1 Thessalonians
1 Thessalonians 1
1 Thessalonians 1:3-4
థెస్సలొనీకయుల గురించి పౌలు ఎల్లప్పుడూ దేవుని ముందు ఏమి జ్ఞాపకం చేసుకొంటున్నాడు?
వారి విశ్వాసపు కార్యాన్ని, ప్రేమతో కూడిన వారి శ్రమను మరియు నిరీక్షణతో కూడిన వారి సహనాన్ని జ్ఞాపకం చేసుకొంటున్నాడు.
1 Thessalonians 1:5
థెస్సలొనీకయులకు సువార్త ఏ నాలుగు మార్గాలలో వచ్చింది?
థెస్సలొనీకయులకు సువార్త మాటలో, శక్తిలో, పరిశుద్ధాత్మలో మరియు అధికమైన నిశ్చయతతో వచ్చింది.
1 Thessalonians 1:6-7
థెస్సలొనీకయులు సువార్త వాక్యాన్ని స్వీకరించినప్పుడు వారికి ఏమి జరుగుతోంది?
థెస్సలొనీకయులు అధికమైన శ్రమలలో వాక్యాన్ని స్వీకరించారు.
థెస్సలొనీకయులు సువార్త వాక్యాన్ని స్వీకరించినప్పుడు వారి వైఖరి ఏమిటి?
థెస్సలొనీకయులు పరిశుద్ధాత్మలో సంతోషంతో వాక్యాన్ని స్వీకరించారు.
1 Thessalonians 1:8
థెస్సలొనీకయులు ప్రభువు వాక్యాన్ని స్వీకరించిన తరువాత వాక్యానికి ఏమి జరిగింది?
వారి విశ్వాసం బయటికి తెలిసిన తరువాత ప్రతిచోటా ప్రభువు వాక్యం మోగింది.
1 Thessalonians 1:9
థెస్సలొనీకయులు నిజమైన దేవుణ్ణి విశ్వసించే ముందు వారు దేనిని ఆరాధించారు?
థెస్సలొనీకయులు నిజమైన దేవుణ్ణి విశ్వసించే ముందు విగ్రహాలను ఆరాధించేవారు.
1 Thessalonians 1:10
పౌలు మరియు థెస్సలొనీకయులు దేని కోసం ఎదురు చూస్తున్నారు?
పౌలు మరియు థెస్సలొనీకయులు యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు.
యేసు మనలను దేని నుండి విడిపించును?
రాబోయే ఉగ్రత నుండి యేసు మనలను విడిపించును.
1 Thessalonians 2
1 Thessalonians 2:2-3
థెస్సలొనీకయుల వద్దకు రావడానికి ముందు పౌలు మరియు అతని సహచరులు ఎలా వ్యవహరించబడ్డారు?
పౌలు మరియు అతని సహచరులు శ్రమపడ్డారు మరియు అవమానకరంగా చూడబడ్డారు.
1 Thessalonians 2:4
పౌలు తన సువార్త బోధతో ఎవరిని సంతోషపెట్టాలని కోరుకుంటున్నాడు?
పౌలు తన సువార్త బోధతో దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకుంటున్నాడు.
1 Thessalonians 2:5
పౌలు తన సువార్త బోధలో ఏమి చేయలేదు?
పౌలు ముఖస్తుతి ఉపయోగించలేదు, మనుష్యుల నుండి కీర్తిని పొందలేదు.
1 Thessalonians 2:6
పౌలు తన సువార్త బోధలో ఏమి చేయలేదు?
పౌలు ముఖస్తుతి ఉపయోగించలేదు, మనుష్యుల నుండి కీర్తిని పొందలేదు.
1 Thessalonians 2:7
పౌలు థెస్సలొనీకయుల మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు?
పౌలు థెస్సలొనీకయులతో మృదువుగా ఉండేవాడు, ఒక తల్లి లేదా తండ్రి తమ స్వంత పిల్లలతో ఉన్నట్టు వలే ఉన్నారు.
1 Thessalonians 2:8
పౌలు థెస్సలొనీకయుల మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు?
పౌలు థెస్సలొనీకయులతో మృదువుగా ఉండేవాడు, ఒక తల్లి లేదా తండ్రి తమ స్వంత పిల్లలతో ఉన్నట్టు వలే ఉన్నారు.
