తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
Chapter 1
1 మన తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తులో తెస్సలొనీకయుల యొక్క సంఘమునకు పౌలు మరియు, సిల్వాను మరియు తిమోతి. 2 మీకు తండ్రి దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు నుండీ కృపా మరియు సమాధానాములు. 3 సహోదరులారా, మేము మీ గూర్చి దేవునికి ఎల్లప్పుడూ మీకు సరిపోయే విధంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీ విశ్వాసం బాగా అభివృద్ధి చెందుతుంది మరియు మీ అందరిలో ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతోంది. 4 కాబట్టి మీరు పొందుతున్న అన్ని హింసల్లోనూ మరియు మీరు సహిస్తున్న భాదల్లోనూ, మీ ఓర్పు మరియు విశ్వాసాన్ని చూసి దేవుని సంఘములలో మీ గురించి మేమే గొప్పగా చెప్పుతున్నాము, 5 దేవుని యొక్క న్యాయమైన తీర్పు యొక్క సాక్ష్యం, మీరు దేవుని రాజ్యానికి యోగ్యమైనవారుగా ఎంచబడటం కోసం, దాని కోసం కూడ మీరు శ్రమ పడుతున్నారు. 6 నిజానికి మిమ్మల్ని బాధిస్తున్న వారికి శ్రమను తిరిగి ఇచ్చిన యెడల ఇది దేవునికి న్యాయమే, 7 మరియు ప్రభువు యేసు యొక్క తన శక్తిమంతమైన దేవదూతలతో పరలోకం నుండి బయలుపరచబడినప్పుడు, మాతో శ్రమ పడుతూ ఉన్న మీకు పరిహారం. 8 దేవుని తెలియని వారి మీద మరియు మన ప్రభువు యేసు యొక్క సువార్తకు లోబడని వారి మీద మండుతున్న అగ్నిలో ప్రతీకారం తీర్చుకోవటం, 9 ఎవరు జరిమానా చెల్లిస్తారు- ప్రభువు యొక్క ముఖం నుండి మరియు ఆయన శక్తి యొక్క మహిమ నుండి దూరంగా శాశ్వతమైన నాశనం. 10 ఆ దినమున తన పరిశుద్ధుల చేత మహిమపరచబడుటకును, మరియు విశ్వసించినవారు అందరి చేత ప్రశంసింపబడుటకును, ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు విశ్వసించారు. 11 దీని కోసం మేము కూడా మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము, తద్వారా మన దేవుడు మిమ్మల్ని పిలుపుకు యోగ్యులుగా యెంచుతాడు మరియు శక్తిలో మంచితనం యొక్క ప్రతి కోరికను మరియు విశ్వాసం యొక్క పనిని ఆయన నెరవేర్చును. 12 తద్వారా మన దేవుడు మరియు ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప ప్రకారం మన ప్రభువు యేసు యొక్క నామము మీలోను, మరియు మీరు ఆయనలోను మహిమపరచబడతారు.
Chapter 2
1 ఇప్పుడు, సహోదరులారా మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క రాకడ మరియు ఆయన దగ్గర మనం సమకూడడం గురించి, మేము మిమ్మల్ని అడుగుతున్నాము 2 ఎందుకంటే మీరు త్వరగా {మీ} మనస్సులో కదల కుండా ఉండేందుకు మరియు ప్రభువు యొక్క దినం ఇప్పటికే వచ్చినట్లుగా మా నుండి వచ్చినట్లుగా ఆత్మ చేత గాని లేదా మాట చేత గాని లేదా లేఖ చేత గాని కలత చెందకుండా ఉండండి. 3 ఏ ఒక్కరూ మిమ్మల్ని ఏ విధంగానూ మోసం చేయకుందురు గాక, ఎందుకంటే మొదట భ్రష్టత్వము వచ్చి మరియు నాశనం యొక్క కుమారుడు, దుర్నీతి యొక్క పురుషుడు బయలుపరచబడతాడు. 4 దేవుడు లేదా ఆరాధన వస్తువు అని పిలువబడుతూ ఉన్న ప్రతిదానికి వ్యతిరేకంగా ఎదిరిస్తు మరియు తననుతాను హెచ్చించుకుంటాడు. దాని ఫలితంగా, అతడు దేవుని యొక్క దేవాలయములో కూర్చుంటాడు, తానే దేవుడై ఉన్నాడు అని చూపించుకుంటూడు. 5 నేనింకను మీ దగ్గర ఉన్నప్పుడు, ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? 6 మరియు ఇప్పుడు తన కాలంలో ఆయన వెల్లడించే వరకు, {ఆయనను} అడ్డగిస్తున్నది ఏదో అది మీరు యెరుగుదురు. 7 ఎందుకంటే ధర్మవిరోధం యొక్క మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది, ఇప్పుడు అడ్డగించుచున్నవాడు మాత్రమే అతడు మధ్యనుండి తీసి వేయబడు వరకే చేస్తాడు. 8 మరియు అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువు యేసు తన నోటి యొక్క శ్వాస చేత అతనిని సంహరిస్తాడు, మరియు ఆయన రాకడ యొక్క ప్రత్యక్షత చేత శూన్యములోనికి తీసుకుని వస్తాడు 9 వీరి రాక సమస్త బలము, మరియు సూచకక్రియలు మరియు తప్పుడు అద్భుతాలలో సాతాను యొక్క కార్యము ప్రకారం ఉంది. 10 మరియు నశించుచున్న వారికి సమస్త దుర్నీతి యొక్క మోసములో దాని కారణంగా వారు రక్షించబడడం కోసం సత్యము యొక్క ప్రేమను వారు పొందలేదు. 11 మరియు దీని కారణంగా, వారు అబద్ధాన్ని విశ్వసించడం కోసం దేవుడు వారి వద్దకు తప్పు యొక్క క్రియను పంపుచున్నాడు 12 తద్వారా సత్యమును విశ్వసించని వారు అయితే దుర్నీతిలో ఆనందాన్ని పొందియుండి వారు అందరూ తీర్పు తీర్చబడతారు. 13 ఇప్పుడు ప్రభువు చేత ప్రేమించబడిన సహోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆత్మ చేత పరిశుద్ధపరచబడడంలో రక్షణ మరియు సత్యంలో విశ్వాసం కోసం ప్రధమ ఫలములుగా దేవుడు మిమ్మును ఎంచుకున్నాడు. 14 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మా సువార్త ద్వారా దీనికి ఆయన మిమ్మును పిలిచాడు. 15 కాబట్టి అప్పుడు సోదరులారా, మా మాట చేత గాని, లేదా మా పత్రిక చేత మీకు ఉపదేశింపబడిన సంప్రదాయాలకు స్థిరంగా నిలబడండి మరియు గట్టిగా పట్టుకోండి 16 ఇప్పుడు మన ప్రభువు యేసు క్రీస్తు, తానే మరియు మనలను ప్రేమించి మరియు కృప ద్వారా శాశ్వత ఆదరణ మరియు మంచి నిరీక్షణను {మనకు} అనుగ్రహించిన మన తండ్రి దేవుడు. 17 ప్రతి మంచి పని మరియు మాటలో ఆయన మిమ్మును ఒదార్చును మరియు మీ హృదయాలను బలపరుచును గాక.
