Romans
Romans front
రోమా పత్రిక యొక్క ఉపోద్ఘాతము
భాగము 1: సహజమైన పరిచయం
రోమా పత్రిక యొక్క విభజన
- పరిచయం (1:1-15)
- ఉపోద్ఘాతము (1:1-15)
- యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా నీతిమంతులగుట (1:16-17)
- పాపమునుబట్టి మనుష్యులందరూ శిక్షించబడియున్నారు (1:18-3:20)
- యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా ఆయన ద్వారా నీతిమంతులగుట (3:21-4:25)
- ఆత్మ ఫలములు (5:1-11)
- ఆదాము మరియు క్రీస్తు పోల్చబడుట (5:12-21)
- ఈ జీవితములో క్రీస్తువలె మారుట (6:1-8:39)
- ఇశ్రాయేలీయులకొరకు దేవుని ప్రణాళిక (9:1-11:36)
- క్రైస్తవులుగా జీవించుటకొరకు ప్రయోగాత్మకమైన సలహాలు (12:1-15:13)
- ముగింపు మరియు శుభాకాంక్షలు (15:14-16:27)
రోమా పత్రికను ఎవరు వ్రాశారు?
రోమా పత్రికను అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. పౌలు తార్సు అనే పట్టణమునుండి వచ్చినవాడు. తను సౌలు అనే పేరుతో కూడా పిలువబడేవాడు. క్రైస్తవుడిగా మారకమునుపు, పౌలు పరిసయ్యుడైయుండెను. ఆయన క్రైస్తవులను హింసించియుండెను. ఆయన క్రైస్తవునిగా మారిన తరువాత, ఆయన యేసు ప్రభువును గూర్చి ప్రజలకు చెప్పుటకు రోమా సామ్రాజ్యమందంతట తిరిగియుండెను.
పౌలు రోమా సామ్రాజ్యములో తన మూడవ సువార్త దండయాత్ర సమయములో కొరింథులో ఉన్నప్పుడు ఈ పత్రికను వ్రాసియుండవచ్చునని.
ఈ రోమా పత్రిక దేనిని గూర్చి వ్రాయబడియున్నది?
పౌలు రోమాలోని క్రైస్తవులకు ఈ పత్రికను వ్రాసియున్నాడు. పౌలు రోమాకు వెళ్లి వారిని కలిసినప్పుడు వారు ఆయనను చేర్చుకొనుటకు సిద్ధముగా ఉండాలని కోరెను. “విశ్వాస సంబంధమైన విధేయతను” (16:26) తీసుకొని రావడమే ఆయన ఉద్దేశమని చెప్పియుండెను.
ఈ పత్రికలో పౌలు యేసు క్రీస్తును గూర్చిన సువార్తను సంపూర్ణముగా వివరించియున్నాడు. యూదులు మరియు యుదేతరులు పాపము చేసియున్నారని ఆయన వివరించాడు, మరియు దేవుడు వారిని క్షమిస్తాడని మరియు యేసునందు వారు విశ్వసించుట ద్వారా మాత్రమే వారు నీతిమంతులుగా తీర్చబడుతారని విశదపరచియున్నాడు (1-11 అధ్యాయములు). విశ్వాసులు ఎలా జీవించాలనే విషయములో ఆయన ప్రయోగాత్మకమైన సలహాను ఇచ్చియున్నాడు (12-16 అధ్యాయాలు),
ఈ పుస్తకము యొక్క పేరును ఎలా తర్జుమా చేయాలి?
తర్జుమాదారులు ఈ పుస్తకమును “రోమీయులు” అనే సంప్రదాయకమైన పేరుతో పిలుచుటకు ఎన్నుకోవచ్చును. లేక వారు “రోమాలో ఉన్న సంఘముకు పౌలు వ్రాయుచున్న పత్రిక” లేక “రోమాలోనున్న క్రైస్తవులకు ఒక పత్రిక” అనే స్పష్టమైన పేర్లను ఎన్నుకోవచ్చును. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతికపరమైన ముఖ్యమైన ఉద్దేశాలు
యేసును సూచించుటకు ఉపయోగించబడిన పేర్లు ఏమిటి?
రోమా పత్రికలో పౌలు యేసు క్రీస్తును వివరించుటకు అనేకమైన పేర్లను మరియు వివరణలను వాడియున్నాడు: యేసు క్రీస్తు (1:1) , దావీదు విత్తనము (1:3), దేవుని కుమారుడు (1:4), ప్రభువైన యేసు క్రీస్తు (1:7), క్రీస్తు యేసు (3:24), ప్రాయశ్చిత్తము (3:25), యేసు (3:26), మన ప్రభువైన యేసు (4:24), సైన్యములకు అధిపతియైన ప్రభువు (9;29), అడ్డురాయి మరియు అడ్డుబండ (9:33), ధర్మశాస్త్రానికి ముగింపు (10:4), విమోచకుడు (11:26), చనిపోయినవారికి సజీవులకు ప్రభువు (14:9), మరియు యెష్షయి వేరు చిగురు (15:12).
రోమా పత్రికలోని వేదాంతపరమైన పేర్లు ఎలా తర్జుమా చేయబడినవి?
నాలుగు సువార్తలలో ఉపయోగించని అనేకమైన వేదాంతపరమైన పదాలను ఈ పత్రికలో పౌలు ఉపయోగించియున్నాడు. ఆదిమ క్రైస్తవులు యేసు క్రీస్తును గూర్చి మరియు ఆయన సందేశమును గూర్చి ఎక్కువగా నేర్చుకొనియున్నారు, క్రొత్త ఆలోచనలకొరకు వారికి పదాలు మరియు భావ జాలము అవసరమైయుండెను. వాటిల్లో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి, “నిర్దోషిగా తిర్చబడడం” (5:1), “ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు” (3:20), “సమాధానపరచబడుట” (5:10), “ప్రాయశ్చిత్తము” (3:25), “పవిత్రీకరణ” (6:19), మరియు “పాత పురుషుడు” (6:6).
”ముఖ్య పదాలు” అనే నిఘంటువు ఈ పదాలను అర్థము చేసికొనుటకు తర్జుమాదారులకు సహాయపడును. (చూడండి: భావనామాలు)
పైన ఇవ్వబడిన పదములను వివరించడం అంత సులభము కాదు. ఈ పదాలకు సమానమైన అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలను తర్జుమాదారుల భాషలో కనుగొనడం అంత సులభము ఏమి కాదు. ఈ పదాలకు సరిపోయిన మాటను కనుగొననవసరము లేదని చెప్పుటకు ఇది సహాయము చేస్తుంది. దీనికి బదులుగా, ఈ ఆలోచనలను వ్యక్తము చేయుటకు తర్జుమాదారులు చిన్న చిన్న మాటలుగా పొందుపరిచి చెప్పవచ్చును. ఉదాహరణకు, “సువార్త” అనే పదమును “యేసు క్రీస్తును గూర్చిన శుభవార్త” అని కూడా తర్జుమా చేయవచ్చును.
ఈ పదాలలోని కొన్ని పదాలకు ఎక్కువ అర్థాలు ఉంటాయని తర్జుమాదారులు తెలుసుకోవాలి. ఆయా వాక్యభాగమునుబట్టి గ్రంథకర్త ఉపయోగించే పదాలనుబట్టి అర్థము ఆధారపడియుంటుంది. ఉదాహరణకు “నీతిమంతము” అనే పదము కొన్నిమార్లు ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలకు లోబడుచున్నాడు అనే అర్థము కూడా ఇస్తుంది. మరికొన్నిమార్లు, “నీతిమంతము” అనే పదముకు యేసు క్రీస్తు మనకొరకు పరిపూర్ణముగా దేవుని ఆజ్ఞలకు లోబడియుండెను అని అర్థము వస్తుంది.
పౌలు చెప్పుచున్న ఇశ్రాయేలీయుల “శేషం” (11:5) అనే మాటకు అర్థము ఏమిటి?
”శేషం” అనే పదము పాతనిబంధనలోను మరియు పౌలుకును చాలా ప్రాముఖ్యమైన పదము. అశ్శూరీయులు మరియు బబులోనీయులు ఇశ్రాయేలీయుల భూమిని జయించి స్వాధీనపరచుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఇతర ప్రజలలోనికి చెదరిపోయారు లేక కొంతమంది చంపబడియున్నారు. కొంతమంది యూదులు మాత్రమే జీవముతో ఉండిరి. వారినే “శేషం” అని పిలుస్తారు.
11:1-9 వచనభాగములో పౌలు శేషించినబడిన ఇతర ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. ఈ శేషము ఎవరంటే యేసు క్రీస్తునందు విశ్వసించిన మరియు దేవుడు రక్షించిన యూదులైయుండిరి. (చూడండి: శేషము)
భాగము 3: తర్జుమాపరమైన ప్రాముఖ్యమైన భాగాలు
“క్రీస్తునందు” ఉండుట అనే మాటకు పౌలు చెప్పుచున్న అర్థము ఏమిటి?
“క్రీస్తునందు” అనే పదము మరియు ఆ పదానికి సంబంధించిన ఇతర పదాలు 3:24; 6:11,23; 8:1,2,39; 9:1; 12:5,17;15:17 మరియు 16:3,7,9,10 వచనములలో కూడా కనిపిస్తాయి. క్రైస్తవ విశ్వాసులు యేసు క్రీస్తుకు సంబంధించినవారని తెలియజెప్పుటకు పౌలు ఈ మాటలన్నిటిని రూపకఅలంకారముగా ఉపయోగించుచున్నాడు. క్రీస్తుకు సంబంధించినవారుగా ఉండడం అనగా క్రీస్తును నమ్మిన విశ్వాసి రక్షించబడియున్నాడని మరియు దేవునితో స్నేహములో శాశ్వతముగా ఉన్నాడని అర్థము. ఏది ఏమైనా , ఈ ఆలోచనను అనేక భాషలలో స్పష్టముగా చెప్పడం క్లిష్టతరమే.
పౌలు ఆ వాక్యములన్నిటిని ఒక నిర్థిష్టమైన వాక్యభాగములో ఎలా ఉపయోగించియున్నడనే దాని మీద ఈ మాటలకు ఒక ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, 3:24లో (క్రిస్తునందున్న విమోచనము”), “ఎందుకంటే” యేసు క్రీస్తునుబట్టి మనము విమోచించబడియున్నామని పౌలు సూచించుచున్నాడు. 8:9 వచనములో (“మీరు శరీరములో లేరుగాని ఆత్మలో ఉన్నారు”), విశ్వాసులు పరిశుద్దాత్మకు సమర్పించుకొనియున్నారని పౌలు మాట్లాడియున్నాడు. 9:1 వచనములో (“క్రీస్తునందున్న సత్యమును నేను చెప్పుచున్నాను”), ఇక్కడ పౌలు యొక్క అర్థము ఏమిటంటే యేసు క్రీస్తుతో చేయబడిన “ఒడంబడిక” సత్యమును ఆయన చెప్పుచున్నాడని అర్థము.
అయినప్పటికీ, యేసు క్రీస్తుతో(మరియు (పరిశుద్ధాత్మతో) ఏకమైయున్నామనే ప్రాథమికమైన ఆలోచన ఈ వాక్యభాగములన్నిటిలో కనిపిస్తుంది. అందుచేత, “నందు లేక లో” అనే క్రియాపదమును ఉపయోగించబడిన అనేక వాక్యభాగములలో తర్జుమాదారుడు స్వేచ్చను కలిగియున్నాడు. “లో లేక నందు” అనే క్రియాపదముకుగల తక్షణ ఆలోచనను తెలియజెప్పుటకు అనేకమార్లు అతను “అందునుబట్టి,” “ఆ ప్రకారము,” లేక “దానికి సంబంధించి” అని తెలియజెప్పుటకు నిర్ణయించుకొనియున్నాడు. అయితే, “ఏకమైయున్నాము” అనే అర్థమును ఇవ్వగలిగే తక్షణ భావమును సూచించే పదమునుగాని లేక వాక్యమునుగాని తర్జుమాదారుడు ఎన్నుకోవాలి. (చూడండి: క్రీస్తులో, యేసులో, ప్రభువునందు, ఆయనలో)
యుఎల్.టి(ULT) లోని రోమా పత్రికలో “పరిశుద్ధత,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధులైనవారు,” మరియు “పవిత్రీకరణ” అనే పదాలు ఎలా సూచించబడియున్నాయి?
ఇతర విభిన్నమైన ఆలోచనలను సూచించుటకు లేఖనములు అటువంటి పదాలను ఉపయోగిస్తాయి. ఈ కారణముచేత, తర్జుమాదారులు తమ తమ భాషలలో వాటిని చక్కగా స్పష్టతగా తెలియజెప్పడానికి వాటిని తర్జుమా చేయడం తర్జుమాదారులకు అనేకమార్లు ఇబ్బందిగానే ఉంటుంది. ఆంగ్లములోని తర్జుమా చేసేతప్పుడు యుఎల్.టి(ULT) ఈ క్రింది సూత్రాలను లేక నియమాలను అనుసరిస్తుంది:
- కొన్నిమార్లు వాక్యభాగములోని అర్థము నైతిక పరిశుద్ధతను తెలియజేస్తుంది. విశేషముగా సువార్తను అర్థము చేసికొనుట ప్రాముఖ్యము, క్రైస్తవులు యేసు క్రీస్తుతో ఏకమైయున్నందున దేవుడు వారిని పాపరహిత ప్రజలుగా చూచుచున్నడనే సత్యమును వ్యక్తము చేయుటకు “పరిశుద్ధత” అనే పదమును ఉపయోగించడమైనది. దేవుడు పరిపూర్ణుడు మరియు ఏ దోషములేనివాడనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధుడు” అనే పదము ఉపయోగించబడియున్నది. మూడవ వాస్తవం ఏమనగా క్రైస్తవులు కూడా తమ్మును తాము తమ జీవితములలో నిందారహితులుగా, దోషములేనివారుగా ఉండాలనే ఆలోచనను వ్యక్తము చేయుటకు “పరిశుద్ధులు” అనే పదమును ఉపయోగించియున్నారు. ఇటువంటి సందర్భాలలో యుఎల్.టి(ULT) తర్జుమాలో “పరిశుద్ధత,” “పరిశుద్ధుడైన దేవుడు,” “పరిశుద్ధులు,” లేక “పరిశుద్ధ ప్రజలు” అనే పదాలను ఉపయోగించియున్నది. (చూడండి: 1:7)
- కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము సాధారణముగా క్రైస్తవులను సూచించుచును, ఇక్కడ వారు ఎటువంటి పాత్రను పోషించనవసరము లేదు. ఇటువంటి సందర్భాలలో ఆంగ్ల భాష అనువాదం లో, సాధువులు లేక పరిశుద్దులు అనే పదమును యుఎల్.టి(ULT) “విశ్వాసి” లేక “విశ్వాసులు” అని ఉపయోగిస్తుంది. (చూడండి: 8:27; 12:13; 15:25,26,31; 16:2,15) *కొన్నిమార్లు వాక్యభాగములో అర్థము దేవునికే ప్రతిష్టించిన వస్తువునుగాని లేక ఒకరినిగూర్చిగాని తెలియజేయును. ఇటువంటి సందర్భాలలో, యుఎల్.టి (ULT) “ప్రత్యేకించుట,” “ప్రతిష్టించుట,” లేక “ప్రత్యేకించి సమర్పించుట” అనే పదాలను ఉపయోగించును. (చూడండి: 15:16)
తర్జుమాదారులు ఈ ఆలోచనలన్నియు తమ స్వంత అనువాదములలో ఎలా చెప్పాలనేదానినిగూర్చి తర్జుమాదారులు ఆలోచించే విధముగానే యుఎస్.టి(UST) ఎల్లప్పుడూ సహాయకరముగా ఉంటుంది.
రోమా పత్రికలోని క్లిష్ట వాక్యభాగములు ఏమిటి?
ఈ క్రిందనున్న వచనముల విషయములో బైబిలు యొక్క ఆధునిక తర్జుమా పాత తర్జుమాలతో విభేధిస్తాయి. యుఎల్.టి(ULT) లో ఆధునిక తర్జుమాను కలిగియుంటుంది మరియు పాత తర్జుమా పేజి క్రింది భాగములో ఉంటుంది.
- “మంచి కొరకే ఆయన (దేవుడు) సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు” (8:28). కొన్ని పాత తర్జుమాలలో, “మంచి కొరకే సమస్తమును జరుగుచున్నవి.”
- “ఇది కేవలము కృప ద్వారానేగాని క్రియల ద్వారా కాదు. ఇలా కాకపోయినట్లయితే, కృప ఎప్పటికి కృపగా ఉండేది కాదు” (11:6). కొన్ని పాత తర్జుమా లలో ఈ విధముగా ఉంటుంది: “క్రియల ద్వారా అయినట్లయితే, అది కృప అనిపించుకోదు: లేకపొతే క్రియ క్రియగా ఉండేది కాదు.”
ఈ క్రిందనున్న వాక్యము బైబిలుకు సంబంధించిన పురాతన ఉత్తమ మూల ప్రతులకు సంబంధించినది కాదు. ఈ వాక్యమును చేర్చవద్దని తర్జుమాదారులకు సలహా ఇవ్వడమైనది. తర్జుమాదారులు తమ ప్రాంతములలో రెండవ అనువాదమును కలిగియున్నట్లయితే, వారు దానినే ఇక్కడ ఎన్నుకొని చేర్చుకొనవచ్చును. ఒకవేళ తర్జుమాదారులు రెండవ తర్జుమానే ఎన్నుకున్నట్లయితే ఆ మాటలు రోమీయులకు వ్రాసిన పత్రికయొక్క మూల ప్రతిలో ఉండకపోవచ్చని చెప్పుటకు వాటిని చదరపు ఆకార బ్రాకెట్లలో పెట్టాలి ([]).
- “మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్” (16:24)
(చూడండి: మూల గ్రంథం వైవిధ్యాలు)
Romans 1
రోమా 01 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
మొదటి వచనము పుస్తకమును పరిచయము చేయుటకు ఒక విధానమైయున్నది. పురాతన మధ్యధరా ప్రాంతములోని ప్రజలు అనేకమార్లు తమ పత్రికలను ఈ విధానములోనే వ్రాసియుండిరి. కొన్నిమార్లు ఇది “వందన వచనములు” అని కూడా పిలువబడెను.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు
సువార్త
ఈ అధ్యాయము “సువార్త”వలె రోమీయులకు వ్రాసిన పుస్తకముయొక్క విషయ సూచికలను సూచించుచున్నది ([రోమా.1:2] (../../rom/01/02.md)). రోమా పత్రిక ఇతర మత్తయి, మార్కు, లూక మరియు యోహాను పత్రికలవలె సువార్త పత్రిక కాదు. అయితే, 1-8 అధ్యాయాలు వాక్యానుసారమైన సువార్తను తెలియజేయుచున్నవి: ప్రతియొక్కరు పాపము చేసియున్నారు. మన పాపముల కొరకు యేసు మరణించియున్నాడు. ఆయనయందు మనము క్రొత్త జీవము కలిగియుండునట్లు ఆయన తిరిగి బ్రతికించబడెను.
ఫలము
ఈ అధ్యాయము ఫలముకు సంబంధించిన ఊహా చిత్రమును ఉపయోగించుచున్నది. ఫలముకు సంబంధించిన చిత్రము సహజముగా విశ్వాసము కలిగియున్న వ్యక్తి తన జీవితములో మంచి ఫలములు ఫలించుటను సూచించుచున్నది. ఈ అధ్యాయములో, ఈ పదము రోమా క్రైస్తవుల మధ్యలో పౌలు పనికి తగ్గ ఫలములను సూచించుచున్నది. (చూడండి: ఫలం, ఫలవంతం, నిష్ఫలమైన మరియు విశ్వాసం మరియు నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత)
సార్వత్రిక శిక్ష మరియు దేవుని ఉగ్రత
ప్రతియొక్కరూ శిక్షకు అర్హులేనని ఈ అధ్యాయము వివరించుచున్నది. మన చుట్టూ ఉన్నటువంటి సృష్టియంతటి ద్వారా నిజ దేవుడైన యెహోవాను గూర్చి మనము తెలుసుకొనియున్నాము. మనము చేసిన పాపములను బట్టి మరియు మన పాప స్వభావమునుబట్టి ప్రతి వ్యక్తి దేవుని ఉగ్రతకు పాత్రుడైయున్నాడు. యేసునందు విశ్వసించువారందరికొరకు సిలువ మీద యేసు మరణించుట ద్వారా ఈ ఉగ్రత చల్లార్చబడియున్నది. (చూడండి: విశ్వసించు, విశ్వాసి, నమ్మకం, అవిశ్వాసి, అవిశ్వాసం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు
“దేవుడు వారికి ఇచ్చెను”
”దేవుడు వారికి ఇచ్చెను” మరియు “వారు పైకి లేచుటకు దేవుడు వారికి ఇచ్చెను” అనే మాటలను అనేకమైన పండితులు వేదాంతపరముగా చాలా ప్రాముఖ్యమైన మాటలుగా ఎంచుదురు. ఈ కారణముచేత, దేవుడు పరోక్షముగా పనిచేస్తున్నాడనే ఆలోచనతో ఈ మాటలన్నిటిని తర్జుమా చేయడం చాలా ప్రాముఖ్యము. మనుష్యులు తమ ఇచ్చలను నెరవేర్చుకొనుటకు దేవుడు అనుమతిస్తాడు, ఎందుకంటే ఆయన ఎవరిని బలవంతము చేయడు. (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగములు
క్లిష్టమైన వాక్యములు మరియు అంశములు
ఈ అధ్యాయములో అనేకమైన క్లిష్ట వాక్యములను కలిగియున్నది. ఈ అధ్యాయములో పౌలు వ్రాసిన మాటలను తర్జుమా చేయడము అంత సులభము కాదు. తర్జుమాదారుడు వాక్యముల అర్థమును గ్రహించుటకు యుఎస్.టి(UST) ని ఉపయోగించవలసియుంటుంది. ఈ వాక్యములను ఎక్కువ స్వేచ్చగా తర్జుమా చేయనవసరము కూడా ఉంటుంది. కొన్ని క్లిష్టమైన వాక్యములు కూడా ఉంటాయి: “విశ్వాస సంబంధమైన విధేయత,” “ఆత్మలో నేను సేవించుచున్న వ్యక్తి,” “విశ్వాసమునుండి విశ్వాసముకు” మరియు “అక్షయమైన దేవుని మహిమ క్షయమైన మనిషి రూపములోనికి మార్చబడుట.”
Romans 1:1
Παῦλος
పత్రిక యొక్క గ్రంథకర్తను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక విశేషమైన పధ్ధతి ఉండవచ్చు. పౌలు ఈ పత్రికను ఎవరికి వ్రాస్తున్నాడో ఆ ప్రజలు ఎవరోనని ఈ వచనములో మీరు చెప్పవలసిన అవసరత ఉన్నది ([రోమా.1:7] (./07.md). ప్రత్యామ్నాయ అనువాదము: “పౌలు అను నేను ఈ పత్రికను వ్రాయుచున్నాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κλητὸς ἀπόστολος, ἀφωρισμένος εἰς εὐαγγέλιον Θεοῦ
మీరు దీనిని క్రియాశీల రూపములో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నన్ను అపొస్తలుడిగా పిలిచాడు మరియు సువార్త గురించి ప్రజలకు చెప్పడానికి నన్ను ఎన్నుకున్నాడు” (చూడండి : కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం) (చూడండి: @)
κλητὸς
దీనికి దేవుడు ఎన్నుకొనియున్నాడని లేక ఆయన పిల్లలుగా ఉండుటకు, ఆయన సేవకులుగా ఉండుటకు మరియు యేసు ద్వారా తన రక్షణ సందేశమును ప్రకటించువారుగా ఉండుటకు ప్రజలను ఎన్నుకొనియున్నాడని అర్థమునైయున్నది.
Romans 1:2
ὃ προεπηγγείλατο διὰ τῶν προφητῶν αὐτοῦ ἐν Γραφαῖς ἁγίαις
అతను తన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని తన ప్రజలతో దేవుడు వాగ్ధానము చేసియుండెను. ఈ వాగ్ధానములన్నియు లేఖనములో వ్రాయమని ఆయన తన ప్రవక్తలతో చెప్పియుండెను.
Romans 1:3
περὶ τοῦ Υἱοῦ αὐτοῦ
ఇది “దేవుని సువార్తను” సూచించుచున్నది, శుభవార్త ఏమనగా దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించుటకు వాగ్ధానము చేసియుండెను.
τοῦ Υἱοῦ
దేవుని కుమారుడు అనేది యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
τοῦ γενομένου ἐκ σπέρματος Δαυεὶδ κατὰ σάρκα
“శరీరము” అనే పదము ఇక్కడ భౌతిక శరీరమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “భౌతిక స్వభావమును బట్టి దావీదు సంతానమైన” లేక “దావీదు కుటుంబములో జన్మించినవాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 1:4
బోధించుటకు తన బాధ్యతను గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు.
τοῦ ὁρισθέντος Υἱοῦ Θεοῦ ἐν δυνάμει
“ఆయన” అనే పదము యేసు క్రీస్తును సూచించుచున్నది. దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆయనను తన కుమారునిగా ఉండుటకు తన అధికారముతో ప్రకటించెను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐξ ἀναστάσεως νεκρῶν
మరణించిన ప్రజలలోనుండి ఆయనను పైకి లేపుట ద్వారా. ఈ మాట భూమి క్రింద చనిపోయినవారందరిని గూర్చి మాట్లాడుచున్నది, మరియు తిరిగి సజీవుడుగా పైకి రావడమనేది వారి మధ్యలోనుండి పునరుత్థానమైనదానిని గూర్చి మాట్లాడుచున్నది.
Πνεῦμα ἁγιωσύνης
ఇది పరిశుద్ధాత్ముని సూచించుచున్నది.
Romans 1:5
ἐλάβομεν χάριν καὶ ἀποστολὴν
దేవుడు పౌలు అపొస్తలుడుగా ఉండే వరమును ప్రసాదించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను అపొస్తలుడుగా ఉండునట్లు దేవుడు చేసెను. ఇది ఒక ప్రత్యేకమైన ధన్యతయైయున్నది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
εἰς ὑπακοὴν πίστεως ἐν πᾶσιν τοῖς ἔθνεσιν ὑπὲρ τοῦ ὀνόματος αὐτοῦ
పౌలు ఇక్కడ “నామము” అనే పదమును యేసును సూచించుటకు పర్యాయ పదముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనయందు వారు ఉంచిన విశ్వాసమును బట్టి సమస్త దేశములవారు విధేయత చూపే క్రమములో” (చూడండి: అన్యాపదేశము)
Romans 1:7
πᾶσιν τοῖς οὖσιν ἐν Ῥώμῃ, ἀγαπητοῖς Θεοῦ, κλητοῖς ἁγίοις
దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ప్రజలుగా ఉండుటకు ఎన్నుకొనిన మరియు దేవుడు ప్రేమించిన రోమాలోని ప్రజలందరికి నేను ఈ పత్రికను వ్రాయుచున్నాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
χάρις ὑμῖν καὶ εἰρήνη
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మీకు కృపను మరియు సమాధానమును అనుగ్రహించునుగాక” లేక “దేవుడు మిమ్మును దీవించి, అంతరంగ సమాధానమును అనుగ్రహించునుగాక” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Θεοῦ Πατρὸς ἡμῶν
“తండ్రి” అనే పదము దేవునికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
Romans 1:8
ὅλῳ τῷ κόσμῳ
ప్రపంచము పౌలుకు మరియు తన చదువరులకు తెలుసు మరియు వారు రోమా సామ్రాజ్యములో ప్రయాణము చేసియుండిరి.
Romans 1:9
μάρτυς γάρ μού ἐστιν ὁ Θεός
పౌలు వారికొరకు ఎడతెగక ప్రార్థన చేయుచున్నాడని మరియు అతను ప్రార్థన చేయుచున్నదానిని దేవుడు చూస్తున్నాడని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. “కొరకు” అనే పదము అనేకమార్లు తర్జుమా చేయకుండానే వదిలిపెట్టబడుతుంది.
ἐν τῷ πνεύματί μου
ఒక వ్యక్తి ఆత్మ అనేది అతనిలో ఒక భాగమైయున్నది, అది దేవునిని తెలుసుకొనవచ్చును మరియు ఆయనయందు విశ్వసించవచ్చును.
τῷ εὐαγγελίῳ τοῦ Υἱοῦ αὐτοῦ
పరిశుద్ధ గ్రంథముయొక్క శుభవార్త (సువార్త) ఏమనగా లోక రక్షకునిగా దేవుని కుమారుడు తనను తాను అప్పగించుకొనియున్నాడు.
Υἱοῦ
దేవుని కుమారుడు అనేది యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
μνείαν ὑμῶν ποιοῦμαι
మిమ్మును గూర్చి నేను దేవునితో మాట్లాడుచున్నాడు
Romans 1:10
πάντοτε ἐπὶ τῶν προσευχῶν μου, δεόμενος εἴ…ποτὲ εὐοδωθήσομαι…ἐλθεῖν πρὸς ὑμᾶς.
ప్రార్థించిన ప్రతిమారు నేను దేవునిని అడుగుతాను... మిమ్మును దర్శించాలని కోరుకొనుచున్నాను.
εἴ πως
దేవుడు అనుమతించే ఏ విధానములోనైనా
ποτὲ
చివరిగా లేక “తుదకు”
ἐν τῷ θελήματι τοῦ Θεοῦ
దేవుడు దానిని ఇష్టపడుచున్నందున
Romans 1:11
చెరలోనున్న పౌలు వారిని చూడాలనే ఆశను తెలియజెప్పుట ద్వారా రోమాలోని ప్రజలతో పౌలు మాట్లాడుటను కొనసాగించుచున్నాడు.
ἐπιποθῶ γὰρ ἰδεῖν ὑμᾶς
ఎందుకంటే నేను మిమ్మును చూడాలని ఎంతగానో ఆశించుచున్నాను
τι…χάρισμα…πνευματικὸν, εἰς τὸ στηριχθῆναι ὑμᾶς
పౌలు రోమాలోనున్న క్రైస్తవులను ఆత్మీయముగా బలపరచాలని కాంక్షించాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఆత్మీయముగా ఎదగడానికి వరము ఉపయోగపడుతుంది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 1:12
τοῦτο δέ ἐστιν συνπαρακληθῆναι ἐν ὑμῖν, διὰ τῆς ἐν ἀλλήλοις πίστεως, ὑμῶν τε καὶ ἐμοῦ
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసునందు విశ్వాసమును ఉంచుట మూలమున మనము మన అనుభవములను పంచుకొనుట ద్వారా మనలో ఒకరికొకరము ప్రోత్సహించుకోవాలని కోరుచున్నాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 1:13
οὐ θέλω…ὑμᾶς ἀγνοεῖν
ఈ సమాచామును వారు తెలుసుకోవాలని పౌలు కోరినట్లుగా పౌలు నొక్కి చెప్పుచున్నాడు. మీరు ఈ ద్వంద్వ అనానుకూల మాటను అనుకూల రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దీనిని తెలుసుకోవాలని నేను కోరుచున్నాను” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ἀδελφοί
ఇక్కడ దీనికి తోటి క్రైస్తవులని అర్థము, ఇందులో స్త్రీ పురుషులిరువురు ఉంటారు.
καὶ ἐκωλύθην ἄχρι τοῦ δεῦρο
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎదో ఒకటి నన్ను ఎప్పుడూ అడ్డుకుంటుంది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἵνα τινὰ καρπὸν σχῶ καὶ ἐν ὑμῖν
“ఫలము” అనే పదము ఇక్కడ సువార్తను నమ్మాలని పౌలు కోరుకునే రోమాలోని ప్రజలను సూచించే రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ మధ్యనున్న అనేకమంది ప్రజలు యేసునందు విశ్వసించాలి” (చూడండి: రూపకం)
τοῖς λοιποῖς ἔθνεσιν
ఆయన ప్రయాణము చేసిన ఇతర ప్రాంతాలలోని అన్యులు
Romans 1:14
τε…ὀφειλέτης εἰμί
“రుణపడి” అనే రూపకఅలంకారపు పదమును ఉపయోగించి, అతను దేవునికి ఆర్థికముగా రుణపడియున్నట్లుగా దేవునిని సేవించే తన కర్తవ్యమునుగూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను తప్పకుండగ సువార్తను ప్రకటించవలసియున్నది” (చూడండి: రూపకం)
Romans 1:16
οὐ…ἐπαισχύνομαι τὸ εὐαγγέλιον
దీనిని మీరు అనుకూలమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను సంపూర్ణముగా సువార్తయందు నమ్మికయుంచుచున్నాను” (చూడండి: ద్వంద్వ నకారాలు)
δύναμις…Θεοῦ ἐστιν εἰς σωτηρίαν παντὶ τῷ πιστεύοντι
ఇక్కడ “నమ్ముట” అనే పదముకు ఒక వ్యక్తి క్రిస్తునందు తన నమ్మకమును ఉంచుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తునందు నమ్మికయుంచువారినందరిని సువార్త ద్వారా దేవుడు శక్తియుతముగా రక్షించువాడైయున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Ἰουδαίῳ τε πρῶτον καὶ Ἕλληνι
యూదా ప్రజలు మరియు గ్రీకు ప్రజలు
τε πρῶτον
ఇక్కడ “మొదట” అనే పదముకు కాలానుగుణముగా అన్నిటికంటే ముందుగా వచ్చేది.
Romans 1:17
γὰρ…ἐν αὐτῷ
ఇక్కడ “దాని” అనే పదము సువార్తను సూచించుచున్నది. పౌలు సువార్తను సంపూర్ణముగా ఎందుకు నమ్ముచున్నాడో వివరించుచున్నాడు.
δικαιοσύνη…Θεοῦ…ἀποκαλύπτεται, ἐκ πίστεως εἰς πίστιν
దేవుడు ప్రజలకు భౌతికముగా చూపించే ఒక వస్తువన్నట్లుగా పౌలు సువార్త సందేశమునుగూర్చి మాట్లాడుచున్నాడు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు ఆరంభమునుండి అంతమువరకు నీతిమంతులుగా మార్చబడేది కేవలము విశ్వాసము ద్వారానే అని దేవుడు మనకు తెలియజెప్పుచున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καθὼς γέγραπται
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో ఎవరో ఒకరు వ్రాసియున్నట్లుగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ…δίκαιος ἐκ πίστεως ζήσεται.
ఇక్కడ “నీతిమంతుడు” అనే పదము దేవునియందు నమ్మికయుంచిన వారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మికయుంచిన ప్రజలను దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు, మరియు వారు సదాకాలము జీవించుచూ ఉంటారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 1:18
ఒక పాప సంబంధమైన మనిషిపట్ల దేవుని కోపము ఎంత భయంకరముగా ఉన్నదని పౌలు బయలుపరచుచున్నాడు.
ἀποκαλύπτεται γὰρ ὀργὴ Θεοῦ
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఎంత కోపముగా ఉన్నాడో చూపించుచున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
γὰρ
[రోమా.1:17] (../01/17.md) వచనములో పౌలు చెప్పిన విషయమును ప్రజలు ఎందుకు తెలుసుకోవాలనే దానిని గూర్చి అతను చెప్పుటకు “కొరకు” అనే పదమును పౌలు ఉపయోగించుచున్నాడనేది నిజము.
ἀποκαλύπτεται…ὀργὴ Θεοῦ ἀπ’ οὐρανοῦ, ἐπὶ πᾶσαν ἀσέβειαν καὶ ἀδικίαν ἀνθρώπων
“భక్తిహీనత” మరియు “దుర్నీతి” అనే పదాలు ప్రజలను సూచించుటకు “అదైవికత్వము” మరియు వారి క్రియలను సూచించుటకు “అనీతి” అనే విశేషణాలను ఉపయోగిస్తు వ్యక్తీకరించే సారాంశ నామవాచకములైయున్నవి. ఈ నామవాచకములన్నియు దేవుడు ఎవరి మీద కోపపడుచున్నాడో ఆ ప్రజల కొరకు ఉపయోగించిన పర్యాయపదములైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ప్రజల మీద ఎంత కోపము కలిగియున్నాడోన్న విషయమును ఆయన పరలోకమునుండే బయలుపరచుచున్నాడు ఎందుకంటే వారు భక్తిహీనులు మరియు దుర్నీతి క్రియలను చేయుచున్నారు” (చూడండి: భావనామాలు మరియు అన్యాపదేశము)
τὴν ἀλήθειαν…κατεχόντων
ఇక్కడ “సత్యము” అనే పదము దేవునిని గూర్చిన నిజమైన సమాచారమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని గూర్చిన నిజమైన సమాచారమును దాచియుంచుట” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 1:19
τὸ γνωστὸν τοῦ Θεοῦ, φανερόν ἐστιν ἐν αὐτοῖς
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు సాధారణముగా చూసే దానినిబట్టి వారు దేవుని గూర్చి తెలుసుకొనవచ్చును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ Θεὸς γὰρ αὐτοῖς ἐφανέρωσεν
ఇక్కడ “వారికి కనబడుతూనే ఉంది” అనే మాటకు దేవుడు తనను గూర్చిన సత్యమును వారికి చూపించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తనను తాను బయలుపరచుకొనియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 1:20
τὰ γὰρ ἀόρατα αὐτοῦ ἀπὸ κτίσεως κόσμου, τοῖς ποιήμασιν νοούμενα, καθορᾶται
ప్రజలు దేవుని గుణలక్షణములను చూసినట్లుగా దేవుని అదృశ్య గుణగణాలను ప్రజలు ఎంతవరకు అర్థము చేసుకున్నారనేదానిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు దేవుని అదృశ్యమైన గుణగణాలను, ఆయన నిత్యత్వ శక్తిని మరియు దైవిక స్వభావమును అర్థము చేసికొనియున్నారు” (చూడండి: రూపకం)
θειότης
దేవుని గుణగణాలు మరియు అర్హతలన్నియు లేక “ఆయనను దేవునిగా చేసే దేవునిని గూర్చిన విషయములు”
κόσμου
ఇది ఆకాశములను మరియు భూమిని మరియు వాటియందున్న సమస్తమును సూచించుచున్నది.
τοῖς ποιήμασιν
దీనిని క్రియాత్మక రూపములో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు చేసిన సమస్తమునుబట్టి” లేక “దేవుడు చేసిన సమస్త సృష్టిని ప్రజలు చూసినందున” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὸ εἶναι αὐτοὺς ἀναπολογήτους
వారికి తెలియదని ఈ ప్రజలు ఎప్పుడును చెప్పరు
Romans 1:21
ἐματαιώθησαν ἐν τοῖς διαλογισμοῖς αὐτῶν
దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మూర్ఖముగా ఆలోచించుటకు ఆరంభించిరి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐσκοτίσθη ἡ ἀσύνετος αὐτῶν καρδία
ఇక్కడ “చీకటి” అనే పదము ప్రజల బుద్ధిహీనతను సూచించుటకు రూపకఅలంకారముగా వాడబడిన పదము. ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక వ్యక్తి మనస్సును లేక అంతరంగ స్వభావముకు పర్యాయముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ఏమి తెలుసుకోవాలని దేవుడు కోరియున్నాడనే దానిని వారు అర్థము చేసుకోలేకపోయిరి” (చూడండి: రూపకం)
Romans 1:22
φάσκοντες εἶναι σοφοὶ, ἐμωράνθησαν
వారు జ్ఞానులని ప్రకటించుకొనుచున్న సమయములో వారు మూర్ఖులుగా మారిపోయిరి
φάσκοντες
[రోమా.1:18] (../01/18.md) వచనములోని ప్రజలు
Romans 1:23
ἤλλαξαν τὴν δόξαν τοῦ ἀφθάρτου Θεοῦ
దేవుడు మహిమాన్వితుడని మరియు ఆయన ఎప్పటికి మరణించడనే సత్యమును మార్చారు లేక “దేవుడు మహిమగలవాడని మరియు ఆయన ఎన్నటికి మరణించేవాడు కాదనే దానిని నమ్ముటను నిలిపివేశారు”
ἐν ὁμοιώματι εἰκόνος
దానికి బదులుగా వారు విగ్రహములను ఆరాధించుటను ఎన్నుకొనియున్నారు
φθαρτοῦ ἀνθρώπου
మనుష్యులు మరణిస్తారు
πετεινῶν, καὶ τετραπόδων, καὶ ἑρπετῶν
లేక అవి పక్షులవలె, నాలుగు పాదములు కలిగిన జంతువులవలె, లేక భూమి మీద ప్రాకే జంతువులవలె ఉన్నవి
Romans 1:24
διὸ
నేను చెప్పిన ప్రతీది సత్యమైనందువలన
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς ἐν
వారు తమ్మును తాము అపవిత్రపరచుకొనుటకు దేవుడు అనుమతించాడు
αὐτοὺς…αὐτῶν…αὐτοῖς;
ఈ మాటలన్నియు [రోమా.1:18] (../01/18.md) వచనము యొక్క “మానవాళిని” సూచించుచున్నాయి.
ταῖς ἐπιθυμίαις τῶν καρδιῶν αὐτῶν εἰς ἀκαθαρσίαν
ఇక్కడ “హృదయముల దురాశలు” అనే మాట వారు చేయాలనుకున్న దుష్ట క్రియలను సూచించుటకు ఉపలక్షణముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు నైతికముగా అపవిత్రములైనవాటిని చేయాలని ఆశపడియున్నారు” (చూడండి: ఉపలక్షణము)
τοῦ ἀτιμάζεσθαι τὰ σώματα αὐτῶν ἐν αὐτοῖς
వారు అనైతిక లైంగిక చర్యలకు పాల్పడ్డారని చెప్పుటకు అర్థమిచ్చే ఒక సభ్యోక్తియైయున్నది. మీరు దీనిని ఒక క్రియాత్మకముగా అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు లైంగికపరమైన అనైతిక చర్యలకు మరియు తప్పుడు పనులకు పాల్పడ్డారు” (చూడండి: సభ్యోక్తి మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 1:25
οἵτινες
ఈ మాట [రోమా.1:18] (../01/18.md) వచనములోని “మానవాళిని” సూచించుచున్నది.
ἐσεβάσθησαν καὶ ἐλάτρευσαν τῇ κτίσει
ఇక్కడ “సృష్టి” అనే పదము దేవుడు సృష్టించినవాటిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు సృష్టించిన వాటిని వారు ఆరాధించిరి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
παρὰ
దానికి బదులుగా
Romans 1:26
διὰ τοῦτο
విగ్రహారాధన మరియు లైంగికపరమైన పాపములనుబట్టి
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς εἰς
అపవిత్రులగుటకు దేవుడు వారికి అనుమతించెను
πάθη ἀτιμίας
సిగ్గుకరమైన లైంగిక ఆశలు లేక కోరికలు
αἵ τε γὰρ θήλειαι αὐτῶν
వారి స్త్రీలనుబట్టి
μετήλλαξαν τὴν φυσικὴν χρῆσιν εἰς τὴν παρὰ φύσιν
“అస్వాభావికమైన” సంబంధములుగల ఆలోచన అనేది అనైతిక లైంగికతకొరకు వాడే సభ్యోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తయారుచేయని విధానములో లైంగికతను అభ్యసించుటను ప్రారంభించిరి” (చూడండి: సభ్యోక్తి)
Romans 1:27
καὶ…ἄρσενες ἀφέντες τὴν φυσικὴν χρῆσιν τῆς θηλείας
ఇక్కడ “స్వాభావికమైన సంబంధములు” అనే మాట లైంగిక సంబంధముల కొరకు వాడబడిన సభ్యోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది పురుషులు స్త్రీలతో జరిగించే స్వాభావికమైన లైంగిక కోరికను కలిగియుండుటను ఆపివేశారు” (చూడండి: సభ్యోక్తి)
ἐξεκαύθησαν ἐν τῇ ὀρέξει αὐτῶν εἰς ἀλλήλους
ఇతర పురుషుల కొరకు బలమైన లైంగిక కోరికను కలిగి అనుభవించడము
τὴν ἀσχημοσύνην κατεργαζόμενοι
వారు సిగ్గుపడవలసిన చర్యలను జరిగించిరి కాని వారు సిగ్గునొందలేదు
ἄρσεσιν…καὶ τὴν ἀντιμισθίαν ἣν ἔδει τῆς πλάνης αὐτῶν, ἐν ἑαυτοῖς ἀπολαμβάνοντες
పురుషులు, మరియు వారు చేసిన నీచ కార్యముల కొరకు దేవుడు వారిని శిక్షించెను
πλάνης
నైతికమైన తప్పిదము, సత్యాలను గూర్చిన తప్పిదము కాదు
Romans 1:28
καὶ καθὼς οὐκ ἐδοκίμασαν, τὸν Θεὸν ἔχειν ἐν ἐπιγνώσει
దేవునిని తెలుసుకోవడం అవసరమని వారు ఆలోచించలేకపోయిరి
αὐτοὺς
ఈ మాట [రోమా.1:18] (../01/18.md) వచనములోని “మానవాళిని” సూచించుచున్నది.
παρέδωκεν αὐτοὺς ὁ Θεὸς εἰς ἀδόκιμον νοῦν
ఇక్కడ “చెడు మనస్సు” అనే మాటకు అనైతిక విషయాలను గూర్చి ఆలోచించే మనస్సు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పనికిరాని, అనైతికమైన ఆలోచనలతో నింపబడిన వారి చెడు మనస్సులు వారిని సంపూర్ణముగా నియంత్రించుటకు దేవుడు అనుమతించెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
μὴ καθήκοντα
చెడు లేక “పాపసంబంధమైన”
Romans 1:29
πεπληρωμένους
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తమ హృదయములో బలమైన కోరికను కలిగియున్నారు” లేక “క్రియలను చేయుటకు వారు బలమైన కోరికను కలిగియుండిరి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
μεστοὺς φθόνου, φόνου, ἔριδος, δόλου, κακοηθείας
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది ఇతర ప్రజలను చూసి అసూయ పడుతూ ఉంటారు... అనేకమంది ఇతరులను హత్య చేయాలని ఆశ కలిగియుంటారు... ప్రజల మధ్యలో వాదనలను మరియు గొడవలను పెట్టుకోవాలని కోరిక కలిగియుంటారు... ఇతరులను మోసము చేయుటకు ఇష్టపడుతూ ఉంటారు... ఇతరులను గూర్చి ద్వేషపూరితముగా మాట్లాడుతూ ఉంటారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 1:30
καταλάλους
ఒక వ్యక్తికున్న గౌరవమును పోగుట్టుటకొరకు ఇతర వ్యక్తిని గూర్చి చాడీలు చెప్పేవారు.
ἐφευρετὰς κακῶν
ఇతరులపట్ల దుష్ట క్రియలను జరిగించుటకు క్రొత్త విధానాలను ఆలోచించుట
Romans 1:32
οἵτινες τὸ δικαίωμα τοῦ Θεοῦ ἐπιγνόντες
వారు ఎలా జీవించాలని దేవుడు కోరుకొనుచున్నారనేదానిని గూర్చి వారు తెలుసుకోవాలి
ὅτι οἱ τὰ τοιαῦτα πράσσοντες
ఇక్కడ “చేస్తూనే” అనే మాట చెడు క్రియలను నిరంతరముగా చేసే అలువాటును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దుష్ట క్రియలను ఎల్లప్పుడూ చేయుటకు అలువాటుపడినవారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἄξιοι θανάτου εἰσίν
చనిపోవుటకు అర్హులు
αὐτὰ
ఈ విధమైన చెడు క్రియలన్నియు
τοῖς πράσσουσιν
ఇక్కడ “చేయడం” అనే క్రియా పదము చెడు క్రియలను నిరంతరముగా చేసే అలువాటును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “చెడు క్రియలను చేయుటకు అలువాటుపడినవారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 2
రోమా 02 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
ఈ అధ్యాయము ఈ పుస్తకముయొక్క చదువరులైన రోమా క్రైస్తవులనుండి ఇతర ప్రజలకు “తీర్పు తీర్చే” ప్రజల వైపుకు మరియు యేసునందు విశ్వసించనివారి వైపుకు మరలుతుంది. (చూడండి: న్యాయాధిపతి, తీర్పు మరియు విశ్వసించు, విశ్వాసి, నమ్మకం, అవిశ్వాసి, అవిశ్వాసం)
“అందువలన మీకు క్షమాపణ”
ఈ మాట 1వ అధ్యాయమును జ్ఞాపకము చేయును. మరికొన్ని విధానములలో ఈ మాట 1వ అధ్యాయము బోధించువాటికి ముగింపు పలుకుతుంది. ఈ మాట లోకములోని ప్రతియొక్కరు నిజమైన దేవునిని ఎందుకు ఆరాధించాలనే విషయమును తెలియజేస్తుంది.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు
“ధర్మశాస్త్రమును నెరవేర్చువారు”
ధర్మశాస్త్రమునకు విధేయులగుటకు ప్రయత్నము చేయువారందరూ నీతిమంతులుగా తీర్పు తీర్చబడరు. యేసునందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా పరిగణించబడినవారందరూ దేవుని ఆజ్ఞలకు లోబడుట ద్వారా విశ్వాసము నిజమని చూపించుకోవాలి. (చూడండి: న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా/నీతిమంతులుగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం మరియు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం)
ఈ అధ్యాయములో ఎదురైయే ప్రాముఖ్యమైన అలంకార పదాలు
అలంకారిక ప్రశ్నలు
ఈ అధ్యాయములో పౌలు అనేకమైన అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. చదువరులు తమ పాపములను చూసుకోవాలని తద్వారా వారు యేసును అంగీకరించాలనేది ఈ ప్రశ్నల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఉన్నట్లుగా మనకు కనబడుచున్నది. (చూడండి: అలంకారిక ప్రశ్న,అపరాధ భావం, దోషం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం మరియు విశ్వాసం)
ఊహాత్మక పరిస్థితులు
సందర్భములో, 7వ వచనములో “ఆయన జీవమిచ్చును” అనే మాట ఊహాత్మక పరిస్థితిగా ఉన్నది. ఒక వ్యక్తి పరిపక్వమైన జీవితము కలిగియున్నప్పుడు, వారు నిత్య జీవమును బహుమానముగా సంపాదించుకొనెదరు. అయితే యేసు మాత్రమే ఆ పరిపక్వమైన జీవితమును జీవించుటకు సాధ్యమైనది.
