Colossians
Colossians 1
Colossians 1:1
పౌలు ఏ విధంగా క్రీస్తు యేసు అపొస్తలుడయ్యాడు?
పౌలు దేవుని చిత్తం ద్వారా క్రీస్తు యేసు అపొస్తలుడయ్యాడు.
Colossians 1:2-4
పౌలు ఈ పత్రిక ఎవరికి వ్రాసాడు?
దేవుని కోసం ప్రత్యేకించబడిన వారికి మరియు కొలొస్సీలోని నమ్మకమైన సహోదరులకు పౌలు వ్రాశాడు.
Colossians 1:5
కొలొస్సయులు తమకు ఇప్పుడున్న నమ్మకమైన నిరీక్షణ గురించి ఎక్కడ నుండి విన్నారు?
కొలొస్సయులు సత్య వాక్యమైన సువార్తలో తమ నమ్మకమైన నిరీక్షణ గురించి విన్నారు.
Colossians 1:6
లోకంలో సువార్త ఏమి చేస్తోందని పౌలు చెప్పాడు?
సువార్త ప్రపంచమంతటా ఫలాలను అందిస్తూ వృద్ధి చెందుతుంది అని పౌలు చెప్పాడు.
Colossians 1:7-8
కొలొస్సయులకు సువార్తను ఎవరు అందించారు?
క్రీస్తు నమ్మకమైన సేవకుడైన ఎపఫ్రా కొలొస్సయులకు సువార్తను అందించాడు.
Colossians 1:9
కొలొస్సయులు దేనితో నింపబడాలని పౌలు ప్రార్థిస్తున్నాడు?
కొలొస్సయులు సమస్త జ్ఞానము మరియు ఆత్మీయ అవగాహనతో దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానముతో నింపబడాలని పౌలు ప్రార్థిస్తున్నాడు.
Colossians 1:10-11
కొలొస్సయులు తమ జీవితాలలో నడుచుకోవాలని పౌలు ఏ విధంగా ప్రార్థించాడు?
కొలొస్సయులు ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవాలని, మంచి పనులతో ఫలాలను పొందాలని, దేవుని గురించిన జ్ఞానంలో వృద్ధి చెందాలని పౌలు ప్రార్థిస్తున్నాడు.
Colossians 1:12
దేవుని కోసం ప్రత్యేకించబడినవారు దేనికి అర్హులు?
దేవుని కొరకు ప్రత్యేకించబడినవారు వెలుగులోని వారసత్వంలో భాగస్వామ్యానికి అర్హులు.
Colossians 1:13
తండ్రి తన కొరకు వేరు చేయబడిన వారిని దేని నుండి రక్షించాడు?
ఆయన వారిని చీకటి ఆధిపత్యం నుండి రక్షించి తన కుమారుని రాజ్యానికి బదిలీ చేశాడు.
Colossians 1:14
క్రీస్తులో, మనకు విమోచన ఉంది, ఏది?
క్రీస్తులో మనకు విమోచన ఉంది, అది పాప క్షమాపణ.
Colossians 1:15
కుమారుడు ఎవరి స్వరూపము?
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం.
Colossians 1:16-19
యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన కోసం ఏమి సృష్టించబడింది?
సమస్తము యేసుక్రీస్తు ద్వారా మరియు ఆయన కోసం సృష్టించబడినవి.
Colossians 1:20
దేవుడు అన్ని సంగతులను తనతో ఏ విధంగా సమాధానపరచుకున్నాడు?
దేవుడు తన కుమారుని రక్తము ద్వారా సమాధానమును కలుగజేసినప్పుడు తనతో సమస్తమును సమాధానపరచుకొనెను.
Colossians 1:21-22
కొలొస్సయులు సువార్తను విశ్వసించే ముందు దేవునితో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నారు?
సువార్తను విశ్వసించే ముందు, కొలొస్సయులు దేవుని నుండి వేరు చేయబడి ఆయనకు శత్రువులుగా ఉన్నారు.
