కొలస్సయులకు రాసిన పత్రిక
Chapter 1
1 క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు, దేవుని యొక్క చిత్తము ద్వారా, మరియు {మన} సహోదరుడు తిమోతి, 2 కొలొస్సయిలో క్రీస్తులో పరిశుద్ధులు మరియు నమ్మదగిన సహోదరులకు, మన తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృప మరియు సమాధానము. 3 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి, దేవునికి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. 4 క్రీస్తు యేసులో మీ విశ్వాసము మరియు పరిశుద్ధులు అందరి కోసం మీరు కలిగియున్న ప్రేమ గురించి విన్నాను, 5 పరలోకములలో మీ కోసం భద్రపరచబడి యున్న నిరీక్షణ యొక్క కారణంగా, ఇంతకు ముందు సత్యము యొక్క వాక్యములో, సువార్తను మీరు విన్నారు. 6 మీరు దీనిని వినిన మరియు సత్యములో దేవుని యొక్క కృపను గురించి నేర్చుకొన్న దినము నుండి, లోకం అంతటిలో కూడా ఉన్న విధముగా అది మీ మధ్య ఉంటూ, మీలో కూడా ఫలించుచు మరియు వ్యాపించుచున్నది. 7 మా ప్రియమైన తోడి దాసుడు, మా పక్షంగా క్రీస్తు యొక్క నమ్మదగిన సేవకుడు ఎపఫ్రా నుండి మీరు దీనిని నేర్చుకొనిన విధముగా, 8 మరియు అతడు ఆత్మలో మీ ప్రేమను మాకు తెలిపాడు. 9 ఈ కారణం చేత ఈ సంగతి మేము వినిన దినము నుండి, మేము కూడా మీ కోసం నిమిత్తము ప్రార్థన చేయడం మాన లేదు, మరియు సంపూర్ణ జ్ఞానము మరియు ఆత్మీయ వివేకములో ఆయన చిత్తము యొక్క జ్ఞానముతో మీరు నింపబడి ఉంటారు, 10 ప్రతి మంచి కార్యమునందు ఫలమును కలిగియుండి, మరియు దేవుని యొక్క జ్ఞానములో వృద్ధిపొందుచూ, ప్రతి సంతోషకరమైన మార్గములో ప్రభువుకు యోగ్యముగా నడుచుకొనడానికి, 11 సంతోషంతో పూర్ణమైన ఓర్పును మరియు దీర్ఘశాంతముకు ఆయన మహిమ యొక్క శక్తి ప్రకారం సంపూర్ణ బలముతో బలపరచబడి యుండి, 12 వెలుగులో పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము పంచుకొనడానికి మిమ్మును శక్తిమంతులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ. 13 ఆయన మనలను చీకటి యొక్క అధికారమునుండి రక్షించాడు మరియు ఆయన ప్రియమైన కుమారుని యొక్క రాజ్యముకు బదిలీ చేసాడు. 14 ఆయనలో మనం విమోచనం కలిగియున్నాము, పాపముల యొక్క క్షమాపణ. 15 ఆయన అదృశ్యదేవుని యొక్క స్వరూపియై యున్నాడు సర్వ సృష్టి యొక్క ప్రధముడు. 16 ఎందుకంటే ఆకాశములలో మరియు భూమి మీద, దృశ్యమైనవి మరియు అదృశ్యమైనవి, సమస్త కార్యములు ఆయనలో సృజింప బడెను. సింహాసనములు లేదా ఆదిపత్యములు లేదా ప్రభుత్వములు లేదా అధికారములు అయిననూ, సమస్త కార్యములు ఆయన ద్వారా మరియు ఆయన కోసం సృజింపబడెను. 17 మరియు ఆయన సమస్త కార్యములకు ముందుగా ఉన్నాడు మరియు ఆయనలో సమస్త కార్యములు కలిసి పట్టుకొని ఉన్నాయి. 18 సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సుయై ఉన్నాడు. ఆయన ఆదియై ఉన్నాడు, మృతుల మధ్య నుండి ప్రధముడు, తద్వారా ఆయన తానే సమస్త కార్యముల మధ్య మొదటివాడు అవుతాడు. 