తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

ఫిలిప్పీయులకు రాసిన పత్రిక

Chapter 1

1 ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసులో పరిశుద్ధులు అందరికి, అధ్యక్షులు మరియు పరిచారకులతో క్రీస్తు యేసు యొక్క దాసులు, పౌలు మరియు తిమోతి. 2 మన తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృప మరియు సమాధానము. 3 నేను మీ గురించి ఆలోచించిన ప్రతిసారీ, నేను ఆరాధించే నా దేవుణ్ణి {మీ కారణంగా} ఆరాధిస్తాను. 4 మీ అందరి కోసం నా యొక్క ప్రతీ ప్రార్థ నలో ఎల్లప్పుడును సంతోషముతో {నా} ప్రార్థన చేయుచు 5 మొదటి దినము నుండి ఇప్పటి వరకు సువార్తలో మీ సహవాసం కారణంగా 6 మీలో ఒక మంచి కార్యమును ప్రారంభించినవాడు యేసు క్రీస్తు యొక్క దినము వరకు దానిని పరిపూర్ణం చేస్తాడు అని ఈ సంగతి విషయంలో అంగీకరింపచెయ్యబడ్డాను 7 మీ అందరి గురించి ఈ {విధంగా} ఆలోచించడానికి నా కోసం సరియైనది వలే ఉంది ఎందుకంటే, {నా} హృదయంలో నేను మిమ్ములను కలిగియున్నాను, నా బంధకములలో మరియు {నా} సమర్ధన మరియు సువార్త యొక్క దృఢీకరణ రెండింటిలో కృప విషయంలో మీరు అందరు నాతో పాలివారై యున్నారు. 8 ఎందుకంటే దేవుడు నా సాక్షిగా {ఉన్నాడు}, క్రీస్తు యేసు యొక్క అంతర్భాగాలతో మీ అందరి కోసం నేను ఎంతగానో అపేక్షించుచున్నాను. 9 మరియు నేను దీనిని ప్రార్థించుచున్నాను: మీ ప్రేమ జ్ఞానము మరియు సమస్త వివేచనలో అధికంగా మరియు అధికముగా ఇంకా విస్తరించాలి అని 10 తద్వారా మీరు శ్రేష్ఠమైన వాటిని అంగీకరిస్తారు అని, తద్వారా క్రీస్తు యొక్క దినం వరకు మీరు పవిత్రంగా మరియు నిర్దోషులుగా ఉంటారు, 11 దేవుని యొక్క మహిమ మరియు స్తుతికి యేసు క్రీస్తు ద్వారా {ఉన్న} నీతి యొక్క ఫలముతో నిండి యుండండి. 12 సహోదరులారా, నాకు సంభవించిన సంగతులు సువార్త యొక్క అభివృద్ధి కోసం నిజముగా సంభవించాయి అని ఇప్పుడు మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 13 దాని ఫలితంగా, క్రీస్తులో నా బంధకములు రాజ భవనం కావలివారు అంతా మరియు ఇతరులు అందరి మధ్య స్పష్టం అయ్యాయి. 14 మరియు సహోదరులలో అనేకులు వాక్యము మాట్లాడడానికి మరింత నిర్భయముగా ఉండడానికి నా బంధకముల చేత ప్రభువులో ప్రోత్సహించబడ్డారు. 15 కొందరు నిజానికి అసూయ మరియు కలహం యొక్క కారణం క్రీస్తును ప్రకటిస్తున్నారు కూడా, అయితే కొందరు మంచి బుద్ధి కారణంగా కూడా, 16 నేను సువార్త యొక్క సమర్ధన కోసం నియమించబడ్డాను అని ప్రేమ నుండి అర్థం చేసుకున్నవారు, 17 అయితే శుద్ధమనస్సుతో కాకుండా స్వార్ధపూరిత గాఢవాంఛ నుండి క్రీస్తును ప్రకటించుచున్న వారు, నా బంధకముల శ్రమను హెచ్చించడానికి తలంచుచున్నారు. 