Ephesians
Ephesians 1
Ephesians 1:1-2
పౌలు ఈ పత్రికలో తాను వ్రాస్తున్న మనుషులను ఏవిధంగా వివరిస్తున్నాడు?
తాను వ్రాస్తున్న మనుషులు పరిశుద్ధులు, మరియు క్రీస్తు యేసులో నమ్మకస్థులు అని వర్ణిస్తున్నాడు.
Ephesians 1:3
తండ్రియైన దేవుడు విశ్వాసులను దేనితో ఆశీర్వదించాడు?
తండ్రియైన దేవుడు విశ్వాసులను క్రీస్తులో పరలోక స్థలములలో ప్రతీ ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు.
Ephesians 1:4
క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారిని తండ్రియైన దేవుడు ఎప్పుడు ఏర్పరచుకొన్నాడు?
క్రీస్తు నందు విశ్వాసం ఉంచే వారిని తండ్రియైన దేవుడు లోకం యొక్క పునాది నుండి ఏర్పరుచుకొన్నాడు.
తండ్రియైన దేవుడు ఏ ఉద్దేశంతో విశ్వాసులను ఏర్పరచుకొన్నాడు?
తండ్రియైన దేవుడు విశ్వాసులను ఎన్నుకున్నాడు, తద్వారా వారు ఆయన ముందు పవిత్రులుగా, నిర్దోషులుగా ఉంటారు.
Ephesians 1:5
దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ఎందుకు ముందుగానే నిర్ణయించాడు?
దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఎందుకంటే దానిని చెయ్యడానికి అది ఆయనను సంతోషపరచింది.
Ephesians 1:6
దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ఎందుకు ముందుగానే నిర్ణయించాడు?
దత్తత కోసం విశ్వసించిన వారిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు తద్వారా ఆయన మహిమకరమైన కృప కోసం ఆయన స్తుతించబడాలి.
Ephesians 1:7-8
దేవుని ప్రియుడైన క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసులు ఏమి పొందుతారు?
విశ్వాసులు క్రీస్తు రక్తము ద్వారా విమోచనము, అపరాధముల యొక్క క్షమాపణ పొందుకున్నారు.
Ephesians 1:9
తన పథకం సంపూర్ణమయ్యే కాలం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?
భూమి పైనా, ఆకాశంలోనూ ఉన్న వాటన్నిటిని దేవుడు క్రీస్తుకు లోబరుస్తాడు (1:10).
Ephesians 1:10-12
కాలము యొక్క సంపూర్ణత కోసం దేవుడు తన ప్రణాళిక పూర్తయ్యే సమయం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?
పరలోకంలో ఉన్నవి మరియు భూమి మీద ఉన్న సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూరుస్తాడు.
Ephesians 1:13
సత్య వాక్కు వినినప్పుడు విశ్వాసులు ఏ ముద్రను పొందుతారు?
సత్య వాక్కు వినినప్పుడు విశ్వాసులు వాగ్దానం చెయ్యబడిన పరిశుద్ధ ఆత్మతో ముద్రించబడతారు.
Ephesians 1:14-16
దేని విషయంలో ఆత్మ హామీగా ఉన్నాడు?
విశ్వాసుల వారసత్వానికి ఆత్మ హామీగా ఉన్నాడు.
Ephesians 1:17
ఎఫెసీయులు దేనిని అర్థం చేసుకోవడానికి తెలివి పొందాలని పౌలు ప్రార్థించాడు?
ఎఫెసీయులు వారి పిలుపులోని నిబ్బరాన్ని, వారి వారసత్వంలోని సౌభాగ్యాన్ని, వారిలో ఉన్న దైవ శక్తి లోని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి పొందాలని పౌలు ప్రార్థించాడు (1:18,19).
Ephesians 1:18
ఎఫెసీయులు గ్రహించడానికి వెలిగించబడునట్లు పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
ఎఫెసీయులు తమ పిలుపు యొక్క నిరీక్షణ ఎలాంటిదో మరియు పరిశుద్ధులలో క్రీస్తు యొక్క మహిమ యొక్క ఐశ్వర్యాలు ఎటువంటివో గ్రహించడానికి వారి హృదయం యొక్క నేత్రాలు వెలిగింపబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
Ephesians 1:19
ఇప్పుడు విశ్వాసుల్లో నివసిస్తున్న ప్రభావమే క్రీస్తులో ఏమి చేసింది?
