2 Timothy
2 Timothy front
2 తిమోతి పత్రికకు పరిచయం
భాగము - 1: సాధారణ పరిచయం
2 తిమోతి పత్రిక రూపురేఖ
1. పౌలు తిమోతికి శుభములు తెలుపుచు, దేవుని సేవలో కష్టాలను సహించమని ప్రోత్సహిస్తున్నాడు (1:1-2: 13).
2. పౌలు తిమోతికి సాధారణ హెచ్చరికలు ఇస్తున్నాడు (2:14–26).
3. పౌలు తిమోతికి భవిష్యత్ సంఘటనల గురించి హెచ్చరిస్తూ, తాను దేవుని
సేవించుటలో ఎలా కొనసాగలో బోధిస్తున్నాడు (3:1-4:8).
4. పౌలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నాడు (4: 9-22).
2 తిమోతి పత్రిక ఎవరు వ్రాశారు?
పౌలు 2 తిమోతి పత్రిక వ్రాశాడు. అతడు తార్సు పట్టణానికి చెందినవాడు. అతను తన జీవిత తొలి దశలో సౌలుగా పిలువబడెను. క్రైస్తవుడిగా మారడానికి ముందు, పౌలు పరిసయ్యుడు. అతను క్రైస్తవులను హింసించాడు. అతను క్రైస్తవుడైన తరువాత, యేసు గురించి ప్రజలకు ప్రకటిస్తు రోమా సామ్రాజ్యం అంతటా అనేకసార్లు ప్రయాణించాడు.
ఈ పత్రిక పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. తిమోతి అతని శిష్యుడు, ప్రాణస్నేహితుడు. పౌలు రోమాలో చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రిక వ్రాశాడు. ఈ పత్రిక రాసిన తరువాత పౌలు చనిపోతాడు.
2 తిమోతి పత్రిక దేనిని గురించి చెపుతుంది?
ఎఫెసు నగరంలో ఉన్న విశ్వాసులకు సహాయం చేయుటకు పౌలు తిమోతిని అక్కడ విడిచిపెడతాడు. పౌలు తిమోతికి వివిధ విషయాల గురించి హెచ్చరించడానికి ఈ పత్రిక వ్రాశాడు. అతడు సంభోదించిన అంశాలలో అబద్ద బోధకుల గురించి, క్లిష్ట పరిస్థితులను భరించడం గూర్చిన సలహాలు కూడ ఉన్నాయి. ఈ పత్రిక తిమోతి సంఘాలలో నాయకుడిగా ఉండుటకు పౌలు ఎలా తర్ఫీదు ఇస్తున్నాడో కూడా చూపిస్తున్నది.
ఈ పుస్తకపు శీర్షికను ఎలా అనువదించాలి?
అనువాదకులు ఈ పత్రికను సాంప్రదాయ శీర్షికతో పిలవడానికి ఎంచుకోవచ్చు “2 తిమోతి” లేదా “రెండవ తిమోతి.” లేదా వారు “తిమోతికి పౌలు యొక్క రెండవ పత్రిక” లేదా “తిమోతికి రెండవ పత్రిక” వంటి వేరే శీర్షికను ఎంచుకోవచ్చు.
(చూడండి:: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
పార్ట్ 2: ముఖ్యమైన మతసంబంధ, సాంస్కృతిక అంశాలు
2 తిమోతి పత్రికలో సైనికుని చిత్రం ఏమిటి?
పౌలు చెరసాలలో ఉన్నపుడు, తాను త్వరలోనే చనిపోతాడని తెలిసి, యేసుక్రీస్తు సైనికుడిగా ఉండుటను గూర్చి మాట్లాడినాడు. సైనికులు తమ నాయకులకు విధేయత చూపించాలి. అదేరీతిగా, క్రైస్తవులు యేసు ప్రభువుకు విధేయత చూపించాలి. క్రీస్తు "సైనికులు"గా, విశ్వాసులు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి, వాటి ఫలితంగా మరణించినా సరే.
దేవుడు లేఖనాన్ని ప్రేరేపించాడు అనగా ఏమిటి?
దేవుడు లేఖనం యొక్క మూల గ్రంధకర్త. ఈ లేఖనం లోని పుస్తకాలను వ్రాసిన మానవ రచయితలను ఆయన ప్రేరేపించాడు. దాని అర్ధం ప్రజలు వ్రాసిన వాటిని వ్రాయడానికి దేవుడు ఒక విధంగా కారణమయ్యాడు. అందుకే బైబిల్ ని దేవుని వాక్యము అని కూడా పిలుస్తారు. ఇది దాని(దేవుని వాక్యము) గురించి అనేక విషయాలను సూచిస్తున్నది. మొదటిది, బైబిల్ బోధించే ప్రతిదీ లోపము లేనిది, నమ్మదగినది. రెండవది, దేవుడు తన గ్రంథాన్ని ప్రతీ తరం ప్రజల కోసం ఎల్లప్పుడూ సంరక్షిస్తాడు. మూడవది, దేవుని వాక్యము ప్రపంచంలోని అన్ని భాషలలో అనువదించాలి.
భాగం - 3: ముఖ్యమైన అనువాద సమస్యలు
ఏకవచనం, బహువచనం “నీవు/మీరు”
ఈ పత్రికలో, “నేను” అనే పదం పౌలును సూచిస్తున్నది. ఇక్కడ “నీవు” అనే పదం దాదాపుగా ఎప్పుడూ ఏకవచనంగా, తిమోతిని సూచిస్తుంది. దీనికి మినహాయింపు 4:22. (చూడండి: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
అంతర్గతం మరియు ప్రత్యేకం "మేము" మరియు "మనం"
ఈ పత్రికలో, “మేము” మరియు “మనం” అన్న పదాలలో రచయితయైన పౌలు, పత్రిక గ్రహీత తిమోతి మరియు విశ్వాసులందరూ ఉన్నారు. చూడండి: (See: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
“క్రీస్తులో”, “ప్రభువులో” మొదలైన వ్యక్తీకరణల గూర్చి పౌలు అర్థం ఏమిటి?
పౌలు క్రీస్తుకు విశ్వాసుల మధ్య ఉన్న సన్నిహిత ఐక్యతను వ్యక్తపరచడానికి ఉద్దేశించాడు. ఈ రకమైన వ్యక్తీకరణ గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి రోమా పత్రిక ఉపోద్ఘాతమును చూడండి.
2 తిమోతి పత్రికలో ప్రధాన వాక్యముల సమస్యలు ఏమిటి?
ఈ క్రింది వచనాలలో, పురాతన గ్రీకు లిఖిత ప్రతులకు తరువాత వచ్చిన గ్రీకు లిఖిత ప్రతులకు చాలా భిన్నంగా ఉంటాయి. ఆధునిక అనువాదాలు కూడ వారు అనువదించిన ఏయే గ్రీకు లిఖిత ప్రతుల ఆధారంగా అవి భేదం కలిగియుండవచ్చు.ULT అచ్చుపుస్తకము/ముద్రణ పురాతన గ్రీకును లిఖిత ప్రతులకు నుండి అనువదించి, తరువాత లిఖిత ప్రతులకు ఉన్న తేడాలను ఒక ఫుట్‌నోట్‌లో సూచించారు. బైబిల్ అనువాదం ఇప్పటికే నిర్దిష్ట ప్రాంతంలో అందుబాటులో ఉంటే, అనువాదకులు ఆ అనువాదంలో నిర్ణయాన్ని అనుసరించడాన్ని పరిగణించాలి. లేనిపక్షాన, యుఎల్‌టి వచనంలో ప్రతిబింబించే విధంగా పురాతన గ్రీకు లిఖిత ప్రతులను అనుసరించాలని అనువాదకులకు సూచించారు.
- “ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను, నియమింపబడితిని”(1:11). తరువాత కొన్ని లిఖిత ప్రతులలో ఇలా ఉన్నది, “ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను, అన్యజనులకు బోధకుడనుగాను, నియమింపబడితిని”
- “దేవుని ఎదుట వారికి హెచ్చరించు” (2:14). తరువాత కొన్ని లిఖిత ప్రతులలో, “ప్రభువు ఎదుట వారికి హెచ్చరించు.” చూడండి: (See: మూల గ్రంథం వైవిధ్యాలు)
2 Timothy 1
2 తిమోతి 01 సాధారణ వివరణ
నిర్మాణం, మరియు ఆకృతీకరణ
పౌలు 1-2 వచనాలలో ఈ పత్రికలో అధికారికంగా పరిచయం చేస్తున్నాడు. పురాతకాలంలో తూర్పు సమీప ప్రాంత రచయితలు తరచూ ఈ విధంగా ఉత్తరాల తొలి భాగమును ప్రారంభిస్తారు.
ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు
ఆధ్యాత్మిక పిల్లలు
పౌలు తిమోతిని క్రైస్తవుడిగాను, సంఘ నాయకుడిగాను తరిఫీదు చేసాడు. అతను క్రీస్తునందు విశ్వసించడానికి కూడ పౌలె నడిపించి ఉండవచ్చు. కాబట్టి, పౌలు తిమోతిని “ప్రియమైన కుమారుడు” అని పిలుస్తున్నాడు. పౌలు తిమోతికి తండ్రి కాకపోయినప్పటికీ, పౌలు తిమోతితో తన సంబంధాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఒక తండ్రి, కుమారులుగా మాట్లాడుతున్నాడు. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు ఉండే అవకాశములు
హింస
ఈ పత్రిక వ్రాసేటప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. పౌలు తిమోతిని సువార్త నిమిత్తము శ్రమపడడానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు.
2 Timothy 1:1
Παῦλος
ఇది ఒక మనిషి పేరు, పత్రిక రచయిత. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Παῦλος
ఈ పత్రిక రచయిత పేరు, అతని గుర్తింపుతో ప్రారంభించి, స్వీకరించు వ్యక్తిని ప్రస్తావించడం ద్వారా (2 వ వచనంలో) ఆ కాలము యొక్క సాధారణ పద్ధతిని అనుసరిస్తున్నాడు. మీ భాషలో కూడ పత్రిక రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట విధానం ఉండవచ్చు. అలా ఉన్నట్లైతే, నీవు దానిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, పౌలు ఈ పత్రికను వ్రాస్తున్నాను”
διὰ θελήματος Θεοῦ
పౌలు అపొస్తలుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నందున పౌలు అపొస్తలుడయ్యాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని చిత్తమును బట్టి” లేదా “దేవుడు అలా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి”
κατ’
దీని అర్ధం ఈ రెండు విషయాలలో ఒకటి అయుండవచ్చు. (1) దేవుడు యేసునందు జీవమును గుర్చిన వాగ్దానమును ఇతరులకు చెప్పడానికి పౌలును నియమించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రకటించే ఉద్దేశ్యంతో” (2) పౌలు అపొస్తలుడయ్యాడు ఎందుకంటే యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును స్వయంగా ఆయనే పొందుకున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “స్వీకరించిన ఫలితంగా”
ζωῆς τῆς ἐν Χριστῷ Ἰησοῦ
జీవం అనేది యేసు లోపల అది ఒక వస్తువులా ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ఇది ప్రజలు క్రీస్తు యేసుకు చెందినవారుగా ఉన్న ఫలితంగా పొందుకున్న జీవము సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు యేసుకు చెందినందున ఫలితంగా మనం పొందే జీవమును” (చూడండి: రూపకం)
2 Timothy 1:2
Τιμοθέῳ
ఇది ఒక మనిషి పేరు, ఈ పత్రిక ఎవరికి వ్రాయబడినదో, వారి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Τιμοθέῳ
మీ భాషలో కూడ పత్రిక పొందుకునేవారిని పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట విధానం ఉండి ఉండవచ్చు. అలా ఉన్నట్లైతే, మీరు దానిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ పత్రిక నీ కొరకు, తిమోతి”
ἀγαπητῷ τέκνῳ
పౌలు తిమోతికి తండ్రి కాదు, కానీ తిమోతి పట్ల తన ప్రేమను, ఆమోదాన్ని తెలియజేయడానికి పిల్లవాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. పౌలు తిమోతిని క్రీస్తుకు పరిచయం చేసాడు, కాబట్టి పౌలు అతన్ని తన బిడ్డగా ఆధ్యాత్మిక ధృక్పదంలో భావించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నాకు ప్రియమైన కుమారుడు లాంటివాడు” లేదా “నీవు నాకు ప్రియమైన బిడ్డలా ఉన్నావు” (చూడండి: రూపకం)
χάρις, ἔλεος, εἰρήνη, ἀπὸ
రచయిత పేరు, దానిని స్వీకరించే వ్యక్తి పేరు (తిమోతి) చెప్పిన తరువాత, పౌలు తిమోతికి ఒక ఆశీర్వాదమును జోడిస్తున్నాడు. మీ భాషలో ప్రజలు ఆశీర్వదించే విధమును ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు కనికరము,దయ, శాంతి నీలో అనుభవించుదువు గాక” లేదా “నీకు కనికరము, దయ, శాంతి కలుగునట్లు నేను ప్రార్థిస్తున్నాను” (చూడండి: దీవెనలు)
χάρις, ἔλεος, εἰρήνη
తిమోతికి పౌలు ఇచ్చిన ఆశీర్వాదములో ఈ మూడు నైరూప్య నామవాచకాలు కలిగి ఉన్నాయి. మీ భాషలో కూడ ఈ అంశాలను వ్యక్తపరచు ఒక నిర్దిష్టమైన విధానం ఉండి ఉండివచ్చు, క్రియా పదాలు లాంటివి. అలా ఉన్నట్లైతే, మీరు వాటిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. UST ని చూడండి. (చూడండి: భావనామాలు)
Θεοῦ Πατρὸς
ఇది దేవుని ముఖ్యమైన నామము/బిరుదు. పౌలు ఇక్కడ దేవుణ్ణి (1) క్రీస్తు తండ్రిగా, లేదా (2) విశ్వాసులకు తండ్రి అని సూచిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తండ్రియైన దేవుడు” (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ἡμῶν
ఈ పుస్తకంలో/పత్రికలో, మన, మనము, మాకు, మనకు, మరియు మా అనే పదాలు పౌలు (ఈ పత్రిక రాసినవారు), తిమోతి (ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది వ్రాయబడినవారు), మరియు, పొడిగింపు ద్వారా విశ్వాసులందరికి వర్తిస్తుంది. (చూడండి: See: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)
2 Timothy 1:3
χάριν ἔχω τῷ Θεῷ
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, మీరు క్రియ లేదా విశేషణం ఉపయోగించి ఈ నైరూప్య నామవాచకమైన కృతజ్ఞత వెనుక ఉన్న ఆలోచనను వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను” లేదా “నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను” (చూడండి: భావనామాలు)
ᾧ λατρεύω ἀπὸ προγόνων
ఇది ఒక జాతియం, అంటే పౌలు కుటుంబము అనేక తరాలుగా దేవుని సేవిస్తూ ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా పూర్వీకులు సేవించినవానిని నేనుకూడ సేవిస్తున్నాను.” చూడండి: (See: జాతీయం (నుడికారం))
ἐν καθαρᾷ συνειδήσει
పౌలు తన మనస్సాక్షి గురించి శారీరకంగా శుభ్రంగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి ఉన్న వ్యక్తి దోషారోపణ కలిగి యుండడు, ఎందుకంటే అతడు ఎప్పుడూ యోగ్యమైనది చేయుటకు ప్రయత్నించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “యోగ్యమైనది చేయుటకు నేను ప్రయాసపడి దాన్ని ప్రయత్నించానని తెలుసుకొని” (చూడండి: రూపకం)
ὡς ἀδιάλειπτον ἔχω τὴν περὶ σοῦ μνείαν
జ్ఞాపకం అనే నైరూప్య నామవాచకాన్ని ద్వారా గుర్తుంచుకునే ప్రక్రియను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీ భాషలో కూడ ఈ అంశాలను వ్యక్తపరచే ఒక నిర్దిష్టమైన విధానం ఉండి ఉండవచ్చు, క్రియా పదాలు లాంటివి. అలా ఉన్నట్లైతే, మీరు వాటిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నా ప్రార్థనలలో నేను నీ గురించి ఎల్లప్పుడు ఆలోచిస్తున్నట్లు నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు” (చూడండి: భావనామాలు)
σοῦ
పౌలు తిమోతిని సంబోధిస్తున్నందున నీవు అనే పదం ఇక్కడ మరియు పత్రిక అంతటా ఏకవచనము. ఒక గమనిక 4:22 లో ఉన్న ఒక మినహాయింపు గురించి నోట్స్ చర్చిస్తుంది. (చూడండి:ఏకవచన నీవు రూపాలు)
νυκτὸς καὶ ἡμέρας
ఇక్కడ, రాత్రి, పగలు కలిసి రాత్రీ, పగలులో ఉన్న సమయాన్ని సూచించడానికి ఉపయోగించారు. దీని అర్ధం పౌలు సమయం ఎప్పుడైన, తరచుగా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాడు. అతను ఎప్పుడూ ఆగకుండా రాత్రంతా, పగలంతా ప్రార్థిస్తున్నాడని కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అన్ని సమయాల్లో” ప్రత్యామ్నాయ అనువాదం: “ఎల్లప్పుడూ” (చూడండి:వివరణార్థక నానార్థాలు)
2 Timothy 1:4
μεμνημένος σου τῶν δακρύων
పౌలు తిమోతిని విడచి వెళ్ళుతున్న సమయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లు సూచించబడింది. ఇది అస్పష్టంగా ఉంటే, మీరు ఈ సమాచారాన్ని చేర్చవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నిన్ను విడిచిపెట్టినప్పుడు నీవు ఎలా కన్నీళ్ళు కార్చావో జ్ఞాపకము చేసుకొనుచు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
σου τῶν δακρύων
ఇక్కడ, మీ కన్నీళ్లు తిమోతి ఏడుపు లేదా చాలా విచారంగా ఉన్న చర్యను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు ఏడ్చినట్లు” లేదా “నీ బాధ” (చూడండి: https://git.door43.org/Door43-Catalog/te_ta/src/branch/master/translate/figs-metonymy/01.md)
χαρᾶς πληρωθῶ
పౌలు తనను గూర్చి తాను ఎవరో ఒక పాత్రను నింపు నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను అధిక సంతోషంతో ఉండునట్లు” లేదా “నేను చాలా ఆనందించవచ్చు” (చూడండి: రూపకం)
χαρᾶς πληρωθῶ
మీ భాష కర్మణి క్రియా పదాల రూపాలను ఉపయోగించకపోతే, ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి క్రియా పదాల రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆనందం నన్ను నింపునట్లు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 1:5
ὑπόμνησιν λαβὼν
ఇది ఒక జాతీయం, అంటే “జ్ఞాపకముచేసుకొనుట”. (చూడండి: జాతీయం (నుడికారం))
τῆς ἐν σοὶ ἀνυποκρίτου πίστεως
పౌలు తిమోతి యొక్క విశ్వాసాన్ని ఒక నైరూప్య నామవాచకంతో సూచిస్తున్నాడు. మీ భాషలో కూడ ఈ అంశాలను వ్యక్తపరచు ఒక నిర్దిష్టమైన విధానం ఉండి ఉండవచ్చు, క్రియా పదాలు లాంటివి. అలా ఉన్నట్లైతే, మీరు వాటిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు యదార్ధంగా నమ్ముచున్న” (చూడండి: భావనామాలు)
τῆς ἐν σοὶ ἀνυποκρίτου πίστεως
విశ్వాసం గురించి అది తిమోతి లోపల ఒక వస్తువులా ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఇక్కడ దేవునియందు తిమోతికి ఉన్న విశ్వాసాన్ని సూచిస్తున్నాడు, తిమోతి యందు మరొకరి విశ్వాసం గూర్చి కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ నిష్కపటమైన విశ్వాసం” లేదా “నీ విశ్వాసం, అనగా నిష్కపటమైనది” (చూడండి: రూపకం)
ἐν σοὶ…πίστεως, ἥτις ἐνῴκησεν πρῶτον ἐν τῇ μάμμῃ σου, Λωΐδι, καὶ τῇ μητρί σου, Εὐνίκῃ; πέπεισμαι δὲ ὅτι καὶ ἐν σοί
పౌలు వారి విశ్వాసం గురించి అలంకారికంగా మాట్లాడుతున్నాడు, అది ప్రతి ఒక్కరిలో లో సజీవంగా, జీవించినట్లుగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ము చున్నాను.” (చూడండి: మానవీకరణ)
Λωΐδι
ఇది ఒక స్త్రీ పేరు, అనగా తిమోతి అమ్మమ్మ పేరు, బహుశా అతని అమ్మ వాళ్ళ అమ్మ. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Εὐνίκῃ
ఇది ఒక స్త్రీ పేరు, అనగా తిమోతి తల్లి పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 1:6
δι’ ἣν αἰτίαν
పౌలు తిమోతిలో ఉన్న కృపావరమును ప్రజ్వలింప జేయుమని ప్రోత్సహించుటకు కారణం ఏమనగా యేసునందు తిమోతికి ఉన్న విశ్వసమందు పౌలుకు రూడీగా ఉందని పౌలు వ్రాస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ కారణం చేత” లేదా “యేసునందు నీ విశ్వాసమును బట్టి”
ἀναζωπυρεῖν τὸ χάρισμα
నిప్పును మరలా రగులునట్లు చేయు రీతిగా తిమోతి తన కృపావరమును మరలా ఉపయోగించవలసిన అవసరమును గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “కృపావరమును మరొకసారి ఉపయోగించుటకు ఆతురతగా ఉండు” (చూడండి: రూపకం)
τὸ χάρισμα τοῦ Θεοῦ, ὅ ἐστιν ἐν σοὶ διὰ τῆς ἐπιθέσεως τῶν χειρῶν μου
పౌలు తన చేతులను తిమోతిపై ఉంచి, దేవుడు తనను పిలిచిన పనిని చేయటానికి దేవుడు అతనికి దేవుని ఆత్మ బలపరచి శక్తిని ఇచ్చునట్లు ప్రార్థించాడు. అప్పుడు తిమోతి పరిశుద్ధాత్మ ద్వార కృపావరమును పొందుకున్నాడు. దీనిని 1 తిమోతి 4:14 లో మీరు దీనిని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నీ కోసం ప్రార్థించినప్పుడు నీవు పొందుకున్న దేవుని బహుమతి/కృపావరము” (చూడండి: సంకేతాత్మకమైన చర్య)
τὸ χάρισμα τοῦ Θεοῦ, ὅ ἐστιν ἐν σοὶ διὰ τῆς ἐπιθέσεως τῶν χειρῶν μου
పౌలు బహుమతి గురించి అది తిమోతి లోపల ఒక వస్తువుగా మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న* అను పదాలు తిమోతి కృపావరము పొందుకునట్లు మీ భాషలో స్పష్టంగా చెప్పలేకపోతే, మీరు దానిని ఇవ్వడం లేదా స్వీకరించడం అనే ఆలోచనను వ్యక్తపరిచే క్రియతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నీ మీద చేయి వేసినప్పుడు నీవు పొందిన దేవుని కృపావరము” (చూడండి: రూపకం)
τὸ χάρισμα τοῦ Θεοῦ, ὅ ἐστιν ἐν σοὶ διὰ τῆς ἐπιθέσεως τῶν χειρῶν μου
ఇందులో ఉన్న అంతర్యం ఎదనగా దేవుడు తనను పిలిచిన పరిచర్య పనిని చేయుటకు ఈ ఆత్మీయ వరము తిమోతిని బలపరుస్తుంది, పౌలు కూడ అతని మీద చేతులుంచి ప్రార్ధన చేసినాడు. ఈ విషయాలు స్పష్టంగా లేకపోతే, మీరు ఈ సమాచారాన్ని మీ అనువాదంలో చేర్చవచ్చు. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 1:7
γὰρ
ఇక్కడ, ఎందుకంటే అనేది తిమోతి తన ఆధ్యాత్మిక కృపావరాన్ని ఉపయోగించాలని పైవచనంలో పౌలు బోధించిన దానికి ఈ వచనం మరొక కారణాన్ని ఇస్తున్నదని సూచిస్తుస్తున్నది. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఎందుకంటే అనే చోట ఈ సమాచారంతో ఇక్కడ భర్తీ చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు నీకిచ్చిన బహుమతిని నీవు మరలా ఉపయోగించుటకు ప్రారంభించడానికి నేను కోరుకునే మరో కారణం ఏమిటంటే” (చూడండి: సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం)
οὐ…ἔδωκεν ἡμῖν ὁ Θεὸς πνεῦμα δειλίας, ἀλλὰ δυνάμεως, καὶ ἀγάπης, καὶ σωφρονισμοῦ
ఇది ఈ రెండు విషయాలలో ఒకట అర్ధం అయుండవచ్చు. (1) ఆత్మ అనేది పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని పరిశుద్ధాత్మ మనకు భయమును పుట్టించదు. ఆయన మనకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును కలిగిస్తాడు ”(2) ఆత్మ అనేది మానవుని స్వభావమును సూచిస్తుంది.. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మనము భయపడునట్లు చేయడు, కాని, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలుగునట్లు చేయును.”
