తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

ఎఫెసీయులకు రాసిన పత్రిక

Chapter 1

1 క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడు అయిన పౌలు, దేవుని యొక్క సంకల్పము ద్వారా, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, మరియు క్రీస్తు యేసులో నమ్మకస్తులు. 2 మన తండ్రి దేవుడు మరియు ప్రభుఫు యేసు క్రీస్తు నుండి మీకు కృప మరియు సమాధానం. 3 దేవుడు మరియు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును, ఆయన క్రీస్తులో పరలోక స్థలములలో మనలను ప్రతీ ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు.

4 మీరు ఆయన ముందు పరిశుద్ధులు మరియు నిర్దోషులుగా ఉండునట్లు లోకం యొక్క పునాది నుండి ఆయన మనలను తనలో ఏర్పరుచుకొనిన ప్రకారం, ప్రేమలో 5 ఆయన తనకు యేసు క్రీస్తు ద్వారా దత్తత కోసం మనలను ముందుగా నిర్ణయుంచుకొన్నాడు. ఆయన సంకల్పం యొక్క మంచి సంతోషం ప్రకారం, 6 ఆయన కృప యొక్క మహిమ యొక్క స్తుతి కోసం ప్రియునిలో ఆయన మనకు ఉచితముగా అనుగ్రహిచెను, 7 ఆయనలో ఆయన రక్తము ద్వారా ఆయన కృప యొక్క సమృద్ధి ప్రకారం మనము విమోచనము, అపరాధముల యొక్క క్షమాపణ కలిగియున్నాము, 8 దీనిని సమస్త జ్ఞానము మరియు వివేకములో ఆయన మనకు విస్తారంగా కలిగించాడు. 9 ఆయన మంచి సంతోషం ప్రకారం ఆయన సంకల్పము యొక్క మర్మము ఆయన మనకు తెలియపరచాడు, ఇది ఆయనలో ప్రణాళిక చేసాడు. 10 కాలము యొక్క సంపూర్ణత ఏర్పాటు ఉద్దేశంతో, క్రీస్తులో సమస్తాన్నీ ఆయనలో, ఏకంగా సమకూర్చాలని, పరలోకంలో ఉన్నవి మరియు భూమి మీద ఉన్నవి, 11 ఆయనలో మనం కూడా సంపాద్యముగా నిర్ణయించబడ్డాము. ఆయన సంకల్పము యొక్క ఆలోచనను ప్రకారం సమస్తమును జరిగించుచున్న వాని ఉద్దేశము ప్రకారం మనం ముందుగా నిర్ణయించబడ్డాము, 12 తద్వారా మొదట క్రీస్తులో నమ్మకమైన నిరీక్షణ కలిగిన మేము ఆయన మహిమ యొక్క స్తుతి కోసం ఉండాలని, 13 ఆయనలో, మీరు కూడా, సత్యము యొక్క వాక్కును వినినప్పుడు, మీ రక్షణ యొక్క సువార్త, మరియు ఆయనలో మీరు విశ్వాసముంచారు, వాగ్దానం చెయ్యబడిన పరిశుద్ధ ఆత్మతో మీరు ముద్రించబడ్డారు, 14 ఆయన మహిమ యొక్క స్తుతికి, సంపూర్ణ సంపాద్యము యొక్క విమోచనం వరకు ఆయన మనకు స్వాస్థ్యం యొక్క హామీగా ఉన్నాడు.

