2 Thessalonians
2 Thessalonians 1
2 Thessalonians 1:3
థెస్సలొనీక సంఘము కలిగియున్న ఏ రెండు విషయాల గూర్చి పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాడు?
పౌలు వారిలో వృద్ధి చెందుతున్న విశ్వాసానికి మరియు వారిలో ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమకు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
2 Thessalonians 1:4
ఎలాంటి పరిస్థితులను థెస్సలొనీక విశ్వాసులు సహిస్తున్నారు?
విశ్వాసులు శ్రమలను మరియు బాధలను సహిస్తున్నారు.
2 Thessalonians 1:5
సహిస్తున్న పరిస్థితులకు విశ్వాసులకు కలిగే సానుకూల ఫలితం ఏమిటి?
విశ్వాసులు దేవుని రాజ్యానికి అర్హులుగా పరిగణించబడతారు.
2 Thessalonians 1:6
విశ్వాసులను బాధపెట్టేవారిని దేవుడు ఏమి చేస్తాడు?
విశ్వాసులను బాధపెట్టేవారిని దహించు అగ్నితో దేవుడు బాధిస్తాడు.
2 Thessalonians 1:7
విశ్వాసులను బాధపెట్టేవారిని దేవుడు ఏమి చేస్తాడు?
విశ్వాసులను బాధపెట్టేవారిని దహించు అగ్నితో దేవుడు బాధిస్తాడు.
విశ్వాసులు తమ బాధల నుండి ఎప్పుడు విడిపించబడతారు?
పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు విడుదల కలుగుతుంది.
2 Thessalonians 1:8
విశ్వాసులను బాధపెట్టేవారిని దేవుడు ఏమి చేస్తాడు?
విశ్వాసులను బాధపెట్టేవారిని దహించు అగ్నితో దేవుడు బాధిస్తాడు.
2 Thessalonians 1:9
దేవుని గురించి తెలియని వారికి ఎంతకాలం శిక్ష ఉంటుంది?
దేవుని గురించి తెలియని వారికి శిక్ష శాశ్వతకాలం ఉంటుంది.
దేవునిని ఎరుగని వారు శిక్షలో భాగంగా దేని నుండి వేరు చేయబడతారు?
దేవునిని ఎరుగని వారు శిక్షలో భాగంగా దేవుని సన్నిధి నుండి వేరు చేయబడతారు.
2 Thessalonians 1:10
క్రీస్తు రాకడ దినాన్ని చూసి విశ్వాసులు ఏమి చేస్తారు?
క్రీస్తు తన దినాన వచ్చినప్పుడు విశ్వాసులు ఆయనను చూసి ఆశ్చర్యపోతారు.
2 Thessalonians 1:11
దేవుని శక్తితో విశ్వాసులు చేసిన సత్కార్యాల ఫలితం ఏమిటి?
వారి సత్కార్యాల ఫలితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామం మహిమపరచబడుతోంది.
2 Thessalonians 1:12
దేవుని శక్తితో చేయబడిన విశ్వాసులసత్కార్యాలు ఫలితం ఏమిటి?
వారి సత్కార్యాల ఫలితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామం మహిమపరచబడుతోంది.
2 Thessalonians 2
2 Thessalonians 2:1
ఏ సంఘటన గురించి పౌలు ఇప్పుడు వ్రాయబోతున్నట్లు చెప్పాడు?
ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గూర్చి వ్రాయబోతున్నానని పౌలు చెప్పాడు.
2 Thessalonians 2:2
పౌలు ఏమి నమ్మవద్దని వారికి చెప్పాడు?
ప్రభువు దినము ఇప్పటికే వచ్చిందని నమ్మవద్దని పౌలు వారికి చెప్పాడు.
2 Thessalonians 2:3
ప్రభువు దినానికి ముందు ఏమి రావాలని పౌలు చెప్పాడు?
