తెలుగు (Telugu): translationNotes

Updated ? hours ago # views See on DCS Draft Material

2 John

2 John front

2 యోహాను పత్రిక పరిచయం

భాగం 1: సాధారణ పరిచయం

2 యోహాను పత్రిక సంక్షిప్త వర్ణన

  1. పత్రిక ప్రారంభం (1:1-3) 
  2.  ఒకరినొకరు ప్రేమించుకునే విధంగా ప్రోత్సాహం, ఆజ్ఞ (1:4-6) 
  3. తప్పుడు బోధకులను గురించి హెచ్చరిక (1:7–11)
  4. పత్రిక ముగింపు (1:12-13)

2 యోహాను పుస్తకాన్ని ఎవరు వ్రాశారు?

ఈ పత్రిక రచయిత తనను తాను “పెద్దను” అని మాత్రమే గుర్తిస్తున్నాడు. అయితే 2 యోహాను  పత్రికలోని భావం, యోహాను సువార్తలోని భావంతో సమానంగా ఉంటుంది. అపొస్తలుడైన యోహాను ఈ పత్రిక  రాశాడు, అతడు తన జీవితం చివరి దశలో ఆ విధంగా రాసి ఉంటాడని ఇది సూచిస్తుంది.

2 యోహాను పత్రిక ఎవరికి వ్రాయడం జరిగింది?

రచయిత ఈ పత్రికలో “ఎన్నికైన అమ్మగారు”, “ఆమె పిల్లలు” అని సంబోధిస్తాడు (1:1). ఇది ఒక విశేషమైన స్త్రీని, ఆమె పిల్లలను గూర్చి సూచించినప్పటికీ, స్త్రీ అని, పిల్లలు అనే వివరణ అనుకొనదగినది కాదు.చాలామటుకు ఇది ఒక నిర్దిష్టమైన సమాజాన్ని, దాని సభ్యులను సూచించడానికి ఉపయోగించిన ఒక అలంకారప్రాయమైన విధానం. 13 వ వచనంలో యోహాను తనతో ఉన్న సంఘాన్ని“మీరు ఎన్నుకున్న సోదరిపిల్లలు” అని సూచించే విధానం, ఈ వ్యాఖ్యానానికి మద్దతు ఇస్తుంది. గ్రీకులో “సంఘం” అనే పదం స్త్రీ నామవాచకం, కాబట్టి ఇది సులభంగా అర్థమయ్యే రూపకం అవుతుంది. (చూడండి: రూపకం)

2 యోహాను పత్రిక దేని గురించి చెపుతుంది?

ఈ పత్రికను యోహాను విశ్వాసుల సమాజానికి ప్రత్యేకంగా రాస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పత్రిక వారికి రాయడంలో యోహాను ఉద్దేశం  తప్పుడు బోధకులును గురించి తన పాఠకులను హెచ్చరించడం. విశ్వాసులు తప్పుడు బోధకులకు సహాయం చేయడమూ, లేదా డబ్బు ఇవ్వడం యోహాను కోరుకోలేదు. సాధారణంగా ఈ సందేశాన్ని విశ్వాసులందరికీ అందజేయాలని ఆయన భావించారు.

ఈ పుస్తకం శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక “2యోహాను ” లేదా “రెండవ యోహాను ” అని పిలవవచ్చు. లేదా వారు "యోహాను రెండవ ఉత్తరం" లేదా "యోహాను రాసిన రెండవ పత్రిక" వంటి వేరే శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి:పేర్లను ఏ విధంగా అనువదించాలి)

భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

ఆతిథ్యం అంటే ఏమిటి?

ప్రాచీన తూర్పు ప్రాంతాల చుట్టుపక్కల ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండటమూ,అవసరమైతే వారికి సహాయం అందించడం చాలా ముఖ్యం.విశ్వాసులు అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలని యోహాను కోరుకున్నాడు. అయినప్పటికీ విశ్వాసులు తప్పుడు బోధకులకు ఆతిథ్యం ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు.

యోహాను ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది?

యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు తరువాత తెలిసి ఉండవచ్చు, జ్ఞానవాదులు వలె. వీరు భౌతిక ప్రపంచం చెడు అని నమ్మారు. భౌతిక శరీరాన్ని చెడుగా ఎంచడం వలన, దేవుడు మానవుడు కాగలడని వారు అనుకోలేదు. అందువల్ల, యేసు దైవమని వారు విశ్వసించారు, కాని ఆయనను మానవుడని ఖండించారు. (చూడండి: దుష్టత్వం, దుర్మార్గుడు, భ్రష్టమైన)

## భాగం 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

2 యోహాను పుస్తకంనందు ప్రధానమైన వచన సమస్యలు ఏమిటి?

