లేని విషయాల గురించి గొప్పలు పలుకుతుంది” లేక “మనకు అధకారం ఉన్న విషయాల గురించి మాత్రమే గొప్పలు పలుకుతుంది” (చూడండి: జాతీయం (నుడికారం))
κατὰ τὸ μέτρον τοῦ κανόνος, οὗ ἐμέρισεν ἡμῖν ὁ Θεὸς
దేవుని అధికారం క్రింద ఉన్న విషయాల గురించి
μέτρου, ἐφικέσθαι ἄχρι καὶ ὑμῶν
పౌలు తనకున్న అధికారం గురించి అతను పాలించే భూమిలా ఉందని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మీరు మా అధికారం యొక్క హద్దుల్లో ఉన్నారు” (చూడండి: రూపకం)
2 Corinthians 10:14
οὐ…ὑπερεκτείνομεν ἑαυτούς
మా హద్దులు దాటి వెళ్ళలేదు
2 Corinthians 10:15
οὐκ εἰς τὰ ἄμετρα καυχώμενοι
ఇది ఒక భాషియమై యున్నది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:13లో ఇలాంటి సమానమైన పదాలు ఎలా అనువదించబడ్డాయో చూడండి ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు అధికారం లేని విషయాల గురించి గొప్పలు పలుకుతుంది” లేక “మనకు అధికారం ఉన్న విషయాల గురించి మాత్రమే గొప్పలు పలుకుతుంది” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Corinthians 10:16
ἀλλοτρίῳ κανόνι
దేవుడు వేరొకరికి కేటాయించిన ప్రాంతం
2 Corinthians 10:17
ἐν Κυρίῳ καυχάσθω
ప్రభువు చేసిన దానిని గురించి అతిశయించుదురు
2 Corinthians 10:18
ὁ ἑαυτὸν συνιστάνων
దీని అర్థం అతని బోధను విన్న ప్రతి వ్యక్తీకి అతను సరైనది బోధించాడా లేక తప్పు బోధను బోధించాడ అని నిర్ణయించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2లో “మమ్మల్ని సిఫారసు చేయి” అనేది ఎలా అనువదించబడిందో చూడండి
ἐστιν δόκιμος
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మెచ్చుకొనేవాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὃν ὁ Κύριος συνίστησιν
మీరు అర్థం చేసుకున్న వర్తమానాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు మెచ్చుకునే వాడే యోగ్యుడు” (చూడండి: శబ్దలోపం)
2 Corinthians 11
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్థించుకుంటూనే ఉన్నాడు.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
తప్పుడు బోధలు
కొరింథీయులు తప్పుడు బోధను అంగీకరించారు. వారు యేసు గురించి మరియు సువార్త గురించి భిన్నమైన మరియు నిజం కాని విషయాలను బోధించారు. ఈ తప్పుడు బోధకులుగా కాకుండా పౌలు బలియజ్ఞంగా కొరింథీయులకు సేవ చేసాడు. (చూడండి: మంచి వార్త, సువార్త)
వెలుగు
వెలుగుని క్రొత్త ఒడంబడికలో ఒక రూపకఅలంకారమువలే ఉపయోగిస్తారు. దేవుని వెల్లడిపరచడం మరియు నీతిని సూచించడానికి పౌలు ఇక్కడ వెలుగును ఉపయోగిస్తాడు. చీకటి పాపం గురించి వివరిస్తుంది. పాపం దేవుని నుండి దాగుకొనుటకు ప్రయత్నిస్తుంది. (చూడండి: వెలుగు, తేజస్సు, మెరుపు, ప్రకాశింప జేయు, జ్ఞానంకలిగించడం, నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత మరియు చీకటి మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
రూపకఅలంకారము
పౌలు ఈ అధ్యాయాన్ని విస్తరించిన రూపకఅలంకారముతో ప్రారంభిస్తాడు. అతడు తన పెళ్ళికొడుకుకు పవిత్రమైన, కన్య వధువును ఇస్తున్న వధువు తండ్రితో పోల్చాడు. సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి వివాహ పద్దతులు మారతాయి. కాని ఒకరిని ఎదిగిన మరియు పవిత్రమైన బిడ్డగా చూపించడానికి సహాయం చేయాలనే ఆలోచన వాక్య భాగంలో స్పష్టంగా ప్రతిపాదించబడింది. (చూడండి: రూపకం మరియు పరిశుద్ధమైన, పరిశుద్ధత, అపరిశుద్ధమైన, పవిత్రమైన మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
వ్యంగ్యము
ఈ అధ్యాయము వ్యంగ్యంతో నిండి ఉంది. కొరింథులో ఉన్న విశ్వాసులు తన వ్యంగ్యంతో సిగ్గు పడాలని పౌలు ఆశిస్తున్నాడు.
”మీరు ఈ విషయాలను బాగా సహిస్తారు!” “తప్పుడు అపోస్తలులు తమతో ప్రవర్తించిన తీరును వారు సహించకూడదని పౌలు భావిస్తాడు. వారు నిజంగా అపోస్తలుడని పౌలు అనుకోడు.
“మీ కోసం ముర్ఖులతో సంతోషంగా ఉండండి” కోరింథులోని విశ్వాసులు తమను తాము చాలా తెలివైనవారని అనుకుంటారు కాని పౌలు అంగీకరించలేదు అని వివరించబడింది.
”మేము చాలా బలహీనంగా ఉన్నామని చెప్పుటకు సిగ్గుపడుతున్నాము.” పౌలు దానిని నివారించడానికి చాలా తప్పు అని భావించే ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు. అతను అది చేయకపోవడం తప్పు అని అనుకున్నట్లు మాట్లాడుతున్నాడు. అతను ఒక అలంకారిక ప్రశ్నను వ్యంగ్యంగా ఉపయోగిస్తాడు. “మీరు ఘనముగా ఉండటానికి నాకు నేను వినయముగా ఉండటం ద్వారా పాపం చేశానా?” (చూడండి: వ్యంగ్యోక్తి మరియు అపొస్తలుడు, అపొస్తలత్వం మరియు అలంకారిక ప్రశ్న)
అలంకారిక ప్రశ్నలు
ఉన్నతమైనదని చెప్పుకునే తప్పుడు అపోస్తలులను ఖండించడంలో, పౌలు అలంకారిక ప్రశ్నల వరసను ఉపయోగిస్తాడు. ప్రతి ప్రశ్న సమాధానంతో జతచేయబడుతుంది: “వారు హేబ్రియులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు అబ్రాహాము వారసులా? నేను కూడా అలాగే ఉన్నాను. వారు క్రీస్తు సేవకులేనా? (నేను వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) అలా నేను ఎక్కువగా ఉన్నాను.”
అతను తన మతమార్పిడులతో సహానుభూతి పొందడానికి అలంకారిక ప్రశ్నల వరుసను కూడా ఉపయోగిస్తాడు: “ఎవరు బలహీనంగా ఉన్నారు మరియు నేను బలహీనంగా లేనా? మరొకరు పాపంలో పడటానికి ఎవరు కారణమైయ్యారు, నేను లోపల కాలిపోనా?”
“వారు క్రీస్తు సేవకులా?”
