తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Titus

Titus 1

Titus 1:1

దేవునికి చేసిన సేవలో పౌలు ఉద్దేశ్యం ఏమిటి?

దేవుడు ఎన్నుకొన్న ప్రజల విశ్వాసం స్థిరపరచడం, సత్యం గురించి జ్ఞానాన్ని స్థిరపరచడం అతని ఉద్దేశం.

Titus 1:2

దేవుడు తాను ఎన్నుకొన్న ప్రజలకోసం శాశ్వత జీవం ఎప్పుడు వాగ్దానం చేశాడు?

ఆయన యుగాల కాలాల ముందే వారికి వాగ్దానం చేసాడు

దేవుడు అబద్దం ఆడతాడా?

లేదు

Titus 1:3

దేవుడు తన ప్రకటనను సరైన సమయంలో ఎవరికి అప్పగించాడు?

దేవుడు దానిని అపొస్తలుడైన పౌలుకు అప్పగించాడు

Titus 1:4-5

తీతుకూ, పౌలుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

వారి ఉమ్మడి విశ్వాసం కారణంగా తీతు పౌలుకు నిజమైన కుమారుడిగా ఉన్నాడు.

Titus 1:6

పెద్ద యొక్క భార్య మరియు పిల్లలు ఏవిధంగా ఉండాలి?

అతడు ఏక పత్నీ పురుషుడిగా ఉండాలి, మరియు నిర్లక్ష్యంగల ప్రవర్తన లేదా తిరుగుబాటు విషయంలో నిందితుడు కాకుండా విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండాలి.

Titus 1:7

ఒక పెద్ద నిందితుడు కాకుండా ఉండడానికి ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన స్వభావ లక్షణాలు ఏమిటి?

అతడు అహంకారిగా ఉండకూడదు లేదా త్వరగా కోపపడేవాడు, లేదా మద్యానికి అలవాటు పడినవాడు, లేదా దెబ్బలాడేవాడు, లేదా దురాశపరుడుగా ఉండకూడదు.

దేవుని ఇంటిలో అధ్యక్షుని స్థానం మరియు బాధ్యత ఏమిటి?

అతడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడుగా ఉండాలి.

Titus 1:8

ఒక పెద్ద ఎటువంటి మంచి లక్షణాలు కలిగియుండాలి?

ఒక పెద్ద అతిథి ప్రియుడు, మంచికి స్నేహితుడు, స్థిరబుద్ధికలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం కలవాడుగా ఉండాలి.

Titus 1:9-10

తనకు నేర్పించిన ఉపదేశం విషయంలో పెద్ద వైఖరి ఏవిధంగా ఉండాలి?

అతడు దానిని గట్టిగా చేపట్టాలి. మరియు తద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఇతరులను గద్దించడానికి సమర్ధుడుగా ఉంటాడు.

Titus 1:11-12

వారి ఉపదేశం ద్వారా అబద్దపు బోధకులు ఏమి చేస్తున్నారు?

వారు కుటుంబాలు అన్నింటిని పాడుచేస్తున్నారు.

అబద్దపు బోధకులు ఏమి కోరుకున్నారు?

వారు సిగ్గుకరమైన లాభాన్ని కోరుకున్నారు.

Titus 1:13

సంఘాన్ని పాడుచేస్తున్న ఈ అబద్దపు బోధకులను ఒక పెద్ద ఏవిధంగా చూడాలి?

అతడు వారిని కఠినంగా గద్దించాలి తద్వారా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు.

Titus 1:14

వారు దేని విషయంలో శ్రద్ధ చూపకూడదని పౌలు చెప్పాడు?

వారు యూదుల కల్పనాకథలకూ మరియు మనుషుల ఆదేశాలకూ శ్రద్ధ చూపించకూడదు.

Titus 1:15

అవిశ్వాసియైన మనిషిలో అపవిత్రం అయినదేమిటి?

అతని మనసు మరియు మనస్సాక్షి రెండూ అపవిత్రం అయ్యాయి.

Titus 1:16

అపవిత్రుడైన మనిషి దేవుడు తెలుసు అని చెప్పుకొన్నప్పటికీ అతడు దేవుణ్ణి ఏవిధంగా నిరాకరిస్తున్నాడు?

అతడు తన పనుల ద్వారా దేవుణ్ణి నిరాకరిస్తున్నాడు.

Titus 2

Titus 2:2

సంఘంలోని వృద్ధ పురుషులు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి?

వారు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగానూ, స్థిరబుద్ధికలవారుగానూ మరియు విశ్వాసంలో, ప్రేమలో, పట్టుదలలో స్థిరులుగా ఉండాలి.

Titus 2:3

సంఘంలోని వృద్ధ స్త్రీలు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి?

వృద్ధస్త్రీలు గౌరవప్రదంగా ఉండాలి, కొండెకత్తెలు కాకుండా ఉండాలి మరియు నిగ్రహం కలిగి ఉండాలి, మరియు మంచికి బోధకులుగా ఉండాలి.

Titus 2:4-6

వృద్ధ స్త్రీలు యౌవనస్త్రీలకు ఏమి నేర్పించాలి?