[1:12]in (../01/12.md), బైబిలు నందు చాలా ఆధునిక సంస్కరణలు “మా ఆనందం” అని చదవడం ఉంది."మీ ఆనందం" అని చెప్పే మరొక సాంప్రదాయ పఠనం ఉంది. మీ ప్రాంతంలో ఇప్పటికేబైబిలు సంస్కరణ ఉంటే,మీ అనువాదంలో ఆ సంస్కరణ పఠనాన్ని ఉపయోగించడాన్ని మీరు పరిగణించాలి. కాకపోతే, మీరు చాలా మంది బైబిలు పండితులు ప్రామాణికమైనవిగా భావించే పఠనాన్ని అనుసరించి "మా ఆనందం" అని చెప్పాలనుకోవచ్చు. ఈ సందర్భంలో,"మా" లో యోహాను ఇంకా లేఖ గ్రహీతలు ఇద్దరూ ఉంటారు. (చూడండి:మూల గ్రంథం వైవిధ్యాలు)

2 John 1

2 John 1:1

ὁ πρεσβύτερος

ఈ సంస్కృతిలో, పత్రిక రచయితలు తమ పేర్లను ముందుగా ఇస్తారు, మూడవ వ్యక్తిలో తమను తాము సూచిస్తారు. అది మీ భాషలో గందరగోళంగా ఉంటే, మీరు ఇక్కడ మొదటి వ్యక్తిని ఉపయోగించవచ్చు. లేదా మీ భాషలో ఒక లేఖ యొక్క రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంటే మరియు అది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, పెద్ద, ఈ లేఖ వ్రాస్తున్నాను” (See:ఉత్తమ, మధ్యమ, ప్రథమ)

ὁ πρεσβύτερος

పెద్దవాడు  అంటే యేసు అపొస్తలుడు, శిష్యుడైన యోహాను అని అర్ధం. అతను తన వృద్ధాప్యం కారణంగా, లేదా అతను సంఘంలో నాయకుడవ్వడం వలన, లేదా తనను తాను సంఘంలోనూ, వయసులోనూ “పెద్దవాడు”నని పేర్కొన్నాడు. మీకు వృద్ధుడైన, గౌరవనీయ నాయకుడికి ఒక పదం ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “యోహాను అను నేను ఈ పత్రిక రాస్తున్నాను” లేదా ప్రత్యామ్నాయ అనువాదం: “పెద్దనైన యోహాను అను నేను, ఈ పత్రిక రాస్తున్నాను” (చూడండి:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς

ఈ సంస్కృతిలో, పత్రిక రచయితలు మొదట తమ పేర్లను ఇస్తారు, మూడవ వ్యక్తిలో తమను తాము సూచిస్తారు. అది మీ భాషలో గందరగోళంగా ఉంటే, మీరు ఇక్కడ మొదటి వ్యక్తిని ఉపయోగించవచ్చు. లేదా మీ భాషకు ఒక పత్రిక రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంటే, అది కూడా మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయఅనువాదం: “పెద్దనైన నేను ఈ పత్రిక రాస్తున్నాను” (చూడండి:ఉత్తమ, మధ్యమ, ప్రథమ)

ἐκλεκτῇ κυρίᾳ

* ఎన్నుకున్న అమ్మగారికి*    అనే అర్ధానికి రెండు అవకాశాలు ఉన్నాయి. (1) యోహాను  ఒక సంఘానికి  వ్రాస్తున్నాడు. విశ్వాసుల సమూహాన్ని "అమ్మ"అని అలంకారికంగా వర్ణించాడు. (గ్రీకులో, “చర్చి” అనే పదం స్త్రీలింగంగా చెప్పడం జరిగింది.) (2) యోహాను ఒక ప్రత్యేకమైన స్త్రీకి వ్రాస్తూ, ఆమెను “అమ్మ” అని గౌరవంగా ప్రస్తావిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎంచుకున్న సంఘానికి” (చూడండి:

రూపకం)

ἐκλεκτῇ κυρίᾳ

ఈ సందర్భంలో, ఎంచుకున్న  అనే పదం రక్షణ పొందటానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది.ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు రక్షించిన సంఘానికి” (చూడండి: జాతీయం (నుడికారం))

