పేతురు రాసిన రెండవ పత్రిక
Chapter 1
1 సీమోను పేతురు, యేసు క్రీస్తు దాసుడు మరియు అపొస్తలుడు, మన దేవుడు మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క నీతి చేత, మనతో విలువలో సమానమైన విశ్వాసము పొందినవారికి: 2 దేవుడు మరియు మన ప్రభువు యేసు యొక్క జ్ఞానములో మీకు కృప మరియు సమాధానము విస్తరించును గాక. 3 ఆయన దైవిక శక్తి మనలను {ఆయన} మహిమ మరియు శ్రేష్ఠత ద్వారా పిలిచిన వ్యక్తి యొక్క జ్ఞానం ద్వారా జీవం మరియు దైవభక్తి కోసం సమస్తమైన సంగతులు మనకు ఇవ్వబడ్డాయి. 4 దాని ద్వారా ఆయన మనకు అమూల్యమైన మరియు గొప్ప వాగ్దానాలను అనుగ్రహించాడు, తద్వారా మీరు వాటి ద్వారా దైవిక స్వభావానికి భాగస్వాములు అవుతారు, దుష్ట కోరికల చేత లోకంలోని భ్రష్టత్వమును తప్పించుకున్నారు. 5 మరియు ఇప్పుడు దీనికి సంబంధించి, పూర్ణ జాగ్రత్తను వినియోగించి, మీ విశ్వాసంలో సమకూర్చుకోండి, మంచితనం; మరియు మంచితంలో, జ్ఞానం; 6 మరియు జ్ఞానంలో, స్వీయ నియంత్రణ; మరియు స్వీయ నియంత్రణలో, సహనము; మరియు సహనములో, దైవభక్తి; 7 మరియు దైవభక్తిలో, సహోదర అనురాగము; మరియు సహోదర అనురాగములో ప్రేమ. 8 ఎందుకంటే మీలో ఉనికిలో ఉన్న మరియు వృద్ధి చెందుతున్న ఈ సంగతులు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క జ్ఞానంలో మీరు దుర్బలులుగా గానే లేదా నిష్ఫలంగా గానీ కాకుండా చేస్తాయి. 9 ఎందుకంటే ఈ సంగతులు కలిగి యుండని వాడు గుడ్డివాడు, సమీప దృష్టిగలవాడు, తన గత పాపముల యొక్క శుద్ధి యొక్క మరుపు పొందినవాడు. 10 కాబట్టి సహోదరులారా, మీ పిలుపు మరియు ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సంగతులు చెయ్యడం వలన, మీరు నిశ్చయముగా ఎన్నటికిని తొట్రిల్లరు. 11 ఎందుకంటే ఈ విధానంలో మన ప్రభువు మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి మీకు ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడును. 12 కాబట్టి, మీరు ఈ సంగతులను గురించి విషయాలను ఎరిగినప్పటికీ, మరియు ప్రస్తుత సత్యంలో స్థిరపడినప్పటికీ, వాటి గురించి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. 13 అయితే నేను ఈ గుడారంలో ఉన్నంత వరకు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి {ఇది} సరైనదని నేను భావిస్తున్నాను. 14 మన ప్రభువు యేసు క్రీస్తు కూడా దీని నాకు బయలుపరచిన విధముగా నా గుడారము ఆపివేయబడుట ఆసన్నమైనది అని తెలిసికొన్నాను. 15 అలాగే, నా నిష్క్రమణ తరువాత ఈ సంగతుల యొక్క జ్ఞాపకం ఎల్లప్పుడూ ఉండేలా చెయ్యడానికి నేను జాగ్రత్తగా ఉంటాను. 16 ఎందుకంటే మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క శక్తి మరియు రాకడను చమత్కారముగా కల్పిత కథలను అనుసరించడం చేత మేము మీకు తెలియపరచలేదు, అయితే ఆయన మహాత్మ్యము యొక్క ప్రత్యక్ష సాక్షులంగా మారడం చేత 17 ఎందుకంటే ఆయన తండ్రి దేవుని నుండి ఘనత మరియు మహిమను పొందాడు, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందించుచున్నాను" అనే ఒక స్వరం మహాత్మ్యమైన మహిమ చేత ఆయన వద్దకు తీసుకొనిరాబడింది. 18 మరియు మా మట్టుకు మేము పరలోకం నుండి తీసుకురాబడి, పవిత్ర పర్వతం మీద ఆయనతో ఉన్న ఈ స్వరం విన్నాము. 19 మరియు మనం చాలా ఖచ్చితమైన ప్రవచన వాక్యాన్ని కలిగి ఉన్నాము, చీకటి ప్రదేశంలో ప్రకాశించే దీపమునకు వలే, తెల్లవారు వరకు మరియు మీ హృదయాలలో ఉదయపు నక్షత్రం ఉదయించే వరకు దానికి మీరు జాగ్రత్త వహించడం మంచిది. 20 లేఖనం యొక్క ప్రతి ప్రవచనం ఒకరి స్వంత వివరణ నుండి వచ్చినది కాదు అని కాదని మొదట తెలుసుకొనాలి. 21 ఎందుకంటే ఏ ప్రవచనమూ మనిషి యొక్క ఇచ్ఛ చేత తీసుకురాబడలేదు, అయితే మనుషులు పరిశుద్ధ ఆత్మ చేత తీసుకువెళ్లబడుతూ దేవుని నుండి పలికారు.