ఇది ఒక వ్యంగ్యంపు మాటలై యున్నవి, ఎగతాళి చేయడానికి లేక అవమానించడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన వ్యంగ్యంగా ఉంది. ఈ తప్పుడు బోధకులు వాస్తవానికి క్రీస్తును సేవిస్తారని పౌలు నమ్మడు, వారు అలా నటిస్తారు
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
వైపరీత్యం
“వైపరీత్యం” అనేది అసాధ్యమైనదాన్ని వివరించడానికి కనిపించే నిజమైన వివరణయై యున్నది. 30వ వచనములో ఈ వాక్యం ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నేను గొప్పలు చెప్పాలంటే, నా బలహీనతలను చూపించే దాని గురించి నేను గొప్పలు చెపుతాను. 2వ కొరింథీయులకు 12:9 వరకు తన బలహీనత గురించి ఎందుకు గొప్పలు చెపుతాడో పౌలు వివరించలేదు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:30)
2 Corinthians 11:1
పౌలు తన అపోస్తలత్వమును దృఢపరుస్తూనే ఉన్నాడు
ἀνείχεσθέ μου μικρόν τι ἀφροσύνης
నన్ను బుద్ధిహీనుడిలా వ్యవహరించడానికి అనుమతించు
2 Corinthians 11:2
ζηλῶ…ζήλῳ
ఈ మాటలు కొరింథీయులు క్రీస్తుకు నమ్మకంగా ఉండాలని, అతని విడచిపెట్టమని ఎవరూ ఒప్పించకూడదని మంచి బలమైన కోరిక గురించి చెప్పుచున్నాయి.
ἡρμοσάμην γὰρ ὑμᾶς ἑνὶ ἀνδρὶ, παρθένον ἁγνὴν παραστῆσαι τῷ Χριστῷ
కొరింథు విశ్వాసుల పట్ల శ్రద్ధ గురించి పౌలు మాట్లాడుతూ తన కుమార్తెను వివాహం కొరకు సిద్ధం చేస్తానని మరొక వ్యక్తికి వాగ్దానం చేసినట్లుగా మరియు అతను ఆ వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడని అతడు చాలా విచార పడుతున్నాడు అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను తన కుమార్తెను ఒక భర్తకు సమర్పిస్తానని వాగ్దానం చేసిన తండ్రిలాంటివాడిని. మిమ్మల్ని పవిత్రమైన కన్యకగా ఉంచుతానని వాగ్ధానం చేశాను కాబట్టి నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేస్తాను” (చూడండి: రూపకం)
2 Corinthians 11:3
φοβοῦμαι δὲ, μή πως…τῆς ἁγνότητος τῆς εἰς τὸν Χριστόν
సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తు పట్ల నిజాయితి నుండి మరియు పవిత్ర భక్తి నుండి మీ ఆలోచనలు ఏదో ఒక విధంగా తొలగిపోతాయేమొ అని నేను భయపడుతున్నాను.
φθαρῇ τὰ νοήματα ὑμῶν
ప్రజలు తప్పుడు మార్గాలలో నడిపించగల పశువులలాగా అని పౌలు ఆలోచనలను గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా మీరు అబద్దాలను నమ్మడానికి కారణం కావచ్చు” (చూడండి: రూపకం)
2 Corinthians 11:4
εἰ μὲν γὰρ ὁ ἐρχόμενος
ఎవరైనా వచ్చినప్పుడు మరియు
ἢ πνεῦμα ἕτερον λαμβάνετε ὃ οὐκ ἐλάβετε, ἢ εὐαγγέλιον ἕτερον ὃ οὐκ ἐδέξασθε
పరిశుద్ధాత్మ కంటే భిన్నమైన ఆత్మ లేక మీరు మా నుండి పొందిన సువార్త కంటే వేరే సువార్త
καλῶς ἀνέχεσθε
ఈ విషయాలతో వ్యవహరించడి. ఈ పదాలు 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:1లో ఎలా తర్జుమా చేయబడిందో చూడండి.
2 Corinthians 11:5
τῶν ὑπέρ λίαν ἀποστόλων
ఆ బోధకులకు తక్కువ ప్రాముఖ్యతను చూపించడానికి పౌలు ఇక్కడ వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తాడు, అప్పుడు ప్రజలు వారు ప్రాముఖ్యులని చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది ఇతరులకన్న మంచి బోధకులని భావించు వారు ” (చూడండి: వ్యంగ్యోక్తి)
2 Corinthians 11:6
οὐ τῇ γνώσει
ఈ ప్రతికూల వాక్యాన్ని జ్ఞానంలో శిక్షణ పొందిన సానుకూల సత్యాన్ని నొక్కి చెపుతుంది. నైరూప్య నామవాచకమైన “జ్ఞానం” ను నోటి మాటతో అనువదించవచ్చు ప్రత్యామ్నాయా తర్జుమా: “నేను ఖచ్చితంగా జ్ఞానంలో శిక్షణ పొందాను” లేక “వారికీ తెలిసిన వాటిని తెలుసుకోవడానికి నేను శిక్షణ పొందాను” (చూడండి: ద్వంద్వ నకారాలు మరియు భావనామాలు)
2 Corinthians 11:7
ἢ ἁμαρτίαν ἐποίησα ἐμαυτὸν ταπεινῶν, ἵνα ὑμεῖς ὑψωθῆτε
పౌలు కొరింథీయులతో బాగా ప్రవర్తించాడని చెప్పడం ప్రారంభించాడు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను నేను అర్పించుకోవడం ద్వారా నేను పాపం చేయలేదని మేము అంగీకరిస్తున్నాము కాబట్టి మీరు ఘనంగా ఉండవచ్చు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
δωρεὰν τὸ τοῦ Θεοῦ εὐαγγέλιον εὐηγγελισάμην ὑμῖν
ప్రతిఫలంగా మీ నుండి ఏమి ఆశించకుండా దేవుని సువార్తను మీకు ప్రకటించాము
2 Corinthians 11:8
ἄλλας ἐκκλησίας ἐσύλησα
పౌలు తనకు ఇవ్వవలసిన బాద్యత లేని సంఘాలనుండి జీతం తీసుకున్నాడని నొక్కి చెప్పడం అతిశయోక్తియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇతర సంఘాలనుండి జీతం అందుకున్నాను. (చూడండి: వ్యంగ్యోక్తి మరియు అతిశయోక్తి)
τὴν ὑμῶν διακονίαν
దీని పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు ఖర్చు లేకుండా సేవ చేయగలను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 11:9
ἐν παντὶ ἀβαρῆ ἐμαυτὸν ὑμῖν ἐτήρησα
నేను మీకు ఏ విధంగానూ ఆర్థిక భారంగా ఉండలేను. పౌలు ఎవరికోసమైతే డబ్బు ఖర్చు చేయవలసి వస్తుందనో దాని గురించి ప్రజలు తీసుకు వెళ్ళాల్సిన భారి వస్తువులు ఉన్నట్లు అని చెప్పుచున్నాడు. దీని పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీతో ఉండటానికి మీరు డబ్బు ఖర్చు చేయనవసరం లేదు నేను చేయగలిగినంతా చేసాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు రూపకం)
οἱ ἀδελφοὶ ἐλθόντες
ఈ “సహోదరులు” బహుశః అందరూ మగవారై యున్నారు
τηρήσω
నేను మీకు ఎప్పటికి భారం కాను
2 Corinthians 11:10
ἔστιν ἀλήθεια Χριστοῦ ἐν ἐμοὶ
పౌలు క్రీస్తు గురించి సత్యం చెపుతున్నాడని తన చదవరులకు తెలుసు కాబట్టి, అతను ఇక్కడ సత్యం చెపుతున్నాడని వారు తెలుసుకోగలరని పౌలు నొక్కి చెప్పాడు. “క్రీస్తు గురించిన సత్యాన్ని నాకు నిజంగా తెలుసని మరియు ప్రకటిస్తున్నానని మీకు తెలిసినట్లుగా, నేను చెప్పబోయేది నిజమని మీరు తెలుసుకోవచ్చు. ఇది”
ἡ καύχησις αὕτη οὐ φραγήσεται εἰς ἐμὲ
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అతిశయించకుండా మరియు నిశ్యబ్ధంగా ఉండేలా ఎవరు చేయలేరు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡ καύχησις αὕτη…εἰς ἐμὲ
(2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:7) లో పౌలు ప్రారంభంలో మాట్లాడిన విషయాన్ని ఇది తెలియచేస్తుంది
τοῖς κλίμασι τῆς Ἀχαΐας
అకయ ప్రాంతాలు. “భాగాలు” అనే పదం రాజకీయ విభజనల గురించి కాకుండా భూభాగాల గురించి చెప్పబడింది.
