తీతుకు రాసిన పత్రిక
గ్రంథకర్త
తీతుకు రాసిన లేఖ రచయితగా పౌలు తనను చెప్పుకున్నాడు. “దేవుని దాసుడు, యేసు క్రీస్తు అపోస్తలుడు” గా తనను అభివర్ణించుకున్నాడు (తీతు 1:1). పౌలుకు, తీతుకు మధ్య పరిచయం గురించి అస్పష్టత ఉంది. అతడు పౌలు పరిచర్యలో క్రైస్తవుడు అయ్యాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే “మన అందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడగు తీతుకు” అని పౌలు రాశాడు (1:4). పౌలు తీతును స్నేహితునిగాను, సువార్తలో జత పనివానిగాను ఎంతో గౌరవించాడు. అతని అపేక్ష, శ్రద్ధ, ఇతరులకు అతడు చేకూర్చిన ఆదరణల నిమిత్తం మెచ్చుకున్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 63 - 65
పౌలు ఈ ఉత్తరం నికొపొలి నుండి తీతుకు రాశాడు. అపోస్తలుని మొదటి రోమ్ చెర అనంతరం విడుదల అయిన తరువాత రాశాడు. ఎఫెసులో పరిచర్యకై తిమోతిని పంపి పౌలు తీతుతోకలిసి క్రేతు లంకకు వెళ్ళాడు.
స్వీకర్త
క్రేతులో ఉన్న మరొక ఆత్మీయ కుమారుడు, సాటి పనివాడు అయిన తీతు.
ప్రయోజనం
క్రేతులో అప్పుడే ఏర్పడిన సంఘాల్లోని లోపాలను సరిదిద్దడం. అందులోని క్రైస్తవులు క్రమశిక్షణ లేకుండా ఒక పధ్ధతి అనేది లేకుండా ఉన్నారు. వారికి సహాయం అవసరం. (1) సంఘాల్లో కొట్టగా పెద్దలను ఏర్పాటు చెయ్యాలి. (2) క్రేతులో ఉన్న క్రైస్తవేతరుల ఎదుట మంచి విశ్వాస సాక్ష్యం ఇవ్వడానికి వారిని సిద్ధ పరచాలి.
ముఖ్యాంశం
ప్రవర్తన నియమావళి
విభాగాలు 1. అభివాదం — 1:1-4 2. పెద్దల నియామకం — 1:5-16 3. వివిధ వయో బృందాల గురించిన సూచనలు — 2:1-3:11 4. అంతిమ పలుకులు — 3:12-15Chapter 1
స్థానిక సంఘాల్లో దైవ క్రమం
1 దేవునియొక్క బానిస మరియు యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడు అయిన పౌలు, దేవుని ఎన్నుకొన్న ప్రజల విశ్వాసం మరియు ఆ దైవభక్తికి అనుగుణమైన సత్యం గురించిన జ్ఞానం కోసం, 2 యదార్ధవంతుడైన దేవుడు అన్ని కాలాల యుగాలకు ముందే శాశ్వత జీవం యొక్క నిశ్చిత నిరీక్షణతో కూడిన వాగ్దానంచేసాడు. 3 అయితే సరైన సమయంలో మన రక్షకుడు దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించబడినటువంటి ప్రకటన వలన తన వాక్కును ఆయన వెల్లడిచేశాడు.
4 మన ఉమ్మడి విశ్వాసంలో ఒక నిజమైన కుమారుడు తీతుకు తండ్రియైన దేవుడు, మరియు మన రక్షకుడు క్రీస్తు యేసు నుండి కృప, మరియు సమాధానం.
5 ఈ ఉద్దేశం కోసం నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టాను ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం పూర్ణంగా లేని వాటిని నీవు క్రమపరచి, మరియు ప్రతి పట్టణంలో పెద్దలును నియమించాలి.
6 ఏ పురుషుడైనా నిందారహితుడు, ఏక పత్నీ భర్త, నిర్లక్ష్యంగల ప్రవర్తన లేదా తిరుగుబాటు విషయంలో నిందితుడు కాకుండా నమ్మదగిన పిల్లలు గలవాడునై యున్న యెడల. 7 ఎందుకనగా అధ్యక్షుడు నిందారహితుడు వలే దేవుని ఇంటి సేవ నిర్వహించే వాడుగా ఉండాలి. అహంకారి కాక, త్వరగా కోపపడేవాడు కాక, మద్యానికి అలవాటు పడినవాడు కాక, దెబ్బలాడేవాడు కాక, దురాశపరుడు కాక, 8 బదులుగా అతడు అతిథి ప్రియుడు, మంచి దానికి స్నేహితుడు, స్థిరబుద్ధికలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం కలవాడుగా ఉండాలి. 9 ఉపదేశం ప్రకారం ఉన్న నమ్మదగిన వాక్కును అతడు గట్టిగా చేపట్టాలి. తద్వారా దృఢమైన ఉపదేశంతో ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఎదిరించే వారిని గద్దించడానికి రెంటికీ సమర్ధుడుగా ఉంటాడు.