καὶ τοῖς τέκνοις αὐτῆς

ఆమె పిల్లలు అనే అర్ధానికి మూడు అవకాశాలు ఉన్నాయి. (1)  ఎన్నికైన అమ్మ ఒక సంఘాన్నిఅలంకారికంగా సూచించినట్లే, ఇక్కడ ఆమె పిల్లలు అంటే, ఆ సంఘంలో భాగమైన వ్యక్తులను అలంకారికంగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆ గుంపులోని విశ్వాసులకు” (2) ఈ పత్రిక స్త్రీకి సంబోధించినట్లయితే, అది ఆమె జీవసంబంధమైన పిల్లలను సూచిస్తుంది, లేదా (3) ఇది స్త్రీ విశ్వాసానికి దారితీసిన వ్యక్తులకు అలంకారికంగా సూచించవచ్చు. ఆమె ఆధ్యాత్మిక పిల్లలు. (చూడండి:రూపకం)

ἀγαπῶ ἐν ἀληθείᾳ

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు సత్యం అనే నైరూప్య నామవాచకం వెనుక ఉన్న ఆలోచనను సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తీకరించవచ్చు. ఇది రెండు విషయాలలోను ఒకటి అని అర్ధం.(1) సత్యం అనే పదం యోహానును ఎలా ప్రేమిస్తుందో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నిజమైన ప్రేమ” (2)  సత్యం అనే పదం యోహాను ప్రేమకు కారణాన్ని అందిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రేమ ఎందుకంటే మన ఇద్దరికీ సత్యం తెలుసు” (చూడండి:భావనామాలు)

πάντες οἱ ἐγνωκότες τὴν ἀλήθειαν

యేసు క్రీస్తు గురించి నిజమైన సందేశాన్ని తెలుసుకొనిన,అంగీకరించిన విశ్వాసులను సూచించడానికి యోహాను సత్యాన్ని ఎరిగిన వారందరూ అనే పదబంధాన్ని ఉపయోగిస్తాడు. యోహాను ఎక్కువగా  అన్నీ అనే పదాన్ని సాధారణీకరణగా ఉపయోగిస్తున్నాడు, అంటే అతనితో ఉన్నా, ఆ సంఘంలోని వ్యక్తులందరికీ తెలిసిన విశ్వాసులందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “నాతో ఉన్నట్టి, సత్యాన్ని తెలుసుకొని అంగీకరించే వారందరూ” (చూడండి: అతిశయోక్తి)

2 John 1:2

τὴν ἀλήθειαν

క్రైస్తవులు విశ్వసించే నిజమైన సందేశాన్ని సూచించడానికి యోహాను  సత్యం అనే నైరూప్య నామవాచకాన్ని ఉపయోగిస్తాడు. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఈ పదం వెనుక ఉన్న ఆలోచనను సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తీకరించవచ్చు.ప్రత్యామ్నాయ అనువాదం: “నిజమైన సందేశం” (చూడండి:భావనామాలు)

ἡμῖν…ἡμῶν

మీ భాష ఈ వ్యత్యాసాన్ని సూచిస్తే, మాకు అనే సర్వనామం ఇక్కడ, ఇంకా ఉపదేశంలో కలుపుకొని ఉంటుంది, ఎందుకంటే యోహాను తనను, పత్రిక గ్రహీతలను సూచించడానికి ఎల్లప్పుడూ ఉపయోగిస్తాడు. “మేము” అనే సర్వనామం కూడా మీ అనువాదంలో ఉపయోగించాలని ఎంచుకుంటే “మా” అనేసర్వనామం వలె ఉంటుంది. (చూడండి:ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)

εἰς τὸν αἰῶνα

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎప్పటికైనా” (చూడండి:https://git.door43.org/Door43-Catalog/eteta_man/src/branch/master/figs-idiom.md)

2 John 1:3

ἔσται μεθ’ ἡμῶν χάρις, ἔλεος, εἰρήνη, παρὰ Θεοῦ Πατρός καὶ παρὰ Ἰησοῦ Χριστοῦ

మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, మీరు  కృప, దయశాంతి    అనే నైరూప్య నామవాచకాల వెనుక ఉన్న ఆలోచనను, శబ్ద పదబంధాలతో తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు అంశంగా మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తండ్రియైన దేవుడూ, యేసుక్రీస్తూ మన పట్ల దయ చూపిస్తారు, మన యెడల కృప చూపిస్తారు, ఇంకా శాంతియుతంగా ఉండటానికి వీలు కల్పిస్తారు” (చూడండి:భావనామాలు)

ἔσται μεθ’ ἡμῶν χάρις, ἔλεος, εἰρήνη

ఈ సంస్కృతిలో, లేఖను రాసేవారు సాధారణంగా పత్రికకు సంబంధించి ప్రధాన విషయాన్ని ప్రవేశపెట్టే ముందు పొందుకొనే వ్యక్తికి శుభాకాంక్షలు లేదా ఆశీర్వాదం ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఆశీర్వాదానికి బదులుగా, యోహాను ఒక ప్రకటన చేశాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే చేస్తాడనే  అతని విశ్వాసాన్ని ఇది వ్యక్తపరుస్తుంది. మీ అనువాదంలో  కూడా ఇట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుందని నిర్ధారించుకోండి.

