తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తిమోతికి రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 క్రీస్తు యేసులో ఉన్న జీవం యొక్క వాగ్దానం ప్రకారం దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలును 2 నా ప్రియ కుమారుడు, తిమోతికి: తండ్రియైన దేవుడు మరియు మన ప్రభువు క్రీస్తు యేసు నుండి కృప, కరుణ, మరియు సమాధానం.

3 నా ప్రార్థనలలో నిన్ను రాత్రి మరియు పగలు నేను మానకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఒక పవిత్రమైన మనస్సాక్షితో నా పూర్వీకుల నుండి నేను సేవిస్తున్న దేవునికి నేను కృతజ్ఞత కలిగియున్నాను. 4 నేను ఆనందంతో నింపబడాలని నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, తద్వారా నిన్ను చూడడానికి ఎదురుచూస్తున్నాను. 5 నీలోని యథార్థమైన విశ్వాసం జ్ఞాపకానికి తెచ్చుకొంటున్నాను, అది మొదట మీ అమ్మమ్మ లోయిలో మరియు మీ అమ్మ యునీకేలో నిలిచియుంది, మరియు అది నీలో కూడా ఉన్నదని నేను ఒప్పించబడ్డాను.

6 ఈ కారణం కోసం నా చేతులు ఉంచడం ద్వారా నీలో ఉన్న ఆ దేవుని యొక్క కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోడానికి నేను నీకు జ్ఞాపకంచేస్తున్నాను. 7 ఎందుకంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వ లేదు, అయితే శక్తిగల మరియు ప్రేమగల మరియు స్వీయ క్రమ శిక్షణ గల. 8 కాబట్టి మన ప్రభువు గురించి సాక్ష్యం విషయం, ఆయన ఖైదీనైన నన్ను గురించి, గానీ సిగ్గు పడ వద్దు, అయితే దేవుని యొక్క శక్తి ప్రకారం సువార్త కోసం కలిసి శ్రమపడు.

9 ఆయన మన క్రియల ప్రకారం కాక, అయితే తన స్వకీయ ఉద్దేశం మరియు కృప ప్రకారం ఒక పరిశుద్ధ పిలుపుతో మనలను రక్షించాడు మరియు మనలను పిలిచాడు. శాశ్వత యుగాలకు ముందే క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించబడింది. 10 మరియు అది ఇప్పుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత ద్వారా వెల్లడి అయింది. ఆయన రూఢిగా మరణానికి అంతం విధించడం, మరియు సువార్త ద్వారా జీవాన్ని మరియు అక్షయతను వెలుగులోకి తేవడం చేసాడు. 11 దాని కోసం ఒక వార్తాహరుడు, మరియు ఒక అపొస్తలుడు మరియు ఒక బోధకుడుగా నేను నియమించబడ్డాను.

12 ఈ కారణం కోసం నేను కూడా వీటిని అనుభవిస్తున్నాను. అయితే నేను సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మిన వానిని నేను యెరుగుదును. మరియు నేను ఆయనకు అప్పగించినదానిని ఆ రోజు వరకు ఆయన కాపాడడానికి సామర్ధ్యము గలవాడని నేను రూఢిగా ఉన్నాను. 13 క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసంలో మరియు ప్రేమలో నా నుండి నీవు వినిన ఆ హిత వాక్కుల యొక్క మాదిరిని పాటించు. 14 మనలో నివాసముంటున్న వాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా అప్పగించబడిన మంచి నిక్షేపమును కాపాడుము.

15 ఆసియలో ఉన్న వారు అందరు నా నుండి తొలగిపోయారని ఇది నీకు తెలుసు, ఫుగెల్లు, మరియు హెర్మొగెనే వారిలో ఉన్నారు. 16 ప్రభువు ఒనేసిఫోరు కుటుంబానికి కనికరం అనుగ్రహించు గాక, ఎందుకంటే అతడు తరచుగా నాకు సేదతీర్చాడు మరియు నా సంకెళ్ళ విషయంలో సిగ్గు పడలేదు, 17 అయితే అతడు రోములో ఉన్నప్పుడు నన్ను శ్రద్ధగా వెతికాడు, మరియు నన్ను కనుగొన్నాడు. 18 ఆ దినంలో ప్రభువు నుండి కనికరం పొందడానికి ప్రభువు అనుగ్రహించు గాక. మరియు అతడు ఎఫెసులో ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు.

Chapter 2

1 కాబట్టి నా కుమారుడా, నీవు క్రీస్తు యేసులో ఉన్న కృపలో బలవంతుడవుగా ఉండు. 2 మరియు అనేకమైన సాక్షులతో పాటు నా నుండి నీవు వినిన దానిని, ఇతరులకు కూడా బోధించడానికి సామర్ధ్యంగల, నమ్మకమైన వ్యక్తులు అయిన వారికి ఈ సంగతులను అప్పగించు.