అదే ప్రభావం క్రీస్తు ను చనిపోయిన వారిలో నుండి లేపి, ఆయనను పరమ స్థలాల్లో దేవుని కుడి వైపున కూర్చో బెట్టింది (1:20).
Ephesians 1:20-21
ఇప్పుడు విశ్వాసులలో పని చేస్తున్న పనిచేసే అదే శక్తి క్రీస్తులో ఏమి చేసింది?
అదే శక్తి క్రీస్తును మృతులలో నుండి లేపి మరియు పరలోకపు స్థలములలో దేవుని కుడిచేతి వైపున ఆయనను కూర్చుండబెట్టింది.
Ephesians 1:22
క్రీస్తు పాదాల క్రింద దేవుడు ఉంచినదేమిటి?
సమస్తాన్ని దేవుడు క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు.
సంఘంలో క్రీస్తు అధికారపూరిత స్థానం ఏమిటి?
సంఘంలోని సమస్తము మీదా క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు.
Ephesians 1:23
సంఘం అంటే ఏమిటి?
సంఘం క్రీస్తు శరీరం.
Ephesians 2
Ephesians 2:1
అవిశ్వాసులందరి ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?
అవిశ్వాసులందరూ వారి అతిక్రమాలలో మరియు పాపాలలో చచ్చినవారై ఉన్నారు.
Ephesians 2:2
అవిధేయత యొక్క కుమారులలో ఎవరు పని చేస్తున్నారు?
గాలి యొక్క అధికారుల యొక్క అధిపతి, అవిధేయత యొక్క కుమారులలో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు.
Ephesians 2:3
స్వభావం ప్రకారం, అవిశ్వాసులు అందరూ ఏమై ఉన్నారు?
అవిశ్వాసులు అందరూ స్వభావం చేత ఉగ్రత యొక్క కుమారులుగా ఉంటారు.
Ephesians 2:4
విశ్వాసుల పట్ల దేవుడు ఎందుకు కరుణా సంపన్నుడిగా ఉన్నాడు?
దేవుడు తన తన మహా ప్రేమ యొక్క కారణంగా కరుణలో సంపన్నుడిగా ఉన్నాడు.
Ephesians 2:5
విశ్వాసులు దేని చేత రక్షించబడ్డారు?
దేవుని కృప చేత విశ్వాసులు రక్షించబడ్డారు.
Ephesians 2:6
విశ్వాసులు ఎక్కడ కూర్చుండపెట్టబడ్డారు?
విశ్వాసులు క్రీస్తు యేసుతో పరలోక స్థలములలో కూర్చుండపెట్టబడ్డారు.
Ephesians 2:7
దేవుడు ఏ ప్రయోజనం కోసం విశ్వాసులను రక్షించాడు, పెంచాడు?
దేవుడు విశ్వాసులను రక్షించాడు, పైకి లేపాడు తద్వారా రాబోవుతున్న యుగములలో ఆయన కృప యొక్క అపరిమితమైన మహా సమృద్ధిని వారికి కనపరుస్తాడు.
Ephesians 2:8
మనం ఏవిధంగా రక్షించబడ్డాము?
మేము దేవుని బహుమతిగా విశ్వాసం ద్వారా దయ ద్వారా రక్షించబడ్డాము.
Ephesians 2:9
విశ్వాసి ఎందుకు అతిశయపడకూడదు?
ఏ విశ్వాసి కూడా అతిశయపడకూడదు ఎందుకంటే అతడు తన సొంత పనుల ద్వారా రక్షించబడలేదు.
Ephesians 2:10
ఏ ఉద్దేశ్యంతో దేవుడు క్రీస్తు యేసులో విశ్వాసులను సృష్టించాడు?
క్రీస్తు యేసులో విశ్వాసుల కోసం దేవుని ఉద్దేశం వారు మంచి పనులలో నడవడమే.
Ephesians 2:11
విశ్వాసం లేని యూదేతరుల స్థితి ఏమిటి?
విశ్వాసం లేని యూదేతరులు క్రీస్తు నుండి వేరై పోయారు. ఇశ్రాయేలుకు దూరమై పోయారు. వారు నిబంధనకు అపరిచితులు. దేవుడు గానీ ఆశాభావం గానీ లేని వారు (2:12).
Ephesians 2:12
అవిశ్వాసులైన యూదేతరుల ఆధ్యాత్మిక పరిస్థితి ఏమిటి?