17-29 వచనములలో పౌలు మరియొక ఊహాత్మక పరిస్థితిని ఇచ్చుచున్నాడు. ఇక్కడ మోషే ధర్మశాస్త్రమునకు విధేయులుగా ఉండుటకు మనఃపూర్వకముగా ప్రయత్నించిన వారుకూడా ఆ ధర్మశాస్త్రమును ధిక్కరించినవారుగా వారు నిందించబడియున్నారని ఇక్కడ అతడు వివరించుచున్నాడు. ఆంగ్ల భాషలో, ధర్మశాస్త్రము యొక్క “అక్షరములను” వెంబడించుచు ధర్మశాస్త్రము యొక్క “ఆత్మను” వెంబడించని వారిని గూర్చి ఇది సూచించుచున్నది. (చూడండి: ఊహాత్మక పరిస్థితులు)
ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర అనువాద ఇబ్బందులు
“తీర్పు తీర్చు నీవు”
కొన్ని సందర్భాల్లో, దీనిని సులువుగా తర్జుమా చేయవచ్చును. అయితే ఇది ఇంత ఘోరముగా తర్జుమా చేయబడడానికి కారణమేమిటంటే పౌలు “తీర్పు చేయువారు” అని చెప్పుచునే అందరు తీర్పు చేయుచున్నారని కూడా చెప్పుచున్నాడు. “తీర్పు చేయువారు (మరియు తీర్పు చేయు అందరు)” అని దీనిని అనువాదం చేసే అవకాశం కలదు.
Romans 2:1
మనుష్యులందరూ పాపమూ చేసియున్నారని ధృవీకరించియున్నాడు మరియు ప్రజలందరూ దుష్టులని జ్ఞాపకము చేయుటను పౌలు కొనసాగించుచున్నాడు.
διὸ ἀναπολόγητος εἶ
“కాబట్టి” అనే పదము ఈ పత్రికయొక్క క్రొత్త భాగాన్ని తెలియజేయుటకు వాడబడియున్నది. పౌలు రోమా.1:1-32 వచనములో చెప్పిన మాటను ఆధారము చేసుకొని ముగింపు వచనమును తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎడతెగక పాపము చేయువారిని దేవుడు శిక్షిస్తాడు, ఆయన మీ పాపములను క్షమించడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
εἶ
పౌలు అతనితో వాదించే ఒక యూదునితో మాట్లాడుచున్నట్లుగా ఆయన ఇక్కడ వ్రాయుచున్నాడు. ఎడతెగకుండగ పాపము చేయు యూదుడినిగాని లేక అన్యుడునిగాని దేవుడు శిక్షించునని పౌలు తన చదువరులకు బోధించుటకు పౌలు దీనిని ఇలా చేయుచున్నాడు. (చూడండి: అపాస్ట్రొఫీ)
εἶ
ఇక్కడ “నీవు” అనే సర్వనామము ఏకవచనమైయున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
ὦ ἄνθρωπε, πᾶς ὁ κρίνων
దేవునివలె మరియు ఇతరులను తీర్పుతీర్చువారివలె నడుచుకొనుటకు ఆలోచించు ప్రతివానిని గద్దించుటకు పౌలు ఇక్కడ “వ్యక్తి” అనే పదమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు కేవలము మానవ మాత్రుడవే, అయినను నీవు ఇతరులకు తీర్పు తీర్చుచున్నావు మరియు వారు దేవుని శిక్షకు అర్హులని చెప్పుచున్నావు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν ᾧ γὰρ κρίνεις τὸν ἕτερον, σεαυτὸν κατακρίνεις
అయితే నీవు నీకె తీర్పు తీర్చుకొనుచున్నావు ఎందుకంటే వారు చేసినట్లుగానే నీవును దుష్ట క్రియలను చేయుచున్నావు.
Romans 2:2
οἴδαμεν δὲ
ఇక్కడ “మనకు” అనే సర్వనామములో క్రైస్తవ విశ్వాసులు మరియు క్రైస్తవులు కాని యూదులు ఉండవచ్చును. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
τὸ κρίμα τοῦ Θεοῦ ἐστιν κατὰ ἀλήθειαν ἐπὶ τοὺς
ఇక్కడ “దేవుని తీర్పు” ఎల్లప్పుడూ ఉండేదిగా పౌలు మాట్లాడుచున్నాడు మరియు అది దేవుని ప్రజలపైన “పడునని” కూడా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అటువంటి ప్రజలకు దేవుడు నిజముగాను మరియు నిష్పాక్షికంగాను తీర్పు తీర్చును” (చూడండి: మానవీకరణ)
τοὺς τὰ τοιαῦτα πράσσοντας
అటువంటి దుష్ట క్రియలను చేసే ప్రజలు
Romans 2:3
λογίζῃ δὲ τοῦτο
కాబట్టి దీనిని పరిగణించండి లేక “అందుచేత, దీనిని పరిగణించండి”
λογίζῃ…τοῦτο
నేను చెప్పబోయేదానిని గూర్చి ఆలోచించండి
ἄνθρωπε
మనిషి అనే పదము కొరకు సాధారణ పదమును ఉపయోగించండి “నీవేమైయున్నావో”
ὦ ἄνθρωπε, ὁ κρίνων τοὺς τὰ τοιαῦτα πράσσοντας, καὶ ποιῶν αὐτά
నీవు అదే దుష్ట క్రియలను చేస్తూనే ఇంకొకరు దేవుని శిక్షకు పాత్రులని చెప్పుచున్న నీవు
ὅτι σὺ ἐκφεύξῃ τὸ κρίμα τοῦ Θεοῦ
ఈ సంఘటనను గూర్చి నొక్కి చెప్పుటకు ప్రశ్న రూపములో కనిపించుచున్నది. మీరు ఈ ప్రశ్నను తీసుకొని ఒక బలమైన అనానుకూల వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుని తీర్పును తప్పించుకొనజాలరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 2:4
ἢ τοῦ πλούτου τῆς χρηστότητος αὐτοῦ, καὶ τῆς ἀνοχῆς, καὶ τῆς μακροθυμίας καταφρονεῖς, ἀγνοῶν ὅτι τὸ χρηστὸν τοῦ Θεοῦ, εἰς μετάνοιάν σε ἄγει?
ఈ సంఘటనను గూర్చి నొక్కి చెప్పుటకు ప్రశ్న రూపములో కనిపించుచున్నది. మీరు ఈ ప్రశ్నను తీసుకొని ఒక బలమైన అననుకూల వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ప్రజలను శిక్షించకమునుపు ఆయన సహనముతో దీర్ఘశాంతము వహిస్తాడని మరియు ఆయన మంచివాడని తలంచి నీ ఇష్టానుసారముగా నీవు నడుచుకొనకూడదు, తద్వారా ఆయన మంచితనము వారు పశ్చాత్తాపపడుటకు కారణమగును!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τοῦ πλούτου τῆς χρηστότητος αὐτοῦ, καὶ τῆς ἀνοχῆς, καὶ τῆς μακροθυμίας καταφρονεῖς
ఆయన ఐశ్వర్యమును అప్రాముఖ్యముగా ఎంచుతావా లేక “మంచిది కాదని .... ఎంచుతావా”
ἀγνοῶν ὅτι τὸ χρηστὸν τοῦ Θεοῦ, εἰς μετάνοιάν σε ἄγει?
ఈ సంఘటనను గూర్చి నొక్కి చెప్పుటకు ప్రశ్న రూపములో కనిపించుచున్నది. మీరు ఈ ప్రశ్నను తీసుకొని ఒక బలమైన అననుకూల వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మంచివాడని ఆయన నీకు చూపించుకుంటాడని నీవు తప్పకుండగ తెలుసుకోవాలి తద్వారా నీవు తప్పకుండగా పశ్చాత్తాపపడాలి!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 2:5
సమస్త ప్రజలందరూ దుష్టులైయున్నారని ప్రజలకు జ్ఞాపకము చేయుటకు పౌలు తన వివరణను కొనసాగించుచున్నాడు.
κατὰ δὲ τὴν σκληρότητά σου καὶ ἀμετανόητον καρδίαν
రాయిలాంటి క్లిష్టమైన విషయములో దేవునికి అవిధేయత చూపించే వ్యక్తికి పోల్చి చెప్పడము కొరకు పౌలు రూపకఅలంకారమును ఉపయోగించుచున్నాడు. ఆయన ఒక వ్యక్తి యొక్క మనస్సును లేక అంతరంగమును సూచించుచుటకు “హృదయము” అనే పర్యాయ పదమును కూడా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు వినుటకు మరియు పశ్చత్తాపపడుటకు తిరస్కరించినందున” (చూడండి: రూపకం)
τὴν σκληρότητά…καὶ ἀμετανόητον καρδίαν
“పశ్చాత్తాపపడని హృదయమువలె” మీరు కలగలిపే రెట్టింపులాంటి మాట ఇది.” (చూడండి: జంటపదం)
θησαυρίζεις σεαυτῷ ὀργὴν
“పోగు చేసుకోవడం” అనే మాట ఒక వ్యక్తి తన నిధినంతటిని సమకూర్చుకొనుటను మరియు వాటిని భద్రమైన స్థలములో పెట్టుటను సహజముగా సూచించే రూపకఅలంకారమైయున్నది. నిధులకు బదులుగా ఇక్కడ ఒక వ్యక్తి దేవుని శిక్షను సమకూర్చుకొనుచున్నాడని పౌలు చెప్పుచున్నాడు. వారు పశ్చాత్తాపము లేకుండా ప్రయాణము చేయుచున్న కొలది ఎక్కువగా శిక్షను పొందుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మీ శిక్షను మరింత ఎక్కువగా చేసుకొనుచున్నారు” (చూడండి: రూపకం)
ἐν ἡμέρᾳ ὀργῆς…ἀποκαλύψεως δικαιοκρισίας τοῦ Θεοῦ
ఈ రెండు వచనములు ఒకే రోజును సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు కోపముగా ఉన్నాడని మరియు ఆయన ప్రజలందరికి న్యాయముగా తీర్పుతీర్చుచున్నాడని ఆయన ప్రతియొక్కరికి చూపించుకొనునప్పుడు” (చూడండి: జంటపదం)
Romans 2:6
ἀποδώσει
న్యాయమైన బహుమానము లేక శిక్షను ఇచ్చుటకు
ἑκάστῳ κατὰ τὰ ἔργα αὐτοῦ
ప్రతి వ్యక్తి చేసిన కార్యమునుబట్టి
Romans 2:7
ζητοῦσιν
తీర్పు దినమున దేవునినుండి అనుకూలమైన నిర్ణయమును పొందుటకు నడిపించబడే విధానములో వారు నడుచుకొనియున్నారని ఈ మాటకు అర్థమైయున్నది.
δόξαν καὶ τιμὴν καὶ ἀφθαρσίαν
దేవుడు వారిని స్తుతించాలని మరియు వారిని ఘనపరచాలని వారు కోరుకొనిరి, మరియు వారు ఎప్పటికిని చనిపోకూడదని కోరుకొనిరి.
ἀφθαρσίαν
ఇది భౌతిక క్షయమును సూచించుచున్నది గాని నైతిక క్షయమును సూచించుటలేదు.
Romans 2:8
ఈ భాగము భక్తిలేని దుష్ట వ్యక్తిని గూర్చి మాట్లాడుచున్నప్పటికిని, పౌలు ఇక్కడ యూదులు మరియు యూదేతరులు దేవుని ఎదుట దుష్ట ప్రజలేనని చెప్పుట ద్వారా సారాంశపు మాటలను పలుకుచున్నాడు.
ἐριθείας
స్వార్థము లేక “వారిని సంతోషపరిచే వాటి మీదనే వారు దృష్టి కలిగియుండిరి”
ἀπειθοῦσι τῇ ἀληθείᾳ, πειθομένοις δὲ τῇ ἀδικίᾳ
ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థమును ఇచ్చుచున్నవి. రెండవ మాట మొదటి మాటను తీవ్రతరము చేయుచున్నది. (చూడండి: సమాంతరత)
ὀργὴ καὶ θυμός
“ఉగ్రత” మరియు “మహా కోపము” అనే మాటలకు ప్రాథమికముగా ఒకే అర్థము కలదు మరియు దేవుని కోపాన్ని నొక్కి చెప్పే మాటలైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన భయంకరమైన కోపమును చూపించును” (చూడండి: జంటపదం)
ὀργὴ
ఇక్కడ “ఉగ్రత” అనే పదము దుష్ట ప్రజల విషయమై దేవుడు చూపించే భయంకరమైన శిక్షను సూచించే పర్యాయ పదమైయున్నది. (చూడండి: అన్యాపదేశము)
Romans 2:9
θλῖψις καὶ στενοχωρία, ἐπὶ
“బాధ” మరియు “వేదన” అనే పదాలకు ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుంటాయి మరియు దేవుని శిక్ష ఎంత భయంకరముగా ఉంటుందనే విషయాన్ని నొక్కి చెప్పుచున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “భయంకరమైన శిక్షలు జరుగుతాయి” (చూడండి: జంటపదం)
ἐπὶ πᾶσαν ψυχὴν ἀνθρώπου
ఇక్కడ పౌలు ఉపయోగించుచున్న “ఆత్మ” అనే పదము ఒక సంపూర్ణ వ్యక్తిని సూచించే ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి వ్యక్తి మీద” (చూడండి: ఉపలక్షణము)
τοῦ κατεργαζομένου τὸ κακόν
దుష్ట క్రియలను నిరంతరముగా చేయు వ్యక్తి
Ἰουδαίου τε πρῶτον καὶ Ἕλληνος
దేవుడు మొట్ట మొదటిగా యూదా ప్రజలకు తీర్పు తీర్చును, మరియు ఆ తరువాత యూదేతరులకు తీర్పు తీర్చును
πρῶτον
ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “సమయాన్నిబట్టి మొదటిగా” లేక 2) “చాలా ఖచ్చితంగా”
Romans 2:10
δόξα δὲ, καὶ τιμὴ, καὶ εἰρήνη, παντὶ
అయితే దేవుడు మహిమను, ఘనతను మరియు సమాధానమును అనుగ్రహిస్తాడు
τῷ ἐργαζομένῳ τὸ ἀγαθόν
మంచి క్రియలను నిరంతరముగా చేయువారు
Ἰουδαίῳ τε πρῶτον καὶ Ἕλληνι
దేవుడు మొట్ట మొదటిగా యూదులకు బహుమానములను అనుగ్రహించును, మరియు ఆ తరువాత యూదేతరులకు బహుమానములిచ్చును
πρῶτον
మీరు [రోమా.2:9] (../02/09.md) వచనములో తర్జుమా చేసిన విధముగానే మీరు ఈ మాటను తర్జుమా చేయవచ్చును.
Romans 2:11
οὐ γάρ ἐστιν προσωπολημψία παρὰ τῷ Θεῷ
మీరు అననుకూలమైన రూపములో దీనిని తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనుష్యులందరి విషయములో ఒకే విధముగా నడుచుకొనును” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Romans 2:12
ὅσοι γὰρ…ἥμαρτον
పాపము చేసినవారందరూ
ἀνόμως…ἀνόμως καὶ ἀπολοῦνται
ప్రజలకు మోషే ధర్మశాస్త్రమును గూర్చి తెలియకపోయినా పరువాలేదన్నట్లుగా నొక్కి చెప్పుటకు “ధర్మశాస్త్రములేకుండ” అనే మాటను పునరావృతం చేయుచున్నాడు. వారు పాపము చేస్తే, దేవుడు వారికి తీర్పు తీర్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము తెలియకుండుట అనేది ఖచ్చితంగా ఆత్మీయముగా చనిపోయియుండుటను సూచించుచున్నది. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὅσοι…ἥμαρτον
పాపము చేసినవారందరూ
ἐν νόμῳ…διὰ νόμου κριθήσονται
దేవుడు తన ధర్మశాస్త్ర ప్రకారముగా పాపాత్ములైన ప్రజలకు తీర్పు తీర్చును. మీరు దీనిని అనుకూలమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమును ఎరిగినవారికి, దేవుడు ధర్మశాస్త్రమునుబట్టియే తీర్పు తీర్చును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 2:13
దేవుని ధర్మశాస్త్రమునకు పరిపూర్ణమైన విధేయత దేవుని ధర్మశాస్త్రమును కలిగియుండని ప్రజలకు కూడ అవసరమైయున్నదని చదువరి తెలుసుకొనునట్లుగా పౌలు కొనసాగించుచున్నాడు.
γὰρ
అదనపు సమాచారమును చదువరికి ఇచ్చుటకు పౌలు ముఖ్య వాదనను 14 మరియు 15 వచనములు ఆటంకము కలుగజేయుచున్నవి. మీ భాషలో ఈ విధముగా ఆటంకపరిచే విధానమును కలిగియున్నట్లయితే, దానిని ఇక్కడ మీరు ఉపయోగించవచ్చును.
οὐ…οἱ ἀκροαταὶ νόμου
ఇక్కడ “ధర్మశాస్త్రము” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ధర్మశాస్త్రమును వినినవారు మాత్రమే కాకుండా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
δίκαιοι παρὰ τῷ Θεῷ
దేవుడు నీతిమంతులని పరిగణించేవారు
ἀλλ’ οἱ ποιηταὶ νόμου
అయితే ఇది మోషే ధర్మశాస్త్రముకు విధేయత చూపేవారికొరకు
δικαιωθήσονται
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అంగీకరించేవారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 2:14
ἔθνη τὰ μὴ νόμον ἔχοντα,…ἑαυτοῖς εἰσιν νόμος;
“తమకుతామే ధర్మశాస్త్రములా” అనే మాట ఒక నాన్ణుడియైయున్నది, దీనికి అర్థము ఏమనగా ప్రజలు స్వాభావికముగానే దేవుని ధర్మశాస్త్రముకు విధేయత చూపుతారు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారిలో దేవుని ధర్మశాస్త్రమును ఇదివరికే కలిగియున్నారు” (చూడండి: జాతీయం (నుడికారం))
νόμον…μὴ ἔχοντες
ఇక్కడ “ధర్మశాస్త్రము” అనే పదము మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మోషేకి ఇచ్చిన శాస్త్రములను వారు కలిగియుండలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 2:15
οἵτινες ἐνδείκνυνται
వారు చూపించే ధర్మశాస్త్రమంతటికి స్వాభావికముగానే విధేయత చూపుట ద్వారా
τὸ ἔργον τοῦ νόμου, γραπτὸν ἐν ταῖς καρδίαις αὐτῶν
ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక వ్యక్తి ఆలోచనలకు లేక అంతరంగములకు పర్యాయ పదముగా వాడబడియున్నది. “వారి హృదయములో వ్రాయబడెను” అనే మాట వారి మనస్సులలో తెలుసుకున్న విషయాలకొరకు రూపకఅలంకారముగా వ్రాయబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము చేయమనిన ఆజ్ఞలన్నిటిని దేవుడు వారి హృదయములలో వ్రాసియుండెను” లేక “దేవుడు తన ధర్మశాస్త్రమునుబట్టి చేయమని కోరిన ప్రతి క్రియను వారు ఎరుగుదురని” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
συνμαρτυρούσης αὐτῶν…καὶ μεταξὺ ἀλλήλων, τῶν λογισμῶν κατηγορούντων ἢ καὶ ἀπολογουμένων
ఇక్కడ “సాక్ష్యమివ్వడం” అనే మాట దేవుడు వారి హృదయములలో వ్రాసిన ధర్మశాస్త్రమునుండి వారు పొందిన జ్ఞానమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ధర్మశాస్త్రమునకు అవిధేయులైయున్నారో లేక విధేయులైయున్నారో వారికి చెప్పును” (చూడండి: జాతీయం (నుడికారం))
Romans 2:16
ἐν ἡμέρᾳ ὅτε κρίνει ὁ Θεὸς
ఈ మాట [రోమా.2:13] (../02/13.md) వచనములో పౌలు ఆలోచనకు ముగింపు పలుకుచున్నది. “దేవుడు తీర్పు తీర్చునప్పుడు ఇది జరుగును”
Romans 2:17
ఇక్కడ యూదులు పొందుకొనిన ధర్మశాస్త్రము వాస్తవానికి వారిని ఖండించుచున్నది, ఎందుకంటే వారు దానికి విధేయత చూపించలేదు.
εἰ…σὺ Ἰουδαῖος ἐπονομάζῃ
నిన్ను నివే యూదుడని పిలిచుకొనుచున్నందున
ἐπαναπαύῃ νόμῳ,
“ధర్మశాస్త్రము మీద ఆధారపడుతూ” అనే మాట ఇక్కడ ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా వారు నీతిమంతులుగా మారుదురనే నమ్మకమును తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మోషే ధర్మశాస్త్రము మీద ఆధారపడుట” (చూడండి: రూపకం)
Romans 2:18
γινώσκεις τὸ θέλημα
మరియు దేవుని చిత్తమును తెలుసుకొనుట
κατηχούμενος ἐκ τοῦ νόμου
దీనిని మీరు క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమునుండి సత్యమైనదానిని ప్రజలు మీకు బోధించినందున” లేక “ధర్మశాస్త్రమునుండి మీరు నేర్చుకొనినందున” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 2:19
πέποιθάς τε σεαυτὸν ὁδηγὸν εἶναι τυφλῶν, φῶς τῶν ἐν σκότει
ఇక్కడ “గ్రుడ్డితనము” మరియు “చీకటిలో నడిచేవారు” అనే మాట ధర్మశాస్త్రమును అవగాహన చేసుకొనని ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ధర్మశాస్త్రమును బోధించుచున్నందున, గ్రుడ్డిప్రజలను నడిపించువారివలె మీకు మీరున్నారు మరియు చీకటిలో నడిచే ప్రజలకు వెలుగువలె మీరున్నారు” (చూడండి: సమాంతరత మరియు రూపకం)
Romans 2:20
παιδευτὴν ἀφρόνων
తప్పు చేయుచున్నవారిని మీరు సరిచేయుదురు
διδάσκαλον νηπίων
ఇక్కడ ధర్మశాస్త్రమును గూర్చి ఏ మాత్రము తెలియని ప్రజలను అతి చిన్న పిల్లలను పోల్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమును గూర్చి ఏమీ తెలియని ప్రజలను గూర్చి మీరు బోధించుచున్నారు” (చూడండి: రూపకం)
ἔχοντα τὴν μόρφωσιν τῆς γνώσεως καὶ τῆς ἀληθείας ἐν τῷ νόμῳ
ధర్మశాస్త్రములోని సత్యమును గూర్చిన జ్ఞానము దేవుని వద్దనుండి వచ్చుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమునందు దేవుడు అనుగ్రహించియున్నడనే సత్యమును మీరు అర్థము చేసుకొనియున్నారనే నిశ్చయత మీకున్నందున” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 2:21
ὁ…διδάσκων ἕτερον, σεαυτὸν οὐ διδάσκεις
పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఇతరులకు బోధించుచున్నారు గాని మీకు మీరే బోధించుకొనరు!” లేక “మీరు ఇతరులకు బోధించుదురు, కానీ మీరు బోధించుచున్నదానిని మీరు చేయరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὁ κηρύσσων μὴ κλέπτειν, κλέπτεις
పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దొంగలించవద్దని ప్రజలకు మీరు చెప్పుదురు, కానీ మీరు దొంగలింతురు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 2:22
ὁ λέγων μὴ μοιχεύειν, μοιχεύεις
పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు వ్యభిచారము చేయవద్దని ప్రజలకు చెప్పుదురు, కాని మిరే వ్యభిచారము చేయుదురు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὁ βδελυσσόμενος τὰ εἴδωλα, ἱεροσυλεῖς
పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు విగ్రహములను ద్వేషించాలని చెప్పుదురు, కానీ మీరే దేవాలయములలో చొచ్చి దొంగలించెదరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἱεροσυλεῖς
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) “అమ్మి లాభము పొందడానికి స్థానిక అన్య దేవాలయములలోనుండి వస్తువులను దొంగలించండి” లేక 2) “దేవునినిబట్టి ఉన్న డబ్బంతంటిని యెరూషలేములోని దేవాలయమునకు పంపించవద్దు.”
Romans 2:23
ὃς ἐν νόμῳ καυχᾶσαι διὰ τῆς παραβάσεως τοῦ νόμου, τὸν Θεὸν ἀτιμάζεις
పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు దుష్టుడిగా ఉండి ధర్మశాస్త్రమునుబట్టి గర్విస్తున్నానని చెప్పుకుంటున్నావుగాని, అదే సమయములోనే దానికి అవిధేయత చూపించి, దేవునికి అవమానమును తెచ్చుచున్నావు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 2:24
τὸ…ὄνομα τοῦ Θεοῦ…βλασφημεῖται ἐν τοῖς ἔθνεσιν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది అన్యులు దేవుని నామమునకు దూషణపాలు చేయుచున్నారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὄνομα τοῦ Θεοῦ
“నామము” అనే పదము కేవలము దేవుని పేరునే కాకుండా, దేవుని సంపూర్ణతను సూచించే పర్యాయ పదమైయున్నది. (చూడండి: అన్యాపదేశము)
Romans 2:25
దేవుని ధర్మశాస్త్రమునుబట్టి ఆయనను చూపించుటకు పౌలు ముందుకు కొనసాగుచున్నాడు, దేవుని ధర్మశాస్త్రమును కలిగిన యూదులను ఖండించుచున్నాడు.
περιτομὴ μὲν γὰρ ὠφελεῖ
నేను ఇవన్నియు చెప్పడానికిగల కారణము ఏమనగా సున్నతి పొందుట ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనము లేదు
ἐὰν…παραβάτης νόμου ᾖς
ధర్మశాస్త్రములో కనిపించే ఆజ్ఞలకు మీరు విధేయత చూపించకపోయినట్లయితే
ἡ περιτομή σου, ἀκροβυστία γέγονεν
మీరు సున్నతి చేయించుకొననివారివలె ఉన్నారు
Romans 2:26
ἡ ἀκροβυστία
సున్నతి పొందని వ్యక్తి
τὰ δικαιώματα τοῦ νόμου φυλάσσῃ
ధర్మశాస్త్రములోనున్న దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట
οὐχ ἡ ἀκροβυστία αὐτοῦ εἰς περιτομὴν λογισθήσεται
సున్నతి దేవుని ఎదుట నీతిమంతునిగా చేయదని నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ మొట్టమొదటిగా రెండు ప్రశ్నలను అడుగుచున్నాడు. మీరు ఈ ప్రశ్నను క్రియాత్మక రూపములో ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “సున్నతిపొందినవానివలె దేవుడు అతనిని పరిగణించును.” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 2:27
καὶ κρινεῖ ἡ ἐκ φύσεως ἀκροβυστία, τὸν νόμον τελοῦσα
సున్నతి దేవుని ఎదుట నీతిమంతునిగా చేయదని నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ అడిగే (మొదటి ప్రశ్న రోమా.2:26(./26.md)) రెండవ ప్రశ్నయైయున్నది. అడుగుచున్నాడు. మీరు ఈ ప్రశ్నను క్రియాత్మక రూపములో ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “భౌతికముగా సున్నతి పొందని వ్యక్తి మిమ్మును ధర్మశాస్త్రమునుబట్టి... ఖండించును.” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 2:28
ἐν τῷ φανερῷ
ఇది ప్రజలు చూడగలిగిన సున్నతి లాంటి యూదా ఆచారములను సూచించుచున్నది.
ἐν τῷ φανερῷ ἐν σαρκὶ
ఒకవ్యక్తి ఒకనికి సున్నతి చేయునప్పుడు ఆ వ్యక్తి దేహమునకు భౌతికపరమైన మార్పును కలుగజేస్తుందని ఇది సూచించుచున్నది.
σαρκὶ
ఇది సంపూర్ణ దేహమును సూచించే ఉపలక్షకమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేహము” (చూడండి: ఉపలక్షణము)
Romans 2:29
ὁ ἐν τῷ κρυπτῷ Ἰουδαῖος; καὶ περιτομὴ καρδίας
ఈ రెండు మాటలకు సమానమైన అర్థాలు ఉంటాయి. మొదటి మాట, “అతను లోలోపల ఉండే యూదుడు,” రెండవ మాటను వివరించుచున్నది, “హృదయ సున్నతి.” (చూడండి: సమాంతరత)
ἐν τῷ κρυπτῷ
ఇది దేవుడు రూపాంతరము చెందించిన వ్యక్తియొక్క విలువలను మరియు ఉద్దేశములను సూచించుచున్నది.
καρδίας
ఇక్కడ “హృదయము” అనే పదము అంతరంగ వ్యక్తిని సూచించే పర్యాయ పదమైయున్నది. (చూడండి: అన్యాపదేశము)
ἐν Πνεύματι, οὐ γράμματι
ఇక్కడ “పత్రిక” అనే పదము వ్రాయబడిన లేఖనములను సూచించే ఉపలక్షకమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పరిశుద్ధాత్మ కార్యము ద్వారానే గాని మీకు లేఖనములు తెలిసినందువలన కాదు” (చూడండి: ఉపలక్షణము)
ἐν Πνεύματι
“దేవుని ఆత్మ” మార్పు కలుగజేసే ఒక వ్యక్తి యొక్క అంతరంగ మరియు ఆత్మీయ భాగమును సూచించుచున్నది.
Romans 3
రోమా 03 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన 4వ వచనమును మరియు ఈ అధ్యాయములోని 10-18 వచనములను చేసియున్నారు.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు
”అన్యునిగానున్న వ్యక్తిపైన యూదుడిగా ఉండుటవలన కలుగు ప్రయోజనము ఏది?” అనే ఈ ప్రశ్నకు 3వ అధ్యాయము జవాబులను ఇచ్చును (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
“అందరూ పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందనొల్లకపోయిరి”
ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పరలోకములో ఆయనతోనున్న ప్రతియొక్కరు పరిపూర్ణులైయుండవలెను. ఏ పాపమైన ఒక వ్యక్తిని ఖండించును. (చూడండి: పరలోకం, ఆకాశం, అకాశాలు, పరలోకసంబంధమైన మరియు దోషిగా తీర్చు, దోషిగా తీర్పు పొందిన, దోషిగా తీర్చిన, దోషిగా తీర్పు)
ఈ అధ్యాయములో ప్రాముఖమైన అలంకారములు
అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో తరచుగా అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ఈ పత్రికను చదువుచున్న చదువరి వారి పాపమును చూచునట్లు చేయడమే ఈ అలంకారిక ప్రశ్నల ఉద్దేశమన్నట్లుగా కనబడుచున్నది. తద్వారా వారు యేసునందు విశ్వసించుదురు. (చూడండి: న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా/నీతిమంతులుగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం మరియు విశ్వాసం)
Romans 3:1
దేవుడు తన ధర్మశాస్త్రమును వారికిచ్చినందున యూదులు కలిగియుండె ప్రయోజనములను పౌలు ప్రకటించుచున్నాడు.
τί οὖν τὸ περισσὸν τοῦ Ἰουδαίου, ἢ τίς ἡ ὠφέλια τῆς περιτομῆς
2వ అధ్యాయములో పౌలు వ్రాసిన మాటలను వారు విన్న తరువాత (లేక, చదువుకున్న తరువాత) ప్రజలు కలిగియుండె ఆలోచనలను ఆయన ఇక్కడ ప్రస్తావించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే యుదుడు కలిగియుండే ప్రయోజనము ఏమిటి? మరియు సున్నతి పొందుటవలన కలుగు ప్రయోజనము ఏమిటి?’ అని కొంతమంది ప్రజలు చెప్పవచ్చును.” లేక “అదే నిజమైతే, యూదులకు ఎటువంటి ప్రయోజనము లేదు, సున్నతి పొందుటవలన ఎటువంటి ప్రయోజనము లేదని’ కొంత ప్రజలు చెప్పావచ్చును.” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు అలంకారిక ప్రశ్న)
Romans 3:2
πολὺ κατὰ πάντα τρόπον
1వ వచనములోనున్న కొన్ని అంశాలనుబట్టి పౌలు ఇప్పుడు ప్రతిస్పందించుచున్నాడు. ఇక్కడ “వీరు” అనే పదము యూదా ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే యూదుడిగా ఉండటము గొప్ప ప్రయోజనకరమైయున్నది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πρῶτον μὲν
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ప్రతి విషయములో మొదటిది” లేక 2) “ఖచ్చితమైన” లేక 3) “చాలా ప్రాముఖ్యమైన.”
ἐπιστεύθησαν τὰ λόγια τοῦ Θεοῦ
ఇక్కడ “ప్రత్యక్షత లేక వాక్కులు” అనే పదము దేవుని మాటలను మరియు వాగ్ధానములను సూచించుచున్నాయి. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులకు వాగ్ధానములతో కూడిన తన మాటలను లేక వాక్కులను ఇచ్చియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 3:3
τί γάρ εἰ ἠπίστησάν τινες? μὴ ἡ ἀπιστία αὐτῶν, τὴν πίστιν τοῦ Θεοῦ καταργήσει
ప్రజలను ఆలోచింపచేయుటకు పౌలు ఈ ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “కొంతమంది యూదులు దేవునికి నమ్మకస్తులుగా లేరు. దీనినిబట్టి దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చడని మనము చెప్పగలమా?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 3:4
μὴ γένοιτο
ఇలా జరుగుతుందని ఈ మాట చాలా బలముగా తిరస్కరించుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించగలిగే మీ భాషలోని మాటను ఇక్కడ కలిగియుండవచ్చును. “అలా జరగడం అసాధ్యము!” లేక “అలా జరగనే జరుగదు!”
γινέσθω δὲ
ఇలా జరుగదని మనము ఖచ్చితంగా చెప్పవచ్చును
γινέσθω…ὁ Θεὸς ἀληθής
దేవుడు ఎల్లప్పుడు సత్యవంతుడైయుంటాడు మరియు ఆయన ఇచ్చిన వాగ్ధానములన్నిటిని నేరవేరుస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వాగ్ధానము చేసిన ప్రతిదానిని నేరవేరుస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πᾶς δὲ ἄνθρωπος ψεύστης
ఇక్కడ దేవుడు ఒక్కడే తన వాగ్ధానములను నెరవేర్చుటలో నమ్మదగినవాడుగా ఉండునని నొక్కి చెప్పుటకు “ప్రతియొక్కరు” మరియు “అబద్ధీకుడు” అనే పదాలు ఉపయోగించబడియున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి మనిషి అబద్ధికుడైనప్పటికీ” (చూడండి: అతిశయోక్తి)
καθὼς γέγραπται
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను చెప్పుచున్న సంగతులతో లేఖనములు తమంతట అవే అంగీకరించుచున్నాయి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὅπως ἂν δικαιωθῇς ἐν τοῖς λόγοις σου, καὶ νικήσεις ἐν τῷ κρίνεσθαί σε
ఈ రెండు మాటలకు ఒకే విధమైన అర్థాలు ఉంటాయి. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు చెప్పే ప్రతిదీ నిజమని ప్రతియొక్కరు తెలుసుకోవాలి, మరియు ఎవరైనా మీ మీద ఆరోపించునప్పుడు మీ విషయములో ఎల్లప్పుడూ మీరు నెగ్గేవారిగానే ఉండాలి” (చూడండి: సమాంతరత మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 3:5
εἰ δὲ ἡ ἀδικία ἡμῶν, Θεοῦ δικαιοσύνην συνίστησιν, τί ἐροῦμεν? μὴ ἄδικος ὁ Θεὸς, ὁ ἐπιφέρων τὴν ὀργήν
ఇతర ప్రజలు ఏమి వాదిస్తున్నారో తెలియజెప్పుటకు మరియు ఆ వాదన సరియైనదా కాదా అని తన చదువరులు ఆలోచించుటకు పౌలు ఈ ప్రశ్నలను సంధించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన అనీతి దేవుని నీతిని కనుపరచుచున్నందున, ఆయన మనలను శిక్షించునప్పుడు ఆయన అనీతిమంతుడే కదా అని కొంతమంది ప్రజలు చెప్పుదురు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὁ ἐπιφέρων τὴν ὀργήν
ఇక్కడ “ఉగ్రత” అనే పదము శిక్షకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన మీద ఆయన శిక్షను తీసుకొని వచ్చుటకు” లేక “మనలను శిక్షించుటకు” (చూడండి: అన్యాపదేశము)
(κατὰ ἄνθρωπον λέγω.)
ఇతర ప్రజలు చెప్పుచున్నవాటిని నేను ఇక్కడ చెప్పుచున్నాను లేక “కొంతమంది ప్రజలు చెప్పే సంగతులు ఇవే”
Romans 3:6
μὴ γένοιτο
దేవుడు అనీతిమంతుడని మనము చెప్పకూడదు
ἐπεὶ πῶς κρινεῖ ὁ Θεὸς τὸν κόσμον
సువార్తకు విరుద్ధముగా జరిగించే ప్రతి వాదన చెల్లదని చూపించుటకు పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు, దేవుడు ప్రజలందరిని శిక్షించును అని యూదులు విశ్వసించుదురు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు లోకమునంతటికి తీర్పు తీర్చునని మనకందరికి తెలుసు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὸν κόσμον
“లోకము” అనే పదము ఈ భూమి మీద నివసించుచున్న ప్రజలను సూచించుటకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “లోకములోనున్న ప్రతియొక్కరూ” (చూడండి: అన్యాపదేశము)
Romans 3:7
εἰ δὲ ἡ ἀλήθεια τοῦ Θεοῦ ἐν τῷ ἐμῷ ψεύσματι ἐπερίσσευσεν εἰς τὴν δόξαν αὐτοῦ, τί ἔτι κἀγὼ ὡς ἁμαρτωλὸς κρίνομαι
ఇక్కడ పౌలు క్రైస్తవ సువార్తను తిరస్కరించువారిని ఊహించుకొనుచున్నాడు. అటువంటి విరోధి వాదించును, ఎందుకంటే అతని పాపము దేవుని నీతిని కనుబరుచును, ఉదాహరణకు, అతను అబద్ధములు చెప్పుచున్నట్లయితే దేవుడు తీర్పు దినమున అతను పాపియని ప్రకటించడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 3:8
καὶ μὴ καθὼς βλασφημούμεθα, καὶ καθώς φασίν τινες ἡμᾶς λέγειν, ὅτι ποιήσωμεν τὰ κακὰ, ἵνα ἔλθῃ τὰ ἀγαθά
పౌలు ఊహించుకుంటున్న తన విరోధి ఎంత హాస్యస్పదమైనవాడని చూపించుటకు ఇక్కడ పౌలు తనంతటికి తానె ఒక ప్రశ్నను లేవనెత్తుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను చెప్పుచున్నట్లుగానే... జరుగును!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
καθὼς βλασφημούμεθα
మేము దీనినే చెప్పుచున్నామని కొంతమంది ఇతరులకు చెప్పుదురు
ὧν τὸ κρίμα ἔνδικόν ἐστιν
పౌలు బోధించుచున్న వాటిని గూర్చి అబద్ధములు పలుకుచున్నందుకు దేవుడు అతని శత్రువులను గద్దించడము మంచిదే.
Romans 3:9
నీతిమంతులు లేరు, దేవునిని వెదకువారెవారును లేరని ప్రతియొక్కరు పాపము చేసి అపరాధులైయున్నారని పౌలు తెలియజేయుచున్నాడు.
τί οὖν? προεχόμεθα
పౌలు తను చెప్పబోయే అంశమును నొక్కి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము యూదులమైనందున మనము దేవుని తీర్పును తప్పించుకొందుమని మనము ఊహించుకొనకూడదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐ πάντως
“లేదు” అని చెప్పేదానికంటే ఈ మాటలు చాలా బలమైనవి, కానీ “ఖచ్చితంగా కాదు” అనేంత బలమైనవి కావు!”
Romans 3:10
καθὼς γέγραπται
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది లేఖనములలో ప్రవక్తలు వ్రాసియున్నట్లుగానే ఉన్నది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 3:11
οὐκ ἔστιν ὁ συνίων
సరియైనదానిని లేక న్యాయమైనదానిని అర్థము చేసుకొనువారు ఎవరును లేరు. ప్రత్యామ్నాయ అనువాదము: “సరియైనదానిని అర్థము చేసుకొనువారు నిజముగా లేరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐκ ἔστιν ὁ ἐκζητῶν τὸν Θεόν
ఇక్కడ “దేవునిని వెదకుట” అనే మాటకు దేవునితో సంబంధమును కలిగియుండుటను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునితో సరియైన సంబంధమును కలిగియున్నవారెవరును లేరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 3:12
πάντες ἐξέκλιναν
ప్రజలు దేవునిని గూర్చి ఆలోచించుటకైనను అవకాశము ఇచ్చుటలేదనే నానుడియైయున్నది. వాళ్ళు ఆయనను త్రోసిపుచ్చాలని కోరుచున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారందరూ దేవునినుండి తొలగిపోయారు” (చూడండి: జాతీయం (నుడికారం))
ἅμα ἠχρεώθησαν
మంచి కార్యములను ఎవరు చేయనందువలన, వారు దేవునికి అప్రయోజకులైయున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతియొక్కరు దేవునికి పనికిరాకుండా పోయారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 3:13
αὐτῶν…αὐτῶν
“వారి” అనే పదము [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నది.
τάφος ἀνεῳγμένος ὁ λάρυγξ αὐτῶν
“గొంతుక” అనే పదము ప్రజలు చెప్పే లేక వినిపించే ప్రతి మాట అనీతిమయమైనది మరియు అసహ్యమైనవి అని చెప్పుటకు పర్యాయ పదమైయున్నది. ఇక్కడ “తెరచి ఉన్న సమాధి” అనే మాట ప్రజల దుష్ట సంబంధమైన మాటల కంపును సూచించుచుటకు రూపకఅలంకారమైయున్నది. (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
ταῖς γλώσσαις αὐτῶν ἐδολιοῦσαν
“నాలుకలు” అనే పదము ప్రజలు మాట్లాడే తప్పుడు మాటల కొరకు చెప్పబడిన పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు అబద్ధములు చెప్పుదురు” (చూడండి: అన్యాపదేశము)
ἰὸς ἀσπίδων ὑπὸ τὰ χείλη αὐτῶν
ఇక్కడ “పాముల విషము” అనే మాట ప్రజలు మాట్లాడే దుష్ట సంబంధమైన మాటలవలన గొప్ప హాని కలుగుతుందని సూచించి చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. “పెదవులు” అనే పదము ప్రజల మాటలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నాగుపాము విషమువలె వారి దుష్ట సంబంధమైన మాటలు ప్రజలకు హాని కలిగించును” (చూడండి: రూపకం)
Romans 3:14
ὧν τὸ στόμα ἀρᾶς καὶ πικρίας γέμει
ఇక్కడ “నోళ్ళు” అనే పదము ప్రజల దుష్ట సంబంధమైన మాటలను సూచించుటకు ఉపయోగించిన పర్యాయ పదమైయున్నది. “నిండా” అనే పదము ప్రజలు తరుచుగా మాట్లాడే ద్వేష పూరితమైన మరియు శాపగ్రస్తమైన మాటలను వివరించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తరచుగా శాపగ్రస్తమైన మరియు క్రూరమైన మాటలను పలుకుచుందురు” (చూడండి: అన్యాపదేశము మరియు అతిశయోక్తి)
Romans 3:15
ὀξεῖς οἱ πόδες αὐτῶν, ἐκχέαι αἷμα
ఇక్కడ “పాదములు” అనే మాటను ప్రజలు తమ్మును తాము సూచించుకొనుటకు ఉపలక్షకముగా వాడబడింది. “రక్తము” అనే పదము ప్రజలను చంపుట అనే విషయమును సూచించుట కొరకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ప్రజలకు హాని చేయుటకు మరియు ప్రజలను చంపుటకు త్వరపడుచున్నారు” (చూడండి: ఉపలక్షణము మరియు రూపకం)
οἱ πόδες αὐτῶν
“వారి” అనే పదము [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నది.
Romans 3:16
ταῖς ὁδοῖς αὐτῶν
“వారి” అనే పదము [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నది.
σύντριμμα καὶ ταλαιπωρία ἐν ταῖς ὁδοῖς αὐτῶν
ఇక్కడ “నాశనము మరియు శ్రమ” అనే పదాలు ఈ ప్రజలు ఇతరులకు కలుగజేసే హాని సూచించుటకు వాడబడిన పర్యాయ పదములు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ఇతరులను నాశనము చేయుటకు ప్రయత్నించుదురు మరియు వారు శ్రమపొందుటకు కారణమగుదురు” (చూడండి: అన్యాపదేశము)
Romans 3:17
ἔγνωσαν
ఈ మాటలు లేక పదములు [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నవి.
ὁδὸν εἰρήνης
ఇతరులతో సమాధానకరముగా ఎలా జీవించాలి. “మార్గము” అనగా రహదారి లేక చిన్న దారి అని అర్థము.
Romans 3:18
αὐτῶν
ఈ మాటలు లేక పదములు [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నవి.
οὐκ ἔστιν φόβος Θεοῦ ἀπέναντι τῶν ὀφθαλμῶν αὐτῶν
ఇక్కడ “భయము” అనే పదము దేవునికొరకైన గౌరవమును మరియు ఆయనను సన్మానించుటకుగల ఇష్టతను సూచించుటకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకర్హమైన గౌరవమును దేవునికిచ్చుటకు ప్రతియొక్కరు తిరస్కరించిరి” (చూడండి: ఉపలక్షణము)
Romans 3:19
ὅσα ὁ νόμος λέγει, τοῖς…λαλεῖ
ధర్మశాస్త్రము జీవించుచున్నదన్నట్లుగాను మరియు దానికి స్వంత స్వరమున్నదన్నట్లుగాను పౌలు ధర్మశాస్త్రమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము చెప్పుచున్న ప్రతి విషయమును ప్రజలు తప్పకుండ చేయాలి లేక పాటించాలి” లేక “ధర్మశాస్త్రములో మోషే వ్రాసిన ప్రతి ఆజ్ఞయు అందుకొరకే” (చూడండి: మానవీకరణ)
τοῖς ἐν τῷ νόμῳ
ధర్మశాస్త్రముకు తప్పకుండ లోబడవలసినవారందరూ
ἵνα πᾶν στόμα φραγῇ
ఇక్కడ “నోరు” అనే పదము ప్రజలు మాట్లాడే మాటలకు ఉపలక్షకముగా చెప్పబడియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత ఏ ఒక్కరు కూడా తమ్మును తాము మంచివారని చెప్పుకొనలేరు” (చూడండి: ఉపలక్షణము మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὑπόδικος γένηται πᾶς ὁ κόσμος τῷ Θεῷ
ఇక్కడ “లోకము” అనే పదము భూమి మీద నివసించుచున్న ప్రజలందరినీ సూచించే ఉపలక్షకమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు లోకములోని ప్రతియొక్కరిని అపరాధులనుగా ఎంచవచ్చును” (చూడండి: ఉపలక్షణము)
Romans 3:20
σὰρξ
ఇక్కడ “శరీరము” అనే పదము మానవాళియంతటిని సూచిస్తుంది.
