తిమోతికి రాసిన మొదటి పత్రిక
Chapter 1
1 మన రక్షకుడు దేవుని యొక్క మరియు మన నిరీక్షణ ప్రభువు యేసు క్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు, పౌలు, 2 విశ్వాసంలో ఒక నిజ కుమారుడు తిమోతికి: తండ్రి దేవుడు మరియు మన ప్రభువు క్రీస్తు యేసు నుండి కృప, కనికరం, సమాధానం.
3 నేను మాసిదోనియ లోనికి వెళ్తున్నపుడు నేను నిన్ను ప్రేరేపించిన విధంగా, ఎఫెసులోనే నిలిచి ఉండు. తద్వారా భిన్నంగా బోధించడం కాకుండా కొందరిని నువ్వు ఆజ్ఞాపించవచ్చు, 4 మరియు కల్పనా కథలు మరియు మితములేని వంశావళులకు ఆసక్తి చూపడం వద్దు, విశ్వాసం చేత దేవుని యొక్క ఏర్పాటుకు బదులు అవి బేధాభిప్రాయాలను పుట్టిస్తాయి. 5 ఇప్పుడు ఈ ఆజ్ఞ యొక్క లక్ష్యం ఒక పవిత్ర హృదయం, మరియు ఒక మంచి మనస్సాక్షి, మరియు ఒక యథార్థమైన విశ్వాసం నుండి ప్రేమయై ఉంది.
6 దీని నుండి కొందరు, తొలగిపోయి బుద్ధిహీనమైన ముచ్చటకు తిరిగారు. 7 వారు మాట్లాడేవి గానీ లేదా వారు చేస్తున్న ఆ నమ్మకమైన ధృవీకరణలు గురించి గానీ అర్థం చేసుకోవడం లేకుండా ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండడానికి కోరుకుంటున్నారు. 8 అయితే ఒకరు దీనిని ధర్మబద్ధంగా ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మంచిది అని మనకు తెలుసు.
9 ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం చేయబడలేదు అని ఇది తెలుసు, అయితే ధర్మవిరోధుల కోసం మరియు తిరుగుబాటుదారులు, భక్తిహీనులు మరియు పాపులు, భ్రష్టులు, మరియు చెడిపోయినవారు, పితృహంతకులు, మరియు మాతృహంతకులు, నర హంతకులు 10 వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుష్యులను అపహరించేవారు, అబద్ధికులు, కపటసాక్షులు, మరియు హిత బోధకు విరుద్ధంగా ఉన్న మరేదైనా ఉన్న యెడల, 11 శ్రీమంతుడైన దేవుని మహిమ యొక్క సువార్త ప్రకారం, దీనితో నేను అప్పగించబడ్డాను.
12 నన్ను బలపరచిన వాడు మన ప్రభువు క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞత కలిగియున్నాను. ఎందుకంటే ఆయన నన్ను నమ్మకమైన వాడుగా యెంచాడు, సేవలో నన్ను నియమించాడు, 13 అంతకుముందు దేవదూషకుడు, మరియు ఒక హింసకుడు మరియు ఒక దురాక్రమణదారునిగా ఉన్నాను, అయితే నేను కనికరం పొందాను ఎందుకంటే తెలియక, నేను అవిశ్వాసంలో చేశాను. 14 నిజముగా మన ప్రభువు యొక్క కృప క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసము మరియు ప్రేమతో పొంగిపొరలింది. 15 "పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు" ఈ మాట నమ్మదగినది, మరియు పూర్ణ అంగీకారానికి యోగ్యమునై ఉంది. అలాంటి వారిలో నేను మొదటి వాణ్ణి.
16 అయితే ఈ కారణం కోసం నాకు కనికరం చూపించబడింది, తద్వారా నిత్యజీవం కోసం ఆయనలో విశ్వాసముంచబోయే వారి కోసం ఒక నమూనా వలే యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో, మొదట కనుపరచాడు. 17 ఇప్పుడు యుగాల యొక్క రాజు, అమర్త్యుడు, అదృశ్యుడు, ఏకైక దేవునికి ఘనత, మరియు మహిమ యుగముల యొక్క యుగములు ఉండాలి. ఆమేన్.
