తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

మార్కు రాసిన సువార్త

Chapter 1

1 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించి సువార్త ప్రారంభము. 2 ప్రవక్త యెషయాలో ఇది వ్రాయబడిన విధముగా, “ఇదిగో నా సందేశకుడిని నీ ముఖము ముందు నేను పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. 3 అరణ్యములో కేకవేయుచున్న ఒక స్వరము, ‘ప్రభువు యొక్క మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు తిన్నవిగా చేయుడి.” 4 యోహాను వచ్చి, అరణ్యములో బాప్తిసం ఇస్తూ మరియు పాపముల యొక్క క్షమాపణ కోసం పశ్చాత్తాపము యొక్క బాప్తిసం ప్రకటించుచు ఉన్నవాడు. 5 మరియు యూదయ యొక్క ప్రాంతం అంతా మరియు యెరూషలేము యొక్క నివాసులు అందరూ, అతని యొద్దకు వెళ్ళుచున్నారు మరియు తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నారు. 6 మరియు యోహాను ఒంటె రోమముల వస్త్రమును మరియు అతని మొల చుట్టు తోలు దట్టియు ధరించుకొని ఉన్నాడు, మరియు మిడుతలను మరియు అడవి తేనెను తింటున్నాడు. 7 మరియు అతడు ప్రకటించుచున్నాడు, చెపుతున్నాడు, “నా కంటే శక్తిమంతుడు నా తరువాత వస్తున్నాడు, ఆయన కిందకు వంగి, ఆయన చెప్పుల పట్టీ విప్పడానికి, నేను యోగ్యుడను కాను. 8 నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చాను, అయితే ఆయన పరిశుద్ధ ఆత్మతో మీకు బాప్తిసం ఇస్తాడు.” 9 మరియు గలిలయలో నజరేతు నుండి యేసు వచ్చాడు ఆ దినములలో ఇది జరిగింది మరియు ఆయన యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందాడు. 10 మరియు వెంటనే, నీళ్లలో నుండి వెలుపలికి వస్తున్నాడు, ఆకాశములు బయటికి చీల్చబడియుండుట మరియు ఆత్మ ఒక పావురము వలె ఆయన మీదికి దిగి రావడం ఆయన చూసాడు. 11 మరియు ఒక స్వరం ఆకాశముల వెలుపలికి వచ్చింది, “నీవు నా ప్రియ కుమారుడవు, నీతో నేను చాలా సంతోషించాను.” 12 మరియు వెంటనే, అరణ్యము లోనికి వెళ్ళడానికి ఆయనను పరిశుద్ధ ఆత్మ బలవంతం చేసాడు. 13 మరియు ఆయన సాతాను చేత శోధింపబడుచు, అరణ్యములో 40 దినములు ఉన్నాడు. మరియు ఆయన అడవి జంతువులతో ఉన్నాడు మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 14 అయితే యోహాను చెరపట్టబడిన తరువాత, యేసు దేవుని యొక్క సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. 15 మరియు చెపుతున్నాడు, “కాలము నెరవేర్చబడి ఉంది, మరియు దేవుని యొక్క రాజ్యము సమీపంగా వచ్చింది. పశ్చాత్తాపపడండి మరియు సువార్తలో విశ్వాసముంచండి.” 16 మరియు గలిలయ యొక్క సముద్ర తీరమున నడచుచూ, ఆయన సీమోను మరియు సీమోను సోదరుడు అంద్రెయ, సముద్రములోనికి వల వేయడం చూసాడు. ఎందుకంటే వారు జాలరులు. 17 మరియు యేసు వారికి చెప్పాడు, “నా తరువాత రండి, మరియు మనుష్యుల యొక్క జాలరులుగా మారడానికి నేను మిమ్మును చేయుదును.” 18 మరియు వెంటనే, వలలు విడిచి పెట్టి, వారు ఆయనను వెంబడించారు. 19 మరియు ఇంక కొంత దూరము వెళ్లి, ఆయన జెబెదయి యొక్క {కుమారుడు}, యాకోబును మరియు అతని సోదరుడు, యోహానును చూసాడు. మరియు వారు దోనెలో వలలు బాగుచేసికొనుచుండిరి. 20 మరియు వెంటనే, వారిని పిలిచాడు మరియు వారు తమ తండ్రి జెబెదయిని దోనెలో జీతగాండ్రైన సేవకులతో విడిచి పెట్టారు, వారు ఆయన వెనుక వెళ్ళారు. 21 మరియు ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించాడు, మరియు వెంటనే విశ్రాంతిదినమున, సమాజమందిరములోనికి ప్రవేశించి, ఆయన బోధించడానికి ఆరంభించాడు. 22 మరియు వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన అధికారము కలిగిఉన్న వాని వలె వారికి బోధించాడు మరియు శాస్త్రుల వలే కాదు. 23 మరియు వెంటనే వారి సమాజమందిరములో అపవిత్ర ఆత్మతో ఒక మనుష్యుడు ఉన్నాడు, మరియు అతడు గట్టిగా అరిచాడు. 24 చెప్పాడు, “నజరేతు యొక్క యేసూ, మాకు మరియు నీకు ఏమిటి? మమ్ములను నశింపజేయడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు - దేవుని యొక్క పరిశుద్ధుడవు!” 25 మరియు యేసు దానిని గద్దించాడు, చెప్పాడు, “మౌనంగా ఉండుము మరియు అతని నుండి వెలుపలికి రమ్ము!” 26 మరియు అతనిని క్రిందకు త్రోసి, మరియు పెద్ద స్వరంతో గట్టిగా అరచి, అపవిత్ర ఆత్మ అతని నుండి వెలుపలికి వెళ్ళింది. 27 మరియు {వారు} అందరును విస్మయమొందారు. కాబట్టి వారు తమ మధ్య చర్చించుకొన్నారు, చెప్పారు, “ఇది ఏమిటి? అధికారం ప్రకారం ఒక క్రొత్త బోధ! ఈయన అపవిత్ర ఆత్మలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, మరియు అవి ఆయనకు లోబడుచున్నవి!” 28 మరియు ఆయన యొక్క సమాచారము వెంటనే గలిలయ యొక్క చుట్టూ ప్రాంతము అంతటిలోనికి ప్రతీ చోట బయటికి వెళ్ళింది. 29 మరియు వెంటనే సమాజమందిరము నుండి బయటికి వచ్చి, వారు యాకోబు మరియు యోహానులతో పాటు, సీమోను మరియు అంద్రెయ యొక్క యింటిలోనికి వచ్చారు. 30 ఇప్పుడు సీమోను యొక్క అత్త క్రింద పడిఉంది, జ్వరముతో జబ్బుపడియుంది, మరియు వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో మాట్లాడారు. 31 మరియు దగ్గరకు వచ్చి, ఆయన ఆమెను లేవనెత్తాడు, {ఆమె} యొక్క చేతిని పట్టుకొన్నాడు, మరియు జ్వరము ఆమెను విడిచిపెట్టింది, మరియు ఆమె వారికి ఉపచారము చేయడానికి ఆరంభించింది. 32 ఇప్పుడు సూర్యుడు అస్తమించిన తరువాత, సాయంకాలము అయ్యింది, వారు వ్యాధి ఉన్నవారు మరియు దయ్యములు పట్టిన వారు అందరినీ ఆయన యొద్దకు తీసికొని వచ్చారు. 33 మరియు నగరం అంతా ద్వారం వద్ద కలిసి చేరారు. 34 మరియు వివిధ రోగములతో వ్యాధి ఉన్న అనేకులను ఆయన స్వస్థపరచాడు, మరియు అనేక దయ్యములను వెళ్ళగొట్టాడు, అయితే దయ్యములు మాట్లాడడానికి ఆయన అనుమతించడం లేదు, ఎందుకంటే వాటికి ఆయన తెలుసు. 35 మరియు తెల్లవారుజాము ఇంకా చీకటి ఉండగానే, పైకి లేచాడు, ఆయన వెళ్ళాడు మరియు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు, మరియు అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి ఆరంభించాడు. 36 మరియు సీమోను మరియు అతనితో ఉన్నవారు ఆయన కోసం వెదకారు. 37 మరియు ఆయనను కనుగొన్నారు మరియు ఆయనతో చెప్పారు, “ప్రతి ఒక్కరు నిన్ను వెదకుచున్నారు.” 38 మరియు ఆయన వారితో చెప్పాడు, “మనం మరో చోటికి వెళ్దాం, చుట్టుప్రక్కల పట్టణములలోనికి, తద్వారా నేను అక్కడ కూడా ప్రకటిస్తాను, ఎందుకంటే నేను దీని కోసం వచ్చాను.” 39 మరియు ఆయన గలిలయ అంతటా వెళ్ళాడు, వారి సమాజమందిరములలో ప్రకటించుచు, మరియు దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను. 40 మరియు ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడు, ఆయనను బతిమాలుచున్నాడు, మరియు కింద మోకాళ్ళూనాడు, ఆయనతో చెప్పాడు, “నువ్వు ఇష్టంగా ఉన్న యెడల, నన్ను శుద్ధునిగా చేయగలవు.” 41 మరియు కనికరముతో కదిలించబడ్డాడు, తన చెయ్యి బయటికి చాపాడు, ఆయన వానిని ముట్టాడు, మరియు అతనితో చెప్పాడు, “నేను ఇష్టంగా ఉన్నాను. శుద్ధుడవుగా ఉండు.” 42 మరియు వెంటనే కుష్ఠరోగము వాని నుండి పోయింది, మరియు అతడు శుద్ధుడు అయ్యాడు. 43 అయితే అతనికి ఖండితముగా ఆజ్ఞాపించి, ఆయన వెంటనే అతనిని పంపించి వేసాడు. 44 మరియు ఆయన అతనితో చెప్పాడు, “నీవు ఏ ఒక్కరికీ ఏమీ చెప్పకుండా చూడు, అయితే వెళ్ళు, నిన్ను నీవు యాజకునికి కనుపరచుకో, మరియు మోషే ఆజ్ఞాపించినది వారికి సాక్ష్యం కోసం నీ శుద్ధి కోసం అర్పించు. 45 అయితే వాడు, బయటికి వెళ్ళాడు, తరచుగా ప్రకటించడానికి మరియు వాక్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చెయ్యడానికి ఆరంభించాడు, తద్వారా ఆయన ఇకమీదట పట్టణంలోనికి బహిరంగంగా ప్రవేశించలేక పోయాడు, అయితే ఆయన నిర్జన ప్రదేశాలలో వెలుపల ఉన్నాడు, మరియు అన్ని దిక్కుల నుండి వారు ఆయన వద్దకు వచ్చుచుండిరి.

Chapter 2

1 మరియు {కొన్ని} దినములైన తరువాత మరల కపెర్నహూములోనికి ప్రవేశించాడు, ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు అని ఇది వినపడింది. 2 మరియు అనేకులు సమకూడారు తద్వారా అక్కడ ఇక స్థలం లేదు, తలుపు దగ్గర సహితం లేదు, మరియు ఆయన వారికి వాక్యము చెప్పడానికి ఆరంభించాడు. 3 మరియు ఆయన వద్దకు పక్షవాయువుగల ఒక మనుష్యుని వారు తీసుకొని వచ్చారు, నలుగురు పురుషుల చేత మోసుకొనిరాబడ్డాడు. 4 మరియు సమూహం యొక్క కారణంగా ఆయన వద్దకు చేరలేని వారిగా ఉండి, ఆయన యున్నచోట వారు ఇంటి కప్పు తొలగించారు, మరియు ఒక సందు త్రవ్విన తరువాత, వారు పక్షవాయువుగలవాడు పడి ఉన్న పరుపును కిందకు దింపారు. 5 మరియు యేసు, వారి విశ్వాసము చూచాడు, పక్షవాయువుగలవానితో చెప్పాడు, “కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి.” 6 అయితే శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చున్నారు మరియు వారి హృదయాలలో తర్కించుచున్నారు. 7 “ఈ వ్యక్తి ఎందుకు ఈ విధానంలో మాట్లాడుచున్నాడు? ఇతడు దేవదూషణ చేయుచున్నాడు! దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమించ గలవాడు ఎవడు?” 8 మరియు వెంటనే, యేసు, వారు తమలో తాము ఈ విధానంలో ఆలోచించుకొనుచున్నారు అని తన ఆత్మలో తెలిసికొన్నాడు, వారితో చెప్పాడు, “మీరు ఈ {సంగతులు} మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 9 ఈ పక్షవాయువుగలవానితో చెప్పడానికి, “నీ పాపములు క్షమింప బడియున్నవి” లేదా చెప్పడానికి “పైకి లెమ్ము మరియు నీ పరుపు పైకి తీసుకో మరియు నడువు” ఏది సులభం? 10 అయితే తద్వారా పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్యుని యొక్క కుమారునికి అధికారము కలదు అని మీరు తెలిసికొనునట్లు,” ఆయన పక్షవాయువుగలవానితో చెప్పాడు, 11 నేను నీతో చెప్పుచున్నాను, పైకి లెమ్ము, నీ పరుపు పైకి తీసుకొనుము, మరియు నీ యింటికి వెళ్ళు.” 12 మరియు పైకి లేచి మరియు వెంటనే పరుపు పైకి తీసుకొన్నాడు, అతడు ప్రతి ఒక్కరి యెదుట బయటికి వెళ్ళాడు, తద్వారా వారు అందరూ ఆశ్చర్యపడ్డారు మరియు దేవుణ్ణి మహిమపరచారు, చెప్పారు, “మేము ఆ విధంగా ఎన్నడూ చూడలేదు.” 13 మరియు ఆయన సముద్ర తీరమున మరల బయటికి వెళ్ళాడు, మరియు సమూహం అంతా ఆయన వద్దకు వస్తున్నారు, మరియు ఆయన వారికి బోధించుచున్నాడు. 14 మరియు మార్గమున వెళ్లుచు, పన్ను వసూలుదారుని గుడారం వద్ద కూర్చునియున్న అల్ఫయి యొక్క {కుమారుడు} లేవిని ఆయన చూసాడు, మరియు ఆయన అతనితో చెప్పాడు, “నన్ను వెంబడించుము.” మరియు పైకి లేచిన తరువాత అతడు ఆయనను వెంబడించాడు. 15 మరియు అతని యింటిలో ఆయన భోజనము చెయ్యడానికి ఏటవాలుగా కూర్చోవడం జరిగింది. మరియు పన్ను వసూలుదారులు మరియు పాపులు అనేకులు యేసు మరియు ఆయన శిష్యులతో భోజనము చేయుచున్నారు. ఎందుకంటే అనేకులు కూడా ఆయనను వెంబడిస్తున్నారు. 16 మరియు పరిసయ్యులలో శాస్త్రులు, ఆయన పాపులు మరియు పన్ను వసూలుదారులతో భుజించున్నాడు అని చూచి, ఆయన శిష్యులతో మాట్లాడడం ఆరంభించారు, “ఆయన పన్ను వసూలు దారులు మరియు పాపులతో ఎందుకు భుజించుచున్నాడు?” 17 మరియు {దీనిని} వినిన తరువాత, యేసు వారితో చెప్పాడు, “ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుని యొక్క అవసరం లేదు, అయితే రోగులుగా ఉన్న వారికే. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, అయితే పాపులను. 18 మరియు యోహాను యొక్క శిష్యులు మరియు పరిసయ్యులు ఉపవాసము చేయుచున్నారు, మరియు వారు వచ్చారు మరియు ఆయనతో చెప్పారు, “యోహాను యొక్క శిష్యులు మరియు పరిసయ్యుల యొక్క శిష్యులును ఉపవాసము చేయుచున్న కారణంగా, అయితే నీ శిష్యులు ఉపవాసము చేయడం లేదు ఏమిటి?” 19 మరియు యేసు వారితో చెప్పాడు, “వివాహపు గది యొక్క కుమారులు పెండ్లికుమారుడు ఇంకా వారితో ఉన్న కాలమున ఉపవాసము చేయలేరు, వారు ఉంటారా? పెండ్లికుమారుడు వారితో ఉన్నంత కాలము, వారు ఉపవాసము చేయలేరు. 20 అయితే వారి నుండి పెండ్లికుమారుడు కొనిపోబడునప్పుడు దినములు వచ్చును, మరియు ఆ దినములలో, అప్పుడు వారు ఉపవాసము చేతురు. 21 ఏ ఒక్కరూ పాత బట్ట మీద ముడుచుకొననిదాని వస్త్రం యొక్క అతుకు కుట్టడు, అయితే కాని యెడల పూరక పదార్ధం దాని నుండి లాగి వేస్తుంది. పాతదాని నుండి క్రొత్తది, మరియు చినుగు మరింత పెద్దదవుతుంది. 22 మరియు ఏ ఒక్కడును పాత ద్రాక్షతిత్తులలోనికి క్రొత్త ద్రాక్షారసము పోయడు, అయితే కాని యెడల, ద్రాక్షారసము ద్రాక్షతిత్తులను పిగుల్చును మరియు ద్రాక్షారసము మరియు ద్రాక్షతిత్తులును నాశనం అవుతాయి, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనికి. 23 మరియు ఆయన విశ్రాంతి దినములలో ధాన్యం పొలముల ద్వారా వెళ్లడం జరిగింది, మరియు ఆయన శిష్యులు {వారి} మార్గాన్ని చేసుకోడానికి ఆరంభించారు, ధాన్యం యొక్క వెన్నులు త్రుంచుచునుండిరి. 24 మరియు పరిసయ్యులు ఆయనతో చెప్పుచున్నారు, “చూడుము, విశ్రాంతి దినములలో చట్టబద్దం కాని వాటిని వారు ఎందుకు చేస్తున్నారు?” 25 మరియు ఆయన వారితో చెప్పాడు, “అతడు మరియు అతనితో ఉన్నవారు – అతనికి అవసరం ఉన్నప్పుడు మరియు ఆకలిగా ఉన్నప్పుడు, దావీదు చేసిన దానిని మీరు ఎన్నడును చదువలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా మరియు యాజకుల కోసం తప్పించి తినడానికి చట్టబద్ధం కాని సన్నిధి యొక్క రొట్టె తిని మరియు తనతో ఉన్న వారికి కూడా అతడు ఇచ్చిన సమయంలో అతడు దేవుని యొక్క ఇంటిలోనికి ప్రవేశించిన విధానం. 27 మరియు ఆయన వారితో చెప్పాడు, “విశ్రాంతిదినము మనుష్యుని కోసం చెయ్యబడింది, మరియు మనుష్యుడు విశ్రాంతి దినము కోసం కాదు. 28 కాబట్టి, మనుష్యుని యొక్క కుమారుడు విశ్రాంతిదినమునకు కూడా ప్రభువై యున్నాడు.