అవిశ్వాసులైన యూదేతరులు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క సమాజము నుండి బహిష్కరించబడినవారు, మరియు వాగ్దానం యొక్క నిబంధనలకు పరాయివారు, నిరీక్షణ లేని వారు మరియు లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.
Ephesians 2:13
కొంతమంది యూదేతరులైన అవిశ్వాసులను దేవుని వద్దకు తీసుకొని వచ్చిన దేమిటి?
కొందరు యూదేతరులైన అవిశ్వాసులు క్రీస్తు రక్తం ద్వారా దేవునికి దగ్గరకు తీసుకొనిరాబడ్డారు.
Ephesians 2:14
అన్యజనులు, యూదుల మధ్య సంబంధాన్ని క్రీస్తు ఏవిధంగా మార్చాడు?
విశ్వాసులైన యూదేతరులనూ, మరియు యూదులనూ ఒకే గుంపుగా చేసాడు, మరియు వారిని విభజించిన శతృత్వమును నాశనం చేసాడు.
Ephesians 2:15-16
యూదులు, యూదేతరుల మధ్య సమాధానమును నెలకొల్పడానికి క్రీస్తు దేనిని రద్దు చేశాడు?
యూదులు, యూదేతరుల మధ్య సమాధానమును నెలకొల్పడానికి విధులలో ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రమును క్రీస్తు రద్దు చేసాడు.
Ephesians 2:17
దేని మూలంగా విశ్వాసులకు తండ్రి చెంతకు ప్రవేశం ఉంది?
పరిశుద్ధాత్మ మూలంగా విశ్వాసులకు తండ్రి చెంతకు ప్రవేశం ఉంది (2:18).
Ephesians 2:18
విశ్వాసులందరూ ఏ విధంగా తండ్రిని పొందగలరు?
విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రిని పొందగలరు
Ephesians 2:19
ఏ పునాదిపై దేవుని కుటుంబం కట్ట బడింది?
క్రీస్తే మూల రాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిపై దేవుని కుటుంబం కట్టబడింది (2:20).
తన కుటుంబం నిర్మాణంలో యేసు ప్రభావం ఎలాటి పాత్ర పోషిస్తున్నది?
యేసు ప్రభావం నిర్మాణం మొత్తాన్నిచక్కగా అమర్చి అభివృద్ధి కలిగిస్తున్నది (2:21).
దేవుని కుటుంబం అనే కట్టడం ఎలాటి కట్టడం?
దేవుని కుటుంబం అనే కట్టడం ప్రభువుకు ప్రత్యేకపరచబడిన ఆలయం (2:21).
దేవుడు ఆత్మ ద్వారా ఎక్కడ నివసిస్తున్నాడు?
దేవుడు ఆత్మ ద్వారా విశ్వాసిలో నివసిస్తున్నాడు (2:22).
Ephesians 2:20
దేవుని కుటుంబం ఏ పునాది మీద కట్టబడింది?
దేవుని కుటుంబం అపొస్తలులు, ప్రవక్తల పునాది మీద కట్టబడింది, క్రీస్తు యేసు తానే మూలరాయిగా ఉన్నాడు.
Ephesians 2:21
విశ్వాసులు ఎటువంటి కట్టడంగా మారుతున్నారు?
అవి స్వామికి పవిత్ర దేవాలయంగా మారుతున్నాయి. ప్రభువు కోసం వారు పరిశుద్ధ దేవాలయంలోనికి మారుతూ ఉన్నారు.
Ephesians 2:22
దేవుడు ఆత్మలో ఎక్కడ నివసిస్తాడు?
దేవుడు విశ్వాసులలో ఆత్మలో నివసిస్తాడు
Ephesians 3
Ephesians 3:1
ఎవరి ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు వరం ఇచ్చాడు?
యూదేతరుల ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు వరం ఇచ్చాడు (3:1-2)
Ephesians 3:2
ఎవరి ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు తన గృహనిర్వాహకత్వాన్ని ఇచ్చాడు?
యూదేతరుల ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు తన గృహనిర్వాహకత్వాన్ని ఇచ్చాడు.
Ephesians 3:3-4
పౌలుకు తెలియపరచబడినది ఏమిటి?
మర్మం గురించిన ప్రత్యక్షత పౌలుకు తెలియపరచబడింది.
Ephesians 3:5
ఇతర తరాలలో మనుష జాతికి తెలియపరచబడని దానిని దేవుడు ఎవరికి తెలియపరచాడు?