పడిపోవడం మరియు అధర్మము జరిగించు వ్యక్తి గూర్చి బయలుపరచబడటం ప్రభువు దినానికి ముందే రావాలి.
2 Thessalonians 2:4-5
అధర్మము జరిగించు వ్యక్తి ఏమి చేస్తాడు?
అధర్మము జరిగించు వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకొని, దేవుని ఆలయంలో కూర్చుని దేవుడిగా చిత్రీకరించుకుంటాడు.
2 Thessalonians 2:6
అధర్మము జరిగించు వ్యక్తి ఎప్పుడు బయలుపరచబడతాడు?
తగిన కాలమున అధర్మము జరిగించు వ్యక్తిని అడ్డుకొనువాడు దారి నుండి తీసివేయబడినప్పుడు అధర్మము జరిగించు వ్యక్తి బయలుపరచబడును.
2 Thessalonians 2:7
అధర్మము జరిగించు వ్యక్తి ఎప్పుడు బయలుపరచబడతాడు?
తగిన కాలమున అధర్మము జరిగించు వ్యక్తిని అడ్డుకొనువాడు దారి నుండి తీసివేయబడినప్పుడు అధర్మము జరిగించు వ్యక్తి nబయలుపరచబడును.
2 Thessalonians 2:8
యేసు బయలుపరచబడినప్పుడు అధర్మము జరిగించు వ్యక్తిని ఏమి చేస్తాడు?
యేసు బయలుపరచబడినప్పుడు, అధర్మము జరిగించు వ్యక్తిని అంతమొందిస్తాడు.
2 Thessalonians 2:9
శక్తిని, సంకేతాలను మరియు తప్పుడు అద్భుతాలను ఇవ్వడానికి అధర్మము జరిగించు వ్యక్తితో ఎవరు పని చేస్తున్నారు?
శక్తిని, సంకేతాలను మరియు తప్పుడు అద్భుతాలను ఇవ్వడానికి అధర్మము జరిగించు వ్యక్తితో సాతాను కలిసి పని చేస్తున్నాడు.
2 Thessalonians 2:10-11
కొందరు అధర్మము జరిగించు వ్యక్తి చేత మోసపోయి ఎందుకు నశించిపోతున్నారు?
కొందరు రక్షింపబడునట్లు సత్యము యొక్క ప్రేమను పొందలేకపోయారు గనుక మోసపోతున్నారు.
2 Thessalonians 2:12
మోసపోయి నశించిపోతున్నవారు దేనిలో ఆనందిస్తారు?
మోసపోయి నశించిపోతున్నవారు అధర్మంనందు ఆనందాన్ని పొందుతారు.
2 Thessalonians 2:13
సువార్త ద్వారా థెస్సలొనీకయులు ఏమి పొందాలని దేవుడు ఎంచుకున్నాడు?
సువార్త ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందేందుకు దేవుడు థెస్సలొనీకయులను ఎన్నుకున్నాడు.
2 Thessalonians 2:14
సువార్త ద్వారా థెస్సలొనీకయులు ఏమి పొందాలని దేవుడు ఎంచుకున్నాడు?
సువార్త ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందేందుకు దేవుడు థెస్సలొనీకయులను ఎన్నుకున్నాడు.
2 Thessalonians 2:15-16
థెస్సలొనీకయులు సువార్త పొందుకున్నందుకు ఇప్పుడు ఏమి చేయాలని పౌలు పిలుస్తున్నాడు?
పౌలు థెస్సలొనీకయులను స్థిరంగా నిలబడాలని మరియు వారికి భోదించబడిన సంప్రదాయాలను గ్రహించాలని పిలుపునిచ్చా డు.
2 Thessalonians 2:17
ఏ విషయములలో థెస్సలొనీకయులు తమ హృదయాల్లో స్థిరపడాలని పౌలు కోరుతున్నాడు?
ప్రతి మంచి పనిలో మరియు మాటలో థెస్సలొనీకయులు స్థిరపడాలని పౌలు కోరుకుంటున్నాడు.
