తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Philippians

Philippians 1

Philippians 1:1-4

పౌలు ఈ పత్రికను ఎవరికి సంబోధించాడు?

పౌలు ఈ పత్రికను ఫిలిప్పీలో క్రీస్తు యేసులో ప్రత్యేకించబడిన మనుష్యులు అందరికి రాసాడు, వీరిలో , పర్యవేక్షకులు మరియు పరిచారకులు ఉన్నారు.

Philippians 1:5

ఫిలిప్పీయుల కోసం ఏ విషయంలో పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు?

మొదటి రోజు నుండి ఇప్పటివరకు సువార్తలో ఫిలిప్పీయుల సహవాసం కోసం పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.

Philippians 1:6

ఫిలిప్పీయుల విషయంలో పౌలు దేని గురించి ధైర్యంగా ఉన్నాడు?

వారిలో మంచి క్రియను ప్రారంభించిన వాడు దానిని పూర్తి చేస్తాడని పౌలు ధైర్యంగా ఉన్నాడు.

Philippians 1:7-8

ఫిలిప్పీయులు దేనిలో పౌలు భాగస్వాములుగా ఉన్నారు?

పౌలు యొక్క చెరలో, మరియు అతని సమర్ధనలో మరియు సువార్త యొక్క ధృవీకరణలో, ఫిలిప్పీయులు అతని భాగస్వాములుగా ఉన్నారు.

Philippians 1:9-10

ఫిలిప్పీయుల మధ్య మరింత ఎక్కువగా వృద్ధి చెందాలని దేని గురించి పౌలు ఏమి ప్రార్థించాడు?

ఫిలిప్పీయుల మధ్య ప్రేమ మరింత పెరగాలని పౌలు ప్రార్థించాడు.

Philippians 1:11

ఫిలిప్పీయులు దేనితో నింపబడాలని పౌలు కోరుకున్నాడు?

ఫిలిప్పీయులు నీతి ఫలాలతో నింపబడాలని పౌలు కోరుకున్నాడు.

Philippians 1:12

పౌలు చెర సువార్తను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లింది?

క్రీస్తు కోసం పౌలు చెర విస్తృతంగా ప్రసిద్ది చెందింది, మరియు అనేక మంది సహోదరులు ఇప్పుడు మరింత ధైర్యంగా మాట్లాడుతున్నారు.

Philippians 1:13

పౌలు చెర సువార్తను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లింది?

క్రీస్తు కోసం పౌలు చెర విస్తృతంగా ప్రసిద్ది చెందింది, మరియు అనేక మంది సహోదరులు ఇప్పుడు మరింత ధైర్యంగా మాట్లాడుతున్నారు.

Philippians 1:14-16

పౌలు చెర సువార్తను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లింది?

క్రీస్తు కోసం పౌలు చెర విస్తృతంగా ప్రసిద్ది చెందింది, మరియు అనేక మంది సహోదరులు ఇప్పుడు మరింత ధైర్యంగా మాట్లాడుతున్నారు.

Philippians 1:17

కొందరు స్వార్థపూరిత మరియు మోసపూరిత ఉద్దేశ్యాలతో ఎందుకు క్రీస్తును ప్రకటిస్తున్నారు?

కొంతమంది స్వార్థపూరితమైన మరియు మోసపూరిత ఉద్దేశ్యాలతో క్రీస్తును ప్రకటిస్తున్నారు, వారు చెరలో పౌలు యొక్క శ్రమలను అధికం చేస్తున్నారని భావించారు.

Philippians 1:18-19

క్రీస్తు గురించి యదార్ధమైన మరియు మోసపూరిత బోధ విషయంలో పౌలు యొక్క ప్రతిస్పందన ఏమిటి?

ఏవిధము చేతనైననూ క్రీస్తు ప్రకటించబడుతున్నందుకు పౌలు సంతోషించాడు

Philippians 1:20

పౌలు జీవితంలో లేదా మరణం చేత ఏమి చేయాలని కోరుకున్నాడు?

జీవితంలో లేదా మరణం చేత క్రీస్తుకు మహిమ తీసుకురావాలని పౌలు కోరుకున్నాడు.

