తెలుగు (Telugu): GLT - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 దేవుని యొక్క చిత్తము చేత క్రీస్తు యేసు చేత అపొస్తలుడుగా {ఉండుటకు} పిలువబడిన, పౌలును, మరియు సహోదరుడు సొస్తెనేసును 2 కొరింథులో ఉన్న దేవుని యొక్క సంఘమునకు, క్రీస్తు యేసులో పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా {ఉండుటకు} పిలువబడినవారు, వారికిని మరియు మనకును, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామములో ప్రతి స్థలములో ప్రార్థించువారు అందరితో, 3 మన తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృప మరియు సమాధానములు. 4 క్రీస్తు యేసులో మీకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృప యొక్క కారణంగా, మీ కోసం నా దేవునికి ఎల్లప్పుడును నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 5 ఎందుకంటే మీరు ప్రతి విషయములోను, సమస్త ఉపదేశములోను మరియు సమస్త జ్ఞానములోను ఆయనలో ఐశ్వర్యవంతులుగా చేయబడ్డారు. 6 క్రీస్తు యొక్క సాక్ష్యము మీ మధ్య స్థిరపరచబడిన విధముగా. 7 తద్వారా ఏ కృపావరమునందైనా మీరు లోపము లేకుండా ఉంటారు, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఆతురముగా ఎదురుచూచుచున్నారు, 8 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క దినమందు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచడం కూడా చేస్తాడు. 9 దేవుడు నమ్మదగినవాడు, ఆయన చేత మీరు తన కుమారుడు, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క సహవాసము లోనికి పిలువబడ్డారు. 10 సహోదరులారా, మీరు అందరు ఒకే సంగతి మాట్లాడాలి అని మరియు మీ మధ్య విభజనలు ఉండకూడదు, అయితే ఒకే మనస్సులో మరియు ఒకే ఉద్దేశంలో మీరు కలిసి ఏకంగా ఉండాలి అని మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామం ద్వారా ఇప్పుడు మిమ్మును నేను వేడుకొనుచున్నాను. 11 ఎందుకంటే నా సహోదరులారా, మీ మధ్య కలహములు ఉన్నాయి అని మిమ్మును గూర్చి క్లోయె యొక్క యింటివారి చేత నాకు స్పష్టం అయ్యింది. 12 ఇప్పుడు నేను ఇది చెప్పుచున్నాను, మీలో ప్రతి ఒక్కడు, "నేను పౌలు వాడను" లేదా "నేను అపొల్లో వాడను" లేదా "నేను కేఫా వాడను" లేదా "నేను క్రీస్తు వాడను" అని చెప్పుకొంటున్నారు. 13 క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కోసం సిలువ వేయబడలేదు, ఆయన వేయబడ్డాడా? లేదా పౌలు యొక్క నామములో మీరు బాప్తిస్మము పొందారా? 14 క్రిస్పు మరియు గాయియులకు తప్పించి మీలో ఏ ఒక్కరికీ నేను బాప్తిస్మమియ్య లేదు అని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, 15 తద్వారా నా నామములోనికి మీరు బాప్తిస్మము పొందారు అని ఏ ఒక్కరూ చెప్పకుండా ఉంటారు. 16 (ఇప్పుడు స్తెఫను యొక్క ఇంటివారికి కూడా నేను బాప్తిస్మమిచ్చాను, దానికి మించి ఎవరికైనను నేను బాప్తిస్మమిచ్చిన యెడల, అది నాకు తెలియదు. 17 ఎందుకంటే బాప్తిస్మమివ్వడానికి క్రీస్తు నన్ను పంప లేదు అయితే, సువార్త ప్రకటించడానికి - జ్ఞానయుక్తమైన మాటలు కాదు, తద్వారా క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాదు. 18 ఎందుకంటే సిలువ యొక్క గూర్చిన వాక్కు, నశించుచున్న వారికి వెఱ్ఱితనముగా ఉంది, అయితే రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని యొక్క శక్తియై ఉంది. 19 ఎందుకంటే ఇది వ్రాయబడింది, జ్ఞానుల యొక్క జ్ఞానమును నేను నాశనము చేతును. మరియు నేను వివేకుల యొక్క వివేకమును శూన్యపరతును. 20 జ్ఞానియైన మనిషి ఎక్కడ ఉన్నాడు? పండితుడు ఎక్కడ ఉన్నాడు? ఈ యుగము యొక్క తర్కవాది ఎక్కడ ఉన్నాడు? ఈ లోకం యొక్క జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనములోనికి మార్చలేదా? 21 ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానములో, లోకము జ్ఞానము ద్వారా దేవుణ్ణి తెలుసుకో లేదు కాబట్టి, ప్రకటన యొక్క బుద్ధిహీనత ద్వారా విశ్వసించిన వారిని రక్షించడానికి దేవుడు సంతోషించాడు. 22 ఎందుకంటే నిజానికి, యూదులు సూచకక్రియల కోసం అడుగుచున్నారు, మరియు గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. 23 అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులకు అడ్డుబండయు, అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు. 24 అయితే యూదులు మరియు గ్రీసుదేశస్థులు, పిలువబడిన వారికి, ఇద్దరికీ క్రీస్తు దేవుని యొక్క శక్తియును మరియు దేవుని యొక్క జ్ఞానమునై {యున్నాడు}. 25 ఎందుకంటే దేవుని యొక్క వెఱ్ఱితనము మనుష్యల కంటె జ్ఞానము గలది, మరియు దేవుని యొక్క బలహీనత మనుష్యుల కంటె బలమైనది. 26 ఎందుకంటే సహోదరులారా, మీ పిలుపును పరిశీలించండి, శరీరం ప్రకారం అనేకమంది జ్ఞానులు కారు, అనేకులు శక్తివంతులు కారు, {మరియు} అనేకులు ఘనులుగా పుట్టినవారు కాదు అని. 27 అయితే జ్ఞానులను అయన సిగ్గుపరచే క్రమంలో దేవుడు లోకము యొక్క బుద్ధిహీనమైన సంగతులను ఏర్పరచుకొనియున్నాడు, మరియు బలవంతులైనవారిని ఆయన సిగ్గుపరచే క్రమంలో లోకము యొక్క బలహీనమైన సంగతులను దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 28 మరియు ఉన్న సంగతులను ఆయన శూన్యముకు తీసుకొని వచ్చే క్రమంలో దేవుడు లోకము యొక్క నీచమైన సంగతులు మరియు తృణీకరించబడిన సంగతులను {మరియు} లేనివిగా ఉన్నవాటిని ఎన్నుకున్నాడు. 29 తద్వారా ఏ శరీరమూ దేవుని ఎదుట అతిశయించదు. 30 అయితే ఆయన కారణంగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు, ఆయన దేవుని నుండి మన కోసం జ్ఞానమును, నీతియును, మరియు పరిశుద్ధతయును, మరియు విమోచనమును కూడా అయ్యాడు. 31 తద్వారా ఇది వ్రాయబడిన విధముగా, “అతిశయించువాడు ప్రభువులో అతిశయించనివ్వండి.”

Chapter 2

1 మరియు సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చియుండగా, వాక్కు యొక్క లేదా జ్ఞానం యొక్క ఆధిక్యతతో దేవుని యొక్క మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. 2 ఎందుకంటే నేను, యేసు క్రీస్తును మరియు సిలువవేయబడిన ఆయనను తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొన్నాను. 3 మరియు బలహీనతలో మరియు భయములో మరియు అధికమైన వణకులో నేను మీతో ఉన్నాను. 4 మరియు నా మాట మరియు నా ప్రకటన జ్ఞానం యొక్క ప్రేరేపించే మాటలతో {ఉన్నవి} కావు, అయితే ఆత్మ యొక్క మరియు శక్తి యొక్క ప్రదర్శనతో, 5 తద్వారా మీ విశ్వాసము మనుష్యుల యొక్క జ్ఞానములో ఉండదు, అయితే దేవుని యొక్క శక్తిలో. 6 ఇప్పుడు పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును మేము బోధించుచున్నాము, అయితే గతించి పోవుచున్న ఈ యుగము యొక్క జ్ఞానం కాదు, ఈ యుగం యొక్క పాలకులది కాదు. 7 బదులుగా, మన మహిమ కోసం యుగములకు ముందుగా దేవుడు పూర్వనిర్నీతం చేసిన మర్మములో దాచబడిన దేవుని యొక్క జ్ఞానమును మేము బోధించుచున్నాము. 8 అది ఈ యుగము యొక్క అధికారులలో ఎవరూ అర్థం చేసుకోలేదు, ఎందుకంటే వారు దానిని అర్థం చేసుకొన్న యెడల, వారు మహిమ యొక్క ప్రభువును సిలువ వేసి ఉండే వారు కాదు. 9 అయితే ఇది వ్రాయబడిన విధముగా, తన్ను ప్రేమించువారి కోసం దేవుడు సిద్ధపరచిన ఈ సంగతులు ఏ కన్ను చూడ లేదు మరియు చెవి విన లేదు మరియు మనిషి యొక్క హృదయంలో పుట్ట లేదు. 10 ఎందుకంటే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా మనకు బయలుపరచియున్నాడు. ఎందుకంటే ఆత్మ అన్నిటిని, దేవుని యొక్క లోతైన సంగతులను కూడ పరిశోధించుచున్నాడు. 11 ఎందుకంటే ఒక మనుష్యుని యొక్క సంగతులు అతనిలో {ఉన్న} మనుష్యుని యొక్క ఆత్మకే తప్ప మనుష్యుల మధ్య ఎవనికి తెలియును? ఆ విధంగానే దేవుని యొక్క సంగతులు దేవుని యొక్క ఆత్మకే తప్ప మరి ఎవనికిని తెలియవు. 12 అయితే మనము లోకము యొక్క ఆత్మను పొంద లేదు, అయితే దేవుని నుండి {ఉన్న} ఆత్మ, తద్వారా దేవుని చేత మనకు ఉచితముగా దయచేయబడిన సంగతులు మనము తెలుసుకొంటాము. 13 మరియు మనుష్య జ్ఞానము చేత బోధింపబడిన మాటలలో మేము ఈ సంగతులు బోధించడం లేదు అయితే ఆత్మ చేత బోధించబడిన వాటిలో ఆత్మీయ పదాలతో .ఆత్మీయ సంగతులను కలుపుతున్నాము. 14 అయితే ప్రకృతి సంబంధియైన వ్యక్తి దేవుని యొక్క ఆత్మ యొక్క సంగతులు అంగీకరింపడు, ఎందుకంటే అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, మరియు అవి ఆత్మీయంగా వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింప లేడు. 15 అయితే ఆత్మసంబంధియైనవాడు అన్ని సంగతులను వివేచించును, అయితే అతడు తానే ఏ ఒక్కని చేతను వివేచింపబడడు. 16 ఎందుకంటే ప్రభువు యొక్క మనస్సును ఎరిగిన వాడు ఎవడు - ఆయనకు బోధింప గలవాడెవడు? అయితే మనము క్రీస్తు యొక్క మనస్సు కలిగినవారము.

