2 Timothy
2 Timothy 1
2 Timothy 1:1
ఏవిధంగా పౌలు క్రీస్తు యొక్క అపొస్తలుడు అయ్యాడు?
దేవుని సంకల్పం ద్వారా పౌలు క్రీస్తు యొక్క అపొస్తలుడు అయ్యాడు.
2 Timothy 1:2
తిమోతితో తన సంబంధం ఏమిటి అని పౌలు చెపుతున్నాడు?
తిమోతిని తన "ప్రియ కుమారుడు" అని పౌలు పిలుస్తున్నాడు.
2 Timothy 1:3
నిజమైన విశ్వాసo తిమోతి కంటే ముందు అతని కుటుంబంలో ఎవరికి ఉంది?
నిజమైన విశ్వాసం తిమోతి కంటే ముందు అతని అమ్మకు, అమ్మమ్మకు ఉంది(1: 5).
2 Timothy 1:4
పౌలు తన ప్రార్థనలలో తిమోతిని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు ఏమి చేయాలని పౌలు ఎదురుచూస్తున్నాడు?
పౌలు తిమోతిని చూడాలని ఎదురుచూస్తున్నాడు.
2 Timothy 1:5
తిమోతి కుటుంబంలో, తిమోతి కంటే ముందు ఎవరికి నిజమైన విశ్వాసం ఉంది?
తిమోతి అమ్మమ్మ, మరియు అమ్మ ఇద్దరికీ యదార్ధమైన విశ్వాసం ఉంది.
2 Timothy 1:6
దేవుడు తిమోతికి ఎలాంటి ఆత్మను ఇచ్చాడు?
దేవుడు తిమోతికి క్రమశిక్షణ, ప్రేమ, శక్తిగల ఆత్మను ఇచ్చాడు(1 :7).
2 Timothy 1:7
ఎటువంటి ఆత్మను తిమోతికి దేవుడు ఇచ్చాడు?
శక్తిగల, మరియు ప్రేమగల మరియు స్వీయ క్రమశిక్షణగల ఆత్మను దేవుడు తిమోతికి ఇచ్చాడు.
2 Timothy 1:8
ఏమి చేయవద్దని తిమోతికి పౌలు చెప్పాడు?
ప్రభువు గురించి సాక్ష్యం విషయం సిగ్గు పడవద్దు అని తిమోతికి పౌలు చెపుతున్నాడు.
ఏమి హేయ్యాలని తిమోతికి పౌలు చెప్పాడు?
సువార్త కోసం కలిసి శ్రమపడాలని తిమోతికి పౌలు చెపుతున్నాడు.
2 Timothy 1:9
దేవుని ప్రణాళిక మరియు కృప మనకు ఎప్పుడు అనుగ్రహించబడింది?
యుగాల ఆరంభానికి ముందే దేవుని ప్రణాళిక మరియు కృప మనకు అనుగ్రహించబడింది.
2 Timothy 1:10-11
దేవుడు తన రక్షణ ప్రణాళికను ఏ విధంగా వెల్లడి అయ్యింది?
దేవుడు తన రక్షణ ప్రణాళిక మన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత ద్వారా వెల్లడి అయింది.
యేసు ప్రత్యక్షం అయినప్పుడు మరణం, జీవం, అక్షయత విషయంలో అయన ఏమి చేశాడు?
యేసు మరణానికి అంతం విధించాడు, మరియు సువార్త ద్వారా జీవాన్ని మరియు అక్షయతను వెలుగులోకి తేవడం చేసాడు.
2 Timothy 1:12-13
సువార్త విషయంలో పౌలు సిగ్గుపడకుండా చేసేలా దేవుడు తన కోసం ఏమి చేయగలడని పౌలు రూఢిగా ఉన్నాడు?
దేవునికి పౌలు అప్పగించినదానిని ఆ రోజు వరకు దేవుడు కాపాడడానికి సామర్ధ్యము గలవాడని నేను రూఢిగా ఉన్నాడు.
2 Timothy 1:14
దేవుడు తనకు అప్పగించిన మంచి నిక్షేపముతో తిమోతి ఏమి చేయవలసి ఉంది?