δυνάμεως, καὶ ἀγάπης, καὶ σωφρονισμοῦ
తిమోతి చేయవలసిన మూడు విషయాలను సూచించడానికి నైరూప్య నామవాచకాలను పౌలు ఉపయోగిస్తున్నాడు. మీ భాష ఈ భావనలను వ్యక్తపరచడానికి ఒక నిర్దిష్ట విధానం కలిగి ఉండవచ్చు, క్రియా పదము వంటివి. అలా అయితే, మీరు వాటిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనంతట మనమే విధేయత చూపుటకు, ప్రేమించుటకు, నియంత్రించుకునేలా చేయునది” (చూడండి: భావనామాలు)
σωφρονισμοῦ
క్రమశిక్షణ అనే పదమునకు ఈ రెండు అర్ధాలలో ఒకటి అయుండవచ్చు (1) క్రమశిక్షణ ఆశానిగ్రహముకు సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మనల్ని మనం నియంత్రించుకునే సామర్థ్యం” (2) క్రమశిక్షణ ఇతరులను సరిజేయు లేదా నియంత్రించే శక్తికలిగియుండుటను సూచిస్తుంది.. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇతరులను సరిజేయు సామర్థ్యము”
2 Timothy 1:8
τὸ μαρτύριον
ప్రభువు గురించి ఇతరులకు చెప్పే కార్యాచరణను/ప్రక్రియను సూచించడానికి సాక్ష్యము* అనే పదాన్ని పౌలు ఉపయోగిస్తూ ఉండవచ్చు, కేవలం సందేశమును మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “సాక్ష్యమివ్వడం” లేదా “ఇతరులకు చెప్పడం” (చూడండి: అన్యాపదేశము)
τὸν δέσμιον αὐτοῦ
పౌలు ప్రభువు చేత ఖైదీ చేయబడలేదు. అతను ప్రభువును గూర్చి సాక్షమిచ్చాడు గనుక ఖైదీయైయాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన కొరకు ఖైదీ” లేదా “ప్రభువు కొరకు ఖైదీ”
συνκακοπάθησον τῷ εὐαγγελίῳ
కలిసి అనే పదమునకు ఈ రెండు అర్ధాలలో ఒకటి ఉండవచ్చు. (1) తిమోతి పౌలుతో కలిసి శ్రమపడడం అని ఒక అర్థం. (2) తిమోతి సమస్త క్రైస్తవులందరితో కలిసి శ్రమపడడం అనేది మరో అర్థం.
συνκακοπάθησον τῷ εὐαγγελίῳ
ఇక్కడ, సువార్త కొరకు అంటే “యేసును గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పడం కొరకు” అని అర్ధం ప్రత్యామ్నాయ అనువాదం: “యేసును గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పడం వల్ల కలిగే శ్రమలను నాతో పాటు అంగీకరించుము.
τῷ εὐαγγελίῳ, κατὰ δύναμιν Θεοῦ
దేవుడు తన ప్రజలు శ్రమపడుతున్నప్పుడు దానిని ఒర్చుకొనడానికి శక్తి అనుగ్రహిస్తాడని తిమోతికి పౌలు గుర్తుచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సువార్త నిమిత్తము, దేవుడు మిమ్మును బలపరచుటకు అనుమతించుట”
2 Timothy 1:9
καλέσαντος κλήσει ἁγίᾳ
**పరిశుద్ధమైన పిలుపుతో** అను వ్యక్తీకరణను ఈ క్రింది రెండు అర్ధాలలో ఒక అర్ధమిచ్చుటకు పౌలు ఉపయోగిస్తున్నాడు. (1) ఇది పిలుపు వలన కలుగు ఫలితాలను గూర్చి వివరిస్తుంది. ఈ పిలుపు పరిశుద్ధమైన వారిని లేదా దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రజలను తయారుచేస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రత్యేకపరచు పిలుపుతో దేవునికి పరిశుద్దులుగా ఉండుటకు పిలిచెను” లేదా (2) ఈ పిలుపు మూలం పరిశుద్ధమైన దేవుడని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “తన పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను” (చూడండి: అన్యాపదేశము)
οὐ κατὰ τὰ ἔργα ἡμῶν
ఇక్కడ క్రొత్త వాక్యాన్ని ప్రారంభించడానికి ఇది సహాయపడవచ్చు. మీరు క్రొత్త వాక్యాన్ని ప్రారంభిస్తే, స్పష్టంగా ఉండుట కొరకు మీరు మునుపటి ఉపవాక్యభాగం లోని కొన్ని పదాలను పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన మన క్రియలను బట్టి మనలను రక్షించలేదు, పిలువలేదు”
ἀλλὰ κατὰ ἰδίαν πρόθεσιν καὶ χάριν
ఇక్కడ సంకల్పం, మరియు కృప అనే పదాలను కలిపి “దయాసంకల్పం” అని అర్ధమిచ్చును. యేసు క్రీస్తు ద్వారా మనకు కృప లేదా కనికరము చూపించునట్లు దేవుని సంకల్పంలో లేదా మన కొరకైన ప్రణాళికలో ఉన్నదని పౌలు చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “కానీ ఆయన కృపా సంకల్పమును బట్టి” లేదా “అయితే ఆయన మనకు దయ చూపించాలని ప్రణాళిక నిర్ణయించాడు.” (చూడండి: విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు)
καὶ χάριν, τὴν δοθεῖσαν ἡμῖν ἐν Χριστῷ Ἰησοῦ
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, మీరు ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు క్రీస్తుయేసు నందు దేవుడు మనకు అనుగ్రహించిన కృప” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐν Χριστῷ Ἰησοῦ
పౌలు దేవుని సంకల్పం, మరియు కృప లేదా “కృపా సంకల్పం” గురించి క్రీస్తుయేసు లోపల అదేదో ఒక వస్తువు ఉన్నట్లు అలంకార రీతిగా మాట్లాడుతున్నాడు. ఇది మనుష్యులను రక్షించడానికి యేసు నెరవేర్చిన దేవుని ప్రణాళికను సూచిస్తున్నది. కాబట్టి మనుష్యులను యేసుతో సంబంధాన్ని ప్రారంభించినప్పుడు, దేవుడు వారిని రక్షిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తుయేసుతో మనకున్న సంబంధం ద్వారా” (చూడండి: రూపకం)
πρὸ χρόνων αἰωνίων
ఇది కాలమునకు, ప్రపంచ సృష్టికి ముందు క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షించాలని దేవుడు నిర్ణయించాడని సూచిస్తున్న ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: “సమయం ప్రారంభమయ్యే ముందు/అనాదికలముననే ఆరంభానికి ముందే” (చూడండి: జాతీయం (నుడికారం))
2 Timothy 1:10
φανερωθεῖσαν δὲ νῦν
మనలను రక్షించుట కొరకైన దేవుని కృపగల ప్రణాళిక యేసుక్రీస్తు రాకడ ద్వారా మనుష్యులకు ఒక వస్తువును బయలుపరచి, చూపించునట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు ఇప్పుడు మనుష్యులు దానిని తెలుసుకొనగలరు” లేదా “మరియు ఇప్పుడు మనుష్యులు అనుభవించగలరు. (చూడండి: రూపకం)
φανερωθεῖσαν δὲ νῦν
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, మీరు ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇప్పుడు దానిని దేవుడు వెల్లడిచేసినాడు” లేదా “దేవుడు ఇప్పుడు దానిని మనుష్యులు తెలుసుకొనునట్లు అనుమతించాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
φωτίσαντος δὲ ζωὴν καὶ ἀφθαρσίαν διὰ τοῦ εὐαγγελίου
జీవము మరియు అక్షయత అనునవి మనుష్యులు వాటిని చూచునట్లు చీకటి నుండి వెలుగులోకి తీసుకురాగల వస్తువులుగా ఉన్నట్లు, పౌలు సూచిస్తున్నాడు. అతడు ఏదో బహిర్గతం చేయడము గురించి లేదా మనుష్యులకు తెలియజేయడం గురించి అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు సువార్త ద్వారా జీవమును, అక్షయత బయలుపరచెను” లేదా “మరియు సువార్త ద్వారా జీవము, అక్షయతను ప్రకటించెను” (చూడండి: రూపకం)
ζωὴν καὶ ἀφθαρσίαν
ఇక్కడ, జీవము, అక్షయత బహుశా “అక్షయమైన జీవము” అని అర్ధం చేసుకోవడానికి కలిసి పనిచేస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “శాశ్వతమైన నిత్యజీవము” లేదా “క్షయము కాని జీవము” (చూడండి: విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు)
2 Timothy 1:11
ἐτέθην ἐγὼ κῆρυξ
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, మీరు ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు నన్ను చాటింపు వేయువానిగా ఎన్నుకున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κῆρυξ
ఒక చాటించే వ్యక్తి అనగా ఒక సందేశాన్ని ప్రకటించడానికి పంపబడిన వ్యక్తి. మీ భాషలో ఇలాంటి పదం లేకపోయినయెడల, మీ పాఠకులకు చాటించే వ్యక్తి అంటే ఏమిటో తెలియకపోతే, మీరు సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “సందేశకుడు” (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
κῆρυξ
పౌలు తనను తాను చాటించే వ్యక్తి తో పోల్చుకుంటున్నాడు, ఎందుకంటే సువార్త సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు అతనిని పంపించినాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక బోధకుడు/ప్రకటించువాడు” (చూడండి:రూపకం)
2 Timothy 1:12
δι’ ἣν αἰτίαν
పౌలు అపొస్తలుడిగా తన స్థాయిని ప్రస్తావించడం ద్వారా తన శ్రమలకు కారణం చూపిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను అపొస్తలుడనైయున్నందున”
καὶ ταῦτα πάσχω
పౌలు తాను శ్రమలు అనుభవిస్తున్నాడని నిర్దిష్టమైన విషయాలను ప్రస్తావించలేదు, కాని పత్రిక యొక్క సందర్భాన్ని బట్టి, అతడు పరోక్షంగా ఖైదీగా శ్రమపడుతున్నాడని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను ఖైదీగా కూడ శ్రమపడుతున్నాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πέπεισμαι
దేవుడు సమస్తమును చివరిలో సరిజేయునని తాను నిశ్చయత గలవానిగా పౌలు వ్యక్తపరుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నాకు ఖచ్చితంగా తెలుసు”
τὴν παραθήκην μου φυλάξαι
ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక వస్తువును ఇచ్చి దానిని మరలా మొదటి వ్యక్తికి తిరిగి ఇచ్చేవరకు రెండవ వ్యక్తి సంరక్షించాలన్న ఒక రూపకాన్ని ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు యేసు, పౌలు, కానీ స్వీకరించబడిన వస్తువు ను ఎవరు కలిగి ఉన్నారో స్పష్టంగా లేదు. కాబట్టి ఈ రెండిటిలో ఒక అర్ధం అయుండవచ్చు. (1) పౌలు యేసుకు అప్పగించిన దానిని సురక్షితంగా ఉంచునని యేసును నమ్ముతున్నాడు. ఇది పౌలు యొక్క సొంత జీవం అయుండవచ్చు, లేదా, నిర్దిష్టంగా, పౌలు తన జీవితమంతా యేసుకు నమ్మకంగా ఉంటాడని యైన ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నన్ను ఆయనకు నమ్మకంగా ఉంచడానికి” (2) పౌలు ప్రకటించుటకు పౌలుకు యేసు ఇచ్చిన సువార్తను యేసు కాపాడతాడని పౌలు నమ్ముతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం:“ఆయన సందేశాన్ని ప్రకటించుటకు నాకు సహాయపడటానికి/సహాయపడునట్లు” (చూడండి:రూపకం)
τὴν παραθήκην μου
ఇక్కడ నా అనే పదం ఈ*జమా** ఒక విధముగా పౌలుకు సంబందించినది అనే ఆలోచనను తెలియజేస్తున్నది. ప్రత్యేక అనుబంధం/సంబంధం మనము జమాగా భావించే దానిపై ఆధారపడి ఉంటుంది. రెండు అవకాశాలు ఉన్నాయి. (1) జమా అనేది పౌలుతో ముడిపడి ఉన్నది ఎందుకంటే ఇది పౌలు సొంత జీవం లేదా యేసునందు పౌలు విశ్వాసము గూర్చినదై యున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయనపట్ల నా నమ్మకత్వం” లేదా (2) జమా అనేది పౌలుతో ముడిపడి ఉంది ఎందుకంటే ఇది పౌలు ప్రకటించే సువార్త సందేశం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన సువార్త సందేశమును ప్రకటించుటకు నాకు అప్పగించినాడు” (చూడండి:స్వాస్థ్యం)
ἐκείνην τὴν ἡμέραν
ఇక్కడ దినము అనేది యేసు తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చుచున్నాడు అన్న సమయాన్ని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “తీర్పు దినము” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 1:13
ὑγιαινόντων λόγων
పౌలు తిమోతిని తాను బోధించిన విషయాలను బోధించాలని తద్వారా తన మాదిరిని అనుసరించాలని కోరుచున్నాడు. ఆరోగ్యకరమైన మాటలు అనే వ్యక్తీకరణ “సరైన సందేశం” అనుబంధపరచే అలంకారము(అని అర్ధం), ఎందుకనగా ఆరోగ్యకరమైన మనస్సు సరైన సందేశమును సహేతుకమైనదని గుర్తిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సరైన సందేశం” (చూడండి: అన్యాపదేశము)
λόγων
క్రైస్తవులు విశ్వసించు వ్యక్తీకరణ మాటలలో వివరించడానికి పౌలు పదాలు అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “యొక్క … సందేశం” (చూడండి: అన్యాపదేశము)
ἐν πίστει καὶ ἀγάπῃ τῇ ἐν Χριστῷ Ἰησοῦ
తిమోతి చేయవలసిన పనులను సూచించడానికి పౌలు విశ్వాసం, ప్రేమ అనే రెండు నైరూప్య నామవాచకములను ఉపయోగిస్తున్నాడు. మీ భాషలో ఈ భావనలను వ్యక్తపరచు ఒక నిర్దిష్ట విధానం ఉండి ఉండవచ్చు, క్రియా పదాల వంటివి. ఆలాగు ఉన్నట్లైతే, మీరు వాటిని మీ అనువాదంలో ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు యేసును విశ్వసించడము, మీరు ఆయనకు చెందిన వారు గనుక ఇతరులను ప్రేమించడము” (చూడండి:భావనామాలు)
ἐν πίστει καὶ ἀγάπῃ τῇ ἐν Χριστῷ Ἰησοῦ
ఇక్కడ, ప్రేమ అనే పదముకు ఈ రెండు అర్ధాలలో ఒకటి అయుండవచ్చు. (1) తిమోతి ఇతరుల పట్ల చూపించవలసిన ప్రేమ. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు యేసును విశ్వసించడము, మీరు ఆయనకు చెందిన వారు గనుక ఇతరులను ప్రేమించడము” (2) తిమోతి దేవుని పట్ల చూపించవలసిన ప్రేమ. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తుయేసును నమ్ముడము ఆయనను ప్రేమించడము”
ἐν Χριστῷ Ἰησοῦ
విశ్వాసము, ప్రేమ అనునవి క్రీస్తు యేసు లోపలి వస్తువులు అన్నట్లుగా పౌలు అలంకారరిత్య మాట్లాడుతున్నాడు. ఇది మనము యేసునకు చెందినవారమైనప్పుడు మనము విశ్వాసము, ప్రేమను కలిగి ఉండునట్లు యేసు చేయునని సూచిస్తున్నది. 1: 9 లో మీరు దీనిని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తుయేసుతో సంబంధం/సంబంధబాంధవ్యము ద్వారా మనది” (చూడండి: రూపకం)
2 Timothy 1:14
τὴν καλὴν παραθήκην
ఇక్కడ, మంచి జమా అనేది దేవుడు తన ప్రజలతో ప్రకటించడానికి తిమోతికి అప్పగించిన సువార్త సందేశాన్ని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని ప్రజల కోసం మీకు అప్పగించిన మంచి సందేశం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τὴν καλὴν παραθήκην φύλαξον
తిమోతి సువార్త సందేశమును సంరక్షించడానికి అప్రమత్తంగా ఉండాలి, ఎందుకనగా ప్రజలు అతనిని వ్యతిరేకిస్తారు, అతడు చెప్పుచున్నా, బోధించుచున్న దానిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు, తద్వారా దానిని వేరే సందేశంగా మారుస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మంచి జమా వక్రీకరించడానికి ప్రయత్నించే వారి నుండి రక్షించండి” లేదా “ప్రజలు సువార్త సందేశాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు గనుక, దానిని కాపాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
διὰ Πνεύματος Ἁγίου
ఇక్కడ ,ద్వారా అంటే “ద్వారా” లేదా “శక్తి ద్వారా”. ప్రత్యామ్నాయ అనువాదం: “పరిశుద్ధాత్మ ద్వారా” లేదా “పరిశుద్ధాత్మ సహాయముతో”
2 Timothy 1:15
πάντες οἱ ἐν τῇ Ἀσίᾳ
అన్నీ అనే పదానికి ఈ రెండు అర్ధాలలో ఒకటి అయుండవచ్చు. (1) పౌలు అందరు అనే పదాన్ని కఠినమైన అర్థంలో బావంతో “చాలామంది, కానీ అందరూ కాదు” అని అర్ధంతో వాడి ఉండవచ్చు, ఎందుకనగా తిమోతి, ఒనేసిఫోరు అతనిని విడచిపోలేదు. కాబట్టి ఇది అతిశయోక్తి ఉదాహరణ అవుతుంది. (2) ఆసియా మైనర్ నుండి తనతో కూడ రోమాకు వచ్చిన పురుషులను సూచించడానికి పౌలు అన్నీ అనే పదాన్ని ఉపయోగించి ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆసియా నుండి నాతో వచ్చిన వారందరూ” (చూడండి: అతిశయోక్తి)
Ἀσίᾳ
ఇది రోమా సామ్రాజ్య ప్రాంతమైన, ఆసియా మైనర్ పేరు, ఎఫేసు పట్టణము దీనికి రాజధానిగా ఉంది, ఈ పత్రిక వ్రాస్తున్న సమయంలో తిమోతి ఇక్కడ నివసిస్తున్నాడు. ఇది ఇప్పుడు ఆధునిక టర్కీలో ఒక ప్రాంతం. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἀπεστράφησάν με
ఇది ఒక రూపకం అనగా వారు పౌలును విడిచిపెట్టి అతనికి సహాయం చేయడాన్ని ఆపివేశారు. ప్రత్యామ్నాయ అనువాదం: “నన్ను విడిచిపెట్టారు” (చూడండి: రూపకం)
ἀπεστράφησάν με
అధికారులు పౌలును చెరసాలలో వేసినందున ఆసియా నుండి వచ్చిన విశ్వాసులు అతనిని విడిచిపెట్టారని తిమోతికి తెలుకుంటాడని పౌలు అనుకొనుచున్నాడు. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందంటే, మీరు దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను జైలులో/చెరసాలలో ఉన్నందున నన్ను విడిచిపెట్టారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Φύγελος
ఇది ఒక మనిషి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Ἑρμογένης
ఇది ఒక మనిషి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 1:16
Ὀνησιφόρου
ఇది ఒక మనిషి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
δῴη ἔλεος ὁ Κύριος τῷ Ὀνησιφόρου οἴκῳ
ఒనేసిఫోరు ఇంటివారిని ఆశీర్వదించమని పౌలు దేవున్ని ప్రార్ధిస్తున్నాడు. మీరు దీనిని ఒక ఆశీర్వాదముగా లేదా ప్రార్ధనగా వ్యక్తపరచవచ్చు, మీ భాషలో ఏ విదానం సహజంగా దానిని చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారిని కనికరము చూపాలని నేను ప్రార్ధించుచున్నాను” లేదా “ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారిని ఆశీర్వదించునుగాక” (చూడండి:దీవెనలు)
τῷ Ὀνησιφόρου οἴκῳ
ఇంటివారిని అనే పదం ఒనేసిఫోరు మరియు అతని కుటుంబంలోని వారందరికి, బహుశా అతని దాసులకు కూడా సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒనేసిఫోరు, అతనితో నివసించే ప్రతి ఒక్కరికీ” (చూడండి: అన్యాపదేశము)
τὴν ἅλυσίν μου οὐκ ἐπησχύνθη
సంకెళ్ళు అనే పదము చెరసాలలో ఉండుటను సూచిస్తున్నది. పౌలు జైలులో ఉన్నాడని ఒనేసిఫోరు సిగ్గుపడలేదు కాని తరచూ ఆయనను పరామర్శించడానికి వచ్చాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నా జైలుశిక్షను గూర్చి సిగ్గుపడలేదు” లేదా “నేను చెరసాలలో ఉన్నందుకు సిగ్గుపడలేదు” లేదా “నేను చెరసాలలో ఉన్నప్పటికీ నన్ను గూర్చి సిగ్గుపడలేదు” (చూడండి: అన్యాపదేశము)
2 Timothy 1:17
ἀλλὰ
ఇక్కడ,కానీ అనే పదము మునుపటి వచనమునకు ఈ వచనమునకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తున్నది. పౌలు జైలులో ఉన్నాడని సిగ్గుపడుటకు బదులు, ఒనేసిఫోరు పౌలు కొరకు వెదకి అతనిని కనుగొన్నాడు. ఈ వ్యత్యాసాన్ని చూపించడానికి మీ భాషలో అత్యంత సహజమైన రూపాన్ని ఉపయోగించండి. (చూడండి: సంబంధించు – విరుద్ధ సంబంధం)
Ῥώμῃ
ఇది రోమా సామ్రాజ్య రాజధాని నగరం పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 1:18
δῴη αὐτῷ ὁ Κύριος, εὑρεῖν ἔλεος παρὰ Κυρίου
ఒనెసిఫోరు కనికరము పొందునట్లు పౌలు మరలా ప్రభువును ప్రార్ధించుచున్నాడు. మీరు దీనిని ఒక ఆశీర్వాదముగా లేదా ప్రార్ధనగా వ్యక్తపరచవచ్చు, మీ భాషలో ఏ విదానం సహజంగా ఉంటే దానిని చేయవచ్చు. మీరు దీన్ని
1:16 ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు ఒనేసిఫోరు పట్ల కనికరము చూపాలని నేను ప్రార్ధించుచున్నాను” లేదా “ప్రభువు ఒనేసిఫోరు మీద కనికరము చూపించును గాక” (చూడండి:దీవెనలు)
(δῴη αὐτῷ ὁ Κύριος, εὑρεῖν ἔλεος παρὰ Κυρίου ἐν ἐκείνῃ τῇ ἡμέρᾳ), καὶ ὅσα ἐν Ἐφέσῳ διηκόνησεν, βέλτιον σὺ γινώσκεις
ఇది మీ భాషలో ఇంకా స్పష్టంగా ఉంటే, మీరు ఈ వాక్యాల క్రమాన్ని మార్చి వ్రాయవచ్చు, ఎందుకనగా రెండవ వాక్యము మొదటి వాక్యములో జరిగే క్రియను గూర్చిన కారణమును వివరిస్తున్నది. UST చూడండి. (చూడండి: సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం)
δῴη αὐτῷ ὁ Κύριος, εὑρεῖν ἔλεος παρὰ Κυρίου
ఇది మీ భాషలో ఇంకా స్పష్టంగా ఉంటే, మీరు ఎవరు దయ పొందుతున్నారో స్పష్టం చేయడానికి మీరు అతనిని అనే సర్వనామానికి బదులు “ఒనేసిఫోరు” పేరును ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒనేసిఫోరు ప్రభువు నుండి దయ పొందవచ్చు” (చూడండి: సర్వనామాలు-ఎప్పుడు ఉపయోగించాలి?)
