James
James 1
James 1:1
యాకోబు ఈ పత్రిక ఎవరికి వ్రాసాడు?
చెదిరిపోయిన పన్నెండు గోత్రముల వారికి యాకోబు ఈ పత్రిక రాశాడు.
James 1:2
కష్టాలను అనుభవిస్తున్నప్పుడు, తన పాఠకులు ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలని యాకోబు చెప్పాడు?
కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అన్నింటినీ సంతోషంగా ఎంచుకోవాలని యాకోబు చెప్పారు.
James 1:3
మన విశ్వాసాన్ని పరీక్షించడం ద్వారా ఏమి కలుగుతుంది ?
మన విశ్వాసాన్ని పరీక్షించడం ద్వారా ఓర్పు కలుగుతుంది.
James 1:4
మనం విశ్వాసంతో ఏమి అడగాలి?
మనం విశ్వాసంతో దేవున్ని జ్ఞానం కోసం అడగాలి(1:5-6).
James 1:5
మనకు అవసరమైనప్పుడు మనం దేవుడు నుండి ఏమి అడగాలి?
మనకు అవసరమైనప్పుడు మనం దేవుడు నుండి జ్ఞానం అడగాలి.
James 1:6
సందేహించువాడు ఏవిధంగా ఉంటాడు?
సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్రపు అలను పోలియుంటాడు.
James 1:7-8
సందేహంగా అడిగే వారు ఏమి పొందాలని ఆశిస్తారు?
సందేహంగా అడిగే వారు ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొంటారు.
James 1:9
ఎందుకు ఆస్థిపరుడైన సోదరుడు వినయం కలిగి ఉండాలి?
ఆస్థిపరుడైన సోదరుడు వినయం కలిగి ఉండాలి ఎందుకంటే ఆతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు(1:12).
James 1:10
ధనవంతుడు దీనుడుగా ఎందుకు ఉండాలి?
ధనవంతుడు దీనుడుగా ఉండాలి ఎందుకంటే అతడు గడ్డి పువ్వుల వలె గతించిపోతాడు.
James 1:11
ధనవంతులను దేనితో పోల్చబడవచ్చు?
ఎండిపోయే, రాలిపోయే మరియు నశించేపోయె గడ్డి పువ్వుతో ధనవంతుని పోల్చవచ్చు.
James 1:12-13
విశ్వాస పరీక్షలో నిలిచినవారు ఏమి పొందుతారు?
విశ్వాస పరీక్షలో నిలిచినవారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు.
James 1:14
ఒక వ్యక్తి కీడు ద్వారా శోదించబడటానికి కారణమేమిటి?
ఒక వ్యక్తి యొక్క స్వకీయమైన దురాశ అతడు కీడు చేత శోధించబడడానికి కారణం అవుతుంది.
James 1:15-16
పరిపక్వమైన పాపం యొక్క ఫలితం ఏమిటి?
పరిపక్వమైన పాపం యొక్క ఫలితం మరణం.
James 1:17
జ్యోతిర్మయుడగు తండ్రి నుండి ఏమి వచ్చును?
శ్రేష్టమైన ప్రతి బహుమతి మరియు శ్రేష్టమైన వరము జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును.
James 1:18
దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు?
సత్య వాక్యం ద్వారా దేవుడు మనకు జీవం ఇవ్వడానికి ఎంచుకున్నాడు.
James 1:19-21
మన వినికిడి, మాట్లాడడం, భావోద్వేగాలను గురించి మనం ఏమి చెయ్యాలని యాకోబు మనకు చెపుతున్నాడు?
మనము వినుటకు వేగిరపడువారముగా, మాటలాడుటకు నిదానించువారము, కోపించుటకు నిదానించువారము ఉండాలని యాకోబు మనకు చెపుతున్నాడు.
James 1:22-25
ఏవిధంగా మనలను మనం మోసపున్చుకొంటామని యాకోబు చెప్పాడు?
దేవుని వాక్యం వింటూ మరియు వాక్యం ప్రకారం చేయకుండా ఉండడం చేత మనలను మనం మోసపుచ్చుకుంటాము.
James 1:26
మనం నిజంగా భక్తిగలవారంగా ఉండాలంటే ఏది అదుపులో ఉంచబడాలి?
మనం నిజంగా భక్తిగలవారంగా ఉండాలంటే నాలుక అదుపులో ఉంచబడాలి.