1 Thessalonians 2:9-10
థెస్సలొనీకయులకు భారం కాకుండ పౌలు మరియు అతని సహచరులు ఏమి చేసారు?
పౌలు మరియు అతని సహచరులు థెస్సలొనీకయులకు భారం కాకుండా రాత్రింబగళ్లు శ్రమించారు.
1 Thessalonians 2:11
పౌలు థెస్సలొనీకయుల మధ్య ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు?
పౌలు థెస్సలొనీకయులతో మృదువుగా ఉండేవాడు, ఒక తల్లి లేదా తండ్రి తమ స్వంత పిల్లలతో ఉన్నట్టు వలే ఉన్నారు.
1 Thessalonians 2:12
థెస్సలొనీకయులు ఏవిధంగా ప్రవర్తించాలని పౌలు చెప్పాడు?
థెస్సలొనీకయులు తన స్వంత రాజ్యానికి మరియు మహిమకు తమను పిలిచిన దేవునికి తగిన విధంగా నడుచుకోవాలని చెప్పాడు.
1 Thessalonians 2:13
పౌలు వారికి బోధించిన సందేశాన్ని థెస్సలొనీకయులు ఎలాంటి వాక్యంగా స్వీకరించారు?
థెస్సలొనీకయులు సందేశాన్ని మానవుని వాక్యంగా కాకుండా దేవుని వాక్యంగా స్వీకరించారు.
1 Thessalonians 2:14
దేవుణ్ణి సంతోషపెట్టని అవిశ్వాసులైన యూదులు ఏమి చేసారు?
అవిశ్వాసులైన యూదులు యూదయలోని సంఘాలను హింసించారు, యేసును మరియు ప్రవక్తలను చంపారు, పౌలును వెలుపలికి వెళ్లగొట్టారు మరియు అన్యజనులతో మాట్లాడకుండా పౌలును నిషేధించారు.
1 Thessalonians 2:15

1 Thessalonians 2:16
దేవుణ్ణి సంతోషపెట్టని అవిశ్వాసులైన యూదులు ఏమి చేసారు?
అవిశ్వాసులైన యూదులు యూదయలోని చర్చిలను హింసించారు, యేసును మరియు ప్రవక్తలను చంపారు, పౌలును వెలుపలికి వెళ్లగొట్టారు మరియు అన్యజనులతో మాట్లాడకుండా పౌలును నిషేధించారు.
1 Thessalonians 2:17
పౌలు థెస్సలొనీకయుల వద్దకు రావాలనే కోరిక ఉన్నప్పటికీ వారి వద్దకు ఎందుకు రాలేకపోయాడు?
సాతాను పౌలును అడ్డుకున్నందున రాలేకపోయాడు.
1 Thessalonians 2:18
పౌలు థెస్సలొనీకయుల వద్దకు రావాలనే కోరిక ఉన్నప్పటికీ వారి వద్దకు ఎందుకు రాలేకపోయాడు?
సాతాను పౌలును అడ్డుకున్నందున రాలేకపోయాడు.
1 Thessalonians 2:19
ప్రభువు రాకడలో థెస్సలొనీకయులు పౌలుకు ఏవిధంగా ఉంటారు?
ప్రభువు రాకడలో థెస్సలొనీకయులు పౌలు యొక్క నిరీక్షణ, ఆనందం మరియు మహిమ కిరీటంగా ఉంటారు.
1 Thessalonians 2:20
ప్రభువు రాకడలో థెస్సలొనీకయులు పౌలుకు ఏవిధంగా ఉంటారు?
ప్రభువు రాకడలో థెస్సలొనీకయులు పౌలు యొక్క నిరీక్షణ, ఆనందం మరియు మహిమ కిరీటంగా ఉంటారు.
1 Thessalonians 3
1 Thessalonians 3:1
ఏథెన్సులో పౌలు విడిచిపెట్టబడిననప్పటికీ అతడు ఏమి చేశాడు?
థెస్సలొనీకలోని విశ్వాసులను బలపరచడానికి మరియు వారికి ఆదరణ ఇవ్వడానికి పౌలు వారి వద్దకు తిమోతిని పంపాడు.
1 Thessalonians 3:2
ఏథెన్సులో పౌలు విడిచిపెట్టబడిననప్పటికీ అతడు ఏమి చేశాడు?
థెస్సలొనీకలోని విశ్వాసులను బలపరచడానికి మరియు వారికి ఆదరణ ఇవ్వడానికి పౌలు వారి వద్దకు తిమోతిని పంపాడు.