వారు తమ భర్తలను ప్రేమించువారుగా, మరియు తమ బిడ్డలను ప్రేమించు వారుగా ఉండాలని బోధించాలి.

Titus 2:7

విశ్వాసులకు ఆదర్శంగా కనపరచుకొనేలా ఉండడానికి తీతు ఏమి చేయాలి?

అతడు మంచి పనుల విషయంలోనూ, నిష్కళంకంగానూ మర్యాదగానూ ఉండడంలోనూ ఆదర్శంగా ఉండాలి,

Titus 2:8

తీతు మంచి ఆదర్శంగా ఉంటే అతని ప్రతివాదికి ఏమి జరుగుతుంది?

అతని ప్రతివాది అతని గూర్చి చెడుమాట యేదియు చెప్పలేడు కనుక సిగ్గుపడతాడు.

Titus 2:9

విశ్వాసులైన బానిసలు ఏవిధంగా ప్రవర్తించాలి?

వారు బానిసలు తమ సొంత యజమానులకు విధేయులై వాదులాడకుండా సంతోషపెట్టేవారిగా ఉండాలి.

Titus 2:10

విశ్వాసులైన బానిసలు పౌలు హెచ్చరించినట్లు ప్రవర్తించినప్పుడు, ఇతరులమీద అది ఎలాంటి ప్రభావాన్ని కలిగియుంటుంది?

రక్షకుడు అయిన దేవుని గురించిన ఉపదేశానికి అన్ని విధాలుగా కీర్తి తెస్తుంది.

Titus 2:11

దేవుని కృప ఎవరిని రక్షించగలదు?

దేవుని కృప ప్రతి ఒక్కరినీ రక్షించగలదు.

Titus 2:12

మనం దేనిని తిరస్కరించడానికి దేవుని కృప మనకు శిక్షణ ఇస్తుంది?

భక్తిహీనతనూ, మరియు ఈ లోక సంబంధమైన దురాశలు తిరస్కరించడానికి దేవుని కృప మనకు మనకు శిక్షణ ఇస్తుంది.

Titus 2:13

విశ్వాసులు ఎటువంటి భవిష్యత్తు సంఘటనను పొందడం కోసం ఎదురుచూస్తున్నారు?

విశ్వాసులు శుభప్రదమైన నిరీక్షణ పొందడం కోసం ఎదురుచూస్తున్నారు: మన మహా దేవుడు, మరియు రక్షకుడు యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత.

Titus 2:14-15

యేసు మన కోసం ఎందుకు తనను తాను అర్పించుకొన్నాడు?

మనలను సమస్త దుర్మార్గమంతటి నుంచీ విమోచించడం కోసం, మరియు తనకోసం ప్రత్యేక ప్రజలుగా, మంచి పనుల కోసం ఆసక్తి గలవారుగా పవిత్రపరచుకోవడానికి ఆయన మన కోసం తనను తాను అర్పించుకొన్నాడు.

Titus 3

Titus 3:1-2

పరిపాలకులూ, అధికారుల పట్ల విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి?

విశ్వాసి వారికి లోబడాలి, మరియు వారికి విధేయులై ఉండాలి, మరియు ప్రతి మంచి పని కోసం సంసిద్ధంగా ఉండాలి.

Titus 3:3-4

అవిశ్వాసులను తప్పుదారి పట్టించేవీ, బానిసలుగా చేసేవీ ఏమిటి?

నానా విధాల కోరికలూ, సుఖానుభవాలు వారిని తప్పుదారి పట్టిస్తాయి, బానిసలుగా చేస్తాయి.

Titus 3:5-6

దేవుడు మనలను ఏ విధంగా రక్షించాడు?

నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, మరియు పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావం కలిగించడం ద్వారా ఆయన మనలను రక్షించాడు.

మనం చేసిన నీతి పనులు మూలంగా రక్షించబడ్డామా లేదా దేవుని కనికరం చేత రక్షించబడ్డామా?

మనం దేవుని కనికరం చేత రక్షించబడ్డాము.

Titus 3:7

దేవుడు మనలను నీతిమంతులుగా చేసిన తరువాత మనలను ఏవిధంగా చేస్తాడు?

దేవుడు మనలను తన వారసులుగా చేస్తాడు.

Titus 3:8

విశ్వాసులు ఏమి చేయడానికి జాగ్రత్త వహించాలి?

విశ్వాసులు మంచి పనులు చెయ్యడంలో జాగ్రత్త వహించాలి.

Titus 3:9

విశ్వాసులు వేటిని తప్పించాలి?

విశ్వాసులు బుద్ధిలేని వాదనలు, వంశావళులు, కలహము, మరియు ధర్మశాస్త్రమును గురించిన విభేధములను తప్పించాలి.

Titus 3:10-13

ఒకటి లేదా రెండు హెచ్చరికల తర్వాత మనం ఎవరిని విసర్జించాలి?

విభజించే వ్యక్తిని మనం విసర్జించాలి.

Titus 3:14-15

విశ్వాసులు ఫలవంతులు కావడానికి తాము దేనిలో పాల్గొనాలి?

విశ్వాసులు తప్పనిసరి ఆవసరాల విషయం మంచి పనులలో తాము పాల్గొనడం నేర్చుకోవాలి.