2 Corinthians 11:11
διὰ τί? ὅτι οὐκ ἀγαπῶ ὑμᾶς?
కొరింథీయుల పట్ల ప్రేమను నొక్కి చెప్పటానికి పౌలు అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు. ఈ ప్రశ్నలను ఏకీభవించవచ్చు లేక ప్రకటనగా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీకు భారంగ ఉండటానికి ఇష్టపడలేదు ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించలేదా?” లేక “నా అవసరాలను తీర్చకుండా నేను మిమ్మల్ని కొనసాగిస్తాను ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇతరులకు చూపిస్తుంది” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὁ Θεὸς οἶδεν
మీరు అర్థం చేసుకున్న వర్తమానాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు” (చూడండి: శబ్దలోపం)
2 Corinthians 11:12
పౌలు తన అపోస్తలత్వమును దృఢపరుస్తూనే, తప్పుడు అపోస్తలుల గురించి మాట్లాడుతాడు.
ἵνα ἐκκόψω τὴν ἀφορμὴν
పౌలు తన శత్రువులు చెప్పే తప్పుడు వాదన గురించి మాట్లాడుతూ అతను మోసుకొనివెళ్ళే దానిలా ఉందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దానిని అసాద్యం చేయవచ్చు” (చూడండి: రూపకం)
εὑρεθῶσιν καθὼς καὶ ἡμεῖς
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మా లాంటివారని ఆ ప్రజలు అనుకుంటారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 11:13
οἱ γὰρ τοιοῦτοι
ప్రజలు వారిని ఇష్టపడటం వలన నేను చేయవలసినది చేసెదను
ἐργάται δόλιοι
నీతిలేని పనివారు
μετασχηματιζόμενοι εἰς ἀποστόλους
వారు అపోస్తలులు కాదు, గాని వారు తమను తాము అపోస్తలులుగా కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు
2 Corinthians 11:14
οὐ θαῦμα
దీనిని ప్రతికూల రూపంలో చెప్పడం ద్వారా కొరింథీయులు చాలా మంది “తప్పుడు అపోస్తలులను” కలవాలని నొక్కి చెప్పాడు (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:13). ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దీనిని ముందుగ ఉహించాలి” (చూడండి: ద్వంద్వ నకారాలు)
ὁ Σατανᾶς μετασχηματίζεται εἰς ἄγγελον φωτός
సాతాను వేలుగుదూత కాదు గాని వాడు తనను తానూ వెలుగు దూతలా కనిపించేలా ప్రయత్నిస్తాడు
ἄγγελον φωτός
ఇక్కడ వెలుగు అనేది నీతికి ఒక రూపకఅలంకారమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతి యొక్క దేవదూత”
2 Corinthians 11:15
οὐ μέγα
దీనిని ప్రతికూల రూపంలో చెప్పడం ద్వారా కొరింథీయులు చాలా మంది “తప్పుడు అపోస్తలులను” కలవాలని నొక్కి చెప్పాడు (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:13). ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దానిని ఖచ్చితంగా దానిని ముందుగా ఉహించాలి” (చూడండి: ద్వంద్వ నకారాలు)
καὶ οἱ διάκονοι αὐτοῦ μετασχηματίζονται ὡς διάκονοι δικαιοσύνης
వాడి సేవకులు నీతి సేవకులు కాదు, గాని వారు తమను తాము నీతి పరిచారకులుగా కనపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తారు
2 Corinthians 11:16
ὡς ἄφρονα δέξασθέ με, ἵνα κἀγὼ μικρόν τι καυχήσωμαι
మీరు ఒక బుద్ధిహీనుని స్వీకరించినట్లు నన్ను స్వీకరించండి: నన్ను మాట్లాడనివ్వండి మరియు ఒక బుద్ధిహీనుని మాటలను నేను అతిశయంగా చెప్పుకుంటాను
2 Corinthians 11:18
κατὰ σάρκα
ఇక్కడ “మాంసం” అనే మారుపేరు మనిషిని తన పాపపు స్వభావాన్ని మరియు అతని విజయాలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి స్వంత మానవ విజయాల గురించి” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 11:19
ἀνέχεσθε τῶν ἀφρόνων
నేను బుద్ధిహీనుడిలాగా వ్యవహరించినప్పుడు నన్ను అంగీకరించండి. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:1 లో ఇలాంటి వాక్య భాగాన్ని ఎలా అనువదించారో చూడండి
φρόνιμοι ὄντες
పౌలు వ్యంగ్యాన్ని ఉపయోగించి కొరింథీయులను అవమానిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు తెలివైనవారని మీరు అనుకుంటారు, కాని మీరు కాదు!” (చూడండి: వ్యంగ్యోక్తి)
2 Corinthians 11:20
ὑμᾶς καταδουλοῖ
కొంతమంది వ్యక్తులు బానిసలుగా ఉండటానికి బలవంతం చేస్తున్నట్లుగా నియమాలను పాటించమని ఇతరులను బలవంతం చేస్తున్నప్పుడు పౌలు అతిశాయోక్తిని ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారాలోచించిన నియమాలను మీరు అనుసరించేలా చేస్తుంది (చూడండి: రూపకం మరియు అతిశయోక్తి)
κατεσθίει
ఉత్తమ అపోస్తలులు ప్రజలను స్వయంగా తింటున్నట్లు ముఖ్యమైన సాధనములను తీసుకోవడం గురించి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు మీ ఆస్తి అంతటిని తీసుకుంటాడు” (చూడండి: రూపకం)
λαμβάνει
ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేయని విషయాలను తెలుసుకోవడం ద్వారా మరియు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తనకు తానూ సహాయ పడటానికి మరియు ఎదుటి వ్యక్తికి హాని కలిగిచడం ద్వారా మరొక వ్యక్తిని సద్వినియోగం చేసుకుంటాడు.
2 Corinthians 11:21
κατὰ ἀτιμίαν λέγω ὡς ὅτι ἡμεῖς ἠσθενήκαμεν!
నిన్ను అలా చూసుకోవటానికి మేము ధైర్యంగా లేమని నేను సిగ్గుతో అంగీకరిస్తున్నాను. పౌలు కొరింథీయులకు మంచిగా ప్రవర్తించమని చెప్పడానికి వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తున్నాడు, కాని వారు బలహీనంగా ఉన్నందున కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు హాని చేసే శక్తి నాకు ఉందని సిగ్గుపడను, గాని మేము మిమ్మల్ని బాగా విచారించము” (చూడండి: వ్యంగ్యోక్తి)
δ’ ἄν τις τολμᾷ (ἐν ἀφροσύνῃ λέγω), τολμῶ κἀγώ
ఎవరైనా దేని గురించైనా అతిశయిస్తే ... దాని గురించి కూడా అతిశయించే ధైర్యం చేస్తాను
2 Corinthians 11:22
పౌలు విశ్వాసి అయినప్పటినుండి తనకు జరిగే ముఖ్యమైన విషయాలను చెప్పి, అతడు తన అపోస్తలత్వమును దృఢపరుస్తూనే ఉన్నాడు
Ἑβραῖοί εἰσιν?…Ἰσραηλεῖταί εἰσιν?…σπέρμα Ἀβραάμ εἰσιν?
