తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తులో థెస్సలొనీకయుల యొక్క సంఘమునకు పౌలు మరియు, సిల్వాను మరియు తిమోతి. మీకు కృప మరియు సమాధానము. 2 మా ప్రార్థనలలో మీ విషయమై నిరంతరము జ్ఞాపకము చేయుచు మీ అందరి కోసం దేవునికి ఎల్లప్పుడు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. 3 విశ్వాసము యొక్క మీ పనిని, మరియు ప్రేమతోకూడిన ప్రయాసమును మరియు మన ప్రభువు యేసు క్రీస్తులో నిరీక్షణతోకూడిన ఓర్పును, మన తండ్రి మరియు దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచున్నాము. 4 దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా, మీ ఎన్నికను తెలుసుకొన్నాము, 5 ఎందుకంటే మా సువార్త, మీ వద్దకు మాటలో మాత్రము కాక రాలేదు, అయితే శక్తిలో మరియు పరిశుద్ధ ఆత్మలో మరియు సంపూర్ణ నిశ్చయతలో - మీ నిమిత్తము మేము మీ మధ్య ఎటువంటి మనుష్యులముగా ఉన్నామో మీరు ఎరిగిన విధముగా. 6 మరియు మీరు మా యొక్క మరియు ప్రభువు యొక్క అనుకరించువారు అయ్యారు, పరిశుద్ధ ఆత్మ యొక్క ఆనందముతో, గొప్ప శ్రమలో వాక్యము నంగీకరించారు. 7 దాని ఫలితంగా, మాసిదోనియలో మరియు అకయలో విశ్వసించిన వారు అందరికీ మాదిరి అయ్యారు. 8 ఎందుకంటే మీ వద్ద నుండి ప్రభువు యొక్క వాక్యము మాసిదోనియలో మరియు అకయలో మాత్రమే కాక బయటకి మోగింది. అయితే దేవుని పట్ల మీ విశ్వాసము ప్రతి స్థలములోనికి వెలుపలికి వెళ్ళింది. కాబట్టి, మేము ఏమియు చెప్పవలసిన అవశ్యము లేదు. 9 ఎందుకంటే మీతో మేము ఎటువంటి ప్రవేశము పొందామో, మరియు జీవముగలవాడు మరియు సత్యవంతుడైన దేవుణ్ణి సేవించడానికి విగ్రహముల నుండి దేవుని వైపుకు మీరు ఏవిధంగా తిరిగారో వారు తమకై తాము మా గురించి నివేదిక ఇచ్చారు. 10 మరియు పరలోకముల నుండి ఆయన కుమారుని కోసం యెదురుచూడడానికి, మృతులలో నుండి ఆయన లేపినవాడు - యేసు రాబోవుతూ ఉన్న ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నవాడు.

Chapter 2

1 ఎందుకంటే సహోదరులారా, మీ వద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు అని మీకై మీరు యెరుగుదురు. 2 అయితే ముందు శ్రమపడి మరియు మీరు ఎరిగిన విధముగా ఫిలిప్పీలో సిగ్గుకరంగా అవమానం పొందియుండి, యెంతో పోరాటములో దేవుని యొక్క సువార్తను మీకు బోధించడానికి మన దేవునిలో మేము ధైర్యముగా ఉన్నాము. 3 ఎందుకంటే మా బోధ లోపం నుండి వచ్చినది కాదు, అపవిత్రత నుండి కాదు, మోసములోనిది కాదు, 4 అయితే సువార్తతో అప్పగించబడి యుండుటకు దేవుని చేత మేము పరీక్షించబడిన విధముగా, కాబట్టి మేము మనుష్యులను సంతోషపరచడం కాక, అయితే మన హృదయములను పరీక్షించువాడు దేవునినే సంతోషపెట్టువారముగా మాట్లాడుచున్నాము. 5 ఎందుకంటే మీరు యెరిగియున్న విధముగా, మేము ఆ సమయంలో ఇచ్చకము యొక్క మాటలలో, లేదా ధనాపేక్ష కోసం నెపముతో మేము రాలేదు - దేవుడు సాక్షియై {ఉన్నాడు.