Chapter 3

1 మరియు ఆయన ఒక సమాజమందిరములోనికి మరల ప్రవేశించాడు, మరియు అక్కడ ఊచ చెయ్యి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. 2 మరియు వారు ఆయనను సమీపంగా గమనిస్తూ ఉన్నారు ఆయన విశ్రాంతి దినమున అతనిని స్వస్థపరచిన యెడల, తద్వారా వారు ఆయనను నిందిస్తారు. 3 మరియు ఆయన ఊచ చెయ్యి గల మనుష్యునితో చెప్పాడు, “మధ్యలో లేచి నిలువుము.” 4 మరియు ఆయన వారితో చెప్పాడు, “విశ్రాంతిదినములలో మేలు చెయ్యడం లేదా కీడు చెయ్యడం చట్టబద్ధమా; ఒక ప్రాణాన్ని రక్షించడం లేదా చంపడం?” అయితే వారు మౌనంగా ఉన్నారు. 5 మరియు ఆయన వారి హృదయము యొక్క కాఠిన్యము చేత దుఃఖపడి, కోపముతో వారిని కలయ చూచాడు, ఆయన ఆ మనుష్యునితో చెప్పాడు, “నీ చెయ్యి బయటికి చాపుము.” మరియు అతడు దానిని బయటికి చాపాడు, మరియు అతని చెయ్యి బాగుపడెను. 6 మరియు పరిసయ్యులు వెలుపలికి వెళ్ళి, వెంటనే హేరోదీయులతో, వారు ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేసారు. 7 మరియు యేసు, తన శిష్యులతో, సముద్రము నొద్దకు వెళ్ళిపోయాడు, మరియు గలిలయ నుండి మరియు యూదయ నుండి ఒక గొప్ప సమూహము వెంబడించింది. 8 మరియు యెరూషలేము నుండి మరియు ఇదూమియా మరియు యొర్దాను నది అవతల మరియు తూరు మరియు సీదోను పట్టణాలు చుట్టు ప్రక్కల నుండి. ఒక గొప్ప సమూహము, ఆయన ఎంత చేయుచున్నాడని విని, ఆయన వద్దకు వచ్చారు. 9 మరియు ఆయన తన శిష్యులతో మాట్లాడాడు తద్వారా సమూహం కారణంగా ఒక చిన్న దోనె ఆయన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది, తద్వారా వారు ఆయనకు వ్యతిరేకంగా ఒత్తిడి చెయ్యరు. 10 ఎందుకంటే ఆయన అనేకులను స్వస్థపరచాడు, కాబట్టి రోగములు ఉన్న అనేకులు ఆయనను ముట్టు కొనవలెను అని ఆయనకు వ్యతిరేకంగా బలవంతం చేయుచున్నారు. 11 మరియు అపవిత్ర ఆత్మలు ఆయనను చూచి నప్పుడు, అవి ఆయన ఎదుట నేలపై పడుపోతు మరియు గట్టిగా అరుస్తు, చెపుతున్నాయి, “నీవు దేవుని యొక్క కుమారుడవు.” 12 మరియు ఆయన వారిని తరచూ గద్దించుచున్నాడు తద్వారా వారు ఆయనను తెలియ చేయ కుండా ఉంటారు. 13 మరియు ఆయన పర్వతము మీదకు వెళ్ళాడు మరియు ఆయన తానే కోరుకున్న వారిని పిలిపించాడు మరియు వారు ఆయన వద్దకు వెళ్ళారు. 14 మరియు ఆయన 12 మంది (ఆయన వారికి అపొస్తలులు అని కూడా పేరు పెట్టాడు) నియమించాడు తద్వారా వారు ఆయనతో ఉంటారు మరియు తద్వారా ఆయన వారిని ప్రకటించడానికి పంపుతాడు. 15 మరియు దయ్యములను బయటికి వెళ్ళగొట్టు అధికారము గలవారై యుండడానికి. 16 మరియు ఆయన పన్నెండు మందిని నియమించాడు, మరియు ఆయన సీమోనుకు పేతురు పేరును కలిపాడు; 17 మరియు జెబెదయి యొక్క {కుమారుడు} యాకోబు, మరియు యాకోబు సోదరుడు యోహాను, ఆయన వారికి బోయనేర్గెసు పేరు కూడా జత చేసాడు, అంటే, ఉరుము యొక్క కుమారులు; 18 మరియు అంద్రెయ, మరియు ఫిలిప్పు, మరియు బర్తొలొమయి, మరియు మత్తయి, మరియు తోమా, మరియు అల్ఫయి యొక్క {కుమారుడు} యాకోబు, మరియు తద్దయి, మరియు జెలోతీయుడు సీమోను 19 మరియు ఆయనను అప్పగించిన వాడు కూడా అయిన ఇస్కరియోతు యూదా. 20 మరియు ఆయన ఒక ఇంటిలోనికి వచ్చినప్పుడు, మరియు సమూహం మరల గుంపు కూడి వచ్చారు, తద్వారా వారు రొట్టె కూడా తిన లేక పోయారు. 21 మరియు ఆయన ప్రక్కన ఉన్నవారు, దాని గురించి విని, ఆయనను పట్టుకోడానికి వెళ్ళారు, ఎందుకంటే వారు చెప్పారు, “అతడు మతి తప్పి ఉన్నాడు.” 22 మరియు యెరూషలేము నుండి శాస్త్రులు వచ్చి చెప్పారు, “ఇతడు బయల్జెబూలును కలిగియున్నాడు” మరియు “దయ్యముల యొక్క యధిపతి చేత ఇతడు దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు.” 23 అయితే వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానములలో వారికి ఆయన చెపుతున్నాడు, “సాతాను సాతానును ఏవిధంగా వెళ్లగొట్ట గలడు? 24 మరియు ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల, ఆ రాజ్యము నిలువ నేరదు. 25 మరియు ఒక ఇల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ ఇల్లు నిలువ నేరదు. 26 మరియు సాతాను తనకు తానే విరోధముగా లేచి మరియు వేరుపడిన యెడల వాడు నిలువ లేడు, అతను నిలబడలేడు, కానీ అతనికి ముగింపు ఉంది. 27 అయితే బలవంతుడైన మనిషి యొక్క ఇంటి లోనికి ప్రవేశించి ఆ బలవంతుడైన మనిషిని అతడు మొదట బంధించితే తప్పించి అతని ఆస్తిని దొంగిలించడానికి మరియు అప్పుడు అతని ఇంటిని వాడు దోచుకోడానికి ఏ ఒక్కరూ చేయ లేరు. 28 మనుష్యుల యొక్క కుమారుల యొక్క పాపములు, దేవదూషణలు సహితం, వారు దేనినైనా దూషించవచ్చు, అన్నీ క్షమించబడతాయి అని నిజముగా నేను మీకు చెప్పుచున్నాను. 29 అయితే పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా దేవదూషణ చేయువాడెవరైననూ, నిత్యత్వముకు క్షమాపణ కలిగి యుండరు, అయితే నిత్య పాపము యొక్క దోషిగా ఉంటారు.” 30 ఎందుకంటే వారు చెపుతున్నారు, “ఆయన అపవిత్ర ఆత్మ కలిగిన వాడు.” 31 మరియు ఆయన తల్లి మరియు ఆయన సోదరులు వచ్చారు, మరియు వెలుపల నిలుచున్నారు, వారు ఆయన వద్దకు పంపారు, ఆయనను పిలిపించారు. 32 మరియు ఒక సమూహము ఆయన చుట్టూ కూర్చున్నారు, మరియు వారు ఆయనతో చెప్పారు, “ఇదిగో, నీ తల్లి మరియు నీ సోదరులు వెలుపల నిన్ను వెదకుచున్నారు.” 33 మరియు వారికి జవాబు ఇస్తూ, ఆయన చెప్పాడు, “నా తల్లి మరియు నా సోదరులు ఎవరు?” 34 మరియు ఒక వృత్తంలో తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచాడు, ఆయన చెప్పాడు, “ఇదిగో నా తల్లి మరియు నా సోదరులు! 35 ఎందుకంటే దేవుని యొక్క చిత్తము చేయువారు ఎవరైనా, ఇది నా సోదరుడు మరియు సోదరి మరియు తల్లి.”

Chapter 4

1 మరియు, మరల ఆయన సముద్ర తీరమున బోధించడానికి ఆరంభించాడు, మరియు ఒక పెద్ద సమూహం ఆయన చుట్టూ కూడివచ్చారు. కాబట్టి ఆయన సముద్రములో ఒక దోనెలో కూర్చోడానికి దానిలోనికి ప్రవేశించాడు, మరియు సమూహం అంతా సముద్ర తీరమున ఒడ్డు మీద కూర్చున్నారు. 2 మరియు ఆయన వారికి ఉపమానములలో అనేక సంగతులు బోధించుచూ ఉన్నాడు, మరియు ఆయన తన బోధలో వారికి చెప్పుచున్నాడు. 3 “వినండి! ఇదిగో, విత్తువాడు విత్తడానికి బయటకు వెళ్ళాడు. 4 మరియు వాడు విత్తుచుండగా ఇది సంభవించింది, కొన్ని దారి ప్రక్కను పడ్డాయి, మరియు పక్షులు వచ్చాయి, మరియు వాటిని మ్రింగివేసాయి. 5 మరియు కొన్ని రాతి నేల మీద పడ్డాయి, అక్కడ మన్ను ఎక్కువగా లేదు, మరియు వెంటనే అవి పైకి మొలిచాయి, ఎందుకంటే దానికి లోతైన నేల లేదు. 6 మరియు సూర్యుడు ఉదయించినప్పుడు, అది దహించివేయబడింది, మరియు దానికి వేరు లేని కారణంగా, అది ఎండిపోయింది. 7 మరియు కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, మరియు ముండ్లపొదలు పైకి ఎదిగాయి మరియు దానిని అణచివేసాయి, మరియు అది ఫలాన్ని ఇవ్వలేదు. 8 మరియు కొన్ని మంచి నేలలో పడ్డాయి, మరియు అది ఫలాన్ని పండిస్తుంది, పైకి పెరుగుతుంది మరియు వృద్ధి చెందుతుంది మరియు ఒకటి, 30, మరియు ఒకటి, 60, మరియు ఒకటి, 100 దిగుబడి ఇచ్చాయి.” 9 మరియు ఆయన చెప్పాడు, “వినడానికి చెవులు గలవాడు, వానిని విననివ్వండి!” 10 మరియు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, పండ్రెండుమందితో ఆయన చుట్టు ఉండినవారు ఉపమానమును గురించి ఆయనను అడిగారు. 11 మరియు ఆయన వారికి చెప్పడానికి ఆరంభించారు, “దేవుని యొక్క రాజ్యము మర్మము మీకు అనుగ్రహింపబడియున్నది, అయితే వెలుపల ఉన్న వారికి ప్రతీదీ ఉపమానములలో ఉన్నది. 12 తద్వారా చూడడం, వారు చూస్తారు అయితే తెలుసుకొనరు, మరియు వినడం, వారు వింటారు అయితే అర్థం చేసుకోరు, తద్వారా వారు తిరుగరు, మరియు ఇది వారికి క్షమించబడుతుంది. 13 మరియు ఆయన వారితో చెప్పాడు, “ఈ ఉపమానము మీకు అర్థం కాలేదా? మరియు ఉపమానములు అన్నీ మీరు ఏవిధంగా అర్థం చేసుకుంటారు? 14 విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. 15 ఇప్పుడు వీరు దారి ప్రక్కన ఉండు వారు, అక్కడ వాక్యము విత్తబడి ఉంది, అయితే వారు దానిని వినిన ప్రతీసారి, సాతాను వెంటనే వస్తాడు మరియు వారిలో విత్తబడిన {ఆ} వాక్యమును ఎత్తుకొనివెళ్తాడు. 16 మరియు అదే విధానంలో, వీరు రాతి నేల మీద విత్తబడి ఉన్న వారు, వారు, వాక్యమును వినిన ప్రతీసారి, వెంటనే దానిని సంతోషముతో స్వీకరిస్తారు. 17 మరియు వారికి తమలో వేరు లేదు, అయితే తాత్కాలికంగా ఉంది. అప్పుడు, వాక్యము కారణంగా శ్రమ లేదా హింస వచ్చినప్పడు, వెంటనే వారు తొట్రుపడతారు. 18 మరియు ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు. వీరు వాక్యము వినువారు, 19 అయితే జీవితంలో విచారములు మరియు సంపదల యొక్క మోసము మరియు ఇతర విషయముల ఆపేక్షలు, లోనికి ప్రవేశిస్తాయి, వాక్యమును అణచివేస్తాయి, మరియు అది నిష్ఫలముగా మారుతుంది. 20 మరియు మంచి నేలను విత్తబడినవారు, వాక్యమును వినువారు మరియు దానిని స్వీకరిస్తారు మరియు ఒక పంటను పండిస్తారు – ఒకటి, 30, ఒకటి, మరియు 60, మరియు ఒకటి 100. 21 మరియు ఆయన వారితో చెప్పాడు, “దీపము రాదు తద్వారా అది ఒక బుట్ట కింద లేదా మంచము కింద ఉంచ బడదు, అది అవుతుందా? కాదు కదా తద్వారా అది దీప స్తంభము మీద ఉంచబడుతుంది? 22 ఎందుకంటే ఇది బయలుపరచబడుటకే తప్పించి ఏదియు మరుగుచేయబడలేదు, మరియు ఇది బహిరంగపరచబడడానికే తప్పించి రహస్యమైనది ఏదియూ సంభవించ లేదు. 23 ఎవరికైనా చెవులు ఉన్న యెడల, అతనిని విననివ్వండి. 24 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీరు వినుచున్నదానికి గమనాన్ని పెట్టండి. మీరు ఎటువంటి కొలతను వినియోగిస్తారో, మీకును ఇది కొలువబడును, మరియు ఇది మీకు జత చెయ్యబడుతుంది. 25 ఎందుకంటే కలిగిన {వానికి}, ఇది ఇయ్యబడును, మరియు లేని {వానికి} అతడు కలిగి యున్నది కూడా వాని నుండి తీసివేయబడును. 26 మరియు ఆయన చెప్పుచున్నాడు, "ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం ఉంటుంది: ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లిన విధంగా, 27 మరియు అతడు నిద్ర పోవచ్చు మరియు రాత్రి మరియు పగలు లేవవచ్చు మరియు విత్తనం మొలకెత్తవచ్చు మరియు పెరగవచ్చు- అతడు తనకు తెలియకుండా ఎలా ఉంటాడు 28 నేల దాని సొంత పొందిక ప్రకారం పంటను పండిస్తుంది: మొదట మొలక, తరువాత వెన్నును, తరువాత వెన్నులో పరిపక్వ గింజ. 29 మరియు అది పంటను అందించినప్పుడు, ఆయన వెంటనే కొడవలిని పంపిస్తాడు, ఎందుకంటే కోతకాలము వచ్చింది. 30 మరియు ఆయన చెపుతున్నాడు, “దేవుని యొక్క రాజ్యమును మనం ఏవిధంగా పోల్చెదము, లేదా ఏ ఉపమానములో దానిని తెలియపరుస్తాము? 31 ఒక ఆవగింజను వలే {ఇది ఉంది}, అది భూమిలో విత్తబడినప్పుడు, భూమి మీదనున్న విత్తనములు అన్నిటికంటె చిన్నదిగా ఉంది, 32 మరియు అది విత్తబడినప్పుడు, అది పెరుగుతుంది మరియు తినదగిన మొక్కలు అన్నిటి కంటే గొప్పది అవుతుంది, మరియు అది పెద్ద కొమ్మలు చేయును, తద్వారా ఆకాశం యొక్క పక్షులు వాటి గూడులను దాని నీడలో తయారు చేసుకొంటాయి. 33 మరియు వారు వినడానికి శక్తి కలిగినకొలది అటువంటి అనేక ఉపమానములతో ఆయన వారితో వాక్యము మాట్లాడు చుండెను. 34 అయితే ఉపమానము లేకుండా ఆయన వారితో మాట్లాడడం లేదు, అయితే తనకై తాను ఆయన {తన} సొంత శిష్యులకు ప్రతీ దానిని వివరిస్తున్నాడు. 35 మరియు ఆ దినమే ఆయన వారితో చెప్పాడు, సాయంకాలమైనప్పుడు, “మనము ఆవలి వైపుకు దాటి వెళ్దాము.” 36 మరియు సమూహమును విడిచి పెట్టి, వారు ఆయన ఉన్న విధంగా దోనేలో ఆయనను {తమ}తో తీసుకెళ్ళారు, మరియు ఇతర దోనెలు ఆయనతో ఉన్నాయి. 37 మరియు ఒక గొప్ప గాలి యొక్క తుపాను సంభవించింది, మరియు అలలు దోనెలోనికి కొట్టాయి తద్వారా దోనె అప్పటికే నిండిపోయినట్టుగా ఉంది. 38 మరియు ఆయన తానే దోనె యొక్క చివరి భాగమున ఉన్నాడు, అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. మరియు వారు ఆయనను లేపారు మరియు ఆయనతో చెప్పారు, “బోధకుడా, మేము నశించిపోవుచున్నాము అని నీవు శ్రద్ధ చూపడం లేదా?” 39 మరియు నిద్ర మేల్కొని, ఆయన గాలిని గద్దించాడు, మరియు సముద్రముతో చెప్పాడు, “నిశ్శబ్దంగా ఉండు! నిశ్చలంగా ఉండు!” మరియు గాలి ఆగిపోయింది, మరియు అక్కడ గొప్ప నెమ్మది ఉంది. 40 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీరు ఎందుకు భయపడుచున్నారు? మీకు ఇంకా విశ్వాసం లేదా?” 41 మరియు వారు గొప్ప భయంతో నిండిపోయారు మరియు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు, “అప్పుడు ఈయన ఎవరు, ఎందుకంటే గాలి మరియు సముద్రము కూడా ఈయనకు లోబడుచున్నవి?”

Chapter 5

1 మరియు వారు సముద్రమునకు అవతలి వైపుకు వచ్చారు, గెరాసేనుల యొక్క ప్రాంతమునకు. 2 మరియు {అప్పుడు} ఆయన ఆయన దోనె నుండి బయటికి వచ్చాడు, వెంటనే ఒక అపవిత్ర ఆత్మతో ఒక మనిషి ఆయనను కలుసుకోడానికి సమాధుల నుండి వచ్చాడు. 3 అతడు {తన} నివాసం సమాధులలో ఉంది, మరియు ఎవడునూ అతనిని ఎంత మాత్రము బంధించ లేకపోయారు, కనీసం ఒక గొలుసుతో కూడా, 4 ఎందుకంటే అతడు తరచుగా సంకెళ్ళు మరియు గొలుసులతో బంధించబడ్డాడు, అయితే గొలుసులు అతని చేత నలిగిపోయాయి మరియు సంకెళ్ళు తునకలై పోయాయి మరియు అతనిని లోబరుచుకోడానికి బలంగా ఏ ఒక్కరూ లేరు. 5 మరియు సమాధులలో మరియు పర్వతములలో ప్రతి రాత్రి మరియు పగలు అంతటా, అతడు కేకలువేయుచున్నాడు మరియు తన్నుతాను రాళ్లతో కోసుకొంటున్నాడు. 6 మరియు దూరము నుండి యేసును చూసి, వాడు ఆయన వద్దకు పరుగెత్తికొని వచ్చాడు మరియు ఆయన ముందు కిందకు వంగాడు. 7 మరియు ఒక పెద్ద స్వరంలో అరిచాడు, అతడు చెప్పాడు, “నాకు మరియు నీకు ఏమిటి, యేసూ, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడా, దేవుని చేత నేను నిన్ను బతిమాలుచున్నాను, నన్ను బాధపరచ వద్దు.” 8 ఎందుకంటే ఆయన అతనితో చెపుతున్నాడు, “అపవిత్ర ఆత్మా, యీ మనుష్యుని నుండి బయటికి రమ్ము.” 9 మరియు ఆయన అతనిని అడిగాడు, “నీ పేరు ఏమిటి?” మరియు అతడు ఆయనతో చెప్పాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులము.” 10 మరియు ఆయన వాటిని ఆ ప్రాంతం నుండి పంపించ వద్దు అని అతడు ఆయనను పలుమార్లు బతిమాలాడు. 11 అయితే అక్కడ కొండ మీద మేయుచూ ఉన్న పందుల ఒక గొప్ప మంద ఉంది. 12 మరియు అవి ఆయనను బతిమాలడాయి, చెప్పాయి, “మమ్మును పందులలోనికి పంపు.” తద్వారా మేము వాటిలోనికి ప్రవేశిస్తాము. 13 మరియు ఆయన వాటికి అనుమతి ఇచ్చాడు, మరియు బయటికి వచ్చి, అపవిత్ర ఆత్మలు పందులు మరియు మంద లోనికి ప్రవేశించాయి. దాదాపు 2,000 - ఆ సముద్రములో లోతుకు ఏటవాలుగా పరుగెత్తుకొని వెళ్ళాయి మరియు సముద్రములో మునిగిపోయాయి. 14 మరియు వాటిని మేపుచున్నవారు పారిపోయారు మరియు {దీనిని} నగరములో మరియు పల్లెటూరు ప్రాంతంలో తెలియజేసారు మరియు జరిగినది ఇది ఏమిటి {అని} చూడడానికి వారు బయటికి వెళ్ళారు. 15 మరియు వారు యేసు వద్దకు వచ్చారు మరియు దయ్యము పట్టినవాడిని – ఆ సేనను కలిగియున్నవాడు, కూర్చుని, వస్త్రములు వేసుకుని మరియు తన సరియైన మనసులో ఉండడం చూసారు మరియు వారు భయపడ్డారు. 16 మరియు దయ్యం పట్టిన వ్యక్తికి ఇది ఏవిధంగా జరిగిందో చూసిన వారు {దీనిని} వారికి మరియు పందుల గురించి వివరించారు. 17 మరియు తమ ప్రాంతము నుండి విడిచివెళ్ళడానికి ఆయనను బతిమాలడానికి వారు ఆరంభించారు. 18 మరియు ఆయన దోనెలోనికి ఎక్కి {నప్పుడు}, దయ్యములు పెట్టినవాడు ఆయనను బతిమాలుచున్నాడు తద్వారా అతడు ఆయనతో ఉంటాడు. 19 అయితే ఆయన అతని అనుమతించలేదు, అయితే అతనికి చెప్పాడు, “నీ ఇంటికి వెళ్ళుము, నీ {మనుష్యుల} వద్దకు, మరియు ప్రభువు నీ కోసం ఎంత చేసాడో, మరియు నీ మీద కరుణ కలిగియున్నాడో వారికి తెలియజెప్పు, 20 మరియు అతడు వెళ్ళాడు, మరియు యేసు తన కోసం చేసినది అంతా దెకపొలిలో ప్రకటించడానికి ఆరంభించాడు. మరియు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడ్డారు. 21 మరియు యేసు మరల దోనెలో అద్దరికి దాటి వెళ్లి {నప్పుడు}, ఒక గొప్ప సమూహము ఆయన చుట్టూ చేరారు. మరియు ఆయన సముద్రం ప్రక్కన ఉన్నాడు. 22 మరియు ఇదిగో, సమాజమందిరము యొక్క నాయకులలో ఒకడు, యాయీరు అని పిలువబడిన వాడు వచ్చాడు, మరియు ఆయనను చూచి, అతడు ఆయన పాదముల మీద పడ్డాడు. 23 మరియు అతడు ఆయనను పలుమార్లు బతిమాలుచున్నాడు, చెప్పాడు, "నా చిన్న కుమార్తె తీవ్రమైన స్థితిలో ఉంది; రండి, తద్వారా ఆమె స్వస్థత పొంది, మరియు ఆమె బ్రతకు నిమిత్తం నీవు ఆమె మీద {నీ} చేతులు వేస్తావు." 24 మరియు అతనితో వెళ్ళాడు. మరియు ఒక గొప్ప సమూహమును ఆయనను వెంబడించారు మరియు ఆయన మీద పడుచుండిరి. 25 మరియు 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో ఉన్న ఒక స్త్రీ ఉంది, 26 మరియు అనేక వైద్యుల నుండి చాలా శ్రమ పడింది, మరియు ఆమె కలిగియున్న {దాని} నంతటిని ఖర్చు చేసింది, మరియు సహాయము చెయ్యబడ లేదు, అయితే బదులుగా మిక్కిలి చెడ్డగా మారింది. 27 యేసు గురించి {సంగతులు} విని, సమూహములో ఆయన వెనుకకు వచ్చింది, ఆమె ఆయన వస్త్రమును ముట్టుకుంది. 28 ఎందుకంటే ఆమె చెప్పింది, “ఆయన వస్త్రమును మాత్రము ముట్టుకొనిన యెడల, నేను కాపాడబడుదును.” 29 మరియు వెంటనే ఆమె రక్తస్రావము ఎండిపోయింది, మరియు రోగము నుండి స్వస్థపరచబడ్డాను అని ఆమె {తన} శరీరములో తెలుసుకొంది. 30 మరియు వెంటనే యేసు, తన నుండి {తన} శక్తి బయటకు వెళ్ళింది అని తనలో గుర్తించాడు, సమూహములో చుట్టూ తిరిగాడు, చెప్పాడు, “నా వస్త్రములను ఎవరు తాకారు?” 31 మరియు ఆయన శిష్యులు ఆయనతో చెప్పారు, “సమూహము నీ మీద పడుచుండుట నీవు చూచుచున్నావు, మరియు నువ్వు చెప్పుచున్నావు, ‘నన్ను ముట్టినది ఎవరు?’” 32 అయితే దీనిని చేసిన వానిని చూడడానికి ఆయన చుట్టు చూసాడు. 33 మరియు ఆ స్త్రీ భయపడి మరియు వణకుచు వచ్చి, ఆమెకు జరిగిన దానిని తెలుసుకొంది, వచ్చింది మరియు ఆయన ముందు కిందకు వంగింది మరియు ఆయనకు సత్యము అంతా చెప్పింది. 34 అయితే ఆయన ఆమెతో చెప్పాడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానములో వెళ్ళు మరియు నీ రోగము నుండి స్వస్థత పొందు.” 35 ఆయన {ఇంకను} మాటలాడుచుండగా, వారు సమాజమందిరము యొక్క నాయకుని {ఇంటి} నుండి కొందరు వచ్చారు, చెప్పారు, “నీ కుమార్తె చనిపోయినది. ఇకమీదట బోధకుని శ్రమపెట్టడం ఎందుకు?” 36 అయితే యేసు, పలుకబడిన మాట విని, సమాజమందిరము యొక్క అధికారితో చెప్పాడు, “భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము.” 37 మరియు పేతురు మరియు యాకోబు మరియు యాకోబు యొక్క సోదరుడు యోహాను తప్పించి ఎవరినీ తన వెంబడి రావడానికి అనుమతించ లేదు. 38 మరియు ఆయన సమాజమందిరము యొక్క అధికారి యొక్క యింటికి వచ్చాడు, మరియు గగ్గోలును మరియు యేడుపు మరియు చాలా రోదనము చూసాడు. 39 మరియు ప్రవేశించి, ఆయన వారితో చెప్పాడు, “మీరు ఎందుకు కలవరపడుతున్నారు మరియు యేడ్చుచున్నారు? చిన్నబిడ్డ చనిపోలేదు అయితే నిద్రించుచున్నది. 40 మరియు వారు ఆయనను చూచి నవ్వుతున్నారు, అయితే ఆయన, {వారు} అందరిని బయట ఉంచాడు, ఆ చిన్నబిడ్డ యొక్క తండ్రిని మరియు తల్లిని మరియు తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని తీసుకు వెళ్ళాడు మరియు చిన్నబిడ్డ ఉన్నచోటికి ప్రవేశించాడు. 41 మరియు ఆ చిన్నబిడ్డ యొక్క చేతిని తీసుకొన్నాడు, ఆయన ఆమెతో చెప్పాడు, “తలీతా, కౌం!” అది “చిన్న పాపా, నేను నీకు చెపుతున్నాను, పైకి లెమ్ము” అని అనువదించబడింది. 42 మరియు వెంటనే ఆ చిన్న పాప పైకి లేచింది మరియు నడస్తుంది (ఎందుకంటే ఆమెకు 12 సంవత్సరముల {వయస్సు}), మరియు వెంటనే వారు గొప్ప దిగ్భ్రాంతితో ఆశ్చర్యపోయారు. 43 మరియు దీని గురించి ఏ ఒక్కరికీ తెలియకూడదు అని ఆయన వారికి ఖండితముగా ఆదేశించాడు, మరియు తినడానికి ఆమెకు ఏదైనా ఇవ్వాలని వారికి చెప్పాడు.