దేవుడు తన అపొస్తలులు, ప్రవక్తలకు క్రీస్తు గురించి దాచిన సత్యాన్ని వెల్లడించాడు.
Ephesians 3:6
దాచబడిన ఏ సత్యం బయలుపరచబడింది?
ఆ యూదేతరులు సువార్త ద్వారా క్రీస్తు యేసులో సహా వారసులుగా ఉన్నారు మరియు శరీరం యొక్క సహా అవయవములు, మరియు వాగ్దానం యొక్క పాలిభాగస్తులు అనేది బయలుపరచబడిన మరుగై ఉన్న సత్యం.
Ephesians 3:7
పౌలుకు ఏ వరం గానుగ్రహించబడింది?
దేవుని కృపా వరం పౌలుకు అనుగ్రహించబడింది.
Ephesians 3:8
దేనిని గూర్చి యూదేతరులకు వివరించడానికి పౌలు పంపబడ్డాడు?
దేవుని ప్రణాళిక గూర్చి యూదేతరులకు వివరించ దానికి పౌలు పంపబడ్డాడు (3:9).
Ephesians 3:9
యూదేతరులు గ్రహించడంలో సహాయపడడానికి పౌలు దేని గురించి పంపబడ్డాడు?
దేవునిలో అనాదికాలం నుండి మరుగై యున్న ఆ మర్మము యొక్క ఏర్పాటు ఎట్టిదో యూదేతరులు అర్థం చేసుకోవడంలో సహాయం చెయ్యడానికి పౌలు పంపించబడ్డాడు.
Ephesians 3:10-11
దేని ద్వారా దేవుని నానా విధ జ్ఞానం తెలియజేయబడుతుంది?
సంఘము ద్వారా దేవుని యొక్క నానావిధ జ్ఞానం తెలియపరచబడుతుంది.
Ephesians 3:12-13
క్రీస్తునందు విశ్వాసం కారణంగా విశ్వాసులు దేనిని కలిగియుంటారని పౌలు చెప్పాడు?
క్రీస్తునందు విశ్వాసం కారణంగా విశ్వాసులు ఆయనలో ధైర్యమును మరియు నిర్భయమైన ప్రవేశమును కలిగి యున్నారు.
Ephesians 3:14
తండ్రి పేరున ఏది సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది?
భూమి మీదా, ఆకాశంలో ఉన్న ప్రతి కుటుంబం తండ్రి పేరున సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది (3:14-15).
విశ్వాసులు ఎలా బలం పొందాలని పౌలు ప్రార్థించాడు?
వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ మూలంగా శక్తి పొంది విశ్వాసులు బలం పొందాలని పౌలు ప్రార్థించాడు (3:16-17).
Ephesians 3:15
తండ్రిని బట్టి పేరు పెట్టబడినది ఏమిటి, సృష్టించబడినది ఏమిటి?
ఆయన నుండి పరలోకంలో మరియు భూమి మీద ప్రతి కుటుంబం తండ్రిని బట్టి పేరు పొందింది, సృష్టించబడింది.
Ephesians 3:16
విశ్వాసులు బలపడడం కోసం పౌలు ఏవిధంగా ప్రార్థిస్తాడు?
దేవుని ఆత్మ ద్వారా శక్తితో బలపరచబడి ఉండడానికి, విశ్వాసుల కోసం పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
Ephesians 3:17
విశ్వాసులు ఏమి అర్థం చేసుకోగలగాలని పౌలు ప్రార్థించాడు?
విశ్వాసులుక్రీస్తు ప్రేమ వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు అర్థం చేసుకోగలగాలని పౌలు ప్రార్థించాడు (3;18).
Ephesians 3:18-19
విశ్వాసులు అర్థం చేసుకోగలిగేలా పౌలు ఏమని ప్రార్థన చేసాడు?
క్రీస్తు ప్రేమ పొడవు మరియు వెడల్పు మరియు ఎత్తు మరియు లోతు ఏమిటో విశ్వాసులు పూర్తిగా అవగాహన చేసుకోడానికి శక్తిని పొందులాగున పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
Ephesians 3:20
అన్ని తరాల్లోనూ తండ్రికి ఏమి ఇవ్వబడాలని పౌలు ప్రార్థించాడు?
సంఘంలో, క్రీస్తు యేసులో అన్ని తరాల్లోనూ తండ్రికి మహిమ కలుగుతుంది అని పౌలు ప్రార్థించాడు (3:21).
