Romans
Romans 1
Romans 1:1-3
పౌలుకు ముందే దేవుడు దేని ద్వారా సువార్తను వాగ్దానం చేసాడు ?
దేవుడు ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసాడు(1:1-2).
శరీరమును బట్టి దేవుని కుమారుడు ఎవరి సంతానముగా పుట్టాడు ?
శరీరమును బట్టి దేవుని కుమారుడు దావీదు సంతానముగా పుట్టాడు. (1:3)
Romans 1:4-7
దేని ద్వారా యేసు క్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించ బడ్డాడు ?
యేసు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు(1:4)
ఏ ఉద్దేశం కొరకు పౌలు కృపను, అపోస్తలత్వం పొందాడు ?
సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా పౌలు కృపను, అపోస్తలత్వం పొందాడు. (1:5)
Romans 1:8-10
రోమాలో ఉన్న విశ్వాసుల విషయములో దేని కొరకు పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ?
వారి విశ్వాసము సర్వ లోకమునకు ప్రచురము చేయబడింది గనుక పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు (1:8).
Romans 1:11-12
రోమాలో ఉన్న విశ్వాసులను పౌలు ఎందుకు చూడ గోరాడు ?
వారు స్థిరపరచ బడేలా వారికి ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వడానికి పౌలు చూడగోరాడు. (1:11)
Romans 1:13-15
పౌలు ఇది వరకు రోమాలోని విశ్వాసులను ఎందుకు దర్శించ లేకపోయాడు ?
ఇది వరకు ఆటంకం కలిగిన కారణంగా రోమాలోని విశ్వాసులను పౌలు దర్శించలేక పోయాడు(1:13)
Romans 1:16-17
సువార్తను గురించి పౌలు ఏమి చెబుతున్నాడు ?
నమ్ము ప్రతివానికి సువార్త దేవుని శక్తియై యున్నది అని పౌలు చెపుతున్నాడు.(1:16)
నీతి మంతుడు ఏ విధంగా జీవిస్తాడు అనే డానికి ఏ లేఖనాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు ?
"నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు" అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు (1:17)
Romans 1:18-19
దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది భక్తి హీనులకు, అనీతిమంతులకు విశదపరచ బడినపుడు వారు ఏమి చేస్తారు ?
దేవుని గూర్చి తెలియశక్యమైనది విశదపరచ బడినపుడు భక్తి హీనులు, అనీతిమంతులు దానిని దుర్నీతి చేత అడ్డగిస్తారు. (1:18-19)
Romans 1:20-21
దేవుని అదృశ్య లక్షణములు ఏ విధంగా తేటపడుతున్నాయి ?
దేవుని అదృశ్య లక్షణములు సృష్టింపబడిన వస్తువుల ద్వారా తేటపడుతున్నాయి. (1:20)
తేటపడుతున్న దేవుని అదృశ్య లక్షణములు ఏవి ?
ఆయన నిత్యశక్తి, దేవత్వము తేటపడుతున్నాయి. (1:20)
దేవుని మహిమ పరచక, ఆయనకు కృతజ్ఞత చెల్లించని వారి హృదయాలకు, తలంపులకు ఏమి జరుగుతుంది ?
దేవుని మహిమ పరచక, ఆయనకు కృతజ్ఞత చెల్లించని వారు తమ ఆలోచనలలో వ్యర్థులయ్యారు, వారి హృదయాలు అంధకారమయ్యాయి. (1:21)
Romans 1:22-25
దేవుని మహిమను క్షయమగు మనుష్యుల, జంతువుల ప్రతిమాస్వరూపముగా మార్చిన వారిని దేవుడు ఏమి చేస్తాడు ?
వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. (1:23-24)
Romans 1:26-27
ఏ నీచమైన కోరికల కొరకు ఈ స్త్రీ పురుషులు కామతప్తులయ్యారు ?
స్త్రీలు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు, పురుషులు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు. (1:26-27)
Romans 1:28
తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లని వారికి దేవుడు ఏమి చేస్తాడు ?
తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లని వారిని చేయ రాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ఠ మనస్సుకు వారిని అప్పగించాడు. (1:28)
Romans 1:29-31
భ్రష్ఠమనస్సు కలిగిన వారి లక్షణాలు కొన్ని ఏమిటి ?
భ్రష్ఠ మనస్సు కలిగిన వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండి యుంటారు. (1:29)
Romans 1:32
భ్రష్ఠ మనస్సు కలిగిన వారు దేవుని న్యాయ విధిని ఎలా అర్ధం చేసుకున్నారు ?
భ్రష్ఠ మనస్సు కలిగి ఇట్టి కార్యములు చేయువారు తాము మరణమునకు తగినవారు అని అర్ధం చేసుకున్నారు. (1:32)
భ్రష్ఠ మనస్సు కలిగి దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి యుండికూడా వారు ఏమి చేస్తున్నారు?
ఎరిగి యుండి కూడా అవినీతి కార్యాలే చేయుచున్నారు, వాటిని అభ్యసించు వారితో సమ్మతించుచున్నారు (1:32)
Romans 2
Romans 2:1-2
ఎందుకు కొందరు తీర్పు తీర్చునప్పుడు సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు ?
దేని విషయములో ఇతరులకు తీర్పు తీర్చుచున్నారో అట్టి కార్యములనే వారు చేయుచున్నారు గనుక వారు తీర్పు తీర్చునప్పుడు సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు(2:1)
దుర్నీతిని చేయువారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు ?
దుర్నీతిని చేయువారిని దేవుడు సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు(2:2)
Romans 2:3-4
దేవుని సహనము, అనుగ్రహము ఏమి చెయ్యాలని ప్రేరేపిస్తుంది ?
దేవుని సహనము, అనుగ్రహము మారుమనస్సు పొందుటకు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. (2:4)
Romans 2:5-7
దేవుని విషయమై కఠినులైన, మార్పు పొందని వారు ఏమి సమకూర్చుకొంటున్నారు ?
దేవుని విషయమై కఠినులైన, మార్పు పొందని వారు దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినమందు దేవుని ఉగ్రతను సమకూర్చుకొంటున్నారు. (2:5)
సత్క్రియలు ఓపికగా చేయు వారు ఏమి పొందుతారు?
సత్క్రియలు ఓపికగా చేయు వారు నిత్య జీవమును పొందుతారు. (2:7)
Romans 2:8-9
దుర్నీతికి లోబడు వారు ఏమి పొందుతారు ?
దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయి, వారికి శ్రమ, వేదన కలుగుతాయి. (2:8-9)
Romans 2:10-12
యూదునికి గ్రీసు జాతి వాడికి దేవుని తీర్పు నిష్పక్షపాతాన్ని ఏ విధంగా చూపిస్తాడు ?
యూదునికి గ్రీసు జాతి వాడికి దేవుని తీర్పు విషయంలో ఏ పక్షపాతం చూపడు. పాపం చేస్తే ఇద్దరూ నశిస్తారు (2:12).
Romans 2:13-16
దేవుని ఎదుట నీతిమంతులు గా ఎంచబడినవాడు ఎవరు ?
ధర్మ శాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచ బడుదురు. (2:13)
అన్యుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలు తన హృదయములో రాయబడినట్టు ఏవిధంగా చూపించగలడు ?
ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసిన యెడల అన్యుడు ధర్మశాస్త్రంతన హృదయములో రాయబడినట్టు చూపించ గలడు (2:14-15)
Romans 2:17-20
ధర్మ శాస్త్రమును ఆశ్రయించి దానిని ఇతరులకు బోధించు యూదులకు పౌలు ఎలాంటి సవాలు చేస్తున్నాడు ?
ధర్మ శాస్త్రమును ఆశ్రయించి దానిని ఇతరులకు బోధించు యూదులు తమకు తాము బోధించుకోవాలని పౌలు సవాలు చేస్తున్నాడు. (2:17-21)
Romans 2:21-22
ధర్మ శాస్త్రమును బోధించు యూదులు ఏఏ పాపాలను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు ?
దొంగతనము, వ్యభిచారం, గుళ్ళను దోచుకోవడం లాంటి పాపాలను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు. (2:21-22)
Romans 2:23-24
యూదా ఉపదేశకులను బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య ఎందుకు అవమానపరచ బడుతుంది ?