దేవుడు తనకు అప్పగించిన మంచి నిక్షేపమును తిమోతి పరిశుద్ధ ఆత్మ ద్వారా కాపాఎడాలి.
2 Timothy 1:15
ఆసియాలో ఉన్న పౌలు సహచరులందరూ ఆయనకి ఏమి చేసారు?
ఆసియలో ఉన్న వారు అందరు పౌలు నుండి తొలగిపోయారు.
2 Timothy 1:16
ఒనేసిఫోరు కుటుంబానికి కనికరం చూపాలని ప్రభువును పౌలు ఎందుకు అడిగాడు?
ప్రభువు ఒనేసిఫోరు కుటుంబానికి కనికరం అనుగ్రహించాలని పౌలు అడుగుతున్నాడు, ఎందుకంటే ఒనేసిఫోరు పౌలును సేదతీర్చాడు మరియు పౌలు సంకెళ్ళ విషయంలో సిగ్గు పడలేదు.
2 Timothy 1:17
పౌలు రోములో ఉన్నప్పుడు పౌలు కోసం ఒనేసిఫోరు ఏమి చేసాడు?
పౌలు రోములో ఉన్నప్పుడు పౌలును ఒనేసిఫోరు శ్రద్ధగా వెతికాడు, మరియు పౌలును కనుగొన్నాడు.
2 Timothy 1:18
ప్రభువు ఒనేసిఫోరుకు ఏమి అనుగ్రహించాలని పౌలు అడుగుతున్నాడు?
ఒనేసిఫోరుకు కనికరం అనుగ్రహించాలని ప్రభువును పౌలు అడుగుతున్నాడు.
2 Timothy 2
2 Timothy 2:1
తిమోతిని బలపరచగలిగినది ఏమిటి?
క్రీస్తు యేసులో ఉన్న కృప తిమోతిని బలపరచగలదు.
2 Timothy 2:2
పౌలు తనకు బోధించిన సందేశాన్ని ఎవరికీ తిమోతి అప్పగించాలి?
ఇతరులకు కూడా బోధించడానికి సామర్ధ్యంగల, నమ్మకమైన వ్యక్తులకు ఈ సందేశాన్ని తిమోతి అప్పగించవలసి ఉంది.
2 Timothy 2:3
ఒక మంచి సైనికుడు తనకుతాను ఎలాంటి చిక్కుల్లోపడడని పౌలు తిమోతికి వివరించాడు?
ఒక మంచి సైనికుడు తనకు తాను ఈ జీవన సంబంధాలలో చిక్కుకోడని పౌలు తిమోతికి వివరించాడు(2:4).
2 Timothy 2:4-7
తిమోతి కోసం ఒక దృష్టాంతంగా, ఒక మంచి సైనికుడు వేటిలో తనను తాను చిక్కించుకోడు అని పౌలు చేప్పాడు?
ఒక సైనికుడిగా పనిచేయువాడు ఎవడును జీవితం యొక్క వ్యాపకాలలో చిక్కుకోడు.
2 Timothy 2:8
ఈ లేఖ తిమోతికి వ్రాస్తుండగా దేవుని వాక్కు ప్రకటన కోసం పౌలు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాడు?
ఈ లేఖ పౌలు తిమోతికి వ్రాస్తుండగా సంకెళ్ళతో బందియై కష్టాలు అనుభవిస్తున్నాడు(2:9).
ఏది సంకెళ్ళపాలై లేదని పౌలు చెపుతున్నాడు?
దేవుని వాక్కు సంకెళ్ళపాలై లేదని పౌలు చెపుతున్నాడు(2:9).
వీటన్నిటి కోసం పౌలు ఎందుకు ఓర్చుకున్నాడు?
క్రీస్తు యేసులో రక్షణ పొందాలని దేవుని వలన ఏర్పరచుకొన్నవారికోసం పౌలు వీటన్నిటిన్నీ ఓర్చుకున్నాడు(2:10).