15 దీని యొక్క కారణంగా, ప్రభువు యేసులో మీ విశ్వాసం మరియు పరిశుద్ధులు అందరి కోసం ప్రేమ గురించి నేను విన్నప్పటి నుంచి, 16 మీ కోసం కృతజ్ఞతలు చెప్పడం ఆపివేయ లేదు, నా ప్రార్థనలలో మీ యొక్క ప్రస్తావన చేస్తున్నాను. 17 తద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడు, మహిమ యొక్క తండ్రి, వివేకము యొక్క ఆత్మను మరియు ఆయన యొక్క జ్ఞానములో ప్రత్యక్షతను మీకు ఇస్తాడు, 18 మీ హృదయం యొక్క నేత్రాలు వెలిగింపబడాలి, తద్వారా ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ యొక్క ఐశ్వర్యాలు ఎటువంటివో మీరు గ్రహిస్తారు. 19 మరియు విశ్వసించిన మన పట్ల ఆయన శక్తి యొక్క అపరిమితమైన ఆధిక్యము ఏమిటో, ఆయన శక్తి యొక్క బలము యొక్క పని ప్రకారం, 20 ఆయనను మృతులలో నుండి ఆయన లేపినప్పుడు దీనిని ఆయన క్రీస్తులో జరిగించాడు, మరియు పరలోకపు స్థలములలో తన కుడిచేతి వైపున ఆయన కూర్చుండబెట్టినప్పుడు, 21 ప్రతీ సర్వాదిపత్యం మరియు అధికారం మరియు శక్తి మరియు ప్రభుత్వం మరియు పేరు పెట్టబడిన ప్రతీ నామముకు పైగా ఈ యుగములో మాత్రమే కాదు, అయితే రానున్న యుగములో కూడా. 22 మరియు ఆయన సమస్తాన్నీ ఆయన పాదాల కింద ఉంచాడు మరియు అన్నిటి మీద ఆయనను శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు, 23 ఇది ఆయన శరీరం, అంతటిలో అన్ని విధాలుగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.

Chapter 2

1 మరియు మీరు మీ అతిక్రమాలలో మరియు పాపాలలో చచ్చినవారై ఉన్నప్పుడు 2 వాటిలో ఒకప్పుడు మీరు ఈ లోకం యొక్క కాలము ప్రకారం, గాలి యొక్క అధికారుల యొక్క అధిపతి, అవిధేయత యొక్క కుమారులలో ఇప్పుడు పనిచేస్తూ ఉన్న ఆత్మ ప్రకారం నడుచుకున్నారు. 3 వీటిలో మనం అందరము కూడా ఒకప్పుడు మన మాంసం యొక్క దుష్ట కోరికలలో, శరీరం యొక్క మరియు మనసుల యొక్క కోరికలను నెరవేర్చుకొంటూ జీవించాము. మరియు మనము ఇతరుల వలే కూడా స్వభావం చేత ఉగ్రత యొక్క కుమారులుగా ఉన్నాము. 4 అయితే దేవుడు తన మహా ప్రేమ యొక్క కారణంగా కరుణలో సంపన్నుడిగా ఉండి దానితో ఆయన మనలను ప్రేమించాడు. 5 మరియు మనము అతిక్రమాలలో చచ్చినవారమై ఉన్నప్పుడు, క్రీస్తులో ఆయన మనలను కలిపి సజీవులుగా చేసాడు- కృప చేత మీరు రక్షించబడియున్నారు.

6 మరియు ఆయనతో మనలను పైకి లేపాడు మరియు క్రీస్తు యేసులో పరలోక స్థలములలో మనలను ఆయనతో కూర్చోబెట్టాడు. 7 తద్వారా రాబోవుతున్న యుగములలో క్రీస్తు యేసులో మనకు ఆయన దయలో ఆయన కృప యొక్క అపరిమితమైన మహా సమృద్ధిని ఆయన కనపరుస్తాడు. 8 ఎందుకంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడియున్నారు, మరియు ఇది మీనుండి కలిగింది కాదు; ఇది దేవుని యొక్క బహుమానం. 9 క్రియల నుండి కాదు, తద్వారా ఎవడునూ అతిశయపడకూడదు. 10 ఎందుకంటే మనం ఆయన పనితనము, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు కోసం క్రీస్తు యేసులో సృష్టించబడ్డాము. తద్వారా మనం వాటిలో నడవాలి.