పౌలు కొరింథీయులు అడిగే ప్రశ్నలను అడుగుతున్నాడు ఉత్తమ అపోస్తలులు మాదిరిగానే అతడు యూదుడని నొక్కి చెప్పటానికి వారికి సమాధానం ఇస్తున్నాడు. వీలయితే మీరు ప్రశ్నోత్తరాల ఫారంను ఉంచాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ముఖ్యమైన వారని మీరు అనుకోవాలని మరియు వారు చెప్పేది నమ్మాలని వారు కోరుకుంటారు ఎందుకంటే వారు హేబ్రీయులు మరియు ఇశ్రాయేలీయులు మరియు అబ్రహాము వారసులు. నేను కూడా అలాగే ఉన్నాను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
2 Corinthians 11:23
διάκονοι Χριστοῦ εἰσιν? (παραφρονῶν λαλῶ), ὑπὲρ ἐγώ
పౌలు కొరింథీయులు అడిగే ప్రశ్నలను అడుగుతున్నాడు ఉత్తమ అపోస్తలులు మాదిరిగానే అతడు యూదుడని నొక్కి చెప్పటానికి వారికి సమాధానం ఇస్తున్నాడు. వీలయితే మీరు ప్రశ్నోత్తరాల ఫారంను ఉంచాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు క్రీస్తు సేవకులని చెప్తారు- నేను వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను-కాని నేను ఎక్కువ క్రీస్తు సేవకుడిని” (చూడండి: అలంకారిక ప్రశ్న)
παραφρονῶν λαλῶ
నేను బాగా ఆలోచించలేక పోయాను
ὑπὲρ ἐγώ
మీరు అర్థం చేసుకున్న వర్తమానాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వారికంటే ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి” (చూడండి: శబ్దలోపం)
ἐν κόποις περισσοτέρως
నేను చాల ఎక్కువగా కష్టపడ్డాను
ἐν φυλακαῖς περισσοτέρως
నేను అనేక సార్లు చెరసాల పాలయ్యాను
ἐν πληγαῖς ὑπερβαλλόντως
ఇది ఒక భాషియమై యున్నది. మరియు అతను లెక్కలేనన్నిసార్లు దెబ్బలు తిన్నాడని నొక్కి చెప్పడం అతిశయోక్తియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చాలా సార్లు దెబ్బలు తిన్నాను” లేక “లేక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను” (చూడండి: జాతీయం (నుడికారం) మరియు అతిశయోక్తి)
ἐν θανάτοις πολλάκις
అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను
2 Corinthians 11:24
τεσσεράκοντα παρὰ μίαν
ఒకటి తక్కువ నలభై కొరడాదెబ్బలు అని ఇది సాధారణంగా తెలియచేస్తుంది. యూదుల ధర్మశాస్త్రంలో ఒక సమయములో నలభై కొరడా దెబ్బలను ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టడానికి అనుమతించారు. కాబట్టి వారు సాధారణంగా ఒక వ్యక్తిని ఒకటి తక్కువ నలభై సార్లు కొట్టేవారు, తద్వారా వారు అనుకోకుండా తప్పుగా లేక్కించినట్లయితే ఒకరిని చాల సార్లు కొరడాలతో కొట్టేవారు.
2 Corinthians 11:25
ἐραβδίσθην
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు బెత్తాలతో నన్ను కొట్టారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐλιθάσθην
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చనిపోయానిని భావించే వరకు ప్రజలు నాపై రాళ్ళు విసిరారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
νυχθήμερον ἐν τῷ βυθῷ πεποίηκα
తానూ ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయిన తరువాత నీటిలో తేలుతున్నట్లు పౌలు ప్రస్తావించాడు
2 Corinthians 11:26
κινδύνοις ἐν ψευδαδέλφοις
ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు క్రీస్తులో సహోదరులు అని చెప్పుకునే, కాని మా గురించి బయట పెట్టిన వ్యక్తుల నుండి ప్రమాదంలో ఉన్నాము. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Corinthians 11:27
γυμνότητι
ఇక్కడ పౌలు తన బట్టల అవసరాన్ని చూపించడానికి అతిశయోక్తి చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను ఉంచడానికి తగినన్ని బట్టలు లేకుండా” (చూడండి: అతిశయోక్తి)
2 Corinthians 11:28
ἡ ἐπίστασίς μοι ἡ καθ’ ἡμέραν, ἡ μέριμνα πασῶν τῶν ἐκκλησιῶν
సంఘాలు ఎంతవరకు విధేయత చూపిస్తాయొ దానికి దేవుడు బాధ్యతా వహిస్తాడని పౌలుకు తెలుసు మరియు ఆ జ్ఞానం గురించి మాటాడుతూ అది ఒక భారమైన వస్తువులాగా అతనిని క్రిందికి నేట్టివేస్తుంది అని చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని సంఘాల ఆధ్యాత్మిక వృద్దికి దేవుడు నన్ను ఉత్తరవాదిగా ఉంచుతాడని నాకు తెలుసు, అందువలన ఒక బరువైన వస్తువు నన్ను క్రిందికి నెట్టి వేస్తున్నట్లు నేను ఎల్లప్పుడూ భావిస్తాను” (చూడండి: రూపకం)
2 Corinthians 11:29
τίς ἀσθενεῖ, καὶ οὐκ ἀσθενῶ?
ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువాదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నేను కూడా ఆ బలహీనతను అనుభవిస్తాను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τίς ἀσθενεῖ, καὶ οὐκ ἀσθενῶ?
“బలహీనమైన” అనే పదం బహుశః ఆధ్యాత్మిక స్థితికి ఒక రూపకఅలంకారమై యున్నది కాని పౌలు ఏమి చెప్పుచున్నాడో ఎవరికీ తెలియదు కాబట్టి అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం మంచిది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరెవరైనా బలహీనంగా ఉన్నప్పుడు నేను బలహీనంగా ఉన్నాను” (చూడండి: రూపకం)
τίς σκανδαλίζεται, καὶ οὐκ ἐγὼ πυροῦμαι?
తోటి విశ్వాసులు పాపానికి కారణమైనప్పుడు తన కోపాన్ని వ్యక్తపరచడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ఇక్కడ అతని కోపము అతని లోపల మండుతున్నట్లు చెప్పబడింది. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా తన సహోదరుడు పాపం చేయుటకు కారణమైనప్పుడు, నేను కోపంగా ఉన్నాను” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు రూపకం)
σκανδαλίζεται
పౌలు పాపం గురించి మాట్లాడుతూ అది ఎదో ఒకదానిపై వడిగా పడిపోతున్నట్లు ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపానికి దారి తీసింది” లేక “వేరొకరు చేసిన ఏదో కారణంగా దేవుడు అతనిని పాపానికి అనుమతిస్తాడని అనుకున్నాడు. (చూడండి: రూపకం)
οὐκ ἐγὼ πυροῦμαι
పౌలు తన శరీరం లోపల అగ్ని ఉన్నట్లు పాపం గురించి కోపంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దాని గురించి కోపంగా లేను” (చూడండి: రూపకం)
2 Corinthians 11:30
τὰ τῆς ἀσθενείας
నేను ఎంత బలహీనంగా ఉన్నానో చూపిస్తుంది
2 Corinthians 11:31
οὐ ψεύδομαι
తాను నిజం చెపుతున్నానని నొక్కి చెప్పడానికి పౌలు ఆక్షేపమును ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను కేవలం నిజం చెపుతున్నాను” (చూడండి: ద్వంద్వ నకారాలు)
2 Corinthians 11:32
ὁ ἐθνάρχης Ἁρέτα τοῦ βασιλέως ἐφρούρει τὴν πόλιν
అరేత అనే రాజు క్రింద ఉన్న అధికారి నగరాన్ని కాపలా కాయుమని మనుష్యులకు చెప్పాడు.
πιάσαι με
వారు నన్ను పట్టుకొని నన్ను బంధించవచ్చు.
2 Corinthians 11:33
ἐν σαργάνῃ, ἐχαλάσθην
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంత మంది నన్ను గంపలో వేసి నేలమీద దింపారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὰς χεῖρας αὐτοῦ
పౌలు అధిపతి చేతులను అధిపతికి ఉపలక్షణముగా ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిపతి నుండి” (చూడండి: అన్యాపదేశము)
2 Corinthians 12
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్తిస్తూనే ఉన్నాడు.