2 Timothy 2:9
తిమోతికి పౌలు రాస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకటించడం కోసం పౌలు ఎటువంటి స్థితిలో శ్రమ పొందుతున్నాడు?
పౌలు ఒక నేరస్థుడి వలే సంకెళ్ళలో బందింపబడు వరకు శ్రమ అనుభవిస్తున్నాడు.
ఏది బంధించబడలేదని పౌలు చెపుతున్నాడు?
దేవుని వాక్యం బంధించబడిలేదు.
2 Timothy 2:10
వీటన్నిటినీ పౌలు ఎందుకు ఓర్చు కొంటున్నాడు?
ఎన్నికైనవారి కోసం పౌలు అన్నింటిని ఓర్చుకుంటున్నాడు, తద్వారా వారు కూడా నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులో ఉన్న రక్షణ పొందుతారు.
2 Timothy 2:11
సహించే వారికి క్రీస్తు వాగ్ద్ధానం ఏమిటి?
సహించే వారు క్రీస్తుతో కూడా ఏలతారు(2:12).
క్రీస్తును ఎరగననే వారికీ క్రీస్తు హెచ్చరిక ఏమిటి?
క్రీస్తును ఎరగననే వారిని ఆయనా ఎరగనoటాడు(2:12).
2 Timothy 2:12-13
సహించేవారికి క్రీస్తు వాగ్దానం ఏమిటి?
సహించిన వారు క్రీస్తుతో పాటు రాజ్య పాలన చేస్తారు.
ఆయనను తిరస్కరించిన వారికి క్రీస్తు హెచ్చరిక ఏమిటి?
క్రీస్తును తిరస్కరించిన వారిని క్రీస్తు తిరస్కరిస్తాడు.
2 Timothy 2:14-15
దేని గురించి వాదం పెట్టుకోకూడదని తిమోతి మనుషులను హెచ్చరించాలి?
పనికిరాని మాటల వాదం పెట్టుకోకూడదని తిమోతి మనుషులను హెచ్చరించాలి.
2 Timothy 2:16-17
సత్యం నుండి తొలిగిపోయిన ఇద్దరు ఏ తప్పుడు సిద్ధాంతం ఉపదేశిoచారు?
సత్యం నుండి తొలిగిపోయిన ఇద్దరు పునర్జీవం ముందే జరిగిoదనే తప్పుడు సిద్ధాంతం ఉపదేశిoచారు(2:18).
2 Timothy 2:18
ఏ బోధ విషయంలో సత్యం చెప్పకుండా ఇద్దరు మనుషులు గురి తప్పిపోయారు?
పునరుత్థానం ఇంతకుముందే జరిగింది అని వారు చెపుతున్నారు.
2 Timothy 2:19-20
ప్రతి మంచి పని కోసం విశ్వాసులు ఎలా సిద్ధపడాలి?
ప్రతి మంచి పని కోసం విశ్వాసులు ఘనతకు ఉపయోగపడని వాటినుండి తమ్ముతాము శుద్ధి చేసుకొని, సమర్పించుకోవాలి(2:21).
2 Timothy 2:21
ప్రతి మంచి పని కోసం విశ్వాసులు తమను తాము ఏ విధంగా సిద్ధపరచుకోవాలి?
విశ్వాసులు ప్రతి మంచి పని కోసం తమ్మునుతాము సిద్ధపరచుకోవడం కోసం ఘనహీనమైన ప్రయోజనము నుండి పరిశుద్ధ పరచుకోవాలి.
2 Timothy 2:22-23
తిమోతి దేని నుండి పారిపోవాలి?
యవ్వనపు వ్యామోహముల నుండి తిమోతి పారిపోవాలి.
2 Timothy 2:24
ప్రభువు సేవకుడు ఏవిధంగా ఉండాలని పౌలు చెపుతున్నాడు?
ప్రభువు సేవకుడు సహనంతో ఉండాలి, అందరితో దయగా ఉండాలి, బోధించగలిగేవాడుగా ఉండాలి.
2 Timothy 2:25
ప్రభువు సేవకుడు తనను వ్యతిరేకించే వారి పట్ల ఏవిధంగా వ్యవహరించాలి?