2 Thessalonians 3
2 Thessalonians 3:1
ఎందు నిమిత్తం థెస్సలొనీకయులు ప్రభువు వాక్యం గురించి ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు?
ప్రభువు వాక్యం వేగంగా వ్యాప్తి చెందాలని మరియు మహిమపరచబడాలని థెస్సలొనీకయులు ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు.
2 Thessalonians 3:2-3
పౌలు ఎవరి నుండి విడుదల కోరుకుంటున్నాడు?
పౌలు విశ్వాసం లేని చెడ్డ మరియు దుర్మార్గుల నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నాడు.
2 Thessalonians 3:4-5
థెస్సలొనీకయులను ఏమి కొనసాగిస్తూ ఉండమని పౌలు చెప్పాడు?
పౌలు తాను ఆజ్ఞాపించిన వాటిని చెయ్యడం కొనసాగించమని థెస్సలొనీకయులకు చెప్పాడు.
2 Thessalonians 3:6
పౌలు నుండి పొందిన సంప్రదాయాల ప్రకారం కాకుండా క్రమరాహిత్యంతో నడిచే ప్రతి సోదరుడితో విశ్వాసులు ఎలా ప్రతిస్పందించాలి?
విశ్వాసులు పౌలు నుండి పొందిన సంప్రదాయాల ప్రకారం కాకుండా క్రమరాహిత్యంతో నడిచే ప్రతి సోదరుణ్ణి దూరం పెట్టాలి.
2 Thessalonians 3:7
పౌలు తన పని మరియు సహాయము విషయంలో ఎలాంటి మాదిరి థెస్సలొనీకయులకు ఉంచాడు?
పౌలు రాత్రింబగళ్లు శ్రమిస్తూ, ఎవరికీ భారంగా ఉండకుండా తన ఆహారాన్ని తానే సమకూర్చుకున్నాడు..
2 Thessalonians 3:8-9
పౌలు తన పని మరియు సహాయము విషయంలో ఎలాంటి మాదిరి థెస్సలొనీకయులకు ఉంచాడు?
పౌలు రాత్రింబగళ్లు శ్రమిస్తూ, ఎవరికీ భారంగా ఉండకుండా తన ఆహారాన్ని తానే సమకూర్చుకున్నాడు.
2 Thessalonians 3:10-11
పని చేయకూడదనుకునే వారి గురించి పౌలు ఏమి ఆజ్ఞాపించాడు?
పని చెయ్యకూడదనుకున్నవాడు ఎవరైనా తినకూడదని పౌలు ఆజ్ఞాపించాడు.
2 Thessalonians 3:12-13
సోమరితనానికి బదులుగా ఏమి చేయమని పౌలు ఆజ్ఞాపించాడు?
పౌలు సోమరులను పనిచేసి వారి స్వంత ఆహారం తినమని ఆజ్ఞాపించాడు.
2 Thessalonians 3:14-15
ఈ పత్రికలో ఉన్న పౌలు సూచనను పాటించని సోదరులను ఏమి చేయాలి?
ఈ పత్రికలో ఉన్న పౌలు సూచనను పాటించని వానితో సహోదరులు ఎటువంటి సహవాసం కలిగి ఉండకూడదు.
2 Thessalonians 3:16
థెస్సలొనీకయులకు ప్రభువు ఏమి ఇవ్వాలని పౌలు ఆశిస్తున్నాడు?
ప్రభువు థెస్సలొనీకయులకు అన్ని విధాలుగా శాంతిని ఇవ్వాలని పౌలు ఆశిస్తున్నాడు.
2 Thessalonians 3:17-18
ఈ పత్రికకు తానే రచయిత అని పౌలు ఎలా చూపించాడు?
పౌలు తన స్వహస్తాలతో తానే రచయిత అని అభినందనలు తెలియచేస్తాడు.