} 6 లేదా మీ నుండి గాని లేదా ఇతరుల నుండి, మనుష్యుల నుండి ఘనతను మేము కోరలేదు. 7 క్రీస్తు యొక్క అపొస్తలుల వలే ఒక భారముగా ఉండడానికి సమర్థులమై ఉండి, అయితే ఒక తల్లి తన సొంత బిడ్డలను ఆదరించు విధముగా, మేము మీ యొక్క మధ్యలో చిన్న పిల్లలము అయ్యాము. 8 ఈ విధానములో మీ కోసం అనురాగము కలిగియుండి, దేవుని యొక్క సువార్తను మాత్రమే కాక, అయితే మా సొంత ప్రాణములను కూడా మీకు ఇవ్వడానికి మేము సంతోషించుచున్నాము. 9 ఎందుకంటే సహోదరులారా మా ప్రయాసము మరియు కష్టము మీకు జ్ఞాపకం ఉంది, మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రి మరియు పగలు పనిచేసి, దేవుని యొక్క సువార్తను మేము మీకు బోధించాము. 10 విశ్వసించు మీ పట్ల మేము ఎంత పరిశుద్దముగా మరియు నీతిగా, మరియు నిందారహితముగా మారామో మీరు మరియు దేవుడు {కూడా} సాక్షులై {ఉన్నారు.} 11 తండ్రి తన పిల్లలతో ఉన్న విధముగా మీలో ప్రతి ఒక్కరి యెడల ఉన్నాము అని మీకు తెలుసు. 12 తన సొంత రాజ్యము మరియు మహిమలోనికి మిమ్ములను పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనడానికి మీ కోసం మిమ్ములను హెచ్చరిస్తూ మరియు ప్రోత్సహిస్తూ మరియు సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. 13 మరియు ఈ కారణంచేత మేము కూడా ఎడతెగకుండా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాము, మీరు మా నుండి దేవుని యొక్క వాక్కు విని అంగీకరించినప్పుడు అది మనిషి యొక్క వాక్కు {వలే} కాక దేవుని యొక్క వాక్కుగానే స్వీకరించారు. అయితే సత్యమైన విధముగా దేవుని యొక్క వాక్కును విశ్వసించు మీలో కూడా అది పని చేస్తూ ఉంది కూడా. 14 ఎందుకంటే మీరు సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసులో ఉన్న దేవుని యొక్క సంఘములను పోలి నడుచుకొనినవారు అయ్యారు. ఎందుకంటే యూదుల నుండి వారు కూడా అనుభవించిన విధముగా మీరు కూడా మీ సొంతదేశస్థుల నుండి శ్రమ పడ్డారు. 15 వారు ప్రభువు యేసును మరియు ప్రవక్తలను ఇద్దరినీ చంపారు మరియు మమ్మును హింసించారు మరియు దేవునికి ఇష్టులైనవారు కాదు మరియు మనుష్యులు అందరికీ విరోధులుగా {ఉన్నారు,} 16 తమ పాపాలను ఎప్పుడు పోగుచేసుకోడానికి యూదేతరులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడడానికి మమ్మును ఆటంకపరచుచున్నారు. అయితే ఉగ్రత చివరికి వారి మీదికి వచ్చింది. 17 అయితే సహోదరులారా, మేము ముఖము చేత ఒక గంట యొక్క సమయం కోసం, మీ నుండి వేరుగా ఉన్ననూ, హృదయంలో కాదు, అధికమైన అపేక్షలో, మీ ముఖములను చూడడానికి అమితముగా అత్యాశగలవారం అయ్యాము. 18 ఎందుకంటే మేము మీ వద్దకు రావడానికి కోరుకున్నాము - నిజానికి నేను పౌలును ఒకసారి మరియు రెండుసార్లు - అయితే సాతాను మమ్మును అడ్డగించాడు. 19 ఎందుకంటే మా నిరీక్షణ లేదా ఆనందము లేదా అతిశయం యొక్క కిరీటం ఏమిటి? లేదా ఆయన రాకడ సమయములో మన ప్రభువు యేసు యెదుట మీరే గదా. 20 ఎందుకంటే మీరు మా మహిమ మరియు ఆనందము.