γὰρ
ఇతర అర్థాలు - 1) “అందుచేత” లేక 2) “ఈ కారణమునుబట్టి”
διὰ…νόμου ἐπίγνωσις ἁμαρτίας
ఒకరికి దేవుని ధర్మశాస్త్రమును గూర్చి తెలిసినప్పుడు, అతను పాపము చేసియున్నాడని గ్రహిస్తాడు లేక తెలుసుకుంటాడు
Romans 3:21
“కానీ” అనే పదము పౌలు ఆరంభించిన పరిచయమును ముగించియున్నాడని మరియు ఇప్పుడు అతని ముఖ్యాంశమును ఆరంభించునని చూపించుచున్నది.
νυνὶ
“ఇప్పుడు” అనే పదము యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పటి సమయమును సూచించుచున్నది.
χωρὶς νόμου, δικαιοσύνη Θεοῦ πεφανέρωται
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమునకు లోబడకుండానే దేవునితో సమాధానపడే విధానమును దేవుడు చేసియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
μαρτυρουμένη ὑπὸ τοῦ νόμου καὶ τῶν προφητῶν
“ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే పదాలు యూదుల లేఖనాలలో మోషే మరియు ప్రవక్తలు వ్రాసిన లేఖన భాగములను సూచించుచున్నవి. ఆ లేఖనములు సభలో సాక్ష్యమిచ్చుచున్నట్లుగా పౌలు వాటిని గూర్చి వివరించుచున్నాడు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మోషే మరియు ప్రవక్తలు వ్రాసినవాటిని ధృవీకరించుచున్నది” (చూడండి: మానవీకరణ మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 3:22
δικαιοσύνη…Θεοῦ διὰ πίστεως Ἰησοῦ Χριστοῦ
ఇక్కడ “నీతి” అనగా దేవునితో సరియైన విధముగా ఉండుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు క్రీస్తునందు విశ్వసించుట ద్వారా దేవునితో సరియైన విధముగా ఉండుట” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐ γάρ ἐστιν διαστολή
దేవుడు ప్రజలందరినీ అదే విధముగా అంగీకరించునని పౌలు ఇక్కడ తెలియజేయుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులకు మరియు అన్యులకు మధ్యన ఎటువంటి వ్యత్యాసము ఉండదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 3:23
ὑστεροῦνται τῆς δόξης τοῦ Θεοῦ
ఇక్కడ “దేవుని మహిమ” అనే మాట దేవుని స్వరూపమును మరియు ఆయన స్వభావమును సూచించుటకు ఉపయోగించిన పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునివలె ఉండుటకు విఫలము చెందిరి” (చూడండి: అన్యాపదేశము)
Romans 3:24
δικαιούμενοι δωρεὰν τῇ αὐτοῦ χάριτι, διὰ τῆς ἀπολυτρώσεως τῆς ἐν Χριστῷ Ἰησοῦ
ఇక్కడ “తీర్పు పొందుచున్నారు” అనే మాట దేవునితో సరియైన విధానములో సమాధానముగా ఉండుటను సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన్నుతాను వారితో సమాధానపడుటకు ఇష్టపడియున్నాడు, ఎందుకంటే యేసు వారిని స్వతంత్రపరిచియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
δικαιούμενοι δωρεὰν
నీతిమంతులుగా తీర్చబడుటకు ఎటువంటి ప్రయాసపడకుండానే వారు నీతిమంతులుగా తీర్చబడియున్నారని ఈ మాటకు అర్థము. దేవుడు వారిని ఉచితముగానే నీతిమంతులుగా తీర్పు తీర్చియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీతిమంతులుగా ఉండుటను సంపాదించకుండానే వారు దేవునితో సమాధానపరచబడియున్నారు”
Romans 3:25
ἐν τῷ αὐτοῦ αἵματι
పాపములకు ప్రాయశ్చిత్త బలిగా యేసు మరణము కొరకు ఈ మాటను పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపములకు బలిగా ఆయన మరణములో” (చూడండి: అన్యాపదేశము)
πάρεσιν
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) విస్మరించుట లేక 2) క్షమించుట.
Romans 3:26
πρὸς τὴν ἔνδειξιν τῆς δικαιοσύνης αὐτοῦ ἐν τῷ νῦν καιρῷ
దేవుడు ఎలా ప్రజలను తనతో సమాధాన పరచుకొనుననే విషయాన్ని చూపించుటకు ఆయన దీనిని చేసియున్నాడు
εἰς τὸ εἶναι αὐτὸν δίκαιον καὶ δικαιοῦντα τὸν ἐκ πίστεως Ἰησοῦ
దీని ద్వారా ఆయన న్యాయవంతుడని మరియు యేసునందు విశ్వసించినవారందరూ నీతిమంతులని ప్రకటన చేయువాడని తను చూపించుచున్నాడు
Romans 3:27
ποῦ οὖν ἡ καύχησις? ἐξεκλείσθη
ధర్మశాస్త్రమునకు లోబడియుండుటను గూర్చి ప్రజలు అతిశయించుటకు ఎటువంటి కారణము లేదని చూపించుటకు పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆ ఆజ్ఞలన్నిటికి మనము విధేయత చూపించుచున్నందున దేవుడు మన విషయమై దయ చూపించునని మనము అతిశయించుటకు ఎటువంటి అవకాశము లేదు. అతిశయించడం అనునది తీసివేయడమైనది” (చూడండి: అలంకారిక ప్రశ్న)
διὰ ποίου νόμου? τῶν ἔργων? οὐχί, ἀλλὰ διὰ νόμου πίστεως
పౌలు పేర్కొనుచున్న ప్రతియొక్క అంశము నిజమైనదని నొక్కి చెప్పుటకు పౌలు ఈ అలంకారిక ప్రశ్నలను అడుగుతూ జవాబులను ఇచ్చుచున్నాడు. పౌలు చెప్పుచున్న మాటలను చేర్చుకొని మీరు దీనిని తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఏ కారణముచేత గొప్పలు చెప్పుకోవాలి? మన మంచి క్రియలనుబట్టి దానిని గొప్పగా చెప్పుకోవాలా? కాదు గానీ, విశ్వాసమునుబట్టియే మనము గొప్పలు చెప్పుకోవాలి” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు శబ్దలోపం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 3:28
δικαιοῦσθαι πίστει ἄνθρωπον
ఇక్కడ “విశ్వాసము” అనే పదము నైరూప్య పదము దేవునియందు విశ్వాసముంచే వ్యక్తిని సూచిస్తున్నది. ఇక్కడ “వ్యక్తి” అనగా ఎవరైనా ఉండవచ్చు. దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మకముంచిన ప్రతి వ్యక్తిని దేవుడు నీతిమంతులుగా తీర్చును” లేక “దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్పు తీర్చునప్పుడు, అతను నీతిమంతునిగా తీర్పు తీర్చబడియున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి దేవునియందు విశ్వాసముంచియున్నాడు” (చూడండి: భావనామాలు మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
χωρὶς ἔργων νόμου
అతను ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు చేయకపోయినప్పటికిని
Romans 3:29
ἢ Ἰουδαίων ὁ Θεὸς μόνον
నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మిమ్ములను మాత్రమే అంగీకరిస్తాడని యూదులైన మీరు ఆలోచించనవసరములేదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐχὶ καὶ ἐθνῶν? ναὶ, καὶ ἐθνῶν
పౌలు తను చెప్పబోవుచున్న అంశమును నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన యూదేతరులైన అన్యులను కూడా అంగీకరించును” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 3:30
ὃς δικαιώσει περιτομὴν ἐκ πίστεως, καὶ ἀκροβυστίαν διὰ τῆς πίστεως
ఇక్కడ “సున్నతి” అనే పదము యూదులను సూచించుటకు వాడబడిన పర్యాయ పదమునైయున్నది మరియు “సున్నతిలేనివారు” అనే మాట యూదేతరులను సూచించుటకు వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుడు యూదులను మరియు యూదేతరులను నీతిమంతులనుగా చేయును” (చూడండి: అన్యాపదేశము)
Romans 3:31
పౌలు విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాడు.
νόμον οὖν καταργοῦμεν διὰ τῆς πίστεως
చదువరులు కలిగియుండే ఒకానొక ప్రశ్నను పౌలు ఇక్కడ అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము విశ్వాసమును కలిగియున్నందున మనము ధర్మశాస్త్రమును అనుసరించనవసరములేదని మీలో ఎవరైనా చెప్పవచ్చును.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ γένοιτο
ఈ మాట రాబోయే అలంకారిక ప్రశ్నకు బలమైన ప్రతికూల జవాబును ఇచ్చును. మీరు ఇక్కడ ఉపయోగించే మీ భాషలోని మాటను ఇక్కడ మీరు కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది ఖచ్చితంగా కాదు” లేక “కానే కాదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
νόμον ἱστάνομεν
మేము ధర్మశాస్త్రమునకు విధేయత చూపిస్తాము
καταργοῦμεν
ఈ సర్వనామము పౌలును, ఇతర విశ్వాసులను మరియు చదువరులను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 4
రోమా 04 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన ఈ అధ్యాయములోని 7-8 వచనములను చేసియున్నారు.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు
మోషే ధర్మశాస్త్రముయొక్క ముఖ్య ఉద్దేశ్యము పౌలు 3వ అధ్యాయములోని విషయాల మీద కడుతూ వస్తున్నాడు. ఇశ్రాయేలు తండ్రియైన అబ్రహాము ఎలా నీతిమంతునిగా తీర్చబడియున్నాడనే విషయమును వివరించుచున్నాడు. అబ్రాహాము కూడా తాను చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా తీర్చబడలేదు. ధర్మశాస్త్రమునకు లోబడినంత మాత్రాన దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారానే ఒక వ్యక్తి దేవునియందు విశ్వాసముంచియున్నాడని తెలియవచ్చును. ప్రజలు ఎల్లప్పుడూ విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుదురు. (చూడండి: న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా/నీతిమంతులుగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం మరియు ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం మరియు విశ్వాసం)
సున్నతి
సున్నతి అనేది ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యమైనది. అది అబ్రాహాముకు, యాహోవా కు మధ్య జరిగిన నిబ౦ధన సూచనగా ఉ౦ది. అయితే సున్నతి పొందినంత మాత్రాన ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు. (చూడండి: సున్నతి చేయడం, సున్నతి చేయబడిన, సున్నతి, సున్నతి పొందని, సున్నతి లేని మరియు నిబంధన)
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు
అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. అలంకారిక ప్రశ్నల ఉద్దేశము కేవలము చదువరులు తమ పాపములను గుర్తించాలన్నదానిని ఇక్కడ చూపించుచున్నది, అందుచేత వారు యేసునందు విశ్వాసముంచియున్నారు. (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు అపరాధ భావం, దోషం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
Romans 4:1
వెనుకటికి విశ్వాసులు తాము దెవునియందు కలిగియున్న విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడియున్నారనేగాని ధర్మశాస్త్రము ద్వారా కాదని పౌలు ఆమోదించుచున్నాడు.
τί οὖν ἐροῦμεν, εὑρηκέναι Ἀβραὰμ τὸν προπάτορα ἡμῶν κατὰ σάρκα
పౌలు చదువరుల శ్రద్ధను మరింత పెంచడానికి పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు మరియు క్రొత్త విషయమును గూర్చి మాట్లాడుటను ఆరంభించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దీనినే మన భౌతిక సంబంధ పితరుడు కనుగొనియున్నది” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 4:3
τί γὰρ ἡ Γραφὴ λέγει
నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. లేఖనములు జీవము కలిగియున్నట్లుగా మరియు అవి ఇప్పటికీ మాట్లాడుచున్నట్లుగా పౌలు లేఖనములను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములో మనము చదువుచున్నట్లుగా” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు మానవీకరణ)
ἐλογίσθη αὐτῷ εἰς δικαιοσύνην
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:4
ὁ μισθὸς οὐ λογίζεται κατὰ χάριν
దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యజమానినుండి వచ్చే బహుమానముగా యజమాని తన పనివానికి ఇచ్చేవాటిని ఎవరూ లెక్కించరు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀλλὰ κατὰ ὀφείλημα
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యజమాని తనను స్వంతము చేసికొనినట్లుగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:5
ἐπὶ τὸν δικαιοῦντα
దేవునియందు నీతిమంతులుగా ఎంచబడినవారు
λογίζεται ἡ πίστις αὐτοῦ εἰς δικαιοσύνην
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నీతిమంతునిగా ఒక విశ్వాసమును దేవుడు పరిగణించును” లేక “ఒక వ్యక్తి విశ్వాసమునుబట్టి అతని నీతిని దేవుడు పరిగణించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:6
καθάπερ καὶ Δαυεὶδ λέγει τὸν μακαρισμὸν τοῦ ἀνθρώπου ᾧ ὁ Θεὸς λογίζεται δικαιοσύνην χωρὶς ἔργων
క్రియలవలన కాకుండా దేవుడు నీతివంతునిగా తీర్చబడిన వ్యక్తిని ఏ విధంగా ఆశీర్వదించుననే విషయము గూర్చి దావీదు కూడా వ్రాయుచున్నాడు.
Romans 4:7
ὧν ἀφέθησαν αἱ ἀνομίαι…ὧν ἐπεκαλύφθησαν αἱ ἁμαρτίαι;
రెండు విధాలుగా ఒకే ఉద్దేశము వ్యక్తపరచబడియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రముకు లోబడనివారిని కూడా ప్రభువు క్షమించును... ఎందుకంటే వారి పాపములు ప్రభువు తీసివేసియున్నాడు” (చూడండి: సమాంతరత మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:9
ὁ μακαρισμὸς οὖν οὗτος ἐπὶ τὴν περιτομὴν, ἢ καὶ ἐπὶ τὴν ἀκροβυστίαν
నొక్కి చెప్పడానికి ఈ మాట ప్రశ్న రూపములో కనిపించును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు సున్నతి పొందినవారినే ఆశీర్వదించునా, లేక సున్నతి పొందనివారిని కూడా ఆశీర్వదించడా?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὴν περιτομὴν
ఇది యూదా ప్రజలను సూచించే పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు” (చూడండి: అన్యాపదేశము)
τὴν ἀκροβυστίαν
ఇది యూదేతరులైన ప్రజలను సూచించుటకు వాడబడిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “అన్యులు” (చూడండి: అన్యాపదేశము)
ἐλογίσθη τῷ Ἀβραὰμ ἡ πίστις εἰς δικαιοσύνην
మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహాము విశ్వాసమును నీతిగా ఎంచాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:10
πῶς οὖν ἐλογίσθη? ἐν περιτομῇ ὄντι, ἢ ἐν ἀκροβυστίᾳ
పౌలు తను చెప్పాలనుకున్న అంశాలను నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహామును నీతిగా ఎప్పుడు పరిగణించాడు? సున్నతి పొందకముందా లేక సున్నతి పొందిన తరువాత?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
οὐκ ἐν περιτομῇ, ἀλλ’ ἐν ἀκροβυστίᾳ
అతను సున్నతి పొందక మునుపే ఇది జరిగింది గాని అతను సున్నతి పొందిన తరువాత కాదు
Romans 4:11
σφραγῖδα τῆς δικαιοσύνης τῆς πίστεως τῆς ἐν τῇ ἀκροβυστίᾳ
ఇక్కడ “విశ్వాస సంబంధమైన నీతి” అనే మాటకు దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించాడని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అతను సున్నతి పొందక మునుపే దేవునియందు విశ్వాసముంచియున్నాడు గనుకనే దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించాడనెందుకు కనపించే గురుతుయైయున్నది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
δι’ ἀκροβυστίας
వారు సున్నతి పొందకపోయినప్పటికి
εἰς τὸ λογισθῆναι αὐτοῖς τὴν δικαιοσύνην
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచియున్నాడని దీని అర్థమునైయున్నది” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:12
καὶ πατέρα περιτομῆς
ఇక్కడ “సున్నతి” అనే పదము దేవునియందు విశ్వాసముంచిన నిజమైన విశ్వాసులను సూచించుచున్నది, ఈ విశ్వాసులలో యూదులు మరియు అన్యులు కూడా ఉన్నారు.
τοῖς στοιχοῦσιν τοῖς ἴχνεσιν τῆς…πίστεως, τοῦ πατρὸς ἡμῶν Ἀβραάμ
ఇక్కడ “విశ్వాసపు అడుగలను అనుసరించుట” అనే మాట ఒక నానుడియైయున్నది, దీనికి అనుసరించుటకు ఒకరి మాదిరికరమైన జీవితము అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన తండ్రియైన అబ్రాహాము యొక్క విశ్వాస సంబంధమైన జీవితమును అనుసరించువారు” లేక “మన తండ్రియైన అబ్రాహాము చేసినట్లుగా విశ్వాసమును కలిగియుండుట” (చూడండి: జాతీయం (నుడికారం))
Romans 4:13
ἀλλὰ διὰ δικαιοσύνης πίστεως
“వాగ్ధానము కలిగింది” అనే మాటలు మొదటి వాక్యమునుండి అర్థము చేయబడుచున్నది. అన్వయించుకొనే మాటలను చేర్చుట ద్వారా మీరు దీనిని తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే విశ్వాసము ద్వారా వాగ్ధానము వచ్చింది, దానినే దేవుడు నీతిగా ఎంచును” (చూడండి: శబ్దలోపం)
Romans 4:14
κληρονόμοι
దేవుడు ప్రజలతో చేసిన వాగ్ధానములన్నియు ఒక కుటుంబ సభ్యుడినుండి పొందుకునే ఆస్తి మరియు సంపదవలె ఉన్నాయన్నట్లుగా చెప్పబడియున్నది. (చూడండి: రూపకం)
εἰ…οἱ ἐκ νόμου κληρονόμοι
ఇక్కడ “ధర్మశాస్త్రము ద్వారా జీవించుట” అనే మాట ధర్మశాస్త్రముకు లోబడియుండుట అని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రముకు లోబడినవారందరూ భూమిని స్వతంత్రించుకొనినట్లయితే” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κεκένωται ἡ πίστις καὶ κατήργηται ἡ ἐπαγγελία
విశ్వాసముకు ఎటువంటి విలువలేదు, మరియు వాగ్ధానముకు అర్థము లేదు
Romans 4:15
οὐδὲ παράβασις
“అపరాధము” అనే నైరూప్య నామవాచకమును తొలగించుటకు మీరు దీనిని తిరిగి చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమును ఎవరును తిరస్కరించలేరు” లేక “ధర్మశాస్త్రముకు అవిధేయత చూపుట అసాధ్యము” (చూడండి: భావనామాలు)
Romans 4:16
διὰ τοῦτο
అందుచేత
ἐκ πίστεως
“అది” అనే పదము లేక అక్షరము దేవుడు వాగ్ధానము చేసినదానిని పొందుకొనుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము వాగ్ధానమును పొందుకొనుటయనునది విశ్వాసము ద్వారానే జరుగును” లేక “విశ్వాసము ద్వారానే మనము వాగ్ధానమును పొందుకొనియున్నాము” (చూడండి: @)
ἵνα κατὰ χάριν…τὴν ἐπαγγελίαν
ఇక్కడ “వాగ్ధానము కృప పైన ఆధారపడియున్నది” అనే మాట దేవుడు తన కృపనుబట్టి ఆయన వాగ్ధానము చేసినదానిని ఇచ్చుచున్నాడని తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత ఆయన వాగ్ధానము చేసినది ఉచితమైన వరమే” లేక “అంచుచేత అయన వాగ్ధానము ఆయన క్రుపనుబట్టియే” (చూడండి: రూపకం)
τῷ ἐκ τοῦ νόμου
ఇది మోషే అందించిన ధర్మశాస్త్రముకు కట్టుబడి ఉండాలనుకునే యూదా ప్రజలను సూచించును.
τῷ ἐκ πίστεως Ἀβραάμ
అబ్రాహాము సున్నతి చేయించుకొనక మునుపు చేసిన క్రియవలె విశ్వాసము కలిగియున్నవారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అబ్రాహాము విశ్వసించినట్లుగానే నమ్మినవారందరూ”
πατὴρ πάντων ἡμῶν
ఇక్కడ “మనము” అనే పదము పౌలును మరియు క్రీస్తునందు యూదులను మరియు యూదేతరులను కలిపి సూచించుచున్నది. అబ్రాహాము యూదా ప్రజల భౌతిక సంబంధమైన పితరుడు, అయితే ఈయన విశ్వాసము కలిగియున్నవారందరికీ ఆత్మీయ తండ్రియైయున్నాడు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 4:17
καθὼς γέγραπται
ఈ మాటలు ఎక్కడ వ్రాయబడియున్నవో దానిని స్పష్టముగా చేయాలి. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో వ్రాసినట్లుగా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τέθεικά σε
“నువ్వు” అనే పదము ఇక్కడ ఏకవచనము మరియు ఇది ప్రత్యామ్నాయ అనువాదము: “ (చూడండి: ‘మీరు’ రూపాలు)
κατέναντι οὗ ἐπίστευσεν Θεοῦ, τοῦ ζῳοποιοῦντος τοὺς νεκροὺς
ఇక్కడ “తాను నమ్ముకున్న దేవుడు” అనే మాట దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తాను నమ్మిన దేవుని సన్నిధిలో అనగా చనిపోయినవారికి జీవమునిచ్చే దేవుని సన్నిధిలో అబ్రాహాము ఉన్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καλοῦντος τὰ μὴ ὄντα ὡς ὄντα
శూన్యములోనుండి సమస్తము చేసెను
Romans 4:18
ὃς παρ’ ἐλπίδα, ἐπ’ ἐλπίδι ἐπίστευσεν
ఈ నానుడికి అర్థము ఏమనగా అబ్రహాము కుమారుని పొందకముందే అతను దేవునిని విశ్వసించియుండెను. ప్రత్యామ్నాయ అనువాదము: “తనకు పిల్లలను కనడం అసాధ్యమైనప్పటికిని, అతను దేవునిని నమ్మియుండెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κατὰ τὸ εἰρημένον
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రహాముకు చెప్పినట్లుగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οὕτως ἔσται τὸ σπέρμα σου
దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన సంపూర్ణ వాగ్ధానము స్పష్టముగా చెప్పవలసిన అవసరత ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు లెక్కించునంతకంటే ఎక్కువ సంతానమును పొందుదువు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 4:19
καὶ μὴ ἀσθενήσας τῇ πίστει
మీరు దీనిని అనుకూల వాక్యములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయినప్పటికిని, అతను తన విశ్వాసములో బలముగా నిలువబడియుండెను” (చూడండి: ద్వంద్వ నకారాలు)
Romans 4:20
οὐ διεκρίθη τῇ ἀπιστίᾳ
మీరు దీనిని అనుకూల వచనములో ద్వంద్వ అననుకూలమైన మాటలలో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో నడుస్తూ ఉండెను” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ἐνεδυναμώθη τῇ πίστει
మీరు దీనిని క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అతను తన విశ్వాసములో బలవంతుడాయేను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:21
καὶ πληροφορηθεὶς
అబ్రాహాము సంపూర్ణముగా నమ్మాడు
δυνατός ἐστιν καὶ ποιῆσαι
దేవుడు చేయుటకు సమర్థుడైయుండెను
Romans 4:22
διὸ καὶ ἐλογίσθη αὐτῷ εἰς δικαιοσύνην
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేతనే దేవుడు అబ్రాహాము నమ్మకమును నీతిగా ఎంచియున్నాడు” లేక “అబ్రాహామును దేవుడు విశ్వసించినందున దేవుడు ఆయనను నీతిగా ఎంచియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:23
ἐγράφη δὲ
విశ్వాసము ద్వారా అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చబడుటయనునది నేటి రోజుల్లో క్రీస్తు మరణ పునరుత్థానములయందు విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురనే సంగతిని కలిపేందుకు ఇక్కడ ఉపయోగించబడియున్నది.
δι’ αὐτὸν μόνον
అబ్రాహాము కొరకు మాత్రమే
ὅτι ἐλογίσθη αὐτῷ
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచినందున” లేక “దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించెను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 4:24
δι’ ἡμᾶς
“మనము” అనే పదము పౌలు మరియు క్రీస్తునందున్న విశ్వాసులందరిని సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
καὶ δι’ ἡμᾶς, οἷς μέλλει λογίζεσθαι, τοῖς πιστεύουσιν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది కూడా మన ప్రయోజనము కొరకే, ఎందుకంటే మనము విశ్వసించినట్లయితే దేవుడు మనలను కూడా నీతిమంతులుగా పరిగణించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὸν ἐγείραντα Ἰησοῦν, τὸν Κύριον ἡμῶν, ἐκ νεκρῶν
మరణమునుండి లేపబడియున్నాడు... అనే మాట ఒక నానుడియైయున్నది, దీనికి “మరల బ్రతుకునట్లు చేసెను” అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన ప్రభువైన యేసును బ్రతుకునట్లు చేసినవాడు” (చూడండి: జాతీయం (నుడికారం))
Romans 4:25
ὃς παρεδόθη διὰ τὰ παραπτώματα ἡμῶν, καὶ ἠγέρθη διὰ τὴν δικαίωσιν ἡμῶν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మన అపరాధముల కొరకు శత్రువులకు అప్పగించి మరియు దేవుడు ఆయనను తిరిగి బ్రతికించెను. తద్వారా ఆయన తనతోపాటు మనలను నీతిమంతులనుగా చేసెను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 5
రోమా.05 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
అనేకమంది పండితులు 12-17 వచనముల వాక్యభాగమును చాలా ప్రాముఖ్యమైన భాగముగా చూశారు, అయితే లేఖనములలోని ఆ వచనములు అర్థము చేసుకోవడము చాలా కష్టము. వాటి వైభవము మరియు వాటి అర్థము మూల భాషయైన గ్రీకు భాషనుండి తర్జుమా చేయునప్పుడు పోయినట్లు అనిపిస్తుంది.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు
నీతిమంతునిగా తీర్చబడుటయొక్క ఫలితములు
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన భాగముగా మనము నీతిమంతులుగా తీర్చబడుటయొక్క ఫలితాలను పౌలు ఎలా వివరించుచున్నాడు. ఈ ఫలితాలన్నియు దేవునితో సమాధానమును కలిగియుండుటలో, దేవునితో మాట్లాడుటలో, మన భవిష్యత్తును గూర్చిన నిశ్చయతను కలిగియుండుటలో, మనము శ్రమలు పొందుచున్నప్పుడు పొందే ఆనందములో, నిత్య రక్షణను కలిగియుండుటలో, మరియు దేవునితో సమాధానపడుటలో భాగమైయుండును. (చూడండి: న్యాయమైన, న్యాయం, అన్యాయమైన, అన్యాయం, నిర్దోషిగా/నీతిమంతులుగా చేయు, నీతిమంతునిగా తీర్చబడడం)
“అందరును పాపము చేసియున్నారు”
పౌలు 12వ వచనములో చెప్పుచున్న మాటనుబట్టి పండితులు విడిపోయారు: “సర్వమానవాళిని పాపము వేరు చేసింది, ఎందుకంటే అందరును పాపము చేశారు.” సర్వ మానవాళి ఆదాము బీజమందున్నారు” అని కొంతమంది నమ్ముతారు. అందుచేత, సర్వమానవాళికి ఆదాము ఎలాగు తండ్రిగా ఉన్నాడో, అలాగే ఆదాము పాపము చేసినప్పుడు అందరును అక్కడే ఉన్నారు. మరికొంతమంది ఆదాము సర్వమానవాళికి ముఖ్యస్థుడుగానే ఉన్నాడు, గనుక అతను పాపము చేసినప్పుడు, ప్రజలందరూ తత్ఫలితముగా “పడిపోవాల్సిందే. ఆదాముయొక్క వాస్తవ పాపములో నేడు ప్రజలు పరోక్ష పాత్రను పోషించారా లేక ప్రత్యక్ష పాత్రను పోషించారా అనేది ఒక విషయమైతే, ఇక్కడ ఇవ్వబడిన కొన్ని దృష్టికోణములు వ్యత్యాసము చూపిస్తాయి. ఇతర వాక్యభాగములు కేవలము ఒక నిర్ణయమునకు మాత్రమే సహకరించును. (చూడండి: విత్తనము, వీర్యము మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
రెండవ ఆదాము
ఆదాము మొదటి మానవుడు మరియు దేవుని మొదటి “కుమారుడు”. ఇతను దేవునిచేత చేయబడియున్నాడు. నిషేధించబడిన పండును తినుట ద్వారా ఇతను లోకములోనికి పాపమును మరియు మరణమును తీసుకొని వచ్చియున్నాడు. పౌలు ఈ అధ్యాయములో యేసు “రెండవ ఆదాముగా” వివరించి చెప్పుచున్నాడు మరియు ఈయనే నిజమైన కుమారుడు అని చెప్పుచున్నాడు. ఈయన సిలువలో మరణించుట ద్వారా పాపమును మరియు మరణమును జయించి జీవమును తీసుకొనివచ్చియున్నాడు. (చూడండి: దేవుని కుమారుడు, కుమారుడు మరియు చనిపోవడం, చనిపోయిన, ప్రమాదకరమైన, మరణం)
Romans 5:1
దేవుడు తనతో విశ్వాసులను నీతిమంతులనుగా చేసుకొనినప్పుడు జరిగిన అనేక విషయాలను తెలియజేయాలని పౌలు ఆరంభించాడు.
δικαιωθέντες οὖν
మనము నీతిమంతులుగా తీర్చబడినందున
…ἡμῶν
“మనము” మరియు “మన” అనే పదాలు విశ్వాసులందరిని సూచించుచున్నవి మరియు వాటిలో అన్నియు చేర్చబడియున్నవి. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
διὰ τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ
మన ప్రభువైన యేసు క్రీస్తునుబట్టి
τοῦ Κυρίου
ఇక్కడ “ప్రభువు” అనే పదమును యేసు దేవుడు అని అర్థము.
Romans 5:2
δι’ οὗ καὶ τὴν προσαγωγὴν ἐσχήκαμεν, τῇ πίστει εἰς τὴν χάριν ταύτην, ἐν ᾗ ἑστήκαμεν
ఇక్కడ “విశ్వాసము ద్వారా” అనే మాట యేసునందు మన నమ్మకమును సూచించుచున్నది, ఇది మనలను దేవుని ఎదుట నిలువబడుటకు అనుమతించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము యేసునందు విశ్వసించినందున, దేవుడు మనకు ఆయన సన్నిధిలోనికి వచ్చుటకు అనుమతించును”
Romans 5:3
οὐ μόνον δέ
“ఈ” అనే పదము [రోమా.5:1-2] (./01.md) వచనములోని ఆలోచనను సూచించుచున్నది.
καυχώμεθα…
ఈ మాటలు విశ్వాసులందరిని సూచించుచున్నవి మరియు అందులో చేర్చబడుటకు అవకాశమున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 5:4
ἐλπίδα
క్రీస్తునందు నమ్మికయుంచినవారందరికొరకు దేవుడు తన వాగ్ధానములన్నియు నేరవేర్చుచున్నాడనుటకు ఇదే మనకు నిశ్చయత.
Romans 5:5
ἡμῶν…ἡμῖν
ఈ మాటలు విశ్వాసులందరిని సూచించుచున్నవి మరియు అందులో చేర్చబడుటకు అవకాశమున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἡ…ἐλπὶς οὐ καταισχύνει
“నిశ్చయత” అనునది జీవించేది అన్నట్లుగా పౌలు ఇక్కడ వ్యక్తిత్వమును ఉపయోగించి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఎదురుచూచుచున్నవాటిని మనము పొందుకొందుమని మనము ఎంతో నిశ్చయతను కలిగియున్నాము” (చూడండి: మానవీకరణ)
ὅτι ἡ ἀγάπη τοῦ Θεοῦ ἐκκέχυται ἐν ταῖς καρδίαις ἡμῶν
ఇక్కడ “హృదయములు” అనే మాట ఒక వ్యక్తి ఆలోచనలను, భావాలను, లేక అంతరంగమును సూచించుచున్నది. “దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరించబడియున్నది” అనే మాట దేవుడు తన ప్రజలకు ప్రేమను చూపించియున్నాడనే మాట కొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ఇది క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన మనలను ఎక్కువగా ప్రేమించినందున” లేక “దేవుడు మనలను ఎంతగా ప్రేమించియున్నాడని దేవుడు మనకు చూపించినందున” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 5:6
ἡμῶν
“మనము” అనే పదము ఇక్కడ విశ్వాసులందరినీ సూచించుచున్నది మరియు అందుచేత అందులో అందరు చేర్చబడియున్నారు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 5:7
μόλις γὰρ ὑπὲρ δικαίου τις ἀποθανεῖται
నీతిమంతుడికొరకైన చనిపోయేవాడిని కనుగొనుట ఎంతో కష్టము
ὑπὲρ γὰρ τοῦ ἀγαθοῦ, τάχα τις καὶ τολμᾷ ἀποθανεῖν
అయితే ఒక మంచి వ్యక్తి కొరకు చనిపోవుటకు ఇష్టపడే వ్యక్తిని మీరు కనుగొనవచ్చును
Romans 5:8
συνίστησιν
“ప్రదర్శించబడియున్నది” లేక “చూపించబడియున్నది” అని భూతకాలములోని మాటలను ఉపయోగించి ఈ క్రియను మీరు తర్జుమా చేయవచ్చును.
ἡμῶν…ἡμῶν
“మనము” మరియు “మేము” అనే అన్ని పదములు విశ్వాసులను సూచించుచున్నవి మరియు అందులో అందరు చేర్చబడియున్నారు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 5:9
πολλῷ οὖν μᾶλλον δικαιωθέντες νῦν ἐν τῷ αἵματι αὐτοῦ
ఇక్కడ “నీతిమంతులుగా తీర్చబడుట” అనే మాటకు దేవుడు తనతో సరియైన సంబంధము కలిగియుండుటలో ఉంచియున్నాడు అని అర్థము. మీరు దీనిని క్రియాత్మకమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనకొరకు ఎంత ఎక్కువగా చేస్తాడు అని అంటే సిలువలో యేసు మరణము ద్వారా ఆయనతో సరియైన సంబంధమును కలిగియుండునంతగా మనలను తీర్చిదిద్దియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῷ αἵματι
సిలువలో యేసు త్యాగపూరితమైన మరణముకొరకు వాడబడిన పర్యాయ మాటలవి. (చూడండి: అన్యాపదేశము)
σωθησόμεθα
ఈ మాటకు సిలువలో యేసు యొక్క త్యాగపూరితమైన మరణము ద్వారా అని అర్థము, మనము చేసిన పాపముల కొరకు నరకములో శిక్షను అనుభవించుటకు బదులుగా దేవుడు మనలను క్షమించి రక్షించియున్నాడు.
τῆς ὀργῆς
ఇక్కడ “ఉగ్రత” అనే పదము దేవునికి విరుద్ధముగా పాపము చేసినవారికి ఆయన ఇచ్చే శిక్షను సూచించుటకు ఉపయోగించబడిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని శిక్ష” (చూడండి: అన్యాపదేశము)
Romans 5:10
ὄντες
“మనము” అనే పదము విశ్వాసులను సూచించుచున్నది మరియు అందులో అందరు చేర్చబడియుందురు.
Υἱοῦ αὐτοῦ, πολλῷ μᾶλλον καταλλαγέντες, σωθησόμεθα ἐν τῇ ζωῇ αὐτοῦ
దేవుని కుమారుడు ... దేవుని కుమారుని జీవితము
κατηλλάγημεν τῷ Θεῷ διὰ τοῦ θανάτου τοῦ Υἱοῦ αὐτοῦ
దేవుని కుమారుని మరణము యేసునందు విశ్వాసముంచినవారందరికి నిత్య క్షమాపణను అనుగ్రహించియున్నది మరియు దేవునితో స్నేహము చేసే భాగ్యము అనుగ్రహించియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారుడు మన కొరకు సిలువలో చనిపోయినందున దేవుడు తనతో సమాధానకరమైన సంబంధమును కలిగియుండుటకు అనుమతించియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τοῦ Υἱοῦ
దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు ఇది లేక పేరు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
καταλλαγέντες
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇప్పుడు దేవుడు మరల మనలను ఆయన స్నేహితులనుగా చేసుకొనియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 5:12
దేవుడు మోషేకు ధర్మశాస్త్రమును ఇవ్వకముందే మరణము ఎందుకు సంభవించిందని పౌలు వివరించుచున్నాడు.
δι’ ἑνὸς ἀνθρώπου ἡ ἁμαρτία εἰς τὸν κόσμον εἰσῆλθεν, καὶ διὰ τῆς ἁμαρτίας ὁ θάνατος
ఆదాము అనే “ఒక మనిషి” క్రియల ద్వారా లోకములోనికి అపాయకరమైన విషయముగా ప్రవేశించిన పాపమును గూర్చి పౌలు వివరించుచున్నాడు. ఈ పాపము మరణము ద్వారా బహిరంగమైనది, ఈ లోకములోనికి మరియొక అపాయకరమైనది ప్రవేశించియున్నది అన్నట్లుగా ఇక్కడ పాపము చిత్రీకరించబడియున్నది. (చూడండి: మానవీకరణ)
Romans 5:13
ἄχρι γὰρ νόμου, ἁμαρτία ἦν ἐν κόσμῳ
దేవుడు ధర్మశాస్త్రమును ఇవ్వకమునుపే ప్రజలు పాపము చేసియున్నారని ఈ మాటకు అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ధర్మశాస్త్రమును మోషేకు ఇవ్వక మునుపే లోకములోనున్న ప్రజలు పాపము చేసియున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἁμαρτία δὲ οὐκ ἐλλογεῖται, μὴ ὄντος νόμου
దేవుడు ప్రజలకు ధర్మశాస్త్రమును ఇవ్వకముందు వారు చేసిన తప్పులకు శిక్షించడని దీని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే దేవుడు ధర్మశాస్త్రమును ఇవ్వకమునుపు ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా పాపములను లెక్కించలేదు (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 5:14
ἀλλὰ…ὁ θάνατος
నేను చెప్పినది సత్యమే అయినప్పటికిని, మరణమున్నది లేక “ఆదాము కాలమునుండి మోషే కాలమువరకు ఎటువంటి ధర్మశాస్త్రము లేదు, కాని మరణమున్నది” ([రోమా.5:13] (../05/13.md)).
ἐβασίλευσεν ὁ θάνατος ἀπὸ Ἀδὰμ μέχρι Μωϋσέως
పాపము ఒక రాజులా ఏలుతుందన్నట్లుగా పౌలు పాపమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు చేసిన పాపములకు పరిణామముగా ఆదాము కాలమునుండి మోషే కాలమువరకు ప్రజలు చనిపొతూనే ఉన్నారు” (చూడండి: మానవీకరణ మరియు రూపకం)
καὶ ἐπὶ τοὺς μὴ ἁμαρτήσαντας ἐπὶ τῷ ὁμοιώματι τῆς παραβάσεως Ἀδάμ
ఆదాముకు విభిన్నముగా ప్రజల పాపములున్నప్పటికిని చనిపోతూనే ఉన్నారు
ὅς ἐστιν τύπος τοῦ μέλλοντος
ఎంతో కాలము తరువాత కనిపించిన క్రీస్తుకు ఆదాము నమూనాగా ఉండెను. ఆయనకు అతనికి ఎన్నో విషయాల్లో పోలికలు కలవు.
Romans 5:15
εἰ γὰρ τῷ τοῦ ἑνὸς παραπτώματι, οἱ πολλοὶ ἀπέθανον
ఇక్కడ “ఒకనివలన” అనే మాట ఆదామును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా : “ఒక మనిషి చేసిన పాపము ద్వారా, అనేకమంది చనిపోయారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πολλῷ μᾶλλον ἡ χάρις τοῦ Θεοῦ καὶ ἡ δωρεὰ ἐν χάριτι, τῇ τοῦ ἑνὸς ἀνθρώπου, Ἰησοῦ Χριστοῦ, εἰς τοὺς πολλοὺς ἐπερίσσευσεν
ఇక్కడ “కృప” అనే పదము దేవుడు యేసు క్రీస్తు ద్వారా ప్రతియొక్కరికి అందుబాటులో ఉండుటకు దేవుని ఉచిత వరమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనందరికొరకు చనిపోయిన యేసు క్రీస్తు అను మనుష్యుడి ద్వారా మరిఎక్కువగా ఈ నిత్యజీవ సంబంధమైన వరమును మనము పొందనర్హత లేకపోయినప్పటికిని దేవుడు మనఎడల దయ ఉంచి మనకు అనుగ్రహించియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 5:16
καὶ οὐχ ὡς δι’ ἑνὸς ἁμαρτήσαντος, τὸ δώρημα
ఇక్కడ “వరము” అనే పదము దేవుడు మన పాపములను ఉచితముగా తుడిచి వేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ వరము ఆదాము పాపమునకు వచ్చిన ఫలితమువలె కాదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τὸ…γὰρ κρίμα ἐξ ἑνὸς, εἰς κατάκριμα, τὸ δὲ χάρισμα ἐκ πολλῶν παραπτωμάτων, εἰς δικαίωμα
“ఈ వరము ఆదాము చేసిన పాపమునకు కలుగు ఫలితమువలె ఎందుకు కాదు” అని చెప్పుటకు పౌలు రెండు కారణములను ఇచ్చుచుచున్నాడు. “శిక్షకు సంబంధించిన తీర్పు” అనే మాట మనము చేసిన పాపములకొరకు దేవుని శిక్షకు మనము అర్హులమైయున్నాము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మనిషి చేసిన పాపమువలన సమస్త మానవాళి శిక్షకు అర్హులైయున్నారని దేవుడు ఒకవైపు చెబుతూ ఉంటే, మరొక వైపు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τὸ…χάρισμα ἐκ πολλῶν παραπτωμάτων, εἰς δικαίωμα
మనము శిక్షకు పాత్రులమైయున్నప్పటికిని దేవుడు ఎలా తనతో నీతిమంతులనుగా చేసుకొనగలడని అనే విషయమును ఈ మాట సూచించున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని దయగల వరమే ఆయనతో మనలను నీతిమంతులనుగా చేసియున్నది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐκ πολλῶν παραπτωμάτων
అనేకమంది పాపములు చేసిన తరువాత
Romans 5:17
τοῦ ἑνὸς παραπτώματι
ఇది ఆదాము పాపమును సూచించుచున్నది.
ὁ θάνατος ἐβασίλευσεν
పాలించు రాజువలె “మరణము” ఉన్నదన్నట్లుగా పౌలు దానిని గూర్చి మాట్లాడుచున్నాడు. మరణ “పాలన” అనేది ప్రతియొక్కరిని మరణముకు గురి చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతియొక్కరు చనిపోయిరి” (చూడండి: మానవీకరణ మరియు రూపకం)
Romans 5:18
ὡς δι’ ἑνὸς παραπτώματος
ఆదాము ద్వారా ఒక్క పాపము జరిగినందున లేక “ఆదాము చేసిన పాపమునుబట్టి”
εἰς πάντας ἀνθρώπους εἰς κατάκριμα
ఇక్కడ “శిక్ష” అనే పదము దేవుని శిక్షను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరూ తాము పాపము చేసినందున దేవుని శిక్షకు ప్రతియొక్కరు అర్హులైయున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
δι’ ἑνὸς δικαιώματος
యేసు క్రీస్తు త్యాగము
εἰς πάντας ἀνθρώπους…δικαίωσιν ζωῆς
ఇక్కడ “నీతిమంతులుగా తీర్చబడుట” అనగా దేవుడు తనతోపాటు ప్రజలను నీతిమంతులనుగా చేయు సామర్థ్యమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరిని నీతిమంతులనుగా చేయుటకు దేవుని వరమునైయున్నది” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 5:19
τῆς παρακοῆς τοῦ ἑνὸς ἀνθρώπου
ఆదాము అవిధేయత
ἁμαρτωλοὶ κατεστάθησαν οἱ πολλοί
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది ప్రజలు పాపము చేసిరి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῆς ὑπακοῆς τοῦ ἑνὸς
యేసు విధేయత
δίκαιοι κατασταθήσονται οἱ πολλοί
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అనేకమందిని తనతో నీతిమంతులనుగా చేసికొనును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 5:20
νόμος…παρεισῆλθεν
ధర్మశాస్త్రము ఒక వ్యక్తియన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన ధర్మశాస్త్రమును మోషేకి ఇచ్చియున్నాడు” (చూడండి: మానవీకరణ)
ἐπλεόνασεν ἡ ἁμαρτία
పాపము పెరిగిపోయింది
ὑπερεπερίσσευσεν ἡ χάρις
ఇక్కడ “కృప” అనే పదము దేవుని అనర్హమైన ఆశీర్వాదములను సూచించును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు అర్హులు కాదన్నట్లుగానే దేవుడు వారియెడల ఇంకా ఎక్కువ దయను కనుబరుస్తూ నడుచుకొనుచున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 5:21
ὥσπερ ἐβασίλευσεν ἡ ἁμαρτία ἐν τῷ θανάτῳ
“పాపము” పాలించే రాజుగా ఉన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపమువలన మరణము వచ్చింది” (చూడండి: మానవీకరణ మరియు రూపకం)
οὕτως καὶ ἡ χάρις βασιλεύσῃ διὰ δικαιοσύνης, εἰς ζωὴν αἰώνιον διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν
“కృప” పాలించే రాజు అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన ప్రభువైన యేసు క్రీస్తు నీతి ద్వారా కృప ప్రజలకు నిత్య జీవమును అనుగ్రహించియున్నది” (చూడండి: మానవీకరణ మరియు రూపకం)
οὕτως…ἡ χάρις βασιλεύσῃ διὰ δικαιοσύνης
“కృప” పాలించే రాజు అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. “నీతి” అనే పదము దేవుడు ప్రజలను నీతిమంతులనుగా చేసే సామర్థ్యమును గూర్చి మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనుష్యులను నీతిమంతులనుగా చేయుటకు ఆయన వారికి ఉచిత వరమును అనుగ్రహించుచున్నాడు” (చూడండి: మానవీకరణ మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τοῦ Κυρίου ἡμῶν
పౌలు తనతోపాటు, తన చదువరులను మరియు విశ్వాసులందరిని చేర్చుకొనుచున్నాడు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 6
రోమా 06 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
పౌలు 5వ అధ్యాయములో చెప్పినవాటికి ఒకరు కాల్పనికముగా ఎలా ఉండగలరని జవాబునిచ్చుట ద్వారా పౌలు ఈ అధ్యాయమును ఆరంభించియున్నాడు. (చూడండి: ఊహాత్మక పరిస్థితులు)
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు
ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా
ఈ అధ్యాయములో క్రైస్తవులు రక్షణ పొందిన తరువాత వారు తమకు ఇష్టమువచ్చినట్లుగా జీవంచవచ్చుననే బోధనను పౌలు తిరస్కరించుచున్నాడు. పండితులు దీనిని “అంటినోమియనిజము” లేక “ధర్మశాస్త్రముకు విరుద్ధముగా నడుచుకోవడం” అని పిలిచారు. భక్తి సంబంధమైన జీవితమును ప్రోత్సహించుటకు, రక్షణపొందిన క్రైస్తవులకొరకు యేసు గొప్ప ధనమును చెల్లించాడు అని పౌలు తెలియజేయుచున్నాడు. (చూడండి: రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ మరియు దైవభక్తిగల, దైవభక్తి, దైవభక్తిలేని, దేవుడులేని, దైవభక్తిలేని, దేవుడులేని స్థితి)
పాపమునకు దాసులు
యేసునందు నమ్మికయుంచుటకు మునుపు, పాపము ప్రజలను బానిసలుగా చేసుకొనియుండెను. దేవుడు పాపమునకు సేవ చేయుటనుండి క్రైస్తవులను విడిపించాడు. అప్పుడు వారు తమ జీవితాలలో క్రీస్తుకు మాత్రమే సేవ చేయాలని ఎన్నుకొనియున్నారు. క్రైస్తవులు పాపము చేయుటను ఎన్నుకొనినప్పుడు, వారు ఇష్టపూర్వకముగానే పాపము చేయుటకు ఎన్నుకున్నారని పౌలు వివరించుచున్నారు. (చూడండి: విశ్వాసం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఫలము
ఈ అధ్యాయము ఫలము యొక్క చిత్రమును ఉపయోగించుకొనుచున్నది. ఫలము యొక్క చిత్రము సహజముగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసము ఆ వ్యక్తి జీవితములో మంచి క్రియలను పుట్టించుననే విషయమును సూచించును. (చూడండి: ఫలం, ఫలవంతం, నిష్ఫలమైన మరియు నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత)
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారములు
అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ఈ అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుటకుగల ఉద్దేశము చదువరులు వారి పాపమును గుర్తించునట్లు చేయుటయైయున్నది. తద్వారా వారు యేసునందు విశ్వసించుదురు. (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు అపరాధ భావం, దోషం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ప్రాముఖ్యమైన క్లిష్ట భాగములు
మరణము
పౌలు ఈ అధ్యాయములో “మరణము” అనే పదమును చాలా విధాలుగా ఉపయోగించియున్నాడు: భౌతిక మరణము, ఆత్మీయ మరణము, పాపము మనిషి హృదయములో ఏలుతూ ఉన్నది, మరియు ఒకదానికి ముగింపుయైయున్నది. క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన క్రొత్త జీవితము ద్వారా మరియు క్రైస్తవుల నూతనమైన విధానముద్వారా మరణమును మరియు పాపమును గూర్చి వివరించుచు, వారు రక్షణ పొందిన తరువాత ఎలా జీవించాలని వివరించుచున్నాడు. (చూడండి: చనిపోవడం, చనిపోయిన, ప్రమాదకరమైన, మరణం)
Romans 6:1
పాపము విషయములో మృతపొంది, దేవుని విషయములో జీవిస్తూ ఒక క్రొత్త జీవితమును జీవించుటకు యేసునందు విశ్వసించియున్నారని, కృప క్రింద ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు.