Chapter 3

1 మరియు నేను, సహోదరులారా, ఆత్మసంబంధులు వలే మీతో మాటలాడ లేకపోయాను, అయితే శరీర సంబంధుల వలే, క్రీస్తులో పసిబిడ్డల వలే. 2 త్రాగడానికి నేను మీకు పాలు ఇచ్చాను, ఘనమైన ఆహారం కాదు, ఎందుకంటే మీరు ఇంకా సమర్ధులు కాదు. నిజానికి ఇప్పటికి కూడా మీరు సమర్ధులు కాదు. 3 ఎందుకంటే మీరు ఇంకా శరీర సంబందులుగా ఉన్నారు. ఎందుకంటే మీ మధ్య అసూయ మరియు కలహమును ఉండగా, మీరు శరీర సంబంధులై మరియు మనుష్యల ప్రకారం నడుచుకొనువారు కారా? 4 ఎందుకంటే ఒకడు–“నేను పౌలు వాడను,” మరియు మరియొకడు –“నేను అపొల్లోవాడను,” అని చెప్పునప్పుడు మీరు మనుష్యులు కారా? 5 అప్పుడు అపొల్లో ఎవడు? మరియు పౌలు ఎవడు? ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము కూడా వారి ద్వారా మీరు విశ్వసించిన పరిచారకులు. 6 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, అయితే అది ఎదగడానికి దేవుడు కారణం అయ్యాడు. 7 కాబట్టి అప్పుడు, నాటువానిలోనైనను లేదా నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు, అయితే వృద్ధి కలుగజేయువాడు దేవుడే. 8 ఇప్పుడు నాటువాడును మరియు నీళ్లుపోయువాడును ఒక్కటే, మరియు ప్రతి వాడు తన స్వీయ కష్టం ప్రకారం తన స్వీయ జీతము పుచ్చుకొనును. 9 ఎందుకంటే మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై యున్నారు. 10 జ్ఞాన వంతుడైన ఓక నిపుణుడైన నిర్మాణకుని వలే దేవుడు నాకు అనుగ్రహించిన కృప ప్రకారం, నేను ఒక పునాది వేసాను, మరియు మరియొకడు దాని మీద కట్టుచున్నాడు, అయితే ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో అతడు జాగ్రత్తగా చూచుకొననివ్వండి. 11 ఎందుకంటే వేయబడిన దాని కంటే మరియొక పునాది ఎవడును వేయలేడు, అది యేసు క్రీస్తే. 12 ఇప్పుడు ఎవడైనను పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, లేదా కొయ్య కాలుతో కట్టిన యెడల, 13 ప్రతి ఒక్కరి యొక్క పని స్పష్టం అవుతుంది, ఎందుకంటే ఆ దినము దానిని కనుపరచును; ఎందుకంటే అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు ప్రతిఒక్కరి యొక్క పని యెట్టిదై ఉన్నదో దానిని అగ్నియే పరీక్షించును. 14 ఒకడు తాను కట్టిన పని నిలిచిన యెడల, వాడు జీతము పుచ్చు కొనును. 15 ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును, అయితే అతడు తానే రక్షింపబడును, అయితే అగ్ని ద్వారా తప్పించుకొన్నట్టు వలే. 16 మీరు దేవుని యొక్క ఆలయమై యున్నారు మరియు దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరెరుగరా? 17 ఎవడైనను దేవుని యొక్క ఆలయమును నాశనం చేసిన యెడల, దేవుడు ఆ వ్యక్తిని నాశనం చేయును. ఎందుకంటే దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై యున్నది, అది మీరై ఉన్నారు. 18 ఏ ఒక్కడును తన్నుతాను మోసపరచుకొననివ్వ వద్దు. మీ మధ్య ఏఒక్కడైనను ఈ యుగములో తాను జ్ఞానిని అని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు అతడు వెఱ్ఱివాడు కానివ్వండి. 19 ఎందుకంటే ఈ లోకము యొక్క జ్ఞానము దేవునికి వెఱ్ఱితనమై ఉన్నది. ఎందుకంటే ఇది వ్రాయబడి ఉన్నది, “జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును; 20 మరియు మరల “జ్ఞానుల యొక్క యోచనలు అవి వ్యర్థములు అని ప్రభువు యెరుగును.” 21 కాబట్టి అప్పుడు ఏ ఒక్కడు మనుష్యులలో అతిశయింప నివ్వవద్దు. ఎందుకంటే అన్ని సంగతులు మీవి. 22 పౌలు గాని లేదా అపొల్లో లేదా కేఫా లేదా లోకము లేదా జీవము లేదా మరణము లేదా ప్రస్తుతమందున్న సంగతులు లేదా రాబోవు సంగతులు అన్ని సంగతులు మీవే. 23 మరియు మీరు క్రీస్తు వారు, మరియు క్రీస్తు దేవుని వాడు.

Chapter 4

1 ఈ విధానంలో మనుష్యుడు మమ్మును లక్ష్యపెట్టనివ్వండి: క్రీస్తు యొక్క సేవకులు మరియు దేవుని యొక్క మర్మముల యొక్క గృహనిర్వాహకుల వలే. 2 ఈ విషయంలో, గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట ఇది అవశ్యము. 3 అయితే మీ చేత లేదా మనుష్య న్యాయ స్థానం చేత నేను పరీక్షించబడుట అనేది ఇది నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఎందుకంటే నన్ను నేనే పరీక్షించు కొనను. 4 ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఏదియూ తెలియదు, అయితే దీని చేత నేను నీతిమంతుడనుగా ఎంచబడను; అయితే నన్ను తీర్పు తీర్చువాడు ప్రభువే. 5 కాబట్టి సమయము రాకమునుపు, ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారము యొక్క దాచబడిన సంగతులను వెలుగులోనికి తీసుకొని మరియు హృదయముల యొక్క ఉద్దేశములను బయలుపరచడం రెండూ చేస్తాడు. మరియు అప్పుడు దేవుని నుండి మెప్పు ప్రతి వానికి వస్తుంది. 6 ఇప్పుడు, సహోదరులారా, ఈ సంగతులను మీ కోసం నాకునూ మరియు అపోల్లోకు నేను అన్వయించాను, తద్వారా మా ద్వారా మీరు దీనిని నేర్చుకొంటారు: “వ్రాయబడిన దానికి మించినది కాదు,” తద్వారా ఏ ఒక్కరూ ఒకని పక్షంగా మరొకరికి వ్యతిరేకంగా ఉప్పొంగకుండా ఉంటారు. 7 ఎందుకంటే మిమ్మును అధికులుగా ఎవరు చేస్తున్నారు? మరియు నీకు కలిగిన వాటిలో నీవు పొందనిది ఏది? మరియు నిజానికి నీవు దానిని పొంది యుండిన యెడల, నీవు దానిని పొందియుండ లేదు అన్నవిధముగా, నీవు ఎందుకు అతిశయించుచున్నావు? 8 ఇదివరకే మీరు సంతృప్తి చెందారు! ఇదివరకే మీరు ఐశ్వర్యవంతులైతిరి! మా నుండి వేరుగా మీరు పాలించడం ఆరంభించారు, మరియు మీరు నిజంగా పరిపాలించాలని నేను కోరుకొంటున్నాను, తద్వారా మేము కూడా మీతో పరిపాలిస్తాము. 9 ఎందుకంటే మరణదండన విధింపబడినవారమైన విధముగా దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట కనుపరచాడు అని నేను తలస్తున్నాను. ఎందుకంటే మేము లోకమునకు - దేవదూతలకును మరియు మనుష్యులకును ఇద్దరికీ వేడుకగా మారాము. 10 మేము క్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారమై {యున్నాము}, అయితే మీరు క్రీస్తులో జ్ఞానమంతులై {ఉన్నారు}. మేము బలహీనులమై {యున్నాము}, అయితే మీరు బలవంతులై యున్నారు. మీరు ఘనపరచబడి {యున్నారు}. అయితే మేము ఘనహీనులమై {యున్నాము}. 11 ఈ ప్రస్తుత గడియ వరకు మేము ఆకలి మరియు దప్పిక రెండు కలిగియున్నాము. మరియు పేదగా దుస్తులు ధరించాము మరియు క్రూరంగా కొట్టబడ్డాము మరియు నిరాశ్రయులమై ఉన్నాము 12 మరియు కష్టపడి పని చేస్తున్నాము, {మా} స్వంత చేతులతో పని చేస్తున్నాము. దూషించబడుతూ, మేము ఆశీర్వదిస్తున్నాము; హింసించబడుతూ ఉండి మేము సహిస్తున్నాము. 13 దూషింపబడియు, మేము ఆదరించుచున్నాము. ఇప్పటి వరకు కూడా మేము లోకము యొక్క మలినము, అన్ని సంగతుల యొక్క తిరస్కరణ వలే మారాము. 14 మిమ్మును సిగ్గుపరచు విధముగా నేను ఈ సంగతులు వ్రాయడం లేదు, అయితే నా ప్రియమైన పిల్లల వలె, నేను {మిమ్మల్ని} సరిదిద్దుతున్నాను. 15 ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేలమంది యున్న యెడల, అయినప్పటికీ {మీరు} అనేకమంది తండ్రులను {కలిగి లేరు} ఎందుకంటే సువార్త ద్వారా క్రీస్తు యేసులో నేను మిమ్మును కంటిని. 16 కాబట్టి మీరు నన్ను అనుకరించే వారిగా మారాలని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 17 ఈ కారణం కోసం ప్రభువులో అతడు నా ప్రియుడు మరియు నమ్మకమైన బిడ్డ తిమోతిని మీ యొద్దకు నేను పంపియున్నాను. ప్రతి సంఘములో ప్రతి స్థలములో నేను భోధించిన విధముగా అతడు క్రీస్తు యేసులో {ఉన్న} నా మార్గాలను మీకు జ్ఞాపకం చేస్తాడు. 18 ఇప్పుడు నేను మీ యొద్దకు రావడం లేదు అన్నట్టుగా కొందరు ఉప్పొంగుచున్నారు. 19 అయితే ప్రభువు చిత్తమైన యెడల, నేను త్వరలోనే మీ యొద్దకు వస్తాను, మరియు ఉప్పొంగుచున్న వారి యొక్క మాటను మాత్రమే కాదు, అయితే వారి శక్తిని నేను కనుగొంటాను. 20 ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము మాటలో కాదు అయితే శక్తిలో {ఉంది}. 21 మీరు ఏమి కోరుచున్నారు? బెత్తముతో లేదా ప్రేమ మరియు సాత్వికము యొక్క ఆత్మతో నేను మీ వద్దకు రావలెనా?

Chapter 5

1 నిజానికి మీ మధ్య లైంగిక దుర్నీతి ఉన్నది మరియు అటువంటి లైంగిక దుర్నీతి అన్యజనుల మధ్య సహితం లేదు అని - ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు అని ఇది నివేదించబడింది. 2 మరియు మీరు ఉప్పొంగుచున్నారు, మరియు బదులుగా దుఃఖపడ లేదు, తద్వారా ఈ పని చేసిన వాడు మీ మధ్య నుండి తొలగించబడతాడు. 3 ఎందుకంటే నేను కూడా, దేహములో లేకపోయిననూ అయితే ఆత్మలో ఉండి, అటువంటి కార్యం చేసిన వ్యక్తి మీద ఇప్పటికే ఉన్నట్టు వలే తీర్పు ఇచ్చాను. 4 మీరు మరియు నా ఆత్మ, మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామంలో, మన ప్రభువు యేసు యొక్క శక్తితో సమావేశమయ్యాము 5 శరీరం యొక్క నాశనం కోసం ఈ మనిషిని సాతానుకు అప్పగించుము తద్వారా {అతని} ఆత్మ ప్రభువు యొక్క దినములో రక్షించబడుతుంది. 6 మీ అతిశయము మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును అని మీరు యెరుగరా? 7 పాతదైన పులిపిండిని శుభ్రపరచండి తద్వారా మీరు పులియని రొట్టె వలె ఉన్న విధముగా మీరు క్రొత్త ముద్దగా ఉంటారు. ఎందుకంటే క్రీస్తు, మన పస్కా గొర్రెపిల్ల కూడా వధింప బడెను. 8 కాబట్టి అప్పుడు, పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు మరియు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాదు, అయితే యధార్ధత మరియు సత్యమునను పులియని రొట్టెతో మనం పండుగ ఆచరింతము. 9 లైంగిక దుర్నీతిపరులైన మనుష్యులతో సాంగత్యము చేయ వద్దని నా పత్రికలో నేను మీకు వ్రాసియుంటిని 10 ఏమైనప్పటికీ ఈ లోకం యొక్క అనైతిక మనుష్యులు, లేదా లోభులు మరియు , దోచుకొనువారు లేదా విగ్రహారాధకులు, అప్పటి నుండి మీరు ఈ లోకం నుండి బయటకు వెళ్లవలసిన అవసరం ఉంది. 11 అయితే ఇప్పుడు, సహోదరుడు అని పిలువబడిన వాడు ఎవరైనను లైంగిక దుర్నీతిపరుడు లేదా లోభత్వంతో ఉన్నవాడు లేదా విగ్రహారాధకుడు లేదా తిట్టుబోతు లేదా త్రాగుబోతు లేదా దోచుకొనువాడు అయిన వానితో సాంగత్యము చేయకూడదని నేను మీకు వ్రాయుచున్నాను. అటువంటి వ్యక్తితో భోజనం కూడా చెయ్యవద్దు. 12 ఎందుకంటే వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకు ఏమిటి? లోపటి వారికి మీరు తీర్పు తీర్చరా? 13 అయితే వెలుపల ఉన్న వారికి దేవుడు తీర్పు తీర్చును. “మీ మధ్య నుండి దుర్మార్గతను తొలగించండి.”