18 అయిననేమి? మిషలో గాని లేదా సత్యములో - ప్రతీ విధానంలో అని క్రీస్తు మాత్రమే ప్రకటింపబడుచున్నాడు, మరియు దీనిలో నేను సంతోషించుచున్నాను. అవును మరియు నేను సంతోషిస్తాను, 19 ఎందుకంటే ఇది మీ ప్రార్థనలు మరియు యేసు క్రీస్తు యొక్క ఆత్మ యొక్క ఏర్పాటు ద్వారా విమోచనలో జరుగుతుంది అని నాకు తెలుసు, 20 నా ఆకాంక్షగల ఎదురుచూపు మరియు నిరీక్షణ ప్రకారం నేను ఏ విషయంలోనూ సిగ్గుపడను, అయితే ప్రతి విషయంలో ధైర్యం కలిగియుంటాను, మరియు ఇప్పుడు, ఎప్పటి వలెనే, జీవితం ద్వారా లేదా మరణం ద్వారా గానీ క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడును. 21 నా మట్టుకైతే బ్రదకడానికి క్రీస్తే {అయియున్నాడు}, మరియు చావడానికి లాభము {అయియున్నది}. 22 ఇప్పుడు శరీరములో జీవించడానికి అయితే, ఇది నా కోసం ఫలవంతమైన శ్రమ {అయియున్నది, అయితే నేను ఏమి కోరుకొందునో నాకు తెలియదు. 23 అయితే రెంటి మధ్య కఠినంగా అణచబడ్డాను, నేను వెడలిపోడానికి మరియు క్రీస్తుతో ఉండడానికి ఆశ కలిగియున్నాను, ఎందుకంటే చాలా ఎక్కువ మేలుకరమైనది {అయియున్నది}. 24 అయితే మీకు సహాయం చెయ్యడానికి కొనసాగడానికి ఇక్కడ భూమి మీద సజీవంగా నిలిచియుండడం నాకు అవసరం 25 మరియు దీని విషయంలో అంగీకరింపబడియుండి, నేను నిలిచి యుంటాను మరియు మీ విశ్వాసములో అభివృద్ధి మరియు ఆనందము కోసం మీ అందరితో కొనసాగుతాను అని నాకు తెలుసు. 26 తద్వారా నేను మరల మీ వద్దకు రావడం ద్వారా క్రీస్తు యేసు నందు మీ అతిశయము నాలో అధికం అవుతుంది. 27 క్రీస్తు యొక్క సువార్త విషయంలో తగిన విధంగా మాత్రమే మిమ్మల్ని మీరు నిర్వహించుకోండి, తద్వారా మా వద్దకు రావడం గానీ మరియు మిమ్మల్ని చూడడం గానీ లేదా రాకపోయినా, మీరు ఒకే ఆత్మలో ఒకే ప్రాణంతో స్థిరంగా నిలిచియున్నారు, సువార్త యొక్క విశ్వాసం కోసం కలిసి పోరాడుచున్నారు అని నేను మీ గురించి వింటాను. 28 మరియు మిమ్మల్ని వ్యతిరేకించే వారి చేత దేనిలో భయపడ కుండా ఉండండి. ఇది వారికి {వారి} నాశనానికి ఒక సంకేతం, అయితే మీ రక్షణ విషయం - మరియు ఇది దేవుని నుండి. 29 ఎందుకంటే క్రీస్తు యొక్క పక్షమున ఆయనను విశ్వసించడానికి మాత్రమే కాదు, అయితే ఆయన పక్షమున శ్రమపడడానికి కూడా మీకు ఉచితముగా అనుగ్రహింపబడెను. 30 నాలో మీరు చూసిన అదే పోరాటాన్ని కలిగి ఉన్నారు, మరియు ఇప్పుడు మీరు నాలో విన్నారు.