పౌలు కొరింథీయులతో ఉన్నప్పుడు, శక్తివంతమైన పనుల ద్వారా తనను తాను అపోస్తలుడని నిరూపించాడు. అతను వారి నుండి ఏమియు తీసుకోలేదు. ఇప్పుడు అతను మూడవ సారి వస్తున్నాడు, అతడు ఇంకా మరేమియు తీసుకోడు. అతను సందర్శించినప్పుడు, అతను వారితో కఠినంగా ఉండవలసిన అవసరం లేదని అతను ఆశిస్తున్నాడు. (చూడండి: అపొస్తలుడు, అపొస్తలత్వం)
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
పౌలు యొక్క దర్శనములు
పౌలు ఇప్పుడు పరలోకం యొక్క అద్భుతమైన దర్శనం గురించి చెప్పడం ద్వారా తన అధికారాన్ని సమర్థించుకున్నాడు. అతను 2-5 వచనాలలో మూడవ వ్యక్తిలాగా మాట్లాడుతున్నప్పటికి, 7వ వచనం అతను దర్శనాలను అనుభవించే వ్యక్తి అని తెలియచేస్తుంది. ఇది చాలా గొప్పది, అతడు విధేయతగా ఉండటానికి దేవుడు శరీరంలో ఒక ముల్లును పెట్టాడు. (చూడండి: పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకసంబంధమైన)
మూడవ ఆకాశం
“మూడవ” ఆకాశం దేవుని నివాసమని చాలా మంది పండితులు నమ్ముతారు. ఎందుకంటే ఆకాశం (మొదటి పరలోకం) మరియు విశ్వం (రెండవ పరలోకము) అని తెలియచేయుటకు లేఖనములు “పరలోకము” అనే పదాన్ని ఉపయోగిస్తుంది.
ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు
అలంకారిక ప్రశ్నలు
తనపై ఆరోపణలు చేసిన తన శత్రువులపై తనను తానూ సమర్థించుకుంటూ పౌలు అనేక అలంకారిక ప్రశ్నలను ఉపయోగిస్తాడు: “నేను మీకు భారం కాదని తప్ప మిగతా సంఘాలకన్నా నీకు ఎలా తక్కువ ప్రాముఖ్యత ఉంది?” “తీతు మీ ప్రయోజనాన్ని తీసుకున్నాడా? మనం అదే విధంగా నడవలేదా? మనం ఒకే అడుగుజాడలలో నడవలేదా?” మరియు “ఈ సమయమందు అంతట మేము మిమ్మల్ని సమర్థించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
వ్యంగ్యం
పౌలు వ్యంగం యొక్క ఒక ప్రత్యేకమైన వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాడు, అతను ఎటువంటి ఖర్చు లేకుండా వారికి ఏ విధంగా సహాయం చేసాడో వారికి గుర్తు చేస్తాడు. “ఈ తప్పుకు నన్ను క్షమించు” అని అతను అంటాడు. “కాని నేను చాలా కపటమైన స్వభావము గలవాడను కాబట్టి, మోసానికి నిన్ను పట్టుకున్నది నేనే” అని అతను చెప్పినప్పుడు అతడు సాధారణ వ్యంగ్యాన్ని కూడా ఉపయోగిస్తాడు. నిజాయితీగా ఉండడం ఎంత అసాధ్యమో చూపించుటకు ఈ నిందకు వ్యతిరేకంగా తన రక్షణను పరిచయం చేయడానికి అతడు దానిని ఉపయోగిస్తాడు. (చూడండి: వ్యంగ్యోక్తి)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
వైపరీత్యం
“వైపరీత్యం” అనేది అసాధ్యమైనదాన్ని వివరించడానికి కనిపించే నిజమైన వివరణయై యున్నది. 5వ వచనములో ఈ వాక్యం ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నా బలహీనతల గురించి తప్ప నేను గొప్పలు చెప్పను.” చాలా మంది బలహీనంగా ఉన్నారని గొప్పలు చెప్పుకోరు. 5వ వచనములో ఈ వాక్యం కూడా ఒక శాస్త్రవిరుద్ధమైనది: “నా బలహీనతల గురించి తప్ప గొప్పలు చెప్పుకోను.” చాలా మంది బలహీనంగా ఉండటం గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. చాలా మంది బలహీనంగా ఉండటం గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు: “నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడే బలవంతుడిగా ఉన్నాను.” ఈ రెండు ప్రకటనలు ఎందుకు నిజమైనవి అని పౌలు 9వ వచనం లో వివరించాడు. (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:5)
2 Corinthians 12:1
దేవుని నుండి తన అపోస్తలత్వమును సమర్థించుకోవడంలో, పౌలు విశ్వాసి అయినప్పటినుండి తనకు జరిగిన ప్రత్యేక విషయాలను చెబుతూనే ఉన్నాడు.
ἐλεύσομαι
నేను మాట్లాడం కొనసాగిస్తూ ఉంటాను, కాని ఇప్పటి గురించి
ὀπτασίας καὶ ἀποκαλύψεις Κυρίου
సాధ్యమైయ్య అర్థాలు 1) పౌలు “దర్శనాలు” మరియు “బహిరంగము చేయుట” అనే పదాలను ప్రాముఖ్యత కోసం విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడటాన్ని అర్థం చేసుకోవాలని నొక్కి చెప్పుటకు ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నన్ను చూడటానికి అనుమతించిన విషయాలు” లేక 2) పౌలు రెండు వేరు వేరు విషయాల గురించి మాట్లాడుతున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నన్ను చూడటానికి అనుమతించిన రహస్య విషయాలు మరియు ఆయన నాకు చెప్పిన ఇతర రహస్యములు” (చూడండి: విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు)
2 Corinthians 12:2
οἶδα ἄνθρωπον ἐν Χριστῷ
పౌలు వాస్తవానికి తనను తానూ వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పుచున్నాడు, ఈ పదాలను అక్షరాలా అనువదించాలి.
εἴτε ἐν σώματι οὐκ οἶδα, εἴτε ἐκτὸς τοῦ σώματος οὐκ οἶδα
ఇది మరొక వ్యక్తికి జరిగినట్లు పౌలు తనను తానూ వివరిస్తూనే ఉన్నాడు. ఈ మనిషి తన సహజ శరీరంలో ఉన్నాడా లేక అతని ఆధ్యాత్మిక శరీరం లో ఉన్నాడో నాకు తెలియదు”
τρίτου οὐρανοῦ
ఇది ఆకాశం లేక బాహ్య ఆకాశం కంటే దేవుని నివాస స్థలం గురించి తెలియచేస్తుంది (గృహాలు, నక్షత్రాలు మరియు విశ్వం).
2 Corinthians 12:3
పౌలు వేరొకరి గురించి మాట్లాడుతున్నట్లుగా తనను తానూ మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.
2 Corinthians 12:4
ἡρπάγη εἰς τὸν Παράδεισον
“ఈ మనిషికి” ఏమి జరిగిందో అని చెప్పే పౌలు వృత్తాంతం కొనసాగుతుంది (3వ వచనం). ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమైయ్య అర్థాలు 1) దేవుడు ఈ మనిషిని ... పరదైసులోనికి తీసుకువెళ్ళాడు” లేక 2) ఒక దేవదూత ఈ వ్యక్తిని ... పరదైసులోనికి తీసుకువెళ్ళాడు.” వీలయితే, మనిషిని తీసుకున్న వ్యక్తి పేరు పెట్టకపోవడమే మంచిది: “ఎవరో తీసుకున్నారు ... పరదైసు” లేక “వారు తీసుకున్నారు ... పరదైసు.”
ἡρπάγη
అకస్మాత్తుగా మరియు బలవంతంగా పట్టుకొని కొనిపోబడింది
τὸν Παράδεισον
సాధ్యమైయ్యే అర్థాలు 1) ఆకాశం లేక 2) మూడవ ఆకాశం లేక 3) ఆకాశంలో ఒక ప్రత్యేక స్థలం.