18 తిమోతీ, నా కుమారుడా, గతంలో నీ గురించిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ ఆజ్ఞ నేను నీ ముందు ఉంచుతున్నాను, ఎందుకంటే వాటి చేత నీవు మంచి పోరాటం పోరాడుతావు, 19 విశ్వాసాన్ని మరియు ఒక మంచి మనస్సాక్షిని అంటిపెట్టుకొని, వారిలో కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు. 20 వారిలో హుమెనై, మరియు అలెగ్జాండర్ ఉన్నారు. వీరిని సాతానుకు నేను అప్పగించాను తద్వారా వారు దేవదూషణ చెయ్యకుండా నేర్పించబడతారు.
Chapter 2
1 కాబట్టి, అన్నింటిలో మొదట, మనుషులు అందరి కోసం మనవులు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతలు చెయ్యబడడం కోసం నేను ప్రోత్సహిస్తున్నాను, 2 రాజుల కోసం, మరియు అధికారంలో ఉన్న వారు అందరు, తద్వారా మనం సంపూర్ణ భక్తి, మరియు గౌరవంలో ఒక ప్రశాంతమైన మరియు నెమ్మదైన జీవితం జీవిస్తాము.
3 ఇది మన రక్షకుడైన దేవుని యెదుట మంచిది మరియు అంగీకారమైనది. 4 మానవులు అందరు రక్షణ పొంది మరియు సత్యం యొక్క జ్ఞానంలోనికి రావడానికి ఆయన ఆశపడుతున్నాడు.
5 ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు, మరియు దేవుని యొక్క మరియు మానవుల యొక్క ఒక్కడే మధ్యవర్తి - క్రీస్తు యేసు అనే మానవుడు. 6 ఈయన అందరి కోసం విమోచన క్రయధముగా తనను తానే అర్పించుకున్నాడు. దీని సరైన సమయాలలో సాక్ష్యం,
7 దీని కోసం నేను ప్రకటించేవాడు మరియు అపొస్తలుడుగా చెయ్యబడ్డాను - క్రీస్తులో నేను సత్యము మాట్లాడుతున్నాను, నేను అబద్ధమాడడం లేదు - విశ్వాసం మరియు సత్యంలో దేశాల యొక్క బోధకుడు.
8 కాబట్టి, అన్ని స్థలాలలో పురుషులు ఆగ్రహం, మరియు తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులు పైకిఎత్తి ప్రార్థన చేయడానికి నేను కోరుతున్నాను.
9 అలాగే స్త్రీలు సక్రమమైన వస్త్రాలలో తమ్మునుతాము అలంకరించుకోవాలి, అణుకువ మరియు స్వీయ నియంత్రణతో, జడలు మరియు బంగారం లేదా ముత్యాలు, లేదా ఖరీదైన వస్త్రాలతో కాదు, 10 అయితే భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు ప్రయోజనాన్ని కలిగించే దానిని, మంచి క్రియల ద్వారా. 11 ఒక స్త్రీ మౌనంలో నేర్చుకోనివ్వండి, సంపూర్ణ విధేయతలో. 12 అయితే ఉపదేశించడానికీ, లేదా ఒక పురుషుని మీద అధికారం కలిగియుండడానికి ఒక స్త్రీకి నేను అనుమతి ఇవ్వను, అయితే మౌనంలో ఉండడానికి. 13 ఎందుకంటే ఆదాము మొదట నిర్మించబడ్డాడు తరువాత హవ్వ, 14 మరియు ఆదాము మోసగించబడ లేదు, అయితే స్త్రీ, మోసగించబడి, అపరాధములోనికి వచ్చెను.
15 అయితే వారు విశ్వాసంలో మరియు ప్రేమ మరియు స్వీయ నియంత్రణతో పరిశుద్ధతలో నిలిచిన యెడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది.
