ఫిలేమోనుకు రాసిన పత్రిక
Chapter 1
1 క్రీస్తు యేసు యొక్క ఖైదీ, పౌలు, మరియు {మన} సహోదరుడు తిమోతి మా ప్రియుడు మరియు సహ పనివాడు ఫిలేమోనుకు, 2 మరియు {మన} సహోదరి అప్ఫియకు, మరియు మా సహ సైనికుడు, ఆర్ఖిప్పుకు, మరియు నీ ఇంటిలో సంఘముకు. 3 మన తండ్రి దేవుడు మరియు మన ప్రభువు యేసు క్రీస్తు నుండి నీకు కృప మరియు సమాధానము. 4 నిన్ను నా ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకొంటూ నా దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 5 నీ యొక్క ప్రేమ మరియు ప్రభువు యేసులో మరియు సమస్త పరిశుద్దల కోసం నువ్వు కలిగి యున్న విశ్వాసము గురించి విని, 6 క్రీస్తు కోసం మన మధ్య {ఉన్న} సమస్తమైన మంచి దాని యొక్క జ్ఞానం ద్వారా మీ విశ్వాసం యొక్క సహవాసం ఫలవంతంగా మారాలని. 7 ఎందుకంటే నీ ప్రేమ కారణంగా నేను అధిక సంతోషం మరియు ఆదరణ కలిగి యున్నాడు, ఎందుకంటే సహోదరుడా, పరిశుద్దల యొక్క అంతరంగ భాగములు నీ చేత విశ్రాంతి పొందాయి. 8 కాబట్టి, సరిగా ఉన్నదానిని చెయ్యడానికి నీకు ఆజ్ఞాపించడానికి క్రీస్తులో బహు ధైర్యం కలిగి, 9 ప్రేమ యొక్క కారణంగా దానికి బదులుగా నేను నీకు మనవి చేస్తున్నాను – పౌలు వలే ఒకనిగా, పెద్దను, మరియు ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క ఖైదీగా కూడా ఉండి, 10 {నా} బంధకములలో నేను కనిన నా బిడ్డ ఒనేసిము యొక్క పక్షముగా నేను నిన్ను వేడుకొనుచున్నాను. 11 అతడు గతంలో నీకు నిష్ ప్రయోజనముగా ఉన్నాడు అయితే, ఇప్పుడు నీకును మరియు నాకును ప్రయోజనకరముగా ఉన్నాడు. 12 అతనిని నీ వద్దకు తిరిగి పంపాను – అతనిని – ఇతడు నా అంతరంగ భాగములుగా ఉన్నాడు. 13 అతనిని నాతో ఉంచుకోవాలని నేను కోరుకున్నాను, తద్వారా సువార్త యొక్క బంధకములలో అతడు నీకు పక్షముగా నన్ను సేవిస్తాడు. 14 అయితే నీ అంగీకారం లేకుండా నేను దేనినైననూ చెయ్యడానికి కోరుకోవడం లేదు, తద్వారా మీ మంచి కార్యం బలవంతం ప్రకారంగా కాకుండా, అయితే మంచి చిత్తం ప్రకారం ఉండాలి. 15 ఎందుకంటే ఒకవేళ ఈ కారణం కోసం అతడు నీ నుండి ఒక గంట కోసం వేరు చెయ్యబడ్డాడు, తద్వారా శాశ్వతం అతడిని నీవు కలిగి యుంటావు. 16 ఇక మీదట ఒక బానిస వలే కాక, అయితే ఒక బానిస కంటే శ్రేష్ఠమైనవాడుగా – ఒక ప్రియ సహోదరుడు, ప్రత్యేకంగా నాకు, అయితే నీకు మరి ఎక్కువగా, శరీరము మరియు ప్రభువులో రెండింటిలో. 17 కాబట్టి నన్ను ఒక భాగస్వామిగా నువ్వు కలిగి యున్నయెడల, నన్ను వలే అతనిని స్వీకరించుము. 18 అయితే అతడు నీకు తప్పిదం చేసిన లేదా దేనినైనా ఋణమున్న యెడల దానిని నా లెక్కలో చేర్చుము. 19 పౌలను నేను నా సొంత హస్తముతో దీనిని రాసాను. నేను నామట్టుకు దానిని తిరిగి చెల్లింతును - అయినను నీ సొంత ఆత్మ విషయములో నువ్వు కూడా నాకు ఋణపడి యున్నావని చెప్పకుండా ఉండడానికి. 20 అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను ప్రయోజనము పొందుతాను; క్రీస్తులో నా అంతరంగ భాగాలను తెప్పరిల్ల జేయుము. 21 నీ విదేయతలో ధైర్యము కలిగియుండి, నేను నీకు రాసాను, నేను చెప్పిన దానికి మించి కూడా నువ్వు చేస్తావు అని తెలిసి యుండి. 22 అయితే అదే సమయంలో, నా కోసం ఒక అతిధి గృహము కూడా సిద్ధపరచు, ఎందుకంటే నీ ప్రార్థనల ద్వారా నేను నీకు తిరిగి ఇవ్వబడగలను అని నేను నిరీక్షించుచున్నాను. 23 క్రీస్తు యేసులో నా సహ ఖైదీ ఎపఫ్రా నీకు శుభములు చెప్పుతున్నాడు, 24 మార్కు, అరిస్తార్కు, దేమా, {మరియు} లూకా నా సహ పనివారు. 25 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో యుండును. ఆమేన్.