τί οὖν ἐροῦμεν? ἐπιμένωμεν τῇ ἁμαρτίᾳ, ἵνα ἡ χάρις πλεονάσῃ
పౌలు చదువరుల శ్రద్ధను రాబట్టుటకు ఈ అలంకారిక ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత, ఈ విషయాలన్నిటిని గూర్చి మనము ఏమి చెప్పుదుము? మనము పాపము చేయకూడదు, తద్వారా దేవుడు మనకు ఎక్కువ ఎక్కువ కృపను అనుగ్రహించును! (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐροῦμεν
“మనము” అనే సర్వ నామము పౌలును, తన చదువరులను మరియు ఇతర ప్రజలను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 6:2
οἵτινες ἀπεθάνομεν τῇ ἁμαρτίᾳ, πῶς ἔτι ζήσομεν ἐν αὐτῇ
ఇక్కడ “పాపము విషయమై చనిపోవడం” అనే మాటకు యేసును అనుసరించుచున్నవారు ఇప్పుడు పాపము ద్వారా ప్రభావితము చెందని చనిపోయిన ప్రజలు. పౌలు ఈ విషయమును నొక్కి చెప్పుటకు ఈ అలంకారిక ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము మనలను ప్రభావితము చేయలేని విధముగా మనము మరణించినవారివలె ఉన్నాము! అందుచేత మనము పాపము చేయనే కూడదు!” (చూడండి: రూపకం మరియు అలంకారిక ప్రశ్న)
Romans 6:3
ἢ ἀγνοεῖτε, ὅτι ὅσοι ἐβαπτίσθημεν εἰς Χριστὸν Ἰησοῦν, εἰς τὸν θάνατον αὐτοῦ ἐβαπτίσθημεν?
పౌలు నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “గుర్తుంచుకొనండి, మనకు యేసు క్రీస్తుతో సంబంధమున్నదని చూపించుటకు ఎవరైనా మనకు బాప్తిస్తము ఇచ్చినప్పుడు, అప్పుడు సిలువలో మనము కూడా క్రీస్తుతోపాటు మరణించియున్నామని కూడా చూపించుచున్నది! (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 6:4
συνετάφημεν οὖν αὐτῷ διὰ τοῦ βαπτίσματος εἰς τὸν θάνατον
నీళ్ళలో విశ్వాసియొక్క బాప్తిస్మము మరణించి సమాధిచేయబడినదానితో సమానము అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనకు ఎవరైనా బాప్తిస్తము ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి సమాధిలో క్రీస్తుతోపాటు మనలను కూడా సమాధి చేసినట్లేనని అర్థము” (చూడండి: రూపకం)
ὥσπερ ἠγέρθη Χριστὸς ἐκ νεκρῶν διὰ τῆς δόξης τοῦ Πατρός, οὕτως καὶ ἡμεῖς ἐν καινότητι ζωῆς περιπατήσωμεν
మరణమునుండి తిరిగి లేవడము అనేది ఒక నానుడియైయున్నది దీనికి అర్థము ఏమనగా చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బ్రతుకుట అని అర్థము. ఒక విశ్వాసి క్రొత్త ఆత్మీయ జీవితము యేసు క్రీస్తు భౌతికముగా తిరిగి వచ్చే కార్యముతో పోల్చడం జరిగింది. విశ్వాసి యొక్క నూతన ఆత్మీయమైన జీవితము దేవునికి విధేయత చూపడానికి ఆ వ్యక్తిని బలపరుస్తుంది. మీరు దీనిని క్రియాత్మకమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “తండ్రియైన దేవుడు యేసును మరణమునుండి లేపి జీవింపజేసినట్లుగానే, మనము కూడా క్రొత్త ఆత్మీయ జీవితమును కలిగియుంటాము మరియు దేవునికి విధేయత చూపుతాము” (చూడండి: ఉపమ మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు జాతీయం (నుడికారం))
ἐκ νεκρῶν
మృతిచెందినవారందరిలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినందరివారిని గూర్చి మాట్లాడుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి లేపబడడం అనేది తిరిగి జీవింపజేయబడడం అనేదానిని గూర్చి మాట్లాడుచున్నది.
Romans 6:5
σύμφυτοι γεγόναμεν τῷ ὁμοιώματι τοῦ θανάτου αὐτοῦ, ἀλλὰ καὶ τῆς ἀναστάσεως ἐσόμεθα
మరణము విషయములో క్రీస్తుతోపాటు మనము ఏకమైయున్నామని పోల్చి చెప్పుచున్నాడు. మరణము విషయములో క్రీస్తుతో ఏకమైయున్న ప్రతియొక్కరు ఆయన పునరుత్థానములో కూడా పాల్గొంటారు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనతో మరణించుట... ఆయనతోపాటు తిరిగి జీవింపజేయుట” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 6:6
ὁ παλαιὸς ἡμῶν ἄνθρωπος συνεσταυρώθη
“పాత పురుషుడు” అనే మాట యేసునందు విశ్వసించక మునుపు ఉన్నటువంటి వ్యక్తిని లేక వ్యక్తిత్వమును సూచించే రూపకఅలంకారమైయున్నది. యేసునందు మనము విశ్వసించినప్పుడే యేసుతోపాటు సిలువలో మన పాత పాప స్వభావము కలిగిన వ్యక్తిని సిలువకు వేసియున్నామని పౌలు వివరించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన పాపసంబంధమైన వ్యక్తి యేసుతోపాటు సిలువలో మరణించియున్నాడు” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὁ παλαιὸς…ἄνθρωπος
ఈ మాటకు ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉండడని అర్థము.
τὸ σῶμα τῆς ἁμαρτίας
సంపూర్ణముగా పాప సంబంధమైన ఒక వ్యక్తిని సూచించే పర్యాయ మాటయైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన పాపసంబంధమైన స్వభావము” (చూడండి: అన్యాపదేశము)
καταργηθῇ
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “చనిపోవుదురు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
μηκέτι δουλεύειν ἡμᾶς τῇ ἁμαρτίᾳ
దీనిని మీరు క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము ఎప్పటికీ మనలను ఏలదు” లేక “మనము ఇక ఎన్నటికి పాపముకు బానిసలము కాదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
μηκέτι δουλεύειν ἡμᾶς τῇ ἁμαρτίᾳ
పాపముకు బానిసలము అనేది రూపకఅలంకారమునైయున్నది, ఈ మాటకు ఒక వ్యక్తి పాపము చేయకుండ ఆపలేనంతగా పాపము చేయుటకు బలమైన ఆశను కలిగియుండుట అని అర్థము. ఇది పాపము ఒక వ్యక్తిని నియంత్రణ చేసినట్లుగా చెప్పబడుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఇక ఎన్నడు పాపము ద్వారా నియంత్రించబడము” (చూడండి: రూపకం)
Romans 6:7
ὁ γὰρ ἀποθανὼν, δεδικαίωται ἀπὸ τῆς ἁμαρτίας.
ఇక్కడ “నీతి” అనే పదము దేవుడు తనతోపాటు ప్రజలందరిని నీతిమంతులనుగా చేసుకొనే దేవుని సామర్థ్యమును సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని తీర్పు తీర్చినప్పుడు, ఆ వ్యక్తి ఇక పాపము చేత నియంత్రించబడడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 6:8
ἀπεθάνομεν σὺν Χριστῷ
ఇక్కడ “చనిపోయినవారు” అనే మాట విశ్వాసులు ఇక పాపము ద్వారా నియంత్రించబడరు అనే వాస్తవమును సూచించుచున్నది. (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 6:9
εἰδότες ὅτι Χριστὸς ἐγερθεὶς ἐκ νεκρῶν
ఇక్కడ లేపబడుట అనే మాట చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించుట అనే అర్థమునిచ్చే నానుడియైయున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మరణించిన తరువాత దేవుడు ఆయనను తిరిగి బ్రతికించియున్నాడని మనకు తెలుసు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు జాతీయం (నుడికారం))
ἐκ νεκρῶν
చనిపోయినవారందరిలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినవారందరిని గూర్చి వివరించునదియైయున్నది. వారి మధ్యలోనుండి తిరిగి లేపబడడం అనేది తిరిగి బ్రతుకుటయైయున్నది.
θάνατος αὐτοῦ οὐκέτι κυριεύει
ఇక్కడ “మరణము” అనేది ప్రజలందరిపైన అధికారముగలిగిన పాలకునివలె లేక రాజువలె వివరించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన ఇక ఎన్నటికి చనిపోడు” (చూడండి: మానవీకరణ)
Romans 6:10
ὃ γὰρ ἀπέθανεν, τῇ ἁμαρτίᾳ ἀπέθανεν ἐφάπαξ
“మనుష్యలందరికొరకు ఒక్కమారే” అనే మాటకు ఏదైనా ఒక కార్యమును సంపూర్ణముగా చేసి ముగించుట అని అర్థము. మీరు ఈ మాటకు సంపూర్ణముగా అర్థము వచ్చేలా మీ తర్జుమాలో స్పష్టతతో వ్యాఖ్యగా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన చనిపోయినప్పుడు, ఆయన సంపూర్ణముగా పాపపు శక్తిని విరగగొట్టియున్నాడు” (చూడండి: జాతీయం (నుడికారం) మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 6:11
οὕτως καὶ ὑμεῖς, λογίζεσθε
ఈ కారణమునుబట్టి వర్తిస్తుంది
λογίζεσθε ἑαυτοὺς
మిమ్మునుగూర్చి మీరు ఆలోచించండి లేక “మిమ్మును మీరు చూచుకొనండి”
νεκροὺς μὲν τῇ ἁμαρτίᾳ
ఒకరు ఏదైనా ఒక కార్యమును చేయుటకు బలవంతము చేయలేరో, అలాగే దేవునిని అగౌరవపరచుటకు పాపము విశ్వాసులను బలవంతము చేయుటకు అధికారము లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పాపపు శక్తి విషయమై చనిపోయినవారైతే” (చూడండి: రూపకం)
νεκροὺς μὲν τῇ ἁμαρτίᾳ, ζῶντας δὲ τῷ Θεῷ
పాపపు శక్తి విషయమై చనిపోవుట, అయితే దేవుని ఘనపరచు విషయమై జీవించుట
ζῶντας…τῷ Θεῷ ἐν Χριστῷ Ἰησοῦ
క్రీస్తు యేసు మీకు ఇచ్చిన శక్తి ద్వారా దేవుని ఘనపరిచే జీవితమును జీవించుట
Romans 6:12
కృప మనలను ఏలుతుందిగాని ధర్మశాస్త్రము కాదని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు; మనము పాపమునకు బానిసలము కాదు గాని దేవునికి దాసులమైయున్నాము.
μὴ…βασιλευέτω ἡ ἁμαρτία ἐν τῷ θνητῷ ὑμῶν σώματι
పాపము వారి యజమాని అన్నట్లుగా లేక వారిని నియంత్రించే రాజు అన్నట్లుగా పౌలు పాపము చేసే ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప సంబంధమైన ఆశలు మిమ్మును నియంత్రించకుండ చూసుకోండి” (చూడండి: మానవీకరణ)
ἐν τῷ θνητῷ ὑμῶν σώματι
ఈ మాట ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన భాగమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు” (చూడండి: ఉపలక్షణము)
εἰς τὸ ὑπακούειν ταῖς ἐπιθυμίαις αὐτοῦ
ఒకవేళ పాపము యజమానియైట్లయితే, అది దుష్ట ఆశలను కలిగియున్నట్లుగా ఒక వ్యక్తి దుష్ట ఆశలను లేక కోరికలను కలిగియున్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
Romans 6:13
μηδὲ παριστάνετε τὰ μέλη ὑμῶν, ὅπλα ἀδικίας τῇ ἁμαρτίᾳ
ఒక పాపి “తన శరీరములోని భాగములను” తన యజమానికి లేక రాజుకు సమర్పించే చిత్రము. ఒకని “దేహమందున్న అవయవములు” ఒక సంపూర్ణ వ్యక్తికొరకు చెప్పబడిన ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపమునకు మిమ్మును మీరే అప్పగించుకొనవద్దు, తద్వారా మీరు సరియైనది ఏది కాదో అదే చేస్తారు”(చూడండి: ఉపలక్షణము)
ἀλλὰ παραστήσατε ἑαυτοὺς τῷ Θεῷ, ὡσεὶ ἐκ νεκρῶν ζῶντας
ఇక్కడ “ఇప్పుడు జీవించుచున్నది” అనే మాట విశ్వాసుల క్రొత్త ఆత్మీయ జీవితమును సూచించును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మిమ్మును మీరు దేవునికి సమర్పించుకొనుడి, ఎందుకంటే ఆయన మీకు క్రొత్త ఆత్మీయమైన జీవితమును అనుగ్రహించియున్నాడు” లేక “అయితే మిమ్మును మీరు మరణించి జీవించినవారివలె దేవునికి సమర్పించుకొనుడి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
καὶ τὰ μέλη ὑμῶν, ὅπλα δικαιοσύνης τῷ Θεῷ
ఇక్కడ “మీ శరీరములోని భాగములు” అనే మాట సంపూర్ణ వ్యక్తిని సూచించే ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునికి మెప్పు కలిగించే కార్యముల కొరకు దేవుడు మిమ్మును ఉపయోగించుకొనునుగాక” (చూడండి: ఉపలక్షణము)
Romans 6:14
ἁμαρτία…ὑμῶν οὐ κυριεύσει,
“పాపము” అనే పదము ఇక్కడ ప్రజలందరిపైన పాలన చేసే రాజువలె ఉన్నదన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు చేసే కార్యములను పాప సంబంధమైన ఆలోచనలు నియంత్రించకుండ చూసుకొనుడి” లేక “మీరు చేయదలచిన పాప సంబంధమైన కార్యములను చేయుటకు అనుమతించుకొనవద్దు” (చూడండి: మానవీకరణ)
οὐ γάρ ἐστε ὑπὸ νόμον
“ధర్మశాస్త్రము క్రింద” ఉండుట అనే మాటకు దాని సరిహద్దులకు మరియు బలహీనతలకు లోబడియుండుట అని అర్థము. మీరు దీనిని మీ తర్జుమా స్పష్టతతో కూడిన సంపూర్ణ అర్థముతో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మోషే ధర్మశాస్త్రముకు కట్టుబడియుండనవసరములేదు, ఎందుకంటే మీరు పాపము చేయకుండ అది ఆపలేదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀλλὰ ὑπὸ χάριν
“కృప క్రింద ఉండుట” అనగా పాపము చేయకుండగ శక్తిని అనుగ్రహించే దేవుని ఉచిత వరము అని అర్థము. మీరు మీ తర్జుమాలో సంపూర్ణ అర్థముతో వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు దేవుని కృపకు కట్టుబడియున్నారు, తద్వారా మీరు పాపము చేయకుండగ మీకు శక్తిని అనుగ్రహించును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 6:15
τί οὖν? ἁμαρτήσωμεν ὅτι οὐκ ἐσμὲν ὑπὸ νόμον, ἀλλὰ ὑπὸ χάριν? μὴ γένοιτο
కృప క్రింద జీవించుట అనగా పాపము చేయుట కారణము కాదు అని నొక్కి చెప్పుటకు పౌలు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఏదిఏమైనా, మనము మోషే ధర్మశాస్త్రముకు కాకుండా కృపకు కట్టుబడియున్నందున మనకు పాపము చేయుటకు అనుమతి దొరికిందని దాని అర్థము కాదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ γένοιτο
అది జరగాలని మేము కోరుకోవడము లేదు! లేక “దానిని చేయకుండా దేవుడు నాకు సహాయము చేయునుగాక!” ఈ మాట అది జరగకుండగ ఉండాలనే బలమైన ఆశను చూపించుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించగలిగే అదే మాటను మీ భాషలో కలిగియుండవచ్చు. మీరు [రోమా.3:31] (../03/31.md) వచనములో ఎలా తర్జుమా చేశారో చూడండి.
Romans 6:16
οὐκ οἴδατε, ὅτι ᾧ παριστάνετε ἑαυτοὺς δούλους εἰς ὑπακοήν, δοῦλοί ἐστε ᾧ ὑπακούετε
దేవుని కృప పాపము చేయడానికి అవకాశము కల్పించిందని ఆలోచించే ప్రతియొక్కరిని గద్దించడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఈ బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు విధేయత చూపుటకు ఎన్నుకొనిన యజమానికి దాసులైయున్నారని మీరు తెలుసుకోవాలి!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἤτοι ἁμαρτίας…ἢ ὑπακοῆς
ఇక్కడ “పాపమును” మరియు “విధేయత” అనునవి ఒక బానిస విధేయత చూపించే యజమానులుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు పాపముకు దాసులైయుండుటకు ఇష్టపడుతారో లేక విధేయతకు దాసులైయుండుటకు ఇష్టపడుతారో” (చూడండి: మానవీకరణ)
εἰς θάνατον…εἰς δικαιοσύνην
దాని ద్వారా మరణము వచ్చును .... దాని ద్వారా నీతి కలుగును
Romans 6:17
χάρις δὲ τῷ Θεῷ
అయితే నేను దేవునికి వందనములు తెలియజేయుచున్నాను!
ὅτι ἦτε δοῦλοι τῆς ἁμαρτίας
పాపము యొక్క బానిసత్వము అనేది ఒక రూపకఅలంకారము, దానికి అర్థము ఏమనగా, పాపము చేయకుండా ఒక వ్యక్తి తనను తాను ఆపుకోలేనంత బలమైన పాపపు ఆశను కలిగియుండడం అని అర్థము. పాపము ఆ వ్యక్తిని నియంత్రిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు పాపమునకు దాసులుగా ఉన్నారు” లేక “మీరు పాపము ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: రూపకం)
ὑπηκούσατε δὲ ἐκ καρδίας
ఇక్కడ “హృదయము” అనే పదము ఏదైనా ఒక కార్యము చేయుటకు యథార్థమైన ఉద్దేశాలను లేక నిజాయితీని కలిగియుండుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు నిజముగా విధేయత చూపించియున్నారు” (చూడండి: అన్యాపదేశము)
εἰς ὃν παρεδόθητε τύπον διδαχῆς
ఇక్కడ “ఏ ఉపదేశముకు” అనే మాట నీతిని పొందడానికి నడిపించే జీవన శైలిని సూచించుచున్నది. క్రైస్తవ నాయకులు వారికి బోధించుచున్న క్రొత్త జీవన శైలి విధానముకు సరిపోవునట్లుగా విశ్వాసులు తమ పాత జీవన శైలిని మార్చుకున్నారు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రైస్తవ నాయకులు మీకు ఇచ్చిన ఉపదేశము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 6:18
ἐλευθερωθέντες δὲ ἀπὸ τῆς ἁμαρτίας
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మిమ్మును పాపమునుండి స్వతంత్రులనుగా చేసియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐλευθερωθέντες δὲ ἀπὸ τῆς ἁμαρτίας
ఇక్కడ “పాపమునుండి విడుదల” అనే మాట ఒక వ్యక్తి పాపము చేయకుండ తనను తను ఆపుకోగలిగిన సామర్థ్యము కలిగియుండుట మరియు పాపము చేయుటకు బలమైన ఆశను కలిగిలేకుండుట అని అర్థమునిచ్చుటకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము చేయాలనే మీ బలమైన కోరిక ఇక తీసివేయబడియున్నది” లేక “మీ మీదనున్న పాపపు నియంత్రణనుండి మీరు విడిపించబడియున్నారు”
ἐδουλώθητε τῇ δικαιοσύνῃ
నీతికి దాసులైయుండుట అనే మాట రూపకఅలంకారమైయున్నది, ఈ మాటకు సరియైనదానిని చేయుటకు బలమైన ఆశను కలిగియుండుట అని అర్థము. నీతి ఒక వ్యక్తిని నియంత్రించుచున్నట్లుగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు నీతిగా దాసులుగా చేయబడియున్నారు” లేక “మీరు నీతి ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: రూపకం)
ἐδουλώθητε τῇ δικαιοσύνῃ
మీరు దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు మిమ్మును నీతికి దాసులుగా చేసియున్నాడు” లేక “క్రీస్తు మిమ్మును మార్చియున్నాడు, తద్వారా మీరు ఇప్పుడు నీతి ద్వారా నియంత్రించబడుచున్నారు” (చూడండి: @)
Romans 6:19
ἀνθρώπινον λέγω
పౌలు ఎందుకు బానిసత్వమును గూర్చి మరియు స్వాతంత్ర్యమును గూర్చి మాట్లాడుచున్నాడని తన చదువరులు ఆశ్చర్యపోవుదరని కూడా తలంచియుండవచ్చును. ఇక్కడ ప్రజలు పాపము ద్వారా గాని లేక నీతి ద్వారా గాని నియంత్రించబడాలనే విషయము వారు అర్థము చేసుకొనుటకు సహాయము చేయుటకు వారి దైనందిన అనుభవములోనుండి ప్రతి ఆలోచనను తీసి ఉపయోగించుచూ ఆయన చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను దీనిని గూర్చి మానవ పరిభాషలో మాట్లాడుచున్నాను” లేక “నేను దైనందిన జీవితములో జరిగే ప్రతి అనుభవమునుండి ఉదాహరణలను ఉపయోగించుచున్నాను” (చూడండి: @)
διὰ τὴν ἀσθένειαν τῆς σαρκὸς ὑμῶν
“ఆత్మ” అనే పదముకు వ్యతిరేకముగా “శరీరము” అనే పదమును పౌలు అనేకమార్లు ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఆత్మ సంబంధమైన విషయములు సంపూర్ణముగా అర్థము చేసికొనలేదు గనుక” (చూడండి: అన్యాపదేశము)
παρεστήσατε τὰ μέλη ὑμῶν δοῦλα τῇ ἀκαθαρσίᾳ, καὶ τῇ ἀνομίᾳ
ఇక్కడ “శరీర అవయవములు” అనే మాట సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునిని మెప్పించని దుష్ట సంబంధమైన ప్రతిదానికి బానిసలుగా మిమ్మును మీరు అప్పగించుకొనియున్నారు” (చూడండి: ఉపలక్షణము)
παραστήσατε τὰ μέλη ὑμῶν, δοῦλα τῇ δικαιοσύνῃ εἰς ἁγιασμόν
ఇక్కడ “శరీర అవయములు” అనే మాట సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఎదుట సరియైన వాటికి బానిసలుగా లేక దాసులుగా మిమ్ములను మీరు అప్పగించుకొనుడి, తద్వారా ఆయన మిమ్మును ప్రత్యేకపరచుకొని తనను సేవించుటకు మీకు అధికారమును అనుగ్రహించును” (చూడండి: ఉపలక్షణము)
Romans 6:20
ἐλεύθεροι ἦτε τῇ δικαιοσύνῃ
ఇక్కడ “నీతినుండి విడుదల” అనే మాట రూపకఅలంకారమైయున్నది, నీతి అన్నదానిని చేయకుండుట అని ఈ మాటకు అర్థము. ప్రజలు సరియైన దానిని చేయకుండ ఉన్నామనే ఆలోచన కలిగియుండియు వారు జీవిస్తున్నారని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు నీతినుండి విడిపించబడినవారైయున్నప్పటికి” లేక “మీరు సరియైన దానిని చేయాలని తెలిసినప్పటికీ మీరు చేయకుండా నడుచుకొంటిరి” లేక (చూడండి: రూపకం మరియు వ్యంగ్యోక్తి)
Romans 6:21
τίνα οὖν καρπὸν εἴχετε τότε, ἐφ’ οἷς νῦν ἐπαισχύνεσθε
ఫలము అనేది ఇక్కడ రూపకఅలంకారము, దీనికి “పలితము” లేక “బయటకు కనిపించే క్రియ” అని అర్థము. పాపము చేయుట ద్వారా మంచి ఫలములు లభించవు అని నొక్కి చెప్పుటకు పౌలు ఒక ప్రశ్నను సంధించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇప్పుడు మిమ్మును సిగ్గుపరచిన ఏ ఒక్క విషయమునుండియు మంచిదనేది రాలేదు” లేక “మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న సంగతులను చేయుట ద్వారా మీరు ఏమియు సంపాదించుకొనలేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 6:22
νυνὶ δέ, ἐλευθερωθέντες ἀπὸ τῆς ἁμαρτίας, δουλωθέντες δὲ τῷ Θεῷ
దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇప్పుడు మీరు పాపము నుండి విడుదల పొందియున్నారు మరియు మీరు దేవునికి దాసులైయున్నారు” లేక “అయితే ఇప్పుడు దేవుడు మిమ్మును పాపమునుండి విడుదల చేసియున్నాడు మరియు మీరు ఆయనకు దాసులైయున్నారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
νυνὶ δέ, ἐλευθερωθέντες ἀπὸ τῆς ἁμαρτίας
“పాపమునుండి విడుదల పొందియున్నారు” అనే మాట మీరు పాపము చేయుటకు సమర్థులు కాదు అనే అర్థము కొరకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఇప్పుడు దేవుడు మిమ్మును పాపము చేయనివారలనుగా చేసియున్నారు” (చూడండి: రూపకం)
δουλωθέντες δὲ τῷ Θεῷ
దేవునికి “దాసులుగా ఉండుట” అనే మాట రూపకఅలంకారమైయున్నది, ఈ మాటకు దేవునికి విధేయత చూపి సేవించువారలనుగా చేసియున్నాడని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవునిని సేవించు సమర్థులనుగా దేవుడు చేసుకొనియున్నాడు” (చూడండి: రూపకం)
ἔχετε τὸν καρπὸν ὑμῶν εἰς ἁγιασμόν
ఇక్కడ “ఫలము” అనే పదము “ఫలితము” లేక “ప్రయోజనము” అని అర్థము ఇచ్చే రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ ప్రయోజనము మీ పవిత్రీకరణే” లేక “ప్రయోజనము ఏమనగా పరిశుద్ధ మార్గములో మీరు జీవించు విషయమే” (చూడండి: రూపకం)
τὸ δὲ τέλος ζωὴν αἰώνιον
వీటన్నిటికి ఫలితము ఏమనగా మీరు సదాకాలము దేవునితో జీవించుటయే
Romans 6:23
τὰ γὰρ ὀψώνια τῆς ἁμαρτίας θάνατος
“జీతము” అనే పదము ఒక వ్యక్తి తాను చేసిన పనికి ఇవ్వబడే కూలి. “మీరు పాపముకు సేవ చేసినట్లయితే, మీరు దానికి జీతముగా ఆత్మీయ మరణమును పొందుకుంటారు” లేక “మీరు పాపము చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు మిమ్మును ఆత్మీయ మరణముతో శిక్షిస్తాడు”
τὸ δὲ χάρισμα τοῦ Θεοῦ ζωὴ αἰώνιος ἐν Χριστῷ Ἰησοῦ, τῷ Κυρίῳ ἡμῶν
అయితే మన ప్రభువైన క్రీస్తు యేసుకు సంబంధించిన వారికందరికీ దేవుడు నిత్య జీవమును అనుగ్రహించును
Romans 7
రోమా 07 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
“లేక మీరు ఎరుగరా”
ముందు ఉపదేశించిన బోధతోపాటు అనుబంధ విషయాలను కలుపుతూ క్రొత్త విషయాన్ని చర్చించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశ్యాలు
“మనము ధర్మశాస్త్రమునుండి విడుదల చేయబడియున్నాము”
మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఎటువంటి ప్రభావము చూపించదని పౌలు వివరించుచున్నాడు. ఇది వాస్తవమైయుండగా, ధర్మశాస్త్రమునకు వెనకాల ఉన్నటువంటి దేవుని గుణలక్షణమును ప్రతిబింబింపజేస్తుంది. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం)
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు
వివాహము
లేఖనము సహజముగా వివాహమును ఒక రూపకలంకారముగా ఉపయోగించును. ఇక్కడ సంఘము మోషే ధర్మశాస్త్రముకు మరియు ఇప్పుడు క్రీస్తుకు ఎలా సంబంధము కలిగియున్నదని వివరించుటకు దీనిని వివరించుచున్నాడు. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర క్లిష్ట భాగములు
శరీరము
ఇది సంక్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము మన పాప సంబంధమైన స్వభావముకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. మన భౌతిక సంబంధమైన శరీరములు పాపసంబంధమైనవని పౌలు బోధించుట లేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరమందు జీవించు కాలము”), మనము పాపము చేస్తూనే ఉంటాము అని పౌలు బోధించునట్లుగా కనబడుతుంది. అయితే మన క్రొత్త స్వభావము మన పాత స్వభావముతో పోరాటము చేస్తూనే ఉంటుంది. (చూడండి: శరీరం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
Romans 7:1
ధర్మశాస్త్రము క్రింద జీవించాలనుకునేవారిని ధర్మశాస్త్రము ఎలా నియంత్రించునని పౌలు వివరించుచున్నాడు.
ἢ ἀγνοεῖτε, ἀδελφοί (γινώσκουσιν γὰρ νόμον λαλῶ), ὅτι ὁ νόμος κυριεύει τοῦ ἀνθρώπου ἐφ’ ὅσον χρόνον ζῇ?
పౌలు నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రములోని జీవముగా ఉన్నప్పుడే దానికి లోబడవలసియుంటుందని మీరు తప్పకుండగా తెలుసుకోవాలి” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἀδελφοί
ఇక్కడ ఈ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ పదములో స్త్రీ పురుషులు కూడా చేర్చబడియున్నారు.
Romans 7:2
“ధర్మశాస్త్రము ఒక వ్యక్తి బ్రతికియున్నంత కాలము నియంత్రించును” అనే మాటకు పౌలు యొక్క వివరణతో ఈ వాక్యము ఆరంభమవుతుంది ([రోమా.7:1] (./01.md)).
ἡ…ὕπανδρος γυνὴ τῷ…ἀνδρὶ δέδεται νόμῳ
ఇక్కడ “ధర్మశాస్త్రమువలన భర్తకు బద్ధులైయుండుట” అనే మాట వివాహమునకు సంబంధించిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక స్త్రీ తన భర్తతో ఏకమైయుంటుందని చెప్పుటకు రూపకఅలంకారమును ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్ర ప్రకారముగా, వివాహము చేసుకొనిన స్త్రీ తన భర్తతో ఏకమైయుండును” (చూడండి: రూపకం)
ἡ…ὕπανδρος γυνὴ
ఇది వివాహము చేసుకొనిన ప్రతియొక్క స్త్రీని సూచించును.
Romans 7:3
“ఒక వ్యక్తి బ్రతికియున్నంత కాలము ధర్మశాస్త్రము నియంత్రించుట” అనే మాటకు అర్థము ఏమిటన్న పౌలు వివరణతో ఈ వాక్యము ముగుస్తుంది. ([రోమా.7:1] (./01.md)).
μοιχαλὶς χρηματίσει
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆమెను వ్యభిచారిగా పరిగణించును” లేక “ప్రజలు ఆమెను వ్యభిచారి అని పిలుతురు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐλευθέρα ἐστὶν ἀπὸ τοῦ νόμου
ఇక్కడ ధర్మశాస్త్రమునుండి విడుదల పొందుట అనగా ధర్మశాస్త్రముకు విధేయత చూపకూడదని కాదు. ఈ విషయములో వివాహము చేసుకొనిన స్త్రీ మరియొక పురుషుని వివాహము చేసుకొనకూడదని చెప్పే ధర్మశాస్త్రముకు ఆ స్త్రీ విధేయత చూపనవసరము లేదు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆమె ధర్మశాస్త్రముకు విధేయత చూపనవసరము లేదు”
Romans 7:4
ὥστε, ἀδελφοί μου
ఇది [రోమా.7:1] (../07/01.md) వచనముకు సంబంధించినది.
ἀδελφοί
ఇక్కడ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ మాటలో స్త్రీ పురుషులు కూడా ఉన్నారు.
καὶ ὑμεῖς ἐθανατώθητε τῷ νόμῳ διὰ τοῦ σώματος τοῦ Χριστοῦ
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా మీరు కూడా ధర్మశాస్త్రము విషయములో మరణించియున్నారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῷ ἐκ νεκρῶν ἐγερθέντι
ఇక్కడ లేపబడుట అనేది ఒక నానుడియైయున్నది, ఈ మాటకు “తిరిగి జీవించబడుట” అని అర్థము. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనను తిరిగి బ్రతికింపజేసినవాడు” లేక “దేవుడు మరణమునుండి లేపిన వ్యక్తికి” లేక “దేవుడు తిరిగి బ్రతికించిన వ్యక్తికి” (చూడండి: జాతీయం (నుడికారం))
καρποφορήσωμεν τῷ Θεῷ
ఇక్కడ “ఫలము” అనే పదము దేవునిని మెప్పించే క్రియలకొరకు వాడబడిన రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునికిష్టమైన క్రియలను మనము చేయువారమైయున్నాము” (చూడండి: రూపకం)
Romans 7:5
εἰς τὸ καρποφορῆσαι τῷ θανάτῳ
ఇక్కడ “ఫలము” అనే పదము “ఒకరి క్రియల ఫలితము” లేక “ఒకరి ద్వారా వెలువడే క్రియలు లేక ఫలాలు” అనే అర్థాలకొరకు వాడబడిన రూపకఅలంకారమునైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దీని ఫలము ఆత్మీయ మరణములో కనిపిస్తుంది” లేక “దాని ఫలము మన స్వంత ఆత్మీయ మరణము” (చూడండి: రూపకం)
Romans 7:6
దేవుడు ధర్మశాస్త్రమునుబట్టి మనలను పరిశుద్దులనుగా చేయడని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.
κατηργήθημεν ἀπὸ τοῦ νόμου
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనలను ధర్మశాస్త్రమునుండి విడిపించియున్నాడు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
κατηργήθημεν
ఈ సర్వనామము పౌలును మరియు విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἐν ᾧ κατειχόμεθα
ఇది ధర్మశాస్త్రమును సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను పట్టుకొనిన ధర్మశాస్త్రముకు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
γράμματος
ఇది మోషే ధర్మశాస్త్రమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మోషే ధర్మశాస్త్రము” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 7:7
τί οὖν ἐροῦμεν
పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు.
μὴ γένοιτο
అవును అది ఖచ్చితముగా వాస్తవము కాదు! ముందు రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబునిస్తుంది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనే మీ భాషలో కూడా ఉండవచ్చును. [రోమా.9:14] (../09/14.md) వచనములో మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.
τὴν ἁμαρτίαν οὐκ ἔγνων, εἰ μὴ διὰ νόμου
పాపము క్రియ చేసే ఒక వ్యక్తియన్నట్లుగా పౌలు పాపమును గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
ἁμαρτία
పాపము చేయుటకు నా ఆశ
Romans 7:8
ἀφορμὴν δὲ λαβοῦσα ἡ ἁμαρτία διὰ τῆς ἐντολῆς, κατειργάσατο ἐν ἐμοὶ πᾶσαν ἐπιθυμίαν;
పాపమును క్రియలు చేసే ఒక వ్యక్తికి పోలుస్తూ పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
ἐπιθυμίαν
లైంగికపరమైన తప్పుడు ఆలోచనలు మరియు ఇతర ప్రజలు కలిగియున్నవాటి మీద ఆశలు ఈ మాటలో ఉన్నాయి.
χωρὶς…νόμου, ἁμαρτία νεκρά
ధర్మశాస్త్రము లేనప్పుడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించడము అనేది కూడా లేదు, గనుక పాపము అనేదే లేదు
Romans 7:9
ἡ ἁμαρτία ἀνέζησεν
దీనికి 1) “నేను పాపము చేయుచున్నానని తెలుసుకొనియున్నాను” లేక 2) “నేను పాపము చేయాలని బలమైన ఆశను కలిగియున్నాను” అనే అర్థాలు కూడా ఉండవచ్చును (చూడండి: మానవీకరణ)
Romans 7:10
εὑρέθη μοι ἡ ἐντολὴ, ἡ εἰς ζωὴν, αὕτη εἰς θάνατον.
దేవుని శిక్ష ప్రాథమికముగా భౌతిక మరణములో కనబడుతుందన్నట్లుగా పౌలు దేవుని శిక్షను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గనుకనే నేను జీవించుచున్నాను, లేకపోతె అది నన్ను చంపివేసియుండేది” (చూడండి: రూపకం)
Romans 7:11
ἡ γὰρ ἁμαρτία ἀφορμὴν λαβοῦσα διὰ τῆς ἐντολῆς, ἐξηπάτησέν με καὶ δι’ αὐτῆς ἀπέκτεινεν
[రోమా.7:7-8] (./07.md) వచనములో ఉన్నట్లుగా, 3 కార్యములను చేయగలిగే ఒక వ్యక్తివలె పాపము ఉన్నదని పౌలు వివరించుచున్నాడు: అవకాశమును తీసుకోవడం, మోసము చేయడం, మరియు చంపడం. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను పాపము చేయాలని ఇష్టపడినందుననే, నేను పాపము చేయగలనని మరియు అదే సమయములో నేను ఆజ్ఞకు లోబడగలనని నన్ను నేను మోసము చేసుకొనియున్నాను, అయితే దేవుని నన్ను దూరము చేయడము ద్వారా ఆజ్ఞకు అవిధేయత చూపినందువలన దేవుడు నన్ను శిక్షించియున్నాడు” (చూడండి: మానవీకరణ)
ἡ…ἁμαρτία
పాపము చేయాలనే నా ఆశ
ἀφορμὴν λαβοῦσα διὰ τῆς ἐντολῆς
పాపమును క్రియలు చేసే ఒక వ్యక్తికి పోలుస్తూ పౌలు మాట్లాడుచున్నాడు. మీరు దీనిని [రోమా.7:8] (../07/08.md) వచనములో ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: మానవీకరణ)
ἀπέκτεινεν
పాపుల విషయములో దేవుని శిక్ష ప్రాథమికముగా భౌతిక మరణములో కనపడుతుందని పౌలు దేవుని శిక్షను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది నన్ను దేవునినుండి వేరు చేసింది” (చూడండి: రూపకం)
Romans 7:12
ἅγιος
పాపము లేకుండా నైతికంగా పరిపూర్ణత
Romans 7:13
పౌలు తన మనస్సునందున్న ధర్మశాస్త్రముకు మరియు తన అంతరంగములోనున్న పాపమునకు మధ్యన అనగా పాపముకు మరియు మంచితనముకు తన అంతరంగములో జరిగే పోరాటమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.
οὖν
పౌలు ఒక క్రొత్త విషయమును పరిచయము చేయుచున్నాడు.
τὸ…ἀγαθὸν ἐμοὶ ἐγένετο θάνατος
పౌలు నొక్కి చెప్పడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὸ…ἀγαθὸν
ఇది దేవుని ధర్మశాస్త్రమును సూచించుచున్నది.
ἐμοὶ ἐγένετο θάνατος
నేను చనిపోవుటకు కారణమైనది
μὴ γένοιτο
రాబోయే అలంకారిక ప్రశ్నకు ఈ మాట చాలా బలమైన అననుకూల జవాబును ఇచ్చుచున్నది. మీరు ఇక్కడ ఉపయోగించే మాటవలెనె మీ భాషలో కూడా అదే మాటను కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అవును ఖచ్చితంగా అది వాస్తవము కాదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἡ ἁμαρτία…μοι κατεργαζομένη θάνατον;
క్రియలు చేసే ఒక వ్యక్తివలె పాపమున్నదని పౌలు పాపమును చూచుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
μοι κατεργαζομένη θάνατον
దేవునినుండి నన్ను వేరు చేసియున్నది
διὰ τῆς ἐντολῆς
నేను ఆజ్ఞకు అవిధేయత చూపించినందున
Romans 7:15
పౌలు దేవుని ధర్మశాస్త్రముకు మరియు తన శరీరముకు మధ్యన అనగా పాపముకు మరియు మంచితనముకు మధ్యన జరిగే తన అంతరంగములోని పోరాటమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు.
ὃ γὰρ κατεργάζομαι, οὐ γινώσκω
నేను చేసే కొన్ని క్రియలు నేను ఎందుకు చేయుచున్నానో నాకు తెలియదు
ὃ γὰρ κατεργάζομαι
నేను చేయుచున్నదానినిబట్టి
οὐ…ὃ θέλω, τοῦτο πράσσω,
పౌలు అనేకమార్లు తాను చేయాలనుకొనినవాటిని చేయుటకు ఇష్టపడినవాటిని చేయలేదు లేక అనేకమార్లు తాను చేయకూడదనేవాటిని చేసియున్నాడని నొక్కి చెప్పుటకు “నేను చేయలేదు” అనే మాటలు గొప్పగా చెప్పుటకు ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను చేయాలనుకున్నది నేను ఎల్లప్పుడూ చేయలేకపోయాను” (చూడండి: అతిశయోక్తి)
ὃ μισῶ, τοῦτο ποιῶ.
“నేను చేశాను” అనే మాటలు పౌలు చేయకూడదని అసహ్యించుకొనినవాటిని అతను ఎల్లప్పుడూ చేశాడు అని సూచించుచున్నవి, అంతేగాకుండా పౌలు అనేకమార్లు తాను చేయకూడదనుకొనినవాటిని చేసినట్లుగా చెప్పుటకు ఉపయోగించిన మాటలైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “నాకు తెలిసిన కొన్ని విషయాలు మంచివి కావు కాని వాటినే నేను కొన్నిమార్లు చేసియున్నాను” (చూడండి: అతిశయోక్తి)
Romans 7:16
εἰ δὲ…ποιῶ
ఏదిఏమైనా నేను చేసినట్లయితే
σύνφημι τῷ νόμῳ
దేవుని ధర్మశాస్త్రము మంచిదని నాకు తెలుసు
Romans 7:17
ἡ ἐνοικοῦσα ἐν ἐμοὶ ἁμαρτία
పాపము జీవించునదియని అది తనను ప్రభావము చేయగల శక్తిని కలిగియున్నదని పౌలు పాపమును గూర్చి వివరించుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
Romans 7:18
τῇ σαρκί μου
ఇక్కడ “శరీరము” అనే పదము పాప స్వభావమును కొరకు వాడబడిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “నా పాప స్వభావము” (చూడండి: అన్యాపదేశము)
Romans 7:19
ἀγαθόν
మంచి పనులు లేక “మంచి కార్యములు”
κακὸν
దుష్ట పనులు లేక “దుష్ట క్రియలు”
Romans 7:20
ἀλλὰ ἡ οἰκοῦσα ἐν ἐμοὶ ἁμαρτία
పాపము జీవించియుండెనని మరియు ఇంకను తనలో జీవించుచున్నదన్నట్లుగా పౌలు “పాపమును” గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
Romans 7:21
ὅτι ἐμοὶ τὸ κακὸν παράκειται
“కీడు” జీవించియుండెనని, ఇంకను తనలో జీవించియున్నదన్నట్లుగా పౌలు “కీడును” గూర్చి మాట్లాడుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
Romans 7:22
τὸν ἔσω ἄνθρωπον
ఇది క్రొత్తగా ఉజ్జీవింపజేయబడిన క్రీస్తునందు విశ్వసించిన ఒక వ్యక్తి ఆత్మ. (చూడండి: రూపకం)
Romans 7:23
βλέπω δὲ ἕτερον νόμον ἐν τοῖς μέλεσίν μου, ἀντιστρατευόμενον τῷ νόμῳ τοῦ νοός μου, καὶ αἰχμαλωτίζοντά με
నా పాత స్వభావము నాకు చెప్పువాటినే నేను చేయుచున్నాను, ఆత్మ నాకు చూపించే నూతన విధానములో జీవించుటలేదు
νόμῳ
ఇది నూతన ఆత్మీయతను కలిగిన స్వభావముతో జీవించుట యైయున్నది.
ἕτερον νόμον ἐν τοῖς μέλεσίν μου
ఇది పాత స్వభావము, ప్రజలు తాము జన్మించినప్పటి జీవన విధానము.
τῷ νόμῳ τῆς ἁμαρτίας, τῷ ὄντι ἐν τοῖς μέλεσίν μου
నా పాప స్వభావము
Romans 7:24
τίς με ῥύσεται ἐκ τοῦ σώματος τοῦ θανάτου τούτου
పౌలు ఒక గొప్ప భావమును తెలియజెప్పుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీ భాషలో ఆశ్చర్యము వ్యక్తము చేయుట ద్వారానో లేక ఒక ప్రశ్న ద్వారానో ఒక గొప్ప భావమును వ్యక్తము చేసే విధానము ఉన్నట్లయితే, దానిని ఇక్కడ ఉపయోగించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా శరీరము కోరుకునే ఆశల నియంత్రణనుండి నన్ను విడిపించగలవారు నాకు కావలి!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
με ῥύσεται
నన్ను కాపాడండి
τοῦ σώματος τοῦ θανάτου τούτου
శరీరము లేక దేహము భౌతిక మరణమును రుచిచూచుననే అర్థమునిచ్చే రూపకఅలంకారమైయున్నది. (చూడండి: రూపకం)
Romans 7:25
χάρις τῷ Θεῷ διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν
7:24 వచనములోని ప్రశ్నకు ఇది జవాబుయైయున్నది.
ἄρα οὖν αὐτὸς ἐγὼ, τῷ μὲν νοῒ δουλεύω νόμῳ Θεοῦ; τῇ δὲ σαρκὶ, νόμῳ ἁμαρτίας
మనస్సు మరియు శరీరము దేవుని ధర్మశాస్త్రమునుగానీ లేక పాప నియమమునకుగాని ఎలా పోటి పడుతాయో చూపించుటకు మనస్సు మరియు శరీరములు ఉపయోగించబడ్డాయి. మనస్సుతోను లేక జ్ఞానముతోను దేవునికి విధేయత చూపుటకు మరియు ఆయనను మెప్పించుటకు ఎన్నుకోవచ్చును మరియు శరీరముతోను లేక భౌతిక స్వభావముతోనూ పాపము చేయుటకు ఎన్నుకోవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “నా మనస్సు దేవునిని మెప్పించాలని అనుకొనుచున్నది, కానీ నా శరీరము పాపము చేయాలని కోరుచున్నది” (చూడండి: రూపకం)
Romans 8
రోమా 08 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
ఈ అధ్యాయము యొక్క మొట్ట మొదటి వచనమే పరివర్తన వాక్యమైయున్నది. పౌలు 7వ అధ్యాయములోని తన బోధనను ముగించి, 8వ అధ్యాయములోని మాటలలోనికి కొనసాగుచున్నాడు.
కొన్ని తర్జుమాలలో చదువుటకు సులభముగా ఉండుటకు కావ్య భాగములోని ప్రతి పంక్తిని వాక్యభాగములోనే ఉంచకుండగా దాని కుడి వైపున ఉంచుదురు. ఈ విధముగా యుఎల్.టి(ULT) తర్జుమాలో పాత నిబంధన వచనములైన ఈ అధ్యాయములోని 36వ వచనమును అలా పెట్టియున్నారు.