εὑρεῖν ἔλεος παρὰ Κυρίου
పౌలు దయ గురించి అది దొరికే ఒక వస్తువులాగా మాట్లాడుతున్నాడు. తీర్పు దినమున దేవుడు ఒనెసిఫోరు పట్ల దయ చూపించాలన్న కోరికను పౌలు వ్యక్తం చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువు నుండి దయను పొందడానికి” (చూడండి: రూపకం)
ἐν ἐκείνῃ τῇ ἡμέρᾳ
ఆ దినము అనే వ్యక్తీకరణ దేవుడు మనుష్యులందరిని తీర్పు తీర్చే దినమును సూచిస్తున్నది; ఆ సమయంలో పౌలు చెప్పినట్లుగా దయను లేదా ఉగ్రతను వారు ప్రభువు నుండి పొందుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: “తీర్పు దినమున” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Ἐφέσῳ
ఇది ఒక నగరం పేరు, పత్రిక పొందుకున్న తిమోతి ఉన్న ప్రదేశం. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ὅσα ἐν Ἐφέσῳ διηκόνησεν, βέλτιον σὺ γινώσκεις
ఎఫెసులో, ఒనేసిఫోరు తనకు ఇంతకు ముందు సహాయం చేశాడని పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి, పౌలు ఒనెసిఫోరును ఆశీర్వదించమని ప్రభువును అడుగుతున్నాడు ఎందుకనగా అతను పౌలుకు అనేక పర్యాయాలు సహాయం చేశాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను ఎఫెసులో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన నాకు ఎంత సహాయం చేశాడో నీకు బాగా తెలుసు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 2
2 తిమోతి 02 సాధారణ వివరణలు
నిర్మాణం, ఆకృతీకరణ
11 బి -13 వచనాలలో, పౌలు ఒక పద్యమును లేదా కీర్తన గాని ఉటంకిస్తూ ఉండవచ్చు.ఇది ఉల్లేఖనం కావచ్చని పాఠకుడికి చూపించడానికి,మీ అనువాదంలో మీరు ఈ వచనాలను అధ్యాయంలోని ఇతర వచనాలకు కుడి వైపున చూపించడానికి ఎంచుకోవచ్చు.
ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
మనము ఆయనతో పాటు ఏలుదుము.
నమ్మకమైన క్రైస్తవులు భవిష్యత్తులో క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తారు. (చూడండి విశ్వసనీయ, విశ్వాస్యత, అవిశ్వసనీయ, అవిశ్వాస్యత, నమ్మదగిన)
ఈ అధ్యాయంలో ముఖ్యమైన అలంకారాలు
సారూప్యాలు
ఈ అధ్యాయంలో, క్రైస్తవునిగా జీవించడం గురించి బోధించటకు పౌలు అనేక సారూప్యతలను ఉపయోగిస్తున్నాడు. అతను సైనికులు, జెట్టి, రైతుల సారూప్యతలను ఉపయోగిస్తున్నాడు. ఈ అధ్యాయం తదుపరి భాగంలో, అతను గృహములో ఉండు వివిధ రకాల పాత్రల సారూప్యతను ఉపయోగిస్తున్నాడు.
2 Timothy 2:1
τέκνον μου
ఇక్కడ, * పిల్లవాడు* అను పదము గొప్ప ప్రేమ, ఆమోదం కలిగియున్న పదము. తిమోతి పౌలు యొక్క శరీర సంబంధమైన పిల్లవాడు/కుమారుడు కాదు. పౌలు తిమోతిని క్రీస్తుకు పరిచయం చేసినట్లు కూడ ఉన్నది, అందుకే పౌలు అతనిని తన బిడ్డలాగే భావించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నా బిడ్డలాంటి/కుమారుడు వంటివాడు" (చూడండి: రూపకం)
ἐνδυναμοῦ
మీరు దీన్ని కర్తరి రూపంలో చెప్పవచ్చు, ఎవరు క్రియ చేస్తారో వారిని మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు నిన్ను బలపరచడానికి అనుమతించు” (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐν τῇ χάριτι τῇ ἐν Χριστῷ Ἰησοῦ
దేవుడు తన కృప లేదా దయ ద్వారా అనుగ్రహించు బలమును తిమోతి అనుభవించాలని పౌలు కోరుకుంటున్నాడు. యేసు క్రీస్తును తెలుసుకొనుట ద్వారా విశ్వాసులు దేవుని కృపను అనుభవిస్తారు. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు కృప అనే నైరూప్య నామవాచకములో ఉన్న ఆలోచనను విశేషణంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు యేసు మీ సంబంధం ద్వారా మిమ్మును దయతో బలపరచుటకు మీరు అనుమతించుచుండగ” (చూడండి: భావనామాలు)
2 Timothy 2:2
διὰ πολλῶν μαρτύρων
పౌలు ఇతరులు హాజరైయున్న బహిరంగ సభ నేపధ్యంలోని బోధను సుచిస్తున్నాడు. అతను బోధించిన దానికి ఇతరులు సాక్ష్యమివ్వగలరని దీని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను చెప్పినదానికి సాక్ష్యం చెప్పగల వ్యక్తుల సమక్షంలో” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ταῦτα παράθου πιστοῖς ἀνθρώποις
పౌలు తిమోతికి తన హెచ్చరికలు/బోధనలు గురించి అవి తిమోతి ఇతరులకు ఇవ్వగలిగిన వస్తువులుగాను, మరియు వారు వాటిని సరిగ్గా ఉపయోగించునట్లు చూచునట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం:“వాటిని అప్పగించు” లేదా “వాటిని బోధించు” (చూడండి: రూపకం)
πιστοῖς ἀνθρώποις
ఇక్కడ పురుషులు అనే పదము సహజ బావం కలిగి ఉన్నది, అనగా స్త్రీలు కూడా అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “నమ్మకమైన వారికి” (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
2 Timothy 2:3
συνκακοπάθησον
కలిసి అనే పదానికి ఈ రెండు విషయాలలో ఒక అర్ధం అయుండవచ్చు.(1) తిమోతి పౌలుతో కలిసి శ్రమ పడుట అని దీని అర్థం అయుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నాతో కలిసి శ్రమ అనుభవించు” (2) తిమోతి శ్రమ అనుభవించే క్రైస్తవులందరితో కలిసి తిమోతి శ్రమపడటం అన్న అర్థం అయుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసులందరితో కలిసి బాధపడు/శ్రమ అనుభవించు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὡς καλὸς στρατιώτης Ἰησοῦ Χριστοῦ
పౌలు క్రీస్తు యేసు కొరకు శ్రమను అనుభవించుటను మంచి సైనికుడు శ్రమను భరించే అనుభవముతో పోల్చుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు సైనికుడిగాను, యేసుక్రీస్తు మీ సైన్యాదిపతిగా ఆజ్ఞాపించు వాడిగా ఉన్నట్లు” (చూడండి: రూపకం)
2 Timothy 2:4
οὐδεὶς στρατευόμενος ἐμπλέκεται ταῖς τοῦ βίου πραγματίαις
యేసును అనుసరించుటలో తిమోతికి ముఖ్యమైన విషయం అర్ధం చేసుకోడానికి, పౌలు ఒక సైనికుడి రూపకాన్ని పరిచయం చేస్తున్నాడు, అతను తన నాయకుడిని సంతోషపెట్టడం లేదా సైన్యం వెలుపల ఉన్నవారిని సంతోషపెట్టడం మధ్య నిర్ణయించుకోవాలి. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దీన్ని సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అంకితభావంతో ఉన్న ఏ సైనికుడు జీవన వ్యవహారాలలో తన దృష్టినిమరల్చడానికి అనుమతించడు” (చూడండి: రూపకం)
ἐμπλέκεται ταῖς τοῦ βίου πραγματίαις
ఇతర విషయాలలో పాల్గొనడం అనేది అవి ప్రజలను చిక్కించుకొనేవిగాను, స్వేచ్ఛగా కదలకుండా చేయు ఉరిగాను ఉన్నవి అనట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “జీవన వ్యవహారాలు అతని దృష్టిని మరల్చడానికి అనుమతిస్తాడు” (చూడండి: రూపకం)
ἐμπλέκεται ταῖς τοῦ βίου πραγματίαις
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “జీవన వ్యవహారాలు అతని దృష్టిని మరల్చడానికి అనుమతిస్తాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τοῦ βίου
* జీవం* అనగా, ఈ రూపకం యొక్క సందర్భంలో “పౌరసంబంధమైన జీవితం” అని పౌలు ఉద్దేశం. దీని అర్థం ఏమనగా, తిమోతి, విశ్వాసులందరూ క్రీస్తును సేవించకుండా ఉండటానికి పోటీపడు విషయాలను అనుమతించకూడదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అనుదిన జీవితం గూర్చి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τῷ στρατολογήσαντι
ప్రత్యామ్నాయ అనువాదం: “అతని నాయకుడు” లేదా “అతనిని ఆజ్ఞాపించేవాడు”
2 Timothy 2:5
ἐὰν…ἀθλῇ τις, οὐ στεφανοῦται, ἐὰν μὴ νομίμως ἀθλήσῃ
యేసును అనుసరించడంలో ముఖ్యమైన విషయం తిమోతి అర్ధం చేసుకోవడానికి, పౌలు నియమము ప్రకారము పోటిపడాల లేదా నియమవిరుద్ధంగా పోటిపడాలి అన్న విషయంలో నిర్ణయించుకోవాల్సిన ఒక జెట్టి యొక్క రూపకాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. క్రీడాకారుడు చట్టబద్ధంగా పోటీ చేస్తేనే విజేతకు ఇవ్వబడు కిరీటాన్ని అందుకుంటాడు. ఆటలలో పోటీ పడుతున్న అథ్లెట్‌తో ఈ పోల్చడం ద్వారా, క్రీస్తును సేవించే వారు చట్టబద్ధంగా పోరాడకుంటే, అనగా విధేయత చూపకుంటే వారికి ప్రతిఫలం ఇవ్వడని పౌలు తిమోతికి పరోక్షంగా చెప్తున్నాడు. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే,మీరు దీన్ని నేరుగా సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:“నిబంధనల ప్రకారం పోటీపడే క్రీడాకారులను అధికారులు విజేతగా కిరీటం పెడతారని ఆలోచించు” (చూడండి:రూపకం)
ἐὰν…ἀθλῇ τις, οὐ στεφανοῦται, ἐὰν μὴ νομίμως ἀθλήσῃ
పౌలు తిమోతికి బోధించడానికి ఒక ఉహాత్మక పరిస్థితిని కూడా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక క్రీడాకారుడు నిబంధనల ప్రకారం పోటీ చేయలేదని అనుకుందాం. అప్పుడు అతనికి కిరీటం దక్కదు.”(చూడండి:ఊహాత్మక పరిస్థితులు)
ἐὰν…ἀθλῇ τις
ఇక్కడ, పోటీ చెయ్యడం అనేది క్రిడారంగాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక క్రీడాకారుడు ఒక కీడావిభాగంలో పోటీ చేస్తే”
οὐ στεφανοῦται, ἐὰν μὴ νομίμως ἀθλήσῃ
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీనిని రెండు ప్రతికూల పదాలు వాడి ఒక సానుకూల ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతను నిబంధనల ప్రకారం పోటీ చేస్తేనే అధికారులు అతనికి కిరీటం పెడతారు” (చూడండి:జంట వ్యతిరేకాలు)
οὐ στεφανοῦται
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అధికారులు అతనికి కిరీటం పెట్టరు” (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οὐ στεφανοῦται
ఈ సంస్కృతిలో కిరీటం ధరించుట అనేది ఒక పోటీలో విజేతను సూచిస్తున్నదని తిమోతికి తెలుసుకుంటాడాని పౌలు అనుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అధికారులు అతనికి విజేతగా కిరీటం పెట్టరు.” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐ στεφανοῦται
పౌలు కాలంలో, క్రీడాకారులు పోటీలలో గెలిచినప్పుడు, వారు మొక్కల ఆకుల నుండి తయారు చేసిన దండలతో కిరీటం పొందారు. మీ సొంత సంస్కృతిలో పోల్చదగిన ఆచారాన్ని సూచించడం ద్వారా లేదా సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించడం ద్వారా మీరు ఈ ఆలోచనను మీ అనువాదంలో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అధికారులు అతనికి బహుమతి ఇవ్వరు” లేదా “అధికారులు అతనిని విజేతగా ప్రకటించరు” (చూడండి:తెలియనివాటిని అనువదించడం)
μὴ νομίμως ἀθλήσῃ
పౌలు ఒక పోటీని నియంత్రించే నియమాలను సూచిస్తున్నాడు. క్రీడాకారులు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది లేదా వారు పోటీ నుండి తొలగించబడతారు, గెలిచే అవకాశం ఉండదు. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఈ నియమాలను పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతను నిబంధనల ప్రకారం పోటీ చేయడు” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 2:6
τὸν κοπιῶντα γεωργὸν δεῖ πρῶτον τῶν καρπῶν μεταλαμβάνειν
యేసును అనుసరించుటలో ముఖ్యమైన విషయం తిమోతి అర్ధం చేసుకోవడానికి, పౌలు ఒక రైతు యొక్క రూపకాన్ని అనగా కష్టపడి పనిచుయుట లేదా కష్టపడి పనిచేయకపోవుట మధ్య నిర్ణయించుకోవాల్సిన రైతును పరిచయం చేస్తున్నాడు, అతను కష్టపడి పనిచేయడం లేదా కష్టపడక పోవటం. రైతు కష్టపడి పనిచేస్తే పంటలో తన భాగాన్ని పొందుకుంటాడు. ఈ పోలిక చూపించుట ద్వార, క్రీస్తుకు చేయు సేవలో కష్టపడి పనిచేయమని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు, తద్వారా దేవుడు అతనికి ప్రతిఫలమిస్తాడు. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉండేటట్లు ఉంటే,మీరుదీన్ని నేరుగా సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:“కష్టపడి పనిచేసే రైతు అందరికంటే ముందు పంటలో తన వాటాను పొందాలి అన్నది ఆలోచించండి గ్రహించండి.” (చూడండిరూపకం)
πρῶτον τῶν καρπῶν μεταλαμβάνειν
ఈ దృష్టాంతంలో/ఉదాహరణలో, కష్టపడి పనిచేసే రైతు, కోత తరవాత పంటలో భాగాన్ని తీసుకొను ఇతర రైతులతో కలిసి పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ రైతు ఇతరులకన్నా ఎక్కువ కష్టపడి పనిచేస్తాడు కాబట్టి, ఇతరుల కంటేముందుగా పొందుకోవాలి. మొదట పొందుకోవడం అనేది ఉత్తమం అని సూచించబడుతుంది/అనిపిస్తుంది, ఎందుకనగా బహుశా పంట యొక్క నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “పంటలలో ఉత్తమమైన భాగాన్ని పొందుడి” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 2:7
νόει ὃ λέγω, δώσει γάρ σοι ὁ Κύριος σύνεσιν
3 నుండి 6 వచనాలలో పౌలు తిమోతికి మూడు రూపకాలను ఇచ్చాడు, కాని అతను వాటి నిగూడ భావాలను అన్వయాన్ని పూర్తిగా వివరించలేదు. దేవుని సహాయంతో, క్రీస్తు సేవకులకు ఈ రూపకాల పాఠాన్ని తిమోతి గుర్తించగలడని అతను ఎదురుచుస్తునాడు. ఆ కారణంగా, మీరు రూపకాల యొక్క అర్ధానికి వివరణను చేర్చాలనుకుంటే, మీరు బైబిల్ వచనంలో కాకుండా ఫుట్‌నోట్‌లో అర్థాన్ని పేర్కొనాలని మేము సిఫార్సు చేస్తున్నాము/ప్రోత్సాహ పరుస్తున్నాము. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నీకు చెప్పిన దాని గురించి నీవు పూర్తిగా అర్ధంచేసుకొనుటకు జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది, కానీ నీకు సహాయం చేయడానికి నీవు దేవునిపై ఆధారపడవచ్చు” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὃ λέγω
తెలియపరచడం అనే ఆలోచనను వ్యక్తపరచడానికి చెప్పడం అనే క్రియతో పౌలు తన లేఖలో వ్రాసిన వాటిని సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం:“నేను ఇప్పుడే నీకు చెప్పినది” (చూడండి:అన్యాపదేశము)
ἐν πᾶσιν
ఇక్కడ, అన్నివిషయములలో అనే పదము/పదబంధము పౌలు దీనికి ముందు వ్రాసిన మూడు రూపకాలకు సంబంధించిన ప్రతిదాన్ని సూచిస్తున్నది . ప్రత్యామ్నాయ అనువాదం: "నేను ఇప్పుడే చెప్పిన ప్రతిదాని గురించి" లేదా "నేను చెప్పినవాటన్నిటికి (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 2:8
ἐκ σπέρματος Δαυείδ
అనే విత్తనం నుండి అనే పదబంధము యేసు దావీదు రాజు నుండి వచ్చినట్లు సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “దావీదు వారసుడు ఎవరు” (చూడండి: రూపకం)
Δαυείδ
ఇది ఇశ్రాయేలు గొప్ప రాజైన ఒక మనిషి/వ్యక్తి పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἐγηγερμένον ἐκ νεκρῶν
మృతులలో నుండి లేచిన అనే వ్యక్తీకరణ మరణించిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా లేపుట అనే దానికి ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మరలా జీవింప జేసినవాడు” (చూడండి:జాతీయం (నుడికారం))
ἐγηγερμένον ἐκ νεκρῶν
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, ఇదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎవరిని దేవుడు మృతులలో నుండి లేపినాడో” (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κατὰ τὸ εὐαγγέλιόν μου
నా అనే పదము పౌలు సువర్తకు సంబంధించిది అనే ఆలోచనను తెలియచేయుచున్నది, ఎందుకనగా దానిని అతడు ప్రకటిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను ప్రకటించుచున్న సువార్త సందేశము ప్రకారము” (చూడండి:స్వాస్థ్యం)
2 Timothy 2:9
μέχρι δεσμῶν
తన శ్రమలు ఎంత తీవరంగా ఉన్నాయో/ఎంత స్థాయికి పోయాయో అన్నది వ్యక్తపరచడానికి సంకెళ్ళుకు అని అలకారికంగా పౌలు ఉపయోగిస్తున్నాడు: కొట్టబడడం నుంచి బంధింప బడడం, చెరసాలలో సంకెళ్ళతో ఉండేంత వరకు. ప్రత్యామ్నాయ అనువాదం: “చెరసాలలో వేయబడే స్థితికి” (చూడండి: అన్యాపదేశము)
ὡς κακοῦργος
పౌలు తన పరిస్థితిని నిజముగా ఒక నేరం చేసిన వ్యక్తిలో ఉండు సిగ్గుపడు స్థితితో పోల్చుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నేరస్థుడనై యున్నట్టు” (చూడండి:ఉపమ)
ὁ λόγος τοῦ Θεοῦ οὐ δέδεται
ఇక్కడ, బందిపబడి అంటే పౌలు పరిస్థితిని సూచిస్తూ ఖైదీగా గొలుసులతో ఉంచబడి ఉన్నట్లు అని అర్ధమిచ్చుచున్నది. పౌలు ఎప్పటికీ బంధింపబడి ఉంచ లేని దేవుని సందేశమును ఒక వాస్తవ ఖైదీగా వ్యత్యాస పరచుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని నుండి వచ్చిన సందేశమును/దేవుని సందేశమును ఏదీ వెనక్కి ఉంచుకొనలేదు/అడ్డగించలేదు” (చూడండి: రూపకం)
ὁ λόγος τοῦ Θεοῦ οὐ δέδεται
మీ భాష కర్మణి క్రియా రుపాలను ఉపయోగించకపోతే, మీరు ఈ ఆలోచనను వ్యక్తపరచడానికి కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుని సందేశాన్ని/దేవుని నుండి వచ్చిన సందేశాన్ని ఏదీ ఆపలేదు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ λόγος τοῦ Θεοῦ
పౌలు వాక్యము అనే పదాన్ని దేవుని నుండి వచ్చిన సందేశాన్ని అతను మరియు ఇతరులు పదాలతో తెలియజేసిన దేవుని సందేశాన్ని గూర్చి చెప్పుటకు అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని నుండి వచ్చిన సందేశము” (చూడండి:అన్యాపదేశము)
2 Timothy 2:10
πάντα ὑπομένω
ఇక్కడ సమస్తము అనే పదము సర్వసాధారణంగా, బహుశా పౌలు మునుపటి వచనంలో వివరించుచున్న శ్రమలను సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను ఈ శ్రమలన్నిటిని భరిస్తున్నాను/ఒర్చుకోనుచున్నాను” (చూడండి:అతిశయోక్తి)
διὰ τοὺς ἐκλεκτούς
ఏర్పరచబడినవారు అనే పదము ఇక్కడ నామవాచకముగా పనిచేయు విశేషణము మైయున్నది మరియు సమూహాన్ని/గుంపు ప్రజలను సూచిస్తున్నది. మీ భాష ఈ విధంగా ఒక విశేషణాన్ని ఉపయోగించకపోతే, మీరు ఈ పదాన్ని ఒక సమానమైన పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు ఎన్నుకున్నవారి/ఏర్పరచుకున్నవ్యక్తుల/ప్రజల కోసము" (చూడండి:నామకార్థ విశేషణాలు)
καὶ αὐτοὶ σωτηρίας τύχωσιν τῆς ἐν Χριστῷ Ἰησοῦ
రక్షణ పొందవలెను అనే పదబంధం రక్షణ అనుగ్రహించు క్రీస్తు యేసుఒక కర్తగా కూడా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తు యేసు వారికి రక్షణను అనుగ్రహించును గాక."
