Jonah
Jonah 1
Jonah 1:2
యోనాను ఏమి చేయమని యెహోవా చెప్పాడు?
యోనా లేచి నీనెవె వెళ్లి దానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా చెప్పాడు.
Jonah 1:3
నీనెవె వెళ్లమని యెహోవా చెప్పిన తర్వాత యోనా ఏమి చేశాడు?
యెహోవా ముఖం ముందు నుండి తర్షీషుకు పారిపోవడానికి యోనా లేచాడు.
Jonah 1:4
యోనా ఎక్కిన ఓడకు యెహోవా ఏమి చేశాడు?
ఓడ విరిగిపోయేలా ఉండటానికి యెహోవా ఒక గొప్ప గాలిని, పెద్ద తుఫానును సముద్రం మీదకు పంపాడు.
Jonah 1:5-6
తుఫాను మధ్యలో నావికులు ఎవరికి మొర్రపెట్టారు?
నావికులు చాలా భయపడ్డారు, ప్రతి ఒక్కరూ తన స్వంత దేవునికి మొర పెట్టుకున్నారు.
Jonah 1:7-9
కీదుకు కారణం ఎవరు అని నావికులు ఏవిధంగా నిర్ధారించారు?
కీడు యొక్క కారణాన్ని గుర్తించడానికి నావికులు చీట్లు వేసారు, ఒక చీటీ యోనాను సూచించింది.
చీట్లను వేయడం వలన కలిగిన ఫలితం ఏమిటి?
వారు అనుభవిస్తున్న కీడుకు యోనా కారణమని ఆ చీటీ సూచించింది.
Jonah 1:10-11
యెహోవా ముఖం ముందు నుండి యోనా పారిపోతున్నాడని నావికులకు ఏవిధంగా తెలుసు?
యోనా చెప్పినందున యెహోవా ముఖం నుండి యోనా పారిపోతున్నాడని నావికులకు తెలుసు.
Jonah 1:12-13
తుఫానును ఆపడానికి యోనా మనుషులకు ఏమి చెప్పాడు?
అతడిని పైకి లేపి సముద్రంలోకి విసిరేయమని యోనా ఆ మనుషులకు చెప్పాడు.
Jonah 1:14
నావికులు యెహోవా నుండి ఏ రెండు మానవులు చేసారు?
యోనా జీవితం కారణంగా తాము నశించనివ్వవద్దని, యోనా మరణానికి తమను దోషులుగా ఉంచవద్దని నావికులు యెహోవాను కోరారు.
Jonah 1:15-16
నావికులు యోనాను సముద్రంలోకి విసిరినప్పుడు ఏమి జరిగింది?
నావికులు యోనాను సముద్రంలోకి విసిరినప్పుడు, సముద్రం పొంగిపోకుండా ఆగిపోయింది.
Jonah 1:17
నావికులు సముద్రంలోకి విసిరినప్పుడు యోనాకు ఏమీ జరిగింది?
యోనాను మింగడానికి యెహోవా ఒక గొప్ప చేపను నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు చేప కడుపులో ఉన్నాడు.
Jonah 2
Jonah 2:1-3
చేపల కడుపులో యోనా ఏమి చేశాడు?
యోనా ఆపదలో ఉన్నందున ప్రార్థనలో యెహోవాకు మొరపెట్టాడు.
Jonah 2:4-5
తాను తిరిగి ఏమి చేయగలడని యోనా ఆశించాడు?
తాను తిరిగి యెహోవా పవిత్ర ఆలయం వైపు చూడగలనని యోనా ఆశించాడు.
Jonah 2:6-7
యోనా జీవితాన్ని యెహోవా ఎక్కడ నుండి తెచ్చాడు?
యెహోవా యోనా జీవితాన్ని గుంట నుండి పైకి తెచ్చాడు.
Jonah 2:8
ఖాళీ వ్యర్థాలపై దృష్టి పెట్టే వారికి ఏమి జరుగుతుందని యోనా చెప్పాడు?
నిరర్ధకమైన విగ్రహాల మీద దృష్టిని నిలిపేవారు నిబంధన విశ్వాసాన్ని నిరాకరిస్తున్నారు.
Jonah 2:9
యోనా చేప కడుపులో ప్రార్థించినప్పుడు, అతడు ఏమి చేస్తానని చెప్పాడు?
తాను కృతజ్ఞతాస్తుతుల యొక్క స్వరంతో దేవునికి బలి అర్పిస్తానని చెప్పాడు, తాను మొక్కుకున్న దానిని నేను నెరవేరుస్తాను అని నిబంధన చేసాడు.
రక్షణ ఎవరికి చెందఉందని యోనా చెప్పాడు?
రక్షణ యెహోవాకు చెందఉందని యోనా చెప్పాడు.
Jonah 2:10
యోనా ప్రార్థనకు యెహోవా ఏవిధంగా ప్రతిస్పందించాడు?
యెహోవా చేపకు చెప్పాడు, మరియు అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.
Jonah 3
Jonah 3:2
యోనాను రెండవసారి ఏమి చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు?
నీనెవెకు వెళ్లి, యెహోవా సందేశాన్ని పలకమని యెహోవా యోనాకు ఆజ్ఞాపించాడు.
