కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
Chapter 1
1 పౌలును, దేవుని యొక్క చిత్తము చేత క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడను, మరియు మన సహోదరుడు తిమోతి, కొరింథులో ఉన్న దేవుని యొక్క సంఘముకు, మరియు అకయ అంతటిలో ఉన్న పరిశుద్ధులు అందరికి. 2 మీకు కృప మరియు మన తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు నుండి సమాధానము. 3 కనికరముల యొక్క తండ్రి మరియు సమస్త ఆదరణ యొక్క దేవుడు, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి మరియు దేవుడు స్తుతింపబడును. 4 ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు తద్వారా దేవుని చేత మా మట్టుకు మేము ఆదరించబడిన ఆ ఆదరణతో ప్రతీ శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తిగలవారముగా ఉన్నాము. 5 ఎందుకంటే క్రీస్తు యొక్క శ్రమలు మా యెడల విస్తరించుచున్న విధముగా, అదే విధానములో క్రీస్తు ద్వారా మా ఆదరణ కూడా విస్తరించుచున్నది. 6 అయితే మేము శ్రమ పొందిన యెడల, మీ ఆదరణ మరియు రక్షణ కోసం {ఇది ఉంది}; మేము ఆదరణ పొందిన యెడల, మా మట్టుకు మేము కూడా శ్రమపడుతున్న అవే శ్రమల యొక్క ఓర్పులో మీరు అనుభవించుచున్న మీ ఆదరణ కోసం {ఇది ఉంది}. 7 మరియు మీరు శ్రమలలో, అదే విధానములో, ఆదరణలో కూడా పాలివారైయున్నారు అని యెరిగి మీ గురించి మా నిరీక్షణ స్థిరముగా {ఉంది}. 8 ఎందుకంటే సహోదరులారా, ఆసియలో మాకు సంభవించిన శ్రమను గురించి మీరు జ్ఞానరహితంగా ఉండడం మేము కోరుకోవడం లేదు, అది మేము {మా} సామర్ధ్యముకు మించి, అత్యధికంగా బరువు చెయ్యబడ్డాము, తద్వారా మేము జీవితం గురించి కూడా నిరాశ చెందాము. 9 నిజానికి, మా మట్టుకు మేము మరణం యొక్క శిక్షను మాలో కలిగియున్నాము తద్వారా మాలో మేము నమ్మకం ఉంచడం లేదు, అయితే మృతులను లేపు వాడు, దేవునిలో, 10 ఆయన అటువంటి గొప్ప మరణకరమైన ఆపద నుండి మమ్మును తప్పించెను, మరియు ఇంకా మరల {మమ్మును} తప్పించును అని మేము మా నిరీక్షణను స్థిరపరచుకున్నాము. 11 మా పక్షంగా విజ్ఞాపనలో సహాయం చెయ్యడంలో మీరు కూడా చేరుతున్నారు - తద్వారా అనేకుల ద్వారా, మాకు కృపగల వరము కోసం అనేక ముఖముల నుండి మా పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. 12 ఎందుకంటే మా అతిశయము ఇది: దేవుని యొక్క కృపలో మరియు మీ యెడల సమృద్ధిగా మరియు శరీరానుసారమైన జ్ఞానంలో కాదు, అయితే దేవుని యొక్క పరిశుద్ధత మరియు నిష్కాపట్యములో లోకములో మమ్ములను మేము నడిపించుకొన్నాము అని మా మనస్సాక్షి యొక్క సాక్ష్యము. 13 ఎందుకంటే మీరు చదువునవి లేదా అర్థం చేసుకొనునవి కూడా తప్పించి మరి ఏ ఇతర {సంగతులు} మేము మీకు వ్రాయడం లేదు, అయితే కడ వరకు మీరు అర్థం చేసుకుంటారు అని నేను నిరీక్షించుచున్నాను. 14 మీరు కూడా కొంత మట్టుకు మమ్మును అర్థం చేసుకొన్న విధముగా - తద్వారా మన ప్రభువు యేసు యొక్క దినమున మీరు కూడా మాకు ఉన్న విధముగా మేము మీ అతిశయమై ఉన్నాము. 15 మరియు ఈ నమ్మకముతో, నేను మీ వద్దకు ముందుగానే రావడానికి ఉద్దేశించుచున్నాను తద్వారా మీరు రెండవ కృపను కలిగియుంటారు. 16 మరియు మీ ద్వారా మాసిదోనియ దేశంలోనికి వెళ్లడానికి మరియు మాసిదోనియ నుండి మరల మీ యొద్దకు రావడానికి, మరియు మీ చేత యూదయ ప్రాంతముకు సాగనంపబడడానికి. 17 కాబట్టి, దీనిని ఉద్దేశించి, నేను చపలచిత్తములో నడుచుకొన లేదు. నేను చేసానా? లేదా నేను ఏమి ఉద్దేశించాను, శరీరం ప్రకారం నేను ఉద్దేశించానా, తద్వారా నాతో "అవును అవును" మరియు "కాదు కాదు" అని ఉందా? 18 అయితే దేవుడు నమ్మదగినవాడై {ఉన్నాడు}, తద్వారా మీకు మా వాక్యము "అవును" మరియు "కాదు" అని లేదు. 19 ఎందుకంటే దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు, మా చేత - నా చేత మరియు సిల్వాను మరియు తిమోతి చేత, మీ మధ్య ప్రకటింపబడినవాడు - "అవును" మరియు "కాదు" అని ఉండలేదు, అయితే ఆయనలో ఇది "అవును" అని ఉంది. 20 ఎందుకంటే దేవుని యొక్క {ఉన్న} వాగ్దానములు అన్నియూ ఆయనలో "అవును" అన్నట్టు {అవి ఉన్నాయి}. కాబట్టి మన ద్వారా దేవునికి ఆయన మహిమ కోసం ఆయన ద్వారా కూడా "ఆమేన్" అని {ఉన్నాయి}. 21 ఇప్పుడు మీతో క్రీస్తులో మమ్మును స్థిరపరచుచున్నవాడు మరియు అభిషేకించినవాడు దేవుడై {ఉన్నాడు}. 22 ఆయన మనలను ముద్రించాడు కూడా మరియు {మనకు} మన హృదయములలో ఆత్మ యొక్క ముందు చెల్లింపును అనుగ్రహించియున్నాడు. 23 ఇప్పుడు నేను మిమ్మును విడిచిపెట్టిన నా ఆత్మకు సాక్షి వలే దేవుణ్ణి వేడుకొంటున్నాను - నేను ఇంకా కొరింథుకి రాలేదు. 24 మీ విశ్వాసము మీద మేము ప్రభువులము అని కాదు, అయితే మీ ఆనందము కోసం మేము జత పనివారమై ఉన్నాము, ఎందుకంటే విశ్వాసములో మీరు దృఢముగా నిలుచున్నారు.