యూదా ఉపదేశకులు ధర్మ శాస్త్రమును మీరుట వలన దేవుని నామము అన్యజనుల మధ్య అవమానపరచ బడుతుంది (2:23-24)
Romans 2:25-27
ఏ విధంగా ఒక యూదుని సున్నతి సున్నతి కాక పోవును అని పౌలు చెపుతున్నాడు ?
ఒక యూదుడు ధర్మ శాస్త్రమును అతిక్రమించిన వాడైతే అతని సున్నతి అతనికి సున్నతి కాక పోవును. (2:25)
ఏ విధంగా ఒక సున్నతి లేని అన్యుడు సున్నతి గలవాడుగా ఎంచ బడును అని పౌలు చెపుతున్నాడు ?
సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులు గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతి గలవాడుగా ఎంచ బడును. (2:26)
Romans 2:28-29
నిజమైన యూదుడు ఎవరని పౌలు చెబుతున్నాడు ?
హృదయ సంబంధమైన సున్నతి కలిగి అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని పౌలు చెపుతున్నాడు. (2:28-29)
నిజమైన యూదుడు ఎవరి వలన మెప్పు పొందును ?
నిజమైన యూదుడు దేవుని వలననే మెప్పు పొందును. (2:29)
Romans 3
Romans 3:1-2
యూదులకు కలిగిన గొప్పతనములలో మొదటిది ఏది ?
యూదులకు కలిగిన గొప్పతనములలో మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడడమే. (3:1-2)
Romans 3:3-4
ప్రతి మనుష్యుడు అబద్దికుడు అయినప్పటికిని దేవుడు ఏ విధంగా కనిపిస్తున్నాడు ?
ప్రతి మనుష్యుడు అబద్దికుడు అయినప్పటికిని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. (3:4)
Romans 3:5-6
దేవుడు నీతిమంతుడు కనుక ఆయన ఏమి చెయ్యగలడు ?
దేవుడు నీతిమంతుడు కనుక ఆయన లోకమునకు తీర్పు తీర్చ గలడు. (3:5-6)
Romans 3:7-8
"మేలు కలుగుట కొరకు మనము కీడు చేయుదము" అని చెప్పువారి మీదకు ఏమి వచ్చును ?
"మేలు కలుగుటకు మనము కీడు చేయుదము" అని చెప్పువారి మీదకు తీర్పు వచ్చును (3:8)
Romans 3:9-10
యూదులు, గ్రీసు దేశస్తులు మనుష్యులందరి నీతిని గురించి లేఖనాలలో ఏమి రాసి ఉంది ?
నీతి మంతుడు లేదు, ఒక్కడును లేడు అని రాసి ఉంది. (3:9-10)
Romans 3:11-18
రాసి ఉన్న దాని ప్రకారం గ్రహించు వాడు, దేవుని వెదకు వాడు ఎవరు ?
రాసి ఉన్న దాని ప్రకారం గ్రహించు వాడు లేడు, దేవుని వెదకు వాడు లేడు. (3:11)
Romans 3:19-20
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు ?
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చ బడడు.(3:20)
ధర్మశాస్త్రంమూలముగా ఏమి కలుగుతుంది ?
ధర్మశాస్త్రంమూలముగా పాపమనగా ఎట్టిదో తెలియు చున్నది. (3:20)
Romans 3:21-22
ధర్మశాస్త్రమునకు వేరుగా ఏ సాక్ష్యము ద్వారా దేవుని నీతి బయలు పడుచున్నది ?
ధర్మశాస్త్రమును, ప్రవక్తల సాక్ష్యము చేత ఇపుడు దేవుని నీతి బయలు పడుచున్నది. (3:21)
ధర్మశాస్త్రంలేకయే ఏ నీతి ఇపుడు బయలుపడు చున్నది ?
ధర్మశాస్త్రంలేకయే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి దేవుని నీతి బయలు పడు చున్నది. (3:22)
Romans 3:23-24
దేవుని యెదుట ఒక వ్యక్తి ఏ విధంగా నీతి మంతుడిగా తీర్చబడతాడు ?
నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చ బడుతున్నాడు. (3:24)
Romans 3:25-26
ఏ ఉద్దేశం కొరకు దేవుడు క్రీస్తు యేసును అనుగ్రహించాడు ?
క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా అనుగ్రహించాడు (3:25)
జరిగిన దానంతటిని బట్టి యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఏమి కనుపరచెను ?
యేసునందు విశ్వాసము గలవానిని నీతి మంతునిగా తీర్చువాడునై యుండుటకు అయన అలా చేశాడు. (3:26)
Romans 3:27-28
నీతిమంతునిగా తీర్చ బడుటలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వంతు ఏమిటి ?
ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుచున్నాడు. (3:28)
Romans 3:29-30
సున్నతి పొందిన యూదుని, సున్నతి లేని అన్యజనులను దేవుడు ఏ రీతిగా నీతిమంతులనుగా తీర్చుచున్నాడు ?
ఇద్దరినీ దేవుడు విశ్వాసము ద్వారా దేవుడు నీతిమంతులనుగా తీర్చుచున్నాడు (3:30)
Romans 3:31
విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రమును ఏమి చేయుచున్నాము ?
విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రమును స్థిర పరచుచున్నాము. (3:31)
Romans 4
Romans 4:1-3
అబ్రాహాము అతిశయించడానికి ఏ కారణం ఉండియుండవచ్చు ?
అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చ బడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును. (4:2)
అబ్రాహాము నీతిమంతుడుగా తీర్చబడుటను గూర్చి లేఖనము ఏమి చెపుతున్నది ?
అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచ బడెను అని లేఖనము చెప్పుచున్నది. (4:3)
Romans 4:4-5
ఎటువంటి వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు ?
భక్తి హీనులను దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. (4:5)
Romans 4:6-8
దావీదు చెప్పిన ప్రకారం మనుష్యుడు ఏ విధంగా దేవుని చేత దీవించ బడతాడు ?
దావీదు చెప్పిన ప్రకారం, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తనపాపంలకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ప్రభువు చేత దీవించ బడినవాడు. (4:6-8)
Romans 4:9-10
అబ్రాహాము విశ్వాసము అతను సున్నతి పొందడానికి ముందు నీతిగా ఎంచ బడినదా లేక సున్నతి పొందిన తరువాత ఎంచ బడినదా ?
అబ్రాహాము విశ్వాసము అతను సున్నతి పొందడానికి ముందే నీతిగా ఎంచబడినది. (4:9-10)
Romans 4:11-12
ఏ గుంపు ప్రజలకు అబ్రాహాము తండ్రి గా ఉన్నాడు ?
సున్నతి పొందిన వారైనను, సున్నతి పొందని వారైనను విశ్వసించు ప్రతివారికీ అబ్రాహాము తండ్రి గా ఉన్నాడు. (4:11-12)
Romans 4:13-15
విశ్వాసము వలనైన నీతి ద్వారా అబ్రాహాము సంతానమునకు ఏ వాగ్దానము ఇవ్వబడినది ?
విశ్వాసము వలనైన నీతి ద్వారా లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహాము సంతానమునకు ఇవ్వబడినది. (4:13)
లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మ శాస్త్రంవలన కలిగినదైతే ఏమి జరుగుతుంది ?
లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మ శాస్త్రంవలన కలిగినదైతే విశ్వాసము వ్యర్ధమగును, వాగ్దానమును నిరర్ధకమగును. (4:14)
Romans 4:16-17
విశ్వాస మూలముగా వాగ్దానము ఇవ్వబడుటకు కారణాలు ఏమిటి ?
కృప చేత, దృఢం కావలెనని వాగ్దానము విశ్వాస మూలముగా ఇవ్వబడింది. (4:16)
దేవుడు చేసే ఏ రెండు కార్యాలను పౌలు చూపిస్తున్నాడు ?
దేవుడు మృతులను సజీవులనుగా చేస్తాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. (4:17)
Romans 4:18-19
అనేకులకు తండ్రి అవుతాడని దేవుని వాగ్దానమును నమ్మడానికి అబ్రాహామును కష్టపెట్టిన బాహ్య పరిస్తితులేవి ?