Chapter 2

1 కాబట్టి, క్రీస్తులో ఏ ప్రోత్సాహమైనను, ప్రేమ యొక్క ఏ ఆదరణయైనను, ఆత్మ యొక్క ఏ సహవాసమైనను, ఏ వాత్సల్యమైనను మరియు కరుణలుయైనను {అక్కడ ఉన్న} యెడల, 2 మీరు ఒకే విధంగా ఆలోచన చేయుచు, అదే ప్రేమను కలిగియుండి, ప్రాణంలో ఐక్యమై, ఒకే విషయాన్ని ఆలోచించుచూ నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 3 స్వార్థపూరిత గాఢవాంఛ ప్రకారం లేదా వృథాతిశయము ప్రకారం ఏమీ {చేయ} వద్దు, అయితే వినయంతో మీ కంటే ఇతరులను యోగ్యమైన వారుగా భావించండి. 4 ప్రతివాడును తమ యొక్క సంగతులను పరిగణనలోకి తీసుకొనకుండా, అయితే ఒకరికొకరి యొక్క సంగతులును కూడా. 5 క్రీస్తు యేసులో {ఉన్న} యీ వైఖరి మీలో కూడా కలిగియుండుడి. 6 ఆయన దేవుని యొక్క స్వరూపములో ఉన్నవాడు, దేవునితో సమానముగా ఉండడడం అందుకొనవలసిన దానిగా యెంచుకొన లేదు. 7 దానికి బదులుగా, ఆయన తన్నుతాను రిక్తునిగా చేసికొనెను, మనుష్యుల యొక్క పోలికలో పుట్టి, ఒక దాసుని యొక్క రూపమును తీసుకొన్నాడు, మరియు, ఆయన ఆకారములో ఒక మనుష్యుని వలే కనబడి, 8 ఆయన తన్నుతాను తగ్గించుకొన్నాడు, మరణము యొక్క స్థానానికి, సిలువ మీద మరణం సహితం, విధేయుడు అయ్యాడు! 9 కాబట్టి దేవుడు కూడా ఆయనను అధికముగా హెచ్చించాడు, మరియు ప్రతి నామమునకు పైన {ఉన్న} నామమును ఆయనకు అనుగ్రహించాడు. 10 తద్వారా యేసు యొక్క నామము వద్ద ప్రతీ మోకాలు వంగుతుంది, పరలోకములో మరియు భూమి మీద మరియు భూమి క్రింద, 11 మరియు ప్రతి నాలుక తండ్రి దేవుని యొక్క మహిమకు యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొంటుంది. 12 కాబట్టి అప్పుడు, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై యున్న విధముగా, నా సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే గాక, అయితే మరి యెక్కువగా నేను లేని సమయమందును, భయము మరియు వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 13 ఎందుకంటే మీరు ఇచ్ఛయించుటకును మరియు మీలో {ఆయన} దయా సంకల్పము కోసం పని చేయడానికి దేవుడు మీలో పని చేస్తున్నాడు. 14 సణుగులును లేదా వివాదములు లేకుండా సమస్త కార్యములను చేయుడి. 15 తద్వారా మీరు నిరపరాధులును మరియు పవిత్రులు, మూర్ఖైమెన మరియు వక్ర తరము యొక్క మధ్యలో, కళంకములేని దేవుని యొక్క పిల్లలుగా మారతారు, వారి మద్య మీరు లోకములో జ్యోతుల వలే ప్రకాశిస్తారు. 16 నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, లేదా వ్యర్ధముగా కష్టపడలేదు అని క్రీస్తు యొక్క దినమున నాకు అతిశయము కోసం జీవము యొక్క వాక్యాన్ని పట్టుకొని ఉన్నాను. 17 అయితే మీ విశ్వాసం యొక్క బలిఅర్పణ మరియు సేవ మీద నేను పానార్పణముగా పోయబడి ఉన్నప్పటికి సహితం, నేను ఆనందించుచున్నాను మరియు మీ అందరితో ఆనందిస్తున్నాను. 18 ఇప్పుడు అదే విధానంలో, మీరు కూడా ఆనందించండి మరియు నాతో ఆనందించండి. 