Chapter 3

1 కాబట్టి ఇకమీదట సహింపజాలక ఏథెన్సులో మాత్రమే విడువబడి యుండడానికి ఇది మంచిది మేము తలంచాము, 2 మరియు మన సహోదరుడు మరియు క్రీస్తు యొక్క సువార్తలో దేవుని యొక్క దాసుడు, మీ విశ్వాస విషయంలో మిమ్మును బలపరచడానికి మరియు ఆదరించడానికి తిమోతిని మేము పంపాము. 3 ఈ హింసల చేత ఎవరూ చెదరిపోకుండా ఉండాలి అని. ఎందుకంటే దీని కోసం మేము నియమించబడ్డాము అని మీకై మీరు యెరుగుదురు. 4 ఎందుకంటే మేము మీయొద్ద ఉన్నప్పుడు కూడా, మేము శ్రమను అనుభవింపవలసియున్నది అని ముందుగా మేము మీతో చెప్పాము, మరియు మీరు యెరిగిన విధముగా కూడా ఇది సంభవించింది. 5 దీని యొక్క కారణంగా, నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మరియు మా ప్రయాసము వ్యర్థమైపోయెనేమో అనియు, మీ విశ్వాసము గురించి తెలిసికోడానికి పంపాను. 6 అయితే ఇప్పుడే తిమోతి మీ వద్ద నుండి మా వద్దకు వచ్చాడు మరియు మీ విశ్వాసము మరియు ప్రేమ మరియు మేము కూడా మిమ్మును చూడడానికి ఉన్న విధముగా మీరును మమ్మును చూడడానికి నపేక్షించుచు, మా గురించిన మంచి జ్ఞాపకాలు ఎల్లప్పుడు మీరు కలిగియున్నారు అనేదాని యొక్క మంచి వార్తను మా వద్దకు తీసుకొని వచ్చాడు. 7 దాని యొక్క కారణంగా, సహోదరులారా, మా యిబ్బంది మరియు శ్రమ అంతటిలో మీ చేత, విశ్వాసము చేత మేము ఆదరించబడ్డాము. 8 ఎందుకంటే మీకై మీరు ప్రభువులో స్థిరముగా నిలిచిన యెడల ఇప్పుడు మేము జీవిస్తూఉన్నాము. 9 ఎందుకంటే మన దేవుని ఎదుట మీ కారణంగా మేము సంతోషిస్తున్న ఆనందం అంతటి కోసం దేవునికి తిరిగి ఇవ్వడానికి తగినట్టుగా ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు ఇవ్వగలము? 10 రాత్రి మరియు పగలు మీ ముఖము చూడడానికి మరియు మీ విశ్వాసములో కొదువగా {ఉన్న} దానిని సమకూర్చడానికి ప్రాధేయపడి వేడుకొనుచున్నాము. 11 అయితే మన దేవుడు మరియు తండ్రి తానే మరియు మన ప్రభువు యేసు మీ వద్దకు మమ్మును నడిపించును గాక. 12 ఇప్పుడు మీ పట్ల మేము కూడా ఉన్న విధముగా ఒకరి కోసం ఒకరు మరియు అందరి కోసం ప్రేమలో ప్రభువు వృద్ధిని మరియు సమృద్ధిని కలుగ జేయునుగాక. 13 మన ప్రభువు యేసు తన పరిశుద్ధులు అందరితో వచ్చిన సమయంలో, మన తండ్రి మరియు దేవుని యెదుట మీ హృదయములను బలపరచును మరియు పరిశుద్ధతలో నిందారహితముగా ఉంచును. ఆమేన్!