11 కాబట్టి ఒకప్పుడు మీరు మాంసంలో యూదేతరులై యున్నారు అని జ్ఞాపకం చేసుకోండి. శరీరంలో మనుషుల చేతుల చేత చెయ్యబడిన "సున్నతి పొందినవారు" అని పిలువబడిన వారి చేత "సున్నతి లేనివారు” అని పిలువబడినవారు. 12 ఎందుకంటే ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క సమాజము నుండి బహిష్కరించబడినవారు, మరియు వాగ్దానం యొక్క నిబంధనలకు పరాయివారు, నిరీక్షణ లేని వారు మరియు లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు. 13 అయితే ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసులో క్రీస్తు యొక్క రక్తము చేత దగ్గరకు తీసుకురాబడ్డారు. 14 ఎందుకంటే ఆయన తానే మన సమాధానమై ఉన్నాడు. ఆయన ఇద్దరినీ ఒకటి చేసాడు మరియు మధ్య అడ్డు గోడను, ద్వేషమును తన మాంసంలో నాశనం చేసాడు. 15 ఆయన విధులలో ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రమును రద్దు చేసాడు, తద్వారా ఆయన తనలో ఇద్దరిని ఒక నూతన మనిషి లోనికి చేసాడు, సమాధాన పరచాడు. 16 మరియు అయన సిలువ ద్వారా ఇద్దరిని ఒక్క దేహముగా దేవునికి సమాధానపరచాలని దాని లోని ద్వేషాన్ని మరణానికి నియమించాడు. 17 మరియు ఆయన వచ్చాడు మరియు దూరంగా ఉన్న వారు అయిన మీకు సమాధానమును మరియు దగ్గరగా ఉన్న వారికి సమాధానమును ప్రకటించాడు, 18 ఎందుకంటే ఆయన ద్వారా మనం ఇద్దరం ఒకే ఆత్మలో తండ్రి వద్దకు ప్రవేశం కలిగియున్నాము. 19 కాబట్టి అప్పుడు మీరు ఇకమీదట పరజనులు మరియు పరదేశీయులు కాదు, బదులుగా, మీరు పరిశుద్ధులతో సాటి పౌరులు మరియు దేవుని యొక్క కుటుంబ సభ్యులు. 20 అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క పునాది మీద మీరు కట్టబడ్డారు. క్రీస్తు యేసు తానే మూలరాయిగా ఉన్నాడు, 21 ఆయనలో పూర్తి కట్టడం, ఒకభాగంతో ఒకటి అమర్చబడి ఉంది, ప్రభువులో పరిశుద్ధ దేవాలయంలోనికి పెరుగుతూ ఉంది. 22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవుని కోసం నివాసస్థలం అగుటకు కలిసి కట్టబడుతూ ఉన్నారు.

Chapter 3

1 ఈ కారణం కోసం నేను, పౌలు, యూదేతరులైన మీ యొక్క పక్షముగా క్రీస్తు యేసు ఖైదీని, 2 అయితే మీ కోసం నాకు అనుగ్రహించబడిన దేవుని యొక్క కృప యొక్క నిర్వహణ గురించి మీరు రూఢిగా వినినట్లయితే, 3 నాకు తెలియపరచబడిన ప్రత్యక్షత ప్రకారం, మర్మం గురించి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను. 4 దాని విషయం, మీరు దీనిని చదివినప్పుడు, క్రీస్తు యొక్క మర్మం విషయంలో మీరు నా పరిజ్ఞానం గ్రహించడానికి శక్తిని పొందుతారు. 5 ఇప్పుడు ఆత్మ చేత తన పరిశుద్ధ అపొస్తలులు మరియు ప్రవక్తలకు ఇది ప్రత్యక్ష్యపరచబడిన విధంగా ఇది ఇతర తరాలలో మనుష్యుల యొక్క కుమారులకు తెలియపరచబడ లేదు - 6 ఆ యూదేతరులు సువార్త ద్వారా క్రీస్తు యేసులో సహా వారసులుగా ఉన్నారు మరియు శరీరం యొక్క సహా అవయవములు, మరియు వాగ్దానం యొక్క పాలిభాగస్తులు, 7 దాని కోసం ఆయన శక్తి యొక్క కార్యము ద్వారా నాకు అనుగ్రహించబడిన దేవుని యొక్క కృప యొక్క వరము చేత నేను ఒక సేవకుణ్ణి అయ్యాను. 8 నాకు - పరిశుద్ధులు అందరిలో అత్యల్పుణ్ణి - ఈ కృప అనుగ్రహించబడింది, క్రీస్తు యొక్క శోధింపశక్యంకాని ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికి, 9 మరియు అన్నింటిని సృష్టించిన వాడు దేవునిలో అనాదికాలం నుండి మరుగై యున్న ఆ మర్మము యొక్క ఏర్పాటు ఎట్టిదో ప్రతిఒక్కరి కోసం ప్రత్యక్షపరచడానికి, 10 తద్వారా ఇప్పుడు సంఘము ద్వారా దేవుని యొక్క నానావిధ జ్ఞానం పరలోక స్థలములలో ప్రధానులకు మరియు అధికారులకు తెలియపరచబడుతుంది. 11 మన ప్రభువు క్రీస్తు యేసులో ఆయన నెరవేర్చిన ఆ నిత్య సంకల్పం ప్రకారం, 12 ఆయన నుండి విశ్వాసం ద్వారా ఆయనలో ధైర్యమును మరియు నిర్భయమైన ప్రవేశమును మనము కలిగియున్నాము. 13 కాబట్టి మీ కోసం నా హింసల చేత నిరుత్సాహ పడకుండా ఉండాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది మీ మహిమ కారకాలుగా ఉంటాయి.