10 ఎందుకంటే, తిరుగుబాటుదారులు మరియు వదరుబోతులు, మరియు మోసగాళ్ళు , ముఖ్యంగా సున్నతిపొందినవారు అనేకులు ఉన్నారు. 11 వారిని నిలువరించడానికి ఇది అవసరం. వారు సిగ్గుకరమైన లాభం కోసం బోధించ కూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలు అన్నింటిని వారు పాడుచేస్తున్నారు.
12 వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తలు అన్నాడు, “క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్ట మృగములును, సోమరులగు తిండిపోతులు.” 13 ఈ సాక్ష్యం సత్యంగా ఉంది. ఈ కారణం కోసం వారిని కఠినంగా గద్దించు తద్వారా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు. 14 యూదుల కల్పనాకథలకూ లేదా సత్యం నుంచి వైదొలగిన మనుషుల ఆదేశాలకూ ఎటువంటి గమనాన్ని ఇవ్వడం లేదు.
15 పవిత్రులకు అన్నీ పవిత్రం అయితే అపవిత్రులు అయిన వారికి, మరియు అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. అయితే ఇద్దరి మనసులు మరియు వారి మనస్సాక్షి అపవిత్రం అయ్యాయి. 16 దేవుడు తెలుసు అని వారు చెప్పుకొంటారు అయితే వారి పనుల వలన ఆయనను నిరాకరించారు. వారు అసహ్యులు, మరియు అవిధేయులు, మరియు ఎలాంటి మంచి పని విషయంలోనూ పనికి రానివారు.
Chapter 2
కాపరి పరిచర్య
1 అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశంతో అనుకూలమైన వాటినే చెప్పు. 2 వృద్ధపురుషులు నిగ్రహంగానూ, గౌరవపూర్వకంగానూ, స్థిరబుద్ధికలవారుగానూ ఉండాలి. విశ్వాసంలో, ప్రేమలో, పట్టుదలలో స్థిరులుగా ఉండాలి.
3 అలాగే వృద్ధస్త్రీలు ప్రవర్తనలో గౌరవప్రదంగా ఉండాలి, కొండెకత్తెలు కాకుండా లేదా అధిక మద్యానికి బానిసలుగా ఉండకూడదు, అయితే మంచికి బోధకులుగా ఉండాలి. 4 ఇదే విధానంలో యౌవనస్త్రీలు తమ భర్తలను ప్రేమించువారుగా, మరియు తమ బిడ్డలను ప్రేమించు వారుగా ఉండాలని వారు తర్ఫీదుచేయాలి, 5 నిగ్రహంగా , పవిత్రులుగా, మంచి ఇంటి యజమానిగా, తమ సొంత భర్తలకు లోబడుతూ ఉండాలని, తద్వారా దేవుని వాక్యము దూషించబడకుండా ఉంటుంది.
6 అదే విధంగా యువకులు నిగ్రహంగా ఉండాలని హెచ్చరించు. 7 మంచి పనుల విషయంలో అన్నివిధాలలో నిన్నునీవే ఆదర్శంగా కనపరచుకొనేలాఉండు. ఉపదేశంలో నిష్కళంకంగా మర్యాదతో, 8 మరియు విమర్శకు మించిన దృఢమైన ఉపదేశం, తద్వారా ప్రతివాది సిగ్గుపడతాడు, మనలను గూర్చి చెడు చెప్పడానికి యేదీఉండదు.
9 బానిసలు అన్నివిషయాలలో తమ సొంత యజమానులకు విధేయులై ఉండాలి, సంతోషపెట్టేవారిగా మరియు వాదులాడ కుండా ఉండాలి, 10 దొంగతనం చేయకుండా అయితే బదులుగా సమస్త మంచి విశ్వాసం కనుపరచుము. తద్వారా మన రక్షకుడు అయిన దేవుని గురించిన ఉపదేశానికి అన్ని విధాలుగా వారు కీర్తి తెస్తారు.