Jonah 3:3
నీనెవెకు వెళ్లమని యెహోవా చెప్పిన రెండవసారి యోనా ఏవిధంగా స్పందించాడు?
యోనా యెహోవాకు లోబడి నీనెవెకు వెళ్లాడు.
Jonah 3:4-7
నీనెవెలో యోనా ఏ సందేశం చెప్పాడు?
40 రోజుల్లో నీనెవె పడగొట్టబడుతుందని యోనా చెప్పాడు.
Jonah 3:8
యోనా బోధించిన యెహోవా సందేశానికి నీనెవీయులు ఏవిధంగా ప్రతిస్పందించారు?
నీనెవె ప్రజలు దేవుణ్ణి విశ్వసించారు, ఉపవాసం ఉన్నారు, గొనెపట్ట కప్పుకొన్నారు. ఏ వ్యక్తి లేదా జంతువు నీరు తినకూడదు లేదా త్రాగకూడదు, ప్రతి వ్యక్తి, జంతువు తప్పనిసరిగా గోనెపట్టతో కప్పబడి ఉండాలని, ప్రతి వ్యక్తి దేవుడిని మొరపెట్టుకోవాలని, హింసాత్మక చర్యలతో సహా చెడు పనులు చేయడం మానేయాలని నీనెవె రాజు ఒక శాశానాన్ని చేసాడు.
Jonah 3:9
నీనెవె రాజుకు నీనెవె, నీనెవె నగరం ప్రజల పట్ల, ఎటువంటి నిరీక్షణ ఉంది?
నీనెవె ప్రజలు నశించకుండా దేవుడు తన కోపం నుండి వెనక్కి తిరిగి వారిపై కరుణ చూపాలని నీనెవె రాజు ఆశించాడు.
Jonah 3:10
నీనెవేయుల పశ్చాత్తాపానికి దేవుడు ఏవిధంగా ప్రతిస్పందించాడు?
వారు తమ దుష్ట మార్గాల నుండి తప్పుకొన్నారు అని దేవుడు వారి క్రియలను చూసాడు. మరియు దేవుడు తాను వారికి చేస్తాను అని తాను చెప్పిన కీడు విషయంలో మనసు మార్చుకొన్నాడు, మరియు ఆయన దానిని చెయ్యలేదు.
Jonah 4
Jonah 4:1
యోనా ఎందుకు కోపంగా ఉన్నాడు?
యోనా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నీనెవేయులపై యెహోవా కరుణ చూపడం, వారిని శిక్షించకపోవడం యోనాకు గొప్ప కీడుగా అనిపించింది.
Jonah 4:2
తర్షీషు పారిపోవడానికి ప్రయత్నించానని యోనా ఎందుకు చెప్పాడు?
యెహోవా కృపగలవాడు మరియు కరుణగల దేవుడు, దీర్ఘశాంతం గలవాడు మరియు నిబంధన విశ్వాస్యతలో సమృద్ధిగలవాడు మరియు కీడు నుండి మనసు మార్చుకొనువాడు అని యోనాకు తెలుసు కనుక తర్షీషుకు పారిపోడానికి ముందుగానే ప్రయతించాను అని చెప్పాడు.
Jonah 4:3
తనకు ఏమి చేయమని యోనా యెహోవాను అడిగాడు?
తన ప్రాణాలను తీయమని యోనా యెహోవాను అడిగాడు.
Jonah 4:4
యెహోవా యోనాను ఏ ప్రశ్న అడిగాడు?
యోనా కోపంగా ఉండటం సరైనదేనా అని యెహోవా యోనాను అడిగాడు.
Jonah 4:5
యోనా నగరం నుండి బయటకు వెళ్లి నగరానికి ఎదురుగా ఎందుకు కూర్చున్నాడు?
యోనా నీనెవె నగరానికి ఏమి జరుగుతుందో చూడాలనుకున్నాడు.
Jonah 4:6
యోనా నగరం వెలుపల కూర్చున్నప్పుడు యెహోవా ఆయన కోసం ఏమి చేశాడు?
యోనా తన తలకు నీడగా ఉండేలా ఒక మొక్క పెరగడానికి యెహోవా కారణమయ్యాడు.
Jonah 4:7-8
యోనాకు నీడనిచ్చిన మొక్కకు యెహోవా ఏమి చేశాడు?
మరుసటి రోజు ఉదయించే సమయంలో దేవుడు ఒక పురుగును నియమించాడు;, అది మొక్కపై దాడి చేసింది,, అది ఎండిపోయింది.
Jonah 4:9
మొక్క మొక్క ఎండిపోవడానికి, యోనాపై వేడి తూర్పు గాలి వీచిన తరువాత యెహోవా ఏ ప్రశ్నను యోనాను అడిగాడు?
అతడు మొక్క గురించి కోపంగా ఉండటం సరైనదేనా అని యెహోవా యోనాను అడిగాడు.
Jonah 4:10
తనకు నీడనిచ్చిన మొక్క ఎండిపోయి చనిపోయినప్పుడు యోనాకు ఏవిధంగా అనిపించింది?
వాడిపోయిన, చనిపోయిన మొక్క పట్ల యోనా కరుణించాడు.
Jonah 4:11
ఎవరి కోసం యెహోవా కరుణించాడు?
నీనెవెలోని ప్రజలు, జంతువుల పట్ల యెహోవా కనికరం చూపాడు.