καὶ αὐτοὶ σωτηρίας τύχωσιν τῆς ἐν Χριστῷ Ἰησοῦ
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు రక్షణ అనే నైరూప్య నామవాచకమున వెనుక ఉన్న భావాన్ని క్రియతో వ్యక్తపరచవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: “క్రీస్తు యేసు వారిని రక్షించునుగాక.” (చూడండి:భావనామాలు)
μετὰ δόξης αἰωνίου
నైరూప్య నామవాచకం మహిమ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రజలు అనుభవించే అద్భుతమైన పరిస్థితిని సూచిస్తున్నది. ఇది దేవుని నుండి వచ్చుచున్నది, దానిని ఆయన యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన వారికి ఇస్తాడు, ఈ పరిస్థితి శాశ్వతమైనది*. మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే,విశేషణంతో **మహిమ** అనే నైరూప్య నామవాచకం వెనుక ఉన్న భావనను మీరువ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు దేవునితో శాశ్వతంగా ఉండటం ఎంత మహిమాన్వితమైనదో తెలుసుకోండి" లేదా "మరియు దేవుని అద్భుతమైన సన్నిధిని శాశ్వితముగా అనుభవించండి" (చూడండి:భావనామాలు)
2 Timothy 2:11
πιστὸς ὁ λόγος
ఈ సందర్భంలో, వాక్యము అనే పదము తదుపరి వచ్చు సిద్ధాంత ప్రకటనను సూచిస్తున్నది. [1 తిమోతి 1:15] లో మీరు ఈ పదబంధాన్ని ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ ప్రకటన నమ్మదగినది.”
πιστὸς ὁ λόγος
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే,కర్తరి క్రియతో **నమ్మదగిన** అనే విశేషణ అర్థాన్ని మీరు సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు ఈ ప్రకటనను విశ్వసించవచ్చు."
πιστὸς ὁ λόγος
ఒక ప్రత్యక్ష ఉల్లేఖనాన్ని పరిచయం చేయడానికి పౌలు ఈ పదబంధాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ వచనంలో వచ్చు ఇతర పదాలు మరియు [2:12]లోను మరియు [2:13] లోను వచ్చే పదాలు పౌలు చెప్పిన సందేశం నమ్మదగినదని వ్యక్తపరచుచున్న పద్యం లేదా గీతం/కీర్తన.. ఈ అధ్యాయం ప్రారంభంలో సాధారణ గమనికలు దగ్గర సూచించినట్లుగా, ఈ పదాలను ప్రత్యక్ష ఉల్లేఖనాలుగా గుర్తు వేయడం ద్వారా లేదా భాగా కుడివైపుకు మరింత దూరంగా ఉంచడం ద్వారా దీనిని మీరు సూచిస్తే మీ పాఠకులకు ఇది సహాయకరంగా ఉండవచ్చు.. (చూడండి:కొటేషన్ చిహ్నాలు)
εἰ γὰρ συναπεθάνομεν, καὶ συνζήσομεν
ఇది పౌలు బహుశా ఉటంకిస్తున్న పద్యం లేదా కీర్తన ఆరంభం. మీ భాషలో ఇది పద్యం అని సూచించే విధము ఉంటే, ప్రత్యేక పదబందాలుగా ప్రత్యేక పంక్తుల అమర్చడం ద్వారా, మీరు దీనిని ఇక్కడ మరియు [2:12] లోను, [2:13] లో ఉపయోగించవచ్చు. లేనట్లయితే, మీరు ఈ భాగాన్ని కవితగా కాకుండా సాధారణ గద్యంగా అనువదించవచ్చు. (చూడండి:పద్యం)
εἰ…συναπεθάνομεν
పౌలు అలంకారంగా మాట్లాడుతున్నాడు, ఎందుకనగా అతను, తిమోతి మరియు ఈ ప్రకటనను నమ్మవలసిన ఇతర విశ్వాసులు వాస్తవంగా చనిపోలేదు. ఇది ఈ రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు. (1) విశ్వాసులు రక్షణ కొరకు యేసును నమ్మినప్పుడు వారి పాపముల నిమిత్తము యేసు మరణాన్ని అంగీకరించే విధానాన్ని పౌలు సూచిస్తూ ఉండవచ్చు. దీని అర్థం వారు వారి పాత పాప జీవితానికి అలంకారికంగా "చనిపోయారు". ప్రత్యామ్నాయ అనువాదం: "యేసు మరణము మనకొరకు అని అంగీకరించడం ద్వారా మన పాత జీవన విధానాన్ని ముగించినట్లయితే" (2) యేసునందు విశ్వసించే ప్రజలు ఆయన కోసం శ్రమపడే విదానాన్ని,సాధ్యమైతే ఆయన కోసం చనిపోయే స్థితి వరకు కూడా అని పౌలు సూచిస్తూ ఉండవచ్చు .ప్రత్యామ్నాయ అనువాదం:“మనం యేసు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే” (చూడండి:రూపకం)
καὶ συνζήσομεν
పౌలు క్రీస్తుతో కూడ చనిపోవడాన్ని అలంకారిక భావనతో సూచిస్తున్నప్పటికీ, బ్రతకడం అనేది బహుశా అలంకారికమైనది కాదు/కాకపోవచ్చు, కానీ రెండు విషయాలలో ఒకదాన్ని సూచిస్తున్నది. (1) జీవించడం అనేది భౌతిక మరణం తర్వాత జీవితాన్ని సూచిస్తున్నది. పౌలు నిత్యమహిమ అని మునుపటి వచనంలో ప్రస్తావించిన దృష్ట్యా, తరువాతి జీవితంలో "మనము ఆయనతో ఏలుదుము" అని పౌలు ఇక్కడ ప్రస్తావించినందున ఇదే అర్ధం అయుండవచ్చు.ప్రత్యామ్నాయ అనువాదం: "తరువాత దేవుడు యేసుతో కూడ మనలను మరణము నుండి బ్రతికిస్తాడు" (2) జీవించుట అనేది భౌతిక మరణానికి ముందు ఈ జీవితంలో విశ్వాసులు ఎలా వ్యవహరిస్తారో అన్నది సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "మేము మా స్వకీయ కోరికలను కొనసాగించము, దానికి బదులుగా యేసు మమ్మల్ని ఏమి చేయమని కొరుతున్నాడో అది చేస్తాము"
2 Timothy 2:12
εἰ ἀρνησόμεθα
ఈ ప్రస్తుత జీవితంలో వారికి యేసుక్రీస్తు తెలియదు అని చెప్పే విశ్వాసుల క్రియను సూచించడానికి పౌలు ఇక్కడ తిరస్కరించు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇది సహించు అనే పదానికి వ్యేతిరేక పదముగా చూపించ బడినది,కాబట్టి ఇది శ్రమలలో యేసు అనుచరుడు కాదను వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "మనం ఇప్పుడు ఆయనను ఎరుగమంటే"
κἀκεῖνος ἀρνήσεται ἡμᾶς
ఈ తిరస్కరణ అనే పదమును రెండవ సారి ఉపయోగించుటలో, పౌలు అంతిమ తీర్పు దినమున యేసుక్రీస్తు చర్యను సూచిస్తున్నాడు. ఆ దినమున, యేసు అయితే నమ్మకమైన విశ్వాసిని స్వీకరిస్తాడు లేదా నిజమైన అనుచరులు కానివారిని తిరస్కరిస్తాడు/కాదంటాడు. భూమీద ఉన్నప్పుడు యేసుని తిరస్కరించే వారు నిజమైన అనుచరులు కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “తీర్పు దినమున ఆయన మనలను తిరస్కరిస్తాడు.”
2 Timothy 2:13
εἰ ἀπιστοῦμεν
యేసుకు విధేయత చూపుటలో కొనసాగించకుండ,ఆయనకు అవిధేయత చూపే విశ్వాసుల పరిస్థితిని/స్థితిని వ్యక్తపరచడానికి పౌలు నమ్మదగనివారు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మనం యేసుకు అవిధేయత చూపితే" లేదా "మనము చేయాలని యేసు కోరుకున్నది మనము చేయకపోతే"
ἐκεῖνος πιστὸς μένει
ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: (1) “ఆయన మనకు నమ్మదగినవానిగా ఉంటాడు”(2) “ఆయన తనకు తాను నమ్మకముగా ఉంటాడు” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀρνήσασθαι…ἑαυτὸν οὐ δύναται
యేసు తనకు తాను తిరస్కరించుకోవడం చేసుకోలేడు అని పౌలు పేర్కొటున్నాడు, దాని అర్ధం యేసు తన స్వభావానికి విరుద్ధంగా వెళ్లలేడు, ఆయన చేస్తానని చెప్పిన దానికి నిజాయితిగా ఉంటాడు. పౌలు మనస్సులో ఈ క్రింది ఆలోచనలలో ఒక ఆలోచన గాని లేదా రెండూ కలిగి ఉండవచ్చు. (1) పేతురు క్షమాపణ అనుభవించినట్లు, మనము పశ్చాతాపడునప్పుడు మన అపనమ్మకత్వమును క్షమించగల రక్షకుని స్వభావము యేసు కలిగి ఉన్నాడు. (యోహాను 21: 15-19). ఇది మునుపటి పైన ఉన్న పదబంధాన్ని "ఆయన మనకు నమ్మకంగా ఉంటాడు" అన్న వ్యాఖ్యానానికి/వివరణకు అనుకూలంగా ఉన్నది. (2) ప్రజలు పశ్చాత్తాపపడనప్పుడు వారి పాపమును తీర్పు తీర్చే పరిశుద్ధ దేవుడిగా కూడా యేసు స్వభావములో ఉన్నది. మునుపటి పైన ఉన్న పదబంధాన్ని "ఆయన తనకు నమ్మకంగా ఉంటాడు" అన్న వ్యాఖ్యానానికి అనుకూలంగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన ఎప్పుడూ తన స్వభాము ప్రకారం నడుచుకోవాలి”
2 Timothy 2:14
ὑπομίμνῃσκε
గ్రీకు భాషలోని క్రియా పదములో వారికి అనునది అవ్యక్తంగా/పరోక్షంగా ఉన్నది, బహుశా ప్రజలపట్ల తిమోతికి బాధ్యత ఉందని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “అక్కడి ప్రజలకు గుర్తు చేయండి.”
ἐνώπιον τοῦ Θεοῦ
పౌలు దేవుని ముందు అనే వ్యక్తీకరణను ఉపయోగిస్తున్నాడు, అంటే "దేవుని యెదుట" అనగా "దేవుడు చూడగల చోటు" అని అర్థం. చూడటం, మరోవైపు అలంకారికంగా శ్రద్ధ, తీర్పు అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు చూస్తున్నట్లుగా” (చూడండి:రూపకం)
ἐνώπιον τοῦ Θεοῦ
దేవుడు వారు చేయునది చూస్తున్నాడు అని ఈ ఆజ్ఞ విశ్వాసులకు ఇచ్చినప్పుడు దానిని తిమోతి వారికి చెప్పునట్లు పౌలు తిమోతికి చేపుతున్నాడని పరోక్ష అర్ధం ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు వారి సాక్షిగా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μὴ λογομαχεῖν
పౌలు వాదనలు వివరించడానికి యుద్ధం అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ఈ రెండిటిలో ఒక అర్ధం కావచ్చు. (1) విశ్వాసులు ఎవరైనా సువార్త సందేశాన్ని అందించడానికి ఉపయోగిస్తున్న పదాల వంటి ముఖ్యముకాని విషయాల గురించి విశ్వాసులు వాదించకూడదు. ఇది సువార్త సందేశం వంటి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టి దూరం చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "పదాల వంటి చిన్న విషయాల గురించి పోరాడకూడదు" (2) విశ్వాసులు పదాల అర్థము గురించి వాదించకూడదు. మళ్ళీ, ఇది మంచి కారణం లేకుండా విశ్వాసులలో అనైక్యతకు కారణమవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "పదాల అర్థాల గురించి పోరాడకూడదు/వధించకూడదు" (చూడండి:రూపకం)
ἐπ’ οὐδὲν χρήσιμον
పదాల గురించి పోరాడడం వల్ల పాల్గొన్న వారికి ప్రయోజనం లేదని పౌలు జతపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది ఎవరికీ ప్రయోజనం కలిగించదు/కలుగచేయదు”
ἐπὶ καταστροφῇ τῶν ἀκουόντων
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు నైరూప్య నామవాచకం నాశనం వెనుక ఉన్న ఆలోచనను క్రియా పదబంధంతో మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది వినేవారిని నాశనం చేస్తున్నది.” (చూడండి:భావనామాలు)
ἐπὶ καταστροφῇ τῶν ἀκουόντων
ఇక్కడ, నాశనం అనేది భౌతిక హాని కాదు, గాని మూర్ఖంగా ముఖ్యముకాని విషయాలలో వాదించు వారిని విన్న విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక హానిని సూచిస్తున్నది. ఇలాంటివి విశ్వాసులకు ప్రేమ, ఐక్యత కన్నా చిన్న చిన్న విషయాలే సరైనదిగా చూడటం చాలా ముఖ్యం అని బోధిస్తున్నది, మరియు ఇవి విశ్వాసం గురించి తప్పుడు ఆలోచనలు ఏర్పడుటకు లేదా యేసును అనుసరించడం పూర్తిగా మానివేయుటకు కారణం అవుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అది విన్నవారు యేసును అనుసరించకుండ ఆపివేయవచ్చు/ఆటంకపరచవచ్చు ” (చూడండి: అన్యాపదేశము)
2 Timothy 2:15
σπούδασον σεαυτὸν, δόκιμον παραστῆσαι τῷ Θεῷ
ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీ వంతు కృషి చేయండి”
ἐργάτην
తిమోతి దేవుని వాక్యాన్ని సరిగ్గా బోధిస్తే నైపుణ్యం కలిగిన వాడిగా/పనివాడుగా ఉంటాడని పౌలు అలంకారికంగా చెపుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నైపుణ్యము గల పనివాడిగా” (చూడండి: రూపకం)
ὀρθοτομοῦντα τὸν λόγον τῆς ἀληθείας
ఎవరో కష్టతరమైన/ఇబందికరమైన భూభాగం గుండ వెల్లుచున్నట్లు సత్యవాక్యము కూడా దేనినైన చేధించుకొని వెళ్ళును అని పౌలు అలంకారికంగా సూచిస్తున్నాడు. అటువంటి మార్గం నేరుగా ఉన్నపుడు, ప్రయాణికులు దానిని నేరుగా వారి గమ్యస్థానానికి అనుసరించవచ్చు. దీనికి విరుద్ధంగా, పౌలు [2:14] (../02/14.md) మరియు [2:16] (..//02/16.md) లో వివరించిన పనికిరాని/నిరుపయోగమైన చర్చలు ఇదే రూపకం అనవసరమైన మలుపులు అయున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రజలకు లేఖనాలను ఎలా అనుసరించాలో పత్యక్షంగా చూపించండి” లేదా “ప్రజలు వాటిని అనుసరించునట్లు లేఖనాలను సరిగ్గా బోధించండి” (చూడండి:రూపకం)
τὸν λόγον τῆς ἀληθείας
పౌలు వాక్యము అనే పదాన్ని అలంకారికంగా పదాలలో/మాటలలో వ్యక్తపరచబడిన విషయాన్ని సూచించడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు (1) ఇది తిమోతి బోధించవలసిన సందేశాన్ని సూచిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్య సందేశం” (2) ఇది లేఖనాలను సూచిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు లేఖనాలలో చెప్పిన సత్యమైన సంగతులు" (చూడండి:అన్యాపదేశము)
τὸν λόγον τῆς ἀληθείας
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, సత్యం అనే నైరూప్య నామవాచకం వెనుక ఉన్న ఆలోచనను మీరు విశేషణంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్య సందేశం” లేదా “దేవుడు లేఖనాల్లో చెప్పిన నిజమైన సత్యమైన సంగతులు” (చూడండి:భావనామాలు)
2 Timothy 2:16
ἐπὶ πλεῖον…προκόψουσιν ἀσεβείας
ఈ చర్చల గురించి భౌతికంగా ఒక నిర్దిష్ట దిశలో పురోగమిస్తారని అలంకారికంగా పౌలు మాట్లాడుతున్నాడు, అతను ఆ దిశగా భక్తిహీనత గురించి మాట్లాడుతున్నాడు. పౌలు ఈ చర్చలు ప్రజలపై చూపే ప్రభావాన్ని అలంకారికంగా వివరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అవి ప్రజలను మరింత భక్తిహీనులుగా మారుస్తాయి.” (చూడండి:రూపకం)
2 Timothy 2:17
ὁ λόγος αὐτῶν ὡς γάγγραινα νομὴν ἕξει
ఇది ఒక సారూప్యత(ఉపమాలంకారము). అనగా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది, మరియు దానిని విన్న వారందరి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. వ్యాప్తి చెందేది ఈ రెండిటిలో ఏదైనా కావచ్చు, అయితే (1) పనికిరాని దైవభక్తి లేని/భక్తిహీన చర్చల అలవాటు కలిగియుండుట, లేదా (2) ఈ నిష్ప్రయోజనమైన వాదనలలో/చర్చలలో ప్రజలు చెపుతున్న విషయాలు, లేదా రెండూ. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ నిష్ప్రయోజనమైన వాదనలు త్వరగా వ్యాపించి, అంటు వ్యాధివలె నాశనానికి కారణమవుతాయి" (చూడండి: ఉపమ)
ὁ λόγος αὐτῶν
పౌలు వాక్యము అనే పదాన్ని అలంకారికంగా పదాలలో/మాటలలో వ్యక్తపరచబడిన విషయాన్ని సూచించడానికి ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ వాదనలు" లేదా "ఈ వాదనలలో/చర్చలలో పాల్గొనే వ్యక్తులు చెప్పేది" (చూడండి:అన్యాపదేశము)
ὡς γάγγραινα
కొరుకుడు పుండు అనేది సంక్రమణ లేదా రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కలిగే ఒక రకమైన కణజాల మరణం. ఇది ఒక వ్యక్తి శరీరంలో త్వరగా వ్యాపించి, మరణానికి దారితీయగలదు. మీ పాఠకులకు కొరుకుడు పుండు అంటే ఏమిటో తెలియకపోతే, మీరు సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించవచ్చు.. ప్రత్యామ్నాయ అనువాదం: “అంటు వ్యాధి వంటిది” (చూడండి:తెలియనివాటిని అనువదించడం)
ὧν ἐστιν Ὑμέναιος, καὶ Φίλητος
భక్తిహీనతకు, మూర్ఖత్వానికి ఉదాహరణగా ఉన్న ఇద్దరి వ్యక్తుల పేర్లను పౌలు తిమోతికి చెపుతున్నాడు. ఈ పేర్లకూ, మునుపటి వాటి పదం మధ్య మీ బాషలో స్పష్టమైన సంబంధం చూపించడానికి, మీరు దీన్ని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "హుమేనైయును, ఫిలేతు అలాంటి వ్యక్తులు" (చూడండి:సర్వనామాలు-ఎప్పుడు ఉపయోగించాలి?)