దేవుడు అబ్రహముకు వాగ్దానము చేసినపుడు అబ్రాహాము రమారమి నూరేండ్ల ప్రాయము గలవాడు, శారా గర్భము మృతతుల్యమైనదిగా ఉంది. (4:18-20)
Romans 4:20-22
ఈ బాహ్య పరిస్తితులు ఉన్నప్పటికిని దేవుని వాగ్దానముకు అబ్రాహాము ఎలా స్పందిచాడు ?
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని విశ్వసించాడు. (4:18,20)
Romans 4:23-25
ఎవరి నిమిత్తము అబ్రాహాము వృత్తాంతము రాయబడింది ?
అబ్రాహాము వృత్తాంతము అతని నిమిత్తమును, మన నిమిత్తమును రాయబడింది. (4:23-24)
దేవుడు మనకు ఏమి చేశాడని మనము నమ్ముతున్నాము ?
దేవుడు మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపెనని, ఆయన మన అపరాధంల నిమిత్తము అప్పగించబడ్డాడని, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెనని నమ్ముతున్నాము. (4:25)
Romans 5
Romans 5:1-2
విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు ఏమి కలిగి యున్నారు ?
విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడినకారణంగా విశ్వాసులు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యున్నారు. (5:1)
Romans 5:3-7
శ్రమలు కలుగ చేసే మూడు అంశాలు ఏమిటి ?
శ్రమ సహనమును, అనుభవాన్ని, ఆశాభావాన్ని కలిగిస్తుంది. (5:3-4)
Romans 5:8-9
దేవుడు మన యెడల తన ప్రేమను ఏవిధంగా ఋజువు చేసాడు ?
దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయాడు. (5:8)
క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు దేనినుండి రక్షించ బడ్డారు ?
క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు దేవుని ఉగ్రత నుండి రక్షించ బడ్డారు. (5:9)
Romans 5:10-11
యేసు ద్వారా అవిశ్వాసులైన వారు దేవుని తో సమాధాన పరచ బడక మునుపు ఏమై యున్నారు ?
యేసు ద్వారా అవిశ్వాసులైన వారు దేవుని తో సమాధాన పరచ బడక మునుపు శత్రువులు గా ఉన్నారు. (5:10)
Romans 5:12-13
ఒక మనుష్యునిపాపం వలన ఏమి జరిగింది ?
ఒక మనుష్యుని ద్వారాపాపంను,పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను, మరణంఅందరికీ వాటిల్లింది. (5:12)
Romans 5:14-15
ఎవని ద్వారాపాపం లోకములో ప్రవేశించిందో ఆ మనుష్యుడు ఎవరు ?
ఆదాము అను మనుష్యుని ద్వారాపాపం లోకములోనికి ప్రవేశించినది. (5:14)
దేవుని కృపావరం ఆదాము అపరాధంనకు భిన్నంగా ఉంది ?
ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు, అయితే దేవుని కృపావరం అనేకులకు విస్తరించింది. (5:15)
Romans 5:16-17
ఆదాము అపరాధం నుండి ఏమి కలిగింది, దేవుని కృపావరం నుండి ఏమి కలిగింది ?
ఆదాము అపరాధం నుండి శిక్షా విధి కలిగినది, దేవుని కృపావరం మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణ మాయెను. (5:16)
ఆదాము అపరాధం నుండి ఏలినది ఏది, దేవుని కృపావరం నుండి ఏమి ఏలినది ?
ఆదాము అపరాధం నుండి మరణంఏలినది, దేవుని కృపావరం పొండువారు జీవము గలవారై యేసు క్రీస్తు ద్వారా ఏలుదురు. (5:17)
Romans 5:18-19
ఆదాము అవిధేయత వలన అనేకులు ఏమి చేయబడతారు, క్రీస్తు విధేయత వలన అనేకులు ఏమి చేయ బడతారు ?
ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏమి చేయబడ్డారు, క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయ బడ్డారు. (5:19)
Romans 5:20-21
ఎందుకు ధర్మశాస్త్రంప్రవేశించింది ?
అపరాధం విస్తా రించు నట్లుగా ధర్మ శాస్త్రంప్రవేశించింది. (5:20)
అపరాధం కంటే ఎక్కువగా ఏది విస్తరించింది ?
దేవుని కృప అపరాధం కంటే ఎక్కువగా విస్తరించింది. (5:20)
Romans 6
Romans 6:1-3
కృప విస్తరించునట్లుగా విశ్వాసులుపాపంలో కొనసాగుతారా ?
అలా ఎప్పటికి జరగకూడదు. (6:1-2)
క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన వారు దేనిలోకి బాప్తిస్మము పొందారు ?
క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన వారు ఆయన మరణంలోకి బాప్తిస్మము పొందారు. (6:3)
Romans 6:4-5
క్రీస్తు మృతులలో నుండి లేపబడినందు వలన విశ్వాసులు ఏమి చేయాలి ?
విశ్వాసులు నూతన జీవము గలవారై నడుచుకోవాలి. (6:4)
బాప్తిస్మము ద్వారా ఏ రెండు విషయాలలో విశ్వాసులు క్రీస్తుతో ఐక్య పరచ బడ్డారు ?
బాప్తిస్మము ద్వారా అయన మరణము, పునరుద్ధానము లలో విశ్వాసులు క్రీస్తుతో ఐక్య పరచ బడ్డారు. (6:5)
Romans 6:6-7
మనమిక మీదట పాపానికిదాసులము కాకుండు నట్లు మనకు ఏమి జరిగింది ?
మనమిక మీదట పాపానికిదాసులము కాకుండు నట్లు మన ప్రాచీన పురుషుడు క్రీస్తు తో సిలువ వేయబడ్డాడు, (6:6)
Romans 6:8-9
మరణమునకు క్రీస్తు మీద ఆధిపత్యము లేదనే విషయము మనము ఎలా తెలుసుకోగాలము ?
క్రీస్తు మరణంలోనుండి లేచినకారణంగా మరణం ఆయన మీద ప్రభుత్వము చేయదు. (6:9)
Romans 6:10-11
క్రీస్తుపాపం విషయమై ఎన్ని సార్లు చనిపోయెను, ఎంతమంది కొరకు ఆయన చనిపోయెను ?
క్రీస్తుపాపం విషయమై ఒక్క సారే అందరికొరకు చనిపోయాడు. (6:10)
పాపం విషయములో తన గురించి ఏ విధంగా ఎంచు కోవాలి ?
పాపం విషయములో ఒక విశ్వాసి మృతునిగా ఎంచు కోవాలి. తన గురించి ఏ విధంగా ఎంచు కోవాలి (6:10-11)
ఎవరి కొరకు ఒక విశ్వాసి జీవించాలి ?
ఒక విశ్వాసి దేవుని కొరకు జీవించాలి. (6:10-11)
Romans 6:12-14
ఒక విశ్వాసి ఎవరి కొరకు తన అవయవములను సమర్పించు కోవాలి, ఏ ఉద్దేశం కొరకు ?
ఒక విశ్వాసి తన అవయవములను దేవునికి నీతి కొరకు సాధనములుగా సమర్పించు కోవాలి. (6:13)
పాపంమీద ఏలునట్లు ఒక విశ్వాసి దేనికి లోని ఉండాలి ?
పాపంమీద ఏలునట్లు ఒక విశ్వాసి కృపకు లోనైనా వాడిగా ఉంటాడు. (614)
Romans 6:15-21
పాపానికితనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం ఏమిటి ?
పాపానికితనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం మరణం. (6:16,21)
దేవునికి తనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం ఏమిటి ?
దేవునికి తనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం నీతి. (6:16,18-19)
Romans 6:22-23
దేవుని దాసులైనవారి ఫలము ఏ ఉద్దేశం కొరకు వారు కలిగి ఉంటారు ?
దేవుని దాసులైనవారి ఫలము పరిశుద్ధత కొరకే. (6:22)
పాపమంకు వచ్చు జీత మేమి ?
పాపం కు వచ్చు జీతము మరణము. (6:23)
దేవుని కృపావరం ఏమిటి ?