Chapter 6

1 మరియు ఆయన అక్కడ నుండి వెళ్ళాడు మరియు తన స్వదేశమునకు వచ్చాడు, మరియు ఆయన శిష్యులు ఆయనను వెంబడించారు. 2 మరియు ఒక విశ్రాంతిదినము వచ్చింది, ఆయన సమాజమందిరములో బోధించడానికి ఆరంభించాడు. మరియు ఆయనను వింటున్నవారు అనేకులు ఆశ్చర్యపడ్డారు, చెప్పారు, “ఈ సంగతులు ఎక్కడ నుండి {ఉన్నాయి}, మరియు ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిదై {ఉంది}, మరియు ఇతని చేతుల చేత ఈ అద్భుతములు చేయబడుచున్నవి? 3 ఇతడు వడ్రంగి, మరియ యొక్క కుమారుడు మరియు యాకోబు, మరియు యోసే, మరియు యూదా, మరియు సీమోనుల యొక్క సోదరుడు కాడా? మరియు ఇతని సహోదరీలు మనతో నున్నారు కారా? మరియు ఆయన చేత అభ్యంతరపడ్డారు. 4 మరియు యేసు వారితో చెప్పాడు, “ఒక ప్రవక్త తన స్వగ్రామంలో మరియు తన బంధువుల మధ్య మరియు {తన} సొంత ఇంటిలో తప్పించి గౌరవం లేనివాడు కాదు. 5 మరియు కొద్దిమంది రోగుల మీద {తన} చేతులు ఉంచి ఆయన {వారిని} స్వస్థపరచడం తప్పించి ఆయన అక్కడ ఏ శక్తి గల కార్యమును చేయజాలక పోయాడు. 6 మరియు ఆయన వారి అవిశ్వాసము కారణంగా ఆశ్చర్యపడ్డాడు. మరియు ఆయన చుట్టుప్రక్కలనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. 7 మరియు ఆయన పండ్రెండు మందిని పిలిచాడు మరియు వారిని ఇద్దరిద్దరినిగా పంపించడానికి ఆరంభించాడు మరియు అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. 8 మరియు ప్రయాణము కోసం వారు ఒక చేతికఱ్ఱ మాత్రమే తప్పించి ఏమీ తీసుకు వెళ్ళకూడదు అని ఆయన వారికి ఆజ్ఞాపించాడు – రొట్టె కాదు, సంచి కాదు, {వారి} దట్టీలలో డబ్బు కాదు- 9 అయితే చెప్పులు తొడగుకొని, మరియు, “మీరు రెండు అంగీలు దరించవద్దు.” 10 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీరు ఒక యింటిలోనికి ప్రవేశించినప్పుడెల్లా, అక్కడనుండి మీరు బయలుదేరు వరకు అక్కడనే నిలిచియుండండి. 11 మరియు ఏ స్థలమైనను మిమ్మును చేర్చుకొనకుండా లేదా మీ మాటలు వినకుండా ఉన్నప్పుడు, అక్కడ నుండి బయలుదేరి, వారికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యము కోసం మీ పాదముల క్రింది {ఉన్న} ధూళి దులిపివేయుడి. 12 మరియు శిష్యులు బయటకు వెళ్ళి, {మనుష్యులు} పశ్చాత్తాపపడాలి {అని} వారు ప్రకటించారు. 13 మరియు వారు అనేక దయ్యములు వెళ్లగొట్టుచున్నారు మరియు నూనెతో రోగులైన {మనుష్యులను} అభిషేకించారు మరియు వారిని స్వస్థపరచుచున్నారు. 14 మరియ రాజైన హేరోదు ఆయనను గురించి విన్నాడు ఎందుకంటే ఆయన పేరు ప్రసిద్ది అయ్యింది, మరియు చెప్పారు, “బాప్తిసం ఇచ్చే యోహాను మృతులలో నుండి లేపబడి యున్నాడు, మరియు దీని కారణంగా, అద్భుత శక్తులు అతనిలో క్రియజరిగించుచున్నాయి.” 15 అయితే ఇతరులు చెప్పారు, “ఈయన ఏలీయా.” అయితే మరికొందరు చెపుతున్నారు, “ఒక ప్రవక్త, ప్రవక్తలలో ఒకని వలె ఉన్నాడు.” 16 అయితే హేరోదు, {దీనిని} విని, చెప్పాడు, “నేను శిరచ్చేదం చేసిన యోహాను, అతడు లేపబడ్డాడు.” 17 ఎందుకంటే హేరోదు తానే పంపి, యోహానును బంధించాడు మరియు అతడు {తన సోదరుడు ఫిలిప్పు భార్య} హేరోదియ కారణంగా అతనిని చెరసాలలో బంధించాడు, ఎందుకంటే అతడు ఆమెను పెండ్లి చేసుకొన్నాడు. 18 ఎందుకంటే యోహాను హేరోదుతో చెప్పాడు, “నీ సోదరుని యొక్క భార్యను కలిగియుండడం నీకు ఇది చట్టబద్ధం కాదు.” 19 అయితే హేరోదియ అతనితో కోపంగా ఉంది మరియు అతనిని చంపడానికి కోరుకుంది, అయితే ఆమె చెయ్యలేక పోయింది. 20 ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడ్డాడు, అతడు నీతిమంతుడు మరియు పరిశుద్ధుడుగా {ఉన్నాడని} ఎరిగి, మరియు అతనిని కాపాడుచు వచ్చెను, మరియు అతని మాటలు వినినప్పుడు, అతడు చాలా కలవరపడ్డాడు, అయినా అతడు అతని మాటలు సంతోషముతో వినుచూఉన్నాడు. 21 మరియు అనుకూలమైన దినము ఒకటి వచ్చింది, అప్పుడు హేరోదు తన ప్రధానుల కోసం మరియు సహస్రాధిపతుల కోసం మరియు గలిలయ యొక్క నాయకుల కోసం తన జన్మ దిన విందు చేయించాడు. 22 మరియు అతని కుమార్తె హేరోదియ వచ్చింది మరియు నాట్యమాడింది మరియు హేరోదును మరియు {అతనితో} ఏటవాలుగా కూర్చున్నవారిని సంతోషపరచింది, రాజు చిన్న దానితో చెప్పాడు, “నీకు ఇష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, మరియు నేను {దానిని} నీకు ఇస్తాను.” 23 మరియు అతడు ఆమెకు ప్రమాణం చేసాడు, “నీవు నన్ను ఏమి అడిగినను నేను నా రాజ్యము యొక్క సగము వరకు దానిని నేను నీకు ఇస్తాను.” 24 మరియు బయటికి వెళ్ళి, ఆమె తన తల్లితో చెప్పింది, “నేను ఏమి అడగాలి?” మరియు ఆమె చెప్పింది, “బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల.” 25 మరియు వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చింది, ఆమె బతిమాలింది, చెప్పింది, "బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల ఒక పళ్లెములో ఒక్కసారి నాకు నీవు ఇవ్వాలి అని నేను కోరుచున్నాను." 26 మరియు రాజు లోతుగా దుఃఖ పడ్డాడు, {అతని} ప్రమాణాలు మరియు తనతో భోజనం చెయ్యడానికి ఏటవాలుగా కూర్చుండియున్న వారి కారణంగా ఆమెను నిరాకరించడానికి అతడు కోరుకోలేదు. 27 మరియు రాజు, వెంటనే ఒక శిరశ్ఛేదకుడిని పంపాడు, అతని తలను తీసుకురావడానికి {అతనికి} ఆజ్ఞాపించాడు, మరియు కాబట్టి బయటికి వెళ్ళాడు. అతడు చెరసాలలో అతని శిరచ్ఛేదం చేసాడు. 28 మరియు అతడు ఒక పళ్లెములో అతని తలను తీసుకొని వచ్చాడు మరియు దానిని ఆ చిన్నదానికి ఇచ్చాడు, మరియు ఆ చిన్నది తన తల్లికి దానిని ఇచ్చింది. 29 మరియు అతని శిష్యులు {ఈ} సంగతి విని, వచ్చారు మరియు ఆయన దేహమును ఎత్తికొనిపోయారు మరియు దానిని ఒక సమాధిలో ఉంచారు. 30 మరియు అపొస్తలులు యేసుతో కలిసి సమావేశమయ్యారు, మరియు తాము చేసిన వన్నియు మరియు బోధించిన వన్నియు ఆయనకు తెలియజేసారు. 31 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీకై మీరు, మీరే ఒక నిర్జన ప్రదేశానికి రండి, మరియు కొంచెము సేపు విశ్రాంతి తీసుకోండి.” ఎందుకంటే వచ్చుచున్న వారు మరియు పోవుచున్నవారు అనేకులు, మరియు భోజనము చేయడానికి సహితం వారికి అవకాశము లేదు. 32 మరియు వారు తమంతట తాము దోనెలో ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళారు. 33 అయితే వారు వెళ్లుచుండగా అనేకులు చూసారు మరియు {వారిని} గుర్తుపట్టారు, మరియు అన్ని పట్టణముల నుండి అక్కడికి కాలినడకను కలిసి పరుగెత్తారు, మరియు వారు వారికంటె ముందుగా వచ్చారు. 34 మరియు బయటికి వచ్చిన తరువాత, ఆయన ఒక గొప్ప సమూహమును చూసాడు, మరియు వారి మీద కనికరపడ్డాడు ఎందుకంటే వారు ఒక కాపరి లేని గొఱ్ఱెల వలె ఉన్నారు, మరియు ఆయన వారికి అనేక {సంగతులు} బోధించడానికి ఆరంభించాడు. 35 మరియు గడియ అప్పటికే ఆలస్యం అయ్యింది, ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, చెప్పారు, “ఈ స్థలం నిర్జనమైనది, మరియు గడియ ఇప్పటికే ఆలస్యం {అయ్యింది}. 36 వాటిని పంపించు తద్వారా, చుట్టుపట్ల పల్లెటూరులు మరియు గ్రామాలలోనికి వెళ్లి, వారు వారి కోసం భుజించడానికి ఏదైనా కొనుక్కుంటారు." 37 అయితే ఆయన, జవాబిచ్చాడు, వారికి చెప్పాడు, "మీరు వారికి భోజనముచెయ్యడానికి ఇవ్వండి." మరియు వారు ఆయనతో చెప్పారు, "వెళ్లి, 200 దేనారముల రొట్టెలు కొని మరియు వారు భుజించడానికి {దానిని} పెట్టుదుమా?" 38 అయితే ఆయన వారితో చెప్పాడు, “మీరు ఎన్ని రొట్టెలు కలిగి యున్నారు” వెళ్ళండి. చూడండి.” మరియు కనుగొని, వారు చెప్పారు, “ఐదు, మరియు రెండు చేపలు.” 39 మరియు ఆకుపచ్చ గడ్డి మీద అందరు గుంపులు గుంపులుగా ఏటవాలుగా కూర్చోడానికి ఆయన వారిని ఆజ్ఞాపించాడు. 40 మరియు వారు వందల ప్రకారం మరియు యాభైల ప్రకారం గుంపులు గుంపులుగా ఏటవాలుగా కూర్చున్నారు. 41 మరియు ఆయన ఆ అయిదు రొట్టెలు మరియు రెండు చేపలను పట్టుకొని, ఆకాశము వైపు పైకి చూసి, ఆయన ఆశీర్వదించాడు మరియు ఆ రొట్టెలు విరిచాడు మరియు తన శిష్యులకు వాటిని ఇచ్చాడు తద్వారా వారు వాటిని వారి ముందు ఏర్పరచుతారు, మరియు రెండు చేపలు {వారి} అందరి మధ్య విభజించాడు. 42 మరియు వారు అందరు తిన్నారు మరియు తృప్తి చెందారు. 43 మరియు వారు విరిగిన ముక్కలను మరియు చేపలలో నుండి 12 పూర్తి బుట్టలను తీసుకున్నారు. 44 మరియు ఆ రొట్టెలు తినినవారు 5,000 మంది పురుషులు. 45 మరియు వెంటనే ఆయన జనసమూహమును పంపివేయు చుండగా, దోనెలోనికి ఎక్కి మరియు అద్దరిన ఉన్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. 46 మరియు ఆయన వారిని పంపి వేసి, ప్రార్థన చేయడానికి పర్వతానికి వెళ్ళాడు. 47 మరియు సాయంకాలమైనప్పుడు, ఆ దోనె సముద్రము యొక్క మధ్యలో ఉంది, మరియు ఆయన ఒంటరిగా నేల మీద ఉన్నాడు. 48 మరియు వారు దోనెమీద ప్రయాణం అవుతున్నప్పుడు వారు బాధించపడుతూ ఉండడం చూచి – ఎందుకంటే వారికి గాలి వ్యతిరేకంగా ఉంది – మరియు దాదాపు రాత్రి యొక్క నాలుగవ జామున, ఆయన వారి వద్దకు వచ్చాడు. సముద్రము మీద నడుచుచు మరియు వారి యొద్దకు రావడానికి ఉద్దేశించాడు. 49 అయితే వారు, ఆయన సముద్రము మీద నడవడం వారు చూచి, ఒక భూతము అని తలంచారు, మరియు వారు గట్టిగా అరిచారు, 50 ఎందుకంటే వారు అందరూ ఆయన చూచారు మరియు తొందరపడ్డారు. అయితే వెంటనే ఆయన వారితో మాట్లాడాడు మరియు వారికి చెప్పాడు, “ధైర్యము తెచ్చుకొనుడి! ఇది నేనే! భయపడ వద్దు.” 51 మరియు ఆయన వారితో దోనె లోనికి వెళ్ళాడు, మరియు గాలి నిమ్మళించింది, మరియు వారు తమలోతాము చాలా ఆశ్చర్యపడ్డారు. 52 ఎందుకంటే వారు రొట్టెలను గురించి అర్థం చేసుకోలేదు, అయితే వారి హృదయము కఠినమయ్యింది. 53 మరియు ఆ ప్రదేశాన్ని దాటి వారు వెళ్లి గెన్నేసరెతుకు వచ్చారు మరియు అక్కడ లంగరు వేశారు. 54 మరియు వారు దోనె నుండి దిగి {నప్పుడు}, వెంటనే ఆయనను గుర్తించి, 55 వారు ఆ ప్రాంతం అంతటి ద్వారా పరుగెత్తారు మరియు ఆయన యున్నాడు అని వారు వినిన చోటుకు రోగులను {తమ} పరుపుల మీద మోసికొనిరావడానికి ఆరంభించారు. 56 మరియు గ్రామములలోనికి, లేదా నగరములలోనికి లేదా పల్లెటూరులలోనికి ఆయన యెక్కడెక్కడ ప్రవేశించాడో, వారు సంత వీదులలో రోగులను ఉంచుతున్నారు మరియు ఆయన బతిమాలుచున్నారు తద్వారా వారు కనీసం ఆయన వస్త్రము యొక్క అంచును ముట్టుకుంటారు, మరియు ఆయనను ముట్టిన వారు అందరూ స్వస్థతనొందారు.