Chapter 3
1 ఈ మాట నమ్మదగినది: "ఒకరు ఒక పైవిచారణ చేయువానిగా ఉండాలని కోరుకున్న యెడల, అతడు ఒక శ్రేష్టమైన పనిని కోరుకుంటున్నాడు." 2 కాబట్టి పై విచారణ చేయువాడు నిందారహితుడు, ఒకే భార్య యొక్క భర్త, స్థిరబుద్ధిగలవాడు, ఆశానిగ్రహంకలవాడు, మర్యాదస్తుడు, అతిధిప్రియుడు, బోధించడానికి శక్తిగలవాడుగా ఖచ్చితంగా ఉండాలి. 3 తాగుబోతు కాకుండా, కొట్టేవాడు కాకుండ, అయితే సాత్వికుడు, శాంతముగలవాడు, డబ్బును ప్రేమించువాడు కాకుండా, 4 తన సొంత కుటుంబాన్ని చక్కగా నిర్వహించువాడు, పూర్తి గౌరవంతో విధేయతలో పిల్లలు కలిగియుండి 5 (ఎందుకంటే ఒక పురుషుడు తన సొంత కుటుంబాన్ని ఏవిధంగా నిర్వహించాలో తెలియ కుండ ఉన్న యెడల, అతడు దేవుని యొక్క సంఘం యొక్క శ్రద్ధను ఏవిధంగా తీసుకొంటాడు?) 6 అతడు కొత్తగా మారినవ్యక్తి కాకుండా, తద్వారా అతడు గర్వపడేవాడుగా ఉండడం, అపవాది యొక్క తీర్పు లోనికి పడడం లేకుండా ఉంటాడు. 7 అయితే అతడు ఖచ్చితంగా వెలుపల ఉన్నవారితో ఒక మంచి పేరు కూడా కలిగియుండాలి, తద్వారా అతడు అవమానము లోనికి మరియు అపవాది యొక్క ఉరిలో పడడం లేకుండా ఉంటాడు. 8 అలాగే పరిచారకులు గౌరవపూర్వకముగా, రెండు నాలుకలతో మాట్లాడువారు కాకుండా, అధిక మద్యములో లోలుడు కాకుండా, అత్యాశగలవాడు కాకుండా ఉండాలి, 9 విశ్వాసం యొక్క మర్మమును ఒక పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకోవాలి. 10 మరియు మొదట వారు కూడా పరీక్షించబడ నివ్వండి. తరువాత సేవ చెయ్యనివ్వండి, నిందారహితులుగా ఉండాలి.
11 అలాగే స్త్రీలు గౌరవపూర్వకంగా, అపనిందలు వేయువారు కాకుండా, స్థిరబుద్ధిగలవారు, అన్ని విషయాలలో నమ్మదగినవారు అయిఉండాలి. 12 పరిచారకులు ఒకే భార్య యొక్క భర్తలు అయిఉండాలి, తమ సొంత పిల్లలను మరియు ఇంటివారిని చక్కగా నిర్వహించుకోవాలి. 13 ఎందుకంటే చక్కగా సేవ చేసిన వారు తమ కోసం ఒక మంచి స్థానం, మరియు క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసంలో గొప్ప ధైర్యం సంపాదించుకొంటారు.
14 నేను ఈ సంగతులు నీకు రాస్తున్నాను, త్వరలో నీ దగ్గరికి రావడానికి ఆశిస్తున్నాను, 15 అయితే నేను ఆలస్యమైన యెడల, తద్వారా దేవుని యొక్క ఇంటిలో ఒకడు ఖచ్చితంగా ఏవిధంగా ప్రవర్తించడానికి నీకు తెలుసు, అది సజీవుడైన దేవుని యొక్క సంఘం అయి ఉంది, సత్యం యొక్క స్తంభము మరియు ఆధారము.