14 ఈ కారణం కోసం నేను తండ్రి ముందు నా మోకాళ్ళు వంచాను, 15 ఆయన నుండి పరలోకంలో మరియు భూమి మీద ప్రతి కుటుంబం పేరుపొందింది, 16 తద్వారా అంతరంగ పురుషునిలో ఆయన ఆత్మ ద్వారా శక్తితో బలపరచబడి ఉండడానికి, ఆయన మహిమ యొక్క ఐశ్వర్యం ప్రకారం ఆయన మీకు దయచేయును, 17 విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివసించునట్లు, ప్రేమలో వేరుపారి మరియు స్థిరపడి యుండునట్లు, 18 తద్వారా పరిశుద్ధులు అందరితో పొడవు మరియు వెడల్పు మరియు ఎత్తు మరియు లోతు ఏమిటో మీరు పూర్తిగా పూర్తిగా అవగాహన చేసుకోడానికి శక్తిని పొందుతారు, 19 మరియు జ్ఞానమునకు మించి ఉన్న క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోడానికి తద్వారా దేవుని యొక్క సంపూర్ణత అంతటితో మీరు నింపబడి యుంటారు.

20 మరియు మనలో పనిచేస్తున్న ఆ శక్తి ప్రకారం మనం అడిగేవి లేదా ఊహించేవి అన్నిటి పైగా మిక్కిలి అత్యధికముగా చెయ్యడానికి శక్తి గలవాడు ఆయనకు, 21 సంఘంలో మరియు క్రీస్తు యేసులో తరతరాలు అన్నిటికి శాశ్వతము మరియు నిత్యము ఆయనకు మహిమ కలుగుతుంది. ఆమేన్‌.

Chapter 4

1 కాబట్టి నేను, ప్రభువు కోసం ఖైదీని, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని మిమ్మును బతిమాలుచున్నాను, దీనికోసం మీరు పిలువబడ్డారు 2 సంపూర్ణ వినయం మరియు సాత్వికంతో, ఓర్పుతో, ప్రేమలో ఒకనితో ఒకడు అంగీకరిస్తూ, 3 సమాధానం యొక్క బంధంలో ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోడానికి శ్రద్ధ కలిగి యుండాలి. 4 మీ పిలుపు యొక్క ఒక్క నిశ్చిత నిరీక్షణలో మీరు కూడా పిలువబడిన విధముగా శరీరం ఒక్కటే, మరియు ఆత్మ ఒక్కడే, 5 ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, 6 అందరి యొక్క తండ్రి మరియు దేవుడు ఒక్కడే, ఆయన అందరికంటే పైగా మరియు అందరి ద్వారా మరియు అందరిలో ఉన్నాడు. 7 మరియు క్రీస్తు యొక్క వరము యొక్క పరిమాణం ప్రకారము మనలో ప్రతి ఒక్కరికీ కృప అనుగ్రహించబడింది. 8 కాబట్టి ఇది చెపుతుంది:

     "ఆయన ఎత్తుకు ఆరోహణం అయినప్పుడు

     ఆయన బందీలను చెరలోనికి నడిపించాడు,

     మరియు ఆయన మనుష్యులకు ఈవులను ఇచ్చాడు."