Chapter 2
1 ఎందుకంటే దుఃఖంలో మీ దగ్గరకు మరల రాకుండా ఉండడానికి నేను నా అంతట నేనే నిశ్చయించుకొన్నాను. 2 ఎందుకంటే నేనే మిమ్ములను దుఃఖపెట్టిన యెడల, నా చేత దుఃఖపడిన వాడు తప్పించి నన్ను సంతోషపరచువాడు ఎవరై {ఉన్నారు}? 3 మరియు నేను ఇదే సంగతి రాసాను తద్వారా, వచ్చిన తర్వాత, నేను సంతోషించడానికి అవసరం ఉన్న {వారి} నుండి నాకు దుఃఖం ఉండదు, నా సంతోషము మీ అందరి యొక్క {సంతోషమై} ఉంది అని మీ అందరిలో నమ్మకము కలిగి ఉంది. 4 ఎందుకంటే ఎంతో బాధ, మరియు హృదయం యొక్క వేదన నుండి అనేక కన్నీళ్ళ ద్వారా నేను మీకు రాశాను. తద్వారా మీరు దుఃఖపడాలని కాదు, అయితే తద్వారా మీ కోసం నాకు అత్యధిక ప్రేమ ఉంది అని మీరు తెలుసుకొంటారు. 5 అయితే ఎవరైననూ దుఃఖాన్ని కలిగించిన యెడల, అతడు నాకు {మాత్రమే} దుఃఖాన్ని కలిగించ లేదు, అయితే కొంతమట్టుకు - ఎందుకనగా నేను మీ అందరికీ భారాన్ని కలిగించను. 6 ఎక్కువమంది చేత అటువంటి {వ్యక్తి} మీద ఈ శిక్ష చాలినదై {ఉంది}. 7 తద్వారా, విరుద్ధంగా మీరు అతణ్ణి క్షమించాలి మరియు {అతనిని} ఆదరించాలి {తద్వారా} అటువంటి {వ్యక్తి} తన అధికమైన దుఃఖంలో మునిగిపోకుండా ఉంటాడు. 8 కాబట్టి అతని కోసం మీ ప్రేమను రూఢిపరచడానికి నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను. 9 నిజానికి, నేను కూడా ఈ కారణం కోసం రాసాను: తద్వారా మీరు అన్ని విషయాలలో విధేయులై ఉన్నారా లేదా అని నేను మీ రుజువును తెలుసుకొంటాను. 10 ఇప్పుడు మీరు దేనిగూర్చియైననూ ఎవరినైనను క్షమించుచున్నారో, నేను కూడా {క్షమిస్తాను} - ఎందుకంటే నిజానికి, నేను క్షమించిన వ్యక్తి (నేను దేనినైనా క్షమించిన యెడల) క్రీస్తు యొక్క సన్నిధిలో మీ కోసమై {ఉంది} 11 తద్వారా మనం సాతాను చేత మోసపరచకుండా ఉంటాము, ఎందుకంటే మనం అతని తంత్రములను ఎరుగనివారము కాము. 12 ఇప్పుడు త్రోయకు వచ్చాను మరియు క్రీస్తు యొక్క సువార్త కోసం ఒక ద్వారం ప్రభువులో నాకు తెరువబడింది. 13 అక్కడ నా క్రైస్తవ సహోదరుడు తీతును నేను కనుగొనక పోవడంచేత నా ఆత్మలో ఉపశమనం లేదు. కాబట్టి వారికి వీడ్కోలు తీసుకొని, నేను మాసిదోనియకు బయలు దేరాను. 14 అయితే దేవునికి కృతజ్ఞతలు {కలుగుతాయి}, క్రీస్తులో విజయ సూచకమైన ఊరేగింపులో మమ్ములను ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు, మరియు ఆయన యొక్క జ్ఞానము యొక్క పరిమళాన్ని మా ద్వారా ప్రతీ స్థలంలో తెలియపరుస్తున్నాడు. 15 ఎందుకంటే రక్షణ పొందుతున్న వారి మధ్య, మరియు నశిస్తున్న వారి మధ్య మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాం. 16 నిజానికి, వారికి, మరణము నుండి మరణముకు వాసన, అయితే {ఇతరులకు}, జీవము నుండి జీవముకు వాసన. మరియు ఈ సంగతుల కోసం, ఎవరు చాలినవాడై {ఉన్నాడు}? 17 ఎందుకంటే మేము దేవుని యొక్క వాక్యం వలన అక్రమలాభం సంపాదించే అనేకుల వలే కాదు; అయితే నిజాయితీ నుండి ఉన్నట్టు, అయితే దేవుని నుండి అన్నట్టు, మేము దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తులో మాట్లాడుతాము.
Chapter 3
1 మమ్మును మేమే మరల మెప్పించుకొనడానికి మేము మొదలు పెట్టుచున్నామా? లేదా కొందరికి వలే, మీ వద్దకైనను లేదా మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరం లేదు. మాకు అవసరమా? 2 మా హృదయములలో వ్రాయబడియుండి, మనుష్యులు అందరి చేత తెలిసికొనుచు మరియు చదువబడిన మా పత్రిక మీరే. 3 మా చేత నిర్వహించబడుచూ క్రీస్తు యొక్క పత్రికయై ఉన్నారు అని మీరు తేటపరచబడుచున్నారు. సిరాతో రాయబడ లేదు అయితే జీవముగల దేవుని యొక్క ఆత్మతో, రాతి యొక్క పలకల మీద కాదు అయితే శరీరం యొక్క హృదయముల యొక్క పలకల మీద. 4 ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకు ఇటువంటి నమ్మకము కలదు. 5 మా నుండి ఏదైనా అయినట్లుగా ఆలోచించడానికి మా నుండి మేము సమర్థులము అని కాదు. బదులుగా, మా సామర్థ్యము దేవుని నుండి {ఉంది}. 6 ఆయనే నిజానికి మమ్మును క్రొత్త నిబంధన యొక్క పరిచారకుల {వలే} సమర్ధులను చేసాడు, అక్షరమునకు కాదు అయితే ఆత్మకే; ఎందుకంటే అక్షరము చంపును, అయితే ఆత్మ జీవింప చేయును. 7 ఇప్పుడు ఈ మరణము యొక్క పరిచర్య - రాళ్ల మీద అక్షరములలో చెక్కబడి - మహిమలో వచ్చినదైన యెడల, తద్వారా ఇశ్రాయేలు యొక్క కుమారులు మోషే యొక్క ముఖము వైపు అతని ముఖము యొక్క వాడిపోయే మహిమ యొక్క కారణంగా తేరి చూడలేకపోయారు. 8 ఆత్మ యొక్క పరిచర్య అత్యధికమైన మహిమతో ఏ విధంగా ఉండదు? 9 ఎందుకంటే ఈ శిక్ష యొక్క పరిచర్యయే మహిమ {కలిగినదైన} యెడల, ఈ నీతి యొక్క పరిచర్య మరింత అధికమైన మహిమలో విస్తరిస్తుంది. 10 ఎందుకంటే నిజానికి అత్యధికమైన మహిమ కారణంగా మహిమ పరచబడినది ఈ భాగంలో మహిమపరచబడ లేదు. 11 ఎందుకంటే వాడి పోవు చున్నది మహిమతో {వచ్చిన} యెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై {వచ్చును}. 12 కాబట్టి, అటువంటి ఒక నిరీక్షణ కలిగియుండి, మేము బహు ధైర్యముతో నడుచుచున్నాము. 13 మరియు ఇశ్రాయేలు యొక్క కుమారులు వాడి పోవుచున్న {దాని} యొక్క అంతము వైపు తేరిచూడకుండ ఉండు నిమిత్తము మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనినట్టు వలే కాదు. 14 అయితే వారి మనస్సులు కఠినములాయెను, ఎందుకంటే ప్రస్తుత దినము వరకు, అదే ముసుకు నిలిచియున్నది, పాతనిబంధన చదువబడునప్పుడు, ఎత్తివెయ్యబడలేదు, ఎందుకంటే క్రీస్తులో ఇది వాడి పోయింది. 15 అయితే ఈ నాటి వరకు, మోషే చదవబడినప్పుడు, ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, 16 అయితే ఎప్పుడైనను ఒకడు ప్రభువు వైపునకు తిరుగునో, ముసుకు తీసివేయబడును. 17 ఇప్పుడు ప్రభువే ఆత్మయై ఉన్నాడు, మరియు ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ {ఉండునో} స్వాతంత్యము {అక్కడ ఉండును}. 18 ఇప్పుడు మనం అందరము, ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను ప్రతిబింబిస్తున్నాము, మహిమ నుండి మహిమకు, ఆత్మ, ప్రభువు నుండి అన్నట్టు వలే అదే స్వరూపం లోనికి మార్చబడుచున్నాము.