Πατρός…Υἱοῦ

తండ్రి, కుమారుడు అనేది దేవునికీ, యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు. వాటిని ఖచ్చితంగా, స్థిరంగా అనువదించాలని నిర్ధారించుకోండి. (చూడండి:తండ్రి, కుమారుడు ను అనువదించడం)

ἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు నైరూప్య నామవాచకాల వెనుక ఉన్న ఆలోచనలను నిజం, ప్రేమ విశేషణం లేదా క్రియలతో వ్యక్తీకరించవచ్చు. ఈ నైరూప్య నామవాచకాల అర్థానికి ఇక్కడ రెండుఅవకాశాలు ఉన్నాయి. (1) వారు తండ్రియైన దేవుని గూర్చి, యేసుక్రీస్తు గూర్చిన లక్షణాలను వివరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యవంతులూ, ప్రేమగలవారు” (2) విశ్వాసులు ఎలా జీవించాలో వారు వివరిస్తారు, అందువల్ల విశ్వాసులు దేవుని నుండి "కృప, దయ, శాంతిని" అందుకుంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం సత్యాన్ని పట్టుకోవడమూ, ఒకరినొకరు ప్రేమించడమూ” (చూడండి: భావనామాలు)

2 John 1:4

σου

మీ అనేపదం ఇక్కడ ఏకవచనం, ఎందుకంటే యోహాను  సంఘాన్ని అలంకారికంగా “అమ్మ” అని సంబోధిస్తున్నాడు. (చూడండి:‘మీరు’ రూపాలు)

ἐχάρην λείαν

మీ భాషలో మొదట గాని, తరువాత గాని ఫలితాన్ని చెప్పడం మరింత సహజంగా ఉంటే, మీరు దీన్ని తర్వాత ఉంచవచ్చు మీ పిల్లలు కొందరు సత్యంననుసరించి నడుస్తున్నట్లు నేను కనుగొన్నాను, UST లోవలె. (చూడండి: సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం)

τῶν τέκνων σου

[1: 1] (../01/01.md) లో పిల్లలు అనే పదాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. ఇది మూడు విషయాలలో ఒకటి అని అర్ధం. (1) ఇది ఒక నిర్దిష్ట సమాజంలో భాగమైన ప్రజలను సూచిస్తుంది. (2) ఈ పత్రిక అసలు స్త్రీకి సంబోధించినట్లయితే, అది ఆమె జీవసంబంధమైన పిల్లలు లేదా (3) ఆమె ఆధ్యాత్మిక పిల్లలు అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ గుంపులోని విశ్వాసులు” (చూడండి: రూపకం)

περιπατοῦντας ἐν ἀληθείᾳ

ఒక వ్యక్తి జీవితాన్ని నడక అనే వ్యక్తీకరణతో యోహాను అలంకారికంగా సూచించడం జరిగింది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం ప్రకారం జీవించడం” (చూడండి:రూపకం)

ἐν ἀληθείᾳ

మీ భాషలో దీని కోసం ఒక నైరూప్య నామవాచకాన్నిఉపయోగించకపోతే, మీరు విశేషణంతో ఒక పదబంధాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునినుండి వచ్చిన నిజమైన సందేశంతో ఏకీభవించే విధంగా” (చూడండి:భావనామాలు)

καθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός

ఒక ఆజ్ఞను పొందుకొన్నారు దేవుడు విశ్వాసులకు ఏదైనా చేయమని ఆజ్ఞాపించాడనే ఆలోచనను వ్యక్తపరుస్తుంది.ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, “ఆజ్ఞ” అనే క్రియ వాక్యంతో “తండ్రి” కి సంబంధించిన అంశంగా మీరు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తండ్రి మనకు ఆజ్ఞాపించినట్లే”

τοῦ Πατρός

తండ్రి దేవునికి ముఖ్యమైన శీర్షిక. దీన్ని ఖచ్చితంగానూ, స్థిరంగానూ అనువదించడానికి జాగ్రత్తగా ఉండండి. (చూడండి:తండ్రి, కుమారుడు ను అనువదించడం)

2 John 1:5

καὶ νῦν

లేఖకు సంబంధించిన ప్రధాన అంశం ఏమిటో దానిని సూచిస్తుంది,లేదా దానికి సంబంధించిన మొదటి ప్రధాన అంశాన్ని సూచిస్తుంది. మీ భాషలో ప్రధాన అంశాన్ని పరిచయం చేయడానికి సహజమైన విధానాన్ని  ఉపయోగించండి.