16 వాస్తవానికి దైవభక్తి యొక్క మర్మము గొప్పది అని అంగీకరించబడింది.
ఆయన శరీరంలో ప్రత్యక్షమయ్యాడు.
ఆత్మలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు
దూతలకు ఆయన కనిపించాడు
దేశాలలో ఆయన ప్రకటించబడ్డాడు
లోకంలో విశ్వసించబడ్డాడు
మహిమలో పైకి కొనిపోబడ్డాడు."
Chapter 4
1 ఇప్పుడు చివరి సమయములలో కొందరు విశ్వాసమును విడిచిపెడతారు, మోసపరచు ఆత్మలను మరియు దయ్యముల యొక్క బోధలను అనుసరిస్తున్నారు అని ఆత్మ స్పష్టంగా చెపుతున్నాడు, 2 అబద్ధికుల యొక్క వేషధారణ ద్వారా, వారి సొంత అంతరాత్మలు వాతవేయబడి ఉన్నాయి, 3 వివాహం చేసుకోవడం నిషేధిస్తారు, సత్యాన్ని తెలుసుకున్న వారు మరియు విశ్వాసుల చేత కృతజ్ఞతతో పుచ్చుకోవడం కోసం దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల నుండి వైదొలగడానికి,
4 ఎందుకంటే దేవుని యొక్క ప్రతీ సృష్టి మంచిది, మరియు కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ చాలా చెడ్డది కాదు. 5 ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మరియు ప్రార్థన చేత ఇది పవిత్రపరచబడింది. 6 ఈ సంగతులను సోదరుల ముందు ఉంచడం, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సేవకుడవు అవుతావు, విశ్వాసం యొక్క మాటలు మరియు నీవు అనుసరించిన ఆ మంచి బోధ చేత పోషించబడుతూ ఉన్నావు.
7 అయితే అపవిత్రమైనవి మరియు ముసలమ్మ కల్పిత కథలు విసర్జించు. బదులుగా దైవభక్తి కోసం నీకునీవే శిక్షణ ఇచ్చుకో. 8 ఎందుకంటే "శరీర శిక్షణ కొంత మట్టుకే విలువైనది, అయితే దైవభక్తి అన్ని విషయాల కోసం విలువైనదిగా ఉంది, ఈ ప్రస్తుత జీవితం మరియు రాబోతున్న దాని కోసం వాగ్దానం కలిగియుంది.
9 ఆ మాట నమ్మదగినదిగా ఉంది మరియు పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. 10 ఎందుకంటే దీని నిమిత్తం మనం శ్రమపడుతున్నాము మరియు పోరాడుతున్నాము, ఎందుకంటే మనం సజీవుడైన దేవునిలో నిరీక్షణ కలిగియున్నాము, ఆయన మనుష్యులు అందరి యొక్క రక్షకుడుగా ఉన్నాడు, ముఖ్యంగా విశ్వాసులకు.
11 ఆజ్ఞాపించు మరియు ఈ సంగతులు బోధించు. 12 నీ యౌవనాన్ని ఎవరూ నిరాకరించనియ్యకు, అయితే మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసుల కోసం ఒక మాదిరిగా ఉండు. 13 నేను వచ్చే వరకు చదవడానికి, హెచ్చరించడానికి, బోధించడానికి శ్రద్ధ వహించు. 14 పెద్ద యొక్క చేతుల యొక్క నిక్షేపణతో ప్రవచనం ద్వారా నీకు అనుగ్రహించబడిన నీలోని ఆ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
15 ఈ సంగతులను అధ్యయనం చెయ్యి, వాటిలో ఉండు, తద్వారా నీ అభివృద్ధి అందరికీ కనబడుతూ ఉంటుంది. 16 నీకు మరియు బోధకు జాగ్రత్తను నిలుపు, ఈ సంగతులలో కొనసాగు, ఎందుకంటే దీని చెయ్యడం, నిన్ను నీవు మరియు నీ శ్రోతలను ఇద్దరిని నీవు రక్షించుతావు.