దేవుని కృపావరం నిత్య జీవము. (6:23)
Romans 7
Romans 7:1
ధర్మ శాస్త్రంఎంత కాలము ఒక మనుష్యుని మీద ప్రభుత్వము చేస్తుంది ?
ఒక మనుష్యుడు బ్రతికినంత కాలము అతని మీద ప్రభుత్వము చేస్తుంది. (7:1)
Romans 7:2-3
ధర్మశాస్త్రం వలన వివాహమైన స్త్రీ ఎంత కాలము బద్ధురాలై ఉంటుంది ?
ధర్మశాస్త్రం వలన వివాహమైన స్త్రీ భర్త బ్రతికినంతకాలము అతనికే బద్ధురాలై ఉంటుంది. (7:2)
ధర్మ శాస్త్రం నుండి ఒకసారి విడుదల పొందిన తరువాత ఆ స్త్రీ ఏమి చెయ్య వచ్చును ?
ధర్మ శాస్త్రం నుండి ఒకసారి విడుదల పొందిన తరువాత ఆ స్త్రీ వేరొక పురుషుని వివాహం చేసికొన వచ్చును. ఏమి చెయ్య వచ్చును. (7:3)
Romans 7:4-6
విశ్వాసులు ధర్మ శాస్త్రమునకు ఏ విధముగా మృతులయ్యారు ?
క్రీస్తు శరీరము ద్వారా విశ్వాసులు ధర్మ శాస్త్రమునకు మృతులయ్యారు. (7:4)
ధర్మ శాస్త్రమునకు మృతులయిన విశ్వాసులు ఏమి చెయ్య గలిగారు ?
ధర్మ శాస్త్రమునకు మృతులయిన విశ్వాసులు క్రీస్తును చేర గలిగారు. (7:4)
Romans 7:7-10
ధర్మ శాస్త్రంయొక్క పని ఏమిటి ?
ధర్మ శాస్త్రంపాపమును తెలియ పరచుచున్నది. (7:7)
ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం ఏమి చేస్తుంది ?
ఆజ్ఞను హేతువు చేసుకొనిపాపం సకలవిధములైన దురాశలను పుట్టిస్తుంది. (7:8)
Romans 7:11-12
ధర్మ శాస్త్రం పాపమా లేక పరిశుద్ధమా ?
ధర్మ శాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధ మైనది,నీతి గలది, ఉత్తమమైనదియునై ఉన్నది. (7:7,12)
Romans 7:13-14
పాపం తనకు ఏమి చేసినదని పౌలు చెపుతున్నాడు ?
పాపం ధర్మ శాస్త్రంద్వారా అతనికి మరకరమైనదని పౌలు చెపుతున్నాడు. (7:13)
Romans 7:15-16
పౌలు ధర్మశాస్త్రముతో అది శ్రేస్టమైనదని ఒప్పుకొనునట్లు చేయడానికి కారణమేమిటి ?
పౌలు తాను ఇచ్చయింపని తాను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేస్టమైనదని ఒప్పుకొనుచున్నాడు. (7:16)
Romans 7:17-18
పౌలు చేయుచున్న వాటిని, చేయ గోరని పనులను ఎవరు చేయుచున్నారు ?
పౌలు చేయుచున్న, చేయ గోరని పనులను తనలో నివసించు చున్న పాపమే చేయుచున్నాది. (7:17,20)
పౌలు శరీరములో ఎవరు నివసించుచున్నారు ?
తన శరీరమందు మంచిది ఏదీ నివసించదు. (7:18)
Romans 7:19-23
తనలో క్రియ చేయుచున్న ఏ నియమమును పౌలు కనుగొన్నాడు ?
మేలు చేయగోరు తనకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము పౌలుకి కనబడు చున్నది. (7:21-23)
Romans 7:24-25
తన అంతరంగ పురుషునిలో పౌలు చూచిన నియమము ఏది, తన శరీర అవయములలో ఉన్న నియమము ఏది ?
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మ సాస్త్రమునండు పౌలు ఆనందించుచున్నాడు, అయితే తన అవయములలో నున్న పాపనియమము పౌలును చెరపట్టి లోబరచు కొనుచున్నది. (7:23,25)
మరణమునకు లోనైన శరీరమును నుండి పౌలుని ఎవరు విడిపించ గలరు ?
పౌలు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అయన విడుదల కొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు. (7:25)
Romans 8
Romans 8:1-2
పాపమరణ నియమము నుండి పౌలును విడిపించినది ఏది ?
క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమము నుండి పౌలును విడిపించినది. (8:2)
Romans 8:3-5
ధర్మ శాస్త్రంపాపమరణ నియమము ఎందుకు విడిపించ లేక పోయింది ?
ధర్మ శాస్త్రంశరీరము ద్వారా బలహీనమైనది కనుక చేయ్య లేక పోయింది. (8:3)
ఆత్మానుసారులైన మనుష్యులు దేని మీద తమ మనసు నుంచుతారు ?
ఆత్మాను సారులైన మనుష్యులు ఆత్మ సంబంధమైన వాటి మీద తమ మనసు నుంచుతారు(8:4-5)
Romans 8:6-8
శరీరానుసారమైన మనసుకు దేవునితోను, ధర్మసాస్త్రముతోను ఎలాంటి సంబంధం ఉంటుంది ?
శరీరానుసారమైన మనసుకు దేవునికి విరోధమై యున్నది, అది ధర్మ శాస్త్రమునకు లోబడదు. (8:7)
Romans 8:9-10
దేవునికి చెందని వారికి ఏమి కొదువగా ఉంటుంది ?
క్రీస్తు ఆత్మ దేవునికి చెందని వారిలో నివసించడు. (8:9)
Romans 8:11
చావునకు లోనైన విశ్వాసుల శరీరములకు దేవుడు తన జీవాన్ని ఎలా ఇస్తాడు ?
చావునకు లోనైన విశ్వాసుల శరీరములలో దేవుడు తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇస్తాడు, ఆ ఆత్మ విశ్వాసిలో నివసిస్తాడు. (8:11)
Romans 8:12-13
దేవుని కుమారులు జీవించ డానికి ఏ విధంగా నడిపించ బడతారు ?
దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించ బడతారు. (8:13-14)
Romans 8:14-15
ఒక విశ్వాసి దేవుని ఇంటిలో ఎలా కలుపబదతాడు ?
దత్తత ద్వారా ఒక విశ్వాసి దేవుని ఇంటిలో ఎలా కలుపబడతాడు. (8:15).
Romans 8:16-17
దేవుని కుమారులుగా దేవుని ఇంటిలో విశ్వాసులు పొండుకొనే ఇతర ప్రయోజనాలు ఏవి ?
దేవుని కుమారులుగా దేవుని ఇంటిలో విశ్వాసులు దేవుని వారసులుగా ఉంటారు, క్రీస్తు తోడి వారసులుగా ఉంటారు. (8:17)
Romans 8:18-19
ప్రస్తుత కాల శ్రమలను ఎందుకు విశ్వాసులు సహించాలి ?
దేవుని కుమారులు ప్రత్యక్ష్య పరచ బదడినపుడు క్రీస్తు తో మహిమ పరచ బడుటకై ప్రస్తుత కాల ఈ శ్రమలను సహించాలి. (8:17-19)
Romans 8:20-22
ప్రస్తుత కాలమందు సృష్టి ఏ విధమైన దాస్యములో ఉన్నది ?
ప్రస్తుత కాలమందు సృష్టి వ్యర్ధ పరచబడు దాస్యములో ఉన్నది. (8:21)
దేనిలోనికి వెళ్ళడానికి సృష్టి విడిపించ బడుతుంది ?
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము లోనికి విడిపించబడబోతుంది. (8:21)
Romans 8:23-25
దేహముల విమోచనము కొరకు విశ్వాసులు ఎలా ఎదురు చూడాలి ? ?
దేహముల విమోచనము కొరకు విశ్వాసులు నిరీక్షణ తోను ఒపికతోను కనిపెట్టాలి. (8:23-25)
Romans 8:26-27
పరిశుద్దుల బలహీనతలో సహాయం చెయ్యాడానికి ఆత్మ తానే ఏమి చేస్తాడు ?