19 ఎందుకంటే ఆయనలో సర్వ సంపూర్ణత నివసించడానికి ఆనందభరితమయ్యింది, 20 మరియు ఆయనకు సమస్త కార్యములను సమాధానపరచడానికి, భూమి మీద ఉన్న కార్యములు లేదా ఆకాశములలో ఉన్న కార్యములు అయినను ఆయన ద్వారా, ఆయన సిలువ యొక్క రక్తము ద్వారా సమాధానపరచాడు, 21 ఒకానొక సమయంలో మీరు కూడా దూరస్థులు మరియు ఆలోచనలో, దుష్ట క్రియలలో శత్రువులునై ఉన్నారు. 22 అయితే ఇప్పుడు ఆయన యెదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మరియు నిరపరాధులుగాను మిమ్మును నిలువబెట్టుటకు ఆయన మాంసము యొక్క దేహము చేత ఇప్పుడు మరణము ద్వారా మీరు సమాధానపరచబడ్డారు. 23 పునాదిమీద కట్టబడి మరియు స్థిరముగా ఉండి, మరియు మీరు వినిన, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన ఈ సువార్త యొక్క నిరీక్షణ నుండి తొలగిపోకఉండి, విశ్వాసములో మీరు నిజముగా కొనసాగిన యెడల, దానికి పౌలు అను నేను ఒక పరిచారకుడను అయ్యాను. 24 ఇప్పుడు మీ కోసం {నా} శ్రమలలో నేను ఆనందించుచున్నాను, మరియు సంఘము అను ఆయన శరీరము నిమిత్తం క్రీస్తు యొక్క వేదనలలో కొదువైన వాటిని నా శరీరములో నేను సంపూర్ణము చేయుచున్నాను. 25 దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడానికి మీ కోసం నాకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం దానికి నేను ఒక సేవకుడిని అయ్యాను, 26 యుగముల నుండి మరియు తరముల నుండి మరుగు చేయబడియున్న మర్మము, అయితే ఇప్పుడు తన పరిశుద్ధులకు బయలుపరబడింది, 27 యూదేతరుల మధ్య ఈ మర్మము యొక్క మహిమ యొక్క ఐశ్వర్యము ఎట్టిదిగా {ఉన్నదో} వారికి తెలియపరచడానికి దేవుడు కోరాడు, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ యొక్క నిరీక్షణ. 28 సమస్త జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు మరియు బోధించుచూ మేము ఆయనను ప్రకటించుచున్నాము తద్వారా క్రీస్తులో సంపూర్ణునిగా చేసి ప్రతి మనుష్యుని ఆయన యెదుట మేము నిలువబెడతాము. 29 శక్తిలో నాలో క్రియ జరిగించుచు ఉన్న ఆయన క్రియ ప్రకారం నేను కూడా దీని కోసం ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను.
Chapter 2
1 ఎందుకంటే మీ కోసం మరియు లవొదికయలో ఉన్న వారి కోసం మరియు శరీరంలో నా ముఖము చూడని వారందరి కోసం నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. 2 తద్వారా వారి హృదయాలు ప్రోత్సహించబడతాయి, ప్రేమలో కలుపుబడి ఉండి మరియు గ్రహింపుయొక్క సంపూర్ణ నిశ్చయత యొక్క సమస్త ఐశ్వర్యము లోనికి, దేవుని యొక్క మర్మము క్రీస్తు యొక్క పరిజ్ఞానములోనికి తీసుకొనిరాబడతారు 3 వివేకం మరియు జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయనలో గుప్తములైయున్నవి. 4 నేను దీనిని చెపుతున్నాను తద్వారా ఎవడైనను ఒప్పింప జేసే మాటలతో మిమ్మును మోసపరచకుండా ఉంటారు. 5 ఎందుకంటే నేను శరీరంలో దూరముగా ఉన్న యెడల కూడా, ఆత్మలో నేను మీతో ఉన్నాను, మీ మంచి క్రమాన్ని మరియు క్రీస్తులో మీ విశ్వాసం యొక్క శక్తిని చూస్తున్నాను మరియు ఆనందించుచున్నాను. 6 కాబట్టి, మీరు ప్రభువు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ఆయనలో నడుచుకొనుడి. 