యాకోబు రాసిన పత్రిక
Chapter 1
1 దేవుని యొక్క మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు, చెదరి ఉన్న పన్నెండు గోత్రములకు: సంతోషించండి! 2 నా సహోదరులారా, మీరు నానా విధములైన శ్రమలలో పడునప్పుడు దానిని అంతటిని ఆనందముగా పరిగణించుడి. 3 మీ విశ్వాసము యొక్క పరీక్ష ఓర్పును కలుగజేయును అని తెలుసుకొనుడి. 4 అయితే ఓర్పు సంపూర్ణ కార్యాన్ని కలిగియుండనివ్వండి, తద్వారా మీరు ఏ విషయములోను కొదువలేకుండా సంపూర్ణంగా మరియు పరిపూర్ణులు అవుతారు. 5 ఇప్పుడు మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న యెడల, వాడు అందరికి దారాళముగా మరియు గద్దించకుండా ఇచ్చువాడు, దేవుని నుండి అడుగనివ్వండి, మరియు అది అతనికి అనుగ్రహించబడును. 6 అయితే, అతనిని విశ్వాసములో అడుగ నివ్వండి, దేనిని సందేహించకుండా, ఎందుకంటే సందేహించు వాడు గాలి చేత త్రోయబడి మరియు యెగిరిపడు సముద్రము యొక్క ఒక కెరటం వలే మారతాడు. 7 కాబట్టి ఆ మనుష్యుడు ప్రభువు నుండి తాను దేనినైనా పొందుదును అని తలంచ నివ్వ వద్దు. 8 ఒక ద్విమనస్కుడైన మనిషి, అతని మార్గములు అన్నిటిలో అస్థిరుడు. 9 ఇప్పుడు దీనుడైన సహోదరుడు అతని ఉన్నత స్థితిలో అతిశయించ నివ్వండి. 10 అయితే ధనవంతుడు అతని దీనస్థితిలో, ఎందుకంటే గడ్డి యొక్క ఒక పువ్వు వలె అతడు గతించిపోతాడు. 11 ఎందుకంటే సూర్యుడు వేడితో ఉదయించును మరియు గడ్డిని ఎండిపోజేయును, మరియు దాని పువ్వు కిందపడిపోవును మరియు దాని ముఖము యొక్క అందము నశించిపోవును. అదేవిధంగా ధనవంతుడు కూడా అతని ప్రయాణములలో వాడిపోవును. 12 పరీక్షను సహించు మనుషుడు ధన్యుడై ఉన్నాడు. ఎందుకంటే, అంగీకరింపబడుటకు అర్హమైనప్పుడు, అతడు జీవ కిరీటమును పొందుకుంటాడు, అది ఆయన తనను ప్రేమించువారికి వాగ్ధానమును చేసినది. 13 ఏ ఒక్కరు శోధించబడినప్పుడు “నేను దేవుని చేత శోధించబడ్డాను," అని పలుకనివ్వ వద్దు, ఎందుకంటే దేవుడు కీడు చేత శోధించ బడడు మరియు ఆయన తానే ఎవరిని శోధించడు 14 అయితే ప్రతివాడు తన సొంత అభిలాష చేత శోధించబడుతున్నాడు, బయటకు ఈడ్వబడుచున్నాడు మరియు మరులుకొలుపబడుచున్నాడు. 15 అప్పుడు అభిలాష, గర్భం దాల్చి, పాపాన్ని కంటుంది, మరియు పాపం, వృద్ధి చెంది, మరణానికి జన్మను ఇస్తుంది 16 నా ప్రియ సహోదరులారా, త్రోవతప్పి ఉండకండి 17 ప్రతి మంచి బహుమానం మరియు ప్రతి సంపూర్ణమైన వరం పైనుండి వెలుగుల యొక్క తండ్రి నుండి కిందకు వస్తుంది, ఆయనతో ఏ మార్పు లేదా తిరగడం యొక్క ఛాయ లేదు. 18 సంకల్పము కలిగియుండి, సత్యము యొక్క వాక్కు చేత ఆయన మనకు జన్మ ఇచ్చాడు, ఆయన సృష్టించిన వాటన్నిటి యొక్క ప్రధమ ఫలములుగా మనం ఉండడం కోసం. 19 నా ప్రియ సహోదరులారా, తెలుసుకొనండి: అయితే ప్రతి మనిషి వినుటకు త్వరపడేవానిగా, మాట్లాడుటకు నెమ్మదిగాను, కోపించుటకు నిదానంగా ఉండనివ్వండి. 20 ఎందుకంటే మనిషి యొక్క కోపము దేవుని యొక్క నీతిని జరిగించదు. 