1 Timothy
1 Timothy 1
1 Timothy 1:1
పౌలు క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడిగా ఏవిధంగా చేయబడ్డాడు?
దేవుని ఆజ్ఞ ప్రకారం పౌలు అపొస్తలుడిగా చేయబడ్డాడు.
1 Timothy 1:2
పౌలు, తిమోతి మధ్య సంబంధం ఏమిటి?
తిమోతి విశ్వాసంలో పౌలు యొక్క నిజమైన కుమారుడు.
1 Timothy 1:3-4
తిమోతిని ఉండమని పౌలు ఎక్కడ ప్రార్థించాడు?
అతడు తిమోతిని ఎఫెసులో ఉండాలని బతిమిలాడాడు.
కొంతమంది వ్యక్తులు చేయకూడదని తిమోతి ఆజ్ఞాపించినది ఏమిటి?
విభిన్నంగా బోధించవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించవలసి ఉంది.
1 Timothy 1:5-8
తన ఆజ్ఞ, బోధన యొక్క లక్ష్యం ఏమిటి అని పౌలు చెప్పాడు.
ఆయన ఆజ్ఞ యొక్క లక్ష్యం పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిజాయితీ విశ్వాసం నుండి వచ్చు ప్రేమ.
1 Timothy 1:9-11
ధర్మశాస్త్రం ఎవరి కోసం రూపొందించబడింది?
ధర్మశాస్త్రం భక్తిహీనులు, తిరుగుబాటుదారులు, పాపుల కోసం.
1 Timothy 1:12
గతంలో పౌలు చేసిన పాపాలు ఏమిటి?
గతంలో పౌలు దైవ దూషకుడు, హింసించేవాడు, హానికరుడు(1:13).
యేసు క్రీస్తు అపోస్తలుడుగా మారటానికి పౌలును బలవంతం చేసిన దేమిటి?
మన ప్రభువు కృప పౌలును బలవంతం చేసింది (1:14).
1 Timothy 1:13
పౌలు గతంలో ఏ పాపాలు చేశాడు?
పౌలు దేవదూషకుడు, ఒక హింసకుడు మరియు ఒక హింసాత్మకమైన మనిషిగా ఉన్నాడు.
1 Timothy 1:14
యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడిగా పౌలు మారడానికి పరిణమించేలా పౌలుకు పొంగిపొరలినది ఏమిటి?
మన ప్రభువు కృప పౌలుకు పొంగిపొరలింది.
1 Timothy 1:15
ఎవరిని రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు?
పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు.
1 Timothy 1:16-17
దేవుడు తనకు కరుణ ఇచ్చాడని పౌలు ఎందుకు చెప్పాడు?
దేవుడు పౌలుకు కరుణను అనుగ్రహించాడు తద్వారా యేసు పౌలులో తన సహనాన్ని ఒక ఉదాహరణగా చూపించాడు.
1 Timothy 1:18
తిమోతి గురించి చేసిన ప్రవచనాలకు అనుగుణంగా ఏమి చేయాలని పౌలు తిమోతికి చెప్పాడు?
మంచి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు.
1 Timothy 1:19
వారి విశ్వాసాన్నీ, వారి మంచి మనస్సాక్షినీ నిరాకరించిన కొంతమందికి ఏమి జరిగింది?
ఈ మనుషులు విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.
1 Timothy 1:20
విశ్వాసం, మంచి మనస్సాక్షిని నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్న ఆ మనుషుల కోసం పౌలు ఏమి చేశాడు?
దేవదూషణ చేయకుండా నేర్పించబడడానికి పౌలు వారిని సాతానుకు అప్పగించాడు.
1 Timothy 2
1 Timothy 2:1
ఎవరి కోసం ప్రార్థనలు చెయ్యబడాలని పౌలు మనవి చేసాడు?
మనుషులందరి కోసం ప్రార్థనలు చెయ్యబడాలని పౌలు మనవి చేసాడు?
1 Timothy 2:2-3
ఎటువంటి జీవితం జీవించడానికి క్రైస్తవులు అనుమతించబడాలని పౌలు కోరుకుంటున్నాడు?