Chapter 4
1 కాబట్టి, ఈ పరిచర్య కలిగియుండి, మనం కరుణ పొందిన విధంగా, మనం అధైర్యపడము. 2 బదులుగా, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము, కపటములో నడుచుకొనకుండా, లేదా దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధింపకుండా, అయితే సత్యము యొక్క ప్రత్యక్షత చేత, ప్రతి మనుష్యుని మనస్సాక్షికి మమ్మును మేమే దేవుని యెదుట మెప్పించుకొనుచున్నాము. 3 అయితే మా సువార్త మరుగుచేయ బడిన యెడల, అది నశించుచున్నవారికి మరుగుచేయబడియున్నది. 4 వారికి ఈ యుగము యొక్క దేవత అవిశ్వాసులైనవారి యొక్క మనసులకు గ్రుడ్డితనము కలుగ జేసెను, తద్వారా దేవుని యొక్క స్వరూపియై యున్న క్రీస్తు యొక్క మహిమ యొక్క సువార్త యొక్క ప్రకాశము {వారికి} ప్రత్యక్షం కాలేదు. 5 ఎందుకంటే మమ్మును మేము ప్రకటించుకొనుట లేదు, అయితే ప్రభువు క్రీస్తు యేసు మరియు యేసు నిమిత్తము మేము మీ పరిచారకులము {వలె}. 6 ఎందుకంటే "అంధకారము నుండి ఒక వెలుగు ప్రకాశించును." అని పలికిన వాడు దేవుడే, ఆయన యేసు క్రీస్తు ముఖములో దేవుని యొక్క మహిమ యొక్క జ్ఞానము యొక్క ప్రకాశము కోసం మా హృదయములలో ప్రకాశించాడు. 7 అయితే మట్టి పాత్రలలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, తద్వారా శక్తి యొక్క అత్యధిక బలప్రభావం దేవుని నుండి ఉంటుంది మరియు మా నుండి కాదు. 8 ప్రతి {వైపు}లో అణచి వెయ్యబడ్డాము, అయితే నలిగి పోలేదు; కలవరపడ్డాము, అయితే నిరాశ చెందడం లేదు; 9 హింసించబడుచున్నాము, అయితే విడిచిపెట్టబడ లేదు; క్రిందకు విసిరివేయబడ్డాము, అయితే నశింఛిపోవడం లేదు. 10 యేసు యొక్క మరణమును శరీరములో ఎల్లప్పుడు భరిస్తూ ఉన్నాము తద్వారా యేసు యొక్క జీవం కూడా మా శరీరంలో బయలుపరచ బడుతుంది. 11 ఎందుకంటే సజీవులమై ఉన్న మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము తద్వారా యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరములో బయలుపరచబడుతుంది. 12 కాబట్టి అప్పుడు, మాలో మరణము, అయితే మీలో జీవమును పని చేస్తూ ఉన్నాయి. 13 అయితే "నేను విశ్వసించితిని; కాబట్టి నేను మాటలాడితిని," అని వ్రాయబడిన {దాని} ప్రకారము అదే విశ్వాసం యొక్క ఆత్మను కలిగియుండి మేము కూడా విశ్వసించాము; కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాము, 14 యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడ లేపును మరియు {మమ్మును} మీతో నిలువ బెట్టును అని యెరిగియున్నాము. 15 ఎందుకంటే ఈ సమస్తమైన {సంగతులు} మీ నిమిత్తమై యున్నవి తద్వారా కృప, ఎక్కువ మంది మరియు ఎక్కువ మంది {మనుష్యుల} ద్వారా విస్తరించి, దేవుని యొక్క మహిమకు కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయును. 16 కాబట్టి మేము నిరుత్సాహపడము. బదులుగా, మా బాహ్య పురుషుడు సహితం కృశించుచున్నను, అయినను మా ఆంతర్య {పురుషుడు} దిన దినము నూతన పరచబడుచున్నాడు. 17 ఎందుకంటే మా క్షణికమైన, చులకనైన బాధ సమస్త పోలికకు ఎంతో మించిపోయే శాశ్వత మహిమ యొక్క భారాన్ని మాలో కలిగిస్తూ ఉన్నాయి. 18 మేము కనిపిస్తూ ఉన్న సంగతులను చూడడం లేదు, అయితే కనిపించని సంగతులను. ఎందుకంటే కనిపిస్తూ ఉన్న సంగతులు తాత్కాలికంగా {ఉంటాయి}, అయితే కనిపించని సంగతులు శాశ్వతమైనవై {ఉంటాయి}.
Chapter 5
1 ఎందుకంటే ఈ గుడారము యొక్క మన భూసంబంధమైన ఇల్లు శిథిలమైపోయిన యెడల, మనము దేవుని నుండి ఒక నివాసము కలిగియున్నాము, పరలోకములలో నిత్యమైన నివాసము, చేతులతో చేసినది కాదు అని మేము యెరిగి యున్నాము. 2 ఎందుకంటే, నిజానికి ఈ {ఇంటి} లో మనము మూలుగుచున్నాము, పరలోకము నుండి {ఉన్న} మన నివాసముతో పూర్తిగా వస్త్రము ధరించుకొనినవారముగా ఉండుటకు అపేక్షించుచున్నాము. 3 మరియు నిజముగా మనలను మనం వస్త్రం ధరింప చేసుకొన్న యెడల, మనము దిగంబరులముగా కనబడము. 4 ఎందుకంటే నిజానికి, ఈ గుడారంలో ఉన్న మనం, మూలుగుతున్నాము, భారంగా ఉన్నాము, మనం వస్త్రాలు ధరించకుండా ఉండాలని కాదు అయితే పూర్తిగా వస్త్రాలు ధరింపబడి ఉండాలని మనం కోరుతున్నాము తద్వారా చావుకు లోనయ్యేది జీవం చేత మింగివేయబడుతుంది. 5 ఇప్పుడు ఈ అవశ్యమైన సంగతి కోసం మనలను సిద్ధపరచినవాడు దేవుడే, ఆయన ఆత్మ యొక్క ముందు చెల్లింపు మనకు అనుగ్రహించాడు. 6 కాబట్టి, ఎల్లప్పుడూ ధైర్యముగా యున్నాము మరియు దేహములో ఇంటి వద్ద ఉన్నాము, ప్రభువు నుండి దూరముగా ఉన్నాము అని యెరిగియున్నాము. 7 ఎందుకంటే మేము విశ్వాసము చేత నడచుచున్నాము, కంటి చూపు చేత కాదు. 8 ఇప్పుడు మేము ధైర్యముగా ఉన్నాము మరియు దేహము నుండి దూరంగా ఉండడం కంటే మరియు ఇంటి వద్ద ప్రభువుతో ఉండడం ఇది మంచిది అని తలస్తున్నాము. 9 మరియు కాబట్టి ఇంటి వద్ద ఉన్నను లేదా దూరముగా ఉన్ననూ ఆయనకు చాలా ఇష్టులమై ఉండడానికి మేము అపేక్షించుచున్నాము. 10 ఎందుకంటే మనము అందరం క్రీస్తు యొక్క న్యాయ పీఠము ఎదుట బయలు పరచబడవలసిన అవసరం ఉంది తద్వారా ప్రతి వాడు తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను లేదా చెడ్డవైనను, దేహము ద్వారా {జరిగించిన సంగతులను} తిరిగి పొందుతారు. 11 కాబట్టి, ప్రభువు యొక్క భయము నెరిగి, మేము మనుష్యులను ప్రేరేపించుచున్నాము. అయితే మేము దేవుని చేత మేము స్పష్టంగా యెరుగబడిన వారము, మరియు మీ మనస్సాక్షులలో కూడ స్పష్టంగా ఉండడానికి నేను నిరీక్షించు చున్నాను. 12 మేము మీ యెదుట మరల మమ్మును మేమే మెప్పించుకొనుట లేదు, అయితే మా పక్షముగా అతిశయించడం యొక్క అవకాశమును మీకు ఇస్తున్నాము తద్వారా హృదయములో కాకుండా మరియు పైరూపములో అతిశయపడు వారి కోసం మీరు {ఒక జవాబు} కలిగియుంటారు. 13 ఎందుకంటే మేము మతి తప్పిన వారమైన యెడల, {ఇది} దేవుని కోసం; మేము స్వస్థ బుద్ధిగలవారమైన యెడల {ఇది} మీ కోసమై ఉంది. 14 ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ మమ్మును నియంత్రిస్తుంది, దీనిని తీర్పు తీర్చింది: ఆయన అందరి కోసం మరణించాడు; కాబట్టి అందరు మరణించారు. 15 మరియు ఆయన అందరి కోసం మరణించాడు తద్వారా జీవించువారు ఇక మీదట తమ కోసం జీవించకూడదు, అయితే తమ కోసం మృతి పొంది మరియు తిరిగి లేచినవాని కోసమే. 16 కాబట్టి, ఇప్పటి నుండి మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండిన యెడల, అయినను ఇప్పుడు ఇకమీదట ఆయనను {ఆ విధంగా} యెరుగము. 17 కాబట్టి, ఎవడైనను క్రీస్తులో {ఉన్న} యెడల, {అతడు} నూతన సృష్టియై ఉన్నాడు. పాత సంగతులు గతించెను, ఇదిగో క్రొత్త సంగతులు వచ్చాయి. 18 ఇప్పుడు ఈ సంగతులు అన్నీ దేవుని నుండి {ఉన్నాయి}, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొన్నాడు మరియు ఈ సమాధానపరచడం యొక్క పరిచర్యను మాకు అనుగ్రహించెను. 19 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారికి వ్యతిరేకముగా లెక్కించక, క్రీస్తులో లోకమును తనతో సమాధానపరచుకొనుచున్నాడు, మరియు సమాధానపరచు వాక్యమును మాలో ఉంచాడు. 20 కాబట్టి, దేవుడు మా ద్వారా వేడుకొనుచున్నాడన్నట్టు వలె మేము క్రీస్తు పక్షముగా రాయబారులమై ఉన్నాము: క్రీస్తు పక్షముగా {మిమ్మును} బతిమాలుకొనుచున్నాము. "దేవునితో సమాధానపడుడి!" 21 పాపము యెరుగని ఆయనను మన కోసం ఆయన పాపముగా చేసాడు, తద్వారా మనం ఆయనలో దేవుని యొక్క నీతి అవుతాము.
Chapter 6
1 ఇప్పుడు {ఆయన}తో కలిసి పనిచేయుచున్నాము, దేవుని యొక్క కృపను మీరు వ్యర్థముగా పొంద వద్దు అని మేము కూడా మిమ్మును వేడుకొనుచున్నాము 2 ఎందుకంటే ఆయన చెప్పుచున్నాడు,
అనుకూల సమయము నందు నీ ప్రార్థన నేను విన్నాను,
మరియు రక్షణ దినములో నేను నీకు సహాయం చేసాను."
ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయము. చూడండి , ఇప్పుడే రక్షణ యొక్క దినమై ఉంది.
3 ఏ విషయములోనైనను అభ్యంతరము కోసం ఏ కారణం ఇవ్వడం లేదు తద్వారా మా పరిచర్య నిందింపబడకుండు ఉంటుంది. 4 బదులుగా, మేము ప్రతి దానిలో దేవుని యొక్క సేవకులము వలే మమ్మును మేము మెచ్చుకొంటున్నాము: చాలా సహనములో, శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, 5 దెబ్బలలో, చెరసాలలలో, అల్లరులలో, కఠిన ప్రయాసములలో, జాగరములలో {రాత్రులు}, ఆకలిలో, 6 పవిత్రతలో, జ్ఞానములో, దీర్ఘ శాంతములో, దయలో, పరిశుద్ధ ఆత్మలో, నిష్కపటమైన ప్రేమలో, 7 సత్యము యొక్క వాక్యములో, దేవుని యొక్క శక్తిలో, కుడి మరియు యెడమ చేతి {కోసం} నీతి యొక్క ఆయుధముల ద్వారా, 8 ఘనత మరియు ఘనహీనత ద్వారా, చెడ్డ నివేదిక మరియు మంచి నివేదిక ద్వారా; మోసగాండ్రము వలె, అయినప్పటికీ సత్యవంతులము; 9 తెలియబడని వారమైనట్టు వలే ఉండియు, అయినప్పటికీ బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్టు వలే ఉండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షించబడినవారమైనట్టు వలే ఉండియు, అయినప్పటికీ చంపబడనివారము; 10 దుఃఖపడిన వారమైనట్లు వలే ఉండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లు వలే ఉండియు, అయితే అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయుచున్నాము, ఏమియు లేనివారమైనట్లు వలే ఉండియు, అయినప్పటికీ సమస్తమును కలిగినవారము. 11 కొరింథీయులారా, మీ వైపు మా నోరు తెరువబడింది; మా హృదయము విశాలముగా తెరువబడింది. 12 మీరు మా చేత పరిమితం చెయ్యబడలేదు, అయితే మీరు మీ ఆప్యాయతల చేత పరిమితం చెయ్యబడ్డారు. 13 మరియు అదే వినిమయంలో - పిల్లలతో వలే నేను మాట్లాడుచున్నాను - మిమ్మల్ని మీరు కూడా విశాలపరచుకొనుడి. 14 అవిశ్వాసులతో కలిసి జోడుగా ఉండ వద్దు, ఎందుకంటే నీతి మరియు దుర్నీతి ఏమి భాగస్వామ్యం {ఉంది}? లేదా చీకటితో వెలుగు ఏమి సహవాసం {కలిగి} {ఉంది}? 15 మరియు క్రీస్తు బెలియాలుతో ఏమి పొందిక {కలిగి} {ఉన్నాడు}? లేదా ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో ఏమి భాగం {కలిగి} {ఉన్నాడు}? 16 మరియు దేవుని యొక్క ఆలయము విగ్రహములతో ఏమి అంగీకారం {కలిగి} {ఉంది}? ఎందుకంటే మనము జీవముగల దేవుని యొక్క ఆలయమై యున్నాము; దేవుడు చెప్పిన విధముగా:
"నేను వారి మధ్య నివసిస్తాను, మరియు {వారి మధ్య} నడుస్తాను;
మరియు నేను వారి దేవుడనై యుందును,
మరియు వారు తామే నా ప్రజలైయుందురు.
17 కాబట్టి,
వారి మధ్య నుండి బయటకు రండి,
మరియు ప్రత్యేకముగా ఉండుడి," ప్రభువు చెప్పుచున్నాడు.
"మరియు అపవిత్రమైనదానిని ముట్ట వద్దు,"
మరియు "నేను మిమ్మును చేర్చుకొందును."
18 మరియు
"నేను మీకు తండ్రి వలే యుందును,
మరియు మీరు నాకు కుమారులు మరియు కుమార్తెలు వలె యుందురు,"
సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
Chapter 7
1 కాబట్టి, ప్రియులారా, ఈ వాగ్దానములు కలిగియుండి, మనం దేవుని యొక్క భయములో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరము మరియు ఆత్మ యొక్క సమస్త కల్మషము నుండి మనలను మనం శుద్ధి చేసుకొందాము. 2 మా కోసం స్థలం సిద్ధం చెయ్యండి! మేము ఎవరికీ తప్పు చెయ్యలేదు; మేము ఎవనిని నాశనం చెయ్యలేదు; ఎవని విషయంలోనూ అన్యాయమైన ప్రయోజనం పొందలేదు. 3 నేను మీ శిక్ష కోసం మాట్లాడడం లేదు; ఎందుకంటే కలిసి చనిపోవడానికి మరియు జీవించడానికి మీరు మా హృదయములలో ఉన్నారు అని నేను ఇంతకుముందే చెప్పాను. 4 మీలో నా ధైర్యం గొప్పదిగా {ఉంది}. మీ పక్షముగా నా అతిశయం గొప్పదిగా {ఉంది}. నేను ప్రోత్సాహంతో నింపబడి ఉన్నాను. మా శ్రమలు అన్నిటిలో ఈ సంతోషంతో నేను ఉప్పొంగుచున్నాను. 5 ఎందుకంటే మాసిదోనియకు వచ్చినప్పుడు సహితం, మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. అయితే {మేము} ప్రతి {విధానము}లో శ్రమపెట్టబడి - శ్రమలు లేకుండా, లోపట భయములు ఉండెను. 6 అయితే దీనులను ఆదరించు దేవుడు తీతు రాక చేత మమ్మును ఆదరించెను. 7 మరియు అతని రాక చేత మాత్రమే కాదు, అయితే అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును {మరియు} నా విషయమై మీ అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ చేత ఆదరించబడిన ఆదరణ చేత తద్వారా నేను మరి ఎక్కువగ సంతోషించేలా చేసింది. 8 ఎందుకంటే నేను పత్రికలో సహితం మిమ్మును దుఃఖపెట్టిన యెడల, నేను {దాని విషయంలో} విచారపడను. నేను {దాని గురించి} పశ్చాత్తాపపడుతున్నప్పటికీ (ఆ ఉత్తరం మీకు బాధ కలిగించిందని నేను చూస్తున్నాను, ఒక గంట మాత్రమే), 9 ఇప్పుడు, మీరు దుఃఖించుచున్నారు అని కాదు, అయితే పశ్చాత్తాపం {యొక్క అంచు}కు మీరు దుఃఖించారు అని. నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే మీరు దేవుని చిత్తానుసారముగా దుఃఖపడితిరి తద్వారా మీరు ఏ విషయములోనైనను మా ద్వారా మీరు నష్టము పొందకూడదు. 10 ఎందుకంటే దేవుని విషయంలో దుఃఖము విచారము లేకుండా రక్షణ వైపుకు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. అయితే లోకము యొక్క దుఃఖము మరణమును కలుగజేయును. 11 ఎందుకంటే ఇదిగో ఇదే సంగతి మీలో ఎంత ఆసక్తిని కలిగించింది, దేవుని విషయంలో దుఃఖముగా ఉండడానికి: ఎటువంటి ప్రతివాదము, ఎటువంటి కోపము, ఎటువంటి భయం, ఎటువంటి హృదయాభిలాష, ఎటువంటి ఆసక్తి, {మరియు} ఎటువంటి ప్రతిక్రియ! ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు నిర్దోషులుగా ఈ విషయంలో రుజువు పరచుకొన్నారు. 12 కాబట్టి నేను మీకు వ్రాసినప్పటికీ, ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము కాదు లేదా అన్యాయము పొందినవాని నిమిత్తము కాదు, అయితే తద్వారా మా పక్షముగా {ఉన్న} మీ ఆసక్తి దేవుని యెదుట మీకు బయలుపరచబడునట్లు {ఇది రాయబడింది.} 13 దీని కారణంగా మేము ప్రోత్సహించబడ్డాము.
ఇప్పుడు మా సొంత ప్రోత్సాహానికి అదనంగా, మేము తీతు యొక్క సంతోషం యెడల సహితం మరి అధికంగా సంతోషించాము, ఎందుకంటే అతని ఆత్మ మీ అందరి చేత విశ్రాంతి పొందింది. 14 ఎందుకంటే మీ గురించి అతనితో నేను ఏ అతిశయపు మాటలు చెప్పిన యెడల, నేను సిగ్గుపరచబడను, అయితే మేము అన్నిటిని మీతో సత్యములో చెప్పిన విధముగా, అదే రీతిలో కూడా మా అతిశయము తీతుతో సత్యముగా మారింది. 15 మరియు మీ యెడల అతని ఆప్యాయతలు మరి విస్తారముగా ఉన్నాయి, మీ అందరి యొక్క విధేయతను, భయము మరియు వణకుతోను అతనిని మీరు ఏవిధంగా చేర్చుకొన్నారో అని జ్ఞాపకముచేసికొనుచున్నాడు. 16 ప్రతివిషయములో మీలో నేను ధైర్యము కలిగియున్నాను అని నేను సంతోషించుచున్నాను.
