తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Revelation

Revelation 1

Revelation 1:1-3

ఈ ప్రత్యక్షత మొదట ఎవరి నుంచి వచ్చింది, దేవుడు ఎవరికి చూపాడు?

యేసుక్రీస్తు ప్రత్యక్షత దేవుని నుండి వచ్చింది, ఆయన తన దాసులకు చూపాడు(1:1).

ఈ ప్రత్యక్షత గూర్చిన సంగతులు ఎప్పుడు జరుగుతాయి?

ఈ ప్రత్యక్షత గూర్చిన సంగతులు త్వరలో జరుగుతాయి(1:1).

ఈ గ్రంథం వల్ల ఎవరు ధన్యులు?

ఈ గ్రంథం బహిరంగంగా చదివేవారు, వినేవారు, వాటిని పాటించేవారు ధన్యులు(1:3).

Revelation 1:4-6

ఈ గ్రంథం ఎవరు ఎవరికి రాశారు?

యోహాను ఈ గ్రంథం ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు రాశాడు(1:4).

యేసు క్రీస్తుకు యోహాను ఏ మూడు బిరుదులను ఇచ్చాడు?

యేసు క్రీస్తుకు యోహాను నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలోనుంచి మొదట లేచినవాడు, భూరాజులను పరిపాలించువాడు అనే మూడు బిరుదులను ఇచ్చాడు(1:5).

యేసు విశ్వాసులను ఏం చేశాడు?

యేసు విశ్వాసులను తండ్రియైన దేవునికి రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు(1:6).

Revelation 1:7-8

యేసు వచ్చినప్పుడు ఎవరు చూస్తారు?

యేసు వచ్చినప్పుడు ప్రతీ కన్నూ, ఆయనను పొడిచినవారూ చూస్తారు(1:7).

ప్రభువైన దేవుడు తనను తాను ఎలా వివరించుకొన్నాడు?

ప్రభువైన దేవుడు తనను తాను అల్ఫాయు ఓమెగయు, ప్రస్థుతమూoటూ, పూర్వముoడి, భవిష్యత్తులో రాబోవు వాడినని వివరించుకొన్నాడు(1:8).

Revelation 1:9-13

యోహాను పత్మాసు దీవిలో ఎందుకున్నాడు?

యోహాను పత్మాసు దీవిలో దేవుని వాక్కు కోసం యేసును గూర్చిన సాక్ష్యం కోసం ఉన్నాడు(1:9).

యోహాను ఏం చెయ్యాలని వెనుక నుండి పెద్ద స్వరం చెప్పడం జరిగింది?

యోహానుకు వెనుక నుంచి వచ్చిన స్వరం తాను చూచినది గ్రంథంలో రాసి ఆసియాలోని ఏడు సంఘాలకు పoపంపించాలని చెప్పడం జరిగింది(1:11).

Revelation 1:14-16

యోహాను చూచిన వ్యక్తి ఎలాంటి కన్నులూ, వెంట్రుకలు కలిగి ఉన్నాడు?

యోహాను చూచిన వ్యక్తి ఉన్నివలె తెల్లని వెంట్రుకలూ, మండుచున్న అగ్ని వంటి కన్నులూ కలిగి ఉన్నాడు(1:14).

ఆ వ్యక్తి కుడి చేతిలో ఏముంది, అతని నోటి నుంచి బయటకు ఏం వస్తుంది?

ఆ వ్యక్తి కుడి చేతిలో ఏడు నక్షత్రాలు, రెండంచుల పదునైన కత్తి నోటి నుంచి బయటకు వస్తుంది(1:16).

Revelation 1:17-18

ఆ వ్యక్తిని చూచినప్పుడు యోహాను ఏం చేశాడు?

ఆ వ్యక్తిని చూచినప్పుడు యోహాను చచ్చిన వాని వలె ఆ వ్యక్తి పాదాల దగ్గర పడ్డాడు(1;18).

Revelation 1:19-20

ఏడు నక్షత్రాలూ, ఏడు ద్వీప స్తంభాలూ అర్ధము ఏమిటి?

ఏడు నక్షత్రాలూ ఏడు సంఘాల దూతలు ఏడు ద్వీప స్తంభాలూ ఏడు సంఘాలు(1:20).

Revelation 2

Revelation 2:1-2

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం ఎఫెసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:1).

ఎఫెసులో ఉన్న సంఘo దుష్టులైన వారికీ, అబద్ద ప్రవక్తలకూ ఏం చేసింది?

ఎఫెసులో ఉన్న సంఘo దుష్టులైన వారిని సహించలేదూ, అబద్ద ప్రవక్తలను పరీక్షించి సహించలేదు(2:2).

Revelation 2:3-5

ఎఫెసు సంఘంలో క్రీస్తు కలిగియున్న వ్యతిరేకత ఏమిటి?

ఎఫెసు సంఘంలో క్రీస్తు కలిగియున్న వ్యతిరేకత వారి మొదటి ప్రేమను విడిచి పెట్టడం(2:5).

వారు మారుమనస్సు పొందక పోతే ఏం చేస్తానని క్రీస్తు చెప్పాడు?

వారు మారుమనస్సు పొందక పోతే వారి దీపస్తంభం దాని ఉన్న చోటు నుంచి తొలగిస్తానని క్రీస్తు చెప్పాడు(2:5).

Revelation 2:6-7

జయించు వారికి క్రీస్తు చేసిన వాగ్దానం ఏమిటి?

జయించు వారికి పరదైసులో జీవ వృక్ష ఫలాలు తినడానికి ఇస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).

Revelation 2:8-9

తరువాతి గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాతి గ్రంథ భాగం స్ముర్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:8).

స్ముర్న సంఘము ఏమి అనుభవం కలిగి ఉంది?

స్ముర్న సంఘము శ్రమానుభవమూ, పేదరికమూ, నిందానుభవం కలిగి ఉంది(2:9).

Revelation 2:10-11

మరణం వరకు నమ్మకంగా ఉండి జయించిన వారికి క్రీస్తు చేసిన వాగ్దానం ఏమిటి?

మరణం వరకు నమ్మకంగా ఉండి జయించిన వారికి క్రీస్తు జీవకిరీటమిచ్చీ, రెండవ మరణం వల్ల ఎటువంటి హాని కలగదని వాగ్దానం చేశాడు(2:10-11).

Revelation 2:12-13

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం పెర్గములోని సంఘo దూతకు రాయడం జరిగింది(2:12).

పెర్గము సంఘo ఎక్కడ నివాసముంది?

పెర్గము సంఘo సాతాను సింహాసనo ఉన్న స్థలంలో నివాసముంది(2:13).

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం ఏం చేసింది?

అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం క్రీస్తు నామమును గట్టిగా పట్టుకొని, విశ్వాసం కాదన లేదు(2:13).

Revelation 2:14-15

పెర్గము సంఘంలో కొందరు పట్టుకొని ఉన్న రెండు బోధలేంటి?

పెర్గము సంఘంలో కొందరు బిలాం బోధలూ, కొoదరు నికోలయతు బోధలూ పట్టుకొని ఉన్నారు(2:14-15).

Revelation 2:16-17

మారుమనస్సు పొందక అబద్ద బోధలను పట్టుకుంటే ఏం చేస్తానని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు?

మారుమనస్సు పొందక అబద్ద బోధలను పట్టుకుంటే వారికి వ్యతిరేకంగా యుద్దము చేస్తానని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(2:16).

జయించిన వారికి ఏం చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారికి మరుగైన మన్నానూ, ఒక కొత్త పేరుగల తెల్లని రాయి పొందుతారని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:17).

Revelation 2:18-19

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం తుయతైరలోని సంఘం దూతకు రాయడం జరిగింది(2:18).

తుయతైర సంఘం చేసిన ఏ మంచి పనులను క్రీస్తు తెలుసుకున్నాడు?

తుయతైర సంఘంలోని ప్రేమా, విశ్వాసమూ, సేవా, సహనమూ ఓర్పు వంటి మంచిపనులను క్రీస్తు తెలుసుకున్నాడు(2:19).

Revelation 2:20-21

తుయతైర సంఘంలో క్రీస్తుకు ఉన్న వ్యతిరేకత ఏమిటి?

తుయతైర సంఘంలో క్రీస్తుకు ఉన్న వ్యతిరేకత, వారు యెజెబెలు ప్రవక్తి అనైతికమైన తప్పుడు విధానాన్ని సహిస్తున్నారు(2:20).

Revelation 2:22-23

యెజెబెలు మారుమనసు పొందకపోతే ఏమి చేస్తానని క్రీస్తు హెచ్చరించాడు?

యెజెబెలు మారుమనసు పొందకపోతే ఆమెను మంచం పట్టించి ఆమె పిల్లలను కొట్టి చంపేస్తానని క్రీస్తు హెచ్చరించాడు(2:22-23).

Revelation 2:24-25

యెజెబెలు బోధను పాటించని వారు ఏమి చెయ్యాలని క్రీస్తు చెప్పాడు?

యెజెబెలు బోధను పాటించని వారు ఆయన వచ్చే వరకు ఆయనలో కలిగింది గట్టిగా పట్టుకోoడని క్రీస్తు చెప్పాడు(2:25).

Revelation 2:26-29

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారికి జనాల మీద అధికారంనూ వేకువ నక్షత్రానిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).

చదివేవారు ఏం వినాలని క్రీస్తు చెబుతున్నాడు?

చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(2:29).

Revelation 3

Revelation 3:1-4

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం సార్దీసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:1).