Colossians 1:23
కొలొస్సయులు ఏమి చేస్తూనే ఉండాలి?
కొలొస్సయులు సువార్త యొక్క విశ్వాసం మరియు నమ్మకంతో స్థిరపడటం కొనసాగించాలి.
Colossians 1:24-26
ఎవరి నిమిత్తము పౌలు బాధపడుతున్నాడు మరియు అతని వైఖరి ఏమిటి?
పౌలు చర్చి కొరకు బాధలు పడుతున్నాడు, మరియు అతను దానిలో సంతోషిస్తున్నాడు.
Colossians 1:27
యుగయుగాలుగా దాచబడి అయితే ఇప్పుడు బయలుపరచబడిన మర్మము ఏమిటి?
యుగయుగాలుగా దాచబడి అయితే ఇప్పుడు బయలుపరచబడిన మర్మము నీలో క్రీస్తు, మహిమ యొక్క విశ్వాసము.
Colossians 1:28-29
పౌలు ప్రతి మనిషికి ఉపదేశిస్తున్న మరియు బోధిస్తున్న లక్ష్యం ఏమిటి?
ప్రతి వ్యక్తిని క్రీస్తులో సంపూర్ణంగా కనుపరచడమే పౌలు లక్ష్యం.
Colossians 2
Colossians 2:2
దేవుని మర్మం ఏమిటి?
దేవుని మర్మం క్రీస్తు.
Colossians 2:3
క్రీస్తులో ఏమి దాగి ఉంది?
బుద్ధి మరియు జ్ఞానం యొక్క దాచబడిన సమస్త సంపదలు క్రీస్తులో దాగి ఉన్నాయి.
Colossians 2:4-5
కొలొస్సయులకు ఏమి జరుగుతుందని పౌలు ఆందోళన చెందుతున్నాడు?
కొలొస్సయులు ఒప్పించే మాటలతో మోసగించబడతారని పౌలు ఆందోళన చెందాడు.
Colossians 2:6-7
కొలొస్సయులు క్రీస్తు యేసును స్వీకరించినందున ఇప్పుడు ఏమి చేయాలని పౌలు పిలిచాడు?
కొలొస్సయులను క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే నడుచుకోవాలని పౌలు పిలుపునిచ్చాడు.
Colossians 2:8
పౌలు చింతిస్తున్న నిరుపయోగమైన మోసాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి?
నిరుపయోగమైన మోసాలు మానవ సంప్రదాయం మరియు లోకం యొక్క పాపాత్మకమైన విశ్వాస వ్యవస్థల మీద ఆధారపడి ఉంటాయి.
Colossians 2:9
క్రీస్తులో ఏమి జీవిస్తుంది?
దేవుని స్వభావం యొక్క సంపూర్ణత అంతా క్రీస్తులో నివసిస్తుంది.
Colossians 2:10
సమస్త పాలన మరియు అధికారానికి అధిపతి ఎవరు?
క్రీస్తు సమస్త నియమాలకు మరియు అధికారానికి అధిపతి.
Colossians 2:11
క్రీస్తు సంబంధమైన సున్నతి ద్వారా ఏమి తొలగించబడింది?
క్రీస్తు సంబంధమైన సున్నతి ద్వారా శరీరం యొక్క పాప సంబంధమైన దేహం తొలగించబడింది?
Colossians 2:12
బాప్తిస్మంలో ఏమి జరుగుతుంది?
బాప్తిస్మంలో ఒక వ్యక్తి క్రీస్తుతో పాటు పాతిపెట్టబడ్డాడు.
Colossians 2:13
ఒక వ్యక్తిని క్రీస్తు సజీవునిగా చెయ్యడానికి ముందు అతని పరిస్థితి ఏమిటి?
ఒక వ్యక్తిని క్రీస్తు సజీవునిగా చెయ్యడానికి ముందు అతడు తన పాపములలో చనిపోయాడు.