21 కాబట్టి, సమస్త ఆశుద్ధమును మరియు విస్తారమైన దుష్టత్వమును ప్రక్కన పెట్టండి, వినయములో మీ ఆత్మలను రక్షించగల ఆ నాటబడిన వాక్యమును అంగీకరించండి. 22 అయితే మిమ్మును మీరు మోసపుచ్చుకొనక వినువారు మాత్రమే కాదు మరియు వాక్యము ప్రకారము చేసేవారిగా ఉండండి. 23 ఎందుకంటే ఎవరైనా వాక్యమును వినేవారిగా ఉండి మరియు చేయువారుగా ఉండని యెడల, అతడు అద్దములో తన సహజ ముఖమును పరీక్షించుకొను మనిషిని పోలి ఉన్నాడు. 24 ఎందుకంటే అతడు తన్నుతాను పరీక్షించుకొనును మరియు బయటికి వెళ్ళును మరియు వెంటనే అతడు ఏవిధంగా ఉన్నాడో మరచిపోవును. 25 అయితే స్వాతంత్యము యొక్క సంపూర్ణ నియమములోనికి తేరి చూచి మరియు కొనసాగించు వ్యక్తి, మరుపుతో వినువాడుగా మారకుండా, అయితే కార్యాన్ని చేయువాడు, ఈ వ్యక్తి తాను చేస్తున్న దానిలో ఆశీర్వదించబడతాడు. 26 ఎవరైనా భక్తిపరునిగా ఉన్నానని తలంచి, తన నాలుకను కళ్లములో పెట్టుకొనకపోయిన యెడల, అయితే తన హృదయాన్ని మోసపరచుకొనుచున్న అతని యొక్క భక్తి వ్యర్థమే. 27 దేవుడు మరియు తండ్రి యెదుట పవిత్రమైన మరియు శుద్ధమైన భక్తి ఇది: అనాధలు మరియు వితంతువులను వారి కష్టములలో చూడడం, ఈ లోకము చేత నిష్కళంకంగా తననుతాను కాపాడు కొనుటయే.
Chapter 2
1 నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క విశ్వాసమును కలిగియున్నవారముగా పక్షపాతం లేకుండా ఉండండి. 2 ఎందుకంటే బంగారపు ఉంగరాలు కలిగిన వ్యక్తి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని మీ సభలలోనికి ప్రవేశించిన యెడల, మరియు ఒక బీదవాడు కూడా మురికి దుస్తులతో లోపలికి ప్రవేశించినప్పుడు, 3 మరియు మీరు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొనిన వ్యక్తిని చూచి మరియు “మీరు ఇక్కడ చక్కగా కూర్చోండి” అని చెపుతావు, మరియు నీవు బీదవానితో, “నీవు అక్కడ నిలబడు” లేదా “నా పాదపీఠమునకు దిగువను కూర్చో” అని అంటావు, 4 మీ మధ్య మీరు బేధాలు చూపుతున్నారు మరియు దుష్ట తలంపులతో న్యాయనిర్ణేతలు అవ్వడం లేదా? 5 వినండి, నా ప్రియ సహోదరులారా, ఈ లోకములోని పేదవారు విశ్వాసములో ధనవంతులుగా ఉండునట్లు మరియు ఆయనను ప్రేమించు వారికి ఆయన వాగ్ధానము చేసిన రాజ్యము యొక్క వారసులు అని దేవుడు ఏర్పరచుకొనలేదా? 6 అయితే మీరు పేదవారిని అగౌరపరచారు! మిమ్ములను మరియు వారిని అణగద్రొక్కేదీ, న్యాయస్థానంలోనికి మిమ్మును ఈడ్చుకుపోయేదీ ధనవంతులే గదా! 7 మీ మీద పిలువబడిన మంచి పేరును దూషించేది వారు కాదా? 8 అయితే, “మిమ్ములను మీరు వలే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి” అను రాజు ధర్మశాస్త్రాన్ని లేఖనము ప్రకారము మీరు పాటించిన యెడల, మీరు బాగుగా ప్రవర్తిస్తున్నారు. 9 అయితే మీరు పక్షపాతం చూపుతున్న యెడల, మీరు పాపము చేయుచున్నారు, అతిక్రమకారులుగా ధర్మశాస్త్రము చేత ఒప్పించబడతారు. 