సార్దీసులో ఉన్న సంఘ ప్రసిద్ధి ఏoటి, దాన్నిగూర్చిన సత్యం ఏoటి?

సార్దీసులో ఉన్న సంఘo బ్రతికుంది కానీ దానిలోని సత్యం చనిపోయిoది(3:1).

సార్దీసులో ఉన్న సంఘo ఏం చెయ్యాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు?

సార్దీసులో ఉన్న సంఘాని మేల్కొని, మిగిలిన వాటిని దృఢ పరచుకొని, జ్ఞాపకం చేసుకొని, తగ్గించుకొని, మారుమనసు పొందాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(3:2-3).

Revelation 3:5-6

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు ?

జయించిన వారికి తెల్లని వస్త్రాలు ధరించడం జరుగుతుంది, జీవగ్రంథంలో పేరు నిలిచి ఉంటుంది, తండ్రియైన దేవుని ఎదుట వారి పేరు పలకడం జరుగుతుంది(3:5).

Revelation 3:7-8

తరువాత గ్రంథ భాగం ఏ దూతకు రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:8).

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo తక్కువ బలమున్నప్ప్తటికి ఏమి చేసింది?

ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo తక్కువ బలమున్నప్పటికీ క్రీస్తు వాక్కుకు విధేయత చూపీ ఆయన పేరు తెలియదనలేదు(3:8).

Revelation 3:9-11

సాతాను సమాజం వారిని క్రీస్తు ఏమి చేస్తాడు?

సాతాను సమాజం వారిని పవిత్రుల కాళ్ళ ముందు పడి నమస్కారం చేసేలా క్రీస్తు చేస్తాడు(3:9).

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సంఘo ఏమి చెయ్యాలని క్రీస్తు చెప్పాడు?

ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సంఘo ఏదైతే కలిగిఉoదో ఆ కిరీటం ఎవరు తీసుకోకుండా గట్టిగా పట్టుకోవాలని క్రీస్తు చెప్పాడు(3:11).

Revelation 3:12-13

జయించిన వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించిన వారిని దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటారు, దేవుని పేరు కలిగి ఉంటారు, దేవుని పట్టణం పేరు కలిగి ఉంటారు, క్రీస్తు కొత్త పేరు వారి మీద రాయడం జరుగుతుందని క్రీస్తు వాగ్దానం చేశాడు(3:12).

Revelation 3:14-16

ఏ దూతకు తరువాత గ్రంథ భాగం రాయడం జరిగింది?

తరువాత గ్రంథ భాగం లవొదికయలో ఉన్న సంఘ దూతకు రాయడం జరిగింది(3:14).

లవొదికయలో ఉన్న సంఘo ఎలా ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు?

లవొదికయలో ఉన్న సంఘo చల్లగానైన వెచ్చగానైన ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు(3:15).

క్రీస్తు లవొదికయలో ఉన్న సంఘానికి ఏమి చెయ్యాలని ఉన్నాడు, ఎందుకు?

లవొదికయలో ఉన్న సంఘo నులివెచ్చగా ఉన్నందుకు తన నోటి నుంచి ఉమ్మి వేయబోతున్నాడు (3:16).

Revelation 3:17-18

లవొదికయలో ఉన్న సంఘo తన గూర్చి తాను ఏమనుకుoటుంది?

లవొదికయలో ఉన్న సంఘo తన గూర్చి తాను ధనవంతుడననీ తనకు కొదువంటూ ఏమి లేదని అనుకుంటుంది(3:17).

లవొదికయలో ఉన్న సంఘo గూర్చి క్రీస్తు ఏమంటున్నాడు?

లవొదికయలో ఉన్న సంఘo గూర్చి క్రీస్తు దిక్కుమాలినవాడనీ, దౌర్భగ్యుడనీ, దరిద్రుడనీ, గుడ్డివాడనీ, దిగంబరిగా ఉన్నావని క్రీస్తు చెబుతున్నాడు(3:17).

Revelation 3:19-20

ఆయన ప్రేమిoచువారి కోసం క్రీస్తు ఏమి చేస్తాడు?

ఆయన ప్రేమిoచువారికి శిక్షణ ఇచ్చి నేర్పిస్తాడు(3:19).

Revelation 3:21-22

జయించు వారికి ఏమి చేస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు?

జయించు వారిని క్రీస్తు తన సింహాసనం మీద కూర్చోనిస్తాడు(3:21).

చదివేవారు ఏం వినాలని క్రీస్తు చెబుతున్నాడు?

చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(3:22).

Revelation 4

Revelation 4:1-3

ఏమి తెరుచుకోడం యోహాను చూశాడు?

యోహాను పరలోకంలో ఒక తలుపు తెరుచుకోడం చూశాడు(4:1).

యోహానుతో ఆ స్వరం ఏమి చూపుతానని చెప్పింది?

యోహానుతో ఆ స్వరం ఇక మీదట జరిగేది ఆయన చూపుతాడని చెప్పింది(4:1).

పరలోకంలో ఎవరో కూర్చుని ఉన్నదేంటి?

పరలోకంలో ఎవరో సింహాసనం మీద కూర్చున్నాడు(4:2).

Revelation 4:4-5

పరలోకంలో సింహాసనం చుట్టూ ఉన్నదేంటి?

పరలోకంలో సింహాసనం చుట్టూ ఇరవైనాలుగు సింహాసనాలు పైన ఇరువైనాలుగు మంది పెద్దలు కూర్చున్నారు(4:4).

సింహాసనం ఎదుట మండుచున్న ఏడు దీపాలు ఏమై ఉన్నాయి?

సింహాసనం ఎదుట మండుచున్న ఏడు దీపాలు దేవుని ఏడాత్మలు (4:5).

Revelation 4:6

సింహాసనం చుట్టూ ఉన్నవి నాలుగు ఏమిటి?

సింహాసనం చుట్టూ ఉన్నవి నాలుగు జీవులు(4:6).

Revelation 4:7-8

రాత్రింబవళ్ళు నాలుగు జీవులు ఏం చేస్తున్నాయి?

రాత్రింబవళ్ళు నాలుగు జీవులు దేవునికి మహిమా ఘనతా కృతజ్ఞతా స్తుతులు మానక చేస్తున్నాయి (4:8-9).

Revelation 4:9-11

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు ఏం చేశారు?

దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు సింహాసనం ఎదుట వంగి సాగిలపడి, తమ కిరీటాలు పడేశారు(4:10).

సృష్టిలో దేవుని పాత్ర గూర్చి పెద్దలు ఏం చెప్పారు?

దేవుడు సమస్తమును సృష్టించెను ఆయన చిత్తం ద్వారా అవన్నియు జీవిస్తున్నాయి అని పెద్దలు చెప్పారు(4:11).

Revelation 5

Revelation 5:1-2

సింహాసనం మీద కూర్చున్న వాని కుడిచేతిలో యోహాను ఏం చూశాడు?

సింహాసనం మీద కూర్చున్న వాని కుడిచేతిలో ఏడు ముద్రలతో ముద్రించి ఉన్న గ్రంథం యోహాను చూశాడు(5:1).

గ్రంథం విప్పటానికి చదవటానికి భూమి మీద యోగ్యుడెవరు?

గ్రంథం విప్పటానికి చదవటానికి భూమి మీద యోగ్యులెవరూ లేరు(5:2-4).

Revelation 5:3-5

చుట్టి ఉన్న గ్రంథo దాని ఏడు ముద్రలు విప్పుటకు ఎవరు సమర్ధుడు?

చుట్టి ఉన్న గ్రంథo, దాని ఏడు ముద్రలు విప్పుటకు యూదగోత్ర సింహం, దావీదు వేరు చిగురు సమర్ధుడు(5:5).

Revelation 5:6-7

సింహాసనం ఎదుట పెద్దల మధ్యలో ఎవరు నుంచున్నారు?

సింహాసనం ఎదుట పెద్దల మధ్యలో చూడ్డానికి వధింపబడినట్టుగా ఉన్న గొర్రెపిల్ల నుంచుంది(5:6).

గొర్రెపిల్ల మీదున్న ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏమిటి?

గొర్రెపిల్ల మీదున్న ఏడు కొమ్ములు ఏడు కన్నులు భూమంతటికీ పంపిన దేవుని ఏడాత్మలు(5:6).

Revelation 5:8

పెద్దలు కలిగున్నసువాసన ధూపంతో నింపిన బంగారు పాత్రలు ఏమిటి?

పెద్దలు కలిగున్నసువాసన ధూపంతో నింపిన బంగారు పాత్రలు పవిత్రుల ప్రార్ధనలు(5:8).

Revelation 5:9-10

ఎందుకు చుట్టి ఉన్న గ్రంథం విప్పుటకు గొర్రెపిల్ల యోగ్యుడు?

చుట్టి ఉన్న గ్రంథం విప్పుటకు గొర్రెపిల్ల యోగ్యుడు ఎందుకంటే ప్రతీ గోత్రం నుంచి, బాష నుంచి, ప్రజల నుంచి, జనం నుంచి ఆయన రక్తంతో దేవుని కోసం ఆయన మనుషులను కొన్నాడు(5:9).

దేవుని యాజకులు ఎక్కడ పరిపాలిస్తారు?

దేవుని యాజకులు భూమ్మీద పరిపాలిస్తారు(5:10).

Revelation 5:11-12

గొర్రెపిల్ల ఏమి పొందడానికి యోగ్యుడని అని దేవదూత చెప్పాడు?

గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తుతి పొందడానికి యోగ్యుడు అని దేవదూత చెప్పాడు [5:12].