Chapter 5
1 వృద్ధ మనిషిని దూషించ వద్దు, అయితే ఒక తండ్రి వలే అతనిని హెచ్చరించు, యువకులైన మనుష్యులను సోదరుల వలే, 2 వృద్ధ స్త్రీలను తల్లుల వలే, యవనులైన స్త్రీలను సోదరీల వలే, పూర్ణ పవిత్రతలో.
3 విధవరాండ్రను గౌరవించు - నిజమైన విధవరాండ్రు. 4 అయితే ఏ విధవరాలికైనా పిల్లలు లేదా మనవలు ఉన్న యెడల, మొదట తమ సొంత ఇంటివారిని గౌరవించడానికి మరియు వారి పూర్వీకులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకో నివ్వండి, ఎందుకంటే దేవుని ముందు ఇది ప్రీతికరం. 5 అయితే యదార్ధమైన మరియు ఒంటరిగా విడిచిపెట్టబడిన విధవరాలు దేవునిలో నిరీక్షణ ఉంచుతూ, రాత్రి మరియు పగలు మనవులు మరియు ప్రార్థనలో మరియు కొనసాగుతుంది. 6 అయితే లైంగికకార్యాలలో నిమగ్నమైన ఆమె బ్రతుకుతున్నది, చనిపోయింది. 7 అంతేకాకుండా ఈ సంగతులు ఆజ్ఞాపించు. తద్వారా వారు నింద పాలు కారు. 8 అయితే ఒకడు తన సొంతవారి కోసం, మరియు మరి ముఖ్యంగా ఇంటి సభ్యుల కోసం సమకూర్చడం చెయ్య కుండా ఉన్న యెడల, అతడు విశ్వాసాన్ని నిరాకరించాడు మరియు ఒక అవిశ్వాసి కన్న చెడ్డవాడుగా ఉన్నాడు. 9 అరవై సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ఉన్న ఒక విధవరాలు, ఒక్క భర్త యొక్క భార్య, నమోదు చెయ్యబడాలి, 10 మంచి పనులలో పేరు పొంది ఉండాలి, అయితే ఆమె పిల్లలను పెంచడం, అయితే పరదేశీయులను స్వీకరించడం, అయితే పరిశుద్ధుల యొక్క పాదాలు కడగడం, అయితే ఆమె బాధింపబడిన వారిని విడిపించడం, అయితే ఆమె ప్రతీ మంచి పని పూనుకోవడం.
11 అయితే యవనస్థులైన విధవరాండ్రను నిరాకరించండి, ఎందుకంటే అప్పుడు వారు క్రీస్తుకు వ్యతిరేకంగా అక్రమంగా మార్పుచెంది, వారు వివాహం చేసుకోడానికి కోరుకుంటారు. 12 తీర్పును కలిగియుంటారు ఎందుకంటే వారు తమ మొదటి వాగ్దానాన్ని భగ్నం చేశారు. 13 అయితే అదే సమయంలో, వారు సోమరులుగా ఉండడానికి కూడా నేర్చుకొంటారు, ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మరియు సోమరులు మాత్రమే కాక, అయితే వదరుబోతులు మరియు అధికప్రసంగీకులు కూడా, వారు వేటిని చెప్ప కూడదో వాటిని చెపుతారు.
14 కాబట్టి యవనస్థులైన వారు వివాహము చేసుకోడానికి నేను కోరుతున్నాను, పిల్లలను కని, ఇంటిని నిర్వహించి, వ్యతిరేకించే వానికి అపవాదు కోసం అవకాశం ఇవ్వ కూడదు. 15 ఎందుకంటే ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళారు. 16 అయితే విశ్వాసురాలు ఎవరైనా విధవరాండ్రను కలిగియున్నప్పుడు, ఆమె వారికి సహాయం చెయ్యనివ్వండి, మరియు సంఘం దాని భారాన్ని మోయకుండా చూడండి తద్వారా అది యదార్ధమైన విధవరాండ్రకు సహాయం చేస్తుంది.