7 ఆయనలో వేరుపారినవారై, మరియు యింటివలె కట్టబడుచు, మరియు మీరు నేర్చుకొనబడిన విధముగా విశ్వాసములో స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచూ ఉన్నారు. 8 క్రీస్తు ప్రకారం కాక, మరియు లోకము యొక్క ప్రాథమిక బోధ ప్రకారం, మనుష్యుల పారంపర్యాచారము ప్రకారం, మోసకరమైన నిరర్థకమైన మరియు తత్వజ్ఞానము ద్వారా మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 9 ఎందుకంటే ఆయనలో సమస్త దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా నివసించు చున్నది. 10 మరియు ఆయనలో మీరు సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకు మరియు అధికారులకును శిరస్సై యున్నాడు. 11 ఆయనలో మీరు కూడా, క్రీస్తు యొక్క సున్నతిలో శరీరం యొక్క దేహం యొక్క తొలగింపులో చేతులు లేకుండా చెయ్యబడిన ఒక సున్నతితో సున్నతి చెయ్యబడ్డారు. 12 బాప్తీస్మంలో ఆయనతో పాతిపెట్టబడినవారై మరియు ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని యొక్క ప్రభావములో విశ్వాసం ద్వారా మీరు ఆయనలో పైకి లేపబడితిరి. 13 మరియు అతిక్రమములలో మరియు శరీరమందు సున్నతిపొందక యుండుటలో మీరు మృతులై యుండగా, ఆయన {మన} అపరాధములను అన్నిటిని క్షమించి, ఆయనతో మిమ్మును సజీవులనుగా చేసాడు. 14 మనకు వ్యతిరేకంగా ఆజ్ఞల యొక్క వ్రాతరూపకమైన, మనకు విరోధముగాను నుండిన పత్రమును రద్దు చేసి, మరియు ఆయన దానిని {మన} మధ్య నుండి ఎత్తివేసి, సిలువకు దానిని కొట్టివేసాడు, 15 ఆయన ప్రధానులను మరియు అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువలో వారి మీద జయోత్సవము కలిగి, వారిని బాహాటముగా వేడుకకు కనుపరచెను. 16 కాబట్టి ఆహారములో లేదా పానములో లేదా పండుగ విషయంలో లేదా అమావాస్య లేదా విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, ఎవనిని మీకు తీర్పు తీర్చనియ్యకుడి. 17 ఇవి రాబోవు సంగతుల యొక్క ఛాయయే, అయితే శరీరం క్రీస్తు సంబంధమైనది. 18 తప్పు వినయం మరియు దేవదూతల యొక్క ఆరాధనలో ఆనందించుచు, తాను చూచినవాటి మీద నిలుచుచు, తన శరీరము యొక్క మనస్సు చేత కారణం లేకుండా ఉప్పొంగుచు ఉన్న వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి. 19 మరియు శిరస్సును హత్తుకొనకుండా ఉంటూ, దాని నుండి సర్వ శరీరము, కీళ్ళు మరియు నరముల ద్వారా పోషింపబడి కలిపి అతుకబడినదై, దేవుని నుండి వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 20 మీరు క్రీస్తుతో లోకము యొక్క మూలపాఠముల నుండి మృతిపొందినవారైన యెడల, లోకములో జీవించుచున్న విధముగా ఎందుకు మీరు దాని ఆజ్ఞలకు లోబడి యున్నారు: 21 "నువ్వు చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు!" 22 మనుష్యుల యొక్క ఆజ్ఞలు మరియు ఉపదేశముల ప్రకారం అవి అవన్నియు వినియోగంతో నాశనం కోసం ఉన్నాయి 23 అట్టివి నిజముగా స్వీయ-తయారిత మతములో మరియు తప్పుడు వినయము {మరియు} శరీరం యొక్క కఠినతలో జ్ఞానము యొక్క మాటను నిజముగా కలిగియుండడం, శరీరం యొక్క కోరికలు తీర్చుకోడానికి వ్యతిరేకంగా ఎటువంటి విలువ లేకుండా ఉంటుంది.