Revelation 5:13-14

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని ఎవరు చెప్పారు?

సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని సృష్టించ బడిన ప్రతిదీ చెప్పడం జరిగింది(5:13).

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలేమి చేశారు?

నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలు సాష్టాంగపడి ఆరాధించిరి(4:14).

Revelation 6

Revelation 6:1-2

గొర్రెపిల్ల చుట్టి ఉన్న గ్రంథంతో ఏం చేసింది?

గొర్రెపిల్ల చుట్టి ఉన్న గ్రంథం ఏడు ముద్రలలో ఒకటి విప్పడం చేసింది(6:1).

మొదటి ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

మొదటి ముద్ర విప్పిన తరువాత తెల్లని గుర్రంపై జయిoచడానికి బయలుదేరిన ఒకనిని యోహాను చూశాడు(6:2 ).

Revelation 6:3-4

రెండవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

రెండవ ముద్ర విప్పిన తరువాత భూమి మీద నుండి శాంతిని తీసివేయడానికి మండుచున్న ఒక ఎర్రనిగుర్రం తోలేవాన్నియోహాను చూశాడు(6:4).

Revelation 6:5-6

మూడవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

మూడవ ముద్ర విప్పిన తరువాత త్రాసు చేత పట్టుకొని ఒక నల్లని గుర్రం తోలేవాన్ని యోహాను చూశాడు(6:5).

Revelation 6:7-8

నాలుగవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

నాలుగవ ముద్ర విప్పిన తరువాత ఒక కాంతిలేని తెల్లబారిన గుర్రాన్ని తోలే మరణం అనే పేరు గలవాన్నియోహాను చూశాడు(6:9).

Revelation 6:9-11

ఐదవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

ఐదవ ముద్ర విప్పిన తరువాత దేవుని వాక్కు కోసం చనిపోయిన వారిని యోహాను చూశాడు(6:9).

బలిపీఠo కింద ఉన్న ఆత్మలు దేవుని నుండి ఏం తెలుసుకోవాలనుకొన్నాయి?

బలిపీఠo కింద ఉన్న ఆత్మలు వారి రక్తం కోసం ఎంతకాలానికి పగ తీర్చు కుంటాడని దేవుని నుండి తెలుసుకోవాలనుకొన్నాయి(6:10).

Revelation 6:12-14

ఆరవ ముద్ర విప్పిన తరువాత యోహాను ఏం చూశాడు?

ఆరవ ముద్ర విప్పిన తరువాత యోహాను భూకంపం, సూర్యుడు నల్లగామారడం, చంద్రుడు రక్తంలాగ మారడం, నక్షత్రాలు భూమి మీద పడటం చూశాడు(6:12-13).

Revelation 6:15-17

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు ఏం చేయడం యోహాను చూశాడు?

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు గుహలలో దాగి బండలతో మా మీద పడి దాచమని అడగడం యోహాను చూశాడు(6:15-16).

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు దేని నుంచి దాగి ఉండాలని కోరారు?

భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల కోపం నుంచీ దాగి ఉండాలని కోరారు(6:16).

ఎలాంటి రోజు వచ్చింది?

సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల నుంచీ మహా ఉగ్రత రోజు వచ్చింది(6:17).

Revelation 7

Revelation 7:1-3

యోహాను చూచినప్పుడు భూమ్మీద నలుదిక్కుల నిలుచున్న నలుగురు దూతలు ఏం చేస్తున్నారు?

యోహాను చూచినప్పుడు భూమ్మీద నలుదిక్కుల నిలుచున్న నలుగురు దూతలు భూమి నాలుగు దిక్కుల గాలులను పట్టుకున్నారు(7:1).

భూమికి హనీ చేయక ముందు ఏం చెయ్యాలని తూర్పు నుంచి వచ్చిన దేవదూత చెప్పాడు?

భూమికి హనీ చేయక ముందు దేవుని దాసుల నొసట మీద ముద్ర వెయ్యాలని దేవదూత చెప్పాడు(7:2-3).

Revelation 7:4-8

ఏ గోత్రం నుంచి ఎంత మంది ప్రజలు ముద్రించడం జరిగింది?

ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుంచి 1,44,OOO మంది ముద్రించడం జరిగింది(7:4).

Revelation 7:9-10

సింహాసనం ముందూ గొర్రెపిల్ల ఎదుట యోహాను ఏo చూశాడు?

సింహాసనం ముందూ గొర్రెపిల్ల ఎదుట ప్రతి జనంలో నుంచీ, ప్రతి గోత్రంలో నుంచీ, ప్రతి ప్రజల్లో నుంచీ, ప్రతి భాషల్లో నుంచీ గొప్ప జనసముహంను యోహాను చూశాడు(7:10).

సింహాసనం ముందు ఉన్న వారి ప్రకారం, రక్షణ ఎవరికి చెందింది?

సింహాసనం ముందు ఉన్న వారి ప్రకారం దేవునికీ గొర్రెపిల్లకూ రక్షణ చెందినది(7:10).

Revelation 7:11-12

దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు దేవున్ని ఆరాధిస్తూoడగా ఎలాంటి శరీర స్థితిలో ఉన్నారు?

దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు వారు సాష్టాంగపడి తమ ముఖాలు నేలపై ఉంచి దేవున్ని ఆరాధిoచారు. (7:11).

Revelation 7:13-14

సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన వారెవరని పెద్ద చెప్పాడు?

సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మహా శ్రమల్లో నుంచి వచ్చిన వారని పెద్ద చెప్పాడు(7:14).

ఎలా సింహాసనం ముందు ఉన్నవారి వస్త్రాలు తెల్లగా అయ్యాయి?

సింహాసనం ముందున్నవారి వస్త్రాలు గొర్రెపిల్ల రక్తం ద్వారా తెల్లగా అయ్యాయి(7:14).

Revelation 7:15-17

తెల్లని వస్త్రాలు ధరించిన వారి కోసం దేవుడు ఏం చేస్తాడని పెద్ద చెప్పాడు?

తెల్లని వస్త్రాలు ధరించిన వారి పైన దేవుడు తన గుడారం కప్పుతాడు కనుక వారెప్పటికి భాదపడరు(7:15-16).

తెల్లని వస్త్రాలు ధరించిన వారి కోసం గొర్రెపిల్ల ఏం చేస్తాడని పెద్ద చెప్పాడు?

తెల్లని వస్త్రాలు ధరించిన వారికి గొర్రెపిల్ల కాపరియై జీవజలం ఊటకు నడిపిస్తుంది(7:17).

Revelation 8

Revelation 8:1-2

ఏ కారణం చేత పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది?

ఏడవ ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది(8:1).

దేవుని ముందు నిల్చున్న ఏడు దూతలకు ఏం ఇవ్వడం జరిగింది?

దేవుని ముందు నిల్చున్న ఏడు దూతలకు ఏడు బూరలివ్వడం జరిగింది(8:2).

Revelation 8:3-5

దేవుని ఎదుట ఏం లేచింది?

దేవుని ఎదుట పవిత్రుల ప్రార్ధనా ధూపం పొగ లేచింది(8:4).

దేవదూత బలిపీఠo నుంచి నిప్పులు తీసి భూమ్మీద పడేసినప్పుడు ఏం అయ్యింది?

దేవదూత బలిపీఠo నుంచి నిప్పులు తీసి భూమ్మీద పడేసినప్పుడు ఉరుములూ, ధ్వనులు, మెరుపులు కలిగి భూకంపం వచ్చిoది(8:5).

Revelation 8:6-7

మొదటి దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

మొదటి దూత బూర ఊదినప్పుడు భూమ్మీద మూడోవంతు కాలిపోయింది, చెట్లలో మూడోవంతు కాలిపోయాయి, పచ్చగడ్డి మూడోవంతు కాలిపోయింది(8:7).

Revelation 8:8-9

రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

రెండవ దూత బూర ఊదినప్పుడు సముద్రాలలో మూడోవంతు రక్తంగా మారింది, సముద్ర జీవులలో మూడోవంతు చనిపోయాయి, ఓడలలో మూడోవంతు నాశనమయ్యాయి(8:8-9).

Revelation 8:10-11

మూడవ దూత బూర ఊదినపుడు ఏం జరిగింది?

మూడవ దూత బూర ఊదినప్పుడు నీటిలో మూడోవంతు చేదుగా మారింది దాని వల్ల అనేకమంది చనిపోయారు(8:10-11).

Revelation 8:12

నాలుగోవ దూత బూర ఊదినప్పుడు ఏం అయ్యింది?

నాలుగోవ దూత బూర ఊదినప్పుడు పగటి సూర్యుని వెలుగులో మూడోవంతు చీకటై పోయింది చంద్ర నక్షత్రాల వెలుగులో మూడోవంతు చీకటై పోయింది(8:12).

Revelation 8:13

ఎందుకు గ్రద్ద భూమ్మీదున్న వారికీ "అయ్యో, అయ్యో, అయ్యో" అంది?

ఉదాటానికి మిగిలివున్న మూడు బూరలు గూర్చి భూమ్మీదున్న వారికీ "అయ్యో, అయ్యో, అయ్యో" అని గ్రద్ద అంది(8:13).

Revelation 9

Revelation 9:1-2

ఐదవ దూత బూర ఊదినప్పుడు యోహాను ఎలాంటి నక్షత్రాన్ని చూశాడు?

ఐదవ దూత బూర ఊదినప్పుడు యోహాను పరలోకం నుంచి భూమ్మీద పడుతున్న నక్షత్రాన్ని చూశాడు(9:1).