σε,…σοι

మీరు ఈ సందర్భాలు ఏకవచనం, ఎందుకంటే యోహాను మరోసారి సంఘాన్ని "అమ్మ" అని అలంకారిక పద్ధతిలో ప్రసంగిస్తున్నాడు. (చూడండి: ‘మీరు’ రూపాలు)

κυρία

verse 1 లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి (చూడండి:రూపకం)

οὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι

యోహాను వ్రాసే వ్యక్తిగా తనను తాను స్పష్టంగా సూచించడు. మీరు క్రియ విషయాన్ని మీ భాషలో పేర్కొనవలసి వస్తే, మీరు ఇక్కడ ఒక సర్వనామం జోడించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను మీకు క్రొత్త ఆజ్ఞను వ్రాస్తున్నట్లు కాదు” (See:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ἀπ’ ἀρχῆς

మొదటి నుండి అనే పదం యోహాను, అతని సభ్యులు  మొదటసారిగా యేసుక్రీస్తును విశ్వసించిన సమయాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము మొదట నమ్మినప్పటి నుండి” (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఇక్కడ క్రొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం మొదటి నుండి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన ఆజ్ఞాపించాడు.”

2 John 1:6

περιπατῶμεν κατὰ…ἐν…περιπατῆτε

ఈ సందర్భాలలో నడక అని తెలియచేయడమనేది, అలంకారికంగా “లోబడి నడుచుకోవడం” అనిఅర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము లోబడి నడుచుకోవాలి… మీరు దానిని అనుసరించాలి” (చూడండి:రూపకం)

ἠκούσατε…περιπατῆτε

ఈ పద్యంలో  మీరు అనే పదం బహువచనం, ఎందుకంటే యోహాను విశ్వాసుల సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. 13 వవచనంలో తప్ప, మిగిలినపత్రిక  అంతటా ఇది ఉంది, ఎందుకంటేయోహాను అక్కడ సంఘాన్ని స్త్రీగానూ, దాని సభ్యులను ఆమె పిల్లలుగానూ సూచిస్తూ  తన రూపకాలంకారాన్ని తిరిగి వస్తాడు. (see: ‘మీరు’ రూపాలు)

2 John 1:7

ὅτι

ఇక్కడ, కోసం మునుపటి వచనాలలో దేవుణ్ణి ప్రేమించి,  ఆయనకు లోబడి నడుచుకోవాలి అనే ఆజ్ఞ గురించి యోహాను  వ్రాసిన కారణాన్ని పరిచయం చేస్తాడు - ఎందుకంటే విశ్వాసులవలె నటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు, కానివారు దేవుణ్ణి ప్రేమించరు, లేదా ఆయనకు లోబడి నడుచుకోరు. ఈ కారణాన్ని మీ భాషలో పరిచయం చేయడానికి సహజమైన రీతిలో ఉపయోగించండి. UST చూడండి. (See: సంబంధపరచు - కారణం మరియు ఫలిత సంబంధం)

ὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον

యోహాను  10–11 verses చర్చిస్తున్న తప్పుడు బోధకులకు ఇది ఒక తిరుగులేని సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “చాలామంది వంచకులు అనేకులు బయలుదేరి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తిరుగుతున్నారు” (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

Ἰησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί

శరీరంతో వచ్చాడు అనే వ్యక్తీకరణ ఒక వ్యక్తి నిజమైన, భౌతిక శరీరంతో ఉండడం ఒక అన్యోపదేశం, ఒక ఆధ్యాత్మిక జీవిగా ఉండడం మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసుక్రీస్తు నిజమైన మానవునిగా వచ్చాడు” (చూడండి: అన్యాపదేశము)

οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος

ఇది అనే పదాన్ని సూచించడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. (1) యోహాను ఇతరులు చేసే మోసకరమైన చర్యను లేదా ఈ వ్యక్తులు చేస్తున్న బోధను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది వంచకుడైన క్రీస్తు విరోధి పని” లేదా “ఈవిధమైన బోధ మోసగాడైన క్రీస్తు విరోధి నుండి వస్తుంది” (2) వంచాకులనుగూర్చి సంఘంలోని ఏ సభ్యుడైనా యోహాను  సూచిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:“అలాంటి వ్యక్తి వంచకుడు, క్రీస్తు విరోధి” ఇది సహాయకరంగా ఉంటే, మీరు ఈ అర్థాలలో ఒకదాన్ని స్పష్టంగా చేయవచ్చు. (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος

మీ అనువాదంలో, వంచకుడు,క్రీస్తువిరోధి ఒకే వ్యక్తి., ఇద్దరుకాదు అని స్పష్టం చేయడం సహాయకరంగా ఉండవచ్చు.