9 మరియు ఇది “ఆయన ఆరోహణమయ్యాడు.” అంటే ఆయన కూడా భూమి యొక్క కింది భాగముల లోనికి దిగడం తప్పించి ఏమి ఉంది? 10 కిందకు దిగినవాడు ఆయన కూడా తానే పరలోకములు అన్నింటి కంటే ఎంతో పైకి ఆరోహణం అయిన వాడు, తద్వారా ఆయన సమస్తాన్ని నింపుతాడు. 11 మరియు ఆయన తానే అపొస్తలులు, మరియు ప్రవక్తలు, మరియు సువార్తికులు, మరియు కాపరులు మరియు ఉపదేశకులను ఇచ్చాడు, 12 సేవ యొక్క కార్యం కోసం పరిశుద్ధులను సిద్ధపరచడం కోసం, క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి కోసం, 13 మనం అందరము విశ్వాసం యొక్క మరియు దేవుని యొక్క కుమారుని యొక్క జ్ఞానంలో ఏకత్వానికి చేరు వరకు, పరిణత చెందిన పురుషుని వరకు, క్రీస్తు యొక్క సంపూర్ణత యొక్క ఉన్నతి యొక్క పరిమాణం వరకు, 14 తద్వారా మనం ఇకమీదట అలల చేత వెనుకకు మరియు ముందుకు యెగురవేయబడిన చిన్నపిల్లలు వలే ఉండము, మరియు మోసపూరిత వ్యూహం కోసం కపటం ద్వారా మనుష్యుల యొక్క కుయుక్తిలో బోధ యొక్క ప్రతీ గాలి చేత కొట్టుకుపోము. 15 బదులుగా ప్రేమలో సత్యము మాట్లాడుతూ, అన్ని విషయాలలో శిరస్సు అయిన ఆయన లోనికి మనం ఎదుగుదాం, క్రీస్తు కూడా 16 ఆయన నుండి సర్వ శరీరం అమర్చబడి ఉంది మరియు బలపరచు ప్రతి కీలు చేత కలిసి పట్టుకొంది, ప్రతి ఒక్క భాగం యొక్క పరిమాణములో పనిచేయుచున్న ప్రకారం, ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కోసం శరీరం యొక్క అభివృద్ధి కలుగచేసుకొంటుంది.

17 కాబట్టి నేను ఇది చెపుతున్నాను మరియు ప్రభువులో నిన్ను బలంగా బతిమాలుచున్నాను, ఇకమీదట యూదేతరులు కూడా తమ మనసుల యొక్క వ్యర్ధతలో నడిచిన విధంగా నడువకూడదు. 18 వారి అవగాహనలో వారు అంధకారమయం అయ్యారు, వారిలో ఉన్న అజ్ఞానం కారణంగా, వారి హృదయాల యొక్క కాఠిన్యం కారణంగా దేవుని యొక్క జీవం నుండి వేరై ఉన్నారు. 19 వారు అన్ని భావనలకు చనిపోయినవారుగా ఉండి, అత్యాశతో ప్రతివిధమైన అపవిత్ర కార్యాల కోసం తమ్మును తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు. 20 అయితే మీరు క్రీస్తును గురించి ఈ విధంగా నేర్చుకొన లేదు, 21 వాస్తవానికి యేసులో ఉన్న సత్యము వలే మీరు ఆయన గురించి విని మరియు ఆయనలో బోధింపబడినవారు అయితే. 22 మీ జీవితం యొక్క పూర్వపు విధానానికి చెందిన దానిని, దాని మోసకరమైన కోరికల కారణంగా చెడిపోయినది అయిన ప్రాచీన పురుషుణ్ణి పక్కన ఉంచాలి, 23 మరియు మీ మనసుల యొక్క ఆత్మలో నూతనపరచబడి యుండండి, 24 మరియు దేవుని ప్రకారం సృష్టించబడిన నూతన పురుషుణ్ణి సత్యం యొక్క పరిశుద్ధత మరియు నీతిలో ధరించుకోవాలి.

25 కాబట్టి, అబద్దమాడడం పక్కన ఉంచుతూ, మీలో ప్రతి ఒక్కరు తన పొరుగువానితో సత్యం మాట్లాడాలి, ఎందుకంటే మనం ఒకరికొకరం అవయవములం. 26 కోపపడుడి మరియు పాపం చెయ్య వద్దు. సూర్యుడు అస్తమించ వరకు మీ ఆగ్రహం యుండ నీయ వద్దు. 27 అపవాదికి అవకాశం ఇవ్వకండి. 28 దొంగ ఇక మీదట దొంగిలించకూడదు. అయితే బదులుగా, అతడు పని చెయ్యాలి, తన చేతులతో మంచి పనిచేస్తూ ఉండాలి, తద్వారా అతడు అవసరత కలిగిన వారితో పంచుకోడానికి కొంత కలిగియుంటాడు. 29 మీ నోటి నుండి ఎటువంటి చెడు మాట రానివ్వ వద్దు. అయితే అవసరతలో ఉన్న వాని యొక్క అభివృద్ధి కోసం మంచిదిగా ఏదైనా ఉన్నయెడల తద్వారా అది వినువారికి కృపను ఇస్తుంది. 30 మరియు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచ వద్దు. ఆయన చేత విమోచన యొక్క దినం కోసం మీరు ముద్రించబడ్డారు. 31 సమస్తమైన ద్వేషం, మరియు ఆగ్రహం, మరియు కోపం, మరియు అల్లరి, మరియు దూషణలు, సకలమైన దుష్టత్వంతో పాటు మీ నుండి తొలగిపోనివ్వండి. 32 బదులుగా, ఒకరి యెడల ఒకరు దయకలిగి, మృదువైన హృదయం, దేవుడు కూడా క్రీస్తులో మిమ్మల్ని క్షమించిన విధంగానే ఒకరి నొకరు క్షమించుచూ ఉండండి.