17 చక్కగా పాలన చేసే పెద్దలు, రెట్టింపు యొక్క గౌరవానికి యోగ్యులుగా వారు యెంచబడేలా చూడండి, ప్రత్యేకించి వాక్యములో మరియు బోధలో, శ్రమ పడువారు 18 ఎందుకంటే లేఖనం చెపుతుంది, "కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” మరియు “పనివాడు తన యొక్క జీతమునకు అర్హుడు.” 19 ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఆధారంగా అయితే తప్పించి ఒక పెద్దకు వ్యతిరేకంగా నిందారోపణ అంగీకరించ వద్దు. 20 పాపం చేస్తున్నమనుషులు, అందరి ముందు గద్దించు తద్వారా మిగిలినవారు కూడా భయం కలిగి ఉంటారు. 21 పక్షపాతము లేకుండా ఈ సంగతులను నీవు పాటించాలి అని పక్షపాతిత్వములో నుండి ఏమీ చేయకుండ ఉండాలి దేవుడు మరియు, క్రీస్తు యేసు మరియు ఎన్నుకోబడిన దేవదూతలు ఎదుట నేను నిన్ను అభ్యర్ధిస్తున్నాను.
22 ఏ ఒక్కరి మీద త్వరపడి చేతులు ఉంచవద్దు. లేదా ఇతరుల పాపాలలో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉంచుకో. 23 ఇకమీదట నీళ్ళు మాత్రమే త్రాగవద్దు, అయితే నీ యొక్క కడుపు మరియు నీకు తరచుగా వచ్చే వ్యాధి కారణంగా కొద్దిగా ద్రాక్షారసం వినియోగించు.
24 కొందరి మనుషుల యొక్క పాపాలు స్పష్టంగా ఉన్నాయి. తీర్పుకు ముందే వెళ్తున్నాయి, అయితే అవి కూడా కొందరి వెనుక అనుసరిస్తున్నాయి. 25 అదేవిధంగా మంచి క్రియలు కూడా స్పష్టంగా ఉన్నాయి మరియు మరొకవిధంగా ఉన్నవి దాచబడి యుండడం సాధ్యం కాదు.
Chapter 6
1 అనేకుల వలే కాడి కింద బానిసలు వలే ఉన్నవారు, తమ సొంత యజమానులు పూర్తి గౌరవానికి యోగ్యులుగా ఎంచాలి, తద్వారా దేవుని యొక్క నామము మరియు బోధ దూషణకు గురికాకుండా ఉంటుంది. 2 అయితే విశ్వాసులైన యజమానులు గలవారు, వారు వారిని తృణీకరించడం లేకుండా ఉండాలి ఎందుకంటే వారు సహోదరులు, అయితే వారు వారిని ఎక్కువ సేవించాలి, ఎందుకంటే వారు విశ్వాసులు మరియు ప్రియులు, సేవ యొక్క భాగస్థులుగా ఉన్నవారు. ఈ సంగతులను బోధించు మరియు ప్రోత్సహించు. 3 ఎవరైనా మన ప్రభువు యేసు క్రీస్తు క్షేమకరమైన మాటలకు మరియు దైవభక్తి ప్రకారం బోధకు అంగీకరించడం కాకుండా భిన్నంగా మరియు బోధిస్తూ ఉన్న యెడల 4 వాడు గర్వపడుతున్నాడు, అర్థం చేసుకొన్నది ఏమీ లేదు, అయితే తర్కములు మరియు మాటల జగడముల గురించి వ్యాధిగ్రస్తంగా ఉన్నాడు, వీటి నుండి అసూయ, కలహం, దూషణలు, దుష్ట అపోహలు వస్తాయి, 5 ఘర్షణ, మనసు ప్రకారం చెడిపోయిన మనుషుల మధ్య మరియు సత్యం యొక్క ప్రయోజనాన్ని పోగొట్టుకొన్న వారుగా ఉన్నారు, దైవభక్తి లాభం యొక్క మార్గంగా ఉండడానికి ఆలోచిస్తున్నారు.