2 John 1:8

βλέπετε ἑαυτούς

దీని తాత్పర్యం ఏమిటంటే, విశ్వాసులు తమనుతాము కాచుకొని ఉండాలి అంటే, జాగ్రత్తగా ఉండడం, తద్వారా వారు వంచకులైన క్రీస్తు విరోధుల వలన మోసపోరు.ప్రత్యామ్నాయ అనువాదం: “వంచకులూ, క్రీస్తు విరోధులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించండి”ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం

ఏమిటి అనేపదం తదుపరి పదబంధంలో ప్రతిఫలం గా నిర్వచించడం జరిగింది. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరుఇక్కడ“బహుమానం” అని కూడా చెప్పవచ్చు. UST చూడండి. (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

εἰργασάμεθα

ఇక్కడ మేము అనే పదం యోహనును, అతని సభ్యులను, ఇతరులందరినీ కలుపుకొని, యోహాను వ్రాస్తున్న విశ్వాసుల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. (See: ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)

2 John 1:9

πᾶς ὁ προάγων καὶ μὴ μένων ἐν τῇ διδαχῇ τοῦ Χριστοῦ

యోహాను క్రీస్తు బోధను గూర్చి నమ్మకమైన విశ్వాసులు ఉండే ప్రదేశమని అలంకారికంగా సూచిస్తున్నాడు. ఇంకా తప్పుడు బోధలు చేసే వారి బోధను దాటి వెళ్ళే ప్రదేశంగా కూడా  సూచిస్తున్నాడు. దాటి పోతుంది అనే ఈ వ్యక్తీకరణ యేసు బోధించని క్రొత్త బోధను గూర్చి, ఇంకా తప్పుడు విషయాలను బోధించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు బోధించని విషయాలు బోధించే ప్రతి ఒక్కరూ” (See: రూపకం)

πᾶς ὁ προάγων καὶ μὴ μένων ἐν τῇ διδαχῇ τοῦ Χριστοῦ

ఈ రెండు పదబంధాలు ఒకే విషయాన్ని గూర్చి అని అర్ధం, ఒకటి సానుకూలంగా పేర్కొంది (దాటి పోతుంది) మరొకటి ప్రతికూలంగా పేర్కొంది (నిలిచి ఉండదు). ఇది మీ భాషలో సహజంగా ఉంటే, USTలో వలె మీరు వీటి క్రమాన్ని రివర్స్ చేయవచ్చు. (See: సమాచార నిర్మాణము)

Θεὸν οὐκ ἔχει

దేవుణ్ణి కలిగి ఉండటం అంటే రక్షకుడిగా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సంబంధంపెట్టుకోవడం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునికి చెందినది కాదు” లేదా “దేవునితో సరైన సంబంధం లేదు” (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει

క్రీస్తు బోధను అనుసరించే ఎవరైనా తండ్రి, కుమారులకు ఇద్దరికీ చెందినవారు

ὁ μένων ἐν τῇ διδαχῇ

ఈ పదబంధం మునుపటి వాక్యానికి భిన్నంగా ఉంటుంది. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, USTలో వలె ఈ వ్యత్యాసాన్ని గుర్తించడానికి, మీరు ఒక పదం లేదా పదబంధాన్ని ఉపయోగించవచ్చు.(See: సంబంధించు – విరుద్ధ సంబంధం)

οὗτος

యోహాను ఒక విధమైన వ్యక్తిని సూచించడానికి ఇది అనే నామవాచకంగా ప్రదర్శించే విశేషణాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక అనే పదాన్ని జోడించడం ద్వారా ULT దీనిని సూచిస్తుంది. మీ భాష ఈ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే, మీరు దీన్ని సమానమైన పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అటువంటి ఒక వ్యక్తి” లేదా “ఆ రకమైన వ్యక్తి” (See:నామకార్థ విశేషణాలు)

τὸν Πατέρα καὶ τὸν Υἱὸν

దేవునికీ, యేసుక్రీస్తుకీ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. ఈ శీర్షికలను స్థిరంగానూ, కచ్చితంగానూ వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి. (See: తండ్రి, కుమారుడు ను అనువదించడం)