Chapter 2
1 ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కూడా మనుష్యులలో ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా మీ మధ్య ఉంటారు, వారు నాశనం యొక్క తప్పుడు బోధలు తీసుకొని వస్తారు, మరియు తమను కొనిన యజమానిని తిరస్కరించారు, వారు తమ మీదకు తామే శీఘ్రముగా నాశనము తెచ్చుకొంటారు. 2 మరియు అనేకులు వారి ఐహిక సుఖబోధేచ్ఛ క్రియలను అనుసరిస్తారు, వీరి కారణంగా సత్యము యొక్క మార్గము దూషింపబడును. 3 మరియు లోభములో మోసపూరిత మాటలతో వారు మిమ్ములను దోచుకొని లాభం పొందుతారు. ఎందుకంటే చాలా కాలం నుండి తీర్పు వ్యర్ధముగా లేదు, మరియు వారి నాశనము కునికి నిద్రపోదు. 4 ఎందుకంటే దేవుడు పాపం చేసిన దేవదూతలను విడిచిపెట్టని యెడల, అయితే, తీర్పు కోసం ఉంచబడిన వారిని చీకటి యొక్క సంకెళ్ళలో నరకములోనికి కిందకు త్రోసి వేసి ఆయన అప్పగించాడు. 5 మరియు ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టలేదు, అయితే ఎనిమిదవ వాడు, నీతి యొక్క బోధకుడు నోవహును భక్తిహీనుల యొక్క లోకం మీదకు జలప్రళయమును తీసుకురావడం చేత భద్రపరచాడు. 6 మరియు సొదొమ మరియు గొమొఱ్ఱా యొక్క నగరాలు, బూడిదకు తగ్గించాడు, ఆయన నాశనానికి శిక్షించాడు, భక్తిహీనులగు వారికి జరుగబోవు సంగతుల యొక్క ఒక దృష్టాంతము ఉంచాడు. 7 మరియు ఆయన నీతిమంతుడు లోతును రక్షించాడు, విధి విరుద్ధమైన మనుష్యుల యొక్క కామాతురుమైన ప్రవర్తన చేత వేధించబడ్డాడు, 8 (ఎందుకంటే, చూడడం చేత మరియు వినడం చేత, ఆ నీతిమంతుడు, రోజు నుండి రోజు వారి మధ్య నివసిస్తూ ఉన్నాడు, అక్రమమైన క్రియల చేత అతని నీతిగల ప్రాణం బాధింపబడుతూ ఉంది. 9 శోధన నుండి మనుషులను కాపాడడానికి, మరియు తీర్పు యొక్క దినమున శిక్షింపబడియుండడానికి దుర్నీతిపరులను పట్టుకోడానికి ప్రభువుకు తెలుసు. 10 అయితే ప్రత్యేకించి శరీరమును దాని అపవిత్రత యొక్క కోరికలలో అనుసరించుచూ మరియు అధికారమును నిరాకరించు వారు. సిగ్గులేని వారు! స్వయం సంకల్పం గలవారు! మహిమాన్వితులను అవమానించినప్పుడు వారు వణుకరు; 11 అయితే దేవదూతలు, బలం మరియు శక్తిలో గొప్పవారుగా ఉండి, ప్రభువు యొక్క సన్నిధిలో వారికి వ్యతిరేకంగా అవమానకరమైన తీర్పు తీసుకురారు. 