19 ఇప్పుడు తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపడానికి ప్రభువు యేసులో నేను నిరీక్షించుచున్నాను తద్వారా మీ గురించిన సంగతులు తెలుసుకోడానికి వచ్చి, నేను కూడా ప్రోత్సహించబడతాను. 20 ఎందుకంటే మీ గురించిన సంగతులను గురించి యదార్ధంగా చింతించువారు అటువంటి మనసు ఉన్నవారు నాకు ఎవరూ లేరు. 21 ఎందుకంటే వారు అందరును తమ సొంత సంగతులను వెదకుచున్నారు, యేసు క్రీస్తు సంగతులను కాదు. 22 అయితే అతని నిరూపిత యోగ్యత మీరు యెరుగుదురు, {అతని} తండ్రితో ఒక బిడ్డ వలే, అతడు సువార్తలో నాతో సేవ చేసాడు. 23 కాబట్టి, నాకు సంబంధించిన సంగతులు {వెళ్ళడం} నేను {ఏ విధంగా} చూసిన వెంటనే నేను అతనిని ఒక్కసారి పంపడానికి నిరీక్షిస్తున్నాను. 24 అయితే నా మట్టుకు నేను కూడా శీఘ్రముగా వచ్చెదను అని ప్రభువులో నమ్ముచున్నాను. 25 ఇప్పుడు నా సహోదరుడు మరియు సహ పనివాడు మరియు సహ సైనికుడు మరియు మీ దూత మరియు నా అవసరముల కోసం పరిచారకుడు ఎపఫ్రొదితును మీ వద్దకు తిరిగి పంపడం అవసరమని నేను భావిస్తున్నాను. 26 అతడు మీ అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు అని, మరియు అతడు అనారోగ్యంతో ఉన్నాడని మీరు వినిన కారణంగా అతడు విచారపడు చుండెను. 27 ఎందుకంటే నిజానికి అతడు దాదాపు చనిపోయేంత అనారోగ్యంతో ఉన్నాడు, అయితే దేవుడు అతని మీద దయ కలిగి ఉన్నాడు, మరియు అతని మీద మాత్రమే కాదు, అయితే నా మీద కూడా, తద్వారా నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండా ఉంటుంది 28 కాబట్టి నేను అతనిని మరింత శీఘ్రముగా పంపితిని. తద్వారా, అతనిని మరల చూచి, మీరు సంతోషిస్తారు, మరియు నేను బాధనుండి విముక్తి చెందుతాను. 29 కాబట్టి, సమస్త సంతోషంతో ప్రభువులో అతనిని స్వాగతించండి, మరియు అతని వలే ఉన్నవారిని ఘనపరచుడి. 30 క్రీస్తు యొక్క పని కోసం, అతడు మరణమునకు దగ్గరకు సహితం వచ్చాడు, {తన} ప్రాణాన్ని పణంగా పెట్టాడు కనుక, తద్వారా నాకు సేవ యొక్క మీ లోపాన్ని అతడు తీరుస్తాడు.

Chapter 3

1 మిగిలినవారి {వలే}, నా సోదరులారా, ప్రభువులో ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయడానికి నాకు కష్టమైనది కాదు, మరియు మీ కోసం కావలిగా {ఉంటుంది}. 2 కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3 ఎందుకంటే మనము సున్నతి పొందినవారము - దేవుని యొక్క ఆత్మ చేత ఆరాధించుచు, మరియు క్రీస్తు యేసులో అతిశయపడుచూ మరియు శరీరములో నమ్మకము లేకుండా ఉన్నవారము. 4 నేను శరీరములో సహితము నా మట్టుకు నేను నమ్మకము కలిగియున్నాను. ఎవడైనను శరీరములో నమ్మకము కలిగియుండడానికి ఆలోచన చేసిన యెడల, నాకు ఇంకా ఎక్కువగా చేసికొనవచ్చును. 5 ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు యొక్క దేశము నుండి వచ్చినవాడను, బెన్యామీను యొక్క గోత్రముకు చెందినవాడను, హెబ్రీయులకు హెబ్రీయుడను, ధర్మశాస్త్ర ప్రాకారమ ఒక పరిసయ్యుడను; 6 ఆసక్తి ప్రకారం, సంఘమును హింసించుచు; ధర్మశాస్త్రములో {ఉన్న} నీతి ప్రకారం, అనింద్యుడిగా మారాను. 