Chapter 7

1 మరియు పరిసయ్యులు మరియు శాస్త్రులలో కొందరు, యెరూషలేము నుండి వచ్చారు, ఆయన చుట్టూ కూడి వచ్చారు. 2 మరియు వారు ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో రొట్టె తినడం చూచారు. 3 (ఎందుకంటే పరిసయ్యులు మరియు యూదులు అందరూ పెద్దల యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ పిడికిలితో {వారి} చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చేయరు. 4 మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు, నీళ్ళు చల్లుకొంటేనే గాని వారు భోజనము చేయరు, మరియు ఇది గాక గిన్నెలు, మరియు కుండలు, మరియు ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఇతర ఆచారములను వారు అనుసరించుటకు స్వీకరించారు. 5 అప్పుడు పరిసయ్యులు మరియు శాస్త్రులు ఆయనను అడిగారు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల యొక్క పారంపర్యాచారము చొప్పున నడుచుకొనుట లేదు, అయితే వారు కడుగుకొనని చేతులతో {తమ} రొట్టె తింటారా?” 6 అయితే ఆయన, జవాబిస్తూ, వారితో చెప్పాడు, “వేషధారులైన మీ గురించి యెషయా బాగుగా ప్రవచించాడు. వ్రాయబడిన విధముగా,ఈ మనుష్యులు {తమ} పెదవులతో నన్ను ఘనపరచుదురు, అయితే వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7 అయితే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు, మనుష్యుల యొక్క ఆజ్ఞలు దేవోప దేశములుగా బోధించుచు. 8 మీరు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల యొక్క పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9 మరియు ఆయన వారితో చెప్పుచున్నాడు, “మీరు దేవుని యొక్క ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు తద్వారా మీరు మీ పారంపర్యా చారమును గైకొంటారు! 10 ఎందుకంటే మోషే చెప్పాడు, ‘నీ తండ్రిని మరియు నీ తల్లిని సన్మానించండి’, మరియు, {తన} తండ్రి లేదా {తన} తల్లి గురించి చెడుగా మాట్లాడేవాడు – అతనిని మరణంతో ముగించనివ్వండి. 11 అయితే మీరు చెపుతారు, “ఒక మనుష్యుడు {తన} తండ్రితో లేదా {తన} తల్లితో, “నా నుండి నీకు ప్రయోజనమగునది ఏదో కొర్బాను {అవుతుంది}” (అది, ఒక కానుక), 12 మీరు అతని {తన} తండ్రి లేదా {తన} తల్లి కోసం ఏదైనా చేయుటకు మీరు అతనిని ఇక మీదట అనుమతించరు, 13 మీరు నియమించిన మీ పారంపర్యాచారము చేత దేవుని యొక్క వాక్యమును నిరర్థకము చేయుదురు, మరియు మీరు ఇటువంటి {క్రియలు} అనేకములు మీరు చేయుదురు. 14 మరియు ఆయన సమూహమును మరల పిలిచాడు, ఆయన వారితో చెప్పుచున్నాడు, “నేను చెప్పునది {మీరు} అందరు వినండి, మరియు అర్థం చేసుకోండి: 15 వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రము చేయగలుగునది ఏదియు లేదు; అయితే మనుష్యుని నుండి బయటికి వెళ్ళు {సంగతులు} మనుష్యుని అపవిత్రము చేయును.” 16 [ఎవరికైనా వినడానికి చెవులు ఉంటే, అతనిని విననివ్వండి.] 17 మరియు ఆయన జనసమూహము నుండి ఒక యింటి లోనికి ప్రవేశించినప్పుడు, ఆయన శిష్యులు ఆ ఉపమానమును గురించి ఆయనను అడుగుచున్నారు. 18 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీరు కూడా ఈ విధంగా అవగాహన లేకుండా ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునది ప్రతీది వానిని అపవిత్రునిగా చేయజాలదు అని మీరు అర్థం చేసుకో లేదా, 19 ఎందుకంటే అది అతని హృదయం లోనికి వెళ్ళ లేదు, అయితే కడుపు లోనికి ప్రవేశించి, మరియు బయట మరుగుదొడ్డి లోనికి వెళుతుంది (అన్ని ఆహారములను శుభ్రంగా చేస్తుంది). 20 అయితే ఆయన చెప్పుచున్నాడు, “మనుష్యుని నుండి బయటకు వచ్చునది, అది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. 21 ఎందుకంటే లోపలి నుండి, మనుష్యుల యొక్క హృదయము నుండి, దుష్ట ఆలోచనలు, లైంగిక దుర్నీతి, దొంగతనము, హత్య వచ్చును. 22 వ్యభిచారము, లోభము, చెడుతనము, మోసం, కామవికారము, దుష్ట చూపు, దూషణ, అహంభావము, {మరియు} అవివేకమును. 23 ఈ దుష్టమైనవి అన్నియు లోపలి నుండి బయటకు వస్తాయి, మరియు మనుష్యుని అపవిత్రపరుస్తాయి. 24 ఇప్పుడు అక్కడ నుండి పైకి లేచాడు, ఆయన తూరు మరియు సీదోను యొక్క ప్రాంతములకు వెళ్ళాడు, మరియు ఒక ఇంటి లోనికి ప్రవేశించాడు, {అది} ఎవనికిని తెలియకుండవలెనని ఆయన కోరుచున్నాడు, అయితే ఆయన దాగి యుండ లేక పోయాడు. 25 అయితే వెంటనే, అపవిత్ర ఆత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయన గురించి విన్నది, వచ్చింది, ఆయన పాదముల వద్ద క్రింద పడింది. 26 ఇప్పుడు గ్రీసు దేశస్తురాలైన స్త్రీ, వంశం చేత సురోఫెనికయరాలు, మరియు ఆమె తన కుమార్తె నుండి దయ్యమును వెళ్ళగొట్టాలి అని ఆయనను అడిగింది. 27 మరియు ఆయన ఆమెకు చెప్పుచున్నాడు, “మొదట ఆహారం ఇవ్వడానికి పిల్లలను అనుమతించండి, ఎందుకంటే పిల్లల యొక్క రొట్టె తీసికొని మరియు కుక్కలకు వేయుట {ఇది} మంచిది కాదు. 28 అయితే ఆయనకు జవాబిచ్చింది మరియు ఆయనకు చెప్పింది, “అవును, ప్రభువా, మరియు కుక్కపిల్లలు బల్ల క్రింద ఉండి, పిల్లలు యొక్క రొట్టెముక్కల నుండి తింటాయి. 29 మరియ ఆయన ఆమెతో చెప్పుచున్నాడు, “ఈ మాట కారణంగా, వెళ్లుము! దయ్యం నీ కుమార్తెను నుండి బయటకు వెళ్ళిపోయింది. 30 మరియు ఆమె తన యింటికి వెళ్ళిపోయిన తరువాత, ఆమె మంచం మీద పడి ఉన్న బిడ్డను కనుగొన్నది, మరియు దయ్యము బయటకు వెళ్ళిపోయింది. 31 మరియు మరల తూరు యొక్క ప్రాంతములు నుండి వెళ్ళిపోయాడు, ఆయన సీదోను ద్వారా దెకపొలి ప్రాంతం యొక్క మధ్యలో గలిలయ యొక్క సముద్రముకు వెళ్ళాడు. 32 మరియు వారు ఒక చెవుడు {మనుష్యుని} మరియు ఒక నత్తివానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు, మరియు అతని మీద {ఆయన} చెయ్యి ఉంచుమని వారు ఆయనను వేడుకున్నారు. 33 మరియు సమూహము నుండి ఆయన వానిని ప్రక్కకు తీసుకొనివెళ్ళాడు, ఆయన వాని చెవులలోనికి తన వ్రేళ్లు ఉంచాడు, మరియు ఉమ్మి వేసి, ఆయన అతని నాలుకను ముట్టాడు. 34 మరియు ఆకాశము వైపుకు పైకి చూసాడు, ఆయన నిట్టూర్పు విడిచాడు మరియు వానితో చెప్పాడు, “ఎఫ్ఫతా!” (అంటే “తెరవబడుము”) 35 మరియు అతని చెవులు తెరవబడ్డాయి, మరియు అతని నాలుక యొక్క నరము విడిపించబడింది, మరియు వాడు తేటగా మాటలాడడం ఆరంభించాడు. 36 మరియు ఆయన వారికి ఆజ్ఞాపించాడు, తద్వారా వారు {దీనిని} ఎవనితోను చెప్పకుండా ఉంటారు. అయితే ఆయన వారికి ఆజ్ఞాపించిన కొలది, వారు మరి ఎక్కువగా {దీనిని} ప్రకటించారు. 37 మరియు వారు అత్యధికంగా నిర్ఘాంతపోయారు, చెప్పారు, “ఈయన సమస్త {కార్యములను} బాగుగా చేసియున్నాడు. ఆయన చెవిటి వారు వినడానికి మరియు మూగవారు మాటలాడడానికి కూడా చేయుచున్నాడు.

Chapter 8

1 ఆ దినములలో, అక్కడ మరల ఒక గొప్ప జనసమూహము ఉండగా, మరియు వారికి తినుటకు ఏమియు లేదు, యేసు తన శిష్యులను పిలిచాడు, ఆయన వారికి చెప్పాడు, 2 జనసమూహము మీద నాకు కనికరము కలిగి ఉన్నాను ఎందుకంటే వారు ఇప్పటికే మూడు రోజులు నాతో ఉన్నారు మరియు తినుటకు ఏమియు లేదు. 3 మరియు నేను వారిని ఆకలితో వారి ఇంటికి పంపిన యెడల, వారు మార్గములో మూర్ఛపోతారు, మరియు వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారు. 4 మరియు ఆయన శిష్యులు ఆయనకు జవాబిచ్చారు, ఇక్కడ ఈ అరణ్య ప్రదేశములో ఈ {మనుష్యులను} రొట్టెతో పోషించడానికి ఎవరైనా ఎక్కడ నుండి ఇవ్వగలడు. 5 మరియు ఆయన వారిని అడిగాడు, “మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” మరియు వారు చెప్పారు, “ఏడు.” 6 మరియు ఆయన – నేల మీద విశ్రమించండి అని జనులకు ఆజ్ఞాపించాడు, మరియు యేడు రొట్టెలు తీసుకున్నాడు, కృతజ్ఞతలు చెప్పాడు, ఆయన వాటిని విరిచాడు మరియు {వాటిని} తన శిష్యులకు ఇచ్చాడు, తద్వారా వారు వాటిని వడ్డించగలుగుటకు, మరియు వారు జనసమూహమునకు వడ్డించారు. 7 మరియు వారియొద్ద కొన్ని చిన్నచేపలు ఉన్నాయి,మరియు వాటిని ఆశీర్వదించి, వీటిని కూడ వడ్డించుడని ఆయన చెప్పాడు. 8 మరియు వారు తిని మరియు తృప్తిపొందారు, మరియు వారు మిగిలిన చాలా ముక్కలను -ఏడు గంపలుకు ఎత్తారు. 9 ఇప్పుడు ఇంచు మించు నాలుగు వేలమంది, మరియు ఆయన వారిని పంపివేసాడు. 10 మరియు వెంటనే, ఆయన తన శిష్యులతో దోనె లోనికి ఎక్కాడు, ఆయన దల్మనూతా యొక్క ప్రాంతము లోనికి వెళ్ళాడు. 11 మరియు పరిసయ్యులు బయటకు వచ్చారు మరియు ఆకాశము నుండి ఒక సూచక క్రియను ఆయన నుండి వెదకుచు, ఆయనను పరీక్షించుచు ఆయనతో వాదించడం మొదలుపెట్టారు. 12 మరియు ఆయన తన ఆత్మలో గొప్పగా నిట్టూర్పు విడిచాడు, ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ కోసం వెదకుచున్నారు? నిజంగా నేను మీకు చెప్పుచున్నాను, ఈ తరమునకు ఒక సూచక క్రియయు ఇవ్వబడిన యెడల 13 మరియు వారిని విడిచి, మరల దోనె యెక్కి, ఆయన అద్దరికి వెళ్ళాడు. 14 మరియు రొట్టెను తీసుకురావడానికి వారు మరచిపోయారు, మరియు ఒక్క రొట్టె తప్పించి, దోనెలో వారితో {ఏమీ} వారు కలిగి లేరు. 15 మరియు ఆయన వారిని హెచ్చరించుచున్నాడు, చెప్పాడు, “మెలకువగా ఉండండి! పరిసయ్యులు పులిసిన పిండి మరియు హేరోదు యొక్క పులిసిన పిండి వ్యతిరేకంగా జాగ్రత్త కలిగియుండండి. 16 మరియు తమ యొద్ద రొట్టె లేదు అని తమలోతాము చర్చించుకొంటున్నారు. 17 మరియు {దీనిని} యెరిగి, యేసు వారితో చెప్పాడు, “మీ వద్ద రొట్టె లేదు అని మీరు ఎందుకు తర్కించుచున్నారు? మీరు ఇంకా గ్రహించడం లేదా? లేదా వివేచింపలేదా? మీ హృదయాలు కఠినంగా మారాయా? 18 కన్నులు కలిగియుండి, మీరు చూడరా? మరియు చెవులు కలిగియుండి, మీరు వినరా? మరియు మీరు జ్ఞాపకము చేసికొనరా? 19 నేను 5,000 మంది మధ్య అయిదు రొట్టెలు విరిచినప్పుడు, మీరు విరిగిన ముక్కల యొక్క నిండిన బుట్టలు ఎన్ని మీరు పైకి ఎత్తారు? వారు ఆయనకు చెప్పారు, “12.” 20 “మరియు ఏడు 4,000 మంది మధ్య, మీరు విరిగిన ముక్కల యొక్క నిండిన బుట్టలు ఎన్ని మీరు పైకి ఎత్తారు?” మరియు వారు ఆయనకు చెప్పారు, “ఏడు.” 21 మరియు ఆయన వారితో చెప్పాడు, “మీరు ఇంకా ఎందుకు అర్ధం చేసుకోకుండా ఉన్నారు?” 22 మరియు వారు బేత్సయిదాకు వచ్చారు, మరియు వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డి {మనిషిని} తీసుకొని వచ్చారు మరియు ఆయన అతనిని తాకవలెను అని ఆయనను బతిమాలుకున్నారు. 23 మరియు ఆ గ్రుడ్డి మనిషి యొక్క చెయ్యి పట్టుకొని, ఆయన అతనిని గ్రామం నుండి బయటికి నడిపించాడు. మరియు అతని కన్నులలోనికి ఉమ్మివేసి, వాని మీద {తన} చేతులు ఉంచి, ఆయన అతనిని అడిగాడు, “నీవు ఏమైనా చూచుచున్నావా?" 24 మరియు పైకి చూసి, అతడు చెప్పాడు, “నేను మనుష్యులను చూచుచున్నాను వారు నడుచుచున్న చెట్ల వలె కనబడుచున్నారు." 25 అప్పుడు ఆయన మరల {తన} చేతులు అతని కన్నుల మీద ఉంచాడు, మరియు వాడు స్థిరంగా చూచాడు మరియు పునరుద్ధరించబడ్డాడు, మరియు అతడు ప్రతీదానిని స్పష్టంగా చూస్తున్నాడు. 26 మరియు ఆయన అతనిని తన ఇంటికి పంపాడు, చెప్పాడు, “నీవు పట్టణంలోనికి కూడా ప్రవేశించ వద్దు. 27 మరియు యేసు మరియు ఆయన శిష్యులు ఫిలిప్పు కైసరయ యొక్క గ్రామములలోనికి వెళ్ళారు, మరియు మార్గములో ఆయన తన శిష్యులను ప్రశ్నించాదు, వారితో చెప్పాడు, “నేను ఎవడినని అని మనుష్యులు చెప్పుచున్నారు?” 28 అయితే వారు ఆయనతో మాట్లాడారు, చెప్పారు, “బాప్తిస్మమిచ్చు యోహాను, మరియు ఇతరులు, ఏలీయా, అయితే ఇతరులు, ప్రవక్తలలో ఒకడు.” 29 మరియు ఆయన వారిని ప్రశ్నించాడు, “అయితే నేను ఎవడిని {అని} చెప్పుచున్నారు?” మరియు జవాబిచ్చారు, పేతురు ఆయనతో చెప్పాడు, “నీవు క్రీస్తువై ఉన్నావు.” 30 మరియు తన్ను గురించి ఎవ్వరికీ చెప్పవద్దు అని ఆయన వారిని హెచ్చరించాడు. 31 మరియు మనుష్యుని యొక్క కుమారుడు అనేక {సంగతులు} సహించాలి మరియు పెద్దలు మరియు ప్రధాన యాజకులు, శాస్త్రుల చేతను తృణీకరించబడి మరియు చంపబడి మరియు మూడు దినములు తరువాత లేచుట కోసం ఇది అవసరం అని ఆయన వారికి బోధించడానికి ఆరంభించాడు. 32 మరియు ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాడు. మరియు పేతురు, ఆయనను ప్రక్కకు తీసుకొనివెళ్ళాడు, ఆయన గద్దించడానికి ఆరంభించాడు. 33 అయితే యేసు, తిరిగాడు మరియు తన శిష్యుల వైపు చూసాడు, పేతురును గద్దించాడు మరియు చెప్పాడు, “సాతానా, నా వెనుకకు పొమ్ము! ఎందుకంటే నీవు దేవుని యొక్క {సంగతుల} మీద నీ మనస్సు ఉంచుకోవడం లేదు, కాని మనుష్యుల యొక్క {సంగతుల} మీద. 34 మరియు అంతట తన శిష్యులతో పాటు సమూహమును పిలిచాడు, ఆయన వారితో చెప్పాడు, “ఎవడైనను నన్ను వెంబడించడానికి కోరుకున్న యెడల, అతడు తన్ను తాను ఉపేక్షించుకొని మరియు తన సిలువను ఏత్తుకొని మరియు నన్ను వెంబడించుము. 35 ఎందుకంటే తన ప్రాణమును రక్షించుకోడానికి కోరుచున్న ఎవడైనను దాని పోగొట్టుకొనును, అయితే నా నిమిత్తము మరియు సువార్త విషయం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును. 36 ఎందుకంటే ఒక మనిషి సర్వ లోకమును సంపాదించుకోడానికి మరియు తన ప్రాణమును పోగొట్టుకోడానికి ఇది ఏమి ప్రయోజనము? 37 ఎందుకంటే ఒక మనుష్యుడు తన ప్రాణము కోసం ఒక మారకం వలే ఏమి ఇస్తాడు? 38 ఎందుకంటే ఎవడైనను నన్ను గురించి మరియు నా మాటల గురించి వ్యభిచారం మరియు పాపభరితమైన ఈ తరంలో సిగ్గుపడిన యెడల, మనుష్యుని యొక్క కుమారుడు కూడా తన యొక్క తండ్రి యొక్క మహిమలో పరిశుద్ధ దూతలతో వచ్చునప్పుడు సిగ్గుపడును.