Chapter 8
1 ఇప్పుడు విశ్వాస సహోదరులారా, మాసిదోనియ యొక్క సంఘముల మధ్య అనుగ్రహింపబడియున్న దేవుని యొక్క కృపను మీకు తెలియజేయుచున్నాము. 2 ఏలాగనగా, తీవ్రమైన శ్రమ యొక్క పరీక్ష సమయంలో, వారి యొక్క అత్యధికమైన సంతోషం మరియు వారి లోతైన పేదరికం వారి దాతృత్వం యొక్క సంపదకు విస్తరించింది. 3 ఎందుకంటే తమ సామర్థ్యము ప్రకారము మరియు సామర్థ్యముకు మించి, తమ సొంత ఇష్టము ప్రకారం, {వారు ఇచ్చారు} అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. 4 పరిశుద్ధులకు {ఉన్న} ఈ పరిచర్య యొక్క దయ మరియు సహవాసము {కోసం} వారు మాతో చాలా గట్టిగా వేడుకొన్నారు. 5 మరియు మేము నిరీక్షించిన విధముగా కాదు, అయితే వారు మొదట ప్రభువునకు మరియు దేవుని చిత్తము చేత మాకును, తమ్మును తామే అప్పగించుకొన్నారు. 6 కాబట్టి తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలు పెట్టిన విధముగా ఆలాగున దానిని కూడా మీ కోసం సంపూర్ణము చేయాలి అని మేము అతనిని వేడుకొన్నాము. 7 అయితే మీరు ప్రతి విషయములో, విశ్వాసములో మరియు ఉపదేశములో మరియు జ్ఞానములో మరియు సమస్త జాగ్రత్తలో మరియు మీలో మా నుండి ప్రేమలో విస్తరిస్తున్న విధముగా, అదే విధంగా మీరు ఈ కృప యొక్క చర్యలో అభివృద్ధి చెందాలి. 8 ఇది నేను ఒక ఆజ్ఞగా మీతో చెప్పడం లేదు, అయితే ఇతరుల యొక్క జాగ్రత్త ద్వారా మీ ప్రేమ యొక్క యథార్థతను రుజువుపరచడం కూడా. 9 ఎందుకంటే ఆయన ధనవంతుడై యుండడం {ద్వారా} మీ నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు అని మీరు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు తద్వారా ఆయన దారిద్యము చేత మీరు ధనవంతులు అవుతారు. 10 మరియు దీనిలో నేను నా అభిప్రాయమును మీకు ఇస్తున్నాను, ఎందుకంటే ఇది మీ కోసం ప్రయోజనకరం. ఆయన సంవత్సరము క్రిందటనే యీ కార్యము చేయడానికి ఆరంభించడమే మాత్రమే కాక, అయితే {దీనిని చెయ్యడానికి} కోరిక కూడా. 11 అయితే ఇప్పుడు కూడా మీరు {ఆరంభించిన దానిని} చెయ్యడానికి పూర్తి చెయ్యండి. తద్వారా కోరిక యొక్క సంసిద్ధత {ఉన్న} విధముగా, అదే విధంగా మీరు కలిగిన దాని నుండి సంపూర్తి {అవ్వనివ్వండి}. 12 ఎందుకంటే సంసిద్ధత ఇంతకుముందే ఉన్న యెడల, ఒకనికి కలిగియున్న దాని ప్రకారం {ఇది} సంపూర్తిగా అంగీకారము, అతడు కలిగి లేని దాని ప్రకారం కాదు.
13 ఎందుకంటే {ఇది} కాదు తద్వారా ఇతరుల కోసం ఉపశమనం {ఉంది} {అయితే} మీ కోసం శ్రమ, అయితే సమానత్వం నుండి. 14 ప్రస్తుత సమయంలో మీ సమృద్ధి వారి యొక్క అక్కర కోసం, తద్వారా కూడా వారి యొక్క సమృద్ధి మీ అవసరం కోసం కూడా ఉంటుంది, తద్వారా అక్కడ సమానత ఉంటుంది, 15 ఇది రాయబడిన విధముగా:
హెచ్చుగా {కూర్చుకొనుచున్న} వాడు అధికంగా కలిగియుండడు,
మరియు తక్కువగా {కూర్చుకొనుచున్న} వాడు మరీ తక్కువగా ఉండదు."
16 అయితే దేవునికి స్తోత్రము, ఆయన మీ పక్షముగా తీతు యొక్క హృదయములో అదే ఆసక్తిని ఉంచాడు. 17 ఎందుకంటే అతడు మా మనవిని అంగీకరించడం మాత్రమే కాదు, అయితే చాలా ఆసక్తితో ఉంది, అతడు తన యిష్టము ప్రకారం మీ యొద్దకు బయలుదేరాడు, 18 ఇప్పుడు సువార్తలో అన్ని సంఘములు అన్నిటిలో ప్రసిద్ధిచెందిన అతని విశ్వాస సహోదరుని అతనితో మేము పంపాము. 19 మరియు ఇది మాత్రమే కాదు, అయితే ప్రభువు యొక్క మహిమకు మరియు మన సంసిద్ధతను {చూపడానికి} మా చేత కూడా నిర్వహించబడుతున్న ఈ కృపతో పాటు, మా ప్రయాణపు సహచరుని వలే సంఘముల చేత కూడా అతడు ఏర్పరచబడ్డాడు. 20 దీనిని తప్పించచూ, మన చేత నిర్వహించబడుతున్న ఈ దాతృత్వానికి సంబంధించి ఎవరూ మమ్మును నిందించకుండా ఉంటారు. 21 ఎందుకంటే ప్రభువు ఎదుట మాత్రమే గాక, అయితే మనుష్యుల ఎదుట కూడా మంచిది {అయినదానిని} ముందుగానే మేము ఆలోచించుచున్నాము. 22 ఇప్పుడు వారితో మేము మా సహోదరుని పంపుచున్నాము, మేము అతనిని అనేక విధాలుగా నిరూపించాము, {మరియు} తరచూ ఆసక్తితో ఉన్నాడు. అయితే ఇప్పుడు మీలో {అతడు కలిగియున్న} అతని గొప్ప ధైర్యము {యొక్క కారణంగా} అతడు మరింత ఆసక్తితో ఉన్నాడు. 23 తీతు విషయంలో, {అతడు} మీ కోసం నా పాలివాడు మరియు జత పనివాడునై యున్నాడు. మా సహోదరుల విషయం, {వారు} సంఘముల యొక్క దూతలు, క్రీస్తు యొక్క మహిమనై ఉన్నారు. 24 కాబట్టి, మీ ప్రేమ యొక్క రుజువును మరియు మీ గురించి మా అతిశయమును సంఘముల యొక్క ముఖములకు, వారికి రుజువుపరచండి.
Chapter 9
1 పరిశుద్ధుల కొరకైన { అది} పరిచర్య విషయం కోసం, మీకు రాయడానికి ఇది నాకు అధికమై ఉంది. 2 ఎందుకంటే మీ సంసిద్ధత నేను యెరుగుదును, దాని విషయం గత సంవత్సరము నుండి అకయ సిద్ధపడియున్నది అని నేను మిమ్మును గురించి మాసిదోనియ వారి యెదుట నేను అతిశయపడుచున్నాను, మరియు మీ ఆసక్తి {వారిలో} అనేకులను ప్రేరేపించింది. 3 అయితే నేను సహోదరులను పంపాను తద్వారా మిమ్మును గురించిన మా అతిశయము ఈ విషయములో వ్యర్థము కాదు {మరియు} తద్వారా నేను చెప్పిన విధముగా మీరు సిద్ధముగా ఉంటారు. 4 కాకపోతే, మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారు నాతో వచ్చి మరియు మీరు సిద్ధముగా ఉండకపోవుట కనుగొనిన యెడల, ఈ ధైర్యము చేత - మేము సిగ్గుపరచబడుదుము - మీకు చెప్పనవసరం లేదు. 5 కాబట్టి వారు ముందుగా మీ వద్దకు వెళ్ళాలి మరియు మీ యొక్క వాగ్దానమైన ఈ ఆశీర్వాదాన్ని ముందుగానే సిద్ధం చేసుకోడానికి, బలవంతంగా కాకుండా మరియు ఒక ఆశీర్వాదం వలే ఈ విధానంలో సిద్ధంగా ఉండడానికి నేను సహోదరులను బతిమాలడం ఇది అవసరము అని నేను తలంచాను. 6 ఇప్పుడు దీనిని {నేను చెప్పుచున్నాను}: కొంచెముగా విత్తువాడు కూడా కొంచెముగా పంటకోయును, మరియు ఆశీర్వాదములలో విత్తువాడు కూడా ఆశీర్వాదము పంటకోయును. 7 దుఃఖము నుండి లేదా బలవంతం నుండి కాకుండా ప్రతివాడును తన హృదయములో ముందుగా తాను నిశ్చయించుకొనిన విధముగా ఇయ్యనివ్వండి. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8 మరియు దేవుడు మీకు సమస్త కృపను సమృద్ధిగా విస్తరింప చేయగలడు, తద్వారా ప్రతిదానిలో, ఎల్లప్పుడూ, అన్నిటిలో సమృద్ధిగా ఉండి, ప్రతి మంచి పనిలో మీరు సమృద్ధిగా ఉంటారు. 9 ఇది వ్రాయబడియున్న విధముగా:
"అతడు {ధర్మము} పంచిపెట్టాడు, అతడు పేదలకు ఇచ్చాడు,
అతని నీతి శాశ్వతంగా ఉంటుంది."