క్రైస్తవులు సంపూర్ణ భక్తి, మరియు గౌరవంలో ఒక సమాధానపూరితమైన మరియు నెమ్మదైన జీవితం జీవించాలని పౌలు కోరుతున్నాడు.
1 Timothy 2:4
మానవులందరి కోసం దేవుడు ఏమి కోరుకుంటున్నాడు?
మానవులు అందరు రక్షణ పొంది మరియు సత్యం యొక్క జ్ఞానంలోనికి రావడానికి దేవుడు కోరుతున్నాడు.
1 Timothy 2:5
దేవునికీ, మానవునికీ మధ్య క్రీస్తు యేసు స్థానం ఏమిటి?
వునికీ, మానవునికీ మధ్య క్రీస్తు యేసు ఒక్కడే మధ్యవర్తిగా ఉన్నాడు.
1 Timothy 2:6
క్రీస్తు యేసు అందరి కోసం ఏమి చేశాడు?
క్రీస్తు యేసు తనను తానే అందరి కోసం విమోచన క్రయధనంగా అర్పించుకొన్నాడు.
1 Timothy 2:7
అపొస్తలుడైన పౌలు ఎవరికి బోధిస్తున్నాడు?
దేశాల యొక్క బోధకునిగా పౌలు ఉన్నాడు.
1 Timothy 2:8
పురుషులు ఏమి చేయాలని పౌలు కోరుకుంటున్నాడు?
పురుషులు ప్రార్థన చేయాలని, పవిత్రమైన చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయాలని పౌలు కోరుకుంటున్నాడు
1 Timothy 2:9-10
స్త్రీలు ఏమి చేయాలని పౌలు కోరుకుంటున్నాడు?
స్త్రీలు అణుకువ మరియు స్వీయ నియంత్రణతో సక్రమమైన వస్త్రాలలో అలంకరించుకోవాలని పౌలు కోరుతున్నాడు.,
1 Timothy 2:11
స్త్రీలు ఏం చెయ్యటానికి పౌలు అనుమతించ లేదు?
స్త్రీలు ఉపదేశించటం, పురుషులపై అధికారం చేయడానికి పౌలు అనుమతించ లేదు(2: 12).
1 Timothy 2:12
ఒక స్త్రీని ఏమి చేయడానికి పౌలు అనుమతించడు?
ఉపదేశించడానికీ, లేదా ఒక పురుషుని మీద అధికారం కలిగియుండడానికి ఒక స్త్రీకి పౌలు అనుమతి ఇవ్వడు.
1 Timothy 2:13
ఉపదేశించడానికీ, లేదా ఒక పురుషుని మీద అధికారం కలిగియుండడానికి ఒక స్త్రీకి పౌలు అనుమతి ఇవ్వకుండా ఉండడానికి పౌలు ఇచ్చిన మొదటి కారణం ఏమిటి?
ఆదాము మొదట నిర్మించబడ్డాడు అనేది పౌలు యొక్క మొదటి కారణం.
1 Timothy 2:14
ఉపదేశించడానికీ, లేదా ఒక పురుషుని మీద అధికారం కలిగియుండడానికి ఒక స్త్రీకి పౌలు అనుమతి ఇవ్వకుండా ఉండడానికి పౌలు ఇచ్చిన రెండవ కారణం ఏమిటి?
ఆదాము మోసగించబడలేదు అనేది పౌలు ఇచ్చిన రెండవ కారణం.
1 Timothy 2:15
స్త్రీలు దేనిలో నిలిచి యుండాలని పౌలు కోరుకుంటున్నాడు?
స్త్రీలు విశ్వాసంలో మరియు ప్రేమ మరియు స్వీయ నియంత్రణతో పరిశుద్ధతలో కొనసాగాలని పౌలు కోరుకుంటున్నాడు.
1 Timothy 3
1 Timothy 3:1
ఒక పైవిచారణ చేయువాని పని ఎటువంటి పని?
ఒక పైవిచారణ చేయువాని పని ఒక శ్రేష్టమైన పని.
1 Timothy 3:2
ఒక పైవిచారణ చేయువాడు ఖచ్చితంగా ఏమి చేయడానికి శక్తిమంతుడిగా ఉండాలి?