Chapter 9

1 మరియు ఆయన వారికి చెప్పాడు,“నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు ఖచ్చితంగా మరణము రుచి చూడరు." 2 మరియు ఆరు దినములు తరువాత, యేసు పేతురు మరియు యాకోబును మరియు యోహానును తీసుకొని మరియు ఒక యెత్తయిన పర్వతం మీదికి తమకుతాము, ఏకాంతముగా వారిని తోడుకొనిపోయాడు, మరియు వారి యెదుట ఆయన రూపాంతరము పొందాడు. 3 మరియు ఆయన వస్త్రములు ప్రకాశమానమైన, మిక్కిలి తెల్లగా అయినవి, భూమి మీద ఏ చాకలి ఆవిధముగా తెల్లగా చేయ లేడు. 4 మరియు మోషేతో ఏలీయా వారి చేత చూడబడిన్నారు, మరియు వారు యేసుతో మాటలాడుచున్నారు. 5 మరియు జవాబిచ్చాడు, పేతురు యేసుతో చెప్పాడు, “రబ్బీ, మనము ఇక్కడ ఉండుట ఇది మంచిది, మరియు మనం మూడు గుడారాలు చేద్దాము, నీ కోసం ఒకటి మరియు మోషే కోసం ఒకటి మరియు ఏలీయా కోసం ఒకటి.” 6 (ఎందుకంటే అతడు ఏమి సమాధానం చెప్పాలో అతనికి తెలియదు, ఎందుకంటే వారు భయపడిపోయారు.) 7 మరియు ఒక మేఘము వచ్చింది, వారిని కప్పివేసింది,మరియు ఆ మేఘములోనుండి ఒక స్వరం వచ్చింది, “ఈయన నా ప్రియ కుమారుడు,ఈయన మాట వినండి.” 8 మరియు అకస్మాత్తుగా,చుట్టూ చూసారు,వారు ఇక వారితో ఎవరినీ చూడలేదు,అయితే యేసు మాత్రమే. 9 మరియు వారు ఆ కొండ నుండి క్రిందికి వస్తుండగా, మనుష్యుని యొక్క కుమారుడు మృతులలో నుండి లేచు వరకు, వారు చూసిన వాటిని ఎవరికీ చెప్పకూడదు అని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. 10 మరియు వారు తమలో తాము ఆ మాటను ఉంచుకొన్నారు, మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు కలసి చర్చించుకొన్నారు. 11 మరియు వారు ఆయనను ప్రశ్నిస్తున్నారు, చెప్పారు, “ఏలీయా ముందుగా రావడం తప్పనిసరి అని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? 12 అయితే ఆయన వారితో చెప్పాడు,“అన్ని {విషయాలు} పునరుద్ధరించడానికి ఏలియా మొదట వచ్చాడు. మరియు మనుష్యుని యొక్క కుమారుని గురించి ఆయన అనేక {విషయాలు} శ్రమ పడతాడు మరియు తృణీకరించబడతాడు అని ఎలా ఇది వ్రాయబడింది? 13 అయితే ఏలీయా నిజముగా వచ్చెననియు మరియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చిన విధముగా అతని యెడల చేసిరి అనియు నేను మీతో చెప్పాను.” 14 మరియు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు ఒక గొప్ప జనసమూహమును మరియు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసాడు. 15 మరియు వెంటనే, జనసమూహము అంతయు, ఆయనను చూసారు, ఆశ్చర్యపడ్డారు, మరియు {ఆయన} వద్దకు పరుగెత్తారు, వారు ఆయనకు వందనము చేసారు. 16 మరియు ఆయన వారిని అడిగాడు, “మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారు?” 17 మరియు జనసమూహము నుండి ఒకడు ఆయనకు జవాబిచ్చాడు, “బోధకుడా, మూగ ఆత్మ కలిగిన నా కుమారుని నీ యొద్దకు తీసుకువచ్చాను. 18 మరియు అది ఎక్కడ అతనిని పట్టునో, అది అతనిని క్రింద పడద్రోయును,మరియు అతడు నురుగు కార్చుకొని మరియు {తన}పండ్లు కొరుకుతాడు, మరియు అతడు దృఢంగా మారతాడు,మరియు దానిని బయటకు వెళ్ళగొట్టడానికి నీ శిష్యులను అడిగాను, అయితే వారు తగినంత బలంగా లేరు.” 19 అయితే వారికి జవాబిస్తూ, ఆయన చెప్పాడు, “మీరు విశ్వాసములేని తరము, నేను మీతో ఎప్పటి వరకు ఉంటాను? నేను మిమ్ములను ఎప్పటి వరకు భరిస్తాను? అతనిని నా వద్దకు తీసుకు రండి.” 20 మరియు వారు ఆయన వద్దకు అతనిని తీసుకువచ్చారు, మరియు ఆయనను చూడగానే, ఆత్మ వెంటనే అతనిని మూర్ఛ లోనికి త్రోసింది, మరియు నేల మీద పడిపోయాడు, అతడు చుట్టూ దొర్లుతూ, నోట నుండి నురుగు కార్చుచున్నాడు. 21 మరియు ఆయన అతని తండ్రిని అడిగాడు, “ఎంత కాలము నుండి ఇది అతనికి సంభవించుచున్నది?” మరియు అతడు చెప్బాడు, బాల్యము నుండియే; 22 మరియు అది అతనిని నాశనము చేసేందులకు తరచుగా అగ్ని లోనికి మరియు నీళ్ళ లోనికి రెంటిలో పడద్రోయును, అయితే నీవు ఏదైనను చేయగలిగిన యెడల, మా మీద కనికరపడి, మాకు సహాయము చేయండి.” 23 అయితే యేసు అతనితో చెప్పాడు,“‘నీకు సాధ్యమైన యెడల’ నమ్మువానికి సమస్తమును సాధ్యము.” 24 మరియు వెంటనే ఆ బిడ్డ యొక్క తండ్రి, అరిచాడు, చెప్పాడు, "నేను నమ్ముచున్నాను! నా అవిశ్వాసములో నాకు సహాయం చెయ్యండి!” 25 మరియు యేసు, జనసమూహము {వారి} వద్దకు పరిగెత్తడం చూసి, అపవిత్ర ఆత్మను గద్దించి, దానితో చెప్పాడు,"నీవు మూగ మరియు చెవిటి ఆత్మ, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, అతని నుండి బయటకు రా, ఇక ఎన్నడు అతని లోనికి మరల ప్రవేశించవద్దు." 26 మరియు గట్టిగా అరచి మరియు అతనిని బాగా మూర్చిల్లచేసింది. అది బయటకు వచ్చింది, మరియు అతడు ఒక చనిపోయిన {వ్యక్తి} వలె అయ్యాడు, అందువలన అనేకులు చెప్పారు, “అతడు చనిపోయాడు.” 27 అయితే యేసు, అతని చేతితో {అతనిని} పట్టుకొని, అతనిని పైకి లేపాడు, మరియు అతడు లేచి నిలబడ్డాడు. 28 మరియు ఆయన ఒక ఇంటి లోనికి వెళ్ళి {నప్పుడు}, ఆయన శిష్యులు ఆయనను స్వయంగా అడిగారు, మేము ఎందుకు దానిని వెళ్ళగొట్టలేకపోయాము? 29 మరియు ఆయన వారితో చెప్పాడు,"ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా తప్ప ఈ రకమైనది ఏదియు బయటకు రాదు. 30 మరియు అక్కడ నుండి యేసు ఆయన శిష్యులు బయటకు వెళ్ళారు, వారు గలిలయ ద్వారా వెళుచున్నారు, అయితే అది ఎవనికిని తెలియుట ఆయనకు ఇష్టము లేదు, 31 ఎందుకంటే ఆయన తన శిష్యులకు బోధిస్తున్నాడు మరియు వారితో చెప్పాడు, “మనుష్యుని యొక్క కుమారుడు మనుష్యుల యొక్క చేతులకు అప్పగింపబడు చున్నాడు, మరియు వారు ఆయనను చంపుతారు.మరియు చంపబడి, మూడు దినముల తరువాత ఆయన తిరిగి లేస్తాడు.” 32 అయితే వారు ఈ ప్రకటనను అర్థం చేసుకోలేదు, మరియు వారు ఆయనను అడుగుటకు భయపడ్డారు. 33 మరియు వారు కపెర్నహూమునకు వచ్చారు, మరియు ఇంటి లోనికి వచ్చారు, ఆయన వారిని అడుగుచున్నాడు, "మీరు దారిలో ఏమి చర్చిస్తున్నారు?" 34 అయితే వారు మౌనంగా ఉన్నారు, ఎందుకంటే వారు ఎవరు గొప్ప అనే దాని గురించి దారిలో ఒకరితో ఒకరు వాదించుకున్నారు. 35 మరియు కూర్చుండి, అయన పండ్రెండు మందిని కలిపి పిలిచాడు మరియు వారితో చెప్పాడు,“ఎవడైనను మొదటివాడై ఉండ కోరిన యెడల, వాడు అందరిలో కడపటివాడును మరియు అందరికి సేవకుడై ఉండ వలెను.” 36 మరియు ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు, ఆయన అతనిని వారి మధ్యను ఉంచాడు, మరియు అతనిని తన చేతులలోనికి తీసుకొన్నాడు, ఆయన వారితో చెప్పాడు, 37 ఈ చిన్న పిల్లలలో ఒకరిని నా నామమున స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు; మరియు నన్ను స్వీకరించువాడు నన్ను స్వీకరించడు, అయితే నన్ను పంపిన వానిని. 38 యోహాను ఆయనతో చెప్పాడు, “బోధకుడా, ఒకడు నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టుట మేము చూచితిమి, మరియు మేము అతనిని అడ్డుకున్నాము ఎందుకంటే అతడు మనలను వెంబడించువాడు కాడు.” 39 అయితే యేసు చెప్పాడు, “అతనిని అడ్డుకో వద్దు, ఎందుకంటే నా నామమున ఒక శక్తివంతమైన క్రియను చేసేవాళ్ళు మరియు త్వరలోనే నా గురించి చెడుగా మాట్లాడగల వాడు ఎవరూ లేరు. 40 ఎందుకంటే మనకు వ్యతిరేకం కాని వాడు మన పక్షమున ఉన్నవాడే. 41 ఎందుకంటే మీరు క్రీస్తుకు చెందినవారు కాబట్టి ఎవరైతే నామములో ఒక నీళ్ళ యొక్క గిన్నె మీకు ఇచ్చినప్పుడు, అతడు ఖచ్చితంగా తన ప్రతిఫలాన్ని కోల్పోడు అని నేను నిజంగా మీతో చెప్పుచున్నాను. 42 మరియు నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని తొట్రుపడునట్లు చేయువాడెవడో, దానికి బదులుగా అతని మెడ చుట్టూ ఒక పెద్ద తిరుగటిరాయి ఉంచి మరియు సముద్రంలో పడవేసిన యెడల అతనికి మంచిది. 43 మరియు నీ చెయ్యి నిన్ను తొట్రు పడేలా చేసిన యెడల, దానిని నరికి వేయుము; నీవు రెండు చేతులు కలిగియుండి, గెహెన్నాలోనికి, ఆర్పివేయలేని అగ్ని లోనికి వెళ్ళడం కంటే అంగవైకల్యంతో జీవములో ప్రవేశించడం ఇది నీకు మేలు. 44 [అక్కడ వారి పురుగు ముగింపు కాదు, మరియు అగ్ని ఆరిపోదు.] 45 మరియు నీ పాదము నిన్ను తొట్రు పడేలా చేసిన యెడల, దానిని నరికివేయుము. రెండు పాదములు కలిగి, గెహెన్నలోనికి త్రోసివెయ్య బడి యుండడం కంటే కుంటి వానిగా జీవములో ప్రవేశించడం ఇది నీకు మేలు. 46 [అక్కడ వారి పురుగు ముగింపు కాదు, మరియు అగ్ని ఆరిపోదు.] 47 మరియు నీ కన్ను నిన్ను తొట్రు పడేలా చేసిన యెడల, దానిని బయటికి త్రోసి వెయ్యి. రెండు కన్నులు కలిగి, గెహెన్నలోనికి త్రోసివెయ్యబడం కంటే ఒక్క కన్నుతో దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించుట నీకు ఇది మేలు. 48 నరకమున వారి పురుగు చావదు; మరియు అగ్ని ఆరదు. 49 ఎందుకంటే ప్రతి ఒక్కరు అగ్నితో ఉప్పు చెయ్యబడతారు. 50 ఉప్పు మంచిది, అయితే ఉప్పు నిస్సారముగా మారిన యెడల, దేనితో నీవు దానికి సారము కలుగచేస్తావు? మీలో మీరు ఉప్పు గలవారై ఉండండి, మరియు యొకరితో ఒకరు సమాధానముగా ఉండండి.”

Chapter 10

1 మరియు పైకి లేచి, ఆయన ఆ స్థలం నుండి యూదయ యొక్క ప్రాంతముకు మరియు యొర్దాను నది యొక్క అద్దరికిని వెళ్ళాడు, మరియు సమూహములు తిరిగి ఆయన యొద్దకు మరల కూడివచ్చారు. మరియు ఆయన వారికి ఆయనకు వాడుక అయిన విధముగా మరల బోధించుచుండెను. 2 మరియు వచ్చి, పరిసయ్యులు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆయన పరీక్షిస్తూ, భార్యను విడనాడుట భర్త కోసం ఇది చట్టబద్దమా కాదా? 3 అయితే ఆయన జవాబిస్తూ, వారితో చెప్పాడు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” 4 మరియు వారు చెప్పారు, “విడాకుల యొక్క పత్రిక వ్రాయడానికి మరియు {ఆమె} ను పంపించి వెయ్యడానికి మోషే అనుమతించాడు.” 5 అయితే యేసు వారితో చెప్పాడు, “మీ యొక్క హృదయ కాఠిన్యము కారణంగా, అతడు ఈ ఆజ్ఞను మీకు వ్రాసాడు. 6 అయితే సృష్టి యొక్క ఆరంభం నుండి, ఆయన వారిని పురుషుడు మరియు స్త్రీగా చేసాడు. 7 ’ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని మరియు తల్లిని విడిచిపెడతాడు, 8 మరియు ఇద్దరు ఒక్క శరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇకమీదట ఇద్దరుగా ఉండరు, అయితే ఒక్క శరీరం. 9 కాబట్టి దేవుడు కలిపి జతపరచిన దానిని, మనుష్యుడు వేరుపరచ కుండా ఉండనివ్వండి. 10 మరియు ఇంటిలో మరల, శిష్యులు దీనిని గురించి ఆయనను మరల అడిగారు. 11 మరియు ఆయన వారితో చెప్పాడు, “తన భార్యను విడాకులిచ్చి మరొక మరియు మరొకరిని పెండ్లిచేసికొనువాడు ఎవరైనను ఆమెకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12 మరియు ఆమె తన భర్తను విడనాడి మరియొకరిని పెండ్లిజేసికొనిన యెడల, ఆమె వ్యభిచరించుచున్నది. 13 మరియు వారు ఆయన వద్దకు చిన్నబిడ్డలను తీసుకొని వచ్చుచున్నారు తద్వారా ఆయన వారిని తాకుతాడు, అయితే శిష్యులు వారిని గద్దించారు. 14 అయితే దీనిని చూసి,యేసు దైవికకోపంతో నిండిపోయాడు మరియు వారితో చెప్పాడు, “చిన్నబిడ్డలను నా యొద్దకు రావడానికి అనుమతించండి, మరియు వారిని అడ్డగించ వద్దు, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము ఇటువంటి వారిదే. 15 నిజముగా నేను మీతో చెప్పుచున్నాను. ఒక చిన్నబిడ్డ వలె దేవుని యొక్క రాజ్యమును అంగీకరింపనివాడు ఎవరైనను ఖచ్చితంగా దాని లోనికి ప్రవేశింపడు. 16 మరియు వారిని తన చేతులలోనికి తీసుకొని, ఆయన {వారిని} ఆశీర్వదించాడు, {తన} చేతులు వారి మీద ఉంచాడు. 17 మరియు ఆయన ప్రయాణంలో ముందుకు వెళ్ళుచుండగా, ఒకరు {ఆయన} వద్దకు పరుగెత్తుకొని వచ్చాడు మరియు, ఆయన యెదుట మోకాళ్లూనాడు, ఆయన అడిగాడు,“మంచి బోధకుడా, నిత్య జీవమునును నేను స్వతంత్రించుకొనునట్లు నేను ఏమి చెయ్యాలి?” 18 అయితే యేసు అతనితో చెప్పాడు, “నీవు నన్ను మంచివాడను అని ఎందుకు పిలుచుచున్నావు? దేవుడు మాత్రమే తప్పించి ఏ ఒక్కరును మంచి వారు కాదు. 19 నీవు ఆజ్ఞలను యెరిగియున్నావు: నరహత్య చేయవద్దు, వ్యభిచారం చెయ్య వద్దు, దొంగతనం చెయ్య వద్దు, అబద్ధంగా సాక్ష్యము చెప్ప వద్దు, మోసంగా ఉండ వద్దు, నీ తండ్రిని మరియు తల్లిని గౌరవించు.’” 20 అయితే అతడు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, ఈ {సంగతులు} అన్నీ, నా బాల్యము నుండి నేను లోబడుచూ ఉన్నాను.” 21 అయితే యేసు, అతని వైపు చూచి, అతనిని ప్రేమించాడు, మరియు అతనితో చెప్పాడు,“నీకు ఒక్క {సంగతి} కొదువగా నున్నది; వెళ్ళుము, నీకు కలిగియున్న వాటన్నిటినీ అమ్మి వెయ్యి, మరియు {దానిని} పేదలకు ఇవ్వు, మరియు పరలోకములో నీకు ధనము ఉంటుంది మరియు రమ్ము, నన్ను వెంబడించు.” 22 అతడు అతడు, {ఈ} మాట వద్ద చిన్నబుచ్చుకొన్నవాడు అయ్యాడు, దుఃఖపడుచు వెళ్లి పోయెను, ఎందుకంటే అతడు అనేకమైన ఆస్తులు కలిగియున్నాడు. 23 మరియు చుట్టు చూచాడు, యేసు తన శిష్యులతో చెప్పాడు, “దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి ఆస్తిని కలిగిన వారికోసం ఇది ఎంతో కష్టం!” 24 మరియు ఆయన మాటలకు శిష్యులు విస్మయం చెందారు, అయితే మరల జవాబిచ్చాడు, యేసు వారితో చెప్పాడు, “పిల్లలారా, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి ఇది ఎంతో కష్టం! 25 ఒక ధనవంతుడైన {వ్యక్తి} కోసం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించడానికి కంటే ఒక ఒంటె సూది బెజ్జములో నుండి రావడం ఇది సులభము. 26 మరియు వారు అత్యధికముగా ఆశ్చర్యపడ్డారు, ఆయనతో చెప్పారు, “మరియు ఎవడు రక్షణపొంద గలడు?” 27 వారి వైపు చూచి,యేసు చెప్పాడు,“మనుష్యులతో {ఇది} అసాధ్యము, అయితే దేవునితో కాదు. ఎందుకంటే అన్ని {సంగతులు} దేవునితో సాధ్యమై {ఉన్నాయి}. 28 పేతురు ఆయనతో మాట్లాడడం ఆరంభించాడు, “ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టాము మరియు నిన్ను వెంబడించాము.” 29 యేసు చెప్పాడు,“నిజముగా నేను మీతో చెప్పు చున్నాను, నా నిమిత్తము మరియు సువార్త నిమిత్తము ఇంటి లేదా సోదరులు లేదా సోదరీలు లేదా తల్లి లేదా తండ్రి లేదా పిల్లలు లేదా భూములు విడిచినవాడు ఎవడైనను, 30 వాడు ఇప్పుడు ఈ కాలములో వంద రెట్లు {అంతకు} పొందకుండా ఉండడు: హింసలతో ఇళ్ళు మరియు సోదరులు మరియు అక్కచెల్లెళ్ళు మరియు తల్లులు మరియు పిల్లలు మరియు భూములు, మరియు ఈ రాబోతూ {ఉన్న} ఈ కాలములో, నిత్య జీవంలో. 31 అయితే మొదటి {ఉన్న వారు} అనేకులు కడపటి వారు అవుతారు, మరియు కడపటివారు, మొదటి వారు.” 32 ఇప్పుడు వారు దారి మీద ఉన్నారు, యెరూషలేము వరకు వెళ్తున్నారు, మరియు యేసు వారికి ముందు వెళ్తున్నాడు. మరియు వారు విస్మయమొందిరి, అయితే వెంబడించు వారు భయపడ్డారు. మరియు మరల పండ్రెండు మందిని ప్రక్కకు తీసుకొనివెళ్ళాడు, ఆయన వారితో ఆయనకు జరుగబోతున్న {దానిని} గురించి చెప్పడం ఆరంభించాడు. 33 “ఇదిగో, మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము, మరియు మనుష్యుని యొక్క కుమారుడు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులకు అప్పగింపబడును, మరియు వారు ఆయనను మరణముకు శిక్ష విధిస్తారు మరియు ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు. 34 మరియు వారు ఆయనను అపహసిస్తారు మరియు ఆయన మీద ఉమ్మివేస్తారు మరియు ఆయనను కొరడాలతో కొడతారు మరియు {ఆయనను} చంపుతారు, అయితే మూడు దినముల తరువాత, ఆయన లేచును.” 35 మరియు జెబెదయి యొక్క కుమారులు యాకోబు మరియు యోహాను ఆయన యొద్దకు వచ్చారు, ఆయనతో చెప్పారు, “బోధకుడా, మేము నిన్ను ఏది అడిగినా, నీవు మా కొరకు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. 36 మరియు ఆయన వారితో చెప్పాడు “నేను మీ కోసం ఏమి చేయాలని మీరు కోరుచున్నారు?” 37 మరియు వారు ఆయనతో చెప్పారు, “నీ మహిమలో, ఒకరు నీ కుడివైపున మరియు ఒకడును నీ యెడమవైపున, మేము కూర్చుండునట్లు మాకు దయచేయుము.” 38 అయితే యేసు వారితో చెప్పాడు, “మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న పాత్ర లోనిది త్రాగడానికి లేదా నేను బాప్తిసం పొందుచున్న బాప్తిసంతో బాప్తిసం పొంద గలరా?” 39 మరియు వారు ఆయనతో చెప్పారు, “మేము చెయ్యగలము.” అయితే యేసు వారితో చెప్పాడు, “నేను త్రాగుచున్న ఆ పాత్రలోనిది మీరు త్రాగెదరు, మరియు నేను పొందిన బాప్తిసముతో బాప్తిసం, మీరు బాప్తిసం పొందగలరు. 40 అయితే నా కుడి చేతివైపున లేదా నా ఎడమ చేతి వైపున కూర్చుండడానికి ఇవ్వడం నాది కాదు, అయితే {ఇది} ఎవరికి సిద్ధం చేసేనో వారికే {ఉంది}. 41 మరియు {దీనిని} విని, పదిమంది యాకోబు మరియు యోహానులతో చాలా కోపంగా ఉండడం ఆరంభించారు. 42 మరియు వారిని పిలువనంపించి,యేసు వారితో చెప్పాడు, “అన్యజనుల యొక్క అధికారులుగా యెంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేస్తారు మరియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురు అని మీకు తెలియును. 43 అయితే మీ మధ్య ఈ విధానంలో ఉండ కూడదు. బదులుగా, మీ మధ్య గొప్పవాడై యుండాలని కోరిన వారు ఎవరైనా మీకు సేవకుడిగా ఉంటాడు. 44 మరియు మీ మధ్య మొదటివాడుగా ఉండాలని కోరుకున్న వారు ఎవరైనా అందరి యొక్క బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యుని యొక్క కుమారుడు సహితం పరిచారము చేయించుకొనుటకు రాలేదు, అయితే పరిచారము చేయుటకు మరియు అనేకుల కోసం ప్రతిగా విమోచన క్రయధనము వలె తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. 46 మరియు వారు యెరికో లోనికి వచ్చారు, మరియు ఆయన తన శిష్యులతో మరియు ఒక గొప్ప సమూహముతో యెరికో పట్టణము నుండి బయలు దేరి వచ్చుచున్న {విధముగా} ఉన్నాడు, తీమయి యొక్క కుమారుడు, బర్తమయి, ఒక గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. 47 మరియు ఇది నజరేయుడైన యేసు అని విని, అతడు గట్టిగా అరవడానికి ఆరంభించాడు మరియు చెప్పాడు, “దావీదు కుమారుడా, యేసూ, నా మీద దయ చూపు!” 48 మరియు అనేకుల అతనిని గద్దించారు తద్వారా అతడు మౌనంగా ఉంటాడు, అయితే అతడు మరి ఎక్కువగా అరుస్తున్నాడు, “దావీదు యొక్క కుమారుడా, నా మీద కరుణ కలిగియుండు!” 49 మరియు స్థిరంగా నిలిచి,యేసు చెప్పాడు, “అతనిని పిలవండి.” మరియు వారు గ్రుడ్డి {మనుష్యుని} పిలిచారు, అతనితో చెప్పారు, “ధైర్యం తెచ్చుకో! పైకి లెమ్ము! ఆయన నిన్ను పిలుచుచున్నాడు.” 50 మరియు అతని వస్త్రాన్ని ప్రక్కకు విసిరివేసాడు, దిగ్గున పైకి లేచాడు, అతడు యేసు వద్దకు వచ్చాడు. 51 మరియు అతనికి జవాబిస్తున్నాడు, యేసు చెప్పాడు, “నేను నీకు ఏమి చెయ్యాలని నీవు కోరుకుంటున్నావు?” మరియు గ్రుడ్డి మనుష్యుడు ఆయనతో చెప్పాడు, “రబ్బీ నా చూపును నేను తిరిగి పొందాలి అని.” 52 మరియు యేసు అతనితో చెప్పాడు, “వెళ్ళుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను.” వెంటనే ఆతడు చూపును తరిగి పొందాడు, మరియు అతడు మార్గములో ఆయనను వెంబడించాడు.