2 Corinthians 12:5
τοῦ τοιούτου
ఆ వ్యక్తి యొక్క
οὐ καυχήσομαι, εἰ μὴ ἐν ταῖς ἀσθενείαις
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా బలహీనతల గురించి మాత్రమే నేను అతిశయిస్తాను”
2 Corinthians 12:6
పౌలు దేవునినుండి తన అపోస్తలత్వమును సమర్థిస్తున్నప్పుడు తనను విధేయుడిగా ఉంచడానికి దేవుడు ఇచ్చిన బలహీనత గురించి చెప్పాడు.
μή τις εἰς ἐμὲ λογίσηται ὑπὲρ ὃ βλέπει με, ἢ ἀκούει ἐξ ἐμοῦ
అతడు నాలో చూసేదానికంటే లేక నా నుండి వింటున్న దానికంటే ఎవ్వరూ నాకు ఎక్కువ కీర్తిని ఇవ్వరు.
2 Corinthians 12:7
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:2లో పౌలు తన గురించి మాట్లాడుతున్నాడని ఈ వచనం వెల్లడిపరుస్తుంది.
καὶ τῇ ὑπερβολῇ τῶν ἀποκαλύψεων
ఎందుకంటే ఆ ప్రకటనలు మరెవరూ చూడనిదానికంటే చాలా ఎక్కువై యున్నది.
ἐδόθη μοι σκόλοψ τῇ σαρκί
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకు శరీరంలో (మాంసం లో) లో ముల్లు ఇచ్చాడు” లేక “శరీరంలో ముల్లు ఉంచుకోవడానికి దేవుడు నన్ను అనుమతించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
σκόλοψ τῇ σαρκί
ఇక్కడ పౌలు యొక్క శారీరిక సమస్యలను తన మాంసాన్ని గాయపరచే ముల్లుతో పోల్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక బాధ” లేక “శారీరిక సమస్యయై యున్నది” (చూడండి: రూపకం)
ἄγγελος Σατανᾶ
సాతాను దూత
ὑπεραίρωμαι
చాల అతిశయింప దగినది
2 Corinthians 12:8
τρὶς
తన “ముల్లు” గురించి చాలా సార్లు ప్రార్థించానని నొక్కి చెప్పడానికి పౌలు ఈ మాటలను వాక్య ప్రారంభములో ఉంచాడు (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:7)
ὑπὲρ τούτου…τὸν Κύριον
మాంసంలో ఈ ముల్లు గురించి ప్రభువా, లేక “ఈ బాధ గురించి ప్రభువా అని చెప్పబడింది”
2 Corinthians 12:9
ἀρκεῖ σοι ἡ χάρις μου
నా కృప నీకు చాలును
ἡ γὰρ δύναμις ἐν ἀσθενείᾳ τελεῖται
మీరు బలహీనంగా ఉనప్పుడు నా శక్తి ఉత్తమంగా పని చేస్తుంది
ἐπισκηνώσῃ ἐπ’ ἐμὲ ἡ δύναμις τοῦ Χριστοῦ
పౌలు క్రీస్తు శక్తిని తనపై నిర్మించిన గుడారంలా ఉందని చెప్పుచున్నాడు సాధ్యమైయ్యే అర్థాలు 1) “నాకు క్రీస్తు శక్తి ఉందని ప్రజలు చూడవచ్చు” లేక 2) “నేను నిజముగా క్రీస్తు శక్తిని కలిగి ఉండవచ్చు.” (చూడండి: రూపకం)
2 Corinthians 12:10
εὐδοκῶ ἐν ἀσθενείαις, ἐν ὕβρεσιν, ἐν ἀνάγκαις, ἐν διωγμοῖς, καὶ στενοχωρίαις, ὑπὲρ Χριστοῦ
సాధ్యమైయ్యే అర్థాలు 1) “నేను క్రీస్తుకు చెందిన వాడిని కాబట్టి ఈ విషయాలు వస్తే నేను బలహీనత, అవమానాలు, ఇబ్బందులు, హింసలు మరియు ఉపద్రవాలలో నేను సంతృప్తి కలిగి యున్నాను” లేక 2) “నేను బలహీనతతో ఉన్నాను ... ఎక్కువ మంది క్రీస్తును తెలుసుకొనుటకు ఈ విషయాలు కారణమైతే.”
ἐν ἀσθενείαις
నేను బలహీనంగా ఉన్నప్పుడు
ἐν ὕβρεσιν
నేను చెడ్డ వ్యక్తిని చెప్పడం ద్వారా ప్రజలు నన్ను కోపగించడానికి ప్రయత్నించినప్పుడు
ἐν ἀνάγκαις
నేను బాధపడుతున్నప్పుడు
στενοχωρίαις
ఇబ్బంది ఉన్నప్పుడు
ὅταν γὰρ ἀσθενῶ, τότε δυνατός εἰμι
పౌలు చెప్తున్నది తాను చేయవలసిన పనిని చేయటానికి ఇకపై బలంగా లేనప్పుడు, ఎప్పటికైనా శక్తివంతుడైన క్రీస్తు పౌలు ద్వారా చేయవలసిన పనిని చేయటానికి పని చేస్తాడు. అయితే మీ భాష అనుమతించినట్లయితే ఈ పదాలను అక్షరాలా అనువదించడం మంచిది.
2 Corinthians 12:11
పౌలు కొరింథులోని విశ్వాసులకు అపోస్తలుడి యొక్క నిజమైన సూచనలను మరియు వారిని బలపరచుటకు వారి ముందు ఉన్న వినయాన్ని గుర్తుచేస్తాడు.
γέγονα ἄφρων
నేను బుద్ధిహీనుడిలా వ్యవహరిస్తున్నాను
ὑμεῖς με ἠναγκάσατε
మీరు నన్ను ఈ విధంగా మాట్లాడమని బలవంతం చేసారు
ἐγὼ…ὤφειλον ὑφ’ ὑμῶν συνίστασθαι
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నాకు ఇచ్చిన మెప్పుదల” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
συνίστασθαι
సాధ్యమైయ్యే అర్థాలు 1) “ప్రశంస” (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3:1) లేక 2) “మెచ్చుకోవడం” (2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 4:2).
γὰρ ὑστέρησα
ప్రతికూల రూపాన్ని ఉపయోగించడం ద్వారా, తాను వట్టివాడినని భావించే కొరింథీయులు తప్పు అని పౌలు గట్టిగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అంతే మంచివాడిని” (చూడండి: ద్వంద్వ నకారాలు)
τῶν ὑπέρ λίαν ἀποστόλων
ఆ బోధకులకు తక్కువ ప్రాముఖ్యతను చూపించడానికి పౌలు ఇక్కడ వ్యంగ్యపు మాటలను ఉపయోగిస్తాడు, అప్పుడు ప్రజలు ఉన్నారని చెప్పారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:5 లో ఇది ఎలా అనువదించబడిందో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ కొంత మంది ఇతరులకన్నా మంచిదని భావించే బోధకులు” (చూడండి: వ్యంగ్యోక్తి)
2 Corinthians 12:12
τὰ μὲν σημεῖα τοῦ ἀποστόλου κατειργάσθη
ఇది “గురుతులను” నొక్కి చెప్పుచు, దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది నేను చేసిన అపోస్తలుడి నిజమైన గురుతులు” అయియున్నవి (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
σημεῖα…σημείοις
రెండు సార్లు ఒకే పదాన్ని ఉపయోగించండి
σημείοις τε, καὶ τέρασιν, καὶ δυνάμεσιν
పౌలు “పూర్తి సహనంతో చేసిన “అపోస్తలుడి నిజమైన గురుతులు” ఇవి.
2 Corinthians 12:13
τί γάρ ἐστιν ὃ ἡσσώθητε ὑπὲρ τὰς λοιπὰς ἐκκλησίας, εἰ μὴ ὅτι αὐτὸς ἐγὼ οὐ κατενάρκησα ὑμῶν?
ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొరింథీయులు తమకు హాని చేయాలని కోరుకుంటున్నారని నిందించడం తప్పు అని పౌలు నొక్కి చెప్పాడు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఇతర సంఘాలన్నింటిని అదే విధంగా చూసాను , అదే తప్ప ... మీరు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐγὼ οὐ κατενάρκησα ὑμῶν
నేను మీ యొద్ద డబ్బును లేక నాకు అవసరమైన ఇతర వస్తువులను అడగలేదు
χαρίσασθέ μοι τὴν ἀδικίαν ταύτην!
కొరింథీయులను సిగ్గుపరచడానికి పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అతను వారికి ఎటువంటి తప్పు చేయలేదని అతనికి మరియు వారికి ఇద్దరికీ తెలుసు, కాని అతను వారికి అన్యాయం చేసినట్లుగా వారు ఆయనతో ప్రవర్తిస్తున్నారు. (చూడండి: వ్యంగ్యోక్తి)
τὴν ἀδικίαν ταύτην
డబ్బు మరియు అతనికి అవసరమైన ఇతర వస్తువులను అడగటం లేదు.
2 Corinthians 12:14
ἀλλὰ ὑμᾶς
ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు కావలసినది మీరు నన్ను ప్రేమించాలి మరియు అంగీకరించాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐ…ὀφείλει τὰ τέκνα τοῖς γονεῦσιν θησαυρίζειν
సౌఖ్యంగా ఉండే తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వడం లేక ఇతర వస్తువులను ఇవ్వడానికి చిన్న పిల్లలు భాద్యత వహించరు.
2 Corinthians 12:15
ἐγὼ…ἥδιστα δαπανήσω καὶ ἐκδαπανηθήσομαι
పౌలు తన పని గురించి మరియు సహజ జీవితం గురించి మాట్లాడుతూ అది అతను లేక దేవుడు ఖర్చుచేయగల డబ్బులాగా ఉన్నాయని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సంతోషంగా ఏ పనైనా చేస్తాను మరియు ప్రజలు నన్ను చంపడానికి దేవుని అనుమతికి నేను ఒప్పుకుంటాను” చూడండి: రూపకం
ὑπὲρ τῶν ψυχῶν ὑμῶν
“ఆత్మలు” అనే పదం ప్రజలు తమకు తామే ఒక మారుపేరై యున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ కోసం” లేక “కాబట్టి మీరు బాగా జీవిస్తారు” (చూడండి: అన్యాపదేశము)
εἰ περισσοτέρως ὑμᾶς ἀγαπῶν, ἧσσον ἀγαπῶμαι?
ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే, మీరు నన్ను అంత తక్కువగా ప్రేమించకూడదు.” లేక “చాలా ... ఉంటే మీరు నన్ను ప్రేమించేదానికన్న ఎక్కువగా ప్రేమించాలి.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
περισσοτέρως
పౌలు ప్రేమకంటే “ఎక్కువ” అని ఏమిటో స్పష్టంగా లేదు. “చాలా” అనే పదం ఉపయోగించడం చాలా మంచిది లేక “చాలా” అనే పదం వాక్యంలోని “చాలా తక్కువ”తో పోల్చవచ్చు.
2 Corinthians 12:16
ἀλλὰ ὑπάρχων πανοῦργος δόλῳ, ὑμᾶς ἔλαβον
పౌలు కొరింథీయులను ధనాన్ని అడగకపోయిన తానూ అబద్ధం చెప్పాడని భావించే వారిని సిగ్గుపరచడానికి వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాని ఇతరులు నేను మోసగాడినని మరియు మోసాన్ని ఉపయోగించానని అనుకుంటున్నారు” (చూడండి: వ్యంగ్యోక్తి)
2 Corinthians 12:17
μή τινα ὧν ἀπέσταλκα πρὸς ὑμᾶς, δι’ αὐτοῦ ἐπλεονέκτησα ὑμᾶς?
పౌలు మరియు కొరింథీయులకు సమాధానం లేదు అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ యొద్దకు పంపిన ఎవరూ మీ ప్రయోజనాన్ని పొందలేదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
2 Corinthians 12:18
μήτι ἐπλεονέκτησεν ὑμᾶς Τίτος?
పౌలు మరియు కొరింథీయులకు సమాధానం లేదు అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీతు మీ ప్రయోజనాన్ని పొందలేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐ τῷ αὐτῷ πνεύματι περιεπατήσαμεν
పౌలు ఒక రహదారిపై నడుస్తున్నట్లు జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మరియు కొరింథీయులకు ఈ ప్రశ్నకు సమాధానం అవును అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: \n“మనమందరం ఒకే వైఖరిని కలిగి ఉన్నాము మరియు ఒకేలా జీవిస్తాము” (చూడండి: అలంకారిక ప్రశ్న) (చూడండి: రూపకం)
οὐ τοῖς αὐτοῖς ἴχνεσιν?
పౌలు ఒక రహదారిపై నడుస్తున్నట్లు జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మరియు కొరింథీయులకు ఈ ప్రశ్నకు సమాధానం అవును అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనమందరమూ ఏక విధానంగా పని చేస్తాము.” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు రూపకం)
2 Corinthians 12:19
πάλαι δοκεῖτε ὅτι ὑμῖν ἀπολογούμεθα?
పౌలు ఈ ప్రశ్నను ప్రజలు ఎదో ఆలోచిస్తు ఉండవచ్చుఅని గుర్తించడానికి ఉపయోగిస్తాడు. ఇది నిజం కాదని వారిని నమ్మించడానికి అతను ఇలా చేస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ సమయమందంతట మేము మిమ్మల్ని సమర్థించుకుంటున్నామని మీరు అనుకోవచ్చు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
κατέναντι Θεοῦ
దేవుడు శారీరికంగా ఉన్నాడు మరియు పౌలు చెప్పిన మరియు చేసిన ప్రతిదాన్నిగమనించునట్లుగా పౌలు చేసే ప్రతిదాన్ని తెలుసుకోవడం గురించి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఎదుట” లేక “దేవునితో సాక్షిగా” లేక “దేవుని సన్నిధిలో” (చూడండి: రూపకం)
ὑπὲρ τῆς ὑμῶν οἰκοδομῆς
మిమ్మల్ని బలపరచుటకు. పౌలు దేవునికి ఎలా విధేయత చూపించాలో తెలుసుకోవడం మరియు అతనికి విధేయత చూపాలని కోరుకోవడం అనేది శారీరిక పెరుగుదల ఉన్నట్లుగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మీరు దేవుని తెలుసుకొని ఆయనకు బాగా విధేయులై ఉంటారు” (చూడండి: రూపకం)
2 Corinthians 12:20
οὐχ οἵους θέλω, εὕρω ὑμᾶς
నేను కనుగొన్నదాన్ని నేను ఇష్టపడకపోవచ్చు లేక “మీరు చేస్తున్నదాన్ని నేను ఇష్టపడక పోవచ్చు”
κἀγὼ εὑρεθῶ ὑμῖν οἷον οὐ θέλετε
మీరు నాలో చూసేది మీకు నచ్చక పోవచ్చు
μή πως ἔρις, ζῆλος, θυμοί, ἐριθεῖαι, καταλαλιαί, ψιθυρισμοί, φυσιώσεις, ἀκαταστασίαι
కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు మరియు కలత అనే నైరూప్య నామవాచకాలకు క్రీయా పదములను ఉపయోగించి అనువదించవచ్చు. సాధ్యమైయ్యే అర్థాలు 1) మీలో కొందరు మాతో కలహ పడతారు, మా పై అసూయ పడతారు, అకస్మాత్తుగా మా పై కోపంగా ఉంటారు, మా స్థానాలను నాయకులుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, మా గురించి తప్పుగా మాట్లాడతారు, మా వ్యక్తిగత జీవితాల గురించి చెబుతారు, గర్వపడతారు మరియు మేము నడిపించడానికి ప్రయత్నించినప్పుడు మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తారు” లేక 2) మీలో కొందరు ఒకరితో ఒకరు కలహపడతారు, ఒకరిపై ఒకరు అసూయపడతారు, ఆకస్మాత్తుగా ఒకరిపై ఒకరు కోపంగా ఉంటారు, నాయకుడు ఎవరనే దానిపై కలహపడుతుంటారు, ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడటం, ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి చెప్పడం, గర్వంగా ఉండటం మరియు దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఎంచుకున్న వారిని వ్యతిరేకిస్తారు” (చూడండి: భావనామాలు)
2 Corinthians 12:21
πενθήσω πολλοὺς τῶν προημαρτηκότων,
వారిలో చాలామంది తమ గతంలోని పాపాలను వదులు కోనందున నేను భాదపడుతున్నాను
μὴ μετανοησάντων ἐπὶ τῇ ἀκαθαρσίᾳ, καὶ πορνείᾳ, καὶ ἀσελγείᾳ
సాధ్యమైయ్యే అర్థాలు 1)పౌలు అదే విషయాన్ని దాదాపుగా మూడు సార్లు నొక్కి చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పాటించిన లైంగిక పాపాలకు పాల్పడడం ఆపలేదు” లేక 2)పౌలు మూడు వేరు వేరు పాపాల గురించ మాట్లాడుతున్నాడు. (చూడండి: సమాంతరత)
ἐπὶ τῇ ἀκαθαρσίᾳ
“అపవిత్రత అనే నైరూప్య నామవాచకమును “దేవుని సంతోష పెట్టని విషయాలు” అని అనువదించవచ్చు.” ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుని సంతోష పెట్టని విషయాల గురించి రహస్యంగా ఆలోచించడం మరియు కోరుకోవడం” (చూడండి: భావనామాలు)
ἐπὶ τῇ…πορνείᾳ
“అనైతికత” అనే నైరూప్య నామవాచకమును “అనైతిక పనులు” అని అనువదించవచ్చు.” ప్రత్యామ్నాయ తర్జుమా: “జారత్వం చేయడం” (చూడండి: భావనామాలు)
ἐπὶ τῇ…ἀσελγείᾳ
“లోలత” అనే నైరూప్య నామవాచకమును నోటిమాటగల వాక్యభాగాన్ని ఉపయోగించి అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యొక్క ... అనైతిక లైంగిక కోరికను సంతృప్తి పరచే పనులు చేయడం” (చూడండి: భావనామాలు)
2 Corinthians 13
2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13 అధ్యాయములోని సాధారణ గమనికలు
నిర్మాణం మరియు క్రమపరచుట
ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్థించుకోవడం ముగించాడు. చివరి శుభాకాంక్షలు మరియు ఆశిర్వాదాలతో పత్రికను ముగించారు.
ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు
సిద్దము చేయుట
పౌలు కొరింథీయులను సందర్శించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆదేశించాడు. సంఘంలో ఎవరినైనా క్రమశిక్షణ చేయాల్సిన అవసరం లేదని అతను ఆశిస్తున్నాడు, తద్వారా అతను వారిని ఆనందంగా సందర్శించవచ్చు. (చూడండి: శిష్యుడు, శిష్యులు)
ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు
బలము మరియు బలహీనత
ఈ అధ్యాయములో పౌలు “బలము” మరియు “బలహీనత” అనే విరుద్ధమైన పదాలను పదేపదే ఉపయోగిస్తాడు. తర్జుమా చేయువారు ఒకదానికొకటి వ్యతిరేకమని అర్థం చేసుకున్న పదాలను ఉపయోగించాలి.
“మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మీరే పరిశీలించండి.”
విద్వాంసులు ఈ వాక్యముయొక్క అర్థాల పై విభజించారు. కొంతమంది విద్వాంసులు క్రైస్తవులు తమ చర్యలు తమ క్రైస్తవ విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తమను తాము పరీక్షించుకోవాలని చెప్పారు. సందర్భం ఈ అవగాహనకు అనుకూలంగా ఉంటుంది. మరికొందరు ఈ వాక్యాల అర్థం క్రైస్తవులు వారి చర్యలను చూడాలి మరియు వారు నిజంగా రక్షించబడ్డారా అని ప్రశ్నించాలి అని చెప్పుచున్నారు. (చూడండి: విశ్వాసం మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
2 Corinthians 13:1
క్రీస్తు తన ద్వారా మాట్లాడుతున్నాడని వాటిని పునరుద్ధరించడానికి, వారిని ప్రోత్సహించడానికి మరియు వారిని ఏకం చేయాలని పౌలు కోరుకుంటున్నట్లు పౌలు స్థాపించాడు.
ἐπὶ στόματος δύο μαρτύρων καὶ τριῶν σταθήσεται πᾶν ῥῆμα
దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు ఒకే మాట చెప్పిన తర్వాతే ఎవరైనా తప్పు చేసారని నమ్ముతారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Corinthians 13:2
τοῖς λοιποῖς πᾶσιν
ఇతర వ్యక్తులైన మీరందరూ
2 Corinthians 13:4
ἐσταυρώθη
దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: ఆయనను వారు సిలువ వేసారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀλλὰ ζήσομεν σὺν αὐτῷ ἐκ δυνάμεως Θεοῦ
దేవుడు ఆయనలో మరియు ఆయనతో జీవించే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇస్తాడు.
2 Corinthians 13:5
ἐν ὑμῖν
సాధ్యమైయ్య అర్థాలు 1)ప్రతివారి లోపల నివసిస్తున్నారు లేక 2) ”మీలో” సంఘములో భాగం మరియు అతి ముఖ్యమైన సభ్యుడు.
2 Corinthians 13:7
μὴ ποιῆσαι ὑμᾶς κακὸν μηδέν
మీరు అస్సలు పాపం చేయరు లేక మేము మిమ్మల్ని సరిదిద్దినప్పుడు మీరు మా మాట వినడానికి నిరాకరించారు. పౌలు తన ప్రకటనతో ఈ విరుద్ధాన్ని నొక్కి చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ప్రతిదీ మంచిగా చేస్తారు” (చూడండి: ద్వంద్వ నకారాలు)
δόκιμοι
గొప్ప బోధకులుగా ఉండి యోగ్యంగా జీవించడానికి
2 Corinthians 13:8
οὐ…δυνάμεθά τι κατὰ τῆς ἀληθείας
మేము సత్యాన్ని నేర్పించకుండా ప్రజలను ఉంచలేము
τῆς ἀληθείας, ἀλλὰ ὑπὲρ τῆς ἀληθείας
సత్యం; మేము చేసే ప్రతి పని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రజలను అనుమతిస్తుంది
2 Corinthians 13:9
τὴν ὑμῶν κατάρτισιν
ఆధ్యాత్మికంగా పరిణతి చెందవచ్చు
2 Corinthians 13:10
εἰς οἰκοδομὴν καὶ οὐκ εἰς καθαίρεσιν.
ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా క్రీస్తును గురించి బాగా తెలుసుకోవడానికి కొరింథీయులకు సహాయం చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:8లో మీరు ఈ సమానమైన వాక్య భాగాన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యొక్క మంచి అనుచరులవ్వాలని మీకు సహాయమ చేస్తాము మరియు మీరు అతని అనుసరించడం మానేయ కుండా ఉండాలని మిమ్మల్ని నిరుత్సాహ పరచాము
2 Corinthians 13:11
పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికను ముగించాడు.
καταρτίζεσθε
పునరుద్ధరణ వైపు పని చేయండి
τὸ αὐτὸ φρονεῖτε
ఒకరితో ఒకరు ఐక్యమత్యంగా జీవించండి
2 Corinthians 13:12
ἐν ἁγίῳ φιλήματι
క్రైస్తవ ప్రేమతో
οἱ ἅγιοι
దేవుడు తన కోసం తాను వేరుచేసుకున్న వారిని అని వ్రాయబడింది.