Chapter 6

1 మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధుల యెదుట గాక మరియు అనీతిమంతుల యెదుట న్యాయస్థానముకు వెళ్ళడానికి ధైర్యం చేయున్నాడా? 2 లేదా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరెరుగరా? మరియు మీ చేత లోకము తీర్పు తీర్చబడవలసిన యెడల, మీరు మిక్కిలి అల్పమైన విషయములను గూర్చి అనర్హులుగా ఉన్నారా? 3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుము అని మీరు యెరుగరా? ఈ జీవితం యొక్క విషయాలు, ఇంకా ఎంత ఎక్కువ? 4 కాబట్టి అప్పుడు, ఈ జీవితం యొక్క విషయాల గురించి మీకు చట్టపరమైన వ్యాజ్యెములు కలిగిన యెడల, సంఘములో లెక్కలో లేని వారిని మీరు తీర్పరులుగా ఎందుకు నియమిస్తారు? 5 మీ సిగ్గుకు నేను ఇది చెప్పుచున్నాను. {అవునా} ఈ విధంగా తన సహోదరుల మధ్యను వివేచన చేయగల వాడు ఎవరైనా జ్ఞాన వంతుడైన మనుష్యుడు మీ మధ్య లేడా? 6 అయితే సహోదరునికి వ్యతిరేకంగా సహోదరుడు న్యాయస్థానముకు వెళ్ళుచున్నాడు, మరియు ఇది అవిశ్వాసుల ముందు? 7 ఇది, కాబట్టి, నిజానికి మీకు ఇప్పటికే ఒక పూర్తి ఓటమిగా ఉంది, మీ మధ్య వ్యాజ్యాలు ఉన్నాయి కాబట్టి బదులుగా అన్యాయము ఎందుకు చేయబడ కూడదు? బదులుగా ఎందుకు మోసగింపబడకూడదు? 8 అయితే మీరు తప్పు చేస్తున్నారు మరియు మోసగిస్తున్నారు, మరియు దీనిని మీ సహోదరులకు! 9 లేదా అనీతిమంతులు దేవుని యొక్క రాజ్యమును వారసత్వంగా పొందరు అని మీకు తెలియదా? మోసగింపబడకుడి; లైంగిక దుర్నీతిపరులు లేదా విగ్రహారాధికులు లేదా వ్యభిచారులు లేదా పురుష వేశ్యలు లేదా స్వలింగ సంపర్కాన్ని అభ్యసించే వారు కాదు. 10 దొంగలు కాని లోభులు కాని త్రాగుబోతులు కాని అపవాదకులు కాని మోసగాళ్ళు కాని దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు. 11 మరియు మీలో కొందరు అట్టివారై యుంటిరి, అయితే మీరు శుద్ధి చేయబడ్డారు అయితే మీరు పరిశుద్ధపరచబడ్డారు, అయితే ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామములో మరియు మన దేవుని యొక్క ఆత్మ చేత మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. 12 “ప్రతీది నా కోసం చట్టబద్ధమైనది,” అయితే ప్రతీది ప్రయోజనకరమైన కాదు. “ప్రతీది నా కోసం చట్టబద్ధమైనది,” అయితే నేను దేని చేతను లోపరచుకొనబడను. 13 “ఆహారం కడుపు కోసం {ఉన్నది}, మరియు కడుపు ఆహారం కోసం", అయితే దేవుడు దీనిని మరియు వాటిని రెంటిని దూరం చేస్తాడు. ఇప్పుడు శరీరం లైంగిక దుర్నీతి కోసం కాదు, అయితే ప్రభువు కోసం మరియు ప్రభువు శరీరం కోసం. 14 ఇప్పుడు దేవుడు నిజముగా ప్రభువును లేపాడు మరియు మనలను కూడ తన శక్తి చేత లేపుతాడు. 15 మీ దేహములు క్రీస్తు యొక్క అవయవములై యున్నవి అని మీరు ఎరుగరా? కాబట్టి క్రీస్తు యొక్క అవయవములను తీసివేసియుండగా, నేను వాటిని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎన్నడు ఉండదు! 16 లేదా వేశ్యతో కలిసికొనువాడు ఏక శరీరమై యున్నాడు అని మీరు ఎరుగరా? ఎందుకంటే ఇది చెపుతుంది, “ఇద్దరు ఒక్క శరీరముగా అవుతారు. 17 అయితే ప్రభువుకు చేర్చబడినవాడు ఒక్క ఆత్మయై ఉన్నాడు. 18 లైంగిక దుర్నీతి నుండి పారిపోండి! మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, అయితే లైంగిక దుర్నీతిపరుడైన వాడు {తన} స్వంత శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. 19 లేదా మీ దేహము దేవుని నుండి మీరు పొంది, మీలో నున్న పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? మరియు మీరు మీ స్వంతం కాదు, 20 ఎందుకంటే మీరు ఒక వెలతో కొనబడినారు. కాబట్టి, మీ దేహములో దేవుని మహిమపరచుడి.

Chapter 7

1 ఇప్పుడు మీరు వ్రాసిన వాటి విషయము: “ఒక స్త్రీని ముట్ట కుండుట ఒక పురుషునికి {ఇది} మంచిది.” 2 అయితే దుర్నీతి యొక్క కారణంగా, ప్రతి పురుషుడు తన స్వంత భార్యను కలిగియుండనివ్వండి, మరియు ప్రతి స్త్రీ {ఆమె} స్వంత భర్తను కలిగియుండనివ్వండి. 3 భర్త భార్యకు కర్తవ్యాన్ని ఇవ్వనివ్వండి మరియు అదేవిధంగా భార్య కూడా భర్తకు. 4 భార్యకు {ఆమె} సొంత దేహము మీద అధికారము లేదు, అయితే భర్తకు {ఉంది}. మరియు అలాగే, భర్తకు కూడా {అతని} స్వంత శరీరం మీద అధికారం లేదు, అయితే భార్యకు {ఉంది}. 5 ఒక సమయము కోసం పరస్పర ఒప్పందం ద్వారా తప్ప ఒకరినొకరు పోగొట్టుకో వద్దు, తద్వారా మిమ్ములను మీరు ప్రార్థనకు సమర్పించు కొంటారు. మరియు అప్పుడు మరల కలసి ఉండండి, తద్వారా మీకు స్వీయ నియంత్రణ లేని కారణము వలన సాతాను మిమ్ములను శోధించకుండ ఉంటాడు. 6 అయితే నేను దీనిని ఒక సమ్మతిగా చెప్పుచున్నాను, ఒక ఆజ్ఞగా కాదు. 7 అయితే మనుష్యులు అందరు నా వలె సహితం ఉండడానికి నేను కోరుచున్నాను. అయితే ప్రతి ఒక్కరికి దేవుని నుండి తన స్వంత వరము ఉంటుంది, ఒకడు నిజానికి ఈ విధంగా, మరియు మరొకడు ఆ విధంగా. 8 ఇప్పుడు నేను ఉన్న విధంగా వారు నిలిచి యుండిన యెడల, {ఇది} వారికి మేలు అని పెండ్లికాని వారితోను మరియు విధవరాండ్రతోను నేను చెప్పుచున్నాను. 9 అయితే వారికి స్వీయ నియంత్రణ లేని యెడల. వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే కాల్చబడడం కంటే పెళ్ళి చేసుకోవడం ఇది ఉత్తమం. 10 ఇప్పుడు వివాహితులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను-నేను కాదు, అయితే ప్రభువు- భార్య తన భర్త నుండి వేరుచేయబడ కూడదు. 11 (అయితే ఆమె విడిపోయిన యెడల కూడా, ఆమెను పెళ్ళి చేసుకోకుండా ఉండనివ్వండి, లేదా ఆమె భర్తతో సమాధానపడనివ్వండి), మరియు ఒక భర్త ఒక భార్యకు పరిత్యాగ పత్రిక ఇవ్వ కూడదు. 12 అయితే మిగిలిన వారికి నేను చెప్పుచున్నాను- నేను, ప్రభువు కాదు- ఎవరైనా సహోదరునికి అవిశ్వాసురాలైన భార్య ఉండి, మరియు ఆమె అతనితో జీవించడానికి అంగీకరించిన యెడల, అతడు ఆమెకు పరిత్యాగపత్రిక ఇవ్వనివ్వ వద్దు. 13 మరియు ఏ స్త్రీకైన అవిశ్వాసియైన భర్త ఉండి, మరియు అతడు ఆమెతో జీవించడానికి అంగీకరించిన యెడల ఆమె భర్తకు పరిత్యాగపత్రిక ఇవ్వనివ్వ వద్దు. 14 ఎందుకంటే అవిశ్వాసి అయిన భర్త భార్య ద్వారా పరిశుద్ధపరచబడతాడు, మరియు అవిశ్వాసి అయిన భార్య సహోదరుని ద్వారా పరిశుద్ధ పరచబడుతుంది. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులైయుందురు, అయితే ఇప్పుడు వారు పరిశుద్ధులు. 15 అయితే అవిశ్వాసియైనవాడు విడిచిపోయిన యెడల, అతనిని వెళ్ళనివ్వండి. అటువంటి సందర్భాలలో, సహోదరుడు లేదా సహోదరి కట్టుబడి ఉండరు, అయితే దేవుడు మనలను సమాధానమునకు పిలిచాడు. 16 ఎందుకంటే స్త్రీ, భర్తను రక్షించెదవో లేదో నీకు ఎలా తెలుసు? లేదా పురుషుడా, భార్యను నీవు రక్షించెదవో లేదో నీకు ఎలా తెలుసు? 17 అయినప్పటికీ, ప్రభువు ప్రతి ఒక్కరికి నియమించిన విధముగా, దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచిన విధముగా, ఈ విధంగా అతనిని నడవనివ్వండి. మరియు ఈ విధానంలో నేను సంఘములు అన్నిటిలో నడిపిస్తాను. 18 సున్నతి చేయబడి, ఎవడైనను పిలువబడినాడా? అతడు సున్నతి పొందనివాడుగా ఉండనివ్వకండి. సున్నతి పొందని స్థితిలో ఎవడైనను పిలువబడెనా? అతనిని సున్నతి పొందనివ్వ వద్దు. 19 సున్నతి ఏమి కాదు, మరియు సున్నతి పొందకపోవడం ఏమి కాదు, అయితే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటయే. 20 ప్రతి ఒక్కడు, అతడు పిలువబడిన పిలుపులో, అతనిని అందులోనే ఉండనివ్వండి. 21 నీవు ఒక దాసుడువుగా పిలువబడితివా? ఇది నీకు ఒక చింతగా ఉండనివ్వ వద్దు. అయితే నీవు నిజంగా స్వేచ్ఛగా మారగలిగిన యెడల, అప్పుడు దాని యొక్క ప్రయోజనాన్ని పొందండి. 22 ఎందుకంటే ప్రభువులో బానిసగా పిలువబడిన వాడు ప్రభువు యొక్క ఒక స్వేచ్ఛపొందిన మనుష్యుడుగా ఉన్నాడు. అదేవిధంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడు పిలువబడిన వాడు క్రీస్తు యొక్క బానిసగా ఉన్నాడు. 23 మీరు ఒక వెలతో కొనబడినవారు; మనుషుల యొక్క బానిసలుగా మార వద్దు. 24 సహోదరులారా, ప్రతి ఒక్కడు అతడు పిలువబడిన దానిలో, అతడు దానిలో దేవునితో నిలిచి ఉండనివ్వండి. 25 ఇప్పుడు కన్యకల సంబంధించి, ప్రభువు యొక్క ఒక ఆజ్ఞ నేను పొంద లేదు, అయినప్పటికీ, నమ్మదగినదిగా ఉండేందుకు ప్రభువు నుండి కరుణ పొందిన విధముగా నేను ఒక అభిప్రాయాన్ని ఇస్తున్నాను. 26 కాబట్టి, ఇది మంచిదిగా ఉంది అని నేను భావిస్తున్నాను, రాబోయే దుఃఖము కారణంగా, అతడు అలాగే ఉండుట అది ఒక మనుష్యునికి మంచిది. 27 నీవు భార్యకు కట్టుబడి ఉన్నావా? విడుదల చేయబడుటకు వెదక వద్దు. నీవు ఒక భార్య నుండి విడుదల చేయబడితివా? ఒక భార్యను వెదక వద్దు. 28 అయితే, నీవు నిజంగా వివాహము చేసుకున్న యెడల, నీవు పాపము చేయ లేదు; మరియు కన్య వివాహం చేసుకున్న యెడల, ఆమె పాపం చేయ లేదు. అయితే అలాంటి వారికి శరీరములో బాధ ఉంటుంది, మరియు నేను మిమ్ములను దీని నుండి తప్పించాలనుకుంటున్నాను. 29 అయితే సహోదరులారా ఇది నేను చెప్పుచున్నాను: సమయం తగ్గించబడి ఉంది, తద్వారా ఇప్పటి నుండి, భార్యలు ఉన్నవారు కూడా ఏమీ లేని వారి వలే ఉండాలి; 30 మరియు ఏడ్చువారు, ఏడ్వని వారి వలె; మరియు సంతోషించే వారు, సంతోష పడని వారి వలె; మరియు కొనువారు, కలిగి ఉండని వారి వలె; 31 మరియు లోకమును ఉపయోగించేవారు, దానిని ఉపయోగించని వారి వలె; ఎందుకంటే ఈ లోకం యొక్క ప్రస్తుత రూపం గతించిపోతుంది. 32 అయితే మీరు చింత నుండి స్వేచ్ఛగా ఉండవలెనని నేను కోరుచున్నాను. పెండ్లికాని మనుష్యుడు ప్రభువు యొక్క విషయాల గురించి చింతిస్తున్నాడు, అతడు ప్రభువును ఏవిధంగా సంతోషపరచగలడు. 33 అయితే పెండ్లియైన పురుషుడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకము యొక్క విషయములను గురించి చింతించుచున్నాడు, మరియు అతడు విభజించబడ్డాడు. మరియు వివాహము కాని స్త్రీ లేక కన్యక. 34 ప్రభువు యొక్క విషయాల గురించి చింతించుచున్నది, తద్వారా ఆమె శరీరములో మరియు ఆత్మలో రెంటిలో పరిశుద్ధముగా ఉంటుంది. అయితే పెండ్లియైన వ్యక్తి లోకము యొక్క విషయాలు గురించి, భర్తను ఆమె ఏవిధంగా సంతోషపెట్టగలనని చింతించుచున్నది. 35 ఇప్పుడు నేను మీ స్వంత ప్రయోజనం కోసం దీనిని చెప్పుచున్నాను, మీ మీద ఎలాంటి నిర్బంధాన్ని ఉంచడం కోసం కాదు, అయితే ఎలాంటి ఆటంకము లేకుండా ప్రభువుకు తగినవిధంగా మరియు అర్పించుకొన్న వాటి వైపు. 36 అయితే తన కన్య పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఎవడైననూ తలంచిన యెడల-ఆమె వివాహ వయస్సు దాటిన యెడల మరియు అది అలా ఉండాలి – తాను కోరుకున్నదానిని అతడు జరిగించాలి. అతను పాపం చేయడం లేదు; వారిని పెళ్లి చేసుకోనివ్వండి. 37 అయితే తన హృదయంలో స్థిరంగా నిలిచి ఉన్నవాడు, బలవంతం మీద కాదు, అయితే {అతని} స్వంత చిత్తం మీద అధికారం కలిగి, మరియు అతడు దీనిని {తన స్వంత హృదయంలో నిర్ణయించుకున్నాడు —{తన స్వంత కన్యను ఉంచడానికి—అతడు బాగా చేస్తాడు. 38 కాబట్టి అప్పుడు, {అతని} స్వంత కన్యను పెండ్లికొను వాడు మంచిను జరిగిస్తున్నాడు, మరియు వివాహం చేసుకొననివాడు ఇంకా బాగుగా జరిగిస్తున్నాడు. 39 భార్య తన భర్త బ్రదికి ఉన్నంత కాలము బద్ధురాలై యుండును, అయితే భర్త మృతిపొందిన యెడల, ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండును, అయితే ప్రభువులో మాత్రమే. 40 అయినప్పటికీ నా తీర్పు ప్రకారం ఆమె ఉన్న విధముగా నిలిచి యుండిన యెడల, ఆమె సంతోషముగా ఉండును. మరియు నేను కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి యున్నాను అని నేను తలంచుచున్నాను.