Chapter 5

1 కాబట్టి ప్రియమైన పిల్లలు వలే దేవుణ్ణి అనుకరించేవారుగా ఉండండి, 2 మరియు క్రీస్తు కూడా మనలను ప్రేమించి, మరియు మన కోసం తన్నుతాను, ఒక అర్పణ మరియు పరిమళ సువాసన కోసం దేవునికి బలిగా అప్పగించుకున్న విధంగా ప్రేమలో నడవండి.

3 అయితే పరిశుద్ధుల కోసం తగిన విధంగా ఉండేలా మీ మధ్య లైంగిక అనైతికత, మరియు ప్రతీ అపవిత్రత లేదా లోభము పేరుపిలువబడడం కూడా ఉండకూడదు. 4 మరియు బూతులు మరియు మూర్ఖపు మాట లేదా అసభ్య పరిహాసాలు - ఇవి తగినవి కావు - అయితే బదులుగా కృతజ్ఞతమాటలు. 5 దీనిని నిశ్చిత కోసం తెలుసుకోండి. ప్రతీ లైంగిక అనైతికత లేదా అపవిత్రత లేదా లోభి అయిన వ్యక్తి - అంటే, విగ్రహారాధికుడు - క్రీస్తు యొక్క మరియు దేవుని యొక్క రాజ్యములో వారసత్వం లేదు. 6 నిరర్ధక మాటలతో ఎవరూ మిమ్ములను మోసపరచనియ్యకండి. ఎందుకంటే ఈ కార్యాల కారణంగా దేవుని యొక్క ఉగ్రత అవిధేయత యొక్క కుమారుల మీదకు వస్తుంది. 7 కాబట్టి వారితో భాగస్వామ్యులుగా మార వద్దు. 8 ఎందుకంటే పూర్వము మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు యొక్క పిల్లలు వలే నడుచుకోండి. 9 (ఎందుకంటే వెలుగు యొక్క ఫలం సమస్త మంచితనం, మరియు నీతి మరియు సత్యంలో ఉంది), 10 ప్రభువుకు ఇష్టంగా ఉన్నది ఏదో జాగ్రత్తగా పరీక్షించండి. 11 మరియు చీకటి యొక్క నిష్ఫలమైన పనులలో భాగం తీసుకో వద్దు, అయితే బదులుగా వాటిని బట్టబయలు కూడా చెయ్యండి. 12 ఎందుకంటే రహస్యంలో వారి చేత జరిగించబడే కార్యాలు ప్రస్తావించడం కూడా అది సిగ్గుకరం. 13 అయితే వెలుగు చేత బట్టబయలు అయ్యే ప్రతీది ప్రత్యక్షపరచబడుతుంది, ఎందుకంటే ప్రత్యక్షపరచబడే ప్రతీది వెలుగే. 14 కాబట్టి ఇది చెపుతుంది,

     ఓ నిద్రబోతా మేలుకో.

     మరియు మృతుల నుండి లెమ్ము.

     మరియు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు."

15 కాబట్టి మీరు ఏవిధంగా నడుస్తున్నారో జాగ్రత్తగా గమనించండి - అజ్ఞానుల వలే కాకుండా అయితే జ్ఞానుల వలే, 16 సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవిగా ఉన్నాయి 17 దీని కారణంగా, బుద్ధిహీనంగా ఉండ వద్దు, అయితే ప్రభువు యొక్క సంకల్పం ఏమిటో అర్థంచేసుకోండి. 18 మరియు మద్యంతో మత్తులై ఉండ వద్దు, దీనిలో అనాలోచిత ప్రవర్తన ఉంది. బదులుగా ఆత్మతో నింపబడి ఉండండి. 19 కీర్తనలలో మరియు సంగీతాలు మరియు ఆత్మసంబంధమైన పాటలలో ఒకరితో ఒకరు మాట్లాడండి. ప్రభువుకు మీ హృదయంలో పాడుతూ మరియు కీర్తనలు పాడుతూ ఉండండి, 20 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామంలో సమస్తం కోసం తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు ఎల్లప్పుడు చెపుతూఉండండి, 21 క్రీస్తు కోసం భయంలో మిమ్మల్నిమీరు ఒకరికొకరు లోబడి ఉండండి-