Chapter 4

1 కాబట్టి చివరికి, సహోదరులారా, మీరు ఏలాగు నడుచుకొనవలసిన అవసరం ఉన్నదో దాని గురించి మరియు దేవుణ్ణి సంతోషపరచడానికి మా నుండి పొందుకొన్న విధముగా (మీరు కూడా నడుచుకొనుచున్న విధముగా) మేము ప్రభువైన యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము మరియు హెచ్చరించుచున్నాము. తద్వారా మీరు అంతకంతకు అభివృద్ధి పొందుదురు. 2 ఎందుకంటే ప్రభువు యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు యెరుగుదురు. 3 ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తము, మీరు పరిశుద్ధులగుటయే: అనగా మీరు లైంగిక దుర్నీతి నుండి మిమ్మును మీరు దూరముగా ఉంచుకొనుట; 4 మీలో ప్రతివాడును, పరిశుద్ధపరచుకొనుట మరియు ఘనతలో తన సొంత పాత్రను స్వాధీనములో ఉంచుకోడానికి తెలుసుకోవాలి, 5 (దేవుని ఎరుగని అన్యజనులు కూడా ఉన్న విధముగా) కామం యొక్క అభిలాషలో కాకుండా; 6 ఈ విషయమందు ఎవడును అతిక్రమించకూడదు మరియు తన సహోదరుని వంచించకూడదు, ఎందుకనగా మేము మిమ్మును ముందుగా హెచ్చరించి మరియు సాక్ష్యమిచ్చిన విధముగా ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతీకారం చేయువాడై ఉన్నాడు. 7 ఎందుకంటే దేవుడు మనలను అపవిత్రతకు పిలువలేదు, అయితే పరిశుద్ధపరచబడుటలో. 8 కాబట్టి దీనిని ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు అయితే మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. 9 అయితే సహోదర ప్రేమను గురించి (మేము) మీకు వ్రాయడానికి మీకు అవసరం లేదు. ఎందుకంటే మీకై మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పించబడితిరి. 10 ఎందుకంటే నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న సోదరులు అందరికి మీరు దీనిని చేసారు. అయితే సహోదరులారా, మరింతగా వృద్ధి కలిగియుండడానికి మేము మిమ్మును హెచ్చరించుచున్నాము. 11 మరియు మేము మీకు ఆజ్ఞాపించిన విధముగా శాంతముగా జీవించడానికి మరియు మీ సొంత కార్యములను జరుపుకోడానికి మరియు మీ సొంత చేతులతో పని చేయడానికి ప్రయాసపడండి. 12 తద్వారా బయట ఉన్నవారి యెదుట మీరు సరిగా ప్రవర్తిస్తారు మరియు మీకు కొదువ ఏమీ లేకుండా ఉంటుంది. 13 ఇప్పుడు సహోదరులారా, నిరీక్షణ లేని యితరుల వలె కూడా మీరు దుఃఖపడకుండా ఉండడానికి, నిద్రించుచున్నవారిని గురించి మీకు తెలియకుండ ఉండడానికి మేము కోరుకోము. 14 ఎందుకంటే యేసు చనిపోయాడు మరియు తిరిగి లేచాడు అని మనము విశ్వసించిన యెడల, అదే ప్రకారము యేసు ద్వారా నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. 15 ఎందుకంటే ప్రభువు యొక్క మాట చేత మీకు మేము ఇది చెప్పుచున్నాము, ప్రభువు యొక్క రాకడ వరకు సజీవులై నిలిచి యుండు మనము నిద్రించిన వారికంటె ముందుగా ఖచ్చితంగా వెళ్ళము. 16 ఎందుకంటే ప్రభువు తానే, ఒక శబ్దంతో, ప్రధానదూత యొక్క స్వరముతో, మరియు దేవుని యొక్క బూరతో, పరలోకము నుండి ప్రభువు తానే దిగివచ్చును, మరియు క్రీస్తులో మృతులైనవారు మొదట లేతురు. 17 తరువాత సజీవులమై ఉన్న మనము, విడిచిపెట్టబడిన మనము, గాలిలో ప్రభువును ఎదుర్కొనుటకు వారితో ఏకముగా మేఘముల మీద కొనిపోబడుదుము, మరియు ఈ విధానములో మనము సదాకాలము ప్రభువుతో ఉందుము. 18 కాబట్టి ఈ మాటలతో ఒకనినొకడు ఆదరించుకొనుడి.