1 Thessalonians 3:3-4
తాను దేనికి నియమించబడ్డానని పౌలు చెప్పాడు?
తాను శ్రమలకు నియమించబడ్డానని పౌలు చెప్పాడు.
1 Thessalonians 3:5
థెస్సలొనీకయుల గురించి పౌలు దేని గురించి ఆందోళన చెందాడు?
శోధకుడు తమను శోధించాడని మరియు తన శ్రమ వ్యర్థమైందని పౌలు ఆందోళన చెందాడు.
1 Thessalonians 3:6
తిమోతి థెస్సలొనీక నుండి తిరిగి వచ్చినప్పుడు పౌలుకు ఏది ఓదార్పునిచ్చింది?
థెస్సలొనీకయుల విశ్వాసం మరియు ప్రేమ గురించిన సువార్తను విన్నందుకు పౌలు ఓదార్పు పొందాడు మరియు వారు తనను చూడాలని కోరుకున్నారు.
1 Thessalonians 3:7
తిమోతి థెస్సలొనీక నుండి తిరిగి వచ్చినప్పుడు పౌలుకు ఏది ఓదార్పునిచ్చింది?
థెస్సలొనీకయుల విశ్వాసం మరియు ప్రేమ గురించిన సువార్తను విన్నందుకు పౌలు ఓదార్పు పొందాడు మరియు వారు తనను చూడాలని కోరుకున్నారు.
1 Thessalonians 3:8-9
థెస్సలొనీకయులు ఏమి చేస్తే తాను జీవిస్తానని పౌలు చెప్పాడు?
థెస్సలొనీకయులు ప్రభువులో స్థిరంగా నిలబడితే తాను జీవిస్తానని పౌలు చెప్పాడు.
1 Thessalonians 3:10-11
పౌలు రాత్రింబగళ్లు దేనికోసం ప్రార్థిస్తున్నాడు?
థెస్సలొనీకయులను చూడాలని మరియు వారి విశ్వాసంలో లోపించిన వాటిని అందించాలని పౌలు రాత్రింబగళ్లు ప్రార్థిస్తున్నాడు.
1 Thessalonians 3:12
థెస్సలొనీకయులు దేనిలో వృద్ధి చెందాలని మరియు సమృద్ధిగా ఉండాలని పౌలు కోరుతున్నాడు?
థెస్సలొనీకయులు ఒకరికొకరు మరియు ప్రజలందరి పట్ల ప్రేమలో వృద్ధి చెందాలని మరియు సమృద్ధిగా ఉండాలని పౌలు కోరుతున్నాడు.
1 Thessalonians 3:13
థెస్సలొనీకయులు తమ హృదయాలను పవిత్రతలో నిర్దోషంగా ఉంచుకోవడం ద్వారా ఏ సంఘటన కోసం సిద్ధపడాలని పౌలు కోరుతున్నాడు?
థెస్సలొనీకయులు తన పరిశుద్ధులందరితో ప్రభువైన యేసు రాకడకు సిద్ధపడాలని పౌలు కోరుతున్నాడు.
1 Thessalonians 4
1 Thessalonians 4:1
థెస్సలొనీకయులు ఏ విధంగా నడుచుకోవాలి మరియు దేవుణ్ణి ఏవిధంగా సంతోషపెట్టాలి అనే దాని గురించి తాను ఇచ్చిన హెచ్చరికల విషయంలో ఏమి చేయాలని పౌలు కోరుకున్నాడు?
థెస్సలొనీకయులు ప్రవర్తించడం కొనసాగించాలని మరియు వారు దేవుణ్ణి సంతోషపెట్టాలని, ఇంకా అధికంగా చేయాలని పౌలు కోరుకున్నాడు.
1 Thessalonians 4:2

1 Thessalonians 4:3
థెస్సలొనీకయుల పట్ల దేవుని చిత్తమని పౌలు ఏమి చెప్పాడు?
థెస్సలొనీకయులు పరిశుద్ధ పరచబడడం వారి విషయంలో దేవుని చిత్తం అని పౌలు చెప్పాడు.
1 Thessalonians 4:4-5
భర్తలు తమ భార్యలతో ఏవిధంగా ప్రవర్తించాలి?
భర్తలు తమ భార్యలను పవిత్రతలోనూ, ఘనతలోనూ చూడాలి.