12 అయితే ఈ మనుష్యులు, వీరు వివేకశూన్యములగు జంతువుల వలే, పట్టబడి మరియు చంపబడడం కోసం స్వభావం చేత జన్మించారు, వారు అజ్ఞానంగా ఉన్న ఆ సనతులను గురించి అపవాదులు వేస్తారు, వారు కూడా వారి నాశనానికి నాశనం అవుతారు, 13 అధర్మం యొక్క ప్రతిఫలము {వలే} గాయపరచబడతారు, పట్టపగలు సుఖభోగాలలో గడపడం సంతోషం అనుకొంటారు. దాగులు మరియు కళంకములు, మీతో విందులలో పాల్గొంటూ ఉండగా తమ మోసాలలో సంతోషిస్తారు. 14 ఒక వ్యభిచారిణి యొక్క కన్నులతో నిండి ఉండి, మరియు పాపము నుండి ఎప్పటికీ నిలిచిపోకుండా, అస్థిరమైన ఆత్మలను ప్రలోభపెట్టడం, దురాశలో శిక్షణ పొందిన హృదయాలు, శాపం యొక్క పిల్లలు కలిగియుండి. 15 తిన్నని మార్గాన్ని విడిచి పెట్టి వారు త్రోవ తప్పి వెళ్ళారు, అధర్మ వేతనాన్ని ఇష్టపడే బోసోరుకు చెందిన బిలాము మార్గాన్ని అనుసరించారు, అతడు అధర్మం యొక్క ప్రతిఫలాన్ని ప్రేమించాడు. 16 అయితే అతడు తన సొంత అతిక్రమం కోసం ఒక గద్దింపును పొందాడు - ఒక మూగ గాడిద, ఒక మానవుని యొక్క స్వరంలో మాట్లాడి, ప్రవక్త యొక్క అహేతుకతను నిరోధించింది. 17 ఈ మనుషులు నీళ్లులేని ఊటలు మరియు ఒక తుఫాను చేత కొట్టుకొనిపోవు పొగమంచు. ఎందుకంటే చీకటి యొక్క అంధకారము వారికోసం భద్రము చేయబడియున్నది. 18 ఎందుకంటే వ్యర్థత యొక్క అహంకార సంగతులు మాట్లాడుతారు. తప్పులో నివసిస్తున్న వారి నుండి కేవలం తప్పించుకొంటున్న వారిని శరీర స్వభావ దురాశలచేత, దుష్టమైన క్రియల చేత మభ్యపెడతారు. 19 వారికి స్వేచ్ఛను వాగ్దానం చేస్తారు, తాము భ్రష్టత్వము యొక్క దాసులై ఉన్నారు. (ఎందుకంటే ఒకడు దేనివలన జయింపబడునో దాని చేత అతడు దాసుడగును.) 20 ఎందుకంటే మన ప్రభువు మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క జ్ఞానము ద్వారా లోకము యొక్క మాలిన్యమును తప్పించుకొని, అయితే మరల చిక్కుకొని, వారు ఈ సంగతుల చేత జయించబడ్డారు, వారి కోసం చివరి సంగతులు మొదటి సంగతుల కంటే మరింత చెడ్డవిగా మారాయి. 21 ఎందుకంటే వారు నీతి యొక్క మార్గమును తెలిసికొని, మరియు తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటె ఆ మార్గము తెలియక యుండుటయే వారికి మేలు. 22 ఈ సామెత వారికి జరిగిన నిజమైన సామెత: "ఒక కుక్క దాని సొంత వాంతికి తిరిగినట్టు మరియు కడుగబడిన ఒక పంది బురదకు తిరిగింది."