10 ఎందుకంటే ఎవరైనా ధర్మశాస్త్రం అంతటిని పాటించి అయితే ఒక్క విషయంలో తొట్రుపడినప్పుడు అంతటిలో దోషిగా మారతాడు. 11 ఎందుకంటే “వ్యభిచారము చేయవద్దు” అని చెప్పిన వాడు “హత్య చేయవద్దు" అని కూడా చెప్పాడు. ఒకవేళ నీవు వ్యభిచారము చేయకుండ, అయితే హత్య చేసిన యెడల, నీవు ధర్మశాస్త్రం యొక్క అతిక్రమకారునిగా మారావు. 12 స్వాతంత్రము యొక్క నియమము యొక్క విధానం చేత తీర్పుతీర్చబడు వారి వలె ఆవిధంగా మాట్లాడండి మరియు ఆ విధంగానే చెయ్యండి. 13 ఎందుకంటే కరుణ జరిగించని వారికి కరుణ లేకుండా తీర్పు ఉంటుంది. కరుణ తీర్పుకు వ్యతిరేకంగా అతిశయపడుతుంది. 14 నా సహోదరులారా ఎవరైనా తనకు విశ్వాసం ఉన్నది అని చెప్పి అయితే అతనికి క్రియలు లేని యెడల ఏమి ప్రయోజనం? విశ్వాసము అతనిని రక్షించలేదు, కాదా? 15 ఒక సహోదరుడు లేదా సహోదరి గాని వస్త్రాలు లేకుండా మరియు అనుదిన ఆహారం కొదువగా ఉన్న యెడల, 16 మరియు మీలో ఎవరైనా వారికి "సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో, మరియు తృప్తిగా ఉండు," అని చెప్పారు, అయితే శరీరం కోసం అవసరమైన సంగతులను మీరు వారికి ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమి ప్రయోజనం? 17 అదే విధంగా కూడా విశ్వాసం దానంతటికి అదే, అది క్రియలు కలిగియుండని యెడల, మృతము. 18 అయితే ఒకరు “నీకు విశ్వాసం ఉంది, మరియు నాకు క్రియలు ఉన్నవి" అని చెపుతారు. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు చూపించు, మరియు నేను క్రియల నుండి నా విశ్వాసమును నీకు కనుపరుస్తాను. 19 దేవుడు ఒక్కడే అని నీవు విశ్వసిస్తావు. నీవు మంచిదానిని చేస్తున్నావు. దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి, మరియు అవి వణుకుతున్నాయి. 20 అయితే, ఓ బుద్ధిహీనుడైన మనిషి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమైనది అని నువ్వు తెలుసుకోడానికి కోరుతున్నావా? 21 మన తండ్రి అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, క్రియల చేత నీతిమంతునిగా తీర్చబడలేదా? 22 విశ్వాసం అతని క్రియలతో పని చేసింది మరియు విశ్వాసం క్రియల నుండి పరిపూర్ణం చెయ్యబడింది అని మీరు గమనించండి. 23 మరియు “అబ్రాహాము దేవుని నమ్మెను, మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను” అని చెపుతున్న లేఖనం నేరవేర్చబడింది. మరియు అతడు దేవుని యొక్క స్నేహితునిగా పిలువబడ్డాడు. 24 ఒక మనిషి క్రియల నుండి నీతిమంతునిగా తీర్చబడ్డాడు మరియు కేవలం విశ్వాసము ద్వారా కాదు అని మీరు గ్రహించండి. 25 మరియు అదే రీతిలో వేశ్య రాహాబు కూడా దూతలను స్వాగతించి మరియు వారిని మరొక దారి చేత పంపి వేసినప్పుడు క్రియల నుండి నీతిమంతురాలని తీర్చబడినది కదా? 26 ఎందుకంటే ప్రాణం లేని శరీరం మృతమైన విధముగానే, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.