1 Thessalonians 4:6-7
లైంగిక దుర్నీతి విషయంలో పాపం చేసిన సోదరుడికి ఏమి జరుగుతుంది?
లైంగిక అనైతికత విషయంలో పాపం చేసిన సోదరుడి పట్ల ప్రభువు ప్రతీకారం తీర్చుకుంటాడు.
1 Thessalonians 4:8
పవిత్రతకు పిలుపుని తిరస్కరించే వ్యక్తి ఎవరిని తిరస్కరిస్తాడు?
పవిత్రతకు పిలుపుని తిరస్కరించే వ్యక్తి దేవుణ్ణి తిరస్కరిస్తాడు.
1 Thessalonians 4:9
థెస్సలొనీకయులు ఏమి చేస్తున్నారు పౌలు వారు ఇంకా అధికంగా ఏమి చేయాలని కోరుకున్నారు?
థెస్సలొనీకయులు ఒకరినొకరు మరింత ఎక్కువగా ప్రేమించాలని పౌలు కోరుకున్నాడు.
1 Thessalonians 4:10
థెస్సలొనీకయులు ఏమి చేస్తున్నారు పౌలు వారు ఇంకా అధికంగా ఏమి చేయాలని కోరుకున్నారు?
థెస్సలొనీకయులు ఒకరినొకరు మరింత ఎక్కువగా ప్రేమించాలని పౌలు కోరుకున్నాడు.
1 Thessalonians 4:11
థెస్సలొనీకయులు అవిశ్వాసుల యెదుట సరిగ్గా నడిచి, కొదువ లేకుండా ఉండడానికి వారు ఏమి చేయాలి?
థెస్సలొనీకయులు మౌనంగా ఉండాలి, వారి స్వంత పనులను చూసుకోవాలి మరియు వారు తమ చేతులతో పని చేయాలి.
1 Thessalonians 4:12
థెస్సలొనీకయులు అవిశ్వాసుల యెదుట సరిగ్గా నడిచి, కొదువ లేకుండా ఉండడానికి వారు ఏమి చేయాలి?
థెస్సలొనీకయులు మౌనంగా ఉండాలి, వారి స్వంత పనులను చూసుకోవాలి మరియు వారు తమ చేతులతో పని చేయాలి.
1 Thessalonians 4:13
థెస్సలొనీకయులకు ఏ విషయం గురించి తప్పు అభిప్రాయం కలిగియుండవచ్చు?
నిద్రించిన వారి విషయంలో వారికి ఏమి జరిగిందనే విషయంలో థెస్సలొనీకయులకు బహుశా తప్పు అభిప్రాయం ఉండవచ్చు.
1 Thessalonians 4:14-15
యేసులో నిద్రించిన వారికి దేవుడు ఏమి చేస్తాడు?
క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు యేసుతో తీసుకు వస్తాడు.
1 Thessalonians 4:16
ప్రభువు పరలోకం నుండి ఏవిధంగా దిగి వస్తాడు?
గొప్ప శబ్దముతోనూ, మరియు దేవుని బూర శ్వనితో ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు.
ఎవరు ముందు లేపబడతారు మరియు ఆ మీదట వారితో కలిసి ఎవరు లేపబడతారు?
క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులుగా ఉన్నవారు వారితో లేపబడతారు.
1 Thessalonians 4:17
ఎవరు ముందు లేపబడతారు మరియు ఆ మీదట వారితో కలిసి ఎవరు లేపబడతారు?
క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులుగా ఉన్నవారు వారితో లేపబడతారు.
సజీవులుగా లేపబడినవారు ఎవరిని కలుస్తారు, ఎంతకాలం?
సజీవులుగా లేపబడినవారు మధ్యాకాశంలో ప్రభువును కలుస్తారు మరియు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటారు.
1 Thessalonians 4:18
నిద్రించుచున్న వారిని గురించి తన బోధ విషయంలో థెస్సలొనీకయులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు?
పౌలు తన మాటలతో ఒకరినొకరు ఓదార్చుకోవాలని థెస్సలొనీకయులకు చెప్పాడు.
1 Thessalonians 5
1 Thessalonians 5:2
ప్రభువు దినం ఏవిధంగా వస్తుందని పౌలు చెప్పాడు?
రాత్రి వేళ దొంగ వచ్చినట్లు ప్రభువు దినము వస్తుందని పౌలు చెప్పాడు.