Chapter 11

1 మరియు వారు యెరూషలేమునకు దగ్గరకు, బేత్పగే మరియు బేతనియ దగ్గరకు, ఒలీవల యొక్క పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపాడు 2 మరియు వారితో చెప్పాడు, "మీ యెదుట ఉన్న గ్రామము లోనికి వెళ్లుడి, మరియు వెంటనే, దానిలోనికి ప్రవేశించి, కట్టబడి యున్న యొక గాడిద పిల్లను మీరు కనుగొంటారు, దాని మీద ఏ మనుష్యుడును ఇంకా కూర్చుండ లేదు. దానిని విప్పండి మరియు దానిని {ఇక్కడికి} తీసుకొని రండి. 3 మరియు ఎవడైనను– 'మీరు ఎందుకు దీనిని చేయుచున్నారు?' అని మిమ్మును అడిగిన యెడల, చెప్పండి, 'ప్రభువుకు దీని యొక్క అవరత ఉంది మరియు వెంటనే అతడు దానిని వెనుకకు పంపును." 4 మరియు వారు వెళ్ళారు మరియు వీధి మీద వెలుపల ఒక ద్వారం వద్ద కట్టబడి యున్న ఒక గాడిద పిల్లను వారు కనుగొన్నారు, మరియు వారు దానిని విప్పుచున్నారు. 5 మరియు అక్కడ నిలిచియున్న వారిలో కొందరు వారితో చెప్పడం ఆరంభించారు, "మీరు ఏమి చేయుచున్నారు, గాడిద పిల్లను విప్పుచున్నారు?" 6 మరియు వారు యేసు తమతో చెప్పిన విధముగా వారితో చెప్పారు, మరియు వారు వాటిని పోనిచ్చారు. 7 మరియు వారు గాడిదపిల్లను యేసు వద్దకు తీసుకొని వచ్చారు మరియు తమ పై వస్త్రములను దాని మీద విసిరారు, మరియు ఆయన దాని మీద కూర్చున్నాడు. 8 మరియు అనేకులు తమ బట్టలను దారి మీద పరచారు, మరియు ఇతరులు, పొలముల నుండి వారు నరికిన కొమ్మలు. 9 ముందు వెళ్లుచుండినవారు మరియు వెనుక వచ్చుచుండినవారు ఇద్దరూ అరుస్తున్నారు, "హోసన్నా! ప్రభువు నామములో వచ్చుచున్న వాడు స్తుతింపబడును. 10 వచ్చుచున్న మన తండ్రి దావీదు యొక్క రాజ్యము స్తుతింపబడును! సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా!" 11 మరియు ఆయన యెరూషలేము లోనికి, దేవాలయములో ప్రవేశించాడు; మరియు చుట్టు ప్రతీ దాని వైపు చుట్టూ చూసాడు, గంట ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ఆయన పండ్రెండు మందితో బేతనియకు వెళ్ళాడు. 12 మరియు తరువాత రోజు, వారు బేతనియ నుండి బయటికి వచ్చుచున్నప్పుడు, ఆయన ఆకలిగొన్నాడు. 13 మరియు ఆకులు కలిగియున్న ఒక అంజూర చెట్టును దూరము నుండి చూసాడు, ఆయన దాని మీద ఏమైనను కనుగొనునేమో అని బహుశా ఆయన వెళ్ళాడు, అయితే ఆయనకు ఆకులు తప్ప మరేమీ దొరకలేదు. ఎందుకంటే ఇది అంజూర పండ్లు యొక్క కాలము కాదు. 14 మరియు జవాబిస్తూ, ఆయన దానితో చెప్పాడు, "ఇక మీదట శాశ్వతకాలం నీ పండ్లు ఎవరును తినరు." మరియు శిష్యులు {దానిని} విన్నారు. 15 మరియు యెరూషలేమునకు వచ్చారు మరియు దేవాలయములోనికి ప్రవేశించాడు, దేవాలయంలో కొనడాలు మరియు విక్రయించడాలు చేయువారిని ఆయన వెళ్లగొట్టడానికి ప్రారంభించాడు, మరియు రూకలు మార్చువారి యొక్క బల్లలను మరియు పావురాలు అమ్మువారి పీటలను తలకిందులు చేసాడు, 16 మరియు దేవాలయము ద్వారా పాత్రలను మోసుకొని వెళ్ళడానికి ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. 17 మరియు ఆయన వారికి బోధించుచున్నాడు మరియు చెప్పాడు, "'నా ఇల్లు సమస్త దేశముల కోసం ప్రార్థన యొక్క ఇల్లు అని పిలువబడును' అని ఇది వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దోచుకొను వారి యొక్క దొంగల గుహగా చేసారు." 18 మరియు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు అది విన్నారు మరియు వారు ఆయనను చంపడానికి మార్గాన్ని వెదకుచున్నారు ఎందుకంటే జన సమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపోయారు కాబట్టి వారు ఆయనకు భయపడ్డారు. 19 మరియు సాయంకాలము వచ్చినప్పుడు, వారు నగరం నుండి బయలు దేరారు. 20 మరియు ఉదయకాలంలో మార్గమున వెళ్ళుచుండగా, అంజూర చెట్ల వేళ్ల నుండి ఎండిపోయి ఉండడం వారు చూసారు. 21 మరియు జ్ఞాపకం చేసుకొని, పేతురు ఆయనతో చెప్పాడు, "బోధకుడా, యిదిగో! నీవు శపించిన ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినది." 22 మరియు జవాబిచ్చాడు, యేసు వారితో చెప్పాడు, "దేవునిలో విశ్వాసము కలిగి ఉండండి. 23 ఎవడైనను ఈ పర్వతముతో చెపుతూ, 'పైకి ఎత్తబడి ఉండు మరియు సముద్రములో పడవేయబడుము' మరియు తన హృదయములో సందేహించ కుండ, మరియు తాను చెప్పినది జరుగును అని నమ్మినపుడు, అతని కోసం ఇది జరుగుతుంది అని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. 24 దీని యొక్క కారణంగా, నేను మీతో చెప్పుచున్నాను, మీరు ప్రార్థన చేసిన మరియు అడిగిన, {దానిని} మీరు కలిగి యున్నారు మరియు అవి మీకు కలుగును అని విశ్వసించండి. 25 మరియు మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు, మీకు ఎవని మీదనైనను విరోధముగా ఏదైనా ఉన్న యెడల, క్షమించుడి, తద్వారా పరలోకములలో {ఉన్న} మీ తండ్రి కూడా మిమ్మును మీ పాపములు క్షమించును. 26 [అయితే మీరు క్షమించని యెడల, పరలోకములలో {ఉన్న} మీ తండ్రి మీ పాపములు క్షమించడు.] 27 మరియు వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు, మరియు ఆయన దేవాలయములో చుట్టూ నడుచుచూ ఉండగా, ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు మరియు పెద్దలును ఆయన యొద్దకు వచ్చారు. 28 మరియు వారు ఆయనతో చెప్పారు, "ఏ అధికారము చేత ఈ {కార్యములు} చేయుచున్నావు? మరియు ఈ అధికారము ఎవరు ఇచ్చారు, తద్వారా నువ్వు ఈ {కార్యములు} చేయుచున్నావు?" 29 అయితే యేసు వారితో చెప్పాడు, "నేను కూడా మిమ్మును ఒక్క మాట అడుగుదును, మరియు మీరు నాకు జావాబు ఇవ్వండి, మరియు నేను ఈ {సంగతులను} ఏ అధికారం చేత చేయుచున్నానో నేను మీకు చెప్పుదును. 30 యోహాను యొక్క బాప్తిసం అది పరలోకము నుండి కలిగినదా, లేదా మనుష్యుల నుండా? నాకు జవాబు ఇవ్వండి. 31 మరియు వారు తమలోతాము చర్చించుకొంటున్నారు, చెప్పారు, "మనము ఏమని చెప్పుదము? 'పరలోకము నుండి' అని మనం చెప్పిన యెడల, ఆయన చెపుతాడు, 'దేని కారణంగా అప్పుడు మీరు నన్ను నమ్మడం లేదు? 32 అయితే 'మనుష్యుల నుండి' అని మనం చెప్పిన {యెడల} (సమూహము విషయంలో వారు భయపడ్డారు, ఎందుకంటే వారు అందరు యోహాను నిజముగా ప్రవక్త అని పట్టుకొన్నారు.) 33 మరియు యేసు జవాబిచ్చాడు, వారు వారు చెప్పారు, "మాకు తెలియదు." మరియు యేసు వారితో చెప్పాడు, "నేను ఏ అధికారం చేత ఈ {సంగతులను} చేయుచున్నానో నేను కూడా మీకు చెప్పను."

Chapter 12

1 మరియు యేసు ఉపమానములో వారితో మాట్లాడడం ప్రారంభించాడు: “ఒక మనుష్యుడు ఒక ద్రాక్షతోట నాటాడు మరియు దానిచుట్టు ఒక కంచె వేసాడు మరియు ద్రాక్షల గానుగ కోసం ఒక గుంట త్రవ్వాడు మరియు ఒక గోపురము కట్టాడు మరియు ద్రాక్ష తోటను పెంచువారికి దానిని అద్దెకు ఇచ్చాడు మరియు ఒక యాత్ర మీద వెళ్ళాడు. 2 మరియు కాలమందు, అతడు ఒక బానిసను రైతుల వద్దకు పంపాడు తద్వారా అతడు ద్రాక్షతోట యొక్క ఫలమును రైతుల నుండి స్వీకరించుటకు. 3 అయితే అతనిని పట్టుకున్నారు, వారు {అతనిని} కొట్టారు, మరియు {అతనిని} ఖాళీగా పంపివేసారు. 4 మరియు మరల అతడు మరియొక బానిసను వారి వద్దకు పంపాడు, మరియు ఆ ఒకనిని, వారు తలలో గాయపరచారు మరియు అవమానకరముగా వ్యవహరించారు. 5 మరియు అతడు మరియొకని పంపాడు, మరియు వానిని వారు చంపారు, మరియు అనేక ఇతరులను-కొందరిని కొట్టారు అయితే ఇతరులను చంపారు. 6 మరి ఒకరిని, ఒక ప్రియమైన కుమారుని, ఆఖరిగా అతడు అతనిని వారి వద్దకు పంపాడు, చెప్పాడు, “వారు నా కుమారుని గౌరవిస్తారు.” 7 అయితే ఆ రైతులు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, “ఇతడు వారసుడు. రండి, మనము ఇతనిని చంపుదము, మరియు వారసత్వం మనది అవుతుంది. 8 మరియు {అతనిని} పట్టుకొన్నారు, వారు అతనిని చంపారు, మరియు ద్రాక్షతోట యొక్క వెలుపల అతనిని పారవేసారు. 9 అందువలన, ఆ ద్రాక్షతోట యొక్క యజమానుడు ఏమి చేస్తాడు? అతడు వస్తాడు మరియు రైతులను నాశనం చేస్తాడు మరియు ద్రాక్షతోటను ఇతరులకు ఇస్తాడు. 10 మరియు మీరు ఈ లేఖనము చదువ లేదా? ‘కట్టువారు నిరాకరించిన రాయి, ఇది మూల యొక్క తలగా అయినది. 11 ఇది ప్రభువు నుండి వచ్చింది, మరియు ఇది మన కన్నులకు ఆశ్చర్యము.’” 12 మరియు వారు ఆయనను పట్టుకొనుటకు వెదకుచున్నారు. అయితే వారు సమూహమునకు భయపడ్డారు, ఎందుకంటే ఆయన తమకు వ్యతిరేకంగా ఉపమానం చెప్పాడు అని వారికి తెలుసు. మరియు ఆయనను విడిచిపెట్టి, వారు వెళ్ళిపోయారు. 13 మరియు వారు మాటలలో ఆయనను చిక్కించుకునేందుకు కొందరు పరిసయ్యులను మరియు హేరోదీయులను ఆయన వద్దకు పంపారు. 14 మరియు వచ్చారు, వారు ఆయనతో చెప్పారు, “బోధకుడా, నీవు సత్యవంతుడవు అని మాకు తెలుసు, మరియు ఎవరి గురించి మీకు ఇది ఒక ఆందోళన కాదు, ఎందుకంటే నీవు మనుష్యుల యొక్క ముఖమును చూడవు, అయితే నీవు సత్యం ప్రకారం దేవుని యొక్క మార్గమును బోధిస్తావు. కైసరుకు పన్నులు ఇచ్చుట ఇది చట్టబద్ధమైనదా లేదా కాదా? మనం ఇవ్వవలెనా, లేదా మనం ఇవ్వకూడదా?” 15 ఆయితే ఆయన, వారి వేషధారణను ఎరిగి, వారితో చెప్పాడు, మీరు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నారు? “నేను {దానిని} చూడగలిగేలా నా వద్దకు ఒక దేనారము తీసుకురండి.” 16 మరియు వారు {ఒకటి} తెచ్చారు, మరియు ఆయన వారితో చెప్పాడు, “ఈ చిత్రం మరియు శాసనం ఎవరిది?” మరియు వారు ఆయనతో చెప్పారు, “కైసరువి.” 17 మరియు యేసు వారితో చెప్పాడు, “కైసరు యొక్క {వస్తువులు} కైసరునకు, మరియు దేవుని యొక్క {వస్తువులు} దేవునికి తిరిగి ఇవ్వండి.” మరియు వారు ఆయన వద్ద ఆశ్చర్యపోయారు. 18 మరియు పునరుత్థానము లేదు అని చెప్పే సద్దూకయ్యులు, ఆయన వద్దకు వచ్చారు మరియు ఆయనను ప్రశ్నించడం ప్రారభించారు, చెప్పారు, 19 “బోధకుడా, మోషే మనకు వ్రాసాడు, ఒకని యొక్క సోదరుడు చనిపోయిన యెడల మరియు వెనుక భార్యను విడిచాడు అయితే ఒక బిడ్డను విడువ లేదు, అతని సోదరుడు భార్యను తీసుకొని మరియు తన సోదరునికి సంతానము పెంచవలెను. 20 ఏడుగురు సోదరులు ఉన్నారు, మరియు మొదటివాడు ఒక భార్యను తీసుకున్నాడు మరియు సంతానం విడువకుండా చనిపోయాడు, 21 మరియు రెండవవాడు ఆమెను తీసుకున్నాడు మరియు సంతానం విడువకుండా చనిపోయాడు, మరియు మూడవ వాడును అదేవిధముగా. 22 మరియు ఏడుగురును సంతానము విడువ లేదు. లేకయే చనిపోయిరి. చివరిగా, ఆ స్త్రీ కూడా చనిపోయింది. 23 పునరుత్థానములో, వారు తిరిగి లేచినప్పుడు, వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉంటుంది? ఎందుకంటే ఆ ఏడుగురు ఆమెను భార్యగా కలిగి ఉన్నారు. 24 యేసు వారితో చెప్పాడు,– మీరు లేఖనములను లేదా దేవుని శక్తినిగాని యెరుగక దీని వలన మీరు దారి తప్పి పోవుట లేదా? 25 ఎందుకంటే వారు మృతులలో నుండి లేచునప్పుడు, వారు పెండ్లిచేసికొనరు, లేదా పెండ్లికి ఇయ్యబడరు, అయితే వారు పరలోకములలోని దూతల వలె ఉంటారు. 26 అయితే లేపబడిన మృతులకు సంబంధించి, పొద వద్ద, దేవుడు అతనితో ఎలా మాట్లాడాడో మీరు మోషే యొక్క గ్రంథములో చదువలేదా?, చెప్పాడు, ‘నేను అబ్రహాముకు దేవుడను మరియు ఇస్సాకు దేవుడను మరియు యాకోబుకు దేవుడను?’ 27 ఆయన మృతుల యొక్క దేవుడు కాడు అయితే సజీవుల యొక్క దేవుడు. మీరు పూర్తిగా మోసగింపబడ్డారు.” 28 మరియు శాస్త్రులలో ఒకడు వచ్చాడు, వారు కలసి {దీనిని} తర్కించడం విన్నాడు, ఆయన వారికి బాగుగా జవాబిచ్చాడు అని చూచాడు, అతడు ఆయనను అడిగాడు, “ఆజ్ఞల అన్నిటిలో మొదటది ఏది?” 29 యేసు జవాబిచ్చాడు, “మొదటిది, ఓ ఇశ్రాయేలూ, వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు. 30 మరియు నీవు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, మరియు నీ పూర్ణ ఆత్మతోను, మరియు నీ పూర్ణ మనస్సుతోను, మరియు నీ పూర్ణ బలముతోను ప్రేమింపవలెను. 31 రెండవది ఇది, ‘నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను.’ వీటి కంటే గొప్ప ఆజ్ఞ మరొకటి లేదు.” 32 మరియు శాస్త్రి ఆయనతో చెప్పాడు, “మంచి బోధకుడా! సత్య ప్రకారముగా ఆయన ఒక్కడు అని, మరియు ఆయన తప్ప వేరొకడు లేడు అని చెప్పావు. 33 మరియు పూర్ణ హృదయము నుండి, మరియు పూర్ణ అవగాహన నుండి, మరియు పూర్ణ శక్తి నుండి ఆయనను ప్రేమించడానికి మరియు తనను వలే పొరుగువానిని ప్రేమించడానికి, సమస్త దహన బలులు మరియు బలుల కంటె ఇంకా గొప్పది." 34 మరియు యేసు, అతడు వివేకముగా జవాబిచ్చాడు అని చూచాడు, అతనితో చెప్పాడు, “నీవు దేవుని యొక్క రాజ్యమునకు దూరముగ లేవు.” మరియు ఎవడును ఇక మీదట ఆయనను ప్రశ్నించుటకు ధైర్యము చేయలేదు. 35 మరియు యేసు జవాబిస్తూ, దేవాలయములో బోధిస్తూ చెప్పాడు, “క్రీస్తు, దావీదు యొక్క కుమారుడు అని శాస్త్రులు ఎలా చెప్పుచున్నారు? 36 దావీదు తానే, పరిశుద్ధ ఆత్మలో, చెప్పాడు, ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు, నా కుడి చేతి వైపున కూర్చుండుము, నేను నీ శత్రువులను నీకు పాదముల క్రింద ఉంచు వరకు.” 37 దావీదు తానే ఆయనను ‘ప్రభువు,’ అని పిలుస్తున్నాడు. మరియు ఆయన అతని కుమారుడు ఎలా?” మరియు గొప్ప జనసమూహము ఆయన మాటలు సంతోషముగా వినుచున్నారు. 38 మరియు తన బోధలో ఆయన చెప్పాడు, “శాస్త్రులను చూడండి, వారు పొడవాటి వస్త్రాలు ధరించి నడవడం మరియు సంత ప్రదేశాలలో వందనములు కోరుకుంటారు. 39 మరియు సమాజమందిరములలో మొదటి పీఠములను మరియు విందులలో వద్ద మొదటి స్థానములను కోరుతారు. 40 విధవరాండ్ర యొక్క యిండ్లు మ్రింగుచున్నారు, మరియు సాకుగా దీర్ఘప్రార్థనలు చేస్తారు. వీరు గొప్ప శిక్ష పొందుతారు. 41 మరియు ఆయన దేవాలయపు కానుకల పెట్టె యెదుట కూర్చున్నాడు, ఆయన జనసమూహము కానుకల పెట్టెలో డబ్బు వేయుడం చూస్తున్నాడు. మరియు అనేక మంది ధనవంతులైన మనుష్యులు అందులో ఎక్కువగా వేయుచుచున్నారు. 42 మరియు ఒక బీద విధవరాలు వచ్చి రెండు చిన్న కాసులు వేసింది, అవి వెండి నాణెములు. 43 మరియు తన శిష్యులను పిలిచాడు, ఆయన వారితో చెప్పాడు, “నేను మీతో నిజముగా చెప్పుచున్నాను, ఈ బీద విధవరాలు అందరు వేసిన దాని కంటే కానుక పెట్టెలో ఎక్కువ వేసింది. 44 ఎందుకంటే వారు అందరు తమ సమృద్ధిలో నుండి ఇచ్చారు, అయితే ఈమె తన పేదరికము నుండి, తనకు కలిగినది అంతయు, ఆమె తన జీవనోపాధి అంతా వేసింది.”