Chapter 3
1 కాబట్టి, మీరు క్రీస్తుతో లేపబడినవారు అయిన యెడల, పైనున్న సంగతులను వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుండియున్నాడు. 2 పైనున్న సంగతులను గురించి ఆలోచన చెయ్యండి, భూమి మీద సంగతులను గురించి కాదు. 3 ఎందుకంటే మీరు మృతిపొందారు, మరియు మీ జీవము దేవునిలో క్రీస్తుతో దేవునియందు దాచబడియున్నది. 4 మీ జీవం క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, తరువాత మహిమలో ఆయనతో మీరు కూడా ప్రత్యక్షపరచబడుదురు. 5 కాబట్టి భూమి మీద {ఉన్న} మీ అవయవములను, అనగా లైంగిక దుర్నీతి, అపవిత్రత, కామాతురత, దుష్ట ఆశ, మరియు విగ్రహారాధన అయిన ఈర్ష్యను చంపివేయుడి. 6 వాటి కారణంగా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, 7 వాటిలో మీరు జీవించినప్పుడు పూర్వము మీరు కూడా వాటిలో నడిచారు. 8 అయితే ఇప్పుడైతే మీరు కూడా, ఉగ్రత, కోపము, దుష్ట ఆశ, దూషణ, {మరియు} మీ నోట నుండి అశ్లీల సంభాషణ వంటి ఆన్ని సంగతులను విసర్జించుడి. 9 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ప్రాచీన పురుషుని దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, 10 మరియు పరిజ్ఞానములో దానిని సృష్టించినవాని యొక్క స్వరూపం ప్రకారం నూతన పరచబడుచున్న నూతన పురుషుని ధరించుకొని యున్నారు. 11 అక్కడ గ్రీసుదేశస్థుడు మరియు యూదుడు, సున్నతి పొందడం మరియు సున్నతి పొందక పోవడం, ఆటవికుడు, సిథియనుడు, బానిస, స్వతంత్రుడు అని లేదు అయితే క్రీస్తు సర్వమునై మరియు అందరిలో {ఉన్నాడు}. 12 కాబట్టి, దేవుని యొక్క ఏర్పరచబడినవారు, పరిశుద్ధులు, ప్రియమైనవారు వలే, కరుణ, జాలి, వినయము, సాత్వీకము, {మరియు} దీర్ఘశాంతము యొక్క అంతరంగ అవయవాలను ధరించుకొనుడి. 13 ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి పిర్యాదులు ఉన్న యెడల ఒకనికొకడు సహించుచు మరియు ఒకనికొకడు కృపాభరితంగా యుండండి; ప్రభువు మిమ్మును క్షమించిన విధముగా కూడా మీరు కూడా క్షమించుడి. 14 అయితే ఈ సంగతులు అన్నిటికి మించి, ప్రేమ, అది పరిపూర్ణత యొక్క బంధం. 15 మరియు క్రీస్తు యొక్క సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి, ఇందు కోసం కూడా మీరు ఒక్క శరీరములో పిలువబడితిరి; మరియు కృతజ్ఞతకలిగి యుండుడి. 16 సంగీతములతో, కీర్తనలతో, {మరియు} ఆత్మీయ పాటలు, దేవునికి మీ హృదయములలో కృతజ్ఞతతో కూడిన గానములతో ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు సమస్త జ్ఞానములో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. 17 మరియు మాటలో లేదా క్రియలో, మీరు ఏమి చేసినను ప్రభువు యేసు యొక్క నామములో ఆయన ద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును చేయుడి. 18 భార్యలారా, ప్రభువులో యుక్తమైయున్న విధముగా {మీ} భర్తలకు విధేయులై యుండుడి; 19 భర్తలారా, {మీ} భార్యలను ప్రేమించుడి మరియు వారికి వ్యతిరేకంగా కష్టం కలిగించకుడి.౹ 20 పిల్లలారా, అన్ని విషయములలో {మీ} తలిదండ్రులకు విధేయతచూపించండి, ఎందుకంటే ఇది ప్రభువులో సంతోషకరమైనది. 21 తండ్రులారా, మీ పిల్లలకు కోపము పుట్టించకుడి తద్వారా వారు నిరుత్సాహపరచబడరు. 22 బానిసలారా, మనుష్యులను సంతోషపెట్టువారి వలే కంటికి కనబడే సేవతో కాక, అయితే ప్రభువునకు భయపడుచు, హృదయం యొక్క యధార్ధతతో శరీరము ప్రకారం {మీ} యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి. 23 మీరేమి చేసినను, అది మనుష్యులకు కాక ప్రభువుకు చేసినట్టువలే మనసు నుండి చెయ్యండి, 24 ప్రభువు నుండి స్వాస్థ్యము యొక్క ప్రతిఫలమును పొందుదుము అని యెరుగుదురు. మీరు ప్రభువు క్రీస్తును సేవించు చున్నారు. 25 ఎందుకంటే అన్యాయము చేయుచున్న వాడు తాను అన్యాయముగా చేసినదానికి పొందుకుంటాడు, మరియు పక్షపాతము ఉండదు.
