తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోహాను రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 పెద్దను, సత్యములో నేను ప్రేమిస్తున్న వారు, ఎన్నికైన అమ్మ, మరియు ఆమె యొక్క పిల్లలకు- మరియు నేను మాత్రమే కాక, అయితే ఆ సత్యాన్ని ఎరిగిన వారందరు కూడా- 2 మనలో నిలిచియుంటూ మరియు శాశ్వతకాలం వరకూ మనతో ఉండే ఆ సత్యం కారణంగా. 3 తండ్రి అయిన దేవుని నుండి మరియు తండ్రి యొక్క కుమారుడు యేసు క్రీస్తు నుండి కృప, కరుణ, శాంతి, సత్యంలో మరియు ప్రేమ మనతో ఉంటాయి.

4 తండ్రి నుండి మనం పొందిన ఆజ్ఞ ప్రకారం నీ పిల్లలు కొందరు సత్యములో నడుచుచున్నారు అని నేను కనుగొని నేను అధికంగా ఆనందించాను. 5 మరియు అమ్మా ఇప్పుడు నేను నిన్ను బతిమిలాడుతున్నాను. కొత్త ఆజ్ఞ నీకు రాస్తున్న విధంగా కాదు, అయితే ఆరంభం నుండి మనం కలిగియున్న దానిని - అంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి. 6 మరియు ప్రేమ అంటే ఇదే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. ఆ ఆజ్ఞ ఇదే, ఆరంభం నుండి మీరు వినిన ప్రకారం తద్వారా దానిలో నడుచుకోవాలి. 7 ఎందుకంటే అనేకమంది మోసగాళ్ళు ఈ లోకంలోనికి బయలుదేరారు, వారు యేసు క్రీస్తు శరీరంలో వచ్చియున్నాడని ఒప్పుకోరు. ఇలా ఉండే వాడు వంచకుడు, మరియు క్రీస్తు విరోధి. 8 మనం పని చేసినందుకు రావలసినదానిని మీరు పోగొట్టుకోకుండా, అయితే తద్వారా పూర్ణ ప్రతిఫలం పొందేలా మిమ్మల్నిమీరు చూసుకోవాలి. 9 మించి సాగే ఇటువంటి వాడు మరియు క్రీస్తు యొక్క బోధలో నిలిచి ఉండని వాడు దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచియుండు వాడు తండ్రి, మరియు కుమారుడు ఇద్దరినీ కలిగియున్నాడు. 10 ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మరియు ఈ బోధను తీసుకురాని యెడల అతనిని మీ ఇంటిలోనికి చేర్చుకొనవద్దు. మరియు అతనికి శుభములు చెప్పవద్దు. 11 ఎందుకంటే అతనికి శుభము చెప్పినవాడు, అతని దుష్ట పనులలో పంచుకొంటాడు. 12 మీకు రాయడానికి అనేక సంగతులు ఉన్నాయి, నేను కాగితంతో మరియు సిరా కోరుకోవడం లేదు. అయితే నేను మీ దగ్గరకు రావలెనని మరియు నోటి నుండి నోటితో మాట్లాడడానికి ఎదురుచూస్తున్నాను, తద్వారా మీ సంతోషం సంపూర్ణం అవుతుంది. 13 ఎన్నికైన నీ సోదరి యొక్క పిల్లలు నీకు శుభములు చెప్పుచున్నారు.