యోహాను రాసిన సువార్త
Chapter 1
1 ఆదిలో వాక్యము ఉన్నాడు, మరియు వాక్యము దేవునితో ఉన్నాడు, మరియు వాక్యము దేవుడై ఉన్నాడు. 2 ఆయన ఆదిలో దేవునితో ఉన్నాడు. 3 సమస్త కార్యములు ఆయన ద్వారా ఉనికి లోనికి వచ్చాయి, మరియు ఉనికి లోనికి వచ్చినది ఒక్క కార్యము ఆయన లేకుండ ఉనికి లోనికి రాలేదు. 4 ఆయనలో జీవము ఉంది. మరియు జీవము మనుష్యుల యొక్క వెలుగై ఉంది. 5 మరియు వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, మరియు చీకటి దానిని జయించ లేదు. 6 ఒక మనుష్యుడు ఉన్నాడు-దేవుని నుండి పంపబడి యున్నాడు-అతని పేరు యోహాను. 7 ఎందుకంటే అతడు ఆ వెలుగును గురించి సాక్ష్య ము ఇచ్చుటకు ఒక సాక్షి వలే వచ్చాడు, తద్వారా అతని ద్వారా అందరు విశ్వసిస్తారు. 8 ఆ ఒక్కడు వెలుగై యుండ లేదు, అయితే అతడు వెలుగును గురించి సాక్ష్యము ఇవ్వడానికి {వచ్చాడు.} 9 నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచూ ఉన్నది, అది మనుష్యులు అందరికి వెలుగు ఇస్తూ ఉంది. 10 ఆయన లోకములో ఉన్నాడు, మరియు ఆయన ద్వారా లోకము ఉనికి లోనికి వచ్చింది, మరియు లోకము ఆయనను తెలుసుకొన లేదు. 11 ఆయన {తన} సొంతవారి వద్దకు వచ్చాడు. మరియు {తన} సొంతవారు ఆయనను స్వీకరించ లేదు. 12 అయితే ఆయనను ఎంత మంది అంగీకరించారో, ఆయన నామములో విశ్వాసముంచిన వారికి, దేవుని యొక్క పిల్లలు అవడానికి అధికారము ఆయన వారికి అనుగ్రహించాడు. 13 వీరు రక్తముల నుండి పుట్టలేదు, శరీరము యొక్క చిత్తము నుండీ కాదు, ఒక మనిషి యొక్క చిత్తము నుండీ కాదు, అయితే దేవుని నుండి. 14 మరియు ఆ వాక్యము శరీరి అయ్యాడు మరియు మన మధ్య నివసించాడు, మరియు తండ్రి నుండి అద్వితీయుడు, కృప మరియు సత్యము యొక్క సంపూర్ణత యొక్క మహిమను వలే మనం ఆయన మహిమను చూసాము. 15 యోహాను ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు మరియు గట్టిగా అరిచాడు, చెప్పాడు, "'నా వెనుక వచ్చువాడు నా కంటె ప్రముఖుడు గనుక ఆయన నా కంటె గొప్పవాడు అయ్యాడు ఎందుకంటే ఆయన నాకు ముందు ఉన్నవాడు' అని నేను చెప్పినవాడు ఈయనే.'" 16 ఎందుకంటే ఆయన పరిపూర్ణత నుండి మనము అందరమూ కృప వెంబడి కృపను సహితం పొందాము. 17 ఎందుకంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృప మరియు సత్యము యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి. 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి యొక్క రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే {ఆయనను} తెలియ పరచాడు. 19 మరియు యూదులు యెరూషలేము నుండి యాజకులను మరియు లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు యోహాను యొక్క సాక్ష్యము ఇదే తద్వారా వారు ఆయనను 'నీవు ఎవరివి?' అని అడుగుతారు. 20 మరియు అతడు ఒప్పుకొన్నాడు- మరియు అతడు నిరాకరించ లేదు, అయితే ఒప్పుకొన్నాడు-నేను క్రీస్తును కాను." 21 మరియు వారు అతనిని అడిగారు, "అప్పుడు ఏమిటి? నువ్వు ఏలీయావా?" మరియు అతడు చెప్పాడు, "నేను కాను." "నీవు ఆ ప్రవక్తవా?" మరియు అతడు జవాబిచ్చాడు, "కాదు." 22 అప్పుడు వారు అతనికి చెప్పారు, "నీవు ఎవరివి, తద్వారా మమ్మును పంపిన వారికి మేము జవాబు ఇస్తాము? నిన్ను గురుంచి నీవు ఏమి చెప్పుకొంటావు?" 23 అతడు చెప్పాడు, ప్రవక్తయైన యెషయా చెప్పిన విధముగా "నేను 'ప్రభువు యొక్క మార్గము తిన్ననిదిగా చేయుడి,' అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక స్వరము" 24 మరియు పంపబడిన వారు పరిసయ్యుల నుండి, 25 మరియు వారు ఆయనను అడిగారు, మరియు చెప్పారు, "నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కాని యెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావు?" 26 యోహాను వారికి జవాబిచ్చాడు, చెప్పాడు, "నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను. మీ యొక్క మధ్యలో ఒకరు నిలువబడి ఉన్నాడు మీరు ఆయనను యెరుగరు. 27 నా తరువాత వచ్చుచున్నవాడు, ఆయన యొక్క చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. 28 యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవల బేతనియలో ఈ సంగతులు జరిగాయి. 29 తరువాతి రోజు యేసు తన వద్దకు రావడం అతడు చూసాడు మరియు చెప్పాడు, "ఇదిగో, లోకం యొక్క పాపమును మోసికొనిపోవు దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల! 30 'నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నా కంటె గొప్పవాడు అయ్యాడు, ఎందుకంటే ఆయన నా ముందు ఉన్నాడు' అని నేను ఎవని గురించి చెప్పానో ఆయనే ఈయన. 31 మరియు నేను ఆయనను యెరుగను, అయితే తద్వారా ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుతాడు, దీని కారణంగా, నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చాను." 32 మరియు యోహాను సాక్ష్యమిచ్చాడు, చెప్పాడు, "ఆత్మ ఒక పావురము వలె ఆకాశము నుండి దిగిరావడం నేను చూసాను, మరియు అది ఆయన మీద నిలిచియుంది. 33 మరియు నేను ఆయనను గుర్తుపట్ట లేదు, అయితే నీళ్లలో బాప్తీస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు, ఆయన నాతో చెప్పాడు, 'ఎవని మీద ఆత్మ దిగిరావడం మరియు ఆయన మీద నిలిచి యుండడం నీవు చూచెదవో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చువాడు' అని నాతో చెప్పాడు. 34 మరియు ఈయనే దేవుని యొక్క కుమారుడు అని నేను చూసాను మరియు సాక్ష్యమిచ్చాను. 35 మరునాడు మరల యోహాను అతని ఇద్దరు శిష్యులతో నిలబడి యున్నాడు, 36 మరియు నడుచుచున్న యేసును చూచి, అతడు చెప్పాడు, "ఇదిగో, దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల!" 37 మరియు అతని ఇద్దరు శిష్యులు అయన మాట్లాడడం విన్నారు, మరియు వారు యేసును వెంబడించారు. 38 అయితే యేసు వెనుకకు తిరిగి, వారు వెంబడించడం చూచి, వారితో చెప్పాడు, "మీరు ఏమి వెదకుచున్నారు?" మరియు వారు ఆయనతో చెప్పారు, "రబ్బీ, (ఇది బోధకుడు అర్థముగా అనువదించబడింది), నీవు ఎక్కడ ఉంటున్నావు?" 39 ఆయన వారితో చెప్పాడు, "రండి మరియు మీరు చూస్తారు." కాబట్టి వారు వెళ్ళారు మరియు ఆయన ఉన్న స్థలము చూచారు, మరియు ఆ దినము ఆయన వద్ద నిలిచారు. ఇది రమారమి పదవ గంట అయ్యింది. 40 యోహాను నుండి మాట విని మరియు ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. 41 ఇతడు మొదట {తన} సొంత సహోదరుడు సీమోనును కనుగొన్నాడు మరియు అతనితో చెప్పాడు, "మేము మెస్సీయను కనుగొన్నాము" (ఇది "క్రీస్తు" అని అనువదించబడింది). 42 అతడు యేసు వద్దకు అతనిని తీసుకొని వచ్చాడు. యేసు, అతని వైపు చూచి, చెప్పాడు, "నీవు యోహాను యొక్క కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అని పిలువబడుదువు" (ఇది "పేతురు" అని అనువదించబడింది). 43 మరునాడు యేసు గలిలయకు వెళ్లడానికి కోరుకున్నాడు, మరియు ఆయన ఫిలిప్పును కనుగొన్నాడు మరియు అతనికి చెప్పాడు, "నన్ను వెంబడించుము." 44 ఇప్పుడు ఫిలిప్పు బేత్సయిదా నుండి, అంద్రెయ మరియు పేతురు యొక్క నగరము నుండి వచ్చాడు. 45 ఫిలిప్పు నతానియేలును కనుగొన్నాడు మరియు చెప్పాడు, "ధర్మశాస్త్రములో మోషే మరియు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను మేము కనుగొన్నాము - నజరేతు నుండి యోసేపు యొక్క కుమారుడు యేసు." 46 మరియు నతానియేలు ఆయనతో చెప్పాడు, "నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా?" ఫిలిప్పు అతనితో అతనితో చెప్పాడు, "రమ్ము మరియు చూడుము." 47 యేసు నతానియేలు తన వద్దకు రావడం చూచాడు మరియు అతని గురించి చెప్పాడు, "ఇదిగో ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ మోసం లేదు." 48 నతానియేలు ఆయనతో చెప్పాడు, "నన్ను నీవు ఏలాగు ఎరుగుదువు?" యేసు జవాబిచ్చాడు మరియు అతనితో చెప్పాడు, "ఫిలిప్పు నిన్ను పిలువక ముందు, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను." 49 నతానియేలు ఆయనకు ప్రత్యుత్తరమిచ్చాడు, "రబ్బీ, నీవు దేవుని యొక్క కుమారుడవు! నీవు ఇశ్రాయేలు యొక్క రాజవు!" 50 యేసు ప్రత్యుత్తరమిచ్చాడు మరియు అతనికి చెప్పాడు, "అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పిన కారణంగా నీవు నమ్ముచున్నావా? వీటి కంటె గొప్ప కార్యములు నువ్వు చూస్తావు." 51 మరియు ఆయన అతనికి చెప్పాడు, "నిజముగా, నిజముగా, నేను నీకు చెప్పుచున్నాను, "ఆకాశము తెరవబడుట మరియు దేవుని యొక్క దూతలు మనుష్యుని యొక్క కుమారుని పైగా ఎక్కుట మరియు దిగుట మీరు చూస్తారు."
Chapter 2
1 మరియు మూడవ దినమున గలిలయ యొక్క కానాలో ఒక వివాహము జరిగింది, మరియు యేసు యొక్క తల్లి అక్కడ ఉంది. 2 ఇప్పుడు యేసు కూడా ఆహ్వానించబడ్డాడు, మరియు ఆయన శిష్యులు, వివాహమునకు. 3 మరియు ద్రాక్షారసము అయిపోయింది, యేసు యొక్క తల్లి ఆయనకు చెప్పింది, "వారికి ద్రాక్షారసము లేదు." 4 మరియు యేసు ఆమెకు చెప్పాడు, "అమ్మా, నాకు ఏమిటి మరియు నీకు? నా గడియ ఇంకా రాలేదు." 5 ఆయన తల్లి సేవకులకు చెప్పింది, "ఆయన మీతో చెప్పునది ఏదైనా, చెయ్యండి." 6 ఇప్పుడు యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం కోసం ఆరు రాతి నీటి కుండలు అక్కడ నిలబెట్టబడి ఉన్నాయి, ప్రతీది రెండు లేదా మూడు తూములు [1] కలిగి ఉంటుంది. 7 యేసు వారితో చెప్పాడు, "నీటి కుండలను నీళ్లతో నింపండి." మరియు వారు వాటిని అంచుల వరకు నింపారు. 8 మరియు ఆయన వారితో చెప్పాడు, "ఇప్పుడు తీసుకోండి మరియు ప్రధాన సేవకుని వద్దకు దానిని తీసికొనివెళ్ళండి." వారు దానిని తీసికొని వెళ్ళారు. 9 అయితే ప్రధాన సేవకుడు ద్రాక్షారసముగా మారిన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు (అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియక పోయెను, అయితే - నీళ్లు తీసుకొనివచ్చిన సేవకులకు - తెలిసింది), ప్రధాన సేవకుడు పెండ్లికుమారుని పిలిచాడు 10 మరియు అతనితో చెప్పాడు, "ప్రతి మనుష్యుడు మొదట మంచి ద్రాక్షారసమును పంచుతాడు, మరియు వారు మత్తుగా మారినప్పుడు చవుకైన ద్రాక్షారసము. నీవు ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసము ఉంచావు." 11 గలిలయ యొక్క కానాలో, యేసు చేసిన సూచక్రియల యొక్క ఈ ప్రారంభం మరియు ఆయన తన మహిమను బయలుపరచాడు, మరియు ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచిరి. 12 దీని తరువాత ఆయనయు మరియు ఆయన తల్లియు మరియు సహోదరులు మరియు ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్ళారు మరియు వారు అక్కడ అనేక దినములు ఉండిపోలేదు. 13 మరియు యూదుల యొక్క పస్కాపండుగ దగ్గరగా ఉంది, మరియు యేసు యెరూషలేము వరకు వెళ్ళాడు. 14 మరియు దేవాలయములో ఎడ్లను మరియు గొఱ్ఱెలను మరియు పావురములను అమ్మువారును మరియు రూకలు మార్చువారును అక్కడ కూర్చుని ఉన్నారు. 15 మరియు త్రాళ్ల నుండి ఒక కొరడా చేసి, గొఱ్ఱెలను మరియు ఎడ్లను వాటిని అన్నిటినీ ఆయన దేవాలయములోనుండి వెలుపలికి తోలివేసాడు మరియు డబ్బును మార్చువారి నాణెములను ఆయన చెల్లాచెదుర చేసాడు మరియు వారి బల్లలు పడద్రోసాడు. 16 మరియు పావురములు అమ్మువారితో, ఆయన చెప్పాడు, "ఈ వస్తువులను ఇక్కడ నుండి తీసివెయ్యండి. నా తండ్రి యొక్క యిల్లు వ్యాపారము యొక్క ఇల్లుగా చేయ వద్దు." 17 ఆయన శిష్యులు ఇది వ్రాయబడియున్నది అని జ్ఞాపకము చేసికొన్నారు, "నీ యింటి కోసం ఆసక్తి నన్ను భక్షించుచున్నది." 18 అప్పుడు యూదులు స్పందించారు మరియు ఆయనకు చెప్పారు, "నీవు ఈ సంగతులు చేయుచున్నావు కనుక యే సూచక క్రియను మాకు చూపెదవు" 19 యేసు జవాబిచ్చాడు మరియు వారికి చెప్పాడు, "ఈ దేవాలయమును నాశనం చెయ్యండి, మరియు మూడు దినములలో నేను దానిని పైకి లేపుదును. 20 అప్పుడు యూదులు చెప్పారు, "ఈ దేవాలయము 46 సంవత్సరములలో కట్టబడింది, మరియు నీవు మూడు దినములలో దానిని లేపుదువా?" 21 అయితే ఆయన తన శరీరము యొక్క దేవాలయమును గురించి మాట్లాడుచూ ఉన్నాడు. 22 కాబట్టి, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, ఆయన ఈ మాట చెప్పాడు అని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొన్నారు, మరియు లేఖనమును మరియు యేసు చెప్పిన మాటను విశ్వసించారు. 23 ఇప్పుడు ఆయన పస్కా వద్ద, పండుగ వద్ద యెరూషలేములో ఉన్నప్పుడు, అనేకులు ఆయన చేస్తున్న సూచకక్రియలను చూచి ఆయన నామములో విశ్వాసముంచారు. 24 అయితే యేసు తానే తన్ను వారి చేతిలో ఉంచు కొనలేదు ఎందుకంటే ఆయన మనుష్యులు అందరిని యెరుగును. 25 మరియు ఎందుకంటే ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య వలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తానే మనిషిలో ఉన్నదానిని యెరుగును.
Chapter 3
1 ఇప్పుడు పరిసయ్యుల నుండి ఒక మనుష్యుడు ఉన్నాడు, అతని పేరు నీకొదేము, యూదుల యొక్క ఒక అధికారి. 2 ఇతడు రాత్రియందు ఆయన వద్దకు వచ్చాడు, "రబ్బీ [1] , నీవు దేవుని నుండి ఒక బోధకుడి వలే వచ్చావు అని మేము యెరుగుదుము, ఎందుకంటే దేవుడు అతనితో ఉంటే తప్పించి నీవు చేయుచున్న ఈ సూచకక్రియలు చెయ్యడానికి ఎవడును సమర్ధుడు కాడు." 3 యేసు జవాబిచ్చాడు మరియు అతనికి చెప్పాడు, "నిజముగా, నిజముగా నేను మీకు చెప్పుచున్నాను, ఒకడు తిరిగి జన్మించితేనే తప్పించి అతడు దేవుని రాజ్యమును చూడలేడు." 4 నీకొదేము ఆయనకు చెప్పాడు, "ముసలివాడుగా ఉన్న ఒక మనుష్యుడు ఏ విధంగా జన్మించ గలడు? అతడు రెండవమారు తన తల్లి యొక్క గర్భములోనికి ప్రవేశించ లేడు మరియు జన్మించ లేడు, అతడు చెయ్యగలడా?" 5 యేసు జవాబిచ్చాడు, "నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, ఒకడు నీరు మరియు ఆత్మ నుండి జన్మించితేనే తప్పించి, అతడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింప లేడు. 6 శరీరము నుండి జన్మించినది శరీరమునై ఉంది, మరియు ఆత్మ నుండి జన్మించినది ఆత్మయునై యున్నది. 7 'మీరు తిరిగి జన్మించి యుండడం ఇది మీ కోసం అవసరం అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడ వద్దు. 8 గాలి దానికి ఇష్టమైన చోటను విసరును, మరియు నీవు దాని శబ్దము వింటావు, అయితే అది యెక్కడ నుండి వచ్చునో లేదా యెక్కడికి పోవునో నీకు తెలియదు. కాబట్టి ఆత్మ నుండి జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడు." 9 నీకొదేము ప్రత్యుత్తరమిచ్చాడు మరియు ఆయనకు చెప్పాడు, "ఈ సంగతులు ఏలాగు సంభవించ గలవు?" 10 యేసు జవాబిచ్చాడు మరియు అతనికి చెప్పాడు, "నీవు ఇశ్రాయేలు యొక్క బోధకుడివా మరియు నీవు ఇంకా ఈ సంగతులను అర్థం చేసుకోకుండా ఉన్నావా?" 11 మేము యెరిగిన దానిని మేము చెప్పుచున్నాము, మరియు చూచినదాని గురించి మేము సాక్ష్యమిచ్చుచున్నాము, మరియు మీరు మా సాక్ష్యమును అంగీకరించరు అని నేను మీతో నిజముగా, నిజముగా చెప్పుచున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పిన మరియు మీరు నమ్మని యెడల, పరలోకసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పిన యెడల మీరు ఏవిధంగా నమ్ముతారు? 13 మరియు పరలోకము నుండి దిగివచ్చినవాడు, మనుష్యకుమారుడు తప్పించి పరలోకములోనికి ఎక్కిపోయిన వాడు ఎవరును లేడు. 14 మరియు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తిన విధముగా, ఆలాగే మనుష్యుని యొక్క కుమారును ఎత్తబడడం కోసం ఇది అవసరమైంది. 15 తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచువారు అందరు నిత్యజీవము కలిగి యుంటారు. 16 ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన {తన} అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు, తద్వారా ఆయనలో విశ్వాసముంచు ప్రతివాడును నశింపడు అయితే నిత్యజీవము కలిగి యుంటాడు. 17 ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకము లోనికి పంప లేదు తద్వారా ఆయన లోకమునకు తీర్పు తీర్చునట్లు, అయితే తద్వారా ఆయన ద్వారా లోకము రక్షణ పొందును. 18 ఆయనలో విశ్వాసముంచు వాడు తీర్పు తీర్చబడడు, అయితే విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామములో విశ్వాసముంచ లేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 19 ఇప్పుడు ఆ తీర్పు ఇదే: లోకములోనికి వెలుగు వచ్చెను, మరియు మనుష్యులు వెలుగుకు బదులు చీకటిని ప్రేమించారు, ఎందుకంటే వారి క్రియలు దుష్టమైనవి. 20 ఎందుకంటే దుష్టత్వం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, మరియు వెలుగు వద్దకు రాడు, తద్వారా అతని క్రియలు కనబడకుండా ఉంటాయి. 21 అయితే సత్యాన్ని చేయు వాడు వెలుగు వద్దకు వస్తాడు, తద్వారా తన క్రియలు ప్రత్యక్షపరచబడతాయి, అవి దేవుని మూలముగా చేయబడియున్నవి. 22 ఈ సంగతుల తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు యూదయ యొక్క ప్రదేశము లోనికి వెళ్ళారు, మరియు అక్కడ ఆయన వారితో ఆలస్యం చేసాడు, మరియు బాప్తిస్మమిచ్చుచున్నాడు. 23 ఇప్పుడు సలీము దగ్గర ఐనోననులో యోహాను కూడా బాప్తిస్మమిచ్చుచు ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఎక్కువ నీళ్లు ఉన్నాయి, మరియు వారు వస్తున్నారు మరియు బాప్తిస్మము పొందుచున్నారు- 24 ఎందుకంటే యోహాను ఇంకను చెరసాలలో త్రోయబడి యుండలేదు. 25 అప్పుడు శుద్ధీకరణ ఆచారమును గురించి యోహాను యొక్క శిష్యుల నుండి ఒక యూదునితో ఒక వివాదము వచ్చింది. 26 మరియు వారు యోహాను వద్దకు వెళ్ళారు మరియు చెప్పారు, "రబ్బీ [2] , యొర్దానుకు అవతల నీతో ఉన్నవాడు, నీవు ఎవని గురించి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు, మరియు వారు అందరు ఆయన వద్దకు వెళ్ళుచున్నారు." 27 యోహాను ప్రత్యుత్తర మిచ్చాడు మరియు చెప్పాడు, "తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే తప్పించి ఒక మనిషి ఏమియు పొంద లేడు. 28 'నేను క్రీస్తును కాను, అయితే ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను నేను' అని నేను చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29 పెండ్లికుమార్తె గలవాడు పెండ్లికుమారుడు. అయితే పెండ్లికుమారుని యొక్క స్నేహితుడు నిలువబడతాడు మరియు అతని స్వరము వింటాడు, పెండ్లికుమారుని యొక్క స్వరం కారణంగా సంతోషంతో ఉల్లసిస్తాడు. కాబట్టి, ఈ నా సంతోషము పరిపూర్ణం చెయ్యబడింది. 30 ఆయన హెచ్చవలసిన అవసరం ఉంది, అయితే నా కోసం తగ్గడానికి. 31 పై నుండి వచ్చువాడు అన్ని సంగతుల మీద ఉన్న వాడు. భూమి నుండి ఉన్న వాడు భూమి నుండి ఉన్నవాడు మరియు భూమి నుండి మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి వచ్చు వాడు అన్ని సంగతులకు పైన ఉన్నాడు. 32 తాను చూచినవి మరియు విన్నవాటిని గురించి ఆయన సాక్ష్యమిచ్చును, అయితే ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 33 ఆయన సాక్ష్యము స్వీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అని ముద్రవేసి యున్నాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుని యొక్క మాటలు మాట్లాడుతాడు. ఎందుకంటే ఆయన కొలత చేత ఆత్మను అనుగ్రహించాడు. 35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు మరియు ఆయన చేతికి అన్ని సంగతులు అప్పగించియున్నాడు. 36 కుమారునిలో విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, అయితే కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు, అయితే దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచియుండును.