Ephesians 3:21
తరతరాలు అన్నిటికి, తండ్రికి ఏమి ఇవ్వబడాలని పౌలు ప్రార్తిస్తున్నాడు?
సంఘంలో మరియు క్రీస్తు యేసులో తరతరాలు అన్నిటికి శాశ్వతము మరియు నిత్యము ఆయనకు మహిమ కలగాలాని పౌలు ప్రార్థన చేస్తున్నాడు.
Ephesians 4
Ephesians 4:1-3
విశ్వాసుల జీవించడానికి పౌలు ఏవిధంగా బతిమాలుచున్నాడు?
విశ్వాసులు తమ పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలని పౌలు బతిమాలు చున్నాడు.
Ephesians 4:4-6
పౌలు ఇచ్చిన ఒక్కటే అని ఉన్న జాబితాలో ఏమి ఉన్నాయి?
ఒక్కటే శరీరం, ఒక్కటే ఆత్మ, నిరీక్షణ గురించిన నిబ్బరం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే (4:4-6).
Ephesians 4:7-10
క్రీస్తు ఆరోహణుడైన తరువాత ప్రతి విశ్వాసికి ఏమి అనుగ్రహించాడు?
క్రీస్తు యొక్క వరము యొక్క పరిమాణం ప్రకారము ప్రతి విశ్వాసికీ కృప అనుగ్రహించబడింది.
Ephesians 4:11
ఎటువంటి ఐదు రకాల వ్యక్తులను క్రీస్తు ఇచ్చాడని పౌలు చెప్పాడు?
అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, మరియు ఉపదేశకులను క్రీస్తు ఇచ్చాడు.
Ephesians 4:12-13
సంఘం కోసం ఈ ఐదు రకాల వ్యక్తులు ఏమి చేయవలసి ఉంది?
ఈ ఐదు రకాలైన మనుషులు సేవ యొక్క కార్యం కోసం, శరీరం క్షేమాభివృద్ధి కోసం పరిశుద్ధులను సిద్ధపరచవలసి ఉంది.
Ephesians 4:14-15
విశ్వాసులు పిల్లలలా ఉండవచ్చని పౌలు ఏవిధంగా చెపుతున్నాడు?
విశ్వాసులు అలల చేత వెనుకకు మరియు ముందుకు యెగురవేయబడిన చిన్నపిల్లలు వలే ఉంటారు, మరియు మోసపూరిత వ్యూహం కోసం కపటం ద్వారా మనుష్యుల యొక్క కుయుక్తిలో బోధ యొక్క ప్రతీ గాలి చేత కొట్టుకుపోతారు.
Ephesians 4:16
విశ్వాసుల శరీరం అమర్చబడి ఉందని పౌలు ఏవిధంగా చెప్పాడు?
విశ్వాసుల శరీరం అమర్చబడి ఉంది మరియు బలపరచు ప్రతి కీలు చేత కలిసి పట్టుకొంది, ప్రతి ఒక్క భాగం యొక్క పరిమాణములో పనిచేయుచున్న ప్రకారం, ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కోసం శరీరం యొక్క అభివృద్ధి కలుగచేసుకొంటుంది.
Ephesians 4:17
యూదేతరులు ఏవిధంగా నడుస్తారని పౌలు చెపుతున్నాడు?
యూదేతరులు తమ మనసు యొక్క వ్యర్ధతలో నడుస్తారని పౌలు చెపుతున్నాడు.
Ephesians 4:18
యూదేతరుల అవగాహనకు ఏమి జరిగిందని పౌలు చెపుతున్నాడు?
యూదేతరుల అవగాహన అంధకారమయం అయ్యింది.
Ephesians 4:19-21
యూదేతరులు తమ్మును తాము దేనికి అప్పగించుకున్నారు?
యూదేతరులు ప్రతివిధమైన అపవిత్ర కార్యాల కోసం తమ్మును తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
Ephesians 4:22
విశ్వాసులు దేనిని విడిచిపెట్టాలని పౌలు చెపుతున్నాడు?
విశ్వాసులు ప్రాచీన పురుషునికి చెందినావాటిని పక్కన ఉంచాలి,
Ephesians 4:23
విశ్వాసులు దేన్ని తీసేసి, దేన్ని ధరించాలి?
విశ్వాసులు పాడై పోయిన పాత స్వభావాన్ని తీసేసి, నీతిమూలంగా సృష్టి అయిన నూతన స్వభావం ధరించుకోవాలి (4:22-24)
Ephesians 4:24
విశ్వాసులు తప్పనిసరిగా దేనిని ధరించాలని పౌలు చెపుతున్నాడు?
విశ్వాసులు నూతన పురుషుణ్ణి ధరించాలి.
Ephesians 4:25-26
విశ్వాసి సాతానుకు ఎలా అవకాశం ఇవ్వగలడు?
విశ్వాసి సూర్యాస్తమయం తరువాత కూడా కోపం ఉంచుకుంటే సాతానుకు అవకాశం కలుగుతుంది.
Ephesians 4:27
విశ్వాసి ఎవరికి అవకాశం ఇవ్వకూడదు?
విశ్వాసి ఎప్పుడూ అపవాదికి అవకాశం ఇవ్వకూడదు.
Ephesians 4:28
దొంగతనం చెయ్యడం కాకుండా విశ్వాసులు ఏమి చేయాలి?
విశ్వాసులు తప్పనిసరిగా పని చెయ్యాలి, చేతులతో మంచి పనిచేస్తూ ఉండాలి, తద్వారా వారు అవసరత కలిగిన వారితో పంచుకోడానికి కొంత కలిగియుంటారు.
Ephesians 4:29
విశ్వాసి నోటి నుండి తప్పనిసరిగా ఎటువంటి మాటలు రావాలని పౌలు చెపుతున్నాడు?
విశ్వాసి నోటి నుండి ఎటువంటి చెడు మాట రాకూడదు, దానికి బదులు ఇతరులకు అభివృద్ధిని కలుగచేసే మాటలు రావాలి.
Ephesians 4:30
విశ్వాసి ఎవరిని దుఃఖపరచకూడదు?
విశ్వాసి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు.
Ephesians 4:31
దేవుడు విశ్వాసిని క్రీస్తులో క్షమించాడు గనక విశ్వాసి ఏమి చెయ్యాలి?
దేవుడు విశ్వాసిని క్రీస్తులో క్షమించాడు గనక విశ్వాసి ఇతరులను క్షమించాలి (4:32).
Ephesians 4:32
దేవుడు క్రీస్తులో అతనిని క్షమించిన కారణంగా విశ్వాసి ఏమి చేయాలి?
దేవుడు క్రీస్తులో అతనిని క్షమించిన కారణంగా విశ్వాసి ఇతరులను క్షమించాలి
Ephesians 5
Ephesians 5:1
విశ్వాసులు ఎవరిని అనుకరించాలి?
విశ్వాసులు ప్రియమైన పిల్లలు వలె దేవుణ్ణి అనుకరించాలి
Ephesians 5:2
దేవునికి పరిమళ సువాసనగా ఉండడం కోసం క్రీస్తు ఏమి చేసాడు?
విశ్వాసుల కోసం క్రీస్తు తన్నుతాను, ఒక అర్పణ మరియు బలిగా అప్పగించుకొన్నాడు.
Ephesians 5:3
విశ్వాసుల మధ్య ఏది సూచించబడకూడదు?
లైంగిక అనైతికత, మరియు ప్రతీ అపవిత్రత లేదా లోభము పేరు పిలువబడడం సూచించబడకూడదు.
Ephesians 5:4
విశ్వాసుల మధ్య ఎటువంటి వైఖరి కనపడాలి?
విశ్వాసులు బదులుగా కృతజ్ఞతా వైఖరిని కలిగి ఉండాలి.
Ephesians 5:5
క్రీస్తు, దేవుని రాజ్యంలో ఎవరికి వారసత్వం లేదు?
ప్రతీ లైంగిక అనైతికత లేదా అపవిత్రత లేదా లోభి అయిన వ్యక్తి - అంటే, విగ్రహారాధికునికి క్రీస్తు, దేవుని రాజ్యంలో వారసత్వం లేదు.
Ephesians 5:6-7
అవిధేయత పిల్లల మీదకు ఏమి వస్తోంది?
అవిధేయత పిల్లల మీద దేవుని ఉగ్రత వస్తుంది.
Ephesians 5:8
ఎలాటి వెలుగు ఫలం దేవునికి ఇష్టం?
మంచితనం, నీతి, సత్యం అనే ఫలం దేవునికి ఇష్టం.
చీకటి కార్యాల విషయం విశ్వాసులు ఏమి చెయ్యాలి?
అలాటి వాటిలో విశ్వాసులు పాల్గొనకూడదు. చీకటి పనులను వారు బట్టబయలు చెయ్యాలి (5:11).
Ephesians 5:9-10
ఏ వెలుగు ఫలం ప్రభువుకు ప్రీతికరమైనది?
సమస్త మంచితనం, మరియు నీతి మరియు సత్యం యొక్క ఫలం ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది.
Ephesians 5:11-12
చీకటి యొక్క పనులతో విశ్వాసులు ఏమి చేయాలి?
చీకటి యొక్క నిష్ఫలమైన పనులలో విశ్వాసులు భాగం తీసుకోకూడదు, బదులుగా వాటిని బట్టబయలు కూడా చెయ్యండి
Ephesians 5:13-14
వెలుగు చేత ప్రత్యక్షపరచబబడేది ఏమిటి?
ప్రతిదీ వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది.
Ephesians 5:15
దినాలు చెడ్డవి గనక విశ్వాసులు ఏమి చెయ్యాలి?
దినాలు చెడ్డవి గనక విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి (5:16).
Ephesians 5:16-17
దినములు చెడ్డవి కాబట్టి విశ్వాసులు ఏమి చేయాలి?
దినములు చెడ్డవి కనుక విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Ephesians 5:18
అనాలోచిత ప్రవర్తనకు దారితీసేది ఏమిటి?
మద్యంతో మత్తులై ఉండడం అనాలోచిత ప్రవర్తనకు దారితీస్తుంది.
Ephesians 5:19-21
విశ్వాసులు ఒకరితో ఒకరు ఏమి మాట్లాడాలి?
విశ్వాసులు కీర్తనలలో మరియు సంగీతాలు మరియు ఆత్మసంబంధమైన పాటలలో ఒకరితో ఒకరు మాట్లాడండి.
Ephesians 5:22
భార్యలు ఏ విధంగా భర్తలకు లోబడి ఉండాలి?
భార్యలు ప్రభువుకు వలే తమ సొంత భర్తలకు లోబడి ఉండాలి.
Ephesians 5:23-24
భర్త దేనికి శిరస్సుగా ఉన్నాడు, మరియు క్రీస్తు దేనికి శిరస్సుగా ఉన్నాడు?
క్రీస్తు సంఘం యొక్క శిరస్సుగా ఉన్న విధంగా ఒక భర్త భార్య యొక్క శిరస్సు అయి ఉన్నాడు.
Ephesians 5:25
క్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా ఎలా ఉంచుతాడు?
వాక్కు అనే నీటితో స్నానం చేయించడం ద్వారా క్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా ఉంచుతాడు (5:26-27).
Ephesians 5:26-27
సంఘాన్ని క్రీస్తు ఏవిధంగా పవిత్రం చేస్తాడు?
సంఘాన్ని క్రీస్తు వాక్యముతో నీటి యొక్క స్నానం చేత శుద్ధిచేసి, ఆమెను పవిత్రపరుస్తాడు
Ephesians 5:28
భర్తలు తమ భార్యలను ఏవిధంగా ప్రేమించాలి?
భర్తలు తమ సొంత శరీరముల వలే తమ సొంత భార్యలను ప్రేమించ వలసి ఉంది.
Ephesians 5:29-30
ఒక వ్యక్తి తన శరీరాన్ని ఏవిధంగా చూసుకుంటాడు?
ఒక వ్యక్తి తన సొంత శరీరాన్ని పోషిస్తాడు మరియు ప్రేమిస్తాడు.
Ephesians 5:31
ఒక వ్యక్తి తన భార్యతో కలిసినప్పుడు ఏమి జరుగుతుంది?
ఒక వ్యక్తి తన భార్యతో కలిసినప్పుడు, వారు ఒకే శరీరంగా మారతారు
Ephesians 5:32-33
ఒక వ్యక్తి, ఆయన భార్య చేరడం ద్వారా దాచబడిన ఉన్న ఏ సత్యం బయలుపడింది?
ఒక వ్యక్తి, ఆయన భార్య చేరడం ద్వారా క్రీస్తును గురించి మరియు ఆయన సంఘం గురించిన మర్మము బయలుపడింది.
Ephesians 6
Ephesians 6:1-3
క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులను ఏవిధంగా చూడాలి?
క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి.
Ephesians 6:4
క్రైస్తవ తండ్రులు తమ పిల్లల కోసం ఏమి చేయాలి?