Colossians 2:14
మన మీద మోపబడిన ఋణముల పత్రమును క్రీస్తు ఏమి చేశాడు?
మన మీద మోపబడిన ఋణముల పత్రమును క్రీస్తు తొలగించాడు మరియు దానిని సిలువకు కొట్టాడు.
Colossians 2:15
అధిపతులు మరియు అధికారులతో క్రీస్తు ఏమి చేసాడు?
అధిపతులు మరియు అధికారులను క్రీస్తు తొలగించాడు, వారిని బహిరంగంగా కనుపరచాడు, మరియు విజయోత్సవంలో తన బందీలుగా వారిని నడిపించాడు.
Colossians 2:16
రాబోయే వాటి ఛాయ అని పౌలు వేటిని గురించి చెప్పాడు?
ఆహారం, పానీయం, పండుగ రోజులు మరియు విశ్రాంతి దినాలు రాబోయే వాటి యొక్క ఛాయ అని పౌలు చెప్పాడు.
Colossians 2:17-18
ఛాయలు ఏ వాస్తవికతను సూచిస్తాయి?
ఛాయలు క్రీస్తు యొక్క వాస్తవికతను సూచిస్తాయి.
Colossians 2:19-20
దేవుని నుండి ఎదుగుదలతో శరీరమంతా దేని నుండి వృద్ధి చెందుతుంది?
దేవుని నుండి వచ్చిన ఎదుగుదలతో వృద్ధి చెందడానికి శరీరమంతా శిరస్సు అయిన క్రీస్తును గట్టిగా పట్టుకుంది.
Colossians 2:21-22
ఏ విధమైన ఆజ్ఞలు లోక విశ్వాసాలలో భాగమని పౌలు చెప్పాడు?
పట్టుకొనకూడదు, రుచి చూడకూడదు మరియు తాకకూడదు అనే ఆజ్ఞలు లోక విశ్వాసాలలో భాగం.
Colossians 2:23
మానవ నిర్మిత మతం యొక్క నియమాలకు వ్యతిరేకంగా వెతికి విలువ లేదు?
మానవ నిర్మిత మతం యొక్క నియమాలకు శరీరం యొక్క కోరికలకు వ్యతిరేకంగా ఎటువంటి విలువ లేదు.
Colossians 3
Colossians 3:1
క్రీస్తు ఎక్కడికి తిరిగి సజీవుడిగా లేచాడు?
క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటకు ఆయన సజీవుడిగా లేపబడెను.
విశ్వాసులు దేనిని వెదకాలి, దేనిని వెదకకూడదు?
విశ్వాసులు భూమి మీద వస్తువులను కాకుండా పైనున్న వాటిని వెదకాలి.
Colossians 3:2
విశ్వాసులు దేనిని వెదకాలి, దేనిని వెదకకూడదు?
విశ్వాసులు భూమి మీద వస్తువులను కాకుండా పైనున్న వాటిని వెదకాలి.
Colossians 3:3
దేవుడు విశ్వాసి జీవాన్ని ఎక్కడ ఉంచాడు?
దేవుడు విశ్వాసి జీవాన్ని క్రీస్తులో దాచిపెట్టాడు.
Colossians 3:4
క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసికి ఏమి జరుగుతుంది?
క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, విశ్వాసి కూడా ఆయనతో పాటు మహిమలో బయలుపరచబడతాడు.
Colossians 3:5
విశ్వాసి వేటికి మరణశిక్ష విధించాలి?
విశ్వాసి భూమి యొక్క పాపపు కోరికలను చంపాలి.
Colossians 3:6-7
దేవునికి అవిధేయులైన వారికి ఏమవుతుంది?
దేవునికి అవిధేయత చూపే వారి మీద దేవుని కోపం వస్తుంది.
Colossians 3:8-9
విశ్వాసులు తప్పనిసరిగా విడిచిపెట్టాలని పౌలు చెప్పిన కొన్ని పాత స్వభావానికి సంబంధించిన విషయాలు ఏమిటి?
ఆగ్రహం, కోపం, దుష్ట ఉద్దేశాలు, అవమానాలు మరియు అసభ్యకరమైన మాటలను విడిచిపెట్టాలి.
Colossians 3:10-11
విశ్వాసి యొక్క నూతన జీవితం ఎవరి స్వరూపంలో సృష్టించబడింది?
విశ్వాసి యొక్క నూతన జీవితం క్రీస్తు స్వరూపంలో సృష్టించబడింది.
Colossians 3:12
విశ్వాసులు తప్పనిసరిగా ధరించాలని పౌలు చెప్పిన కొన్ని నూతన జీవితం భాగమైన కొన్ని విషయాలు ఏమిటి?
కరుణ, దయ, వినయం, సాత్వికం మరియు సహనం యొక్క హృదయాన్ని విశ్వాసి ధరించాలి.
Colossians 3:13
విశ్వాసి ఏ విధంగా క్షమించాలి?
ప్రభువు తనను క్షమించిన విధంగానే విశ్వాసి క్షమించాలి.
Colossians 3:14
విశ్వాసుల మధ్య పరిపూర్ణత యొక్క బంధం ఏమిటి?
ప్రేమ అనేది పరిపూర్ణత యొక్క బంధం.
Colossians 3:15
విశ్వాసి హృదయంలో ఏది పాలించాలి?
విశ్వాసి హృదయంలో క్రీస్తు సమాధానం పాలించాలి.
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో, చేతలలో దేవునికి ఏమి ఇవ్వాలి?
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో మరియు చేతలలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.
Colossians 3:16
విశ్వాసిలో ఏది గొప్పగా జీవించాలి?
క్రీస్తు వాక్యం విశ్వాసిలో సమృద్ధిగా జీవించాలి.
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో, చేతలలో దేవునికి ఏమి ఇవ్వాలి?
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో మరియు చేతలలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.
Colossians 3:17
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో, చేతలలో దేవునికి ఏమి ఇవ్వాలి?
విశ్వాసి తన వైఖరిలో, పాటలో, మాటలో మరియు చేతలలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.
Colossians 3:18
భార్య తన భర్తకు ఏ విధంగా స్పందించాలి?
భార్య తన భర్తకు లోబడాలి.
Colossians 3:19
భర్త తన భార్యతో ఏ విధంగా ప్రవర్తించాలి?
భర్త తన భార్యను ప్రేమించాలి మరియు ఆమె మీద కోపంగా ఉండకూడదు.
Colossians 3:20
చిన్నబిడ్డ తన తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి?
చిన్నబిడ్డ తన తల్లిదండ్రులకు అన్ని విషయాలలో లోబడాలి.
Colossians 3:21-22
తండ్రి తన పిల్లలకు ఏమి చేయకూడదు?
తండ్రి తన పిల్లలకు కోపాన్ని రేపకూడదు.
Colossians 3:23
విశ్వాసులు ఏది చేసినా అది ఎవరి కోసం పని చేస్తున్నారు?
విశ్వాసులు వారు ఏమి చేసినా అది ప్రభువు కొరకు చేస్తున్నారు.
Colossians 3:24
విశ్వాసులు ఏది చేసినా అది ఎవరి కోసం పని చేస్తున్నారు?
విశ్వాసులు వారు ఏమి చేసినా అది ప్రభువు కొరకు చేస్తున్నారు.
ప్రభువును సేవించే వారు ఏ పని చేసినా వారు ఏమి పొందుతారు?
ప్రభువును సేవించే వారు ఏ పని చేసినా వారు ఏమి స్వాస్థ్యం యొక్క బహుమానాన్ని పొందుతారు?
Colossians 3:25
దుర్నీతిని జరిగించే వారు ఏమి పొందుతారు?
దుర్నీతిని జరిగించే వారు తాము చేసిన దానికి తగిన శిక్ష అనుభవిస్తారు.
Colossians 4
Colossians 4:1
భూలోక యజమానులకు కూడా ఎవరు ఉన్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు?
భూలోక యజమానులకు కూడా ఒక యజమాని ఉన్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు?
Colossians 4:2
కొలొస్సయులు దేనిలో స్థిరంగా కొనసాగాలని పౌలు కోరుతున్నాడు?
కొలొస్సయులు ప్రార్థనలో స్థిరంగా కొనసాగాలని పౌలు కోరుతున్నాడు.
Colossians 4:3-4
కొలొస్సయులు దేని కొరకు ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు?
క్రీస్తు యొక్క మర్మమైన వాక్యాన్ని మాట్లాడేందుకు తనకు తెరువబడిన ద్వారం కలిగి యుండేలా కొలొస్సయులు ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు.
Colossians 4:5
బయటి వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలని పౌలు కొలొస్సయులకు సూచించాడు?
వివేకంతో జీవించమని మరియు బయటి వ్యక్తుల పట్ల కృపాభరితంగా మాట్లాడాలని వారికి పౌలు సూచించాడు.
Colossians 4:6
బయటి వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలని పౌలు కొలొస్సయులకు సూచించాడు?
వివేకంతో జీవించమని మరియు బయటి వ్యక్తుల పట్ల కృపా భరితంగా మాట్లాడాలని వారికి పౌలు సూచించాడు.
Colossians 4:7
తుకికు మరియు ఒనేసిములకు ఏ పనిని పౌలు అప్పగించాడు?
కొలొస్సయులకు తన గురించిన ప్రతి విషయాన్ని తెలియజేసే పనిని పౌలు వారికి అప్పగించాడు.
Colossians 4:8
తుకికు మరియు ఒనేసిములకు ఏ పనిని పౌలు అప్పగించాడు?
కొలొస్సయులకు తన గురించిన ప్రతి విషయాన్ని తెలియజేసే పనిని పౌలు వారికి అప్పగించాడు.
Colossians 4:9
తుకికు మరియు ఒనేసిములకు ఏ పనిని పౌలు అప్పగించాడు?
కొలొస్సయులకు తన గురించిన ప్రతి విషయాన్ని తెలియజేసే పనిని పౌలు వారికి అప్పగించాడు.
Colossians 4:10-11
బర్నబా బంధువైన మార్కు గురించి పౌలు ఏ సూచనలు ఇచ్చాడు?
అతడు కొలొస్సయుల దగ్గరకు వచ్చినప్పుడు మార్కును స్వీకరించమని చెప్పాడు.
Colossians 4:12-13
కొలొస్సయుల విషయంలో ఎపఫ్రా దేని కోసం ప్రార్థించాడు?
కొలొస్సయులు దేవుని చిత్తమంతటిలో సంపూర్ణంగా నిలబడాలని మరియు పూర్ణంగా నిశ్చయించబడాలని అతడు ప్రార్థిస్తున్నాడు.
Colossians 4:14
పౌలు దగ్గర ఉన్న వైద్యుని పేరు ఏమిటి?
వైద్యుడి పేరు లూకా.
Colossians 4:15
లవొదికయలోని సంఘం ఏ విధమైన స్థలంలో సమావేశమైంది?
లవొదికయలోని సంఘం ఒక సంఘంలో సమావేశమైంది.
Colossians 4:16-17
పౌలు ఏ ఇతర సంఘానికి కూడా పత్రిక రాశాడు?
పౌలు లవొదికయలోని సంఘానికి కూడా ఒక పత్రిక రాశాడు.
Colossians 4:18
ఈ పత్రిక నిజానికి తననుండే వచ్చినదని పౌలు ఏ విధంగా చూపించాడు?
పత్రిక చివరి భాగంలో తన స్వంత చేతివ్రాతతో తన పేరును వ్రాసాడు.