10 ఇప్పుడు విత్తువానికి విత్తనమును మరియు ఆహారం కోసం రొట్టె అందించువాడు మీ విత్తనాన్ని దయచేస్తాడు మరియు విస్తరింపచేస్తాడు మరియు మీ యొక్క నీతి ఫలములను వృద్ధిపొందిస్తాడు. 11 మన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగించే సమస్త దాతృత్వము కోసం ప్రతి విధానంలో మిమ్మును బలపరుస్తుంది. 12 ఎందుకంటే ఈ సేవ యొక్క పరిచర్య కారణంగా పరిశుద్ధుల యొక్క అక్కరలకు పూర్తిగా సహాయము కలుగజేయుట మాత్రమే కాకుండ, అయితే అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులతో కూడా విస్తరించుచున్నది. 13 ఈ పరిచర్య యొక్క రుజువు కారణంగా క్రీస్తు యొక్క సువార్తకు మీ ఒప్పుకోలు యొక్క విధేయత మరియు వారి పట్ల మరియు ప్రతి ఒక్కరి పట్ల సహవాసం యొక్క ఔదార్యము ఆధారంగా వారు దేవుని మహిమపరుస్తున్నారు. 14 మరియు మీ పక్షముగా వారి ప్రార్థనలో, మీ మీద దేవుని యొక్క అత్యధికమైన కృప కారణంగా మీ కోసం ఎక్కువ కోరిక గలవారై యున్నారు. 15 చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
Chapter 10
1 ఇప్పుడు నేను, పౌలును, నేనే మీ మధ్య ముఖా ముఖిగా {ఉన్నప్పుడు} సాత్వీకంగా {ఉన్నాను}, అయితే లేకుండా ఉన్నప్పుడు, మీ యెడల ధైర్యముగా ఉన్నాను - క్రీస్తు యొక్క సాత్వికము మరియు మృదుత్వము చేత మిమ్మును వేడుకొనుచున్నాను. 2 ఇప్పుడు వచ్చినప్పుడు, శరీర ప్రకారము నడుచుకొను విధముగా మమ్మును భావించే కొందరికి వ్యతిరేకంగా ధైర్యంగా ఉండడానికి నేను ప్రణాళిక చేస్తున్న ఆత్మవిశ్వాసంతో {నేను} ధైర్యంగా ఉండడానికి నాకు అవసరం లేదు అని నేను బతిమాలుకొనుచున్నాను. 3 ఎందుకంటే శరీరములో నడుచుకొనుచున్నప్పటికీ, మేము శరీరప్రకారము యుద్ధము చేయము. 4 ఎందుకంటే మా యుద్ధము యొక్క ఆయుధములు శరీరసంబంధమైనవి కావు, అయితే దుర్గములను కూల్చివేయడం, వ్యూహాలను కూల్చివేయడం కోసం దేవునికి శక్తివంతమైనవి. 5 మరియు ప్రతి ఉన్నతమైన విషయం దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా దానిని పైకి పెంచుకుంటుంది, మరియు మేము ప్రతి ఆలోచనను క్రీస్తు యొక్క విధేయతలోనికి చెఱలో ఉంచుతున్నాము. 6 మరియు మీ విధేయత సంపూర్ణము అయినప్పుడు, అవిధేయత యొక్క ప్రతి చర్యకు ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధబాటులో యున్నాము. 7 మీరు స్వరూపము ప్రకారం సంగతులను చూడండి. తాను క్రీస్తు సంబంధుడని ఎవడైనను తనలో తాను ఒప్పించబడిన యెడల, అతడు తన గురించి మరల ఆలోచించుకొననివ్వండి. అతడు క్రీస్తువాడై {ఉన్న} విధముగా మేమును {ఉన్నాము} 8 ఎందుకంటే మిమ్మును కూల్చివేయడం కోసం కాకుండా మరియు కట్టడం కోసం ప్రభువు ఇచ్చిన మా అధికారాన్ని గురించి ఒకవేళ నేను అధికంగా అతిశయపడిన యెడల, నేను సిగ్గుపరచబడను. 9 తద్వారా నా పత్రికల ద్వారా మిమ్మును నేను భయపెట్టవలెనని ఉన్నట్టు కనబడకుండ ఉంటాను. 10 ఎందుకంటే {ఒకరు} చెప్పును, "నిజానికి, అతని పత్రికలు ఘనమైనవై మరియు బలమైనవి {ఉన్నాయి}, అయితే {అతని} శరీర రూపము బలహీనమై {ఉంది}, మరియు అతని ప్రసంగము అలక్ష్యము చేయబడినది. 11 అటువంటి {ఒక వ్యక్తి} దీనిని తలంచుకొననివ్వండి, పత్రికల ద్వారా మా మాటలో మేము లేనప్పుడు, మా క్రియలో కూడా అటువంటి వారముగా {మేము ఉన్నాము}. 12 ఎందుకంటే తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనడం లేదా సరిచూచుకొనడానికి మేము తెగింపజాలము. అయితే ఇవి - తమను తాము కొలుచుకోవడం మరియు తమతో తమను తాము పోల్చుకోవడం చేత - గ్రహింపులేక యున్నారు. 13 మేము, అయితే, మేము అపరిమితమైన సంగతులకు గురించి అతిశయపడము, అయితే దేవుడు మాకు నియమించిన దాని పరిమితి యొక్క కొలత ప్రకారం, మీ వరకు కూడా చేరిన కొలత. 14 ఎందుకంటే మేము మీ యొద్దకు రానివారమైనట్టు ఉన్నప్పటికీ మేము దాటి వెళ్లడం లేదు, ఎందుకంటే మేము క్రీస్తు యొక్క సువార్తతో మీ వద్దకు మేము వచ్చియుంటిమి, 15 మేము ఇతరుల ప్రయాసల గురించి {మా} పరిమితులకు మించి మేము అతిశయ పడము అయితే మీ విశ్వాసము {కోసం} నిరీక్షణ కలిగియుండి సమృద్ధికి మా పరిమితి ప్రకారం మీ మధ్య విస్తరించబడడానికి కారణమైంది. 16 మీకు ఆవతల {ప్రదేశములలో} సువార్త ప్రకటించడానికి - మరియొకని ప్రాంతంలో నెరవేరిన సంగతులలో అతిశయించ వద్దు. 17 అయితే "అతిశయించువాడు ప్రభువులో అతిశయింపనివ్వండి."
18 ఎందుకంటే తన్ను తానే మెచ్చుకొనువాడు ఆమోదింపబడిన వాడు కాదు. అయితే ప్రభువు మెచ్చుకొనువాడే.