పరిశుద్దుల బలహీనతలో సహాయం చెయ్యాడానికి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తాడు. (8:26-27)
Romans 8:28-30
దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగేలా దేవుడు ఎలా పనిచేస్తాడు ?
దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేలా దేవుడు పనిచేస్తాడు. (8:28)
దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారికి ఏ గమ్యాన్ని ముందుగా నిర్ణయించాడు ?
దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (8:29)
దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనొ వారికి దేవుడింకా ఏమి చేస్తాడు ?
దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనొ వారిని పిలిచాడు, నీతిమంతులుగా చేసాడు, మహిమ పరచాడు. (8:30)
Romans 8:31-32
దేవుడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడని విశ్వాసులు ఎలా తెలుసుకుంటారు ?
మన అందరి కొరకు దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు కనుక దేవుడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడని విశ్వాసులు తెలుసుకుంటారు. (8:32)
Romans 8:33-34
దేవుని కుడిపార్స్వమున క్రీస్తు యేసు ఏమి చేయుచున్నాడు ?
దేవుని కుడిపార్స్వమున క్రీస్తు యేసు మన కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు. (8:34)
Romans 8:35-36
శ్రమల లోను, హింసలలోను, మరణములో సహితము విశ్వాసులు అత్యధిక విజయాన్ని ఎలా పొందుతున్నారు ?
విశ్వాసులు తమను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నారు. (8:35-37)
Romans 8:37-39
సృష్టింప బడిన ఏదైనను విశ్వాసిని ఏమీ చెయ్యలేదని పౌలు రూడిగా నమ్మిన దేమిటి ?
సృష్టింప బడిన ఏదైనను విశ్వాసిని దేవుని ప్రేమ నుండి వేరు పరచ లేదని పౌలు రూడిగా ఒప్పించా బడ్డాడు, నమ్మాడు. (8:39)
Romans 9
Romans 9:1-2
పౌలు ఎందుకు బహు దుఃఖము, మానని వేదన కలిగి యున్నాడు ?
దేహసంబందులైన అతని సహోదరులు, ఇశ్రాయేలీయుల కొరకు పౌలు బహు దుఃఖము, మానని వేదన కలిగి యున్నాడు. (9:1-4)
Romans 9:3-5
ఇశ్రాయేలీయులు తమ చరిత్ర లో ఏమి కలిగి యున్నారు ?
దత్త పుత్రత్వమును, మహిమయు, నిబందనలును, ధర్మ శాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలును, వాగ్దానములును వీరివి. (9:4)
Romans 9:6-7
ఇశ్రాయేలులో ఉన్నవారందరు, అబ్రాహాము సంతానమంతయు గురించి యధార్ధము కాదు అని పౌలు చెపుతున్న దేమిటి ?
ఇశ్రాయేలు సంబందులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు అని పౌలు చెపుతున్నాడు. (9:6-7)
Romans 9:8-9
ఎవరు దేవుని పిల్లలుగా ఎంచబడడం లేదు ?
శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. (9:8)
ఎవరు దేవుని పిల్లలుగా ఎంచబడు చున్నారు ?
వాగ్దాన సంబంధులైన పిల్లలు దేవుని సంతానమని ఎంచబడుచున్నారు. (9:8)
Romans 9:10-13
తనకు పిల్లలు పుట్టక మునుపే "పెద్దవాడు చిన్న వానికి దాసుడగును" అని రిబ్కా కు ఇవ్వబడిన మాట వెనుక ఉన్న కారణం ఏమిటి ?
రిబ్కా కు ఇవ్వబడిన మాట వెనుక ఉన్న కారణం ఏమిటి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. (9:10-12)
Romans 9:14-18
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక ఉన్న కారణము ఏమిటి ?
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక కారణం దేవుని సంకల్పం. (9:14-16)
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక కారణం కానిది ఏమిటి ?
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక ఉన్నకారణం పొంద గోరువానిలోనైనను, ప్రయాసపడు వానిలోనైనను కాదు(9:16)
Romans 9:19-21
మనుష్యుల మీద నేరము మోపుచున్న కారణము గా దేవుడు నీతిమంతుడని ప్రశ్నించు వారికి పౌలు ఇస్త్తున్న సమాధానము ఏమిటి ?
"ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవేవడవు ?" అని జవాబిచ్చాడు. (9:20)
Romans 9:22-26
నాశనమునకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు ఏమి చేసాడు ?
నాశనమునకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు దీర్ఘ శాంతముతో సహించాడు. (9:22)
మహిమకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు ఏమి చేసాడు ?
దేవుడు వారికి తన మహిమైస్వర్యమును కనుపరచాడు. (9:23)
ఏ ప్రజలలో నుండి తాను కరుణించిన వారిని దేవుడు పిలిచాడు ?
దేవుడు యూదులలో నుండియూ, అన్య జనులలో నుండియూ తాను కరుణించిన వారిని పిలిచాడు. (9:24)
Romans 9:27-29
ఇశ్రాయేలీయులందరిలోనుండి ఎంత మంది రక్షించ బడుదురు ?
ఇశ్రాయేలీయులందరిలోనుండి శేషమే రక్షించ బడుదురు. (9:27)
Romans 9:30-31
నీతిని వెంటాడని అన్య జనులు దానిని ఏ విధము గా దానిని సాధించారు.
నీతిని వెంటాడని అన్య జనులు దానిని విశ్వాసము వలనైన నీతిని పొందారు. (9:30)
నీతి కారణమైన నియమమును వెంటాడినను ఇశ్రాయేలీయులు దానిని ఎందుకు పొందలేదు ?
నీతి కారణమైన నియమమును విశ్వాస మూలముగా కాకుండా క్రియల మూలముగా వెంటాడిన కారణము చేత ఇశ్రాయేలీయులు దానిని పొందలేదు. (9:31-32)
Romans 9:32-33
దేని విషయములో ఇశ్రాయేలీయులు తొట్రు పడ్డారు ?
ఇశ్రాయేలీయులు అడ్డురాయిని , తొట్రుపాటు బండను తగిలి పడిరి. (9:32-33)
తొట్రు పడకయు విశ్వసించు వారికి ఏమి జరుగుతుంది ?
తొట్రు పడకయు విశ్వసించు వారు సిగ్గుపడరు. (9:33)
Romans 10
Romans 10:1-3
తన సహోదరులు, ఇశ్రాయేలీయుల కొరకు పౌలు కున్న హృదయాభిలాష ఏమిటి ?
ఇశ్రాయేలీయుల కొరకు పౌలు కున్న హృదయాభిలాష వారి రక్షణ. (10:1)
ఇశ్రాయేలీయులు దేనిని స్థాపించాలని చూచుచున్నారు ?
ఇశ్రాయేలీయులు తమ స్వనీతిని స్థాపించాలని చూచుచున్నారు. (10:3)
ఇశ్రాయేలీయులు దేనిని ఎరుగరు ?
ఇశ్రాయేలీయులు దేవుని నీతిని ఎరుగరు (10:3)
Romans 10:4-7
ధర్మ శాస్త్రంవిషయమై క్రీస్తు ఏమై యున్నాడు ?
క్రీస్తు ధర్మశాస్త్రమునాకు సమాప్తియై యున్నాడు(10:4)
Romans 10:8-10
పౌలు ప్రకటించు చున్న విశ్వాస వాక్యము ఎక్కడ ఉన్నది ?
పౌలు ప్రకటించు చున్న విశ్వాస వాక్యము నోటను, హృదయములోను ఉన్నది. (10:8)
ఒక వ్యక్తి రక్షించ బడడానికి ఏమి చెయ్యాలని పౌలు చెపుతున్నాడు ?
ఒక వ్యక్తి యేసు ప్రభువును తన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపేనని హృదయములో విశ్వసించాలి. (10:9)
Romans 10:11-13
ఏమి చేసిన ప్రతివాడును రక్షించ బడతాడు ?
ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షించ బడును. (10:13)
Romans 10:14-15
ఒక వ్యక్తి ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయునట్లు ఆ వ్యక్తి కి సువార్త చేరగలిగిన వివిధ అంశముల గురింఛి పౌలు ఏమి చెప్పాడు ?