7 ఏ యే {సంగతులు} నాకు లాభకరములై యుండెనో, వీటిని {సంగతులను} క్రీస్తు కోసం నష్టముగా ఎంచుకొంటిని. 8 అయితే దానికి విరుద్ధంగా, నా ప్రభువు క్రీస్తు యేసు యొక్క జ్ఞానము యొక్క అతి శ్రేష్టమైన విలువ కారణంగా అన్ని సంగతులు సహితం నష్టముగా నేను భావిస్తున్నాను, ఆయన కారణంగా నేను సమస్త సంగతులను నష్టపోయాను - మరియు నేను వాటిని పెంటగా ఎంచుకొనుచున్నాను, తద్వారా నేను క్రీస్తును పొందగలను. 9 మరియు ఆయనలో కనుగొనబడి ఉండి, ధర్మశాస్త్రము నుండి నా సొంత నీతిని కలిగి ఉండకుండా, అయితే క్రీస్తులో విశ్వాసము ద్వారా {ఉన్నది} - విశ్వాసము చేత దేవుడు అనుగ్రహించు నీతి. 10 ఆయనను మరియు ఆయన పునరుత్థానం యొక్క శక్తిని మరియు ఆయన శ్రమల యొక్క సహవాసాన్ని తెలుసుకోడానికి ఆయన మరణానికి అనుగుణంగా ఉండి, 11 అయితే, ఏ విధముచేతనైనను మృతులలో నుండి {ఉన్న} పునరుత్థానమును నేను పొందగలను. 12 ఇదివరకే నేను దీనిని పొందితిననియైనను, లేదా ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను కాదు, అయితే నేను వెంబడిస్తున్నాను, నేను కూడా దేని కోసం క్రీస్తు యేసు చేత అంగీకరించబడ్డానో దానిని నేను కూడా అంగీకరించాలి. 13 సహోదరులారా, నేను దానిని అంగీకరించడానికి నామట్టుకు నేను భావించను. అయితే ఒక్క సంగతి: వెనుక {ఉన్న} వాటిని మరచి మరియు ముందు {ఉన్న} వాటి కోసం శ్రమపడుచూ, 14 క్రీస్తు యేసులో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు యొక్క బహుమానము కోసం గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. 15 కాబట్టి, సంపూర్ణులైన వారు అనేకులు ఈ {విధంగా} ఆలోచన చెయ్యాలి; మరియు ఆలోచించాలి; మరియు దేని గూర్చియైనను భిన్నంగా ఆలోచించిన యెడల, దేవుడు కూడా దానిని మీకు బయలు పరచును. 16 అయితే మనం పొందుకున్న దానిలో, మనం దీనిలో జీవించుదము. 17 సహోదరులారా, నన్ను అనుకరించేవారిగా అవ్వండి మరియు ఒక ఉదాహరణ {వలే} మీరు మమ్ములను కలిగియున్న విధముగా, ఈ విధానంలో నడుస్తున్న వారిని సన్నిహితంగా గమనించండి. 18 ఎందుకంటే - వారి గురించి నేను తరచుగా మీకు చెప్పాను, అయితే ఇప్పుడు ఏడ్చుచు కూడా, నేను చెప్పు చున్నాను - క్రీస్తు యొక్క సిలువకు శత్రువులు {వలే} అనేకులు నడుచుకొంటున్నారు. 19 వారు అంతము నాశనం {అయియున్నది}, వారి దేవుడు {వారి} కడుపు, మరియు {వారి} మహిమ వారి సిగ్గులో {ఉంది}, వారు భూసంబంధమైన సంగతులను గురించి ఆలోచిస్తారు. 20 అయితే మన పౌరస్థితి పరలోకములో ఉంది, అక్కడ నుండి మనం కూడా రక్షకుడు ప్రభువు యేసు క్రీస్తు కోసం ఆత్రుతగా కనిపెట్టుకొనియున్నాము. 21 సమస్తమైన సంగతులను తనకు లోపరచుకొనడానికి సహితం ఆయన శక్తి యొక్క కార్యము ప్రకారం మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును.