Chapter 11
1 కొంచెము బుద్ధిహీనతలో నాతో మీరు సహింపవలెను అని నేను కోరుచున్నాను, అయితే నిజానికి మీరు నాతో సహిస్తున్నారు! 2 ఎందుకంటే నేను దైవికమైన అసూయతో మీ {కోసం} అసూయ కలిగి ఉన్నాను, ఎందుకంటే క్రీస్తుకు పవిత్రమైన కన్య {వలే} {మిమ్మల్ని} సమర్పించడానికి నేను మిమ్మును ఒక్కడే భర్తకు కలిపాను. 3 అయితే సర్పము తన కపటము చేత హవ్వను మోసపరచిన విధముగా మీ మనస్సులు యధార్ధత మరియు క్రీస్తు ఎడల {ఉన్న} పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవును అని నేను భయపడుచున్నాను. 4 ఎందుకంటే వచ్చుచున్న వాడు నిజానికి మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించిన యెడల, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినయెడల, లేక మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించి యెడల, మీరు {దానితో} బాగుగా సహిస్తున్నారు. 5 ఎందుకంటే నేను {నన్ను నేను} "మిక్కిలి శ్రేష్ఠులైన - అపొస్తలుల కంటె తక్కువవాడను కాను అని తలంచుకొనుచున్నాను. 6 అయితే ఈ మాటలో నేను నేర్పులేనివాడనైన యెడల, అయినప్పటికీ ఈ జ్ఞానములో కాదు, అయితే అన్ని సంగతులలో మీకు ప్రతి దానిలో దీనిని స్పష్టంగా కనుపరచియున్నాము. 7 లేదా నేను దేవుని యొక్క సువార్తను జీతము లేకుండా మీకు కూడా ప్రకటించిన కారణంగా, మీరు హెచ్చింపబడునట్లు నన్ను నేను తగ్గించుకొని పాపము చేశానా? 8 మీకు పరిచర్య కోసం జీతము అంగీకరించి, నేను ఇతర సంఘములను దోచుకున్నాను. 9 మరియు నేను మీ యొద్దనున్నప్పుడు - ఏమియూ కొదువ లేకుండా ఉన్నాను - మరియు నేను ఎవని మీదను భారము మోపలేదు. ఎందుకంటే మాసిదోనియ నుండి వచ్చిన నహోదరులు నా అక్కర పూర్తిగా తీర్చారు, మరియు ప్రతి విషయంలో మీకు భారంగా ఉండడం నుండి నన్ను నేను కాపాడుకోవడానికి మరియు {కొనసాగిస్తాను}. 10 క్రీస్తు యొక్క సత్యము నాలో ఉన్నది, తద్వారా అకయ యొక్క ప్రాంతములలో ఈ అతిశయం నాకు మూసివేయబడదు. 11 ఎందుకు? నేను మిమ్మును ప్రేమించని కారణంగా? {నేను చేస్తాను} దేవునికి తెలుసు!
12 అయితే నేను చేయుచున్న దానిని నేను ఆ విధంగా చెయ్యడం {కొనసాగిస్తాను} కూడా తద్వారా వారు అతిశయపడు వాటిలో తాము మేము కూడా {ఉన్న} విధంగా కనుగొనబడాలి అని ఒక అవకాశాన్ని కోరుకొనువారి యొక్క అవకాశాన్ని నేను లేకుండా చేస్తాను. 13 ఎందుకంటే అటువంటి వారు అబద్దపు అపొస్తలులు, మోసపూరిత పనివారునై యున్నారు, క్రీస్తు యొక్క అపొస్తలుల {వలే} తమకు తాము వేషము వేసుకున్నారు. 14 మరియు ఇది ఆశ్చర్యము కాదు, ఎందుకంటే సాతాను తానే వెలుగు యొక్క దూత {వలే} వేషము ధరించుకొనుచున్నాడు. 15 కాబట్టి వాని పరిచారకులు కూడా నీతి యొక్క పరిచారకుల వలే వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి అంతము ఉంటుంది.
16 నేను మరల చెప్పుచున్నాను: నేను అవివేకినై ఉన్నానని ఏ ఒక్కరూ తలంచవద్దు. అయితే కాని యెడల నన్ను కనీసం ఒక అవివేకి వలే స్వీకరించండి, తద్వారా నేను కూడా కొంచెం అతిశయపడతాను. 17 నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము నేను చెప్పుటలేదు అయితే బుద్దిహీనతలో వలే, అతిశయము యొక్క ఈ ధైర్యములో. 18 అనేకులు శరీర ప్రకారముగా అతిశయపడుచున్నారు గనుక నేను కూడా అతిశయపడుదును. 19 ఎందుకంటే మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. 20 ఎందుకంటే ఒకడు మిమ్మును బానిసలుగా చేసిన యెడల, ఒకడు మిమ్మును మ్రింగివేసిన యెడల, ఒకడు {మీ నుండి} ప్రయోజనం పొందిన యెడల, ఒకడు తన్ను గొప్పచేసికొనిన యెడల, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టిన యెడల, మీరు {దాని}తో సహిస్తున్నారు. 21 అవమానము ప్రకారం {దాని కోసం} వలే నేను మాట్లాడుతున్నాను, అంటే మేము బలహీనులమై ఉన్నాము! అయితే, ఏ {విధానములో} అయినా ఎవడైన ధైర్యము కలిగి ఉంటాడు - నేను అవివేకముగా మాటలాడుచున్నాను - నేను కూడ ధైర్యము కలిగినవాడను. 22 వారు హెబ్రీయులా? నేను కూడా. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా. వారు అబ్రాహాము యొక్క సంతానమా? నేను కూడా. 23 వారు క్రీస్తు పరిచారకులా? (నేను వెఱ్ఱివాని {వలె} మాటలాడుచున్నాను.) నేను మరి యెక్కువగా ఉన్నాను: మరి విస్తారముగా కఠిన ప్రయాసలో, మరి విస్తారముగా ఖైదులలో, అపరిమితముగా దెబ్బలు తినడంలో, తరచుగా మరణముల {యొక్క ప్రమాదము}లో. 24 యూదుల నుండి అయిదు మారులు ఒకటి తక్కువ 40 {దెబ్బలు} నేను పొందాను. 25 మూడు సార్లు నేను బెత్తములతో కొట్టబడ్డాను. ఒకసారి నేను రాళ్లతో కొట్టబడ్డాను. మూడు సార్లు నేను ఉన్న ఓడ పగిలిపోయింది. ఒక రాత్రి మరియు ఒక పగలు లోతులో గడిపాను; 26 తరచూ ప్రయాణములలో, నదుల నుండి ఆపదలలో, దోపీడీ దారుల నుండి ఆపదలలోను, {నా సొంత} స్వజనుల నుండి ఆపదలలో, యూదేతరుల నుండి ఆపదలలో, నగరములో ఆపదలలో, అరణ్యములో ఆపదలలో, సముద్రము వద్ద ఆపదలలో, కపట సహోదరుల నుండి ఆపదలలో; 27 శ్రమలో మరియు కష్టములో, తరచుగా నిద్రలేమిలో, ఆకలి మరియు దాహంలో, తరచుగా ఉపవాసంలో, చలి మరియు దిగంబరత్వములో; 28 ఇతర సంగతులతో పాటు సంఘములు అన్నిటి యొక్క చింత, ప్రతి దినం నా కోసం {ఉంది}. 29 ఎవడు బలహీనుడై ఉన్నాడు, మరియు నేను బలహీనుడను కానా? తొట్రుపడడానికి ఎవరు కారణమై ఉన్నారు, మరియు నేను తగులబెట్టబడలేదా? 30 అతిశయపడడానికి ఇది అవసరమైన యెడల, నేను నా బలహీనత యొక్క సంగతుల {గురించి} అతిశయపడుదును. 31 నేను అబద్దము చెప్పుట లేదు అని నిత్యత్వముకు స్తుతింపబడుచు ఉన్న వాడు, దేవుడు మరియు ప్రభువు యేసు యొక్క తండ్రి ఎరుగును. 32 దమస్కులో అరెత రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను బంధించడానికి దమస్కీయుల యొక్క నగరమును కావలి కాస్తున్నాడు. 33 అయితే నేను ఒక కిటికీ ద్వారా గోడ ద్వారా గంపలో దింపబడ్డాను, మరియు అతని చేతుల నుండి తప్పించుకొన్నాను.
Chapter 12
1 అతిశయపడడానికి ఇది అవసరమై ఉంది. {ఇది} ప్రయోజనకరం కాదు, అయితే నేను ప్రభువు యొక్క దర్శనములు మరియు ప్రత్యక్షతలకు వెళ్ళుదును. 2 క్రీస్తులో ఒక మనుష్యుని నేను యెరుగుదును - అటువంటి ఒక {మనుష్యుడు} 14 సంవత్సరముల క్రితం - నేను యెరగను శరీరములో ఉన్న లేదా శరీరము బయట కూడా, మూడవ ఆకాశమునకు కొనిపోబడెనో నేను యెరుగను, దేవుడే యెరుగును. 3 మరియు అట్టి మనుష్యుని నేను యెరుగుదును - . దేహంలో లేదా దేహము బయటా అనేది నాకు తెలియదు, దేవునికి తెలుసు- 4 అతడు పరదైసులోనికి కొనిపోబడి, మరియు ఒక మనుష్యుడు మాట్లాడడానికి అనుమతించబడని పదములను విన్నాడు అని. 5 అటువంటి {మనుష్యుని} పక్షముగా నేను అతిశయింతును. అయితే నా పక్షముగా నా బలహీనతలో తప్పించి నేను అతిశయింపను. 6 ఎందుకంటే అతిశయపడడానికి నేను కోరుకున్న యెడల, నేను అవివేకిని కాకపోదును, ఎందుకంటే నేను సత్యమునే పలుకుదును; అయితే నేను మానుకొనుచున్నాను, {తద్వారా} నాలో చూచినది లేదా నా నుండి వినినదాని కంటే ఎక్కువగా ఎవరూ ఆలోచించరు. 7 మరియు ప్రత్యక్షతల యొక్క అత్యధిక {స్వభావము} కారణంగా, కాబట్టి, తద్వారా నేను అహంకారిగా మారను, శరీరములో ఒక ముల్లు నాకు ఇవ్వబడింది - సాతాను యొక్క దూత - తద్వారా అతడు నన్ను శిక్షిస్తాడు, తద్వారా నేను అధికమైన అహంకారిగా మారాను. 8 దీని గురించి ఆయన {దీనిని} నా నుండి తొలగించాలి అని నేను మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9 అయితే ఆయన నాతో చెప్పాడు, "నా కృప నీకోసం చాలును, ఎందుకంటే {నా} శక్తి బలహీనతలో పరిపూర్ణము చేయబడుతుంది. కాబట్టి నేను నా బలహీనలో మరింత సంతోషంగా అతిశయింతును తద్వారా క్రీస్తు యొక్క శక్తి నాపై నివసిస్తూ ఉంటుంది. 10 కాబట్టి, నేను క్రీస్తు నిమిత్తము బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో మరియు ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను; ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడనై ఉంటానో, అప్పుడే నేను బలవంతుడనై ఉంటాను.