Chapter 3
1 నా సహోదరులారా, మనం గొప్ప తీర్పును పొందుతామని తెలుసుకొని అనేకులు బోధకులుగా మార వద్దు. 2 ఎందుకంటే మనం అందరం ఎక్కువగా తొట్రుపడతాం. ఎవరైనా మాటలో తొట్రుపడకుండా ఉన్న యెడల అతడు పరిపూర్ణమైన మనిషి, పూర్తి శరీరాన్ని సహితం అదుపు చెయ్యగలడు. 3 ఇప్పుడు, మనకు అవి విధేయత చూపించడం కోసం మనము గుఱ్ఱముల నోళ్లలోనికి కళ్ళెం ఉంచిన యెడల, వాటి పూర్తి శరీరములను కూడా మనం తిప్పుతాము. 4 ఇదిగో ఓడలను కూడా గమనించండి, అవి చాలా పెద్దవి మరియు బలమైన గాలుల చేత కొట్టుకొనిపోయేవిగా ఉంటాయి, నావికుడు కోరుకున్న వాలు వైపుకు చాలా చిన్నదైన చుక్కాని చేత ఇది తిప్పబడుతుంది. 5 అదేరీతిగా నాలుక కూడా ఒక చిన్న భాగంగా ఉంది, అయితే ఇది గొప్ప సంగతుల విషయంలో అతిశయపడుతుంది. చూడండి ఎంతటి చిన్న నిప్పు విష్టారమైన ఒక అడవిని తగలపెడుతుంది. 6 నాలుక కూడా ఒక అగ్నియే, దుర్నీతి యొక్క ఒక లోకము. నాలుక మన శరీర భాగముల మధ్య ఉంచబడింది, పూర్తి శరీరమును మలినము చేస్తున్న అంశం మరియు జీవన మార్గాన్ని నిప్పు మీద అమర్చుతుంది, మరియు గెహన్న* చేత అగ్నిమీద అమర్చబడి ఉంది. 7 ఎందుకంటే ప్రతి విధమైన అడవి మృగములు, మరియు పక్షులు రెండు, ప్రాకుజీవులు, మరియు సముద్ర జంతువులు రెండు మానవుని జాతి చేత మచ్చిక చేసుకోబడుతున్నాయి మరియు మచ్చిక చేయబడ్డాయి. 8 అయితే మనుష్యులలో ఏ ఒక్కడును నాలుకను మచ్చిక చేయలేడు. ఇది అనిశ్చితమైన దుష్టత్వం, మరణకరమైన విషముతో పూర్తిగా ఉన్నది. 9 దీనితో మనం ప్రభువును మరియు తండ్రిని స్తుతిస్తాము, మరియు దీనితో మనం మనుష్యులను శపిస్తాము, వారు దేవుని యొక్క పోలిక ప్రకారం ఉనికిలోనికి వచ్చారు. 10 అదే నోటి నుండి ఆశీర్వాదము మరియు శాపము వచ్చుచున్నది, నా సహోదరులారా, ఎందుకంటే ఈ సంగతులు ఈ విధంగా జరగవలసిన అవసరం లేదు. 11 ఒక ఊట ఒకే ద్వారం నుండి తియ్యని మరియు చేదు జలధారను ఇవ్వదు, ఇస్తుందా? 12 ఒక అంజూరపు చెట్టు ఒలీవ పండ్లను ఇవ్వలేదు, అది ఇస్తుందా? నా సహోదరులారా, లేదా ఒక ద్రాక్షావల్లి, అంజూరపు పండ్లను? తియ్యని నీరు చెయ్యడానికి ఉప్పు నీరు కూడా కాదు. 13 మీ మధ్య జ్ఞానవంతులు మరియు గ్రహింపు ఉన్నవారు ఎవరు? అతడు జ్ఞానము యొక్క వినయములో మంచి ప్రవర్తన నుండి తన క్రియలను కనుపరచనివ్వండి. 14 అయితే మీ హృదయంలో తీవ్రమైన అసూయ మరియు గాఢవాంఛ ఉన్న యెడల, అతిశయించ వద్దు మరియు సత్యమునకు విరోధముగా అబద్ధమాడకుడి. 