Chapter 4

1 కాబట్టి, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము మరియు నా కిరీటము, ఈ విధానంలో ప్రియులారా, ప్రభువులో స్థిరంగా నిలబడండి. 2 ప్రభువులో ఒకదానినే ఆలోచించడానికి నేను యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. 3 అవును, నిజమైన సహకారీ, క్లెమెంతుతో మరియు నా యితర సహకారులతో సువార్తలో నాతో ప్రయాసపడిన ఈ స్త్రీలకు సహాయం చెయ్యడానికి నేను కూడా నిన్ను అడుగుతున్నాను. వారి పేరులు జీవము యొక్క గ్రంథములో {ఉన్నాయి}. 4 ఎల్లప్పుడును ప్రభువులో ఆనందించుడి, మరల నేను చెప్పుదును, ఆనందించుడి. 5 మీ మృదుత్వము సకల మనుష్యులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా {ఉన్నాడు}. 6 దేనినిగూర్చియు చింతపడకుడి, అయితే ప్రతివిషయములో ప్రార్థన మరియు విజ్ఞాపనము చేత కృతజ్ఞతతో, మీ విన్నపములు దేవునికి తెలియజేయబడనివ్వండి. 7 మరియు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము, మీ హృదయములకు మరియు క్రీస్తు యేసులో మీ మనసులకు కావలియుండును. 8 మిగిలిన {వాటికి}, సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి ఘనతకలిగినవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏదైనా ధర్మమైనది {ఉన్న} యెడల, మరియు ఏదైనా పొగడదగినవి {ఉన్న} యెడల ఈ సంగతులను గురించి ఆలోచన చెయ్యండి. 9 మరియు మీరు నేర్చుకొనినవి మరియు పొందుకొన్నవి మరియు వినినవి మరియు నాలో చూసినవి, ఈ సంగతులను చెయ్యండి, మరియు సమాధానం యొక్క దేవుడు మీతో ఉంటాడు. 10 ఇప్పుడు ప్రభువులో నేను ఎంతో ఆనందించుచున్నాను ఎందుకంటే చివరకు మీరు నా పక్షంగా {మీ} శ్రద్ధను నూతనపరచారు. ఆ విషయములో నిజముగా మీరు శ్రద్ధ కలిగి యున్నారు. అయితే అవకాశము కొదువగా ఉన్నారు. 11 అవసరం ప్రకారం నేను మాట్లాడడం అని కాదు. ఎందుకంటే నా మట్టుకునేను నేనేస్థితిలో ఉన్నను సంతృప్తి కలిగియుండడానికి నేర్చుకొనియున్నాను. 12 నాకు {ఏవిధంగా} దీనస్థితికి తీసుకురాబడడానికీ తెలుసు, మరియు {ఏవిధంగా} సమృద్ధి కలిగి యుండడానికి నాకు రెండు తెలుసు. ప్రతి {పరిస్థితిలో} మరియు అన్ని {పరిస్థితులలో}, నేను సంతృప్తి చెంది యుండడానికి మరియు ఆకలితో ఉండడానికి మరియు సమృద్ధి స్థితిలో ఉండడానికి మరియు అవసరంలో ఉండడానికీ రెండింటినీ నేను నేర్చుకున్నాను. 13 నన్ను బలపరచువానిలో నేను సమస్త కార్యములను చేయగలను. 14 అయినను నా శ్రమలో కలిసి పంచుకొని మీరు చక్కగా చేసారు. 15 ఇప్పుడు ఫిలిప్పీయులారా మీరు కూడా సువార్త యొక్క ఆరంభంలో యెరుగుదురు, నేను మాసిదోనియ నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు ఇవ్వడం మరియు పుచ్చుకోవడం యొక్క విషయములో మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పంచుకొనలేదు, 16 ఎందుకంటే థెస్సలొనీకలో కూడ మీరు ఒకసారి మరియు రెండుసార్లు నా అవసరాల కోసం పంపారు. 17 నేను బహుమానమును వెదకుతూ ఉండడం అని కాదు, అయితే మీ లెక్క విస్తరించడానికి అని నేను ఫలం వెదకుచున్నాను. 18 ఇప్పుడు నాకు సమస్త సంగతులు నిండుగా నేను కలిగియున్నాను మరియు నేను సమృద్ధిలో ఉన్నాను. మీ నుండి వస్తువులను ఎపఫ్రొదితు నుండి పొందాను, నేను నింపబడి యున్నాను, ఒక పరిమళం, మనోహరమైన సువాసనయు, దేవునికి అంగీకారము, ప్రీతికరమైన యాగమునై ఉన్నాయి. 19 ఇప్పుడు నా దేవుడు తన మహిమలో ఐశ్వర్యము ప్రకారము క్రీస్తు యేసులో మీ అవసరం అంతా తీర్చును. 20 ఇప్పుడు మన దేవుడు మరియు తండ్రికి శాశ్వతం {మరియు} నిరంతరం మహిమ {ఉంటుంది}. ఆమేన్. 21 క్రీస్తు యేసులో ప్రతి పరిశుద్ధునికి శుభములు చెప్పండి. నాతో సహోదరులు మీకు శుభములు చెప్పుచున్నారు. 22 పరిశుద్ధులు అందరు మీకు శుభములు చెప్పుచున్నారు, అయితే ప్రత్యేకంగా కైసరు యొక్క ఇంటి నుండి ఉన్నవారు. 23 ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో {ఉంటుంది}. ఆమేన్.