Chapter 8

1 ఇప్పుడు విగ్రహములకు బలిగా అర్పించబడిన సంగతుల గురించి: –మనం అందరం జ్ఞానము గలవారము అని మనం యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును, అయితే ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 2 ఎవడైనను తనకు ఒకటి తెలుసు అని తలంచిన యెడల, తాను తెలిసికొనవలసిన విధంగా అతడు ఇంకనూ తెలుసుకొన లేదు. 3 అయితే ఎవడైనను దేవుని ప్రేమించిన యెడల, అతడు ఆయన చేత తెలుసుకొనబడినవాడే. 4 కాబట్టి అప్పుడు, విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట గురించి: లోకములో ఒక విగ్రహము వట్టిది మరియు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడు అని మనం ఎరుగుదుము. 5 ఎందుకంటే దేవతలని పిలువబడినవారు ఉన్నప్పటికి కూడా, పరలోకములో లేదా భూమి మీద గాని, అనేక “దేవతలు” మరియు అనేక “ప్రభువులు” ఉన్న విధముగా ఉన్నారు. 6 అయినప్పటికీ మన కోసం ఒక్క తండ్రి దేవుడు {ఉన్నాడు}, ఆయన నుండి సమస్త కార్యములు మరియు ఆయన కోసం మనం {ఉన్నాము}, మరియు ఒక్క ప్రభువు యేసు క్రీస్తు, ఆయన ద్వారా సమస్త కార్యములు {ఉన్నాయి}, మరియు ఆయన ద్వారా మనం {ఉన్నాము}. 7 అయితే ప్రతి ఒక్కరిలో ఈ జ్ఞానము లేదు. బదులుగా, కొందరు ఇప్పటి వరకు విగ్రహముల యొక్క ఆచారములో {ఉండి}, విగ్రహములకు బలి యియ్యబడినవాటిని భుజించుదురు, మరియు వాటి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 8 అయితే భోజనము మనలను దేవుని వద్దకు తీసుకొని రాదు, మనం భుజించక పోయిన యెడల మనకు తక్కువ చెయ్యబడదు, మనము భుజించిన యెడల మనకు విస్తరించ లేదు. 9 అయితే మీ యొక్క ఈ అధికారము బలహీనుల కోసం అడ్డు బండగా మారకుండా జాగ్రతగా చూచుకొనుడి. 10 ఎందుకంటే జ్ఞానము గల వ్యక్తి విగ్రహముల దేవాలయంలో భుజించడానికి ఏటవాలుగా కూర్చుండగా ఒకడు చూచిన యెడల, అతని మనస్సాక్షి. బలహీనముగా ఉండి, విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినడానికి అన్నట్టుగా క్షేమాభివృద్ధిలో ఉంటుందా? 11 కాబట్టి ఎవని కోసం క్రీస్తు చనిపోయెనో బలహీనుడైన సహోదరుడు నీ జ్ఞానము ద్వారా నశింప చెయ్యబడును. 12 మరియు ఈవిధంగా మీ సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, మరియు వారి బలహీనమైన మనస్సాక్షిని గాయపరచడం వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయుచున్నారు. 13 కాబట్టి భోజన పదార్థము నా సహోదరుడిని తొట్రుపడడానికి కారణం అయిన యెడల, నేను ఖచ్చితంగా ఎప్పటికీ మాంసము భుజించను, తద్వారా నా సహోదరుడు తొట్రుపడడానికి నేను కారణం కాను.

Chapter 9

1 నేను స్వతంత్రుడను కానా? నేను అపొస్తలుడను కానా? మన ప్రభువు యేసును నేను చూడ లేదా? ప్రభువులో మీరు నా పనియై ఉన్నారు కారా? 2 ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయిన యెడల, నేను కనీసం మీకోసం ఉన్నాను. ఎందుకంటే ప్రభువులో మీరు నా అపొస్తలత్వము యొక్క రుజువుగా ఉన్నారు. 3 నన్ను పరీక్షించు వారికి నా సమాధానము ఇదే: 4 తినడానికి మరియు త్రాగడానికి మాకు ఖచ్చితంగా హక్కు లేదా? 5 మిగిలిన అపొస్తలులు సహితం మరియు ప్రభువు యొక్క సహోదరులు మరియు కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు ఖచ్చితంగా హక్కు లేదా? 6 లేదా పని చేయకుండ ఉండుటకు నేనును మరియు బర్నబాయు మాత్రమే హక్కు లేని వారమా? 7 తన సొంత ఖర్చు పెట్టుకొని ఏ సమయంలోనైనా ఒక సైనికుడి వలే పని చేయువాడు ఎవడు? లేదా ద్రాక్షతోటను నాటి మరియు దాని ఫలము తిననివాడు ఎవడు? ఒక మందను కాయుచు మరియు మంద యొక్క పాల నుండి త్రాగనివాడు ఎవడు? 8 ఈ సంగతులు మనుషుల ప్రకారం నేను చెప్పుట లేదా? లేదా ధర్మశాస్త్రము కూడ ఈ సంగతులను చెప్పడం లేదు గదా? 9 ఎందుకంటే అది మోషే యొక్క ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది, "ధాన్యాన్ని తొక్కే ఎద్దుకు మూతి కట్ట వద్దు." దేవుడు ఎద్దుల గురించి పట్టించుకోడు, ఆయన చేస్తాడా? 10 లేదా పూర్తిగా మన కోసమే ఆయన మాట్లాడుతున్నాడా? ఎందుకంటే దున్నుతున్నవాడు నిరీక్షణలో దున్నాలి అని ఇది మన కోసం వ్రాయబడింది, మరియు నూర్చెడు వాడు పంటను పంచుకోవడం యొక్క నిరీక్షణలో. 11 మేము మీ మధ్య ఆత్మీయ విషయాలను విత్తిన యెడల, మేము మీ నుండి భౌతిక వస్తువులను కోసికొంటె {ఇది} చాలా ఎక్కువ {అవుతుందా}? 12 ఇతరులు మీ మీద హక్కును పంచుకొనిన యెడల, మేము ఇంకా ఎక్కువ కాదా? అయితే ఈ హక్కు యొక్క ప్రయోజనాన్ని మేము తీసుకో లేదు, బదులుగా మేము క్రీస్తు యొక్క సువార్తకు మేము ఎటువంటి ఆటంకం ఇవ్వకుండా ఉండేందుకు మేము ప్రతీ దానిని సహించాము. 13 ఆలయములో పని చేసేవారు ఆలయములోని వస్తువుల నుండి తింటారు అని మీకు తెలియదా; బలిపీఠం వద్ద సేవ చేసేవారు బలిపీఠం నుండి పాలుపంచుకుంటారు? 14 అదే విధంగా కూడా, సువార్త ప్రకటించే వారికి సువార్త నుండి జీవించుటకు ప్రభువు ఆజ్ఞాపించాడు. 15 అయితే నేను ఈ విషయాలలో {దేని} యొక్క ప్రయోజనమును తీసుకోలేదు. ఇప్పుడు నేను ఈ విషయాలు వ్రాయడం లేదు తద్వారా ఈ విధంగా ఇది నా కోసం చేయబడుతుంది, ఎందుకంటే {ఎవరైనా} నా అతిశయాన్ని శూన్యం చెయ్యడం కంటే బదులుగా నేను చనిపోవడం ఇది నాకు మంచిది. 16 ఎందుకంటే నేను సువార్త ప్రకటించిన యెడల, నేను అతిశయించడానికి ఏమీ లేదు, ఎందుకంటే నా మీద బలవంతం పెట్టబడింది. ఎందుకంటే నేను సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ ఉంటుంది! 17 ఎందుకంటే నేను దీనిని ఇష్టపూర్వకంగా చేసిన యెడల, నాకు ఒక బహుమానము ఉంది. అయితే ఇది ఇష్టములేని యెడల, నాకు గృహనిర్వాహకత్వము బాధ్యతలు అప్పగింపబడెను. 18 అప్పుడు నా బహుమానము ఏమిటి? ఎటువంటి రుసుము లేకుండా సువార్తను ప్రకటించడం, సువార్తలో నాకున్న హక్కును ఉపయోగించుకోకుండా ఉండేందుకు నేను సువార్తను అందించవచ్చు. 19 ఎందుకంటే అందరి నుండి స్వతంత్రుడనై ఉండుట, నేను ఎక్కువ మందిని {మనుష్యులను} సంపాదించుకొనేందుకు అందరికి నన్ను నేను బానిసగా చేసుకున్నాను. 20 మరియు యూదులను సంపాదించుకొనుటకు నేను యూదులకు యూదుడి వలె మారాను. ధర్మశాస్త్రమునకు లోబడినవారికి, ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించడం కోసం నా మట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడి యుండక పోయినా ధర్మశాస్త్రమునకు లోబడినవాని వలే, 21 ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె మారాను. (దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను, అయితే క్రీస్తు యొక్క ధర్మశాస్త్రమునకు లోబడినవాడను) తద్వారా ధర్మశాస్త్రము లేనివారిని నేను సంపాదించుకొందును. 22 బలహీనులకు నేను బలహీనుడుగా మారాను తద్వారా నేను బలహీనులను సంపాదించుకొందును, అన్ని విధముల చేత ప్రతి ఒక్కరికి అన్నివిధముల వాడుగా నేను మారాను తద్వారా కొందరిని రక్షించుదును. 23 అయితే నేను సువార్త నిమిత్తము అన్ని కార్యములు చేయుచున్నాను తద్వారా నేను దానిలో పాలివాడను అగుదును. 24 పందెపు రంగములో పరుగెత్తువారు అందరు పరుగెత్తుదురు, అయితే యొక్కడే బహుమానము పొందును అని మీకు తెలియదా? అటువలె మీరు దానిని పొందునట్లుగా పరుగెత్తుడి. 25 అయితే క్రీడలలో పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో స్వీయ నియంత్రణను అభ్యాసం చేయును. కాబట్టి వారు వారు క్షయమగు కిరీటమును పొందడానికి {దీనిని చేస్తారు}, అయితే మనం అక్షయమైన దానిని. 26 కాబట్టి, నేను ఉద్దేశం లేని వాడి వలే నేను ఈ విధంగా పరుగెత్తను; గాలిని కొట్టుతున్న విధముగా నేను ఈ విధంగా పోరాడను. 27 అయితే ఒకవేళ ఇతరులకు ప్రకటించి, నాకై నేనే అయోగ్యమైనవాడిగా అగుదునేమో అని నా శరీరమును లోబరుచుకొనుచున్నాను మరియు దానిని బానిసగా చేసుకొనుచున్నాను.