Chapter 4
1 యజమానులారా, పరలోకములో మీకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు అని యెరిగి, యదార్ధమైనది మరియు న్యాయమైనదిగా {ఉన్న} దానిని {మీ} బానిసలకు ఇవ్వండి. 2 ప్రార్థనలో నిలుకడగా కొనసాగండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దానిలో మెలకువగా ఉండండి, 3 మా కోసం కూడా కలిసి ప్రార్థన చెయ్యండి, తద్వారా వాక్యం కోసం దేవుడు మాకు ద్వారాన్ని తెరచునట్లు, క్రీస్తు యొక్క మర్మము మాట్లాడడానికి, దాని యొక్క కారణంగా కూడా నేను బంధించ బడియున్నాను. 4 నేను బోధింపవలసిన విధముగానే నేను దానిని స్పష్టంగా మాట్లాడగలను. 5 సమయమును విముక్తి చేయుచు, సంఘమునకు వెలుపటి వారి యెడల జ్ఞానములో నడుచుకొనుడి. 6 ప్రతి ఒక్కరికి ఏలాగు ప్రత్యుత్తరమివ్వడం అవసరమో అది మీరు తెలిసికోడానికి మీ మాటలు ఎల్లప్పుడూ కృపతో, ఉప్పుతో పక్వము చేయబడినట్టు ఉండనియ్యుడి. 7 ప్రియ సహోదరుడు మరియు నమ్మకమైన పరిచారకుడు మరియు ప్రభువులో నా తోటి బానిస తుకికు నన్నుగూర్చిన సంగతులు అన్ని మీకు తెలియచేస్తాడు. 8 ఈ నిజమైన {కారణం} కోసం ఇతనిని మీ వద్దకు నేను పంపాను, తద్వారా మీరు మా గురించి సంగతులు తెలిసికొంటారు మరియు అతడు మీ హృదయములను ప్రోత్సహిస్తాడు. 9 మీ మధ్య నుండి ఉన్న నమ్మకమైనవాడు మరియు ప్రియమైన సహోదరుడైన ఒనేసిముతో కలిపి, వారు ఇక్కడి సంగతుల అన్ని మీకు తెలియ చేస్తారు. 10 నా జత ఖైదీ, అరిస్తార్కు మీకు శుభములు చెప్పు చున్నాడు మరియు బర్నబా యొక్క జ్ఞాతియైన మార్కు (అతనిని గురించి మీరు ఆజ్ఞలు స్వీకరించారు, అతడు మీ యొద్దకు వచ్చిన యెడల అతనిని స్వీకరించండి.) 11 మరియు యూస్తు అని పిలువబడిన యేసు. వీరు సున్నతి పొందినవారి నుండి ఉన్నవారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము కోసం జత పనివారై యున్నారు, వీరు నాకు ఆదరణగా ఉన్నారు. 12 ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. అతడు మీ మధ్య నుండి {ఉన్నాడు}, క్రీస్తు యేసు దాసుడు, మీరు దేవుని యొక్క సమస్త చిత్తములో పూర్ణులు మరియు సంపూర్ణ నిశ్చయత కలిగి నిలుచునట్లు ప్రార్థనలో మీ యొక్క పక్షముగా ఎల్లప్పుడూ పోరాడుచున్నాడు. 13 ఎందుకంటే ఇతడు మీరు మరియు లవొదికయలో ఉన్నవారు మరియు హియెరాపొలిలో ఉన్న వారి పక్షముగా బహు ప్రయాసపడుచున్నాడు అని ఇతని కోసం నేను సాక్ష్యమిచ్చుచున్నాను. 14 లూకా, అను ప్రియమైన వైద్యుడు, మీకు శుభములు చెప్పుచున్నాడు, మరియు దేమా కూడా. 15 లవొదికయలో ఉన్న సహోదరులకు, మరియు నుంఫాకు, మరియు ఆమె ఇంటిలో ఉన్న సంఘముకు శుభములు చెప్పుడి. 16 మరియు ఈ పత్రిక మీ మధ్య చదువబడినప్పుడు, లవొదికయ యొక్క సంఘములో ఇది చదువబడేలా కూడా నిర్ధారించుకోండి మరియు లవొదికయ నుండి మీరు కూడా ఒకదానిని చదవండి 17 మరియు అర్ఖిప్పుతో చెప్పండి, "ప్రభువులో నీవు పొందిన పరిచర్యను చూడు తద్వారా నీవు దానిని నెరవేర్చుదువు." 18 ఈ శుభము పౌలు - నా సొంత హస్తము చేత. నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీతో {యుండును}.