ఈ అధ్యాయములో ప్రత్యేకమైన ఉద్దేశాలు
ఆత్మ నివసించుట
పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి హృదయములో నివసిస్తాడని లేక వారి హృదయములో ఉంటాడని చెప్పబడియున్నది. ఆత్మ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి రక్షణను కలిగియున్నాడని అర్థము. (చూడండి: రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
“వీరందరూ దేవుని కుమారులు”
ఒక ప్రత్యేకమైన విధానములో యేసు దేవుని కుమారుడైయున్నాడు. దేవుడు క్రైస్తవులను కూడా తన పిల్లలనుగా ఉండునట్లు దత్తత తీసుకొనియున్నాడు. (చూడండి: దేవుని కుమారుడు, కుమారుడు మరియు దత్తత, దత్తత తీసుకొను, దత్తత తీసుకొనబడిన)
ముందుగా నిర్ణయించబడుట
”ముందుగ నిర్ణయించబడుట” అని పిలువబడే అంశము మీద పౌలు ఈ అధ్యాయములో బోధించుచున్నాడని అనేకమంది పండితులు నమ్ముదురు. ఇది వాక్యానుసారమైన అంశమైన “నిర్ణయించబడుట” అనే విషయానికి సంబంధించినది. ఇది జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు కొంతమంది నిత్యరక్షణ కలిగియుండుటకు ఎన్నుకొనియున్నాడని సూచించుటకు కొంతమంది దీనిని తీసుకుంటారు. ఈ అంశము మీద బైబిలు ఏమి బోధించుచున్నదనే మీద క్రైస్తవులు అనేక భిన్నాభిప్రాయాలను కలిగియున్నారు. అందుచేత ఈ అధ్యాయమును తర్జుమా చేయునప్పుడు తర్జుమాదారులు అదనపు శ్రద్ధను తీసుకోవలసిన అవసరత ఉన్నది, విశేషముగా ఈ కారణముకు మూలకాల విషయాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. (చూడండి: ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినది మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన అలంకారిక మాటలు
రూపకఅలంకారము
పౌలు పద్యరూపములో తన బోధనను రూపకఅలంకార రూపములో 38 మరియు 39 వచనాలలో చూపించుచున్నాడు. యేసునందున్న దేవుని ప్రేమనుండి ఏదియు మనలను ఎడబాపనేరదని ఆయన వివరించుచున్నాడు. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగములు
శిక్ష లేదు
సిద్ధాంతపరమైన గలిబిలి సృష్టించబడకుండ ఈ మాటను చాలా జాగ్రత్తగా తర్జుమా చేయాలి. ప్రజలు ఇంకను తమ పాపముల విషయములో అపరాధులైయున్నారు. యేసునందు విశ్వాసముంచినప్పటికీ కూడా పాపులమన్నట్లుగా నడుచుకోవడమును దేవుడు ఒప్పుకొనడు. దేవుడు ఇప్పటికిని విశ్వాసులు పాపము చేసినట్లయితే శిక్షిస్తూనే ఉన్నాడు, అయితే యేసు వారి పాపములకొరకు పొందవలసిన శిక్షను చెల్లించియున్నాడు. దీనినే పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. “శిక్ష” అనే పదముకు అనేకమైన అర్థాలు ఉన్నాయి. అయితే యేసునందు విశ్వాసముంచిన ప్రజలు “నరక పాత్రులుగా” ఉండిన వారి పాపములకొరకు నిత్య శిక్షను పొందుకొనరని పౌలు ఇక్కడ నొక్కి చెప్పుచున్నాడు. (చూడండి: అపరాధ భావం, దోషం మరియు విశ్వాసం మరియు దోషిగా తీర్చు, దోషిగా తీర్పు పొందిన, దోషిగా తీర్చిన, దోషిగా తీర్పు)
శరీరము
ఇది సంక్లిష్టమైన విషయము. “శరీరము” అనే పదము మన పాప సంబంధమైన స్వభావముకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. మన భౌతిక సంబంధమైన శరీరములు పాపసంబంధమైనవని పౌలు బోధించుట లేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరమందు జీవించు కాలము”), మనము పాపము చేస్తూనే ఉంటాము అని పౌలు బోధించునట్లుగా కనబడుతుంది. అయితే మన క్రొత్త స్వభావము మన పాత స్వభావముతో పోరాటము చేస్తూనే ఉంటుంది. (చూడండి: శరీరం మరియు @)
Romans 8:1
పౌలు పాపముతోను మరియు మంచితనముతోను కలిగియున్న పోరాటముకు ఇక్కడ జవాబును ఇచ్చుచున్నాడు.
οὐδὲν ἄρα νῦν κατάκριμα τοῖς ἐν Χριστῷ Ἰησοῦ
ఇక్కడ “శిక్ష” అనే పదము లేక మాట ప్రజలను శిక్షించుటను గూర్చి సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ క్రీస్తు యేసునందు ఏకమైన వారిని దేవుడు శిక్షించడు మరియు ఖండించడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἄρα
ఆ కారణము కొరకు లేక “నేను మీకు సత్యము చెప్పినందున”
Romans 8:2
ὁ…νόμος τοῦ Πνεύματος τῆς ζωῆς ἐν Χριστῷ Ἰησοῦ
ఇది దేవుని ఆత్మను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసునందు దేవుని ఆత్మ” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἠλευθέρωσέν σε ἀπὸ τοῦ νόμου τῆς ἁμαρτίας καὶ τοῦ θανάτου
పాపము మరియు మరణముకు సంబంధించిన ధర్మశాస్త్రమునుండి విడిపించుట అనే మాట పాపానికి మరియు మరణానికి సంబంధించిన ధర్మశాస్త్రము ద్వారా నియంత్రించబడడము అని చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపానికి మరియు మరణానికి కారణమైన ధర్మశాస్త్రము ఇక ఎన్నటికి మిమ్మును నియంత్రించదు” (చూడండి: రూపకం)
τοῦ νόμου τῆς ἁμαρτίας καὶ τοῦ θανάτου
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పాపము చేయడానికి ప్రజలను ప్రేరేపించే ధర్మశాస్త్రము, మరియు వారి పాపములే వారు చనిపోవుటకు కారణము. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపముకు మరియు మరణముకు కారణమైన ధర్మశాస్త్రము లేక 2) ప్రజలు పాపము చేసి, చనిపోవుదరనే నియమము.
Romans 8:3
τὸ γὰρ ἀδύνατον τοῦ νόμου, ἐν ᾧ ἠσθένει διὰ τῆς σαρκός, ὁ Θεὸς
ధర్మశాస్త్రము ఇక్కడ పాపపు శక్తిని విరుగగొట్టలేని ఒక వ్యక్తివలె వివరించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము పాపము చేయకుండ ఆపగల శక్తి ధర్మశాస్త్రముకు లేదు, ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపపు శక్తి చాలా బలమైనది. అయితే మనము పాపము చేయకుండ దేవుడు ఆపగలడు” (చూడండి: మానవీకరణ)
διὰ τῆς σαρκός
ప్రజల పాప స్వభావమునుబట్టి
τὸν ἑαυτοῦ Υἱὸν πέμψας, ἐν ὁμοιώματι σαρκὸς ἁμαρτίας, καὶ περὶ ἁμαρτίας, κατέκρινε τὴν ἁμαρτίαν
దేవుని కుమారుడు తన స్వంత శరీరమునే ఇచ్చుట ద్వారా మరియు పాపము కొరకు నిత్యబలిగా మానవ జీవితమును ఇచ్చుట ద్వారా మన పాపములకు విరుద్ధముగానున్న దేవుని పరిశుద్ధ కోపమును ఆర్పగలిగాడు
Υἱὸν
దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన చాలా ప్రాముఖ్యమైన పేరు ఇది. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ἐν ὁμοιώματι σαρκὸς ἁμαρτίας
ఇతర పాప స్వభావము కలిగిన మనిషివలె కనిపించాడు లేక అవతారిగా వచ్చాడు
καὶ περὶ ἁμαρτίας
తద్వారా ఆయన మన పాపముల కొరకు బలిగా మరణించాడు
κατέκρινε τὴν ἁμαρτίαν ἐν τῇ σαρκί
దేవుడు తన కుమారుని దేహము ద్వారా పాపపు శక్తిని విరుగగొట్టాడు
Romans 8:4
τὸ δικαίωμα τοῦ νόμου πληρωθῇ ἐν ἡμῖν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము కోరుకునే ప్రతిదానిని మనము నెరవేర్చవలసినవారమైయున్నాము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τοῖς μὴ κατὰ σάρκα περιπατοῦσιν
మార్గమందు నడచుట అనే మాట ఒక వ్యక్తి తన జీవితమును ఎలా జీవించుచున్నాడని చెప్పుట కొరకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. శరీరము అనేది పాప స్వభావము కలిగిన ఒక మనిషికొరకు చెప్పబడిన నానుడియైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మేము మా పాప స్వభావ కోరికలకు విధేయత చూపము” (చూడండి: రూపకం లేక జాతీయం (నుడికారం))
ἀλλὰ κατὰ Πνεῦμα
అయితే మేము పరిశుద్ధాత్మునికి లోబడుతాము
Romans 8:6
మనమిప్పుడు కలిగియుండే ఆత్మతో శరీరముయొక్క విరుద్ధమును పౌలు కొనసాగించుచున్నాడు.
τὸ…φρόνημα τῆς σαρκὸς…τὸ δὲ φρόνημα τοῦ Πνεύματος
“శరీరము” మరియు “ఆత్మ” అనేవి జీవించు ఇద్దరు వ్యక్తులు అన్నట్లుగా పౌలు ఆ రెండింటిని గూర్చి ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపాత్ములైనవారు ఆలోచించు విధానములో .... పరిశుద్ధాత్ముని స్వరమును వినువారి ప్రజలు ఆలోచించు విధానములో” (చూడండి: మానవీకరణ)
θάνατος
ఇక్కడ ఈ మాటకు దేవునినుండి దూరమైన ఒక వ్యక్తియని అర్థము.
Romans 8:8
οἱ…ἐν σαρκὶ ὄντες
తమ పాప స్వభావము చేయమని చెప్పే ప్రతిదానిని చేసే ప్రజలను ఈ మాట సూచించుచున్నది.
Romans 8:9
ἐν σαρκὶ
మీ పాప స్వభావములను బట్టి నడుచుకొనేవారు. [రోమా.8:5] (../08/05.md) వచనములో “శరీరము” అనే పదమును ఎలా తర్జుమా చేశారో చూడండి.
ἐν Πνεύματι
పరిశుద్ధాత్ముని ప్రకారముగా నడుచుకొనండి
Πνεύματι,…Πνεῦμα Θεοῦ…Πνεῦμα Χριστοῦ
ఇవన్నియు పరిశుద్ధాత్మున్నే సూచించుచున్నవి.
εἴπερ
కొంతమందిలో దేవుని ఆత్మ ఉందా అని పౌలు సందేహపడుచున్నట్లు ఈ మాటకు అర్థము కాదు. వారందరు దేవుని ఆత్మను కలిగియున్నారని తెలుసుకోవాలని పౌలు కోరియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆ సమయమునుండి” లేక “కాబట్టి” (చూడండి: @)
Romans 8:10
εἰ…Χριστὸς ἐν ὑμῖν
ఒక వ్యక్తిలో క్రీస్తు ఎలా జీవించగలడు అనేది స్పష్టము చేయవలసియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పరిశుద్ధాత్మ ద్వారా మీలో క్రీస్తు నివసించుచున్నట్లయితే” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τὸ μὲν σῶμα νεκρὸν διὰ ἁμαρτίαν
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును , 1) ఒక వ్యక్తి పాప శక్తి విషయమై ఆత్మీయముగా చనిపోయాడు లేక 2) పాపమునుబట్టి భౌతిక సంబంధమైన దేహము ఇంకను చనిపోవుచున్నది. (చూడండి: జాతీయం (నుడికారం))
τὸ…Πνεῦμα ζωὴ διὰ δικαιοσύνην
ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) సరియైనదానిని చేయుటకు దేవుడు తనకు శక్తిని ఇచ్చినందున ఒక వ్యక్తి ఆత్మీయముగా జీవించుచున్నాడు లేక 2) ఒక వ్యక్తి చనిపోయిన తరువాత దేవుడు ఆ వ్యక్తిని తిరిగి బ్రతుకునట్లు చేయును ఎందుకంటే దేవుడు నీతిమంతుడు మరియు విశ్వాసులకు నిత్య జీవమును ప్రసాదించువాడు. (చూడండి: జాతీయం (నుడికారం))
Romans 8:11
εἰ δὲ τὸ Πνεῦμα τοῦ ἐγείραντος τὸν Ἰησοῦν ἐκ νεκρῶν οἰκεῖ ἐν ὑμῖν, ὁ ἐγείρας ἐκ νεκρῶν Χριστὸν Ἰησοῦν ζῳοποιήσει καὶ τὰ θνητὰ σώματα ὑμῶν, διὰ τοῦ ἐνοικοῦντος αὐτοῦ Πνεῦμα ἐν ὑμῖν.
పౌలు తన చదువరులలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడనుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆత్మ.. మీలో నివసించుచున్నందున”
τοῦ ἐγείραντος
పైకి లేపిన దేవుడు
ἐγείραντος τὸν Ἰησοῦν
ఇక్కడ పైకి లేపుట అనే మాట ఒక నానుడియైయున్నది, చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతుకునట్లు చేయుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు తిరిగి బ్రతుకునట్లు లేక జీవించునట్లు చేసెను” (చూడండి: జాతీయం (నుడికారం))
τὰ θνητὰ σώματα
భౌతిక సంబంధమైన దేహాలు లేక “ఒకరోజున చనిపోయే దేహాలు”
Romans 8:12
ἄρα οὖν
నేను మీకు చెప్పినవి నిజమైనందున
ἀδελφοί
ఇక్కడ ఈ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ మాటలో స్త్రీ పురుషులందరూ ఉన్నారు.
ὀφειλέται ἐσμέν
విధేయత అనేది తిరిగి ఋణమును చెల్లించేదన్నట్లుగా పౌలు విధేయతను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము విధేయత చూపవలసిన అవసరత ఉన్నది” (చూడండి: రూపకం)
οὐ τῇ σαρκὶ, τοῦ κατὰ σάρκα ζῆν
మరలా పౌలు ఇక్కడ విధేయత అనేది తిరిగి ఋణమును చెల్లించేదన్నట్లుగా పౌలు విధేయతను గూర్చి మాట్లాడుచున్నాడు. “ఋణస్థులు” అనే పదమును కూడా చేర్చుకోవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మనము శరీరముకు ఋణస్థులము కాదు, మరియు మనము మన పాప సంబంధ కోరికలకు లోబడనవసరము లేదు” (చూడండి: శబ్దలోపం మరియు రూపకం)
Romans 8:13
εἰ γὰρ κατὰ σάρκα ζῆτε
మీరు మీ పాప స్వభావ కోరికలను తీర్చుకొనువారైతే
μέλλετε ἀποθνῄσκειν
మీరు తప్పకుండగ దేవుని నుండి వేరు చేయబడుతారు
εἰ δὲ Πνεύματι τὰς πράξεις τοῦ σώματος θανατοῦτε
క్రీస్తుతో సిలువ వేయబడిన “పాత పురుషుడు” అనగా తన పాప స్వభావ కోరికలకు బాధ్యుడైన వ్యక్తిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు పాప సంబంధమైన కోరికలకు విధేయత చూపకుండ ఉండవచ్చును” (చూడండి: రూపకం)
Romans 8:14
ὅσοι γὰρ Πνεύματι Θεοῦ ἄγονται
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఆత్మ నడిపించే ప్రజలందరికొరకు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
υἱοί Θεοῦ
ఈ మాటకు యేసునందున్న విశ్వాసులందరూ అని అర్థము మరియు అనేకమార్లు “దేవుని పిల్లలు” అని తర్జుమా చేయబడియున్నది.
Romans 8:15
ἐν ᾧ κράζομεν
మనము మొర్ర పెట్టుటకు కారణమైన
Ἀββά, ὁ Πατήρ
అబ్బా అనగా అరామిక్ భాషలో “తండ్రి” అని అర్థము. (చూడండి: తెలియనివాటిని అనువదించడం మరియు పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Romans 8:17
κληρονόμοι μὲν Θεοῦ
క్రైస్తవ విశ్వాసులు ఒక ఇంటి సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను సంపాదించుకొనువారుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనకు వాగ్ధానము చేసిన దానిని ఒకరోజు మనము కూడా పొందుకుంటాము” (చూడండి: రూపకం)
συνκληρονόμοι…Χριστοῦ
క్రైస్తవ విశ్వాసులు ఒక ఇంటి సభ్యుడినుండి ఆస్తిని మరియు సంపదను సంపాదించుకొనువారుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. దేవుడు క్రీస్తుకు ఇచ్చినదే ఆయన మనకును అనుగ్రహించును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు క్రీస్తుకును మనకును వాగ్ధానము చేసినవాటిని మనము కూడా పొందుకుంటాము” (చూడండి: రూపకం)
ἵνα καὶ συνδοξασθῶμεν
దేవుడు క్రీస్తును ఘనపరచుచున్నందున ఆయన క్రైస్తవ విశ్వాసులను కూడా ఘనపరచును. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆయనతోపాటు మనలను కూడా మహిమపరచును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 8:18
[రోమా.8:25] (../08/25.md) వచనములో ముగించబడే ఈ భాగములో మన దేహములకు విమోచనము కలుగునప్పుడు విశ్వాసులమైన మన దేహములు మార్పు చెందుతాయని పౌలు మనకు జ్ఞాపకము చేయుచున్నాడు.
γὰρ
“నేను భావించుచున్నాను” అనేదానిని ఇది ఎత్తి చూపుతోంది. దీనికి “ఎందుకనగా లేక కాబట్టి” అనే అర్థము కాదు.
λογίζομαι…ὅτι οὐκ ἄξια τὰ παθήματα τοῦ νῦν καιροῦ, πρὸς
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రస్తుతము మన శ్రమలను నేను పోల్చడములేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀποκαλυφθῆναι
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు బయలుపరచును” లేక “దేవుడు తెలియునట్లుగా చేయును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 8:19
ἡ…ἀποκαραδοκία τῆς κτίσεως, τὴν…ἀπεκδέχεται
ఏదో ఒక విషయము కొరకు చాలా ఆతురతగా ఎదురు చూసే ఒక వ్యక్తివలె దేవుడు సృష్టించిన ప్రతిదానిని గూర్చి పౌలు వివరించుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
τὴν ἀποκάλυψιν τῶν υἱῶν τοῦ Θεοῦ
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన పిల్లలను బయలుపరిచే సమయములో” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
υἱῶν τοῦ Θεοῦ
ఇక్కడ ఈ మాటకు క్రిస్తునందున్న ప్రతి విశ్వాసి అని అర్థము. మీరు దీనిని “దేవుని పిల్లలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.
Romans 8:20
τῇ γὰρ ματαιότητι, ἡ κτίσις ὑπετάγη
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సృష్టించిన సృష్టి ఏ ఉద్దేశ్యము కొరకు చేయబడియున్నదో దానిని సాధించలేదు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οὐχ ἑκοῦσα, ἀλλὰ διὰ τὸν ὑποτάξαντα
ఇక్కడ పౌలు “సృష్టి” అనేదానిని ఆశ కలిగిన ఒక వ్యక్తివలె వివరించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సృష్టించబడినవాటి ప్రకారము కాకుండా, దేవుడు కోరుకొనినదానినిబట్టి” (చూడండి: మానవీకరణ)
Romans 8:21
αὐτὴ ἡ κτίσις ἐλευθερωθήσεται
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు సృష్టిని కాపాడును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἀπὸ τῆς δουλείας τῆς φθορᾶς
నాశనముకు లోనైన దాస్యము అనే మాట నాశనముకు లోనైనా అనే అర్థముకొరకు అలంకారికముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నాశనముకు లోనైన దాస్యమునుండి” (చూడండి: రూపకం)
εἰς τὴν ἐλευθερίαν τῆς δόξης τῶν τέκνων τοῦ Θεοῦ
ఇక్కడ స్వాతంత్ర్యము అనగా నాశనముకు లోనైన దాస్యమునకు విరుద్ధముగా. సృష్టి నాశనము కాదని చెప్పే రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని పిల్లలవలె నాశనమునుండి మహిమకరముగా విడుదల పొందును” (చూడండి: రూపకం)
Romans 8:22
οἴδαμεν γὰρ ὅτι πᾶσα ἡ κτίσις συνστενάζει καὶ συνωδίνει ἄχρι τοῦ νῦν
సృష్టిని వేదనతో ఒక శిశువుకు జన్మనిచ్చిన ఒక తల్లికి పోల్చడమైనది. ప్రత్యామ్నాయ అనువాదము: “శిశువుకు జన్మనిచ్చుచున్న తల్లివలె దేవుడు సృష్టించిన ప్రతీది విడుదల పొందాలని మూలుగుతూ ఉన్నదని మనకు తెలుసు” (చూడండి: రూపకం)
Romans 8:23
υἱοθεσίαν ἀπεκδεχόμενοι, τὴν ἀπολύτρωσιν τοῦ σώματος ἡμῶν
ఇక్కడ “మన దత్తత” అనే మాటకు దేవుని కుటుంబములో సంపూర్ణ సభ్యులుగా చేర్చబడినప్పుడు పిల్లలముగా దత్తత చేయబడియున్నాము అని అర్థము. “విమోచన” అనే పదముకు దేవుడు మనలను రక్షించెనని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము దేవుని కుటుంబములో సంపూర్ణ సభ్యులుగా ఉన్నప్పుడు, ఆయన మరణమునుండి మరియు నాశనమునుండి మన దేహములను రక్షించు క్షణము కొరకు ఎదురుచూచుచున్నాము” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు రూపకం)
Romans 8:24
τῇ γὰρ ἐλπίδι ἐσώθημεν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము దేవునియందు నిరీక్షణ కలిగియున్నందున ఆయన మనలను రక్షించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐλπὶς δὲ βλεπομένη, οὐκ ἔστιν ἐλπίς; ὃ γὰρ βλέπει τις, ἐλπίζει
“నిరీక్షణ” అనగా ఏమిటి అనే విషయమును తన ప్రేక్షకులు అర్థము చేసుకొనుటకు పౌలు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము నిశ్చయత కలిగి ఎదురుచూచువారమైతే, మనము కోరినది మనము ఇంకను పొందుకొనలేదని దాని అర్థము. ఎవడును తనకు కావలసినది తనకు దొరికినప్పుడు నిశ్చయతతో ఎదురుచూడడు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 8:26
శరీరముకు మరియు ఆత్మకు మధ్యన పోరాటము విశ్వాసులలో ఉన్నదని పౌలు నొక్కి చెప్పుచున్నప్పటికిని, ఆత్మ మనకు సహాయము చేయుచున్నాడని ఆయన తెలియజేయుచున్నాడు.
στεναγμοῖς ἀλαλήτοις
మనము మాటలలో చెప్పుకొనలేక మూల్గులను కలిగి
Romans 8:27
ὁ…ἐραυνῶν τὰς καρδίας
ఇక్కడ “ఆయన” అనే పదము దేవునిని సూచించుచున్నది. ఇక్కడ “హృదయములు” అనే మాటలు ఒక వ్యక్తి ఆలోచనలను మరియు భావాలను సూచించుటకొరకు పర్యాయముగా చెప్పబడియున్నది. “హృదయములను పరిశోధించును” అనే మాట ఆలోచనలను మరియు భావములను పరీక్షించుచున్నాడని చెప్పుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన సమస్త ఆలోచనలను మరియు భావాలను ఎరిగిన దేవుడు” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
Romans 8:28
దేవుని ప్రేమనుండి విశ్వాసులను వేరు చేయలేరని పౌలు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు.
τοῖς…κλητοῖς οὖσιν
మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఎన్నుకొనినవారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 8:29
οὓς προέγνω
సృష్టిని చేయక మునుపే ఆయన వారిని ఎరిగియున్నాడు
καὶ προώρισεν
ఆయన వారి గమ్యమును గూర్చి చేసియున్నాడు లేక “ఆయన ముందుగానే ప్రణాళిక చేసియున్నాడు”
συμμόρφους τῆς εἰκόνος τοῦ Υἱοῦ αὐτοῦ
దేవుడు ఈ జగత్తును సృష్టించబడకమునుపే తన కుమారుడైన యేసువలె మారునట్లు యేసునందు విశ్వసించిన వారినందరిని అభివృద్ధి చేయుటకు ముందుగానే ప్రణాళికను కలిగియున్నాడు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన తన కుమారునివలె వారినందరిని మార్చును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Υἱοῦ
ఇది దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
εἰς τὸ εἶναι αὐτὸν πρωτότοκον
తద్వారా ఆయన కుమారుడు మొదటివాడు
ἐν πολλοῖς ἀδελφοῖς
ఇక్కడ “సహోదరులు” అనే పదము స్త్రీ పురుషులైన విశ్వాసులందరిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని కుటుంబమునకు సంబంధించిన సహోదరి మరియు సహోదరుల మధ్యలోనుండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 8:30
οὓς…προώρισεν
ముందుగానే దేవుడు ప్రణాళిక చేసిన వారందరూ
τούτους καὶ ἐδικαίωσεν
ఇక్కడ “నీతిమంతులుగా తీర్చబడుట” అనే మాట ఇది తప్పకుండ జరుగుతుందని నొక్కి చెప్పుటకు భూత కాలములోనే వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వీరినందరిని ఆయన తనతోపాటు నీతిమంతులనుగా ఎంచియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τούτους καὶ ἐδόξασεν
“మహిమపరచియున్నాడు” అనే మాట ఇది తప్పకుండగ భవిష్యత్తులో జరుగునని నొక్కి చెప్పుటకు భూత కాలములో ముందుగానే చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వీరినందరిని ఆయన మహిమపరచును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 8:31
τί οὖν ἐροῦμεν πρὸς ταῦτα? εἰ ὁ Θεὸς ὑπὲρ ἡμῶν, τίς καθ’ ἡμῶν
పౌలు ముందుగా చెప్పిన ముఖ్య అంశమును నొక్కి చెప్పుటకు ఆయన ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వీటన్నిటినుండి మనము తెలుసుకొనవలసినది ఇదే: దేవుడు మనకు సహాయము చేయుచున్నందున, ఎవరును మనలను ఓడించలేరు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 8:32
ὅς γε τοῦ ἰδίου Υἱοῦ οὐκ ἐφείσατο
మనుష్యుల పాపములకు విరుద్ధముగా ఉన్నటువంటి దేవుని అనంతమైన పరిశుద్ధ స్వభావమును తృప్తిపరచుటకు అవసరమైన నిత్య బలిని పరిశుద్ధముగా సిలువలో పొందుటకు తండ్రియైన దేవుడు దేవుని కుమారుడైన యేసును పంపించెను. ఇక్కడ “కుమారుడు” అనే పదము దేవుని కుమారుడైన యేసుకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన శీర్షిక. (చూడండి: తండ్రి, కుమారుడు ను అనువదించడం)
ἀλλὰ…παρέδωκεν αὐτόν
అయితే ఆయన శత్రువుల నియంత్రణ క్రింద ఆయనను పెట్టియుండెను
πῶς οὐχὶ καὶ σὺν αὐτῷ, τὰ πάντα ἡμῖν χαρίσεται
నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు: “ఆయన నిశ్చయముగా మరియు ఉచితముగా సమస్తమును అనుగ్రహించును!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τὰ πάντα ἡμῖν χαρίσεται
దయచేసి సమస్తమును మాకు ఇవ్వుము
Romans 8:33
τίς ἐγκαλέσει κατὰ ἐκλεκτῶν Θεοῦ? Θεὸς ὁ δικαιῶν
పౌలు నొక్కి చెప్పుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఎదుట ఎవరును మన మీద ఆరోపణలు చేయరు, ఎందుకంటే ఆయన ఒక్కడే మనలను నీతిమంతులనుగా చేయువాడు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 8:34
τίς ὁ κατακρινῶν
పౌలు నొక్కి చెప్పుటకు ఒక ప్రశ్నను అడుగుచున్నాడు. ఆయన జవాబు కొరకు ఎదురుచూడలేదు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరును మనలను ఖండించలేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὅς, καί ἐστιν ἐν δεξιᾷ τοῦ Θεοῦ
“దేవుని కుడి పార్శ్వమున ఉండుట” అనే మాట దేవుని నుండి గొప్ప ఘనతను మరియు అధికారమును పొందుకొను క్రియకు లేక కార్యముకు చిహ్నమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ప్రక్కన ఘనత పొందు స్థలములో ఎవరున్నారు” (చూడండి: సంకేతాత్మకమైన చర్య)
Romans 8:35
τίς ἡμᾶς χωρίσει ἀπὸ τῆς ἀγάπης τοῦ Χριστοῦ
క్రీస్తు ప్రేమనుండి మనలము ఏదియు వేరుచేయలేదని బోధించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరును ఎడబాపలేరు!” లేక “ఏదియు మనలను క్రీస్తు ప్రేమనుండి వేరు చేయలేదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
“క్రీస్తు ప్రేమనుండి మనలను ఏదైనా వేరుచెయగలదా” అనే మాటలు ముందుగా వచ్చిన ప్రశ్ననుండి అర్థము చేసుకోవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “శ్రమలైన, బాధలైన, లేక హింసలైన, లేక కరువైన, లేక వస్త్రహీనతయైన, లేక అపాయమైన, లేక ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయగలవా?” (చూడండి: శబ్దలోపం)
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
ఇవన్నియు క్రీస్తు ప్రేమనుండి మనలను వేరు చేయలేవని నొక్కి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “శ్రమలైన, బాధయైన, హింసయైన, కరువైన, వస్త్రహీనతయైన, అపాయమైన, మరియు ఖడ్గమైన క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపనేరవు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
θλῖψις, ἢ στενοχωρία, ἢ διωγμὸς, ἢ λιμὸς, ἢ γυμνότης, ἢ κίνδυνος, ἢ μάχαιρα
ఈ నైరూప్య నామవాచకములన్నియు వాటి క్రియాపదములతో వ్యక్తము చేయుచున్నవి. ఇక్కడ “ఖడ్గము” అనే పదము హింసాత్మకముగా చంపబడేవాటికి పర్యాయముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు మనకు శ్రమకు గురి చేసిన, మనలను బాధపెట్టిన, మన బట్టలను మరియు ఆహారమును తీసివేసికొనిన, లేక మనలను చంపినా, వారు క్రీస్తు ప్రేమ నుండి దూరము చేయలేరు.” (చూడండి: భావనామాలు మరియు అన్యాపదేశము)
θλῖψις, ἢ στενοχωρία
ఈ మాటలు ఒకే అర్థమును కలిగియుంటాయి. (చూడండి: జంటపదం)
Romans 8:36
ὅτι ἕνεκεν σοῦ
ఇక్కడ “నీ కోసం” అనే మాట ఏకవచనము మరియు ఇది దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీ కొరకు” (చూడండి: ‘మీరు’ రూపాలు)
θανατούμεθα ὅλην τὴν ἡμέραν
ఇక్కడ “మేము” అనే పదము దేవునిని, ఈ లేఖన భాగమును వ్రాసిన వ్యక్తిని సూచించుచున్నది, అయితే తన ప్రేక్షకులను సూచించుటలేదు. వారు ఎంత ఘోరమైన అపాయములో ఉన్నారని నొక్కి చెప్పుటకు “రోజంతా” అనే మాట ఉపయోగించబడియున్నది. దేవునికి సంబంధించిన మీరందరూ క్లిష్ట సమయాలను లేక పరిస్థితులను ఎదుర్కొనవలసియుంటుందని చూపించుటకు పౌలు ఈ లేఖనభాగమును ఉపయోగించియున్నాడు. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మన శత్రువులు మనలను చంపాలని ఎల్లప్పుడూ పొంచియుంటారు” (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం” మరియు అతిశయోక్తి మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐλογίσθημεν ὡς πρόβατα σφαγῆς
ప్రజలు చంపే వారినందరిని వధకు సిద్ధము చేసిన గొర్రెల మందకు పౌలు పోల్చి చెప్పుచున్నాడు, ఎందుకంటే వారు దేవునికి నమ్మకస్తులైనవారు. మీరు దీనిని క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు చంపే గొర్రెలకంటే మన జీవితాలు వారికి అంత విలువైనవేమి కాదు” (చూడండి: ఉపమ మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 8:37
ὑπερνικῶμεν
మనము సంపూర్ణముగా విజయము పొందియున్నాము
διὰ τοῦ ἀγαπήσαντος ἡμᾶς
యేసు చూపించిన ప్రేమ ఎటువంటిదో మీరు ఇంకా స్పష్టముగా వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు మనలను అమితముగా ప్రేమించినందుననే ఆయన మన కొరకు చనిపోవుటకు ఇష్టపడియుండెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 8:38
πέπεισμαι
నేను ఒప్పించబడియున్నాను లేక “నేను నిశ్చయత కలిగియున్నాను”
ἀρχαὶ
ఈ అర్థాలు ఉండవచ్చును, 1) దయ్యములు లేక 2) మనుష్యులైన రాజులు మరియు పాలకులు.
οὔτε δυνάμεις
ఈ అర్థాలు ఉండవచ్చును, 1) ఆత్మ సంబంధమైన శక్తులు లేక 2) అధికారము కలిగిన మనుష్యులు.
Romans 9
రోమా 09 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
ఈ అధ్యయములో పౌలు బోధించుచున్న విషయమును మార్చుచున్నాడు. 9-11 అధ్యాయములలో, అతడు ఇశ్రాయేలు దేశమును కేంద్రీకరించాడు.
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. యుఎల్టి(ULT) ఈ అధ్యాయములోని 25-29 మరియు 33వ వచనములలో ఈ విధంగా చేసియున్నది. పౌలు ఈ మాటలన్నిటిని పాత నిబంధనలోనుండి వ్యాఖ్యానించాడు.
ఈ అధ్యాయములోని విశేష అంశములు
శరీరము
అబ్రహాము నుండి యాకోబు ద్వారా వచ్చిన శారీరిక పిల్లలను, అనగా దేవుడు ఇశ్రాయేలు అని పిలిచిన ఇశ్రాయేలియులను సూచించుటకు “శరీరము” అనే పదమును పౌలు ఈ అధ్యాయములో మాత్రమే ఉపయోగించుచున్నాడు. (చూడండి: శరీరం)
ఇతర అధ్యాయములలో, తోటి క్రైస్తవులను సూచించుటకు పౌలు “సహోదరుడు” అనే పదమును ఉపయోగించుచున్నాడు. ఇదిలావుండగా, ఈ అధ్యాయములో, అతడు “నా సహోదరులు” అనే పదమును తన సహోదరులైన ఇశ్రాయేలియులను సూచించుటకు ఉపయోగించుచున్నాడు.
ముందుగ నిర్ణయించబడిన గమ్యము
ఈ అధ్యాయములో “ముందుగ నిర్ణయించబడిన గమ్యము” అనే అంశమును గూర్చి పౌలు విరివిగా బోధించుచున్నాడని అనేక మంది పండితులు నమ్ముచున్నారు. ఇది “మందుగా నిర్ణయించబడిన” అనే వాక్యానుసారమైన అంశముకు సంభందించినదైయున్నది. ప్రపంచము పునాదులు వేయబడక ముందే కొంతమంది నిత్య రక్షణలో ఉండునట్లు దేవుడు ఏర్పరచియున్నాడని సూచించడానికి దీనిని తీసుకుంటారు. ఈ విషయమై పరిశుద్ధ గ్రంథము ఏమి బోధించుచున్నదనే విషయమును గూర్చి క్రైస్తవులు అనేక భిన్నాభిప్రాయాలు కలిగియున్నారు. అందువలన ఈ అధ్యాయమును తర్జుమా చేయునప్పుడు అనువాదకులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. (చూడండి: ముందుగా నిర్ణయించబడుట, ముందుగా నిర్ణయించబడినది మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
ఈ అధ్యాయములో ఎదురైయే ప్రాముఖ్యమైన అలంకార పదములు
అడ్డుబండ
కొంతమంది అన్యులు యేసును వారి రక్షకునిగా అంగికరించియున్నారని మరియు యూదులు తమ రక్షణను సంపాదించుకొను ప్రయత్నములో యేసును త్రుణీకరించియున్నారని పౌలు వివరించుచున్నాడు. యూదులు నడచుచున్నప్పుడు తొట్రిల్లు అడ్డుబండగా యేసు ఉన్నాడని పాత నిబంధన గ్రంథములోని వాక్యమును చూపించుచు పౌలు చెప్పుచున్నాడు. ఈ “అడ్డుబండ” వారు “పడిపోవుటకు” కారణమైయున్నది. (చూడండి: రూపకం)
ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర తర్జుమా ఇబ్బందులు
“ఇశ్రాయేలులో నివసించు ప్రతివాడు ఇశ్రాయేలీయుడు కాడు”
పౌలు ఈ వచనములో “ఇశ్రాయేలు” అనే పదమును రెండు వేవేరు అర్థములు ఇచ్చు విధముగా ఉపయోగించియున్నాడు. “ఇశ్రాయేలు” అనే మొదటి పదము యాకోబు ద్వారా అబ్రహాము యొక్క శారీరక సంతానమును సూచించుచున్నది. “ఇశ్రాయేలు” అనే రెండవ పదము విశ్వాసము ద్వారా దేవుని ప్రజలైనవారు అని అర్థము. యుఎస్టి(UST) దీనినే సూచించుచున్నది.
Romans 9:1
ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడుదురని పౌలు కలిగియున్న వ్యక్తిగత ఆశను అతడు తెలియపరచుచున్నాడు. తరువాత వారు నమ్ముటకు దేవుడు వారిని వివిధరకాలుగా సిద్ధపరచిన విషయమును అతడు నొక్కి చెప్పుచున్నాడు.
ἀλήθειαν λέγω ἐν Χριστῷ, οὐ ψεύδομαι
ఈ రెండు పదములు సహజముగా ఒకే విషయాన్ని సూచించుచున్నది. అతడు సత్యమునే చెప్పుచున్నాడని నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించుచున్నాడు. (చూడండి: జంటపదం)
συνμαρτυρούσης μοι τῆς συνειδήσεώς μου ἐν Πνεύματι Ἁγίῳ
పరిశుద్ధాత్మ నా మనస్సాక్షిని నియంత్రించుచున్నది మరియు నేను చెప్పినదానికి సాక్షిగా ఉన్నది
Romans 9:2
ὅτι λύπη μοί ἐστιν μεγάλη, καὶ ἀδιάλειπτος ὀδύνη τῇ καρδίᾳ μου
ఇక్కడ పౌలు తన మానసిక క్షోభను వ్యక్తపరచడానికి “అంతంగాని ఆవేదన నా హృదయములో ఉంది” అనే జాతీయమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను ఎంతగానో దుఖించుచున్నానని నేను మీకు చెప్పుచున్నాను” (చూడండి: జాతీయం (నుడికారం))
λύπη…μεγάλη, καὶ ἀδιάλειπτος ὀδύνη
ఈ రెండు పదములు సహజముగా ఒకే విషయాన్ని సూచించుచున్నది. అతని భావాలు ఎంత గొప్పవిగా ఉన్నవని నొక్కి చెప్పడానికి పౌలు వాటిని కలిపి ఉపయోగించుచున్నాడు. (చూడండి: జంటపదం)
Romans 9:3
ηὐχόμην γὰρ ἀνάθεμα εἶναι αὐτὸς, ἐγὼ ἀπὸ τοῦ Χριστοῦ ὑπὲρ τῶν ἀδελφῶν μου, τῶν συγγενῶν μου, κατὰ σάρκα
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నన్ను శపించి మరియు క్రీస్తునుండి నన్ను శాశ్వతముగా దూరము చేయుట ద్వారా నాతోటి ఇశ్రాయేలీయులు, నా స్వంత ప్రజలు, క్రీస్తును నమ్ముటకు సహాయపడితే నేను దానిని వ్యక్తిగతంగా స్వకరించుటకు సిద్ధముగా ఉన్నాను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῶν ἀδελφῶν
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
Romans 9:4
οἵτινές εἰσιν Ἰσραηλεῖται
వారు, నాలాగే ఇశ్రాయేలీయులైయున్నారు. దేవుడు వారిని యాకోబు వారసులుగా ఎంచుకొనియున్నాడు
ὧν ἡ υἱοθεσία
ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలవలె ఉన్నారని సూచించుటకు ఇక్కడ పౌలు “దత్తపుత్రత్వం” అనే రూపకఅలంకారముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తండ్రిలాగా దేవుని కలిగియున్నారు” (చూడండి: రూపకం)
Romans 9:6
విశ్వాసము ద్వారా మాత్రమే ఇశ్రాయేలు కుటుంబములో జన్మించినవారు ఇశ్రాయేలులో నిజమైన భాగముగా ఉందురని పౌలు నొక్కి చెప్పుచున్నాడు.
οὐχ οἷον δὲ, ὅτι ἐκπέπτωκεν ὁ λόγος τοῦ Θεοῦ
అయితే దేవుడు తన వాగ్దానములను నెరవేర్చుటకు ఎప్పుడు విఫలము చెందలేదు లేక “దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకొనియున్నాడు”
οὐ γὰρ πάντες οἱ ἐξ Ἰσραήλ οὗτοι, Ἰσραήλ
దేవుడు తన వాగ్దానాలను ఇశ్రాయేలు (లేక యాకోబు) భౌతిక స౦తానానికి చేయలేదు కానీ తన ఆధ్యాత్మిక వారసులకు అనగా యేసును విశ్వసించే వారికి చేసియున్నాడు.
Romans 9:7
οὐδ’ ὅτι εἰσὶν σπέρμα Ἀβραάμ πάντες τέκνα
వారు అబ్రహాము సంతానము అయినందున వారందరూ దేవుని పిల్లలైయుండలేరు
Romans 9:8
οὐ τὰ τέκνα τῆς σαρκὸς,
ఇక్కడ “శారీరక పిల్లలు” అనే మాట అబ్రహాము యొక్క భౌతిక పిల్లలను సూచించు సమానార్థక మాటైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అబ్రహాము సంతానము వారందరూ” (చూడండి: అన్యాపదేశము)
ταῦτα τέκνα τοῦ Θεοῦ
ఆత్మీయ సంతానమైన వారిని అనగా యేసులో విశ్వాసముంచినవారిని ఈ రూపకఅలంకారము సూచించుచున్నది. (చూడండి: రూపకం)
τὰ τέκνα τῆς ἐπαγγελίας
దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాలను వారసత్వ౦గా చేసుకోనే వ్యక్తులకు ఇది సూచించుచున్నది.
Romans 9:9
ἐπαγγελίας…ὁ λόγος οὗτος
దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఈ పదాలు ఉపయోగించాడు
ἔσται τῇ Σάρρᾳ υἱός
శారాకు దేవుడు కుమారుడుని ఇచ్చునని వ్యక్తపరచు విధముగా దీనిని మీరు క్రియాశీలకంగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను శారాకు ఒక కుమారుడుని ఇచ్చెదను” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 9:10
τοῦ πατρὸς ἡμῶν
పౌలు ఇస్సాకును “మన తండ్రి” అని సూచించుచున్నాడు ఎందుకంటే పౌలు మరియు రోమాలో ఉన్న యూదా విశ్వాసులకు ఇస్సాకు పితురుడైయుండెను. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
κοίτην, ἔχουσα
గర్భవతి అయింది
Romans 9:11
μήπω γὰρ γεννηθέντων, μηδὲ πραξάντων τι ἀγαθὸν ἢ φαῦλον
పిల్లలు పుట్టకముందే మరియు మంచైనా చెడైనా, వారు ఏమీ చేయకముందే
ἵνα ἡ κατ’ ἐκλογὴν πρόθεσις τοῦ Θεοῦ μένῃ
అందువలన తనకు నచ్చిన ప్రకారం దేవుడు ఏమి జరగాలని కోరుకుంటున్నాడు అదే జరుగును
μήπω γὰρ γεννηθέντων
పిల్లలు పుట్టకముందే
μηδὲ πραξάντων τι ἀγαθὸν ἢ φαῦλον
వారు చేసిన దేనివల్ల కాదు
Romans 9:12
దేవుని వలన
ἐκ τοῦ
మీ భాషలో ఒకవేళ ఈ వచనమును 10వ వచనము మరియు 11వ వచనము మధ్యలో ఉంచవలసిన అవసరం ఉండవచ్చు: “మన తండ్రియైన ఇస్సాకు, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’ అని ఆమెకు చెప్పబడియుండెను. ఇప్పుడు పిల్లలు ఇంకా పుట్టియుండలేదు మరియు ఇంకా మంచి లేదా చెడు ఏమీ చేయలేదు కానీ క్రియలవల్ల కాక పిలిచిన వానిని బట్టి – దేవుని ఉద్దేశ్యము యొక్క కోరిక ప్రకారము నిలబడవచ్చును. ఇది న్యాయమే”
ἐρρέθη αὐτῇ, ὅτι ὁ μείζων δουλεύσει τῷ ἐλάσσονι
దేవుడు రిబ్కాతో చెప్పెను, ‘పెద్దవాడు చిన్నవాడి సేవ చేయును’
Romans 9:13
τὸν Ἰακὼβ ἠγάπησα, τὸν δὲ Ἠσαῦ ἐμίσησα
“ద్వేషించెను” అనే పదము అతిశయోక్తిగా ఉన్నది. దేవుడు ఏశావు కంటే యాకోబును ఎక్కువుగా ప్రేమించెను. అతను ఏశావును అక్షరార్థముగా ద్వేషించలేదు. (చూడండి: అతిశయోక్తి)
Romans 9:14
τί οὖν ἐροῦμεν
పౌలు తన చదువరులు ఏకాగ్రతను పొందుటకు ఈ ప్రశ్నను ఉపయోగి౦చుచున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ γένοιτο
అది సాధ్యం కాదు! లేక ""ఖచ్చితంగా కాదు!"" ఇలా జరగవచ్చని ఈ వ్యక్తీకరణ గట్టిగా తిరస్కరించింది. ఇక్కడ ఉపయోగించుటకు మీ భాషలో ఇలాంటి వ్యక్తీకరణ ఉండవచ్చు.
Romans 9:15
τῷ Μωϋσεῖ γὰρ λέγει
దేవుడు మోషేతో మాట్లాడిన సంఘటన ప్రస్తుత కాలములో జరిగినట్లుగా పౌలు దానిని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మోషేతో ఈ విధంగా చెప్పెను” (చూడండి: రూపకం)
Romans 9:16
οὐ τοῦ θέλοντος, οὐδὲ τοῦ τρέχοντος
ప్రజలు కోరుకునే దాని వల్ల కాదు లేదా వారు ప్రయత్నించడం వల్ల కాదు
οὐδὲ τοῦ τρέχοντος
దేవుని కృపను పొందునట్లు మంచి కార్యములు చేయు ఒక వ్యక్తి పరుగు పందెంలో పరుగెత్తు వ్యక్తిగా ఉన్నాడని ఆ వ్యక్తిని గురి౦చి పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: రూపకం)
Romans 9:17
λέγει γὰρ ἡ Γραφὴ
ఇక్కడ దేవుడు ఫరోతో మాట్లాడుచున్నది లేఖనమే అతనితో మాట్లాడుచున్నట్లు వ్యక్తీకరించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు చెప్పెనని లేఖనాలలో వ్రాయబడియున్నది” (చూడండి: మానవీకరణ)
ἐξήγειρά…ἐνδείξωμαι…μου
దేవుడు తనను గూర్చి తాను సూచించుకొనుచున్నాడు.
σε
ఏకవచనము (చూడండి: ‘మీరు’ రూపాలు)
ἐξήγειρά σε
హెచ్చించాను అనే పదముకు ఇక్కడ “దేనినైన తన స్థానములో ఉండునట్లు చేయునది” అనే జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు శక్తిగల వ్యక్తిగా ఉన్నట్లు నేను నిన్ను శక్తిమంతుడుగా చేసితిని” (చూడండి: జాతీయం (నుడికారం))
ὅπως διαγγελῇ τὸ ὄνομά μου
దీనిని మీరు క్రియాశీలకంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు నా నామమును ప్రచురించునట్లు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὸ ὄνομά μου
ఈ పర్యాయ పదము 1) దేవుని ఉనికి అంతటిలో ఆయనకు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేనెవరిని” లేక 2) ఆయన గుర్తింపుకు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను ఎంత గొప్పవాడిని” (చూడండి: అన్యాపదేశము)
ἐν πάσῃ τῇ γῇ
ప్రజలున్న ప్రతి స్థలము (చూడండి: అతిశయోక్తి)
Romans 9:18
ὃν δὲ θέλει, σκληρύνει
దేవుడు ఎవరిని కఠినపరచాలని తలంచుతాడో వారిని ఆయన కఠినపరచుతాడు.
Romans 9:19
ἐρεῖς μοι οὖν
పౌలు తన విమర్శించువారితో మాట్లాడుచున్నప్పుడు అతడు ఒక వ్యక్తితో మాట్లాడుచున్నట్లు వ్యవహరించాడు. మీరిక్కడ బహువచనమును ఉపయోగించగలరు. (చూడండి: ‘మీరు’ రూపాలు)
τί οὖν ἔτι μέμφεται? τῷ γὰρ βουλήματι αὐτοῦ, τίς ἀνθέστηκεν
ఈ అలంకారిక ప్రశ్నలు దేవునికి విరోధముగా చేయబడిన ఫిర్యాదులైయున్నవి. మీరు వాటిని బలమైన వాక్యములుగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన మాలో తప్పును కనిపెట్టకూడదు. ఆయన చిత్తమును ఎవరు ఇంతవరకు ఎదురించలేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
μέμφεται…αὐτοῦ
“ఆయన” మరియు “అతని” అనే పదములు దేవునిని సూచించుచున్నవి.