Chapter 10

1 ఎందుకంటే సహోదరులారా, మీరు అజ్ఞానంగా ఉండడం నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన తండ్రులు అందరు మేఘము క్రింద నుండిరి. మరియు అందరు సముద్రము ద్వారా నడచిపోయిరి, 2 మరియు వారు అందరు మేఘములో మరియు సముద్రములో మోషే లోనికి బాప్తిస్మము పొందిరి, 3 మరియు వారు అందరు ఆత్మ సంబంధమైన ఒకే అతీతమైన ఆహారమును భుజించిరి, 4 మరియు వారు అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎందుకంటే తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండ నుండి త్రాగిరి, మరియు ఆ బండ క్రీస్తే. 5 అయితే వారిలో ఎక్కువ మందితో దేవుడు బాగా సంతోషించ లేదు. ఎందుకంటే వారు అరణ్యములో చెల్లాచెదురయ్యారు. 6 ఇప్పుడు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా మారాయి తద్వారా వారు కూడా ఆశించిన విధముగా మనము చెడ్డ సంగతులను ఆశించకుండా ఉంటాము. 7 “మనుష్యులు తినడానికి మరియు త్రాగడానికి మరియు ఆడడానికి లేచి కూర్చున్నారు.” అని కూడా ఇది వ్రాయబడిన విధముగా వారిలో కొందరు {ఉన్న} విధంగా విగ్రహారాధికులుగా మారకండి; 8 వారిలో అనేకమంది లైంగిక దుర్నీతికి పాల్పడిన విధముగా మనము లైంగిక దుర్నీతికి పాల్పడక యుందము మరియు ఒకే రోజులో 23,000 మంది పడిపోయారు. 9 వారిలో అనేకులు ఆయనను పరీక్షకు ఉంచి మరియు సర్పముల చేత నశించిన విధముగా మనము ప్రభువును పరీక్షకు ఉంచ కూడదు. 10 సణుగకుడి; వారిలో అనేకులు సహితం సణిగారు, మరియు సంహారకుని చేత నశించిరి. 11 ఇప్పుడు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి, అయితే యుగాల యొక్క అంతముకు వచ్చిన మనకు బుద్ధి కలుగుట కోసం అవి వ్రాయబడెను. 12 కాబట్టి, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు, అతడు పడకుండా ఉండేలా జాగ్రత్తగా ఉండనివ్వండి. 13 మనుష్యులకు సాధారణముగా ఉండే శోధన తప్ప మరి ఏదియు మిమ్మును పట్టు కోదు; అయితే దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంత దానికి మించి ఆయన మిమ్మును శోధింపబడి యుండడానికి అనుమతించడు, అయితే శోధనతో, తప్పించుకొను మార్గమును కూడా ఆయన కలుగ జేయును తద్వారా మీరు దానిని సహింప గలుగుతారు. 14 కాబట్టి నా ప్రియమైన వారలారా, విగ్రహారాధన నుండి దూరముగా పారిపొండి. 15 నేను బుద్ధిమంతులైన మనుష్యులతో మాటలాడిన విధముగా మాటలాడుచున్నాను; నేను చెప్పు దానిని మీకై మీరే తీర్పుతీర్చుడి. 16 మనము ఆశీర్వదించు ఆశీర్వాదం యొక్క పాత్ర క్రీస్తు యొక్క రక్తము యొక్క భాగస్వామ్యం ఇది కాదా? మనము విరుచు రొట్టె క్రీస్తు యొక్క శరీరము యొక్క భాగస్వామ్యం ఇది కాదా? 17 ఒక్క రొట్టె {ఉన్న} కారణంగా, అనేకులమైన మనము ఒక్క శరీరమై {యున్నాము}; ఎందుకంటే మనం అందరం ఆ యొకటే రొట్టె నుండి పాలుపుచ్చుకొనుచున్నాము. 18 శరీర ప్రకారముగా ఇశ్రాయేలును చూడుడి; బలులను తిను వారు బలిపీఠము యొక్క భాగస్వాములై ఉన్నారు కారా? 19 నేను చెప్పునది ఏమనగా, విగ్రహాలకు అర్పించబడిన ఆ ఆహారం ఏమైనా ఉన్నదా లేదా విగ్రహములో ఏమైనా ఉన్నదా? 20 బదులుగా, అన్యజనులు అది ఏమి బలి ఇస్తున్నారు, వారు దయ్యములకే బలి అర్పించుచున్నారు మరియు దేవునికి కాదు. అయితే మీరు దయ్యములతో పాలివారై ఉండుట నాకిష్టము లేదు. 21 మీరు ప్రభువు యొక్క పాత్ర మరియు దయ్యముల యొక్క పాత్ర త్రాగ లేరు. మీరు ప్రభువు యొక్క బల్ల మరియు దయ్యముల యొక్క బల్లలో పాలు పొంద లేరు. 22 లేదా ప్రభువునకు రోషము రేపెదమా? మనము ఆయన కంటె బలవంతులము కాదు, మనము అవుతామా? 23 “అన్ని విషయములు న్యాయబద్దమైనవి ,” అయితే అన్ని సంగతులు ప్రయోజనకరమైనవి కావు. “అన్ని విషయములు న్యాయబద్ధమైనవి కావు,” అయితే అన్ని సంగతులు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24 ఎవడును తన సొంత క్షేమాన్ని వెదుకనివ్వవద్దు, అయితే ఎదుటి వ్యక్తికి చెందినదానిని. 25 మనస్సాక్షి నిమిత్తము అడుగకుండ అంగడిలో అమ్మిన దాని నంతటిని తినండి. 26 ఎందుకంటే “భూమి మరియు దాని యొక్క పరిపూర్ణత ప్రభునివై యున్నవి. 27 అవిశ్వాసులలో ఎవరైనను మిమ్మును ఆహ్వానించి మరియు వెళ్లడానికి మీరు కోరుకున్న యెడల, మీ యెదుట ఏర్పరచిన ప్రతీదానిని మనస్సాక్షి నిమిత్తము ప్రశ్నలు ఏమీ అడుగకుండా భుజించండి. 28 అయితే ఎవడైనను మీతో, “ఇది బలిలో అర్పింపబడినది” అని చెప్పిన యెడల, మీకు తెలిపిన వాని నిమిత్తము మరియు మనస్సాక్షి నిమిత్తమును దానిని తినకుడి. 29 ఇప్పుడు మీ సొంతది కాని మనస్సాక్షి, అయితే మరొక వ్యక్తి దాని నిమిత్తమే నేను చెప్పుచున్నాను. ఎందుకంటే మరొకరి మనస్సాక్షి చేత నా స్వాతంత్యము ఎందుకు తీర్పు తీర్చబడాలి? 30 నేను కృతజ్ఞతతో పాలుపుచ్చుకొనిన యెడల, నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను అవమాన పరచబడనేల? 31 కాబట్టి, మీరు భోజనము లేదా పానము చేసినను లేదా మీరు ఏమి చేసినను, సమస్తమును దేవుని యొక్క మహిమకు చేయుడి. 32 యూదులు, లేదా గ్రీసుదేశస్థులు లేదా దేవుని యొక్క సంఘమునకు అయినను అభ్యంతరము కలుగ జేయకుడి. 33 ఈలాగు నేను కూడ {నా} సొంత ప్రయోజనమును వెదకకుండా, అన్ని విషయములలో మనుష్యులు అందరిని సంతోష పెట్టుచున్నాను. అయితే అనేకుల యొక్క, తద్వారా వారు రక్షింపబడతారు.

Chapter 11

1 నేను కూడా క్రీస్తు వాడనై ఉన్న విధముగా, నన్ను అనుకరించు వారిగా ఉండండి. 2 ఇప్పుడు నేను మిమ్మును మెచ్చుకొనుచున్నాను, ఎందుకంటే మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచున్నారు మరియు నేను వాటిని మీకు అప్పగించిన విధముగా సంప్రదాయములను స్థిరముగా హత్తుకొని ఉన్నారు. 3 ఇప్పుడు ప్రతి పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు, మరియు స్త్రీ యొక్క శిరస్సు పురుషుడు, మరియు క్రీస్తు యొక్క శిరస్సు దేవుడు అని మీరు అర్థం చేసుకొనవలెనని నేను కోరుచున్నాను. 4 తన తలమీద ఏదైనా కలిగియుండి ప్రార్థన చేయడం లేదా ప్రవచించుచున్న ప్రతి పురుషుడు, తన తలను అవమానపరచును. 5 అయితే తలను కప్పుకొనకుండా ప్రార్థనచేయడం లేదా ప్రవచించుచున్న ప్రతీ స్త్రీ తన తలను అవమానపరచును. ఎందుకంటే ఇది క్షౌరము చెయ్యబడిన విధంగా ఏకమై మరియు ఒకే రకమైనదిగా యుండును. 6 ఎందుకంటే స్త్రీ తన తల మీద ముసుకు వేసికొనని యెడల, ఆమె తల వెండ్రుకలు కూడా కత్తిరించుకొన నివ్వండి. అయితే తన తల వెంట్రుకలు కత్తిరించుకోవడం లేదా క్షౌరము చేయించుకొని యుండడం స్త్రీ కి {ఇది} అవమానమైన యెడల, ఆమెను తన తలను కప్పుకొననివ్వండి. 7 ఎందుకంటే ఒక పురుషుడు దేవుని యొక్క పోలికయు మరియు మహిమయునై యుండి తన తలను కప్పుకొన కూడదు. అయితే స్త్రీ పురుషుని యొక్క మహిమయై యున్నది. 8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి కలుగ లేదు, అయితే స్త్రీ పురుషుని నుండి కలిగెను. 9 ఎందుకంటే నిజానికి స్త్రీ పురుషుని కోసమే అయితే పురుషుడు స్త్రీ కోసం సృష్టింపబడ లేదు. 10 ఈ కారణం కోసం దేవదూతల యొక్క కారణంగా స్త్రీ తల మీద అధికారం కలిగి ఉండవలెను. 11 అయినప్పటికీ, ప్రభువులో స్త్రీ పురుషుని నుండి స్వతంత్రం కాదు, అలాగే పురుషుడు స్త్రీ నుండి స్వతంత్రుడు కాదు. 12 ఎందుకంటే స్త్రీ పురుషుని నుండి ఉన్న విధముగానే, ఆలాగే కూడా పురుషుడు స్త్రీ ద్వారా ఉంది. అయితే అన్ని సంగతులు దేవుని నుండి ఉన్నాయి. . 13 మీకు మీరే తీర్పు తీర్చుకొనుడి: ముసుకులేనిదై దేవునికి ప్రార్థించుట స్త్రీకి ఇది సరియైనదిగా ఉంటుందా? 14 పురుషుడు పొడవాటి తల వెండ్రుకలు కలిగియున్న యెడల, అది అతనికి అవమానము అని ప్రకృతి సహితం అదే మీకు బోధించు చున్నది. 15 అయితే స్త్రీ పొడవాటి తల వెండ్రుకలు కలిగియున్న యెడల, ఆమెకు ఇది మహిమయై ఉన్నదా? ఎందుకంటే పొడవాటి తల వెంట్రుకలు ఆమెకు కప్పుగా అనుగ్రహించబడెను. 16 అయితే ఎవడైననూ దీని గురించి వివాదాస్పదంగా ఉన్నట్లు భావించినట్లయిన యెడల, మాకు అటువంటి అభ్యాసమూ లేదా దేవుని యొక్క సంఘములు ఏమీ లేవు. 17 అయితే దీనిని మీకు ఆజ్ఞాపించుటలో, నేను మిమ్మును మెచ్చుకొనను, ఎందుకంటే మీరు ఉత్తమమైన దాని కోసం మీరు కలిసి రావడం లేదు అయితే మిక్కిలి చెడ్డదాని కోసం. 18 ఎందుకంటే మొదట, మీరు సంఘములో కూడుటకు వచ్చినప్పుడు, మీ మధ్య విభజనలు ఉన్నాయి అని నేను విన్నాను, మరియు కొంతమట్టుకు దీనిని విశ్వసించుచున్నాను. 19 ఎందుకంటే మీ మధ్య కక్షలు ఉండడం కోసం నిజానికి ఇది అవసరం, తద్వారా ఆమోదించబడిన వారు కూడా మీ మధ్య స్పష్టం అవుతారు. 20 కాబట్టి అప్పుడు మీరు ఒక స్థలంలో కూడి వచ్చుచుండగా, ఇది ప్రభువు యొక్క రాత్రి భోజనము చేయడానికి కాదు. 21 ఎందుకంటే భోజనము చేయునప్పుడు ప్రతి ఒక్కరు తన సొంత రాత్రి భోజనమును మొదట తీసుకొంటున్నారు; మరియు నిజానికి ఒకడు ఆకలిగొనును, అయితే ఒకడు మత్తుడవును. 22 ఎందుకంటే తినడానికి మరియు త్రాగడానికి మీకు ఖచ్చితంగా ఇండ్లు లేవా? లేదా దేవుని యొక్క సంఘమును మీరు తిరస్కరించి మరియు ఏమీ లేనివారిని అవమాన పరచుదురా? నేను మీతో ఏమి చెప్పుదును? దీని కోసం నేను మిమ్మును మెచ్చుదునా? నేను మిమ్మును మెచ్చుకోను. 23 ఎందుకంటే నేను మీకు అప్పగించిన దానిని కూడా నేను ప్రభువు నుండి పొందితిని. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొన్నాడు, 24 మరియు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు, ఆయన దానిని విరిచాడు, మరియు చెప్పాడు, “యిది మీ కోసం ఉన్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికోవడంలో దీనిని చేయుడి.” 25 అదే విధానంలో రాత్రి భోజనం తరువాత పాత్ర కూడా, చెప్పాడు, “ఈ పాత్ర నా రక్తంలో కొత్త ఒడంబడిక. మీరు త్రాగినప్పుడెల్లా నా యొక్క జ్ఞాపకార్థంలో ఇది చేయండి. 26 ఎందుకంటే తరచుగా ఈ రొట్టెను తిని, మరియు యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల, అయన వచ్చు వరకు మీరు ప్రభువు యొక్క మరణమును ప్రచురించుదురు. 27 కాబట్టి యెవడైనను అయోగ్యమైన విధానంలో ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక పాత్రలోనిది త్రాగునో, ప్రభువు యొక్క శరీరము మరియు రక్తమును గూర్చియు అపరాధియగును. 28 అయితే మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొననివ్వండి, మరియు ఈ విధానములో రొట్టె నుండి తిననివ్వండి, మరియు పాత్ర నుండి త్రాగనివ్వండి. 29 ఎందుకంటే శరీరమును వివేచించకుండా తిని మరియు త్రాగినవాడు తనకు తానే తీర్పు కలుగుటకు తింటున్నాడు మరియు త్రాగుచున్నాడు. 30 ఈ కారణం కోసం మీ మధ్య అనేకులు బలహీనులు మరియు రోగులునై {యున్నారు}, మరియు మీలో అనేకులు నిద్రించుచున్నారు. 31 అయితే మనలను మనమే పరీక్షించుకొనిన యెడల, మనము తీర్పు పొందక పోదుము. 32 అయితే ప్రభువు చేత తీర్పు తీర్చబడుతూ ఉండగా, మనం శిక్షింపబడుచున్నాము తద్వారా మనము లోకముతో పాటు మనము శిక్షావిధి పొందకుండా ఉంటాము. 33 కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు, ఒకనికోసం ఒకడు కనిపెట్టుకొని యుండుడి. 34 ఎవడైననూ ఆకలిగొని ఉన్న యెడల, అతడు ఇంటి వద్ద భుజించనివ్వండి, తద్వారా మీరు తీర్పు కోసం కలిసి రాకుండా ఉంటారు. ఇప్పుడు మిగిలిన సంగతులను {గురించి}, నేను వచ్చినప్పుడు నేను సూచనలు ఇస్తాను.