James 1:27
దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏమిటి?
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయే దేవుని యెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి
James 2
James 2:1-2
విశ్వాసులు ఎలాంటి వైఖరి కలిగి ఉండకూడదు?
విశ్వాసులు మోమాటము గలవారుగా ఉండకూడదు.
James 2:3
తమ సమావేశంలో ప్రవేశించిన ధనవంతుడికి విశ్వాసులు ఏమి చెపుతారు?
మంచి స్థలమందు కూర్చోవాలని వారు ఆయనకి చెపుతారు.
తమ సమావేశంలో ప్రవేశించిన పేదవానికి విశ్వాసులు ఏమి చెపుతారు?
దూరంగా నిలవాలని లేక ఒక దీన స్థలములో నిలవాలని వారు ఆయనకి చెపుతారు.
James 2:4
విశ్వాసులు వారి దురాలోచనల కారణంగా ఏమి అవుతారు?
వారు దుష్ట ఆలోచనలకు న్యాయవిమర్శుకులు అవుతారు.
James 2:5
పేదలను దేవుడు ఎన్నుకోవడం గురించి యాకోబు ఏమి చెపుతున్నాడు?
పేదవారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, మరియు రాజ్యమును వారసులుగా దేవుడు వారిని ఎంచుకొన్నాడని యాకోబు చెపుతున్నాడు.
James 2:6-7
ధనవంతులు ఏమి చేస్తున్నారని యాకోబు చెప్పాడు?
ధనవంతులు అణచివేస్తున్నారు మరియు దేవుని నామాన్ని దూషిస్తూఉన్నారు అని యాకోబు చెపుతున్నాడు.
James 2:8-9
లేఖనముల యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి?
“నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞ.
James 2:10-11
ఎవడైనను ధర్మశాస్త్రము విషయంలో తప్పిపోయినయెడల అతడు దేని విషయంలో దోషి అవుతాడు?
ఎవడైనను ధర్మశాస్త్రము విషయంలో తప్పిపోయినయెడల అతడు ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు.
James 2:12
కరుణ చూపని వానికి ఏం వస్తుంది?
కరుణ చూపని వానికి కరుణ లేకుండా తీర్పు వస్తుంది(2:13).
James 2:13
కనికరము చూపని వారికి ఏమి వస్తుంది?
కనికరము చూపనివానికి కనికరము లేని తీర్పు వస్తుంది.
James 2:14-15
విశ్వాసం ఉందని చెప్పుకొంటూ అయితే అవసరతలో ఉన్నవారికి సహాయం చేయని వారి గురించి యాకోబు ఏమి చెపుతున్నాడు?
విశ్వాసం ఉందని చెప్పుకొంటూ అయితే అవసరతలో ఉన్నవారికి సహాయం చేయని వారు తమను రక్షించలేని విశ్వాసాన్ని కలిగియుంటారు.
James 2:16
పేదవానికి ఏమీ ఇవ్వకుండా చలి కాచుకొనుడి, మరియు తృప్తిపొంది ఉండండి అని చెప్పినయెడల అది ఆయనకి ప్రయోజనము అవుతుందా?
లేదు, చలి కాచుకోడానికి లేక వారికి ఆహారం పెట్టడానికి పేదవానికి మనం ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఆయనకి ఏమీ ప్రయోజనము ఉండదు.
James 2:17
విశ్వాసం క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉన్నట్లయితే అది ఏమవుతుంది?
విశ్వాసం క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉన్నట్లయితే అది మృతం అవుతుంది.
James 2:18
మన విశ్వాసాన్ని చూపించాలని యాకోబు ఏవిధంగా చెప్పాడు?
మన క్రియలు ద్వారా మన విశ్వాసాన్ని చూపించాలని యాకోబు చెప్పాడు.
James 2:19-20
దయ్యాలు మరియు విశ్వాసం ఉందని చెప్పుకునే వారు ఇద్దరూ ఏమి నమ్ముతారు?
దయ్యాలు మరియు విశ్వాసం ఉందని చెప్పుకునే వారు ఇద్దరూ దేవుడు ఉన్నాడని నమ్ముతారు.
James 2:21
అబ్రాహాము తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని ఏవిధంగా కనుపరచాడు?
అబ్రాహాము బలిపీఠం మీద ఇస్సాకును బలి అర్పించినప్పుడు తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని కనుపరచాడు.