Chapter 5

1 ఇప్పుడు సహోదరులారా, కాలములు మరియు సమయములను గురించి మీకు {మేము} వ్రాయడానికి మీకు అవసరం లేదు. 2 ఎందుకంటే రాత్రి వేళ దొంగ వలే - ఈ విధానంలో ప్రభువు యొక్క దినము వచ్చును అని మీకై మీరు సంపూర్ణంగా యెరుగుదురు. 3 అప్పుడు వారు చెప్పవచ్చు, "సమాధానము మరియు భద్రత," అప్పుడు గర్భిణిస్త్రీకి ప్రసవవేదనలు వచ్చునట్లు వారి మీదకు ఆకస్మికముగా నాశనము వచ్చును, మరియు వారు ఖచ్చితంగా తప్పించుకొన లేరు. 4 అయితే మీరు, సహోదరులారా, చీకటిలో లేరు, తద్వారా ఆ దినము దొంగవలె మీ మీదికి వచ్చును. 5 ఎందుకంటే మీరు అందరు వెలుగు యొక్క కుమారులు మరియు పగలు యొక్క కుమారులు, మనము రాత్రి వారము కాము, లేదా చీకటి వారము కాము 6 కాబట్టి అప్పుడు, మనము ఇతరుల వలె నిద్రపోకుండా ఉందము, అయితే మెలకువగా ఉందుము మరియు స్థిరబుద్ధిగలవారముగా ఉందుము. 7 ఎందుకంటే నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మరియు మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. 8 అయితే మనము పగటివారమై ఉండి, స్థిరబుద్ధిగలవారముగా నిలిఛి యుందము, విశ్వాసము యొక్క మరియు ప్రేమ యొక్క కవచమును మరియు ఒక శిరస్త్రాణమును - రక్షణ యొక్క నిరీక్షణను ధరించుకొందము. 9 ఎందుకంటే మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మనలను నియమించెను అయితే ఉగ్రతకు నియమింపలేదు. 10 మన కోసం చనిపోయిన వాడు తద్వారా మనం మెలకువగా ఉన్ననూ లేదా నిద్రపోతూ ఉన్ననూ తనతో కలసి మనం జీవిస్తాము. 11 కాబట్టి మీరు కూడా ఇప్పుడు చేస్తున్న విధముగా ఒకరినొకరు ఆదరించుకోండి, మరియు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. 12 సహోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతున్న వారిని మరియు ప్రభువులో మిమ్ములను నడిపిస్తున్న వారిని మరియు మీకు బుద్ధి చెపుతూ ఉన్నవారిని గుర్తించడానికి ఇప్పుడు మేము మిమ్ములను అడుగుతున్నాము.. 13 మరియు వారి యొక్క పని కారణంగా ప్రేమలో వారిని ఎంతో ఘనంగా ఎంచడానికి. మీలో మీ మధ్య సమాధానముతో ఉండండి. 14 ఇప్పుడు మేము మిమ్ములను హెచ్చరించుచున్నాము, సహోదరులారా, క్రమంలేనివారిని హెచ్చరించండి. నిరుత్సాహంగా ఉన్నవారిని ప్రోత్సహించండి, అందరి పట్లా సహనం కలిగి ఉండండి. 15 ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. అయితే మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులు అందరి కోసం ఎప్పుడూ మేలైన దానిని వెంటాడండి. 16 ఎప్పుడూ సంతోషంగా ఉండండి. 17 యెడతెగక ప్రార్థన చెయ్యండి. 18 ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఇది క్రీస్తు యేసులో మీ కోసం దేవుని చిత్తము. 19 ఆత్మను ఆర్ప వద్దు. 20 ప్రవచనములను నిర్లక్ష్యం చేయవద్దు. 21 అన్నిటిని పరీక్షించండి. శ్రేష్ఠమైన దానిని గట్టిగా పట్టుకొని ఉండండి. 22 దుష్టత్వము యొక్క అన్ని రూపాల నుండి దూరంగా ఉండండి. 23 ఇప్పుడు సమాధానము యొక్క దేవుడు తానే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మరియు మీ పూర్ణ ఆత్మయు, మరియు ప్రాణమును మరియు శరీరమును మన ప్రభువు యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగా, ఉండునట్లు కాపాడబడును గాక. 24 మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు, ఆయన కూడా దానిని చేస్తాడు. 25 సహోదరులారా, మా కోసం కూడా ప్రార్థన చేయుడి. 26 పవిత్రమైన ముద్దుతో సహోదరులు అందరికి శుభములు చెప్పండి. 27 సహోదరులు అందరికి ఈ ఉత్తరాన్ని చదివించాలని ప్రభువు చేత మీకు నేను రూఢిగా ఆదేశిస్తున్నాను. 28 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మీతో యుండును.