2 John
2 John 1
2 John 1:1-2
రచయిత యోహాను ఈ పత్రికలో ఎటువంటి బిరుదులు ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు?
యోహాను తనను తాను ‘పెద్ద’గా పరిచయం చేసుకున్నాడు.
ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది?
ఎన్నికైన స్త్రీ,, ఆమె పిల్లలకు ఈ పత్రిక రాయబడింది.
2 John 1:3
ఎవరి నుండి కృప, కరుణ, సమాధానం కలుగుతాయని యోహాను చెపుతున్నాడు?
తండ్రియైన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృప, కరుణ, సమాధానం కలుగుతాయని యోహాను చెపుతున్నాడు.
2 John 1:4
యోహాను ఎందుకు ఆనందిస్తున్నాడు?
యోహాను ఆనందిస్తున్నాడు, ఎందుకంటే ఆ స్త్రీ పిల్లలు కొంతమంది సత్యం ప్రకారం నడుస్తున్నారని అతడు కనుగొన్నాడు.
2 John 1:5
ఆరంభం నుండి వారు ఎటువంటి ఆజ్ఞను కలిగియున్నారని యోహాను చెపుతున్నాడు?
వారు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే ఆజ్ఞను వారు ఆరంభం నుండి కలిగియున్నారు.
2 John 1:6
ప్రేమ అంటే ఏమిటి అని యోహాను చెపుతున్నాడు?
ప్రేమ అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం.
2 John 1:7
యేసుక్రీస్తు శరీరములో వచ్చాడని ఒప్పుకొనని వారిని యోహాను ఏమని పిలుస్తున్నాడు?
యోహాను వారిని మోసగాడు, క్రీస్తు విరోధి అని పిలుస్తున్నాడు.
2 John 1:8
విశ్వాసులు ఏమి చేయకుండా జాగ్రత్త వహించాలని యోహాను చెపుతున్నాడు?
విశ్వాసులు తాము దేనికోసం పనిచేసారో దానిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని యోహాను చెపుతున్నాడు.
2 John 1:9
ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే విశ్వాసులు ఏమి చేయాలి అని యోహాను చెప్పాడు?
ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే అతని ఆహ్వానించవద్దు అని విశ్వాసులుకు యోహాను చెప్పాడు[1:10].
ఒకవేళ క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వానిస్తే అతడు దేనిలో పాలిభాగస్తుడు అవుతాడు?
క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వనిస్తే అతడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడు అవుతాడు[1:11].
2 John 1:10
క్రీస్తు గురించి నిజమైన బోధను తీసుకురాని వారు ఎవరైననూ వారి విషయంలో విశ్వాసులు ఏమి చేయాలని యోహాను చెప్పాడు?
క్రీస్తు గురించిన నిజమైన బోధను తీసుకురాని వారు ఎవరినైననూ వారు స్వీకరించకూడదు.
2 John 1:11
క్రీస్తు గురించి నిజమైన బోధను తీసుకురాని వ్యక్తిని స్వీకరించినప్పుడు విశ్వాసి దేని విషయంలో దోషి అవుతాడు?
ఒక తప్పు బోధకుని స్వీకరించి, అట్టివానికి శుభములు చెప్పిన విశ్వాసి అతని దుష్టక్రియలలో భాగం పంచుకొంటాడు.
2 John 1:12-13
భవిష్యత్తులో యోహాను ఏమి చేయాలని ఆశిస్తున్నాడు?
ఎన్నికైన మహిళతో ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడాలని యోహాను ఎదురు చూస్తున్నాడు.