James 2:22
అబ్రాహాము విశ్వాసం ఏవిధంగా పరిపూర్ణమైంది?
అబ్రాహాము విశ్వాసం ఆయన క్రియల ద్వారా పరిపూర్ణమైంది.
James 2:23-24
అబ్రాహాము విశ్వాసం మరియు తన క్రియలతో ఏ లేఖనం నెరవేరింది?
" –అబ్రాహాము దేవుని నమ్మెను అది ఆయనకి నీతిగా ఎంచబడెను” అని చెపుతున్న లేఖనం లేఖనం నెరవేరింది.
James 2:25
రాహాబు తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని ఏవిధంగా కనుపరచింది?
రాహాబు దూతలను స్వాగతించింది మరియు వారిని వేరొక మార్గంలో పంపించినప్పుడు ఆమె క్రియల ద్వారా తన విశ్వాసాన్ని కనుపరచింది.
James 2:26
ప్రాణము లేకుండా ఉన్న శరీరం ఏమిటి?
ప్రాణము లేకుండా ఉన్న శరీరం మృతం.
James 3
James 3:1
అనేకమంది బోధకులు కాలేరని యాకోబు ఎందుకు చెప్పాడు?
ఎక్కువమంది బోధకులుగా మారకూడదు ఎందుకంటే వారికి ఎక్కువ తీర్పు లభిస్తుంది.
James 3:2
ఎవరు తప్పిపోతున్నారు, మరియు ఎన్ని విధాలుగా?
అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము.
ఎటువంటి వ్యక్తి తన పూర్ణ శరీరాన్ని నియంత్రించగలడు?
తన మాటయందు తప్పని వ్యక్తి తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొనశక్తిగలవాడగును.
James 3:3
ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున తాను కోరుకొన్న చోటికి వెళ్ళడానికి ఎటువంటి చిన్నది దానిని నడిపించగలదు?
మిక్కిలి చిన్నదగు చుక్కాని ఒక పెద్ద ఓడను నడిపించగలదు.
James 3:4
అడవిలో పెద్ద అగ్నిని ఏ చిన్న విషయం ప్రారంభించగలదు?
ఒక చిన్న అగ్ని ఒక అడవిలో పెద్ద అగ్నిని ప్రారంభించగలదు.
James 3:5
పాపిష్టి నాలుక శరీరాన్నoతా ఏం చేస్తుంది ?
పాపిష్టి నాలుక శరీరాన్నoతా మాలిన్యం చేస్తుంది(3:6).
James 3:6
పాపపు నాలుక పూర్తి శరీరానికి ఏమి చేయగలదు?
పాపపు నాలుక పూర్తి శరీరాన్ని అపవిత్రం చేయగలదు.
James 3:7
మనుషుల్లో ఎవరిచేతా మచ్చిక కానిది ఏమిటి?
మనుషుల్లో ఎవరిచేతా మచ్చిక కానిది నాలుకే(3:8).
James 3:8
మనిషిలో ఎవరూ దేనినీ మచ్చిక చేసుకోలేకపోయారు?
మనిషిలో ఎవరూ నాలుకను మచ్చిక చేసుకోలేకపోయారు.
James 3:9-10
దేవుడు మరియు మనుషులను వారి నాలుకతో చూసుకోవడానికి ప్రజలకు ఏ రెండు మార్గాలు ఉన్నాయి?
ఒకే నాలుకతో, వారు దేవుడిని ఆశీర్వదిస్తారు మరియు మనుషులను శపిస్తారు.
James 3:11-12
నీటి బుగ్గ అందించలేని రెండు విషయాలు ఏమిటి?
ఒక నీటిబుగ్గ తీపి మరియు చేదు నీటిని అందించలేదు.
James 3:13-14
ఒక వ్యక్తి జ్ఞానం మరియు అవగాహనను ఏవిధంగా ప్రదర్శిస్తాడు?
ఒక వ్యక్తి వినయంతో చేసిన పనుల ద్వారా జ్ఞానం మరియు అవగాహనను ప్రదర్శిస్తాడు.
James 3:15
ఒక వ్యక్తికి అసూయ మరియు అత్యాశ మరియు అబద్ధం చెప్పడానికి ఎటువంటి జ్ఞానం కారణమవుతుంది?
భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్న జ్ఞానం ఒక వ్యక్తి అసూయ మరియు అత్యాశ మరియు అబద్ధం చెప్పడానికి కారణమవుతుంది.