ఒక పైవిచారణ చేయువాడు బోధించడానికి శక్తిగలవాడుగా ఖచ్చితంగా ఉండాలి.
1 Timothy 3:3
ఒక పైవిచారణ చేయువాడు మద్యమునూ, డబ్బును ఏవిధంగా నిర్వహించాలి?
ఒక పైవిచారణ చేయువాడు తాగుబోతు కాకుండా, మరియు డబ్బును ప్రేమించువాడు కాకుండా ఉండాలి.
1 Timothy 3:4
ఒక పైవిచారణ చేయువాని పిల్లలు ఆయనతో ఏవిధంగా ఏవిధంగా వ్యవహరించాలి?
ఒక పైవిచారణ చేయువాని పిల్లలు అతనికి విధేయత చూపించాలి, మరియు గౌరవించాలి.
1 Timothy 3:5
ఒక పైవిచారణ చేయువాడు తన సొంత ఇంటిని చక్కగా నిర్వహించడం ఎందుకు ముఖ్యం?
ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఒక పురుషుడు తన సొంత కుటుంబాన్ని ఏవిధంగా నిర్వహించాలో తెలియ కుండ ఉన్న యెడల, అతడు సంఘం యొక్క శ్రద్ధను సరిగా తీసుకోలేడు.
1 Timothy 3:6
ఒక పైవిచారణ చేయువాడు క్రొత్తగా మారినవ్యక్తి అయితే ప్రమాదం ఏమిటి?
అతడు కొత్తగా మారినవ్యక్తి కాకుండా, తద్వారా అతడు గర్వపడేవాడుగా ఉండడం, మరియు తీర్పు లోనికి పడే ప్రమాదం ఉంది.
1 Timothy 3:7
సంఘానికి వెలుపల ఉన్నవారి విషయంలో పైవిచారణ చేయువాని మంచి పేరు ఏవిధంగా ఉండాలి?
సంఘానికి వెలుపల ఉన్నవారి విషయంలో పైవిచారణ చేయువాడు మంచి పేరు కలిగియుండాలి.
1 Timothy 3:8-9
వారు పరిచర్య ఆరoభిoచటానికి ముందు పరిచారకుల విషయం ఏం చేయాలి?
పరిచర్య ఆరంభిoచటానికి ముందు పరిచారకులు ఆమోదం పొందాలి(3:11).
1 Timothy 3:10
సేవ చెయ్యడానికి ముందు పరిచారకులతో ఏమి చేయాలి?
వారు సేవ చెయ్యడానికి ముందు పరిచారకులు పరీక్షించబడాలి.
1 Timothy 3:11-13
దైవభక్తి గల స్త్రీలకు ఉండవలసిన కొన్ని గుణ లక్షణాలు ఏమిటి?
దైవభక్తి గల స్త్రీలు గౌరవపూర్వకంగా, అపనిందలు వేయువారు కాకుండా, స్థిరబుద్ధిగలవారు, అన్ని విషయాలలో నమ్మదగినవారు అయిఉండాలి.
1 Timothy 3:14
దేవుని గృహం అంటే ఏమిటి?
జ సంఘమే దేవుని గృహం(3:15)
1 Timothy 3:15
దేవుని ఇల్లు అంటే ఏమిటి?
దేవుని ఇల్లు అంటే సజీవుడైన దేవుని యొక్క సంఘం.
1 Timothy 3:16
యేసు శరీరంలో ప్రత్యక్షమయిన తరువాత, ఆత్మ చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, మరియు దూతలకు ఆయన కనిపించాడు, ఆయన ఏమి చేసాడు?
దేశాలలో యేసు ప్రకటించబడ్డాడు, లోకంలో విశ్వసించబడ్డాడు, మరియు మహిమలో పైకి కొనిపోబడ్డాడు.
1 Timothy 4
1 Timothy 4:1-2
ఆత్మ ప్రకారం, చివరి సమయములలో కొందరు ఏమి చేస్తారు?
కొందరు మనుషులు విశ్వాసమును విడిచిపెడతారు, మరియు మోసపరచు ఆత్మలను మరియు దయ్యముల యొక్క బోధలను అనుసరిస్తారు.