τῷ…βουλήματι αὐτοῦ…ἀνθέστηκεν
ఆయన చేయాలని తలంచినవాటిని చేయుటకు ఎవరు ఆపలేదు
Romans 9:20
μὴ ἐρεῖ τὸ πλάσμα, τῷ πλάσαντι, τί με ἐποίησας οὕτως
సృష్టికర్త తన సృష్టిని ఏ విధముగానైన చేయోచ్చు అనే సృష్టికర్త అధికారము ఒక కుమ్మరి యొక్క అధికారముతో తన ఆలోచన ప్రకారము మట్టితో ఎటువంటి పాత్రను చేయాలని ఉండునో ఆ పాత్రనే చేయును అనే రూపకఅలంకారమును పౌలు ఉపయోగించుచున్నాడు. తన వాదనను నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను అడుగుచున్నాడు. దీనిని బలమైన వాక్యముగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “రూపించబడిన పాత్ర తనను రూపించిన వ్యక్తిని ‘ఎందుకు… ఎందుకు?’ అని ప్రశ్నించకూడదు?” (చూడండి: రూపకం మరియు అలంకారిక ప్రశ్న)
τί με ἐποίησας οὕτως
ఈ ప్రశ్న గద్దింపుయైయున్నది మరియు దీనిని బలమైన వాక్యముగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీవు నన్నిలా చేసియుండకూడదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 9:21
ἢ οὐκ ἔχει ἐξουσίαν ὁ κεραμεὺς τοῦ πηλοῦ, ἐκ τοῦ αὐτοῦ φυράματος ποιῆσαι ὃ μὲν εἰς τιμὴν σκεῦος, ὃ δὲ εἰς ἀτιμίαν
ఈ అలంకారిక ప్రశ్న గద్దింపైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “రోజువారీ వాడకం కోసం… కుమ్మరికి అధికారము లేదా.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 9:22
σκεύη ὀργῆς
ప్రజలు పాత్రలవలె ఉన్నారని వారిని గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ఉగ్రతకు అర్హులైన ప్రజలు” (చూడండి: రూపకం)
Romans 9:23
γνωρίσῃ…αὐτοῦ
“ఆయన” మరియు “అతని” అనే పదములు దేవునిని సూచించుచున్నవి.
σκεύη ἐλέους
ప్రజలు పాత్రలవలె ఉన్నారని వారిని గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని కరుణకు అర్హులైన ప్రజలు” (చూడండి: రూపకం)
τὸν πλοῦτον τῆς δόξης αὐτοῦ ἐπὶ
దేవుని అద్భుతమైన కార్యములను పౌలు ఇక్కడ “సంపదలు” అని పోల్చుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “చాలా గొప్పదైన తన మహిమ, పై” (చూడండి: రూపకం)
ἃ προητοίμασεν εἰς δόξαν
ఇక్కడ “మహిమ” అనే పదము దేవునితో పరలోకములో జీవించుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనతో పాటు వారు నివసించునట్లు ఆయన ముందుగానే సిద్దపరచినవారిని” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 9:24
καὶ…ἡμᾶς
“మనము” అనే పదము ఇక్కడ పౌలు మరియు తోటి విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἐκάλεσεν
ఇక్కడ “పిలవబడిన” అనే పదము దేవుడు తన పిల్లలుగా, తన సేవకులుగా మరియు యేసు క్రీస్తు ద్వారా రక్షణ సువార్తను ప్రకటించు సువార్తికులు అని అర్థము.
Romans 9:25
ఇశ్రాయేలీయుల అపనమ్మకమును గూర్చి ముందుగానే ప్రవక్తయైన హొషేయ ద్వారా ఏవిధముగా చెప్పబడియున్నదని పౌలు ఈ భాగములో వివరించుచున్నాడు.
ὡς καὶ ἐν τῷ Ὡσηὲ λέγει
ఇక్కడ “ఆయన” అనే పదము దేవుడిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు హొషేయ గ్రంథములో కూడా చెప్పిన విధముగా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τῷ Ὡσηὲ
హొషేయ ఒక ప్రవక్తయైయుండెను. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
καλέσω τὸν οὐ λαόν μου, λαόν μου
నా ప్రజలు కాని వారిని నా ప్రజల కొరకు నేను ఎన్నుకొనెదను
τὴν οὐκ ἠγαπημένην, ἠγαπημένην
ఇక్కడ “ఆమె” అనే పదము ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగినున్న హొషేయ భార్యయైన గోమేరును సూచించుచున్నది. దీనిని మీరు క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 9:26
υἱοὶ Θεοῦ ζῶντος
ఇక్కడ “జీవించుచున్న” అనే పదము దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని మరియు ఆయన ఇతర అన్య దేవతలవలె లేడని సూచించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నిజమైన దేవుని పిల్లలు” (చూడండి: @)
Romans 9:27
κράζει
పిలుచుట
ὡς ἡ ἄμμος τῆς θαλάσσης
ఇక్కడ పౌలు ఇశ్రాయేలు ప్రజల సంఖ్యను సముద్రపు ఇసుకవలె ఉన్నాడని పోల్చుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “లెక్కించుటకు సాధ్యము కాదు” (చూడండి: ఉపమ)
σωθήσεται
పౌలు “రక్షణ” అనే పదమును ఆత్మీయ భావముతో ఉపయోగించుచున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించినట్లైతే, అనగా యేసు సిలువపై మరణించెను అని నమ్ముట ద్వారా దేవుడు వారిని క్షమించియున్నాడని మరియు అతని పాపములనుండి విడిపించబడియున్నారని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు రక్షించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 9:28
λόγον…ποιήσει Κύριος ἐπὶ τῆς γῆς
ఇక్కడ “శిక్ష” అనే పదము ఆయన ప్రజలను శిక్షించుటకు నిర్ణయించుకొనియున్నాడని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన చెప్పిన విధముగా ప్రభువు భూమిపైనున్న ప్రజలను శిక్షించును”
Romans 9:29
ἡμῖν…ν ἐγενήθημεν
ఇక్కడ “మనము” మరియు “మేము” అనే పదములు ఆయన మాట్లాడిన యెషయాను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ὡς Σόδομα ἂν ἐγενήθημεν, καὶ ὡς Γόμορρα ἂν ὡμοιώθημεν
దేవుడు సొదొమ మరియు గొమొర్ర పట్టణ ప్రజల పాపముల నిమిత్తము వారిని శిక్షించెను. ప్రత్యామ్నాయ అనువాదము: “సొదొమ మరియు గొమొర్ర పట్టణస్తులను నాశనము చేసిన విధముగా మనమందరమూ నాశనము చేసియుండవచ్చు” లేక “సొదొమ మరియ గొమొర్ర పట్టణములను నాశనము చేసినట్లుగా దేవుడు మనలందరిని నాశనము చేసియుండవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 9:30
τί οὖν ἐροῦμεν
పౌలు తన చదువరుల గమనమును పొందడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము దీనిని చెప్పవలెను” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ὅτι ἔθνη
..అని మనము చెప్పుదుము
τὰ μὴ διώκοντα δικαιοσύνην
దేవునికి ఇష్టులుగా ఉండుటకు ప్రయత్నించని అన్యులు
δικαιοσύνην…τὴν ἐκ πίστεως
ఇక్కడ “విశ్వాసమూలమైన” అనే పదము క్రీస్తులో ఒకరు ఉంచియున్న నమ్మకమును సూచించుచున్నది. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు క్రీస్తులో విశ్వసించినప్పుడు దేవుడు వారిని ఆయనతో సమానముగా చేసెను గనుక” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 9:31
οὐκ ἔφθασεν
ధర్మశాస్త్రములను అనుసరించడం ద్వారా ఇశ్రాయేలీయులు దేవుని మెప్పించలేరని దీని అర్థము. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ధర్మశాస్త్రములను అనుసరించలేకపోయారు కాబట్టి వారు ధర్మశాస్త్రమును అనుసరించడం ద్వారా దేవుణ్ణి మెప్పించలేక పోయారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 9:32
διὰ τί
ఇది శబ్దలోపమైయున్నది. మీ భాషలో స్పష్టమైన మాటలను మీరు చేర్చవచ్చు. తన చదువరుల గమనమును పొందడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారెందుకు నీతిని పొందలేకపోయారు?” (చూడండి: శబ్దలోపం)
ὡς ἐξ ἔργων
దేవుణ్ణి మెప్పించడానికి ప్రజలు ప్రయత్నించు ప్రయత్నములను ఇది సూచించుచున్నది. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుణ్ణి మెప్పించు కార్యములను వారు చేయుచు” లేక “ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 9:33
καθὼς γέγραπται
యెషయా దీనిని వ్రాసాడని మీరు సూచించవచ్చు. దీనిని మీరు క్రియాశీలకంగా కూడా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రవక్తయైన యెషయా వ్రాసినట్లు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐν Σιὼν
ఇక్కడ సీయోను అనే పదము ఇశ్రాయేలును సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలులో” (చూడండి: అన్యాపదేశము)
λίθον προσκόμματος, καὶ πέτραν σκανδάλου
ఈ రెండు మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు యేసు సిలువపై మరణించుటను సూచించు రూపకఅలంకారములుగా ఉన్నవి. యేసు సిలువపై మరణమును వారు అసహ్యముగా భావించియున్నారు గనుక అది ప్రజలు తొట్రిల్లు అడ్డుబండగా ఉండెను. (చూడండి: జంటపదం మరియు రూపకం)
πιστεύων ἐπ’ αὐτῷ
అడ్డుబండ ఒక వ్యక్తిని సూచించుచున్నది కాబట్టి “ఆయనయందు విశ్వసించువారు” అని తర్జుమా చేయవలసియుండును.
Romans 10
రోమా 10 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
కొన్ని అనువాదములలో పాత నిబంధన భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. యుఎల్టి(ULT) ఈ అధ్యాయములోని 8వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 18-20వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.
ఈ అధ్యాయములోని విశేష అంశములు
దేవుని నీతి
యూదులు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినను, వాళ్ళు దానిని సాధించలేకపోయారు అని పౌలు బోధించుచున్నాడు. మనము దేవుని నీతిని సంపాదించుకొనలేము. ఆయనను విశ్వసించినప్పుడు దేవుడు యేసు నీతిని మనకిచ్చును. (చూడండి: నీతిగల, నీతి, అనీతిగల, అవినీతి, న్యాయబద్ధమైన, న్యాయబద్ధత మరియు విశ్వాసం)
ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో అనేకమైన అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. దేవుడు హెబ్రీయులను మాత్రమే రక్షించడని తన చదువరులను ఒప్పించేందుకు దీనిని చేయుచున్నాడు కాబట్టి క్రైస్తవులు వెళ్లి ప్రపంచమంతటిలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు రక్షించు, రక్షించబడ్డ, సురక్షిత, రక్షణ)
ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర అనువాద ఇబ్బందులు
“దేశముకాని దాని విషయమై మీరు రోషము కలిగియుండుటకు నేను మిమ్ములను రెచ్చగొట్టుచున్నాను”
హెబ్రీ ప్రజలకు రోషము పుట్టించునట్లు దేవుడు తన సంఘమును ఉపయోగించుకొనునని వివరించుటకు పౌలు ఈ ప్రవచనమును ఉపయోగించుచున్నాడు. ఇందుమూలమున వారు దేవుని కనుగొనవచ్చు మరియు సువార్తను నమ్మవచ్చు. (చూడండి: ప్రవక్త, ప్రవచనం, భవిష్యత్తును చెప్పడం, దీర్ఘదర్శి, ప్రవక్త్రిని మరియు రోషము, రోషము కలిగియుండడం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం) .
Romans 10:1
ఇశ్రాయేలీయులు నమ్మాలని పౌలు కోరికను వ్యక్తపరచుచున్నాడు అయితే యూదులై లేక వేరే ఎవరైనా యేసును విశ్వసించుట ద్వారా మాత్రమే రక్షించబడుదురని నొక్కి చెప్పుచున్నాడు.
ἀδελφοί
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
ἡ μὲν εὐδοκία τῆς ἐμῆς καρδίας
ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క భావములు లేక అంతరంగ స్వభావముకు పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నా గొప్ప వాంఛ” (చూడండి: అన్యాపదేశము)
ὑπὲρ αὐτῶν εἰς σωτηρίαν
దేవుడు యూదులను రక్షించునని దాని అర్థమా
Romans 10:2
μαρτυρῶ…αὐτοῖς
నేను వారిని గూర్చి యథార్థముగా ప్రకటించుచున్నాను
Romans 10:3
ἀγνοοῦντες γὰρ τὴν τοῦ Θεοῦ δικαιοσύνην
ఇక్కడ “నీతి” అనే పదము దేవుడు ప్రజలను తనతో నీతిగా ఉంచు మార్గమును సూచించుచున్నది. తర్జుమా చేయునప్పుడు మీరు దీనిని స్పష్టపరచవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ప్రజలను తనతో నీతిగా ఉంచునది వారికి తెలియదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
τῇ δικαιοσύνῃ τοῦ Θεοῦ οὐχ ὑπετάγησαν
దేవుడు తనతో ప్రజలను నీతిగా ఎంచడమును వారు అంగీకరించలేదు
Romans 10:4
τέλος γὰρ νόμου Χριστὸς
క్రీస్తు ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చెను
εἰς δικαιοσύνην παντὶ τῷ πιστεύοντι
ఇక్కడ “నమ్ముట” అనే పదముకు “విశ్వసించుట” అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనను నమ్మిన వారిని దేవుని యెదుట నీతిగా నిలుపుటకు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 10:5
τὴν δικαιοσύνην τὴν ἐκ νόμου
అది జీవము కలిగియుండి మరియు అది సంచరించగలదని “నీతిని” గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ (చూడండి: మానవీకరణ)
ὅτι ὁ ποιήσας αὐτὰ ἄνθρωπος, ζήσεται ἐν αὐτῇ
దేవునికి మనము సరిపోయిన వారముగా ఉండుటకు ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును ఎటువంటి లోపములు లేకుండగా పాటించాలి, అయితే అది సాధ్యము కాదు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రముకు విధేయులైన వ్యక్తి జీవించును ఎందుకంటే ధర్మశాస్త్రము అతనిని దేవుని యెదుట నీతిగా నిలువబెట్టును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ζήσεται
“జీవించును” అనే పదము 1) నిత్య జీవమును లేక 2) దేవుని సహవాసములో క్షయమైన జీవమును సూచించవచ్చు.
Romans 10:6
ἡ δὲ ἐκ πίστεως δικαιοσύνη οὕτως λέγει
ఇక్కడ మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉన్నట్లు “నీతిని” గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఇది ఒక వ్యక్తిని దేవుని యెదుట ఏవిధముగా నీతిగా నిలుపును అనే సంగతులను గూర్చి మోషే వ్రాయుచున్నాడు” (చూడండి: మానవీకరణ)
μὴ εἴπῃς ἐν τῇ καρδίᾳ σου
మోషే ఒక్క వ్యక్తితోనే మాట్లాడుచున్నట్లుగా అతను ప్రజలనుద్దేశించి మాట్లాడియుండెను. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి మనస్సుకొరకు లేక అంతరంగముకొరకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీకు మీరు ఏమీ చెప్పుకొనవద్దు“ (చూడండి: ‘మీరు’ రూపాలు మరియు అన్యాపదేశము)
τίς ἀναβήσεται εἰς τὸν οὐρανόν
మోషే తన చదువరులకు బోధించుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. తను ముందుగా చెప్పిన ఆజ్ఞకు “అనకండి” అనే ఈ ప్రశ్నకు అననుకూల జవాబు కావలెను. ఈ ప్రశ్నను ఒక వాఖ్యగాను మీరు తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “పరలోకానికి ఎక్కి ఎవరు వెళ్ళగలరు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τοῦτ’ ἔστιν Χριστὸν καταγαγεῖν
వారు క్రీస్తును కలిగి భూమి మీదకి వచ్చు క్రమములో
Romans 10:7
τίς καταβήσεται εἰς τὴν Ἄβυσσον
మోషే తన చదువరులకు బోధించుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. తను ముందుగా చెప్పిన ఆజ్ఞకు “అనకండి” అనే ఈ ప్రశ్నకు అననుకూల జవాబు కావలెను. ఈ ప్రశ్నను ఒక వాఖ్యగాను మీరు తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఏ వ్యక్తి కూడా క్రిందకి వెళ్లి, చనిపోయిన ఆత్మలు ఉండే స్థలములోనికి ప్రవేశించలేడు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἐκ νεκρῶν
చనిపోయినవారందరి మధ్యలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినవారందరిని గూర్చి తెలియజేయుచున్నది. వారి మధ్యలోనుండి పైకి లేపబడుటయనునది తిరిగి జీవించుటయైయున్నది.
νεκρῶν
ఈ మాట భౌతిక మరణమునుగూర్చి మాట్లాడుచున్నది.
Romans 10:8
ἀλλὰ τί λέγει
“అది” అనే పదము [రోమా.10:6] (../10/06.md) వచనములోని “నీతిమంతుని” సూచించుచున్నది. ఇక్కడ పౌలు మాట్లాడే వ్యక్తిగా “నీతిమంతుని”గూర్చి వివరించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మోషే చెప్పుచున్నది ఇదే” (చూడండి: మానవీకరణ మరియు అలంకారిక ప్రశ్న)
ἐγγύς σου τὸ ῥῆμά ἐστιν
ఒక వ్యక్తి కదలించేదిగా ఉండే ఒక వస్తువువలె పౌలు దేవుని సందేశమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు సందేశమును విన్నారు” (చూడండి: మానవీకరణ)
τὸ ῥῆμά ἐστιν, ἐν τῷ στόματί σου
“నోరు” అనే పదము ఒక వ్యక్తి చెప్పుచున్న సంగతులను సూచించు పర్యాయ మాటగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సందేశమును…. మీరు ఎలా మాట్లాడాలని మీరు ఎరుగుదురు” (చూడండి: అన్యాపదేశము)
τὸ ῥῆμά ἐστιν,…ἐν τῇ καρδίᾳ σου
“మీ హృదయములో” అనే మాట ఒక వ్యక్తి ఆలోచించు మరియు నమ్ముచున్న సంగతులను సూచించు పర్యాయ మాటగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సందేశము యొక్క అర్థము… మీకు తెలిసియున్నది” (చూడండి: అన్యాపదేశము)
τὸ ῥῆμα τῆς πίστεως
మనము ఆయనయందు నమ్మికయుంచవలెనని దేవుని సందేశము తెలియజేయుచున్నది.
Romans 10:9
ἐὰν ὁμολογήσῃς ἐν τῷ στόματί σου, Κύριον Ἰησοῦν
యేసు ప్రభువని మీరు ఒప్పుకొన్నట్లైతే
πιστεύσῃς ἐν τῇ καρδίᾳ σου
ఇక్కడ “హృదయం” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు లేక అంతరంగ పురుషుని సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ మనస్సులో నమ్ముడి” లేక “నిజముగా నమ్ముడి” (చూడండి: అన్యాపదేశము)
αὐτὸν ἤγειρεν ἐκ νεκρῶν
లేపెను అనే మాట “తిరిగి జీవించునట్లు చేయునది” అని అర్థమిచ్చు జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు తిరిగి జీవించునట్లు చేసెను” (చూడండి: జాతీయం (నుడికారం))
σωθήσῃ
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మిమ్ములను రక్షించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 10:10
καρδίᾳ γὰρ πιστεύεται εἰς δικαιοσύνην, στόματι δὲ ὁμολογεῖται εἰς σωτηρίαν
ఇక్కడ “హృదయము” అనే పదము మనస్సు లేక చిత్తముకు సాదృశ్యమై పర్యాయపదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మనిషి తన మనస్సులో నమ్మి మరియు దేవుని ఎదుట నీతిమంతునిగా ఉన్నాడు మరియు తన నోటితో అతడు ఒప్పుకొనును మరియు దేవుడు అతడిని రక్షించును” (చూడండి: అన్యాపదేశము)
στόματι
ఇక్కడ “నోరు” అనే పదము ఒక వ్యక్తి మాట్లాడగల సామర్థ్యముకు సాదృశ్యమైయున్న ఉపలక్షణమైయున్నది. (చూడండి: ఉపలక్షణము)
Romans 10:11
λέγει γὰρ ἡ Γραφή
లేఖనములు ప్రాణము కలిగియుండి మరియు స్వరము కలిగియున్నట్లు పౌలు దానిని గూర్చి చెప్పుచున్నాడు. పౌలు ఇక్కడ ఉపయోగించిన లేఖనమును ఎవరు వ్రాసారని మీరు స్పష్టంగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యెషయా లేఖనములలో వ్రాసెను గనుక” (చూడండి: మానవీకరణ మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πᾶς ὁ πιστεύων ἐπ’ αὐτῷ οὐ καταισχυνθήσεται
దీనికి ఇది సమానముగా ఉండును: “నమ్మని ప్రతివారు సిగ్గుపడుదురు.” ఇక్కడ నొక్కి చెప్పడానికి అననుకూలమైన మాటను ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మికయుంచిన ప్రతియొక్కరిని ఆయన ఘనపరచును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 10:12
οὐ γάρ ἐστιν διαστολὴ Ἰουδαίου τε καὶ Ἕλληνος
దేవుడు జనులందరిని ఒకే విధముగా చూచుచునని పౌలు సూచించుచున్నాడు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ విధముగా, దేవుడు యూదులను మరియు యూదులు కాని వారిని ఒకే విధముగా చూచును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πλουτῶν εἰς πάντας τοὺς ἐπικαλουμένους αὐτόν
ఇక్కడ “ఆయన సంపన్నుడు” అనే మాటకు దేవుడు సంపదతో ఆశీర్వదించును అని అర్థము. దీనిని మీ అనువాదములో స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనయందు నమ్మికయుంచిన వారందరిని ఆయన సంపన్నముగా ఆశీర్వదించును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 10:13
πᾶς γὰρ ὃς ἂν ἐπικαλέσηται τὸ ὄνομα Κυρίου, σωθήσεται
ఇక్కడ “నామము” అనే పదము యేసుకు పర్యాయ పదముగా ఉన్నది. దీనిని మీ అనువాదములో స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనను నమ్మిన ప్రతివారిని ప్రభువు రక్షించును” (చూడండి: అన్యాపదేశము మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 10:14
πῶς οὖν ἐπικαλέσωνται εἰς ὃν οὐκ ἐπίστευσαν
క్రీస్తును గూర్చిన సువార్తను వినని వారికి దానిని తీసుకెల్లడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దేవునికి ఇంకా సంబంధించని వారిని “వారు” అనే పదము సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని విశ్వసించని వారు ఆయనను పిలువలేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
πῶς…πιστεύσωσιν οὗ οὐκ ἤκουσαν
ఆ కారణము చేత పౌలు మరియొక్క ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన సందేశమును వారు వినకుండినట్లయితే వారు ఆయనను విశ్వసించలేరు!” లేక “మరియు ఆయనను గూర్చిన సందేశమును వారు వినకుండినట్లయితే వారు ఆయనను విశ్వసించలేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
πιστεύσωσιν
ఇక్కడ ఆ వ్యక్తి చెప్పియున్న సంగతులు సత్యమైనవని తెలియజేయడం అని దీని అర్థము.
πῶς…ἀκούσωσιν χωρὶς κηρύσσοντος
ఆ కారణము చేత పౌలు మరియొక్క ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు ఎవరు వారికి చెప్పకపోతే వారు ఆ సందేశమును వినలేరు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 10:15
ὡς ὡραῖοι οἱ πόδες τῶν εὐαγγελιζομένων τὰ ἀγαθά!
సందేశమును వినని వారియొద్దకు ప్రయాణము చేసి దానిని తీసుకొని వచ్చిన వారిని సూచించుటకు పౌలు “పాదాలు” అనే పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “సువార్తికులు వచ్చి సువార్తను చెప్పినప్పుడు అది ఎంతో అద్భుతముగా ఉండును” (చూడండి: అన్యాపదేశము)
Romans 10:16
οὐ πάντες ὑπήκουσαν
ఇక్కడ “వారు” అనే పదము యూదులను సూచించుచున్నది. “యూదులందరు విధేయులు కాలేదు”
Κύριε, τίς ἐπίστευσεν τῇ ἀκοῇ ἡμῶν
యూదులలో అనేకులు యేసునందు విశ్వసించరని లేఖనాలలో యెషయా ప్రవచించిన సంగతిని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువా, అనేకులు మా సందేశమును నమ్ముట లేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τῇ ἀκοῇ ἡμῶν
ఇక్కడ, “మన” అనే పదము దేవుడు మరియు యెషయాలను సూచించుచున్నది.
Romans 10:17
ἡ πίστις ἐξ ἀκοῆς
ఇక్కడ “విశ్వాసము” అనే పదము “క్రీస్తునందు విశ్వసించుట” అనే మాటను సూచించుచున్నది
ἡ…ἀκοὴ διὰ ῥήματος Χριστοῦ
క్రీస్తును గూర్చిన సందేశమును వినుట ద్వారా గ్రహించడం
Romans 10:18
ἀλλὰ λέγω, μὴ οὐκ ἤκουσαν? μενοῦνγε
నొక్కి చెప్పడానికి పౌలు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే, యూదులు క్రీస్తును గూర్చిన సందేశమును నిశ్చయముగా వినియున్నారు” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
εἰς πᾶσαν τὴν γῆν, ἐξῆλθεν ὁ φθόγγος αὐτῶν; καὶ εἰς τὰ πέρατα τῆς οἰκουμένης, τὰ ῥήματα αὐτῶν
ఈ రెండు వాక్యములు ఒకే అర్థమును కలిగియున్నాయి అయితే నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించియున్నాడు. “వారు” అనే పదము సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములను సూచించుచున్నది. అవి దేవుని గూర్చి మనుష్యులకు తెలియజేయు మానవ సువార్తికులుగా ఉన్నవని ఇక్కడ వివరించబడియున్నవి. వాటి ఉనికి ద్వారా దేవుని శక్తిని మరియు మహిమను ఎలా తెలియపరచుచున్నవని ఇది సూచించుచున్నది. పౌలు ఇక్కడ లేఖనమును సూచించుచున్నాడని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ ‘సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు దేవుని శక్తి ప్రభావముకు సాక్ష్యులైయున్నవి మరియు లోకములో ఉన్నవారందరూ వాటిని చూచెదరు మరియు దేవుని గూర్చిన సత్యమును గ్రహించెదరు’ అని లేఖనములో చెప్పబడియున్నట్లు.” (చూడండి: సమాంతరత మరియు మానవీకరణ మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 10:19
ἀλλὰ λέγω, μὴ Ἰσραὴλ οὐκ ἔγνω
నొక్కి చెప్పడానికి పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. “ఇశ్రాయేలు” అనే పదము ఇశ్రాయేలు దేశములో నివసించుచున్న ప్రజలను సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలు ప్రజలు సందేశమును తెలిసికొనియున్నారని నేను మీతో మరియొకసారి చెప్పుచున్నాను” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు అన్యాపదేశము)
πρῶτος Μωϋσῆς λέγει, ἐγὼ παραζηλώσω ὑμᾶς,…παροργιῶ ὑμᾶς.
దేవుడు చెప్పినది మోషే వ్రాసెనని దీని అర్థమైయున్నది. “నేను” అనే పదము దేవునిని సూచించుచున్నది మరియు “మీరు” అనే పదము ఇశ్రాయేలీయులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మీకు రోషము పుట్టించును అని మోషే మొదట చెప్పెను… దేవుడు మీకు కోపము పుట్టించును” (చూడండి: ‘మీరు’ రూపాలు మరియు ప్రత్యక్ష కొటేషన్ పరోక్ష కొటేషన్.)
ἐπ’ οὐκ ἔθνει
నిజమైన దేశముగా మీరు పరిగణించని వారిచే లేక “ఏ దేశముకు చెందని ప్రజల చేత”
ἐπ’ ἔθνει ἀσυνέτῳ
ఇక్కడ “అర్థము చేసుకొనక” అనే మాటకి దేవునిని ఎరుగని ప్రజలు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “నన్ను ఎరుగని లేక నా ఆజ్ఞలు ఎరుగని దేశ ప్రజల చేత” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
παροργιῶ ὑμᾶς
మీకు నేను కోపము పుట్టించెదను లేక “మీరు కోపపడునట్లు నేను చేయుదును”
ὑμᾶς
ఇది ఇశ్రాయేలు దేశమును సూచించుచున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
Romans 10:20
ఇక్కడ “నా”, “నేను” మరియు “నన్ను” అనే పదములు దేవునిని సూచించుచున్నవి.
Ἠσαΐας δὲ ἀποτολμᾷ καὶ λέγει
దేవుడు చెప్పిన సంగతులను ప్రవక్తయైన యెషయా వ్రాసెనని దీని అర్థము.
εὑρέθην ἐν τοῖς ἐμὲ μὴ ζητοῦσιν
భవిష్యత్తు కాలములో జరుగు సంగతులు ఇదివరకే జరిగియున్నట్లు ప్రవక్తలు అనేక మార్లు వ్రాసియున్నారు. ప్రవచనము తప్పక నెరవేరునని ఇది నొక్కి చెప్పుతుంది. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అన్యులు నన్ను వెదకకున్నను వారు నన్ను కనుగొనెదరు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐμφανὴς ἐγενόμην
నన్ను నేను తెలియపరచుకొనియున్నాను
λέγει
ఆయన అనే పదము యెషయా ద్వారా మాట్లాడుచున్న దేవునిని సూచించుచున్నది.
Romans 10:21
ὅλην τὴν ἡμέραν
దేవుని నిత్య ప్రయత్నమును నొక్కి చెప్పడానికి ఈ మాటను ఉపయోగించియున్నారు. “నిరంతరం”
ἐξεπέτασα τὰς χεῖράς μου πρὸς λαὸν ἀπειθοῦντα καὶ ἀντιλέγοντα
మిమ్ములను ఆహ్వానించుటకు మరియు మీకు సహాయము చేయుటకు నేను ప్రయత్నించితిని అయితే మీరు నా సహాయమును త్రోసిపుచ్చితిరి మరియు అవిధేయులైయుండుటను కొనసాగించితిరి
Romans 11
రోమా 11 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 9-10, 26-27 మరియు 34-35 వచనములలో ఈ విధంగా చేసియున్నది.
ఈ అధ్యాయములోని విశేష అంశములు
దేవుని నీతి
యూదులు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినను, వాళ్ళు దానిని సాధించలేకపోయారు అని పౌలు బోధించుచున్నాడు. మనము దేవుని నీతిని సంపాదించుకొనలేము. ఆయనను విశ్వసించినప్పుడు దేవుడు యేసు నీతిని మనకిచ్చును. (చూడండి: క్రీస్తు, మెస్సీయా మరియు కృప, కృపగల)
ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
అలంకారిక ప్రశ్నలు
పౌలు ఈ అధ్యాయములో అనేకమైన అలంకారిక ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. దేవుడు హెబ్రీయులను మాత్రమే రక్షించడని తన చదువరులను ఒప్పించేందుకు దీనిని చేయుచున్నాడు కాబట్టి క్రైస్తవులు వెళ్లి ప్రపంచమంతటిలో సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. (చూడండి: కరుణ, కరుణగల మరియు @)
ఈ అధ్యాయములో ఎదురైయే ఇతర అనువాద ఇబ్బందులు
“దేశముకాని దాని విషయమై మీరు రోషము కలిగియుండుటకు నేను మిమ్ములను రెచ్చగొట్టుచున్నాను”
హెబ్రీ ప్రజలకు రోషము పుట్టించునట్లు దేవుడు తన సంఘమును ఉపయోగించుకొనునని వివరించుటకు పౌలు ఈ ప్రవచనమును ఉపయోగించుచున్నాడు. ఇందుమూలమున వారు దేవుని కనుగొనవచ్చు మరియు సువార్తను నమ్మవచ్చు. (చూడండి: @ మరియు @ మరియు @) .
Romans 11:1
ఇశ్రాయేలు దేశముగా ఉండి దేవునిని నిరాకరించింది, క్రియలు లేక కృపవల్ల రక్షణ కలుగుతుందని వారు అర్థము చేసుకొనవలెనని దేవుడు కోరుకొనుచున్నాడు.
λέγω οὖν
పౌలు అను నేను చెప్పుచున్నాను
μὴ ἀπώσατο ὁ Θεὸς τὸν λαὸν αὐτοῦ
యూదా ప్రజల మనస్సులు బండబారియున్నను, దేవుడు అన్యులను తన ప్రజలతో చేర్చినందుకు కలత చెందినా ఇతర యూదుల ప్రశ్నలకు సమాధానము ఇవ్వగలడనే ఉద్దేశ్యముతో పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ γένοιτο
ఇది సాధ్యము కాదు! లేక “నిశ్చయముగా కాదు!” ఇది జరుగుతుందని ఈ భావము బలముగా నిరాకరించుచున్నది. ఇటువంటి భావన మీ భాషలో ఉండవచ్చు మరియు దానిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. దీనిని రోమా.9:14 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి. (చూడండి: @)
φυλῆς Βενιαμείν
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విభజించిన 12 గోత్రములలో ఒకటైన బెన్యామీను గోత్రంలోనుండి వచ్చిన వారిని ఇది సూచించుచున్నది.
Romans 11:2
ὃν προέγνω
తాను ముందుగానే ఎరిగియున్న వారు
οὐκ οἴδατε ἐν Ἠλείᾳ τί λέγει ἡ Γραφή, ὡς ἐντυγχάνει τῷ Θεῷ κατὰ τοῦ Ἰσραήλ
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలీయులకు విరోధముగా ఏలియా దేవుని ఎదుట విన్నవించుకొన్నాడనే విషయమును గూర్చి లేఖనాలలో ఏమని వ్రాయబడియున్నదని నిశ్చయముగా మీరు తెలిసికొనియున్నారు” (చూడండి: అలంకారిక ప్రశ్న)
τί λέγει ἡ Γραφή
లేఖనాలు మాట్లాడగలవిగా ఉన్నట్లు పౌలు లేఖనములను సూచించుచున్నాడు. (చూడండి: మానవీకరణ)
Romans 11:3
ἀπέκτειναν
వారు అనే పదము ఇశ్రాయేలు ప్రజలను సూచించుచున్నది.
κἀγὼ ὑπελείφθην μόνος
“నేను” అనే సర్వనామము ఇక్కడ ఏలియాను సూచించుచున్నది.
ζητοῦσιν τὴν ψυχήν μου
నన్ను చంపనుద్దేశము కలిగియున్నారు
Romans 11:4
ἀλλὰ τί λέγει αὐτῷ ὁ χρηματισμός
చదువరులను మరియొక్క అంశముకు తీసుకొనిపోవుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అతనికి ఎలా జవాబు ఇచ్చును?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
αὐτῷ
“అతను” అనే సర్వనామము ఇక్కడ ఏలియాను సూచించుచున్నది.
ἑπτακισχιλίους ἄνδρας
7,000 మంది పురుషులు (చూడండి: సంఖ్యలు)
Romans 11:5
λῖμμα
దేవుడు తన కృపను పొందుకొనుటకు ఏర్పరచిన కొంత మంది ప్రజలు అని దీని అర్థము.
Romans 11:6
εἰ δὲ χάριτι
దేవుని కరుణ ఏ రీతిగా పనిచేస్తుందని వివరించుటను పౌలు కొనసాగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే దేవుని కరుణ కృపవల్ల పని చేస్తుంది కాబట్టి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 11:7
τί οὖν
మనమేమని ముగించాలి? చదువరులను మరియొక్క అంశముకు తీసుకొనిపోవుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము జ్ఞాపకముంచుకొనవలసిన విషయము ఇదియే” (చూడండి: అలంకారిక ప్రశ్న)
Romans 11:8
ἔδωκεν αὐτοῖς ὁ Θεὸς πνεῦμα κατανύξεως, ὀφθαλμοὺς τοῦ μὴ βλέπειν, καὶ ὦτα τοῦ μὴ ἀκούειν
ఇది ప్రజలు ఆత్మీయంగా నిరుత్సాహంగా ఉన్నారనే వాస్తవమును గూర్చి తెలియజేయు రూపకఅలంకారమైయున్నది. వారు ఆత్మీయ సత్యమును వినలేక స్వీకరించలేకున్నారు. (చూడండి: రూపకం)
πνεῦμα κατανύξεως
“జ్ఞానాత్మ” వంటి “వాని గుణలక్షణము కలిగియుండుట” అని దీని అర్థము.
ὀφθαλμοὺς τοῦ μὴ βλέπειν
ఒకని కన్నులతో చూచుట అనే విషయము వానిని గూర్చి తెలుసుకోవడం అనేదానికి సమానముగా ఉన్నది.
ὦτα τοῦ μὴ ἀκούειν
చెవులారా వినుట అనే విషయము విధేయత కలిగియుండుటకు సమానముగా ఉన్నది.
Romans 11:9
γενηθήτω ἡ τράπεζα αὐτῶν εἰς παγίδα, καὶ εἰς θήραν
ఇక్కడ బల్ల అనే పదము విందును సూచించు సమానార్థక పదములుగా ఉన్నవి మరియు “వల” మరియు “బోను” అనే పదములు శిక్షను సూచించు రూపకఅలంకారములైయున్నవి. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దయచేసి వారు చేయు విందులు వారిని చిక్కించుకొనే వలగా చేయండి దేవా” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
σκάνδαλον
ఒక వ్యక్తి తట్టుకొని క్రింద పడునట్లు చేయు దేనినైనా “అడ్డుబండ” అని అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి పాపము చేయుటకు శోధించే దేనినైనా అది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పాపము చేయుటకు శోధించు ఏదైనా” (చూడండి: రూపకం)
ἀνταπόδομα αὐτοῖς
వారిపై ప్రతికారము తీసుకొనునట్లు మీకు అనుమతించే ఏదైనా
Romans 11:10
τὸν νῶτον αὐτῶν διὰ παντὸς σύνκαμψον
ఇక్కడ “వారి వీపులు వంగియుండును” అనే పదము బానిసల వీపుల మీద ఎక్కువ బరువును మోపించుట అనే మాటకు పర్యాయ పదముగా ఉన్నది. వారిని కష్టపెట్టుటకు ఇది రూపకఅలంకారముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎక్కువ భారమును మోయు ప్రజలవలె వారిని కష్టపెట్టుట” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
Romans 11:11
ఇశ్రాయేలు దేశముగా దేవునిని తిరస్కరించియున్నారు, అన్యులు అదే తప్పిదమును చేయకుండునట్లు జాగ్రతగా ఉండాలని పౌలు వారిని హెచ్చరించుచున్నాడు.
μὴ ἔπταισαν ἵνα πέσωσιν
నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పాపము చేసియున్నందున దేవుడు వారిని శాశ్వతముగా తిరస్కరించియున్నాడా?” (చూడండి: అలంకారిక ప్రశ్న)
μὴ γένοιτο
ఇది సాధ్యము కాదు! లేక “నిశ్చయముగా కాదు!” ఇది జరుగుతుందని ఈ భావము బలముగా నిరాకరించుచున్నది. ఇటువంటి భావన మీ భాషలో ఉండవచ్చు మరియు దానిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. దీనిని రోమా.9:14 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.
παραζηλῶσαι
ఈ మాటను రోమా.10:19 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.
Romans 11:12
εἰ…τὸ παράπτωμα αὐτῶν, πλοῦτος κόσμου, καὶ τὸ ἥττημα αὐτῶν, πλοῦτος ἐθνῶν
ఈ రెండు మాటలు ఒకే అర్థమును కలిగియున్నవి. అవసరమైతే, మీ అనువాదములో వాటిని మీరు కలిపి అనువాదము చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు ఆత్మీయంగా విఫలులైనప్పుడు, దాని పరిణామంగా దేవుడు యూదులు కానివారిని హెచ్చుగా ఆశిర్వదించెను” (చూడండి: జంటపదం)
πλοῦτος κόσμου
యూదులు క్రీస్తును తిరస్కరించిరి కాబట్టి, క్రీస్తును స్వీకరించు అవకాశం ద్వారా దేవుడు అన్యులను అత్యధికమైన దీవెనతో ఆశిర్వదించెను.
κόσμου
ఇక్కడ “లోకము” అనే పదము లోకములో వసించే ప్రజలను, విశేషముగా అన్యులను సూచించు పర్యాయ పదముగా ఉన్నది.
Romans 11:14
παραζηλώσω
ఈ మాటను రోమా.10:19 వచనములో ఏ విధముగా అనువాదము చేసియున్నారని చూడండి.
μου τὴν σάρκα
ఇది “నా తోటి యూదులు” అనే మాటను సూచించుచున్నది.
καὶ σώσω τινὰς ἐξ αὐτῶν
నమ్మిన వారిని దేవుడు రక్షించును. ప్రత్యామ్నాయ అనువాదము: “బహుశః కొంతమంది విశ్వసించుదురు మరియు దేవుడు వారిని రక్షించును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 11:15
εἰ γὰρ ἡ ἀποβολὴ αὐτῶν καταλλαγὴ κόσμου
ఒకవేళ దేవుడు వారిని తిరస్కరించిన కారణముగా, ఆయన మిగిలిన లోకమును తనతో సమాధాన పరచుకొనును
ἡ ἀποβολὴ αὐτῶν
“వారు” అనే సర్వనామము అవిశ్వాసులైన యూదులను సూచించుచున్నది.
κόσμου
ఇక్కడ “లోకము” అనే పదము లోకములో నివసించుచున్న ప్రజలకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రపంచములోని ప్రజలు” (చూడండి: అన్యాపదేశము)
τίς ἡ πρόσλημψις εἰ μὴ ζωὴ ἐκ νεκρῶν
దేవుడు యూదులను అంగీకరించినప్పుడు, అది అద్భుతంగా ఉంటుందని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని అంగీకరించినప్పుడు ఎలా ఉండును? చచ్చిన వారిలో నుండి తిరిగి జీవించిన వారి వలె వారుందురు!” లేక “దేవుడు వారిని అంగీకరించినప్పుడు, వారి చనిపోయి తిరిగి లేచిన విధముగా ఉండును!” (చూడండి: అలంకారిక ప్రశ్న మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
νεκρῶν
భూమి క్రిందున్న చనిపోయిన ప్రజలందరిని గూర్చి ఈ మాటలు చెప్పుచున్నాయి.
Romans 11:16
εἰ δὲ ἡ ἀπαρχὴ ἁγία, καὶ τὸ φύραμα;
అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు, ఇశ్రాయేలు పితరులను గూర్చి పౌలు మాట్లాడుచు వారు కోయబడుటకు సిద్ధముగా ఉన్న ప్రథమ ధాన్యము లేక “ప్రథమ ఫలముగా” ఉన్నారని చెప్పుచున్నాడు. ఆ మనుష్యుల సంతతి వారైనా ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతూ వారు ఆ ధాన్యమునుండి చేయబడిన “పిండి ముద్ద” వలె ఉన్నారని అతను చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునికి అర్పించిన వాటిలో ప్రథమముగా అబ్రహాము ఎంచబడియున్నట్లైతే, తరువాత వచ్చిన మన పితరులను దేవుని స్వాస్థ్యముగా ఎంచవలసిన అవసరం కలదు” (చూడండి: రూపకం)
εἰ ἡ ῥίζα ἁγία, καὶ οἱ κλάδοι
అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు, ఇశ్రాయేలు పితరులను గూర్చి పౌలు మాట్లాడుచు వారు చెట్టు వేర్లువలె ఉన్నారని మరియు ఆ పురుషుల సంతతివారైనా ఇశ్రాయేలీయులు ఆ చెట్టు యొక్క “కొమ్మలై”యున్నారని చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ἁγία
వారు కోసిన మొదటి పంటను ప్రజలు ఎల్లప్పుడు దేవుని కొరకు ప్రతిష్టించుచుండిరి. ఇక్కడ “ప్రథమ ఫలములు” అనే పదము క్రీస్తును విశ్వసించిన మొదటి ప్రజలను సూచించుచున్నది. (చూడండి: రూపకం)
Romans 11:17
σὺ δὲ ἀγριέλαιος ὢν
“నిన్ను” అనే సర్వనామము మరియు “అడవి ఒలీవ కొమ్మ” అనే మాట యేసు ద్వారా రక్షణను అంగీకరించిన అన్య ప్రజలను సూచించుచున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
εἰ δέ τινες τῶν κλάδων ἐξεκλάσθησαν
“విరిగిన కొమ్మలు” వలె యేసును తిరస్కరించిన యూదులను పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఎవరైనా కొన్ని కొమ్మలను విరిచినట్లైతే” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐνεκεντρίσθης ἐν αὐτοῖς
ఇక్కడ అన్యులైన క్రైస్తవులను గూర్చి “అంటు కట్టబడిన కొమ్మలవలె” ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మిగిలిన కొమ్మలతో పాటు దేవుడు మిమ్మల్ని చెట్టుకు అంటుకట్టియున్నాడు” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῆς ῥίζης τῆς πιότητος τῆς ἐλαίας ἐγένου
ఇక్కడ “సారమైన వేరు” అనే మాట దేవుని వాగ్దానములను సూచించు రూపకఅలంకారమైయున్నది. (చూడండి: రూపకం)
Romans 11:18
μὴ κατακαυχῶ τῶν κλάδων
ఇక్కడ “కొమ్మలు” అనే పదము యూదా ప్రజలను సూచించు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుడు తిరస్కరించన యూదా ప్రజల కంటే మంచి వారని చెప్పకండిఠ (చూడండి: రూపకం)
οὐ σὺ τὴν ῥίζαν βαστάζεις, ἀλλὰ ἡ ῥίζα σέ
అన్యులైన ప్రజలు కొమ్మలవలె ఉన్నారని మరొకసారి పౌలు సూచించుచున్నాడు. యూదులతో ఆయన చేసిన నిబంధన వాగ్ధానములను బట్టియే దేవుడు వారిని రక్షించును. (చూడండి: రూపకం)
Romans 11:19
ἐξεκλάσθησαν κλάδοι
ఇక్కడ “కొమ్మలు” అనే పదము యేసును తిరస్కరించిన యూదులను మరియు దేవుడు తిరస్కరించియున్న యూదులను సూచించుచున్నది. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు కొమ్మలను విరచివేసెను” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐγὼ ἐνκεντρισθῶ
దేవుడు అంగీకరించిన అన్యులైన విశ్వాసులను సూచించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన నన్ను అంటుగట్టవచ్చును” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 11:20
…ἐξεκλάσθησαν
“వారి” మరియు “వారు” అనే సర్వనామములు నమ్మని యూదులను సూచించుచున్నది.
σὺ δὲ τῇ πίστει ἕστηκας
వారు స్థిరముగా నిలిచియున్నారని మరియు వారిని ఎవరు కదలించలేరని పౌలు విశ్వాసములో నిలకడగా ఉన్న అన్యులైన విశ్వాసులను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీ విశ్వాసమును బట్టి మీరు నిలిచియున్నారు” (చూడండి: రూపకం)
Romans 11:21
εἰ γὰρ ὁ Θεὸς τῶν κατὰ φύσιν κλάδων οὐκ ἐφείσατο, οὐδὲ σοῦ φείσεται
ఇక్కడ “సహజమైన కొమ్మలు” అనే మాట యేసును తిరస్కరించిన యూదులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వేర్లలలోనుండి చెట్టు యొక్క సహజమైన కొమ్మలుగా పెరిగిన అవిశ్వాసులైన యూదులను దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి, మీరు నమ్మకపోయినయెడల మిమ్ములను కూడా విడిచిపెట్టడని మీరు తెలుసుకొనుడి” (చూడండి: రూపకం)
Romans 11:22
χρηστότητα καὶ ἀποτομίαν Θεοῦ
వారి పక్షమున దేవుడు కనికరముతో వ్యవహరించినను, వారికి తీర్పు తీర్చి మరియు వారిని శిక్షించుటకు వెనకాడడని పౌలు అన్యులైన విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.