Chapter 4
1 అప్పుడు యోహాను కంటె యేసు ఎక్కువమంది శిష్యులను చేసికొంటున్నాడు మరియు బాప్తిస్మము ఇచ్చుచున్నాడు అని పరిసయ్యులు విన్నారు అని యేసు తెలుసుకొన్నప్పుడు 2 (యేసు తనకు తాను బాప్తిస్మము ఇవ్వకుండా ఉన్నప్పటికీ, అయితే, ఆయన శిష్యులు), 3 ఆయన యూదయ విడిచిపెట్టాడు, మరియు గలిలయకు తిరిగి వెళ్ళాడు. 4 ఇప్పుడు సమరయ ద్వారా వెళ్లడానికి ఆయన కోసం ఇది అవసరం అయ్యింది. 5 అప్పుడు యాకోబు తన కుమారుడు యోసేపుకు ఇచ్చిన భూమి యొక్క ముక్క దగ్గర, సుఖారు అని పిలువబడిన సమరయ యొక్క ఒక పట్టాణానికి ఆయన వచ్చాడు. 6 ఇప్పుడు యాకోబు యొక్క బావి అక్కడ ఉంది. అప్పుడు యేసు, ప్రయాణము నుండి అలసట పెరిగిపోయి, ఆ బావి ప్రక్కనే కూర్చున్నాడు. అది ఇంచుమించు ఆరవ గంట [1] అయ్యింది. 7 సమరయ నుండి ఒక స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. యేసు ఆమెకు చెప్పాడు, "నాకు త్రాగడానికి ఇవ్వు," 8 ఎందుకంటే ఆయన శిష్యులు నగరం లోనికి వెళ్ళారు తద్వారా వారు ఆహారము కొంటారు. 9 అప్పుడు సమరయ స్ర్తీ ఆయనకు చెప్పింది, "నీవు యూదుడవై యుండి నీవు సమరయ స్ర్తీనైన నన్ను త్రాగడానికి ఇమ్మని యేలాగు అడుగుచున్నావు?" (ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము కలిగి యుండరు.) 10 యేసు జవాబిచ్చాడు మరియు ఆమెకు చెప్పాడు, "నీవు దేవుని యొక్క వరమును మరియు 'నాకు త్రాగడానికి ఇవ్వు' నీకు ఇది చెప్పుచున్న వాడు ఎవరో నీవు యెరిగియున్న యెడల నీవు ఆయనను అడిగి యుండేదానివి, మరియు ఆయన నీకు జీవ జలము ఇచ్చియుండే వాడు. 11 ఆ స్త్రీ ఆయనకు చెప్పింది, "అయ్యా, నీకు ఒక పాత్ర లేదు మరియు యీ బావి లోతుగా ఉంది. అప్పుడు జీవ జలము ఎక్కడి నుండి నీకు లభిస్తుంది? 12 బావిని మాకు ఇచ్చిన వాడు మరియు తానును మరియు తన కుమారులును, మరియు తన పశువులును దీని నుండి తాగిన మన తండ్రియైన యాకోబు కంటే నీవు గొప్పవాడవు కావు, నువ్వు గొప్పవాడవా?" 13 యేసు జవాబిచ్చాడు మరియు ఆమెకు చెప్పాడు, "ఈ నీళ్ల నుండి త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14 అయితే నేను వానికి ఇచ్చు నీళ్ల నుండి త్రాగువాడు ఎవరైనా నిత్యత్వంలోనికి ఎప్పటికీ దప్పిగొనడు. దానికి బదులు నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి యొక్క ఊటగా మారుతుంది. 15 ఆ స్త్రీ ఆయనకు చెప్పింది, "అయ్యా, ఈ నీళ్ళు నాకు ఇవ్వండి తద్వారా నేను దప్పిగొనకుండా ఉంటాను మరియు నీళ్ళు చేదుకోడానికి ఇక్కడికి రాకుండా ఉంటాను." 16 ఆయన ఆమెతో చెప్పాడు, "వెళ్ళు, నీ భర్తను పిలువు, మరియు ఇక్కడికి రమ్ము." 17 ఆ స్త్రీ జవాబు ఇచ్చింది మరియు ఆయనకు చెప్పింది, "నాకు భర్త లేడు." యేసు ఆమెతో చెప్పాడు, "నువ్వు సరిగా చెప్పావు, 'నాకు భర్త లేడు' 18 ఎందుకంటే నీకు అయిదుగురు భర్తలు ఉన్నారు, మరియు ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నవాడు నీ భర్త కాడు. నువ్వు చెప్పినది సత్యమే. 19 ఆ స్త్రీ ఆయనకు చెప్పింది, "అయ్యా, నీవు ప్రవక్తవు అని నేను చూస్తున్నాను." 20 మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించారు, అయితే ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు చెపుతారు." 21 యేసు ఆమెతో చెప్పాడు, "అమ్మా, నన్ను నమ్ముము, ఒక గడియ వచ్చుచున్నది అప్పుడు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. 22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసినదానిని ఆరాధిస్తాము, ఎందుకంటే రక్షణ యూదులలో నుండి ఉంది. 23 అయితే ఒక గడియ వచ్చుచున్నది, మరియు ఇప్పుడు ఉంది, నిజమైన ఆరాధికులు ఆత్మ మరియు సత్యములో తండ్రిని ఆరాధించునప్పుడు, ఎందుకంటే తన్ను ఆరాధించు అటువంటి వారిని తండ్రి కూడా కోరుచున్నాడు. 24 దేవుడు ఆత్మయై ఉన్నాడు, మరియు ఆయనను ఆరాధించు వారు, ఆత్మ మరియు సత్యములో ఆరాధించడానికి ఇది అవసరమై ఉంది. 25 ఆ స్త్రీ ఆయనతో చెప్పింది, "(క్రీస్తు అని పిలువబడిన) మెస్సీయ వచ్చుచున్నాడు అని నేను యెరుగుదును. ఆయన వచ్చినప్పుడు ఆయన మాకు ప్రతీదానిని ప్రకటిస్తాడు. 26 యేసు ఆమెతో చెప్పాడు, "నీతో మాటలాడుచున్న వాడను నేనే." 27 మరియు దీనిలో, ఆయన శిష్యులు వచ్చారు, మరియు ఆయన ఒక స్ర్తీతో మాటలాడుచున్నాడు అని ఆశ్చర్యపడ్డారు, అయిననూ "నువ్వు దేనిని వెదకు చున్నావు?" లేదా "నీవు ఎందుకు ఆమెతో మాట్లాడుచున్నావు" ఎవడును అడుగ లేదు. 28 అప్పుడు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టింది మరియు పట్టణం లోనికి తిరిగి వెళ్ళింది మరియు పురుషులకు చెప్పింది, 29 "రండి, నేను చేసిన, అన్ని సంగతులు నాతో చెప్పిన ఒక మనుష్యుని చూడండి. ఈయన క్రీస్తు కాదు, అవునా? 30 వారు పట్టణం నుండి బయటికి వెళ్ళారు మరియు ఆయన వద్దకు వచ్చారు. 31 ఆ మధ్యలో, శిష్యులు ఆయనను బతిమాలుచున్నారు, చెప్పారు, "రబ్బీ [2] , భోజనము చేయుము." 32 అయితే అయన వారితో చెప్పాడు, "భుజించడానికి మీకు తెలియని ఆహారము నేను కలిగి ఉన్నాను." 33 కాబట్టి శిష్యులు ఒకనితో ఒకడు చెప్పు కొన్నారు, "ఆయన భుజించడానికి ఎవడును ఏమియూ తీసుకు రాలేదు, ఆయన భుజించాడా? 34 యేసు వారితో చెప్పాడు, "నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుడం మరియు ఆయన కార్యము పూర్తి చెయ్యడం నా ఆహారమై యున్నది. 35 'ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి, మరియు కోతకాలము వచ్చును' అని మీరు చెప్పుదురు కాదా? ఇదిగో, నేను మీతో చెప్పుచున్నాను, మీ కన్నులు పైకి ఎత్తండి మరియు పొలములను చూడండి, ఎందుకంటే అవి ఇప్పటికే కొత్త కోసం తెల్లగా ఉన్నాయి. 36 కోత కోయువాడు జీతము పొందును మరియు నిత్య జీవం కోసం పంటను సమకూర్చుకొనుచున్నాడు తద్వారా విత్తువాడు మరియు కోత కోయువాడు ను కూడ సంతోషిస్తారు. 37 ఎందుకంటే దీనిలో మాట సత్యం, 'విత్తువాడు ఒకడు, మరియు కోత కోయువాడు మరొకడు.' 38 మీరు దేనిని గురించి గూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపాను. ఇతరులు కష్టపడ్డారు, మరియు మీరు వారి కష్టములో ప్రవేశించారు." 39 ఇప్పుడు 'నేను చేసినవి అన్నియు నాతో చెప్పెను' అని సాక్ష్య మిచ్చిన స్త్రీ యొక్క నివేదిక కారణంగా ఆ నగరం నుండి సమరయులలో అనేకులు ఆయనలో విశ్వాసముంచారు. 40 కాబట్టి సమరయులు ఆయన వద్దకు వచ్చినప్పుడు, వారు తమతో ఉండడానికి ఆయనను అడిగారు మరియు ఆయన అక్కడ రెండు దినములు ఉన్నాడు. 41 మరియు ఆయన యొక్క మాట కారణముగా ఇంకా అనేకులు నమ్మారు. 42 మరియు వారు స్త్రీతో చెప్పారు, "నీ యొక్క మాట కారణంగా మేము ఇక మీదట నమ్మము, ఎందుకంటే మా మట్టుకు మేము విన్నాము, మరియు ఈయన నిజముగా లోకము యొక్క రక్షకుడు అని మేము తెలిసికొన్నాము. 43 ఇప్పుడు ఆ రెండుదినములైన తరువాత, ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయలోనికి వెళ్ళాడు. 44 ఎందుకంటే ప్రవక్త {తన} సొంత దేశములో ఘనత పొందడు అని యేసు త్హనే సాక్ష్యము ఇచ్చాడు. 45 అప్పుడు కాబట్టి ఆయన గలిలయకు వచ్చాడు, పండుగలో యెరూషలేములో ఆయన చేసిన కార్యముములు అన్నీ చూచి, వారు కూడా పండుగకు వెళ్ళారు కనుక గలిలయులు ఆయనను స్వాగతించారు. 46 అప్పుడు తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు, మరియు అక్కడ ఒక ఒకానొక రాజ్య అధికారి ఉన్నాడు, కపెర్నహూములో అతని కుమారుడు రోగియై ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెను అని అతడు విని, ఆయన వద్దకు వెళ్ళాడు, మరియు ఆయన వచ్చి మరియు తన కుమారును స్వస్థ పరచవలెను అని అడిగాడు, ఎందుకంటే అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. 48 అప్పుడు యేసు అతనితో చెప్పాడు, "సూచక క్రియలు మరియు మహత్కార్యములను మీరు చూచితే తప్పించి మీరు ఖచ్చితంగా నమ్మరు." 49 రాజ్య అధికారి ఆయనతో చెప్పాడు, "అయ్యా, నా కుమారుడు చనిపోడానికి ముందు కిందకు రమ్ము." 50 యేసు ఆయనతో చెప్పాడు, "వెళ్లుము. నీ కుమారుడు జీవించుచున్నాడు." ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మాడు మరియు అతడు వెళ్ళాడు. 51 ఇప్పుడు అతడు కిందకు వెళ్లుచుండగా, అతని దాసులు అతనిని కలుసుకున్నారు మరియు అతనికి నివేదిక ఇచ్చారు, అతని కుమారుడు జీవిస్తున్నాడు అని చెప్పారు. 52 కాబట్టి అతడు ఏ గంటకు బాగు పడసాగెను అని వారి నుండి అడిగాడు. కాబట్టి, వారు ఆయనకు ప్రత్యుత్తర మిచ్చారు, "నిన్న ఏడవ గంటకు జ్వరము వానిని విడిచెను." 53 అప్పుడు "నీ కుమారుడు జీవించుచున్నాడు" అని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొన్నాడు. మరియు అతడును మరియు అతని యింటివారు అందరు నమ్మారు. 54 ఇప్పుడు యేసు మరల యూదయ నుండి గలిలయకు వచ్చి ఈ రెండవ సూచకక్రియ చేసాడు.
Chapter 5
1 ఈ సంగతుల తరువాత యూదుల యొక్క పండుగ ఒకటి వచ్చింది, మరియు యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. 2 ఇప్పుడు యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది, అది హెబ్రీ భాషలో బేతెస్ద అని పిలువబడింది, దానికి అయిదు మంటపములు ఉన్నాయి. 3 వీటిలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, {లేదా} పక్షవాతముతో ఉన్న ఒక్క జనసమూహము పడియున్నారు. 4 [ఎందుకంటే ప్రభువు యొక్క ఆయా సమయములకు దేవదూత కోనేటిలో వెళ్ళి మరియు నీళ్లు కదలిస్తాడు, {మరియు} నీరు కదలింపబడిన తరువాత అప్పుడు మొదట ఎవడు లోనికి దిగునో వాడు ఎట్టి వ్యాధి నుండి బాధపడినా స్వస్థపడతాడు.] 5 ఇప్పుడు ఒకానొక మనిషి అక్కడ ఉన్నాడు, తన వ్యాధిలో 38 సంవత్సరాలు ఉన్నాడు. 6 యేసు, ఇతడు అక్కడ పడియుండుట చూచి, మరియు అతడు ఇంతకు ముందే అక్కడ చాలా కాలం ఉన్నాడు అని యెరిగి, అతనికి చెప్పాడు, "ఆరోగ్యంగా ఉండడానికి నువ్వు కోరుచున్నావా?" 7 రోగియైన మనిషి ఆయనకు ప్రత్యుత్తరమిచ్చాడు, "అయ్యా, నాకు ఒక మనిషి లేడు తద్వారా, నీళ్లు కదలింపబడినప్పుడు, అతడు నన్ను కోనేటిలోనికి దించుతాడు. అయితే నేను దానిలోనికి వెళ్ళుచూ ఉండగా, మరియొకడు నాకు ముందు వెళ్తాడు." 8 యేసు అతనికి చెప్పాడు, "పైకి లెమ్ము, నీ పరుపు పైకి తీసుకో, మరియు నడువు." 9 మరియు మనిషి ఆరోగ్యవంతుడు అయ్యాడు, మరియు అతడు అతని పరుపు తీసుకొన్నాడు మరియు నడవడం ప్రారంభించాడు. ఆ రోజు సబ్బాతు దినం. 10 కాబట్టి యూదులు స్వస్థత నొందిన వానికి చెప్పారు, "ఇది విశ్రాంతిదినము మరియు నీ పరుపు మొయ్యడానికి నీ కోసం అనుమతించబడదు." 11 అయితే ఆయన వారికి ప్రత్యుత్తరము ఇచ్చాడు, "నన్ను స్వస్థపరచిన వాడు నాకు చెప్పాడు, 'నీ పరుపు ఎత్తుకొనుము మరియు నడువుము.'" 12 వారు అతనిని అడిగారు, "నీ పరుపు ఎత్తుకొనుము మరియు నడువుము' నీకు చెప్పిన మనిషి ఎవరు?" 13 అయితే ఆయన ఎవరో స్వస్థతనొందిన వానికి తెలియలేదు, ఎందుకంటే ఆ స్థలములో జనసమూహం ఉండడం చేత, యేసు రహస్యంగా వెళ్ళిపోయాడు. 14 ఈ సంగతుల తరువాత, యేసు దేవాలయములో అతనిని కనుగొని మరియు అతనికి చెప్పాడు, "ఇదిగో నువ్వు ఆరోగ్యంగా అయ్యావు! ఇక మీదట పాపం చెయ్యవద్దు, తద్వారా నీకు మరి యెక్కువ కీడు జరుగకుండా ఉంటుంది." 15 ఆ మనిషి వెళ్ళి పోయాడు మరియు తనను ఆరోగ్యవంతునిగా చేసినవాడు యేసు అని యూదులకు ప్రకటించాడు. 16 మరియు ఈ కారణంగా, యూదులు యేసును హింసించడం ఆరంభించారు, ఎందుకంటే ఆయన ఈ కార్యములను విశ్రాంతి దినమున చేస్తున్నాడు. 17 అయితే ఆయన వారికి ప్రత్యుత్తరమిచ్చాడు, "నా తండ్రి ఇప్పుడు సహితం పనిచేయుచున్నాడు, మరియు నేనును చేయుచున్నాను." 18 దీని కారణంగా, కాబట్టి, యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా వెదికారు, ఎందుకంటే ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, అయితే దేవుడు {తన} సొంత తండ్రి అని పిలుశున్నాడు, తన్ను దేవునితో సమానునిగా చేసికొంటున్నాడు. 19 కాబట్టి యేసు జవాబిచ్చాడు మరియు వారికి చెప్పాడు, "నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, దానిని మాత్రమే తప్పించి కుమారుడు తన నుండి ఏదియు చేయనేరడు, ఈ సంగతులు కూడా కుమారుడు అదే విధానంలో చేస్తాడు. 20 ఎందుకంటే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు మరియు ఆయన తానే చేయు ప్రతీ దానిని ఆయన ఆయనకు కనుపరచుచున్నాడు, మరియు వీటి కంటె గొప్ప క్రియలను ఆయనకు కనుపరచును తద్వారా మీరు ఆశ్చర్య పడతారు. 21 ఎందుకంటే తండ్రి మృతులను లేపి మరియు వారిని సజీవులను చేయు విధముగా, అదేవిధంగా కుమారుడును తనకు ఇష్టము వచ్చినవారిని సజీవులను చేయును. 22 ఎందుకంటే తండ్రి సహితం యెవనికిని తీర్పు తీర్చడు, అయితే ఆయన సమస్త తీర్పును కుమారుడికి ఇచ్చాడు. 23 తద్వారా వారు తండ్రిని ఘనపరచు విధముగా అందరు కుమారుని ఘనపరచుదురు. కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 24 నిజముగా, నిజముగా, నా మాట విని మరియు నన్ను పంపినవానిని విశ్వశించువాడు నిత్య జీవము గలవాడు మరియు తీర్పు లోనికి రాకుండా, అయితే మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు అని నేను మీకు చెప్పుచున్నాను. 25 నిజముగా, నిజముగా, ఒక గడియ వచ్చుచున్నది అని నేను మీకు చెప్పు చున్నాను, మరియు ఇప్పుడు ఉంది, మృతులు దేవుని యొక్క కుమారుని యొక్క స్వరం వినునప్పుడు, మరియు వినువారు జీవిస్తారు. 26 ఎందుకంటే తండ్రి తనంతట తానే జీవముగలవాడై ఉన్నవిధముగా ఆలాగే కూడా తనంతట తనలో జీవముగలవాడై ఉండడానికి కుమారునికి ఆయన అనుగ్రహించెను. 27 మరియు ఆయన తీర్పుతీర్చడానికి ఆయనకు అధికారము అనుగ్రహించెను, ఎందుకంటే ఆయన మనుష్యుని యొక్క కుమారుడు. 28 దీనికి ఆశ్చర్యపడకుడి, ఎందుకంటే ఒక కాలము వచ్చుచున్నది దానిలో సమాధులలో ఉన్న వారు అందరు ఆయన స్వరం వింటారు. 29 మరియు-మంచి చేసిన వారు జీవము యొక్క పునరుత్థానమునకు, అయితే కీడును అభ్యాసం చేసిన వారు, తీర్పు యొక్క పునరుత్థానమునకు బయటికి వస్తారు. 30 నా అంతట నేను ఏమీ చేయలేను. నేను విను విధముగా, నేను తీర్పు తీర్చుచున్నాను, మరియు నా తీర్పు న్యాయమైనది ఎందుకంటే నా సొంత చిత్తమును నేను వెదకను అయితే నన్ను పంపిన వాని చిత్తము. 31 నన్నుగురించి నేను సాక్ష్యము చెప్పుకొనిన యెడల, నా సాక్ష్యము సత్యము కాదు. 32 నా గురించి సాక్ష్యమిచ్చు వేరొకడు ఉన్నాడు, మరియు ఆయన నా గురించి ఇచ్చు సాక్ష్యము సత్యము అని నేను యెరుగుదును. 33 మీరు యోహాను నొద్దకు పంపారు, మరియు అతడు సత్యమునకు సాక్ష్యము ఇచ్చాడు. 34 అయితే నేను మనుష్యుని నుండి సాక్ష్యము అంగీకరింపను, అయితే నేను ఈ సంగతులు చెప్పుచున్నాను తద్వారా మీరు రక్షింప బడతారు. 35 అతడు మండుచు మరియు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు, అయితే మీరు అతని వెలుగులో ఒక గడియ కోసం ఆనందించడానికి కోరుకున్నారు. 36 అయితే నాకు సాక్ష్యము కలదు అది యోహాను సాక్ష్యము కంటె గొప్పది. ఎందుకంటే తండ్రి నాకు ఇచ్చి యున్న క్రియలు తద్వారా నేను వాటిని నెరవేర్చుదును-నేను చేయుచున్న ఆ క్రియలే -తండ్రి నన్ను పంపి యున్నాడు అని నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి. 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యము ఇచ్చాడు. మీరు ఏ కాలము నందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడ లేదు. 38 మరియు మీలో ఆయన వాక్యము నిలిచియుండ లేదు, ఎందుకంటే ఆయన ఎవరిని పంపెనో, ఆయనను మీరు నమ్మ లేదు. 39 మీరు లేఖనములను పరిశోధించుచున్నారు ఎందుకంటే వాటి యందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచున్నారు మరియు అవే నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుచున్నవి. 40 మరియు అయితే మీరు నా వద్దకు రావడానికి ఇష్టపడడం లేదు తద్వారా మీరు జీవము కలుగుతుంది. 41 నేను మనుష్యుల నుండి మహిమ పొందను, 42 అయితే మీకు దేవుని యొక్క ప్రేమ మీలో లేదు అని నేను మిమ్మును యెరుగుదును. 43 నేను నా తండ్రి యొక్క నామములో వచ్చాను, మరియు మీరు నన్ను అంగీకరించ లేదు. మరియొకడు {తన} సొంత నామములో వచ్చిన యెడల, మీరు వానిని స్వీకరిస్తారు. 44 అద్వితీయ దేవుని నుండి ఉన్న మహిమను వెదక కుండ మరియు ఒకరి నుండి ఒకరు మహిమను పొందుతూ మీరు ఏవిధంగా నమ్మ గలరు? 45 నా మట్టుకు నేను తండ్రి వద్ద మిమ్మును నిందించుదును అని ఆలోచన చెయ్య వద్దు. మీరు నిరీక్షణ కలిగి యున్న మోషే మిమ్మును నిందించు చున్నాడు. 46 ఎందుకంటే మీరు మోషేను నమ్మినట్టయిన యెడల, మీరు నన్ను నమ్ముదురు, ఎందుకంటే అతడు నా గురించి రాసాడు. 47 అయితే అతని యొక్క లేఖనములను నమ్మని యెడల, మీరు నా మాటలు ఏలాగు నమ్ముదురు?"