Ὑμέναιος, καὶ Φίλητος
ఇవి పురుషుల/వ్యక్తుల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 2:18
οἵτινες περὶ τὴν ἀλήθειαν ἠστόχησαν
క్రీస్తునందు విశ్వసించుట అనేది ప్రజలు లక్ష్యంగా పెట్టుకోవాలని దానిని గురించి అలంకారికంగా మాట్లాడటానికి ఈ వ్యక్తీకరణను పౌలు ఉపయోగిస్తున్నాడు. గురి తప్పిన వారు సత్యమైన దానిని నమ్మరు లేదా బోధించరు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం కాని వాటిని ఎవరు బోధిస్తున్నారు” (చూడండి:రూపకం)
οἵτινες περὶ τὴν ἀλήθειαν ἠστόχησαν
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, *సత్యము*అనే నైరూప్య నామవాచకము వెనుక/లో ఉన్న ఆలోచనను మీరు విశేషణంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “~సత్యము కాని వాటిని ఎవరు బోధిస్తున్నారు” (చూడండి:భావనామాలు)
ἀνάστασιν ἤδη γεγονέναι
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, పునరుత్థానము అనే నైరూప్య నామవాచకము వెనుక/లో ఉన్న ఆలోచనను మీరు సమానమైన వ్యక్తికరణతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు అప్పటికే చనిపోయినవారిని లేపాడు” (చూడండి:భావనామాలు)
ἀνατρέπουσιν τήν τινων πίστιν
విశ్వాసము అనేది నాశనం చేయబడదగిన ఒక వస్తువు అన్నట్లు పౌలు సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు కొందరిని విశ్వాసములో కొనసాగకుండునట్లు చేయుచున్నారు" (చూడండి: రూపకం)
2 Timothy 2:19
ὁ…στερεὸς θεμέλιος τοῦ Θεοῦ ἕστηκεν
కొందరి విశ్వాసమును తప్పుడు, నాశనకరమైన సందేశము నాశనము చేయుచున్నపట్టికి, దేవుడు తనను వెంబడించగోరినవారికి సత్య సందేశమును, అనగా వారు నిలబడుటకు ఒక క్షేమ, సురక్షితమైన స్తితిని దేవుడు ఇచ్చినాడు అని వివరించుటకు పౌలు అలంకారరీతిగా ఒక భవనము యొక్క పునాది రూపకాన్ని ఉపయోగిస్తునాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు తనయందు విశ్వాసముంచుటలో ప్రజలు కొనసాగుటకు ఒక సురక్షితమైన ఆధారాన్ని అందించాడు." (చూడండి: రూపకం)
ἔχων τὴν σφραγῖδα ταύτην
ఈ పునాది మీద ఉండు శాసనాన్ని ఒక ముద్రగా ఉన్నట్లు అలంకారికంగా పౌలు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే దస్తావేజుల/ప్రతుల వెలుపల ఉండు ముద్రలు తరచుగా వాటిలో విషయాలను(సూచికలను) వివరించే శాసనాలు కలిగి ఉంటాయి. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ శాసనం కలిగి ఉండటం" లేదా "ఈ విధంగా వర్ణించవచ్చు" (చూడండి: అన్యాపదేశము)
ἔχων τὴν σφραγῖδα ταύτην
రెండు ప్రత్యక్ష ఉల్లేఖనాలను పరిచయం చేయడానికి పౌలు ఈ పదబంధాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ వచనములో మిగిలిన భాగాలలో వచ్చే ప్రకటనలు ప్రజలు తనను విశ్వాసముంచడంలో కొనసాగించడానికి/కొనసాగునట్లు దేవుడు అందించిన ప్రాతిపదిక యొక్క రెండు అంశాలను వివరిస్తాయి. ఈ వాక్యాలను ఉల్లేఖనాలుగా గుర్తించడం ద్వారా మీరు దీనిని సూచిస్తే మీ పాఠకులకు ఇది సహాయకరంగా ఉండవచ్చు. (చూడండి:కొటేషన్ చిహ్నాలు)
ὁ ὀνομάζων τὸ ὄνομα Κυρίου
ప్రభువు నామములు అనే వ్యక్తీకరణ ఒక వ్యక్తి తనకు చెందినవాడని ప్రకటించడానికి ప్రభువు నామము చెప్పడాన్ని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం:“ప్రభువును నమ్ముతున్నాను అని చెప్పుచున్నవారు” (చూడండి:జాతీయం (నుడికారం))
ἀποστήτω ἀπὸ ἀδικίας
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే,దుర్నీతి అనే నైరూప్య నామవాచకం లో ఉన్న ఆలోచనను మీరు సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “చెడు పనులు చేయడం మానేయాలి” (చూడండి:భావనామాలు)
2 Timothy 2:20
ἐν μεγάλῃ δὲ οἰκίᾳ, οὐκ ἔστιν μόνον σκεύη χρυσᾶ καὶ ἀργυρᾶ, ἀλλὰ καὶ ξύλινα καὶ ὀστράκινα
యేసును అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను తిమోతి అర్ధం చేసుకొనాలని సహాయము చేయునట్లు, పౌలు ఒక ధనవంతుడి గృహములో ఉండు పాత్రలతో సంఘములోని వ్యక్తులతో పోల్చుచున్న రూపకాన్ని పరిచయం చేస్తున్నాడు. ఇది మీ పాఠకులకు సహాయకరంగా ఉంటే, ఇది ఒక రూపకం లేదా ఉదాహరణ అని మీరు సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ దృష్టాంతాన్ని/ఉదాహరణను పరిగణించండి: ఒక ధనవంతుని ఇంట్లో బంగారము, వెండితో చేసిన పాత్రలు ఉన్నాయి, మరియు చెక్క, మట్టితో చేసిన పాత్రలు కూడా ఉన్నాయి" (చూడండి:రూపకం)
ἀλλὰ καὶ ξύλινα καὶ ὀστράκινα
ఒక వాక్యం పూర్తిగా ఉండుటకు అనేక భాషలలో అవసరమయ్యే కొన్ని పదాలను పౌలు వదిలిపెడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు చెక్క, మట్టితో చేసిన పాత్రలు కూడా ఉన్నాయి" (చూడండి:శబ్దలోపం)
σκεύη
పాత్ర అనే పదం ధాన్యం, ఆహారం, పానీయం లేదా తిరస్కరించడం వంటి ఇతర వస్తువులను ఉంచు వాటికి ఉపయోగించే సాధారణ పదం. మీ భాషలో సాధారణ పదం లేకపోతే,మీరు "గిన్నె" లేదా "కుండ" వంటి నిర్దిష్టమైన పదాన్ని ఉపయోగించవచ్చు.
ἃ μὲν εἰς τιμὴν, ἃ δὲ εἰς ἀτιμίαν
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, మీరు నైరూప్య నామవాచకాల లో/వెనుక ఉన్న ఆలోచనలను ఘనతకు, ఘనహీనత కు సమానమైన పదబంధాలతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతను మొదటివాటిని మనుష్యులను గౌరవించు సందర్భాలలోను మరియు తదుపరివి ఎవరూ చూడకూడని పనులు చేయు విషయములలో అతను ఉపయోగిస్తున్నాడు" (చూడండి:భావనామాలు)
2 Timothy 2:21
ἐκκαθάρῃ ἑαυτὸν ἀπὸ τούτων
సంఘంలోని వ్యక్తులను వివిధ ఉపయోగాలు కలిగి ఉన్న గొప్ప ఇంట్లో ఉండు పాత్రలతో పోల్చిన రూపకాన్ని ఇక్కడ పౌలు కొనసాగిస్తున్నాడు. పౌలు ఒక వ్యక్తిని గూర్చి మలినముతో నిండియున్న కుండను శుభ్రపరచునట్లు తనను తాను శుభ్రపరచుకొనునట్లు అలంకారికంగా మాట్లాడుతున్నాడు. దీని ద్వారా ఆ వ్యక్తి కొన్ని చెడుసహవాసాలు లేదా కార్యకలాపాలను వదులుకున్నాడని/విడిచిపెట్టాడు అని అర్థం. ఇది ఈ రెండు విషయాలలో ఒక అర్ధం అయుండవచ్చు. (1) ఇవి అనే పదం కొందరి విశ్వాసాన్ని నాశనం చేస్తున్న తప్పుడు బోధకులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ తప్పుడు బోధకుల నుండి తనను తాను వేరుపరచుకున్నాడు" (2) ఇవి అనే పదం పౌలు తిమోతిని హెచ్చరించిన వాదనలకు, తప్పుడు బోధకులకు సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ భక్తిహీన చర్యలు/క్రియలు చేయడం ఆపివేశాడు” (చూడండి:రూపకం)
ἔσται σκεῦος εἰς τιμήν
పౌలు ఈ చెడుసహవాసాలు లేదా కార్యకలాపాలను విడిచిపెట్టిన వ్యక్తి గురించి అతనే ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉన్నట్లు అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతను ప్రత్యేక సందర్భాలలో/వేడుకలలో ఒక పాత్రగా ఉంటాడు" లేదా "అతను ప్రజలను గౌరవించడానికి ఉపయోగించే పాత్రగా ఉంటాడు" (చూడండి:రూపకం)
ἔσται σκεῦος εἰς τιμήν
చెడు సహవాసాలనుండి లేదా కార్యకలాపాల నుండి విముక్తి ఉన్న వ్యక్తికి దేవుడు ముఖ్యమైన నియామకాలను ఇవ్వగలడు అన్నది భావము. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ముఖ్యమైన పనులను అప్పగించు వ్యక్తియై (అతడు) ఉంటాడు” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἔσται σκεῦος εἰς τιμήν, ἡγιασμένον εὔχρηστον τῷ Δεσπότῃ, εἰς πᾶν ἔργον ἀγαθὸν ἡτοιμασμένον
ఈ నాలుగు పదబంధాలు రెండు విధాలలో ఒకదానితో సంబంధం కలిగి ఉంటాయి. (1) **తో ప్రారంభమైనవి** ముందు ఉన్న పదబంధానికి కారణం ఇవ్వండి/ఇస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "అతను ఘనత కొరకైనా ఒక పాత్రగా ఉంటాడు, ఎందుకనగా అతకు పరిశుద్ధపరచబడినాడు, మరియు అతను యజమానికి ప్రయోజనకరముగా ఉంటాడు ఎందుకనగా అతను ప్రతి మంచి పనికి సిద్ధపరచబడి ఉన్నాడు.డినందున మాస్టర్‌కి ఉపయోగకరంగా ఉంటాడు" లేదా (2) నాలుగు పదబంధాలన్నియు కేవలం వ్యక్తిని వివరిస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “అతను ఘనత కొరకైన పాత్రగా ఉంటాడు, పవిత్రుడు, యజమానికి ఉపయోగపడేవాడు మరియు ప్రతి మంచి పనికి సిద్ధంగా ఉన్నవాడు ఎవరైతే పరిశుద్ధపరచబడి, యజమానికి ఉపయోగకరముగా, ప్రతి మంచిపనికి సిద్ధంగా ఉంటాడో అతను ఘనతకోరకైన పాత్రగా ఉంటాడు.”
ἡγιασμένον
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు మరియు ఆ చర్య ఎవరు చేశారో మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు తన కోసం ప్రత్యేకించిన వ్యక్తి" లేదా "దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశము కొరకు ప్రత్యేకించిన వ్యక్తి" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡγιασμένον
ఈ పదబంధం ఒక ఇంటిలోని వస్తువుల రూపకాన్ని కొనసాగిస్తుంటే, పౌలు తప్పుడు సహవాసాలు లేదా కార్యకలాపాల నుండి విముక్తి పొందిన వ్యక్తిని అనగా అతడు యజమాని ఒక ప్రత్యేకమైన స్తలములో ఉంచ్చుతున్న ఒక ప్రశస్తమైన వస్తువుగా ఉన్నట్లు సూచిస్తున్నాడు, ~అతను ఒక విలువైన వస్తువులా ఉన్నాడు, దాని యజమాని దానిని ప్రత్యేక స్థానంలో ఉంచుతాడు.~ ఈ పదబంధం రూపకాన్ని కొనసాగిస్తుందో లేదో, అయిన ఇది ఇప్పటికీ ఒక ప్రత్యేక ఉద్దేశము కొరకు "ప్రతిష్టించబడుతున్నది" అనే ఆలోచనను వ్యక్తపరుస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: " దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశము కొరకు వేరుగా/ప్రత్యేకించిన వ్యక్తి" (చూడండి:రూపకం)
εὔχρηστον τῷ Δεσπότῃ
ఇంటిని గూర్చిన రూపకం సందర్భంలో, పౌలు దేవుడిని గూర్చి ఒక ఇంటి యజమానిగా అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునికి ఉపయోగపడుతుంది” (చూడండి: రూపకం)
εἰς πᾶν ἔργον ἀγαθὸν ἡτοιμασμένον
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: " ఏ మంచి పనినైన చేయడానికి తమకు తాము సిద్ధపరుచుకున్నారు. ఏమంచి పని చేయడానికైనా తనను తాను సిద్ధపరచుకున్నవారు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 2:22
τὰς…νεωτερικὰς ἐπιθυμίας φεῦγε
పౌలు యౌవన కోరికలు/యౌవనేచ్చలు ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా లేదా జంతువులా ఉన్నట్లు/ను వాటి నుండి తిమోతి పారిపోవాలని మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ యౌవన కోరికలను నియంత్రించుము” (చూడండి:రూపకం)
τὰς…νεωτερικὰς ἐπιθυμίας φεῦγε
పౌలు అపవిత్ర క్రియలను కోరికలతో ఒక వ్యక్తిని వాటిలో నిమగ్నం చేసే కోరికలతో అనుబంధించడం ద్వారా అనైతిక కార్యకలాపాల గురించి అలంకారికంగా మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “యౌవనులు చేయాలనుకునే తప్పుడు పనులను చేయడానికి నిరాకరించు” (చూడండి: అన్యాపదేశము)
δίωκε δὲ δικαιοσύνην, πίστιν, ἀγάπην, εἰρήνην
పౌలు పారిపోవడం అనేదానికి విరుద్ధంగా వెంటాడు అనే క్రియను ఉపయోగిస్తున్నాడు. పౌలు తిమోతి వాటి వైపు పరుగెత్తాలన్నట్లు ఈ సానుకూల విషయాల గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకనగా అవి అతనికి మేలు చేస్తాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “సరైనది చేయటానికి, దేవుని యందు విశ్వసముంచడానికి, దేవునిని, ఇతరులను ప్రేమించటానికి, మరియు ప్రజలతో సమాధానముగా జీవించడానికి ఆతృతగా ఉండు” (చూడండి:రూపకం)
δικαιοσύνην, πίστιν, ἀγάπην, εἰρήνην
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, మీరు నైరూప్య నామవాచకాలు అనగా నీతి, విశ్వాసము*, ప్రేమ మరియు సమాధానము వెనుక ఉన్న ఆలోచనలను సమానమైన వ్యక్తీకరణలతో వ్యక్తపరచవచ్చు . ప్రత్యామ్నాయ అనువాదం: “సరైనది చేయుము, దేవునియందు విశ్వాసముంచుము, ఇతరులను ప్రేమించుము, ఇతరులతో సమాధానముగా జీవించుము” (చూడండి:భావనామాలు)
μετὰ τῶν ἐπικαλουμένων τὸν Κύριον ἐκ καθαρᾶς καρδίας
తమ విశ్వాసంలో యధార్ధముగా ఉన్నవారితో కలిసి ఈ సానుకూల విషయాలను వెంటాడాలని తిమోతిని పౌలు కోరుకుంటున్నట్లు దీని అర్థం అయుండవచ్చు. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే/ఉండేతట్లైతే, యుఎస్‌టిలో ఉన్నట్లు, **వెంటాడుము** అనే పదాన్ని, తిమోతికి పౌలు ఆదేశం యొక్క ప్రారంభంలో ఈ పదబంధాన్ని ఉంచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రభువును యదార్థమైన ఉద్దేశాలతో ఆరాధించే వారితో కలిసి”
τῶν ἐπικαλουμένων τὸν Κύριον
ప్రభువును పిలవడం అనే వ్యక్తీకరణ ప్రభువును నమ్మి, ఆరాధించడము అను అర్ధమిచ్చు ఒక జాతీయము. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువును ఆరాధించు వారు" (చూడండి: జాతీయం (నుడికారం))
ἐκ καθαρᾶς καρδίας
పౌలు శరీరంలోని భౌతిక భాగమైన,హృదయం, ఒక వ్యక్తి ఉద్దేశాలను, కోరికలను సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “యదార్ధమైన ఉద్దేశ్యాలతో” (చూడండి: అన్యాపదేశము)
ἐκ καθαρᾶς καρδίας
ఒక వ్యక్తి ఉద్దేశాలు లేదా ఆలోచనలు వస్తువును శుభ్రపరచునట్లు వాటిని శుభ్రపరచవచ్చు అన్నట్లు వివరించడానికి పవిత్ర అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “యదార్థమైన ఉద్దేశాలతో”రూపకం
2 Timothy 2:23
τὰς…μωρὰς καὶ ἀπαιδεύτους ζητήσεις παραιτοῦ
పౌలు ఈ రకమైన చర్చలకు దారితీసే వ్యక్తులు అడిగే ప్రశ్నలతో అనుబంధం ద్వారా లేదా ఈ ప్రశ్నలను అడిగే వ్యక్తులతో అనుబంధం ద్వారా అలంకారికంగా కొన్ని రకాల చర్చలనుసూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం:“అవివేక/మూర్ఖపు, అజ్ఞాన వాదనలలో పాల్గొనవద్దు” లేదా “వారు తెలివితక్కువవారు, అజ్ఞానులు కాబట్టి వారు ప్రారంభించే వాదనలలో ప్రజలు నిన్ను పాల్గొనడానికి అనుమతించవద్దు” (చూడండి:అన్యాపదేశము)
μωρὰς καὶ ἀπαιδεύτους ζητήσεις
పౌలు ఒకే ఆలోచనను నొక్కిచెప్పడానికి మూర్ఖపు మరియు అజ్ఞానం అనే పదాలను కలిసి వాడుతుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "చాలా తెలివితక్కువ ప్రశ్నలు" (చూడండి:జంటపదం)
γεννῶσι μάχας
పౌలు ప్రశ్నలను అనే పదాన్ని అలంకారికంగా పిల్లలకు జన్మనిచ్చే స్త్రీలు వలే ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు (యుద్ధాలు). ప్రత్యామ్నాయ అనువాదం: “అవి వాదనలకు కారణమవుతాయి” (చూడండి: రూపకం)
μάχας
పౌలు వాదనలు వివరించడానికి జగడము అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అవి వాదనలకు కారణమవుతాయి” (చూడండి:రూపకం)
2 Timothy 2:24
δοῦλον…Κυρίου
పౌలు ప్రభువు బానిస అనే వ్యక్తీకరణను అలంకారికంగా దేవుడు చెప్పునది చేయు సంఘ నాయకులను, తిమోతితో సహా, సూచించడానికి ఉపయోగిస్తున్నాడు. ఇది విశ్వాసులకు బోధించడము, వారి అధికారాన్ని, సత్యాన్ని సవాలు చేసే జగడగొండి బోధకులతో సంభాషించడము కూడా ఇందులో ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: "సంఘంలో ఒక నాయకుడు/ఒక సంఘనాయకుడు" (చూడండి: రూపకం)
οὐ δεῖ μάχεσθαι
పౌలు వాదనలను వివరించడానికి జగడం అనే పదాన్ని అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “వాదించకూడదు” (చూడండి:రూపకం)
2 Timothy 2:25
ἐν πραΰτητι
ఇది మీ భాషలో మరింత స్పష్టంగా ఉంటే, మీరు ఈ వ్యక్తీకరణలో **సాత్వికము** అనే నైరూప్య నామవాచకంలో ఉన్న ఆలోచనను క్రియా విశేషణంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “సాత్వికముగా” లేదా “మృదువుగా” (చూడండి:భావనామాలు)
παιδεύοντα
పౌలు దీనిని తగాదాలకు దైవిక ప్రతిస్పందనగా అందిస్తున్నాడు. ఈ పదానికి "బోధించు" లేదా "సరిజేయు" అనే అర్ధం ఇస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “బోధించుట” లేదా “సరిజేయుట”
μήποτε δώῃ αὐτοῖς ὁ Θεὸς μετάνοιαν
పౌలుపశ్చాత్తాపం అనేది దేవుడు ప్రజలకు ఇవ్వగల ఒక వస్తువుగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు వారికి పశ్చాత్తాపం కలిగించునట్లు" (చూడండి:రూపకం)
εἰς ἐπίγνωσιν ἀληθείας
సత్యము తెలుసుకొనుట అనేది పశ్చాత్తాపము యొక్క ఫలితం అని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "తద్వారా వారు సత్యమును తెలుసుకుంటారు"
2 Timothy 2:26
ἀνανήψωσιν ἐκ τῆς τοῦ διαβόλου παγίδος
పౌలు ఒక రూపకం నుండి మరొక రూపకంలోకి మారుతున్నప్పుడు, ఒక వాక్యము పూర్తి కావడానికి అనేక భాషలలో అవసరమైన కొన్ని పదాలను అతను వదిలివేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు మరలా హుందాగా మారి అపవాది ఉచ్చు నుండి తప్పించుకోవచ్చు"(చూడండి:శబ్దలోపం)
ἀνανήψωσιν
తాగిన వ్యక్తులు మళ్లీ తెలివిగా మారినట్లుగా దేవుని గురించి సరిగ్గా ఆలోచించడం నేర్చుకునే వారిగా పాపుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి:రూపకం)
ἐκ τῆς τοῦ διαβόλου παγίδος
పౌలు సాతాను మోసాన్ని పాపులను బంధించిన ఒక భౌతిక ఉచ్చుగా ఉనట్లు సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు సాతాను మోసం నుండి తప్పించుకోండి" లేదా "మరియు సాతాను మోసాన్ని తిరస్కరించండి" (చూడండి:రూపకం)
ἐζωγρημένοι ὑπ’ αὐτοῦ, εἰς τὸ ἐκείνου θέλημα
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “సాతాను వారిని బంధించి, అతను కోరుకున్నది వారితో చేయించే వాడు ” (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐζωγρημένοι ὑπ’ αὐτοῦ, εἰς τὸ ἐκείνου θέλημα
పౌలు సాతాను మోసం గురించి మాట్లాడుతుంటాడు, దెయ్యం వారిని శారీరకంగా బంధించి, అతను కోరుకున్నది చేసేలా చేసింది. ప్రత్యామ్నాయ అనువాదం: “సాతాను వారిని మోసగించి (న తరువాత), అతను కోరుకున్నది వారితో చేయించేవాడు” (చూడండి:రూపకం)
2 Timothy 3
2 తిమోతి 03 సాధారణ గమనికలు
ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
చాలామంది పండితులు అంత్య దినాలు, యేసు మొదటిసారి వచ్చినప్పటి నుండి ఆయన తిరిగి వచ్చే సమయం వరకు, పౌలు జీవిత సమయంతో సహా అని అర్ధం చేసుకుంటారు. అదే నిజమైతే/అది అల అయితే పౌలు ఈ అధ్యాయంలో హింసించబడటం గురించి బోధిస్తున్నది విశ్వాసులందరికీ వర్తిస్తున్నది. కానీ కొంతమంది పండితులు **చివరి రోజులు/అంత్య దినాలను** భవిష్యత్తులో యేసు తిరిగి రావడానికి ముందు కాలంగా అర్థం చేసుకుంటారు. అదే దాని అర్ధం అయితే, పౌలు ఆ రోజుల గురించి 1-9 మరియు 13 వ వచనాలలో ప్రవచిస్తున్నాడు. వీలైతే/అవకాశముంటే, అనువాదకులు ఈ సమస్యను వారు (పండితులు) ఎలా అర్థం చేసుకున్నారనేది వారు(అనువాదకులు) ఈ వచనాలు అనువదించే దానిపై ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించాలి. (చూడండి:ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రినిమరియు అంత్య దినము, తరువాతి దినములు)
2 Timothy 3:1
ἐν ἐσχάταις ἡμέραις
పౌలు **దినములు** అనే పదమును ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించడానికి అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ముగింపుకు ముందు కాలంలో" (చూడండి: జాతీయం (నుడికారం))
ἐνστήσονται καιροὶ χαλεποί
ప్రజలు భక్తిహీనులుగా, హింసాత్మకంగా మారడం గురించి పౌలు చెప్పిన దాని అర్థం ఏమిటంటే, విశ్వాసులకు ఈ కాలవ్యవధిలో కష్టంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "విశ్వాసులు క్లిష్ట/కష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 3:2
οἱ ἄνθρωποι
ఇక్కడ పౌలు పురుషులు అనే పదాన్ని సాధారణ అర్థంతో ప్రజలందరికి వర్తించు విధమును ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రజలు" (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