Chapter 12

1 ఇప్పుడు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గురించి, మీరు అజ్ఞానంగా ఉండడం నాకు ఇష్టం లేదు. 2 మీరు అన్యజనులై యున్నప్పుడు, మీరు మూగ విగ్రహములకు త్రోవతప్పి నడిపించబడ్డారు అని మీకు తెలియును ఏదైనా మార్గములో మీరు నడిపించబడ్డారు. 3 కాబట్టి, దేవుని యొక్క ఆత్మ చేత మాటలాడు వాడెవడును “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పడు, మరియు పరిశుద్ధ ఆత్మ చేత తప్ప ఎవడును “యేసు ప్రభువై ఉన్నాడు” అని చెప్ప లేడు అని నేను మీకు తెలియజేయుచున్నాను. 4 ఇప్పుడు కృపావరములు నానావిధములుగా ఉన్నవి, అయితే ఆత్మ ఒక్కడే. 5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి, అయితే ప్రభువు ఒక్కడే. 6 మరియు నానావిధములైన కార్యములు కలవు, అయితే ప్రతి ఒక్కరిలో అన్ని సంగతులు జరిగించు దేవుడు ఒక్కడే. 7 ఇప్పుడు సామూహిక ప్రయోజనము కోసం ప్రతి ఒక్కరికి ఆత్మ యొక్క బాహ్య ప్రత్యక్షత అనుగ్రహింపబడియున్నది. 8 ఎందుకంటే, ఒకనికి ఆత్మ చేత బుద్ధి యొక్క వాక్యమును అనుగ్రహించబడింది, మరియు మరియొకనికి అదే ఆత్మ ప్రకారం జ్ఞానము యొక్క వాక్యమును, 9 మరియొకనికి, అదే ఆత్మ చేత విశ్వాసమును, మరియు మరియొకనికి, ఆ ఒక్క ఆత్మ చేత స్వస్థపరచడం యొక్క వరములు; 10 మరియు మరియొకనికి, కార్యములను చేయడం యొక్క శక్తియు, మరియొకనికి ప్రవచనము, మరియొకనికి, ఆత్మల యొక్క వివేచనయు, మరియొకనికి, నానావిధ భాషలును; మరియొకనికి భాషల యొక్క రకాలు; మరియు మరియొకనికి భాషల యొక్క అర్థము. 11 అయితే ఒక్కడే మరియు అదే ఆత్మ ఈ సంగతులు అన్నిటినీ జరిగించు చున్నాడు, ఆయన కోరుకున్న విధముగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా వాటిని పంచియిచ్చుచున్నాడు. 12 ఎందుకంటే శరీరము సహితము ఒక్కటిగా మరియు అనేకమైన అవయవములు కలిగియున్న విధముగా, అయితే శరీరము యొక్క అవయవములు అన్ని అనేకములై యున్నను ఒక్క శరీరమై యున్నవి; ఆలాగే కూడా క్రీస్తు {ఉన్నాడు}. 13 ఎందుకంటే నిజానికి మనము అందరము ఒక్క ఆత్మ చేత ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి, యూదులమైనను, లేదా గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను లేదా స్వతంత్రులమైనను, మరియు మనమందరము ఒక్క ఆత్మను త్రాగడానికి చెయ్యబడ్డాము. 14 ఎందుకంటే నిజానికి శరీరము ఒక్క అవయవము కాదు, అయితే అనేకం. 15 “నేను చెయ్యి కాను గనుక, నేను శరీరములోని దానను కాను” అని పాదము చెప్పిన యెడల, దీని కోసం కాదు ఇది శరీరము లోనిది కాకపోలేదు. 16 మరియు “నేను కన్ను కాను గనుక నేను శరీరము లోనిదానను కాను” అని చెవి చెప్పిన యెడల, దీని కోసం ఇది శరీరము లోనిది కాకపోలేదు. 17 శరీరము అంత కన్ను అయిన యెడల, వినడం ఎక్కడ {ఉంటుంది}? అంతయు వినుట అయిన యెడల, వాసన చూడడం ఎక్కడ {ఉంటుంది}? 18 అయితే ఇప్పుడు దేవుడు అవయవములలో ప్రతి ఒక్క దానిని ఆయన కోరుకున్న విధముగా శరీరములో నియమించెను. 19 అయితే అవి అన్నీ ఒక్క అవయవమై ఉన్న యెడల, శరీరము ఎక్కడ {ఉంటుంది}? 20 అయితే ఇప్పుడు అనేక అవయములు ఉన్నాయి, అయితే శరీరము ఒక్కటే, 21 ఇప్పుడు “నాకు నీ యొక్క అవసరం లేదు” అని కన్ను చేతితో చెప్ప లేక పోతుంది, లేదా మరల తల, పాదములతో “నాకు నీ యొక్క అవసరం లేదు.” 22 అయితే దానికి విరుద్ధంగా, శరీరము యొక్క అవయవములు బలహీనములుగా ఉన్నట్టు కనబడుచున్నవి మరి అవశ్యములై ఉన్నాయి. 23 మరియు శరీరములో ఘనతలేనివిగా ఉన్నాయని మనం తలంచేవి, మనం వాటికి గొప్ప ఘనతను ఇచ్చు చున్నాము; మరియు కనుపరచలేని మన అవయవములు అధికమైన ఘనతను కలిగియున్నాయి. 24 అయితే అగుపరచదగిన మన అవయవములకు ఆవసరము లేదు. అయితే దేవుడు శరీరాన్ని కలిపి ఏకం చేసాడు, కొదువుగా ఉన్నదానికి మరింత అధికమైన గౌరవం ఇచ్చాడు. 25 తద్వారా శరీరములో వివాదము లేకుండా ఉంటుంది, అయితే అవయవములు ఒకదానినొకటి అదేవిధంగా శ్రద్ధ తీసుకొంటాయి. 26 మరియు ఒక అవయవము శ్రమపడిన యెడల, అవయవములు అన్ని కలిసి శ్రమపడతాయి. ఒక అవయవము ఘనత పొందిన యెడల, అవయవములు అన్నీ దానితో సంతోషిస్తాయి. 27 ఇప్పుడు మీరు క్రీస్తు యొక్క శరీరమై యున్నారు మరియు దాని యొక్క వేరు వేరు అవయవములై యున్నారు. 28 మరియు నిజానికి దేవుడు సంఘములో కొందరిని నియమించాడు, మొదట అపొస్తలులు, రెండవదిగా ప్రవక్తలు, మూడవదిగా బోధకులు, తరువాత అద్భుతములు, తరువాత స్వస్థపరచడం, ఉపకారాలు, ప్రభుత్వములు చేయడం యొక్క కృపావరములు, {మరియు} వివిధ రకాలైన భాషలు. 29 అందరు అపొస్తలులు కారు, వారు కారా? అందరు ప్రవక్తలు కారు, వారు కారా? అందరు బోధకులు కాదు, వారు కారా? అందరు అద్భుతములు చేయువారు కాదు, వారు కారా? 30 అందరూ స్వస్థపరచడం యొక్క కృపావరములు కలిగి లేరు. వారికి ఉన్నాయా? అందరు భాషలలో మాట్లాడరు, వారు మాట్లాడుతారా? అందరూ అర్థం చెప్పరు? వారు చెపుతారా? 31 అయితే శ్రేప్ఠమైన కృపావరములను ఆసక్తితో అపేక్షించుడి. మరియు ఇప్పుడు నేను మరింత సర్వోత్తమమైన ఒక మార్గమును మీకు చూపుచున్నాను.

Chapter 13

1 మనుష్యుల యొక్క మరియు దేవదూతల యొక్క భాషలతోను నేను మాటలాడిన యెడల, అయితే నాకు ప్రేమ లేదు, నేను మ్రోగెడు గంట లేదా గణగణలాడు తాళమునై మారతాను. 2 మరియు నేను ప్రవచనం కలిగి మరియు మర్మములు అన్నీ మరియు జ్ఞానం అంతా ఎరిగినవాడను అయిన యెడల, మరియు పర్వతములను తొలగించేంతగా విశ్వాసం అంతా నేను కలిగియున్న యెడల, అయితే నాకు ప్రేమ లేదు, నేను వ్యర్థుడను. 3 మరియు నా ఆస్తులు అన్నీ నేను ఇచ్చివేసిన యెడల, మరియు నా శరీరమును నేను అప్పగించిన యెడల, తద్వారా నేను అతిశయపడతాను, అయితే నాకు ప్రేమ లేదు, నేను ఏమీ పొందను. 4 ప్రేమ సహించును {మరియు} దయయై ఉంది; ప్రేమ అసూయ పడదు; ప్రేమ డంబముగా ఉండదు; ఇది ఉప్పొంగదు. 5 ఇది మూర్ఖంగా ఉండదు; {దాని} సొంత దానిని వెదకదు; ఇది తేలికగా కోపపడదు; ఇది తప్పుల యొక్క లెక్కను ఉంచుకొనదు. 6 ఇది దుర్నీతిలో సంతోషించదు, అయితే సత్యములో సంతోషిస్తుంది. 7 ఇది అన్ని సంగతులను భరిస్తుంది, అన్ని సంగతులను విశ్వసిస్తుంది, అన్ని సంగతులను నిరీక్షిస్తుంది, అన్ని సంగతులను సహిస్తుంది. 8 ప్రేమ ఎప్పటికి విఫలం కాదు. అయితే ప్రవచనములు {ఉన్న} యెడల, అవి గతించి పోతాయి; భాషలు అయిన యెడల, అవి నిలిచి పోతాయి; జ్ఞానమైన యెడల, ఇది గతించి పోతుంది. 9 ఎందుకంటే మనము కొంతభాగం ఎరుగుదుము, మరియు కొంతభాగం ప్రవచించుచున్నాము. 10 అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు, అసంపూర్ణముగా {ఉన్న}దేదో గతించి పోతుంది. 11 నేను పిల్లవాడనై యున్నప్పుడు, పిల్లవాని వలె నేను మాట్లాడాను, ఒక పిల్లవాని వలె నేను తలంచాను. పిల్లవాని వలే నేను తర్కించాను, నేను పురుషుని అయినప్పుడు, పిల్లవాని చేష్టలు నేను తీసి వేసాను, 12 ఎందుకంటే ఇప్పుడు మనం అద్దములో అస్పష్టంగా చూస్తున్నాము, అయితే అప్పుడు ముఖాముఖిగా. ఇప్పుడు నేను కొంతభాగం యెరిగియున్నాను, అయితే అప్పుడు నేను కూడా పూర్తిగా ఎరుగబడిన విధముగా నేను పూర్తిగా ఎరుగుదును. 13 అయితే ఇప్పుడు ఈ మూడు సంగతులు నిలుచును: విశ్వాసము, నిరీక్షణ, {మరియు} ప్రేమ. అయితే ఈ సంగతులలో శ్రేష్టమైనది ప్రేమయే.