22 భార్యలారా, ప్రభువుకు వలే మీ సొంత భర్తలకు. 23 ఎందుకంటే క్రీస్తు కూడా సంఘం యొక్క శిరస్సుగా ఉన్న విధంగా ఒక భర్త భార్య యొక్క శిరస్సు అయి ఉన్నాడు - ఆయన తానే శరీరము యొక్క రక్షకుడుగా ఉన్నాడు. 24 అయితే సంఘం క్రీస్తుకు లోబడిఉన్న విధంగానే, అదేవిధంగా భార్యలు కూడా తమ భర్తలకు ప్రతి విషయంలో ఉన్నారు.

25 భర్తలారా, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు, మరియు దాని కోసం తననుతాను అర్పించుకొన్న విధముగా మీ భార్యలను ప్రేమించండి. 26 తద్వారా ఆయన ఆమెను వాక్యముతో నీటి యొక్క స్నానం చేత శుద్ధిచేసి, ఆమెను పవిత్రపరుస్తాడు, 27 తద్వారా ఆయన సంఘమును తనకు మహిమ గలదానిగా నిలబెట్టాలని, కళంకం లేదా మడత లేదా అటువంటివి ఏవీ లేకుండా, అయితే తద్వారా ఆమె పరిశుద్ధమైనది మరియు నిర్దోషమైనదిగా ఉంటుంది. 28 అదే విధానంలో భర్తలు కూడా తమ సొంత శరీరముల వలే తమ సొంత భార్యలను ప్రేమించ వలసిఉంది. తన సొంత భార్యను ప్రేమించుచున్న వాడు తననుతాను ప్రేమించుకొనుచున్నాడు. 29 ఎందుకంటే ఎవడూ తన సొంత శరీరాన్ని ఎన్నడూ ద్వేషించలేదు, అయితే క్రీస్తు కూడా సంఘానికి చేసిన ప్రకారం ఆయన పోషిస్తాడు మరియు జాగ్రత్తతో సంరక్షిస్తాడు, 30 ఎందుకంటే మనం ఆయన శరీరం యొక్క అవయవాలుగా ఉన్నాం. 31 "ఈ కారణం కోసం ఒక పురుషుడు తన తండ్రిని మరియు తల్లిని విడిచిపెడతాడు మరియు తన భార్యను హత్తుకొని ఉంటాడు, మరియు ఇద్దరు ఒక మాంసం అవుతారు." 32 ఈ మర్మం గొప్పది - అయితే నేను క్రీస్తు గురించి మరియు సంఘం గురించి మాట్లాడుతున్నాను. 33 అదేవిధముగా, మీరు కూడా - మీలో ప్రతి ఒక్కరు - ఈ విధానంలో తన సొంత భార్యను ప్రేమించాలి - తనను వలే, మరియు భార్య తన భర్తను గౌరవించాలి.

Chapter 6

1 పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి. ఎందుకంటే ఇది నీతి. 2 “నీ తండ్రిని మరియు తల్లిని గౌరవించు" (ఇది ఒక వాగ్దానంతో ఉన్న మొదటి ఆజ్ఞ), 3 తద్వారా ఇది నీకు క్షేమం కలుగుతుంది మరియు భూమి మీద ఎక్కువ కాలం బ్రతుకుతావు." 4 మరియు తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకండి. బదులుగా వారిని ప్రభువు యొక్క క్రమశిక్షణలో మరియు బోధలో పెంచండి.

5 బానిసలారా, భయంతో మరియు వణుకుతో, మాంసం ప్రకారం మీ క్రీస్తుకు వలే, మీ హృదయం యొక్క నిజాయితిలో మీ యజమానులకు లోబడండి. 6 మనుషులను సంతోషపెట్టేవారి వలే కంటికికనపడే సేవతో కాక, అయితే క్రీస్తు యొక్క బానిసల వలే, ప్రాణం నుండి దేవుని యొక్క సంకల్పాన్ని జరిగిస్తూ, 7 ఒక మంచి వైఖరితో సేవజరిగిస్తూ, ప్రభువుకు వలే మరియు మనుషులకు కాక, 8 ప్రతీ వ్యక్తి, అయితే అతడు ఏదైనా మంచి చేసినట్లయితే, బానిసయైనా లేదా స్వతంత్రుడైనా, ప్రభువు నుండి దీనిని అతడు పొందుతాడని తెలుసుకోండి.