φίλαυτοι
ఇక్కడ,స్వార్థ ప్రియులు అనేది సహజ/మైన మానవ ప్రేమతో కుటుంబాన్ని లేదా స్నేహితులను ప్రేమించడం కంటే ఎక్కువగా తనను తాను/తమను తాము ప్రేమించుకోవడాన్ని సూచిస్తున్నది. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రేమ ఇలాంటిది కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: "స్వీయ-కేంద్రీకృత"
2 Timothy 3:3
ἄστοργοι
ప్రేమ లేనివారు అనే పదము యొక్క అర్ధం వారు ప్రేమించాల్సిన ఇతర వ్యక్తులను వారు ప్రేమించరు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు తమ సొంత కుటుంబాలను ప్రేమించరు"
ἄσπονδοι
సరిదిద్దలేనివారు అనే పదము అనగా వారు ఇతరులతో సమదానపడటానికి అంగీకరించరు, మరియు వారి సొంత విధానము ప్రకారము జీవించడానికి ఎప్పుడుసంఘర్షణ స్థితిలో జీవించాలని పట్టుబట్టారు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు ఎవరితోనూ ఏకీభవించరు" లేదా "వారు ఎవరితోనూ సమాధానముగా జీవించరు"
ἀφιλάγαθοι
సజ్జన ద్వేషులు అనే పదబంధాన్ని వ్యతిరేకార్థకం కాదు ను తీసివేసి ప్రేమించెడి వ్యతిరేక పదమైన "ద్వేషించడం" మును మార్చి అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు మంచిని ద్వేషిస్తారు"
2 Timothy 3:4
προπετεῖς
నిర్లక్ష్యంగా అనే విశేషణం అనాలోచనగా చేసెడి పనుల యొక్క ప్రతికూల ఫలితం గురించిన భావనను తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "పరిణామాలను పట్టించుకోకుండా"
τετυφωμένοι
గర్వాంధులు అనే వ్యక్తీకరణ అహంకారంగా ఉండి ఇతరులకన్నా తనను తాను గొప్పగా భావించడానికి ఒక రూపకం/అలంకారము. ప్రత్యామ్నాయ అనువాదం: "అహంకారం" లేదా " అహంభావము" (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
τετυφωμένοι
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "అహంకారం" లేదా "అహంభావము" (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 3:5
ἔχοντες μόρφωσιν εὐσεβείας
పై చూపునకు ఒక రూపము అనే వ్యక్తీకరణ వారి * దైవభక్తి* వాస్తవమైనది కాదని లేదా నిజం కాదని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "దైవభక్తి ఉన్నట్లు కనబడుట" లేదా "దేవుడిని గౌరవించినట్లు కనిపిస్తుంది." (చూడండి:జాతీయం (నుడికారం))
καὶ
మునుపటి వాక్యము వివరించిన ఫలితాలను పరిచయం చేయడానికి పౌలు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "కాబట్టి" (చూడండి: సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం)
τούτους ἀποτρέπου
ఇవి/వీరు అనే ప్రదర్శన విశేషణం పదం, పౌలు మునుపటి వచనాలలో లిఖించిన జాబితా లోని భక్తిహీన లక్షణాలను కనపరచు వ్యక్తులను సూచిస్తున్నది. పౌలు ఈ పదాన్ని నామవాచకంగా ఉపయోగిస్తున్నాడు. మీ భాష ఆ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే, మీరు మీ అనువాదంలో "వ్యక్తులు" అనే పదాన్ని జోడించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ వ్యక్తులకు విముఖుడవై ఉండు" లేదా "అలాంటివారికి దూరంగా ఉండు" (చూడండి: నామకార్థ విశేషణాలు)
τούτους ἀποτρέπου
విముఖుడవై ఉండు అనే వ్యక్తీకరణ ఒకరికి తప్పించడానికి/దూరంగా ఉండు అనేదానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ వ్యక్తులకు విముఖుడవై ఉండు" లేదా "అలాంటివారికి దూరంగా ఉండు" (చూడండి:రూపకం)
2 Timothy 3:6
αἰχμαλωτίζοντες
ఇక్కడ పౌలు చేరపట్టు అనే పదాన్ని ఒకరిని మోసముతో ప్రభావితంచేయు దానిని అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “తారుమారు చేయడం” (చూడండి: రూపకం)
γυναικάρια
అవివేక స్త్రీలు అనే పదం ఆధ్యాత్మికంగా బలహీనమైన, పరిణతిలేని స్త్రీలను సూచిస్తున్నది. వారు ఈ పురుషులను తమ ఇళ్లలోకి అనుమతించి, వారి మాటలు వింటారు ఎందుకంటే వారు బలహీనులు, పనిలేనివారు, అనేక పాపములు కలిగి ఉన్నవారు.. ప్రత్యామ్నాయ అనువాదం: "ఆధ్యాత్మికంగా బలహీనమైన స్త్రీలు"
σεσωρευμένα ἁμαρτίαις
ఈ పాపాలను ఈ స్త్రీలు తమ వెనుకభాగంలో పోగుచేసికొని నట్లు అలంకారికంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఈ పురుషులు ఈ స్త్రీలను సులభంగా ప్రభావితం ఎందుకు చేయగలరో పౌలు వివరిస్తున్నాడు. ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు. (1) ఈ స్త్రీలు తరచూ లేదా ఎప్పుడు పాపం చేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: "తరచూ పాపము చేసేవారు" (2) ఈ స్త్రీలు పాపం చేయడం వలన భయంకరమైన దోషారోపణ చెందుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: "తమ పాపములకు భయంకరమైన దోషారోపణ చెందువారు" (చూడండి: రూపకం)
σεσωρευμένα ἁμαρτίαις
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "తరచూ పాపము చేసేవారు" లేదా "తమ పాపములను బట్టి భయంకరమైన దోషారోపణ చెందువారు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀγόμενα ἐπιθυμίαις ποικίλαις
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నానా విధముల దురాశలు వారిని దూరంగా నడిపిస్తాయి" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀγόμενα ἐπιθυμίαις ποικίλαις
పౌలు ఈ నానావిధముల దురాశలు గురించి అవి ఒక వ్యక్తిని శారీరకంగా దూరం చేయగలవన్నట్లుగా అలంకారికంగా మాట్లాడుతున్నాడు. స్త్రీలు తమ దురాశలను తీర్చుకోడానికి చెడు పనులు చేయాలని నిర్ణయించుకుంటారని అతని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు నానావిదాలుగా/లలో పాపము చేయాలని నిర్ణయించుకుంటారు" (చూడండి: మానవీకరణ)
2 Timothy 3:7
μηδέποτε εἰς ἐπίγνωσιν ἀληθείας ἐλθεῖν δυνάμενα
పౌలు సత్యము గూర్చిన జ్ఞానము గురించి ఇది ప్రజలు చేరుకోగల ఒక గమ్యస్థానం అన్నట్లుగా అలంకారికంగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యమును ఎప్పటికీ గ్రహించుకొనలేరు” (చూడండి:రూపకం)
2 Timothy 3:8
ὃν τρόπον δὲ
ప్రత్యామ్నాయ అనువాదం: "కేవలం"
Ἰάννης καὶ Ἰαμβρῆς
ఇవి పురుషుల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Ἰάννης καὶ Ἰαμβρῆς
మోషే చేస్తున్న అద్భుతాలను అదేవిధముగా చేయడానికి ప్రయత్నించిన ఫారో ఆస్థానంలోని మాంత్రికులను తాను ఇక్కడ సూచిస్తున్నట్లు తిమోతికి తెలుసని పౌలు ఊహించుచున్నాడు. బైబిల్ వారి పేర్లను నమోదు చేయలేదు, కానీ యూదుల సంప్రదాయం ప్రకారం వారి పేర్లు యన్నే, యంబ్రే అయ్యున్నాయి. ఈ మనుష్యులు ఫరో మోషే మాటలు వినడం లేదా యెహోవాకు విధేయత చూపాల్సిన అవసరం లేదని చూపించాలనుకున్నారు. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు వారిని మరింత స్పష్టంగా గుర్తించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: " యన్నే, యంబ్రే, ఫారో మాంత్రికులు," (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὗτοι
[3: 5] (../03/05.md) లో వలె, ఇవి అనే పదం పౌలు వివరించిన భక్తిహీన లక్షణాలను చూపించే వ్యక్తులను సూచించే ఒక ప్రదర్శన విశేషణం. పౌలు ఈ పదాన్ని నామవాచకంగా ఉపయోగిస్తున్నాడు. మీ భాష ఆ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే, మీరు మీ అనువాదంలో "వ్యక్తులు" అనే పదాన్ని జోడించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ వ్యక్తులు/వీరు" (చూడండి: నామకార్థ విశేషణాలు)
τῇ ἀληθείᾳ
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, సత్యము అనే నైరూప్య నామవాచకంలో ఉన్న ఆలోచనను విశేషణంతో మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఏది నిజమైనది" (చూడండి: భావనామాలు)
ἄνθρωποι κατεφθαρμένοι τὸν νοῦν
ఈ చెడు మనుషులు ఆలోచించే విధానాన్ని సూచించడానికి పౌలు మనస్సు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "సరిగా ఆలోచించలేని పురుషులు" (చూడండి: అన్యాపదేశము)
ἄνθρωποι κατεφθαρμένοι τὸν νοῦν
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "సరిగా ఆలోచించలేని పురుషులు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀδόκιμοι περὶ τὴν πίστιν
ఈ పురుషులు క్రీస్తును ఎంతగా విశ్వసించారు, ఆయనకు ఎంత విధేయులయ్యారు అనే విషయంలో పరీక్షించబడి,వారి విశ్వాసం సత్యమైనది కానందున వారు పరీక్షలో విఫలమయ్యారను ఆలోచనను తెలియజేయడానికి పౌలు ఆమోదించబడని అనే విశేషణాన్ని పౌలు ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "యధార్థమైన విశ్వాసం లేకుండా" లేదా "యదార్ధమైన విశ్వాసం లేని వారు"
ἀδόκιμοι περὶ τὴν πίστιν
మీ భాషలో మరింత స్పష్టంగా ఉంటే, మీరు ఇక్కడ కొత్త వాక్యాన్ని ప్రారంభించి, ఈ మనుషులను వారిని ఆమోదించని వారు అని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "యేసునందు యదార్ధమైన విశ్వాసము లేనందున దేవుడు ఈ మనుషులను ఆమోదిస్తాడు" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
2 Timothy 3:9
ἀλλ’
ఈ పదము ఈ వచనానికి, మునుపటి ఆలోచనకు మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తున్నది [3:06] (..//03/06.md) అనగా ఈ మనుషులు ఇళ్లలోకి చొరబడి ప్రజలను తప్పుడు విషయాలు నమ్మేలా ఒప్పించుచున్నారు. మీరు ఈ వ్యత్యాసాన్ని స్పష్టం చేయవలసి వస్తే, మీ పాఠకులకు మునుపటి ఆలోచనను ఇక్కడ గుర్తు చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "అయితే వారు తప్పుడు విషయాలను నమ్మమని కొందరిని ఒప్పించినప్పటికీ" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐ προκόψουσιν ἐπὶ πλεῖον
అబద్ద బోధకులు విశ్వాసుల మధ్య ఎక్కువ విజయాన్ని కొనసాగించలేరని అర్ధంతో పౌలు భౌతిక కదలిక గురించిన వ్యక్తీకరణను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు అబద్ధముగా బోధించుట కొనసాగించలేరు" (చూడండి: రూపకం)
ἡ…ἄνοια αὐτῶν ἔκδηλος ἔσται πᾶσιν
అన్నీ అనే పదం సాధారణీకరణ. ఈ మనుషులు కొంతమందిని మోసం చేయడంలో కొంతవరకు మాత్రమే విజయం సాధిస్తారని పౌలు చెప్పియున్నాడు. అయితే, మోషే యొక్క శక్తివంతమైన అద్భుతాలకు సమానమైనవి చేయలేనప్పుడు బహిరంగంగా అపఖ్యాతికి పాలైన యన్నే,యంబ్రే మాదిరిగానే తుదకు వారి మూర్ఖత్వం చాలా స్పష్టంగా కనపడిద్ది. ప్రత్యామ్నాయ అనువాదం: "వారి మూర్ఖత్వం విస్తృతంగా కనపడుతుంది." (చూడండి:అతిశయోక్తి)
ἐκείνων
వారు అనే పదము ఒక ప్రదర్శనాత్మక విశేషణం, ఇది యన్నే, యంబ్రేలను సూచిస్తున్నది. పౌలు ఈ పదాన్ని నామవాచకంగా ఉపయోగిస్తున్నాడు. మీ భాష ఆ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే,మీరు ఇద్దరు వ్యక్తుల పేర్లను అందించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "యన్నే, యంబ్రే యొక్క"(చూడండి:నామకార్థ విశేషణాలు)
2 Timothy 3:10
σὺ…παρηκολούθησάς
పౌలు ఈ వచనంలోని జాబితాలో ఇచ్చిన విషయాలపై దృష్టి పెట్టడం గురించి అవి కదులుతున్నప్పుడు వాటి వెనుక ఒకరు అనుసరిస్తున్నట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ఈ ఆలోచన ఏమిటంటే, తిమోతి ఈ విషయాలపై చాలా శ్రద్ధ వహిస్తున్నాడు, వాటిని అనుకరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నీవు గమనించినావు" లేదా "నీవు చాలా శ్రద్ధ వహించినావు" (చూడండి:రూపకం)
μου τῇ διδασκαλίᾳ
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, నైరూప్య నామవాచకమైన బోధించుట వెనుక ఉన్న ఆలోచనను సాపేక్ష నిబంధనతో ఉపవాక్యం మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను ఇతరులు చేయాలని బోధించినది" (చూడండి:భావనామాలు)
τῇ ἀγωγῇ
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, నైరూప్య నామవాచకమైన ప్రవర్తన వెనుక ఉన్న ఆలోచనను మీరు సాపేక్ష ఉపవాక్యం వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నా జీవితాన్ని జీవించిన విధము" (చూడండి:భావనామాలు)
τῇ προθέσει
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, మీరు నైరూప్య నామవాచకమైన ఉద్దేశము వెనుక ఉన్న ఆలోచనను క్రియా నిబంధనతో ఉపవాక్యం వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నా జీవితంలో చేయుటకు ప్రయత్నించునది" (చూడండి:భావనామాలు)
τῇ πίστει
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, ను నైరూప్య నామవాచకం విశ్వాసము వెనుక ఉన్న ఆలోచనను మీరు సాపేక్ష ఉపవాక్యంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నమ్మేది" (చూడండి: భావనామాలు)
τῇ μακροθυμίᾳ
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, నైరూప్య నామవాచకం ఓర్పు వెనుక ఉన్న ఆలోచనను సాపేక్ష ఉపవాక్యంతో మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను ఇతరుల పట్ల ఓర్పుతో ఉన్నది" (చూడండి:భావనామాలు)
τῇ ἀγάπῃ
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, నైరూప్య నామవాచకం ప్రేమ వెనుక ఉన్న ఆలోచనను మీరు సాపేక్ష ఉపవాక్యంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను ఇతరులను ప్రేమిస్తున్న విధము" (చూడండి:భావనామాలు)
τῇ ὑπομονῇ
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, నైరూప్య నామవాచకం సహనము వెనుక ఉన్న ఆలోచనను మీరు సాపేక్ష నిబంధనతో/ఉపవాక్యంతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను శ్రమపడిన్నప్పుడు నేను సహించినది" (చూడండి:భావనామాలు)
2 Timothy 3:11
ἐν Ἀντιοχείᾳ, ἐν Ἰκονίῳ, ἐν Λύστροις
ఇవి మూడు నగరాల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
οἵους διωγμοὺς ὑπήνεγκα
పౌలు అనేక విధాలుగా శ్రమపడినాడని, దేవుడు అతనిని రక్షించే వరకు అతను ఎలా సహించాడో తనకు తెలుసని పౌలు తిమోతికి గుర్తు చేస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నానావిధముల హింసలను ఎలా భరించినది"
ἐκ πάντων, με ἐρρύσατο ὁ Κύριος
దేవుడు తనను భౌతికంగా ప్రమాదకర పరిస్థితి నుండి తొలగించినట్లుగా అలంకారికంగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు నన్ను వారందరి నుండి కాపాడినాడు" (చూడండి:రూపకం)
2 Timothy 3:12
ζῆν εὐσεβῶς
భక్తితో అనే పదం అంటే దేవునిని గౌరవించే/ఘనపరచే విధేయతతో ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "దైవభక్తితో జీవించడానికి"
διωχθήσονται
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రజలు హింసిస్తారు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 3:13
ἄνθρωποι
ఇక్కడ పౌలు పురుషులు అనే పదాన్ని పురుషులు, స్త్రీలు ఇద్దరినీ దృష్టిలో ఉంచుకొని సాధారణ అర్ధాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రజలు" (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
πονηροὶ…ἄνθρωποι καὶ γόητες
ఇది బహుశా ఒక ఒక రకమైన అలంకారము, దుర్జనులు మరియు వంచకులు రెండు వేరువేరు గుంపులు/సమూహాలు కాదు, ఒక సమూహపు వ్యక్తులు. ప్రత్యామ్నాయ అనువాదం: "యేసుని అనుసరిస్తున్నట్లు కేవలం నటించే దుర్జనులు"
γόητες
వంచకులు అనే పదము ఇక్కడ ఒక వ్యక్తి తాను నిజ క్రైస్తవుడు కానప్పటికీ ఇతరులు నిజమైన క్రైస్తవుడిగా ఉనట్లు భావించాలని కోరుకునే వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "విశ్వాసులుగా నటిస్తున్న వారు/వ్యక్తులు"
προκόψουσιν ἐπὶ τὸ χεῖρον
దుర్జనుల గురించి, వారి స్వభావం గురించి వారు భౌతికంగా ముందుకు సాగడం, ఒక దిశలో క్రమంగా పురోగతి సాధించడం గురించి పౌలు అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అధ్వాన్నంగా మరియు అధ్వాన్నంగా మారుతుంది/అంతకంతకు చెడిపోతారు" లేదా "మరింత చెడుగా మారుతుంది" (చూడండి:రూపకం)
ἐπὶ τὸ χεῖρον
ఇది ఒక జాతియం. ప్రత్యామ్నాయ అనువాదం: "అధ్వాన్నంగా మరియు అధ్వాన్నంగా" (చూడండి:జాతీయం (నుడికారం))
πλανῶντες καὶ πλανώμενοι
వ్యక్తీకరణ దారితప్పిన దారి ఒక వ్యక్తిని తాను వెళ్లాలని అనుకోని ప్రదేశానికి భౌతికంగా తీసుకెళ్లే చిత్రాన్ని ఉపయోగిస్తున్నది. నిజం కానిదాన్ని నమ్మమని ఒకరిని ఒప్పించడానికి ఇది అలంకారిక సూచన. ప్రత్యామ్నాయ అనువాదం: "అబద్ధాలు బోధించడం, అబద్ధాలను నమ్మడం" (చూడండి:రూపకం)
πλανῶντες καὶ πλανώμενοι
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:"అబద్ధాలను బోధించడం, అబద్ధాలను నమ్మడం" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 3:14
μένε ἐν οἷς ἔμαθες
వాక్యానుసారమైన హెచ్చరికలు గూర్చి అవి తిమోతి ఉండగలిగే ప్రదేశంగా ఉన్నట్లు పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం:"నీవు నేర్చుకున్నది చేయుటకు కొనసాగించుము" లేదా "మీరు నేర్చుకున్నది నమ్మడంలో కొనసాగించుము" (చూడండి:రూపకం)
ἐπιστώθης
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నమ్మకంగా ఉన్నారు” (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 3:15
τὰ δυνάμενά σε σοφίσαι
పౌలు లేఖనాల గురించి అవి ప్రజలకు బోధించేవిగాను అవి జ్ఞానులు అవ్వడానికి/మారడానికి సహాయపడేతట్లు ఉన్న గురువుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రొత్త వాక్యాన్ని ప్రారంభించడం మీ అనువాదంలో సౌకర్యవంతంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "వాటిని అధ్యయనం చేయడం ద్వారా నీవు జ్ఞానీ అవ్వవచ్చు" (చూడండి:మానవీకరణ)
εἰς σωτηρίαν διὰ πίστεως τῆς ἐν Χριστῷ Ἰησοῦ
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, రక్షణ అను నైరూప్య నామవాచకము లో/వెనుక ఉన్న ఆలోచనను మీరు "రక్షించు" అను క్రియా పదముతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:"కాబట్టి/అప్పుడు క్రీస్తు యేసు మిమ్మల్ని కాపాడుటకు/రక్షించుటకు మీరు విశ్వసిస్తారని మీకు తెలుస్తుంది" (చూడండి: భావనామాలు)
2 Timothy 3:16
πᾶσα Γραφὴ θεόπνευστος καὶ
దేవుడు-శ్వాస ఊదాడు అనే పదం దేవుని నుండి నేరుగా ఆయన ఆత్మ ద్వారా లేఖనాలు వచ్చాయని సూచించడానికి శ్వాస చిత్రాన్ని ఉపయోగిస్తున్నది. స్వభావికముగ బైబిల్‌లో, దేవుని శ్వాస దేవుని ఆత్మను సూచిస్తున్నది/వర్ణిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుని ఆత్మ మనుష్యులు ఏమి రాయాలన్నది, మరియు దానిని నిర్దేశించగా ఆయన లేఖనమంతటిని ఉత్పత్తి చేశాడు, " (చూడండి:రూపకం)
πᾶσα Γραφὴ θεόπνευστος
లేఖనమంతా అనే పదం ద్వార, పౌలు లేఖనంలోని ప్రతి భాగాన్ని అనగా ఆ సమయంలో అది మనకు తెలిసిన పాతనిబంధన గ్రంధము, దానిని సూచిస్తున్నాడు. పాత నిబంధనలోని పుస్తకాలన్నింటినీ లేఖనం అని ఏకవచనంతో సూచించడం గందరగోళంగా ఉంటే, మీరు దానిని UST లో ఉన్నట్లుగా బహువచనంగా **లేఖనాలు** గా మార్చవచ్చు మరియు క్రీయాపదాలు బహువచనం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "పరిశుద్ధ లేఖనాలన్నీ దేవుడు-శ్వేస ఊదినవి"
ὠφέλιμος
తిమోతియు, విశ్వాసులందరునూ లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును,నీతియందు శిక్షచేయుటకును ఉపయోగించినప్పుడు ప్రయోజనం పొందుతారనే ఆలోచనను తెలియజేయడానికి పౌలు లేఖనమును ప్రయోజనకరము గా సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు దానిని ఉపయోగించినప్పుడు/ఉపయోగిస్తుండగా మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు "లేదా" మనము దీనిని ఉపయోగించినప్పుడు అది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది."