James 3:16
అసూయ మరియు అత్యాశ నుండి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
అసూయ మరియు అత్యాశ నుండి అల్లరియు ప్రతి నీచకార్యమును కలుగుతాయి.
James 3:17-18
ఏ వైఖరులు పై నుండి వచ్చిన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి?
సమాధానాన్ని ప్రేమించడం, మృదువుగా ఉండడం, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతములేక మరియు యదార్ధముగా ఉండువాడు పైనుండి జ్ఞానం కలవాడు.
James 4
James 4:1-2
విశ్వాసుల మధ్య పోరాటాలు మరియు వివాదాలకు మూలం ఏమిటని యాకోబు చెపుతున్నాడు?
వారి మధ్య పోరాటాలు చేసే దుష్ట కోరికలే మూలం.
James 4:3
విశ్వాసులు దేవునికి చేసే తమ అభ్యర్థనలను ఎందుకు పొందరు?
వారు పొందరు ఎందుకంటే వారు తమ దుష్ట కోరికల మీద వినియోగించబడాలని చెడు సంగతుల కోసం వారు అడుగుతారు.
James 4:4-5
ఒక వ్యక్తి ఈ లోకానికి స్నేహితునిగా ఉండాలని నిర్ణయించుకుంటే, ఆ వ్యక్తికి దేవుడితో ఉండే సంబంధం ఏమిటి?
ఈ లోకముతో స్నేహము చేయాలని నిర్ణయించు వ్యక్తి తనను తాను దేవునికి శత్రువుగా చేసుకొంటున్నాడు.
James 4:6
ఎవరిని దేవుడు ఎదిరిస్తాడు మరియు ఎవరికి ఆయన కృపను ఇస్తాడు?
దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
James 4:7
ఒక విశ్వాసి తనను తాను దేవునికి లోబరుకొని మరియు అపవాడిని ఎదిరించినప్పుడు అపవాది ఏమి చేస్తుంది?
అపవాది పారిపోతుంది.
James 4:8-10
తన దగ్గరకు వచ్చు వారి కోసం దేవుడు ఏమి చేస్తాడు?
తన దగ్గరకు వచ్చువారి దగ్గరకు దేవుడు వెళ్తాడు.
James 4:11-12
విశ్వాసులను ఏమి చేయవద్దని యాకోబు చెపుతున్నాడు?
ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడుకోవద్దని యాకోబు చెపుతున్నాడు.
James 4:13-14
భవిష్యత్తులో జరిగే దానికి ఏం చెప్పాలని విశ్వాసులుకు యాకోబు చెపుతున్నాడు?
దేవుడు అనుమతిస్తే, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం అని చెప్పాలని విశ్వాసులుకు యాకోబు చెపుతున్నాడు (4:13-15).
James 4:15
భవిష్యత్తులో జరగబోతున్న దానిని గురించి విశ్వాసులు ఏమి చెప్పాలని యాకోబు చెపుతున్నాడు?
ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అని యాకోబు విశ్వాసులకు చెపుతున్నాడు.
James 4:16
తమ ప్రణాళికల గురించి డంబములు పలికే వారిని గురించి యాకోబు ఏమి చెపుతున్నాడు?
తమ ప్రణాళికల గురించి డంబములు పలికే వారు చెడ్డదానిని చేయుచున్నారని యాకోబు చెపుతున్నాడు?
James 4:17
మేలు చేయాలని తెలిసి దానిని చెయ్యని వానికి ఏమి కలుగుతుంది?
మేలు చేయాలని తెలిసి దానిని చెయ్యని వానికి పాపము కలుగుతుంది.
James 5
James 5:1-2
యాకోబు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అ ధనికులు చివరి రోజుల్లో వారికీ వ్యతిరేకంగా తీర్పు రప్పించే ఎ పనులు చేస్తున్నారు?
ధనికులు తమ సంపదలు నిలవ చేసుకున్నారు (5: 3).
James 5:3
యాకోబు మాట్లాడుతున్న ధనవంతులు తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేలా చివరి రోజులలో ఏమి చేసారు?
అంత్యదినములయందు ధనవంతులు ధనము కూర్చు కొన్నారు.
James 5:4-5
ఈ ధనికులు తమ పనివారితో ఏవిధంగా వ్యవహరించారు?
ఈ ధనికులు తమ పనివారి కూలిని వాటికి ఇవ్వలేదు.