ἐπὶ μὲν τοὺς πεσόντας, ἀποτομία; ἐπὶ…σὲ, χρηστότης Θεοῦ
“కాఠిన్యం” మరియు “కరుణ” అనే నైరూప్య నామవాచకమును తొలగించి దీనిని మరో విధముగా అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదుల విషయములో దేవుడు కఠినంగా వ్యవహరించాడు… కాని దేవుడు మీ విషయములో కరుణతో వ్యవహరించును” (చూడండి: భావనామాలు)
τοὺς πεσόντας
తప్పు చేయునది క్రింద పడినట్లున్నదని చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “తప్పు చేసియున్న యూదులు” లేక “క్రీస్తుయందు విస్వసించుటకు తిరస్కరించిన యూదులు” (చూడండి: రూపకం)
ἐὰν ἐπιμένῃς τῇ χρηστότητι
“కరుణ” అనే నైరూప్య నామవాచకమును తొలగించి దీనిని మరో విధముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు సరియైన దానిని చేయుటను కొనసాగించినప్పుడు ఆయన మీ యెడల కరుణకలిగియుండును” (చూడండి: భావనామాలు)
ἐπεὶ καὶ σὺ ἐκκοπήσῃ
పౌలు ఇక్కడ మరో సారి కొమ్మలు అనే రూపకఅలంకారమును ఉపయోగించుచున్నాడు, అవసరమైతే దేవుడు వాటిని “కొట్టివేయును”. ఇక్కడ “కొట్టివేయును” అనే రూపకఅలంకారము ఒకరిని తిరస్కరించుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “లేకపోతె దేవుడు మిమ్ములను కొట్టివేయును” లేక “లేకపోతె దేవుడు మిమ్ములను తిరస్కరించును” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 11:23
ἐὰν μὴ ἐπιμένωσι τῇ ἀπιστίᾳ
“వారి అవిశ్వాసములో మీరు కొనసాగకండి” అనే మాట ద్వంద్వ ప్రతికూల వాక్యమైయున్నది. దీనిని మీరు అనుకూల పద్ధతిలో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు క్రీస్తునందు విశ్వసించుటకు ప్రారంభించినప్పుడు” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ἐνκεντρισθήσονται
వారు యేసునందు విశ్వసించుటకు ప్రారంభించినప్పుడు తిరిగి అంటుకట్టబడిన కొమ్మలవలె వారుందురని పౌలు యూదులను గూర్చి చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని తిరిగి అంటుకట్టును” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐνκεντρίσαι
ఒక చెట్టులోనుండి క్రొత్త కొమ్మ చిగురించునట్లు ఒక పచ్చని కొమ్మను మరియొక్క చెట్టు కొమ్మకు అంటుకట్టే సహజమైన ప్రక్రియయైయున్నది.
κἀκεῖνοι…αὐτούς
“వారు” లేక “వారి” అనే పదములన్ని యూదులను సూచించుచున్నవి.
Romans 11:24
εἰ γὰρ σὺ ἐκ τῆς κατὰ φύσιν ἐξεκόπης ἀγριελαίου, καὶ παρὰ φύσιν ἐνεκεντρίσθης εἰς καλλιέλαιον, πόσῳ μᾶλλον οὗτοι, οἱ κατὰ φύσιν ἐνκεντρισθήσονται τῇ ἰδίᾳ ἐλαίᾳ
వారు ఒక చెట్టు కొమ్మలవలె ఉన్నారని పౌలు అన్యులైన విశ్వాసులు మరియు యూదులను గూర్చి మాట్లాడుటను కొనసాగించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఒక అడవి జాతికి చెందిన ఒలీవ చెట్టులోని కొమ్మను కొట్టివేసి దానిని మేలు రకమైన ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగితే, సహజమైన కొమ్మలైయున్న ఈ యూదులను ఆయన తమ స్వంత ఒలీవ చెట్టుకు ఇంకెంతగా అంటువేయును?” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οἱ κατὰ φύσιν
వారు కొమ్మలవలె ఉన్నట్లు పౌలు యూదులు మరియు అన్యులను గూర్చి మాట్లాడుచున్నాడు. “సహజమైన కొమ్మలు” యూదులను సూచించుచున్నది మరియు “అంటుకట్టబడిన కొమ్మలు” అన్యులైన విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: రూపకం)
Romans 11:25
οὐ…θέλω ὑμᾶς ἀγνοεῖν
పౌలు ఇక్కడ ద్వంద్వ ప్రతికూల వాక్యమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఈ విషయమై అవగాహన కలిగియుండాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ἀδελφοί
ఇక్కడ “సహోదరులు” అనే పదము తోటి క్రైస్తవులు, అనగా స్త్రీ పురుషులిద్దరిని సూచించుచున్నది.
θέλω
“నేను” అనే సర్వనామము పౌలును సూచించుచున్నది.
ὑμᾶς…ἦτε…ἑαυτοῖς
“మీరు” మరియు “మీ” అనే సర్వనామములు అన్యులైన విశ్వాసులను సూచించుచున్నది.
ἵνα μὴ ἦτε παρ’ ἑαυτοῖς φρόνιμοι
యూదా అవిశ్వాసులకంటే అన్యులైన విశ్వాసులు జ్ఞానవంతులని అనుకొనకూడదని పౌలు ఆశిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందువలన మీకు మీరే తెలివైన వారని తలంచకుండ ఉండాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πώρωσις ἀπὸ μέρους τῷ Ἰσραὴλ γέγονεν
శరీరములోని భౌతిక అంగములను కఠిన పరచు విధముగా ఉన్నవని “కఠినం” లేక మూర్ఖత్వమును గూర్చి పౌలు చెప్పుచున్నాడు. యేసు ద్వార వచ్చు రక్షణను కొంతమంది యూదులు తిరస్కరించారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలులో అనేక మంది మూర్ఖత్వముతో కొనసాగుతున్నారు” (చూడండి: రూపకం)
ἄχρι οὗ τὸ πλήρωμα τῶν ἐθνῶν εἰσέλθῃ
ఇక్కడ “వరకు” అనే పదము దేవుడు అన్యులను సంఘములో చేర్చిన తరువాత కొంతమంది యూదులు విశ్వసించుదురని సూచించుచున్నది.
Romans 11:26
దేవుని మహిమ కొరకు విమోచకుడు ఇశ్రాయేలునుండి వచ్చునని పౌలు చెప్పుచున్నాడు.
καὶ οὕτως πᾶς Ἰσραὴλ σωθήσεται
దీనిని క్రియాశీల రూపములో చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇందుమూలమున దేవుడు ఇశ్రాయేలీయులందరిని రక్షించును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καθὼς γέγραπται
దీనిని క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో వ్రాయబడియున్న విధముగా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐκ Σιὼν
ఇక్కడ “సీయోను” అనే పదము దేవుడు నివసించు స్థలమునకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులతో ఉండు స్థలమునుండి” (చూడండి: అన్యాపదేశము)
ὁ ῥυόμενος
తన ప్రజలను సురక్షిత ప్రాంతముకు తీసుకొచ్చేవాడు
ἀποστρέψει ἀσεβείας
ఒకరు తొలగించు ఒక వస్తువు లేక ఒక వస్త్రమును తొలగించు విధముగా ఉన్నదని పౌలు భక్తిహినతను గూర్చి చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ἀπὸ Ἰακώβ
ఇక్కడ “యాకోబు” అనే పదము ఇశ్రాయేలుకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇశ్రాయేలు ప్రజలనుండి” (చూడండి: అన్యాపదేశము)
Romans 11:27
ἀφέλωμαι τὰς ἁμαρτίας αὐτῶν
ఒకరు వాటిని తీసివేయు వస్తువులవలె ఉన్నవని ఇక్కడ పాపములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారి పాపముల భారమును నేను తొలగించెదను” (చూడండి: రూపకం)
Romans 11:28
κατὰ μὲν τὸ εὐαγγέλιον
పౌలు సువార్తను ఎందుకు ప్రస్తావిస్తున్నాడని మీరు స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎందుకనగా యూదులు సువార్తను తిరస్కరించారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐχθροὶ δι’ ὑμᾶς
వారు ఎవరి శత్రువులని మరియు ఇది అన్యుల కొరకు ఎట్లు కాగలదని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ కొరకు వారు దేవుని శత్రువులైయున్నారు” లేక “మీరు కూడా సువార్తను వినునట్లు దేవుడు వారిని శత్రువులుగా ఎంచియున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
κατὰ…τὴν ἐκλογὴν
పౌలు ఎన్నికను గూర్చి ఎందుకు ప్రస్తావించాడని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు యూదులను ఎన్నుకొనియున్నాడు కాబట్టి” లేక “దేవుడు యూదులను ఏర్పరచుకొనియున్నాడు కాబట్టి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀγαπητοὶ διὰ τοὺς πατέρας
యూదులను ఎవరు ప్రేమిస్తున్నారని మరియు పౌలు ఎందుకు వారి పితరులను గూర్చి ప్రస్తావించుచున్నాడని మీరు స్పష్టముగా తెలియజేయగలరు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన వారి పితరులకు చేసిన వాగ్ధానముకొరకు దేవుడు వారిని ఇంకా ప్రమించుచున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 11:29
ἀμεταμέλητα γὰρ τὰ χαρίσματα καὶ ἡ κλῆσις τοῦ Θεοῦ
దేవుడు తన ప్రజలకు బహుమానమువలె ఇచ్చియున్న ఆత్మీయ మరియు భౌతిక ఆశీర్వదములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దేవుడు యూదులను తన ప్రజలుగా పిలిచియున్నాడనె వాస్తవమును దేవుని పిలుపు అనే మాట సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారికి వాగ్ధానము చేసియున్న విషయములో మరియు తన ప్రజలుగా వారిని ఎలా పిలిచియున్నాడో అనే విషయములో ఆయన మనస్సు మార్చుకొనలేదు” (చూడండి: రూపకం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 11:30
ὑμεῖς ποτε ἠπειθήσατε
మీరు పూర్వము విధేయులు కాలేదు
ἠλεήθητε τῇ τούτων ἀπειθείᾳ
ఇక్కడ కనికరము అంటే దేవుని యొద్దనుండి వచ్చు అనర్హమైన ఆశీర్వాదములు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు యేసును తిరస్కరించియున్నారు కాబట్టి, మీరు అర్హులుకాకపోయినా ఆశీర్వాదములను పొందుకొనియున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὑμεῖς
ఇది అన్యులైన విశ్వాసులను సూచించుచున్నది మరియు ఇది బహువచనమైయున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
Romans 11:32
συνέκλεισεν…ὁ Θεὸς τοὺς πάντας εἰς ἀπείθειαν
దేవుడు ఆయనకు అవిధేయులైన ప్రజలను చెరసాలలో నుండి తప్పించుకొనలేని ఖైదీలవలే చూచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకు అవిధేయులైన వారిని ఖైదీలుగా దేవుడు చేసియున్నాడు. ఇప్పుడు వారు (చూడండి: రూపకం)
Romans 11:33
ὦ βάθος πλούτου, καὶ σοφίας καὶ γνώσεως Θεοῦ
“తెలివి” మరియు “జ్ఞానము” అనే పదములు ఇక్కడ ఒకే అర్థమును కలిగియున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని తెలివి మరియు జ్ఞానము ద్వారా కలుగు మేలులు ఎంతో రమ్యమైనవి!” (చూడండి: జంటపదం)
ὡς ἀνεξεραύνητα τὰ κρίματα αὐτοῦ, καὶ ἀνεξιχνίαστοι αἱ ὁδοὶ αὐτοῦ
ఆయన మనకొరకు నిర్ణయించియున్న సంగతులను గూర్చి మరియు మన విషయములో ఆయన చేయు క్రియలను గూర్చి అర్థం చేసుకోవడం మనకు సంపూర్ణముగా అర్థము చేసుకొనలేము
Romans 11:34
τίς γὰρ ἔγνω νοῦν Κυρίου, ἢ τίς σύμβουλος αὐτοῦ ἐγένετο
ప్రభువువలె ఎవరు జ్ఞానవంతులు లేరని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరు ప్రభువు మనస్సును తెలుసుకొనలేదు మరియు ఎవరు ఆయనకు సలహాదారులు కాలేదు.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
νοῦν Κυρίου
ఇక్కడ “మనస్సు” అనే పదము విషయములను తెలుసుకొనుట లేక విషయములను గూర్చి ఆలోచించడం అనే పదములకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువుకు తెలిసియున్నవన్నీ” లేక “ప్రభువు ఆలోచించు సంగతులు” (చూడండి: అన్యాపదేశము)
Romans 11:35
ἢ τίς προέδωκεν αὐτῷ, καὶ ἀνταποδοθήσεται αὐτῷ
తన దృష్టికోణమును ప్రభావితం చేయుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియొద్దనుండి మొదట పొందుకొనకయే ఏదియు దేవునికి ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు” (చూడండి: అలంకారిక ప్రశ్న) * ఆయన కొరకు దగ్గర నుండి… ఆయన ద్వారా… ఆయన కొరకు - ఇక్కడ “ఆయన” అని సంబోధించబడిన ప్రతి మాట దేవుని సూచించుచున్నది.
Romans 11:36
αὐτῷ ἡ δόξα εἰς τοὺς αἰῶνας
ప్రజలందరూ దేవుని ఘనపరచవలెననే పౌలు కోరికను ఇది వ్యక్తపరచుచున్నది. మీ తర్జుమాలో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “సమస్త ప్రజలు ఆయనను నిత్యము స్తుతించుదురుగాక” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 12
రోమా 12 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరుపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 20వ వచనములో ఈ విధంగా చేసియున్నది.
రోమా.12:1 వచనములో పౌలు “అందువలన” అని ఉపయోగించియున్న పదము 1-11 అధ్యాయములలో చెప్పబడియున్న వాటిని సూచించుచున్నాడని అనేక పండితులు నమ్ముచున్నారు. క్రైస్తవ సువార్తను జాగ్రతగా వివరించియుండి, ఈ గొప్ప సత్యమల వెలుగులో క్రైస్తవులు ఎలా జీవించాలని పౌలు ఇప్పుడు వివరించుచున్నాడు. 12-16 అధ్యాయములు ఒకరు క్రైస్తవ విశ్వాసంలో జీవించు విధము మీద కేంద్రీకృతమైయున్నది. ఈ ప్రయోగాత్మకమైన సూచనలను ఇచ్చుటకు పౌలు అనేకమైన విభిన్న ఆజ్ఞలను ఉపయోగించుచున్నాడు. (చూడండి: విశ్వాసం)
ఈ అధ్యాయములోని విశేష అంశములు
క్రైస్తవ జీవితం
మోషే ధర్మశాస్త్రము క్రింద, పశువులు లేక ధాన్యమును దేవాలయ అర్పణములుగా జనులు అర్పింపనవసరము ఉండెను. ఇప్పుడైతే క్రైస్తవులు వారి జీవితములను దేవునికి అర్పణమువలె జీవించాలి. భౌతిక అర్పణములు ఇక అవసరం లేదు. (చూడండి: ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం)
ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
క్రీస్తు శరీరము
క్రీస్తు శరీరము అనే పదము సంఘమును సూచించు ప్రాముఖ్యమైన రూపకఅలంకారము లేక చిత్రముగా లేఖనాలలో ఉపయోగించబడియున్నది. ప్రతియొక్క సంఘ సభ్యుడు ప్రత్యేకమైన మరియు ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. క్రైస్తవులకు ఒకరి అవసరం మరియొకరికి ఉన్నది. (చూడండి: శరీరం మరియు రూపకం)
Romans 12:1
విశ్వాసుల జీవితము ఎలా ఉండాలని మరియు విశ్వాసులు ఎలా సేవ చేయాలని పౌలు చెప్పుచున్నాడు.
παρακαλῶ οὖν ὑμᾶς, ἀδελφοί, διὰ τῶν οἰκτιρμῶν τοῦ Θεοῦ
ఇక్కడ “సహోదరులు” అనే పదము స్త్రీ పురుషులైన తోటి విశ్వాసులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “తోటి విశ్వాసులారా, దేవుడు మీకిచ్చియున్న గొప్ప కరుణనుబట్టి మీరు నాకు అవసరమైయున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
παραστῆσαι τὰ σώματα ὑμῶν θυσίαν ζῶσαν
ఒక సంపూర్ణమైన వ్యక్తిని సూచించునట్లు పౌలు ఇక్కడ “శరీరాలు” అనే పదము ఉపయోగించుచున్నాడు. దేవునికి సంపూర్ణముగా విధేయులైన క్రీస్తులోని విశ్వాసులను మరియు పశువులను మొదట చంపి తర్వాత దేవునికి అర్పించిన యూదులను పౌలు పోల్చుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఇంకా జీవించుచుండగా దేవాలయపు బలిపీఠము మీద వధించబడిన చచ్చిన పశువువలె దేవునికి సంపూర్ణముగా మిమ్మును మీరు అర్పించుకొనుడి” (చూడండి: ఉపలక్షణము మరియు రూపకం)
ἁγίαν, εὐάρεστον, τῷ Θεῷ
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “దేవునికి మాత్రమే మీరు ఇచ్చు బలి మరియు అది ఆయనకు ఇంపైనదిగా ఉండును” లేక 2) “అది నైతికముగా పరిశుద్ధమైనదిగా ఉన్నది గనుక అది దేవునికి అంగీకారమగును” (చూడండి: జంటపదం)
τὴν λογικὴν λατρείαν ὑμῶν
ఇది దేవున్ని ఆరాధించు సరియైన పధ్ధతి
Romans 12:2
μὴ συνσχηματίζεσθε τῷ αἰῶνι τούτῳ
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “లోకము ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకూడదు” లేక 2) “లోకము ఆలోచించు విధముగా మీరు ఆలోచించకండి.” (చూడండి: రూపకం)
μὴ συνσχηματίζεσθε τῷ αἰῶνι τούτῳ
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “మీరు ఏమి చేయాలని మరియు ఏమి ఆలోచించాలని లోకము మీకు చెప్పనీయకండి” లేక 2) “లోకము చేయునట్లు మీరు ప్రవర్తించునట్లు మీకు మీరు అనుమతి ఇవ్వకండి.” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῷ αἰῶνι τούτῳ
ఇది లోకములో జీవించు అవిశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: అన్యాపదేశము)
ἀλλὰ μεταμορφοῦσθε τῇ ἀνακαινώσει τοῦ νοός
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు ఆలోచించు విధానము మరియు మీ ప్రవర్తనను మార్చునట్లు దేవునికి అనుమతినివ్వండి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 12:3
διὰ τῆς χάριτος τῆς δοθείσης μοι
ఇక్కడ “కృప” అనే పదము దేవుడు పౌలును అపొస్తలుడుగా మరియు సంఘమునకు నాయకుడుగా ఎన్నుకున్న దానిని సూచించుచున్నది. దీనిని మీ తర్జుమాలో స్పష్టము చేయగలరు. దీనిని మీరు క్రియాశీల రూపములో కూడా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు స్వేచ్ఛగా నన్ను అపొస్తలడుగా ఎన్నుకొనెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
παντὶ τῷ ὄντι ἐν ὑμῖν, μὴ ὑπερφρονεῖν παρ’ ὃ δεῖ φρονεῖν
ఇతరుల కంటే మీరు శ్రేష్టమైన వారని మీలో ఎవరు తలంచకూడదు
ἀλλὰ φρονεῖν εἰς τὸ σωφρονεῖν
అయితే మిమ్మును గూర్చి మీరు ఆలోచించు విషయములో జ్ఞానము కలిగియుండుడి
ἑκάστῳ ὡς ὁ Θεὸς ἐμέρισεν μέτρον πίστεως
దేవునితో వారు సంభాషించుటకు విశ్వాసులు వేరే వేరే సామర్ధ్యములు కలిగియుందురని పౌలు సూచించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనయందు మీరు కలిగియున్న నమ్మకమునుబట్టి దేవుడు మీలో ప్రతివానికి వేరే వేరే సామర్థ్యాలు ఇచ్సియున్నందున” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 12:4
γὰρ
ఇతరులకంటే వారు శ్రేష్ఠులని కొంతమంది క్రైస్తవులు ఎందుకు తలంచకూడదని ఇప్పుడు వివరించునని చూపించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.
ἐν ἑνὶ σώματι, πολλὰ μέλη ἔχομεν
మానవ శరీరములోని విభిన్నమైన అవయవాలుగా క్రీస్తులోని విశ్వాసులందరు ఉన్నారని పౌలు సూచించుచున్నాడు. విశ్వాసులు క్రీస్తును అనేక విధములుగా సేవించిన, ప్రతి వ్యక్తి క్రీస్తు సంబంధియైయున్నాడని మరియు ప్రాముఖ్యమైన రీతిలో సేవ చేయునని చూపించుటకు పౌలు దీనిని చేయుచున్నాడు. (చూడండి: రూపకం)
μέλη
ఇవి కన్నులు, కడుపులు మరియు చేతులవంటివి.
Romans 12:5
τὸ δὲ καθ’ εἷς ἀλλήλων μέλη
మానవ శరీరములోని అవయవములవలె దేవుడు వారిని భౌతికముగా ఏకము చేసియున్నట్లు విశ్వాసులను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి విశ్వాసిని దేవుడు వేరే విశ్వాసులతో కలిపియున్నాడు” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 12:6
ἔχοντες δὲ χαρίσματα κατὰ τὴν χάριν τὴν δοθεῖσαν ἡμῖν διάφορα
విశ్వాసులు అనేక విధములైన సామర్థ్యములను కలిగియుండుట అనేది దేవుని ద్వారా వచ్చిన ఉచిత బహుమానములుగా ఉన్నాయని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకొరకు అనేకమైన సంగతులు చేయునట్లు దేవుడు మనలో ప్రతివానికి ఉచితముగా సామర్థ్యమును ఇచ్చియున్నాడు” (చూడండి: రూపకం)
κατὰ τὴν ἀναλογίαν τῆς πίστεως
దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “దేవుడు మనకిచ్చియున్న విశ్వాసము కొలతను మించి పోకుండ అతడు ప్రవచనములను చెప్పనియుడి” లేక 2) “మన విశ్వాసముతో అంగీకరించు ప్రవచనములను అతడు మాట్లాడనివ్వండి.”
Romans 12:8
ὁ μεταδιδοὺς
ఇక్కడ “ఇచ్చుట” అనే పదము వేరే ప్రజలకు ఇచ్చే ధనము మరియు ఇతర వస్తువులను సూచించుచున్నది. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అవసరతలో ఉన్నవారికి ధనము లేక ఇతర వస్తువులను ఇచ్చు వరము గల వాడు ఒకడు పొందియుండినయెడల” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 12:9
ἡ ἀγάπη ἀνυπόκριτος
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు జనులను నిజాయితీగా మరియు నిష్కపటముగా ప్రేమించాలి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡ ἀγάπη
పౌలు ఇక్కడ ఉపయోగించే ప్రేమ అనే విధానము దేవుని నుండి వచ్చును మరియు ఒకనికి మేలు చేయకపోయినా అది ఇతరులకు మంచిచేయనుద్దేశించును.
ἡ ἀγάπη
సహోదర ప్రేమ లేక స్నేహితుని ప్రేమ లేక కుటుంబ సభ్యుల ప్రేమ అని అర్థమిచ్చు మరియొక్క పదమైయున్నది. ఇది స్నేహితులు లేక బంధువుల మధ్య ఉన్న సహజమైన మానవ ప్రేమ.
Romans 12:10
τῇ φιλαδελφίᾳ…φιλόστοργοι
ఇక్కడ పౌలు తొమ్మిది సంగతుల జాబితాను ప్రారంభించుచున్నాడు, ప్రతి ఒక్కటి “….విషయములో ….ఉండాలి” విశ్వాసులు ఏవిధమైన ప్రజలుగా ఉండాలని చెప్పుచున్నాడు. కొన్నిటిని “…విషయములో…చేయాలి” అని తర్జుమా చేయవలసిన అవసరం కలగవచ్చు. రోమా.12:13 వచనములో జాబితా కొనసాగించబడియున్నది.
τῇ φιλαδελφίᾳ
మీ తోటి విశ్వాసులను ప్రేమించిన విధముగా
φιλόστοργοι
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మమతను చూపించు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῇ τιμῇ ἀλλήλους προηγούμενοι
ఒకరినొకరు గౌరవించుకొనుడి మరియు సన్మానించుకొనుడి లేక “మీ తోటి విశ్వాసులను గౌరవించడం ద్వారా వారిని సన్మానించుడి”
Romans 12:11
τῇ σπουδῇ μὴ ὀκνηροί, τῷ πνεύματι ζέοντες, τῷ Κυρίῳ δουλεύοντες
మీ పనుల విషయములో సోమరులైయుండకండి, అయితే ఆత్మను వెంబడించుటకు మరియు ప్రభువును సేవించుటకు ఆసక్తిని కలిగియుండుడి
Romans 12:12
τῇ θλίψει ὑπομένοντες
మీకు కష్టము వచ్చినప్పుడు సహనము కలిగియుండుడి
Romans 12:13
ταῖς χρείαις τῶν ἁγίων κοινωνοῦντες
రోమా.12:9 వచనములో ప్రారంభమైన జాబితాలో ఇది చివరి విషయము. “తోటి క్రైస్తవులు కష్టములో ఉన్నప్పుడు, వారి అవసరతలో సహాయపడుడి”
τὴν φιλοξενίαν διώκοντες
వారుండుటకు స్థలము అవసరమైనప్పుడు వారిని మీ గృహములోనికి ఎల్లప్పుడూ ఆహ్వానించుడి
Romans 12:16
τὸ αὐτὸ εἰς ἀλλήλους φρονοῦντες
ఐక్యతతో జీవించడం అనే మాటకు ఇది జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరితో ఒకరు ఏక మనస్సు కలిగియుండుడి” లేక “ఐక్యతతో ఒకరితో ఒకరు జీవించండి” (చూడండి: జాతీయం (నుడికారం))
μὴ τὰ ὑψηλὰ φρονοῦντες
ఇతరులకంటే మీరు ప్రాముఖ్యమైనవారని తలంచవద్దు
τοῖς ταπεινοῖς συναπαγόμενοι
ప్రముఖులుగా అనిపించని ప్రజలను ఆహ్వానించుడి
μὴ γίνεσθε φρόνιμοι παρ’ ἑαυτοῖς
అందరికంటే మీకే అధికమైన జ్ఞానమున్నదని మిమ్ములను గూర్చి మీరు తలంచవద్దు
Romans 12:17
μηδενὶ κακὸν ἀντὶ κακοῦ ἀποδιδόντες
మీకు కీడు చేసినవారికి మీరు కీడు చేయకుడి
προνοούμενοι καλὰ ἐνώπιον πάντων ἀνθρώπων
అందరు మంచివని ఎంచిన వాటిని మీరు చేయండి
Romans 12:18
τὸ ἐξ ὑμῶν, μετὰ πάντων ἀνθρώπων εἰρηνεύοντες
అందరితో సమాధానము కలిగి జీవించుటకు మీరు ఏదైనా చేయుటకు వెనకాడకుడి
Romans 12:19
δότε τόπον τῇ ὀργῇ
ఇక్కడ “పగ” అనే పదము దేవుని శిక్షను సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని శిక్షించుటకు అవకాశం ఇవ్వండి” (చూడండి: అన్యాపదేశము)
γέγραπται γάρ
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ఈ విధముగా వ్రాసియున్నారు కాబట్టి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐμοὶ ἐκδίκησις; ἐγὼ ἀνταποδώσω
ఈ రెండు మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు దేవుడు తన ప్రజలను శిక్షించునని నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను నిశ్చయముగా మిమ్ములను శిక్షించెదను” (చూడండి: సమాంతరత)
Romans 12:20
ὁ ἐχθρός σου, ψώμιζε αὐτόν;…πότιζε αὐτόν; τοῦτο γὰρ ποιῶν,…σωρεύσεις
“మీరు” మరియు “మీ” అనే అన్ని పదములు ఒకే వ్యక్తిని సూచించుచున్నవి. (చూడండి: ‘మీరు’ రూపాలు)
ἀλλὰ ἐὰν πεινᾷ ὁ ἐχθρός σου, ψώμιζε αὐτόν; ἐὰν διψᾷ, πότιζε αὐτόν; τοῦτο γὰρ ποιῶν, ἄνθρακας πυρὸς σωρεύσεις ἐπὶ τὴν κεφαλὴν αὐτοῦ.
12:20వ వచనములో పౌలు మరియొక లేఖనమును వ్యాఖ్యానించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ‘మీ శత్రువు ఆకలిగొనియుంటే…. అతని తల మీద…’ అని కూడా వ్రాయబడియున్నది”
ψώμιζε αὐτόν
అతనికి కొంత ఆహారము ఇవ్వండి
ἄνθρακας πυρὸς σωρεύσεις ἐπὶ τὴν κεφαλὴν αὐτοῦ
వారి తలల మీద ఎవరో కాలే నిప్పులు పోసినట్లుంటుందని శత్రువులు పొందుకొను ఆశీర్వాదములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “అతడు మిమ్మును ఎంతగా అవమానించాడని మిమ్మును నొప్పించిన ఒక వ్యక్తికి తెలియపరచుట” లేక 2) “మీ శత్రువుల విషయములో దేవుడు మరి కఠినంగా తీర్పు చేయుటకు కారణము ఇచ్చుట” (చూడండి: రూపకం)
Romans 12:21
μὴ νικῶ ὑπὸ τοῦ κακοῦ, ἀλλὰ νίκα ἐν τῷ ἀγαθῷ τὸ κακόν
“దుష్టత్వం” ఒక వ్యక్తిగా ఉన్నట్లు పౌలు చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “కీడు చేసిన వారు మిమ్మును ఓడించుటకు అవకాశం ఇవ్వకండి, అయితే కీడును మేలుతో జయించుడి” (చూడండి: మానవీకరణ మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
μὴ νικῶ ὑπὸ τοῦ κακοῦ, ἀλλὰ νίκα…τὸ κακόν
ఈ క్రియపదములు ఒక వ్యక్తిని సూచించుచున్నట్లు ఉపయోగించబడియున్నవి అందువలన అవి ఏకవచనములైయున్నవి. (చూడండి: ‘మీరు’ రూపాలు)
Romans 13
రోమా 13 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
ఈ అధ్యాయములోని మొదటి భాగములో, తమను పాలించుచున్న అధికారులకు విధేయులైయుండాలని పౌలు క్రైస్తవులకు బోధించుచున్నాడు. ఆ కాలములో, భక్తిహినులైన రోమా అధికారులు ఆ ప్రాంతమును ఏలుచుండిరి. (చూడండి: దైవభక్తిగల, దైవభక్తి, దైవభక్తిలేని, దేవుడులేని, దైవభక్తిలేని, దేవుడులేని స్థితి)
ఈ అధ్యాయములోని విశేష అంశములు
భక్తిహిన పాలకులు
అధికారులకు విధేయులైయుండాలని పౌలు బోధించునప్పుడు, దీనిని అర్థం చేసుకొనుటకు కొంతమంది చదువరులకు కొంత కష్టముగా ఉండును, విశేషముగా అధికారులు సంఘమును హింసించు విషయము కష్టకరముగా ఉంటుంది. వారు ఏమి చేయాలని దేవుడు విశేషముగా చెప్పిన సంగతులను క్రైస్తవులు చేయుటకు అధికారులు అనుమతినివ్వనంతవరకు క్రైస్తవులు తమ పాలకులకు లోబడాలి అలాగునే దేవునికి కూడా లోబడాలి. ఈ లోకము అశాశ్వతమని మరియు వారు దేవునితో నిత్యము జీవింతురని క్రైస్తవులు అర్థం చేసుకొనవలెను. (చూడండి: నిత్యత్వం, శాశ్వతమైన, నిత్యమైన, శాశ్వతంగా)
ఈ అధ్యాయములో ఎదురైయ్యే ఇతర అనువాద ఇబ్బందులు
శరీరము
ఇది క్లిష్టమైన సంగతి. “శరీరము” అనే మాట పాపపు స్వభావముకు రూపకఅలంకారమైయున్నది. మన భౌతిక దేహములు పాపాత్మకముగా ఉన్నవని పౌలు బోధించుటలేదు. క్రైస్తవులు బ్రతికియున్నంత కాలము (“శరీరములో”), మనము పాపము చేయుచుందుమని పౌలు బోధించుచునట్లు కనబడుచున్నది. అయితే మన నూతన స్వభావము మన పాత స్వభావముతో పోరాడుచుండును. (చూడండి: శరీరం మరియు పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం) .
Romans 13:1
తమ పాలకుల క్రింద వారు ఎలా జీవించాలని పౌలు విశ్వాసులకు చెప్పుచున్నాడు.
πᾶσα ψυχὴ…ὑποτασσέσθω
ఇక్కడ “ఆత్మ” అనే పదము ఒక వ్యక్తిని సూచించు ఉపలక్షణమైయున్నది. “ప్రతి క్రైస్తవుడు విధేయత కలిగియుండాలి” లేక “ప్రతి ఒక్కరు విధేయులైయుండాలి” (చూడండి: ఉపలక్షణము)
ἐξουσίαις ὑπερεχούσαις
ప్రభుత్వ అధికారులు
γὰρ
ఎందుకనగా
οὐ…ἔστιν ἐξουσία, εἰ μὴ ὑπὸ Θεοῦ
సమస్త అధికారము దేవునియొద్దనుండి వచ్చును
αἱ δὲ οὖσαι ὑπὸ Θεοῦ τεταγμέναι εἰσίν
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని ఆ స్థలములో ఉంచియున్నాడు కాబట్టి అధికారములో ఆ ప్రజలున్నారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 13:2
τῇ ἐξουσίᾳ
ఆ ప్రభుత్వ అధికారి లేక “దేవుడు శక్తిలో ఉంచిన అధికారము”
οἱ…ἀνθεστηκότες, ἑαυτοῖς κρίμα λήμψονται
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభుత్వ అధికారులను ఎదురించు వారికి దేవుడు తీర్పు తీర్చును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 13:3
γὰρ
రోమా.13:2 వచనము యొక్క వివరణను ప్రారంభించుటకు మరియు ప్రభుత్వము ఒక వ్యక్తిని ఖండించినప్పుడు ఎలాగ ఉండవలెనని చెప్పుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.
οἱ…ἄρχοντες οὐκ εἰσὶν φόβος
అధికారులు మంచి ప్రజలను భయపెట్టరు.
τῷ ἀγαθῷ ἔργῳ,…τῷ κακῷ
తమ “మంచి పనులు” లేక “చెడ్డ పనులు” ద్వారా ప్రజలు గుర్తించబడుదురు.
θέλεις δὲ μὴ φοβεῖσθαι τὴν ἐξουσίαν
అధికారుల విషయములో భయముండకూడదంటే వారు ఏమి చేయాలనె అంశమువైపు ప్రజల ఆలోచనను మళ్ళించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు అధికారుల విషయములో భయము చెందకుండ ఎలా ఉండగలరని నేను మీకు చెప్పుదును.” (చూడండి: అలంకారిక ప్రశ్న)
ἕξεις ἔπαινον ἐξ αὐτῆς
మంచి పనులు చేసిన ప్రజలను గూర్చి ప్రభుత్వము మంచిగానే చెప్పుతుంది.
Romans 13:4
οὐ…εἰκῇ τὴν μάχαιραν φορεῖ
దీనిని మీరు అనుకూల పద్ధతిలో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మంచి ఉద్దేశ్యము కొరకు అతను ఖడ్గమును ధరించును” లేక “జనులను శిక్షించుటకు అతనికి అధికారమున్నది మరియు అతను ప్రజలను శిక్షించును” (చూడండి: ద్వంద్వ నకారాలు)
τὴν μάχαιραν φορεῖ
తమ అధికారముకు గురుతుగా రోమా అధికారులు ఒక చిన్న ఖడ్గమును ధరించేవారు. (చూడండి: అన్యాపదేశము)
ἔκδικος εἰς ὀργὴν
వారు చేసిన చెడ్డ పనులకు పొందుకున్న శిక్షను ఇక్కడ “కోపము” అనే పదము సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “చెడుపైన ప్రభుత్వ కోపమును వ్యక్తపరచుటకు ప్రజలను శిక్షించు ఒక వ్యక్తి” (చూడండి: అన్యాపదేశము)
Romans 13:5
οὐ μόνον διὰ τὴν ὀργὴν, ἀλλὰ καὶ διὰ τὴν συνείδησιν
ప్రభుత్వమూ మిమ్ములను శిక్షించదు అని మాత్రము కాక దేవుని ఎదుట స్పష్టమైన మనసాక్షి కలిగియుండుటకు
Romans 13:6
διὰ τοῦτο
ఎందుకనగా ప్రభుత్వము దుష్టులను శిక్షించును
τελεῖτε
పౌలు ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు కాబట్టి ఇది బహువచనమైయున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
γὰρ…εἰσιν
ఇందువలననే మీరు పన్నులు కట్టాలి: అధికారులు
προσκαρτεροῦντες
పర్యవేక్షణకు లేక “పని మీద”
Romans 13:7
ἀπόδοτε πᾶσι
పౌలు ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు కాబట్టి ఇది బహువచనమైయున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
τῷ τὸν φόρον, τὸν φόρον; τῷ τὸ τέλος, τὸ τέλος; τῷ τὸν φόβον, τὸν φόβον; τῷ τὴν τιμὴν, τὴν τιμήν
“కట్టు” అనే పదము మునుపటి వాక్యములోనుండి అర్థమవుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పన్ను ఋణపడియున్నవారికి పన్నును మరియు సుంకాలు ఋణపడిన వారికి సుంకాలను కట్టండి. భయము ఋణపడియున్న వారికి భయమును మరియు మర్యాద ఋణపడియున్న వారికి మర్యాదను చెల్లించుడి” (చూడండి: శబ్దలోపం)
τῷ τὸν…φόβον, τὸν φόβον; τῷ τὴν τιμὴν, τὴν τιμήν
ఎవరు భయము మరియు మర్యాదకు అర్హులో వారికి భయపడాలని మరియు వారిని గౌరవించాలని ఇక్కడ భయము మరియు మర్యాదను చెల్లించడం అనే పదములకు రూపకఅలంకారములైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “భయముకు అర్హులైనవారికి భయపడుడి మరియు మర్యాదకు అర్హులైనవారికి మర్యాద చేయుడి” లేక “మర్యాద ఇవ్వవలసిన వారికి మర్యాద ఇవ్వండి మరియు గౌరవం ఇవ్వవలసిన వారికి గౌరవం ఇవ్వండి” (చూడండి: రూపకం)
τὸ τέλος
ఇది పన్నులో ఒక రకము.
Romans 13:8
పొరుగువాని విషయములో ఎలా ప్రవర్తించాలని పౌలు విశ్వాసులకు చెప్పుచున్నాడు.
μηδενὶ μηδὲν ὀφείλετε, εἰ μὴ τὸ ἀλλήλους ἀγαπᾶν
ఇది ద్వంద్వ ప్రతికూలమైయున్నది. దీనిని మీరు అనుకూల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఋణపడియున్న వారందరికి చెల్లించుడి మరియు ఒకరినొకరు ప్రేమించుకొనుడి” (చూడండి: జంట వ్యతిరేకాలు)
ὀφείλετε
ఈ క్రియ పదము బహువచమైయున్నది మరియు ఇది రోమాలోని క్రైస్తవులందరికి వర్తిస్తుంది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
εἰ μὴ τὸ ἀλλήλους ἀγαπᾶν
పైన చెప్పబడిన వాటిలో ఈ ఋణమును మాత్రము కలిగియుండవచ్చు.
ἀγαπᾶν
ఇది దేవుని నుండి వచ్చు ప్రేమ విధానమైయున్నది మరియు ఒకనికి మేలు చేయకపోయినా అది ఇతరులకు మంచిచేయనుద్దేశించును.
Romans 13:9
ἐπιθυμήσεις
ఒక వ్యక్తి కలిగియున్న దానిని పొందుకోవాలని లేక కలిగియుండాలనె కోరిక.
Romans 13:10
ἡ ἀγάπη τῷ πλησίον κακὸν οὐκ ἐργάζεται
ఈ మాట ప్రేమను ఒక వ్యక్తి మరోవ్యక్తి యెడల కరుణకలిగియున్న ప్రేమను చూపించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “తమ పొరుగువారిని ప్రేమించువారు వారికి హాని తలపెట్టరు” (చూడండి: మానవీకరణ)
Romans 13:11
εἰδότες τὸν καιρόν, ὅτι ὥρα ἤδη ὑμᾶς ἐξ ὕπνου ἐγερθῆναι
ఒకరు నిద్రలోనుండి మేల్కొనిన రీతిగా రోమాలోని విశ్వాసులు తమ ప్రవర్తనను మార్చుకొవలసిన అవసరతను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: రూపకం)
Romans 13:12
ἡ νὺξ προέκοψεν
రాత్రి సమయమువలె ప్రజలు చెడ్డ పనులు చేయు సమయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము చేయు సమయము గడిచిపోతుంది” లేక “రాత్రి గడిచిపోతున్నట్లు అది ఉంది” (చూడండి: రూపకం)
ἡ…ἡμέρα ἤγγικεν
పగలు వంటి సమయములో ప్రజలు మంచి పనులు చేయు సమయమును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీతి సమయము త్వరలో ప్రారంభముకానుంది” లేక “త్వరలో పగలు వచ్చులాగున అది ఉన్నది” (చూడండి: రూపకం)
ἀποθώμεθα οὖν τὰ ἔργα τοῦ σκότους
ఒక వ్యక్తి ప్రక్కన వేయు వస్త్రమువలె “చీకటి కార్యములు” ఉన్నాయని పౌలు చెప్పుచున్నాడు. ఇక్కడ “ప్రక్కన వేయడం” అంటే దేనినో చేయడం ఆపివేయడం అని అర్థము. ఇక్కడ “చీకటి” అనే పదము కీడుకు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు చీకటిలో చేయు చెడ్డ పనులను మనం చేయుట ఆపివేయుదుము” (చూడండి: రూపకం)
ἐνδυσώμεθα…τὰ ὅπλα τοῦ φωτός
ఇక్కడ “వెలుగు” అనే పదము మంచి పనికి మరియు సరియైన పనికి రూపకఅలంకారమైయున్నది. ఒకడు తనను కాపాడుకొనుటకు ధరించు రక్షణ కవచమువలె మంచి పనులుంటాయని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము మంచి పనులు చేయుటకు ప్రారంభించుదము. రక్షణ కవచము ఒక సైనికుని కాపాడినట్లు కీడు నుండి ఇది మనలను కాపాడును” (చూడండి: రూపకం)
Romans 13:13
περιπατήσωμεν
పౌలు తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను తనతో కలుపుకొనుచున్నాడు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ὡς ἐν ἡμέρᾳ εὐσχημόνως περιπατήσωμεν
నిజమైన విశ్వాసులుగా జీవించడం పగటి సమయములో ఒకడు నడచునట్లు ఉంటుందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను అందరు చూడగలరని తెలుసుకొని అందరికి కనబడు విధములో మనము నడిచెదము” (చూడండి: రూపకం)
κοίταις καὶ ἀσελγείαις
ఈ మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి. మీ అనువాదములో వాటిని కలిపి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “లైంగిక అనైతిక కార్యములు” (చూడండి: జంటపదం)
ἔριδι
ఇతర ప్రజలతో వాదించడం మరియు ఒకరికి విరోధముగా పన్నాగాలు పన్నడమును ఇది సూచించుచున్నది.
ζήλῳ
ఒక వ్యక్తి విజయము లేక ఇతరుల మీద లాభముకు విరోధముగా కలుగు ప్రతికూల భావములను ఇది సూచించుచున్నది.
Romans 13:14
ἐνδύσασθε τὸν Κύριον Ἰησοῦν Χριστόν
క్రీస్తు నైతిక స్వభామును స్వీకరించడము ప్రజలు చూడ కలిగిన మన పైవస్త్రమువలె ఆయన ఉన్నట్లు పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: రూపకం)
ἐνδύσασθε
మీ భాషలో ఆజ్ఞలకు బహువచనము ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.
τῆς σαρκὸς πρόνοιαν μὴ ποιεῖσθε
ఇక్కడ “శరీరము” అనే పదము దేవున్ని వ్యతిరేకించి స్వయం ఆలోచనతో నడచుకొను స్వభావము కలిగిన ప్రజలను సూచించుచున్నది. ఇది మనుష్యుల పాపపు స్వభావమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దుష్ట క్రియలు చేయునట్లు ఎట్టి పరిస్థితులలోను మీ పాత దుష్ట హృదయముకు అవకాశం ఇవ్వకండి” (చూడండి: అన్యాపదేశము)
Romans 14
రోమా 14 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 11వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.
ఈ అధ్యాయములోని విశేష అంశములు
విశ్వాసములో బలహీనత
క్రైస్తవులు నిజమైన విశ్వాసము కలిగియుండి మరియు అదే సమయములో “విశ్వాసములో బలహీనత” కూడా కలిగియుందురని పౌలు బోధించుచున్నాడు. పరిపక్వతలేని, బలహీనమైన లేక అపార్థం చేసుకొనియున్న క్రైస్తవుల విశ్వాసమును ఇది వివరించుచున్నది. (చూడండి: విశ్వాసం)
ఆహార నియమాలు
ప్రాచీన తూర్పు దేశములలోని అనేక మాటలు ఆహార నియమాలు కలిగియుండిరి. క్రైస్తవులు తాము కోరుకున్న ఆహారమును భుజించ స్వాతంత్ర్యము కలిగియున్నారు. అయితే ఈ స్వాతంత్ర్యమును వారు ప్రభువును ఘనపరచు విధములో మరియు ఇతరులు పాపము చేయుటకు కారకులు కాకుండా వివేచనతో ఉపయోగించుకొనవలెను. (చూడండి: పాపము, పాపమైన, పాపి, పాపం చేస్తుండడం)
దేవుని న్యాయపీఠము
దేవుని లేక క్రీస్తు న్యాయపీఠము అనేది క్రైస్తవులతో పాటు, ప్రజలందరూ తాము జీవించిన విధానముకు లేక్కచేప్పవలసిన సమయముకు సాదృశ్యమైయున్నది. .
Romans 14:1
వారు దేవునికి సమాధానము చెప్పవలసిన వారైయున్నారనె విషయమును జ్ఞాపకముంచుకొనవలెనని పౌలు విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు.
ἀσθενοῦντα τῇ πίστει
కొన్ని పదార్థములను తినుటను మరియు త్రాగుటను గూర్చి దోషారోపణ కలిగియున్న వారిని ఇది సూచించుచున్నది.
μὴ εἰς διακρίσεις διαλογισμῶν
మరియు వారి అభిప్రాయముల విషయములో వారిని ఖండించకండి
Romans 14:2
ὃς μὲν πιστεύει φαγεῖν πάντα
దేవుడు అతనికి చెప్పెనని నమ్మి వాటిని చేయుటను “విశ్వాసము” అనే పదము సూచించుచున్నది.
ὁ…ἀσθενῶν λάχανα ἐσθίει
అతడు మాంసమును తినకూడదని దేవుడు చెప్పినట్లు నమ్మువాడిని ఇది సూచించుచున్నది.
Romans 14:4
σὺ τίς εἶ, ὁ κρίνων ἀλλότριον οἰκέτην
ఇతరులకు తీర్పు చేయుచున్న వారిని తిట్టుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుడు కారు మరియు ఆయన సేవకులకు మీరు తీర్పు చేయకూడదు!” (చూడండి: అలంకారిక ప్రశ్న)
σὺ…ὁ κρίνων
ఇక్కడ “నువ్వు” అనే పదము ఏకవచనమైయున్నది. (చూడండి: ‘మీరు’ రూపాలు)
τῷ ἰδίῳ κυρίῳ στήκει ἢ πίπτει
సేవకులను కలిగియున్న యజమానునివలె ఆయన ఉన్నాడని పౌలు దేవుని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “సేవకుని అంగీకరించుటకు లేక అంగీకరించక పోవడం యజమానుడు మాత్రమే నిర్ణయించగలడు” (చూడండి: రూపకం)
σταθήσεται δέ, δυνατεῖ γὰρ ὁ Κύριος στῆσαι αὐτόν
దేవునికి అంగీకారముగా ఉన్న సేవకుడు పడిపోవుటకు బదులుగా “నిలబెట్టబడియున్నాడని” పౌలు ఆ సేవకుని గూర్చి చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ప్రభువు అతడిని అంగీకరించును ఎందుకనగా ఆయన ఆ సేవకుడిని అంగీకారముగా చేయ సమర్థుడైయున్నాడు” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 14:5
ὃς μὲν κρίνει ἡμέραν παρ’ ἡμέραν; ὃς δὲ κρίνει πᾶσαν ἡμέραν.