15 ఈ జ్ఞానము పైనుండి కిందకు వచ్చునది కాదు. అయితే ఇది భూలోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యపు సంబంధమైనది. 16 ఎందుకంటే ఎక్కడ అసూయ మరియు గాఢవాంఛ ఉంటున్నదో, అక్కడ కలవరము మరియు ప్రతి దుష్ట ఆచారము ఉంటుంది. 17 అయితే పైనుండి జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సహకారమైనది, కరుణ మరియు మంచి ఫలములు నిండి ఉన్నది, నిష్పాక్షికమైనది, యధార్ధమైనదియునై ఉన్నది. 18 మరియు నీతి యొక్క ఫలము సమాధాన పరచు వారి చేత సమాధానములో నాటబడినది.
Chapter 4
1 మీ మధ్య ఎక్కడనుండి యుద్ధములు మరియు ఎక్కడనుండి పోరాటములు? మీ అవయములలో పోరాడుతున్న మీ మోహపు కోరికల నుండి వచ్చినవి కావా? 2 మీరు కోరుకొంటున్నారు, మరియు మీరు కలిగియుండడం లేదు. మీరు హత్యచేయుదురు మరియు అసూయపడుదురు. మరియు మీరు పొంద లేక పోతున్నారు. మీరు పోరాడుతున్నారు మరియు యుద్ధాలు చేస్తున్నారు. మీరు కలిగియుండడం లేదు ఎందుకంటే మీరు అడుగరు 3 మీరు అడుగుదురు మరియు మీరు పొందుకోరు, ఎందుకంటే మీరు చెడుగా అడుగుతారు, తద్వారా మీరు మీ మోహపు కోరికల మీద ఖర్చు చేస్తున్నారు. 4 వ్యభిచారిణులారా! లోకముతో స్నేహము దేవునితో శత్రుత్వం అని మీరు యెరుగరా? కాబట్టి లోకము యొక్క స్నేహితునిగా ఉండాలనుకుంటున్న వాడు దేవుని యొక్క శత్రువుగా చెయ్యబడ్డాడు. 5 లేదా "ఆయన మనలో నివసింప చేసిన ఆత్మ అసూయతో కోరుకుంటాడు" అని లేఖనం వ్యర్ధంగా చెపుతున్నది అని మీరు అనుకుంటున్నారా? 6 అయితే ఆయన అధికమైన కృప ఇస్తున్నాడు. కాబట్టి ఇది చెపుతుంది, “దేవుడు అహంకారులను వ్యతిరేకిస్తున్నాడు, అయితే ఆయన దీనులకు కృప ఇస్తున్నాడు." 7 కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అయితే సాతానును ఎదిరించండి. మరియు అతడు మీ నుండి పారిపోతాడు. 8 దేవుని దగ్గరకు,రండి, మరియు ఆయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుద్ధి చేసుకొనుడి మరియు ద్విమనస్కులారా మీ హృదయములను పవిత్రపరచుకొనుడి. 9 దుఃఖపూరితంగా ఉండండి మరియు రోధించుడి మరియు ఏడువుడి! మీ నవ్వును రోదన లోనికి, మరియు మీ సంతోషమును విచారములోనికి మారనివ్వండి. 10 ప్రభువు ఎదుట తగ్గించుకొని ఉండండి మరియు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. 11 సహోదరులారా, ఒకనికి ఒకడు విరోధముగా మరొకరు మాట్లాడ వద్దు. ఒక సహోదరునకు విరోధముగా మాట్లాడు వాడు లేదా అతని సహోదరుని తీర్పుతీర్చు వాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు మరియు ధర్మశాస్త్రమును తీర్పుతీర్చుచున్నాడు. అయితే ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల, మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చువారు కాదు, అయితే ఒక న్యాయాధిపతి. 