Chapter 3
1 తుదకు, సోదరులారా, మా కొరకు ప్రార్థించండి తద్వారా మీతో కూడా ఉన్న విధంగా, ప్రభువు యొక్క వాక్కు పరుగెత్తుతుంది మరియు మహిమపరచబడుతుంది. 2 మరియు తద్వారా మేము వక్రబుద్ధిగల మరియు దుష్టుమనుష్యుల బారి నుండి తప్పించుకునేలా, విశ్వాసము అందరికి లేదు 3 అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు మరియు దుష్టుడి నుండి కాపాడతాడు 4 మేము మీకు ఆజ్ఞాపించిన పనులు చేస్తున్నారు మరియు చేస్తారు అని మీ గురించి ప్రభువులో మాకు నమ్మకం కూడా ఉంది 5 ఇప్పుడు ప్రభువు మీ హృదయాలను దేవుని యొక్క ప్రేమకు మరియు క్రీస్తు యొక్క ఓర్పుకు నడిపిస్తాడు గాక.. 6 సోదరులారా, మీరు మా నుండి అందుకొన్న సాంప్రదాయల ప్రకారం కాక మరియు అక్రమంగా నడుచుచున్న ప్రతి సోదరుని నుండి దూరంగా ఉండడం కోసం ఇప్పుడు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క నామములో మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాము, 7 ఎందుకంటే మమ్మల్ని అనుకరించడం ఏవిధంగా ఇది అవసరమో మీకై మీరే యెరుగుదురు, ఎందుకంటే మేము మీ మధ్య క్రమరహితంగా ప్రవర్తించ లేదు. 8 లేదా మేము ఎవరి దగ్గర ఉచితంగా రొట్టె తిన లేదు, అయితే మీలో ఎవరికీ భారం కాకుండా ఉండడానికి రాత్రి మరియు పగలు శ్రమ మరియు కష్టంలో పని చేస్తున్నాము. 9 మాకు అధికారం లేదు కాబట్టి కాదు, అయితే మీరు మమ్మును అనుకరించడానికి మీకు ఒక మాదిరి {వలే} మమ్మును మేము అప్పగించుకొంటున్నాము 10 ఎందుకంటే మేము మీతో ఉన్నప్పుడు కూడా, మేము దీనిని మీకు ఆజ్ఞాపించాము “ఎవరైనా పని చేయడానికి ఇష్టపడని యెడల, అతనిని భుజింపనివ్వ వద్దు.” 11 ఎందుకంటే మీ మధ్య సోమరితనంగా నడచుచు, పని చెయ్యకుండా అయితే అవసరం లేకుండా ఇతరుల జోలికి పోతూ ఉన్న వారు కొందరి గురించి మేము వింటున్నాం. 12 అయితే అలాంటి వారు నెమ్మదితో పని చేయుచు, వారు తమ సొంత రొట్టెను భుజించుచుండవలెను అని ప్రభువు యేసు క్రీస్తులో మేము ఆజ్ఞాపిస్తున్నాము మరియు హెచ్చరిస్తున్నాము. 13 అయితే సోదరులారా మీరు, సరైనది చేయడంలో అలసి పోవద్దు. 14 ఇప్పుడు ఎవరైనా పత్రిక ద్వారా మన మాటను విధేయత చూపక పోయిన యెడల, అతనిని కనిపెట్టండి-అతనితో సహవాసం చేయడం వద్దు, తద్వారా అతను సిగ్గుపడుతాడు. 15 మరియు అతనిని ఒక శత్రువు వలే భావించ వద్దు, అయితే ఒక సోదరుడి వలే అతనిని హెచ్చరించండి. 16 ఇప్పుడు సమాధానము యొక్క ప్రభువు తానే ప్రతి విధానంలో అన్నిటి ద్వారా మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీ అందరితో ఉంటాడు. 17 ఈ శుభము నా సొంత చేతిలో ఉంది - పౌలును- ఇది ప్రతి పత్రికలోనూ గుర్తుగా ఉంది. ఈ విధానంలో నేను రాస్తాను. 18 మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క కృప మీ అందరితో {ఉంటుంది}.