Chapter 13

1 మరియు ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకరు చెప్పాడు,“బోధకుడా, చూడండి! ఏ విధమైన రాళ్ళు మరియు ఏ విధమైన కట్టడములు!” 2 మరియు యేసు అతనితో చెప్పాడు,“నీవు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావా? ఒక రాయి మీద ఒక రాయి నిశ్చయముగా ఇక్కడ వదిలివేయబడదు, ఇది నిశ్చయముగా పడద్రోయబడకుండా ఉండదు.” 3 మరియు ఆయన దేవాలయము ఎదురుగా ఒలీవల యొక్క పర్వతము మీద కూర్చుండియుండగా, పేతురు మరియు యాకోబు మరియు యోహాను మరియు అంద్రెయ అను వారు స్వయంగా ఆయనను అడిగారు, 4 "మాతో చెప్పండి, ఇవి {విషయాలు} ఎప్పుడు జరుగును? మరియు ఇవి అన్ని {విషయాలు} నెరవేర్చబడునప్పుడు గురుతు ఏమిటి? 5 ఇప్పుడు యేసు వారితో చెప్పడం ప్రారంభిచాడు, “ఎవడును మిమ్ములను మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. 6 అనేకులు నా నామమున వస్తారు, చెప్పుతారు, ‘నేను {ఆయనను}!’ మరియు వారు అనేకులను మోసగిస్తారు. 7 అయితే మీరు యుద్ధములను గూర్చియు మరియు యుద్ధముల యొక్క వదంతులను గూర్చియు వినునప్పుడు చింతించ వద్దు; ఇవి సంభవించడం అవసరము, అయితే {ఇది} ఇంకా అంతం కాదు. 8 ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా దేశం మరియు రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం లేస్తాయి. భూకంపాలు {వివిధ} ప్రదేశాలలో ఉంటాయి. కరువులు ఉంటాయి. ఈ {విషయాలు} ప్రసవ నొప్పులకు ప్రారంభం. 9 అయితే మీరు, మిమ్ములను మీరే చూచుకొనండి! వారు మిమ్ములను సభలు మరియు సమాజమందిరములకు అప్పగిస్తారు; నా కారణంగా, వారికి ఒక సాక్ష్యం కోసం, మీరు కొట్టబడతారు మరియు మీరు అధిపతులు మరియు మీరు రాజుల ముందు నిలువబెట్టబడతారు. 10 మరియు మొదటగా, అన్ని దేశాలకు సువార్త ప్రకటించబడడం కోసం ఇది అవసరం. 11 మరియు వారు మిమ్ములను అప్పగించుటకు నడిపించుకొని పోవునప్పుడు, మీరు ఏమి చెప్పుదుమా అని చింతింప వద్దు. అయితే ఆ గడియలోనే మీకు ఇవ్వబడిన ఏదైనా, అదే మాట్లాడండి; ఎందుకంటే మాట్లాడు వారు మీరు కాదు, అయితే పరిశుద్ధ ఆత్మయే. 12 మరియు సోదరుడు సోదరుడుని మరణమునకు అప్పగిస్తారు, మరియు తండ్రి, {తన} బిడ్డను. మరియు పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పైకి లేచి మరియు వారిని మరణమునకు అప్పగిస్తారు. 13 మరియు నా పేరు యొక్క కారణంగా మీరు ప్రతి ఒక్కరి చేత ద్వేషించబడతారు. అయితే అంతము వరకు సహించినవాడు, అతడే రక్షణ పొందును. 14 ఆయితే నిర్జనత యొక్క అసహ్యత అది నిలువకూడని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు (చదువు వాడు అర్థం చేసుకోనివ్వండి.), అప్పుడు యూదయలో ఉండు వారు పర్వతములకు పారిపోనివ్వండి. 15 అయితే ఇంటి మీద ఉండువాడు క్రిందకు వెళ్ళనివ్వ కూడదు లేదా తన ఇంటి నుండి ఏదైనను తీసికొనుటకు లోనికి వెళ్ళనివ్వకూడదు 16 మరియు పొలములో ఉన్నవాడు తన అంగీని పొందేందుకు వెనుక ఉన్న {వస్తువులకు} తిరిగి రాకూడదు. 17 అయితే ఆ దినములలో గర్భమును కలిగి ఉన్న వారికి, మరియు పాలిచ్చుతలలు తల్లులు వారికి శ్రమ. 18 అయితే అది చలికాలమందు సంభవింప కూడదు అని ప్రార్థించండి. 19 ఎందుకంటే ఆ దినములలో శ్రమ ఉంటుంది - దేవుడు సృజించిన సృష్టి యొక్క ఆరంభము నుండి ఇటువంటి ఈ రకమైనది ఇప్పటి వరకు సంభవించ లేదు, మరియు {మరల} నిశ్చయముగా సంభవించదు. 20 మరియు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల, ఏ శరీరియు రక్షింపొందదు. అయితే ఆయన ఏర్పరచుకొనిన ఎన్నికైన వారి నిమిత్తము, ఆయన ఆ దినములు తక్కువ చేస్తాడు. 21 మరియు అప్పుడు ఎవడైనను మీతో చెప్పినయెడల, ‘చూడండి, క్రీస్తు ఇక్కడ {ఉన్నాడు!}, చూడండి, అక్కడ ఉన్నాడు!’ {దానిని} నమ్మ వద్దు. 22 ఎందుకంటే అబద్ధపు క్రీస్తులు మరియు అబద్ధపు ప్రవక్తలు పైకి లేపబడతారు మరియు సాధ్యమైన యెడల ఎన్నుకున్న వారిని మోసపుచ్చడానికి, సూచక క్రియలు మరియు అద్భుతాలు ఇస్తారు. 23 అయితే మీరు, గమనించండి! ఇదిగో, నేను ప్రతిదానిని మీకు ముందుగానే చెప్పాను. 24 అయితే ఆ దినములలో, ఆ శ్రమ తరువాత, సూర్యుడు చీకటైపోతాడు, మరియు చంద్రుడు తన వెలుగును ఇవ్వడు; 25 మరియు ఆకాశము నుండి నక్షత్రములు పడుతూ ఉంటాయి, మరియు ఆకాశములలోని శక్తులు కదలింపబడతాయి. 26 మరియు అప్పుడు మనుష్యుని యొక్క కుమారుడు మహా శక్తి మరియు మహిమతో మేఘములలో వచ్చుటను వారు చూస్తారు. 27 మరియు తరువాత ఆయన దేవదూతలను పంపుతాడు మరియు ఆయన భూమి యొక్క చివరి నుండి ఆకాశం చివరి వరకు నాలుగు గాలుల నుండి తాను ఎన్నుకున్న వారిని ఒకచోట చేర్చుకుంటాడు. 28 ఇప్పుడు అంజూరపు చెట్టు నుండి ఉపమానము నేర్చు కొనండి. దాని కొమ్మ యింక లేతదై మరియు {దాని} ఆకులు చిగిరించునప్పుడు, వేసవి కాలము సమీపముగా ఉన్నది అని మీకు తెలుసు. 29 ఆ ప్రకారమే కూడా, మీరు ఈ {సంగతులు} జరుగుట చూచు నప్పుడు, ఆయన సమీపమున, ద్వారము వద్ద ఉన్నాడు అని తెలుసుకొనండి. 30 నిజముగా నేను మీకు చెప్పుచున్నాను, {సంగతులు} అన్నియు సంభవించే వరకు ఈ తరము నిశ్చయముగా గతింపదు. 31 ఆకాశము మరియు భూమియు గతించి పోతాయి, అయితే నా మాటలు నిశ్చయముగా గతింపవు. 32 అయితే ఆ దినమును లేదా ఆ గడియ గురించి, తండ్రి తప్ప ఏ ఒక్కరు, పరలోకములోని దూతలు సహితం, లేదా కుమారుడైనను ఎరుగరు. 33 జాగరూకతతో ఉండండి! మెలకువగా ఉండండి మరియు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆ సమయము ఎప్పుడు మీకు తెలియదు. 34 ఒక మనుష్యుడు ఒక ప్రయాణములో వలె, మరియు తన ఇంటిని విడిచిపెట్టి, మరియు తన సేవకులలో ప్రతి ఒక్కరికి తన పని మీద అధికారమును ఇచ్చి, మరియు అతడు జాగరూకతతో ఉండాలి అని ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడు; 35 కాబట్టి, అప్రమత్తంగా ఉండండి,ఎందుకంటే ఇంటి యొక్క ప్రభువు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు- సాయంత్రం అయినా గానీ లేదా అర్ధరాత్రి లేదా కోడి కూయునప్పుడు లేదా ఉదయం - 36 లేనియెడల, అకస్మాత్తుగా వచ్చి, ఆయన మీరు నిద్రబోవుచుండుట కనుగొనవచ్చు. 37 అయితే నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను: జాగరూకతతో ఉండండి.

Chapter 14

1 ఇప్పుడు పస్కాపండుగ మరియు పులియని రొట్టె యొక్క పండుగ రెండు రోజులలో ఉంది, మరియు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులును రహస్యం చేత పట్టుకొని, వారు ఆయనను ఏలాగు చంపగలమని వెదకుచున్నారు. 2 ఎందుకంటే వారు చెప్పారు, "పండుగ సమయంలో కాదు, తద్వారా మనుష్యుల యొక్క అల్లరి ఉండదు." 3 మరియు ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను యొక్క ఇంట {ఉండగా}, ఆయన భోజనము చెయ్యడానికి ఏటవాలుగా కూర్చుండి {ఉండగా}, ఒక స్త్రీ స్వచ్చమైన జటామాంసి యొక్క చాలా విలువైన అభిషేకపు నూనె యొక్క చలువరాయి జాడి తీసికొని వచ్చింది. జాడి పగులగొట్టి, ఆమె దానిని ఆయన తల మీద పోసింది. 4 అయితే కొందరు తమలో తాము కోపంగా ఉన్నారు, “ఈ అభిషేకపు నూనె యొక్క వ్యర్థం దేనికి జరిగింది? 5 ఎందుకంటే ఈ సుగంధద్రవ్య అత్తరు 300 దేనారముల కంటె ఎక్కువ వెలకు అమ్మబడవచ్చు మరియు బీదలకు ఇయ్యవచ్చును.” మరియు వారు ఆమెను తిట్టుచున్నారు. 6 ఆయిత యేసు చెప్పాడు, “ఆమెను ఒంటరిగా వదిలి వెయ్యండి. మీరు ఆమెకు ఎందుకు ఇబ్బంది కలుగజేయుచున్నారు? ఆమె నా కోసం ఒక మంచి కార్యము చేసింది. 7 ఎందుకంటే బీదలు ఎల్లప్పుడును మీతోనే ఉన్నారు, మరియు మీరు కోరుకున్నప్పుడు, మీరు వారికి మేలు చేయగలరు, అయితే మీరు ఎల్లప్పుడూ నన్ను కలిగి ఉండరు. 8 ఆమె చేయగలిగింది, ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నా శరీరమును అభిషేకించడానికి ఆమె ఎదురుచూసింది. 9 మరియు నిజముగా నేను మీకు చెప్పుచున్నాను, సర్వ లోకములో ఎక్కడ సువార్త ప్రకటిస్తారో ఈమె చేసినది కూడా ఆమె జ్ఞాపకార్థములో చెప్పబడుతుంది. 10 మరియు పండ్రెండుగురిలో ఒకడు ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు, తద్వారా అతడు ఆయనను వారికి అప్పగించవచ్చును. 11 మరియు వారు {దీనిని} విన్నారు, సంతోషించారు మరియు అతనికి వెండిని ఇవ్వడానికి వాగ్దానము చేసారు. మరియు ఆయనను సౌకర్యవంతంగా ఏవిధంగా అప్పగించాలని అతడు వెదకుచున్నాడు. 12 మరియు పులియని రొట్టెల పండుగ యొక్క మొదటి దినమున, వారు పస్కా గొర్రెపిల్లను వధించునప్పుడు, ఆయన శిష్యులు ఆయనతో చెప్పారు, “మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచుటకు నీవు {మమ్ములను} కోరుచున్నావు తద్వారా నీవు పస్కాను భుజించవచ్చును?” 13 మరియు ఆయన శిష్యులలో ఇద్దరిని పంపాడు మరియు వారితో చెప్పాడు, “నగరము లోనికి వెళ్ళండి, మరియు ఒక నీళ్ళ యొక్క కుండను మోయుచున్న ఒక మనుష్యుడు మిమ్ములను కలుస్తాడు. అతనిని వెంబడించండి. 14 మరియు అతడు ఎక్కడ ప్రవేశించునో, ఆ యింటి యొక్క యజమానునితో చెప్పండి, ’బోధకుడు చెప్పుచున్నాడు, “నా అథిది గది ఎక్కడ ఉంది? నేను నా శిష్యులతో పస్కాను నేను ఎక్కడ భుజించుదును?” 15 మరియు అతడు అమర్చబడిన {మరియు} సిద్ధంగా ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు, మరియు అక్కడ మన కోసం సిద్ధబాటులు చేయండి. 16 మరియు శిష్యులు వెళ్ళిపోయారు మరియు నగరమునకు వెళ్ళారు, మరియు వారు ఆయన వారితో చెప్పిన విధముగా {దానిని} కనుగొన్నారు, మరియు వారు పస్కాను సిద్ధము చేసారు. 17 మరియు, సాయంకాలము కావచ్చినప్పుడు, ఆయన పండ్రెండుగురితో వచ్చాడు. 18 మరియు వారు తినుటకు ఏటవాలుగా కూర్చుని మరియు తినుచూ {ఉండగా}, యేసు చెప్పాడు, “నేను మీతో నిజముగా చెప్పుచున్నాను, మీ మధ్యలో నుండి ఒకడు, నాతో తినుచున్నవాడు, నన్ను శత్రువులకు అప్పగిస్తాడు. 19 వారు దుఃఖపడుటకు ప్రారంభించారు, మరియు ఒకరి తరువాత ఒకరు ఆయనకు చెప్పారు, "ఖచ్చితంగా నేను కాదా?" 20 మరియు ఆయన వారితో చెప్పాడు, “{అది} పండ్రెండు మందిలో ఒకడు, నాతో పాత్రలో లోనికి ముంచుచున్న వాడు. 21 ఎందుకంటే మనుష్యుని యొక్క కుమారుడు ఆయనను గురించి ఇది వ్రాసిన విధముగా పోవుచున్నాడు, అయితే ఎవని ద్వారా మనుష్యుని యొక్క కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ! ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు.” 22 మరియు వారు తినుచూ {ఉండగా}, ఆయన రొట్టెను తీసుకొన్నాడు, {దానిని} ఆశీర్వదించి, ఆయన {దానిని} విరిచి, మరియు {దానిని} వారికి ఇచ్చి మరియు చెప్పాడు, “{దీనిని} తీసుకోండి. ఇది నా శరీరము.” 23 మరియు ఒక పాత్ర తీసుకొన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన {దానిని} వారికి ఇచ్చాడు, మరియు వారు అందరు దాని నుండి త్రాగారు. 24 మరియు ఆయన వారితో చెప్పాడు, “ఇది అనేకుల కోసం చిందుచున్న నా రక్తము, నిబంధన రక్తం. 25 నేను దేవుని యొక్క రాజ్యములో క్రొత్తదిగా త్రాగు దినము వరకు ద్రాక్ష తీగ యొక్క ఫలం నుండి ఇకను నిశ్చయముగా దానిని త్రాగను అని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. 26 మరియు వారు ఒక కీర్తన పాడారు, ఒలీవల యొక్క పర్వతమునకు వెళ్ళారు. 27 మరియు యేసు వారితో చెప్పాడు, “మీరు అందరు దూరంగా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది వ్రాసియుంది, ‘నేను గొర్రెల కాపరిని కొట్టుదును మరియు గొర్రెలు చెదరగొట్టబడతాయి.’ 28 అయితే నేను పైకి లేచిన తరువాత, నేను మీ కంటె ముందుగా గలిలయ లోనికి వెళ్ళతాను.” 29 అయితే పేతురు ఆయనతో చెప్పాడు, “అందరు తొట్రు పడిన యెడల, సహితం అయినను నేను కాదు.” 30 మరియు యేసు అతనితో చెప్పాడు, “నిజముగా నేను నీకు చెప్పుచున్నాను – ఈ దినమే – ఇదే రాత్రి – ఒక కోడి రెండు సార్లు కూయక ముందు, నీవు నన్ను మూడు సార్లు తిరస్కరిస్తావు.” 31 అయితే అతడు ధృఢంగా చెప్పాడు, “నీతో పాటు చనిపోవలసిన నాకు అవసరం ఉన్న యెడల సహితం నేను నిశ్చయముగా నిన్ను తిరస్కరించను.” మరియు వారు అందరు కూడా అదే విధముగా మాట్లాడారు. 32 మరియు వారు ఒక స్థలమునకు వచ్చారు, దీని పేరు గెత్సేమనే, మరియు ఆయన తన శిష్యులతో చెప్పాడు, “నేను ప్రార్థించుచుండగా మీరు ఇక్కడ కూర్చోండి.” 33 మరియు ఆయన పేతురు మరియు యాకోబును మరియు యోహానులను తనతో పాటు తీసుకువెళ్ళాడు మరియు శ్రమపడుటకు మరియు చాలా ఇబ్బంది పడుటకు ఆరంభించాడు. 34 మరియు ఆయన వారితో చెప్పాడు, నా ప్రాణము మరణమగునంతగా సహితం చాలా దుఃఖములో ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి ఉండండి మరియు మెలకువగా ఉండండి.” 35 మరియు కొంచెం దూరం వెళ్ళాడు, ఆయన నేల మీద మోకరించి మరియు ఇది సాధ్యమైన యెడల, ఆ గడియ తన నుండి దాటిపోవలెను అని ప్రార్థించాడు. 36 మరియు ఆయన చెప్పాడు, “అబ్బా, తండ్రీ, నీకు సమస్త {కార్యములు} సాధ్యమై {ఉన్నవి}. ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము. అయితే నా చిత్తము కాదు, అయితే నీ చిత్తము.” 37 మరియు ఆయన వచ్చాడు మరియు వారు నిద్రించుచుండుట కనుగొన్నాడు, మరియు ఆయన పేతురుతో చెప్పాడు, “సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ కోసం మెలకువగా ఉండ లేవా? 38 మెలకువగా ఉండండి మరియు ప్రార్థన చేయండి, తద్వారా మీరు శోధన లోనికి ప్రవేశించరు. ఆత్మ నిజంగా ఇష్టపడుతూ {ఉంది}, అయితే శరీరం బలహీనంగా {ఉంది}.” 39 మరియు మరల, వెళ్ళి పోయాడు, ఆయన ప్రార్థించాడు, అదే {విషయము} పలికాడు. 40 మరియు మరల, వచ్చాడు, ఆయన వారు నిద్రించుట కనుగొన్నాడు, ఎందుకంటే వారి కన్నులు భారముగా ఉన్నాయి, మరియు ఆయనకు ఏమి జవాబివ్వలో వారికి తెలియ లేదు. 41 మరియు ఆయన మూడవ సారి వచ్చాడు మరియు వారితో చెప్పాడు, “మీరు ఇంకా నిద్రపోవుచున్నారా మరియు విశ్రాంతి తీసుకుంటున్నారా? ఇది చాలును! గడియ వచ్చినది. ఇదిగో, మనుష్యుని కుమారుడు పాపుల చేతుల్లోనికి అప్పగింపబడుచున్నాడు. 42 లెండి, మనము వెళ్ళుదము. ఇదిగో, నన్ను అప్పగించు వాడు సమీపమున ఉన్నాడు.” 43 మరియు వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచూ {ఉండగా}, పండ్రెండుమందిలో ఒకడైన యూదా, మరియు ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు మరియు పెద్దల వద్ద నుండి కత్తులు మరియు గుదియలుతో ఒక సమూహము అతనితో వచ్చారు. 44 ఇప్పుడు ఆయనను అప్పగించువాడు వారికి ఒక గుర్తు ఇచ్చాడు, చెప్పాడు, “నేను ఎవరిని ముద్దుపెట్టుకొందునో, అది ఆయనే. ఆయనను పట్టుకొనండి మరియు భద్రముగా {ఆయనను} నడిపించండి. 45 మరియు చేరుకున్నారు, వెంటనే ఆయన వద్దకు వచ్చాడు, అతడు చెప్పాడు, “రబ్బీ,” మరియు వాడు ఆయనను ముద్దుపెట్టుకొన్నాడు. 46 మరియు వారు ఆయన మీద చేతులు వేసారు మరియు ఆయనను పట్టుకొన్నారు. 47 అయితే పక్కన నిలబడిన వారిలో ఒకానొక వ్యక్తి, {తన} కత్తి దూసాడు, ప్రధాన యాజకుని యొక్క సేవకుడిని కొట్టాడు మరియు అతని చెవి నరికాడు. 48 మరియు జవాబిస్తూ, యేసు వారితో చెప్పాడు, “మీరు ఒక బందిపోటు దొంగకు వ్యతిరేకంగా అన్నట్టు, కత్తులతో మరియు గుదియలతో నన్ను పట్టుకొనుటకు బయటకు వచ్చారా? 49 నేను ప్రతి దినము దేవాలయములో బోధిస్తూ మీతో ఉన్నాను, మరియు మీరు నన్ను పట్టుకొన లేదు, అయితే తద్వారా లేఖనములు నెరవేర్చబడతాయి. 50 మరియు ఆయనను విడిచిపెట్టారు, వారు అందరు పారిపోయారు. 51 మరియు {తన} దిగంబర శరీరము మీద ఒక నార వస్త్రం వేసికొనియున్న ఒకానొక యువకుడు ఆయనను వెంబడించాడు, మరియు వారు అతనిని పట్టుకొన్నారు. 52 అయితే అతడు, నార వస్త్రాన్ని విడిచిపెట్టాడు, దిగంబరుడై పరుగెత్తాడు. 53 మరియు వారు యేసును ప్రధాన యాజకుని వద్దకు తీసుకువెళ్ళారు, మరియు ప్రధాన యాజకులు మరియు పెద్దలు మరియు శాస్త్రులు అందరును కలసి కూడుకున్నారు. 54 ఇప్పుడు పేతురు దూరము నుండి ఆయనను ప్రధాన యాజకుని యొక్క ప్రాంగణం వరకు వెంబడించాడు, మరియు అతడు బంట్రౌతులతో కూర్చున్నాడు మరియు మంట వద్ద తనను తాను వేడిచేసుకొనుచున్నాడు. 55 ఇప్పుడు ప్రధాన యాజకులు మరియు సన్ హెడ్రిన్ వారు అందరును యేసును చంపడానికి ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం వెదకారు, మరియు వారు {ఏదీ} కనుగొనలేదు. 56 అనేకులు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధముగా సాక్ష్యము చెప్పారు, అయితే {వారి} సాక్ష్యం ఒకే విధంగా లేదు. 57 మరియు నిర్దిష్టమైన కొందరు లేచి నిలబడ్డారు, ఆయనకు వ్యతిరేకంగా అబద్దపు సాక్ష్యం చెప్పారు, చెప్పారు, 58 "ఆయన చెప్పడం మేము విన్నాము, ‘చేతులతో చేసిన ఈ దేవాలయాన్ని నేను నాశనం చేస్తాను, మరియు మూడు దినములలో నేను చేతులు లేకుండా చెయ్యబడిన మరొక దానిని నిర్మిస్తాను.'" 59 మరియు ఈ విధానములో కూడా వారి సాక్ష్యం ఒకే విధముగా లేదు. 60 మరియు మధ్యలో లేచి నిలబడ్డాడు, ప్రధాన యాజకుడు యేసును ప్రశ్నించాడు, చెప్పాడు, “నీవు అస్సలు సమాధానం చెప్పవా? వీరు నీకు వ్యతిరేకంగా ఏమి సాక్ష్యమిస్తున్నారు?” 61 అయితే ఆయన మౌనంగా ఉన్నాడు మరియు అస్సలు జవాబు చెప్పలేదు. మరల ప్రధాన యాజకుడు ఆయనను ప్రశ్నించాడు మరియు ఆయనతో చెప్పాడు, “నీవు పవిత్రమైన వాని యొక్క కుమారుడవైన క్రీస్తువు నీవేనా?” 62 మరియు యేసు చెప్పాడు, "నేనే; మరియు నీవు మనుష్యుని యొక్క కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుట మరియు ఆకాశము యొక్క మేఘములతో రావడం మీరు చూస్తారు.” 63 మరియు ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొన్నాడు, చెప్పాడు, "మనకు ఇక సాక్షులతో పని యేమి అవసరం? 64 మీరు ఈ దేవదూషణ విన్నారు. మీకు ఏమి స్పష్టంగా ఉంది?” మరియు వారందరు ఆయన మరణానికి అర్హుడని ఖండించారు. 65 మరియు కొందరు ఆయన మీద ఉమ్మివేయడం ప్రారంభించారు మరియు ఆయన ముఖమునకు ముసుకు వేసి మరియు ఆయనను గుద్దారు మరియు ఆయనతో చెప్పారు, “ప్రవచించు!” మరియు అధికారులు ఆయనను చెంప దెబ్బలను కొట్టారు. 66 మరియు పేతురు ఆవరణ క్రింది భాగములో {ఉండగా} ప్రధాన యాజకుని సేవకురాలైన బాలిక ఒకరు {ఆయన} వద్దకు వచ్చింది. 67 మరియు పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని సమీపంగా చూసింది, ఆమె చెప్పింది, "నీవు నజరేయుడగు యేసుతో కూడ ఉన్నావు." 68 అయితే అతడు {దానిని} తృణీకరించాడు, చెప్పాడు, "నాకు తెలియదు లేదా నీవు చెప్పుచున్నది నాకు అర్థం కావడం లేదు." మరియు అతడు బయటికి వెళ్ళాడు, వెలుపల ఆవరణంలోనికి. 69 మరియు సేవకురాలైన బాలిక {అక్కడ} అతనిని చూచింది, చుట్టూ నిలిచియున్న వారికి మరల చెప్పడానికి ఆరంభించింది, "ఇతడు వారి మధ్య ఉన్నాడు!" 70 అయితే అతడు {దానిని} మరల తృణీకరించాడు. మరియు కొంత {సమయం} తరువాత చుట్టూ నిలిచియున్నవారు మరల పేతురుతో చెప్పారు, "నిజముగా నీవు వారి మధ్య ఉన్నావు, ఎందుకంటే నీవు కూడా గలిలయుడవు." 71 మరియు అతడు శపించుకోడానికి మరియు ఒట్టుపెట్టుకోడానికీ ఆరంభించాడు, "మీరు చెప్పుచున్న ఈ మనుష్యుని నేను యెరుగను." 72 మరియు వెంటనే రెండవ సారి కోడి కూసింది. మరియు 'కోడి రెండు మారులు కూయక ముందే నీవు నన్ను మూడు సార్లు తృణీకరిస్తావు' అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొన్నాడు మరియు విరిగిన వాడై, అతడు ఏడ్చాడు.