πρὸς ἐλεγμόν
ఏది సరైనది, ఏది తప్పు అని తెలుసుకొనుటకు ప్రమాణంగాను మరియు ప్రజలకు వారు తప్పు(చేయుచున్నారు) అని చూపించుటకు లేఖనాలను తిమోతి ఉపయోగించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, ఖండించుట అను నైరూప్య నామవాచకము లో/వెనక ఉన్న ఆలోచనను మీరు సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రజలకు వారు తప్పు(చేయుచున్నారు) అని చూపించుట కొరకు" లేదా "మనము తప్పు/తపైయున్నాము అని తెలుసుకొనుటకు సహాయముచేయుట" (చూడండి:భావనామాలు)
πρὸς ἐπανόρθωσιν
దేనినైన ఎలా సరిచేయాలో ప్రజలకు చూపించుటకు లేఖనాలను ప్రమాణంగా తిమోతి ఉపయోగించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, తప్పు దిద్దుట అను నైరూప్య నామవాచకము లో/వెనక ఉన్న ఆలోచనను మీరు సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "పరిస్థితులు ఎలా సరిజేయాలో చూపించుట కొరకు" లేదా “పొరపాట్లు” ఎలా సరిజేయాలో/పరిష్కరించాలో చూపించుట కొరకు" (చూడండి: భావనామాలు)
πρὸς παιδείαν τὴν ἐν δικαιοσύνῃ
దేవునితో సరైనరీతిలో జీవితాలు ఎలా జీవించాలో ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి లేఖనాలను ప్రమాణంగా తిమోతి ఉపయోగించాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే, నీతి అను నైరూప్య నామవాచకములో వెనక ఉన్న ఆలోచనను మీరు సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు ప్రజలకు సరైనది ఎలా చేయాలో శిక్షణ/ తరిఫీదు ఇవ్వడానికి" లేదా "మరియు సరైనది చేయడానికి మనకు శిక్షణ ఇవ్వడానికి" (చూడండి:భావనామాలు)
2 Timothy 3:17
ὁ τοῦ Θεοῦ ἄνθρωπος
పౌలు ఇక్కడ మనిషి అనే పదాన్ని దేవునియందున్న విశ్వాసులందరిని, స్త్రీయైన పురుష్యుడైన, కలుపుకొని సాధారణ అర్థంతో ఉపయోగిస్తున్నాడు. వాస్తవానికి, తిమోతి కూడా దీనిని తనకు తానుగా వర్తింపజేయాలని కూడా పౌలు భావిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుని సేవించుచున్న వ్యక్తి." (చూడండి: పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
ἄρτιος
ప్రత్యామ్నాయ అనువాదం: "పూర్తిగా సామర్థ్యం కలిగి"
ἐξηρτισμένος
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు అతనికి అవసరమైన ప్రతీదీ కలిగి ఉండండి" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 4
2 తిమోతి 04 సాధారణ వివరణలు
నిర్మాణం, ఆకృతీకరణ
- పౌలు తిమోతికి గంభీరమైన ఆదేశిస్తున్నాడు (4: 1-8)
- పౌలు ఎలా ఉన్నాడో విషయాన్ని తిమోతికి చెపుతున్నాడు (4: 9-18)
- పౌలు వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేయుచున్నాడు (4: 19-22)
ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు
“నేను నిన్ను ఆన పెట్టుచున్నాను”
ఈ మాటలతో పౌలు తిమోతికి తాను చేయమని చెబుతున్న దానిని చేయటానికి అత్యంత తీవ్రమైన మార్గంలో/విధంగా సవాలు చేస్తాడు. ఇది తిమోతిని ఆజ్ఞాపించు ఒక విధానం, పౌలు యొక్క సొంత అధికారంతో కాదు, కానీ అతను తండ్రియైన దేవుని, యేసుక్రీస్తు యొక్క అధికారంను సూచిస్తూ ఆ అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. మరో రీతిగా చెప్పాలంటే, దేవుడు, యేసుక్రీస్తు పౌలు ద్వారా తిమోతికి ఆజ్ఞాపిస్తున్నట్లు పౌలు చెబుతున్నాడు.
కిరీటము
లేఖనాలు కిరీటమను రూపాన్ని విభిన్న విషయాలను ప్రాతినిద్యం వహించడానికి ఉపయోగిస్తున్నది. ఈ అధ్యాయంలో,పౌలు ఈ భూమి మీద సరైనరీతిగా జీవితాన్ని జీవించినందుకు క్రీస్తు వారికి ఇచ్చే బహుమానానికి రూపకంగా/అలంకారంగా క్రీస్తు విశ్వాసులకు కిరీటాన్ని ధరింప చేస్తున్నట్లు వివరిస్తున్నాడు..
2 Timothy 4:1
διαμαρτύρομαι
అనువదించబడిన పదం ఆనపెట్టు ఒకరిని తీవ్రమైన మరియు కట్టుబడి ఉండే బాధ్యత కింద ఉంచడానికి ఉపయోగించబడుతుంది. మీ భాషలో దీన్ని చేయడానికి మీరు ఉపయోగించే పదాల గురించి ఆలోచించండి. ఇక్కడ ఎవరైనా
(1) ఏదైనా చేయాలనే ప్రమాణం లో/కింద ఒకరిని ఉంచడం అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నిన్ను ప్రమాణం చేయిస్తున్నాను" లేదా "నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను" లేదా
(2) గొప్ప అధికారంతో ఒకరిని గంభీరంగా ఆదేశించుట/ఆజ్ఞాపించుట. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను నిన్ను గౌరపుర్వకముగా కోరుతున్నాను/వేడుకుంటున్నాను"
ἐνώπιον τοῦ Θεοῦ καὶ Χριστοῦ Ἰησοῦ
ఇక్కడ ముందు* అనే పదానికి "ముందు" అనగా "సమక్షంలో" అని అర్థం. దేవుడు ,క్రీస్తు యేసు ఈ ఆజ్ఞకు లేదా ప్రమాణమునకు సాక్షిగా ఉంటారని, ఆమోదిస్తారని నిగూడ అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు, క్రీస్తు యేసు "యెదుట" లేదా "దేవుడుతో, క్రీస్తు యేసు సాక్షులుగా" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ζῶντας καὶ νεκρούς
పౌలు సజీవులు మరియు మృతులు ప్రజలందరిని కలిపి అను అర్ధాన్ని సుచిస్తున్నాడు, అది వారు తీర్పు సమయంలో సజీవంగా ఉన్నా లేదా చనిపోయినా. ప్రత్యామ్నాయ అనువాదం: "ఇంకా సజీవంగా ఉన్నవారును, మరణించిన వారును" (చూడండి:వివరణార్థక నానార్థాలు)
ζῶντας καὶ νεκρούς
సజీవులు మరియు మృతులు అనే పదాలు విశేషణాలు, వాటిని పౌలు మనుష్యుల సమూహాలను సూచించడానికి నామవాచకాలుగా ఉపయోగిస్తున్నాడు. మీ భాష ఆ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే, మీరు ఈ పదాలను సమానమైన పదబంధాలతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఇంకా సజీవంగా ఉన్నవారును, ఆప్పటికే మరణించిన వారును" (చూడండి:నామకార్థ విశేషణాలు)
καὶ τὴν ἐπιφάνειαν αὐτοῦ, καὶ τὴν βασιλείαν αὐτοῦ
క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు భూమిపై ఉన్న ప్రజలకు మరోసారి కనిపిస్థాడనే వాస్తవాన్ని పౌలు అలంకారికంగా క్రీస్తు రాకడను సూచిస్తున్నాడు, మరియు ఆయన రాజ్యాని పరిపాలిస్తాడనే చేయబోయే రాజ్యానికి అనుబంధం ద్వారా క్రీస్తు పాలనను రాజుగా సూచించాడు. ఇక్కడ ఒక కొత్త వాక్యాన్ని ప్రారంభించడం సహాయకరంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు క్రీస్తు రాకడలో మరియు రాజుగా ఆయన పరిపాలనలో" (చూడండి:అన్యాపదేశము)
καὶ τὴν ἐπιφάνειαν αὐτοῦ, καὶ τὴν βασιλείαν αὐτοῦ
పౌలు తిమోతిని ప్రమాణం చేయిస్తున్నాడా లేదా తిమోతికి ఆజ్ఞ ఇస్తున్నాడా అనేదానిపై ఆధారపడి దీనిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు.
పౌలు తిమోతిని ప్రమాణం చేయిస్తుంటే, తిమోతి ప్రమాణాన్ని నెరవేర్చడంలో విఫలమైతే తిమోతి తిరస్కరించే విషయాలు ఇవేనని అతను చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తు రాకడ కొరకు మరియు రాజుగా ఆయన పరిపాలన కొరకైన బలమైన వాంఛ వలె/తో ప్రమాణం"
(2) ఈ వచనం పౌలు ఒక ఆదేశాన్ని/ఆజ్ఞను పరిచయం చేస్తుంటే,పౌలు తన ఆజ్ఞను బలపరచడానికి ఈ విషయాల గురించి విన్నవించుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు ఖచ్చితంగా క్రీస్తు తిరిగి వచ్చి రాజుగా పరిపాలిస్తాడు అన్నంత ఖచ్చితంగా"
2 Timothy 4:2
τὸν λόγον
పౌలు వాక్యము అనే పదాన్ని యేసు క్రీస్తును గురించి సందేశమంతటిని సందేశమును అలంకారికంగా సూచించడానికి ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "సువార్త సందేశం" లేదా "శుభవార్త" (చూడండి:అన్యాపదేశము)
εὐκαίρως, ἀκαίρως
యేసును గురించి బోధించడానికి సమయం అనుకూలంగా ఉన్నది అని అనిపించిన్నప్పుడును, సమయం ప్రతికూలంగా ఉన్నది అని అనిపించనప్పుడు కూడా తిమోతి బోధించడానికి సిద్ధంగా ఉండాలి అని పౌలు అర్ధం. అన్ని సందర్భాలలో అని సూచించడానికి పౌలు రెండు రకాల సందర్భాలను అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "సౌకర్యవంతంగా ఉన్నప్పుడు, సౌకర్యవంతంగా లేనప్పుడు" లేదా "అన్ని సమయాలలో" (చూడండి: వివరణార్థక నానార్థాలు)
ἔλεγξον
మందలించడం అనే ఆదేశం/ఆజ్ఞ తప్పు చేసిన వారిని, దిద్దుబాటు అవసరమైన వారి వైపుకు ఇది ఉద్దేశించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “పాపం చేసిన వారిని సరిచేయండి/సరిచేయుము” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐπιτίμησον
గద్ధించుము అనే పదము ఎవరైనా/వారు తప్పు చేశారని చెప్పడం, మళ్లీ చేయవద్దని హెచ్చరించడం అను అర్ధం ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "పాపం చేయవద్దని వారికి చెప్పండి"
ἐν πάσῃ μακροθυμίᾳ καὶ διδαχῇ
ఇక్కడ, ఓర్పు మరియు బోధించుట అనేది ఒక రెండు పదాలతో ఒకే భావం ఓర్పు, బోధించుట ను పరివర్తింప జేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "చాలా ఓపికగా బోధించడం ద్వారా ఈ పనులు చేయండి, ఓర్పుతో బోధించుచు ఈ విషయాలు చేయండి" లేదా "ఎల్లప్పుడూ ఓపికగా బోధించడం ద్వారా ఈ పనులు చేయండి ఎల్లప్పుడు ఈ విషయాలు ఓపికతో బోధించు" (చూడండి:విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు)
ἐν πάσῃ μακροθυμίᾳ καὶ διδαχῇ
దీని పరోక్ష అర్థమేమనగా, తిమోతి ఈ విధంగా బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, మరియు ఉద్బోధించాలి. ఇది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: " చాలా ఓపికగా బోధించడం ద్వారా ఈ పనులు ఓర్పుతో బోధించుచు ఈ విషయాలు చేయండి" లేదా "ఎల్లప్పుడూ ఓపికగా బోధించడం ద్వారా ఈ పనులు ఎల్లప్పుడు ఈ విషయాలు ఓపికతో బోధించు" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν πάσῃ μακροθυμίᾳ καὶ διδαχῇ
ఇక్కడ, సంపూర్ణమైన అంటే రెండు విషయాలలో ఒక అర్ధం అయుండవచ్చు. (1) తిమోతి బోధించు ప్రతిసారి ఓర్పుతో ఉండాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎల్లప్పుడూ ఓర్పుతో బోధించడం”
(2) సంపూర్ణమైన అనే పదము నొక్కి చెప్పడానికి సాధారణంగా వాడి ఉండవచ్చు, అంటే తిమోతి చాలా ఓపికగా ఉండాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “సంపూర్ణమైన ఓర్పుతో బోధించడం ద్వారా” (చూడండి:అతిశయోక్తి)
2 Timothy 4:3
ἔσται…καιρὸς ὅτε
ప్రత్యామ్నాయ అనువాదం: "సమయం వచ్చినప్పుడు"
οὐκ ἀνέξονται
ప్రత్యామ్నాయ అనువాదం: "వారు ఇక ఓర్పుతో వినరు"
οὐκ ἀνέξονται
సంధర్బాన్ని బట్టి వారు అనగా విశ్వాసుల సంఘంలో భాగమైన వారందరు. ప్రత్యామ్నాయ అనువాదం: "కొంతమంది విశ్వాసులు ఇకపై ఓపికగా వినరు" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τῆς ὑγιαινούσης διδασκαλίας
సాహచర్యముగా ఆరోగ్యకరమైన బోధ అను వ్యక్తీకరణ అలంకారికముగా సరియైన బోధ* అని అర్ధం. ఏలయనగా/ఎందుకనగా ఆరోగ్యకరమైన మనస్సు సరైన బోధనను సహేతుకమైనదని గుర్తింస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "సరైన బోధన" (చూడండి: అన్యాపదేశము)
κατὰ τὰς ἰδίας ἐπιθυμίας, ἑαυτοῖς ἐπισωρεύσουσιν διδασκάλους
జలు అనేక మంది బోధకులను కుప్పగా లేదా పోగుచేసుకొని వేసినట్లు వారు ఎలా పొందుతారో అని పౌలు మాట్లాడుతున్నాడు. వారు అనేకమంది బోధకులను కోరుకుంటారు, కానీ ఈ బోధకుల దైవిక జీవితాలను జీవించుట బట్టి లేదా ఖచ్చితంగా బోధిస్తారనే దానిని బట్టి వారు ఈ బోధకులకు విలువ ఇవ్వరు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు వారికి కావలసిన వాటిని బోధించే అనేక బోధకులను సమకూర్చుకుంటారు" (చూడండి:రూపకం)
κνηθόμενοι τὴν ἀκοήν
తమ చెవులు దురద పెట్టినట్లుగా, మరియు వారు వినాలని కోరుకుంటున్న వాటిని చెప్పే బోధకులను కనుగోనినప్పుడే ఉపశమనం కలుగుతుంది అన్నట్లు ప్రజలు వారిని/బోధకులను పిచ్చిగా కోరుకుంటున్నారని పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు దానిని చాలా చెడుగా వినాలనుకుంటున్నారు" (చూడండి: జాతీయం (నుడికారం))
κνηθόμενοι τὴν ἀκοήν
పౌలు చెవి అను పదమును వినడం అనే అర్ధంతో అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు చాలా చెడ్డగా వినాలనుకుంటున్నారు" (చూడండి:అన్యాపదేశము)
2 Timothy 4:4
ἀπὸ μὲν τῆς ἀληθείας τὴν ἀκοὴν ἀποστρέψουσιν
జనులు ఇక ఏమాత్రము శ్రేద్ద వహించక పోవుటను గురించి వారు వినకుండ భౌతికంగా చెవులు త్రిప్పుకొని ఉన్నారన్నట్లు పౌలు వారిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఇకపై సత్యము వైపు దృష్టి పెట్టరు" (చూడండి:రూపకం)
ἀπὸ μὲν τῆς ἀληθείας τὴν ἀκοὴν ἀποστρέψουσιν
పౌలు చెవి అను పదమును వినడం అనే అర్ధంతో అలంకారికంగా ఉపయోగిస్తున్నాడు. అదే వినడం, అలంకారికంగా శ్రద్ధ పెట్టడం అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇకపై సత్యము వైపు దృష్టి పెట్టరు” (చూడండి:అన్యాపదేశము)
ἐπὶ…τοὺς μύθους ἐκτραπήσονται
జనులు కల్పనా కధలు పై దృష్టి పెట్టడం మొదలుపెట్టుట గురించి వారిని ఎవరో తప్పు మార్గంలో తిరుగుతున్నట్లు చేయుచున్నారనట్లు పౌలు వారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ బోధకులు వారిని నిజం/సత్యం కాని కథలపై దృష్టి పెట్టేలా చేస్తారు" (చూడండి: రూపకం)
ἐπὶ…τοὺς μύθους ἐκτραπήσονται
మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని కర్తరి రూపంలో చెప్పవచ్చు, ఆ క్రియ ఎవరు చేస్తారో మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ బోధకులు వారిని సత్యం కాని కథలపై దృష్టి పెట్టేలా చేస్తారు " (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 4:5
νῆφε
పౌలు తన పాఠకులు అన్ని విషయాల గురించి/అన్నిటిని సరిగా ఆలోచించాలని కోరుకుంటున్నాడు, కాబట్టి అతను (మద్యం) త్రాగిన వారిగా ఉండకుండా తెలివిగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "స్పష్టంగా ఆలోచించండి" (చూడండి:రూపకం)
εὐαγγελιστοῦ
ప్రత్యామ్నాయ అనువాదం: "యేసును గూర్చిన సువార్తను ప్రకటించే వ్యక్తి"
2 Timothy 4:6
ἐγὼ…ἤδη σπένδομαι
పౌలు తన మరణం గురించి ఇప్పటికే జరుగుతున్నట్లు మాట్లాడుతుండగా,అది త్వరలో జరిగే సంఘటన అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను త్వరలో పోతాను/పోయబడతాను"
ἐγὼ…ἤδη σπένδομαι
పౌలు తనను గూర్చి తాను గిన్నెలో ఉన్న ద్రాక్షారసము దేవునికి అర్పణగా పోయబడినట్లు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవునికి నా ప్రాణ త్యాగం త్వరలో పూర్తి అవుతుంది" (చూడండి:రూపకం)
ἐγὼ…ἤδη σπένδομαι
ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నా జీవితం త్వరలో దేవునికి బలిగా/అర్పణగా ముగుస్తుంది" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ καιρὸς τῆς ἀναλύσεώς μου ἐφέστηκεν
పౌలు తన మరణాన్ని నిష్క్రమణ గా సుచిస్తున్నాడు. అసహ్యకరమైన దానిని సూచించడానికి ఇది మర్యాదపూర్వక ఉపయోగించు విధము. ప్రత్యామ్నాయ అనువాదం: "త్వరలో నేను చనిపోయి, ఈ లోకమును విడిచిపెడతాను" (చూడండి: సభ్యోక్తి)
2 Timothy 4:7
τὸν καλὸν ἀγῶνα ἠγώνισμαι
పౌలు తనను గూర్చి తాను అథ్లెటిక్/క్రీడల పోటీలో పాల్గొన్నట్లుగా అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ఇది/ఈ రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు. (1) మంచి అనే పదం పౌలు చేసిన ప్రయత్నాన్ని వివరించగలదు/వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను నా వంతు కృషి చేసాను” (2) మంచి అనే పదానికి పౌలు ఒక యోగ్యమైన దాని కొరకు ప్రయత్నం చేశాడని అర్థం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నిజంగా ముఖ్యమైన దాని కొరకు నేను చాలా కష్టపడ్డాను” (చూడండి:రూపకం)
τὸν δρόμον τετέλεκα
పౌలు దేవునికి తన సేవా జీవితాన్ని గురించి అది పరుగు పందెం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను పూర్తి చేయవలసినది నేను చేశాను" (చూడండి:రూపకం)
τὴν πίστιν τετήρηκα
పౌలు విశ్వాసం గురించి అనగా క్రీస్తునందు తన నమ్మకం, దేవునికి తన విధేయత, ఇవి తన దగ్గర ఉన్న విలువైన వస్తువులగా భద్రపర్చుకొన్నట్లు ఉంచినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు.