ఒక వ్యక్తి ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయునట్లు మొదట ప్రకటించు వారు పంపబడాలి, సువార్త వినిపించ బడాలి, విశ్వసించ బడాలి. (10:14-15)
Romans 10:16-17
విశ్వాసము కలుగునట్లు ఏమి వినిపించ బడాలి ?
విశ్వాసము కలుగునట్లు క్రీస్తును గురించిన మాట వినబడాలి. (10:17)
Romans 10:18
ఇశ్రాయేలీయులు సువార్తను విన్నారా, దానిని తెలుసుకున్నారా ?
అవును ఇశ్రాయేలీయులు సువార్తను విన్నారు, దానిని తెలుసుకున్నారు. (10:18-19)
Romans 10:19
ఇశ్రాయేలీయులకు రోషమును ఎలా కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు ?
తనను వెదకని వారికి ఆయన దొరకడం ద్వారా ఇశ్రాయేలీయులకు రోషమును కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు. (10:19-20)
Romans 10:20-21
దేవుడు ఇస్రాయేలీయులను సమీపించినపుడు ఆయన ఏమి కనుగొన్నాడు ?
దేవుడు ఇస్రాయేలీయులను సమీపించినపుడు ఆయన అవిధేయులై ఎదురాడు ప్రజలను కనుగొన్నాడు. (10:21)
Romans 11
Romans 11:1-3
దేవుడు తన ప్రజలను విసర్జించేనా ?
దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విసర్జించక పోవచ్చును. (11:1)
Romans 11:4-5
నమ్మకమైన ఇశ్రాయేలీయులు మిగిలియున్న యెడల వారు ఏ విధంగా భద్రపరచబడతారని పౌలు చెప్పాడా ?
అలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అని పౌలు చెపుతున్నాడు. (11:5)
Romans 11:6-10
ఇశ్రాయేలీయులలో ఎంత మంది రక్షణను పొందారు, మిగిలిన వారికి ఏమి జరిగింది ?
ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన వారు రక్షణను పొందారు, మిగిలిన వారు కఠినచిత్తులైరి. (11:7)
దేవుడిచ్చిన నిద్ర మత్తు గల మనసు దానిని పొందిన వారికి ఏమి చేసింది ?
నిద్ర మత్తు గల మనసు దానిని పొందిన వారు చూడలేకుండను, వినలేకుండను చేసింది. (11:8,10)
Romans 11:11-16
ఇశ్రాయేలీయులు సువార్తను స్వీకరించడానికి నిరాకరించడము వలన ఏ మేలు జరిగింది ?
రక్షణ అన్య జనుల వద్దకు వచ్చింది. (11:11-12)
Romans 11:17-18
ఒలీవ చెట్టు యొక్క వేరు, ఆడని ఒలీవ కొమ్మ కు సంబంధించిన ఉపమానములో వేరు ఎవరు, అడవి ఒలీవ కొమ్మలు ఎవరు ?
వేరు ఇశ్రాయేలు, అడవి ఒలీవ కొమ్మలు అన్యజనులు. (11:3-14,17)
Romans 11:19-22
అడవి ఒలీవ కొమ్మలు ఎలాంటి వైఖరులను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు ?
అడవి ఒలీవ కొమ్మలు విరిచి వేయబడిన కొమ్మల మీద అతిశయ పడే వైఖరిని విడిచిపెట్టాలని పౌలు చెపుతున్నాడు. (11:18-20)
ఏ హెచ్చరిక ను పౌలు అడవి ఒలీవ కొమ్మలకు ఇచ్చాడు ?
దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని యెడల అవిశ్వాసము లోనికి పడిన యెడల అడవి ఒలీవ కొమ్మలనూ విదడిచిపెట్టడని పౌలు హెచ్చరించుచున్నాడు. (11:20-22)
Romans 11:23-24
స్వాభావిక కొమ్మలు తమ అవిశ్వాసము లో నిలువక పోయిన యెడల దేవుడు ఏమి చేస్తాడు ?
స్వాభావిక కొమ్మలు తమ అవిశ్వాసము లో నిలువక పోయిన యెడల దేవుడు వాటిని ఒలీవ చెట్టుకు అంటు కడతాడు. (11:23-24)
Romans 11:25-27
ఇశ్రాయేలుకు ఉండే కఠిన మనసు ఎంత మట్టుకు ఉంటుంది ?
ఇశ్రాయేలుకు ఉండే కఠిన మనసు అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఉంటుంది. (11:25)
Romans 11:28-29
వారి అవిదేయతలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయులు దేవుని చేత ఎందుకు ప్రేమించ బడుతూనే ఉన్నారు ?
వారి పితరులను బట్టి, దేవుడు తన పిలుపు విషయములో మార్పు లేనివాడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రేమించ బడుతూనే ఉన్నారు. (11:28-29)
Romans 11:30-32
యూదులు, అన్యజనులు దేవుని చేత ఏ విధముగా కనబడు తున్నారు ?
యూదులు, అన్యజనులు అవిదేయులుగా కనబడు తున్నారు. (11:30-32)
అవిధేయులైన వారికి దేవుడు ఏమి కనబరచు చున్నాడు ?
అవిదేయులైన యూదులు, అన్యజనులు ఇద్దరికీ దేవుడు తన కరుణ కనుపరచుచున్నాడు. (11:30-32)
Romans 11:33-34
ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడు ?
ఎవరునూ ప్రభువు మనస్సును ఎరిగలేదు, ఆయనకు ఆలోచన చెప్పలేరు. (11:33-34)
Romans 11:35-36
దేవునికి సమస్తము సంబంధించినవని చెప్పే మూడు విధానాలు ఏవి ?
సమస్తమూ దేవుని నుండి, దేవుని ద్వారా ఆయన నిమిత్తమును కలిగినవి. (11:36)
Romans 12
Romans 12:1-2
విశ్వాసి దేవునికి చేసే ఆత్మీయ సేవ ఏమిటి ?
సజీవ యాగాముగా తనను తాను దేవునికి సమర్పించు కొనుటయే విశ్వాసి దేవునికి చేసే ఆత్మీయ సేవ. (12:1)
విశ్వాసి లో నూతన పరచబడిన మనసు అతనిని ఎలా బలపరుస్తుంది ?
ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్త మేదో తెలుసు కొనునట్లు విశ్వాసిని బల పరుస్తుంది. (12:2)
Romans 12:3
ఒక విశ్వాసి తనను గురించి తాను ఏ విధముగా తలంచ కూడదు ?
ఒక విశ్వాసి తనను తాను ఎంచుకొన తగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొన కూడదు. (12:3)
Romans 12:4-5
క్రీస్తు లో అనేకమైన విశ్వాసులు ఏ విధముగా సంబంధ పరచుకోవాలి ?
అనేకమైన విశ్వాసులు క్రీస్తు లో ఒక్క శరీరము, ఒకరికోకారము ప్రత్యేక అవయవాములై ఉన్నారు. (12:4-5)
Romans 12:6-8
దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కృపావరంలతో ప్రతీ ఒక్క విశ్వాసి ఏమి చెయ్యవలెను ?
ప్రతీ విశ్వాసి తమ విశ్వాస ప్రమాణము చొప్పున వారికివ్వబడిన కృపావరంలను వినియోగించ వలెను. (12:6)
Romans 12:9-10
విశ్వాసులు ఒకరి నొకరు ఏ విధముగా చూచుకొనవలెను ?
విశ్వాసులు ఒకనియందోకరు అనురాగము కలిగి ఒకరినొకరు గౌరవించు కొనవలెను. (12:10)
Romans 12:11-13
పరిశుద్ధుల అవసరముల విషయమై విశ్వాసులు ఏవిధంగా స్పందించాలి ?
విశ్వాసులు పరిశుద్ధుల అవసరముల పాలు పొంపులు పొందాలి. (12:13)
Romans 12:14-16
విశ్వాసులు తమను హింసించు వారి పట్ల ఏవిధముగా ఉండాలి ?
హింసించు వారిని దీవించాలి, శపించ కూడదు. (12:14)
విశ్వాసులు బాధలలో ఉన్నవారి పట్ల ఏవిధముగా ఉండాలి ?