Chapter 15

1 మరియు వెంటనే ఉదయము తెల్లవారుచున్నప్పుడు, సంప్రదింపు కలిగి యుండి, ప్రధాన యాజకులు పెద్దలతో మరియు శాస్త్రులు మరియు మహాసభ అంతా, యేసును బంధించారు, {ఆయనను} నడిపించుకొని వెళ్ళారు మరియు {ఆయనను} పిలాతుకు అప్పగించారు. 2 మరియు పిలాతు ఆయనను ప్రశ్నించాడు, "నీవు యూదుల యొక్క రాజువా?" అయితే ఆయన అతనికి జవాబిస్తూ, చెప్పాడు, "నీవు చెప్పినట్టు అలాగే." 3 మరియు ప్రధాన యాజకులు ఆయనను అనేకమైన {సంగతులు} యొక్క ఆరోపణలు చేసారు. 4 ఇప్పుడు పిలాతు ఆయనను మరల ప్రశ్నిస్తున్నాడు, చెప్పాడు, "నీవు దేనికీ జవాబు చెప్పవా?? చూడు, వారు నీ మీద ఎన్ని {సంగతులు} నేరములు మోపుచున్నారు!" 5 అయితే యేసు ఇక మీదట ఏమియూ జవాబు చెప్పలేదు, తద్వారా పిలాతు ఆశ్చర్యపడ్డాడు. 6 ఇప్పుడు పండుగ సమయంలో, అతడు సాధారణముగా వారు మనవి చేసిన ఒక ఖయిదీని వారికి విడిపిస్తాడు. 7 ఇప్పుడు బరబ్బ అని పిలువబడిన ఒకడు ఉన్నాడు, తిరుగుబాటుదారులతో బంధించినవాడు, కలహములో నరహత్య చేసిన వాడు. 8 మరియు వచ్చి, సమూహం ఆయన వారి కోసం సాధారణముగా చేయుచూ వచ్చిన విధముగా {ఆయనను} బతిమిలాడడానికి ఆరంభించారు. 9 మరియు పిలాతు వారికి జవాబిచ్చాడు, చెప్పాడు, "యూదుల యొక్క రాజును నేను మీకు విడుదల చెయ్యాలి {అని} మీరు కోరుకుంటున్నారా?" 10 ఎందుకంటే ప్రధాన యాజకులు అసూయ కారణంగా ఆయనను అప్పగించారు అని అతడు తెలుసుకొన్నాడు. 11 అయితే ప్రధాన యాజకులు సమూహమును ప్రేరేపించారు తద్వారా బదులుగా అతడు బరబ్బను తమకు విడుదల చేస్తాడు. 12 మరియు మరల జవాబిస్తూ, పిలాతు, వారికి చెప్పాడు, "కాబట్టి నేను యూదుల యొక్క రాజు అని మీరు పిలిచిన {వానికి} ఏమి చెయ్యాలి?" 13 అయితే వారు మరల గట్టిగా అరిచారు, "వానిని సిలువ వేయుము!" 14 అయితే పిలాతు చెపుతున్నాడు, "అతడు చేసిన దోషం ఏమిటి?" అయితే వారు మరి ఎక్కువగా గట్టిగా అరిచారు, "వానిని సిలువ వేయుము." 15 ఇప్పుడు పిలాతు, సమూహముకు సంతోషపెట్టు {దానిని} చెయ్యడానికి కోరుకొని, వారికి బరబ్బను విడుదల చేసాడు మరియు యేసును వారికి అప్పగించాడు, {ఆయనను} కొరడాలతో కొట్టించాడు, తద్వారా ఆయన సిలువ వేయబడతాడు. 16 ఇప్పుడు సైనికులు ఆయనను అంతఃపురములోనికి నడిపించారు (అంటే ప్రేతోర్యము) మరియు మొత్తం బృందాన్ని కలిపి పిలిచాడు. 17 మరియు ఆయన మీద ఊదారంగు అంగీని ధరింపచేసాడు మరియు ఆయన మీద వారు కలిపి మెలితిప్పిన ముండ్ల యొక్క కిరీటమును ఉంచాడు, 18 మరియు వారు ఆయనకు నమస్కారం చెయ్యడానికి ప్రారంభించారు: "యూదుల యొక్క రాజా నీకు జయము!" 19 మరియు వారు ఆయన తలను రెల్లుతో కొట్టారు మరియు అయన మీద ఉమ్మివేసారు, మరియు వారు మోకాళ్ళు వంచి, ఆయన ముందుకు కింద వంగారు. 20 మరియు వారు ఆయనను అపహసించిన తరువాత, వారు ఆయన నుండి ఊదారంగు వస్త్రము తీసివేసారు మరియు {ఆయన} సొంత వస్త్రములు ఆయనకు తొడిగించారు మరియు ఆయనను బయటికి తీసుకు వెళ్ళారు తద్వారా వారు ఆయనను సిలువ వేస్తారు. 21 మరియు వారు పల్లెటూరి నుండి వస్తున్న, కురేనీయ యొక్క సీమోను అను ఒకనిని (అతడు అలెక్సంద్రు మరియు రూఫునకు తండ్రి) పరిచర్య కోసం బలవంతము చేసాడు తద్వారా అతడు సిలువను మోస్తాడు. 22 మరియు వారు ఆయనను గోల్గోతా ("కపాలము యొక్క ప్రదేశం" అని అనువదించబడిన ప్రదేశం) కు తీసుకువచ్చారు. 23 మరియు వారు బోళముతో కలిపిన ద్రాక్షారసము ఆయనకు అందించారు, అయితే ఆయన దానిని త్రాగ లేదు. 24 మరియు వారు ఆయనను సిలువవేసారు మరియు ఆయన వస్త్రములను విభజించారు, ఎవరు దేనిని తీసుకోవాలో వారి కోసం చీట్లు వేసారు. 25 ఇప్పుడు ఇది మూడవ గడియ మరియు వారు ఆయనను సిలువ వేసారు. 26 మరియు ఇది ఆయనకు వ్యతిరేకంగా మోపిన నేర శిలాశాసనముగా ఇది, రాయబడింది: "యూదుల యొక్క రాజు." 27 మరియు వారు ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేసారు, ఒకడు {ఆయన} కుడివైపున మరియు ఒకడు ఆయన ఎడమవైపు. 28 [మరియు 'ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను' అని చెప్పిన లేఖనం నెరవేరింది.'] 29 మరియు మార్గమున వెళ్తున్న వారు ఆయనను దూషిస్తూ ఉన్నారు, వారి తలలు ఊపుచున్నారు, మరియు చెప్పుచున్నారు, "ఆహా! దేవాలయమును నాశనము చేయువాడు మరియు {దానిని} మూడు రోజులలో తిరిగి కట్టువాడు, 30 నిన్ను నీవే రక్షించుకొనుము, సిలువ నుండి కిందకు రమ్ము!" 31 అదే విధానంలో కూడా, ప్రధాన యాజకులు శాస్త్రులతో పాటు, ఒకరికొకరు ఆయనను అపహాస్యము చేసారు, చెప్పారు, "ఇతడు ఇతరులను రక్షించాడు; తన్ను తాను రక్షించుకొనలేక పోతున్నాడు. 32 ఇశ్రాయేలు యొక్క రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ నుండి కిందకు రానివ్వండి తద్వారా మనం చూస్తాము మరియు విశ్వసిస్తాము," మరియు ఆయనతో సిలువ వేసిన వారు ఆయనను నిందించారు. 33 మరియు ఆరవ గడియ వచ్చింది, తొమ్మిదవ గడియ వరకు భూమి అంతటి మీద చీకటి వచ్చింది. 34 మరియు తొమ్మిదవ గడియ వద్ద, యేసు ఒక పెద్ద స్వరంతో గట్టిగా అరిచాడు, "ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ?" ఇది ఇలా అనువదించబడింది, "నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి?" 35 మరియు దగ్గర నిలిచున్న వారిలో కొందరు, ఆయన మాటలు విని, చెప్పారు, "చూడండి, ఆయన ఏలీయా కోసం పిలుచుచున్నాడు." 36 మరియు ఒకడు, పరుగెత్తికొని వెళ్ళాడు, పులియబెట్టిన ద్రాక్షారసముతో ఒక స్పంజీని నింపాడు, {దానిని} రెల్లు మీద ఉంచాడు, {దానిని} త్రాగడానికి ఆయనకు ఇచ్చాడు, చెప్పాడు, "అతనిని ఒంటరిగా ఉండనివ్వండి! ఒకవేళ ఏలీయా ఇతనిని కిందకు తీసుకొని వస్తాడేమో మనం చూద్దాము! 37 మరియు యేసు ఒక పెద్ద స్వరంతో గట్టిగా అరిచాడు, {తన} ఆఖరు శ్వాసను విడిచాడు. 38 మరియు దేవాలయము యొక్క తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. 39 ఇప్పుడు ఆయనకు ముందు నిలిచియున్న శతాధిపతి ఆయన ఈ విధానంలో {ఆయన} చివరి శ్వాసను విడువడం చూచి, చెప్పాడు, "నిజముగా ఈ మనుష్యుడు దేవుని యొక్క కుమారుడే." 40 ఇప్పుడు దూరం నుండి చూచుచున్న స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు, వారి మధ్యలో మగ్దలేనే మరియ మరియు చిన్న యాకోబు మరియు యోసే తల్లి మరియ ఇద్దరు మరియు సలోమే ఉన్నారు. 41 ఆయన గలిలయలో ఉన్నప్పుడు, ఆయనను వెంబడించారు మరియు ఆయనకు పరిచారము చేసారు, మరియు ఆయనతో యెరూషలేముకు వచ్చిన అనేక ఇతర {స్త్రీలు} ఉన్నారు. 42 మరియు సాయంత్రం అప్పటికే వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది సిద్ధబాటు యొక్క దినము, అంటే విశ్రాంతి దినముకు ముందు దినము 43 అరిమతయియ నుండి ఒకరు యోసేపు, యోసేపు, ఆలోచన సభ యొక్క గౌరవించ దగిన ఒక సభ్యుడు, అతడు కూడా తానే దేవుని యొక్క రాజ్యము కోసం ఎదురు చూచువాడు. వచ్చాడు, అతడు ధైర్యముగా పిలాతు వద్దకు వెళ్ళాడు మరియు యేసు యొక్క దేహము కోసం అడిగాడు. 44 ఇప్పుడు పిలాతు ఆయన అప్పటికే చనిపోయిన యెడల అని ఆశ్చర్యపడ్డాడు, మరియు శతాధిపతిని పిలిచాడు, అతడు అతనిని ప్రశ్నించాడు, ఆయన ఇప్పటికే చనిపోయెనా ఏమో. 45 మరియు {దీనిని} శతాధిపతి నుండి తెలిసికొన్నాడు, అతడు యోసేపుకు దేహమును ఇచ్చాడు. 46 మరియు నారబట్ట కొని, ఆయనను కిందకు దింపి, అతడు {ఆయనను} నార బట్టలో చుట్టాడు, మరియు రాతి బండ నుండి కత్తిరించిన సమాధిలో ఆయనను పెట్టాడు. మరియు ఆ సమాధి ద్వారమునకు ఎదురుగా అడ్డంగా ఒక రాయి దొర్లించాడు. 47 ఇప్పుడు మగ్దలేనే మరియ మరియు యోసే {తల్లి} మరియ ఆయన ఉంచిన స్థలమును గమనిస్తున్నారు.

Chapter 16

1 మరియు విశ్రాంతిదినము గడచిపోయింది, మగ్దలేనే మరియ మరియు యాకోబు యొక్క {తల్లి} మరియ మరియు సలోమేయు సుగంధద్రవ్యములు కొన్నారు తద్వారా వచ్చి, వారు ఆయనను అభిషేకిస్తారు. 2 మరియు వారం యొక్క మొదటి రోజు ఆదివారం పెందలకడ, వారు సమాధి యొద్దకు వచ్చారు, సూర్యుడు పైకి వచ్చాడు. 3 మరియు వారు ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి, “సమాధి యొక్క ద్వారము నుండి మన కోసం ఆ రాయి యెవడు దొర్లించును?” 4 మరియు పైకి చూచారు, రాయి పక్కకి దొర్లించి ఉండుట వారు చూసారు, ఎందుకంటే అది చాలా పెద్దది. 5 మరియు సమాధి లోనికి ప్రవేశించారు, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న ఒక యవనస్థుడు కుడి వైపున కూర్చుండుట వారు చూసారు, మరియు వారు కలవరపడ్డారు. 6 అయితే అతడు వారికి చెప్పాడు, “కలవరపడ వద్దు. సిలువ వేసిన వాడు, నజరేతు అయిన యేసును మీరు వెదకుచున్నారు; ఆయన తిరిగి లేచిన్నాడు, ఆయన ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. 7 అయితే వెళ్ళండి, ఆయన శిష్యులకు మరియు పేతురుకు చెప్పండి, ‘ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడు. ఆయన మీతో చెప్పిన విధముగా అక్కడ మీరు ఆయనను చూస్తారు. 8 మరియు బయటకు వచ్చి, వారు సమాధి నుండి పరుగెత్తారు, ఎందుకంటే వణుకు మరియు విస్మయము వారిని పట్టుకొన్నాయి. మరియు వారు ఎవనితో ఏమియు చెప్పలేదు. ఎందుకంటే వారు భయపడ్డారు. 9 [ఇప్పుడు వారం యొక్క మొదటి {రోజు} పెందలకడనే, లేచిన తరువాత ఆయన మగ్దలేనే మరియకు మొదట ప్రత్యక్షం అయ్యాడు, ఆమె నుండి ఆయన ఏడు దయ్యములను బయటికి వెళ్లగొట్టాడు. 10 ఆమె వెళ్ళింది {మరియు} ఆయనతో ఉన్న వారికి చెప్పింది {ఆ సమయంలో} వారు దుఃఖపడుతున్నారు మరియు యేడ్చుచున్నారు. 11 మరియు ఆయన సజీవంగా ఉన్నాడు అని మరియు ఆయన ఆమెకు కనపడెను {అని} వారు విన్నారు, {అయితే} వారు విశ్వసించలేదు. 12 ఇప్పుడు ఈ {సంగతులు} తరువాత, వారిలో ఇద్దరికి వారు దేశములోనికి వెళ్ళుచూ, నడచుచుండగా ఒక భిన్నమైన రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. 13 మరియు వారు, వెళ్లి, మిగిలిన శిష్యులకు చెప్పారు, {అయితే} వారు వారిని విశ్వసించ లేదు. 14 ఇప్పుడు తరువాత, వారు భుజించడానికి ఏటవాలుగా కూర్చుని {ఉండగా} ఆయన పదునొకండుమందికి ప్రత్యక్షం అయ్యాడు, మరియు ఆయన వారి అవిశ్వాసం మరియు హృదయం యొక్క కఠినత్వం కోసం వారిని గద్దించాడు, ఎందుకంటే ఆయన మరణం నుండి లేచిన {తరువాత} ఆయనను చూచిన వారిని వారు విశ్వసించ లేదు. 15 మరియు ఆయన వారితో చెప్పాడు,”లోకం అంతటి లోనికి వెళ్లి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 16 నమ్మి మరియు బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, మరియు నమ్మని వాడు శిక్షించబడును. 17 ఇప్పుడు ఈ సూచక క్రియలు విశ్వసించిన వారితో వెళ్తాయి: నా నామములో వారు దయ్యములను వెళ్లగొట్టుదురు. వారు క్రొత్త భాషలలో మాటలాడుదురు. 18 వారు పాములను పైకి ఎత్తిపట్టుకొంటారు, మరియు వారు మరణకరమైనది ఏదైనా త్రాగిన యెడల, అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులు ఉంచుతారు, మరియు వారు స్వస్థత నొందుతారు. 19 ప్రభువు యేసు వారితో మాటలాడిన తరువాత, ఆయన పరలోకములోనికి తీసుకొనబడ్డాడు మరియు దేవుని యొక్క కుడి చేతి వద్ద కూర్చున్నాడు. 20 ఇప్పుడు వారు, బయటకు వెళ్ళి, ప్రతీచోట బోధించారు, {ఆ సమయంలో} ప్రభువు వారితో పనిచేసాడు {మరియు} {వారితో} వెళ్ళిన {ఆ} సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.]