12 ధర్మశాస్త్రమును ఇచ్చినవాడు మరియు న్యాయాధిపతి ఒక్కడే అయిఉన్నాడు, ఆయన రక్షించడానికి మరియు నశింపచేయడానికి సమర్ధుడు. అయితే ఒక పొరుగువానిని తీర్పు తీర్చు నువ్వు ఎవరు? 13 ఇప్పుడు రండి, ఈరోజు లేదా రేపు మనం ఈ నగరానికి ప్రయాణం చేస్తాము మరియు అక్కడ ఒక సంవత్సరం గడుపుదాం మరియు వ్యాపారం చేస్తూ మరియు లాభం సంపాదించు కొంటాం” అని చెప్పుకొనేవారలారా, 14 రేపు ఏమి జరుగుతుందో తెలియని మీరు, మీ జీవం ఏపాటిది? ఎందుకంటే మీరు కొంచం సేపు కనబడి మరియు తరువాత మాయమైపోయే ఆవిరిగా ఉన్నారు. 15 దానికి బదులుగా మీరు చెప్పాలి “ప్రభువు ఇష్టపడిన యెడల, మనం జీవించడం మరియు ఇది లేదా అది చెయ్యడం రెండు చేస్తాము.". 16 అయితే ఇప్పుడు మీరు మీ డంబములలో అతిశయపడుతున్నారు. అటువంటి అతిశయం అంతా దుష్టత్వము. 17 కాబట్టి మంచి చేయడానికి తెలిసి యుండి మరియు దానిని చెయ్యని వానికి, అతనికి అది పాపము.
Chapter 5
1 ఇప్పుడు రండి, ధనవంతులు, మీకు రాబోతున్న దురవస్థల యొక్క కారణంగా కన్నీళ్ళువిడువండి, రోదించండి. 2 మీ సంపద కుళ్ళిపోయింది మరియు మీ వస్త్రాలు చిమ్మటలు తినివేసినవిగా మారాయి. 3 మీ బంగారము మరియు వెండి కాంతిహీనం అయ్యాయి, మరియు వాటి తుప్పు మీకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యం కోసం ఉంటుంది మరియు అది మీ శరీరమును అగ్నివలే తిని వేయును. మీరు అంత్య దినములలో కూడబెట్టుకున్నారు. 4 చూడండి, మీ పొలముల పంటకోసిన పనివారి యొక్క కూలి, మీ నుండి బిగబెట్టబడిన కూలి, మొర్రపెట్టుకుంటుంది, మరియు పంటకోయువారి యొక్క ఏడ్పులు సైన్యముల యొక్క ప్రభువు యొక్క చెవులలోనికి ప్రవేశించాయి. 5 మీరు భూమి మీద విలాసవంతంగా జీవించారు మరియు సొంత కోరికలు తీర్చుకొంటూ జీవించారు. వధ యొక్క దినములో మీరు మీ హృదయములను క్రొవ్వబెట్టుకున్నారు. 6 మీరు శిక్ష విధించారు, మీరు నీతిపరులను హత్య చేసారు. అతడు మిమ్మును అడ్డగించడు. 7 కాబట్టి సహోదరులారా, ప్రభువు యొక్క రాకడ వరకు ఓర్పుగా ఎదురు చూడండి. ఇదిగో వ్యవసాయకుడు భూమి యొక్క విలువైన ఫలాన్ని ఎదురుచూచును, తొలకరి వాన, మరియు కడవరి వాన పొందుకొనే వరకు దాని కోసం ఓర్పుతో ఎదురు చూస్తాడు. 