ప్రభువు సేవకుడు తనను వ్యతిరేకించే వారికి సాత్వికంలో బోధించాలి.
2 Timothy 2:26
అవిశ్వాసులతో అపవాది ఏమి చేసాడు?
అపవాది తన ఇష్టం కోసం అవిశ్వాసులకు ఉరి పన్నాడు, వారిని చెరపట్టాడు.
2 Timothy 3
2 Timothy 3:1
చివరి దినములలో ఏమి వస్తుందని పౌలు చెప్పాడు?
చివరి దినములలో కష్టమైన సమయాలు వస్తాయని పౌలు చెప్పాడు.
2 Timothy 3:2-3
చివరి దినములలో దేవునికి బదులుగా మనుషులు దేనిని ప్రేమిస్తారు?
చివరి దినములలో మనుషులు తమను తాము ప్రేమించుకొంటారు, మరియు దేవునికి బదులుగా డబ్బును ప్రేమిస్తారు.
2 Timothy 3:4
చివరి దినములలో దేవునికి బదులుగా మనుషులు ప్రేమించే ఇతర అంశములు ఏమిటి?
చివరి దినములలో మనుషులు దేవునికి బదులుగా సంతోషాన్ని ప్రేమిస్తారు.
2 Timothy 3:5
దైవభక్తి రూపాన్ని మాత్రమే కలవారి విషయంలో తిమోతి ఏమి చెయ్యవలసి ఉందని తిమోతో పౌలు చెప్పాడు?
దైవభక్తి రూపాన్ని మాత్రమే కలవారి నుండి దూరంగా తొలగిపోవాలని తిమోతికి పౌలు చెపుతున్నాడు.
2 Timothy 3:6-7
ఈ భక్తిహీనులలో కొందరు ఏమి చేస్తారు?
ఈ భక్తిహీనులైన పురుషులలో కొందరు గృహాలలోనికి ప్రవేశిస్తారు, మరియు రకరకాల వాంఛల చేత కొట్టుకు పోయిన బుద్ధిహీనమైన స్త్రీలను వశం చేసుకొంటారు.
2 Timothy 3:8-9
ఈ భక్తిహీనులు పాత నిబంధనలో ఉన్న యన్నే, మరియు యంబ్రే వంటి వారి వలే ఏవిధంగా ఉన్నారు?
యన్నే, మరియు యంబ్రే మోషేను వ్యతిరేకించినట్లుగానే ఈ భక్తిహీనులు అదే విధంగా సత్యాన్ని వ్యతిరేకించారు.
2 Timothy 3:10
అబద్దపు బోధకులకు బదులుగా, తిమోతి ఎవరిని అనుసరించాడు?
తిమోతి పౌలును అనుసరించాడు.
2 Timothy 3:11
దేని నుండి ప్రభువు పౌలును కాపాడాడు?
పౌలుకున్న హింసలు, శ్రమలు అన్నిటినుండి ప్రభువు అతనిని కాపాడాడు.
2 Timothy 3:12
సద్భక్తిగా జీవించడానికి కోరుకున్న వారికందరికీ ఏమి జరుగుతుందని పౌలు చెపుతున్నాడు?
సద్భక్తిగా జీవించడానికి కోరుకున్న వారు అందరు హింసించబడతారు అని పౌలు చెపుతున్నాడు.
2 Timothy 3:13
చివరి దినములలో ఎవరు అధికమైన చెడువైపుకు కదులుతున్నారు?
చివరి దినములలో దుష్టులైన మనుషులు మరియు వంచకులు అధికమైన చెడు వైపుకు కదులుతున్నారు.
2 Timothy 3:14
తిమోతి జీవితంలో పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుండి తెలుసు?
పరిశుద్ధ లేఖనాలు తిమోతికి బాల్యం నుండి తెలుసు(3 :15).
2 Timothy 3:15
తిమోతి జీవితంలో ఏ సమయం నుండి అతడు పరిశుద్ధ లేఖనాలను యెరిగియున్నాడు?