11 నేను అవివేకిగా మారాను; మీరే నన్ను బలవంతము చేసారు. ఎందుకంటే నేను మీచేత మెప్పు పొందవలసినవాడనై ఉన్నాను, ఎందుకంటే నేను ఏమాత్రపువాడను కాకపోయినా కూడా "శ్రేష్ఠులైన అపొస్తలులలో" నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను. 12 నిజానికి అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య కనుపరచబడెను-సూచక క్రియలు మరియు ఆశ్చర్యములు మరియు అద్భుతములు రెండు. 13 ఎందుకంటే నా అంతటికి నేను మీకు భారముగా ఉండ లేదు అని తప్పించి మిగిలిన సంఘముల కంటే తక్కువగా మీరు ఏ {విధముగా} చూడబడ్డారు? యీ అన్యాయముకు నన్ను క్షమించుడి! 14 ఇదిగో! యీ మూడవసారి మీయొద్దకు రావడానికి సిద్ధముగా ఉన్నాను, మరియు నేను మీకు భారంగా ఉండను. ఎందుకంటే నేను మీ యొక్క వస్తువులను వెదకను, అయితే మిమ్మును. ఎందుకంటే పిల్లలు తలిదండ్రుల కోసం నిల్వ చెయ్యకూడదు, అయితే తలిదండ్రులు పిల్లల కోసం. 15 ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఖర్చు చేస్తాను మరియు మీ యొక్క ఆత్మల కోసం పూర్తిగా ఖర్చు చేస్తాను. నేను మిమ్మును ఎక్కువ విస్తారముగా ప్రేమించిన యెడల, నేను తక్కువగా ప్రేమించబడతానా? 16 అయితే దానిని {ఆలా} ఉండనియ్యండి, నేనే మీకు భారముగా ఉండ లేదు, అయితే యుక్తిగలవాడనై ఉంది, నేను మిమ్మును మోసము చేత పట్టుకొంటిని. 17 నేను మీ యొద్దకు పంపిన వారు ఎవ్వరూ లేరు, అతని ద్వారా నేను మీ నుండి ప్రయోజనం పొందాను, అక్కడ ఉన్నదా? 18 నేను తీతును {వెళ్లడానికి} బతిమాలాను మరియు {మరొక} సహోదరుని {అతనితో} పంపాను. తీతు మిమ్మల్ని సద్వినియోగం చేసుకుంటే తప్ప? అదే ఆత్మతో మనం నడవలేదా? {మనం} అదే అడుగుజాడల్లో {నడవలేదా?} 19 ఈ సమయం అంతా మమ్మల్ని మేము మీతో వాదించుకొంటున్నాము అని మీరు ఆలోచిస్తున్నారా? క్రీస్తులో దేవుని యెదుట మేము మాట్లాడుచున్నాము. అయితే ప్రియులారా, ఈ సంగతులు అన్నీ మీ క్షేమాభివృద్ధి నిమిత్తం {ఉన్నాయి}. 20 ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినప్పుడు, నేను కోరుకున్న విధముగా నేను మిమ్మల్ని కనుగొనలేకపోవచ్చు అని నేను భయపడుచున్నాను మరియు మీరు కోరుకున్న విధముగా నేను మీ చేత కనుగొనబడకపోవచ్చు; ఒకవేళ కలహమును అసూయయు, క్రోధములును, కక్షలును, కొండెములును పనిలేని మాటలు, హెచ్చించబడిన అహంకారములు. {మరియు} అల్లరులును {ఉంటాయి}. 21 నేను మరల వచ్చినప్పుడు, నా దేవుడు మీ యెదుట నన్ను తక్కువ చేస్తాడు, మరియు ముందు పాపము చేసి మరియు అపవిత్రత మరియు లైంగిక అనైతికత మరియు వారు చేసిన జారత్వము నుండి పశ్చాత్తాపపడని వారిలో అనేక మంది గురించి నేను దుఃఖిస్తాను.
Chapter 13
1 మీ వద్దకు నేను వచ్చుచున్నాను అని ఇది మూడవ {సారి} {అవుతుంది}. "ప్రతి మాట ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల యొక్క నోరు యొక్క ఆధారంగా స్థిరపరచ బడవలెను. 2 రెండవ {సారి} హాజరై యుండినప్పుడు, మరియు లేకుండా ఉండి {నప్పటికీ}, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మునుపటి పాపము చేసిన వారికి మరియు మిగిలిన వారు అందరికి - నేను మరల వచ్చిన యెడల, నేను {ఎవరినీ} విడిచి పెట్టను. 3 క్రీస్తు నాలో మాట్లాడం యొక్క ఋజువు మీరు వెదకుచున్నారు కాబట్టి ఆయన మీ యెడల బలహీనుడు కాడు అయితే, మీ మధ్య శక్తిమంతుడై యున్నాడు. 4 ఎందుకంటే బలహీనత యొక్క ఫలితముగా ఆయన కూడా సిలువవేయబడెను, అయితే దేవుని శక్తి యొక్క ఫలితముగా ఆయన జీవించుచున్నాడు, మేము కూడా అతనిలో బలహీనంగా ఉన్నాము అయితే మీ యెడల దేవుని యొక్క శక్తి ఫలితముగా మేము ఆయనతో జీవించుచున్నాము. 5 మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. లేదా మీరు ఆమోదించబడకపోతే తప్పించి - యేసు క్రీస్తు {మీలో} ఉన్నాడు అని మిమ్మును గురించి దీనిని పూర్తిగా గ్రహించలేదా? 6 మరియు మా మట్టుకు మేము ఆమోదింపబడనివారము కాదు అని మీరు గుర్తిస్తారు అని నేను నిరీక్షించుచున్నాను. 7 ఇప్పుడు మీరు ఏ చెడ్డకార్యమైనను చెయ్యకుండా ఉంటారు అని దేవునికి మేము ప్రార్థించుచున్నాము, మా మట్టుకు మేము ఆమోదించబడినవారి {వలే} కనపడవలెనని కాదు, అయితే తద్వారా మా మట్టుకు మేము ఆమోదించబడనివారి వలే ఉన్న యెడల మీ మట్టుకు మీరు మేలైనదే చేస్తారు. 8 ఎందుకంటే మేము సత్యమునకు వ్యతిరేకంగా ఏమియు చేయలేని వారమై ఉన్నాము, అయితే నేరము గాని, సత్యము యొక్క పక్షముగా. 9 ఎందుకంటే మా మట్టుకు మేము బలహీనులమై యున్నప్పుడు మేము సంతోషిస్తాము అయితే మీరు శక్తివంతులు. దీని కోసం మేము కూడా ప్రార్థించుచున్నాము: మీ పునరుద్ధరణ కోసం. 10 దీని కారణంగా, నేను లేకుండా ఉండి వ్రాయుచున్నాను తద్వారా, హాజరై ఉండి, క్రింద పడద్రోయుట కోసం కాకుండా మరియు కట్టుట కోసం ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము ప్రకారం నేను {మిమ్మును} కఠినముగా చూడను.
11 చివరిగా, క్రైస్తవ సహోదరులారా, సంతోషించుడి, పునరుద్ధరించబడి యుండుడి, ప్రోత్సహించబడి ఉండండి, ఒకేదానిని ఆలోచించండి, సమాధానములో జీవించండి. మరియు ప్రేమ మరియు సమాధానముల యొక్క దేవుడు మీతో ఉంటాడు. 12 పరిశుద్ధమైన ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు చెప్పుకొనుడి. పరిశుద్ధులు అందరు మీకు శుభములు చెప్పుచున్నారు. 13 ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మరియు దేవుని యొక్క ప్రేమ మరియు పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము మీకు అందరితో {ఉంటుంది}.