James 5:6
ఈ ధనికులు నీతిమంతుడైన వ్యక్తితో ఏ విధంగా వ్యవహరించారు?
ఈ ధనవంతులు నీతిమంతుడిని శిక్షించారు మరియు చంపారు.
James 5:7
ప్రభువు రాక విషయంలో విశ్వాసి వైఖరి ఏ విధంగా ఉండాలని యాకోబు చెప్పాడు?
విశ్వాసులు ప్రభువు రాక కొరకు ఓపికగా వేచి ఉండాలి.
James 5:8
విశ్వాసులు ప్రభువు రాక కొరకు ఓపికగా ఎదురుచూస్తున్నప్పుడు వారి హృదయాలను ఎందుకు బలపరుచుకోవాలి?
ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నందున వారు తమ హృదయాలను బలపరచుకోవాలి.
James 5:9
పాత ఒడంబడిక ప్రవక్తలు మనకు ఏం నిదర్శనంగా చూపెట్టారని యాకోబు చెపుతున్నాడు?
పాత ఒడంబడిక ప్రవక్తలు మనకు ఓర్పు, బాధల్లో సహనాన్ని నిదర్శనంగా చూపెట్టారని యాకోబు చెపుతున్నాడు(5:10-11).
James 5:10
పాత నిబంధన ప్రవక్తల బాధ మరియు సహనం మనకు ఏ విధంగా మారాలి?
పాత నిబంధన ప్రవక్తల బాధ మరియు సహనం మనకు ఒక ఉదాహరణగా మారాలి.
James 5:11
యోబు ఎటువంటి ఆనుకూల లక్షణాన్ని కనుపరచాడు?
యోబు ఓర్పును కనుపరచాడు.
James 5:12
“అవును” మరియు “కాదు” విషయమో విశ్వాసి యొక్క విశ్వసనీయతను గురించి యాకోబు ఏమి చెపుతున్నాడు?
విశ్వాసి "అవును" అని అంటే అది "అవును" అబియూ, మరియు ఆయన "కాదు" అని అంటే అది "కాదు" అని అర్ధం.
James 5:13
ఎవరికైనా జబ్బు చేస్తే ఏం చెయ్యాలి?
ఎవరికైనా జబ్బు చేస్తే అతడు సంఘ పెద్దల్నిపిలిపించుకోవాలి అప్పుడు వాళ్ళు ప్రభు పేర నూనె రాసి ప్రార్ధన చెయ్యాలి (5:16).
James 5:14-15
రోగిగా ఉన్నవారు ఏమి చేయాలి?
రోగిగా ఉన్నవారు పెద్దలను పిలవాలి కాబట్టి వారు ఆయన విషయంలో ప్రార్థన చేయవచ్చు మరియు నూనెతో అభిషేకం చేయవచ్చు.
James 5:16
స్వస్థత పొందడానికి విశ్వాసులు ఒకరితో ఒకరు ఏమి చేయాలని యాకోబు చెపుతున్నాడు?
విశ్వాసులు ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి మరియు ఒకని కొరకు ఒకడు ప్రార్థనచేయాలి.
James 5:17
వర్షం పడకూడదని ఏలీయా ప్రార్థించినప్పుడు ఏమి జరిగింది?
మూడు సంవత్సరాల ఆరు నెలలుగా భూమిపై వర్షాలు పడలేదు.
James 5:18
ఏలీయా వర్షం కోసం మరలా ప్రార్థన చేసినప్పుడు ఏమి జరిగింది?
అతడు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షాన్ని ఇచ్చింది మరియు భూమి ఫలాన్ని ఇచ్చింది.
James 5:19
ఒక పాపి వెళుతున్న తప్పు దారినుంచి మళ్ళించే వాడు ఏమి సాధిస్తున్నాడు?
ఒక పాపి వెళుతున్న తప్పు దారినుంచి మళ్ళించే వాడు అతని ఆత్మను మరణం నుంచి తప్పించి, అసంఖ్యాక మైన పాపాలను కప్పి వేస్తున్నాడు (5:20).
James 5:20
ఒక పాపాత్ముడిని తన మార్గము నుండి మళ్ళించువాడు దేనిని నేరవేరుస్తున్నాడు?
జెరూసలేం సైన్యాలతో చుట్టుముట్టబడినప్పుడు, దాని నాశనం దగ్గరపడింది.