నక్షత్రం ఏం చేసింది?

నక్షత్రం అంతంలేని లోతైన అగాధం తెరిచింది(9:2).

Revelation 9:3-4

అగాధంలో నుంచి వచ్చిన మిడతలుకు ఏం చెయ్యాలని చెప్పడం జరిగింది?

అగాధంలో నుంచి వచ్చిన మిడతలుకు భూమికి హాని చేయకూడదని, నోసళ్ళ మీద దేవుని ముద్ర లేని వారికే హాని చెయ్యాలని చెప్పడం జరిగింది(9:6).

Revelation 9:5-6

మిడతలు ద్వారా బాధలుపడిన వారు వెదుకుతారు కానీ కనుగొన లేకపోతారు ఏమిటి?

మిడతలు ద్వారా బాధలుపడిన వారు చావును వెదుకుతారు కానీ కనుగొన లేకపోతారు(9:6).

Revelation 9:7-9

మిడతల రెక్కలు ఎలాంటి శబ్దం చేస్తాయి?

మిడతల రెక్కలు యుద్దంలో పరుగెత్తుతున్నా అనేక గుర్రాలు రధాలు వలె శబ్దం చేస్తాయి(9:9).

Revelation 9:10-12

మిడతలన్నిటి పైన రాజు ఎవరు?

మిడతలన్నిటి పైన రాజు అగాధానికి దూత అబద్దోను, గ్రీకులో అపోల్లుయోను(9:12).

ఐదవ బూర ఊదిన తరువాత ఏమి గతించింది?

ఐదవ బూర ఊదిన తరువాత మొదటి శ్రమ గతించింది(9:12).

Revelation 9:13-15

ఆరవ దూత బూర ఊదినప్పుడు యోహాను ఏలాంటి స్వరం విన్నాడు?

ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న బంగారు బలిపీఠo నుంచి ఒక స్వరం విన్నాడు(9:13).

ఆ స్వరం విన్నప్పుడు నలుగురు దేవదూతలు ఏం చేశారు?

ఆ స్వరం విన్నప్పుడు నలుగురు దేవదూతలు మనుషుల్లో మూడోవంతు చంపుటకు విడిపించడం జరిగింది(9:15).

Revelation 9:16-17

ఎంత మంది గుర్రాలపై ఉన్న సైనికులను యోహాను చూశాడు?

ఇరవై కోట్ల మంది సైనికులు గుర్రాలపైన ఉండటం చూశాడు(9:16).

Revelation 9:18-19

ఏ తెగుళ్ళు మనుషుల్లో మూడోవంతు చంపడం జరిగింది?

గుర్రాల నోటిలో నుంచి వచ్చే మంటలు, పొగ, గంధకాల తెగుళ్ళు చేత మనుషుల్లో మూడోవంతు చంపడం జరిగింది(9:18).

Revelation 9:20-21

తెగుళ్ల చేత చావని మనుషులు ఎలా స్పందించారు?

తెగుళ్ల చేత చావని మనుషులు వారి పనుల వల్ల పశ్చాత్తాపపడలేదూ దయ్యాలని పూజించడం మానలేదు(9:20).

Revelation 10

Revelation 10:1-2

యోహాను చూచిన బలిష్ఠుడైన దేవదూత ముఖమూ కాళ్ళు చూడటానికి ఏం పోలి ఉన్నాయి?

యోహాను చూచిన బలిష్ఠుడైన దేవదూత ముఖo సూర్యుని వలే, కాళ్ళు అగ్ని స్తంభాలను పోలి ఉన్నాయి(10:2).

దేవదూత ఎక్కడ నుంచున్నాడు?

దేవదూత తన కుడిపాదం సముద్రం మీద ఎడమ పాదం నేల మీద పెట్టి నుంచున్నాడు(10:2).

Revelation 10:3-4

ఏమి రాయకూడదని యోహానుకు చెప్పాడు?

ఏడు ఉరుములు చెప్పిన సంగతులు రాయకూడదని యోహానుకు చెప్పాడు(10:4).

Revelation 10:5-7

బలిష్ఠుడైన దేవదూత ఎవరి తోడని ప్రమాణం చేసెను?

బలిష్ఠుడైన దేవదూత పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ సృజించి యుగయుగాలు జీవించుచున్న వాని తోడని ప్రమాణం చేసెను(10:6).

ఏమి ఆలస్యం కాదని బలిష్ఠుడైన దేవదూత చెప్పాడు?

ఇక ఆలస్యం కాదు ఏడవ దూత బూర ఊదినప్పుడు దేవుని రహస్యము సమాప్తమవుతుందని బలిష్ఠుడైన దేవదూత చెప్పాడు(10:7).

Revelation 10:8-9

బలిష్ఠుడైన దేవదూత నుంచి ఏమి తీసుకోమని యోహానుకు చెప్పడం జరిగింది?

బలిష్ఠుడైన దేవదూత నుంచి విప్పిన పుస్తకం తీసుకోమని యోహానుకు చెప్పడం జరిగింది(10:8).

యోహాను ఆ గ్రంథం తినినప్పుడు ఏమవుతుందని దేవదూత చెప్పాడు?

యోహాను ఆ గ్రంథం తినినప్పుడు నోటికి తియ్యగాను కడుపుకి చేదవుతుందని దేవదూత చెప్పాడు(10:9).

Revelation 10:10-11

యోహాను ఆ గ్రంథం తినిన తరువాత ఏమని ప్రవచనం చెప్పాడు?

యోహాను ఆ గ్రంథం తినిన తరువాత అనేకమంది ప్రజల గూర్చి, జనముల గూర్చి, అనేక భాషలు మాట్లాడేవారి గూర్చి, అనేకమంది రాజులను గూర్చి ప్రవచనం చెప్పాడు(10:11).

Revelation 11

Revelation 11:1-2

ఏమి కొలవమని యోహానుకు చెప్పాడు?

దేవుని ఆలయమును బలిపీఠo కొలిచి అందులో ఆరాదించు వారిని లెక్కపెట్టమని యోహానుకు చెప్పాడు(11:1).

అన్యజనులు ఎంతకాలము పవిత్రమైన పట్ట్తణాన్ని తొక్కుతారు?

అన్యజనులు నలబై రెండు నెలలు పవిత్రమైన పట్ట్తణాన్ని తొక్కుతారు(11:2).

Revelation 11:3-7

ఏం చెయ్యాలని ఇద్దరు సాక్షులకు అధికారం ఇవ్వడం జరిగింది?

ఇద్దరు సాక్షులకు ఒక వెయ్యి రెండు వందల అరవై రోజులు ప్రవచించుటకు, వారి శత్రువులను చంపుటకు, ఆకాశం మూయుటకు, అనేకరకాల తెగుళ్ళతో భూమిని బాధించుటకు అధికారం ఇవ్వడం జరిగింది(11:3-6).

Revelation 11:8-9

ఇద్దరు సాక్షుల మృతదేహాలు ఎక్కడ పడుoటాయి?

ఇద్దరు సాక్షుల మృతదేహాలు పట్టణం వీధిలో పడుoటాయి ఆ నగరానికి అలంకారికంగా సొదొమ, ఐగుప్తు అని పిలుస్తారు అక్కడ వారి ప్రభువు సిలువ వేయడం జరిగింది(11:8-9).

Revelation 11:10-12

ఇద్దరు సాక్షులును చంపివేసినపుడు భూనివాసుల ప్రతిస్పందన ఏంటి?

ఇద్దరు సాక్షులును చంపివేసినపుడు భూనివాసుల సంతోషించి పండగ చేసుకున్నారు(11:10-12).

మూడున్నర రోజుల తరువాత ఇద్దరు సాక్షులకు ఏం జరిగింది?

మూడున్నర రోజుల తరువాత ఇద్దరు సాక్షులు వారి కాళ్ళపైన నిలిచి పరలోకానికి వెళ్ళడం జరిగింది(11:10-12).

Revelation 11:13-14

ఇద్దరు సాక్షులు తరువాత, భూకంపం ముగిసిన తరువాత ఏo గతించింది?

ఇద్దరు సాక్షులు తరువాత, భూకంపం ముగిసిన తరువాత రెండవ శ్రమ గతించిoది(11:13-14).

Revelation 11:15

ఏడవ దూత బూర ఊదినప్పుడు, పరలోకంలో ఏం చెప్పడం జరిగింది?

ఏడవ దూత బూర ఊదినప్పుడు భూలోక రాజ్యాలు మన ప్రభువు రాజ్యంగానూ ఆయన క్రీస్తు రాజ్యంగానూ మారిపోయాయి(11:15).

Revelation 11:16-17

ప్రభువైన దేవుడు ఇప్పుడు ఏం మొదలుపెట్టాలని పెద్దలు చెప్పారు?

ప్రభువైన దేవుడు ఇప్పుడు పరిపాలించడం మొదలుపెట్టాలని పెద్దలు చెప్పారు(11:16-17).

Revelation 11:18

పెద్దల ప్రకారం ఏ సమయం ఇప్పుడు వచ్చింది?

చనిపోయిన వారికి తీర్పుతీర్చు సమయమూ, దేవుని దాసులు బహుమతులు పొందబోయే సమయమూ, భూమిని నాశనం చేసేవారిని దేవుడు నాశనం చేసే సమయమూ ఇప్పుడు వచ్చింది(11:18).

Revelation 11:19

అప్పుడు పరలోకంలో ఏం తెరవడం జరిగింది?

అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరవడం జరిగింది(11:1-2).

Revelation 12

Revelation 12:1-2

పరలోకంలో కనపడిన గొప్ప సూచన ఏమిటి?

పరలోకంలో సూర్యున్ని ధరించుకొన్నగర్భిణి స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రునితో, ఆమె తలమీద పన్నెండు నక్షత్రాలతో, ప్రసవ వేదనలతో కేకలు వేస్తున్న స్త్రీని గూర్చిన సూచన కనపడింది(12:1-2).

Revelation 12:3-4

పరలోకంలో కనపడిన మరొక గొప్ప సూచన ఏమిటి?

పరలోకంలో ఎర్రని పెద్ద మహా సర్పం ఏడు తలలు పది కొమ్ములు ఏడు కిరీటాలు తో మరొక గొప్ప సూచన కనపడింది(12:3-4).

మహా సర్పము దాని తోకతో ఏం చేసింది?

మహా సర్పము దాని తోకతో మూడో వంతు నక్షత్రాలను ఊడ్చి భూమ్మీద పడేసింది(12:3-4).

మహా సర్పము ఏమి చెయ్యాలనుకుంది?

మహా సర్పము ఆ స్త్రీ కనిన శిశువును మ్రింగి వేయాలనుకుంది(12:3-4).

Revelation 12:5-6

ఆ మగ శిశువు ఏం చెయ్యాలని వెళుతున్నాడు?

ఆ మగ శిశువు తన జనములను ఇనుప కడ్డీతో ఏలాలని వెళుతున్నాడు (12:5).

ఆ మగ శిశువు ఎక్కడికి వెళుతున్నాడు?

ఆ మగ శిశువు ఆయన సింహాసనం దగ్గరకు కొనిపోయాడు(12:5).

ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది?

ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయిoది(12:6).

Revelation 12:7-10

పరలోకంలో ఎవరు యుద్ధం చేశారు?

మిఖాయేలును, అతని దూతలును మహా సర్పమునకు దాని దూతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(12:7).

యుద్దము తరువాత మహా సర్పమునకు దాని దూతలకు ఏమి జరిగింది?

యుద్దము తరువాత మహా సర్పము దాని దూతలు భూమి మీదకు పడద్రోయడం జరిగింది(12:9).

ఆ మహా సర్పము ఎవరు?

ఆ మహా సర్పము ఆది సర్పము, పిశాచము, సాతాను [12:9].

Revelation 12:11-12

సోదరులు మహా సర్పoను ఎలా జయించారు?

సోదరులు మహా సర్పంను గొర్రెపిల్ల రక్తంతోను, వారి సాక్ష్యంతోను జయించిరి(12:11).

మహా సర్పం తనకింక ఎంత కాలం ఉందని తెలుసుకుంది?

మహా సర్పం తనకింక కొద్ది కాలమే మాత్రమే మిగిలి ఉందని తెలుసుకుంది(12:12).

Revelation 12:13-14

మహా సర్పం స్త్రీని హింసించినప్పడు స్త్రీ కోసం ఏం అయ్యింది?

మహా సర్పం స్త్రీని హింసించినప్పడు ఆమె కోసం సిద్దపరచిన స్థలంకు ఎగిరిపోవుటకు ఆమెకు రెక్కలు ఇవ్వడం అయ్యింది అక్కడ ఆమె పోషించడం జరిగింది(12:13-14).

Revelation 12:15-17

స్త్రీని తుడిచి పెట్టలేక పోయినప్పుడు మహా సర్పం ఏం చేసింది?

స్త్రీని తుడిచి పెట్టలేక పోయినప్పుడు మహా సర్పం ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతారో యేసుని గూర్చి సాక్ష్యం కలిగుంటారో వారితో యుద్దము చేయడానికి వెళ్ళింది(12:15-18).

Revelation 13

Revelation 13:3-4

ఎందుకు లోకమంతా ఆశ్చర్యపోతూ క్రూర జంతువుని అనుసరించారు?

మరణకరమైన గాయం తగిలి బాగైనoదు వల్ల లోకమంతా ఆశ్చర్యపోతూ క్రూర జంతువుని అనుసరించారు(13:3).

Revelation 13:5-6

క్రూర జంతువు తన నోటితో ఏం మాట్లాడింది?.

క్రూర జంతువు తన నోటితో దేవుని పేరు దూషిస్తూ,గర్వంగా మాట్లాడుచూ, ఆయన నివాసమునకునూ, పరలోక నివాసులకునూ వ్యతిరేకంగా మాట్లాడింది(13:5-6).

Revelation 13:7-8

పవిత్రులైన మనుషులతో ఏం చెయ్యడానికి క్రూర జంతువుకు అనుమతివ్వడం జరిగింది?

పవిత్రులైన మనుషులతో యుద్ధం చెయ్యడానికీ వారిని జయించడానికి క్రూర జంతువుకు అనుమతివ్వడం జరిగింది(13:7).

ఎవరు క్రూర జంతువుని పూజించలేదు?

ఎవరి పేరులు జీవగ్రంథంలో రాయడం జరిగిందో వారు ఆ క్రూర జంతువుని పూజించలేదు(13:8).

Revelation 13:9-10

పవిత్రులైన వారిని దేనికి పిలవడం జరిగింది?

పవిత్రులైన వారిని ఓర్పు, సహనం, విశ్వాసం కోసం పిలవడం జరిగింది(13:10).

Revelation 13:11-12

మరొక క్రూర జంతువు ఎక్కడ నుంచి రావడం యోహాను చూశాడు?

మరొక క్రూర జంతువు భూమిలో నుంచి బయటికి రావడం యోహాను చూశాడు(13:11 ).

మరొక క్రూర జంతువు ఎలాంటి కొమ్ములు కలిగి ఏం మాట్లాడుతుంది?

మరొక క్రూర జంతువు గొర్రెపిల్ల లాంటి కొమ్ములు కలిగి మహా సర్పంలాగా మాట్లాడుతుంది(13:11).

మరొక క్రూర జంతువు భూమ్మీద నివసించే వారు ఏం చేయడానికి కారణమైంది ?

మరొక క్రూర జంతువు భూమ్మీద నివసించే వారు మొదటి క్రూర జంతువును పూజించుటకు కారణమైంది(13:12).

Revelation 13:13-17

క్రూర జంతువును పూజించుటకు నిరాకరించిన వారికి ఏం జరిగింది?

క్రూర జంతువును పూజించుటకు నిరాకరించిన వారిని చంపడం జరిగింది(13:15).

ప్రతిఒక్కరు మరొక క్రూర జంతువు నుంచి ఏం పొoదారు?

ప్రతిఒక్కరు మరొక క్రూర జంతువు నుంచి కుడిచేతి మీదా లేక నొసటి మీద ముద్ర పొoదారు(13:16).

Revelation 13:18

క్రూర జంతువు సంఖ్య ఏమిటి?

క్రూర జంతువు సంఖ్య 666(13:18).

Revelation 14

Revelation 14:1-2

యోహాను తన ముందు ఎవరు నిలుచుండడం చూశాడు?

యోహాను తన ముందు గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలుచుండడం చూశాడు(14:1).

Revelation 14:3-5

సింహాసనం ముందు కొత్త పాట నేర్చుకొని పాడుటకు ఎవరు సమర్ధులు?

భూమ్మీద విమోచన పొందిన 144,000 మంది మాత్రమే సింహాసనం ముందు కొత్త పాట నేర్చుకొని పాడుటకు సమర్ధులు(14:3).

దేవునికీ గొర్రెపిల్లకు మొదటి ఫలంగా విమోచన పొందినవారెవరు?

నిందించడానికి తప్పులేని 144,000 మంది దేవునికీ గొర్రెపిల్లకు మొదటి ఫలంగా విమోచన పొందినవారు(14:4-5).

Revelation 14:6-7

దేవదూత నిత్య సువార్త ప్రకటన ఎవరికిచ్చాడు?

దేవదూత నిత్య సువార్త ప్రకటన ప్రతీ దేశం వారికీ, ప్రతి వంశం వారికీ, ప్రతి భాష మాట్లాడే వారికీ,భూమ్మీద ఉన్న ప్రతి జనానికీ ఇచ్చాడు(14:6).

భూమ్మీద నివసిస్తున్న వారు ఏం చెయ్యాలని దేవదూత చెప్పాడు?

భూమ్మీద నివసిస్తున్న వారు దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించమని దేవదూత చెప్పాడు(14:7).

ఏ గడియ వచ్చిందని దేవదూత చెప్పాడు?

దేవుని తీర్పు గడియ వచ్చిందని దేవదూత చెప్పాడు(14:7).

Revelation 14:8-10

రెండవ దూత ఏమని ప్రకటించాడు?

రెండవ దూత మహా బబులోను కులిపోయిందని ప్రకటించాడు(14:8).

Revelation 14:11-13

క్రూర జంతువు ముద్ర పొందుంటే వారికి ఏం జరిగిందని మూడవ దూత ప్రకటించాడు?

క్రూర జంతువు ముద్ర పొందుంటే వారికి అగ్నిగంధకాలతో ఎన్నటెన్నటికి వేదించడం జరుగుతుందని మూడవ దూత ప్రకటించాడు(14:9-11).

పవిత్రులు దేనికి పిలవడం జరిగింది?

పవిత్రులు సహనంతో ఓర్చు కునేందుకు పిలవడం జరిగింది(14:12).

Revelation 14:14-17

మేఘాల మీద ఎవరు కూర్చోవడం యోహాను చూశాడు?