9 మరియు యజమానులారా, వారికి అదే చెయ్యండి. బెదిరింపులు వినియోగించడం మానండి. మీయొక్క మరియు వారియొక్క ఇద్దరికి యజమాని పరలోకంలో ఉన్నాడు మరియు ఆయనతో ఎటువంటి పక్షపాతం లేదు అని మీకు తెలుసు.

10 చివరిగా, ప్రభువులో బలంగా ఉండండి మరియు ఆయన శక్తి యొక్క బలంలో. 11 దుష్టుని యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలబడడానికి మీరు శక్తి పొందడానికి దేవుని యొక్క పూర్తి కవచాన్ని ధరించండి.

12 ఎందుకంటే మన పోరాటం రక్తము మరియు మాంసంకు వ్యతిరేకంగా కాదు, అయితే ప్రధానులకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, ఈ చీకటి యొక్క లోక నాథులకు వ్యతిరేకంగా, పరలోక స్థలాలలోని దుష్టుని యొక్క ఆత్మ శక్తులకు వ్యతిరేకంగా.

13 దీని కారణంగా దేవుని యొక్క పూర్తి కవచాన్ని ధరించండి, తద్వారా దుష్ట కాలంలో మీరు ఎదిరించి శక్తి పొందేలా మరియు సమస్తము జరిగించి, నిలబడడానికి. 14 కాబట్టి నిలబడి ఉండండి, సత్యముతో మీ నడుముకి దట్టి కట్టండి మరియు నీతి యొక్క కవచం ధరించుకొనండి, 15 మరియు సమాధానం యొక్క సువార్త యొక్క సంసిద్ధతతో మీ పాదాలకు జోడు ధరించండి. 16 ప్రతీదానిలో విశ్వాసం యొక్క డాలును చేతపట్టుకోండి, దీని ద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణాలు అన్నిటిని ఆర్పడానికి మీరు శక్తిపొందుతారు. 17 మరియు రక్షణ యొక్క శిరస్త్రాణం ధరించండి మరియు ఆత్మ యొక్క ఖడ్గం, ఇది దేవుని యొక్క వాక్కు.

18 ప్రతి ప్రార్థనతో మరియు మనవితో, ఆత్మలో అన్ని సమయాలలో ప్రార్థన చెయ్యండి. మరియు దీని కోసం, పూర్తి పట్టుదలతో మెళకువగా ఉండండి మరియు పరిశుద్ధులు అందరి కోసం విజ్ఞాపనలు, 19 మరియు నా కోసం, తద్వారా నేను నా నోరు తెరచినప్పుడు నాకు ఒక సందేశం అనుగ్రహింపబడాలి, ధైర్యంతో సువార్త యొక్క మర్మము తెలియపరచడానికి 20 (దీని కోసం నేను సంకెళ్ళలో రాయబారి), తద్వారా దీనిలో నేను ధైర్యంగా మాట్లాడుతాను, మాట్లాడడానికి నా కోసం ఇది అవసరం వలే ఉంది.

21 అయితే తద్వారా మీరు కూడా నా గురించిన సంగతులు తెలుసుకొనేలా, నేను ఎలా ఉన్నానో, ప్రియ సోదరుడు తుకికు మరియు ప్రభువులో నమ్మకమైన సేవకుడు, మీకు ప్రతీదానిని తెలియజేస్తాడు. 22 నేను ఈ నిజమైన ఉద్దేశం కోసం అతనిని మీ వద్దకు పంపాను, తద్వారా మా గురించి సంగతులు మీరు తెలుసుకొంటారు మరియు మీ హృదయాలను ప్రోత్సహించ బడతాయి.

23 సహోదరులకు సమాధానం, మరియు తండ్రియైన దేవుడు, మరియు ప్రభువైన యేసు క్రీస్తు నుండి విశ్వాసముతో ప్రేమ. 24 పరిశుద్ధతతో మన ప్రభువు యేసు క్రీస్తును ప్రేమించు వారు అందరితో కృప ఉంటుంది.