3 యేసు క్రీస్తు యొక్క ఒక మంచి సైనికుని వలే కలిసి అనుభవించు. 4 ఒక సైనికుడుగా పనిచేయువాడు ఎవడును జీవితం యొక్క వ్యాపకాలలో చిక్కుకోడు, తద్వారా తనను చేర్చుకున్నవాణ్ణి సంతోషపెడతాడు. 5 అయితే ఎవరైనా పోటీచేసిన యెడల అతడు చట్టబద్ధంగా పోటీచేయక పోయిన యెడల అతడు కిరీటం పొందడు. 6 కష్టపడే వ్యవసాయదారుడే పంట భాగం స్వీకరించడానికి మొదటి వాడుగా ఉండాలి. 7 నేను చెపుతున్న దానిని గురించి ఆలోచించు. ఎందుకంటే ప్రతివిషయంలో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.

8 నా సువార్త ప్రకారం, దావీదు యొక్క సంతానం నుండి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 9 దాని కోసం నేను ఒక నేరస్థుడి వలే సంకెళ్ళలో బంధింపబడు వరకు శ్రమ అనుభవిస్తున్నాను. అయితే దేవుని యొక్క వాక్యం బంధించబడి లేదు.

10 ఈ కారణంగా ఎన్నికైనవారి కోసం అన్నింటిని ఓర్చుకుంటున్నాను, తద్వారా వారు కూడా నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులో ఉన్న రక్షణ పొందుతారు.

     11 ఈ మాట నమ్మదగినది: “ఎందుకంటే మనం ఆయనతో చనిపోయిన యెడల మనం కూడా ఆయనతో జీవిస్తాము.

     12 అయితే మనం సహించినట్లయితే మనం ఆయనతో కూడా రాజ్యపరిపాలన చేస్తాము.

     అయితే మనం ఆయనను తిరస్కరించినట్లయితే ఆయన కూడా మనలను తిరస్కరిస్తాడు.

     13 మనం అపనమ్మకస్థులముగా ఉన్న యెడల ఆయన నమ్మకమైనవాడుగా నిలిచియుంటాడు,

     ఎందుకంటే ఆయన తననుతాను తిరస్కరించడానికి సాధ్యం కాదు."

14 ఈ సంగతులను గురించి వారికి జ్ఞాపకం చేయుము, మాటల గురించి వాదం పెట్టుకోవడానికి వద్దని దేవుని ఎదుట వారిని ఆజ్ఞాపించు; ఇది శూన్యం కోసం ప్రయోజనకరం. అయితే విను వారి యొక్క నాశనానికి, 15 దేవునికి నిన్ను ఆమోదయోగ్యుడుగా కనుపరచుకోడానికి ప్రయత్నించు, సిగ్గుపడనక్కరలేని ఒక పనివాడు, సత్య వాక్యాన్ని సరిగా విభజించువాడు.

16 అయితే అపవిత్రమైన వట్టి వివాదములను విడిచిపెట్టు, ఎందుకంటే అవి అధికమైన భక్తిహీనతలోనికి దారితీస్తాయి. 17 మరియు వారి మాట కుళ్ళినపుండు వలే వ్యాపిస్తూ ఉంది, వారి మధ్య హుమెనై, మరియు ఫిలేతు ఉన్నారు. 18 వారు సత్యం విషయంలో గురి తప్పిపోయారు, పునరుత్థానం ఇంతకుముందే జరిగింది అని చెపుతున్నారు, మరియు వారు కొందరి విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు.

19 అయితే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలిచేయున్నది, ఈ ముద్ర ఉంది: "ప్రభువుకు తనవారుగా ఉన్నవారు ఎవరో తెలుసు” మరియు "ప్రభువు యొక్క నామాన్ని ఒప్పుకొనే ప్రతిఒక్కరూ దుర్నీతి నుండి తొలగిపోవాలి.”

20 ఇప్పుడు ఒక గొప్ప ఇంటిలో, బంగారం, మరియు వెండి పాత్రలు మాత్రమే కాక, అయితే కొయ్య, మరియు మట్టివి కూడా ఉన్నాయి. మరియు రెండూ కొన్ని ఘనత కోసం మరియు కొన్ని ఘనహీనత కోసం. 21 కాబట్టి, ఎవరైనా వీటి నుండి తనను తాను శుద్ధి చేసుకొన్న యెడల, అతడు ఘనత కోసం ఒక పాత్రగా ఉంటాడు, పరిశుద్ధ పరచబడి, ప్రతీ మంచి కార్యం కోసం సిద్ధపడి, యజమానికి ఉపయోగకరముగా ఉంటాడు.

22 కాబట్టి యవ్వనపు వ్యామోహముల నుండి పారిపోమ్ము. మరియు ఒక పవిత్ర హృదయం నుండి ప్రభువును పిలిచే వారితో నీతి, విశ్వాసం, ప్రేమ, మరియు సమాధానాలను వెంబడించు. 23 అయితే బుద్ధిహీనమైన మరియు అజ్ఞానమైన ప్రశ్నలను విడిచిపెట్టు, అవి జగడాలను పుట్టిస్తాయని తెలుసుకో.

24 అయితే ప్రభువు యొక్క బానిస జగడమాడ కూడదు, అయితే అందరి పట్ల దయగా ఉండాలి, బోధించగలిగేవాడు, సహించేవాడు 25 తనను వ్యతిరేకించు వారికి సాత్వికంలో బోధించాలి. దేవుడు ఒకవేళ సత్యం యొక్క జ్ఞానం కోసం వారికి పశ్చాత్తాపం దయచేస్తాడేమో. 26 మరియు వారు అపవాది యొక్క ఉరి నుండి మరల స్థిరబుద్ధిగలవారుగా మారుతారు, అతని చేత తన ఇష్టం కోసం చెరపట్టబడ్డారు.

Chapter 3

1 అయితే చివరి దినములలో కష్టమైన సమయములు వస్తాయి అని ఇది తెలుసుకో 2 ఎందుకంటే మనుషులు ఇలా ఉంటారు స్వార్ధ ప్రియులు, ధనవ్యామోహంగలవారు, బడాయికారులు, గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, 3 ప్రేమలేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ప్రేమించనివారు, 4 ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుణ్ణి ప్రేమించడం కంటే బదులు సౌఖ్యాన్ని ప్రేమించేవారు, 5 భక్తి యొక్క ఒక రూపాన్ని కలవారు, అయితే దాని శక్తిని నిరాకరించేవారు. మరియు వీరి నుండి దూరంగా తొలగిపో. 6 ఎందుకంటే వారి మధ్య గృహాల లోనికి ప్రవేశించు వారు ఉన్నారు, మరియు పాపములతో నిండిపోయిన బుద్ధిహీనమైన స్త్రీలను వారిని వశం చేసుకుంటారు, రకరకాల వాంఛల చేత కొట్టుకు పోయారు. 7 ఎల్లప్పుడూ నేర్చుకొంటూ ఉండండి, అయితే సత్యం యొక్క జ్ఞానం వద్దకు ఎప్పటికీ రాలేక ఉన్నారు. 8 మరియు ఏ విధానంలో యన్నే, మరియు యంబ్రే మోషేను వ్యతిరేకించారో వీరు కూడా అదేవిధంగా సత్యాన్ని వ్యతిరేకించారు, ఈ మనుషుల మనసు పాడైపోయింది, విశ్వాసం విషయంలో అంగీకరించబడలేదు. 9 అయితే వారు ముందు వరకు వెళ్ళ లేదు, ఎందుకంటే వారి అవివేకం అందరికి వెల్లడి అవుతుంది, అదేవిధంగా వారికి ఉన్నది కూడా అవుతుంది 10 అయితే నీవు అనుసరించావు, నా బోధ, ప్రవర్తన, ఉద్దేశం, విశ్వాసం, సహనం, ప్రేమ, ఓర్పు, 11 అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్రలో నాకు సంభవించిన అటువంటి హింసలు, శ్రమలు, నేను ఎటువంటి హింసలను భరించాను. అయితే వాటి అన్నిటి నుండి ప్రభువు నన్ను కాపాడాడు.

12 మరియు నిజానికి క్రీస్తు యేసులో సద్భక్తిగా జీవించడానికి కోరుకున్న వారు అందరు హింసించబడతారు. 13 అయితే దుష్టులైన మనుషులు మరియు వంచకులు అధికమైన చెడు వైపుకు కదులుతున్నారు, త్రోవతప్పి నడుస్తున్నారు, మరియు త్రోవతప్పి నడిపించబడుతున్నారు. 14 అయితే నీవు నేర్చుకొన్న సంగతులలో నిలిచియుండు మరియు రూఢిగా ఉండు, ఎవరి నుండి నువ్వు వాటిని నేర్చుకున్నావో తెలుసుకొనియుండు, 15 మరియు బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు నీకు తెలుసు అవి క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం ద్వారా రక్షణ కోసం నీకు జ్ఞానం కలిగించడానికి శక్తిగలవి.

16 ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగినది మరియు బోధించడం కోసం, ఖండించడం కోసం, తప్పుదిద్దడం కోసం మరియు నీతిలో శిక్షణ కోసం ప్రయోజనకరం 17 తద్వారా దేవుని యొక్క మనిషి ప్రవీణుడుగా ఉండి, ప్రతి మంచి పని కోసం సిద్ధపడి ఉంటాడు.

Chapter 4

1 మరియు తన ప్రత్యక్షత మరియు తన రాజ్యము చేత సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చబోతున్నవాడు, దేవుడు మరియు క్రీస్తు యేసు ముందు నేను నిన్ను ఆదేశిస్తున్నాను.

2 వాక్యాన్ని బోధించు; సమయమున, అసమయమున సిద్ధంగా ఉండు. సంపూర్ణమైన సహనం మరియు ఉపదేశంతో ఖండించు, గద్దించు, బుద్ధిచెప్పు. 3 ఎందుకంటే ఒక సమయం ఉండబోతోంది అప్పుడు వారు హిత బోధను సహించ లేరు, బదులుగా వారి దురద చెవులు, వారు తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధకులను వారి కోసం పోగుచేసుకొంటారు. 4 మరియు వాస్తవానికి సత్యం నుండి తమ చెవిని దూరంతిప్పుకొని మరియు కల్పితకథల వైపుకు తొలగిపోతారు.

5 అయితే నీవు అన్ని విషయాల్లో స్థిరబుద్ధితో ఉండు. కష్టాలు భరించు. సువార్తికుని పని చెయ్యి, నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించు.

6 ఎందుకంటే నేను ఇప్పటికే పోయబడుతున్నాను, మరియు నా మరణం యొక్క సమయం ఇక్కడ ఉంది. 7 నేను మంచి పోరాటం పోరాడాను, నేను పరుగును ముగించాను. నేను విశ్వాసమును కాపాడుకున్నాను. 8 ఇప్పుడు నీతి యొక్క కిరీటం నా కోసం ఉంచబడింది. దానిని నీతిగల న్యాయాధిపతి ప్రభువు, ఆ రోజున నాకు బహూకరిస్తాడు. మరియు నాకు మాత్రమే కాదు, అయితే ఆయన ప్రత్యక్షతను ప్రేమించిన వారు అందరికి కూడా .

9 నా దగ్గరికి త్వరగా రావడానికి త్వరపడు. 10 ఎందుకంటే దేమా నన్ను విడిచిపెట్టాడు, ప్రస్తుత కాలాన్ని ప్రేమించి మరియు తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. క్రేస్కేకు గలతీయకి, తీతు దల్మతియకి. 11 లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును తీసుకొని, అతనిని నీతో తీసుకురా, ఎందుకంటే అతడు పరిచర్య కోసం నాకు ప్రయోజనకరం. 12 అయితే నేను తుకికును ఎఫెసుకు పంపాను.

13 నేను త్రోయలో కర్పుతో విడిచిన ఆ అంగీని, నీవు వచ్చేటప్పుడు తీసుకురా, మరియు పుస్తకాలు, ముఖ్యంగా చర్మపు కాగితాలు. 14 కంసాలి అలెక్సంద్రు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియల ప్రకారం ప్రభువు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. 15 అతడు నువ్వు కూడా నిన్నునీవు కాపాడుకో. ఎందుకంటే అతడు మా మాటలను తీవ్రంగా ఎదిరించాడు.

16 నా మొదట సమర్ధనవాదం వద్ద, నాతో ఎవరూ కనిపించలేదు. అయితే ప్రతీఒక్కరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి వ్యతిరేకంగా ఎంచబడడం లేకుండా ఉండును గాక. 17 అయితే ప్రభువు నాతో నిలిచాడు, మరియు నన్ను బలపరిచాడు, తద్వారా నా ద్వారా ప్రకటన సంపూర్ణంగా తీసుకొనిపోబడుతుంది, మరియు యూదేతరులు అందరు వింటారు. మరియు నేను సింహం నోటి నుండి తప్పించబడ్డాను. 18 ప్రతి దుష్ట కార్యం నుండి ప్రభువు నన్ను తప్పిస్తాడు మరియు తన పరలోక రాజ్యం కోసం నన్ను రక్షిస్తాడు. ఆయనకు యుగముల యొక్క యుగములకు ఘనత కలుగుతుంది, ఆమేన్‌.

19 ప్రిస్క మరియు అకులకు శుభములు చెప్పు. మరియు ఒనేసిఫోరు కుటుంబానికి. 20 ఎరస్తు కొరింథు వద్ద నిలిచిపోయాడు, మరియు త్రోఫిము అనారోగ్యముగా ఉన్నాడు, నేను మిలేతులో విడిచి వచ్చాను. 21 చలికాలం రావడానికి ముందే త్వరపడు. యుబూలు మరియు పుదే మరియు లీను మరియు క్లౌదియ మరియు సోదరులు నీకు శుభములు చెపుతున్నారు.

22 ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు, కృప నీతో ఉంటుంది.