Chapter 14

1 ప్రేమను వెంబడించండి, అయితే ఆత్మ సంబంధమైన వరముల కోసం ఆసక్తితో ఉండండి, అయితే ప్రత్యేకంగా మీరు ప్రవచించునట్లు. 2 ఎందుకంటే భాషలో మాటలాడు వాడు మనుష్యులతో మాట్లాడడం లేడు, అయితే దేవునితో. ఎందుకంటే ఏ ఒక్కడు అర్థం చేసుకోడు, అయితే అతడు ఆత్మలో మర్మములను మాట్లాడుచున్నాడు. 3 అయితే ప్రవచించువాడు క్షేమాభివృద్ధి మరియు ప్రోత్సాహం మరియు ఆదరణ కోసం మనుష్యులతో మాటలాడుచున్నాడు. 4 భాషలో మాటలాడు వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును, అయితే ప్రవచించు వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. 5 ఇప్పుడు మీరు అందరు భాషలలో మాటలాడడానికి నేను కోరుచున్నాను, అయితే తద్వారా మీరు మరి ఎక్కువగా ప్రవచిస్తారు. ఇప్పుడు (సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము అతడు అర్థము చెప్పితే తప్ప) భాషలతో మాటలాడు వానికంటె ప్రవచించువాడే గొప్పవాడు. 6 అయితే సహోదరులారా ఇప్పుడు, భాషలలో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చిన యెడల, నేను మీతో ప్రత్యక్షతలో గాని లేదా జ్ఞానములో గాని లేదా ప్రవచనము లేదా బోధలోగాని మీతో మాట్లాడితే తప్ప నేను మీకు ఏమి ప్రయోజనము కలిగిస్తాను? 7 పిల్లన గ్రోవి లేదా వీణె గాని, నిర్జీవ వస్తువులు కూడా స్వరము ఇచ్చునప్పుడు- అవి భిన్నమైన స్వరములు ఇవ్వని యెడల, పిల్లన గ్రోవి మీద వాయించినది లేదా వీణె మీద వాయించినది ఏవిధంగా తెలుస్తుంది? 8 ఎందుకంటే నిజానికి, బూర అస్పష్టమైన ధ్వని ఇచ్చిన యెడల, యుద్ధము కోసం ఎవడు సిద్ధపడును? 9 అదే విధానంలో, మీరు కూడా {మీ} నాలుకతో అర్థమయ్యే మాట ఇస్తే తప్ప, పలుకబడిన సంగతి ఏలాగు అర్థం అవుతుంది? ఎందుకంటే మీరు గాలిలోనికి మాటలాడుచున్నారు. 10 లోకములో అనేక విధములైన భాషలు నిస్సందేహముగా ఉన్నాయి, మరియు ఏ ఒక్కటి అర్థం లేకుండా ఉంది. 11 అప్పుడు భాష యొక్క అర్థము నాకు తెలియకుండిన యెడల, మాటలాడు వానికి నేను పరదేశిగా ఉందును, మరియు మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. 12 అదేవిధంగా మీరు కూడా ఆత్మసంబంధమైన వరముల కోసం ఆసక్తిగలవారు గనుక సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం, వాటిలో మీరు విస్తరించాలి అని వెదకండి. 13 కాబట్టి భాషలో మాటలాడువాడు అతడు అర్థము చెప్పునట్లు ప్రార్థన చేయనివ్వండి. 14 నేను భాషలో ప్రార్థన చేసిన యెడల, నా ఆత్మ ప్రార్థనచేయును, అయితే నా మనస్సు నిష్ఫలముగా ఉంటుంది. 15 అప్పుడు ఇది ఏమిటి? నేను {నా} ఆత్మతో ప్రార్థన చేతును, అయితే నేను {నా} మనస్సుతో కూడా ప్రార్థన చేతును. నేను {నా} ఆత్మతో పాడుదును, మరియు {నా} మనస్సుతో కూడా పాడుదును. 16 లేనియెడల, నీవు ఆత్మతో స్తోత్రము చేసిన యెడల, మీరు ఏమి చెపుతున్నది అతనికి తెలియదు కాబట్టి, మీ కృతజ్ఞతాస్తుతి పట్ల "ఆమేన్" అని వరము లేనివాని యొక్క స్థానాన్ని నింపేవాడు ఏవిధంగా చెపుతాడు? 17 ఎందుకంటే నీవు బాగుగా ఖచ్చితంగా కృతజ్ఞత స్తుతి చెల్లించుచున్నావు, అయితే మరొక వ్యక్తి క్షేమాభివృద్ధి పొందడు. 18 నేను మీ అందరి కంటె ఎక్కువగా భాషలలో మాటలాడుచున్నాను అని నేను దేవుని స్తుతించెదను. 19 అయితే సంఘములో నా మనస్సుతో అయిదు మాటలు పలుకుటకు నేను ఎంచుచున్నాను. తద్వారా భాషలో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులను కూడా నేను హెచ్చరించుదును. 20 సహోదరులారా, {మీ} ఆలోచనలలో పసిపిల్లలుగా మార వద్దు. బదులుగా దుష్టత్వములో శిశువులుగా ఉండుడి, అయితే ఆలోచనలలో పరిణతి చెందండి. 21 ధర్మశాస్త్రములో ఇది వ్రాయబడింది, “ఇతర భాషల యొక్క మనుష్యుల చేత మరియు పరజనుల యొక్క పెదవుల చేత, నేను ఈ మనుష్యులతో మాటలాడుదును, అయితే ఈ విధానములో కూడా వారు నా మాట వినరు,” ప్రభువు చెప్పుచున్నాడు. 22 కాబట్టి అప్పుడు భాషలు విశ్వసించు వారికి కాదు, అయితే అవిశ్వాసుల కోసం ఒక సూచకమై యున్నవి; అయితే ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, అయితే విశ్వాసించువారికి. 23 కాబట్టి సంఘము అంతా ఏకముగా ఒకే చోటికి కూడి మరియు వారు అందరు భాషలలో మాటలాడుచు, అయితే వరము లేనివారు లేదా అవిశ్వాసులు లోపలికి వచ్చిన యెడల, మీరు వెఱ్ఱివారు అని వారు చెప్పరా? 24 అయితే వారు అందరు ప్రవచించుచున్న యెడల, అయితే అవిశ్వాసులు కొందరు లేదా వరము లేని వ్యక్తి లోపలికి వచ్చిన యెడల, అతడు అందరి చేత ఒప్పించబడతాడు, అతడు అందరి వలన పరీక్షించ బడును. 25 అతని హృదయం యొక్క రహస్యములు స్పష్టం అవుతాయి, మరియు కాబట్టి {తన} ముఖము మీద పడి, అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు, ప్రకటిస్తాడు, “దేవుడు నిజముగా మీ మధ్య ఉన్నాడు.” 26 సహోదరులారా, అప్పుడు ఏమి ఉంటుంది? మీరు కూడి వచ్చునప్పుడు, ప్రతి ఒక్కరు ఒక కీర్తన కలిగియున్నారు, బోధను కలిగియున్నారు, ఒక ప్రత్యక్షత కలిగియున్నారు, ఒక బాష కలిగియున్నారు, లేదా అర్థము కలిగియున్నారు. సంగతులు అన్నీ క్షేమాభివృద్ధి కోసం జరుగనివ్వండి. 27 భాషలో ఎవడైనను మాటలాడిన యెడల, {ఇది ఉండాలి} ఇద్దరు లేదా గరిష్టంగా ముగ్గురు, మరియు క్రమంలో, మరియు ఒకడు అర్థము చెప్పవలెను. 28 అయితే అర్థము చెప్పువాడు అక్కడ లేని యెడల, అతడు సంఘములో మౌనముగా ఉండనివ్వండి. బదులుగా, అతడు తనతో మరియు దేవునితో మాటలాడుకొననివ్వండి. 29 అయితే ప్రవక్తలు ఇద్దరు లేదా ముగ్గురు మాటలాడనివ్వండి, మరియు ఇతరులు అంచనా వేయనివ్వండి. 30 అయితే అక్కడ కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండనివ్వండి. 31 ఎందుకంటే అందరు ఒకని తరువాత ఒకరు ప్రవచింప గలరు తద్వారా అందరు నేర్చుకొంటారు, మరియు అందరు ప్రోత్సహించబడతారు. 32 నిజానికి, ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తలకు లోబడి ఉన్నాయి. 33 ఎందుకంటే దేవుడు కలవరానికి సంబంధించినవాడు కాదు. అయితే సమాధానానికి. పరిశుద్ధుల యొక్క సంఘములు అన్నిటిలో ఉన్న విధముగా, 34 సంఘములలో స్త్రీలు మౌనముగా ఉండనివ్వండి. ఎందుకంటే మాటలాడడానికి వారి కోసం ఇది అనుమతించబడ లేదు, అయితే ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్న విధముగా, లోబడియుండవలసినదే. 35 అయితే వారు దేనినైనను నేర్చుకొన కోరిన యెడల, ఇంట వద్ద {తమ} సొంత భర్తలను అడుగనివ్వండి, ఎందుకంటే సంఘములో మాటలాడడానికి ఒక స్త్రీ కోసం ఇది అవమానము. 36 లేదా దేవుని యొక్క వాక్యము మీ యొద్ద నుండి బయలువెళ్లెనా? లేదా అది మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? 37 ఎవడైనను తాను ప్రవక్తను లేదా ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞ అని అతడు గుర్తించ నియ్యండి. 38 అయితే ఎవడైనను తెలియని వాడైన యెడల, వాడు తెలియని వాడుగానే యుండనివ్వండి. 39 కాబట్టి, సహోదరులారా, ప్రవచించడానికి ఆసక్తితో కోరుకోండి, మరియు భాషలలో మాటలాడడానికి ఆటంకపరచకుడి. 40 అయితే అన్ని సంగతులు సరిగా మరియు క్రమములో జరుగనివ్వండి.