1 Thessalonians 5:3
ఆకస్మిక నాశనం వచ్చినప్పుడు కొంతమంది ఏమి చెపుతారు?
కొంతమంది "సమాధానం మరియు భద్రత" అని చెపుతారు.
1 Thessalonians 5:4
ప్రభువు దినం విశ్వాసులను దొంగ వలే అధిగమించకూడదని పౌలు ఎందుకు చెప్పాడు?
ఎందుకంటే విశ్వాసులు చీకటిలో లేరు, అయితే వారు వెలుగు యొక్క కుమారులు. ప్రభువు దినం దొంగలా వారిని అధిగమించకూడదు.
1 Thessalonians 5:5
ప్రభువు దినం విశ్వాసులను దొంగ వలే అధిగమించకూడదని పౌలు ఎందుకు చెప్పాడు?
ఎందుకంటే విశ్వాసులు చీకటిలో లేరు, అయితే వారు వెలుగు యొక్క కుమారులు. ప్రభువు దినం దొంగలా వారిని అధిగమించకూడదు.
1 Thessalonians 5:6-8
రాబోయే ప్రభువు దినానికి సంబంధించి విశ్వాసులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు?
విశ్వాసులు మెలకువగా ఉండాలి మరియు స్థిరబుద్ధి కలిగి ఉండాలని పౌలు చెప్పాడు.
1 Thessalonians 5:9-11
విశ్వాసులు దేవుడు చేత దేని కోసం నియమించబడ్డారు?
విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కోసం దేవుని చేత ఉద్దేశించబడ్డారు.
1 Thessalonians 5:12
ప్రభువులో తమపై ఉన్నవారి పట్ల విశ్వాసులు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని పౌలు చెప్పాడు?
వారు ప్రేమలో వారిని గుర్తించి ఉన్నతంగా పరిగణించాలని పౌలు చెప్పాడు.
1 Thessalonians 5:13-14
ప్రభువులో తమపై ఉన్నవారి పట్ల విశ్వాసులు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని పౌలు చెప్పాడు?
వారు ప్రేమలో వారిని గుర్తించి ఉన్నతంగా పరిగణించాలని పౌలు చెప్పాడు.
1 Thessalonians 5:15-17
ఎవరికైనా కీడు జరిగినప్పుడు వారు ఏమి చేయకూడదని పౌలు చెప్పాడు?
ఎవరికైనా కీడు జరిగినప్పుడు వారు కీడుకు ప్రతి కీడు జరిగించకూడదని పౌలు చెప్పాడు?
1 Thessalonians 5:18-19
విశ్వాసులు ప్రతి దానిలో ఏమి చేయాలని పౌలు చెప్పాడు, మరియు ఎందుకు?
విశ్వాసులు ప్రతిదానిలో కృతజ్ఞతలు చెప్పాలని పౌలు చెప్పాడు, ఎందుకంటే ఇది వారి పట్ల దేవుని చిత్తం.
1 Thessalonians 5:20
ప్రవచనాల గురించి విశ్వాసులకు పౌలు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడు?
ప్రవచనాలను తృణీకరించవద్దని మరియు అన్నిటిని పరీక్షించి, మేలైన దానిని చేపట్టాలని పౌలు విశ్వాసులను ఆదేశిస్తున్నాడు.
1 Thessalonians 5:21-22
ప్రవచనాల గురించి విశ్వాసులకు పౌలు ఎలాంటి హెచ్చరికలు ఇచ్చాడు?
ప్రవచనాలను తృణీకరించవద్దని మరియు అన్నిటిని పరీక్షించి, మేలైన దానిని చేపట్టాలని పౌలు విశ్వాసులను ఆదేశిస్తున్నాడు.
1 Thessalonians 5:23-27
విశ్వాసులకు దేవుడు ఏమి చేయాలని పౌలు ప్రార్థిస్తున్నాడు?
విశ్వాసులను ఆత్మలో, మనసులో మరియు శరీరంలో సంపూర్ణంగా పవిత్రం చేయాలని పౌలు ప్రార్థిస్తున్నాడు.
1 Thessalonians 5:28
విశ్వాసుల విషయంలో పౌలు చేస్తున్న ప్రార్థన ఏమిటి?
ప్రభువైన యేసు క్రీస్తు కృప విశ్వాసులతో ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు.