Acts
Acts 1
Acts 1:1-3
కొత్త నిబంధనలో లూకా రాసిన రెండు పుస్తకాలు ఏవి?
లూకా సువార్త, అపోస్తలుల కార్యములను లూకా రాసాడు [1:1]
యేసు బాధలు అనుభవించిన తరువాత నలభై దినాలు ఏమి చేసాడు?
యేసు సజీవునిగా అపోస్తలులుకు ప్రత్యక్షమై దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులను చెప్పాడు [1:3].
Acts 1:4-5
దేని కొరకు వేచి ఉండాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు?
తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు [1:4]
అపోస్తలులు కొద్ది దినాల్లో ఏ బాప్తిస్మం పోoదనైయున్నారు?
అపోస్తలులు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందనైయున్నారు [1:5]
Acts 1:6-8
ఇశ్రాయేలీయులకు రాజ్యాన్ని మరలా అనుగ్రహించే కాలాన్నిగూర్చి అపోస్తలులు అడిగినప్పుడు యేసు ఏమని జవాబు ఇచ్చాడు?
కాలములను సమయములను తెలిసి కొనుట మీ పని కాదు అని యేసు వారితో అన్నాడు [1:7].
ప్రశ్న: యేసు అపోస్తలులతో, పరిశుద్దాత్మ నుండి ఏమి పొందనై యున్నారని చెప్పాడు?
యేసు అపోస్తలులతో శక్తి పొందనై యున్నారని చెప్పాడు [1:8].
Acts 1:9-11
యేసు అపోస్తలుల నుండి ఏ విధంగా కొనిపోబడ్డారు?
యేసు పైకి ఎత్తబడి, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకుపోయింది [1:9].
యేసు ఏ విధంగా తిరిగి వస్తాడని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు?
యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో అదే విధంగా తిరిగి వస్తారని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు[1:11].
Acts 1:12-14
అపోస్తలులు, స్త్రీలు, మరియ, యేసు సోదరులు మేడ గదిలో ఏమి చేసారు?
వారు ఆసక్తితొ ప్రార్దించారు [1:14].
Acts 1:15-16
యేసును మోసంతో అప్పగించిన యూదా ఇస్కరియోతు జీవితంలో నెరవేరిoది ఏమిటి?
పరిశుద్ద లేఖనం యూదా ద్వారా నెరవేరిoది [1:16].
Acts 1:17-19
ద్రోహంతో సంపాదించిన డబ్బు తీసుకొన్న తరువాత యూదాకు ఏమి జరిగింది?
యూదా ఒక పొలం కొన్నాడు. అందులోనే అతని శరీరం బద్దలై పగిలిపోయి, పేగులు బయటకు వచ్చాయి [1:18].
Acts 1:20
కీర్తనలు గ్రంథంలో యూదా స్థానం గురించి ఏమి జరగాలని రాసి ఉంది?
యూదా స్థానంలో వేరొకని నియమించాలని కీర్తనలలో రాసి ఉంది [1:20].
Acts 1:21-23
యూదా స్థానం లో నియమిoచ వలసిన వ్యక్తికి ఉండవలసిన ఆవశ్యకతలు ఏమిటి?
యూదా స్థానంలో ఉండే వ్యక్తి అపోస్తలుల సహవాసంలో ఉంటూ, బాప్తిసం ఇచ్చే యోహాను కాలం నుండి, యేసు పునరుత్థానం వరకు సాక్షియై యుండాలి [1:21-22].
Acts 1:24-26
అపోస్తలులు నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులలో యూదా స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలో ఎలా నిర్ణయించారు?
అపోస్తలులు ప్రార్ధన చేసి, దేవుడు తన చిత్తాన్ని బయలు పరచాలని చీట్లు వేసారు [1:24-26].
పదకొండు మంది అపోస్తలులతో ఎంపిక అయిన వ్యక్తి ఎవరు?
మత్తీయను ఆ పదకొండు మంది అపోస్తలులతో లెక్కించారు.[1:26].
Acts 2
Acts 2:1-4
యేసు శిష్యులందరూ సమావేశమైన యూదుల పండుగ ఏమిటి?
పెంతెకోస్తు దినాన శిష్యులందరూ సమావేశమయ్యారు [2:1].
పరిశుద్దాత్మ ఇంటిలోకి వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేయసాగారు?
శిష్యులు ఇతర భాషలలో మాట్లాడసాగారు [2:4].
Acts 2:5-7
ఆ సమయములో యెరూషములో ఉన్న యూదులు ఎక్కడ నుండి వచ్చారు?
దైవ భక్తి గల ఆ యూదులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు [2:5].
జన సమూహాలు శిష్యులు మాట్లాడడం విని ఎందుకు కలవర పడ్డారు?
జన సమూహాలు శిష్యులు తమ స్వభాషలో మాట్లాడడం విని కలవర పడ్డారు[2:6].
Acts 2:8-11
దేన్ని గూర్చి శిష్యులు మాట్లాడుతున్నారు?
శిష్యులు దేవుని గొప్ప పనులను గూర్చి చెబుతున్నారు[2:11].
Acts 2:12-15
అపహాస్యము చేసేవారు యేసు శిష్యులను గూర్చి ఏమని తలంచారు?
అపహాస్యము చేస్తూ వారు కొత్త మద్యంతో నిండి యున్నారని తలంచారు[2:13].
Acts 2:16-19
పేతురు చెప్పిన విధంగా ఆ కాలములో నెరవేరినది ఏమిటి?
యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం ప్రకారం, శరీరులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడని పేతురు చెప్పాడు [2:16-17].
Acts 2:20-21
యోవేలు ప్రవచనం ప్రకారంగా రక్షణ పొందిన వారు ఎవరు?
ప్రభువు పేరున ఎవరైతే ప్రార్ధన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు[2:21].
Acts 2:22-26
యేసు పరిచర్యను దేవుడు ఏవిధంగా అమోదించాడు?
యేసు పరిచర్యను ఆయన ద్వారా దేవుడు చేసిన అద్బుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలను బట్టి దేవుడు ఆమోదించాడు [2:22].
యేసును సిలువ వేయడం ఎవరి ప్రణాళిలో ఉన్నది?
దేవుడు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారంగా యేసును సిలువ వేసారు [2:23].
Acts 2:27-28
పాత నిబంధన గ్రంథంలో రాజైన దావీదు దేవుని పరిశుద్దుని గూర్చి ఏమి చెప్పాడు?
దేవుడు తన పరిశుద్దుని కుళ్ళిపోనివ్వడని దావీదు చెప్పాడు [2:25,27,31].
Acts 2:29-31
దేవుడు దావీదు సంతతిని గూర్చి ఏమని ప్రమాణం చేసాడు?
దేవుడు దావీదుతొ అతని గర్బఫలంలో ఒకణ్ణి సింహాసనం మీద కూర్చుండ బెడతానని ప్రమాణం చేసాడు [2:30].
Acts 2:32-33
కుళ్ళు చూడక దేవుని సింహాసనము పై కూర్చుండే దేవుని పరిశుద్దుడు ఎవరు?
యేసు పరిశుద్దుడుగా రాజుగా ప్రవచి౦పబడ్డాడు [2:32].
Acts 2:34-36
పేతురు ప్రసంగములో చెప్పిన విదముగా దేవుడు యేసునకు ఇచ్చిన రెండు బిరుదులు ఏవి?
దేవుడు యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించాడు [2:36].
Acts 2:37-39
జనసమూహం పేతురు ప్రసంగాన్ని విని ఏమన్నారు?
జనసమూహం పేతురును మేము ఏమి చేయాలి? అని అడిగారు [2:37].
పేతురు జనసమూహాన్నిఏమి చేయాలి అని చెప్పాడు?
పేతురు జనసమూహాన్ని మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలని చెప్పాడు [2:38].
దేవుని వాగ్దానం ఎవరి కోసమని పేతురు చెప్పాడు?
దేవుని వాగ్దానం జనులందరికీ, వారి పిల్లలకును దూరస్థులందరికిని చెందునని వారితో చెప్పాడు [2:39].
Acts 2:40-42
ఆరోజు ఎంతమంది ప్రజలు బాప్తిసం తీసుకొన్నారు?
ఆరోజు ఇంచుమించు మూడువేల మంది బాప్తిసం తీసుకొన్నారు [2:41].
బాప్తిసం తీసుకొన్నవారు ఏమిచేసారు?
వీరు అపొస్తలుల బోధలోను సహవాసములోను , రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను కొనసాగుచుoడిరి [2:42].
Acts 2:43-45
విశ్వసించినవారు అవసరాలలో ఉన్నవారి కోసం ఏమి చేసారు?
విశ్వసించినవారు తమకు ఉన్నవాటిని, ఆస్తులను అమ్మి, అందరికిని వారి వారి అవసరాన్నిబట్టి పంచిపెట్టారు[2:44-45].
Acts 2:46-47
విశ్వసించినవారు ఎక్కడ కలసుకోనేవారు?
విశ్వసించినవారు ప్రతిదినము దేవాలయంలో కలసుకోనేవారు [2:46].
విశ్వసించినవారి గుంపులో ప్రతిరోజూ చేర్చబడినది ఎవరు? .
ప్రభువు రక్షణ పొందుతున్నవారిని ప్రతిరోజూ వారితో చేర్చాడు [2:47].
Acts 3
Acts 3:1-3
పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎవరిని చూసారు?
పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుట్టుక నుండి కుంటివానిగా పుట్టినవాడు దేవాలయపు సింహ ద్వారం దగ్గర అడుక్కోవటం చూసారు [3:2].
Acts 3:4-6
పేతురు అతనికి ఏమి ఇవ్వలేదు?
పేతురు అతనికి వెండి బంగారాలు ఇవ్వలేదు [3:6].
Acts 3:7-8
పేతురు అతనికి ఏమి ఇచ్చాడు?
పేతురు అతనికి నడచే సామర్థ్యం ఇచ్చాడు [3:6,7].
పేతురు ఇచ్చిన దానికి అతడు ఏమి చేసాడు?
అతను దేవాలయంలోకి వెళ్లి నడుస్తూ, గెంతుతూ దేవుని స్తుతించాడు [3:8].
Acts 3:9-12
దేవాలయంలో అతనిని చూచి ప్రజలు ఎలా స్పందిoచారు
ప్రజలు అతనిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు [3:10].
Acts 3:13-14
యేసుకు ఏమి చేసారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు?
యేసును తృణీకరించి, పిలాతుకు అప్పగించి, చంపేశారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:13-15].
Acts 3:15-18
పేతురు ఏమి చెప్పి అతనిని బాగుచేసాడు?
పేతురు వారితో యేసు నామమందు విశ్వాసము వలన అతడు బాగుపడ్డాడు అని చెప్పాడు[3:16].
Acts 3:19-20
ప్రజలు ఏమి చేయాలి అని పేతురు చెప్పాడు?
పేతురు ప్రజలను పశ్చాత్తాప పడాలని చెప్పాడు [3:19].
Acts 3:21-23
పరలోకంలో యేసు ఉండే కాలాన్ని గూర్చి పేతురు ఏమి చెప్పాడు?
అన్నిపరిస్తితులు చక్కబడే కాలము వచ్చే వరకు యేసు పరలోకంలో ఉండుట అవసరమని పేతురు చెప్పాడు [3:21].
యేసును గురించి మోషే ఏమి చెప్పాడు?
దేవుని మాట వినేలా ప్రజలలో తన వంటి ప్రవక్తను పుట్టిస్తాడని మోషే చెప్పాడు [3:22].
యేసు మాట వినని ప్రతి మానవునికి ఏమి జరుగుతుంది?
యేసు మాట వినని వాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగును [3:23].
Acts 3:24-26
పాత నిబంధన లోని ఏ వాగ్దానాన్ని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు?
దేవుడు అబ్రాహాము సంతానం ద్వారా భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడుననిన వాగ్దానానికి వారసులై యున్నారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:25].
దేవుడు యూదులను ఏవిధంగా ఆశీర్వదించాలని కోరుకొంటున్నాడు?
యేసును మొదటిగా యూదుల యొద్దకు పంపి వారిని దుష్టత్వము నుండి మళ్ళించి, ఆశీర్వదించాలని దేవుడు కోరుకొన్నాడు [3:26].
Acts 4
Acts 4:1-7
పేతురు యోహానులు దేవాలయంలో ఏమి బోధించారు?
పేతురు యోహానులు దేవాలయంలో, యేసు పునరుత్థానము మరణములను బోధించారు [4:2].
పేతురు యోహానుల బోధకు ప్రజలు ఎలా స్పందించారు?
చాలామంది విశ్వసించారు, దాదాపుగా ఐదువేల మంది. [4:4].
పేతురు యోహానుల బోధకు దేవాలయపు అధికారులు పెద్దలు శాస్త్రులు ఎలా స్పందించారు?
వారు పేతురు యోహానులను భందించి, చెరలో పెట్టారు[4:3].
Acts 4:8-10
ఏ శక్తి ద్వారా, ఎవరి నామములో దేవాలయంలో వ్యక్తి స్వస్తత పొందాడని పేతురు చెప్పాడు?
యేసు నామమందు అతడు బాగుపడ్డాడు అని పేతురు వారితో చెప్పాడు [4:10].
Acts 4:11-12
మనము రక్షణ పొందడానికి ఉన్న ఒకేఒక్క మార్గమును గూర్చి పేతురు ఏమని చెప్పాడు?
యేసు నామముననే రక్షణ పొందాలి గాని, మరి ఏ నామమున రక్షణ పొందలేము అని పేతురు చెప్పాడు[4:12].
Acts 4:13-14
యూదుల అధికారులు పేతురు యోహానులకు ఎందుకు ఎదురు చెప్పలేకపోయారు?
స్వస్తత పొందిన వ్యక్తి పేతురు యోహానులతోపాటు నిలబడి ఉండుటవలన యూదుల అధికారులు ఎదురు చెప్పలేకపోయారు [4:14].
Acts 4:15-18
యూదుల అధికారులు పేతురు యోహానులకు ఏమి చేయకూడదని ఆజ్ఞాపించారు?
యూదుల అధికారులు పేతురు యోహనులకు యేసు నామమున మాట్లాడకూడదని, బోదింపకూడదని ఆజ్ఞాపించారు [4:18].
Acts 4:19-28
యూదుల అధికారులకు పేతురు యోహానులు ఏమని బదులు చెప్పారు?
తాము చూచిన వాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని పేతురు యోహనులు చెప్పారు [4:20].
Acts 4:29-31
యూదుల అధికారుల బెదిరింపులు విని విశ్వాసులు దేవుని ఏమని అడిగారు?
వాక్యమును చెప్పే దైర్యమును, యేసు నామములో సూచక క్రియలు, అద్బుతములు చేయాలనీ విశ్వాసులు దేవుణ్ణి అడిగారు [4:29,30].
విశ్వాసులు ప్రార్ధన ముగించినప్పుడు ఏమి జరిగింది?
విశ్వాసులు ప్రార్ధించినపుడు వారు కూడుకొన్న స్టలము కంపించి, పరిశుద్దత్మతో వారు నింపబడి ఎంతో దైర్యముతో వాక్యమును బోధించారు [4:31].
Acts 4:32-35
విశ్వాసుల అవసరాలు ఎలా అందించబడినవి?
విశ్వాసులు తమకు కలిగినవాటిని అందరితో సమానంగా పంచుకొన్నారు, వారి ఆస్తులను అమ్మి అవసరాన్ని బట్టి పంచారు [4:32,34,35].
Acts 4:36-37
తన పొలమును అమ్మగా వచ్చిన డబ్బును అపొస్తలులకు ఇచ్చిన వానికి "ఆదరణ పుత్రుడు" అని అర్థము వచ్చే కొత్త పేరు పెట్టారు. ఆ వ్యక్తి ఎవరు ?
"ఆదరణ పుత్రుడు" అను పేరుగల వ్యక్తి బర్నబా [4:36-37].
Acts 5
Acts 5:1-2
అననీయ సప్పీరాలు ఏమి చేసారు?
అననీయ సప్పీరాలు పొలమును అమ్మిన డబ్బు మొత్తం ఇస్తున్నామని అబద్దమాడి కొంత మాత్రమే ఇచ్చారు [5:1-3].
Acts 5:3-8
అననీయ సప్పీరాలు ఎవరితో అబద్దం చెప్పారని పేతురు చెప్పాడు?
అననీయ సప్పీరాలు పరిశుద్దాత్మతో అబద్దం చెప్పారని పేతురు చెప్పాడు [5:3].
Acts 5:9-13
అననీయ సప్పీరాలపై దేవుని తీర్పు ఎలా వచ్చింది?
అననీయ సప్పీరాలను దేవుడు చంపివేశాడు [5:5,10].
అననీయ సప్పీరాలకు జరిగినది విన్నవారందరికి, సంఘములోని వారు ఎలా స్పందించారు?
అననీయ సప్పీరాలకు జరిగినది విన్నవారందరికి, సంఘములోని వారికీ చాలా భయం వేసింది [5:11].
Acts 5:14-16
వ్యాధిగ్రస్తులు స్వస్తత పొందడానికి ప్రజలు ఏమి చేసారు?
కొందరు పేతురు నీడైనా పడితే నయం అవుతుందని వ్యాధిగ్రస్తులు వీధులలోకి తెచ్చారు, మరికొందరు యెరూషలేం చుట్టునుండు పట్టణములనుండి రోగులను తెచ్చారు [5:15-16].
Acts 5:17-18
యెరూషలేములో స్వస్థత పొందినవరిని చూచి సద్దుకయ్యులు ఏమన్నారు?
సద్దుకయ్యులు మత్సరముతో నిండి, అపోస్తలులను చెరసాలలో పెట్టారు[5:17-18].
Acts 5:19-21
అపోస్తలులు చెరసాలలోనుండి ఎలా బయటకు వచ్చారు?
ఒక దేవదూత వచ్చి చెరసాల తలుపులు తీసి వారిని బయటకు తెచ్చాడు [5:19].
Acts 5:22-25
ప్రధాన యాజకుని అధికారులు చెరసాలకు వచ్చినప్పుడు ఏమి కనుగొన్నారు?
అధికారులు చెరసాల భద్రంగా మూసివేయబడి, లోపల ఎవ్వరూ లేరని కనుగొన్నారు [5:23].
Acts 5:26-28
అధికారులు అపోస్తలులను ఎట్టి హింస లేకుండా ప్రధాన యాజకుని సభ యొద్దకు తేవడానికిగల కారణం ఏమిటి?
అధికారులు ప్రజలు రాళ్లతో కొడతారని భయపడ్డారు [5:26].
Acts 5:29-32
భోదింప కూడదని అజ్ఞాపించినా యేసు నామమున ఎందుకు భోధిస్తున్నారని ప్రశ్నించినప్పుడు అపోస్తలులు ఏమన్నారు?
"మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను" అని అపోస్తలులు అన్నారు [5:29].
యేసును చంపినది ఎవరని అపోస్తలులు అన్నారు?
యేసును చంపినది ప్రధాన యాజకుడు, సిబ్బంది అని అపోస్తలులు అన్నారు [5:30].
Acts 5:33-37
యేసు చావుకు కారకులు మీరే అని చెప్పిన మాటకు మహా సభ వారు ఎలా స్పందించారు?
మహా సభ వారు గొప్ప కోపంతో నిండిన వారై అపోస్తలులను చంపబోయారు [5:33].
Acts 5:38-39
గమలియేలు మహా సభ వారికి ఇచ్చిన సలహా ఏమిటి?
అపోస్తలులను విడిచిపెట్టమని గమలియేలు మహాసభ వారికి సలహా ఇచ్చాడు [5:38].
గమలియేలు మహాసభ వారితో అపోస్తలులను విడచిపెట్టకపోతే ఏమవుతుందని హెచ్చరించాడు?
గమలియేలు మహాసభ వారితో మీరు దేవునితో పోరాడువారవుతారని చెప్పాడు [5:39].
Acts 5:40-42
మహా సభ వారు చివరకు అపోస్తలులను ఏమి చేసారు?
మహా సభ వారు అపొస్తలులను కొట్టించి, యేసు నామ మున బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసారు [5:40].
మహా సభ వారు అపోస్తలులకు చేసిన దానిని బట్టి ఎలా స్పందించారు?
అపోస్తలులు యేసు నామమునుబట్టి అవమానము పొందుటకు యోగ్యులుగా యెంచబడినందుకు సంతోషించారు [5:41].
అపోస్తలులకు మహా సభ వారియెద్దనుండి వెళ్లిన తరువాత ప్రతిదినము ఏమి చేసేవారు?
అపోస్తలులు ప్రతిదినము దేవాలయంలోనూ, ఇంటింటను ప్రతిదినము బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటిస్తూవచ్చారు [5:42].
Acts 6
Acts 6:1
గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద చేసిన ఫిర్యాదు ఏమిటి?
గ్రీకుభాష మాట్లాడే యూదులు, వారికీ సంబధించిన విధవరాండ్రను ఆహారము పంచి పెట్టేటప్పుడు చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద ఫిర్యాదు చేసారు [6:1].
Acts 6:2-4
ఆహారమును పంచి పెట్టే బాధ్యతను యేడుగురు మనుష్యులకు అప్పగించినది ఎవరు?
శిష్యులు(విశ్వాసులు) యేడుగురు మనుష్యులను ఎన్నుకోన్నారు [6:3,6].
ఎన్నుకోబడిన ఆ యేడుగురు మనుష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి?
ఆ యేడుగురు మనుష్యులు మంచి పేరు కలిగి ఆత్మతోను జ్ఞానముతోను నింపబడినవారై ఉండాలి [6:3].
అపోస్తలులు ఏమి కొనసాగించారు?
అపోస్తలులు ప్రార్థనచేయుటలోను వాక్యపరిచర్యలోను ఎడతెగక యుండిరి [6:4].
Acts 6:5-6
ఎన్నుకోబడిన ఆ యేడుగురు మనుష్యులను తెచ్చినప్పుడు అపోస్తలులు ఏమిచేసారు?
అపోస్తలులు వారిపై తమ చేతులు ఉంచి ప్రార్ధన చేసారు [6:6].
Acts 6:7-9
శిష్యులకు యేరూషలేములో ఏమి జరిగింది?
అనేకమంది యాజకులతొ సహా శిష్యుల సంఖ్య యెరూష లేములో చాల ఎక్కువగా విస్తరించింది [6:7].
Acts 6:10-11
స్తెఫను, యూదులలో విశ్వసించని వారు చర్చించుకొన్నప్పుడు ఎవరు గెలిచేవారు?
స్తెఫను మాటలలోని జ్ఞానము, ఆత్మ ఎదుట విశ్వసించని యూదులు నిలువలేకపోయిరి [6:10].
Acts 6:12-15
స్తెఫనుకు వ్యతిరేకముగా మహా సభ వారు ఎదుట అబద్ధ సాక్షులు చేప్పిన ఆరోపణలు ఏమిటి?
స్తెఫనుకు వ్యతిరేకముగామహా సభ వారు ఎదుట అబద్ధ సాక్షులు యేసు పరిశుద్ధ స్థలమును పడగొట్టి, మోషే ఇచ్చిన ఆచారములను మార్చునని స్తెఫను చెప్పగా విన్నామని తప్పుడు సాక్షము చెప్పారు [6:14].
స్తెఫను వైపు చూచినప్పుడు మహా సభ వారికి ఏమి కనిపించింది?
వారు స్తెఫను ముఖము దేవదూత ముఖమువలె ఉండుటను చూచారు [6:15].
Acts 7
Acts 7:1-3
స్తెఫను యూదుల యొక్క చరిత్రను, ఎవరికి దేవుడు చేసిన వాగ్దానంను గూర్చి చెప్పసాగాడు?
స్తెఫను, దేవుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంతొ మొదలుపెట్టి తమ చరిత్రను వారికి చెప్పసాగాడు [7:2].
Acts 7:4-5
దేవుడు అబ్రహాముకు ఏమని వాగ్దానం చేసాడు?
దేవుడు అబ్రహాముకు అతని వారసులకు భూమిని స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసాడు [7:5].
దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరడం ఎందుకు అసాద్యమైనది?
అబ్రహాముకు సంతానము లేనందున దేవుడుచేసిన వాగ్దానం నెరవేరడం అసాద్యమైనది [7:5].
Acts 7:6-8
అబ్రహాముకు, తన సంతానమునముకు నాలుగు వందల సంవత్సరములు ఏమి జరగనైయున్నదని దేవుడు చెప్పాడు?
అబ్రహాము, తన సంతానము నాలుగు వందల సంవత్సరములు పరదేశములో బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడు [7:6].
దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన ఏమిటి?
నిబంధనతో కూడిన సున్నతిని అబ్రహాముకు ఇచ్చాడు [7:8].
Acts 7:9-10
యోసేపు ఐగుప్తులో బానిసగా ఎలా అయ్యాడు?
అతని అన్నలు అతనిపట్ల అసూయతో ఈజిప్ట్ కు అమ్మివేసారు [7:9].
యోసేపు ఐగుప్తుకు పరిపాలకునిగా ఎలా అయ్యాడు?
దేవుడు యోసేపుకు ఫరో సమక్షములో దయను జ్ఞానమును దయచేసాడు [7:10].
Acts 7:11-13
కానానులో కరువు ఉన్నందున యాకోబు ఏమి చేసాడు?
యాకోబు ఐగుప్తు లో ధన్యమున్నదని విని తన కుమారులను అక్కడికి పంపించాడు [7:12-13].
Acts 7:14-16
యాకోబు అతని బంధువులు ఐగుప్తుకు ఎందుకు వెళ్లారు?
యోసేపు తన అన్నలకు, యకోబును ఐగుప్తు రమ్మని చెప్పి పంపాడు [7:14].
Acts 7:17-19
అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినప్పుడు ఐగుప్తు లో ఉన్న ఇశ్రాయేలీయులకు ఏమి జరిగినది?
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి[7:17].
ఐగుప్తు కొత్త రాజు ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగకుండా ఉండేందుకు ఏమి చేసాడు?
ఈజిప్ట్ కొత్త రాజు ఇశ్రాయేలీయుల శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని బలవంతం చేసాదు [7:19].
Acts 7:20-21
బయట పారవేయబడిన మోషే ఎలా బ్రతికాడు?
ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొన్నది [7:21].
Acts 7:22-28
మోషే ఏవిధంగా విద్యను అభ్యసించాడు?
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు [7:22].
నలబై యేండ్ల వయస్సులో, ఇశ్రాయేలీయులు హింసించబడుట చూచి మోషే ఏమి చేసాడు?
మోషే ఇశ్రాయేలీయుని పక్షమున ఐగుప్తీయుని చంపాడు [7:24].
Acts 7:29-32
మోషే ఎక్కడకు పారిపోయాడు?
మోషే మిద్యానుకు పారిపోయాడు[7:29].
మోషే ఎనబై యేండ్ల వయస్సులో ఉన్నప్పుడు ఏమి చూసాడు?
మోషే మoడుచున్న పొదలో అగ్నిలో దేవదూతను చూసాడు [7:30].
Acts 7:33-34
మోషే ఎక్కడకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు , అక్కడ దేవుడు ఏమి చేయనై యున్నాడు?
దేవుడు మోషే కు ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఎందుకంటే, దేవుడు ఇశ్రాయేలీయులను రక్షింపనై యున్నాడు [7:34].
Acts 7:35-40
మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో ఎన్ని సంవత్సరములు నడిపాడు?
మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో నలభై సంవత్సరములు నడిపాడు [7:36].
మోషే ఇశ్రాయేలీయులకు ఏమని ప్రవచించాడు?
నావంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టిస్తాడని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు [7:37].
Acts 7:41-42
ఇశ్రాయేలీయులు తమ హృదయాలను ఏవిధంగా ఐగుప్తు వైపుకు త్రిప్పారు?
ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడ ప్రతిమకు బలి అర్పించారు [7:41].
ఇశ్రాయేలీయులు దేవుడు నుండి మళ్లుకొన్నప్పుడు దేవుడు ఏమి చేసారు?
దేవుడు ఇశ్రాయేలీయుల నుండి మళ్లుకొని. ఆకాశసైన్యమును సేవించేలా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు [7:42].
Acts 7:43
ఇశ్రాయేలీయులను ఎక్కడకు తీసుకువెళ్తానని దేవుడు చెప్పాడు?
ఇశ్రాయేలీయులను బబులోనుకు తీసుకువెళ్తానని దేవుడు చెప్పాడు[7:43].
Acts 7:44-46
వారి దేశమునకు తీసుకొని పోవుటకు అరణ్యములో ఇశ్రాయేలీయులను ఏమి చేయమని దేవుడు చెప్పాడు?
అరణ్యములో ఇశ్రాయేలీయులు సాక్ష్యపుగుడారమును చేసారు [7:44-45].
ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఇతర జాతి ప్రజలను ఎవరు వెళ్ళగొట్టారు?
దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఇతర జాతి ప్రజలను వెళ్ళగొట్టారు [7:45].
Acts 7:47-50
దేవునికి ఒక నివాసస్థలము కట్టమని చెప్పినది ఎవరు, అది కట్టినది ఎవరు?
దావీదు దేవునికి ఒక నివాసస్థలము కట్టమని చెప్పాడు కానీ సొలొమోను ఆయనకొరకు మందిరమును కట్టించాడు [7:46-47].
మహోన్నతుని సింహాసనము ఎక్కడ ఉంటుంది?
మహోన్నతుని సింహాసనము ఆకాశములో ఉంటుంది [7:49].
Acts 7:51-53
స్తెఫను ప్రజలతో వారి పితరులవలె ఏమిచేస్తున్నారని ఆరోపించాడు?
పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని స్తెఫను ప్రజలను గురించి ఆరోపించాడు [7:51].
ఏ విషయములో ప్రజలు దోషులయ్యారని స్తెఫను ప్రజలతో చెప్పాడు?
నీతిమంతుని అప్పగించి హత్య చేసి చంపిన విషయంలో ప్రజలు దోషులయ్యారని చెప్పాడు [7:52].
Acts 7:54-56
స్తెఫను ఆరోపణకు మహా సభ వారు ఏమిఅన్నారు?
మహా సభ వారు కోపముతో మండిపడి స్తెఫనును చూచి పండ్లుకొరికిరి [7:54].
ఆకాశంలో ఏమి కనిపిస్తుందని స్తెఫను చెప్పాడు?
యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి యుండుటను చూచుచున్నానని స్తెఫను చెప్పాడు [7:55-56].
Acts 7:57-58
స్తెఫనును మహా సభ వారు ఏమిచేసారు?
మహా సభ వారు స్తెఫనుపై బడి పట్టణపు బయటికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లతొ కొట్టారు [7:57-58].
రాళ్లతొ కొట్టేటప్పుడు సాక్షులు తమ పైవస్త్రములను ఎక్కడ పెట్టారు?
సాక్షులు తమ పైవస్త్రములను సౌలు అను ఒక ¸యవనుని దగ్గర పెట్టారు [7:58].
Acts 7:59-60
తాను చనిపోక ముందు స్తెఫను అడిగిన చివరి విషయమేమిటి?
ఈ పాపమును వారిమీద మోపకుమని స్తెఫను దేవుణ్ణి అడిగాడు [7:58].
Acts 8
Acts 8:1-5
స్తెపను రాళ్ళతో కొట్టబడిన దానిని గురింఛి సౌలు ఏమని ఆలోచించాడు?
స్తెఫను చావుకు సౌలు సమ్మతించాడు [8:1].
స్తెఫను రాళ్ళతో కొట్టబడిన రోజు ఏమి ఆరంభమయ్యింది?
స్తెఫను రాళ్ళతో కొట్టబడిన రోజు యెరులేములోని సంఘముకు వ్యతిరేకంగా గొప్ప హింస ఆరంభమయ్యింది [8:1].
యెరులేములోని విశ్వాసులు ఏమి చేసారు?
యెరులేములోని విశ్వాసులు అందరు యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయారు, శుభవార్తను ప్రకటిస్తూ వెళ్ళారు [8:1,4].
Acts 8:6-8
ఫిలిప్పు చెప్పినదానికి సమరయ ప్రజలు ఎందుకు శ్రద్దగా విన్నారు?
ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు చూసి సమరయ ప్రజలు అతని మాటలు శ్రద్దగా విన్నారు [8:6].
Acts 8:9-11
సీమోను చెప్పినదానికి సమరయ ప్రజలు ఎందుకు శ్రద్దగా విన్నారు?
సీమోను మంత్ర విద్యలు చూసి సమరయ ప్రజలు అతడి మాటలు శ్రద్దగా విన్నారు [8:9-11].
Acts 8:12-13
ఫిలిప్పు సందేశం వినినప్పుడు సీమోను ఏమి చేసాడు?
సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు [8:13].
Acts 8:14-17
సమరయలోని విశ్వాసుల మీద పేతురు యోహానులు చేతులుంచినపుడు ఏమి జరిగింది?
సమరయలోని విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందారు [8:17].
Acts 8:18-19
సీమోను అపోస్తలులకు ఏమి ఇవ్వజూపాడు ?
తాను ఎవరి మీదనైన చేతులుంచినపుడు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చునట్లు అధికారము పొందునట్లు సీమోను అపోస్తలులకు డబ్బు ఇవ్వజూపాడు [8:18-19].
Acts 8:20-25
సీమోను అపోస్తలులకు డబ్బు ఇవ్వజూపిన తరువాత అతని ఆత్మీయ స్థితి గురించి పేతురు ఏమన్నాడు?
సీమోను ఘోరదుష్టత్వముతోను, దుర్నీతి బంధకములతోను నిండి యున్నాడని పేతురు చెప్పాడు [8:23].
Acts 8:26-28
ఫిలిప్పును ఏమి చెయ్యమని దూత చెప్పాడు?
దక్షిణంగా గాజా వైపు అరణ్య మార్గానికి వెళ్ళమని ఫిలిప్పుకు దూత చెప్పాడు [8:26].
ఫిలిప్పు ఎవరిని కలిసాడు, అతను ఏమి చేస్తున్నాడు?
ఫిలిప్పు ఇతియోపియ నుండి గొప్ప అధికారియైన నపుంపసకుణ్ణి కలిసాడు. అతడు రధంలో కూర్చుని ఉండి యెషయాాప్రవక్త గ్రంధం చదువుతూ ఉన్నాడు [8:27-28].
Acts 8:29-31
ఫిలిప్పు అతనిని ఏ ప్రశ్న అడిగాడు?
"మీరు చదువుతూ ఉన్నది మీకు అర్ధం అవుతుందా?" అని ఫిలిప్పు అతనిని అడిగాడు [8:30]
ఆ వ్యక్తి ఫిలిప్పును ఏమి చెయ్యమని కోరాడు?
ఆ వ్యక్తి ఫిలిప్పును తన రధమెక్కి తనతో కూర్చోమని, తాను చదువుచున్న దానిని వివరించమని అడిగాడు [8:31].
Acts 8:32-33
లేఖనాలలోని యెషయా గ్రంధం నుండి వివరించబడుతున్న వ్యక్తికి ఏమి జరుగుతుంది?
ఆయన గొర్రెలాగా వధకు తేబడ్డాడు, ఆయన తన నోరు తెరువలేదు [8:32].
Acts 8:34-35
లేఖనాలను చదువుతూ ఉన్న వ్యక్తి ఫిలిప్పును ఏ ప్రశ్న అడిగాడు?
ప్రవక్త ఇలా చెప్పేది తన విషయమా లేక మరొకరి విషయమా అని ఫిలిప్పును అడిగాడు [8:34].
యెషయా నుండి లేఖనాలలోని వ్యక్తి ఎవరు అని ఫిలిప్పు చెప్పాడు ?
యెషయా నుండి లేఖనాలలోని వ్యక్తి యేసు అని ఫిలిప్పు ఆ వ్యక్తికి వివరించాడు [8:35].
Acts 8:36-38
అప్పుడు ఫిలిప్పు ఆ వ్యక్తికి ఏమి చేసాడు?
ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు [8:38]
Acts 8:39-40
నీళ్ళలోనుంచి బయటకు వచ్చినపుడు ఫిలిప్పుకు ఏమి జరిగింది?
నీళ్ళలోనుంచి బయటకు వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళాడు [8:39].
నీళ్ళలోనుంచి బయటకు వచ్చిన తరువాత నపుంసకుడు ఏమి చేసాడు?
నీళ్ళలోనుంచి బయటకు వచ్చిన తరువాత నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళాడు [8:39].
Acts 9
Acts 9:1-2
ఏమి చెయ్యడానికి యెరూషలేములోని ప్రధాన యాజకులను సౌలు అనుమతి కోరాడు?
తాను దమస్కు వరకు ప్రయాణం చేసి ఈ మార్గమునకు చెందినా వారినెవరినైనా ఖైదుచేసి తీసుకొని రావడానికి లేఖలు వ్రాసి ఇవ్వాలని సౌలు కోరాడు [9:1-2].
Acts 9:3-4
దమస్కుకు సమీపించినపుడు సౌలు ఏమి చూసాడు?
దమస్కుకు సమీపించినపుడు, ఆకాశంనుండి వెలుగు రావడం సౌలు చూసాడు [9:3].
ఆ స్వరం సౌలుకు ఏమి చెప్పింది?
"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు" అని ఆ స్వరం చెప్పింది [9:4].
Acts 9:5-7
తనతో మాట్లాడుతున్నదెవరు అని సౌలు అడిగినప్పుడు వచ్చిన జవాబు ఏమిటి?
జవాబు "నీవు హింసించుచున్న యేసునే నేను" [9:5]
Acts 9:8-9
సౌలు నేలమీదనుండి లేచినపుడు అతనికి ఏమి జరిగింది?
సౌలు నేలమీదనుండి లేచినపుడు అతడు ఏమీ చూడలేకపోయాడు [9:8].
అక్కడనుండి సౌలు ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏమి చేసాడు?
అక్కడనుండి సౌలు దమస్కుకు వెళ్ళాడు, అక్కడ మూడు రోజులు ఏమీ తినలేదు, త్రాగలేదు [9:9].
Acts 9:10-12
దేవుడు అననీయకు ఏమి చెయ్యమని చెప్పాడు?
దేవుడు అననీయను వెళ్లి సౌలుకు చూపుకలిగేల తన చేతులను సౌలుమీద ఉంచమని చెప్పాడు [9:11-12].
Acts 9:13-16
దేవునికి ఎటువంటి ఆందోళన అననీయ కనుపరచాడు?
ప్రభువుపేర ప్రార్ధన చేసేవారందరినీ ఖైదు చెయ్యడానికి సౌలు దమస్కుకు వచ్చాడని అననీయకు తెలుసు కనుక ఆందోళనపడ్డాడు [9:13-14].
ఆయన ఎంపిక చేసుకున్న సాధనముగా సౌలు కొరకు తాను ఎటువంటి పరిచర్యను ఉద్దేశించానని ప్రభువు చెప్పాడు ?
సౌలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట. ఇతర ప్రజల ఎదుట, వారి రాజుల ఎదుట తన పేరును భరిస్తాడని ప్రభువు చెప్పాడు [9:15].
సౌలు పరిచర్య సులభమని లేక కష్టమని ప్రభువు చెప్పాడా?
ప్రభువు పేరు కోసం సౌలు అనేక బాధలు అనుభవించాలని చెప్పాడు [9:16].
Acts 9:17-19
అననీయ తన చేతులను సౌలు మీద ఉంచిన తరువాత ఏమి జరిగింది?
అననీయ తన చేతులను సౌలు మీద ఉంచిన తరువాత అతనికి చూపు వచ్చింది, అతడు బాపిస్మం తీసుకున్నాడు, భోజనం చేసాడు [9:19].
Acts 9:20-25
సౌలు వెంటనే ఏమి చెయ్య నారంభించాడు?
సౌలు వెంటనే యేసే దేవుని కుమారుడని యూద సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రసంగించడం మొదలు పెట్టాడు [9:20].
Acts 9:26-27
సౌలు యెరూషలేముకు వచ్చినపుడు శిష్యులు అతనిని ఏవిధంగా చేర్చుకున్నారు?
సౌలు యెరూషలేముకు వచ్చినపుడు శిష్యులు అతనికి భయపడ్డారు [9:26].
సౌలును శిష్యులవద్దకు తీసుకొని వచ్చి సౌలుకు దమస్కులో జరిగినదానిని వివరించినదెవరు?
బర్నబా సౌలును శిష్యులవద్దకు తీసుకొని వచ్చి సౌలుకు దమస్కులో జరిగినదానిని వివరించాడు [9:27].
Acts 9:28-30
యెరూషలేములో సౌలు ఏమి చేసాడు?
యెరూషలేములో సౌలు ప్రభువైన యేసుని గురించి ధైర్యంగా బోధించాడు [9:29].
Acts 9:31-32
సౌలు తార్సుకు పంపబడినపుడు యూదయ, గలలియ, సమరయలోని సంఘం ఎలా ఉంది?
సౌలు తార్సుకు పంపబడినపుడు యూదయ, గలలియ, సమరయలోని సంఘం క్షేమాభివృద్ధినొందుచూ సమాధానము కలిగియుండి విస్తరించుచుండెను [9:31].
Acts 9:33-35
లుద్దలోని వారందరూ ప్రభువువైపు తిరుగునట్లు అక్కడేమి జరిగింది?
లుద్దలో పేతురు ఒక పక్షవాయువుగల వానితో మాట్లాడినపుడు యేసు అతనిని స్వస్థపరచాడు [9:33-35].
Acts 9:36-43
యొప్పేలో అనేకులు ప్రభువును విశ్వసిచునట్లు అక్కడేమి జరిగింది?
యొప్పేలో చనిపోయిన తబిత అను స్త్రీ కొరకు పేతురు ప్రార్ధించగా ఆమె తిరిగి బ్రతికింది [9:36-42].
Acts 10
Acts 10:1-2
కోర్నేలీ ఎలాంటి మనిషి?
కోర్నేలీ భక్తిపరుడు, దేవునియందు భయభక్తులు గలవాడు, దానధర్మాలు చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్ధన చేయువాడు [10:2].
Acts 10:3-8
కోర్నేలీని దేవుడు జ్ఞాపకం చేసుకోడానికి కారణం ఏమిటని దూత అతనితో చెప్పాడు?
కోర్నేలీ ప్రార్ధనలు, పేదవారికి అతడు చేసిన ధర్మములు దేవునిసన్నిదికి జ్ఞాపకార్ధంగా చేరాయని దూత చెప్పాడు [10:4].
కోర్నేలీని ఏమి చెయ్యమని దూత చెప్పాడు?
పేతురుని పిలిపించుకొని రావడానికి యొప్పేకు మనుషులను పంపమని కోర్నేలీతో దూత చెప్పాడు [10:5].
Acts 10:9-12
మరుసటి రోజు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దెమీదికెక్కినపుడు ఏమి చూసాడు ?
సకల విధములైన నలుగు కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, ఆకాశపక్షులతో కూడిన పెద్ద దుప్పటి వంటి పాత్రను పేతురు చూసాడు [10:11-12].
Acts 10:13-18
పేతురు దర్శనంను చూసినపుడు ఒక స్వరం అతనితో ఏమి చెప్పింది ?
"నీవు లేచి చంపుకొని తినుము" అని ఆ స్వరం అతనితో చెప్పింది [10:13].
ఈ స్వరం నకు పేతురు స్పందన ఏమిటి?
పేతురు తాను నిషిద్ధమైనదానిని, అపవిత్రమైనదానిని ఎన్నడు తినలేదని వాటిని నిరాకరించాడు [10:14].
దీని తరువాత స్వరం పేతురుతో ఏమని చెప్పింది?
"దేవుడు పవిత్రం చేసినవాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు" అని స్వరం చెప్పింది [10:15]
Acts 10:19-21
కోర్నేలీ వద్దనుండి మనుష్యులు వచ్చినపుడు ఏమి చెయ్యమని ఆత్మ పేతురుతో చెప్పాడు?
వారితో వెళ్ళమని ఆత్మ పేతురుతో చెప్పాడు [10:20]
Acts 10:22-24
కోర్నేలీ వద్దనుండి మనుష్యులు పేతురు కోర్నేలీ ఇంటికి వచ్చి ఏమి చెయ్యాలని కోరారు?
కోర్నేలీ వద్దనుండి మనుష్యులు పేతురు కోర్నేలీ ఇంటికి వచ్చి సందేశము ఇవ్వాలని కోరారు [10:22].
Acts 10:25-26
కోర్నేలీ పేతురు పాదాలవద్ద సాగిలపడినపుడు పేతురు ఏమి చెప్పాడు ?
పేతురు కోర్నేలీ లేచి నిలువుము, తాను కూడా నరుడనే అని చెప్పాడు [10:26].
Acts 10:27-33
ఇంతకుముందు యూదులకు ధర్మము కాని దేన్ని పేతురు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు?
పేతురు అన్యజాతి వానితో సహవాసము చేస్తున్నాడు, ఎందుకంటే ఏ మనిషి నిషేదింపదగినవాడనిగానీ, అపవిత్రుడనిగానీ చెప్పకూడదని దేవుడు తనతో చెప్పాడు [10:28].
Acts 10:34-35
దేవునికి అంగీకారమైనవారు ఎవరని పేతురు చెపుతున్నాడు?
దేవునికి భయపడి నీతిగా నడచుకోనువానిని దేవుడు అంగీకరించునని పేతురు చెపుతున్నాడు [10:35].
Acts 10:36-38
యేసును గురించిన ఏ సందేశం కోర్నేలీ ఇంటివారు ఇంతకు ముందే విన్నారు?
దేవుడు యేసును పరిశుద్దాత్మతోను, శక్తితోను అభిషేకించేనని, దేవుడాయనకు తోడైయుండెను గనుక పీడింపబడినవారినందరినీ స్వస్థపరచెనని యేసును గురించి విన్నారు [10:38].
Acts 10:39-41
యేసు మరణం తరువాత యేసుకు ఏమి జరిగిందని పేతురు ప్రకటించాడు, పేతురుకు ఈ సంగతి ఎలా తెలుసు?
దేవుడు యేసును మూడవ దినమున లేపేనని పేతురు ప్రకటించాడు, యేసు పునరుద్దానుడైన తరవాత పేతురు ఆయనతో కలసి భోజనం చేసాడు [10:40-41].
Acts 10:42-43
ప్రజలకు ప్రకటించాలని తమను యేసు ఆజ్ఞాపించాడని పేతురు దేనిగురించి చెప్పాడు?
యేసు సజీవులకును, మృతులకును న్యాయాదిపతినిగా దేవునిచేత నియమింబడెనని ప్రకటించాలని యేసు ఆజ్ఞాపించాడని పేతురు చెప్పాడు [10:42].
యేసు నందు విశ్వాసముంచు వారందరూ ఏమి పొందుతారని పేతురు చెపుతున్నాడు?
యేసు నందు విశ్వాసముంచు వారందరూ పాప క్షమాపణ పొందుతారని పేతురు చెపుతున్నాడు [10:43]
Acts 10:44-45
పేతురు ఇంకనూ బోధించుచుండగా వినుచున్న వారికి ఏమి జరిగింది?
పేతురు బోధ వినుచున్నవారి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు [10:44].
సున్నతి పొందిన గుంపుకు చెందిన విశ్వాసులు ఎందుకు ఆశ్చర్యపోయారు?
సున్నతి పొందిన గుంపుకు చెందిన విశ్వాసులు ఆర్చర్యపోయారు ఎందుకంటే, పరిశుద్ధాత్మ అన్యజనులమీద కూడా కుమ్మరింపబడ్డాడు [10:45].
Acts 10:46-48
పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింప బడ్డాడనే దానిని కనపరచడానికి ప్రజలు ఏమి చేస్తున్నారు?
పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింప బడ్డాడనే దానిని కనపరచడానికి ప్రజలు ఇతర భాషలతో మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూఉన్నారు [10:46].
ప్రజలు పరిశుద్ధాత్మను పొందారని చూచినా తరువాత వారి విషయంలో ఏమి జరగాలని పేతురు ఆజ్ఞాపించాడు?
యేసుక్రీస్తు నామంలో ప్రజలు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు [10:48]
Acts 11
Acts 11:1-14
యూదయలోని అపోస్తలులు, సహోదరులు ఏ వార్త విన్నారు?
అన్యజనులు కూడా దేవుని వాక్కును స్వీకరించారని యూదయలోని అపోస్తలులు, సహోదరులు విన్నారు [11:1].
యెరుషలేములోని సున్నతిపొందిన గుంపు వారికి పేతురుకు వ్యతిరేకంగా ఉన్న విమర్శ ఏమిటి?
అన్యజనులతో కలసి భోజనం చేస్తున్నాడని యెరుషలేములోని సున్నతి పొందిన గుంపు వారు పేతురును విమర్శించారు [11:2-3].
Acts 11:15-16
పేతురు తనకు వ్యతిరేకంగా ఉన్న విమర్శకు ఎలాంటి జవాబిచ్చాడు?
పెద్ద దుప్పటి విషయమైన దర్శనం, అన్యజనుల యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి వివరించడం ద్వారా పేతురు తనకు వ్యతిరేకంగా ఉన్న విమర్శకు జవాబిచ్చాడు [11:4-16].
Acts 11:17-18
పేతురు వివరణ వినిన తరువాత సున్నతి పొందినగుంపుకు చెందిన విశ్వాసుల అభిప్రాయం ఏమిటి?
దేవుడు అన్యజనులకు కూడా జీవార్ధమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచారు [11:18].
Acts 11:19-21
స్తెఫను మరణం తరువాత చెదరిపోయిన విశ్వాసులు ఏమి చేసారు?
స్తెఫను మరణం తరువాత చెదరిపోయిన అనేకమంది విశ్వాసులు యేసును గురించిన సందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు [11:19].
చెదరిపోయిన అనేకమంది విశ్వాసులు యేసును గురించిన సందేశాన్ని గ్రీసు దేశస్తులకు చెప్పినపుడు ఏమి జరిగింది?
యేసును గురించిన సందేశాన్ని గ్రీసు దేశస్తులకు చెప్పినపుడు అనేకమంది విశ్వసించారు [11:20-21].
Acts 11:22-24
యెరూషలేమునుండి వచ్చిన బర్నబా అంతియొకయలోని విశ్వాసులకు ఏమిచెప్పాడు?
ప్రభువును స్థిరహృదయంతో హత్తుకోనవలెనని బర్నబా వారిని ప్రోత్సహించాడు [11:22-23].
Acts 11:25-26
అంతియొకయలోని సంఘంలో సంవత్సరమంతా గడిపినదెవరు?
బర్నబా, సౌలు అంతియొకయలోని సంఘంలో సంవత్సరమంతా గడిపారు [11:26].
అంతియొకయలో శిష్యులకు మొదట ఇవ్వబడిన పేరేంటి?
అంతియొకయలో మొదటిసారిగా శిష్యులను "క్రైస్తవులు" అనడం జరిగింది [11:26].
Acts 11:27-28
ఏమి జరగబోతుందని అగబు అను ప్రవక్త ముందుగా చెప్పాడు?
లోకమంతటికీ గొప్ప కరవు రాబోతున్నాదని అగబు అను ప్రవక్త ముందుగా చెప్పాడు [11:28]
Acts 11:29-30
అగబు చెప్పిన ప్రవచనానికి శిష్యులు ఎలా స్పందించారు?
శిష్యులు యూదయలోని సహోదరులకు సహాయాన్ని బర్నబా, సౌలు ద్వారా పంపారు [11:29-30].
Acts 12
Acts 12:1-2
రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబుకు ఏమిచేసాడు?
రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు [12:2].
Acts 12:3-4
రాజైన హేరోదు పేతురుని ఏమిచేసాడు?
రాజైన హేరోదు పేతురుని ఖైదు చేసాడు, పస్కాపండుగ తరువాత ప్రజల ఎదుటికి అతణ్ణి తేవాలని ఉద్దేశించాడు [12:3-4].
Acts 12:5-6
సంఘం పేతురు కొరకు ఏమిచేస్తుంది?
సంఘం పేతురు కొరకు మనస్పూర్తిగా ప్రార్ధన చేస్తూఉంది [12:5].
Acts 12:7-12
పేతురు చెరసాల నుండి బయటకు ఎలావచ్చాడు?
ఒక దేవదూత పేతురుకు కనిపించాడు, అతని చేతులనుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి, చెరసాల బయటవరకు దేవదూతను అనుసరించాడు [12:7-10].
Acts 12:13-15
విశ్వాసులు ప్రార్దిస్తున్న గదికి పేతురు వచ్చినపుడు తలుపు వద్ద జవాబిచ్చినదెవరు, ఆమె ఏమి చేసింది?
రోదే అనే పనిపిల్ల తలుపు తీయడానికి వచ్చింది, ఆమె తలుపు తీయకుండానే పేతురు తలుపు ముందు నిలువబడి ఉన్నాడని విశ్వాసులకు చెప్పింది [12:13-14].
ఆమె చెప్పిన మాటలకు శిష్యులు ఎలా స్పందించారు?
మొదట ఆమెకు మతి తప్పిందని తలంచారు, అయితే వారు తలుపు తెరిచి పేతురును చూసారు [12:15-16].
Acts 12:16-17
తనకు జరిగినదానిని విశ్వాసులకు వివరించిన తరువాత పేతురు వారికి ఏమని ఆజ్ఞాపించాడు?
యాకొబుకూ, సోదరులకూ ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పాడు [12:17].
Acts 12:18-21
పేతురుకి కావలి కాసిన వారికి ఏమిజరిగింది?
పేతురుకి కావలి కాసిన వారిని హేరోదు ప్రశ్నించాడు, వారిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు [12:19].
Acts 12:22-23
హేరోదు తన ప్రసంగాన్ని ఇచ్చినపుడు ప్రజలు ఏమని అరిచారు?
"ఇది ఒక దేవుడి స్వరమే గాని మనిషిది కాదు" అని ప్రజలు అరిచారు [12:22].
ప్రసంగం అయిన తరువాత హేరోదుకు ఏమి జరిగింది, ఎందువలన?
హేరోదు దేవుని మహిమపరచలేదు, కనుక ఒక దేవుని దూత అతణ్ణి మొత్తాడు, అతడు పురుగులు పడి చనిపోయాడు [12:23].
Acts 12:24-25
ఈ కాలంలో దేవుని వాక్యానికి ఏమిజరుగుతూ ఉంది?
దేవునివాక్యం అంతకంతకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది [12:24].
బర్నబా సౌలులు ఎవరిని తమ వెంట తీసుకొని వెళ్ళారు?
బర్నబా సౌలులు మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకువెళ్ళారు [12:25]
Acts 13
Acts 13:1-3
పరిశుద్ధాత్మ వారితో మాట్ల్లడుతున్నప్పుడు అంతియొకయలోని సంఘం ఏమిచేస్తుంది?
పరిశుద్ధాత్మ వారితో మాట్ల్లడుతున్నప్పుడు అంతియొకయలోని సంఘం ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం చేస్తూఉంది [13:2].
పరిశుద్ధాత్మ వారిని ఏమిచెయ్యమని చెప్పాడు?
ఆత్మ బర్నబాను, సౌలునూ పిలిచిన పనికోరకు వారిని ప్రత్యేకించుడని వారితో చెప్పాడు [13:2].
పరిశుద్ధాత్మ మాట వినిన తరువాత సంఘం ఏమిచేసింది?
సంఘం ఉపవాసముండి ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు [13:3].
Acts 13:4-5
బర్నబా, సౌలూ కుప్రకు వెళ్ళినపుడు వారితో ఎవరున్నారు?
కుప్రలో యోహాను అనబడిన మార్కు వారికి సాయం చేసేవాడిగా వారితో ఉన్నాడు [13:5].
Acts 13:6-8
బర్-యేసు ఎవరు ?
బర్-యేసు సెర్గిపౌలుతో ఉన్న యూదుల అబద్ద ప్రవక్త [13:6-7].
ఎందుకు సెర్గిపౌలు బర్నబా, సౌలూను పిలిపించుకొన్నాడు?
సెర్గిపౌలు దేవుని వాక్యము వినగోరెను గనుక బర్నబా, సౌలూను పిలిపించుకొన్నాడు [13:7].
Acts 13:9-10
సౌలుకు ఇవ్వబడిన మరియొక పేరేంటి?
సౌలుకు ఇవ్వబడిన మరియొక పేరు పౌలు [13:9].
Acts 13:11-12
బర్ యేసు సెర్గి పౌలును విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నించినపుడు పౌలు ఏమి చేసాడు?
తాను సాతాను కుమారుడని, తాను కొంత కాలము గ్రుడ్డివాడై యుంటాడని బర్ యేసుతో పౌలు చెప్పాడు [13:10-11].
బర్ యేసుకు జరిగినది చూసి సెర్గి పౌలు ఏవిధంగా స్పందించాడు?
సెర్గి పౌలు విశ్వసించాడు [13:12].
Acts 13:13-20
పౌలును అతని స్నేహితులును పెర్గేకు వెళ్ళడానికి నిశ్చయించినపుడు యోహాను ఏమిచేసాడు?
యోహాను పౌలును అతని స్నేహితులను విడిచి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు [13:13].
పిసిదియలోని అంతియొకయలో ఎక్కడ పౌలును ప్రసంగించాలని అడిగారు?
పిసిదియలోని అంతియొకయలో యూదుల సమాజమందిరంలో ప్రసంగించాలని పౌలును అడిగారు [13:15].
Acts 13:21-22
పౌలు తన ప్రసంగంలో ఏ చరిత్రను తిరిగి చెపుతున్నాడు?
పౌలు తన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజల చరిత్రను తిరిగి చెపుతున్నాడు [13:17-22].
Acts 13:23-25
ఎవరినుండి దేవుడు ఇశ్రాయేలు రక్షకుని తీసుకు వచ్చాడు?
రాజైన దావీడునుండి దేవుడు ఇశ్రాయేలు రక్షకుని తీసుకు వచ్చాడు [13:23].
రానున్న రక్షకుని మార్గమును సిద్ధపరచువాడని ఎవరి గురించి పౌలు చెప్పాడు?
రానున్న రక్షకుని మార్గమును సిద్ధపరచువాడని బాప్తిస్మమిచ్చు యోహాను గురించి పౌలు చెప్పాడు [13:24-25]
Acts 13:26-29
యెరూషలేములోని అధికారులు, ప్రజలు ప్రవక్త యొక్క సందేశాలను ఏవిధంగా నెరవేర్చారు?
యేసుకు శిక్షవిధించుటచేత యెరూషలేములోని అధికారులు, ప్రజలు ప్రవక్త యొక్క సందేశాలను నెరవేర్చారు [13:27].
Acts 13:30-31
ఇప్పుడు ప్రజలకు యేసుయొక్క సాక్షులు ఎవరు?
మృతులలోనుండి లేచిన యేసును చూచిన ప్రజలు ఇప్పుడు ఆయనకు సాక్షులైయున్నారు [13:31].
Acts 13:32-34
యూదులకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చియున్నాడని దేవుడు ఎలా చూపించాడు?
మృతులలోనుండి యేసును లేపుటద్వారా యూదులకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చియున్నాడని దేవుడు చూపించాడు [13:33].
Acts 13:35-37
కీర్తనలు ఒకదానిలో పరిశుద్ధుడైన వానికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి?
పరిశుద్ధుని కుళ్ళిపోనివ్వనని దేవుడు వాగ్దానం చేసాడు [13:35].
Acts 13:38-39
విశ్వసించు ప్రతివానికి పౌలు ఏమి ప్రకటిస్తున్నాడు?
విశ్వసించు ప్రతివానికి పౌలు పాపక్షమాపణను ప్రకటిస్తున్నాడు [13:38].
Acts 13:40-43
వినేవారికి పౌలు ఏ హెచ్చరికను కూడా ఇస్తున్నాడు?
దేవుని కార్యమును గురించి వివరించినను ఎంతమాత్రము నమ్మనివారి గురించి ప్రవక్తలచేత ప్రవచించిన వారివలె ఉండకుడి అని పౌలు హెచ్చరికను ఇస్తున్నాడు [13:40-41].
Acts 13:44-45
మరుసటి సబ్బాతుదినాన్న అంతియొకయలో దేవుని వాక్కును వినడానికి వచ్చినదెవరు?
మరుసటి సబ్బాతుదినాన్న దాదాపు ఆ పట్టణమంతయూ దేవుని వాక్యము వినడానికి కూడివచ్చారు [13:44].
జనసమూహములను చూచి యూదులు ఏవిధంగా స్పందించారు?
యూదులు జనసమూహములను చూచి అసూయతో నిండిపోయారు. పౌలు చెప్పినదానిని కాదంటూ దూషించారు [13:45].
Acts 13:46-47
వారికి చెప్పిన దేవుని వాక్కు విషయం యూదులు ఏమిచేసారని పౌలు చెపుతున్నాడు?
వారికి చెప్పిన దేవుని వాక్యాన్ని యూదులు త్రోసివేసారని పౌలు చెపుతున్నాడు [13:46].
Acts 13:48-49
పౌలు అన్యజనులవైపు వెళుతున్నాడని వారు వినినపుడు అన్యజనుల స్పందన ఏమిటి?
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి [13:48].
అన్యజనులు ఎంతమంది విశ్వసించారు?
నిత్య జీవానికి నిర్ణయింప బడిన వారందరూ విశ్వసించారు [13:48].
Acts 13:50-52
యూదులు పౌలు, బర్నబాలకు ఏమిచేసారు?
యూదులు పౌలు, బర్నబాలకు వ్యతిరేకంగా హింసను పురికొల్పారు, వారిని తమ ప్రాంతములనుండి వెళ్ళగొట్టారు [13:50].
పౌలు, బర్నబాలు ఈకొనియాకు వెళ్లక ముందు ఏమిచేసారు?
పౌలు, బర్నబాలు తమ పాద ధూళిని అంతియొక పట్టణములో తామును బయటకు వెల్లగొ ట్టినవారివైపు దులిపివేసి ఈకొనియకు వచ్చారు [13:51].
Acts 14
Acts 14:1-2
పౌలు, బర్నబాల సందేశాలను విని అనేకులు విశ్వసించడం చూసి ఈకోనియలోని అవిధేయులైన యూదులు ఏమిచేసారు ?
అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించారు [14:1-2].
Acts 14:3-4
దేవుడు తన కృపావాక్యమును గురించి ఏ సాక్ష్యమును ఇచ్చాడు?
ప్రభువు వారి చేత సూచకక్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమును గురించి సాక్ష్యమిప్పించుచుండెను [14:3].
Acts 14:5-7
పౌలు, బర్నబాలు ఎందుకు ఈకోనియ విడిచిపెట్టారు?
కొందరు అన్యజనులును, యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి పౌలు, బర్నబాలను అవమానపరచి రాళ్ళు రువ్వి చంపాలని చూసారు [14:5-7].
Acts 14:8-10
లుస్త్రలో కోలాహలము కలుగుటకు పౌలు ఏమి చేసాడు?
పుట్టుకుంటివాడైన ఒక మనుష్యుని పౌలు స్వస్థపరచాడు [14:8-10].
Acts 14:11-13
లుస్త్రలోని ప్రజలు పౌలు, బర్నబాలకు ఏమిచెయ్యాలని చూసారు?
ద్యుపతియొక్క పూజారి ద్వారా పౌలు, బర్నబాలకు బలులు అర్పించాలని కోరారు [14:11-13,18].
Acts 14:14-16
ప్రజలు తమకు చెయ్యాడానికి ఇష్ట పడిన దాని విషయం పౌలు, బర్నబాలు ఏ విధంగా స్పందించారు?
పౌలు, బర్నబాలు తమ వస్త్రములను చించుకొని సమూహము లోనికి చొరబడి వారు వ్యర్ధమైన వాటిని విడిచి సజీవుడైన దేవుని వైపు తిరగాలని గట్టిగా అరిచారు [14:14-15].
Acts 14:17-18
గతకాలములలో సర్వజనులను తమ తమ మార్గములలో నడువనిచ్చెనని దేని గురించి పౌలు బర్నబా చెపుతున్నారు?
ఆయన అకాశమునుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారముననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు [14:16-17]
Acts 14:19-20
లుస్త్రలోని సమూహము తరువాత పౌలుకు ఏమిచేసారు?
లుస్త్రలోని సమూహము తరువాత పౌలుమీద రాళ్ళు రువ్వి పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి [14:19].
శిష్యులు అతని చుట్టూ నిలిచియుండగా పౌలు ఏమిచేసాడు?
అతడు లేచి పట్టణములో ప్రవేశించెను [14:20].
Acts 14:21-22
దేనిద్వారా శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు చెప్పాడు?
అనేక శ్రమలను అనుభవించుట ద్వారా శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు చెప్పాడు [14:22]
Acts 14:23-26
ప్రతి విశ్వాసుల సంఘములో వారిని విడిచివెళ్ల్లడానికి ముందు పౌలు బర్నబాలు ఏమిచేస్తారు?
ప్రతి సంఘములో పౌలు బర్నబాలు పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు [14:23].
Acts 14:27-28
పౌలు బర్నబాలు అంతియొకయకు తిరిగి వచ్చినపుడు ఏమిచేసారు?
పౌలు బర్నబాలు అంతియొకయకు తిరిగి వచ్చినపుడు దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నిటిని, అన్యజనులు విశ్వసించుటకు అయన ద్వారము తెరచిన సంగతి వివరించిరి [14:27].
Acts 15
Acts 15:1-2
యూదయనుండి వచ్చిన కొందరు సహోదరులకు ఏమని బోధించారు?
యూదయనుండి వచ్చిన కొందరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు [15:1].
ఈ ప్రశ్న పరిష్కరించబడటానికి సహోదరులు ఏవిధంగా నిర్ణయించారు?
పౌలు, బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి [15:2].
Acts 15:3-4
ఫినేకే, సమరయ దేశములద్వారా వెళ్ళుచూ పౌలును అతని సహచారులును ఏ సమాచారాన్ని తెలియచేసారు?
పౌలును అతని సహచారులును అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచిరి [15:3].
Acts 15:5-6
అన్యజనులకు సున్నతిచేయించవలెనని, వారు మోషే ధర్మశాస్త్రమును గైకోనవలెనని విశ్వాసుల్లో ఏ గుంపువారు తలంచారు?
పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులు అన్యజనులకు సున్నతి చేయించవలెనని, వారు మోషే ధర్మశాస్త్రమును గైకొనవలెనని తలంచారు [15:5].
Acts 15:7-9
అన్యజనులకు దేవుడు ఏమి చేసాడు, ఏమి ఇచ్చాడు అని పేతురు చెప్పాడు?
దేవుడు అన్యజనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, విశ్వాసము ద్వారా వీరి హృదయాలను పవిత్రపరచాడని పేతురు చెప్పాడు [15:8-9].
Acts 15:10-11
యూదులు, అన్యజనులు రక్షించబద్దారని పేతురు ఎలా చెప్పాడు?
యూదులు, అన్యజనులు ప్రభువైన యేసు కృపద్వారా రక్షించబడ్డారని పేతురు చెప్పాడు [15:11].
Acts 15:12-14
పౌలు, బర్నబాలు సంఘానికి ఏమని వివరించారు?
దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతాలను పౌలు, బర్నబాలు సంఘానికి వివరించారు [15:12].
Acts 15:15-18
దేవుడు తిరిగి కట్టుదునని చెప్పిన ఏ ప్రవచనంను యాకోబు చెప్పాడు, అందులో ఎవరు చేర్చబడ్డారు?
దేవుడు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుదునని ప్రవచనం చెపుతున్నది, దీనిలో అన్యజనులు ఉన్నారు [15:13-17].
Acts 15:19-26
అన్యజనులలోని విశ్వాసులకు ఏ ఆజ్ఞ ఇవ్వాలని యాకోబు సూచించాడు?
అన్యజనులలోని విశ్వాసులు విగ్రహాల వల్ల అపవిత్రమైనవాటిని, వ్యభిచారాన్ని విసర్జించాలని, గొంతుపిసికి చంపిన దానిని, రక్తాన్ని తినకూడదని వారికి ఆజ్ఞ ఇవ్వాలని యాకోబు సూచించాడు [15:20]
Acts 15:27-29
అన్యజనులకు రాసిన ఉత్తరం ముగింపులో అవసమైన కొన్ని ఆజ్ఞలు ఇవ్వడానికి అంగీకరించినట్టు కనపడుతున్నదెవరు?
ఉత్తరాన్ని రాసినవారు, పరిశుద్ధాత్మ ముగింపుమాటలతో అంగీకరించినట్టు కనిపిస్తుంది [15:28].
Acts 15:30-32
యెరూషలేమునుండి వచ్చిన ఉత్తరాన్ని చూసి అన్యజనుల స్పందన ఎలాఉంది?
అ ఉత్తరములోని ప్రోత్సాహాన్నిబట్టి అన్యజనులు సంతోషించారు [15:31].
Acts 15:33-35
పౌలు, బర్నబాలు అంతియొకయలో నిలిచి ఏమి చేసారు?
పౌలు, బర్నబాలు అంతియొకయలో నిలిచి ప్రభువు వాక్యాన్ని బోధించుచు ప్రకటించుచు వచ్చారు [15:35].
Acts 15:36-38
పౌలు తాను ఏమి చేయాలని కోరుతున్నానని బర్నబాకు చెప్పాడు ?
ఏయే పట్టణాలలో ప్రభువు వాక్యము ప్రచురపరచారో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లాలని బర్నబాతో చెప్పాడు [15:36].
Acts 15:39-41
పౌలు, బర్నబాలు ఎందుకు విడిపోయారు, ఎందుకు వివిధ మార్గాలనుండి ప్రయాణాలు చేసారు?
బర్నబా తమతో మార్కును తీసుకొనివెళ్ళాలని కోరాడు, అయితే పౌలు అతనిని తీసుకొని వెళ్ళడం యుక్తము కాదని తలంచాడు [15:37-39].
Acts 16
Acts 16:1-3
పౌలు తిమోతితో కలిసి వెళ్ళడానికిముందు అతనికి ఏమిచేసాడు, ఎందుకు?
పౌలు తిమోతికి సున్నతి చేయించాడు, ఎందుకంటే అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆప్రాంతయూదులందరికి తెలుసు [16:3].
Acts 16:4-8
పౌలు ప్రయాణం చేస్తూ ఏనియమాలను సంఘాలకు అందించాడు?
యెరూషలేములోని అపోస్తలులు, పెద్దలు నిర్ణయించిన నియమాలను వారికి అందించాడు [16:4].
Acts 16:9-10
మాసిదోనియాలో సువార్త ప్రకటించడానికి తాను పిలువబడ్డాడని పౌలుకు ఎలా తెలుసు?
మాసిదోనియ దేశస్థుడొకడు సహాయం చెయ్యదానికి రమ్మని పిలిచిన దర్శనాన్ని పౌలు పొందాడు [16:9].
Acts 16:11-13
విశ్రాంతి దినాన్న పౌలు ఎందుకు ఫిలిప్పి నగర ద్వారం బయట నది ఒడ్డుకు వెళ్ళాడు?
అక్కడ ప్రార్ధన జరుగునని పౌలు తలంచాడు [16:13].
Acts 16:14-15
పౌలు మాట్లాడినప్పుడు దేవుడు లుదియ కొరకు ఏమిచేసాడు?
పౌలు మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు లుదియ హృదయాన్ని తెరిచాడు [16:14].
పౌలు మాట్లాడిన తరువాత నదిలో బాప్తిస్మం పొందినదెవరు?
పౌలు మాట్లాడిన తరువాత లుదియ తన యింటివారందరితోపాటు నదిలో బాప్తిస్మం పొందింది [16:15].
Acts 16:16-18
దయ్యంపట్టిన బానిసపిల్ల ఏవిధంగా తన యజమానులకు లాభం సంపాదించేది?
దయ్యం పట్టిన బానిసపిల్ల సోదే చెప్పడం మూలంగా తన యజమానులకు లాభం సంపాదించేది [16:16]
అనేక దినాలు ఆ బానిసపిల్ల పౌలును వెంబడిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏమి చేసాడు?
పౌలు ఆమె వైపుకు తిరిగి ఆమెలోనుండి బయటకు రమ్మని యేసు క్రీస్తు నామంలో దురాత్మకు అజ్ఞాపించాడు.[16:17-18].
Acts 16:19-21
ఆ బానిసపిల్ల యజమానులు పౌలు సీలలకు వ్యతిరేకంగా ఎటువంటి నేరం మోపారు?
రోమీయులు అంగీకరించకూడని, పాటించకూడని ఆచారాలను పౌలు సీలలు ప్రకటిస్తున్నారని వారికి వ్యతిరేకంగా నేరం మోపారు [16:21].
Acts 16:22-24
న్యాయాదిపతులనుండి ఎటువంటి శిక్షను పౌలు సీలలు పొందారు ?
వారిని బెత్తాలతో కొట్టారు, చెరసాలలో వేసారు, వారి కాళ్ళు కోయ్యబొండలో బిగించారు [16:22-24].
Acts 16:25-28
చెరసాలలో మధ్యరాత్రి వేళ పౌలు సీలలు ఏమిచేస్తున్నారు?
వారు దేవునికి ప్రార్ధన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు [16:25].
చెరసాల అధికారి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు?
అక్కడ మహా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి [16:26].
Acts 16:29-31
పౌలు సీలలను చెరసాల అధికారి ఏమని ప్రశ్నించాడు?
"అయ్యలారా, పాపవిముక్తి పొందడానికి నేనేం చేయాలి"పౌలు సీలలను చెరసాల అధికారి అడిగాడు [16:30].
పౌలు సీలలు చెరసాల అధికారికి ఏ సమాధానం ఇచ్చారు?
"ప్రభువైన యేసునందు నమ్మకముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణ పొందుతారు" అని పౌలు సీలలు జవాబిచ్చారు [16:31].
Acts 16:32-34
ఆ రాత్రి ఎవరు బాప్తిస్మం పొందారు
ఆ రాత్రి చేరసాల అధికారి, అతని యింటివారు బాప్తిస్మం పొందారు [16:33].
Acts 16:35-39
పౌలు సీలలను విడుదల చెయ్యమని కబురు పంపిన న్యాయాదిపతులు ఎందుకు భయపడ్డారు?
న్యాయవిచారణ లేకుండా ఇద్దరు రోమా పౌరులను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించిన కారణంగా న్యాయాదిపతులు భయపడ్డారు [16:35-38].
Acts 16:40
న్యాయాధిపతులు వారిని పట్టణంను విడిచిపెట్టమని చెప్పినపుడు పౌలు సీలలు ఏమిచేసారు?
పౌలు సీలలు లుదియ యింటికి వెళ్ళారు, అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచి తరువాత వెళ్ళిపోయారు [16:40].
Acts 17
Acts 17:1-2
పౌలు తెస్సలోనికకు వచ్చినపుడు లేఖనాలలోనుండి యేసును గురించి మాట్లాడడానికి మొదట ఎక్కడికి వెళ్ళాడు?
పౌలు తెస్సలోనికకు వచ్చినపుడు లేఖనాలలోనుండి యేసును గురించి మాట్లాడడానికి మొదట యూదుల సమాజకేంద్రం లోనికి వెళ్ళాడు [17:1-2].
Acts 17:3-4
తప్పనిసరి అని లేఖనాలలోనుండి దేన్ని పౌలు చూపించాడు?
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలలోనుండి పౌలు చూపించాడు [17:3].
Acts 17:5-9
పౌలు సీలలమీద పట్టణం అధికారులకు చేసిన నింద ఏమిటి?
పౌలు సీలలు చక్రవర్తికాక యేసుఅను మరో రాజు ఉన్నాడని చెపుతూ చక్రవర్తి శాసనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని వారి మీద నింద వేసారు [17:7].
Acts 17:10-12
పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు ఎక్కడికి వెళ్ళారు?
పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు యూదుల సమాజ కేంద్రానికి వెళ్ళారు [17:10].
పౌలు ప్రసంగం వినినపుడు బెరయవారు ఏమిచేసారు ?
బెరయవారు వాక్కును అత్యాసక్తితో అంగీకరించి పౌలు చెప్పినది సత్యమో కాదో అని ప్రతి రోజూ లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు [17:11].
Acts 17:13-15
పౌలు బెరయ ఎందుకు విదిచిపెట్టాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు ?
తెస్సలోనికలోని యూదులు బెరయలోని జనసమూహములని రేపికదిలించారు కనుక పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు [17:13-15]
Acts 17:16-18
పౌలు ఏథెన్సుకు వెళ్ళినపుడు ఎక్కడికి వెళ్ళాడు?
పౌలు ఏథెన్సుకు వెళ్ళినపుడు యూదుల సమాజకేంద్రానికి, బజారు ప్రదేశానికి యూదులతో చర్చించడానికి వెళ్ళాడు [17:17].
Acts 17:19-21
పౌలు బోధను కొనసాగించడానికి పౌలును ఎక్కడికి తీసుకొని వచ్చారు?
పౌలు బోధను కొనసాగించడానికి పౌలును అరెయోపగస్ సభకు తీసుకొని వచ్చారు [17:19-20].
Acts 17:22-23
ప్రజలకు పౌలు వివరించడానికి కోరుకొనిన ఏ బలిపీఠం ఏథెన్స్ లో పౌలు కనుగొన్నాడు?
"తెలియబడని దేవునికి" అని రాయబడిన ఒక బలిపీఠంను పౌలు చూశాడు, దానినే ప్రజలకు వివరించాలని పౌలు కోరాడు [17:23]
Acts 17:24-25
సమస్తాన్ని సృజించిన దేవుడు మనుష్యులందరికి ఏమి దయచేస్తున్నాడని పౌలు చెప్పాడు?
సమస్తాన్ని సృజించిన దేవుడు మనుష్యులందరికి జీవితాన్ని, ఊపిరిని అలాంటి వాటన్నిటినీ ప్రసాదిస్తున్నాడు [17:25].
Acts 17:26-27
మానవజాతులన్నిటినీ దేనినుండి దేవుడు చేసాడు?
మానవజాతులన్నిటినీ ఒక మనిషి నుండి దేవుడు చేసాడు [17:26].
దేవుడు ఎవరికైనా ఎంతదూరంలో ఉన్నాడని పౌలు చెపుతున్నాడు?
వాస్తవంగా దేవుడు మనలో ఎవరికీ దూరంగా లేడని పౌలు చెపుతున్నాడు [17:27].
Acts 17:28-29
మనము దేవుణ్ణి ఏవిధంగా తలంచకూడదని పౌలు చెపుతున్నాడు ?
మనము మన ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన విగ్రహం లాంటిదని దేవుణ్ణి తలంచకూడదని పౌలు చెపుతున్నాడు [17:29].
Acts 17:30-31
అంతటా ఉన్న మనుష్యులు ఇప్పుడు ఏమి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు?
ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుష్యులందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు [17:30].
దేనికొరకు దేవుడు ఒక దినాన్ని ఏర్పరచాడు?
ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును దేవుడు నిర్ణయించాడు [17:31].
యేసు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఎంపిక చెయ్యబడ్డాడని దేవుడు ఏ ఋజువును ఇచ్చాడు?
ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపడంవల్ల ఈ సంగతి మనుషులందరికీ ఋజూవు చేసాడు [17:31].
Acts 17:32-34
మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు ఏమిచేసారు?
మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు పౌలును హేళన చేసారు [17:32].
పౌలు చెప్పిన దానిని ఎవరైనా విశ్వసించారా?
అవును కొందరు, తమతో ఉన్నవారును పౌలు చెప్పిన దానిని విశ్వసించారు [17:34].
Acts 18
Acts 18:1-3
తనను తాను పోషించుకోడానికి పౌలు ఏమిచేసేవాడు?
తనను తాను పోషించుకోడానికి పౌలు డేరాలు కుట్టేపనిని చేసేవాడు [18:3].
Acts 18:4-8
కొరింథులోని యూదులకు పౌలు ఏమని సాక్ష్యమిచ్చాడు?
యేసే క్రీస్తని కొరింథులోని యూదులకు పౌలు సాక్ష్యమిచ్చాడు [18:5].
యూదులు పౌలును దూషించినపుడు పౌలు ఏమిచేసాడు?
వారి రక్తము వారి తల మీదే ఉంటుందని చెప్పాడు, అన్యజనుల వద్దకు వెళ్ళాడు [18:6].
Acts 18:9-11
కొరింథులో ప్రభువు వద్దనుండి పౌలు ఎలాంటి ప్రోత్సాహాన్ని పొందాడు?
నిర్భయంగా ఉండి మాట్లాడుతూ ఉండమని ప్రభువు పౌలుకు చెప్పాడు, అక్కడ ఎవరూ తనకు హాని చెయ్యరు [18:9-10].
Acts 18:12-13
పౌలుకు వ్యతిరేకంగా ఏనేరంతో యూదులు రాష్ట్రాధికారివద్దకు వచ్చారు?
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను పురికొల్పుతున్నాడని పౌలుమీద నేరం మోపారు [18:12-13].
Acts 18:14-17
పౌలుకు వ్యతిరేకంగా యూదులు మోపిన నేరంవిషయం రాస్ట్రాదికారి ఏవిధంగా స్పందించాడు?
యూదా ధర్మశాస్త్రానికి గురించినవాటిని విచారణ చేయడానికి తనకు ఇష్టంలేదని చెప్పాడు [18:15].
Acts 18:18-21
పౌలుతో ఎఫెసువరకు ప్రయాణం చేసిన భార్యాభర్తలు ఎవరు?
ఆకుల ప్రిస్కిల్ల పౌలుతో పాటు ఎఫెసువరకు ప్రయాణం చేసారు [1818-19].
Acts 18:22-23
ఎఫెసును విడిచిన తరువాత పౌలు మొదట ఏ రెండు స్థలాలకు వెళ్ళాడు?
ఎఫెసును విడిచిన తరువాత పౌలు యెరూషలేముకు వెళ్ళాడు, తరువాత అంతియొకయకు వెళ్ళాడు [18:22].
Acts 18:24-26
అపొల్లో ఏవిషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నాడు, ఏ బోధలో అతనికి మరింత సూచనలు అవసరం?
అపొల్లో ప్రభువు మార్గం విషయం ఉన్నవి ఉన్నట్టుగా అర్ధం చేసుకున్నాడు, అయితే యోహాను ఇచ్చిన బాప్తీస్మం మాత్రమే తనకు తెలుసు [18:25].
ప్రిస్సిల్ల అకులలు అపోల్లోకు ఏమి చేసారు?
ప్రిస్సిల్ల అకులలు అపోల్లోకు స్నేహితులయ్యారు, దేవుని మార్గాన్ని ఇంకా పూర్తిగా వివరించారు [18:26].
Acts 18:27-28
లేఖనాలలోని జ్ఞానం, బోధలో తనకున్న వాగ్దాటితో అపొల్లో ఏమి చెయ్యగలిగాడు?
యేసే క్రీస్తని లేఖనముల ద్వారా ఋజువు చేస్తూ బహిరంగంగానే యూదుల వాదాలను వమ్ము చేసాడు [18:9-10].
Acts 19
Acts 19:1-2
ఎఫెసులో పౌలును కలిసిన శిష్యులు వారు విశ్వసించినపుడు దేనిగురించి వారు వినలేదని చెప్పారు?
వారు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వినలేదని చెప్పారు [19:2].
Acts 19:3-4
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం దేని గురించిన బాప్తిస్మం?
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిస్మం [19:4]
ఎవరియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు?
తన వెనుక వచ్చువానియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు [19:4].
Acts 19:5-7
ఎఫెసులో ఎవరి నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు?
ప్రభువైన యేసు నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు [19:5].
వారు బాప్తిస్మం పొందిన తరువాత పౌలు వారిమీద చేతులుంచినపుడు ఏమిజరిగింది?
పరిశుద్ధాత్ముడు వారిమీదికి వచ్చాడు, వారు వేరే భాషలతో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు [19:6].
Acts 19:8-10
ఎఫెసులోని యూదులు కొందరు ప్రభువు మార్గాన్ని దూషించినపుడు పౌలు ఏమిచేసాడు?
పౌలు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తురన్నాన్ ప్రసంగశాలలో ప్రతి రోజూ చర్చలు జరిపాడు [19:9].
Acts 19:11-14
పౌలు చేతి ద్వారా దేవుడు చేసిన ప్రత్యేక అద్భుతాలు ఏమిటి?
అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గాని నడికట్లు గాని రోగుల దగ్గరకు తెచ్చినపుడు రోగాలు పోయాయి, దయ్యాలు వారిని విడిచి వెళ్ళాయి [19:12].
Acts 19:15-17
యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురు యేసు నామంలో దురాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రయత్నించినపుడు ఏమి జరిగింది?
దురాత్మలు యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురి మీదికి ఎగిరి దూకి వారిని లొంగదీసి ఓడగొట్టాడు, వారు గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు [19:16].
Acts 19:18-20
ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు ఏమి చేసారు?
ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు [19:19].
Acts 19:21-25
యెరూషలేము వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్లాలని పౌలు అనుకున్నాడు?
యెరూషలేము వెళ్ళిన తరువాత పౌలు తాను రోమ్ కూడా చూడాలి అనుకున్నాడు [19:21].
Acts 19:26-27
దేమేత్రియస్ అనే కంసాలి వాడు అలాంటి పని చేసేవారితో ఏవిషయాన్ని పంచుకున్నాడు?
చేతులతో చేసిన దేవతలు దేవతలే కావని, అర్తెమి మహాదేవి నిరుపయోగం అని పౌలు ప్రజలకు బోధిస్తున్నాడని దేమేత్రియస్ అనే కంసాలి వాడు ఆందోళన చెందాడు [19:26].
Acts 19:28-29
అర్తెమి మహాదేవి విషయంలో ప్రజలు ఏ విధంగా స్పందించారు?
ప్రజలు కోపోద్రేకంతో నిండిపోయి "ఎఫేసువారి అర్తెమి గొప్పది" అని కేకలు పెట్టారు, నగరమంతా గందరగోళం అయిపోయింది [19:28-29].
Acts 19:30-37
పౌలు ప్రజల సభ వద్దకు వెళ్లాలని తలంచినప్పటికి ఎందుకు వెళ్ళలేక పోయాడు?
శిష్యులు, స్థానిక అధికారులు పౌలు ప్రజల సభ వద్దకు వెళ్ళడానికి అనుమతించ లేదు [19:30-31].
Acts 19:38-41
ప్రజలు అల్లరికి బదులు ఏమిచెయ్యాలని పట్టణపు కరణం చెప్పాడు?
ప్రజలు అల్లరికి బదులు వారి పిర్యాదులు తేవాలని పట్టణపు కరణం చెప్పాడు [19:38].
ప్రజలు ఏ ప్రమాదంలో ఉన్నారని పట్టణపు కరణం చెప్పాడు ?
జరిగిన అల్లరికి సరైన కారణం లేదు కనుక దానిని గురించి వారిమీద నేరం మోపడం జరుగుతుందేమో అని భయపడ్డాడు [19:40]
Acts 20
Acts 20:7-8
పౌలును ఇతర అపోస్తలులును వారంలో ఏరోజున రొట్టె విరవడానికి కలుసుకోనేవారు?
పౌలును ఇతర అపోస్తలులును వారంలో మొదటి రోజున రొట్టె విరవడానికి కలుసుకోనేవారు [20:7].
Acts 20:9-14
పౌలు ప్రసంగిస్తున్నపుడు కిటికీనుండి క్రింద పడిపోయిన యువకునికి ఏమి జరిగింది?
ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి క్రింద పడి చనిపోయాడు. పౌలు అతనిమీద పడుకున్నాడు. ఆ యువకుడు మరల బ్రతికాడు [20:9-10].
Acts 20:15-16
ఎందుకు పౌలు యెరూషలేములో ఉండాలని ఆతురత పడుతున్నాడు?
పెంతెకోస్తు రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురత పడుతున్నాడు [20:16].
Acts 20:17-21
ఆసియాలో తాను అడుగుపెట్టిన దినమునుండి యూదులు, గ్రీసుదేశస్థులను హెచ్చరిస్తూ ఉన్నాడని దేని విషయంలో పౌలు చెపుతున్నాడు?
దేవుని పట్ల పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులు, గ్రీసు దేశస్థులను హెచ్చరిస్తూ వచ్చానని పౌలు చెపుతున్నాడు [20:18-20].
Acts 20:22-24
యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ప్రతి పట్టణములో పౌలుకు పరిశుద్ధాత్మ చెపుతున్న సాక్ష్యం ఏమిటి?
సంకెళ్ళు బాధలు తనకోసం కాచుకొని యున్నాయని ప్రతి పట్టణములో పౌలుకు పరిశుద్ధాత్మ సాక్ష్యం చెపుతూ ఉన్నాడు [20:23].
ప్రభువైన యేసు నుండి పౌలు పొందిన పరిచర్య ఏమిటి?
దేవుని కృపను గురించిన శుభవార్తను తెలియజేయడం పౌలు పొందిన పరిచర్య [20:24].
Acts 20:25-27
ఎవరైనా నాశనమైతే తాను బాధ్యుడను కాను అని ఎందుకు పౌలు చెపుతున్నాడు?
దేవుని సంకల్పమంతా వారికి ప్రకటించాడు కనుక వారు నాశనమైతే తాను బాధ్యుడను కాను అని పౌలు చెపుతున్నాడు [20:27].
Acts 20:28-30
తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దలను ఏవిషయంలో జాగ్రత కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు?
మంద అంతటి గురించి జాగ్రతగా ఉండుడని పెద్దలను ఆజ్ఞాపించాడు [20:28].
తాను వెళ్ళిపోయిన తరువాత ఎఫెసు పెద్దల మధ్య ఏమి జరగబోతుందని పౌలు చెప్పాడు?
శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని వారిలోని పెద్దలలో కొందరు కుటిలమైన మాటలు చెపుతారు అని పౌలు చెప్పాడు [20:30].
Acts 20:31-32
పౌలు ఎఫెసు పెద్దలను ఎవరికి అప్పగించాడు?
పౌలు ఎఫెసు పెద్దలను దేవునికి అప్పగించాడు[20:32].
Acts 20:33-35
పరిచర్య విషయం ఎఫెసు పెద్దలకు ఎటువంటి ఆదర్శంచూపించాడు?
పౌలు తన అక్కరలు తనతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి తన చేతులతో పనిచేసాడు, బలహీనులకు సాయం చేసాడు [20:34-35].
Acts 20:36-38
దేన్ని బట్టి ఎఫెసు పెద్దలందరూ దు:ఖించారు?
ఇకమీదట నా ముఖం చూడరని పౌలు చెప్పిన మాటకు ఎఫెసు పెద్దలందరూ విశేషంగా దు:ఖించారు [20:38].
Acts 21
Acts 21:3-6
తూరులో ఉన్న శిష్యులు పౌలుతో ఆత్మ ద్వారా ఏమిచెప్పారు?
వారు పౌలును యెరూషలేము వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు [21:4].
Acts 21:7-9
బోధకుడైన ఫిలిప్పు కుమార్తెల గురించి మనకు ఏమి తెలుసు?
ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కన్యలు. వారు ప్రవచించువారు [21:9].
Acts 21:10-11
అగబు అను ప్రవక్త పౌలుకు ఏమి చెప్పాడు?
యెరూలేములోని యూదులు పౌలును బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని చెప్పాడు [21:11].
Acts 21:12-16
యెరూషలేము వదిలి వెళ్ళవద్దని అక్కడివారందరూ పౌలును బతిమాలినప్పుడు పౌలు ఏమన్నాడు?
యెరుషలేములో బంధింపబడుటకే కాక ప్రభువైన యేసు నామము నిమిత్తము చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు [21:13].
Acts 21:17-19
యెరూషలేముకు వచ్చిన తరువాత పౌలు ఎవరిని కలిసాడు?
యెరూషలేముకు వచ్చిన తరువాత పౌలు పెద్దలందరిని కలిసాడు [21:18].
Acts 21:20-21
పౌలుకు వ్యతిరేకంగా యూదులు ఏమి నేరం మోపారు?
అన్యజనులలో ఉన్న యూదులకు మోషేను విడిచిపెట్టమని పౌలు చేపుతున్నాడని యూదులు నేరం మోపారు [21:21].
Acts 21:22-24
యాకోబు, ఇతర పెద్దలు పౌలును అతనితోకూడా మొక్కుబడి చేసుకొని ఉన్నవారిని శుద్ది చేసుకొనమని ఎందుకు చెప్పారు?
పౌలు ధర్మశాస్త్రంను గైకొని యధావిధిగా నడుచుకొనుచున్నాడని అందరు తెలిసికొనునట్లు వారు కోరారు [21:24].
Acts 21:25-26
విశ్వసించిన అన్యజనులు ఏమిచేయాలని యాకోబు కోరాడు?
విగ్రహాలకు అర్పితమైనవాటినీ రక్తాన్నీ గొంతుపిసికి చంపిన దానినీ తినకుండా జారులు కాకుండా ఉండాలని యాకోబు చెప్పాడు [21:25].
Acts 21:27-29
ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలములో పౌలుకు వ్యతిరేకంగా ఏ నేరం మోపారు?
ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని, గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొనివచ్చి ఆ పవిత్ర స్థానాన్ని ఆశుద్దం చేసాడని నేరం మోపారు [21:28].
Acts 21:30-31
ఈ నేరాలు మోపిన తరువాత యూదులు పౌలుకు ఏమిచేసారు?
పౌలును పట్టుకొని దేవాలయంలోనుంచి బయటికి ఈడ్చుకుపోయారు [21:31].
Acts 21:32-33
యెరూషలేంలో అల్లరిగా ఉందని తెలిసినప్పుడు పటాలం అధికారి ఏమిచేసాడు?
యెరూషలేంలో అల్లరిగా ఉందని తెలిసినప్పుడు పటాలం అధికారి పౌలుని పట్టుకొని రెండు సంకెళ్ళతో బంధించి, అతను ఎవరు, ఏమిచేసాడు అని అడిగాడు [21:33].
Acts 21:34-38
సైనికులు పౌలును కోటలోనికి తీసుకొనివెళ్తున్నప్పుడు సమూహం ఏమని అరిచారు?
"వాణ్ణి చంపెయ్యండి" అని సమూహం అరిచారు [21:36].
Acts 21:39-40
పటాలం అధికారికి పౌలు ఏమని కోరాడు?
ప్రజలతో మాట్లాడడానికి తనకు అనుమతి ఇవ్వమని పౌలు కోరాడు [21:39].
యెరూషలెంలో ప్రజలతో పౌలు ఏ భాషలో మాట్లాడాడు?
యెరూషలెంలో పౌలు ప్రజలతో హెబ్రీ భాషలో మాట్లాడాడు [21:40].
Acts 22
Acts 22:1-2
పౌలు హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రజలు వినినప్పుడు వారు ఏమిచేసారు?
పౌలు హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రజలు వినినప్పుడు వారు మౌనం వహించారు [22:2].
Acts 22:3-5
పౌలు ఎక్కడ చదువుకున్నాడు, అతని ఉపాధ్యాయుడు ఎవరు?
పౌలు యెరూషలెంలో చదువుకున్నాడు, గమలీయేల్ అతని ఉపాధ్యాయుడు [22:3].
మార్గాన్ని అనుసరించేవారితో పౌలు ఏవిధంగా వ్యవహరించాడు?
మార్గాన్ని అనుసరించేవారిని మరణమయ్యేవరకు హింసిస్తూ, వారిని చెరసాలలో వేయిస్తూ వచ్చాడు [22:4].
Acts 22:6-8
పౌలు దమస్కుకు చేరినపుడు ఆకాశంనుండి వచ్చిన స్వరం పౌలుతో ఏమిచెప్పింది?
"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?" అని ఆకాశంనుండి వచ్చిన స్వరం పౌలుతో చెప్పింది [22:7].
పౌలు ఎవరిని హింసిస్తూ ఉన్నాడు?
పౌలు నజరేయుడైన యేసును హింసిస్తూ ఉన్నాడు [22:8].
Acts 22:9-11
పౌలు ఎందుకు చూడలేక పోయాడు?
దమస్కుకు చేరినపుడు ఆ కాంతి తేజస్సు కారణంగా పౌలు ఏమీ చూడలేకపోయాడు [22:11].
Acts 22:12-13
పౌలు తన చూపును ఎలా తిరిగి పొందాడు?
భక్తిపరుడైన అననియ అను పేరుగల వ్యక్తి పౌలు వద్ద నిలిచి "సోదరుడా సౌలూ, దృస్టి పొందు" అని చెప్పాడు [22:12-13].
Acts 22:14-16
అననియ పౌలుకు ఏమి చెయ్యమని చెప్పాడు, ఎందుకు?
లేచి తన పాపాలు కడిగివేసుకునేందుకు బాప్తిసం పొందమని అననియ పౌలుకు చెప్పాడు [22:16].
Acts 22:17-18
దేవాలయంలో పౌలుతో యేసు మాట్లాడినపుడు పౌలు సాక్ష్యము గురించి యూదులు ఏవిధంగా స్పందిస్తారని చెప్పాడు?
యూదులు పౌలు సాక్ష్యమును అంగీకరింపరు అని చెప్పాడు [22:18].
Acts 22:19-21
ఎవరి వద్దకు యేసు పౌలును పంపాడు?
అన్యజనులవద్దకు వద్దకు యేసు పౌలును పంపాడు [22:21].
Acts 22:22-26
పౌలు అన్యజనులనను గురించి మాట్లాడుతున్నపుడు ప్రజలు ఎలా స్పందించారు?
ప్రజలు అరుస్తూ తమ పైబట్టలు తీసిపారవేస్తూ ఆకాశం వైపు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు [22:23].
Acts 22:27-29
పౌలు ఏవిధంగా రోమ్ పౌరుడు అయ్యాడు?
పౌలు పుట్టుకతోనే రోమ్ పౌరుడు అయ్యాడు [22:28].
Acts 22:30
పౌలు రోమ్ పౌరుడు అని తెలిసినపుడు పైఅధికారి ఏమిచేసాడు?
పైఅధికారి అతని సంకెళ్ళు తీసివేసి ప్రముఖయాజులూ యూదా సమాలోచన సభావారూ అంతా సమావేశం కావాలని ఆజ్ఞ జారీ చేసాడు [22:30].
Acts 23
Acts 23:1-5
ప్రధాన యాజకుడు పౌలు నోటిమీద కొట్టండని పౌలు దగ్గర ఉన్నావారిని ఎందుకు ఆజ్ఞాపించాడు?
దేవుని ఎదుట మంచి మనస్సాక్షిగలవాడై ఉన్నానని చెప్పిన కారణంగా ప్రధాన యాజకుడు కోపగించి అలా ఆజ్ఞాపించాడు [23:1-2].
Acts 23:6-8
ఏ కారణంగా పౌలు యూదా సమాలోచన సభ ఎదుట విచారణకు గురి అయ్యాడు?
చనిపోయినవారు తిరిగిలేస్తారనే ఆశాభావం గురించి తాను విచారణకు గురి అయ్యాడని పౌలు చెప్పాడు [23:3-6].
తన విచారణకు కారణాన్ని పౌలు చెప్పినపుడు ఎందుకు అలజడి రేగింది?
పరిసయ్యులు పునరుద్ధానం ఉందని చెపుతారు, సద్దూకయ్యులు పునరుద్దానం లేదని చెపుతారు, ఈ కారణంగా వారిమధ్య అలజడి రేగింది [23:7-8].
Acts 23:9-10
యూదుల సభలో నుండి పౌలును కోటలోనికి ఎందుకు తేవాలని పై అధికారి తలంచాడు?
సభలోని సభ్యులు పౌలును చీల్చివేస్తారేమో అని పై అధికారి భయపడ్డాడు [23:10].
Acts 23:11
తరువాత రాత్రి ప్రభువు పౌలుకి ఏమి వాగ్దానం చేసాడు?
ధైర్యంగా ఉండాలని, యెరూషలేంలోను, రోమ్ లోను పౌలు సాక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు [23:11].
Acts 23:12-13
పౌలు విషయంలో కొందరు యూదులు ఏమని ఒట్టు పెట్టుకున్నారు?
సుమారు నలభై మంది యూదులు తాము పౌలును చంపేవరకు అన్నపానాలు తీసుకోబోమని ఒట్టుపెట్టుకున్నారు [23:12-13].
Acts 23:14-19
ప్రధాన యాజకులు, పెద్దల యొదుట నలభై మంది యూదుల ప్రణాలిక ఏమిటి?
పౌలు ఆ సభవరకు రాకముందే తాము అతణ్ణి చంపగలుగునట్లు పౌలుని విచారణ సభకు తీసుకురావాలని ప్రధాన యాజకులు, పెద్దలను అడిగారు [23:14-15].
Acts 23:20-21
ఈ నలుబదిమంది ప్రణాలిక గురించి పైఅధికారికి ఎలా తెలిసింది?
పౌలు మేనల్లుడు ఈ ప్రణాలికను గురించి విని దానిని పైఅధికారికి చెప్పాడు [23:16-21].
Acts 23:22-27
నలుబది మంది యూదుల ప్రణాలిక తెలుసుకున్న పైఅధికారి ఏవిధంగా స్పందించాడు?
పౌలును రాత్రి తొమ్మిది గంటలకు అధిపతియైన ఫేలిక్సు వద్దకు పౌలును సురక్షితంగా తీసుకొని వెళ్ళడానికి పెద్ద సైన్యాన్ని సిద్ధపరచమని ఆజ్ఞాపించాడు [23:23-24].
Acts 23:28-33
అధిపతియైన ఫేలిక్సు కు రాసిన ఉత్తరంలో పౌలుకు వ్యతిరేకంగా చేసిన నేరాల గురించి పైఅధికారి ఏమని రాశాడు?
పౌలు మరణశిక్షకు గాని చెరసాలకు గాని పాత్రుడు కాదు, అయితే తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి చేసిన నేరారోపణలే [23:29].
Acts 23:34-35
అధిపతియైన ఫెలిక్స్ పౌలు విషయాన్ని ఎప్పుడు విచారిస్తానని చెప్పాడు?
అధిపతియైన ఫెలిక్స్ పౌలు విషయాన్ని తనమీద నేరం మోపేవారు కూడా వచ్చినపుడు విచారణ చేస్తానని చెప్పాడు [23:35].
పౌలును తన విచారణ వరకు ఎక్కడ ఉంచారు?
పౌలును తన విచారణ వరకు హేరోదు భవనంలో ఉంచారు [23:35].
Acts 24
Acts 24:4-9
న్యాయవాది తెర్తుల్లు పౌలుకు వ్యతిరేకంగా ఏ నేరాలు మోపాడు?
యూదులందరినీ కలహానికి రేపేవాడు, దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకున్నాడని న్యాయవాది తెర్తుల్లు పౌలుకు వ్యతిరేకంగా నేరాలు మోపాడు [24:5-6].
పౌలు ఏ వర్గానికి చెందినవాడు అని న్యాయవాది తెర్తుల్లు చెప్పాడు?
పౌలు నజరేయుల మత శాఖకు నాయకుడు అని న్యాయవాది తెర్తుల్లు చెప్పాడు [24:5].
Acts 24:10-13
దేవాలయంలో, సమాజకేంద్రంలో, పట్టణంలో పౌలు ఏమి చేసాడని చెప్పాడు?
తాను ఎవరితోనూ వాదించ లేదు, ప్రజల మధ్య అల్లరి రేపలేదని పౌలు చెప్పాడు [24:12].
Acts 24:14-16
తాను ఏ విషయంలో నమ్మకంగా ఉన్నానని పౌలు చెపుతున్నాడు?
ధర్మశాస్త్రంలో ఉన్నదానంతటి విషయంలో నమ్మకంగా ఉన్నాడని పౌలు చెప్పాడు [24:14].
తన మీద నేరం మోపేవారితో ఎటువంటి ఆశాభావాన్ని పౌలు పంచుకుంటున్నాడు?
చనిపోయిన న్యాయవంతులేమి, దుర్మార్గులేమి లేస్తారని వారికి ఆశాభావం ఉందని పౌలు చెప్పాడు [24:15].
Acts 24:17-21
తాను యెరూషలేం ఎందుకు వచ్చాడని పౌలు చెప్పాడు?
తన స్వప్రజలకు దానధర్మాలు ఇవ్వడానికి కానుకలు అర్పించడానికి వచ్చానని చెప్పాడు [24:17].
ఆసియానుండి వచ్చిన యూదులు తనను దేవాలయంలో కనుగొనినపుడు తాను ఏమి చేస్తున్నట్టు చెప్పాడు?
తాను శుద్ధిచేసుకొని దేవాలయంలో ఉంటె వారు తనను చూసారని పౌలు చెప్పాడు [24:18].
Acts 24:22-23
ఏ విషయం అధిపతియైన ఫేలిక్సు కు బాగా తెలుసు?
మార్గం విషయం అధిపతియైన ఫేలిక్సు కు బాగా తెలుసు [24:22].
అధిపతియైన ఫేలిక్సు పౌలు సంగతిని ఎప్పుడు నిర్ణయిస్తాడని చెప్పాడు?
పై అధికారియైన లూసియస్ వచ్చిన తరువాత పౌలు సంగతిని నిర్ణయిస్తానని ఫేలిక్సు చెప్పాడు [24:22].
Acts 24:24-25
కొన్ని రోజుల తరువాత పౌలు ఫేలిక్సు కు ఏమి చెప్పాడు?
పౌలు క్రీస్తు యేసు మీద నమ్మకాన్ని గురించి చెప్పాడు, న్యాయం, ఆశానిగ్రహం, రానున్న తీర్పును గురించి చెప్పాడు [24:24-25].
పౌలు మాటలు వినిన తరువాత ఫేలిక్సుఏవిధంగా స్పందించాడు?
ఫేలిక్సు భయకంపితుడయ్యాడు, తన వద్దనుండి పౌలును పంపించి వేశాడు [24:25].
Acts 24:26-27
ఫేలిక్సు ఎందుకు పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు?
యూదులచేత మంచివాడనిపించుకోవాలనే ఉద్దేశంతో ఫేలిక్సు పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు [24:27].
Acts 25
Acts 25:1-3
ప్రదానయాజకుడు, ప్రముఖయూదులు ఫేస్తు పౌలు విషయం ఏమని అడిగారు?
పౌలును దారిలో చంపడానికి అతనిని యెరూషలేముకు పిలిపించమని అడిగారు [25:3].
Acts 25:4-8
ప్రధాన యాజకుడు, ప్రముఖ యూదులు ఏమి చేయాలని ఫేస్తు వారికి చెప్పాడు?
ఫేస్తు వారిని తాను వెళుతున్నసీజరియకు తనతో పాటు రమ్మని చెప్పాడు, అక్కడ వారు పౌలు మీద నేరారోపణ చెయ్యవచ్చు అని వారితో చెప్పాడు [25:5].
Acts 25:9-10
సీజరియలో పౌలును విచారణ చేస్తున్నప్పుడు ఫేస్తు పౌలును ఏమని అడిగాడు?
పౌలు యెరూషలేముకు వెళ్లి విచారించబడడం తనకు ఇష్టమేనా అని అడిగాడు [25:9].