(1) దేవుడు తనకు చెప్పినది చేయడంలో పౌలు నమ్మకంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నా పరిచర్యలో నేను నమ్మకంగా ఉన్నాను/ఉండిపోయాను"
(2) సత్యమును బోధించడానికి పౌలు నమ్మకంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను బోధనలను/బోధను తప్పు నుండి కాపాడాను" (చూడండి:రూపకం)
2 Timothy 4:8
ἀπόκειταί μοι ὁ τῆς δικαιοσύνης στέφανος
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు నాకు నీతి కిరీటాన్ని సిద్ధపరచి ఉంచాడు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῆς δικαιοσύνης στέφανος
ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు:
(1) కిరీటం దేవుడు సరైన మార్గంలో జీవించిన వారికి/వ్యక్తులకు ఇచ్చే బహుమతిని అలంకారికంగా సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “నీతిమంతులకు/కొరకు బహుమతి”
(2) కిరీటం నీతిని సుచిస్తుండవచ్చు. పరుగుపందెం లో న్యాయనిర్ణేత గెలిచిన వారికి/విజేతకు కిరీటం ఇచ్చినట్లుగా/బహుకరించినట్లుగా, పౌలు తన జీవితాన్ని పూర్తి చేసినప్పుడు, దేవుడు పౌలును నీతిమంతుడని ప్రకటించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీతి అనే బహుమతి” (చూడండి:రూపకం)
στέφανος
మీరు దీన్ని [2: 5] లో ఎలా అనువదించారో చూడండి (../02/05.md).దేవుని నుండి భవిష్యత్పురస్కారానికి/బహుమతిని ఉదాహరణగా పౌలు ఉపయోగిస్తున్న కిరీటం అథ్లెటిక్ పోటీలలో విజేతలకు ఇచ్చిన తమాలవృక్ష ఆకులతో చేసిన చుట్ట. పోటీలో గెలిచినందుకు బహుమతిని సూచించే పదాన్ని మీరు మీ భాషలో ఉపయోగించవచ్చు. (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
ἐν, ἐκείνῃ τῇ ἡμέρᾳ
[1:12] (../01/12.md) లో వలె, ఇది యేసు ప్రజలను/జనులను తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చు దినమును సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "తీర్పు దినమున" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοῖς ἠγαπηκόσι τὴν ἐπιφάνειαν αὐτοῦ
ప్రత్యామ్నాయ అనువాదం: "అయన రాకడ కొరకు ఎదురుచూస్తున్న వారు"
τὴν ἐπιφάνειαν αὐτοῦ
మీరు దీన్ని [4: 1] లో ఎలా అనువదించారో చూడండి (../04/01.md). క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన భూమిపై ఉన్న ప్రజలకు మరోసారి కనబడతాడనే వాస్తవం సాహచర్యముగా క్రీస్తు తిరిగి రావడాన్ని పౌలు అలంకారికంగా సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతని తిరిగి రాకడ" (చూడండి:అన్యాపదేశము)
2 Timothy 4:9
σπούδασον ἐλθεῖν…ταχέως
ప్రత్యామ్నాయ అనువాదం: “వీలైనంత త్వరగా రండి”
2 Timothy 4:10
Δημᾶς…Κρήσκης…Τίτος
ఇవి పురుషుల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τὸν νῦν αἰῶνα
ప్రస్తుత యుగం అనే వ్యక్తీకరణ దేవుని సంబంధమైన విషయాలకు వ్యతిరేకమైన ప్రపంచ విషయాలను సూచిస్తున్నది. పౌలు ఈ ఇహలోక విషయాలను అలంకారికంగా ప్రస్తుతం జతపరచి , ప్రజలు సాధారణంగా వాటిని కోరుకునే ప్రస్తుత కాలంతో అనుబంధించడం ద్వారా, దేవుని విషయాలు భూమి అంతటా స్థాపించబడే భవిష్యత్తు కాలానికి భిన్నంగా ఉంటాయి. ప్రత్యామ్నాయ అనువాదం: "ఈ ప్రపంచంలోని తాత్కాలిక సౌకర్యాలు" (చూడండి:అన్యాపదేశము)
Κρήσκης εἰς Γαλατίαν, Τίτος εἰς Δαλματίαν
ఒక వాక్యం పూర్తి కావడానికి అనేక భాషలలో అవసరమైన కొన్ని పదాలను పౌలు ఇక్కడ వదిలివేసాడు. అతని అర్ధం దేమా లాగా, క్రేస్కే, తీతు అతనిని విడిచిపెట్టారు. ఏదేమైనా, వారు ఇలా చేశారని అతను బహుశా చెప్పలేదు ఎందుకంటే వారు దేమా లాగా "ఇహలోకమును స్నేహించారని కాదు". వారు బహుశా ఎక్కువ శాతం సంఘాలకు సహాయం చేయడానికి వారు ప్రయాణిస్తుండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రేస్కే నన్ను విడచి గలతియాకు వెళ్ళాడు, మరియు తీతు నన్ను విడిచి దల్మతియకు వెళ్లాడు" (చూడండి:శబ్దలోపం)
Γαλατίαν…Δαλματίαν
ఇవి రోమా సామ్రాజ్యంలోని భాగాల/ప్రాంతాల పేర్లు.గలతియ అనేది రోమీయుల అధికారిక సంస్థానం, దల్మతియ అనేది ఇల్లిరికం సంస్థానం యొక్క దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతం. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 4:11
Λουκᾶς…Μᾶρκον
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
μοι εὔχρηστος εἰς διακονίαν
ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు.
(1) మార్కు పౌలు యొక్క వ్యక్తిగత అవసరాలలో సహాయపడటంలో ప్రయోజన కరమైన వాడిగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతడు నా అవసరాలను తీర్చడంలో సహాయపడగలడు"
(2)పౌలు ఇతరులకు పరిచర్య చేడంలో ముఖ్యముగా బోధించుటలోను ప్రకటించుటలోను మార్కు సహాయపడుటలో ప్రయోజనకరముగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతడు నా పరిచర్యలో నాకు సహాయకారిగా ఉన్నాడు"
2 Timothy 4:12
Τυχικὸν
ఇది ఒక మనిషి పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἀπέστειλα
ఈ పత్రికను అందుకున్నప్పుడు/అందుకుంటున్నప్పుడు తిమోతి ఎఫెసులో ఉన్నాడు. ఎఫేసులో ఉన్న తిమోతికి ఈ పత్రిక తీసుకెళ్లినది తుకికు కావచ్చు.. అలా అయితే, తిమోతి కోణం నుండి పౌలు వ్రాస్తున్నాడు, మరియు పౌలు తుకీకును పంపడం అన్నది తిమోతికి గత సంఘటనగా ఉండును. ఇది మీ భాషలో గందరగోళంగా ఉంటే, మీరు ఇలా జరిగే అవకాశ మున్నది అని చేర్చాలనుకుంటే,మీరు క్రియా పదమును భవిష్యత్తు కాలానికి మార్చవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "త్వరలో నేను పంపుతూ ఉంటాను"
Ἔφεσον
ఇది ఒక నగరం పేరు. తిమోతి ఈ పత్రికను అందుకొంటున్నప్పుడు ఈ నగరంలో ఉన్నాడు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 4:13
φελόνην
అంగీ అనే పదం బట్టల మీద ధరించే భారీ వస్త్రాన్ని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "పై అంగీ" (చూడండి:తెలియనివాటిని అనువదించడం)
Τρῳάδι
ఇది ఒక నగరం పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Κάρπῳ
ఇది ఒక మనిషి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τὰ βιβλία
పుస్తకాలు అనే పదం గ్రంధపు చుట్టలను సూచిస్తున్నది. గ్రంధపు చుట్ట అనేది ఒక రకమైన పాపిరస్ అను పొడవాటి కాగితం లేదా ~తోలు~చర్మపు చుట్ట. గ్రంధపు చుట్టను వ్రాసిన తర్వాత గాని చదివిన తర్వాత, ప్రజలు చివర్లలో ఇనుప జువ్వలు ఉపయోగించి దాన్ని చుట్టేస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: "గ్రంధపు చుట్టలు" (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
μάλιστα τὰς μεμβράνας
చర్మపు కాగితములు అనే పదం నిర్దిష్ట రకమైన గ్రంధపు చుట్టగా సూచించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "ముఖ్యంగా జంతువుల తోలుతో తయారు చేయబడినవి" (చూడండి: తెలియనివాటిని అనువదించడం)
2 Timothy 4:14
Ἀλέξανδρος ὁ χαλκεὺς
కంచరివాడు* అనే పదం రాగి, ఇతర లోహాలతో వస్తువుల పనిచేసే వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "అలెగ్జాండర్,లోహముతో పనిచేసేవాడు/ కంసాలి పని చేసే అలెక్సంద్రు" (చూడండి:తెలియనివాటిని అనువదించడం)
Ἀλέξανδρος
ఇది ఒక మనిషి పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἀποδώσει αὐτῷ ὁ Κύριος κατὰ τὰ ἔργα αὐτοῦ
పౌలు శిక్షను గూర్చి అలంకారికంగా తిరిగి చెల్లింపు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "అతను చేసిన దానికి ప్రభువు అతనికి సరైన శిక్షను విదిస్తాడు" (చూడండి:రూపకం)
2 Timothy 4:15
ἀντέστη τοῖς ἡμετέροις λόγοις
మాటలు అనే పదం పౌలు, తిమోతి మరియు వారి తోటిపనివారు బోధించే సందేశాన్ని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "అతను మేము బోధించుచున్న సందేశాన్ని వ్యతిరేకించాడు" (చూడండి:అన్యాపదేశము)
2 Timothy 4:16
ἐν τῇ πρώτῃ μου ἀπολογίᾳ
పౌలు తన విచారణ ప్రారంభ సెషన్/సమావేశకాలం గురించి ప్రస్తావిస్తున్నాడు/సుచిస్తున్నాడు. మొదట అని వ్రాయడం ద్వారా,అతను మళ్లీ న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని సూచిస్తున్నట్లు ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "నా విచారణ ప్రారంభ సమావేశకాలంలో" లేదా "నేను మొదట విచారణకు హాజరై, నా చర్యలను వివరించినప్పుడు"
οὐδείς μοι παρεγένετο
ఎలాంటి మద్దతుదారులు లేకుండా ఒంటరిగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని పౌలు తిమోతికి వివరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "నా తరపున ఎవరూ సాక్ష్యం చెప్పలేదు"
μὴ αὐτοῖς λογισθείη
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు వారికి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు గాక" లేదా "నన్ను వదిలేసినందున దేవుడు ఆ విశ్వాసులను శిక్షించవద్దని/శిక్షించకుండునట్లు నేను ప్రార్థిస్తున్నాను" (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 4:17
ὁ…Κύριός μοι παρέστη
ప్రభువు తనతో భౌతికంగా నిలబడినట్లుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు నాకు సహాయం చేసాడు" (చూడండి: రూపకం)
ἵνα δι’ ἐμοῦ τὸ κήρυγμα πληροφορηθῇ
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ఇది రెండు విషయాలలో ఒక అర్ధం కావచ్చు. (1) తన విచారణలో, పౌలు ప్రకటించడానికి దేవుడు తనకు ఇచ్చిన మొత్తం సందేశాన్ని/సందేశానంతటిని/సందేశమంతటిని వివరించగలిగాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "గనుక నేను ప్రభువు సందేశానంతటిని ప్రకటించగలిగాను" (2) పౌలు దేవుని సందేశాన్ని ఈ సమయం వరకు అనగా తన జీవితాన్ని కోల్పోతానని ఎదురుచూసే వరకు దేవుని సందేశాన్ని ప్రకటించడం కొనసాగించగలిగాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "తద్వారా నేను చివరి వరకు ప్రభువు సందేశాన్ని ప్రకటించడం కొనసాగించగలిగాను" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καὶ ἀκούσωσιν πάντα τὰ ἔθνη
ఇక్కడ అన్నీ అనే పదం
(1) అలంకారిక సాధారణీకరణ, ప్రత్యామ్నాయ అనువాదం: "వీలైనంత ఎక్కువ మంది అన్యజనులు దీనిని వినగలరు" లేదా
(2) న్యాయస్థానంలోని అన్యజనులందరికి సూచన, ప్రత్యామ్నాయ అనువాదం: " తద్వారా అక్కడ ఉన్న అన్యులందరూ/అన్యజనులందరు వినవచ్చు ”(చూడండి:అతిశయోక్తి)
ἐρύσθην ἐκ στόματος λέοντος
పౌలు తన న్యాయస్థానం సింహంతో చంపబడే ప్రమాదం ఉన్నట్లు అలంకారికంగా మాట్లాడుతున్నాడు. అతను మరణశిక్షకు గురయ్యే శారీరక ప్రమాదం అని లేదా యేసు కోసం ధైర్యంగా మాట్లాడకూడదనే శోధనకు గురయ్యే ఆధ్యాత్మిక ప్రమాదం అని లేదా రెండూ అని అర్థం చేసుకోవచ్చు. మీ అనువాదంలో రెండు అవకాశాలను తెరిచి ఉంచడం ఉత్తమం. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను గొప్ప ప్రమాదం నుండి రక్షించబడ్డాను/తప్పించబడ్డాను" (చూడండి:రూపకం)
ἐρύσθην ἐκ στόματος λέοντος
మీ భాష కర్మణి క్రియా రూపాలను ఉపయోగించకపోతే, అదే ఆలోచనను వ్యక్తపరచడానికి మీరు కర్తరి రూపాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు నన్ను గొప్ప ప్రమాదం నుండి కాపాడాడు" (చూడండి:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
2 Timothy 4:18
εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων
ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: "యుగయుగములు" (చూడండి:జాతీయం (నుడికారం))
2 Timothy 4:19
Πρίσκαν
ఇది ఒక స్త్రీ పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Ἀκύλαν
ఇది ఒక మనిషి పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τὸν Ὀνησιφόρου οἶκον
మీరు దీన్ని [1:16] లో ఎలా అనువదించారో చూడండి (../01/16.md). ఇంటివారు అనే పదం ఒనేసిఫొరు, అతని కుటుంబంలోని వ్యక్తులందరినీ, బహుశా అతని దాసులను కూడా సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: " ఒనేసిఫొరు, అతనితో నివసించే ప్రతి ఒక్కరూ" (చూడండి:అన్యాపదేశము)
Ὀνησιφόρου
ఇది ఒక మనిషి పేరు. మీరు ఈ పేరును [1:16] లో ఎలా అనువదించారో చూడండి (../01/16.md). (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 4:20
Κορίνθῳ
ఇది ఒక నగరం పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Ἔραστος…Τρόφιμον
ఇవి పురుషుల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Μιλήτῳ
ఇది ఎఫెసు దక్షిణాన ఉన్న నగరం పేరు ఇది. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
2 Timothy 4:21
σπούδασον…ἐλθεῖν
ప్రత్యామ్నాయ అనువాదం: “రావడానికి మీ వంతు కృషి చేయి” లేదా “రావడానికి వీలైనంత వరకు ప్రయత్నించండి”
πρὸ χειμῶνος
అంతరార్థం ఏమిటంటే, చల్లని వాతావరణం రాకముందే తిమోతి పౌలు వద్దకు రావడానికి ప్రయత్నించాలి మరియు/లేనియెడల ప్రయాణాన్ని కష్టంగా లేదా అసాధ్యంగా చేస్తుంది. మీ ప్రాంతంలో శీతాకాలం వెచ్చగా ఉంటే మరియు వేసవికాలం చల్లగా ఉంటే, లేదా మీ ప్రాంతంలో చలికాలం లేక వర్షాకాలం ఉంటే, మీరు మరింత సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "చల్లని వాతావరణం ప్రయాణాన్ని కష్టతరం చేయడానికి ముందు" లేదా "వాతావరణం మారడానికి మరియు ప్రయాణాన్ని కష్టతరం చేయడానికి ముందు" (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀσπάζεταί σε Εὔβουλος, καὶ Πούδης, καὶ Λίνος, καὶ Κλαυδία, καὶ οἱ ἀδελφοὶ
అనేక భాషలలో ఒక వాక్యం పూర్తి కావడానికి అవసరమైన కొన్ని పదాలను పౌలు ఇక్కడ వదిలివేసాడు.. ~అర్థం స్పష్టంగా ఉందని నిర్ధారించుకోవడానికి~~, మీరు ఈ పదాలను అందించవచ్చు~ అర్ధం స్పష్టముగా ఉండుటకు మీరు కొన్ని పదాలను జోడించవచ్చు. యుబూలు తర్వాత వ్రాయబడినవారు కూడా తిమోతికి శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు. యుబూలు వారికి వందనములు/శుభాకాంక్షలు తెలియజేయుట లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: " యుబూలు వందనములు/శుభాకాంక్షలు తెలుపుచున్నాడు అదేరీతిగా పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు " (చూడండి:శబ్దలోపం)
Εὔβουλος…Πούδης…Λίνος
ఇవి ముగ్గురు పురుషుల పేర్లు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Κλαυδία
ఇది ఒక స్త్రీ పేరు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)
οἱ ἀδελφοὶ
సహోదరులు అనే పదం విశ్వసులందరికి వర్తిస్తుంది పురుషులు, స్త్రీలు అనే తేడా లేదు/పురుషులైన, స్త్రీలైన. ప్రత్యామ్నాయ అనువాదం: "ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ" (చూడండి:పుంలింగ పదాలు స్త్రీలను కూడా ఉద్దేశించిన సందర్భాలు)
2 Timothy 4:22
ὁ Κύριος μετὰ τοῦ πνεύματός σου
తిమోతికి దీవెనతో పౌలు తన పత్రికను తిమోతిని దీవిస్తూ ముగింస్తున్నాడు. ఇక్కడ,నీరు* ఏకవచనం, తిమోతిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు నీ ఆత్మను బలపరచాలని నేను ప్రార్థిస్తున్నాను" (చూడండి:‘మీరు’ రూపాలు)
ὁ Κύριος μετὰ τοῦ πνεύματός σου
పౌలు తిమోతిని అతని ఆత్మ గురించి ప్రస్తావించడం ద్వారా సంపూర్ణ వ్యక్తిగా దృష్ట్యా అలంకారికంగా వర్ణింస్తున్నాడు, ఎందుకనగా బహుశా పౌలు తిమోతి ఆధ్యాత్మిక బలాన్ని పొందాలని కోరుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "ప్రభువు నిన్ను బలపరచునట్లు నేను ప్రార్థిస్తున్నాను" లేదా "ప్రభువు నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచునట్లు ప్రార్థిస్తున్నాను" (చూడండి:ఉపలక్షణము)
ἡ χάρις μεθ’ ὑμῶν
పౌలు రెండవ దీవెనతో తన పత్రికను ముగిస్తున్నాడు. ఇక్కడ మీరు అన్నది బహువచనం, తిమోతితో ఉన్న విశ్వాసులందరినీ సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “అక్కడ కృప మీఅందరికి తోడై ఉండునుగాక ” (చూడండి:‘మీరు’ రూపాలు)
ἡ χάρις μεθ’ ὑμῶν
మీ భాషలో ఇది స్పష్టంగా ఉంటే,పౌలు ఆకాంక్షలను ఎవరు సాధ్యపరచగలరో మీరు చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు మీఅందరికి కృప అనుగ్రహించును గాక"