యోహాను రాసిన మూడవ పత్రిక
గ్రంథకర్త
యోహాను 3 పత్రికలూ ఒక వ్యక్తి రాసినవే. ఎక్కువ మంది పండితులు అపోస్తలుడు యోహన్ రాశాడని అభిప్రాయపడుతున్నారు. తనకు సంఘంలో ఉన్న స్థానాన్ని బట్టి, తన పెద్దవయసుని బట్టి, యోహాను తనను “పెద్ద” గా చెప్పుకుంటున్నాడు. ఈ పత్రిక ఆరంభం, ముగింపు, శైలి, 2 యోహానుకు సరిపోలుతున్నాయి గనక ఈ రెంటినీ ఒకడే రాశాడని భావించవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ 85 - 95
ఆసియా మైనర్ లోని ఎఫెసు పట్టణం లో యోహాను ఈ పత్రిక రాశాడు.
స్వీకర్త
దీన్ని యోహాను గాయి అనే వ్యక్తికి రాశాడు. ఇతడు యోహానుకు పరిచయం ఉన్న సంఘాల్లో ఒక దానిలో ప్రాముఖ్యమైన మనిషి అయి ఉండవచ్చు. గాయి ఆతిథ్యంలో పేరు గాంచిన వాడు.
ప్రయోజనం
స్థానిక సంఘంలో వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకోవడం గురించి హెచ్చరించడం. అంతేగాక సత్య వాక్య ప్రబోధకుల అవసరాలను తన అవసరాలకంటే ప్రాముఖ్యంగా ఎంచడంలో అతణ్ణి మెచ్చుకోవడం (వ. 5-8). క్రీస్తు పరిచర్య కంటే తనను అధికునిగా చూసుకుంటున్న దియోత్రెఫేను గురించి యోహాను హెచ్చరిస్తున్నాడు (వ. 9). సంచార సువార్త ప్రబోధకునిగా ఈ పత్రికను తెచ్చిన వానిగా దేమేత్రిని కూడా యోహాను మెచ్చుకున్నాడు (వ. 12). తాను త్వరలో వారి దగ్గరకు వస్తున్నానని చెబుతున్నాడు.
ముఖ్యాంశం
విశ్వాసుల ఆతిథ్యం
విభాగాలు 1. పరిచయం — 1:1-4 2. సంచార సువార్తికులకు ఆతిథ్యం — 1:5-8 3. దుర్మర్గాతను కాక మంచిని అనుకరించడం — 1:9-12 4. ముగింపు — 1:13-15Chapter 1
పలకరింపులు
1 పెద్దను సత్యంలో నేను ప్రేమిస్తున్నవాడు, ప్రియుడు అయిన గాయికి. 2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న విధంగా నీవు వర్ధిల్లడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి నీ కోసం అన్ని విషయాల గురించి నేను ప్రార్ధిస్తున్నాను.
3 ఎందుకంటే సహోదరులు వచ్చి మరియు నీవు సత్యంలో నడచుకొంటున్న ప్రకారం నీ సత్యానికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, నేను చాలా సంతోషించాను. 4 నా పిల్లలు సత్యంలో నడుచుకొంటున్నారు అని నేను వినడం ఈ విషయాల కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు.
5 ప్రియుడా, సహోదరుల కోసం పని చేస్తున్న ప్రతీసారి నీవు నమ్మదగిన దానిని చేస్తున్నావు, మరియు ఇది అపరిచితులకోసం. 6 వారు సంఘం ముందు నీ ప్రేమకు సాక్ష్యం చెప్పారు. దేవునికి తగిన విధానంలో వారిని వారి ప్రయాణానికి పంపించడానికి సరిగా చెయ్యి, 7 ఎందుకంటే వారు పేరు పక్షంగా బయటికి వెళ్ళారు. అన్యజనుల నుండి ఏమీ తీసుకోలేదు. 8 కాబట్టి మనం ఇటువంటి వారిని స్వీకరించడం చెయ్యాలి, తద్వారా సత్యం కోసం జతపనివారం అవుతాం.
9 సంఘమునకు నేను ఒక సంగతి రాశాను, అయితే వారిలో ప్రధముడిగా ఉండడానికి ప్రేమించే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. 10 ఈ కారణం కోసం నేను వచ్చిన యెడల అతడు చేస్తున్న వాటిని, అతని పనులను జ్ఞాపకం చేసుకొంటాను - చెడ్డ మాటలతో మమ్మల్ని నిందించడం. అయితే ఈ విషయాలతో తృప్తి చెందలేదు, మరియు సహోదరులను స్వీకరించడం లేదు. మరియు ఇష్టంగా ఉన్నవారిని అతడు నిలువరిస్తున్నాడు, మరియు వారిని సంఘం నుండి వెలుపలకు త్రోసివేస్తున్నాడు. 11 ప్రియుడా చెడుగా ఉన్నదానిని అనుసరించ వద్దు, అయితే మంచిదిగా ఉన్నదానిని. మంచిని చేయువాడు దేవుని నుండి వచ్చినవాడు; చెడును చేయువాడు దేవుణ్ణి చూడలేదు. 12 దేమేత్రి అందరి చేత సాక్ష్యం పొందాడు మరియు సత్యం చేతనే అదే పొందాడు. మరియు మేము కూడా సాక్ష్యం కలిగియున్నాం. మరియు మా సాక్ష్యం సత్యం అని నీకు తెలుసు. 13 నీకు రాయడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి. అయితే కలంతోనూ, మరియు సిరాతోనూ నీకు రాయడం నేను కోరుకోవడం లేదు. 14 అయితే త్వరలో నిన్ను చూడాలని ఎదురుచూస్తున్నాను మరియు మనం నోటి నుండి నోటితో మాట్లాడుకొందాం.
15 నీకు సమాధానం. స్నేహితులు నీకు వందనాలు చెపుతున్నారు. స్నేహితులకు పేరుతో వందనాలు.