8 మీరు కూడా ఓర్పుతో ఎదురుచూడండి. మీ హృదయాలను బలపరచుకోండి, ఎందుకంటే ప్రభువు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. 9 సహోదరులారా, ఒకనికి ఒకరు వ్యతిరేకంగా సణుగుకొన వద్దు, తద్వారా మీరు తీర్పు తీర్చబడరు. ఇదిగో న్యాయాధిపతి ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు. 10 సహోదరులారా, ప్రభువు యొక్క నామములో మాట్లాడిన వారు అయిన ప్రవక్తల యొక్క శ్రమ మరియు ఓర్పు యొక్క మాదిరిని తీసుకోండి. 11 చూడండి, మనము సహించిన వారిని మనం ధన్యులని పిలుస్తాము. యోబు యొక్క సహనము గురించి మీరు విన్నారు, మరియు ప్రభువు అధికమైన జాలియు మరియు కరుణగల వాడు అని ప్రభువు యొక్క ఉద్దేశం మీరు చూసారు. 12 అయితే నా సహోదరులారా, అన్నిటికి ముందు, ఆకాశము చేత గాని లేదా భూమి చేత గాని లేదా ఏ ఇతర ప్రమాణం చేత గాని ఒట్టుపెట్టుకొనకుడి. అయితే మీ "అవును" "అవును"గా మరియు "కాదు," "కాదు"గా ఉండనివ్వండి, తద్వారా మీరు తీర్పు కిందకు రారు. 13 మీ మధ్యలో ఎవరైనా కష్టాలు అనుభవిస్తున్నారా? అతనిని ప్రార్ధన చేయనివ్వండి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అతనిని స్తుతి పాడనివ్వండి. 14 మీ మధ్యలో ఎవరైనా రోగియై ఉన్నారా? అతడు సంఘము యొక్క పెద్దలను పిలువనివ్వండి, మరియు వారు అతనిని గురించి ప్రార్ధించ నివ్వండి. వారు ప్రభువు యొక్క నామములో నూనెతో అతనిని అభిషేకించ నివ్వండి. 15 మరియు విశ్వాసము యొక్క ప్రార్ధన రోగిని రక్షిస్తుంది మరియు ప్రభువు అతనిని పైకి లేపును. మరియు అతడు పాపములు చేసిన యెడల, అది అతనికి క్షమించబడును. 16 కాబట్టి ఒకరితో ఒకరు మీ పాపములు ఒప్పుకొనుడి, మరియు ఒకరి కోసం ఒకరు ప్రార్ధన చేయుడి, తద్వారా నీవు స్వస్థత పొందుతావు. నీతిమంతుని యొక్క కార్యరూపక ప్రార్థన చాలా బలముగా ఉండును. 17 ఏలియా మనలాంటి స్వభావము కల ఒక మనుష్యుడే. మరియు అయన వర్షం రాకుండా ఉండడం కోసం శ్రద్ధగా ప్రార్ధన ప్రార్థించాడు, మరియు భూమి మీద మూడు సంవత్సరాల మరియు ఆరు నెలలు అది వర్షం కురువలేదు. 18 మరియు అతడు మరల ప్రార్థించాడు మరియు ఆకాశము వర్షమును ఇచ్చెను, మరియు భూమి దాని ఫలము ఉత్పత్తి చేసెను. 19 నా సహోదరులారా, మీ మధ్య ఎవరైనా సత్యము నుండి తప్పు దారి తప్పినప్పుడు మరియు మరొకరు అతనిని వెనుకకు తీసుకొచ్చిన యెడల, 20 ఒక పాపిని అతని మార్గం యొక్క తిరుగులాడడం నుండి వెనుకకు తిప్పు వాడు ఆ మనిషి ఆత్మను చావు నుండి రక్షించును మరియు విస్తారమైన పాపాలను కప్పివేయును అని అతనిని తెలుసుకోనివ్వండి.