ఫేస్తు ఈ ప్రశ్న పౌలును ఎందుకు అడిగాడు?
యూదులచేత మంచివాడనిపించుకోవడం కొరకు ఫేస్తు ఈ ప్రశ్న పౌలును అడిగాడు [25:9].
Acts 25:11-12
ఫేస్తు అడిగిన ప్రశ్నకు పౌలు స్పందన ఏమిటి?
తాను యూదులకి అన్యాయమేమియూ చేయలేదని, సీజరు ఎదుట తాను చెప్పుకుంటానని పౌలు చెప్పాడు [25:10-11].
పౌలు విషయం ఏమి చెయ్యాలని ఫేస్తు నిర్ణయించాడు?
పౌలు సీజరు పేరు చెప్పినందుకు సీజరు దగ్గరకే పంపడానికి నిర్ణయించాడు [25:12].
Acts 25:13-16
రోమనుల మీద నేరం మోపబడినపుడు వారి విషయంలో న్యాయబద్దమైన విధానం గురించి ఫేస్తు ఏమని చెప్పాడు?
నిందితుడైన వ్యక్తి తనమీద మోపిన వారికి ముఖాముఖిగా నిలబడి తనమీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషీ చెప్పుకోడానికి అవకాశం రోమనులు ఇస్తారని చెప్పాడు [25:16].
Acts 25:17-24
పౌలుకు వ్యతిరేకంగా యూదులు ఏ నేరాలు మోపారని ఫేస్తు చెప్పాడు?
తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వివాదాలు ఉన్నట్టు చెప్పాడు, అయితే ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెపుతున్నట్టు చెప్పాడు [25:19].
Acts 25:25-27
రాజైన అగ్రిప్ప వద్ద పౌలు చెప్పుకోడానికి ఫేస్తు ఎందుకు తీసుకు వచ్చాడు?
పౌలు విచారణను చక్రవర్తి వద్దకు తీసుకొని వెళ్ళడానికేదైనా రాయడానికి రాజైన అగ్రిప్ప వద్దకు తీసుకొని వచ్చాడు [25:26].
పౌలును చక్రవర్తి వద్దకు ఏ విధంగా పంపడం సరి అయిన పని కాదని అని ఫేస్తు చెప్పాడు?
ఖైదీ మీద మోపిన నేరాలేవో సూచించక పౌలును అలాగే చక్రవర్తి వద్దకు పంపడం సరి అయిన పని కాదని ఫేస్తు చెప్పాడు [25:27].
Acts 26
Acts 26:1-3
అగ్రిప్ప రాజు ఎదుట తన సంగతిని చెప్పుకోగల్గుతున్నందుకు పౌలు ఎందుకు సంతోషంగా ఉన్నాడు ?
అగ్రిప్పకు యూదుల సంబంధమైన ఆచారాలు, వివాదాలు బాగా తెలుసు కాబట్టి అగ్రిప్ప రాజు ఎదుట తన సంగతిని చెప్పుకోగల్గుతున్నందుకు పౌలు సంతోషంగా ఉన్నాడు [26:3].
Acts 26:4-5
యెరూషలెంలో బాల్యం నుండి పౌలు ఎలా జీవించాడు?
తన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్టానియమాలు ఉన్న తెగ ప్రకారం పరిసయ్యుడిగా జీవించాడని చెప్పాడు [26:5].
Acts 26:6-8
తాను, యూదులు ఎదురు చూచుచున్నఏ దేవుని వాగ్దానం గురించి పౌలు చెపుతున్నాడు?
దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే వాగ్దానం గురించి తానును యూడులును ఎదురుచూచుచున్నారని పౌలు చెపుతున్నాడు [26:6-8].
Acts 26:9-11
పౌలు తాను మార్పు చెందక ముందు నజరేయుడైన యేసు నామానికి వ్యతిరేకంగా ఏమిచేస్తూ వచ్చాడు?
చాలామంది పవిత్రులను చెరసాలలో వేయించాడు, చంపడానికి సమ్మతించాడు, విదేశీపట్టణాలకు వెళ్లి వారిని హింసిస్తూ వచ్చాడు [26:9-11].
Acts 26:12-14
దమస్కు మార్గంలో పౌలు ఏమిచూసాడు?
సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూసాడు [26:13].
దమస్కు మార్గంలో పౌలు ఏమి విన్నాడు?
జ:"సౌలా, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు?" అనే స్వరాన్ని పౌలు విన్నాడు [26:14].
Acts 26:15-18
దమస్కు మార్గంలో ఎవరు పౌలుతో మాట్లాడుతున్నారు?
దమస్కు మార్గంలో యేసు పౌలుతో మాట్లాడుతున్నారు [26:15].
పౌలు ఏమి కావాలని యేసు నియమించాడు?
ఒక సేవకునిగాను, అన్యజనులకు సాక్షి గాను యేసు పౌలును నియమించాడు [26:16-17].
అన్యజనులు స్వీకరించాలని కోరుతున్నట్లు యేసు ఎందుకు చెప్పాడు?
అన్యజనులు పాపక్షమాపణను, దేవుని వద్దనుండి స్వాస్త్యమును పొందాలని కోరుతున్నాడని యేసు చెప్పాడు [26:18].
Acts 26:19-21
ఏరెండు సంగతులను పౌలు తాను వెళ్ళిన ప్రతీప్రదేశంలో చెపుతున్నాడు?
ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపాన్ని రుజువుపరచే క్రియలు చేయాలని బోధిస్తున్నట్టు పౌలు చెపుతున్నాడు [26:20].
Acts 26:22-23
మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెపుతున్న సంగతులేంటి?
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయి, మరణం నుండి లేవాలి, యూదా ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రకటిస్తాడు అని మోషే, ప్రవక్తలు చెప్పారు [26:22-23].
Acts 26:24-26
పౌలు సమాధానం వినిన తరువాత ఫేస్తు పౌలు గురించి ఏమితలంచాడు?
పౌలు వెఱ్రివాడయ్యాడని ఫేస్తు పౌలు గురించి తలంచాడు [26:24-25].
Acts 26:27-29
రాజైన అగ్రిప్ప విషయం పౌలు కోరిక ఏమిటి?
రాజైన అగ్రిప్ప క్రైస్తవుడుగా మారాలని పౌలు కోరిక [26:28-29].
Acts 26:30-32
పౌలుకు వ్యతిరేకమైన నేరాలను గురించి అగ్రిప్ప, ఫేస్తు, బెర్నేకే పౌలు గురించి ఏమని తీర్మానానికి వచ్చారు?
పౌలు మరణానికి గాని, ఖైదుకు గాని తగిన నేరం ఏదీ చేయలేదు, చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే అతణ్ణి విడుదల చేసేవాళ్ళమే అని అనుకొన్నారు [26:31-32].
Acts 27
Acts 27:3-6
రోమాకు ప్రయాణమవుతున్నపుడు ఆరంభంలో శతాధిపతియైన జూలియన్ పౌలును ఏ విధంగా చూసాడు?
శతాధిపతియైన జూలియన్ పౌలును దయతో చూసాడు, స్నేహితుల వద్దకు వెళ్లి తన అక్కరలు తీర్చుకొనేలా పౌలును అనుమతించాడు [27:3].
Acts 27:7-8
పౌలు ఎక్కిన ఓడ ఏ ద్వీపం వద్ద ఇబ్బందికి గురి అయింది?
క్రేతు ద్వీపం వద్ద ఓడ కష్టంతో ప్రయాణం చేసింది [27:7-8].
Acts 27:9-13
ప్రయాణంలో కొనసాగుతున్న ప్రమాదాలను గురించి పౌలు హెచ్చరికలను శతాధిపతియైన జూలియన్ ఎందుకు అనుసరించ లేదు?
నావికుడూ, ఓడ యజమానీ చెప్పిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక శతాధిపతియైన జూలియన్ పౌలు హెచ్చరికలను అనుసరించ లేదు [27:10-11].
Acts 27:14-18
ప్రయాణంలో నెమ్మదైన ఆరంభం తరువాత ఎటువంటి గాలి ఓడ మీద కొట్టింది?
ప్రయాణంలో నెమ్మదైన ఆరంభం తరువాత పెనుగాలి ఓడ మీద కొట్టింది [27:14].
Acts 27:19-22
చాలా రోజుల తరువాత ఓడ సిబ్బంది ఏ ఆశ వదులుకున్నారు?
చాలా రోజుల తరువాత ఓడ సిబ్బంది తాము బతికి బయట పడతామనే ఆశ వదులుకున్నారు [27:20].
Acts 27:23-26
ప్రయాణం గురించి దేవుని దూత ఎటువంటి సందేశాన్ని పౌలు అందించాడు?
పౌలును, తనతో పాటు ఓడలో ప్రయాణం చేస్తున్నవారు బ్రతుకుతారు, ఓడను కోల్పోతారు అని దేవదూత పౌలుతో చెప్పాడు [27:22-24].
Acts 27:27-29
పద్నాలుగవరోజు రాత్రి ఓడకు ఏమి జరుగుతుందని నావికులు భావించారు?
ఓడ ఏదో దేశాన్ని సమీపిస్తున్నట్టు నావికులు భావించారు [27:27].
Acts 27:30-32
ఏమి చెయ్యాలని నావికులు చూస్తున్నారు?
ఓడను వదిలి పెట్టాలని నావికులు చూస్తున్నారు [27:30].
శతాధిపతికి, ఇతర సైనికులకు పౌలు ఏమిచెప్పాడు?
వారు ఓడలో ఉంటేనే తప్ప వారు తప్పించుకోలేరని శతాధిపతికి, ఇతర సైనికులకు పౌలు చెప్పాడు [27:31].
Acts 27:33-38
తెల్లవారబోతున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఏమి చెయ్యమని పౌలు బతిమిలాడాడు?
ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని పౌలు బతిమిలాడాడు [27:33].
Acts 27:39-41
ఓడను ఒడ్డుకు తేవడానికి నావికులు ఏమి నిర్ణయించారు, ఏమి జరిగింది?
నావికులు ఓడను ఒడ్డుకు చేర్చాలని నిశ్చయించుకొన్నారు, ఓడను ఒడ్డుకు నడిపారు, అయితే ఓడ ముందు భాగం మట్టిలో కూరుకుపోయింది, ఓడ వెనుక భాగం బ్రద్ధలైపోతూ వచ్చింది [27:39-41].
Acts 27:42-44
ఈ సమయంలో ఖైదీల విషయం ఏమిచెయ్యాలని సైనికులు తలంచారు?
ఖైదీలలో ఎవడూ ఈదుకొని తప్పించుకోకుండా వారిని చంపాలని సైనికులు తలంచారు [27:42].
సైనికుల ఆలోచనను శతాధిపతి ఎందుకు ఆపివేసాడు?
పౌలును రక్షించాలనే ఉద్దేశంతో సైనికుల ప్రణాళికను శతాధిపతి ఆపివేసాడు [27:43].
ఓడలోని వారందరూ క్షేమంగా నేలమీదకి ఎలా వచ్చారు?
ఈత వచ్చినవారందరూ మొదట సముద్రములో దూకారు, మిగిలిన వారు పలకల మీద, ఓడ చెక్కల మీద ఎక్కారు [27:44].
Acts 28
Acts 28:1-2
మెలితే ద్వీప వాసులు పౌలును, మిగిలిన ఓడ వారిని ఏ విధంగా చూసారు?
ద్వీపవాసులు వారి పట్ల చూపిన దయ ఇంతింత కాదు [28:2].
Acts 28:3-4
విషసర్పం పౌలు చేతి నుంచి వ్రేలాడడం చూసి ద్వీపవాసులు ఏమి తలంచారు?
పౌలు తప్పక హంతకుడై ఉండాలి, సముద్రం నుంచి తప్పించుకొన్నా ధర్మదేవత అతణ్ణి బతకనివ్వడం లేదు, అని తలంచారు [28:4].
Acts 28:5-6
విషసర్పం పౌలును ఏమీ చెయ్యకపోవడం చూచి ప్రజలు ఏమని తలంచారు?
పౌలు దేవుడని వారు తలంచారు [28:6].
Acts 28:7-10
ద్వీపంలో ముఖ్యుడైన పొప్లి తండ్రిని పౌలు స్వస్థ పరచిన తరువాత ఏమి జరిగింది?
ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు [28:8-9].
Acts 28:11-12
పౌలును, నావికులు ను మెలితే ద్వీపంలో ఎంత కాలం ఉన్నారు?
పౌలును, నావికులు ను మెలితే ద్వీపంలో మూడు నెలలు ఉన్నారు [28:11].
Acts 28:13-15
తనను కలవడానికి రోమ్ నుండి వచ్చిన సోదరులను చూచినపుడు పౌలు ఏమిచేసాడు?
రోమ్ నుండి వచ్చిన సోదరులను చూచినపుడు పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పాడు, ధైర్యం తెచ్చుకున్నాడు [28:15].
Acts 28:16-18
ఖైదీగా రోమ్ నందు పౌలు జీవన పరిస్థితులు ఏమిటి?
పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితో పాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది [28:16].
Acts 28:19-20
ఏ కారణంగా పౌలు సంకెళ్ళ పాలయ్యాడని రోమాలోని యూదా నాయకులకు చెప్పాడు?
ఇస్రాయెల్ ప్రజల ఆశాభావాన్ని బట్టి తాను సంకెళ్ళ పాలయ్యాడని రోమాలోని యూదా నాయకులకు పౌలు చెప్పాడు [28:20].
Acts 28:21-22
ఈ మతశాఖను గురించి రోమ్ లోని యూదా నాయకులకు ఏమి తెలుసు?
ఈ మతశాఖను గురించి అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రోమ్ లోని యూదా నాయకులకు తెలుసు [28:22].
Acts 28:23-26
యూదా నాయకులు మరల పౌలు బస చేస్తున్న ఇంటికి ఎప్పుడు వచ్చారు, ఉదయం నుండి సాయంత్రం వరకు పౌలు ఏమిచెయ్యడానికి ప్రయత్నించాడు?
మోషే ధర్మశాస్త్రం నుంచి ప్రవక్తల వ్రాతలలో నుంచి యేసును గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు [28:23].
పౌలు చెప్పిన బోధకు యూదా నాయకులు చూపిన స్పందన ఏమిటి?
కొందరు యూదా నాయకులు పౌలు చెప్పిన దానిని నమ్మారు, కొందరు నమ్మలేదు [28:24].
Acts 28:27
నమ్మని యూదా నాయకుల గురించి పౌలు ప్రస్తావించిన ఆఖరు లేఖనమేది?
ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్ధం చేసుకోరు, ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావించాడు [28:25-27].
Acts 28:28-29
దేవుడు ప్రసాదించిన రక్షణ పంపడం జరిగింది, దానికి స్పందన ఎక్కడుందని పౌలు చెపుతున్నాడు?
దేవుడు ప్రసాదించిన రక్షణ అన్యజనులకు పంపడం జరిగింది, వారు దానిని వింటారు అని పౌలు చెప్పాడు [28:28].
Acts 28:30-31
రోమాలో ఖైదీగా ఉంటూ పౌలు ఏమి చేసాడు?
పౌలు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, యేసే క్రీస్తుని గురించి ధైర్యంగా బోధించాడు.
పౌలు రెండు సంవత్సరాలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు, దేవుని రాజ్యాన్ని ప్రకటిoచకుండా అడ్డుకున్నది ఎవరు?
అతనిని ఎవ్వరూ ఆపలేదు [28:31].