1 Timothy 4:3-4
ఈ మనుషులు ఎటువంటి అబద్ధాలు నేర్పుతారు?
వారు వివాహం చేసుకోవడం నిషేధిస్తారు, మరియు కొన్ని ఆహార పదార్ధాలను నిషేదిస్తారు.
1 Timothy 4:5
మన వినియోగం కోసం మనం తినేది ఏదైనా ఏవిధంగా పవిత్రం అవుతుంది?
మనం తినేది ఏదైనా దేవుని యొక్క వాక్యము మరియు ప్రార్థన చేత ఇది పవిత్రపరచబడింది
1 Timothy 4:6
దేనిలో శిక్షణ పొందమని పౌలు తిమోతికి చెబుతున్నాడు?
దైవ భక్తిలో శిక్షణ పొందమని పౌలు తిమోతికి చెబుతున్నాడు (4:7).
దైవ భక్తిలో శిక్షణ పొందడం దేహ వ్యాయామం కన్నా ఎందుకు లాభకరమైనది?
దైవ భక్తిలో శిక్షణ పొందడం దేహ వ్యాయామం కన్నా ఎందుకు లాభకరమైనదంటే ఈ జీవితానికి, రాబోయే జీవితానికి అది ప్రయోజనం (4:8).
తిమోతి తాను పొందిన మంచి బోధ అంతటితో ఏమి చెయ్యాలని కోరుతున్నాడు?
ఈ విషయాలు ఇతరులకు బోధించమంటున్నాడు (4:6, 11).
1 Timothy 4:7
దేనిలో తిమోతి తనకు తాను తాను శిక్షణ ఇచ్చుకోవాలని పౌలు చెప్పాడు?
దైవభక్తి కోసం తనకు తాను శిక్షణ ఇచ్చుకోవాలని పౌలు తిమోతికి చెపుతున్నాడు.
1 Timothy 4:8-10
శరీర శిక్షణ కంటే దైవభక్తిలో శిక్షణ ఎందుకు ప్రయోజనకరం?
దైవభక్తిలో శిక్షణ మరింత ప్రయోజనకరం ఎందుకంటే ఇది ఈ ప్రస్తుత జీవితం మరియు రాబోతున్న దాని కోసం వాగ్దానం కలిగియుంది.
1 Timothy 4:11
శారీరక శిక్షణ కంటే దైవభక్తిలో శిక్షణ ఎందుకు లాభదాయకం? పౌలు తనకు బోధించిన బోధలో తాను పొందుకొన్న మంచి విషయాలు అన్నిటితో తిమోతి ఏమి చేయాలని పౌలు హెచ్చరిస్తున్నాడు?
ఈ సగతులు ఆజ్ఞాపించడానికీ మరియు బోధించడానికీ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు.
1 Timothy 4:12-13
ఏ యే మార్గాలలో తిమోతి ఇతరులకు మాదిరిగా ఉండాలి?
మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, తిమోతి ఒక మాదిరిగా ఉండాలి.
1 Timothy 4:14-15
తిమోతి తాను కలిగియున్న ఆధ్యాత్మిక వరాన్ని ఏవిధంగా స్వీకరించాడు?
పెద్ద యొక్క చేతుల యొక్క నిక్షేపణతో ప్రవచనం ద్వారా వరం తిమోతికి అనుగ్రహించబడింది.
1 Timothy 4:16
తిమోతి తన జీవితంలోనూ మరియు బోధలోనూ నమ్మకంగా కొనసాగినట్లయితే ఎవరు రక్షించబడుతారు?
తిమోతి తననూ మరియు తన శ్రోతలను ఇద్దరిని రక్షిస్తాడు.
1 Timothy 5
1 Timothy 5:1-2
సంఘంలో వృద్ధ మనిషిని ఏవిదంగా వ్యవహరించమని పౌలు తిమోతికి చెప్పాడు?
అతడు ఒక తండ్రి వలే ఉన్నాడని యెంచి అతనిని హెచ్చరించాలని పౌలు తిమోతికి చెప్పాడు.
1 Timothy 5:3
విధవరాలి పిల్లలు, పిల్లల సంతానం ఆమె కోసం ఏమి చేయాలి?
ఆ పిల్లలు ,పిల్లల సంతానం తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేస్తూ ఆమెను జాగ్రతగా చూచుకోవాలి(5:4).
1 Timothy 5:4-6
ఒక విధవరాలు పిల్లలు, మనవలు ఆమె కోసం ఏమి చేయాలి?
పిల్లలు, మనువాలు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి, మరియు ఆమె విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
1 Timothy 5:7
ఎవరైనా తన ఇంటివారిని సరిగ్గా చూడకపోతే ఏమిటి?
అతను విశ్వాసం లేని వాని కంటే చెడ్డవాడై విశ్వాసం కాదన్నట్టే(5:8)
1 Timothy 5:8
తన సొంత ఇంటిలో ఉన్నవారిని గురించిన శ్రద్ధ తీసుకోని వ్యక్తి ఏమి చేసాడు?
అతడు విశ్వాసాన్ని నిరాకరించాడు మరియు ఒక అవిశ్వాసి కన్న చెడ్డవాడుగా ఉన్నాడు.
1 Timothy 5:9
ఒక విధవరాలు ఏ విధంగా పేరు పొంది ఉండాలి?
విధవరాలు మంచి పనులకు పేరు పొంది ఉండాలి(5:10).
1 Timothy 5:10
విధవరాలు దేని విషయంలో తెలుసుకొనబడాలి?
ఒక విధవరాలు మంచి పనుల విషయంలో పేరుపొంది యుండాలి.
1 Timothy 5:11-13
యవనస్థులైన విధవరాండ్ర విషయంలో సంఘం శ్రద్ధ వహించడం కోసం వ్యక్తుల జాబితాలో ఎందుకు నమోదు చేయకూడదు?
యవనస్థులైన ఈ విధవరాండ్రు తరువాత వివాహం చేసుకోడానికి కోరుకుంటారు.
1 Timothy 5:14-16
యవనస్థులైన స్త్రీలు ఏమి చేయాలని పౌలు కోరుకుంటున్నాడు?
యవనస్థులైన స్త్రీలు వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని, ఇంటిని నిర్వహించాలని పౌలు కోరుకుంటున్నాడు.
1 Timothy 5:17-18
చక్కగా పాలన చేసే పెద్దల ఏమి చేయాలి?
చక్కగా పాలన చేసే పెద్దలు రెట్టింపు యొక్క గౌరవానికి యోగ్యులుగా యెంచబడాలి.
1 Timothy 5:19-20
ఎవరైనా ఒకరు ఒక పెద్దని నిందించడానికి ముందు తప్పనిసరిగా ఎటువంటి షరతులు పాటించాలి?
ఎవరైనా ఒకరు ఒక పెద్దని నిందించినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు ఉండాలి.
1 Timothy 5:21-22
ఏ విధానంలో ఈ నియమాలను పాటించదానికి తిమోతి జాగ్రత్తగా ఉండాలని పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు?
పక్షపాతం లేకుండా ఈ నియమాలను పాటించడానికి జాగ్రత్తగా ఉండాలని పౌలు తిమోతికి ఆదేశించాడు.
1 Timothy 5:23
ఎప్పటి వరకు కొందరు మనుషుల అపరాధాలు బయట పడవు?
కొందరి మనుషుల అపరాధాలు తీర్పు వరకు బయటపడవు(5:24).
1 Timothy 5:24-25
మనుషుల పాపాలు ఎప్పుడు స్పష్టం తెలియపరచబడతాయి?
కొందరి మనుషుల యొక్క పాపాలు స్పష్టంగా ఉన్నాయి అయితే ఇతరుల పాపాలు తీర్పు వరకూ తెలియపరచబడవు.
1 Timothy 6
1 Timothy 6:1-2
బానిసలు తమ యజమానులను ఏవిధంగా గౌరవించాలని పౌలు చెప్పాడు?
బానిసలు తమ సొంత యజమానులు పూర్తి గౌరవానికి యోగ్యులుగా ఎంచాలి.
1 Timothy 6:3
ఎలాంటి వ్యక్తి దైవభక్తికి అనుగుణమైన ఉపదేశాన్ని, క్షేమకరమైన మాటలును తిరస్కరిస్తాడు?