మేఘాల మీద దేవుని కుమారుని పోలిన ఒకరు కూర్చోవడం యోహాను చూశాడు(14:14).

మేఘాలమీద కూర్చున్న ఆయన ఏం చేశాడు?

మేఘాలమీద కూర్చున్నఆయన భూమి మీద పంట కోతకు కొడవలి ఊపాడు(14:16).

Revelation 14:18-19

దూత పదునైన కొడవలితో ఏం చేశాడు?

దూత పదునైన కొడవలితో భూమ్మీద ద్రాక్ష పంటను కూర్చి దేవుని కోపమనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడేశాడు(14:18-19).

Revelation 14:20

దేవుని ద్రాక్ష గానుగ దగ్గర ఏం జరిగింది?

ద్రాక్ష గానుగ తొక్కడం జరిగింది దాని నుంచి రక్తం బయటికి పారింది(14:20).

Revelation 15

Revelation 15:1

ఏడుగురు దూతలు ఏమి కలిగుండటం యోహాను చూశాడు?

ఏడుగురు దూతలు ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉండటం యోహాను చూశాడు, ఇవే చివరి తెగుళ్ళు(15:1).

Revelation 15:2

సముద్రం దగ్గర ఎవరు నుoచున్నారు?

క్రూర జంతువు మీద గెల్చి ఆయన పోలిక గల వారు సముద్రం దగ్గర నుoచున్నారు(15:2).

Revelation 15:3-4

సముద్రం దగ్గర నుoచున్న వారు ఎవరి పాట పాడుతున్నారు?

సముద్రం దగ్గర నుoచున్న వారు మోషే పాటా, గొర్రెపిల్ల పాటా పాడుతున్నారు(15:3).

ఆ పాటలో దేవుని మార్గాలు ఎలా వివరించడం జరిగింది?

ఆ పాటలో దేవుని మార్గాలు న్యాయమైనవి యధార్ద మైనవని వివరించడం జరిగింది(15:3).

ఈ పాటలో ఎవరు వచ్చి దేవుని ఆరాదిస్తారు?

ఈ పాటలో అన్ని రాజ్యాలు వచ్చి దేవుని ఆరాదిస్తారు(15:4).

Revelation 15:5-6

అప్పుడు అతి పరిశుద్ద స్థలం నుంచి ఎవరు బయటకు వచ్చారు?

అప్పుడు ఏడు తెగుళ్ళుతో ఏడుగురు దేవదూతలు అతి పరిశుద్ద స్థలం నుంచి బయటకు వచ్చారు(15:6).

Revelation 15:7-8

ఏడుగురు దేవదూతలకు ఏం ఇవ్వడం జరిగింది?

ఏడుగురు దేవదూతలకు దేవుని కోపoతో నిండిన ఏడు పాత్రలు ఇవ్వడం జరిగింది(15:7).

ఎప్పటి వరకు అతి పరిశుద్ద స్థలంలోకి ఎవ్వరు ప్రవేశించ లేదు?

ఏడు తెగుళ్ళు పూర్తయ్యే వరకు అతి పరిశుద్ద స్థలంలోకి ఎవ్వరు ప్రవేశించ లేదు(15:8).

Revelation 16

Revelation 16:1

ఏడుగురు దేవదూతలకు ఏం చెయ్యాలని చెప్పారు?

ఏడుగురు దేవదూతలకు వెళ్లి దేవుని కోపమనే ఏడు పాత్రలు భూమ్మీద పోయమని చెప్పారు(16:1).

Revelation 16:2

దేవుని మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు క్రూర జంతువు ముద్ర ఉన్న మనుషుల మీద బాధకరమైన చెడ్డ కురుపులు వచ్చాయి(16:2).

Revelation 16:3

దేవుని రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రం చనిపోయిన వారి రక్తంలాగా మారిoది(16:3).

Revelation 16:4-7

దేవుని మూడవ ఉగ్రత పాత్ర బయటకు కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని మూడవ ఉగ్రత పాత్ర బయటకు కుమ్మరించినప్పుడు నదులూ ఊటలూ రక్తం అయినాయి(16:4).

దేవుడు ఈ ప్రజలకు తాగటానికి రక్తమివ్వడమనేది ఎందుకు యధార్ధమైనదీ న్యాయమైనది ?

దేవుడు ఈ ప్రజలకు తాగటానికి రక్తమివ్వడమనేది యధార్ధమైనదీ న్యాయమైనది ఎందుకంటే వారు దేవుని పవిత్రుల రక్తం, ప్రవక్తల రక్తం ఒలికించారు(16:6).

Revelation 16:8-11

దేవుని నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యుడు అగ్నితో మనుషులను మాడ్చడం జరిగింది(16:8).

ఈ తెగుళ్ళకు మనుషులు ఎలా స్పందించారు?

ఈ తెగుళ్ళకు మనుషులు మారుమనస్సు పొందలేదూ దేవుని మహిమ పరచలేదు(16:9).

Revelation 16:12-14

దేవుని ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీసు నది నీరు ఎండి పోయి తూర్పు నుంచి వచ్చు రాజులకు దారి ఏర్పడింది(16:12).

ఏం చేయడానికి మూడు అపవిత్రాత్మలు బయటికి వెళ్ళాయి?

దేవుని మహా దినాన జరిగే యుద్ధం కోసం భూలోక రాజులను పోగు చేయడానికి మూడు అపవిత్రాత్మలు వెళ్ళాయి(16:13-14).

Revelation 16:15-16

భూలోక రాజులను తెచ్చి పోగుచేసిన స్థలo పేరు ఏమిటి?

భూలోక రాజులను తెచ్చి పోగుచేసిన స్థలo పేరు హార్ మెగిద్దోను(16:16).

Revelation 16:17-19

దేవుని ఏడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది?

దేవుని ఏడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఒక గొప్ప స్వరం,"సమాప్తo అయ్యింది!" అప్పుడు మెరుపులూ, ఉరుములూ, భూకంపము వచ్చింది(16:17-18).

ప్ర.ఈ సమయంలో దేవుడు ఏం చెయ్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు?

ఈ సమయంలో దేవుడు మహా బబులోనును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ఉగ్రతతో నిండిన పాత్రను బబులోనుకు ఇచ్చాడు(16:19).

Revelation 16:20-21

ఈ తెగుళ్ళకు మనుషులు ఎలా స్పందించారు?

ఈ తెగుళ్ళకు మనుషులు దేవుని దూషించారు(16:21).

Revelation 17

Revelation 17:1-2

దేవదూత యోహానుకు ఏం చూపిస్తానని చెప్పాడు?

దేవదూత యోహానుకు మహా వేశ్య మీదకు వచ్చే తీర్పును చూపిస్తానాని చెప్పాడు(17:1).

Revelation 17:3-5

ఆ స్త్రీ దేని మీద కూర్చుంది?

ఆ స్త్రీ ఏడు తలలు ఏడు కొమ్ములతో ఉన్న జంతువు మీద కూర్చుంది(17:3).

ఆ స్త్రీ తన చేతితో పట్టుకున్న పాత్రలో ఏముంది?

ఆ స్త్రీ తన చేతితో పట్టుకున్న పాత్రలో అసహ్యమైన ఆమె వ్యభిచార సంబంధమైన మాలిన్యoతో నిండి ఉంది(17:4).

ఆ స్త్రీ పేరేoటి?

ఆ స్త్రీ పేరు, "మహా బబులోను వేశ్యలకూ, భూలోకoలో అసహ్యమైన వాటికి తల్లి"(17:5).

Revelation 17:6-7

ఆ స్త్రీ ఏమి తాగి మత్తెక్కుంది?

ఆ స్త్రీ యేసు హతసాక్షుల రక్తం, పరిశుద్దుల రక్తం తాగి మత్తెక్కుంది(17:6).

Revelation 17:8

స్త్రీ కూర్చున్న జంతువు ఎక్కడ నుంచి వచ్చింది?

స్త్రీ కూర్చున్న జంతువు లోతైన అంతులేని అగాధం నుంచి వచ్చింది(17:8).

Revelation 17:9-10

క్రూర జంతువు ఏడు తలలు ఏమిటి?

క్రూర జంతువు ఏడు తలలు స్త్రీ కూర్చున్న ఏడు కొండలు, ఏడుగురు రాజులు (17:9-10).

Revelation 17:11

క్రూర జంతువు ఎక్కడకి పోతుంది?

క్రూర జంతువు నాశనానికి పోతుంది(17:8,11)

Revelation 17:12-14

క్రూర జంతువు పది కొమ్ములు ఏమిటి?

క్రూర జంతువు పది కొమ్ములు పది మంది రాజులు(17:12).

అప్పుడు క్రూర జంతువూ రాజులూ ఒకే ఉద్దేశము కలిగి ఏం చేశారు?

అప్పుడు క్రూర జంతువూ రాజులూ ఒకే ఉద్దేశము కలిగి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(17:14).

Revelation 17:15

వేశ్య ఎక్కడ కూర్చుందో ఆ జలాలు ఏమిటి ?

వేశ్య కూర్చున్న జలాలు ప్రజలూ, జనసమూహాలూ, జాతులూ, ఆయా భాషలు మాట్లాడేవారు(17:15).

Revelation 17:16-17

క్రూర జంతువు రాజులూ ఆ స్త్రీకేమి చేస్తాయి?

క్రూర జంతువు రాజులూ ఆ స్త్రీని ద్వేషించీ, దిగంబరిచేసీ, ఆమె మాంసం తిని నిప్పంటించి కాల్చివేస్తాయి(17:16).

