తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యూదా రాసిన పత్రిక

Chapter 1

1 యూదా, యేసు క్రీస్తు యొక్క దాసుడు, మరియు యాకోబు యొక్క సహోదరుడు, పిలువబడిన వారికి, తండ్రి దేవునిలో ప్రేమింపబడి, మరియు యేసు క్రీస్తులో భద్రము చేయబడినవారు: 2 కనికరము మరియు సమాధానము మరియు ప్రేమ మీకు విస్తరించును గాక. 3 ప్రియమైన వారలారా, మనందరికీ సంబంధించిన రక్షణను గూర్చి మీకు వ్రాయడానికి ప్రతీ ప్రయత్నాన్ని చేస్తూ, పరిశుద్దులు అందరి కోసం ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం కోసం పోరాడడానికి హెచ్చరించుచూ మీకు రాయడానికి నాకు అవసరం ఉంది. 4 ఎందుకంటే కొందరు మనుష్యులు రహస్యముగా ప్రవేశించియున్నారు, వారు భక్తిహినులైనవారు, మన దేవుని యొక్క కృపను పోకిరితనములోనికి మార్చుతూ మరియు మన అద్వితీయ నాధుడు మరియు ప్రభువు యేసు క్రీస్తును విసర్జించి, ఈ తీర్పు కోసం వారు చాలా కాలం ముందుగానే నిర్దేశించబడ్డారు. 5 ఇప్పుడు మీరు సంగతులు అన్నిటిని ఒక్కసారిగా తెలుసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చెయ్యాలని కోరుతున్నాను, అదేమనగా, ఐగుప్తు యొక్క భాగంలో నుండి మనుష్యులను యేసు రక్షించాడు, ఆ తరువాత విశ్వసించని వారిని నాశనము చేసాడు. 6 మరియు దేవదూతలు తమ సొంత ఆధిపత్యమును నిలుపుకొనలేదు, అయితే వారి సొంత నివాస స్థలమును విడిచిపెట్టారు, మహా దినము యొక్క తీర్పు కోసం చీకటి క్రింద నిత్య సంకెళ్ళలో ఆయన వారిని భద్రము చేసాడు. 7 సొదొమ మరియు గొమొర్రా మరియు వాటి చుట్టుపక్కల నగరాలు, వీరి వలే అదే విధానంలో లైంగిక అనైతికతకు పాల్పడి, మరియు ఇతర శరీరుల వెంబడి వెళ్ళి, అనుసరించి, శాశ్వతమైన అగ్ని యొక్క శిక్షను అనుభవిస్తూ ఒక ఉదాహరణ వలే ప్రదర్శించబడుతున్నారు. 8 అయినా కూడా అదే మార్గంలో, వీరును కలలు కనుచు, ఒక వైపున శరీరమును అపవిత్ర పరచుకొనుచు మరియు మరొక వైపు ప్రభుత్వమును విసర్జించుచు మరియు మహిమాన్వితులైన వారిని దూషించుచున్నారు. 9 అయితే ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో విభేదించుచున్నప్పుడు, మోషే యొక్క దేహమును గురించి తర్కించినప్పుడు, అతనికి వ్యతిరేకంగా దూషణ యొక్క తీర్పును అతడు తీసుకురావడానికి తెగింప లేదు, దానికి బదులుగా అతడు చెప్పాడు, "ప్రభువు నిన్ను గద్దించును గాక." 10 అయితే వీరు మరొక వైపు తాము గ్రహింపని వాటిని దూషించువారు, మరొక వైపు, వారు వివేక శూన్యములగు మృగముల వలె స్వాభావికముగా ఎరుగు వాటిని, వీటి వలన వారు నాశనమవుతున్నారు. 11 వారికి శ్రమ. ఎందుకంటే వారు కయీను యొక్క మార్గములో వెళ్ళారు మరియు వేతనాలు కోసం బిలాము యొక్క తప్పుకు తమ్మునుతాము విడిచిపెట్టుకొన్నారు, మరియు కోరహు యొక్క తిరుగుబాటులో వారు నశించారు. 12 వీరు నిర్భయముగా మీతో విందు చేయుచూ - మీ ప్రేమ విందులలో దాగియున్న మడతలు, తమ్మునుతాము పోషించుకొంటారు, వాన లేని మబ్బులు, గాలుల చేత కొట్టుకొని పోతారు; ఫలంలేని శరదృతువు చెట్లు - రెండు సార్లు చనిపోయినవి, వేళ్ళతో పెల్లగింపబడినవి, 13 తమ సొంత సిగ్గుకరమైన క్రియల నుండి నురుగు వెళ్లగ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారి కోసం చీకటి యొక్క అంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది. 14 ఇప్పుడు ఆదాము నుండి ఏడవవాడు హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించాడు, చెప్పాడు, "ఇదిగో ప్రభువు తన యొక్క వేలువేలు పరిశుద్దులతో వచ్చాడు, 15 ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా తీర్పు తీర్చుటకు మరియు భక్తిహీనమైన మార్గంలో వారు చేసిన భక్తిహీనత యొక్క వారి క్రియలు అన్నిటిని గురించి ప్రతీ ఆత్మను గద్దించడానికి మరియు భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన కఠినమైన సంగతులు అన్నిటి గురించి." 16 వీరు తమ దురాశల చొప్పున నడుచుచు, సణుగువారు, నిందించు వారునై యున్నారు, మరియు వారి నోరు డంబమైన సంగతులు పలుకును, లాభము కోసం ముఖములను కొనియాడుతారు. 17 అయితే ప్రియులైనవారు మీరు, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క అపొస్తులుల చేత పూర్వమందు పలుకబడిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి. 18 వారు మీకు చెప్పినవి, "అంత్య కాలములో తమ సొంత భక్తిహీనమైన దురాశల ప్రకారం పరిహాసకులు ఉంటారు. 19 వీరు ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారు, భేదములు కలుగజేయుచున్నారు. 20 అయితే మీరు ప్రియులైనవారు, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయుచూ, మీ అతి పరిశుద్ధ విశ్వాసంలో మిమ్మును మీరు కట్టుకొనుచు, 21 నిత్య జీవముకు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని యొక్క ప్రేమలో మిమ్మును మీరు కాచుకొనియుండుడి. 22 మరియు మరొక వైపు సందేహపడు కొందరి మీద కనికరము కలిగి యుండండి. 23 అయితే మరొక వైపు, అగ్ని నుండి లాగివేసి, ఇతరులను రక్షించండి; మరియు శరీరము చేత అపవిత్రపరచబడిన వస్త్రమును కూడా ద్వేషించుచు భయముతో ఇతరుల మీద కనికరము కలిగి యుండండి. 24 తొట్రిల్లపడడం లేకుండా మిమ్మును కాపాడడానికి మరియు ఆయన మహిమ యెదుట నిర్దోషులనుగా, మహానందములో మిమ్మును నిలువబడేలా చేయడానికి శక్తిగల వానికి ఇప్పుడు, 25 మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మన రక్షకుడు అద్వితీయ దేవునికి, మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, శక్తి మరియు అధికారము, సమస్త యుగములకు పూర్వమును మరియు ఇప్పుడు మరియు సమస్త నిత్యత్వమునకు ఉంటాయి. ఆమేన్!