2 John 1:10

εἴ τις ἔρχεται πρὸς ὑμᾶς, καὶ ταύτην τὴν διδαχὴν οὐ φέρει

ఇక్కడ ఎవరైనా అనే పదం ఎవరైనా గురువూ లేదా బోధకుడు అని సూచిస్తుంది. యేసు బోధించిన వాటిని బోధించని ఏ గురువునైన స్వాగతించాలని యోహాను కోరుకోలేదు,  ప్రత్యేకంగా యేసు మానవుడిగా వచ్చాడని చెపుతున్నాడు (see verse7). ప్రత్యామ్నాయ అనువాదం: “బోధకునిగా చెప్పుకుంటూ ఎవరైనా మీ వద్దకు వస్తే, అతను దీని కంటే భిన్నంగా బోధిస్తాడు” (చూడండి: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

ταύτην τὴν διδαχὴν οὐ φέρει

యోహాను ఒక బోధ లేదా ఒక సందేశం గురించి మాట్లాడుతున్నాడు, అది ఒక వస్తువులాగ ఎవరైనా తీసుకొని రాగలరు. మీరు మీ భాషలో ఈ విధమైన అలంకారాన్ని ఉపయోగించకపోతే, మీరు అదే అర్ధాన్ని కలిగి ఉన్న రూపకాన్ని ఉపయోగించవచ్చు లేదా వాడుక భాషను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇదే సందేశాన్ని బోధించదు” (See:రూపకం)

μὴ λαμβάνετε αὐτὸν εἰς οἰκίαν

విశ్వాసులు తమఇళ్లలోకి ఒక తప్పుడు భోదకున్ని చేర్చుకోవాలన్ని యోహాను కోరుకోలేదు, ఆ విధంగా అంగీకరించడం వలన కలిగీ ఫలితం, అతన్ని గౌరవించి, అతని అవసరాలను తీర్చడం ద్వారా అతని తప్పుడు బోధకు మద్దతు ఇవ్వడం. ప్రత్యామ్నాయ అనువాదం: “వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, అతనికి మద్దతు ఇవ్వవద్దు లేదా ప్రోత్సహించవద్దు” (See:ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

χαίρειν αὐτῷ μὴ λέγετε

తప్పుడు బోధకున్ని సాదారణంగా గౌరవించవద్దని యోహాను విశ్వాసులను హెచ్చరించాడు. దీని అర్థం ఏమిటంటే, వారు తప్పుడు బోధకుని ఆమోదిస్తున్నట్లుగా లేదా తప్పు నేర్పేవానికి ఇతరుల దృష్టిలో మంచి స్థితిని ఇచ్చేలా కనిపించే దేనినైన చేయమని అతను కోరుకోవాదం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతనిక సాదారణంగా శుభాలు చెప్పవద్దు” (See: ఊహించుకొన్న జ్ఞానం మరియు అంతర్గత సమాచారం)

2 John 1:11

ὁ λέγων…αὐτῷ χαίρειν

అతనికి గౌరవప్రదమైన బహిరంగ శుభాకాంక్షలు ఇచ్చేవ్యక్తి

κοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς

పాలుపంచుకోవడంలో అనే క్రియ తప్పుడు బోధకుని కార్యాచరణకు సహాయపడటమూ, అనుకూలం అనే భావననువ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అతని దుర్మార్గాలలో పాల్గొవడం” లేదా “అతని చేసే చెడు పనులలో అతనికి సహాయపడడం”

2 John 1:12

οὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος

ఒక వాక్యం పూర్తి కావడానికి అనేక భాషలలో వాక్యానికి అవసరమయ్యేకొన్ని పదాలను ఇక్కడ యోహాను  వదిలివేస్తాడు. ఇది మీ పాఠకులకుఉపయోగకరంగా ఉంటే, మీరు ఈపదాలను ముందు నుండి వాక్యంలో అందించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేనువీటిని కాగితం,సిరాతో వ్రాయడానికి ఇష్టపడడంలేదు” (See: Ellipsis)(Seeశబ్దలోపం)

διὰ χάρτου καὶ μέλανος

** కాగితం, సిరా**కాకుండా వేరే వాటితో ఈ విషయాలు వ్రాస్తానని యోహాను  చెప్పడం లేదు. దానికి బదులుగా,అతనురచనను సూచించడానికి, ఆ వ్రాత పదార్థాల గురించి అలంకారికంగా మాట్లాడుతున్నాడు. అతనువిశ్వాసులను వ్యక్తిగతంగా సందర్శించాలనీ, వారితో నేరుగా తన సంభాషణను కొనసాగించాలనికోరుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈవిషయాలను వ్రాతపూర్వకంగా సంభాషించడానికి” (See: అన్యాపదేశము)