తిమోతి బాల్యం నుండి పరిశుద్ధ లేఖనాలు యెరుగును.
2 Timothy 3:16
ప్రతి లేఖనం ఏవిధంగా ఉనికిలోనికి వచ్చాయి?
ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగినది.
ప్రతి లేఖనం దేని కోసం ప్రయోజనకరం?
ప్రతి లేఖనం బోధించడం కోసం, ఖండించడం కోసం, తప్పుదిద్దడం కోసం మరియు నీతిలో శిక్షణ కోసం ప్రయోజనకరం.
2 Timothy 3:17
లేఖనాలలో ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడంలోని ఉద్దేశ్యం ఏమిటి?
ఒక వ్యక్తికి లేఖనాలలో శిక్షణ ఇవ్వబడుతుంది, తద్వారా అతడు ప్రవీణుడుగా ఉండి, ప్రతి మంచి పని కోసం సిద్ధపడి ఉంటాడు.
2 Timothy 4
2 Timothy 4:1
యేసుక్రీస్తు ఎవరిని తీర్పు తీర్చబోతున్నాడు?
యేసు క్రీస్తు సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చబోతున్నాడు.
2 Timothy 4:2
తిమోతికి ఏమి చేయాలని పౌలు రూఢిగా ఆజ్ఞాపించాడు?
వాక్యాన్ని ప్రకటించమని పౌలు రూఢిగా ఆజ్ఞాపించాడు.
2 Timothy 4:3-4
హిత బోధకు సంబంధించి సమయం వచ్చినప్పుడు మనుషులు ఏమి చేస్తారు అని పౌలు హెచ్చరించాడు?
మనుషులు హిత బోధను సహించ లేరు, అయితే వారి దురద చెవులు, వారు తమ స్వంత దురాశలకు అనుగుణంగా ఉండే బోధలను వింటారు.
2 Timothy 4:5
తిమోతి చెయ్యడానికి ఏ పని, ఏ పరిచర్య అనుగ్రహించబడింది?
సువార్తికుని పని, పరిచర్య తిమోతికి అప్పగించబడింది.
2 Timothy 4:6-7
పౌలు తన జీవితంలో ఏ సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పాడు?
తన మరణం యొక్క సమయం ఇక్కడ ఉంది అని పౌలు చెప్పాడు.
2 Timothy 4:8
క్రీస్తు ప్రత్యక్షతను ఇష్టపడే వారందరూ ఏ బహుమతిని అందుకుంటారని పౌలు చెప్పాడు?
క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించిన వారు అందరూ నీతి కిరీటాన్ని పొందుతారని పౌలు చెప్పాడు.
2 Timothy 4:9
దేమా, పౌలు సహవాసాన్నిఎందుకు విడిచిపెట్టాడు?
ఎందుకంటే దేమాకు ఈలోకం మీద ప్రీతి కలిగి పౌలును విడిచిపెట్టాడు(4:10).
2 Timothy 4:10
పౌలు సహచరుడు దేమా ఎందుకు పౌలును విడిచిపెట్టాడు?
పౌలు సహచరుడు దేమా పౌలును విడిచిపెట్టాడు ఎందుకంటే అతడు ఈ ప్రస్తుత కాలాన్ని ప్రేమించాడు.
2 Timothy 4:11-13
పౌలుతో ఇంకా నిలిచి ఉన్న సహచరుడు ఎవరు?
లూకా మాత్రమే ఇంకా పౌలుతో ఉన్నాడు.
2 Timothy 4:14-15
దేని ప్రకారం ప్రభువు అలెక్సంద్రుకు ప్రతిఫలాన్ని తిరిగి చెల్లిస్తాడని పౌలు చెప్పాడు?
అతని క్రియల ప్రకారం అలెక్సంద్రుకు ప్రభువు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు అని పౌలు చెప్పాడు.
2 Timothy 4:16-22
పౌలు తన మొదటి సమర్ధన వాదంలో ఏ మనుషులు కనిపించారు?
పౌలు తన మొదటి సమర్ధన వాదంలో ఏ ఒక్కరూ కనిపించలేదు.