క్రైస్తవ తండ్రులు తమ పిల్లలను ప్రభువు యొక్క ప్రభువు యొక్క క్రమశిక్షణలో మరియు బోధలో పెంచాలి
Ephesians 6:5-7
ఎటువంటి వైఖరితో క్రైస్తవ బానిసలు తమ యజమానులకు లోబడాలి?
క్రైస్తవ బానిసలు ప్రభువు కోసం అన్నట్టు హృదయం యొక్క నిజాయితిలో యజమానులకు లోబడాలి.
Ephesians 6:8
ఒక విశ్వాసి తాను చేసే ఏదైనా మంచి పని విషయంలో ఏమి గుర్తుంచుకోవాలి?
ఒక విశ్వాసి తాను ఏదైనా మంచి చేసినట్లయితే, ప్రభువు నుండి ఒక బహుమానాన్ని అతడు పొందుతాడని జ్ఞాపకం ఉంచుకోవాలి.
Ephesians 6:9
ఒక క్రైస్తవ యజమాని తన ప్రభువును గురించి ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి?
ఒక క్రైస్తవ యజమాని తన యొక్క, అతని బానిస యొక్క ప్రభువు పరలోకంలో ఉన్నాడని, ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి.
Ephesians 6:10
విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ఎందుకు ధరించాలి?
సైతాను కుతంత్రాల నుండి తనను కాపాడుకోవడానికి విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ధరించాలి (6:11,13,14).
Ephesians 6:11
ఒక విశ్వాసి ఎందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించాలి?
దుష్టుని యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా నిలబడడానికి ఒక విశ్వాసి దేవుని మొత్తం కవచాన్ని ధరించాలి.
Ephesians 6:12
విశ్వాసి ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు?
ఒక విశ్వాసి ఈ చీకటి యొక్క లోక నాథులకు వ్యతిరేకంగా, పరలోక స్థలాలలోని దుష్టుని యొక్క ఆత్మ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు.
Ephesians 6:13
విశ్వాసి దేవుడి మొత్తం కవచాన్ని ఎందుకు ధరించాలి?
సాతాను యొక్క చెడు ప్రణాళికలకు వ్యతిరేకంగా నిలబడటానికి ఒక విశ్వాసి దేవుని మొత్తం కవచాన్ని ధరించాలి.
Ephesians 6:14-15
దేవుని కవచంలో ఉన్న భాగాలు ఏమిటి?
దేవుని కవచంలో సత్యం అనే బెల్టు, నీతి అనే ఛాతీ కవచం, సువార్తకోసం సన్నద్ధం అనే చెప్పులు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం ఉన్నాయి (6:14-17)
Ephesians 6:16
దేవుడిచ్చు కవచంలో ఏ భాగం దుష్టుని యొక్క మండుతున్న అగ్ని బాణాలను ఆర్పుతుంది?
విశ్వాసం యొక్క డాలు దుష్టుని యొక్క మండుతున్న అగ్ని బాణాలు అన్నిటిని ఆర్పుతుంది.
Ephesians 6:17
ఆత్మ యొక్క ఖడ్గం ఏమిటి?
ఆత్మ యొక్క ఖడ్గం దేవుని యొక్క వాక్కు.
Ephesians 6:18
విశ్వాసులు ప్రార్థనలో తమ్మును తాము ఏ విధంగా ఉంచుకోవాలి?
విశ్వాసులు సమయాలలో ప్రార్థన చెయ్యాలి, పూర్తి పట్టుదలతో, దేవుని జవాబు కోసం మెళకువగా ఉండాలి.
Ephesians 6:19
ఎఫెసీయుల ప్రార్థనల ద్వారా పౌలు ఏమి కలిగి యుండాలని కోరుకుంటున్నాడు?
పౌలు సువార్త మాట్లాడడానికి నోరుతెరచినప్పుడు తనకు ధైర్యంతో కూడిన సందేశం అనుగ్రహించబడాలని కోరుకుంటున్నాడు.
Ephesians 6:20-22
పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు?
పౌలు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు చెరసాలలో సంకెళ్ళలో బంధించబడి ఉన్నాడు.
Ephesians 6:23-24
తండ్రియైన దేవుడు మరియు ప్రభువిన యేసు క్రీస్తు విశ్వాసులకు ఏమి అనుగ్రహించాలని పౌలు అడుగుతున్నాడు?
దేవుడు సమాధానం, మరియు విశ్వాసముతో ప్రేమలను విశ్వాసులకు అనుగ్రహించాలని పౌలు దేవుణ్ణి అడుగుతున్నాడు.