Chapter 6
1 ఈ సంగతుల తరువాత, యేసు (తిబెరియ యొక్క) గలిలయ యొక్క సముద్రము యొక్క మరొక ఒడ్డుకు వెళ్ళాడు. 2 ఇప్పుడు ఒక గొప్ప జనసమూహం ఆయనను అనుసరిస్తున్నారు, ఎందుకంటే రోగులుగా ఉన్న వారి మీద ఆయన చేస్తున్న సూచక క్రియలను వారు చూస్తున్నారు. 3 ఇప్పుడు యేసు పర్వతం మీదకు ఎక్కి వెళ్ళాడు, మరియు అక్కడ ఆయన తన శిష్యులతో కూర్చున్నాడు. 4 (ఇప్పుడు పస్కా, యూదుల యొక్క పండుగ, దగ్గర ఉంది.) 5 అప్పుడు యేసు, {తన} కన్నులు పైకి ఎత్తాడు మరియు ఒక గొప్ప జనసమూహం తన యొద్దకు రావడం చూసాడు, ఫిలిప్పుకు చెప్పాడు, "మనం ఎక్కడి నుండి రొట్టెను కొంటాము తద్వారా వీరు భుజిస్తారు? 6 (అయితే ఆయన దీనిని చెప్పాడు, అతనిని పరీక్షించుచు, ఎందుకంటే తాను యేమి చేయనై యుండెనో తనకుతానే యెరిగియుండెను.) 7 ఫిలిప్పు ఆయనకు జవాబిచ్చాడు, "రెండు వందల దేనారముల ఖరీదు చేసే రొట్టెలు వారి కోసం చాలవు, తద్వారా వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొంటాడు." 8 ఆయన యొక్క శిష్యులలో ఒకడు, సీమోను పేతురు యొక్క సహోదరుడు, అంద్రెయ ఆయనకు చెప్పాడు, 9 "ఇక్కడ ఒక చిన్న బాలుడు ఉన్నాడు, వాని వద్ద అయిదు యవల రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నాయి, అయితే అంత ఎక్కువ మందికి ఇవి ఏమాత్రము?" 10 యేసు చెప్పాడు, "మనుషులను కింద కూర్చుండేలా చెయ్యండి." (ఇప్పుడు ఆ స్థలంలో చాలా పచ్చిక ఉంది.) కాబట్టి సంఖ్యలో దాదాపు అయిదువేలమంది పురుషులు కూర్చున్నారు. 11 అపుడు యేసు ఆ రొట్టెలు పట్టుకొన్నాడు, మరియు కృతజ్ఞతలు చెల్లించి, భోజనం చెయ్యడానికి ఏటవాలుగా కూర్చున్న వారికి ఆయన ఇచ్చాడు, అదేవిధంగా చేపలతో కూడ, వారు కోరుకున్నంత. 12 అయితే వారు నింపబడినప్పుడు, ఆయన తన శిష్యులకు చెప్పాడు, "మిగిలిన ముక్కలు పోగుచేయుడి, తద్వారా ఏమియు నష్టం కాకుండా ఉంటాయి. 13 కాబట్టి వారు భుజించిన వారి చేత మిగిలిన అయిదు యవల రొట్టెల నుండి ముక్కలు పోగుచేసారు మరియు 12 గంపలు నింపారు. 14 కాబట్టి, ఆ మనుష్యులు ఆయన చేసిన సూచక క్రియను చూచి, చెప్పారు, "నిజముగా లోకము లోనికి రాబోవు ప్రవక్త ఈయనే." 15 అప్పుడు వారు రాబోతున్నారు మరియు ఆయనను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారు తద్వారా వారు ఆయనను రాజుగా చేయుచున్నారరు అని యేసు గుర్తించి, మరల ఒంటరిగా తనకు తాను పర్వతము మీదకు వెళ్ళిపోయాడు. 16 ఇప్పుడు ఇది సాయంకాలం అవుతూ ఉండగా, ఆయన శిష్యులు సముద్రము దగ్గరికి వెళ్లారు. 17 మరియు ఒక దోనెలోనికి చేరారు, యెక్కి సముద్రపు అవలివైపు ఉన్న కపెర్నహూమునకు పోవుచున్నారు, మరియు చీకటి అప్పటికే సంభవించింది, అయితే యేసు వారి వద్దకు ఇంకను రాలేదు. 18 ఒక బలమైన గాలి విసరుతూ ఉంది, మరియు సముద్రము రేగుతూ ఉంది. 19 అప్పుడు, దాదాపు 25 లేక 30 స్టేడియా దూరము దోనెను నడిపించి, యేసు సముద్రము మీద నడుచుచు మరియు దోనె దగ్గరకు వచ్చుట చూచారు మరియు వారు భయపడ్డారు. 20 అయితే ఆయన వారితో చెప్పాడు, "ఇది నేనే, భయపడకుడి." 21 అప్పుడు వారు ఆయనను దోనె లోనికి స్వీకరించడానికి ఇష్టపడ్డారు, మరియు వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు వచ్చాను. 22 మరుసటి రోజు, సముద్రపు ఆవలివైపు నిలిచియున్న జనసమూహము అక్కడ ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొక దోనే లేదు మరియు యేసు తన శిష్యులతో దోనెలోనికి ప్రవేశింప లేదు అయితే ఆయన శిష్యులు ఒంటరిగా వెళ్ళారు అని చూసారు. 23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి ఇతర దోనెలు వచ్చాయి. 24 కాబట్టి, యేసును ఆయన శిష్యులును అక్కడ లేరు అని జనసమూహము చూచినప్పుడు, వారు తమకి తాము దోనెలలోనికి ఎక్కారు మరియు యేసును వెదకుచు కపెర్నహూమునకు వెళ్ళారు. 25 మరియు సముద్రపు ఆవలివైపు ఆయనను కనుగొని, వారు ఆయనతో చెప్పారు, "రబ్బీ, [1] నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు?" 26 యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చాడు మరియు చెప్పాడు, "నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, మీరు సూచక క్రియలను చూచిన కారణంగా కాదు అయితే ఎందుకంటే మీరు రొట్టెల నుండి భుజించారు మరియు తృప్తి పొందారు. 27 క్షయమైపోయే ఆ ఆహారము కోసం పని చెయ్యకండి, అయితే నిత్య జీవము వరకు సహించే ఆహారం కోసం, దానిని మనుష్యుని యొక్క కుమారుడు మీకు ఇస్తాడు, ఎందుకంటే తండ్రి దేవుడు ఈయన మీద ఆయన ముద్ర ఏర్పాటు చేసాడు. 28 అప్పుడు వారు ఆయనతో చెప్పారు, "మేము ఏమి చెయ్యాలి, తద్వారా మేము దేవుని క్రియలు జరిగిస్తాము?" 29 యేసు ప్రత్యుత్తర మిచ్చాడు మరియు చెప్పాడు, "ఆయన పంపిన వానిలో మీరు విశ్వాసముంచడం అనేది ఇది దేవుని యొక్క క్రియ." 30 కాబట్టి వారు ఆయనతో చెప్పారు, "నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు తద్వారా మేము చూచి మరియు నిన్ను విశ్వసించుదుము? 31 మన తండ్రులు అరణ్యములో మన్నాను భుజించారు, ఇది వ్రాయబడిన విధముగా, 'భుజించడానికి పరలోకము నుండి ఆయన వారికి రొట్టె అనుగ్రహించాడు.'" 32 అప్పుడు యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చాడు, "నిజముగా, నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, పరలోకము నుండి వచ్చు రొట్టె మోషే మీకు ఇవ్వ లేదు, అయితే నా తండ్రి పరలోకము నుండి నిజమైన రొట్టెను మీకు అనుగ్రహించుచున్నాడు. 33 ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చుచున్న వాడు మరియు లోకమునకు జీవము నిచ్చుచున్నది దేవుని యొక్క రొట్టెయై ఉన్నది." 34 కావున వారు ఆయనతో చెప్పారు, "అయ్యా, ఈ రొట్టెను ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుము." 35 యేసు వారితో చెప్పాడు, "నేను జీవము యొక్క రొట్టెను. నా వద్దకు వచ్చుచున్నవాడు ఖచ్చితంగా ఆకలి గొనడు, మరియు నాలో విశ్వాసముంచు వాడు ఖచ్చితంగా దప్పి గొనడు. 36 అయితే మీరు నన్ను చూచారు మరియు విశ్వసించ లేదు అని నేను మీతో చెప్పాను. 37 తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరు నా వద్దకు వస్తారు, మరియు నా వద్దకు వచ్చు వానిని నేను ఖచ్చితంగా బయటికి త్రోసివేయను. 38 ఎందుకంటే నా సొంత యిష్టమును నెరవేర్చుకొనుట కోసం నేను రాలేదు, అయితే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట కోసం నేను పరలోకము నుండి దిగి వచ్చాను. 39 అయితే ఆయన నాకు అనుగ్రహించిన దాని నుండి నేను ఏమియు పోగొట్టుకొనను, అయితే అంత్య దినమున దానిని పైకి లేపుదును అనునదియే నన్ను పంపినవాని యొక్క చిత్తమై ఉన్నది. 40 ఎందుకంటే కుమారుని చూచి మరియు ఆయనలో విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము, మరియు అంత్య దినమున నేను వానిని పైకి లేపుదును. 41 అప్పుడు యూదులు ఆయనను గురించి సణుగుకొనడం ఆరంభించారు ఎందుకంటే 'నేను పరలోకము నుండి దిగి వచ్చిన రొట్టెను' అని ఆయన చెప్పాడు." 42 మరియు వారు చెప్పారు, "ఈయన యోసేపు యొక్క కుమారుడు, ఇతని తండ్రి మరియు తల్లి మనము యెరిగిన యేసు కాడా? 'నేను పరలోకము నుండి దిగి వచ్చియున్నాను' అని ఈయన ఇప్పుడు ఏలాగు చెప్పుచున్నాడు? 43 యేసు ప్రత్యుత్తరమిచ్చాడు మరియు చెప్పాడు, "మీలో మీ మధ్య సణుగుకొనకుడి. 44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే తప్పించి యెవడును నా వద్దకు రాలేడు, మరియు అంత్య దినమున నేను వానిని లేపుదును. 45 ప్రవక్తల లేఖనములలో ఇది వ్రాయబడియున్నది, 'మరియు అందరును దేవుని చేత బోధింపబడుదురు.' తండ్రి నుండి విని మరియు నేర్చుకొనిన ప్రతివాడు నా వద్దకు వచ్చును. 46 దేవుని నుండి వచ్చినవాడు తప్పించి యెవడును తండ్రిని చూచియుండ లేదు-ఆయన తండ్రిని చూచియున్నాడు. 47 నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, విశ్వసించు వాడు నిత్య జీవము గలవాడు. 48 జీవము యొక్క రొట్టె నేనే. 49 మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించారు, మరియు వారు చనిపోయారు. 50 పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే తద్వారా ఒక వ్యక్తి దీని నుండి తింటాడు మరియు చావకుండా ఉంటాడు. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ రొట్టె నుండి భుజించిన యెడల, అతడు నిత్య జీవము లోనికి జీవించును. ఇప్పుడు లోకము యొక్క జీవము కోసం నేను ఇచ్చు రొట్టె కూడా నా శరీరమే." 52 అప్పుడు యూదులు తమ మధ్యలో వాదించుకోవడానికి ఆరంభించారు, చెప్పారు, "ఈయన {తన} శరీరమును తినడానికి ఏలాగు ఇవ్వగలడు?" 53 కాబట్టి, యేసు వారికి చెప్పాడు, "నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, మనుష్యుని యొక్క కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే తప్పించి, మీలో మీరు జీవముగల వారు కారు. 54 నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగు వాడు నిత్య జీవమును కలిగిన వాడు; అంత్య దినమున నేను వానిని లేపుదును. 55 ఎందుకంటే నా శరీరము నిజమైన ఆహారము మరియు నా రక్తము నిజమైన పానమునై యున్నది. 56 నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగువాడు నాలో మరియు నేను వానిలో నిలిచియుందుము. 57 జీవముగల తండ్రి నన్ను పంపిన విధముగా, మరియు నేను తండ్రి యొక్క కారణముగా జీవించుచున్న విధముగా, కాబట్టి నన్ను తినువాడు, నా కారణంగా అతడు కూడా జీవించును. 58 ఇదే పరలోకము నుండి దిగివచ్చిన రొట్టె, పితరులు తిని మరియు చనిపోయిన విధముగా కాదు. ఈ రొట్టెను తినువాడు నిత్యత్వములోనికి జీవించును. 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ సంగతులు చెప్పాడు. 60 అప్పుడు ఆయన శిష్యులలో అనేకులు విని, చెప్పారు, "ఈ మాట కఠినమైనది; యిది ఎవడు వినగలడు?" 61 అయితే యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగుకొనుచున్నారు అని తనకు తానే యెరిగి వారితో చెప్పాడు, "ఇది మిమ్మును అభ్యంతరపరచుచున్నదా? 62 అప్పుడు మనుష్యుని యొక్క కుమారుడు మునుపు ఉన్న చోటునకు పైకి వెళ్ళడం మీరు చూచిన యెడల? 63 ఆత్మయే జీవింప చేయుచున్నాడు; శరీరము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు, మరియు అవి జీవమునైయున్నవి. 64 అయితే విశ్వసించని వారు మీలో కొందరు ఉన్నారు. ఎందుకంటే విశ్వసించని వారు ఎవరో మరియు ఆయనను ద్రోహముతో శత్రువుకు అప్పగింపబోవువాడెవడో, మొదటి నుండి యేసు యెరుగును. 65 మరియు ఆయన చెప్పాడు, "దీని కారణంగా, తండ్రి చేత వానికి ఇది అనుగ్రహింపబడితే తప్పించి ఎవడును నాయొద్దకు రాలేడు అని నేను మీతో చెప్పాను. 66 ఈ సమయం నుండి, ఆయన శిష్యులలో అనేకులు వెనుక నిలిచారు మరియు మరి ఎన్నడును ఆయనతో నడువ లేదు. 67 కాబట్టి యేసు పండ్రెండుమందికి చెప్పాడు, "మీరు కూడ వెళ్లిపోవడానికి కోరుతున్నారా, మీరు కోరుతున్నారా?" 68 సీమోను పేతురు ఆయనకు జవాబిచ్చాడు, "ప్రభువా, మేము యెవని వద్దకు వెళ్లుదుము? నీవే నిత్య జీవం యొక్క మాటలు గలవాడవు, 69 మరియు నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు అని మేము విశ్వసించాము మరియు యెరిగియున్నాము." 70 యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చాడు, "నేను మిమ్మును పండ్రెండు మందిని ఏర్పరచు కొనలేదా మరియు మీలో ఒకడు సాతాను?" 71 (ఇప్పుడు ఆయన సీమోను ఇస్కరియోతు యొక్క {కుమారుడు}, యూదా విషయం మాట్లాడుచున్నాడు, పండ్రెండు మందిలో ఒకడు, ఆయనను ద్రోహముతో శత్రువులకు అప్పగింపబోవుచున్నాడు.
Chapter 7
1 మరియు ఈ సంగతుల తరువాత, యేసు గలిలయలో ప్రయాణం చేసాడు, ఎందుకంటే ఆయన యూదయలో నడవడానికి కోరుకొన లేదు. ఎందుకంటే యూదులు ఆయనను చంపడానికి వెదకుచున్నారు. 2 (ఇప్పుడు యూదుల యొక్క పండుగ, పర్ణశాలల పండుగ సమీపంగా ఉంది.) 3 అప్పుడు ఆయన సహోదరులు ఆయనకు చెప్పారు, "ఈ స్థలము విడిచిపెట్టు మరియు యూదయకు వెళ్లు, తద్వారా నీవు చేయుచున్న ఆ క్రియలు నీ శిష్యులు కూడా చూస్తారు. 4 ఎందుకంటే ఏ ఒక్కడు దేనినైనా రహస్యంలో చెయ్యడు మరియు తన్నుతాను బహిరంగమున వెదకడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల, నిన్ను నీవే లోకమునకు కనబరచుకొనుము." 5 ఎందుకంటే ఆయన సహోదరులు కూడా ఆయనలో విశ్వాసముంచలేదు. 6 కాబట్టి యేసు వారికి చెప్పాడు, "నా సమయము ఇంకా రాలేదు, అయితే మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే యున్నది. 7 లోకము మిమ్మును ద్వేషింప లేదు, అయితే అది నన్ను ద్వేషించుచున్నది ఎందుకంటే దాని యొక్క క్రియలు చెడ్డవి అని నేను దానిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. 8 మీరు పండుగ వరకు వెళ్ళండి; నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లను, ఎందుకంటే నా సమయము ఇంకను పరిపూర్ణము కాలేదు." 9 ఇప్పుడు వారికి ఈ సంగతులు చెప్పి, ఆయన గలిలయలో నిలిచిపోయాడు. 10 అయితే ఆయన సహోదరులు పండుగ వరకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా కాకుండా అయితే రహస్యములో వలే వెళ్ళాడు. 11 కాబట్టి, పండుగ వద్ద యూదులు ఆయన కోసం వెదకుచున్నారు మరియు చెప్పుచున్నారు, "ఆయన ఎక్కడ?" 12 మరియు జనసమూహముల మధ్య ఆయనను గురించి గొప్ప సణుగు ఉంది. కొందరు చెపుతున్నారు, "ఆయన మంచివాడు." అయితే ఇతరులు చెపుతున్నారు, "లేదు, అయితే ఆయన జనసమూహములను తప్పుదారిలో నడిపిస్తున్నాడు." 13 అయితే, యూదుల యొక్క భయం కారణంగా ఆయనను గురించి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. 14 ఇప్పుడు అప్పటికే పండుగ సగము అయిపోయినప్పుడు, యేసు దేవాలయము లోనికి వెళ్ళాడు మరియు బోధించడానికి ఆరంభం చేసాడు. 15 కాబట్టి, యూదులు ఆశ్చర్యపడ్డారు, చెప్పారు, "చదువుకొన కుండా ఉన్న ఇతనికి లేఖనాలు ఏ విధంగా తెలుసు?" 16 అప్పుడు యేసు వారికి జవాబిచ్చాడు మరియు చెప్పాడు, "నా బోధ నాది కాదు, అయితే నన్ను పంపినవానిదే. 17 ఎవడైనను ఆయన చిత్తము చెయ్యడానికి కోరుకున్న యెడల, ఆ బోధ దేవుని నుండి వచ్చినదా లేదా నా నుండి నేను మాట్లాడుచున్నానా, అతడు {ఈ} బోధ గురించి తెలుసుకుంటాడు. 18 తన నుండి తాను మాట్లాడు వాడు {తన} సొంత మహిమను వెదకుచున్నాడు, అయితే తన్ను పంపినవాని యొక్క మహిమను వెదకువాడు, ఇతడు సత్యవంతుడై ఉన్నాడు, మరియు అతనిలో ఏ దుర్నీతియు లేదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇవ్వ లేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరు ఎందుకు నన్ను చంపడానికి చూచుచున్నారు?" 20 జనసమూహము జవాబిచ్చింది, "నీవు దయ్యమును కలిగి ఉన్నావు. ఎవడు నిన్ను చంపదానికి చూచుచున్నాడు?" 21 యేసు జవాబిచ్చాడు మరియు వారికి చెప్పాడు, "నేను ఒక కార్యము చేసాను, మరియు మీరు అందరు ఆశ్చర్యపడుచున్నారు. 22 ఈ కారణం కోసం, మోషే మీకు సున్నతి సంస్కారమును ఇచ్చాడు (ఇది మోషే నుండి కలిగినది కాదు, అయితే పితరుల నుండి), మరియు విశ్రాంతి దినమున మీరు ఒక మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 23 ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందిన యెడల తద్వారా మోషే యొక్క ధర్మశాస్త్రము ఉల్లంఘించబడ కుండా ఉంటుంది, నాతో మీరు ఎందుకు కోపంగా ఉన్నారు, ఎందుకంటే నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసాను. 24 ఆకారం ప్రకారం తీర్పు తీర్చ వద్దు, అయితే నీతివంతమైన తీర్పు తీర్చుడి. 25 అప్పుడు యెరూషలేమువారి నుండి కొందరు చెప్పారు, "వారు చంపడానికి వెదకు వాడు ఈయనే కాడా? 26 మరియు చూడండి, ఆయన బహిరంగముగా మాటలాడుచున్నాడు మరియు వారు ఆయనతో ఏమీ మాట్లాడరు. ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా యెరుగరు, వారు యెరుగుదురా? 27 అయితే ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనం యెరుగుదుము. అయితే క్రీస్తు వచ్చునప్పుడు, ఆయన యెక్కడి నుండి వచ్చునో యెవడును యెరుగడు. 28 అప్పుడు యేసు దేవాలయములో గట్టిగా కేక వేసాడు, బోధించుచున్నాడు మరియు చెప్పాడు, "మీరు నన్ను యెరుగుదురు మరియు నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు యెరుగుదురు. మరియు నా యంతట నేనే రాలేదు, అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు యెరుగరు. 29 నేను ఆయనను యెరుగుదును ఎందుకంటే నేను ఆయన నుండి, మరియు ఆయన నన్ను పంపాడు. 30 కాబట్టి, వారు ఆయనను బంధించడానికి వెదకచు ఉన్నారు, అయితే ఎవడును ఆయన మీద ఒక చెయ్యి వెయ్య లేదు ఎందుకంటే ఆయన గడియ యింకను రాలేదు. 31 అయితే జనసమూహము మధ్య నుండి అనేకులు ఆయనలో విశ్వాసముంచారు, మరియు వారు చెప్పారు, "క్రీస్తు వచ్చునప్పుడు, ఈయన చేసినవాటి కంటె ఎక్కువ సూచక క్రియలు ఆయన చెయ్యడు, ఆయన చేయునా?" 32 జనసమూహము ఆయనను గురించి ఈ సంగతులు సణుగుకొనుట పరిసయ్యులు విన్నారు, మరియు ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు అధికారులను పంపారు తద్వారా వారు ఆయనను పట్టుకొంటారు. 33 కాబట్టి, యేసు చెప్పాడు, "ఇంక కొంతకాలము కోసం నేను మీతో ఉంటాను, మరియు అప్పుడు నన్ను పంపినవాని వద్దకు నేను వెళ్తాను. 34 మీరు నన్ను వెదకుదురు, అయితే మీరు నన్ను కనుగొన లేరు, మరియు నేను ఎక్కడ ఉందునో మీరు రాలేరు." 35 యూదులు కాబట్టి వారిలో వారి మధ్య చెప్పారు, "మనము ఈయనను కనుగొన కుండా ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులను చెదరగొట్టడానికి మరియు గ్రీసుదేశస్థులకు బోధించడానికి ఆయన వెళ్ళబోవడం లేదు, ఆయన వెళ్తున్నాడా? 36 'మీరు నన్ను వెదకుదురు అయితే నన్ను కనుగొనరు, మరియు నేను ఎక్కడ ఉందునో, మీరు రాలేరు' అని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. 37 అయితే పండుగ యొక్క మహా దినము చివరిలో యేసు నిలిచాడు మరియు గట్టిగా అరిచాడు, చెప్పాడు, "ఎవడైనను దప్పిగొనిన యెడల, వానిని నా వద్దకు రానివ్వండి మరియు త్రాగనివ్వండి. 38 నాలో విశ్వాసముంచు వాడు, లేఖనము చెప్పిన విధముగా, "వాని కడుపు నుండి జీవ జలము యొక్క నదులు పారును." 39 (తనలో విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట ఇప్పుడు చెప్పాడు; ఎందుకంటే ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండ లేదు ఎందుకంటే యేసు ఇంకను మహిమపరచబడ లేదు. 40 అప్పుడు జనసమూహము నుండి కొందరు, ఈ మాటలు విని, చెప్పారు, "నిజముగా ఈయన ప్రవక్తయే." 41 ఇతరులు చెప్పారు, "ఈయన క్రీస్తే." అయితే కొందరు చెప్పారు, "నిజానికి, క్రీస్తు గలిలయ నుండి రాడు, ఆయన వస్తాడా?" 42 క్రీస్తు దావీదు యొక్క సంతానము నుండి మరియు దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుండి వచ్చును అని లేఖనము చెప్పడం లేదా?" 43 కాబట్టి ఆయన కారణంగా జనసమూహములో ఒక భేదము సంభవించింది. 44 (ఇప్పుడు వారిలో కొందరు ఆయనను బంధించడానికి కోరుకున్నారు, అయితే యెవడును ఆయన మీద చేతులు వెయ్యలేదు. 45 అప్పుడు అధికారులు మరల ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల వద్దకు వచ్చారు, మరియు వారు వారితో చెప్పారు, "ఎందుకు మీరు ఆయనను తీసికొని రాలేదు?" 46 అధికారులు జవాబిచ్చారు, "ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు." 47 కాబట్టి పరిసయ్యులు వారికి ప్రత్యుత్తరమిచ్చారు, "మీరు కూడ మోసగించబడలేదా? మీరు అయ్యారా? 48 అధికారుల నుండి మరియు పరిసయ్యుల నుండి యెవడైనను ఆయనయందు విశ్వాసముంచ లేదు, వారు ఉంచారా? 49 అయితే ఈ జనసమూహము ధర్మశాస్త్రమును యెరుగదు, వారు శాపగ్రస్తులు." 50 నీకొదేము (అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన వారిలో ఉన్న ఒకడు) వారితో చెప్పాడు, 51 "మన ధర్మశాస్త్రము అతని నుండి మొదట వినకుండా మరియు అతడు వాడు చేసినది తెలిసికొంటే తప్పించి ఒక మనుష్యునికి తీర్పు తీర్చదు, అది చేస్తుందా?" 52 వారు జవాబిచ్చారు మరియు ఆయనకు చెప్పారు, "నీవు కూడా గలలియ నుండి కాదు, నువ్వు ఆ వ్యక్తివా?" పరిశోధించు, మరియు గలిలయ నుండి ఏ ప్రవక్తయు పైకి లేవడు. 53 అప్పుడు ప్రతి ఒక్కరు తన {సొంత} యింటికి వెళ్ళారు.