Chapter 15

1 ఇప్పుడు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, దానిని కూడా మీరు అంగీకరించారు, దాని మీద కూడా మీరు నిలిచియున్నారు. 2 మీరు వృధాగా విశ్వసించితే తప్పించి, నేను మీకు ప్రకటించిన వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల దాని ద్వారా మీరు కూడా రక్షింపబడతారు. 3 ఎందుకంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు అని నేను కూడా పొందిన మొదటి వాటిలో నేను మీకు అందించాను. 4 మరియు ఆయన సమాధి చేయబడెను, మరియు లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను. 5 మరియు ఆయన కేఫాకు కనబడెను, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. 6 తరువాత ఆయన 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు, అయితే కొందరు నిద్రించిరి. 7 తరువాత ఆయన యాకోబుకును, తరువాత అపొస్తలులకు అందరికిని కనబడెను. 8 ఇప్పుడు అందరిలో చివరివాడను, అకాలమందు ఒక బిడ్డ పుట్టినట్టున్న నాకు కూడా ఆయన కనబడెను. 9 ఎందుకంటే నేను అపొస్తలులలో తక్కువవాడను. నేను అపొస్తలుడను అని పిలువబడుటకు యోగ్యుడను కాను, ఎందుకంటే నేను దేవుని యొక్క సంఘమును హింసించాను. 10 అయితే నేను ఏమైయున్నానో అది దేవుని యొక్క కృప చేతనే అయియున్నాను. మరియు నాలో {ఉన్న} ఆయన కృప నిష్ఫలము కాలేదు. బదులుగా వారిలో అందరికంటె నేను ఎక్కువగా ప్రయాసపడితిని. అయినా నేను కాను, అయితే దేవుని యొక్క కృప నాతో ఉంది. 11 కాబట్టి, నేను లేదా వారు అయినా, ఈ విధానంలో మేము ప్రకటించుచున్నాము, మరియు ఈ విధానంలో మీరు విశ్వసించారు. 12 ఇప్పుడు ఆయన మృతులలో నుండి లేపబడియున్నాడు అని క్రీస్తు ప్రకటింపబడిన యెడల, మీ మధ్యలో కొందరు మృతుల యొక్క పునరుత్థానము లేదు అని ఏవిధంగా చెప్పుచున్నారు? 13 అయితే మృతుల యొక్క పునరుత్థానము లేని యెడల, క్రీస్తు కూడ లేపబడియుండ లేదు. 14 అయితే క్రీస్తు లేపబడియుండని యెడల, అప్పుడు మా ప్రకటన వ్యర్థమై {ఉంది}. మరియు మీ విశ్వాసము వ్యర్థమే. 15 అయితే కూడా, మేము దేవుని యొక్క అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము, ఎందుకంటే అప్పుడు మృతులు లేపబడకపోయిన యెడల, ఆయన లేపని క్రీస్తును ఆయన లేపాడు అని దేవుని గురించి మేము సాక్ష్యమిచ్చాము. 16 ఎందుకంటే మృతులు లేపబడని యెడల, క్రీస్తు కూడ లేపబడలేదు. 17 అయితే క్రీస్తు లేప బడని యెడల, మీ విశ్వాసము వ్యర్థమై {ఉంది}; మీరు ఇంకా మీ పాపములలో ఉన్నారు. 18 తరువాత కూడా క్రీస్తులో నిద్రించిన వారు నశించారు. 19 ఈ జీవితంలో మాత్రమే మనము క్రీస్తులో నిరీక్షణ కలిగియున్న యెడల మనుష్యులు అందరిలో మనం మరింత దౌర్భాగ్యులమై ఉంటాము. 20 అయితే ఇప్పుడు క్రీస్తు మృతుల నుండి లేపబడ్డాడు, నిద్రించిన వారిలో ప్రథమ ఫలము. 21 ఎందుకంటే ఒక మనుష్యుని చేత మరణము వచ్చెను కాబట్టి ఒక మనుష్యుని చేత మృతుల యొక్క పునరుత్థానము కూడా. 22 ఎందుకంటే ఆదాములో కూడా అందరు మృతులైనట్టు వలే, ఆలాగుననే కూడా క్రీస్తులో అందరు సజీవులుగా చెయ్యబడతారు. 23 అయితే ప్రతిఒక్కరు {తన} సొంత క్రమంలో: ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత ఆయన రాకడలో, క్రీస్తు వారు. 24 తరువాత సమస్తమైన పాలన మరియు సమస్తమైన అధికారము మరియు శక్తిని ఆయన రద్దు చేసినప్పుడు రాజ్యమును దేవుడు మరియు తండ్రికి ఆయన అప్పగించినప్పుడు అంతము {వచ్చును}. 25 ఎందుకంటే శత్రువులు అందరిని తన పాదముల క్రింద ఆయన ఉంచు వరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 26 కడపట రద్దు జేయబడు శత్రువు: మరణము. 27 ఎందుకంటే “ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు.” అయితే ఇది “ఆయన సమస్తమును ఉంచి యున్నాడు,” అని ఇది చెప్పినప్పుడు, {ఇది} ఆయనకు సమస్తమును లోబరచినవాడు మినహాయించబడ్డాడు అని స్పష్టమై ఉంది. 28 ఇప్పుడు అన్ని సంగతులు ఆయనకు లోబరచబడినప్పుడు, అప్పుడు ఆయనకు అన్ని సంగతులను లోబరచిన వానికి కుమారుడు తానే కూడా లోబడి యుండును, తద్వారా దేవుడు సర్వములో సర్వము అవుతాడు. 29 ఇట్లు కానియెడల, మృతుల కోసం బాప్తిస్మము పొందు వారు ఏమి చేస్తారు? మృతులు ఏమాత్రమును లేపబడని యెడల అప్పుడు వారి కోసం వారు బాప్తిస్మము పొందడం ఎందుకు? 30 మేము ప్రతీ గడియ ప్రమాదములో ఉండడం కూడా ఎందుకు? 31 సహోదరులారా, మన ప్రభువు క్రీస్తు యేసులో నేను కలిగి యున్న మీలో అతిశయము చేత నేను ప్రతి దినము చనిపోవుచున్నాను. 32 నేను ఎఫెసులో అడవి జంతువులతో పోరాడిన యెడల మనుష్యుల ప్రకారము నాకు లాభము ఏమై ఉంది? మృతులు లేపబడని యెడల, “మనం తిందాము మరియు త్రాగుదాము, ఎందుకంటే రేపు మనం చనిపోవుదుము.” 33 మోసపో వద్దు: “చెడ్డ సాంగత్యము మంచి నడవడిని చెరుపును." 34 సరియైనది వలే స్థిరబుద్ధి కలవారై ఉండండి! మరియు పాపం చేస్తూ ఉండకండి. ఎందుకంటే మీలో కొందరికి దేవుని యొక్క జ్ఞానం లేదు - మీకు సిగ్గు కలుగుటకై నేను దీనిని చెప్పుచున్నాను. 35 అయితే ఒకరు చెపుతారు, “మృతులు ఏవిధంగా లేతురు, మరియు వారు ఎటువంటి శరీరముతో వస్తారు? 36 అవివేకి అయిన వాడవు నువ్వు! నీవు విత్తునది చనిపోతే తప్ప జీవింప చెయ్యడానికి కారణం కాదు. 37 మరియు నీవు విత్తునది, కాబోయే శరీరమును నీవు విత్తుట లేదు, అయితే ఒక వట్టి విత్తనం-బహుశా గోధుమ లేదా మరొకటి. 38 అయితే దేవుడు తాను కోరుచున్న విధముగా దానికి శరీరమును ఇచ్చుచున్నాడు, మరియు విత్తనములలో ప్రతిదానికి, దాని సొంత శరీరము. 39 అన్ని మాంసాలు ఒకే మాంసం కాదు, బదులుగా, ఒక మనుష్యుల యొక్క {మాంసం} ఒకటి, మరియు జంతువుల యొక్క మరొక మాంసం, మరియు పక్షుల యొక్క మరొక మాంసం, మరియు చేప యొక్క మరొక మాంసము {ఉంది}. 40 పరలోకసంబంధమైన శరీరములు మరియు భూసంబంధమైన శరీరములు కూడా {ఉన్నాయి}. అయితే పరలోకసంబంధమైన వాటి యొక్క మహిమ ఒకటి, మరియు భూసంబంధమైనవాటిది మరొకటి. 41 సూర్యుని యొక్క మహిమ ఒకటి, మరియు చంద్రుని యొక్క మహిమ మరొకటి, మరియు నక్షత్రముల యొక్క మహిమ మరొకటియై {ఉంది}. ఎందుకంటే నక్షత్రము మహిమలో నక్షత్రము నుండి భిన్నముగా ఉంటుంది. 42 అదే విధంగా మృతుల యొక్క పునరుత్థానము కూడా {ఉంటుంది}. క్షయములో విత్తబడినది అక్షయములో లేపబడును. 43 ఘనహీనములో ఇది విత్తబడింది; మహిమలో ఇది లేపబడుతుంది. బలహీనములో ఇది విత్తబడింది; శక్తిలో ఇది లేపబడుతుంది. 44 ఇది ప్రకృతిసంబంధమైన శరీరముగా ఇది విత్తబడింది; ఇది ఆత్మసంబంధ శరీరముగా లేపబడుతుంది. ప్రకృతిసంబంధమైన శరీరము ఉన్న యెడల, ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది. 45 అదేవిధంగా కూడా ఇది వ్రాయబడింది, “మొదటి మనుష్యుడు ఆదాము జీవించు ప్రాణి ఆయెను.” కడపటి ఆదాము జీవమును ఇచ్చు ఆత్మ ఆయెను. 46 అయితే ఆత్మసంబంధమైనది మొదట ఉన్నది కాదు, అయితే ప్రకృతిసంబంధమైనది, తరువాత ఆత్మసంబంధమైనది. 47 మొదటి మనుష్యుడు భూసంబంధియై ఉన్నాడు, మంటి నుండి చెయ్యబడినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. 48 భూసంబంధమైనవారి వలే, భూసంబంధులు ఆలాగే కూడా {ఉంటారు}; మరియు పరలోకసంబంధమైనవారి వలే పరలోకసంబంధులు ఆలాగే కూడా {ఉంటారు}. 49 మరియు మనము భూసంబంధమైనవాని యొక్క పోలికను ధరించిన విధముగా, మనము పరలోకసంబంధమైనవాని యొక్క పోలికను కూడా ధరించుదుము. 50 సహోదరులారా, రక్తము మరియు మాంసము దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అని ఇప్పుడు నేను దీనిని చెప్పుచున్నాను. క్షయత అక్షయతను స్వతంత్రించుకొన లేదు. 51 ఇదిగో నేను మీకు ఒక మర్మము చెప్పుచున్నాను: మనము అందరము నిద్రించము, అయితే మనము అందరము మార్పు చెందుతాము. 52 ఒక్క క్షణంలో, ఒక కన్ను యొక్క రెప్ప పాటులో, కడ బూర వద్ద. ఎందుకంటే ఒక బూర మ్రోగుతుంది, మరియు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మరియు మనము మార్పు పొందుదుము. 53 ఎందుకంటే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవడం కోసం ఇది అవసరం. మరియు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. 54 అయితే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మరియు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, – అప్పుడు వ్రాయబడిన వాక్యము నెరవేరును, “మరణము విజయములో మ్రింగివేయబడెను.” 55 “ఓ మరణమా, నీ విజయము ఎక్కడ {ఉంది}? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ {ఉంది}? 56 అయితే మరణము యొక్క ముల్లు పాపము, మరియు పాపము యొక్క శక్తి ధర్మశాస్త్రమై ఉంది. 57 అయితే మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము ఉంటుంది. 58 కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువులో వ్యర్థము కాదు అని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు యొక్క పనిలో ఎల్లప్పుడూ సమృద్ధిగల వారుగా మారండి.

Chapter 16

1 ఇప్పుడు పరిశుద్ధుల కోసమై ఉన్న సేకరణ విషయమైతే, నేను గలతీయ యొక్క సంఘములను నడిపింఛిన విధముగా మీరు కూడా ఆ విధంగా చేయుడి. 2 వారం యొక్క ప్రతీ మొదటి దినమున, మీలో ప్రతివాడును కొంత పక్కన ఉంచండి, తాను వర్ధిల్లిన దాని నుండి కొంత సొమ్ము నిలువ చేయవలెను తద్వారా నేను వచ్చినప్పుడు చందా పోగుచేయ కుండ ఉంటుంది. 3 ఇప్పుడు నేను వచ్చి నప్పుడు, మీరు ఎవరిని ఆమోదిస్తారో, పత్రికలతో వారిని మీ కానుకను తీసుకొని వెళ్ళడానికి నేను యెరూషలేమునకు పంపుదును. 4 అయితే నేను కూడ వెళ్లడానికి నా కోసం ఇది యుక్తమైన యెడల వారు నాతో వస్తారు. 5 అయితే మాసిదోనియ ద్వారా నేను వెళ్ళిన తరువాత నేను మీ వద్దకు వస్తాను, ఎందుకంటే నేను మాసిదోనియ ద్వారా వెళ్తున్నాను. 6 అయితే ఒకవేళ నేను మీతో నిలిచి యుంటాను, లేదా శీతకాలము కూడా గడుపుతాను తద్వారా అప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళే నా మార్గంలో మీరు నాకు సహాయం చేస్తారు. 7 ఎందుకంటే ఇప్పుడు మార్గములో మాత్రమే మిమ్మును చూడడానికి నేను కోరుకోవడం లేదు; ఎందుకంటే ప్రభువు అనుమతించిన యెడల కొంత సమయం కోసం మీతో నిలిచి యుండడానికి నేను నిరీక్షించుచున్నాను. 8 అయితే పెంతెకొస్తు వరకు ఎఫెసులో నేను నిలిచియుందును, 9 ఎందుకంటే నా కోసం ఒక విశాలమైన మరియు ఫలవంతమైన ద్వారం తెరువబడియుంది, మరియు అనేకులు నన్ను ఎదిరించుచున్నారు. 10 ఇప్పుడు తిమోతి వచ్చిన యెడల, అతడు మీ యొద్ద నిర్భయుడైయుండునట్లు చూచుకొనుడి, ఎందుకంటే నేను {ఉన్న} విధముగా అతడు ప్రభువు యొక్క పని చేయుచున్నాడు. 11 కాబట్టి, ఏ ఒక్కరునూ అతనిని తృణీకరించనియ్య వద్దు. అయితే తన మార్గంలో సమాధానంలో అతనికి సహాయం చెయ్యండి, తద్వారా అతడు నా వద్దకు వస్తాడు, ఎందుకంటే అతడు సహోదరులతో వచ్చునని నేను యెదురు చూచుచున్నాను. 12 ఇప్పుడు సహోదరుడైన అపొల్లో విషయం, అతడు సహోదరులతో మీ వద్దకు రావలయును అని నేను అతనిని బలంగా ప్రోత్సహించాను. అయితే ఇప్పుడు అతడు రావలెను అని ఎంతమాత్రము {అతని} చిత్తము కాదు. అయితే, అతనికి అవకాశం కలిగినప్పుడు అతడు వస్తాడు. 13 అప్రమత్తంగా నిలిచి ఉండండి, విశ్వాసములో స్థిరంగా నిలిచి ఉండండి. పురుషుల వలే ప్రవర్తించండి. బలంగా ఉండండి. 14 మీ సంగతులు అన్నీ ప్రేమలో జరుగనివ్వండి. 15 ఇప్పుడు నేను మిమ్మును బతిమాలుచున్నాను, సహోదరులారా (స్తెఫను యొక్క ఇంటి వారు, అకయ యొక్క ప్రథమఫలమై యున్నారు అని, మరియు వారు పరిశుద్ధుల యొక్క పరిచర్యకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారు మీరు యెరుగుదురు), 16 ఇటువంటి వారికి మరియు పని మరియు కష్టపడడంలో కలిసి చేరుతున్న ప్రతి ఒక్కరికి మీరు కూడా విధేయులై యుండవలెను అని. 17 ఇప్పుడు స్తెఫను మరియు ఫొర్మూనాతు మరియు అకయి యొక్క రాక విషయంలో నేను సంతోషించుచున్నాను, ఎందుకంటే మీ నుండి కొరతగా ఉన్న దానిని వారు సమకూర్చారు; 18 ఎందుకంటే వారు నా మరియు మీ ఆత్మను సేదదీర్చారు. కాబట్టి ఇటువంటి వారిని గుర్తించండి. 19 ఆసియ యొక్క సంఘములు మీకు శుభములు పంపుచున్నారు. అకుల మరియు ప్రిస్కిల్ల వారి గృహములో సంఘముతో, ప్రభువులో మీకు ఉత్సాహముతో శుభములు చెప్పుచున్నారు. 20 సహోదరులు అందరు మీకు శుభములు చెప్పుచున్నారు. ఒక పరిశుద్ధ ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు చెప్పుడి. 21 పౌలును – నా సొంత చేతిలో ఈ శుభము {ఉంది}. 22 ఎవడైనను ప్రభువును ప్రేమించని యెడల, వాడు శపింపబడి ఉండనివ్వండి. మరనాత! 23 ప్రభువు యేసు యొక్క కృప మీతో {ఉంటుంది}. 24 క్రీస్తు యేసులో మీ అందరితో నా ప్రేమ {ఉంటుంది}. ఆమేన్.