Chapter 3
1 ప్రియమైన వారలారా, ఇది ఇప్పుడు నేను మీకు రాసిన రెండవ పత్రిక; దీనిలో నేను మీ యదార్ధమైన మనసును జ్ఞాపకంలో రేపుతున్నాను. 2 పరిశుద్ధ ప్రవక్తల చేత గతములో పలుకబడిన మాటలు మరియు మన ప్రభువు మరియు రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకోడానికి, 3 దీనిని ముందు తెలుసుకొని, ఆ అపహాసకులు అంత్య దినములలో హేళనతో వస్తారు. తమ స్వకీయ దురాశల ప్రకారం ముందుకు వెళ్తారు. 4 మరియు చెపుతారు, "ఆయన రాకడ యొక్క వాగ్దానము ఎక్కడ ఉంది? ఎందుకంటే మన పితరులు నిద్రించినది మొదలుకొని, సమస్త కార్యములు సృష్టి యొక్క ఆరంభము నుండి అదే మార్గంలో కొనసాగుతున్నాయి." 5 ఎందుకంటే చాలా కాలం క్రితం ఆకాశం ఉనికిలో ఉంది మరియు దేవుని వాక్యం చేత నీళ్ళ ద్వారా మరియు నీళ్ళ నుండి భూమి ఏర్పడింది అని ఇది ఇష్టపూర్వకంగా వారి నుండి దాచబడింది, 6 దీని ద్వారా లోకం నీటి చేత ప్రవాహములో కొట్టుకొని పోయి ఆ కాలంలో నాశనం అయ్యింది. 7 అయితే ఇప్పుడు ఆకాశములు మరియు భూమి అదే ఆజ్ఞ చేత అగ్ని కోసం నిలువచేయబడ్డాయి. తీర్పు యొక్క దినము మరియు భక్తిహీనులైన మనుష్యుల యొక్క నాశనం కోసం ఉంచబడ్డాయి. 8 అయితే ప్రియమైన వారలారా ఈ ఒక్క సంగతి మీ నుండి దాచబడ కూడదు, ఏమనగా ప్రభువుతో ఒక రోజు 1,000 సంవత్సరముల వలే {ఉంది} మరియు 1,000 సంవత్సరములు ఒక దినము వలే {ఉన్నాయి}. 9 కొందరు ఆలస్యముగా భావించిన విధముగా ప్రభువు వాగ్దానము {గురించి} ఆలస్యము చేయడు, అయితే మీ పట్ల ఓపికగా ఉన్నాడు, ఎవరూ నశించడానికి కోరుకోవడం లేదు అయితే అందరూ పశ్చాత్తాపానికి కదలడానికి. 10 అయితే ప్రభువు యొక్క దినము ఒక దొంగ వలే వచ్చును, దానిలో ఆకాశములు పెద్ద శబ్దముతో గతింఛిపోవును, మరియు మూలకములు నాశనము చేయబడును, కాలిపోవును, మరియు భూమి మరియు దానిలోని కృత్యములు కనుగొనబడును. 11 ఈ సంగతులు అన్నీ ఈ విధంగా నాశనం అవుతాయి, మీరు పరిశుద్ధ ప్రవర్తనలు మరియు దైవిక చర్యలలో ఉండడానికి మీ కోసం ఇది ఏ విధమైన అవసరం, 12 దేవుని యొక్క దినము యొక్క రాకడ కోసం ఎదురుచూడటం మరియు త్వరితం చేయడం, దాని కారణంగా ఆకాశాలు, అగ్ని మీద ఉంచబడి, నాశనం అవుతాయి, మరియు మూలకములు, అగ్ని చేత కాల్చి వెయ్యబడతాయి, కరిగిపోతాయి? 13 ఆయితే ఆయన వాగ్దానం ప్రకారం నూతన ఆకాశాలు మరియు ఒక నూతన భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాము, అందులో నీతి నివసిస్తుంది. 14 కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంగతుల కోసం యెదురు చూస్తూ ఉండగా, సమాధానంలో ఆయన చేత వేచియున్నప్పుడు, శాంతియుతముగా ఆయన చేత నిష్కళంకులు మరియ నిందారహితులుగా కనుగొనబడడానికి జాగ్రత్తగా ఉండండి. 15 మరియు మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం ప్రకారం మీకు వ్రాసిన విధముగా మన ప్రభువు సహనాన్ని రక్షణగా {ఉండడానికి} పరిగణించండి. 16 తన పత్రికలు అన్నిటిలో కూడా ఉన్న విధముగా, ఈ సంగతులను గురించి వాటిలో మాట్లాడుతూ, వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవిగా ఉన్నాయి, వీటిని విద్యావిహీనులు మరియు అస్థిరులైన మనుషులు, ఇతర లేఖనములను కూడా తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. 17 కాబట్టి మీరు ప్రియమైనవారలారా, ముందుగా తెలిసికొనియున్నారు, మిమ్ములను మీరు భద్రపరచుకోండి తద్వారా మీరు నీతి విరోధుల యొక్క మోసం చేత త్రోవతప్పి నడిపించబడకుండ మరియు మీ స్వీయ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉంటారు. 18 అయితే మన ప్రభువు మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క కృప మరియు జ్ఞానములో వృద్ధి చెందండి. ఆయనకు ఇప్పుడు మరియు శాశ్వతకాలమూ మహిమ {ఉండును} గాక. ఆమేన్!