Philemon
Philemon 1
Philemon 1:1
ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు?
ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు.
ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది?
ఈ ఉత్తరం పౌలు యొక్క ప్రియమైన స్నేహితుడు మరియు తోటి పనివాడు అయిన ఫిలేమోనుకు వ్రాయబడింది.
Philemon 1:2-4
సంఘం ఎటువంటి ప్రదేశంలో కలుస్తుంది?
సంఘం ఒక గృహంలో సమావేశమవుతోంది.
Philemon 1:5-6
ఫిలేమోను గురించి ఎటువంటి మంచి లక్షణాలను గురించి పౌలు విన్నాడు?
ఫిలోమోను యొక్క ప్రేమ, ప్రభువు మీద విశ్వాసం మరియు పరిశుద్ధులందరి పట్ల విశ్వాసం గురించి పౌలు విన్నాడు.
Philemon 1:7-8
పౌలు ప్రకారం, ఫిలేమోను పరిశుద్ధుల కోసం ఏమి చేసాడు?
ఫిలేమోను పరిశుద్ధుల హృదయాలను తెప్పరిల్ల చేసాడు.
Philemon 1:9
పౌలు ఫిలేమోనుకు ఆజ్ఞాపించడానికి బదులు అతనిని ఎందుకు అడుగుతున్నాడు?
పౌలు ప్రేమ కారణంగా ఫిలేమోనును అడుగుతున్నాడు
Philemon 1:10-11
పౌలు ఒనేసిమును ఏమని పిలిచాడు?
పౌలు ఒనేసిమును తన బిడ్డ అని పిలిచాడు.
ఒనేసిముకు తండ్రి అయినప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు?
పౌలు సంకెళ్ళలోనూ, చెరసాలలో ఉన్నాడు.
Philemon 1:12
పౌలు ఒనేసిముతో ఏమి చేసాడు?
పౌలు ఒనేసిమును ఫిలేమోను దగ్గరకు తిరిగి పంపాడు.
Philemon 1:13
ఈ పత్రిక రాస్తున్న పౌలు ఎక్కడ ఉన్నాడు?
ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు.
ఒనేసిము ఏమి చేయగలడని పౌలు కోరుకున్నాడు?
ఒనేసిము తనకు సహాయం చేయగలడని పౌలు కోరుకున్నాడు.
Philemon 1:14
ఫిలేమోను ఒనేసిముతో ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము బానిసగా ఉండడం నుండి ఫిలోమోను విడుదల చేయాలని, మరియు ఒనేసిము పౌలు వద్దకు తిరిగి రావడానికి అంగీకరించాలని కోరాడు.
Philemon 1:15
ఫిలేమోను ఒనేసిముతో ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము బానిసగా ఉండడం నుండి ఫిలోమోను విడుదల చేయాలని, మరియు ఒనేసిము పౌలు వద్దకు తిరిగి రావడానికి అంగీకరించాలని కోరాడు.
Philemon 1:16-17
ఫిలేమోను ఒనేసిముతో ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము బానిసగా ఉండడం నుండి ఫిలోమోను విడుదల చేయాలని, మరియు ఒనేసిము పౌలు వద్దకు తిరిగి రావడానికి అంగీకరించాలని కోరాడు.
ఫిలేమోను ఒనేసిమును ఏవిధంగా పరిగణించాలని పౌలు ఇప్పుడు కోరుకుంటున్నాడు?
ఫిలేమోను ఒనేసిమును ప్రియమైన సహోదరునిగా పరిగణించాలని పౌలు కోరుతున్నాడు.
Philemon 1:18
ఫిలేమోనుకు ఒనేసిము ఋణపడి ఉన్న ఏదైనా విషయంలో ఫిలేమోను ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఒనేసిము చెల్లించవలసిన ఏదైనా బాకీని పౌలు ఖాతాలో వసూలు చేయాలని ఫిలోమోనుము పౌలు కోరుతున్నాడు.
Philemon 1:19-20
ఫిలేమోను పౌలుకు ఏమి రుణపడి ఉన్నాడు?
ఫిలేమోను పౌలుకు తన జీవితమే రుణపడి ఉంటాడు.
Philemon 1:21
ఫిలేమోను ఒనేసిమును తిరిగి తన దగ్గరకు పంపాలని పౌలు భావిస్తున్నాడా?
అవును, ఫిలేమోను ఒనేసిమును వెనక్కి పంపుతాడని పౌలు నమ్మకంగా ఉన్నాడు.
Philemon 1:22-25
ఫిలేమోను తన కోసం ఏమి చేయాలని పౌలు కోరుతున్నాడు?
ఫిలేమోను తన కోసం అతిథి గదిని సిద్ధం చేయాలని పౌలు కోరుతున్నాడు.
ఫిలేమోను ఇలా చేయాలని పౌలు ఎందుకు కోరుతున్నాడు?
దేవుడు తనను ఫిలేమోను వద్దకు తిరిగి పంపుతాడని పౌలు ఆశిస్తున్నాడు.