విశ్వాసులు బాధలలో ఉన్నవారిని అంగీకరించాలి. (12:16)
Romans 12:17-18
సాధ్యమైనంత వరకు విశ్వాసులు అందరితో ఎలా ఉండాలి ?
విశ్వాసులు సాధ్యమైనంత వరకు సమస్తమైన వారితో సమాధానముగా ఉండాలి. (12:18)
Romans 12:19-21
విశ్వాసులు వారికి వారే ఎందుకు పగతీర్చుకోకూడదు ?
పగ తీర్చుట దేవుని పని గనుక విశ్వాసులు పగతీర్చుకొ కూడదు. (12:19)
విశ్వాసులు కీదుని ఏవిధముగా జయించాలి ?
మేలు చేత కీదుని జయించాలి. (12:21)
Romans 13
Romans 13:1-2
భూసంబంధమైన అధికారులు తమ అధికారాన్ని ఎక్కనుందడి పొందారు ?
భూసంబంధమైన అధికారులు దేవుని చేత నియమించా బడ్డారు, దేవుని నుండి తమ అధికారాన్ని పొందారు. (13:1)
భూసంబంధ మైన అధికారులను ఎదిరించు వారు ఏమి పొందుతారు ?
భూసంబంధమైన అధికారమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. (13:2)
Romans 13:3-5
పరిపాలించు అధికారులకు భయపడకుండునట్లు ఉండాలంటే ఏమి చెయ్యాలని పౌలు చెపుతున్నాడు ?
పరిపాలించు అధికారులకు భయపడకుండునట్లు ఉండాలంటే మేలు చేయాలని పౌలు చెపుతున్నాడు. (13:3)
కీడును అణచివేయడానికి అధికారులకు దేవుడు ఏ అధికారమును వారికి ఇచ్చాడు ?
కీడును అణచివేయడానికి అధికారులు ఖడ్గము ధరించుటకు, కీడు చేయువారి మీద ఆగ్రహము చూపునట్లు కావలసిన అధికారమును వారికి ఇచ్చాడు. (13:4)
Romans 13:6-7
డబ్బును గురించి అధికారులకు దేవుడు ఏ అధికారమును వారికి ఇచ్చాడు ?
డబ్బును గురించి అధికారులకు దేవుడు పన్ను చెల్లింపు లను స్వీకరించే అధికారమును వారికి ఇచ్చాడు. (13:6)
Romans 13:8-10
ఏ ఒక్క విషయములో విశ్వాసులు ఒకరికొకరు అచ్చి యుండాలని పౌలు చెప్పాడు ?
ఒక్క ప్రేమ విషయములో విశ్వాసులు ఒకరికొకరు అచ్చి యుండాలని పౌలు చెప్పాడు(13:8)
విశ్వాసి ఏవిధముగా ధర్మ శాస్త్రమును నెరవేర్చు చున్నాడు ?
తన పొరుగు వానిని ప్రేమించుట ద్వారా విశ్వాసి ధర్మ శాస్త్రమును పాటించు చున్నాడు. (13:8,10)
ధర్మ శాస్త్రములో భాగముగా ఏ ఆజ్ఞలను పౌలు చెపుతున్నాడు ?
వ్యభిచరించ వద్దు, నరహత్య చేయ వద్దు, దొంగిల వద్దు, ఆసించ వద్దు అను ఆజ్ఞలను ధర్మశాస్త్రములో భాగముగా పౌలు చెపుతున్నాడు. (13:9)
Romans 13:11-12
విశ్వాసులు ఏ క్రియలను విసర్జించాలని, వేటిని ధరించుకోవాలని పౌలు చెపుతున్నాడు ?
చీకటి క్రియలను విసర్జించి, తేజోసంబంధ మైన యుద్దోపకరణములను ధరించు కోవాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు. (13:12)
Romans 13:13-14
ఏ కార్య కలాపాలలో విశ్వాసులు నడువకూడదు ?
అల్లరితో కూడిన ఆట పాటలు, మత్తు అయినను, కామ విలాసములైనాను, పోకిరి చేష్టలైనను, మత్సరము అసూయలలో నడువ కూడదని పౌలు చెప్పాడు. (13:13)
శరీర కోరికలలవిషయములో విశ్వాసుల వైఖరి ఎలా ఉండాలని పౌలు చెపుతున్నాడు ?
శరీర కోరికల విషయములో విశ్వాసులు ఆలోచన చేసికొన వద్దని పౌలు చెపుతున్నాడు(13:14)
Romans 14
Romans 14:1-2
బలమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారమును తీసుకొంటాడు, బలహీనమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారము తీసుకొంటాడు ?
బలమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారమునైనను, బలహీనమైన విశ్వాసము కలవాడు కేవలము కూరగాయాలనే తీసుకొంటాడు. (14:2)
వారు తిను విషయములో ఒకరి విషయములో ఒకరు విభేధించుకొను విశ్వాసులు ఏ విధమైన వైఖరి కలిగి ఉండాలి ?
వారు తిను విషయములో ఒకరి విషయములో ఒకరు విభేధించుకొను విశ్వాసులు ఒకరికొకరు తీర్పు తీర్చు కొనకూడదు. (14:1,3)
Romans 14:3-4
ఏ ఆహారమునైనను తీసుకోన్వానిని, కేవలము కూరగాయాలనే తీసుకొనువానిని ఇద్దరినీ అంగీకరించిన వాడు ఎవరు ?
ఏ ఆహారమునైనను తీసుకొనువానిని, కేవలము కూరగాయాలనే తీసుకొనువానిని ఇద్దరినీ అంగీకరించినది దేవుడే. (14:3-4)
Romans 14:5-6
వ్యక్తిగత నమ్మకము గా ప్రస్తావించిన మరియొక అంశము ఏమిటి ?
వ్యక్తిగత నమ్మకము గా ప్రస్తావించిన మరియొక అంశము ఒక దినము మరియొక దినము కంటే విలువైనది లేక అన్ని దినములు సమానముగా ఎంచబడినవి. (14:5)
Romans 14:7-9
దేనికొరకు విశ్వాసులు జీవించాలి, చనిపోవాలి ?
ప్రభువు కొరకు విశ్వాసులు జీవించాలి, చనిపోవాలి. (14:7-8)
Romans 14:10-11
అంతిమముగా విశ్వాసులందరూ ఎక్కడ నిలుస్తారు, అక్కడ ఏమి చేస్తారు ?
అంతిమముగా విశ్వాసులందరూ దేవుని న్యాయ పీఠం ఎదుట నిలుస్తారు, అక్కడ వారి గురించి లెక్క ఒప్పగించవలెను. (14:10-12)
Romans 14:12-13
వ్యక్తిగత అభిప్రాయాల విషయములో ఒక సహోదరుడు మరొక సహోదరుని పట్ల ఎలాంటి వైఖరి కలిగిఉండాలి?
ఒక సహోదరుడు వ్యక్తిగత అభిప్రాయాల విషయములో మరొక సహోదరునికి ఎటువంటి అడ్డమైనను, ఆటంకమైనను కలుగచేయ కూడదు. (14:13)
Romans 14:14-15
ప్రభువైన యేసు నందు నిషిద్దములైన భోజన పదార్దములు అని వేటిని రూఢిగా నమ్ముతున్నాడు ?
ఏదీ నిషిద్దము కాదని పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. (14:14)
Romans 14:16-19
దేవుని రాజ్యము ఏమై ఉంది ?
దేవుని రాజ్యము నీతియు, సమాధానమును పరిశుద్దాత్మ యందలి ఆనందమునై యున్నది. (14:17)
Romans 14:20-21
మాంసము తినుట, ద్రాక్షా రసము త్రాగుట చేయని సహోదరుని ఎదుట మరొక సహోదరుడు ఏమి చెయ్య వలెను ?
ఆ సహోదరుని ఎదుట మాంసము తినుట, ద్రాక్షారసము త్రాగుట చేయకుండుట మంచిదని పౌలు చెపుతున్నాడు. (14:21)
Romans 14:22-23
ఒక వ్యక్తి విశ్వాసము లేకుండా తినిన యెడల కలిగే ఫలితమేమిటి ?
విశ్వాస మూలము కానిది ఏదో అదిపాపం. (14:23)
Romans 15
Romans 15:1-2
బలమైన విశ్వాసము గలవారు బలహీనమైన విశ్వాసము గలవారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి ?
బలమైన విశ్వాసము గలవారు బలహీనమైన విశ్వాసము గలవారి క్షేమాభివృద్ది కలగునట్లు వారి దౌర్బల్యములను భరించ వలెను. (15:1-2)
Romans 15:3-4
పూర్వ మందు రాసి ఉన్న లేఖనముల ఉద్దేశాలలో ఒక ఉద్దేశమేమిటి ?
పూర్వ మందు రాసి ఉన్న లేఖనములు మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడియున్నాయి. (15:4)
Romans 15:5-7
విశ్వాసులు ఓర్పు కలిగిఉండడము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము విషయములో వారికోరకైన పౌలు కోరిక ఏమిటి ?
విశ్వాసులు ఒకనితో ఒకరు మనస్సు కలిగి యుండాలని పౌలు కోరుతున్నాడు. (15:5)
Romans 15:8-9
తనను తాను సంతోష పరచక ఇతరులకు సేవ చేసిన ఏ వ్యక్తి యొక్క మాదిరిని పౌలు ఉపయోగించాడు ?
క్రీస్తు తనను తాను సంతోష పరచక ఇతరులకు సేవ చేసాదు. (15:,38-9)
Romans 15:10-12
తమ పట్ల దేవుని కరుణను బట్టి అన్య జనులు ఏమి చేస్తారని లేఖనాలు చెపుతున్నాయి ?
తమ పట్ల దేవుని కరుణను బట్టి అన్య జనులు సంతోషిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని యందు నిరీక్షణ ఉంచు తారు అని లేఖనాలు చెపుతున్నాయి. (15:10-12)
Romans 15:13-14
పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు ఏమి చేయ గలుగు తారు అని పౌలు చెప్పాడు ?
పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు సంతోషము, సమదానముతో నింపబడతారు, విస్తారమయిన నిరీక్షణ గలవారగుడురు. (15:13)
Romans 15:15-16
దేవుడు పౌలుకు తన పరిచర్యగా అనుగ్రహించిన కృప ఏది ?
క్రీస్తు యేసు దాసునిగా అన్యజనుల వద్దకు పంపబడుటయే పౌలు పరిచర్య. (15:16)
Romans 15:17-19
అన్య జనులు విదేయులగునట్లు పౌలు ద్వారా క్రీస్తు జరిగించిన పద్దతులేవి ?
వాక్యము చేతను, క్రియల చేతను, గురుతులు మహాత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు పౌలు ద్వారా తన కార్యములను జరిగించాడు. (15:18-19)
Romans 15:20-23
పౌలు ఎక్కడ సువార్తను ప్రకటించాలని కోరాడు ?
క్రీస్తు నామము ఎరుగని ప్రదేశాలలో సువార్తను ప్రకటించాలని కోరాడు. (15:20-21)
Romans 15:24-25
రోము దేశమునకు వెళ్ళగలుగునట్లు ఏ ప్రాంతానికి వెళ్లాలని పౌలు తలస్తున్నాడు ?
పౌలు స్పెయిను దేశానికి వెళ్లాలని తలస్తున్నాడు, అక్కడ నుండి రోము వెళ్ళగలుగుటకు ఎదురు చూస్తున్నాడు. (15:24-28)
Romans 15:26-29
పౌలు ఇప్పుడు ఎందుకు యెరూషలేము వెళ్ళుతున్నాడు ?
పౌలు అన్యజనులైన విశ్వాసుల నుండి పోగుచేయ్య బడిన కానుకలను యెరూషలేములోని పరిశుద్దులలో బీదలైన వారికి అందివ్వడానికి వెళ్ళుతున్నాడు. (15:25-26)
అన్యజనులైన విశ్వాసులు శరీర సంబంధమైన విషయములలో యూదయ విశ్వాసులకు ఋణస్తులై ఉన్నారని ఎందుకు పౌలు చెప్పాడు ?
అన్యజనులైన విశ్వాసులు యూదులైన విశ్వాసుల ఆత్మ సంబంధమైన విషయములలో పాలుపొందారు గనుక అన్యజనులైన విశ్వాసులు శరీర సంబంధమైన విషయములలో యూదయ విశ్వాసులకు ఋణస్తులై ఉన్నారని చెప్పాడు. (15:27)
Romans 15:30-33
ఎవరి చేతులలో నుండి పౌలు తప్పించబడాలని పౌలు కోరుతున్నాడు ?
యూదయలో ఉన్నా అవిదేయుల చేతులలో నుండి పౌలు తప్పించబడాలని పౌలు కోరుతున్నాడు. (15:31)
Romans 16
Romans 16:1-2
సోదరి ఫీబే పౌలుకు ఏమై ఉన్నది ?
సోదరి ఫీబే పౌలుకు సహాయకురాలై ఉంది, అనేకులకును సహాయకురాలై ఉన్నది. (16:1-2)
Romans 16:3-5
గతములో ఆకుల ప్రిస్చ్కిల్ల పౌలుకు ఏమి చేసారు ?
గతములో ఆకుల ప్రిస్చ్కిల్ల పౌలు ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇవ్వడానికి తెగించారు. (16:4)
రోమా లో విశ్వాసులు కలుసుకొను ఒక స్థలమేది ?
రోమా లో ఆకుల ప్రిస్సిల్ల గృహములో విశ్వాసులు కలుసుకొనుచున్నారు. (16:5)
Romans 16:6-14
గతములో అన్ద్రోనీకు, యూనియలు పౌలు తో కలిగిఉన్న అనుభవము ఏమిటి ?
గతములో అన్ద్రోనీకు, యూనియలు పౌలు తో సహా ఖైదీలుగా ఉన్నారు. (16:7)
Romans 16:15-16
విశ్వాసులు ఒకరికొకరు ఏవిధముగా వందనాలు చెప్పుకోవాలి ?
పవితమైన ముద్దు పెట్టుకొని విశ్వాసులు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. (16:16)
Romans 16:17-18
భేదములు, ఆటంకములు కలిగే విధముగా కొందరు ఏమి చేయుచున్నారు ?
వారు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వెళ్తున్నారు, నిష్కపటుల హుర్దయాలను మోసపుచ్చుతున్నారు. (1:3)
భేదములు, ఆటంకములు కలిగించు వారి విషయములో ఏమి చెయ్యాలని విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు ?
భేదములు, ఆటంకములు కలిగించు వారి నుండి తొలగి పోవుడని విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు(1:3)
Romans 16:19-20
మేలు కీడుల విషయములో ఎలాంటి వైఖరి కలిగి యుండాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు ?
మేలు విషయము లో జ్ఞానులును, కీడు విషయము నిష్కపటులునై యుండాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు(16:19)
సమాధాన కర్త యగు దేవుడు ఏమి చెయ్య బోతున్నాడు ?
సమాధాన కర్త యగు దేవుడు సతానును విశ్వాసుల కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. (16:20)
Romans 16:21-22
వాస్తవానికి ఈ పత్రిక ఎవరు రాసారు ?
వాస్తవానికి ఈ పత్రిక తెర్తియు రాసాడు. (16:22)
Romans 16:23-24
విశ్వాసియైన ఎరస్తు ఏ ఉద్యోగమును చేస్తున్నాడు ?
విశ్వాసియైన ఎరస్తు పట్టణపు ఖజానాదారుడిగా పని చేయుచున్నాడు. (16:23)
Romans 16:25-27
అనాదినుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు పౌలు చేత భోధింపబడుతున్న మర్మము ఏమిటి ?
అనాదినుండి రహస్యముగా ఉంచ బడి ఇప్పుడు పౌలు చేత భోధింపబడుతున్న మర్మము యేసు క్రీస్తు సువార్తయే. (16:25-26)
ఏ ఉద్దేశం కొరకు పౌలుబోధిస్తున్నాడు ?
సమస్త మైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు బోధిస్తున్నాడు. (16:26)