6 అయితే సంతృప్తితో దైవభక్తి గొప్ప లాభం అయిఉంది 7 ఎందుకంటే మనం ఈ లోకం లోనికి ఏమీ తేలేదు, తద్వారా దేనిని బయటికి తీసుకురావడానికి మనం సామర్ధ్యం కలవారం ఏమీకాదు. 8 కాబట్టి ఆహారము మరియు వస్త్రాలు కలిగి, వీటితో మనం తృప్తి చెంది ఉంటాము. 9 ఇప్పుడు ధనవంతులు కావాలని కోరుకొనే వారు శోధన మరియు ఒక ఉరి మరియు బుద్ధిహీనమైన మరియు హానికరమైన అనేకమైన కోరికల లోనికి పడతారు, అలాంటివి మనుషులను విధ్వంసం మరియు నాశనం లోనికి అణచి వేస్తాయి. 10 ఎందుకంటే ధనం యొక్క ప్రేమ అన్ని కీడుల యొక్క ఒక మూలం అయిఉంది. వాటిని కొందరు ఆశించి, విశ్వాసం నుండి దూరంగా నడిపించబడ్డారు, మరియు తమ్మునుతాము అనేక బాధలతో గుచ్చుకొన్నారు 11 అయితే నీవు ఓ దేవుని యొక్క మనిషి, ఈ సంగతులనుండి పారిపో, మరియు నీతి, దైవభక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వీకములను వెంబడించు. 12 విశ్వాసము యొక్క మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని చేపట్టుము, దానికి నీవు పిలువబడ్డావు మరియు అనేక సాక్షుల ముందు మంచి ఒప్పుకోలు ఒప్పుకొన్నావు. 13 అందరికి జీవమును పోయువాడు, మరియు క్రీస్తు యేసు, పొంతి పిలాతు ముందు మంచి ఒప్పుకోలును సాక్ష్యమిచ్చిన వాడు, దేవుని ముందు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, 14 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఆజ్ఞను గైకొనవలెను. 15 ఆయన తన సొంత సమయములలో, భాగ్యవంతుడు, మరియు ఏకైక సార్వభౌముడు, రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు బయలుపరుస్తాడు, 16 ఆయన మాత్రమే అమరత్వం కలిగియున్నాడు, సమీపింపశక్యం గాని వెలుగు ఆవరించియున్నది. ఆయనను మనుషుల్లో ఎవరూ చూడలేదు, ఎవరూ చూడడానికి సామర్ధ్యం లేదు, ఆయనకు ఘనత, మరియు శాశ్వతమైన ప్రభావం ఉంటుంది. ఆమేన్.
17 ప్రస్తుత లోకంలో ధనవంతులు గర్విష్టులుగా ఉండ కూడదు అని ఆజ్ఞాపించు. ధనము యొక్క అస్థిరతలో నిరీక్షణ ఉంచకూడదు అని, అయితే దేవునిలో, అనుభవం కోసం సమస్తాన్ని సమృద్ధిగా మనకు దయచేయువాడు, 18 మంచి చెయ్యడానికి, మంచి పనులలో ధనవంతులుగా ఉండడానికి, ఔదార్యంగలవారుగా ఉండడానికి, పంచుకోడానికి ఇష్టతచూపుతూ, 19 రాబోతూ ఉన్న దాని కోసం ఒక మంచి పునాదిని తమ కోసం సమకూర్చుకొంటూ, తద్వారా వారు యదార్ధమైన జీవితాన్ని చేపట్టుతారు.
20 ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడు, భక్తిలేని మాటలు, మరియు జ్ఞానం అని తప్పుగా పిలువబడే వ్యతిరేక వాదములు తప్పించు, 21 కొందరు వాటిని ఒప్పుకొనుచు, విశ్వాసము విషయంలో తప్పి పోయారు. కృప మీతో ఉంటుంది.