Revelation 17:18

యోహాను చూసిన స్త్రీ ఏమిటి?

యోహాను చూసిన స్త్రీ భూరాజులను పరిపాలించిన మహా నగరం(17:18).

Revelation 18

Revelation 18:1-3

దేవదూత గొప్ప అధికారంతో ఏమని ప్రకటించింది?

దేవదూత గొప్ప అధికారంతో మహా బబులోను కూలిపోయిందని ప్రకటించింది(18:1-2).

Revelation 18:4-6

పరలోకం నుంచి స్వరం దేవుని ప్రజలు ఏమి చెయ్యాలని చెప్పడం జరిగింది?

పరలోకం నుంచి స్వరం దేవుని ప్రజలు బబులోను నుంచి బయటకు రమ్మనీ, ఆమె పాపములో భాగ మవ్వద్దని చెప్పడం జరిగింది(18:4).

బబులోను చేసిన దానికి దేవుడు తిరిగి ఆమెకు చెల్లించు మొత్తం ఏమిటి?

బబులోను చేసిన దానికి దేవుడు తిరిగి దానికి రెండంతలు ఆమెకు చెల్లిస్తాడు(18:6).

Revelation 18:7-8

బబులోనును ఒక్క రోజులో తరిమి కొట్టిన తెగుళ్ళు ఏమిటి?

ఆమెను అగ్నితో కాల్చిన రోజున బబులోనుపై ఒక్క రోజులో దుఃఖమూ కరువు విరుచుకు పడ్డాయి (18:8).

Revelation 18:9-13

భూలోక రాజులూ వర్తకులు బబులోను తీర్పును చూసినప్పుడు ఎలా స్పందించారు?

భూలోక రాజులూ వర్తకులు బబులోను తీర్పును చూసినప్పుడు ఆమె కోసం ఏడుస్తూ రోదించారు(18:9-11).

Revelation 18:14

ప్ర.ఏ కారణం చేత బబులోను ఒక్క ఘడియలోనే తుడిచి పెట్టుకు పోయింది

బబులోను విలాసవంతమైన వైభవాన్ని కోరుకుంది. అవన్నీ ఒక్క ఘడియలోనే తుడిచి పెట్టుకు పోయాయి(1814).

Revelation 18:15-17

బబులోను తీర్పు సమయoలో రాజులూ, వర్తకులూ, ఓడ నావికులు ఎందుకు దూరాన నిలిచారు?

బబులోను తీర్పు సమయoలో రాజులూ, వర్తకులూ, ఓడ నావికులు దాని వేదనలకు భయపడి దూరంగా నిలిచారు(18:9-10,15,17).

Revelation 18:18-20

బబులోను గూర్చి ఓడ నావికులు ఏo ప్రశ్నలడిగారు ?

జ బబులోను గూర్చి ఓడ నావికులు,"ఈ మహా పట్టణం లాంటి పట్టణం ఏది?"అని ప్రశ్నలడిగారు(18:18).

దేవుని ద్వారా బబులోనుకు తీర్పు జరిగినప్పుడు పవిత్రులు, అపోస్తులులూ, ప్రవక్తలు ఏం చెప్పారు?

దేవుని ద్వారా బబులోనుకు తీర్పు జరిగినప్పుడు పవిత్రులూ, అపోస్తులులూ, ప్రవక్తలు ఆనందించండని చెప్పారు(18:20).

Revelation 18:21-22

ఆమె తీర్పు జరిగిన తరువాత, మళ్ళి ఎప్పుడు బబులోను కనపడతుంది?

ఆమె తీర్పు జరిగిన తరువాత, ఇంకెప్పటికి బబులోను కనబడదు(18:21).

Revelation 18:23-24

బబులోను మహా పట్టణంలో ఏం కనుగోవడం జరిగింది, దేని కోసం తీర్పు జరిగింది?

బబులోను మహా పట్టణంలో ప్రవక్తల రక్తమూ, పవిత్రుల రక్తమూ, భూమి మీద చంపడం జరిగిన వారoదరి రక్తం కనుగొవడం జరిగింది(18:24).

Revelation 19

Revelation 19:1-2

దేవుని తీర్పులను గూర్చి పరలోకంలో గొప్ప స్వరం ఏమని చెప్పింది?

దేవుని తీర్పులు న్యాయమైనవీ, యధార్దమైనవని పరలోకంలో చెప్పడం జరిగింది(19:1-2).

దేవుడు ఎందుకు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చాడు?

ఆమె తన వ్యభిచారంతో భులోకాన్ని చెడగొట్టి, దేవుని దాసుల రక్తం చిందించడం వల్ల దేవుడు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చాడు(19:2).

Revelation 19:3-4

యుగ యుగాలకు మహా వేశ్యకు ఏం జరుగుతుంది?

మహా వేశ్య నుంచి యుగ యుగాలకు పొగ లేస్తూ ఉంటుంది(19:2).

Revelation 19:5-6

దేవునికి భయపడే దాసులు ఏం చెయ్యాలని చెప్పడం జరిగింది?

దేవునికి భయపడే దాసులు ఆయనను స్తుతించాలని చెప్పడం జరిగింది(19:5).

Revelation 19:7-8

ఎందుకు దేవుని దాసులు సంతోషంగా ఉండీ ఆనందించాలని స్వరం చెబుతుంది?

గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినందుచేత దేవుని దాసులు సంతోషంగా ఉండీ ఆనందించాలని స్వరం చెబుతుంది(19:7).

గొర్రెపిల్ల పెండ్లి కూతురు ఏ బట్టలుతో ఉంది?

గొర్రెపిల్ల పెండ్లి కూతురు మంచి నార బట్టలుతో ఉంది, అవి దేవుని పవిత్ర ప్రజల నీతి క్రియలు(19:8).

Revelation 19:9-10

యేసు గూర్చిన సాక్ష్యం ఏమైయున్నదని దేవదూత చెప్పాడు?

యేసు గూర్చిన సాక్ష్యం ప్రవచనాత్మయై ఉన్నదని దేవదూత చెప్పాడు(19:10).

Revelation 19:11-13

యోహాను చూచిన తెల్లని గుర్రం తోలే వాని పేరేంటి?

యోహాను చూచిన తెల్లని గుర్రం తోలే వాని పేరు దేవుని వాక్కు(19:11-13).

Revelation 19:14-16

దేవుని వాక్కు జనాలను ఎలా కొట్టింది?

జనాలను కొట్టడానికి దేవుని వాక్కు నోటి నుంచి వాడిగల ఖడ్గం బయటికి వెళుతుంది(19:15).

దేవుని వాక్కు వస్త్రం మీదనూ తొడ మీదనూ ఏం రాసి ఉంది?

దేవుని వాక్కు వస్త్రం మీదనూ తొడ మీదనూ,"రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు" అని రాసి ఉంది(19:16).

Revelation 19:17-18

గొప్ప విందులో ఏమి తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది?

రాజుల మాంసంనూ, సైన్యాధికారుల మాంసంనూ, బలిష్ఠుల మాంసంనూ, గుర్రాల మాంసంనూ, వాటిని తోలే రౌతులైన వారి మాంసంనూ, అందరి మాంసoనూ తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది(19:18).

Revelation 19:19-20

భూలోక రాజులునూ క్రూర జంతువును ఏమి చేయడానికి పోగై ఉన్నారు?

భూలోక రాజులునూ క్రూర జంతువును దేవుని వాక్కుతోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి బయట పోగై ఉన్నారు(19:19).

క్రూర జంతువుకు, అబద్ద ప్రవక్తకు ఏం జరిగింది?

క్రూర జంతువు, అబద్ద ప్రవక్త వారి ఇద్దరిని బతికుండగానే గంధకంలో మండు అగ్ని గుండంలో పడవేయడం జరిగింది(19:20).

Revelation 19:21

దేవుని వాక్కుకు వ్యతిరేకంగా యుద్దo చేసిన మిగిలిన వారికీ ఏం జరిగింది?

దేవుని వాక్కుకు వ్యతిరేకంగా యుద్దo చేసిన మిగిలిన వారికీ, దేవుని వాక్కు నోటి నుంచి వచ్చు ఖడ్గo వల్ల చంపడం జరిగింది(19:21).

Revelation 20

Revelation 20:1-3

పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత తనతో ఏమి కలిగియున్నాడు?

పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత తన చేతిలో అంతులేని అగాధం తాళం చెవి, పెద్ద గొలుసు కలిగియున్నాడు(20:1).

దేవదూత సాతానుకు ఏం చేశాడు?

దేవదూత సాతానును అడుగులేని అగాధం లోనికి విసిరేసాడు(20:3).

ఎంత కాలం సాతానును బంధించి ఉంచడం జరిగింది?

వెయ్యి సంవత్సరాలు సాతానును బంధించి ఉంచడం జరిగింది(20:2-3).

సాతాను బంది అయినప్పుడు ఏం చేయడానికి సామర్ద్యం లేకుండా పోయిoది?

సాతాను బంది అయినప్పుడు జనాలను మోసగించడానికి సామర్ద్యం లేకుండా పోయిoది(20:3).

Revelation 20:4

క్రూర జంతువు ముద్ర తిరస్కరించిన వారికి ఏం అయ్యింది?

క్రూర జంతువు ముద్ర తిరస్కరించిన వారు బ్రతికి వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యపాలన చేశారు(20:4).

Revelation 20:5-6

చనిపోయిన వారిలో మిగిలిన వారు ఎప్పుడు బ్రతకడం జరిగింది?