Chapter 8
1 ఇప్పుడు యేసు ఒలీవల యొక్క పర్వతానికి వెళ్ళాడు. 2 ఇప్పుడు ఉదయంలో పెందలకడనే ఆయన తిరిగి దేవాలయమునకు వచ్చాడు, మరియు మనుష్యులు అందరు ఆయన వద్దకు వచ్చారు. 3 ఇప్పుడు శాస్త్రులు మరియు పరిసయ్యులు వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు, మరియు వారు ఆమెను మధ్య ఉంచారు. 4 యాజకులు ఆయనకు చెప్పారు, ఆయనకు వ్యతిరేకంగా ఒక నేరము కలిగి యుండడం కోసం ఆయనను పరీక్షిస్తున్నారు, "బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము యొక్క క్రియలో పట్టబడింది. 5 ఇప్పుడు ధర్మశాస్త్రములో, అటువంటి వారిపై రాళ్లురువ్వడానికి మోషే మనకు ఆజ్ఞాపించాడు, అయితే ఇప్పుడు నువ్వు ఏమి చెపుతావు?" 6 అయితే యేసు కిందకు వంగి, నేల మీద {తన} వ్రేలితో వ్రాయడానికి ఆరంభించాడు. 7 అయితే వారు ఆయనను ప్రశ్నలు అడగడం కొనసాగించారు, ఆయన నిలబడ్డాడు మరియు వారికి చెప్పాడు, "మీలో పాపము లేని ఒకడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయ నివ్వండి." 8 మరియు మరల కిందకు వంగి, ఆయన నేలమీద {తన} వ్రేలితో వ్రాసాడు. 9 అయితే యూదులలో ప్రతి ఒక్కరు, పెద్దవారుతో మొదలుకొని బయటికి వెళ్ళారు, తద్వారా వారు అందరూ బయటికి వెళ్ళారు, మరియు మధ్యలో ఉన్న ఆ స్త్రీతో ఆయన ఒక్కడే మిగిలి పోయాడు. 10 మరియు యేసు, పైకి లేచి నిలబడ్డాడు, స్త్రీ కి చెప్పాడు "వారు ఎక్కడ వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా?" 11 మరియు ఆమె ఆయనకు చెప్పింది, "ఒక్కరూ విధించలేదు ప్రభువా." మరియు ఆయన చెప్పాడు, "నేనును నీకు శిక్ష విధింపను. వెళ్ళు, ఇప్పటి నుండి ఇక మీదట పాపము చేయకు."] 12 అప్పుడు మరల యేసు వారితో మాట్లాడాడు, చెప్పాడు, "నేను లోకము యొక్క వెలుగును; నన్ను వెంబడించువాడు ఖచ్చితంగా చీకటిలో నడువడు అయితే జీవం యొక్క వెలుగు గలిగి యుండును." 13 అప్పుడు పరిసయ్యులు ఆయనకు చెప్పారు, "నిన్నుగురించి నీవు సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు." 14 యేసు జవాబిచ్చాడు మరియు వారితో చెప్పాడు, "నన్నుగురించి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే. ఎందుకంటే నేను ఎక్కడనుండి వచ్చితినో మరియు ఎక్కడికి వెళ్లుదునో నేను యెరుగుదును, అయితే నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో లేదా నేను ఎక్కడికి వెళ్లుచున్నానో మీరు యెరుగరు. 15 మీరు శరీరము ప్రకారం తీర్పు తీర్చుచున్నారు; నేను ఎవరికిని తీర్పు తీర్చను. 16 అయితే నేను తీర్పు తీర్చినప్పటికీ, నా తీర్పు సత్యమే, ఎందుకంటే నేను ఒంటరిగా లేను, అయితే నేను మరియు నన్ను పంపిన తండ్రి. 17 అయితే మీ ధర్మశాస్త్రములో సహితం ఇద్దరు మనుష్యుల యొక్క సాక్ష్యము సత్యము అని ఇది వ్రాయబడియున్నది. 18 నన్నుగురించి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను, మరియు నన్ను పంపిన తండ్రియు నన్నుగురించి గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు." 19 కాబట్టి, వారు ఆయనతో చెప్పారు, "నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?" యేసు జవాబిచ్చాడు, "మీరు నన్నైనను నా తండ్రినైనను యెరుగరు, మీరు నన్ను యెరిగిన యెడల, మీరు నా తండ్రిని కూడ యెరిగి యుంటారు." 20 ఆయన ఈ మాటలు కానుక పెట్టె యున్నచోట చెప్పాడు, దేవాలయములో బోధించుచున్నాడు, మరియు ఎవడును ఆయనను పట్టుకొనలేదు ఎందుకంటే ఆయన గడియ యింకను రాలేదు. 21 అప్పుడు మరల ఆయన వారికి చెప్పాడు, "నేను వెళ్లిపోవుచున్నాను, మరియు మీరు నన్ను వెదకుదురు, మరియు మీ పాపములో మీరు చనిపోవుదురు; నేను వెళ్లు చోటికి మీరు రాలేరు." 22 అప్పుడు యూదులు చెప్పారు, "అతడు తన్నుతాను చంపుకోడు, అతడు చేస్తాడా? అందుకే అతడు 'నేను వెళ్లు చోటికి మీరు రాలేరు' అని చెప్పుచున్నాడా?" 23 మరియు ఆయన వారికి చెప్పాడు, "మీరు క్రింది సంగతుల నుండి ఉన్నారు; నేను పైన సంగతుల నుండి ఉన్నాను. మీరు ఈ లోకము నుండి ఉన్నారు; నేను ఈ లోకము నుండి కాదు. 24 కాబట్టి, మీరు మీ పాపముల చనిపోవుదురు అని నేను మీతో చెప్పాను. ఎందుకంటే నేను ఆయనను అని మీరు విశ్వసించితే తప్పించి మీరు మీ పాపములో చనిపోవుదురు. 25 కాబట్టి, వారు ఆయనతో చెప్పారు, "నీవు ఎవరివి?" యేసు వారితో చెప్పాడు, "నేను మొదట నుండి మీతో ఏమి చెప్పుచూ ఉన్నాను? 26 మిమ్మును గురించి చెప్పడానికి మరియు తీర్పు తీర్చడానికి నేను చాలా సంగతులు కలిగి యున్నాను. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు; మరియు నేను ఆయన నుండి వినిన సంగతులు, ఈ సంగతులు నేను లోకమునకు చెప్పుచున్నాను." 27 (తండ్రి గురించి తమతో ఆయన మాట్లాడుతున్నాడు అని వారు గ్రహించ లేదు. 28 అప్పుడు యేసు వారితో చెప్పాడు, "మీరు మనుష్యుని యొక్క కుమారుని పైకెత్తినప్పుడు, నేనే ఆయనను అని మరియు నా అంతట నేను ఏమీ చెయ్యను అని మీరు తెలుసుకొంటారు. అయితే తండ్రి నాకు నేర్పిన విధముగా, నేను ఈ సంగతులు మాటలాడుచున్నాను." 29 మరియు నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్ట లేదు, ఎందుకంటే నేను ఎల్లప్పుడు ఆయనకు ఇష్టమైన కార్యము చేస్తాను. 30 ఆయన ఈ సంగతులు మాటలాడుచూ ఉండగా, అనేకులు ఆయనలో విశ్వాసం ఉంచారు. 31 యేసు అప్పుడు ఆయనలో విశ్వాసముంచిన యూదులతో "మీరు నా వాక్యములో నిలిచినవారైన యెడల, మీరు నిజముగా నాకు శిష్యులై యుంటారు. 32 మరియు మీరు సత్యమును తెలుసుకొంటారు మరియు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది." 33 వారు ఆయనకు ప్రత్యుత్తరమిచ్చారు, "మేము అబ్రాహాము యొక్క సంతానము మరియు మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదు, 'మీరు స్వతంత్రులుగా చేయబడుదురు' అని ఏవిధంగా చెపుతారు?" 34 యేసు వారికి జవాబిచ్చాడు, నిజముగా, నిజముగా, పాపము చేయు ప్రతివాడును పాపము యొక్క దాసుడు అని నేను మీతో చెప్పుచున్నాను. 35 ఇప్పుడు దాసుడు నిత్యత్వం లోనికి ఇంటిలో నిలిచి ఉండడు; కుమారుడు నిత్యత్వం లోనికి నిలిచి యుంటాడు. 36 కాబట్టి, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల, మీరు నిజముగా స్వతంత్రులైయుందురు. 37 మీరు అబ్రాహాము యొక్క సంతానము అని నాకు తెలియును, అయితే మీరు నన్ను చంపడానికి వెదకుచున్నారు, ఎందుకంటే నా వాక్యముకు మీలో చోటు లేదు. 38 నేను తండ్రితో ఏమి చూసానో, నేను చెపుతున్నాను; మరియు కాబట్టి, మీరు తండ్రి నుండి ఏమి విన్నారో, మీరు జరిగించుచున్నారు. 39 వారు జవాబిచ్చారు మరియు ఆయనతో చెప్పారు, "మా తండ్రి అబ్రాహాము." యేసు వారితో చెప్పాడు, "మీరు అబ్రాహాము యొక్క పిల్లలు అయిన యెడల, మీరు అబ్రాహాము యొక్క క్రియలు చేస్తారు. 40 అయితే ఇప్పుడు మీరు నన్ను చంపడానికి వెదకుచున్నారు, దేవుని నుండి నేను వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన మనిషి. అబ్రాహాము దీనిని చేయ లేదు. 41 మీరు మీ తండ్రి యొక్క క్రియలే చేయుచున్నారు." అప్పుడు వారు ఆయనకు చెప్పారు, "మేము లైంగిక దుర్నీతి నుండి పుట్టినవారము కాము; మేము ఒక్క తండ్రిని కలిగి యున్నాము: దేవుడు. 42 యేసు వారితో చెప్పాడు, "దేవుడు మీ తండ్రియైన యెడల, మీరు నన్ను ప్రేమింఛి యుండేవారు, ఎందుకంటే నేను దేవుని వద్ద నుండి వచ్చాను మరియు ఇక్కడ ఉన్నాను; ఎందుకంటే నా అంతట నేనే వచ్చియుండ లేదు, అయితే ఆయన నన్ను పంపాడు. 43 దీని యొక్క కారణముగా మీరు నా మాటలు అర్థం చేసుకోలేదు? ఇది ఎందుకంటే మీరు నా మాటలు విన లేకుండా ఉన్నారు. 44 మీరు {మీ} తండ్రి నుండి ఉన్నారు, సాతాను, మరియు మీరు మీ తండ్రి యొక్క కోరికలు చెయ్యడానికి కోరుచున్నారు. ఆది నుండి వాడు ఒక నరహంతకుడై ఉన్నాడు మరియు సత్యములో నిలువ లేదు, ఎందుకంటే వానిలో సత్యము లేదు. వాడు అబద్ధము చెప్పునప్పుడు, వాడు {తన} సొంత {స్వభావము} నుండి మాట్లాడుతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు దాని యొక్క తండ్రి. 45 నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. 46 పాపము విషయములో మీలో ఎవడు నన్ను ఒప్పిస్తాడు? నేను సత్యము చెప్పుచున్న యెడల, మీరు ఎందుకు నన్ను నమ్మరు? 47 దేవుని నుండి ఉన్నవాడు దేవుని యొక్క మాటలు వింటాడు; ఈ కారణం చేత మీరు వినరు ఎందుకంటే మీరు దేవుని నుండి ఉన్న వారు కాదు. 48 యూదులు జవాబిచ్చారు మరియు ఆయనకు చెప్పారు, "నీవు ఒక సమరయుడవు మరియు ఒక దయ్యము కలిగి యున్న వాడవు అని మేము సరిగా చెప్పడం లేదా?" 49 యేసుజవాబిచ్చాడు, "నేను దయ్యము కలిగిన వాడను కాను, అయితే నేను నా తండ్రిని ఘనపరచుచున్నాను, మరియు మీరు నన్ను అగౌరవపరచుచున్నారు. 50 ఇప్పుడు నేను నా మహిమను వెదకడం లేదు. వెదకుచున్న మరియు తీర్పుతీర్చు చున్న వాడు ఒకడు ఉన్నాడు. 51 నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, ఎవడైనను నా మాట గైకొనిన యెడల, అతడు ఖచ్చితంగా నిత్యత్వం లోనికి మరణము చూడడు." 52 యూదులు ఆయనతో చెప్పారు, "నీవు దయ్యము పెట్టినవాడవు అని ఇప్పుడు మేము యెరుగుదుము; అబ్రాహాము మరియు ప్రవక్తలు చనిపోయారు; అయితే మీరు చెపుతారు, 'ఎవడైనను నా మాట గైకొనిన యెడల, వాడు ఖచ్చితంగా నిత్యత్వంలోనికి మరణము రుచిచూడడు." 53 చనిపోయిన మన తండ్రి అబ్రాహాము కంటే మీరు గొప్పవారు కాదు, మీరు గొప్పవారా? ప్రవక్తలు కూడా చనిపోయారు. మిమ్మల్ని మీరు ఎవరిగా ఉండడానికి చేసుకుంటారు? 54 యేసు జవాబిచ్చాడు, "నన్ను నేను మహిమపరచుకొనిన యెడల, నా మహిమ వట్టిది; 'ఆయన మా దేవుడు' అని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. 55 మరియు మీరు ఆయనను ఎరుగరు, అయితే నేను ఆయనను ఎరుగుదును. మరియు నేను ఆయనను ఎరుగను అని చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడనై యుందును. అయితే నేను ఆయనను యెరుగుదును మరియు ఆయన మాట గైకొనుచున్నాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా దినము చూతును అని ఆనందించాడు, మరియు అతడు చూచాడు మరియు సంతోషించాడు. 57 కాబట్టి యూదులు ఆయనకు చెప్పారు, "నీకు ఇంకా 50 సంవత్సరములు లేవు, మరియు నీవు అబ్రాహామును చూచితివా?" 58 యేసు వారికి చెప్పాడు, "నిజముగా, నిజముగా, అబ్రాహాము రావడానికి ముందు నేను ఉనికిలో ఉన్నాను." 59 కాబట్టి, వారు ఆయన మీద విసురుటకు రాళ్లు పైకి ఎత్తారు, అయితే యేసు తనను తాను దాచుకొన్నాడు మరియు దేవాలయము నుండి బయటికి వెళ్లిపోయాడు.
Chapter 9
1 మరియు ప్రయాణిస్తూ ఉండగా, ఆయన పుట్టుక నుండి గ్రుడ్డియైన ఒక మనుష్యుని చూసాడు. 2 మరియు ఆయన శిష్యులు ఆయనను అడిగారు, చెప్పారు, "రబ్బీ, ఎవరు పాపము చేసారు, వీడా లేదా ఇతని తల్లిదండ్రులా, తద్వారా ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు? 3 యేసు జవాబిచ్చాడు, "ఈ వ్యక్తి గానీ, లేదా ఇతని తల్లిదండ్రులు గానీ పాపం చెయ్యలేదు, అయితే తద్వారా దేవుని యొక్క క్రియలు అతనిలో బయలుపరచబడతాయి. 4 ఇది పగలుగా ఉన్న సమయంలో నన్ను పంపిన వాని యొక్క క్రియలు మనము చెయ్యడానికి మన కోసం ఇది అవసరమై ఉంది. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఏ ఒక్కడు పని చేయలేడు. 5 నేను లోకములో ఉన్నప్పుడు, నేను లోకము యొక్క వెలుగై ఉన్నాను. 6 ఈ సంగతులు చెప్పి, ఆయన నేలమీద ఉమ్మివేసాడు మరియు ఉమ్మి నుండి బురద చేసాడు మరియు {అతని} కన్నుల మీద బురద అతని మీద పూసాదు. 7 మరియు ఆయన అతనికి చెప్పాడు, "వెళ్ళు, సిలోయము యొక్క కోనేటిలో కడుగుకొను," (ఇది "పంపబడినవాడు" అని అనువదించబడింది). కాబట్టి అతడు వెళ్ళాడు మరియు కడుగుకొన్నాడు మరియు చూపు తిరిగి వచ్చింది. 8 అప్పుడు పొరుగువారు మరియు ఇంతకుముందు అతనిని చూచిన వారు, అతడు ఒక భిక్షమెత్తుకొనువాడు అని, చెప్పడం ఆరంభించారు, "వీడు కూర్చుండి మరియు భిక్షమెత్తుకొనుచున్నాడు కాడా?" 9 కొందరు వ్హేప్పారు, "ఇది వీడే." ఇతరులు చెప్పారు, "కానే కాదు, అయితే అతడు ఇతని వలే ఉన్నాడు." అతడు చెపుతూ ఉన్నాడు, "ఇది నేనే." 10 కాబట్టి, వారు అతనికి చెప్పారు, "నీ కన్నులు ఏలాగు తెరవబడ్డాయి?" 11 వాడు జవాబిచ్చాడు, "యేసు అని పిలువబడిన ఒక మనిషి బురదను చేసాడు మరియు {దానిని} నా కన్నుల మీద పూసాడు మరియు నాకు చెప్పాడు, 'సిలోయముకు వెళ్ళు మరియు శుద్ధి చేసుకో.' కాబట్టి వెళ్లాను మరియు శుద్ధి చేసుకొన్నాను, నేను నా చూపు పొందాను." 12 మరియు వారు అతనికి చెప్పారు, "ఆయన ఎక్కడ ఉన్నాడు?" అతడు చెప్పాడు, "నాకు తెలియదు." 13 వారు మునుపు గ్రుడ్డియై యుండిన వాడు, అతనిని పరిసయ్యుల వద్దకు తీసుకు వచ్చారు. 14 (ఇప్పుడు ఇది విశ్రాంతి దినము, ఆ రోజున యేసు బురద చేసాడు మరియు అతని కన్నులు తెరిచాడు.) 15 అతడు ఏ విధంగా అతని చూపు పొందెనో పరిసయ్యులు కూడా అతనిని అడగడం ఆరంభించారు. అయితే అతడు వారికి చెప్పాడు, "ఆయన నా కన్నుల మీద బురద ఉంచాడు, మరియు నేను శుద్ధి చేసుకొన్నాను, మరియు నేను చూచు చున్నాను. 16 అప్పుడు పరిసయ్యులలో కొందరు చెప్పారు, "ఈ మనుష్యుడు దేవుని నుండి వచ్చినవాడు కాడు ఎందుకంటే అతడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు. ఇతరులు చెప్పారు, "పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియలు ఏలాగు చేయగలడు?" మరియు వారి మధ్య ఒక భేదము ఉంది. 17 కాబట్టి, వారు మరల ఆ గ్రుడ్డివానిని అడిగారు, "అతడు నీ కన్నులు తెరచిన కారణంగా నీవు అతని గురించి ఏమను కొనుచున్నావు?" మరియు అతడు చెప్పాడు, "ఆయన ఒక ప్రవక్త." 18 కాబట్టి, అతడు గుడ్డి వాడైయున్నాడు మరియు {తన} చూపు మరల పొందాడు అని అతని తల్లిదండ్రులను పిలిచే వరకు యూదులు నమ్మలేదు. 19 మరియు వారు అతనిని అడిగారు, చెప్పారు, "పుట్టు గుడ్డివాదుగా పుట్టాడు అని మీరు చెప్పుచున్న మీ కుమారుడు ఇతడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడు?" 20 కాబట్టి అతని తలిదండ్రులు జవాబిచ్చారు మరియు చెప్పారు, "ఇతడు మా కుమారుడు అని మరియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేము యెరుగుదుము. 21 అయితే అతడు ఇప్పుడు ఏవిధంగా చూచుచున్నాడు, మేము యెరుగము, లేదా అతని కళ్ళు ఎవరు తెరిచారో మేము యెరుగము. అతనిని అడగండి; అతనికి పూర్ణ పరిణత ఉంది. తన కోసం అతడు మాట్లాడుతాడు." 22 అతని తల్లిదండ్రులు ఈ సంగతులు చెప్పారు ఎందుకంటే వారు యూదులకు భయపడి ఉన్నారు. ఎందుకంటే ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజమందిరములో నుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు అంగీకరించారు. 23 దీని కారణంగా, అతని తల్లిదండ్రులు చెప్పారు, "అతడు పూర్తి పరిణత కలిగి యున్నాడు, అతనినిఅదగండి." 24 కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు వారు గుడ్డివాడుగా ఉన్న ఆ మనిష్యుని పిలిచారు మరియు చెప్పారు, "దేవునికి మహిమ ఇవ్వు. ఈ మనుష్యుడు పాపి అని మేము యెరుగుదుము." 25 అప్పుడు అతడు ప్రత్యుత్తరమిచ్చాడు, "ఆయన పాపియో కాడో నేను యెరుగను. ఒకటి సంగతి నేను యెరుగుదును: నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు నేను చూచుచున్నాను. 26 అప్పుడు వారు ఆయనకు చెప్పారు, "ఆయన నీకు ఏమి చేసాడు? ఆయన నీ కన్నులు ఏలాగు తెరచెను?" 27 వాడు వారికి జవాబు చెప్పాడు, "నేను ఇంతకు ముందు మీతో చెప్పాను, మరియు మీరు వినలేదు! మీరు ఎందుకు మరల వినడానికి కోరుతున్నారు? మీరు ఆయన శిష్యులుగా కూడా మారడానికి కోరడం లేదు, మీరు కోరుతున్నారా? 28 మరియు వారు ఆయనను దూషించారు మరియు చెప్పారు, "నీవు అతని యొక్క శిష్యుడవు, అయితే మేము మోషే యొక్క శిష్యులము. 29 దేవుడు మోషేతో మాటలాడెను అని మనము యెరుగుదుము, అయితే వీడు ఎక్కడ నుండి వచ్చెనో యెరుగము." 30 ఆ మనుష్యుడు జవాబిచ్చాడు, "ఇప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరు యెరుగకపోవుట ఇది ఒక గుర్తింపదగిన సంగతి, మరియు అయినా ఆయన నా కన్నులు తెరచాడు. 31 దేవుడు పాపులను ఆలకింపడు అని మనం యెరుగుదుము, అయితే ఎవడైనను దేవభక్తుడై యుండి మరియు ఆయన చిత్తము జరిగించిన యెడల, ఆయన ఇతనిని ఆలకిస్తాడు. 32 పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరచారు అని నిత్యత్వం నుండి ఇది ఎప్పుడో వినబడ లేదు. 33 ఈయన దేవుని నుండి కాని యెడల, ఆయన ఏమియు చేయ లేదు." 34 వారు జవాబిచ్చారు మరియు ఆయనకు చెప్పారు, "నీవు సంపూర్ణంగా పాపములలో పుట్టావు, మరియు నీవు మాకు బోధించుచున్నావు? మరియు వారు అతనిని వెలుపలికి త్రోసివేసారు. 35 వారు అతనిని వెలుపలికి త్రోసివేసారు అని విన్నాడు, మరియు వానిని కనుగొని, ఆయన చెప్పాడు, "నీవు మనుష్యుని యొక్క కుమారునిలో విశ్వాసముంచుచున్నావా"?" 36 అతడు ప్రత్యుత్తరమిచ్చాడు, మరియు చెప్పాడు, "అయ్యా, అయన ఎవరు, తద్వారా నేను ఆయనలో విశ్వాసముంచుదును." 37 యేసు అతనితో చెప్పాడు, "నీవు ఆయనను చూచుచున్నావు, మరియు నీతో మాటలాడుచున్నవాడు ఆయనే." 38 ఇప్పుడు అతడు చెప్పాడు, "ప్రభువా, నేను విశ్వసించుచున్నాను" మరియు అతడు ఆయనను ఆరాధించాడు. 39 మరియు యేసు చెప్పాడు, "తీర్పు కోసం నేను ఈ లోకములోనికి వచ్చాను, తద్వారా చూడనివారు చూస్తారు మరియు చూచువారు గ్రుడ్డివారు అవుతారు." 40 ఆయనతో ఉన్న పరిసయ్యులలో {కొందరు} ఈ సంగతులు విన్నారు మరియు ఆయనను అడిగారు, "మేము కూడా గ్రుడ్డివారము కాము, మేము అవునా?" 41 యేసు వారితో చెప్పాడు, "మీరు గ్రుడ్డివారైన యెడల, మీకు పాపము లేక పోవును, అయితే ఇప్పుడు మీరు చెప్పుచున్నారు, 'మేము చూచుచున్నాము.' మీ పాపము నిలిచియున్నది.
Chapter 10
1 "నిజముగా, నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, గొఱ్ఱెల దొడ్డిలోనికి ద్వారము ద్వారా ప్రవేశించ కుండా, అయితే వేరొక మార్గమున ఎక్కువాడు, వాడు ఒక దొంగయు మరియు ఒక దోచుకొనువాడునై యున్నాడు. 2 అయితే ద్వారము ద్వారా ప్రవేశించువాడు గొఱ్ఱెల యొక్క కాపరియై ఉన్నాడు. 3 ద్వారపాలకుడు ఇతని కోసం తెరుస్తాడు, మరియు గొఱ్ఱెలు అతని స్వరము వింటాయి, మరియు అతడు {తన} సొంత గొఱ్ఱెలను పేరు చేత పిలుస్తాడు మరియు వాటిని వెలుపలికి నడిపించును. 4 మరియు అతడు {తన} సొంత గొఱ్ఱెలు అన్నిటిని వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు, అతడు వాటికి ముందుగా వెళ్ళును, మరియు గొఱ్ఱెలు అతనిని వెంబడించును ఎందుకంటే అవి అతని స్వరమును యెరుగును. 5 ఇప్పుడు అవి నిశ్చయముగా ఒక అన్యుని అనుసరించవు, అయితే అవి అతని నుండి పారిపోవును, ఎందుకంటే అన్యుల యొక్క స్వరము అవి యెరుగవు. 6 యేసు ఈ ఉపమానం వారికి చెప్పాడు, అయితే ఆయన తమతో చెపుతున్నది ఇది ఏమిటో అని వారు గ్రహించుకొన లేదు. 7 కాబట్టి యేసు మరల వారికి చెప్పాడు, "నిజముగా, నిజముగా, నేను మీతో చెప్పుచున్నాను, నేను గొఱ్ఱెల యొక్క ద్వారమును నేనే. 8 నాకు ముందు వచ్చిన ప్రతి ఒక్కడు ఒక దొంగ మరియు ఒక దోచుకొనువాడు, అయితే గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు. 9 నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైన ప్రవేశించిన యెడల, అతడు రక్షింపబడును, మరియు అతడు లోపలికి వెళ్ళును మరియు బయటికి వెళ్ళును మరియు మేతను కనుగొనును. 10 దొంగ తాను దొంగతనమును మరియు హత్యను మరియు నాశనమును చేయుదానికి తప్పించి మరి దేనికిని రాడు. నేను వచ్చాను తద్వారా అవి జీవమును కలిగి యుంటాయి మరియు దానిని సమృద్ధిగా కలిగియుంటాయి. 11 నేను మంచి కాపరిని. మంచి కాపరి గొఱ్ఱెల కోసం తన ప్రాణము పెట్టును. 12 మరియు అద్దె మనిషి, గొఱ్ఱెల కాపరిగా ఉండక, అతనికి గొఱ్ఱెలు తన సొంతవి కావు, తోడేలు వచ్చుట చూస్తాడు మరియు గొఱ్ఱెలను విడిచిపెడతాడు మరియు తప్పించుకొనిపారిపోతాడు, మరియు తోడేలు బలాత్కారముగా పట్టుకొంటుంది మరియు వాటిని చెదరగొట్టును. 13 ఎందుకంటే అతడు ఒక అద్దె మనిషి, మరియు గొఱ్ఱెలను గురించి అతనికి ఇది ఒక శ్రద్ధ కాదు. 14 నేను మంచి కాపరిని, మరియు నా యొక్క వాటిని నేను యెరుగుదును, మరియు నా యొక్క అవి నన్ను యెరుగును. 15 తండ్రి నన్ను యెరుగిన విధంగా, మరియు నేను తండ్రిని యెరుగుదును; మరియు గొఱ్ఱెల కోసం నా ప్రాణము పెట్టుచున్నాను. 16 మరియు గొర్రెల దొడ్డి నుండి కాని ఇతర గొఱ్ఱెలును నాకు కలవు. వాటిని కూడ నేను తీసుకొని రావలసిన అవసరం ఉంది, మరియు అవి నా స్వరము వినును మరియు అప్పుడు మంద ఒక్కటి, గొఱ్ఱెల కాపరి ఒక్కడు అవుతారు. 17 ఈ కారణంగా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నేను నా ప్రాణము పెట్టుచున్నాను తద్వారా నేను దానిని మరల తీసికొంటాను. 18 ఎవడును దానిని నా నుండి తీసికొనడు, అయితే నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, మరియు దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి నుండి ఈ ఆజ్ఞ పొందాను. 19 ఈ మాటల కారణంగా యూదుల మధ్య మరల భేదము సంభవించింది. 20 ఇప్పుడు వారిలో అనేకులు చెపుతున్నారు, "అతడు ఒక దయ్యమును కలిగి యున్నాడు, మరియు వెఱ్ఱివాడు. అతని మాట మీరు ఎందుకు వినుచున్నారు?" 21 ఇతరులు చెపుతున్నారు, "ఇవి దయ్యము పెట్టినవాని మాటలు కావు. ఒక దయ్యము గ్రుడ్డి వారి కన్నులు తెరవ లేదు, వాడు చెయ్యగలడా?" 22 అప్పుడు ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరిగింది. అది శీతకాలము. 23 మరియు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున నడుచుచుచున్నాడు. 24 యూదులు ఆయన చుట్టు పోగయ్యారు మరియు ఆయనకు చెప్పడం ఆరంభించారు, "ఎంతకాలము మా జీవాన్ని తీసి వేస్తావు? నీవు క్రీస్తువు అయిన యెడల, మాతో స్పష్టముగా చెప్పుము." 25 యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు, "నేను మీకు చెప్పాను, అయితే మీరు నమ్మడం లేదు. నా తండ్రి నామములో నేను చేయుచున్న క్రియలు, ఇవి నన్నుగురించి సాక్ష్యమిచ్చుచున్నవి. 26 అయితే మీరు మీరు నమ్మరు ఎందుకంటే మీరు నా గొఱ్ఱెల నుండి ఉన్న వారు కారు. 27 నా గొఱ్ఱెలు నా స్వరము వినును, మరియు నేను వాటిని యెరుగుదును, మరియు అవి నన్ను వెంబడించును. 28 మరియు నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, మరియు అవి ఖచ్చితంగా నిత్యత్వం లోనికి నశింపవు, మరియు ఎవడును వాటిలో దేనినీ నా చేతిలో నుండి లాగుకొన లేడు. 29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరి కంటె గొప్పవాడు, మరియు తండ్రి యొక్క చేతిలో నుండి యెవడును వాటిని లాగుకొన లేడు; 30 నేను మరియు తండ్రి ఏకమై యున్నాము." 31 యూదులు మరల రాళ్ళు తీసుకొన్నారు తద్వారా వారు ఆయనను రాళ్ళతో కొట్టవచ్చు. 32 యేసు వారికి జవాబిచ్చాడు, "నేను తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించాను. వాటిలో ఏ క్రియల కోసం నన్ను రాళ్లతో కొట్టుచున్నారు?" 33 యూదులు ఆయనకు జవాబిచ్చారు, "ఒక మంచి క్రియ కోసం మేము నిన్ను రాళ్ళతో కొట్టడం లేదు, అయితే దేవదూషణ కోసం, మరియు ఎందుకంటే నీవు ఒక మనుష్యుడవు, నిన్ను నీవు దేవునిగా చేసుకొంటున్నావు." 34 యేసు వారికి జవాబిచ్చాడు, "మీరు దైవములు'' 'నేను చెప్పాను' మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?" 35 దేవుని యొక్క వాక్యము ఎవరికి వచ్చెనో వారిని దైవములు అని చెప్పిన యెడల, (మరియు లేఖనము విచ్చిన్నం కాలేదు), 36 తండ్రి ప్రతిష్ఠ చేసి మరియు ఈ లోకములోనికి పంపినవానితో 'నీవు దేవదూషణ చేయుచున్నావు' అని మీరు చెప్పుదురా, ఎందుకంటే నేను చెప్పాను, 'నేను దేవుని యొక్క కుమారుడను?' 37 నేను నా తండ్రి యొక్క క్రియలు చేయని యెడల. నన్ను నమ్మ వద్దు. 38 అయితే నేను వాటిని చేసిన యెడల, నన్ను నమ్మకుండా ఉన్నప్పటికీ, ఆ క్రియలను నమ్ముడి తద్వారా తండ్రి నాలో మరియు నేను తండ్రిలో ఉన్నాము అని మీరు తెలుసుకుంటారు మరియు అర్థం చేసుకుంటారు. 39 కాబట్టి, వారు మరల ఆయనను పట్టుకోడానికి వెదకుచున్నారు, అయితే ఆయన వారి చేతినుండి వెలుపలికి వెళ్ళాడు. 40 మరియు యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన మరల వెళ్ళాడు, మరియు ఆయన అక్కడ నిలిచాడు. 41 మరియు అనేకులు ఆయన వద్దకు వచ్చారు మరియు చెప్పారు, "నిజానికి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు, అయితే ఈయనను గురించి యోహాను చెప్పిన అన్నీ సత్యమైనవి. 42 మరియు అక్కడ అనేకులు ఆయనలో విశ్వాసముంచారు.
Chapter 11
1 ఇప్పుడు మరియ మరియు ఆమె సహోదరి మార్త యొక్క గ్రామం నుండి, బేతనియ నుండి లాజరు, ఒకానొక మనిషి రోగి అయ్యాడు. 2 ఇప్పుడు ప్రభువును బోళముతో అభిషేకించి మరియు తన తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచింది ఈ మరియనే, ఆమె సహోదరుడు లాజరు రోగిగా ఉన్నాడు. 3 కాబట్టి, సోదరీలు ఆయన వద్దకు పంపారు, చెప్పారు, "అయ్యా, ఇదిగో, నువ్వు ప్రేమించు వాడు రోగియై యున్నాడు." 4 అయితే ఇది విని, యేసు చెప్పాడు, "ఈ వ్యాధి మరణానికి కాదు అయితే దేవుని యొక్క మహిమ కోసం తద్వారా దేవుని యొక్క కుమారుడు దాని చేత మహిమ పరచబడతాడు. 5 (ఇప్పుడు యేసు మార్తను మరియు ఆమె సహోదరిని మరియు లాజరును ప్రేమించెను.) 6 కాబట్టి, అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు, అప్పుడు నిజానికి ఆయన తాను ఉన్న స్థలములోనే రెండు దినములు నిలిచాడు. 7 అప్పుడు దీని తరువాత ఆయన శిష్యులకు చెప్పాడు, "మనము యూదయకు తిరిగి వెళ్దాము." 8 శిష్యులు ఆయనకు చెప్పారు, "రబ్బీ [1] , యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్దానికి వెదకుచున్నారు, మరియు నీవు అక్కడికి తిరిగి వెళ్లుదువా?" 9 యేసు జవాబిచ్చాడు, "రోజులో 12 ఉన్నవి కాదా? ఒకడు పగటివేళ నడిచిన యెడల, అతడు తొట్రు పడడు, ఎందుకంటే ఈ లోకము యొక్క వెలుగు చేత అతడు చూచును. 10 అయితే రాత్రి యందు ఒకడు నడిచిన యెడల, అతడు తొట్రుపడును ఎందుకంటే అతనిలో వెలుగులేదు." 11 ఆయన ఈ సంగతులు చెప్పాడు, మరియు దీని తరువాత, ఆయన వారికి చెప్పాడు, "మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు; అయితే నేను వెళ్తున్నాను తద్వారా అతనిని నిద్ర నుండి మేలుకొలుపుతాను. 12 కాబట్టి, శిష్యులు ఆయనకు చెప్పారు, "ప్రభువా, అతడు నిద్రపోయిన యెడల, అతడు కోలుకుంటాడు." 13 (ఇప్పుడు యేసు అతని మరణము గురించి చెప్పాడు, అయితే వారు ఆయన గాఢ నిద్ర యొక్క మత్తు గురించి చెప్పాడు అని తలంచారు.) 14 కాబట్టి, యేసు వారికి స్పష్టంగా చెప్పాడు, "లాజరు చనిపోయాడు. 15 మరియు నేను అక్కడ ఉండలేదు అని మీ నిమిత్తము సంతోషంగా ఉన్నాను, తద్వారా మీరు విశ్వసిస్తారు. అయితే మనం అతని వద్దకు వెళ్లుదము." 16 కాబట్టి దిదుమ అని పిలువబడిన తోమా, {తన} తోటి శిష్యులతో చెప్పాడు, "మనం కూడా వెళ్దాము, తద్వారా ఆయనతో కూడ చనిపోవుదము." 17 కాబట్టి, యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెను అని కనుగొన్నాడు. 18 ఇప్పుడు బేతనియ యెరూషలేమునకు దగ్గరగా ఉంది, దాదాపు 15 స్టేడియా [2] దూరంలో ఉంది. 19 మరియు యూదులలో అనేకులు మార్త మరియు మరియ వద్దకు వచ్చారు తద్వారా వారు {తమ} సహోదరుని గురించి ఓదార్చుతారు. 20 అప్పుడు మార్త, "యేసు వచ్చుచున్నాడు" అని వినినప్పుడు ఆయనను కలుసుకోడానికి వెళ్ళింది, అయితే మరియ యింటిలో కూర్చుండి ఉంది. 21 మార్త అప్పుడు యేసుతో చెప్పింది, "ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల, నా సహోదరుడు చావ కుండా ఉండే వాడు." 22 అయితే ఇప్పుడైనను, నీవు దేవుని నుండి ఏమైనను అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని నేను యెరుగుదును." 23 యేసు ఆమెతో చెప్పాడు, "నీ సహోదరుడు తిరిగి లేచును." 24 మార్త ఆయనతో చెప్పింది, "అంత్య దినమున పునరుత్థానములో అతడు లేచును అని నేను యెరుగుదును." 25 యేసు ఆమెకు చెప్పాడు, "పునరుత్థానమును మరియు జీవమును నేనే; నాలో విశ్వాసముంచు వాడు, అతడు చనిపోయిన యెడల కూడా, బ్రదుకును; 26 మరియు బ్రదికి మరియు నాలో విశ్వాసముంచు ప్రతివాడును ఖచ్చితంగా నిత్యత్వంలో చని పోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. 27 ఆమె ఆయనతో చెప్పింది, "అవును, ప్రభువా, నీవు లోకములోనికి వచ్చుచున్న దేవుని యొక్క కుమారుడు, క్రీస్తువు అని నమ్ముచున్నాను. 28 మరియు ఇది చెప్పి, ఆమె వెళ్ళిపోయింది మరియు ఆమె సహోదరి మరియను రహస్యంగా పిలిచింది, చెప్పింది, "బోధకుడు ఇక్కడ ఉన్నాడు మరియు నిన్ను పిలుస్తున్నాడు." 29 ఇప్పుడు ఆమె దీనిని వినినప్పుడు, ఆమె త్వరగా పైకి లేచింది మరియు ఆయన వద్దకు వెళ్ళింది. 30 (ఇప్పుడు యేసు ఇంకా ఆ గ్రామము లోనికి రాలేదు, అయితే మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉన్నాడు. 31 అప్పుడు యింటిలో ఆమెతో ఉన్న యూదులు మరియు ఆమెను ఓదార్చుచున్నారు, మరియ త్వరగా పైకి లేచి మరియు బయటికి వెళ్ళడం చూచి, ఆమె సమాధి వద్ద ఏడ్వడం కోసం వెళ్లుచున్నది అని తలంచి ఆమెను అనుసరించారు. 32 అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి త్వరగా వచ్చింది, ఆయనను చూచి, ఆమె ఆయన పాదముల వద్ద పడింది, ఆయనతో చెప్పింది, "ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల, నా సహోదరుడు చావకుండ ఉండేవాడు." 33 అప్పుడు కాబట్టి ఆమె ఏడ్వవడం మరియు ఆమెతో వచ్చిన యూదులు ఏడ్వవడం యేసు చూసాడు, ఆయన లోతుగా ఆత్మలో కలవరపడ్డాడు, మరియు ఆయన తనలో తాను ఇబ్బంది పడ్డాడు. 34 మరియు ఆయన చెప్పాడు, "మీరు అతనిని ఎక్కడ ఉంచారు?" వారు ఆయనతో చెప్పారు, "ప్రభువా, రండి మరియు చూడండి." 35 యేసు ఏడ్చాడు. 36 అప్పుడు యూదులు చెప్పారు, "ఇదిగో ఆయన అతనిని ఎంతో ప్రేమించాడు!" 37 అయితే వారిలో కొందరు చెప్పారు, "ఆ గ్రుడ్డి మనిషి యొక్క కన్నులు తెరచిన వాడు ఈయనేనా, కార్యం చెయ్యలేక పోయాడు, తద్వారా ఇతడు కూడా చావకుండ ఉండే వాడు. 38 కాబట్టి, యేసు మరల తనలో లోతుగా కలవరపడ్డాడు, సమాధి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు అది యొక గుహ, మరియు దానికి వ్యతిరేకంగా ఒక రాయి పెట్టి ఉంది. 39 యేసు చెప్పాడు, "రాయి తీసివేయుడి." చనిపోయినవాని యొక్క సహోదరి మార్త ఆయనకు చెప్పింది, "ప్రభువా, అతడు ఇప్పటికి వాసనకొట్టును, ఎందుకంటే ఇది నాలుగు రోజులు అయ్యింది." 40 యేసు ఆమెకు చెప్పాడు, "నీవు నమ్మిన యెడల, నీవు దేవుని యొక్క మహిమను చూస్తావు, అని నేను నీతో చెప్పలేదా?" 41 కాబట్టి, వారు ఆ రాయి తీసివేసారు. అప్పుడు యేసు {తన} కన్నులు పైకెత్తాడు మరియు చెప్పాడు, "తండ్రీ, నీవు నన్ను విన్నావు అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42 ఇప్పుడు నీవు ఎల్లప్పుడు వింటావు అని నేను యెరుగుదును, అయితే చుట్టు నిలిచియున్న జనసమూహము యొక్క కారణంగా నేను దీనిని చెప్పుచున్నాను, తద్వారా నీవు నన్ను పంపావని వారు నమ్ముతారు. 43 మరియు ఇది చెప్పి, ఒక పెద్ద స్వరంతో ఆయన ఆయన అరిచాడు, "లాజరూ, బయటికి రమ్ము!" 44 చనిపోయినవాడు బయటికి వచ్చాడు, అతని కాళ్లు మరియు చేతులు వస్త్రములతో కట్టబడి ఉన్నాయి, మరియు అతని ముఖము ఒక వస్త్రముతో కట్టబడి ఉంది. యేసు వారితో చెప్పాడు, "అతనిని కట్లువిప్పండి, మరియు అతనిని పోనివ్వండి." 45 కాబట్టి, మరియ వద్దకు వచ్చిన మరియు యన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయనలో విశ్వాసముంచారు. 46 అయితే వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళారు, మరియు యేసు చేసిన కార్యములను వారితో చెప్పారు. 47 కాబట్టి, ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు మహా సభను కలిపి సమకూర్చారు మరియు చెప్పారు, "మనము ఏమి చేస్తాము, ఎందుకంటే ఈ మనుష్యుడు అనేక సూచక క్రియలు చేయుచున్నాడు.? 48 మనము ఆయనను ఈ విధంగా ఒంటరిగా విడిచిపెట్టిన యెడల, అందరు ఆయనలో విశ్వాసము ఉంచుతారు మరియు రోమీయులు వస్తారు మరియు మన స్థలమును మన జనమును తీసుకొని వెళ్తారు. 49 అయితే వారి మధ్య, కయప, ఒకానొక మనిషి, ఆ సంవత్సరము అతడు ప్రధాన యాజకుడు, వారికి చెప్పాడు, "మీకు ఏమీ తెలియదు. 50 జనము అంతా నశింప కుండా మరియు ఒక మనుష్యుడు మనుష్యుల కోసం చనిపోవడం మీ కోసం ఇది ఉత్తమం అని మీరు దానిని ఆలోచించరు." 51 (ఇప్పుడు తన నుండి ఆయన ఇది చెప్పలేదు, అయితే ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై యుండి, యేసు జనము కోసం చనిపోబోతున్నాడు అని అతడు ప్రవచించాడు, 52 మరియు ఆ జనము కోసం మాత్రమే కాదు, అయితే తద్వారా చెదరిపోయిన దేవుని యొక్క పిల్లల కూడా ఏకమగుట లోనికి కలిపి సమకూర్చబడుటకు చావనైయున్నాడు.) 53 కాబట్టి, ఆ దినము నుండి వారు కుట్ర పన్నారు తద్వారా వారు ఆయనను మరణానికి గురి చేస్తారు. 54 కాబట్టి, యేసు ఇక మీదట యూదుల మధ్య బహిరంగముగా నడవ లేదు, అయితే ఆయన అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనికి, ఎఫ్రాయిము అని పిలువబడిన ఒక పట్టణం లోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో ఉన్నాడు. 55 ఇప్పుడు యూదుల యొక్క పస్కాపండుగ సమీపంగా ఉంది, మరియు అనేకులు పస్కా రాకమునుపే పల్లెటూరు నుండి యెరూషలేము వరకు వెళ్ళారు తద్వారా వారు తమ్మును తాము శుద్ధి చేసుకొంటారు. 56 కాబట్టి వారు యేసు కోసం వెదకుచున్నారు, మరియు వారు దేవాలయములో నిలువబడి యుండగా "మీకు ఇది ఏమి కనిపిస్తుంది? ఆయన పండుగకు ఖచ్చితంగా రాడు? అని ఒకనితో ఒకడు చెప్పుకొన్నారు. 57 ఇప్పుడు ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు ఒక ఆదేశాన్ని ఇచ్చారు తద్వారా ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల, అతడు దానిని తెలియజేయాలి తద్వారా వారు ఆయనను పట్టుకొంటారు.
Chapter 12
1 అప్పుడు, పస్కాకు ఆరు రోజులు ముందు, యేసు బేతనియకు వచ్చాడు, అక్కడ లాజరు ఉన్నాడు, అతనిని యేసు మృతుల నుండి లేపాడు. 2 కాబట్టి వారు అక్కడ ఆయనకు ఒక విందు చేసారు, మరియు మార్త ఉపచారము చేయుచుండెను, అయితే లాజరు ఆయనతో భోజనము చేయడానికి ఏటవాలుగా కూర్చున్నవారిలో ఒకడు. 3 అప్పుడు మరియ, చాలా అమూల్యమైన శుద్ధ జటామాంసి యొక్క అత్తరు నూనె యొక్క సుమారు ఒక అర కిలో బరువు తీసికొని, యేసు యొక్క పాదములను అభిషేకించింది మరియు తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఇప్పుడు ఇల్లు ఆ అత్తరు నూనె యొక్క సువాసనతో నిండింది. 4 అయితే ఆయన శిష్యులలో ఒకడు, ఇస్కరియోతు యూదా, ఆయనను ద్రోహముతో శత్రువులకు అప్పగించబోతున్నవాడు, చెప్పాడు, 5 "ఏ కారణం కోసం ఈ అత్తరు నూనెను మూడు వందల దేనారములకు అమ్మలేదు మరియు బీదలకు ఇయ్యలేదు?" 6 (ఇప్పుడు అతడు దీనిని చెప్పాడు, బీదల గురించి అతనికి ఇది ఒక శ్రద్ధయై ఉన్న కారణంగా కాదు, అయితే అతడు ఒక దొంగయై ఉన్న కారణంగా, మరియు డబ్బు సంచి కలిగి యుండి, దానిలో వేయబడినది అతడు దొంగిలించుచు ఉన్నాడు.) 7 కాబట్టి యేసు చెప్పాడు, "ఆమెను ఒంటరిగా విడిచిపెట్టండి తద్వారా నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొంటుంది. 8 ఎందుకంటే బీదలను మీరు ఎల్లప్పుడు కలిగి ఉంటారు, అయితే మీరు ఎల్లప్పుడూ నన్ను కలిగి యుండరు. 9 అప్పుడు యూదుల యొక్క ఒక పెద్ద జన సమూహం ఆయన అక్కడ ఉన్నాడు అని తెలిసికొన్నారు, మరియు యేసు కోసం మాత్రమే కాదు, అయితే తద్వారా మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడ చూడగలరని వారు వచ్చారు. 10 అయితే ప్రధాన యాజకులు దురాలోచన చేసారు తద్వారా వారు లాజరును కూడ చంప వచ్చు. 11 అతని కారణంగా యూదులలో అనేకులు వెళ్లి పోయారు మరియు యేసులో విశ్వాసముంచారు. 12 తరువాత రోజున ఆ పండుగకు వచ్చిన గొప్ప జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడు అని విని, 13 ఖర్జూరపు చెట్ల యొక్క కొమ్మలు తీసుకొన్నారు మరియు ఆయనను కలుసుకోడానికి వెలుపలికి వెళ్ళారు, మరియు గట్టిగా అరిచారు, "హోసన్నా! ప్రభువు యొక్క నామములో వచ్చుచున్న వాడు, ఇశ్రాయేలు యొక్క రాజు సహితం స్తుతింపబడును." 14 ఇప్పుడు యేసు, ఒక చిన్న గాడిదను కనుగొని, దాని మీద కూర్చున్నాడు, ఇది రాయబడిన విధముగా, 15 "సీయోను యొక్క కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద యొక్క పిల్లమీద కూర్చొని వచ్చుచున్నాడు." 16 ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట గ్రహింపలేదు; అయితే యేసు మహిమ పరచబడినప్పుడు, అప్పుడు ఈ సంగతులు ఆయనను గురించి వ్రాయబడెను అని, వారు ఈ సంగతులను ఆయనకు చేసారు అని జ్ఞాపకము చేసుకొన్నారు. 17 అప్పుడు ఆయన లాజరును సమాధిలో నుండి వెలుపలికి పిలిచి మరియు మృతులలో నుండి అతనిని లేపినప్పుడు, ఆయనతో ఉండిన జనసమూహం సాక్ష్యమిచ్చారు. 18 ఈ కారణంగా కూడా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెలుపలికి వెళ్ళారు: ఎందుకంటే ఆయన ఈ సూచక క్రియ చేసాడు అని వారు విన్నారు. 19 కాబట్టి, పరిసయ్యులు వారిమధ్య చెప్పుకొన్నారు, "మీరు ఏమీ సాధించడం లేదు అని మీరు చూస్తున్నారు! ఇదిగో లోకము ఆయన వెంటపోయింది." 20 ఇప్పుడు కొందరు గ్రీసుదేశస్థులు పైకి వెళ్తున్న వారిలో ఉన్నారు తద్వారా వారు ఆ పండుగలో ఆరాధిస్తారు. 21 అప్పుడు ఈ పురుషులు ఫిలిప్పు వద్దకు వెళ్ళారు, అతడు గలిలయలోని బేత్సయిదా నుండి {ఉన్నవాడు}, మరియు అతనిని అడిగారు, చెప్పారు, "అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము." 22 ఫిలిప్పు వెళ్ళాడు మరియు అంద్రెయతో చెప్పాడు; అంద్రెయ మరియు ఫిలిప్పు వెళ్ళారు మరియు యేసుతో చెప్పారు. 23 ఇప్పుడు యేసు వారికి జవాబిస్తూఉన్నాడు, "గడియ వచ్చింది తద్వారా మనుష్యుని యొక్క కుమారుడు మహిమ పొందుతాడు." 24 నిజముగా, నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, గోధుమ యొక్క గింజ, భూమిలోనికి పడి చనిపోతే తప్పించి, అది తానంతట అదే నిలిచిపోతుంది; అయితే అది చచ్చిన యెడల, అది అధికముగా ఫలాన్ని కాస్తుంది. 25 తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, అయితే ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. 26 ఎవడైనను నన్ను సేవించిన యెడల, అతడు నన్ను వెంబడింప నివ్వండి; మరియు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. ఎవడైనను నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. 27 ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, మరియు నేను ఏమి చెప్పుదును? 'తండ్రీ, ఈ గడియ నుండి నన్ను రక్షించు'? అయితే దీని కోసం నేను ఈ గడియకు వచ్చితిని. 28 తండ్రీ, నీ నామము మహిమపరచుము." అప్పుడు "నేను దానిని మహిమపరచితిని మరియు మరల దానిని మహిమ పరతును" అని ఒక స్వరము ఆకాశము నుండి వచ్చింది. 29 అప్పుడు దగ్గర నిలుచుండిన జనసమూహము, కూడా దీనిని విన్నారు, ఉరుము సంభవించింది అని చెప్పారు, ఇతరులు చెప్పారు, "ఓక దూత ఆయనతో మాటలాడెను." 30 యేసు జవాబిచ్చాడు మరియు చెప్పాడు, "ఈ స్వరం నా కోసం రాలేదు, అయితే నీ కోసం. 31 ఇప్పుడు ఈ లోకము యొక్క తీర్పు ఉంది. ఇప్పుడు ఈ లోకం యొక్క అధికారి బయటకు త్రోసివేయబడును; 32 మరియు నేను, భూమి నుండి పైకెత్తబడిన యెడల, అందరిని నా వద్దకు ఆకర్షించుకొందును. 33 ఇప్పుడు తాను ఏ విధమైన చావు మరణించ వలసి ఉందొ సూచించడానికి ఆయన ఇది చెప్పుచున్నాడు. 34 అప్పుడు జనసమూహము ఆయనకు జవాబిచ్చింది, "క్రీస్తు నిత్యత్వం లోనికి నిలిచి యుంటాడు అని ధర్మశాస్త్రము నుండి మేము విన్నాము. మరియు మనుష్యుని యొక్క కుమారుడు పైకెత్తబడడడం కోసం ఇది అవసరం అని నీవు ఏవిధంగా చెప్పుచున్నావు? ఈ మనుష్యుని యొక్క కుమారుడు ఎవరు? 35 యేసు అప్పుడు వారితో చెప్పాడు, "ఇంక కొంతకాలము వెలుగు మీతో ఉండును. మీకు వెలుగు ఉండగనే నడవండి, తద్వారా చీకటి మిమ్మును అధిగమించకుండా ఉంటుంది. మరియు చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. 36 మీరు వెలుగు కలిగియుండగానే, వెలుగులో విశ్వాసముంచండి, తద్వారా మీరు వెలుగు యొక్క కుమారులుగా ఉంటారు. యేసు ఈ సంగతులు చెప్పాడు, మరియు వెళ్ళి పోయి, వారి నుండి దాగి యున్నాడు. 37 ఆయన వారి ముందు అనేకమైన సూచక క్రియలు చేసినప్పటికీ, వారు ఆయనలో విశ్వాసము ఉంచలేదు. 38 తద్వారా ప్రవక్త యెషయా యొక్క వాక్యము నెరవేర్చబడుతుంది, దానిలో అతడు చెప్పాడు, "ప్రభువా, మా నివేదిక ఎవరు నమ్మారు, మరియు ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? 39 ఈ కారణం కోసం వారు నమ్మ లేక పోయారు, ఎందుకంటే యెషయా మరల చెప్పాడు, 40 ఆయన వారి కన్నులకు గుడ్డితనం కలుగచేసాడు, మరియు ఆయన వారి హృదయమును కఠినపరచెను, తద్వారా వారు {తమ} కన్నులతో చూడడం మరియు {తమ} హృదయంతో అర్థం చేసుకోవడం లేకుండా ఉంటారు, మరియు వెనుకకు తిరుగుతారు, మరియు నేను వారిని స్వస్థ పరుస్తాను. 41 యెషయా ఈ సంగతులు చెప్పాడు ఎందుకంటే అతడు ఆయన మహిమను చూసాడు మరియు ఆయనను గురించి మాట్లాడాడు. 42 అయితే అయినను, అధికారులు అనేకులు సహితం ఆయనలో విశ్వాసముంచారు, అయితే పరిసయ్యుల కారణంగా, వారు దానిని ఒప్పుకోవడం లేదు, తద్వారా వారు సమాజ మందిరములో నుండి బయటికి పంపివేయబడకుండా ఉంటారు. 43 ఎందుకంటే వారు దేవుని యొక్క మహిమ కంటె మనుష్యుల యొక్క మహిమను ప్రేమించారు. 44 ఇప్పుడు యేసు గట్టిగా అరిచాడు మరియు చెప్పాడు, "నాలో విశ్వాసముంచు వాడు నాలో మాత్రమే కాదు అయితే నన్ను పంపినవానిలో కూడా విశ్వాసముంచుచున్నాడు. 45 మరియు నన్ను చూచుచున్న వాడు నన్ను పంపినవానిని చూచుచున్నాడు. 46 నేను ఈ లోకమునకు ఒక వెలుగు వలే వచ్చియున్నాను, తద్వారా నాలో విశ్వాసముంచు అందరు చీకటిలో నిలిచి యుండరు. 47 మరియు ఎవడైనను నా మాటలు విని మరియు వాటిని గైకొనకుండా ఉండిన యెడల, నేను అతనికి తీర్పుతీర్చను; ఎందుకంటే నేను లోకమునకు తీర్పు తీర్చుట కోసం నేను రాలేదు, అయితే తద్వారా నేను లోకమును రక్షించుడును. 48 నన్ను నిరాకరించుచు మరియు నా మాటలు అంగీకరించని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాట, అంత్య దినమున ఇది అతనికి తీర్పు తీర్చును. 49 ఎందుకంటే నా అంతట నేను మాటలాడ లేదు, అయితే నన్ను పంపిన వాడు, తండ్రి తానే, నేను ఏమి చెప్పాలి మరియు ఏమి మాట్లాడాలి దానిని గురించి నాకు ఆజ్ఞ యిచ్చియున్నాడు. 50 మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము అని నేను యెరుగుదును. కాబట్టి, నేను చెప్పుచున్నది, తండ్రి నాతో మాట్లాడిన విధముగా, ఆ విధంగా నేను చెప్పుచున్నాను."
Chapter 13
1 ఇప్పుడు పస్కా యొక్క పండుగకు ముందు తన గడియ వచ్చింది అని యేసు యెరిగాడు తద్వారా ఆయన ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్తాడు. లోకములో ఉన్న {తన} వారిని ప్రేమించి, ఆయన వారిని అంతము వరకు ప్రేమించాడు. 2 మరియు రాత్రి భోజనము జరుగుతున్నప్పుడు, సీమోను ఇస్కరియోతు యొక్క {కుమారుడు} యూదా యొక్క హృదయములో సాతాను ఇంతకుముందు ఉంచియున్నాడు, తద్వారా అతడు ఆయనను అప్పగిస్తాడు. 3 తండ్రి ఆయనకు ప్రతీదానిని ఇచ్చాడు అని, {తన} చేతులలోనికి, మరియు తాను దేవుని యొద్ద నుండి వచ్చాడు మరియు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాడు అని యెరిగి, 4 ఆయన రాత్రి భోజనం నుండి లేచి మరియు {తన} పైవస్త్రము తీసివేసాడు. మరియు ఒక తువాలు తీసికొని, ఆయన దానిని తన చుట్టూ కప్పుకున్నాడు. 5 అప్పుడు ఆయన ఒక పళ్లెములో నీళ్లు పోసి మరియు శిష్యుల యొక్క పాదములు కడగడానికి మరియు తన చుట్టూ కట్టుకొని ఉన్న తువాలుతో వాటిని తుడవదానికి మొదలుపెట్టాడు. 6 తరువాత ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చాడు. అతడు ఆయనకు చెప్పాడు, "ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా?" 7 యేసు జవాబిచ్చాడు మరియు అతనికి చెప్పాడు, "నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, అయితే ఈ సంగతుల తరువాత నువ్వు తెలుసుకొంటావు." 8 పేతురు ఆయనకు చెప్పాడు, "నిత్యత్వంలో నువ్వు నా పాదములు ఖచ్చితంగా కడుగ కూడదు." యేసు అతనికి జవాబిచ్చాడు, "నేను నిన్ను కడుగని యెడల, నాతో నీకు పాలు లేదు." 9 సీమోను పేతురు ఆయనకి చెప్పాడు, "ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, అయితే {నా} చేతులు మరియు {నా} తల కూడ. 10 యేసు అతనికి చెప్పాడు, "స్నానము చేసినవాడు {తన} పాదములు కడుగుకోడానికి తప్పించి అవసరం లేదు, అయితే అతడు సంపూర్ణంగా శుద్ధుడయ్యాడు, మరియు మీరు శుద్ధులై ఉన్నారు, అయితే అందరు కాదు. 11 (ఎందుకంటే తనను ద్రోహముతో శత్రువుకు అప్పగించువానిని ఆయన యెరుగును; ఈ కారణముగా ఆయన చెప్పాడు, "అందరు శుద్ధులు కారు." 12 కాబటి ఆయన వారి పాదములు కడిగాడు మరియు ఆయన పైవస్త్రము తీసికొన్నాడు మరియు మరల కూర్చున్నప్పుడు, ఆయన వారికి చెప్పాడు, "నేను మీ కోసం చేసిన పని మీరు అర్థం చేసుకొన్నారా? 13 'బోధకుడు' మరియు 'ప్రభువు' అని మీరు నన్ను పిలుచుచున్నారు, మరియు మీరు సరిగా పిలుచుచున్నారు, ఎందుకంటే నేను అయి ఉన్నాను. 14 నేను అప్పుడు ప్రభువు మరియు బోధకుడు, మీ పాదములు కడిగిన యెడల, మీరు కూడా ఒకరి యొక్క పాదములను ఒకరు కడుగవలసినదే. 15 ఎందుకంటే నేను మీకు ఒక మాదిరిని ఇచ్చాను తద్వారా మీరు కూడా నేను మీకు చేసిన ప్రకారము చెయ్యాలి. 16 నిజముగా, నిజముగా నేను మీకు చెప్పుచున్నాను, ఒక దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు, సందేశకుడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడు. 17 ఈ సంగతులు మీరు యెరుగిన యెడల, మీరు వీటిని చేసినయెడల మీరు ధన్యులుగా ఉంటారు. 18 మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు; నేను ఎవరిని ఏర్పరచుకొన్నానో వారిని యెరుగుదును–అయితే తద్వారా నాతో రొట్టె తింటున్న వాడు నాకు విరోధముగా తన మడమ యెత్తెను' అను లేఖనము నెరవేర్చబడును. 19 ఈ క్షణం నుండి నేను మీకు చెప్పుచున్నాను, ఇది జరగడానికి ముందు, తద్వారా ఇది జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు నమ్ముతారు. 20 నిజముగా, నిజముగా నేను మీకు చెప్పుచున్నాను, నేను ఎవనిని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు, మరియు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడు. 21 దీనిని చెప్పి, యేసు ఆత్మలో కలవరపడ్డాడు, మరియు సాక్ష్యమిచ్చాడు మరియు చెప్పాడు, "నిజముగా, నిజముగా, మీలో ఒకడు నన్ను అప్పగించును అని మీతో చెప్పుచున్నాను. 22 ఆయన యెవరిని గురించి మాట్లాడుతున్నాడు అని శిష్యులు ఆశ్చర్యపడుతూ, ఒకరి వైపు ఒకరు చూచుకోవడం ఆరంభించారు. 23 ఇప్పుడు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, భోజనం చెయ్యడానికి ఏటవాలుగా యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. 24 కాబట్టి, "ఎవరిని గురించి ఆయన మాట్లాడుతున్నాడో అతను ఎవరు?" అని అడగడానికి సీమోను పేతురు అతనికి సైగ చేసాడు. 25 కాబట్టి అ విధంగా యేసు యొక్క రొమ్మున ఆనుకొనియుండి, అతడు ఆయనతో చెప్పాడు, "ప్రభువా, అతడు ఎవరు?" 26 యేసు జవాబిచ్చాడు, "రొట్టె యొక్క ముక్క ముంచి, అందిస్తాను మరియు ఎవనికి ఇచ్చుదునో అది అతనే." అప్పుడు రొట్టెను ముంచి, దానిని సీమోను ఇస్కరియోతు యొక్క {కుమారుడు} యూదాకు ఇచ్చాడు. 27 మరియు రొట్టె తరువాత, సాతాను అప్పుడు అతనిలోనికి ప్రవేశించాడు. కాబట్టి, యేసు అతనితో చెప్పాడు, "నీవు చేయుచున్నది త్వరగా చేయుము." 28 (ఇప్పుడు భోజనం చెయ్యడానికి ఏటవాలుగా కూర్చున్న వారిలో ఆయన ఎందుకు అతనితో ఆలాగు చెప్పెనో ఎవనికిని తెలియ లేదు. 29 ఎందుకంటే కొందరు ఆలోచిస్తున్నారు, డబ్బు సంచి యూదా వద్ద ఉంది కనుక "పండుగ కోసం మనకు అవసరమైన వాటిని కొనండి," అని యేసు అతనికి చెప్పాడు, లేదా తద్వారా అతడు పేదలకు ఏదైనా ఇస్తాడు.) 30 కాబట్టి, రొట్టెను తీసుకొన్నాడు, అతడు వెంటనే వెలుపలికి వెళ్ళాడు. ఇప్పుడు ఇది రాత్రి. 31 కాబట్టి, అతడు వెలుపలికి వెళ్ళినప్పుడు, యేసు చెప్పాడు, "ఇప్పుడు మనుష్యుని యొక్క కుమారుడు మహిమపరచబడియున్నాడు, మరియు దేవుడు ఆయనలో మహిమపరచబడియున్నాడు. 32 మరియు దేవుడు తనయందు ఆయనను మహిమపరచును, మరియు ఆయనను వెంటనే మహిమపరచును. 33 చిన్న పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, మరియు 'నేను ఎక్కడికి వెళ్లుదునో, అక్కడికి మీరు రాలేరు.' అని నేను యూదులతో చెప్పిన విధముగా ఇప్పుడు నేను కూడా దీనిని మీకు చెప్పుచున్నాను. 34 నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, తద్వారా మీరు ఒకరి నొకరు ప్రేమించుదురు, నేను మిమ్మును ప్రేమించిన విధముగా, మీరు కూడా అదేవిధంగా ఒకరి నొకరు ప్రేమించుదురు. 35 మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీని చేత మీరు నా శిష్యులు అని ప్రతి ఒక్కరు తెలిసికొంటారు. 36 సీమోను పేతురు ఆయనతో చెప్పాడు, "ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు? యేసు అతనికి జవాబిచ్చాడు, "నేను వెళ్లుచున్న చోటికి ఇప్పుడు నీవు నన్ను వెంబడించ లేవు, అయితే నీవు తరువాత వెంబడిస్తావు." 37 పేతురు ఆయనతో చెప్పావు, "ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నిన్ను వెంబడించ లేను? నీ కోసం నేను నా ప్రాణమును పెట్టుదును." 38 యేసు జవాబిచ్చాడు, "నా కోసం నీ ప్రాణము పెట్టుదువా? నిజముగా, నిజముగా, నేను నీకు చెప్పుచున్నాను, నీవు నన్ను మూడుసార్లు తృణీకరించడానికి ముందు కోడి ఖచ్చితంగా కూయదు."
Chapter 14
1 మీ హృదయమును కలవరపడ నియ్య వద్దు. దేవునిలో విశ్వాసముంచండి; నాలో కూడా విశ్వాసముంచండి. 2 నా తండ్రి యొక్క ఇంటిలో అనేక నివాస స్థలములు ఉన్నాయి. అయితే లేని యెడల, నేను చెప్పి యుండే వాడిని, ఎందుకంటే మీ కోసం ఒక స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్లుచున్నాను. 3 మరియు నేను వెళ్లి మరియు మీ కోసం ఒక స్థలము సిద్ధపరచిన యెడల, నేను తిరిగి వస్తాను మరియు నా వద్దకు మిమ్మును స్వీకరిస్తాను, తద్వారా నేను ఉండు స్థలమున మీరు కూడా ఉంటారు. 4 మరియు నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియును. 5 తోమా ఆయనతో చెప్పాడు, "ప్రభువా, నువ్వు యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదు. మార్గాన్ని మేము ఏవిధంగా తెలుసుకోగలం?" 6 యేసు అతనికి చెప్పాడు, "నేనే మార్గమును మరియు సత్యమును మరియు జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి వద్దకు రాడు. 7 మీరు నన్ను యెరిగియున్న యెడల, మీరు నా తండ్రిని కూడా యెరుగుదురు. మరియు ఇప్పటి నుండి మీరు ఆయనను యెరుగుదురు మరియు ఆయనను చూచియున్నారు. 8 ఫిలిప్పు ఆయనకి చెప్పాడు, "ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మరియు అది మా కోసం అది మాకు సరిపోతుంది." 9 యేసు అతనికి చెప్పాడు, "ఇంత దీర్ఘ కాలము నేను మీతో ఉన్నాను, మరియు ఫిలిప్పూ నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు. 'తండ్రిని మాకు కనుపరచుము' అని నువ్వు ఏ విధంగా చెప్పుచున్నావు? 10 నేను తండ్రిలో మరియు తండ్రి నాలో ఉన్నాము అని నీవు నమ్ముట లేదా? నేను మీకు చెప్పుచున్న మాటలు నా నుండి నేను చెప్పుట లేదు, అయితే తండ్రి నాలో నిలిచియుండి తన కార్యాన్ని చేయుచున్నాడు. 11 నేను తండ్రిలో ఉన్నాను మరియు తండ్రి నాలో ఉన్నాడు అని నమ్మండి. అయితే లేని యెడల, యీ క్రియల కారణంగా నమ్ముడి. 12 నిజముగా, నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, నేను చేయు క్రియలు, నాలో విశ్వాసముంచు వాడు, అతడు కూడా చేస్తాడు, మరియు అతడు వీటి కంటే గొప్పవి చేయును, ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళ్లుచున్నాను. 13 మరియు మీరు నా నామములో దేనినైనా అడిగినా, దీనిని నేను చేస్తాను తద్వారా తండ్రి కుమారునిలో మహిమ పరచబడును. 14 మీరు నా నామములో మీరు నన్ను ఏమి అడిగిన యెడల నేను దానిని చేస్తాను. 15 మీరు నన్ను ప్రేమించిన యెడల, మీరు నా ఆజ్ఞలను గైకొందురు, 16 మరియు నేను తండ్రిని అడుగుతాను, మరియు ఆయన మరొక సహాయకుడిని మీకు అనుగ్రహిస్తాడు తద్వారా అయన నిత్యత్వం మీతో ఉంటాడు- 17 సత్యము యొక్క ఆత్మ, ఆయనను లోకము స్వీకరించ లేదు, ఎందుకంటే అది ఆయనను చూడదు, ఆయనను యెరుగదు. మీరు ఆయనను యెరుగుదురు, ఎందుకంటే ఆయన మీతో నిలిచి యుంటాడు మరియు మీలో ఉంటాడు. 18 నేను మిమ్మును అనాథలను వలే ఒంటరిగా విడువను; నేను మీ వద్దకు వస్తాను. 19 అయినా ఒక కొద్ది సమయము మరియు లోకము ఇక మీదట నన్ను చూడదు, అయితే మీరు చూస్తారు. ఎందుకంటే నేను జీవించుచున్నాను, మీరు కూడా జీవిస్తారు. 20 నేను నా తండ్రిలో ఉన్నాను, మరియు మీరు నాలో ఉన్నారు, మరియు నేను మీలో ఉన్నాను అని ఆ దినమున మీరు యెరెరుగుదురు. 21 నా ఆజ్ఞలను కలిగి యుండి మరియు వాటిని గైకొను వాడు, ఇతడు నన్ను ప్రేమించు వాడు, మరియు నన్ను ప్రేమించు వాడు నా తండ్రి చేత ప్రేమించ బడును, మరియు నేను అతనిని ప్రేమించుడును, మరియు అతనికి నన్ను కనుపరచుకొందును. 22 {ఇస్కరియోతు కాని} యూదా ఆయనకు చెప్పాడు, "ప్రభువా, నీవు లోకమునకు కాక మరియు మాకు నిన్నునీవు కనబరచుకోవడానికి కొనుటకు ఏమి సంభవించెను?" 23 యేసు జవాబిచ్చాడు మరియు చెప్పాడు, "ఎవడైనాను నన్ను ప్రేమించిన యెడల, వాడు నా మాట గైకొనును. మరియు నా తండ్రి వానిని ప్రేమించును, మరియు మేము అతని వద్దకు వస్తాము, మరియు అతనితో ఒక నివాస స్థలము చేస్తాము. 24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మరియు మీరు వినుచున్న మాట నా మాట కాదు, అయితే నన్ను పంపిన తండ్రిదే. 25 నేను మీతో నిలిచియున్న కాలములో నేను ఈ సంగతులు మీకు చెప్పాను. 26 ఇప్పుడు సహాయకుడు, తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధ ఆత్మ-సమస్తమును మీకు బోధించును మరియు నేను మీతో చెప్పిన ప్రతీదానిని ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు. 27 నేను మీకు సమాధానమును విడిచిపెడుతున్నాను. నేను మీకు నా సమాధానమును ఇచ్చుచున్నాను. లోకము ఇచ్చుచున్నట్టు నేను మీకు ఇవ్వడం లేదు. మీ హృదయమును కలవరపడనియ్య వద్దు, లేదా భయపడ నియ్య వద్దు. 28 'నేను వెళ్లిపోతున్నాను మరియు నేను మీ వద్దకు వచ్చెదను' అని మీతో చెప్పిన మాట మీరు విన్నారు, మీరు సంతోషిస్తారు ఎందుకంటే నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, ఎందుకంటే తండ్రి నా కంటె గొప్పవాడు. 29 మరియు ఇప్పుడు ఈ సంగతి సంభవించడానికి ముందు నేను మీకు చెప్పాను తద్వారా, అది సంభవించినప్పుడు, మీరు నమ్ముతారు. 30 ఇక మీదట నేను మీతో అనేక సంగతులు మాట్లాడను, ఎందుకంటే లోకం యొక్క అధికారి వచ్చుచున్నాడు. మరియు అతడికి నాతో సంబంధమేమియు లేదు. 31 అయితే తద్వారా నేను తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకము తెలిసికొంటుంది, మరియు తండ్రి నాకు ఆజ్ఞాపించిన విధముగా నేను ఆ విధంగా చేస్తాను. పైకి లెండి, ఇక్కడ నుండి మనం వెళ్దాము.
Chapter 15
1 "నేను నిజమైన ద్రాక్షావల్లిని, మరియు నా తండ్రి వ్యవసాయకుడు. 2 నాలో ఫలం కాపు కాయని ప్రతి తీగె, ఆయన దానిని తీసి పారవేయును; మరియు ఫలం కాసే ప్రతి ఒక్కటి, ఆయన దానిని కత్తిరిస్తాడు, తద్వారా అది మరి ఎక్కువగా ఫలాన్ని కాస్తుంది. 3 నేను మీతో చెప్పిన ఆ మాట ద్వారా మీరు ఇంతకు ముందే శుద్దులై ఉన్నారు. 4 నాలో నిలిచియుండండి, మరియు నేను మీలో. ఒక తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే తప్పించి దాని నుండి ఫలాన్ని కాయడానికి సామర్ధ్యత లేకుండా ఉన్న విధముగా, అలాగే మీరు నాలో నిలిచి యుంటే తప్పించి మీరూ చెయ్యలేరు. 5 నేను ద్రాక్షావల్లిని; మీరు తీగెలు. నాలో నిలిచియుండు వాడు మరియు నేను వానిలో, వాడు అధికమైన ఫలాన్ని కాస్తాడు, ఎందుకంటే నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. 6 ఎవడైనను నాలో నిలిచియుండని యెడల, వాడు ఒక తీగె వలె బయట త్రోసివేయబడును మరియు యెండిపోవును, మరియు ; వారు వాటిని పోగుచేస్తారు మరియు {వాటిని} అగ్నిలోనికి త్రోసివేస్తారు, మరియు అవి కాలిపోవును. 7 నాలో మీరు నిలిచియుండిన యెడల, మరియు నా మాటలు మీలో నిలిచియుండిన యెడల మీకు ఏది యిష్టమో అడుగుడి, మరియు అది మీకోసం చెయ్యబడుతుంది. 8 దీనిలో నా తండ్రి మహిమపరచబడును, మీరు అధికమైన ఫలమును ఫలిస్తారు మరియు మీరు నా శిష్యులుగా ఉంటారు. 9 తండ్రి నన్ను ప్రేమించిన విధముగా, నేను కూడ మిమ్మును ప్రేమించాను. నా ప్రేమలో నిలిచి యుండండి. 10 మీరు నా ఆజ్ఞలు గైకొనిన యెడల, నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొని మరియు ఆయన ప్రేమలో నిలిచియున్న విధముగా మీరు నా ప్రేమలో నిలిచి యుంటారు. 11 నేను ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను తద్వారా నా సంతోషము మీలో ఉంటుంది మరియు మీ సంతోషము పరిపూర్ణము అవుతుంది. 12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరు ఒకని నొకడు ప్రేమించవలెను అనుటయ నా ఆజ్ఞ 13 తన స్నేహితుల కోసం తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడు ఎవడును లేడు. 14 నేను మీకు ఆజ్ఞాపించు సంగతులను చేసిన యెడల, మీరు నా స్నేహితులై ఉంటారు. 15 ఇక మీదట మిమ్మును దాసులని పిలువను, ఎందుకంటే యజమానుడు చేయుదానిని దాసుడు ఎరుగడు. అయితే నేను మిమ్మును స్నేహితులు అని పిలుచుచున్నాను, ఎందుకంటే నేను నా తండ్రి నుండి నేను వినిన సంగతులు అన్నిటిని నేను మీకు తెలియజేసితిని. 16 మీరు నన్ను ఏర్పరచుకొన లేదు, అయితే నేను మిమ్మును ఏర్పరచుకొన్నాను మరియు నియమించాను తద్వారా మీరు వెళ్తారు మరియు ఫలం కాస్తారు మరియు మీ ఫలము నిలిచియుంటుంది, తద్వారా మీరు నా నామంలో తండ్రిని ఏమి అడుగుతారో, ఆయన దానిని మీకు అనుగ్రహిస్తాడు. 17 ఈ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను తద్వారా మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను. 18 లోకము మిమ్మును ద్వేషించిన యెడల, మీకు ముందు అది నన్ను ద్వేషించెను అని తెలుసుకోండి. 19 మీరు లోకము నుండి ఉన్నవారైన యెడల, లోకము తన వారిని ప్రేమించును. అయితే మీరు లోకము నుండి ఉన్నవారు కారు, అయితే నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొన్నాను, ఈ కారణంగా లోకము మిమ్మును ద్వేషించుచున్నది. 20 'ఒక బానిస తన యజమానుని కంటె గొప్పవాడు కాదు' అని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికోండి. వారు నన్ను హింసించిన యెడల, వారు మిమ్మును కూడ హింసిస్తారు; వారు నా మాట గైకొనిన యెడల, వారు మీ మాట కూడ గైకొంటారు. 21 అయితే వారు నా నామము నిమిత్తము ఈ సంగతులు అన్నిటిని మీకు చేయుదురు, ఎందుకంటే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు. 22 నేను వచ్చి మరియు వారితో మాట్లాడిన యెడల, వారికీ పాపము ఉండేది కాదు, అయితే ఇప్పుడు వారి పాపము కోసం సాకు లేదు. 23 నన్ను ద్వేషించు వాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు. 24 ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయ కుండిన యెడల, వారికి పాపము ఉండేది కాదు, అయితే ఇప్పుడు వారు నన్నునూ మరియు నా తండ్రినీ చూసారు మరియు ద్వేషించారు. 25 అయితే ఇది ఉంది తద్వారా 'వారు నన్ను కారణం లేకుండా ద్వేషించారు' అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది. 26 తండ్రి నుండి మీ వద్దకు నేను పంపబోవు సహాయకుడు - తండ్రి నుండి బయలుదేరు సత్యము యొక్క ఆత్మ - వస్తాడు, ఆయన నా గురించి సాక్ష్యమిస్తాడు. 27 అయితే మీరు కూడా సాక్ష్యమిస్తారు ఎందుకంటే మీరు మొదట నుండి నాతో ఉన్నారు.
Chapter 16
1 నేను ఈ సంగతులు మీకు చెప్పాను తద్వారా మీరు దూరంగా పడి పోకుండా ఉంటారు. 2 వారు మిమ్మును సమాజమందిరములలో నుండి బయట ఉండేలా చేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకోవడం కోసం ఒక గడియ వచ్చుచున్నది. 3 మరియు వారు ఈ సంగతులు చేస్తారు ఎందుకంటే వారు తండ్రిని, నన్నును తెలిసికొనలేదు. 4 అయితే నేను ఈ సంగతులను మీకు చెప్పాను తద్వారా వాటి గడియ వచ్చినప్పుడు, నేను వాటిని గురించి మీతో చెప్పాను అని మీరు జ్ఞాపకము చేసికొంటారు. అయితే నేను ఈ సంగతులను ఆరంభంలో మీతో చెప్పలేదు ఎందుకంటే నేను మీతో ఉన్నాను. 5 అయితే ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు నేను వెళ్లుచున్నాను, మరియు 'నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు?' అని మీలో ఎవడును నన్ను అడగడం లేదు. 6 అయితే, నేను ఈ సంగతులు మీకు చెప్పిన కారణంగా దుఃఖము మీ హృదయమును నింపింది. 7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవడం మీ కోసం ఇది ఉత్తమం. ఎందుకంటే నేను వెళ్లని యెడల, సహాయకుడు మీ వద్దకు రాడు. అయితే నేను వెళ్లిన యెడల, నేను ఆయనను మీ వద్దకు పంపుదును. 8 మరియు ఆయన వచ్చి, పాపము గురించి మరియు నీతి గురించి మరియు తీర్పు గురించి లోకమును ఖండించును. 9 పాపము గురించి, ఎందుకంటే వారు నాలో విశ్వాసము ఉంచ లేదు, 10 మరియు నీతి గురించి, నేను తండ్రి వద్దకు వెళ్ళడం కారణంగా, మరియు మీరు ఇక మీదట నన్ను చూడరు; 11 మరియు తీర్పు గురించి, ఎందుకంటే ఈ లోకం యొక్క అధికారి తీర్పు పొందియున్నాడు. 12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, అయితే మీరు ఇప్పుడు {వాటిని} సహింప లేరు. 13 అయితే ఆయన, సత్యం యొక్క ఆత్మ, వచ్చినప్పుడు, ఆయన మిమ్మును సర్వ సత్యము లోనికి నడిపించును, ఎందుకంటే ఆయన తనంతట తాను మాట్లాడడు, అయితే తాను వేటిని వినునో వాటిని చెప్పును, మరియు ఆయన మీకు రాబోతున్న సంగతులను ప్రకటించును. 14 ఆయన నన్ను మహిమ పరచును ఎందుకంటే ఆయన నా యొక్క సంగతుల నుండి తీసుకుంటాడు. 15 తండ్రికి కలిగినవన్నియు నావి, కాబట్టి ఆయన నా యొక్క సంగతుల నుండి ఆయన తీసికొంటాడు అని నేను చెప్పాను మరియు ఆయన దానిని మీకు ప్రకటిస్తాడు. 16 మరియు కొంచెము కాలములో మీరు ఇకమీదట నన్ను చూడరు, మరియు మరల కొంచెము కాలమునకు మీరు నన్ను చూస్తారు." 17 అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, "'కొంత కాలానికి మరియు మీరు నన్ను చూడరు, మరియు మరల కొంత కాలానికి మరియు మీరు నన్ను చూస్తారు,' మరియు 'ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను' అని మనతో చెప్పుచున్న ఇది ఏమిటి? 18 కాబట్టి వారు చెప్పుకొంటున్నారు, 'కొంచెము కాలము' ఇది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదు. 19 వారు తన్ను ప్రశ్నించాలని కోరుకున్న దానిని యేసు యెరిగాడు, మరియు ఆయన వారితో చెప్పాడు, "'కొంత కాలానికి మరియు మీరు నన్ను నన్ను చూడరు మరియు మరల కొంత కాలానికి మరియు మీరు నన్ను చూస్తారు' అని నేను చెప్పిన దీని గురించి మీ మధ్య మీరు వెదకుచున్నారా? 20 నిజముగా, నిజముగా, మీరు ఏడ్చుదురు మరియు ప్రలాపింతురు, అయితే లోకము సంతోషంగా ఉంటుంది. మీరు దుఃఖిస్తారు, అయితే మీ దుఃఖము సంతోషంగా మారుతుంది అని నేను మీతో చెప్పుచున్నాను. 21 ఒక స్త్రీ జన్మ ఇచ్చినప్పుడు, ఆమెకు వేదన కలుగుతుంది, ఎందుకంటే ఆమె గడియ వచ్చింది, అయితే ఆమె శిశువుకు జన్మ ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఒక మనుష్యుడు లోకము లోనికి పుట్టెను అని సంతోషము చేత ఆమె {తన} వేదనను ఇక మీదట జ్ఞాపకం ఉంచుకోదు. 22 మరియు కాబట్టి మీరు ఇప్పుడు దుఃఖమును కలిగి యున్నారు, మరియు మీ హృదయము సంతోషించును మరియు మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. 23 మరియు ఆ దినములో మీరు దేనినీ నన్ను అడుగరు. నిజముగా, నిజముగా, నేను మీకు చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా నామంలో ఏమి అడిగినను, ఆయన దానిని మీకు అనుగ్రహించును. 24 ఇప్పటి వరకు మీరు ఏమియు నా నామంలో అడుగ లేదు. అడగండి, మరియు మీరు పొందుతారు తద్వారా మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. 25 నేను ఈ సంగతులను అలంకారిక భాషలో మీకు చెప్పాను; ర్థముగా మీతో చెప్పితిని; నేను ఇక మీదట మీతో అలంకారిక భాషలో మాట్లాడను. అయితే దానికి బడుడులుగా తండ్రి గురించి మీకు స్పష్టముగా చెప్పు గడియ వచ్చుచున్నది. 26 ఆ దినములో మీరు నా నామములో అడుగుతారు, మరియు మీ యొక్క పక్షముగా నేను తండ్రిని వేడుకొంటాను అని నేను మీతో చెప్పడం లేదు. 27 ఎందుకంటే తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు, ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు, నేను దేవుని వద్ద నుండి వచ్చితిని అని నమ్మారు. 28 నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, మరియు నేను లోకములోనికి వచ్చాను, మరల నేను లోకమును విడిచిపెడుతున్నాను, మరియు నేను తండ్రి వద్దకు వెళ్లుచున్నాను. 29 ఆయన శిష్యులు చెప్పారు, "ఇదిగో ఇప్పుడు నీవు స్పష్టముగా మాటలాడుచున్నావు, మరియు నీవు భాషా యొక్క రూపాలలో మాట్లాడడం లేదు. 30 ఇప్పుడు నీవు సమస్తమును యెరిగిన వాడవు అని మరియు ఎవడును నీకు ప్రశ్నవేయ అవసరం లేదు అని మేము యెరుగుదుము; దేవుని వద్ద నుండి నుండి నీవు వచ్చావు అని దీనిలో మేము నమ్ముచున్నాము. 31 యేసు వారికి జవాబిచ్చాడు, "మీరు ఇప్పుడు నమ్ము చున్నారా?" 32 ఇదిగో, ఒక గడియ వచ్చుచున్నది-మరియు వచ్చి ఉంది-మీలో ప్రతివాడును {తన} సొంతదానికి-చెదరిపోతారు, మరియు మీరు నన్ను ఒంటరిగా విడిచిపెదతారు. అయినా నేను ఒంటరిగా లేను, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు. 33 నేను ఈ సంగతులు మీకు చెప్పాను తద్వారా నాలో మీరు సమాధానము కలిగి యుంటారు. లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయితే ధైర్యము కలిగి యుండండి. నేను లోకమును జయించియున్నాను."
Chapter 17
1 యేసు ఈ సంగతులు చెప్పాడు మరియు, మాటలు చెప్పి ఆకాశముకు తన కన్నులు పైకి ఎత్తాడు, ఆయన చెప్పాడు, "తండ్రీ, గడియ వచ్చియున్నది. నీ కుమారుని మహిమ పరచుము తద్వారా కుమారుడు నిన్ను మహిమపరచును. 2 సర్వ శరీరుల మీద నీవు ఆయనకు అధికారమిచ్చితివి కనుక తద్వారా నీవు అనుగ్రహించిన ప్రతి ఒక్కరికి ఆయన వారికి నిత్యజీవము అనుగ్రహిస్తాడు. 3 ఇప్పుడు వారు అద్వితీయ సత్యదేవుడు మరియు నీవు పంపిన యేసు క్రీస్తు అయిన నిన్ను ఎరుగుదురు అనునది ఇదే నిత్య జీవమై ఉంది. 4 నేను చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి భూమి మీద నేను నిన్ను మహిమ పరచాను. 5 మరియు ఇప్పుడు, తండ్రీ, లోకము సృష్టించబడక ముందు నీతో నాకు ఉన్న ఆ మహిమతో నీతో పాటుగా నన్ను మహిమ పరచుము. 6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారు, మరియు నీవు వారిని నాకు అనుగ్రహించితివి, మరియు వారు నీ వాక్యము గైకొనియున్నారు. 7 ఇప్పుడు నీవు నాకు అనుగ్రహించిన ప్రతీది నీ నుండి అని వారు తెలుసుకొంటారు. 8 ఎందుకంటే నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను, మరియు వారు {వాటిని} స్వీకరించారు మరియు నేను నీ నుండి వచ్చితిని అని నిజముగా యెరిగియున్నారు, మరియు నీవు నన్ను పంపితివని వారు నిజముగా నమ్మారు. 9 నేను వారి పక్షముగా అడుగుతున్నాను. లోకము పక్షముగా నేను అడగడం లేదు, అయితే నీవు నాకు అనుగ్రహించిన వారి పక్షముగా, ఎందుకంటే వారు నీవారై ఉన్నారు. 10 మరియు నావి అన్నియు నీవియై ఉన్నాయి, మరియు నీవి అన్నియు నావి, మరియు నేను వారిలో మహిమపరచబడియున్నాను. 11 మరియు నేను ఇకమీదట లోకములో ఉండను, అయితే వారు లోకములో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములో వారిని కాపాడుము తద్వారా మనము ఏకమై ఉన్న విధముగా వారును ఏకమై ఉంటారు. 12 నేను వారితో ఉండగా, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములో కాపాడాను. మరియు నేను వారిని భద్రపరచాను, మరియు నాశనం యొక్క పుత్రుడు తప్ప వారిలో ఒక్కడునూ నశింపలేదు తద్వారా లేఖనము నెరవేర్చబడుతుంది. 13 అయితే ఇప్పుడు నేను నీవద్దకు వచ్చుచున్నాను, మరియు లోకములో ఈ సంగతులు నేను చెప్పుచున్నాను తద్వారా నా సంతోషము వారిలో పరిపూర్ణమవుతుంది. 14 నేను వారికి నీ వాక్యము ఇచ్చియున్నాను, మరియు లోకము వారిని ద్వేషించింది ఎందుకంటే నేను లోకము నుండి కానట్టుగా వారు లోకము నుండి వచ్చిన వారు కాదు. 15 నీవు లోకము నుండి వారిని తీసికొనిపొమ్మని నేను అడగడం లేదు, అయితే దుష్టుని నుండి నీవు వారిని కాపాడుదువు. 16 నేను లోకము నుండి కానట్టు వలే వారును లోకము నుండి కాదు. 17 సత్యము చేత వారిని ప్రతిష్ట పరచుము; నీ వాక్యమే సత్యము. 18 నీవు నన్ను లోకములోనికి పంపిన విధముగా నేను కూడా వారిని లోకములోనికి పంపాను. 19 మరియు వారి నిమిత్తం నన్ను ప్రతిష్ఠ చేసికొన్నాను తద్వారా వారికై వారు కూడా సత్యములో ప్రతిష్ట పరచబడుదురు. 20 అయితే నేను వీరి నిమత్తం మాత్రమే అడుగ లేదు, అయితే వారి వాక్యము ద్వారా నాలో విశ్వాసముంచు వారి యొక్క నిమిత్తము కూడా. 21 నువ్వు, తండ్,రి నాలో మరియు నేను నీలో ఉన్న విధముగా, వారు అందరు ఏకమై ఉండాలి అని, వారు కూడా మనలో ఉండాలి అని, తద్వారా నువ్వు నన్ను పంపావు అని లోకం తెలుసుకొంటుంది. 22 నీవు నాకు అనుగ్రహించిన మహిమను, నేను కూడా వారికి ఇచ్చాను తద్వారా మనము ఏకమై ఉన్న విధముగా వారును ఏకమై ఉంటారు. 23 నేను వారిలో, మరియు నీవు నాలో తద్వారా వారు ఏకముగా సంపూర్ణము చెయ్యబడి ఉంటారు తద్వారా నీవు నన్ను పంపితివి మరియు నీవు నన్ను ప్రేమించిన విధముగా వారిని ప్రేమించావు అని లోకము తెలుసుకుంటుంది. 24 తండ్రీ, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడడానికి నేను కోరుచున్నాను ఎందుకంటే లోకం యొక్క పునాదికి ముందు నీవు నన్ను ప్రేమించావు. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము సహితం నిన్ను యెరుగ లేదు, అయితే నేను నిన్ను యెరుగుదును; మరియు నీవు నన్ను పంపితివి అని వీరు యెరిగియున్నారు. 26 మరియు నీ నామాన్ని వారికి తెలియచేసాను, మరియు దానిని నేను తెలియపరుస్తాను, తద్వారా నీవు నన్ను ప్రేమించిన ప్రేమ వారిలో ఉంటుంది మరియు నేను వారిలో.
Chapter 18
1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కెద్రోను యొక్క వాగు దాటి వెళ్ళారు, అక్కడ ఒక తోట ఉంది, దానిలోనికి ఆయన మరియు ఆయన శిష్యులు ప్రవేశించారు. 2 ఇప్పుడు ఆయనను ద్రోహముతో శత్రువుకు అప్పగిస్తున్న వాడు యూదా, కూడా ఆ స్థలము యెరుగును, ఎందుకంటే యేసు తన శిష్యులతో తరచుగా అక్కడి కలుస్తుండేవాడు. 3 కాబట్టి యూదా పటాలము యొక్క సైనికులను మరియు ప్రధానయాజకుల నుండి మరియు పరిసయ్యుల నుండి అధికారులను నడిపిస్తూ, దీపాలు మరియు కాగడాలు మరియు ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. 4 అప్పుడు యేసు తనకు సంభవింపబోవు సంగతులు అన్ని యెరిగినవాడై, వెలుపలికి వెళ్లి, వారిని అడిగాడు, "మీరు ఎవరిని వెదకుచున్నారు?" 5 వారు ఆయనకు జవాబిచ్చారు, "నజరేయుడైన యేసు." ఆయన వారితో చెప్పాడు, "నేనే ఆయనను." (ఇప్పుడు ఆయనను ద్రోహముతో శత్రువుకు అప్పగిస్తున్న వాడు యూదా కూడా వారితో నిలబడి యున్నాడు.) 6 కాబట్టి "నేనే ఆయనను" అని ఆయన వారితో చెప్పినప్పుడు వారు వెనుకకు వెళ్ళారు మరియు నేలకు పడ్డారు. 7 అప్పుడు మరల ఆయన వారిని అడిగాడు, "మీరు ఎవనిని వెదకుచున్నారు?" మరియు వారు చెప్పారు, "నజరేయుడైన యేసును." 8 యేసు జవాబిచ్చాడు, "నేనే ఆయనను అని మీతో చెప్పాను. కాబట్టి మీరు నన్ను వెదకుచున్నయెడల, వెళ్ళిపోడానికి వీరిని అనుమతించండి." 9 ({ఇది జరిగింది} తద్వారా "నీవు నాకు అనుగ్రహించిన వారిలో, వారి మధ్య నుండి ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు" అని ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది.) 10 అప్పుడు సీమోను పేతురు ఒక కత్తిని కలిగి యుండి, దానిని బయటికి తీసి మరియు ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టాడు మరియు అతని కుడి చెవిని తెగనరికాడు. ఇప్పుడు అ దాసుని యొక్క పేరు మల్కు. 11 అప్పుడు యేసు పేతురుకు చెప్పాడు, "కత్తిని దాని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెను, నేను ఖచ్చితంగా దానిని త్రాగ కుండా ఉందునా?" 12 అప్పుడు సైనికుల యొక్క పటాలము మరియు సేనాధిపతి మరియు యూదుల యొక్క అధికారులు యేసును పట్టుకొన్నారు మరియు ఆయనను కట్టివేశారు. 13 మరియు వారు ఆయనను మొదట అన్నవద్దకు నడిపించారు, ఎందుకంటే అతడు ప్రధానయాజకుడైన కయపకు మామ, అతడు అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు. 14 (ఇప్పుడు మనుష్యుల యొక్క పక్షంగా ఒక మనుష్యుడు చనిపోవడం ఉత్తమంగా ఉంటుంది అని యూదులకు సలహా ఇచ్చిన వాడు కయప.) 15 ఇప్పుడు సీమోను పేతురు మరియు మరియొక శిష్యుడు యేసును వెంబడించారు. ఇప్పుడు ఆ శిష్యుడు ప్రధాన యాజకుని యొక్క ఆవరణము లోనికి యేసుతో ప్రవేశించాడు. 16 అయితే పేతురు ద్వారము వద్ద వెలుపల నిలబడ్డాడు, కాబట్టి ప్రధాన యాజకునికి తెలిసిన మరొక శిష్యుడు బయటికి వెళ్ళాడు మరియు ద్వారపాలకురాలితో మాట్లాడాడు, మరియు అతడు పేతురును లోపలికి తీసుకొని వచ్చాడు. 17 అప్పుడు ద్వారపాలకురాలు, స్త్రీ సేవకురాలు, పేతురుతో చెప్పింది, "నీవు కూడా ఈ మనుష్యుని యొక్క శిష్యులలో ఒకడవు కావా?" అతడు చెప్పాడు, "నేను కాను." 18 (ఇప్పుడు దాసులు మరియు అధికారులు అక్కడ నిలుచున్నారు, ఒక బొగ్గు నిప్పు చేసారు, ఎందుకంటే అది చల్లగా ఉంది, మరియు వారు తమను తాము వేడి చేసుకొంటున్నారు. అయితే పేతురు కూడా వారితో ఉన్నాడు, అక్కడ నిలువబడి యున్నాడు మరియు తననుతాను వేడి చేసుకొంటున్నాడు. 19 అప్పుడు ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి మరియు ఆయన బోధను గురించి యేసును అడుగాడు. 20 యేసు అతనికి జవాబిచ్చాడు, "నేను బాహాటముగా లోకముతో మాట్లాడాను. యూదులు అందరు కలిసి వచ్చు సమాజమందిరములోను మరియు దేవాలయములోను నేను ఎల్లప్పుడును బోధిస్తూ వచ్చాను, మరియు నేను రహస్యముగా ఏమియూ మాట్లాడ లేదు. 21 నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను వారికి ఏమి చెప్పానో విన్న వారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది ఈ మనుష్యులు యెరుగుదురు." 22 ఇప్పుడు ఆయన ఈ సంగతులు చెప్పినప్పుడు, అక్కడ నిలిచియున్న అధికారులలో ఒకడు యేసుకు ఒక చెంపదెబ్బ ఇచ్చాడు, చెప్పాడు, "ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా?" 23 యేసు జవాబిచ్చాడు, "నేను తప్పుగా మాట్లాడిన యెడల, తప్పు గురించి సాక్ష్యమివ్వు, , అయితే సరియైన యెడల, నువ్వు నన్ను ఎందుకు కొట్టుచున్నావు?" 24 అప్పుడు అన్న ఆయనను బంధించి, ప్రధాన యాజకుడు కయప వద్దకు పంపాడు. 25 ఇప్పుడు సీమోను పేతురు నిలువబడియున్నాడు మరియు తనకు తాను వేడిచేసుకొంటున్నాడు. అప్పుడు వారు అతనితో చెప్పారు, "నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడవు కావా?" అతడు దానిని మరియు చెప్పాడు, "నేను కాను." 26 పేతురు {ఎవని} చెవి తెగనరికిన వాని బంధువు, ప్రధానయాజకుని యొక్క దాసుల నుండి ఒకడు చెప్పాడు, "నీవు తోటలో అతనితో ఉండగా నేను చూడలేదా?" 27 పేతురు అప్పుడు దానిని మరల తృణీకరించాడు, మరియు వెంటనే కోడి కూసింది. 28 అప్పుడు వారు కయప వద్ద నుండి అధికారి అంతఃపురమునకు యేసును నడిపించారు. (ఇప్పుడు తెల్లవారుతూ ఉంది, మరియు వారు అధికారి అంతఃపురములోనికి ప్రవేశించ లేదు తద్వారా వారు మైలపడకుండ ఉంటారు, అయితే పస్కాను భుజిస్తారు.) 29 కాబట్టి, పిలాతు బయట ఉన్నవారి వద్దకు వెళ్ళాడు, మరియు చెప్పాడు, "ఈ మనుష్యునికి వ్యతిరేకంగా మీరు ఏ నేరము తీసుకొని వస్తున్నారు?" 30 వారు జవాబిచ్చారు మరియు అతనికి చెప్పారు, "ఇతడు దుర్మార్గుడు కాని యెడల, ఇతనిని నీకు అప్పగించి ఉండే వారిమి కాదు." 31 కాబట్టి, పిలాతు వారితో చెప్పాడు, "అతనిని మీకైమీరు తీసికొనివెళ్ళండి, మరియు మీ ధర్మశాస్త్రము ప్రకారం అతనికి తీర్పు తీర్చండి." 32 (ఇది జరిగింది, తద్వారా తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన యేసు యొక్క మాట నెరవేరును.) 33 అప్పుడు పిలాతు తిరిగి అధికారి అంతఃపురములోనికి ప్రవేశించాడు మరియు యేసును పిలిపించాడు మరియు ఆయనను అడిగాడు, "నీవు యూదుల యొక్క రాజువా?" 34 యేసు జవాబిచ్చాడు, "నీ అంతట నీవే ఈ మాట మాట్లాడుచున్నావా? లేక ఇతరులు నన్ను గురించి నీతో మాట్లాడారా?" 35 పిలాతు జవాబిచ్చాడు, "నేను యూదుడను కాను, నేను అవునా? నీ సొంత జనము మరియు ప్రధానయాజకులు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏమి చేసావు?" 36 యేసు జవాబిచ్చాడు, "నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకము నుండి కాదు. న రాజ్యము ఈ లోకము నుండి అయిన యెడల, నా సేవకులు పోరాడుతారు తద్వారా నేను నీకు అప్పగించబడకుండా ఉంటాను. అయితే ఇప్పుడు నా రాజ్యము ఇక్కడ నుండి కాదు. 37 అప్పుడు పిలాతు ఆయనకు చెప్పాడు, "కాబట్టి నీవు రాజువా?" యేసు జవాబిచ్చాడు, "నువ్వు చెప్పావు నేను రాజును అని. దీని కోసం నేను నేను పుట్టాను, మరియు దీని కోసం నేను లోకం లోనికి వచ్చాను, తద్వారా నేను సత్యమునకు సాక్ష్యాన్ని కలిగి ఉంటాను. సత్యము నుండి ఉన్న ప్రతి ఒక్కరూ నా స్వరాన్ని వింటారు. 38 పిలాతు ఆయనకు చెప్పాడు, "సత్యం అంటే ఏమిటి? మరియు ఇచి చెప్పి, అతడు మరల యూదుల వద్దకు బయటకు వెళ్ళాడు మరియు చెప్పాడు, "ఇతనిలో నేను ఏ దోషమును కనుగొన లేదు. 39 అయితే పస్కాపండుగలో నేను మీకు ఒకనిని విడుదల చేయడం అనే మీ ఆచారం ఉంది. కాబట్టి, నేను యూదుల యొక్క రాజును మీకు విడుదల చేయడం మీరు కోరుకుంటున్నారా? 40 అప్పుడు వారు మరల గట్టిగా అరిచారు, "చెప్పారు, "ఇతడు కాదు, అయితే బరబ్బా." (ఇప్పుడు బరబ్బ ఒక బందిపోటుదొంగ.)
Chapter 19
1 కాబట్టి, అప్పుడు పిలాతు యేసును పట్టుకొన్నాడు మరియు {ఆయనను} కొరడాలతో కొట్టించెను. 2 మరియు సైనికులు ముండ్ల నుంచి ఒక కిరీటమును అల్లారు. వారు {దానిని} ఆయన తల మీద పెట్టారు మరియు ఒక ఊదారంగు వస్త్రమును ఆయన మీద ఉంచారు. 3 మరియు వారు ఆయన వద్దకు వచ్చారు మరియు చెపుతున్నారు, "యూదుల యొక్క రాజా, నమస్కారం!" మరియు ఆయనను అర చేతులతో కొట్టిరి. 4 పిలాతు మరల వెలుపలి వెళ్ళాడు మరియు వారితో చెప్పాడు, "చూడండి, నేను ఈయనను మీ వద్దకు బయటికి తీసికొనివచ్చుచున్నాను తద్వారా ఈయనలో నేను ఏ దోషమును కనుగొనలేదని మీరు తెలుసుకొంటారు." 5 అప్పుడు యేసు బయటికి వెళ్ళాడు, ముండ్ల యొక్క కిరీటమును మరియు ఊదారంగు వస్త్రమును ధరించాడు.మరియు అతడు వారితో చెప్పాడు, "ఇదిగో ఈ మనుష్యుడు." 6 కాబట్టి ప్రధాన యాజకులు మరియు అధికారులు ఆయనను చూసారు, వారు గట్టిగా అరిచారు, చెప్పారు, "ఆయనను సిలువ వేయండి, ఆయనను సిలువ వేయండి!" పిలాతు వారితో చెప్పాడు, "మీరే ఆయనను తీసుకిని వెళ్ళండి మరియు సిలువ వేయండి, ఎందుకంటే ఆయనలో ఏ దోషమును నేను కనుగొన లేదు. 7 యూదులు ఆయనకు జవాబిచ్చారు, "మాకు ఒక నియమము కలదు, మరియు ఆ నియమము ప్రకారం అతడు చనిపోవలసి ఉంది, ఎందుకంటే అతడు తనను తాను దేవుని యొక్క కుమారుడిగా చేసుకొన్నాడు." 8 కాబట్టి, పిలాతు ఈ మాట వినినప్పుడు, అతడు మరింత భయపడ్డాడు, 9 మరియు అతడు తిరిగి అధిపతి అంతఃపురములోనికి ప్రవేశించాడు మరియు య్ర్సుతో చెప్పాడు, "నీవు ఎక్కడ నుండి వచ్చావు?" అయితే యేసు అతనికి ఏ జవాబు ఇవ్వలేదు. 10 కాబట్టి, పిలాతు ఆయనతో చెప్పాడు, "నువ్వు నాతో మాటలాడడం లేదా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు, మరియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదు అని నీకు తెలియదా?" 11 యేసు అతనికి జవాబిచ్చాడు, "పై నుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్పించి నా మీద నీకు ఎటువంటి అధికారము లేదు. కాబట్టి, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు." 12 దీని వద్ద, పిలాతు ఆయనను విడుదల చేయడానికి వెదకుచున్నాడు, అయితే యూదులు గట్టిగా అరిచారు, చెప్పారు, "నీవు ఇతనిని విడుదల చేసిన యెడల, నీవు కైసరునకు స్నేహితుడవు కావు. తనను తాను ఒక రాజుగా చేసుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే." 13 కాబట్టి, పిలాతు, ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చాడు, మరియు న్యాయ పీఠములో "రాళ్ళు పరచిన స్థలం" అని పిలువబడిన స్థలములో కూర్చున్నాడు, అయితే హెబ్రీ భాషలో, "గబ్బతా." 14 (ఇప్పుడు ఇది పస్కా యొక్క సిద్ధపరచడం యొక్క దినము. ఇది దాదాపు ఆరవ గంట.) మరియు అతడు యూదులతో చెప్పాడు, "ఇదిగో మీ రాజు." 15 అయితే వారు బిగ్గరగా అరిచారు, "{అతనిని} తీసుకు వెళ్ళండి! {అతనిని} తీసుకు వెళ్ళండి! అతనిని సిలువ వెయ్యండి!" పిలాతు వారితో చెప్పాడు, "మీ రాజును నేను సిలువ వేయుదునా?" ప్రధాన యాజకులు జవాబు చెప్పారు, "కైసరు తప్పించు మాకు వేరొక రాజు లేడు." 16 కాబట్టి, అతడు అప్పుడు ఆయనను వారికి అప్పగించాడు తద్వారా ఆయన సిలువవేయబడతాడు, మరియు వారు యేసును తీసుకొన్నారు {మరియు} {ఆయనను} బయటికి వదిపించారు. 17 మరియు ఆయన తనంతట తాను సిలువ మోస్తూ, "కపాలం యొక్క స్థలము" అని పిలువబడిన {స్థలము} కు వెలుపలికి వెళ్ళాడు, హెబ్రీ భాషలో ఇది "గొల్గొతా" అని పిలువబడుతుంది. 18 అక్కడ వారు ఆయనను సిలువ వేసారు, మరియు ఈ వైపున మరియు ఆ వైపున ఆయనతో ఇతరులు ఇద్దరు, మరియు మధ్యలో యేసు. 19 ఇప్పుడు పిలాతు ఒక శీర్షికను కూడా రాసాడు మరియు దానిని సిలువ మీద ఉంచాడు. ఇప్పుడు దాని మీద రాయబడి ఉంది, యూదుల యొక్క రాజైన నజరేయుడగు యేసు. 20 కాబట్టి, యూదులలో అనేకులు ఈ శీర్షికను చదివారు, ఎందుకంటే యేసు సిలువ వేయబడిన స్థలము నగరానికి సమీపంగా ఉంది. మరియు అది హెబ్రీలో, లాటిన్ లో, మరియు గ్రీకులో వ్రాయబడింది. 21 కాబట్టి, యూదుల యొక్క ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పారు, "'యూదుల యొక్క రాజు' అని వ్రాయ వద్దు, అయితే అతడు చెప్పాడు, 'నేను యూదుల యొక్క రాజు'"" 22 పిలాతు జవాబిచ్చాడు, "నేను వ్రాసిన దేమో నేను వ్రాసాను." 23 అప్పుడు సైనికులు యేసును సిలువవేసినప్పుడు, వారు ఆయన వస్ర్తములు తీసికొన్నారు మరియు వాటిని నాలుగు భాగములు చేసారు-ఒక్కొక్క సైనికుని కోసం ఒక భాగము-మరియు అంగీ. ఇప్పుడు అంగీ కుట్టులేకుండా ఉంది, పైనుండి ఒక్క ముక్కలో నేయబడింది. 24 కాబట్టి వారు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, "మనం దానిని చింప కూడదు, అయితే దానికి బదులు అది ఎవరిది అవుతుందో, దాని కోసం మనం చీట్లు వెయ్యాలి." ఇది వంభవించింది తద్వారా లేఖనం నెరవేరుతుంది, అది చెపుతుంది, వారు నా వస్త్రములను తమలో పంచుకొన్నారు మరియు నా దుస్తుల కోసం చీట్లు వేసారు." కాబట్టి సైనికులు దీనిని చేసారు. 25 ఇప్పుడు ఆయన తల్లి మరియు ఆయన తల్లి యొక్క సహోదరి, క్లోపా యొక్క {భార్య} మరియు , మరియు మగ్దలేనే మరియ యేసు యొక్క సిలువ ప్రక్కన నిలుచున్నారు. 26 అప్పుడు యేసు {తన} తల్లి మరియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి {తన} తల్లితో చెప్పాడు, "అమ్మా, యిదిగో నీ కుమారుడు." 27 అప్పుడు ఆయన శిష్యునితో చెప్పాడు, "యిదిగో నీ తల్లి." మరియు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను {తన} సొంత {ఇంటి} లోనికి తీసుకొన్నాడు. 28 దీని తరువాత, యేసు, సమస్తమైన సంగతులు అప్పటికి సమాప్తమైనవి అని ఎరిగి, తద్వారా లేఖనము నెరవేరునట్లు, చెప్పాడు, "–నేను దప్పిగొనుచున్నాను." 29 పులిసిన ద్రాక్షరసముతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టిబడి ఉంది, కాబట్టి పులిసిన ద్రాక్షారసముతో నిండిన ఒక స్పంజీని హిస్సోపు మీద ఉంచి, వారు దానిని ఆయన నోటి వరకు పైకి ఎత్తారు. 30 కాబట్టి, యేసు పులిసిన ద్రాక్షారసమును తీసుకొన్నాడు, ఆయన చెప్పాడు, "ఇది సమాప్తమనది." మరియు {తన} తలను వంచి, ఆయన {తన} ఆత్మను ఇచ్చివేసాడు. 31 అప్పుడు యూదులు, ఎందుకంటే అది సిద్ధపాటు యొక్క దినము, తద్వారా ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద నిలిచి యుండవు (ఎందుకంటే ఆ విశ్రాంతి దినము ప్రత్యేకంగా ప్రాముఖ్యమైనదిగా ఉంది), వారి కాళ్లు విరుగగొట్టబడాలి మరియు వాటిని తీసివేయబడాలి అని పిలాతును అడిగారు. 32 కాబట్టి, సైనికులు వచ్చారు మరియు ఆయనతో సిలువవేయబడిన మొదటి మనిషి యొక్క మరియు మరొక మనిషి యొక్క కాళ్ళను విరుగగొట్టారు. 33 అయితే యేసు వద్దకు వచ్చి, ఆయన అంతకుముందే చనిపోయాడు అవి చూసారు, వారు ఆయన కాళ్ళు విరుగగొట్ట లేదు. 34 అయితే, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు, మరియు వెంటనే రక్తము మరియు నీళ్లు బయటికి వచ్చాయి. 35 మరియు ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చాడు, మరియు అతని సాక్ష్యము సత్యమే. మరియు అతడు సత్యము చెప్పుచున్నాడు అని ఆయన యెరుగును తద్వారా మీరు కూడా నమ్ముతారు. 36 ఎందుకంటే "ఆయన యెముకలలో ఏ ఒక్కటీ విరువబడదు" అను లేఖనము నెరవేరడం కోసం ఈ సంగతులు జరిగాయి. 37 మరియు మరల మరొక లేఖనము చెపుతుంది, "తాము పొడిచినవాని వైపు వారు చూస్తారు." 38 ఇప్పుడు ఈ సంగతుల తరువాత, (అయితే యూదుల యొక్క భయము కోసం రహస్యంగా) యేసు యొక్క శిష్యుడిగా ఉండి, అరిమతయియ నుండి యోసేపు, తాను యేసు యొక్క దేహమును తీసికొనిపోవడానికి అని పిలాతును అడిగాడు. మరియు పిలాతు అతనికి అనుమతి ఇచ్చాడు. కాబట్టి అతడు వచ్చాడు మరియు ఆయన దేహమును తీసికొని వెళ్ళాడు. 39 ఇప్పుడు మొదట రాత్రివేళ ఆయన వద్దకు వచ్చినవాడు-నీకొదేము కూడ వచ్చాడు-బోళము యొక్క మిశ్రమము మరియు అగరు దాదాపు 100 లీటర్లు బరువు తీసుకొని వచ్చాడు. 40 కాబట్టి వారు యేసు యొక్క దేహమును తీసుకొన్నారు మరియు సమాధి కోసం సిద్ధపరచడానికి యూదుల యొక్క ఆచారం అయినట్టుగా సుగంధద్రవ్యములతో నారబట్టలలో దానిని చుట్టారు. 41 ఆయన సిలువ వేయబడిన స్థలములో ఒక తోట ఉంది. మరియు ఆ తోటలో, ఎవడును ఇంకా సమాది చెయ్యబడని నూతన సమాధి ఒకటి ఉంది. 42 కాబట్టి, యూదుల యొక్క సిద్ధపరచు దినము కారణంగా మరియు ఆ సమాధి సమీపములో ఉంది కనుక, వారు యేసును అక్కడ ఉంచారు.
Chapter 20
1 ఇప్పుడు వారం యొక్క మొదటి రోజున ఆదివారమున పెందలకడ ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, మగ్ద లేనే మరియ సమాధి వద్దకు వచ్చింది మరియు సమాధి నుండి రాయి దొర్లించబడి యుండడం చూసింది. 2 కాబట్టి, ఆమె పరుగెత్తింది మరియు సీమోను పేతురు వద్దకు మరియు యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకు వచ్చింది మరియు ఆనే వారికి చెప్పింది, "వారు ప్రభువును సమాధి నుండి తీసుకొని వెళ్ళారు, మరియు వారు ఆయనను ఎక్కడ ఉంచారో మనకు తెలియదు. 3 అప్పుడు పేతురు మరియు మరొక శిష్యుడు బయటికి వెళ్ళారు, మరియు వారు సమాధి వద్దకు వెళ్ళారు. 4 ఇప్పుడు ఇద్దరు కలిసి పరుగెత్తుచున్నారు, మరియు ఆ మరొక శిష్యుడు పేతురు కంటే ముందుగా త్వరగా పరుగెత్తాడు మరియు సమాధి వద్దకు చేరాడు. 5 మరియు కిందకు వంగి, నారబట్టలు పడియుండుట అతడు చూసాడు, అయితే అతడు సమాధిలో ప్రవేశింపలేదు. 6 అప్పుడు సీమోను పేతురు కూడా అతనిని అనుసరిస్తూ వచ్చాడు మరియు సమాధిలోనికి ప్రవేశించాడు. మరియు అతడు నారబట్టలు అక్కడ పడియుండడం చూసాడు. 7 మరియు ఆయన తల మీద ఉన్న వస్త్రం, నార బట్టలతో పడియుండ లేదు, అయితే ఒక స్థలంలో దానికదే చుట్టిపెట్టి ఉంది. 8 కాబట్టి అప్పుడు సమాధి వద్దకు మొదట వచ్చిన వాడు, ఆ మరొక శిష్యుడు, కూడా లోపలికి వెళ్ళాడు, మరియు చూసాడు మరియు నమ్మాడు. 9 ఎందుకంటే మృతులలో నుండి లేవడానికి ఆయన కోసం ఇది అవసరం అను లేఖనమును వారు ఇంకా అర్థం చేసుకోలేదు. 10 అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ {సొంత ఇళ్ళకు} వెళ్లిపోయిరి. 11 అయితే మరియ సమాధి వద్ద బయట నిలిచి, యేడ్చుచూ ఉంది. అప్పుడు ఆమె ఏడ్చుచూ ఉండగా, ఆమె కిందకు వంగింది మరియు సమాధిలోనికి చూసింది. 12 మరియు తెలుపులో కూర్చునియున్న యిద్దరు దేవదూతలను ఆమె చూసింది, యేసు యొక్క దేహము ఉంచబడిన స్థలములో తల వద్ద ఒకడు మరియు కాళ్ల వద్ద ఒకడు. 13 మరియు వారు ఆమెతో చెప్పారు, "అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు?" ఆమె వారితో చెప్పింది, "ఎందుకంటే వారు నా ప్రభువు తీసుకొని వెళ్ళారు, మరియు ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు." 14 దీనిని చెప్పి, ఆమె వెనుక తట్టు తిరిగింది మరియు యేసు అక్కడ నిలిచియుండుట చూసింది, మరియు ఆయన యేసు అని ఆమె తెలుసుకోలేదు. 15 యేసు ఆమెతో చెప్పాడు, "అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు ఎవనిని వెదకుచున్నావు?" ఆమె ఆయన తోటమాలి అని ఆలోచించింది, ఆయనతో చెప్పింది, "అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, మరియు నేను ఆయనను తీసుకొని వెళ్తాను." 16 యేసు ఆమెకు చెప్పాడు, "మరియ." వెనుకకు తిరిగి, ఆమె ఆయనకు హెబ్రీలో చెప్పింది, "రబ్బూనీ" (దానికి "బోధకుడు" అని అర్థము). 17 యేసు ఆమెతో చెప్పాడు, "నన్ను పట్టు కొనవద్దు, ఎందుకంటే నేను ఇంకను తండ్రి వద్దకు వెళ్ళ లేదు; అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళు మరియు వారికి చెప్పు, 'నా తండ్రి మరియు మీ తండ్రి, మరియు నా దేవుడు మరియు మీ దేవుడు వద్దకు నేను వెళ్ళు చున్నాను.'" 18 మగ్దలేనే మరియ వచ్చింది, "నేను ప్రభువును చూసాను," మరియు ఆయన ఈ సంగతులు చెప్పాడు అని శిష్యులతో చెప్పింది. 19 అప్పుడు, వారం యొక్క మొదటిది, ఆ దినమున సాయంకాలమైనప్పుడు, మరియు శిష్యులు ఉన్న చోటు యొక్క తలుపులు యూదుల యొక్క భయము కోసం మూసి కొని ఉన్నాయి, యేసు వచ్చాడు మరియు {వారి} మధ్య నిలుచున్నాడు మరియు వారితో చెప్పాడు, "మీకు సమాధానము." 20 మరియు దీనిని చెప్పి, ఆయన వారికి {తన} చేతులు మరియు {ఆయన} ప్రక్కను చూపించాడు. అప్పుడు శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 21 అప్పుడు ఆయన వారితో మరల చెప్పాడు, "మీకు సమాధానము. తండ్రి నన్ను పంపిన విధముగా, అదేవిధంగా నేను మిమ్మును పంపుచున్నాను." 22 మరియు ఇది చెప్పి, ఆయన {వారి} మీద ఊదాడు మరియు వారితో చెప్పాడు, "పరిశుద్ధ ఆత్మను పొందుడి. 23 మీరు ఎవరి పాపములు క్షమింతురో, అవి వారి కోసం క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండును." 24 అయితే యేసు వచ్చినప్పుడు పండ్రెండుమందిలో ఒకడు దిదుమ అని పిలువబడిన తోమా, వారితో లేడు. 25 అప్పుడు ఇతర శిష్యులు అతనితో చెప్పారు, "మేము ప్రభువును చూచాము." అయితే అతడు వారితో చెప్పాడు, "నేను ఆయన చేతులలో మేకుల యొక్క గురుతును చూచి మరియు నా వ్రేలు ఆ మేకుల యొక్క గురుతులో ఉంచి మరియు నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే తప్ప, నేను ఖచ్చితంగా నమ్మను. 26 మరియు ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నారు, మరియు తోమా వారితో ఉన్నాడు. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చాడు, మరియు {వారి} మధ్యలో నిలబడ్డాడు, మరియు చెప్పాడు, "మీకు సమాధానము." 27 అప్పుడు ఆయన తోమాతో చెప్పాడు, "నీ వ్రేలు ఇక్కడు ఉంచుము మరియు నా చేతులు చూడుము. మరియు నీ చెయ్యి చాచుము మరియు దానిని నా ప్రక్కలో ఉంచుము. మరియు అవిశ్వాసివిగా ఉండ వద్దు, అయితే విశ్వసించు. 28 తోమా జవాబిచ్చాడు మరియు ఆయనతో చెప్పాడు, "నా ప్రభువా మరియు నా దేవా." 29 యేసు అతనితో చెప్పాడు, "ఎందుకంటే నీవు నన్ను చూసావు, నీవు నమ్మావు; చూడకుండా మరియు నమ్మిక ఉంచిన వారు ధన్యులు." 30 అప్పుడు యేసు కూడా తన శిష్యుల యెదుట అనేకమైన యితర సూచకక్రియలు చేసాడు, అవి ఈ గ్రంథములో వ్రాయబడి యుండ లేదు, 31 అయితే ఈ సంగతులు వ్రాయబడ్డాయి తద్వారా యేసు దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్ముతారు, మరియు తద్వారా నమ్మి, ఆయన నామములో మీరు జీవము కలిగియుంటారు.
Chapter 21
1 ఈ సంగతుల తరువాత, యేసు తిబెరియ యొక్క సముద్రము వద్ద శిష్యులకు మరల తన్నుతాను కనుపరచుకొన్నాడు. ఇప్పుడు ఈ విధానములో ఆయన తన్నుతాను కనుపరచుకొన్నాడు. 2 వారు కలిసి ఉన్నారు - సీమోను పేతురు మరియు దిదుమ అని పిలువబడిన తోమా మరియు గలిలయ యొక్క కానా నుండి ఉన్నవాడు నతనయేలు మరియు జెబెదయి యొక్క {కుమారులు} మరియు ఆయన శిష్యుల నుండి ఇతర ఇద్దరు. 3 సీమోను పేతురు వారికి చెప్పాడు, "నేను చేపలు పట్టకోడానికి వెళ్తున్నాను." వారు అతనితో చెప్పారు, "మేము కూడా నీతో వస్తున్నాము." వారు వెలుపలికి వెళ్ళారు మరియు ఒక దోనె లోనికి ప్రవేశించారు, అయితే ఆ రాత్రి మధ్యలో యేమియు పట్టలేదు 4 ఇప్పుడు, ఇది దాదాపు తెల్లవారుతూ ఉంది, యేసు ఒడ్డున నిలిచాడు, అయితే ఆయన యేసు అని శిష్యులు యెరుగ లేదు. 5 అప్పుడు యేసు వారితో చెప్పాడు, "పిల్లలారా, భోజనము చెయ్యడానికి మీ వద్ద ఏమైనా చేప లేదు, మీ వద్ద ఉందా?" వారు జవాబిచ్చారు, "లేదు." 6 అయితే ఆయన వారితో చెప్పాడు, "దోనె యొక్క కుడిప్రక్కను వల విసరండి, మరియు మీరు కొన్నింటిని కనుగొంటారు." కాబట్టి, వారు తమ వలను విసిరారు మరియు దానిని లోనికి లాగడానికి వారికి బలము లేదు, ఎందుకంటే చేపల యొక్క సంఖ్య పెద్దది. 7 అప్పుడు యేసు ప్రేమించిన ఆ శిష్యుడు పేతురుతో చెప్పాడు, "ఇది ప్రభువు." కాబట్టి, సీమోను పేతురు, ఇది ప్రభువు అని విని, {అతని} పై వస్త్రమును తీసివేసాడు (ఎందుకంటే అతడు వస్ర్తహీనుడై యున్నాడు), మరియు సముద్రములో తన్ను తాను త్రోసి వేసుకొన్నాడు. 8 అయితే మిగిలిన శిష్యులు దోనేలోనికి వచ్చారు (ఎందుకంటే వారు ఒడ్డు నుండి చాలా దూరంలో లేరు, అయితే దాదాపు 200 మూరల దూరంలో), చేపల యొక్క వలను లాగారు. 9 అప్పుడు వారు ఒడ్డు మీదకు దిగివచ్చినప్పుడు, వారు వెలుగుతూ ఉన్న ఒక బొగ్గు నిప్పు మరియు వాటి మీద ఉంచబడిన ఒక చేప మరియు ఒక రొట్టెను చూసారు. 10 యేసు వారితో చెప్పాడు, "మీరు ఇప్పుడే పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండి." 11 కాబట్టి, సీమోను పేతురు పైకి వెళ్ళాడు మరియు వలను ఒడ్డుకు లాగాడు, పెద్ద చేపలతో నిండి యుంది; 153. అయితే అనేకముగా ఉండి, వల పిగల లేదు. 12 యేసు వారితో చెప్పాడు, "రండి, ప్రాతఃకాల భోజనము భుజించండి." అయితే "నీవు ఎవరివి?" ఆయనను అడగడానికి శిష్యులలో ఎవడును ధైర్యం చెయ్యలేదు. ఇది ప్రభువు అని వారికి తెలుసు. 13 యేసు వచ్చాడు మరియు ఆ రొట్టెను తీసికొన్నాడు మరియు దానిని వారికి ఇచ్చాడు, మరియు చెప్పాను అదే విధానములో. 14 ఇది ఇంతకుముందే యేసు మృతుల నుండి లేపబడిన తరువాత యేసు శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది ఇప్పటికే మూడవసారియై {ఉంది}. 15 అప్పుడు వారు ప్రాతఃకాల భోజనము చేసినప్పుడు, యేసు సీమోను పేతురుతో చెప్పాడు, "యోహాను యొక్క కుమారుడవైన సీమోనూ, వీరి కంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అతడు ఆయనకు చెప్పాడు, "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు యెరుగుదువు." ఆయన అతనితో చెప్పాడు, "నా గొఱ్ఱెపిల్లలను మేపుము." 16 మరల ఆయన అతనితో చెప్పాడు, రెండవ సారి, "యోహాను కుమారుడవైన సీమోనూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?" అతడు చెప్పాడు, "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు." ఆయన ఆయనతో చెప్పాడు, "నా గొఱ్ఱెల యొక్క శ్రద్ధ తీసుకో." 17 ఆయన మూడవసారి అతనితో చెప్పాడు, "యోహాను కుమారుడవైన సీమోనూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా?" పేతురు దుఃఖపడ్డాడు ఎందుకంటే 'నన్ను ప్రేమించుచున్నావా' అని మూడవసారి ఆయన అతనితో అడిగాడు. మరియు అతడు ఆయనతో చెప్పాడు, "ప్రభువా, నీవు అన్ని సంగతులు యెరుగుదువు; నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు యెరుగుదువు ." యేసు అతనితో చెప్పాడు, "నా గొఱ్ఱెలను మేపుము." 18 నిజముగా, నిజముగా, నేను నీతో చెప్పుచున్నాను, నీవు యౌవనుడవై యుండినప్పుడు, నీ అంతట నీవే నడుము కట్టుకొన్నావు మరియు నీవు కోరుకొన్న చోటికి నడివ్హావు, అయితే నీవు ముసలివాడవైనప్పుడు, నీవు నీ చేతులు చాచుదువు, మరియు వేరొకడు నీ నడుము కట్టుతాడు మరియు నీకు కోరు కొనని చోటికి నిన్ను మోసికొని పోవును. 19 ఇప్పుడు ఆయన ఇది చెప్పాడు, అతడు ఏ విధమైన మరణముతో అతడు దేవుని మహిమపరచునో సూచించాడు. ఇది చెప్పి, ఆయన అతనితో చెప్పాడు, "నన్ను వెంబడించుము." 20 చుట్టూ తిరిగి, యేసు ప్రేమించినవాడు, భోజనము వద్ద ఆయన రొమ్మున ఆనుకొని మరియు, "ప్రభువా, నిన్ను ద్రోహము చేత శత్రువుకు అప్పగించువాడు ఎవడు అని అడిగినవాడు కూడా అయిన శిష్యుడు తమను అనుసరించడం వెంబడించడం పేతురు చూసాడు. 21 కాబట్టి అతనిని చూచి, పేతురు యేసుతో చెప్పాడు, "అయితే ప్రభువా, ఇతని సంగతి ఏమిటి?" 22 యేసు అతనితో చెప్పాడు, "నేను వచ్చు వరకు అతడు నిలిచి యుండడానికి నాకు ఇష్టమైన యెడల {అది} నీకు ఏమిటి?" నీవు నన్ను వెంబడించు." 23 కాబట్టి ఆ శిష్యుడు చావడు అను ఈ మాట సహోదరులలో వ్యాపించింది. అయితే అతడు చనిపోడు అని యేసు అతనితో చెప్ప లేదు, అయితే, "నేను వచ్చు వరకు అతడు నిలిచి యుండడానికి నాకు ఇష్టమైన యెడల {అది} నీకు ఏమిటి?" 24 ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు మరియు ఈ సంగతులను వ్రాసిన శిష్యుడు ఇతడే, మరియు ఇతని సాక్ష్యము సత్యము అని మనం యెరుగుదుము. 25 ఇప్పుడు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు ఉన్నాయి, వాటిలో ప్రతిదీ రాయబడిన యెడల, వ్రాయబడిన గ్రంథముల కోసం లోకం అంతటిలో సహితం తగినంత స్థలం ఉండదని నేను ఊహించుచున్నాను.