అలాంటి వ్యక్తి ఏమీ తెలియని గర్విష్టియై దైవభక్తికి అనుగుణమైన ఉపదేశాన్ని, క్షేమకరమైన మాటలును తిరస్కరిస్తాడు(6:3-4).
1 Timothy 6:4-5
ఎలాంటి వ్యక్తి ఆరోగ్యకరమైన మాటలు, దైవిక బోధలను తిరస్కరిస్తాడు?
ఆరోగ్యకరమైన మాటలు, దైవిక బోధలను తిరస్కరించే వాడు గర్వపడుతున్నాడు మరియు అర్థం చేసుకొన్నది ఏమీ లేదు.
1 Timothy 6:6
గొప్ప లాభం అని పౌలు దేనిని గురించి చెపుతున్నాడు?
సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభం అని పౌలు చెపుతున్నాడు.
1 Timothy 6:7
మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకువచ్చాము, మరియు మనం విడిచిపెట్టినప్పుడు ఏమి తీసుకొనివెళ్ళగలం?
మనం ఈ లోకం లోనికి ఏమీ తేలేదు, మరియు దేనిని బయటికి తీసుకురాలేము.
1 Timothy 6:8
ఈ లోకంలో మనం దేనితో సంతృప్తి చెందియుండాలి?
ఆహారము మరియు వస్త్రాలు కలిగి, వీటితో మనం తృప్తి చెంది ఉండాలి.
1 Timothy 6:9
ధనవంతులు కావాలని కోరుకొనే వారు దేనిలోనికి వస్తారు?
ధనవంతులు కావాలని కోరుకొనే వారు శోధన మరియు ఒక ఉరి లోనికి పడతారు,
1 Timothy 6:10
అన్ని రకాల కీడులకు మూలం ఏమిటి?
ధనం యొక్క ప్రేమ అన్ని రకాల కీడులకు మూలం.
ధనాన్ని ప్రేమించిన కొంతమందికి ఏమి జరిగింది?
ధనాన్ని ప్రేమించిన కొందరు విశ్వాసం నుండి దూరంగా నడిపించబడ్డారు.
1 Timothy 6:11
ఎలాంటి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు?
విశ్వాసాన్ని గూర్చిన మంచి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు(6:12).
1 Timothy 6:12-14
తిమోతి తప్పక పోరాడాలని పౌలు చెప్పిన పోరాటం ఏమిటి?
విశ్వాసము యొక్క మంచి పోరాటం తిమోతి పోరాడాలని పౌలు చెపుతున్నాడు.
1 Timothy 6:15
ధన్య జీవి, ఏకైక శక్తిమంతుడు ఎక్కడ నివసిస్తున్నాడు?
ధన్య జీవి, ఏకైక శక్తిమంతుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు (6:16).
1 Timothy 6:16
దేవుడు ఎక్కడ నివసిస్తాడు?
సమీపింపశక్యం గాని వెలుగులో దేవుడు నివసిస్తాడు.
1 Timothy 6:17-18
ధనవంతులు ఎందుకు ధనము యొక్క అస్థిరతలో నిరీక్షణ ఉంచకుండా దేవునిలో నిరీక్షణ ఉంచాలి?
ధనవంతులు దేవునిలో నిరీక్షణ ఉంచాలి ఎందుకంటే ఆయన అనుభవం కోసం సమస్తాన్ని సమృద్ధిగా మనకు దయచేయువాడు.
1 Timothy 6:19
మంచి పనులలో ధనవంతులైన వారు తమ కోసం ఏమి చేస్తారు?
మంచి పనులలో ధనవంతులైన వారు ఒక మంచి పునాదిని తమ కోసం సమకూర్చుకొంటారు మరియు యదార్ధమైన జీవితాన్ని చేపట్టుతారు.
1 Timothy 6:20-21
చివరగా, తనకు అప్పగించబడిన సంగతులతో తిమోతి ఏమి చెయ్యాలని పౌలు చెప్పాడు?
తనకు అప్పగించబడిన సంగతులను తిమోతి కాపాడాలని పౌలు చెప్పాడు.