στόμα πρὸς στόμα λαλῆσαι

నోటి నుండి నోటితో అనే వ్యక్తీకరణ ఒక జాతీయం, అంటే వారి సమక్షంలో మాట్లాడటం. ఇదే అర్థంతో మీ భాషలో ఒక జాతీయాన్నిఉపయోగించండి లేదా ఆ అర్థాన్ని స్పష్టంగా వ్యక్తపరచండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ముఖాముఖిమాట్లాడటం” లేదా “మీతో వ్యక్తిగతంగా మాట్లాడటం” (See:https://git.door43.org/Door43-Catalog/te_ta/src/branch/master/translate/figs-idiom/01.md)

ἵνα ἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని క్రియాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఇది మీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది” (See:కర్తరి ప్రయోగం లేదా కర్మణి ప్రయోగం)

ἵνα ἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని క్రియాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఇది మీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది” (See:భావనామాలు)

ἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ

ఇక్కడ 2 యోహాను సాధారణ పరిచయంకు సంబంధించిన  వచన సమస్యను గురించి, 3 భాగంలోని గమనికను చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మా ఆనందం పరిపూర్ణమవుతుంది” (See: మూల గ్రంథం వైవిధ్యాలు)

ὑμῶν

మీ కు బదులుగా, మీరు ఇక్కడ “మా” ఉపయోగిస్తే, ఇందులో యోహానునూ, పత్రికను పొందుకొనే ఇద్దరూ ఉంటారు. (See:ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన ‘మేము’)

2 John 1:13

τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς

ఈ వ్యక్తీకరణ అనేక విషయాలలో ఒకదాన్న సూచిస్తుంది. (1) ఇది ఒక అలంకారం. యోహాను  "ఎన్నికైన అమ్మగారికి" అనే పదాన్ని విశ్వాసుల సమూహానికి ఒక అలంకారిక వ్యక్తీకరణగా ఉపయోగిస్తున్నట్లే verse 1 ఆ సమాజంలోని సంఘ సభ్యులను కూడా "ఆమె పిల్లలు" అనే పదాన్ని వ్రాస్తున్నాడు. ఇక్కడ కూడా యోహాను తన సొంత విశ్వాసుల సమూహాన్ని ఆ సమాజంలో ఎంచుకున్న సోదరి పిల్లలు అని, ఇంకా అతని గుంపులోని సభ్యులు ఈ సోదరి పిల్లలు అని అలంకారికంగా వివరిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇక్కడ ఎంచుకున్న విశ్వాసుల సమూహంలోని సభ్యులు” అనేది మీరు రూపకాన్ని వచనంలో ఉంచాలని ఎంచుకుంటే, మీరు పుస్తకం పుటకు అడుగున రాసిన వివరంలో వివరణను చేర్చాలనుకోవచ్చు. (2) ఇది యోహాను వ్రాస్తున్న మరొక నిర్దిష్ట మహిళ జీవ సంబంధమైన సోదరి పిల్లలను సూచిస్తుంది. (3) సోదరి, పిల్లలు అనే పదాల యోహాను ఒక ఆధ్యాత్మిక కోణంలో అలంకారికంగా ఉపయోగించ ఉండవచ్చు, అయితే ఒక స్త్రీ, ఆమె ద్వారా యేసుపై విశ్వాసానికి దారితీసిన ఇతర వ్యక్తులను సూచిస్తుంది. (See:రూపకం)

τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς

ఈ సందర్భంలో, ఎన్నికైన అనే పదం రక్షణ  పొందటానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని సూచిస్తుంది. యోహాను  ఉపయోగించిన సందర్భంలోని అలంకారంలో, ఇది రక్షణ పొందటానికి దేవుడు ఎన్నుకున్న సంఘం, లేదా వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసునందు విశ్వాసముంచిన సమాజంలోని సభ్యులు” (See:జాతీయం (నుడికారం))

ἀσπάζεταί σε

ఈ సంస్కృతిలో ఆచారం ప్రకారం, యోహాను తనతో ఉన్న వ్యక్తులతో పాటు, తాను ఎవరికి వ్రాస్తున్నాడో ఆ తెలిసిన వ్యక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికను ముగించాడు. మీ భాషలో పత్రిక శుభాకాంక్షలు పంచుకోవడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉండవచ్చు. అలా అయితే, మీరు ఆ విధానాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు వారు శుభాకాంక్షలు పంపుచున్నారు” లేదా “మిమ్మల్ని  జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు.”

σε…σου

మీరు మరియు మీ అనే సర్వనామాలు ఇక్కడ ఏకవచనం, ఒకసమాజానికి యోహాను వ్రాసే అలంకారానికి అనుగుణంగా, ఇది ఒక మహిళ. (See:‘మీరు’ రూపాలు)