చనిపోయిన వారిలో మిగిలిన వారు వెయ్యి సంవత్సరాలు గడచిపోయే వరకు బ్రతకలేదు(20:5).

మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు ఏం చేస్త్తారు?

మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు దేవునికీ క్రీస్తుకూ యాజకులై ఉండి ఆయనతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు(20:6).

Revelation 20:7-8

వెయ్యి సంవత్సరాలు గడచిన తరువాత సాతాను ఏం చేస్తాడు?

వెయ్యి సంవత్సరాలు గడచిన తరువాత, సాతాను విడుదల పొంది జనాలను మోసం చేయడానికి బయలుదేరిపోతాడు(20:8).

Revelation 20:9-10

పవిత్రుల శిబిరం చుట్టుముట్టినప్పుడు ఏం జరుగుతుంది?

పవిత్రుల శిబిరం చుట్టుముట్టినప్పుడు, పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి గోగు, మాగోగులను మ్రింగివేస్తుంది(20:9).

ఈ సమయంలో సాతానుకు ఏం అవుతుంది?

ఈ సమయంలో సాతాను అగ్ని గంధాకాల సరస్సులో పడత్రోయడం జరిగి యుగయుగాలు వేదనపడుతుంది(20:10).

Revelation 20:11-13

తెల్ల సింహాసనం ఎదుట మృతులంతా దేని మూలంగా తీర్పు పొందారు?

మృతులంతా గ్రంథాల్లో రాసి ఉన్న ప్రకారం వారు చేసిన పనులను బట్టి తీర్పు పొందారు [20:12-13].

Revelation 20:14-15

రెండవ మరణం అంటే ఏమిటి?

రెండవ మరణం అంటే అగ్ని సరస్సు(20:14).

జీవ గ్రంథంలో పేర్లు రాయబడని వారి అందరికి ఏం జరుగుతుంది?

జీవ గ్రంథంలో పేర్లు కనుగొనని వారoదరు అగ్ని సరస్సులో పడత్రోయడం జరుగుతుoది(20:15).

Revelation 21

Revelation 21:1-2

మొదటి భూమీ, మొదట ఆకాశంకు ఏం జరగడం యోహాను చూశాడు?

మొదటి భూమీ, మొదట ఆకాశం గతించి పోవడం యోహాను చూశాడు(21:1).

మొదటి భూమీ, మొదట ఆకాశాల స్థానంలో ఏమి వచ్చాయి?

మొదటి భూమీ, మొదట ఆకాశాల స్థానంలో కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చాయి(21:1).

పరలోకం నుంచి ఏం దిగి వచ్చాయి?

పరలోకo నుంచి పవిత్ర పట్టణం , నూతన యెరుషలేo దిగి వచ్చాయి(21:2).

Revelation 21:3-4

సింహాసనం నుంచి వచ్చిన స్వరం ఇప్పుడు దేవుని నివాసం ఎక్కడని చెప్పింది?

సింహాసనం నుంచి వచ్చిన స్వరం ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్పింది(21:3).

ఇప్పుడు ఏమి గతించిపోయాయి?

మరణం, దుఃఖo, ఏడ్పు, బాధ గతించిపోయాయి(21:4).

Revelation 21:5-6

సింహాసనం మీద కూర్చున్న ఆయన తననుతాను ఏo పేరున పిలుచుకొన్నాడు?

సింహాసనం మీద కూర్చున్న ఆయన తననుతాను అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడనని పేరున పిలుచుకొన్నాడు(21:6).

Revelation 21:7-8

విశ్వాసం లేని వారూ, వ్యభిఛార సంబంధంమైన పాపమూ, విగ్రహారాధికులకు ఏం జరుగుతుంది?

విశ్వాసం లేని వారూ, వ్యభిఛార సంబంధంమైన పాపమూ, విగ్రహారాధికులు అగ్ని గంధకాల సరస్స్లులో ఉంటారు(21:8).

Revelation 21:9-10

గొర్రెపిల్ల భార్య, పెండ్లి కూతురు ఏమిటి?

గొర్రెపిల్ల భార్య, పెండ్లి కూతురు పరలోకమందున్న దేవుని నుంచి వచ్చుచున్న పవిత్ర పట్టణం, యెరూషలేము(22:12).

Revelation 21:11-13

యెరూషలేము గుమ్మముల మీద ఏమి రాసున్నాయి?

యెరూషలేము గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రముల పిల్లల పేర్లు రాసున్నాయి(21:12).

Revelation 21:14-15

యెరూషలేము పునాదుల మీద ఏమి రాసున్నాయి?

యెరూషలేము పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోస్తులుల పేర్లు రాసున్నాయి(21:14).

Revelation 21:16-17

కొత్త యెరూషలేము ఎలా వేయడం జరిగింది?

కొత్త యెరూషలేము నాలుగు వైపుల సమానంగా ఉంది(21:16).

Revelation 21:18-21

పట్టణమూ వీధులూ ఎలా కట్టడం జరిగింది?

పట్టణమూ వీధులూ స్వచ్చమైన బంగారమూ, శుభ్ర మైన గాజువలే కట్టడం జరిగింది(21:18-21).

Revelation 21:22

కొత్త యెరూషలేములో దేవాలయం ఏమిటి?

కొత్త యెరూషలేములోప్రభువైన దేవుడునూ, గొర్రెపిల్లయే దేవాలయం(21:22).

Revelation 21:23-25

కొత్త యెరూషలేములో వెలుగుకు ములాధారం ఏమిటి?

కొత్త యెరూషలేములో దేవుని మహిమా, గోర్రేపిల్ల మహిమా వెలుగుకు ములాధారం(21:23).

Revelation 21:26-27

కొత్త యెరూషలేములో ప్రవేశించలేనిది ఏమిటి?

కొత్త యెరూషలేములో అపవిత్ర మైనది ఏదియూ ప్రవేశించలేదు(21:27).

Revelation 22

Revelation 22:1-2

దేవుని సింహాసనం నుంచి ప్రవహించే దేనిని యోహాను చూసాడు?

దేవుని సింహాసనం నుంచి జీవ జల నది ప్రవహించడాన్ని యోహాను చూసాడు(22:1).

జీవ వృక్షo ఆకులు దేని కోసం?

జీవ వృక్షo ఆకులు జనములను స్వస్థ పరచడo కోసం(22:2).

Revelation 22:3-5

పట్టణంలో ఇంకా ఏముండదు?

పట్టణంలో ఇంకా ఏవిధమైన శాపo ఉండదు, చీకటనేదే ఉండదు(22:3-5)

దేవుని సింహాసనమూ గొర్రెపిల్ల సింహాసనమూ ఎక్క్డడ ఉoటాయి?

దేవుని సింహాసనమూ గొర్రెపిల్ల సింహాసనమూ పట్టణంలో ఉంటాయి(22:3).

Revelation 22:6-7

ఈ గ్రంథం ద్వారా దీవెన పొందాలంటే మనం ఏమి చెయ్యాలి?

ఈ గ్రంథం ద్వారా దీవెన పొందాలంటే ఇందులోని ప్రవచన వాక్కులకు లోబడాలి [22:7].

Revelation 22:8-9

యోహాను దేవదూత పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, దేవదూత యోహానుతో ఏమి చెయ్యాలని చెప్పాడు?

యోహాను దేవదూత పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, దేవదూత యోహానుతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని చెప్పాడు(22:8-9).

Revelation 22:10-11

యోహాను ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ముద్ర వేయ వద్దని చెప్పాడు?

యోహాను ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ముద్ర వేయ వద్దు ఎందుకంటే సమయం దగ్గరా వుందని చెప్పాడు22:10).(

Revelation 22:12-13

ప్రభువు వచ్చేప్పుడు తనతో ఏమి తీసుకోస్తున్నానని చెప్పాడు?

ప్రభువు వచ్చేప్పుడు తనతో బహుమానము తీసుకోస్తున్నానని చెప్పాడు(22:12).

Revelation 22:14-15

జీవ వృక్ష ఫలం తినే హక్కు సంపాదించుకోవాలనుకునే వారు ఏమి చెయ్యాలి?

జీవ వృక్ష ఫలం తినే హక్కు సంపాదించుకోవాలనుకునే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి (22:14)

Revelation 22:16-17

యేసు రాజైన దావీదుకు సంబంధిoచిన వాడినని ఎలా చెప్పాడు?

దావీదు వేరు దావీదు సంతానమని యేసు చెప్పాడు(22:16).

Revelation 22:18-19

ఈ గ్రంథ ప్రవచనాలకు ఎవరైన ఏదైనా కలిపిన ఏమవుతుందని?

ఈ గ్రంథ ప్రవచనాలకు ఎవరైన ఏదైనా కలిపిన తెగుళ్ళు వస్తాయనే విషయం రాసుంది (22:18).

ఈ గ్రంథ ప్రవచనాల నుంచి ఎవరైనా ఏదైనా తీసివేసిన ఏమవుతుంది?

ఈ గ్రంథ ప్రవచనాల నుంచి ఎవరైనా ఏదైనా తీసివేసిన జీవ వృక్షంలో భాగం తీసివేయడం జరుగుతుంది(22:19).

Revelation 22:20-21

ఈ గ్రంథంలో యేసు చివరి మాటలు ఏవమిటి?

యేసు చివరి మాటలు,"అవును! నేను త్వరలో వస్తున్నాను"(22:20).

ఈ గ్రంథంలో చివరి పదం ఏమిటి?

ఈ గ్రంథంలో చివరి పదం "ఆమెన్"(22:21).