11 ఎందుకంటే దేవుని కృప రక్షణ కోసం సమస్త మానవాళికి వెల్లడయ్యింది. 12 మనకు శిక్షణ ఇస్తుంది, తద్వారా భక్తిహీనతనూ, మరియు ఈ లోక సంబంధమైన దురాశలు తిరస్కరించి, ఈ ప్రస్తుత యుగంలో వివేకంతోనూ, మరియు నీతి, మరియు భక్తిమార్గంలో మనము జీవిస్తూ ఉంటాము. 13 శుభప్రదమైన నిరీక్షణ మరియు మన మహా దేవుడు, మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత పొందడానికి మనం ఎదురుచూస్తూఉండగా,
14 మనలను సమస్త దుర్మార్గం నుంచీ విమోచించడం కోసం , మరియు తనకోసం ఒక ప్రత్యేక ప్రజగా, మంచిపనులకోసం ఆసక్తిగలవారుగా పవిత్రపరచుకోవడానికి ఆయన మనకోసం తననుతాను అర్పించుకొన్నాడు. 15 ఈ విషయాలను మాట్లాడు, మరియు పూర్తి అధికారంతో హెచ్చరించు, మరియు గద్దించు. ఎవ్వరూ నిన్ను నిర్లక్ష్యపెట్టకుండాచూచుకో.
Chapter 3
యోగ్యమైన కాపరి పరిచర్య
1 పరిపాలకులకూ అధికారులుకూ లోబడడానికి, వారికి విధేయులైఉండడానికి, ప్రతి మంచి పని కోసం సంసిద్ధంగా ఉండడానికి వారికి జ్ఞాపకంచెయ్యి. 2 ఎవరినీ దూషించకుండుటకు, సమాధానంగా, మృదువుగాఉండుటకు, అందరు మనుషుల పట్ల సంపూర్ణమైన వినయం చూపించడానికి. 3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, మరియు అవిధేయులుగా ఉన్నాం. మనం దారి తప్పిపోయాం, మరియు నానావిధాల కోరికలు, సుఖానుభవాలు చేత బానిసలంఅయ్యాం. దుష్టత్వం, అసూయలో, అసహ్యులుగా, మరియు ఒకరినొకరు ద్వేషిస్తూ మనం జీవించాం.
4 అయితే మన రక్షకుడు దేవుని దయ, మరియు మానవుల కోసం ఆయన ప్రేమ ప్రత్యక్షం అయినప్పుడు 5 మనం చేసిన నీతి యొక్క పనులు మూలంగా కాదు అయితే తన కనికరం చేత నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, మరియు పరిశుద్ధాత్మ నూతనస్వభావం కలిగించడం చేత మనలను ఆయన రక్షించాడు. 6 ఆయనను దేవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు, 7 తద్వారా తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి శాశ్వత జీవం యొక్క నిశ్చిత నిరీక్షణ ప్రకారం వారసులుకావచ్చు.
8 ఈ సందేశం నమ్మదగినది, మరియు దేవుని విశ్వసించినవారు మంచిపనులలో తాము పాల్గొనడానికి జాగ్రత్తగా ఉండేలా నీవు ఈ సంగతుల మీద నొక్కిచెప్పాలని నేను కోరుతున్నాను. ఈ సంగతులు మంచివి, మరియు ప్రతిఒక్కరికోసం ప్రయోజనకరం.
9 అయితే బుద్ధిలేని వాదనలు, మరియు వంశావళులు, మరియు కలహము, మరియు ధర్మశాస్త్రమును గురించిన విభేధము తప్పించు ఎందుకంటే అవి నిష్‌ప్రయోజనము, మరియు వ్యర్థముమైనవి. 10 విభజించే వ్యక్తిని ఒకటి లేదా రెండు హెచ్చరికలు తరువాత విసర్జించు. 11 అలాటి ఒక వ్యక్తి సరైన దారి నుండి తప్పిపోయాడు మరియు పాపం చేస్తున్నాడు, తనకు తానే శిక్షవిధించుకొంటున్నాడు అని తెలుసు.
12 నేను అర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకి పంపినప్పుడు నికొపొలిలో నా దగ్గరకు రావడానికి త్వరపడు, ఎందుకంటే చలికాలం అక్కడ గడపాలని నేను నిర్ణయించుకున్నాను. 13 న్యాయవాది జేనా, మరియు అపొల్లో వారి మార్గంలో జాగ్రత్తగా సాగనంపు తద్వారా వారు ఏమీ కొదువలేకుండాఉంటారు.
14 అదే విధంగా మన సొంతవారు నిష్ఫలులు కాకుండా ఉండునట్లు తప్పనిసరి ఆవసరాల విషయం మంచిపనులలో తాము పాల్గొనడం తప్పక నేర్చుకోవాలి. 15 నా దగ్గర ఉన్నవారు అందరూ నీకు వందనాలు చెపుతున్నారు. విశ్వాసంలో మమ్మల్ని ప్రేమించే వారికి వందనాలుచెప్పు. కృప మీ అందరితో ఉంటుంది.