అన్ని రోజులకంటే ఒక్క రోజు అతి ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని ఒకడు అనుకొనును, అయితే అన్ని రోజులు ఒకే విధముగా ఉన్నవని వేరొక వ్యక్తి అనుకొనును
ἕκαστος ἐν τῷ ἰδίῳ νοῒ, πληροφορείσθω
మీరు సంపూర్ణ అర్థమును స్పష్టము చేయగలరు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు చేయుచున్నవాటి ద్వారా ప్రభువును ఘనపరచుటకు చేయవలెనని ప్రతి మనుష్యుడు నిశ్చయత కలిగియుండాలి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:6
ὁ φρονῶν τὴν ἡμέραν, Κυρίῳ φρονεῖ
ఇక్కడ “పాటించే” అనే పదము ఆరాధనను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక ప్రత్యేకమైన దినమందు ఆరాధించువాడు ప్రభువును ఘనపరచుటకు దానిని చేయుచున్నాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ὁ ἐσθίων
రోమా.14:3 వచనములోనే “సమస్తము” అనే మాటకు అర్థము తెలుసుకొనియున్నాము. దానిని ఇక్కడ మరల చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి విధమైన ఆహారమును తిను వ్యక్తి” (చూడండి: శబ్దలోపం)
Κυρίῳ ἐσθίει
ప్రభువును ఘనపరచుటకు తినును లేక “ప్రభువును ఘనపరచుటకు ఆ విధముగా భుజించును”
καὶ ὁ μὴ ἐσθίων
రోమా.14:3 వచనములోనే “సమస్తము” అనే మాటకు అర్థము తెలుసుకొనియున్నాము. దానిని ఇక్కడ మరల చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు ప్రతి విధమైన ఆహారమును తిననివాడు” లేక “కొన్ని విధములైన ఆహారమును తిననివాడు” (చూడండి: శబ్దలోపం)
Romans 14:7
οὐδεὶς γὰρ ἡμῶν ἑαυτῷ ζῇ
ఇక్కడ “తన కొరకు తాను జీవించు” అనే మాట ఒకని తృప్తిపరచు కొనుటకు మాత్రమే జీవించును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను మనము సంతోషపరచుకొనుటకు మనము జీవించకూడదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οὐδεὶς…ἡμῶν
పౌలు తన చదువరులను ఇక్కడ చేర్చుకొనుచున్నాడు కాబట్టి ఇది కలిపి చెప్పబడియున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
οὐδεὶς ἑαυτῷ ἀποθνῄσκει
అంటే ఒకని మరణం ఇతర ప్రజలను బాధించునని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము మరణించినప్పుడు మనకు మాత్రమే బాధకలుగుతుందని ఎవరు ఆనుకొనకూడదు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:8
పౌలు తన గురించి మరియు అతని చదువరుల గురించి మాట్లాడుచున్నాడు కాబట్టి, “మనము” అనే పదములన్ని చేర్చుకొనబడియున్నవి. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Romans 14:10
τί κρίνεις τὸν ἀδελφόν σου? ἢ καὶ σὺ τί ἐξουθενεῖς τὸν ἀδελφόν σου
ఇటువంటి ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా తన చదువరులను అతను ఇంకా ఎంతగా తిట్టవచ్చునో అనే విషయమును పౌలు ఇక్కడ తెలియపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ సహోదరునిపై తీర్పు చెప్పుట తప్పు మరియు మీ సహోదరుని చిన్న చూప చూడడము తప్పు!” లేక “మీ సహోదరునిపై తీర్పు చెప్పడం మరియు చిన్న చూపు చూడడము తప్పు!” (చూడండి: ‘మీరు’ రూపాలు)
τὸν ἀδελφόν
ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.
πάντες γὰρ παραστησόμεθα τῷ βήματι τοῦ Θεοῦ
“న్యాయపీఠము” అనే పదము తీర్పు తీర్చుటకు దేవుని అధికారమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనకందరికి తీర్పు తీర్చును” (చూడండి: అన్యాపదేశము)
Romans 14:11
γέγραπται γάρ…ἐγώ
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ఒకరు లేఖనములలో వ్రాసియున్నందున: 'గా” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ζῶ ἐγώ
ఈ పదము ఒక ప్రమాణము లేక పరిశుద్ధ వాగ్ధానము ప్రారంభించుటకు ఉపయోగించే పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది సత్యమైనదని మీరు నిశ్చయించుకొనవచ్చు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἐμοὶ κάμψει πᾶν γόνυ, καὶ πᾶσα γλῶσσα ἐξομολογήσεται τῷ Θεῷ
ఒక వ్యక్తిని సంపూర్ణముగా సూచించునట్లు పౌలు “మోకాళ్ళు” మరియు “నాలుక” అనే పదములను ఉపయోగించుచున్నాడు. అంతమాత్రము కాక, ప్రభువు తనను తాను సూచించుటకు “దేవుడు” అనే పదమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి వ్యక్తి నాకు నమస్కరించును మరియు నన్ను స్తుతించును” (చూడండి: ఉపలక్షణము మరియు ఉత్తమ, మధ్యమ, ప్రథమ)
Romans 14:12
περὶ ἑαυτοῦ, λόγον δώσει τῷ Θεῷ
మన క్రియలను దేవునికి వివరించవలెను
Romans 14:13
ἀλλὰ τοῦτο κρίνατε μᾶλλον, τὸ μὴ τιθέναι πρόσκομμα τῷ ἀδελφῷ ἢ σκάνδαλον
ఇక్కడ “అడ్డురాయి” మరియు “ఆటంకము” అనే పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీ తోటి విశ్వాసి పాపము చేయునట్లు మీరు ఏమి చేయకూడదని మరియు ఏమి చెప్పకూడదని మీ గురి పెట్టుకోండి” (చూడండి: జంటపదం)
τῷ ἀδελφῷ
ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.
Romans 14:14
οἶδα καὶ πέπεισμαι ἐν Κυρίῳ Ἰησοῦ
ఇక్కడ “తెలుసుకొనుట” మరియు “ఒప్పుకొనుట” అనే పదములు ఒకే అర్థమును కలిగియున్నవి; అతని నిశ్చయతను నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువైన యేసుతో నేను కలిగియున్న సంబంధము కారణముగా నేను నిశ్చయము కలిగియున్నాను” (చూడండి: జంటపదం)
οὐδὲν κοινὸν δι’ ἑαυτοῦ
దీనిని మీరు అనుకూల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతియొక్కటి తనలో అది పవిత్రముగా ఉన్నది” (చూడండి: జంట వ్యతిరేకాలు)
δι’ ἑαυτοῦ
దాని స్వభావము లేక “అది ఏమైయున్నదో దానిబట్టి”
εἰ μὴ τῷ λογιζομένῳ τι κοινὸν εἶναι, ἐκείνῳ κοινόν
ఒక వ్యక్తి అపవిత్రమని తలంచినవాటినుండి అతను దూరముగా ఉండాలని పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఏదైనా అపవిత్రమని ఒక వ్యక్తి తలంచినప్పుడు, అది అతనికి అపవిత్రమగును మరియు అతడు దానినుండి దూరముగా ఉండవలెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:15
εἰ…διὰ βρῶμα, ὁ ἀδελφός σου λυπεῖται
ఆహార విషయములో మీరు మీ తోటి విశ్వాసుల విశ్వాసమును హానిపరచితే. ఇక్కడ “మీ” అనే పదము విశ్వాసములో బలవంతులను మరియు “సహోదరుడు” అనే పదము విశ్వాసములో బలహీనులను సూచించుచున్నది.
ὁ ἀδελφός
ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.
οὐκέτι κατὰ ἀγάπην περιπατεῖς
విశ్వాసుల ప్రవర్తన ఒక నడకగా ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు ఇక ప్రేమను ఏమాత్రము చూపించడం లేదు” (చూడండి: రూపకం)
Romans 14:16
μὴ βλασφημείσθω οὖν ὑμῶν τὸ ἀγαθόν
ఒకడు ఏదైనా కీడు అని తలంచినప్పుడు, అది మంచిదని మీరు అనుకొనినను దానిని మీరు చేయకండి
Romans 14:17
οὐ γάρ ἐστιν ἡ Βασιλεία τοῦ Θεοῦ βρῶσις καὶ πόσις, ἀλλὰ δικαιοσύνη, καὶ εἰρήνη, καὶ χαρὰ ἐν Πνεύματι Ἁγίῳ
ఆయనతో మనకు సరియైన సంబంధమును ఇచ్చుటకు మరియు శాంతి సమాధానములను మనకు ఇచ్చుటకు దేవుడు తన రాజ్యమును స్థాపించెనని పౌలు వాదించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము తిని త్రాగువాటిపై పాలనచేయుటకు దేవుడు తన రాజ్యమును స్థాపించలేదు. మనము ఆయనతో సరియైన సంబంధము కలిగియుండాలని మరియు ఆయన మనకు శాంతి సమాధానము ఇచ్చుటకు ఆయన తన రాజ్యమును స్థాపించెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:18
δόκιμος τοῖς ἀνθρώποις
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు ఆయనను అంగీకరించుదురు” లేక “ప్రజలు ఆయనను గౌరవించుదురు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 14:19
τὰ τῆς εἰρήνης διώκωμεν, καὶ τὰ τῆς οἰκοδομῆς τῆς εἰς ἀλλήλους
ఇక్కడ “పరస్పర క్షేమాభివృద్ధి” అనే మాట విశ్వాసములో అభివృద్ధి కావడానికి ఒకరికొకరు సహాయపడాలని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము సమాధానముగా జీవించుటను కోరుకుందాం మరియు విశ్వాసములో బలముగా అభివృద్ధిపొందుటకు ఒకరికొకరు తోడ్పడుదాం” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:20
μὴ ἕνεκεν βρώματος, κατάλυε τὸ ἔργον τοῦ Θεοῦ
ఈ వాక్యము యొక్క సంపూర్ణ అర్థమును మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఒక విధమైన ఆహారమును తినుటకొరకు దేవుడు మీ తోటి సహోదరునికి చేసియున్నదానిని మీరు చెరిపివేయకండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀλλὰ κακὸν τῷ ἀνθρώπῳ τῷ διὰ προσκόμματος ἐσθίοντι
ఇక్కడ “అతను తట్టుకొనునట్లు కలుగుజేయు” ఏదైనా అనే మాట బలహీనుడైన సహోదరుని మనసాక్షికి విరోధముగా ఏదైనా చేయునట్లు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే దానిని తినడం ద్వారా బలహినుడైన సహోదరుడు తన మనసాక్షికి విరోధముగా ఏదైనా చేసిన లేక తన సహోదరుడు తినుట తప్పని తలంచినప్పుడు దానిని తినడం పాపమగును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 14:21
καλὸν τὸ μὴ φαγεῖν κρέα, μηδὲ πιεῖν οἶνον, μηδὲ ἐν ᾧ ὁ ἀδελφός σου προσκόπτει
మీ సహోదరుడు పాపము చేయునట్లు చేసే ఏవిధమైన పనులు మీరు చేయక, మాంసమును తినక లేక ద్రాక్షరసమును త్రాగకయుండుట మేలు
ὁ ἀδελφός
ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.
σου
ఇది విశ్వాసములో బలవంతులను సూచించుచున్నది మరియు “సహోదరుడు” అనే పదము విశ్వాసములో బలహీనులను సూచించుచున్నది.
Romans 14:22
σὺ πίστιν ἣν ἔχεις
ఇది ఆహారము మరియు పానియము గూర్చిన నమ్మకములను సూచించుచున్నది.
σὺ…σεαυτὸν
ఏకవచనము. ఎందుకనగా పౌలు విశ్వాసులను సూచించుచున్నాడు, దీనిని మీరు బహువచనములో అనువాదము చేయవలసియుండవచ్చు. (చూడండి: ‘మీరు’ రూపాలు)
μακάριος ὁ μὴ κρίνων ἑαυτὸν ἐν ᾧ δοκιμάζει
వారు చేయుచున్న దానికి అపరాధ భావము కలగకుండ ఉండువారు ధన్యులు
Romans 14:23
ὁ δὲ διακρινόμενος, ἐὰν φάγῃ, κατακέκριται
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక విధమైన ఆహారమును తినుట మంచిదా లేక చెడ్డదా అని తెలియకుండా దానిని అతడు తినినట్లయితే అతడు తప్పు చేసియున్నాడని దేవుడు చెప్పును” లేక “ఒక విధమైన ఆహారమును గూర్చి నిశ్చయత లేకుండా దానిని తినిన వాడు కలవర మనసాక్షి కలిగియుండును” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ὅτι οὐκ ἐκ πίστεως
“విశ్వాసము ద్వారా కాకుండ” మరి దేనినైనా చేయుటకు దేవుడు మీకు అనుమతించ లేదని అర్థము. దీని సంపూర్ణ అర్థమును మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు తినుట దేవునికి ఇష్టం లేదని అతడు నమ్మిన తరువాత అతడు దానిని తింటున్నాడు కాబట్టి అతడు తప్పుచేయుచున్నాడని దేవుడు చెప్పును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
πᾶν δὲ ὃ οὐκ ἐκ πίστεως, ἁμαρτία ἐστίν
“విశ్వాసము ద్వారా కాకుండ” మరి దేనినైన చేయుటకు దేవుడు మీకు అనుమతించ లేదని అర్థము. దీని సంపూర్ణ అర్థమును మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు చేయాలని దేవుడు కోరుకొనుచున్నాడని మీరు నమ్మకుండా దేనినైన చేసినట్లయితే మీరు పాపము చేయుచున్నారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15
రోమా 15 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
కొన్ని అనువాదములలో పాత నిబంధన భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. యుఎల్టి(ULT) ఈ అధ్యాయములోని 9-11 మరియు 21వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.
చదవడానికి అనుకూలముగా ఉండుటకు కొన్ని అనువాదములలో పద్య భాగమును వేరే వాక్యభాగమునుండి కొంత కుడివైపుకు జరపబడియుండును. పాత నిబంధన వాక్య భాగములోని మాటలను యుఎల్టి(ULT) అనువాదములో ఈ అధ్యాయములోని 12వ వచనములలో ఈ విధంగా చేసియున్నది.
రోమా.15:14 వచనములో, పౌలు మరి వ్యక్తిగతంగా మాట్లాడుటకు ప్రారంభించెను. బోధించుట నుండి వ్యక్తిగత ప్రణాళికలు చెప్పుచున్నాడు.
ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార పదములు
బలవంతుడు/బలహీనుడు
విశ్వాసములో పరిక్వత చెందిన మరియు అపరిపక్వతముగా ఉన్న ప్రజలను సూచించుటకు ఈ మాటలను ఉపయోగించబడియున్నవి. విశ్వాసములో బలవంతులైనవారు విశ్వాసములో బలహీనులైనవారిని బలపరచాలని పౌలు బోధించుచున్నాడు. (చూడండి: విశ్వాసం)
Romans 15:1
క్రీస్తు ఎలా జీవించాడన్న విషయమును జ్ఞాపకము చేయుచు ఇతరులకొరకు విశ్వాసులు జీవించవలెనన్న ఈ భాగమును పౌలు ముగించుచున్నాడు.
δὲ
వాదములో క్రొత్త ఆలోచనలను పరిచయం చేయడానికి మీ భాషలో ఉపయోగించే పదములను ఉపయోగించి దీనిని తర్జుమా చేయండి.
ἡμεῖς, οἱ δυνατοὶ
ఇక్కడ “బలవంతులు” అనే పదము విశ్వాసములో బలవంతులుగా ఉన్న ప్రజలను సూచించుచున్నది. వారికి ఏవిధమైన ఆహారమునైనా భుజించుటకు దేవుడు వారికి అనుమతించియున్నాడని వారు నమ్ముదురు. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో బలవంతులైన మనము” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἡμεῖς
ఇది పౌలును, తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
τῶν ἀδυνάτων
ఇక్కడ “బలహీనులు” అనే పదము విశ్వాసములో బలహీనులైన ప్రజలను సూచించుచున్నది. కొన్ని విధములైన ఆహారములను భుజించుటకు దేవుడు వారిని అనుమతించడని వారు నమ్ముచున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో బలహీనులైనవారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:2
πρὸς οἰκοδομήν
దీని ద్వారా, ఒకరి విశ్వాసమును బలపరచుట అని పౌలుగారి అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అతని విశ్వాసమును బలపరచుటకు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:3
καθὼς γέγραπται
క్రీస్తు (మెస్సియా) దేవునితో మాట్లాడుచున్న లేఖన భాగమును పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములో మెస్సియా దేవునితో ఇట్లనెను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
οἱ ὀνειδισμοὶ τῶν ὀνειδιζόντων σε, ἐπέπεσαν ἐπ’ ἐμέ
దేవున్ని నిందించిన నిందలు క్రీస్తుపైన పడినాయి.
Romans 15:4
ὅσα γὰρ προεγράφη, εἰς τὴν ἡμετέραν διδασκαλίαν ἐγράφη
దీన్ని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “భూత కాలములో, మనకు బోధించుట కొరకని ప్రవక్తలు సమస్తమును లేఖనాలలో వ్రాసియుంచారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἡμετέραν…ἔχωμεν
పౌలు తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను చేర్చుకొని మాట్లాడుచున్నాడు. (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
ἵνα διὰ τῆς ὑπομονῆς καὶ διὰ τῆς παρακλήσεως τῶν Γραφῶν, τὴν ἐλπίδα ἔχωμεν
ఇక్కడ “ప్రోత్సాహము” అనే పదముకు దేవుడు తన వాగ్ధానములను నేరవేర్చునని విశ్వాసులు తెలుసుకొందురని అర్థము. మీ అనువాదములో దీని పూర్తీ అర్థమును స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన వాగ్ధానము చేసియున్న వాటన్నిటిని దేవుడు మనకొరకు నెరవేర్చునని నిరీక్షించునట్లు లేఖనములు మనలను ఈ విధముగా ప్రోత్సహించుచున్నవి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:5
అన్యులైన విశ్వాసులు మరియు యూదులలో విశ్వాసులు క్రీస్తులో ఒకటి చేయబడియున్నారని విశ్వాసులు జ్ఞాపకము చేసుకోవాలని పౌలు ప్రోత్సహించుచున్నాడు.
Θεὸς…δῴη
దేవుడు….మంజూరు చెయునట్లు…. నేను ప్రార్థింతును
τὸ αὐτὸ φρονεῖν ἐν ἀλλήλοις
ఇక్కడ “ఒకే మనస్సు” కలిగియుండడం అంటే ఒకరితో ఒకరు అంగీకరించుట అనే మాటకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరితో ఒకరు ఒప్పందం కలిగియుండుట” లేక “ఐక్యత కలిగియుండుట” (చూడండి: అన్యాపదేశము)
Romans 15:6
ἐν ἑνὶ στόματι, δοξάζητε
దేవుని స్తుతించుటలో ఐక్యత కలిగియుండుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకే నోరు మాట్లాడుచున్న రీతిగా అందరు ఐక్యతకలిగి దేవుని స్తుతించుడి” (చూడండి: అన్యాపదేశము)
Romans 15:7
προσλαμβάνεσθε ἀλλήλους
ఒకరిని ఒకరు అంగీకరించండి”
Romans 15:8
λέγω γὰρ
లో నేను” అనే పదము పౌలును సూచించుచున్నది.
Χριστὸν διάκονον γεγενῆσθαι περιτομῆς
ఇక్కడ “సున్నతి” అనే పదము యూదులను సూచించు పర్యాయ పదమైయున్నది. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు క్రీస్తు యూదులకు సేవకుడాయెను” (చూడండి: అన్యాపదేశము మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
εἰς τὸ βεβαιῶσαι τὰς ἐπαγγελίας
సున్నతి చేయబడిన వారికి క్రీస్తు సేవకుడు అవ్వుటకు రెండు ఉద్దేశ్యములలో ఇది ఒకటి.
τὰς ἐπαγγελίας τῶν πατέρων
ఇక్కడ “తండ్రులు” అనే పదము యూదుల పితరులను సూచించుచున్నది. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదుల పితరులకు దేవుడు చేసిన వాగ్ధానములు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 15:9
τὰ δὲ ἔθνη, ὑπὲρ ἐλέους δοξάσαι τὸν Θεόν
సున్నతి చేయబడిన వారికి క్రీస్తు సేవకుడు అవ్వుటకు ఇది రెండవ కారణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన కనికరము కొరకు అన్యులు దేవునిని మహిమపరచు నిమిత్తము”
καθὼς γέγραπται
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో ఎవరో వ్రాసియున్న ప్రకారము” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τῷ ὀνόματί σου ψαλῶ
ఇక్కడ “మీ నామము” అనే పదము దేవుడిని సూచించు పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీకు స్తుతి కీర్తనలు పాడుదును” (చూడండి: అన్యాపదేశము)
Romans 15:10
καὶ πάλιν λέγει
మరల లేఖనములు చెప్పుచున్నవి
μετὰ τοῦ λαοῦ αὐτοῦ
ఇది దేవుని ప్రజలను సూచించుచున్నది. దీనిని మీ అనువాదములో స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ప్రజలతో” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:11
ἐπαινεσάτωσαν αὐτὸν
దేవుని స్తుతించుడి
Romans 15:12
ῥίζα τοῦ Ἰεσσαί
యెష్షయి దావీదు మహారాజుకు భౌతిక తండ్రిగా ఉండెను. ప్రత్యామ్నాయ అనువాదము: “యెష్షయి వంశస్తుడు” (చూడండి: అన్యాపదేశము)
ἐπ’ αὐτῷ ἔθνη ἐλπιοῦσιν
ఇక్కడ “అతడు” అనే పదము యెష్షయి వంశస్తుడైన మెస్సియాను సూచించుచున్నది. ఆయన తన వాగ్ధానములను నెరవేర్చుటకు యూదులు కానివారు కూడా ఆయనయందు నమ్మికయుంచుదురు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన చేసియున్న వాగ్ధానము కొరకు యూదేతరులు కూడా ఆయనను విశ్వసించగలరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:13
πληρώσαι ὑμᾶς πάσης χαρᾶς καὶ εἰρήνης
పౌలు తన దృష్టికోణమును నొక్కి చెప్పడానికి ఇక్కడ అతిశయోక్తిగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “గొప్ప సంతోషం మరియు సమాధానముతో మిమ్మును నింపును” (చూడండి: అతిశయోక్తి)
Romans 15:14
అన్యులను చేరుటకు దేవుడు అతడిని ఎన్నుకొనియున్నాడని రోమాలోని విశ్వాసులకు పౌలు జ్ఞాపకము చేయుచున్నాడు.
πέπεισμαι…ἀδελφοί μου, καὶ αὐτὸς ἐγὼ περὶ ὑμῶν
వారి ప్రవర్తన ద్వారా రోమాలోని విశ్వాసులు ఒకరిని ఒకరు సన్మానించుకొనుచున్నారని పౌలు నిశ్చయతకలిగియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు మీరే ఒకరి యెడల ఒకరు సంపుర్ణమైన మంచి రీతిలో నడుచుకొనియున్నారని నాకు నేను సంపూర్ణముగా నిశ్చయించుకొనియున్నాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀδελφοί
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
πεπληρωμένοι πάσης γνώσεως
పౌలు తన దృష్టికోణమును నొక్కి చెప్పడానికి ఇక్కడ అతిశయోక్తిగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని వెంబడించుటకు తగిన జ్ఞానముతో నింపబడియున్నారు” (చూడండి: అతిశయోక్తి)
δυνάμενοι καὶ ἀλλήλους νουθετεῖν
ఇక్కడ “హెచ్చరిక” అనే పదముకు బోధించుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒకరికొకరు బోధించ సమర్థులు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:15
τὴν χάριν τὴν δοθεῖσάν μοι ὑπὸ τοῦ Θεοῦ
అతనికి దేవుడు ఇచ్చియున్న కృప ఒక భౌతిక బహుమానమువలె ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. యేసును వెంబడించుటకు నిర్ణయించుకొనక ముందు విశ్వాసులను హింసించినను దేవుడు పౌలును అపోస్తలుడుగా నియమించియున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నాకిచ్చిన కృప” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 15:16
γένηται ἡ προσφορὰ τῶν ἐθνῶν εὐπρόσδεκτος
పౌలు సువార్తను ప్రకటించడం అనేది, అతడు యాజకుడుగా ఉండి, దేవునికి అర్పణ చేసినట్లున్నదని అతడు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకు విధేయులుకావడం ద్వారా అన్యులు దేవుని మెప్పించగలరు” (చూడండి: రూపకం)
Romans 15:18
εἰς ὑπακοὴν ἐθνῶν
అందువలన అన్యులు దేవునికి లోబడియుందురు
λόγῳ καὶ ἔργῳ
దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: ప్రత్యామ్నాయ అనువాదము: “నేను చెప్పిన మరియు చేసియున్న సంగతుల ద్వారా క్రీస్తు నెరవేర్చియున్న సంగతులు ఇవే” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 15:19
ἐν δυνάμει σημείων καὶ τεράτων ἐν δυνάμει Πνεύματος Θεοῦ
ఈ ద్వంద్వ ప్రతికూలమైన వాక్యమును అనుకూల రూపములోనికి తర్జుమా చేయవచ్చు. ఇక్కడ “ఈ సంగతులు” అనే పదము పౌలు ద్వారా క్రీస్తు నేరవేర్చియున్న కార్యములను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అన్యులు లోబడియుండుట కొరకు, నా మాటలు మరియు క్రియల ద్వారా అలాగే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుత కార్యాలు మరియు సూచక క్రియలను క్రీస్తు నా ద్వారా చేసియున్న సంగతులను గూర్చి మాత్రమే చెప్పుదును” (చూడండి: జంట వ్యతిరేకాలు మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
σημείων καὶ τεράτων
ఈ రెండు పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు వేవేరు అద్భుత కార్యములను సూచించుచున్నవి. (చూడండి: జంటపదం)
ὥστε…ἀπὸ Ἰερουσαλὴμ καὶ κύκλῳ μέχρι τοῦ Ἰλλυρικοῦ
ఇది యెరూషలేము పట్టణము మొదలుకొని ఇటలీ సమీపములో ఉన్న ఇల్లూరికు ప్రాంతమువరకు ఉన్నది.
Romans 15:20
οὕτως δὲ φιλοτιμούμενον εὐαγγελίζεσθαι, οὐχ ὅπου ὠνομάσθη Χριστός
క్రీస్తును గూర్చి వినని వారికి మాత్రమే బోధించుటకు పౌలు ఇష్టపడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇందువలన, క్రీస్తును గూర్చి ప్రజలు వినకుండ ఉండే ప్రాంతములలో సువార్తను ప్రకటించాలని ఆశించుచున్నాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἵνα μὴ ἐπ’ ἀλλότριον θεμέλιον οἰκοδομῶ
అతని పరిచర్య పనులు పునాది పైన ఇల్లు కట్టు రీతిలో ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ప్రారంభించియున్న పనిని పూర్తీ చేయుట మాత్రమే కాక. ఒకడు వేసిన పునాది పైన ఇల్లు కట్టు వ్యక్తిగా ఉండుటకు నాకిష్టం లేదు” (చూడండి: రూపకం)
Romans 15:21
καθὼς γέγραπται
ఇక్కడ లేఖనాలలో యెషయా వ్రాసియున్న వాక్యమును పౌలు సూచించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు మరియు దాని అర్థమును స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “జరుగుచున్న సంగతులు యెషయా లేఖనములో వ్రాసినట్లు ఉన్నవి” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
οἷς οὐκ ἀνηγγέλη περὶ αὐτοῦ
అది జీవించు వస్తువువలె ఉండి మరియు అది తనంతట తానే కదులుతున్నట్లు పౌలు ఇక్కడ “శుభములు” లేక క్రీస్తు సందేశమును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన గూర్చి ఎవరు వారికి చెప్పియుండలేదు” (చూడండి: మానవీకరణ)
Romans 15:22
రోమాలోని విశ్వాసులతో వారిని అతడు కలిసికొని తన వ్యక్తిగత ప్రణాళికను పంచుకొనుచున్నాడు మరియు విశ్వాసులు ఆ విషయమై ప్రార్థించాలని పౌలు చెప్పుచున్నాడు.
καὶ ἐνεκοπτόμην
దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు నన్ను కూడా ఆటంకపరచారు” లేక “జనులు నన్ను కూడా ఆటంకపరచారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 15:23
μηκέτι τόπον ἔχων ἐν τοῖς κλίμασι τούτοις
ఈ ప్రాంతములలో క్రీస్తును గూర్చి వినని ప్రజలు ఇంకెక్కడా లేరని పౌలు స్పష్టముగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ ప్రాంతములలో ఇంకెక్కడా క్రీస్తును గూర్చి వినని ప్రజలు లేరు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:24
τὴν Σπανίαν
ఇది పౌలు దర్శించాలని కోరుకున్న ప్రాంతము రోమాకు పశ్చిమ దిక్కున ఉన్న రోమాకు చెందిన ఒక ప్రాంతమైయున్నది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
διαπορευόμενος
రోమా ద్వారా నేను వెళ్ళుచుండగా లేక “నా మార్గములో”
καὶ ὑφ’ ὑμῶν προπεμφθῆναι ἐκεῖ
తన స్పెయిను దేశ ప్రయాణము కొరకు కొంత ఆర్థిక సహాయము చేయాలని పౌలు రోమా విశ్వాసులను కోరుకొనుచున్నాడని ఇక్కడ పౌలు స్పష్టము చేయుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నా ప్రయాణములో మీరు సహాయము చేయుదురని” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
ἐὰν ὑμῶν…ἐμπλησθῶ
మీతో కలిసి కొంత సమయము సంతోషముగా గడిపి లేక “మిమ్ములను దర్శించి సంతోషించి”
Romans 15:26
εὐδόκησαν…Μακεδονία καὶ Ἀχαΐα
ఇక్కడ “మాసిదోనియ” మరియు “అకయ” అనే పదములు ఆ ప్రాంతములో నివసిస్తున్న ప్రజలకు ఉపలక్షణాలంకారములైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు సంతోషించిరి” (చూడండి: ఉపలక్షణము)
Romans 15:27
εὐδόκησαν γάρ
మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు దానిని చేయుటకు ఆనందించారు
γάρ…ὀφειλέται εἰσὶν αὐτῶν
వాస్తవానికి మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు యెరూషలేము విశ్వాసులకు ఋణపడియున్నారు
εἰ…τοῖς πνευματικοῖς αὐτῶν ἐκοινώνησαν τὰ ἔθνη, ὀφείλουσιν καὶ…λειτουργῆσαι αὐτοῖς
యెరూషలేము విశ్వాసులతో అన్యులు ఆత్మీయ సంగతులను పంచుకొనియున్నందున, యెరూషలేము విశ్వాసులకు అన్యులు ఋణపడియున్నారు
Romans 15:28
σφραγισάμενος αὐτοῖς τὸν καρπὸν τοῦτον
పౌలు యెరూషలేముకు కొనిపోవుచున్న ధనమును గూర్చి చెప్పుచు అది వారికొరకు పోగుచేయబడిన ఫలముగా ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు వారికి దీనిని క్షేమముగా చేర్చియున్నాను” (చూడండి: రూపకం)
Romans 15:29
οἶδα δὲ ὅτι ἐρχόμενος πρὸς ὑμᾶς, ἐν πληρώματι εὐλογίας Χριστοῦ, ἐλεύσομαι
పౌలును మరియు రోమా విశ్వాసులను దేవుడు ఆశీర్వదించునని ఈ మాటకు అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మరియు నేను మిమ్మును దర్శించినప్పుడు, క్రీస్తు మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించును” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:30
δὲ
(రోమా.15:29) వచనములో మంచి కార్యములను గూర్చి చెప్పుటను పౌలు ఆపివేసియున్నాడని మరియు అతడు ఎదుర్కొన్న అపాయములను గూర్చి చెప్పుటకు ప్రారంభించెను అని చెప్పుటకు మీ భాషలో ఏదైనా విధానముంటే దానిని ఇక్కడ ఉపయోగించండి.
παρακαλῶ…ὑμᾶς
నేను మిమ్మును ప్రోత్సహించుచున్నాను
ἀδελφοί
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
συναγωνίσασθαί
మీరు కష్టపడి పనిచేయుచున్నారు లేక “మీ పోరాటము”
Romans 15:31
ῥυσθῶ ἀπὸ τῶν ἀπειθούντων
దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అవిధేయులైన వారినుండి దేవుడు నన్ను రక్షించునట్లు” లేక “అవిధేయులైన వారు నాకు హాని తలపెట్టకుండ దేవుడు వారిని దూరపరచునట్లు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
καὶ ἡ διακονία μου ἡ εἰς Ἰερουσαλὴμ εὐπρόσδεκτος τοῖς ἁγίοις γένηται
యెరూషలేములోని విశ్వాసులు మాసిదోనియా మరియు అకయ ప్రాంతములోని విశ్వాసులు పంపిన ధనమును సంతోషముగా అంగీకరించుదురని పౌలు తన కోరికను వ్యక్తపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను వారియొద్దకు తెచ్చు ధనమును యెరూషలేములోని విశ్వాసులు సంతోషముగా స్వీకరించునట్లు ప్రార్థించుడి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 15:33
ὁ…Θεὸς τῆς εἰρήνης μετὰ
“దేవుని సమాధానము” అంటే విశ్వాసులకు అంతరంగ సమాధానమును కలుగుజేయు దేవుడు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన అందరికి సమాధానము కలిగియునట్లు చేయు దేవునికి నేను ప్రార్థించుచున్నాను” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 16
రోమా 16 సాధారణ అంశాలు
నిర్మాణము మరియు క్రమపరచుట
ఈ అధ్యాయములో, పౌలు రోమాలోని క్రైస్తవులకు వ్యక్తిగత శుభములను తెలియజేయుచున్నాడు. ఇటువంటి వ్యక్తిగత శుభములతో పత్రికను ముగించడం ప్రాచీన తూర్పు ప్రాంతము వారికి ఆనవాయితీ.
ఈ అధ్యాయములో ఎదురైయ్యే ఇతర అనువాద ఇబ్బందులు
ఈ అధ్యాయము యొక్క వ్యక్తిగత స్వభావమునుబట్టి, ఎక్కువ సందర్భము తెలియకయున్నది. ఇది తర్జుమా చేయుటకు ఇబ్బందులు కలుగజేయును.(చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 16:1
రోమాలోని అనేక విశ్వాసులకు పౌలు పేరు పేరు చెప్పి శుభములు చెప్పుచున్నాడు.
συνίστημι δὲ ὑμῖν Φοίβην
మీరు ఫీబేను గౌరవించాలని కోరుచున్నాను
Φοίβην
ఇది ఒక స్త్రీ పేరైయున్నది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
τὴν ἀδελφὴν ἡμῶν
“మన” అనే పదము పౌలును మరియు విశ్వాసులందరిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తులో మన సహోదరి” (చూడండి: అంతర్గ్రాహ్యం, ప్రత్యేకం “మనం”)
Κενχρεαῖς
గ్రీసు దేశములో ఇది ఒక ఓడ రేవు పట్టణముగా ఉన్నది. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
Romans 16:2
αὐτὴν προσδέξησθε ἐν Κυρίῳ
ఫీబేను తోటి విశ్వాసిగా భావించి ఆహ్వానించాలని పౌలు రోమా విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనమందరమూ ప్రభువుకు చెందినవారము గనుక ఆమెను ఆహ్వానించండి” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
ἀξίως τῶν ἁγίων
విశ్వాసులు వేరే విశ్వాసులను ఆహ్వానించు రీతిగా
παραστῆτε αὐτῇ
ఫీబేకు అవసరమైన వాటిని రోమా విశ్వాసులు ఇవ్వాలని పౌలు వారిని ప్రోత్సహించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆమెకు అవసరమైనవి ఇచ్చి ఆమెకు సహాయము చేయండి” (చూడండి: సభ్యోక్తి)
προστάτις πολλῶν ἐγενήθη καὶ ἐμοῦ αὐτοῦ
అనేక మందికి సహాయము చేసెను మరియు ఆమె నాకు కూడా సహాయము చేసెను
Romans 16:3
Πρίσκαν καὶ Ἀκύλαν
ప్రిస్కిల్ల అకుల భార్యయైయుండెను. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τοὺς συνεργούς μου ἐν Χριστῷ Ἰησοῦ
పౌలు “జతపనివారు” అనబడువారు కూడా యేసును గూర్చి ఇతరులకు చెప్పుతారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలకు యేసు క్రీస్తును గూర్చి చెప్పుటకు నాతో పాటు పనిచేయువారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 16:5
καὶ τὴν κατ’ οἶκον αὐτῶν ἐκκλησίαν
ఆరాధన కొరకు వారి గృహములో కూడుకొను విశ్వాసులకు శుభమని చెప్పుడి
Ἐπαίνετον
ఇది పురుషుని పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
ἀπαρχὴ τῆς Ἀσίας εἰς Χριστόν
అతడు కోతకోసిన ఫలమువలె ఉన్నాడని పౌలు ఎపైనైటును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆసియాలో యేసును నమ్మిన మొదటి వ్యక్తి” (చూడండి: రూపకం)
Romans 16:6
Μαρίαν
ఇది ఒక స్త్రీ పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Romans 16:7
Ἀνδρόνικον
ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Ἰουνίαν
ఇది 1) యూనీయ, ఒక స్త్రీ పేరు లేక, చాలా అరుదుగా 2) యూనీయస్, ఒక పురుషుని పేరు ఉండవచ్చు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
οἵτινές εἰσιν ἐπίσημοι ἐν τοῖς ἀποστόλοις
దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అపొస్తలులకు వారు బాగా తెలుసు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 16:8
Ἀμπλιᾶτον
ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τὸν ἀγαπητόν μου ἐν Κυρίῳ
నా ప్రియ స్నేహితుడు మరియు తోటి విశ్వాసి
Romans 16:9
Οὐρβανὸν…Στάχυν
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Romans 16:10
Ἀπελλῆν…Ἀριστοβούλου
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τὸν δόκιμον ἐν Χριστῷ
“నిరూపణ” అనే పదము పరిక్షించబడి మరియు నిజాయితీపరుడని రుజువుచేయబడిన ఒక వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తు నిరూపించిన వాడిని” (చూడండి: @)
Romans 16:11
Ἡρῳδίωνα…Ναρκίσσου
ప్రత్యామ్నాయ అనువాదము: “ (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
τοὺς ὄντας ἐν Κυρίῳ
యేసునందు విశ్వసించు వారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసులైనవారు” లేక “ప్రభువుకు చెందిన వారు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 16:12
Τρύφαιναν…Τρυφῶσαν…Περσίδα
ఇవి స్త్రీల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
Romans 16:13
Ῥοῦφον
ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
τὸν ἐκλεκτὸν ἐν Κυρίῳ
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువు ఎన్నుకున్న వారు” (చూడండి: కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
τὴν μητέρα αὐτοῦ καὶ ἐμοῦ
తన స్వంత తల్లివలె పౌలు రూఫు తల్లి గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నా తల్లి అని భావించే అతని తల్లి” (చూడండి: రూపకం)
Romans 16:14
Ἀσύγκριτον, Φλέγοντα, Ἑρμῆν, Πατροβᾶν, Ἑρμᾶν
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
ἀδελφούς
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
Romans 16:15
Φιλόλογον…Νηρέα…Ὀλυμπᾶν
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
Ἰουλίαν
స్త్రీ యొక్క పేరు. యూలియా బహుశః ప్లెగోను భార్యయైయుండవచ్చు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి మరియు తెలియనివాటిని అనువదించడం)
Romans 16:16
φιλήματι ἁγίῳ
తోటి విశ్వాసులకు ఆత్మీయ పలకరింపు
ἀσπάζονται ὑμᾶς αἱ ἐκκλησίαι πᾶσαι τοῦ Χριστοῦ
ఇక్కడ పౌలు క్రీస్తు సంఘములను గూర్చి సహజమైన రీతిలో మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ ప్రాంతములో ఉన్న అన్ని సంఘముల విశ్వాసులు తమ శుభములను మీకు తెలియపరచుచున్నారు” (చూడండి: అతిశయోక్తి)
Romans 16:17
ఐక్యత మరియు దేవుని కొరకు జీవించడం గురించి పౌలు ఒక చివరి హెచ్చరికను ఇచ్చుచున్నాడు.
ἀδελφοί
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.
σκοπεῖν
కనిపెట్టియుండుట
τὰς διχοστασίας καὶ τὰ σκάνδαλα…ποιοῦντας
వాదించడం ద్వారా ఇతరులు యేసును నమ్మకుండునట్లు చేయువారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసులు ఒకరితో ఒకరు వాదించులాగున మరియు దేవుని యందు విశ్వాసం కలిగియుండకుండ చేయువాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
παρὰ τὴν διδαχὴν ἣν ὑμεῖς ἐμάθετε
మీరు ఇదివరకే నేర్చుకొనియున్న సత్యముకు అంగీకరించని సంగతులను వారు బోధించెదరు
ἐκκλίνετε ἀπ’ αὐτῶν
దూరంగా తొలగిపొండి అనే మాట “వినుటకు నిరాకరించుడి” అని అర్థమిచ్చు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారి మాటలను వినకండి” (చూడండి: రూపకం)
Romans 16:18
ἀλλὰ τῇ ἑαυτῶν κοιλίᾳ
“వారి సేవ” అనే మాట ఇంతకుముందు మాటలోనే అర్థమైయున్నది. దీనిని వేరే వాక్యముగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దానికి బదులుగా, వారు తమ కడుపులను సేవింతురు” (చూడండి: శబ్దలోపం)
ἀλλὰ τῇ ἑαυτῶν κοιλίᾳ
ఇక్కడ “కడుపు” అనే పదము భౌతిక కోరికలను సూచించు పర్యాయ పదమైయున్నది. వారి కడుపులను సేవించుచున్నారు అంటే వారి కోరికలను తీర్చుకొనుచున్నారని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే వారు తమ స్వార్థపు కోరికలను తీర్చుకొనుటకు ఆశించుతారు” (చూడండి: అన్యాపదేశము మరియు రూపకం)
καὶ διὰ τῆς χρηστολογίας καὶ εὐλογίας
“వినసొంపైన” మరియు “ముఖస్తుతి” అనే మాటలు ఒకే అర్థము కలిగియున్నాయి. ఈ ప్రజలు విశ్వాసులను ఎలా మోసము చేయుచున్నారని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మంచివి మరియు సత్యముగా అనిపించు సంగతులను చెప్పుచు” (చూడండి: జంటపదం)
ἐξαπατῶσι τὰς καρδίας τῶν ἀκάκων
ఇక్కడ “హృదయములు” అనే పదము ఒక మనుష్యుని మనస్సు లేక అంతరంగ స్వభావమును సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు అమాయకులైన విశ్వాసులను మోసము చేయుదురు” (చూడండి: అన్యాపదేశము)
ἀκάκων
ఇది సాధారణముగా ఉన్నవారిని, అనుభవము లేనివారిని మరియు అమాయకులైనవారిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారిని అమాయకముగా నమ్మువారు” లేక “ఈ శిక్షకులు వారిని మోసము చేయుచున్నారని వారికి తెలియదు” (చూడండి: @)
Romans 16:19
ἡ γὰρ ὑμῶν ὑπακοὴ, εἰς πάντας ἀφίκετο
ఇక్కడ పౌలు రోమా విశ్వాసుల విధేయతను గూర్చి మాట్లడుచు అది ప్రజలయొద్దకు వెళ్ళే ఒక వ్యక్తిగా ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు యేసుకు విధేయులైయున్న సంగతి అందరు వినియున్నారు గనుక” (చూడండి: మానవీకరణ)
ἀκεραίους…εἰς τὸ κακόν
దుష్ట క్రియలలో పాలుపొందకుండ ఉండడం
Romans 16:20
ὁ δὲ Θεὸς τῆς εἰρήνης συντρίψει τὸν Σατανᾶν ὑπὸ τοὺς πόδας ὑμῶν ἐν τάχει
“మీ కాళ్ళ క్రింద త్రొక్కు” అనే మాట శత్రువుని మీద సంపూర్ణ విజయమును సూచించుచున్నది. ఇక్కడ సాతానుపైన విజయమును గూర్చి పౌలు చెప్పుచ్చు అది రోమా విశ్వాసులు తమ శత్రువును తమ కాళ్ళ క్రిందవేసి నలుపుచున్నట్లున్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “త్వరలో దేవుడు మీకు శాంతిని మరియు సాతానుపై సంపూర్ణ విజయమునిచ్చును” (చూడండి: రూపకం)
Romans 16:21
పౌలు తనతో ఉన్న విశ్వాసుల తరఫున శుభములు చెప్పుచున్నాడు.
Λούκιος, καὶ Ἰάσων, καὶ Σωσίπατρος
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
Romans 16:22
ἐγὼ, Τέρτιος, ὁ γράψας τὴν ἐπιστολὴν
పౌలు చెప్పినదంతయు తెర్తియు వ్రాసెను. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ἀσπάζομαι ὑμᾶς…ἐν Κυρίῳ
తోటి విశ్వాసివలె నీకు శుభములు చెప్పుచున్నాను
Romans 16:23
Γάϊος…Ἔραστος…Κούαρτος
ఇవి పురుషుల పేర్లు. (చూడండి: పేర్లను ఏ విధంగా అనువదించాలి)
ὁ ξένος
పౌలు మరియు అతని తోటి విశ్వాసుల ఆరాధనకు కూడుకొను ఇల్లుగలవాడగు గాయిని ఇది సూచించుచున్నది.
ὁ οἰκονόμος
ఆ గుంపువారి ధనమును చూచుకొనువాడు ఇతడే.
Romans 16:25
పౌలు ఆశీర్వాద ప్రార్థనతో ముగించుచున్నాడు.
δὲ
ఇక్కడ “ఇప్పుడు” అనే పదము పత్రిక యొక ముగింపుకు గురుతుగా ఉన్నది. మీ భాషలో దీనిని చేయుటకు ఏదైనా పద్ధతి ఉంటే, దానిని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు.
ὑμᾶς στηρίξαι
బలమైన విశ్వాసము కలిగినవాడు పడుటకు బదులు నిలబడియున్నాడని పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ విశ్వాసమును బలపరచుటకొరకు” (చూడండి: రూపకం)
κατὰ τὸ εὐαγγέλιόν μου, καὶ τὸ κήρυγμα Ἰησοῦ Χριστοῦ
యేసు క్రీస్తును గూర్చి నేను బోధించిన శుభవార్త ద్వారా
κατὰ ἀποκάλυψιν μυστηρίου χρόνοις αἰωνίοις σεσιγημένου
పూర్వము దాచబడియున్న సత్యములను దేవుడు విశ్వాసులకు తెలియపరచియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. ఈ సత్యములు రహస్యములైయున్నలాగున అతను మాట్లాడుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన ఎంతో కాలము రహస్యముగా ఉంచియున్న సంగతులను దేవుడు విశ్వాసులైన మనకు తెలియపరచియున్నాడు గనుక” (చూడండి: రూపకం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
Romans 16:26
φανερωθέντος δὲ νῦν διά τε Γραφῶν προφητικῶν, κατ’ ἐπιταγὴν τοῦ αἰωνίου Θεοῦ…εἰς πάντα τὰ ἔθνη γνωρισθέντος
“ప్రత్యక్షపరచెను” మరియు “తెలియపరచెను” అనే క్రియాపదాలు ఒకే అర్థమును కలిగియున్నాయి. పౌలు తన ఆలోచనను నొక్కి చెప్పడానికి ఈ రెండిటిని ఉపయోగించియున్నాడు. మీరు వీటిని కలిపిచెప్పవచ్చు మరియు దీనిని క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ప్రవచనాత్మక లేఖనముల ద్వారా నిత్యుడగు దేవుడు సమస్త దేశములకు తెలియపరచియున్నాడు” (చూడండి: జంటపదం మరియు కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)
εἰς ὑπακοὴν πίστεως
ఇక్కడ “విధేయత” మరియు “విశ్వాసము” నైరూప్య నామవాచకములైయున్నవి. మీరు “లోబడుట” మరియు “నమ్మకము” అనే క్రియాపదాలను ఉపయోగించవచ్చు. ఎవరు లోబడియుందురు మరియు నమ్మకము కలిగియుందురు అని మీరు స్పష్టము చేయవలసిన అవసరము ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందువలన సమస్త దేశములు దేవునికి లోబడియుందురు ఎందుకనగా వారు ఆయనయందు నమ్మికయుంచియున్నారు” (చూడండి: భావనామాలు మరియు ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)
Romans 16:27
μόνῳ σοφῷ Θεῷ…ᾧ ἡ δόξα εἰς τοὺς αἰῶνας. ἀμήν!
ఇక్కడ “యేసు క్రీస్తు” ద్వారా అనే మాట యేసు చేసిన క్రియలను సూచించుచున్నది. “మహిమ” ఇవ్వడం అంటే దేవుని స్తుతించడం అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు మనకొరకు చేసియున్న వాటికొరకు, జ్ఞానియైయున్న మరియు దేవుడైయున్న ఆ ఒక్కడినే మనము నిత్యమూ స్తుతించెదము. ఆమెన్” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)