Philippians 1:21

బ్రతకడం అంటే ఏమిటి, చనిపోవడం అంటే ఏమిటి అని పౌలు చెప్పాడు?

జీవించడం క్రీస్తు అని, చనిపోవడం లాభం అని పౌలు చెప్పాడు.

Philippians 1:22

ఏ ఎంపికలు పౌలు వేరు వేరు దిశలలోనికి లాగాయి?

మరణంలో క్రీస్తుతో కలిసి ఉండడం లేదా తన శ్రమను కొనసాగించడానికి శరీరంలో నిలిచియుండడం అనే ఎంపికల ద్వారా పౌలు లాగబడ్డాడు.

Philippians 1:23

ఏ ఎంపికలు పాల్‌ను వేర్వేరు దిశల్లోకి లాగాయి?

మరణంలో క్రీస్తుతో కలిసి ఉండడం లేదా తన శ్రమను కొనసాగించడానికి శరీరాన్ని కలిగి ఉండడం అనే ఎంపికల ద్వారా పౌలు లాగబడ్డాడు.

Philippians 1:24

ఏ ఎంపికలు పౌలు వేరు వేరు దిశలలోనికి లాగాయి?

మరణంలో క్రీస్తుతో కలిసి ఉండడం లేదా తన శ్రమను కొనసాగించడానికి శరీరంలో నిలిచియుండడం అనే ఎంపికల ద్వారా పౌలు లాగబడ్డాడు.

Philippians 1:25-26

ఏ ఉద్దేశ్యం కోసం పౌలు ఫిలిప్పీయులతో నిలిచి ఉంటానని ధైర్యంగా ఉన్నాడు?

ఫిలిప్పీయుల అభివృద్ధి మరియు విశ్వాసంలో సంతోషం కోసం తాను వారితోనే నిలిచి ఉంటానని పౌలు ధైర్యంగా ఉన్నాడు.

Philippians 1:27

ఫిలిప్పీయులతో ఉన్నప్పటికీ లేదా వారికి దూరంగా ఉన్నప్పటికీ, ఫిలిప్పీయుల గురించి ఏమి వినాలని పౌలు కోరుకున్నాడు?

సువార్త యొక్క విశ్వాసం కోసం ఫిలిప్పీయులు ఒకే ఆత్మలో స్థిరంగా నిలిచియున్నారని మరియు ఒకే ఆత్మలో కలిసి పోరాడుతున్నారని పౌలు వినాలని కోరుకున్నాడు.

Philippians 1:28

తమను వ్యతిరేకించే వారికి ఫిలిప్పీయులు భయపడనప్పుడు, అది దేనికి సంకేతం?

తమను వ్యతిరేకించే వారికి ఫిలిప్పీయులు భయపడనప్పుడు, అది వారి ప్రత్యర్థుల నాశనానికి సంకేతం, అయితే విశ్వాసుల రక్షణకు.

Philippians 1:29-30

ఫిలిప్పీయులకు దేవుడు ఏ రెండు విషయాలు అనుగ్రహించాడు?

ఫిలిప్పీయులు క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారు, అయితే వారు ఆయన పక్షమున శ్రమపడడం కూడా వారికి అనుగ్రహించబడింది.

Philippians 2

Philippians 2:2

తన సంతోషాన్ని సంపూర్ణం చెయ్యడానికి ఫిలిప్పీయులు ఏమి చేయాలని పౌలు చెప్పాడు?

ఫిలిప్పీయులు ఒకే మనస్సుతో ఉండాలి, ఒకే ప్రేమను కలిగి ఉండాలి మరియు ఆత్మ మరియు మనస్సులో ఐక్యంగా ఉండాలి.

Philippians 2:3-4

ఫిలిప్పీయులు ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసుకోవాలని పౌలు ఏ విధంగా చెప్పాడు?

ఫిలిప్పీయులు ఒకరినొకరు తమ కంటే గొప్పగా భావించాలి.

Philippians 2:5

మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలని పౌలు చెప్పాడు?

మనం క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉండాలని పౌలు చెప్పాడు.

Philippians 2:6

మనం ఎవరి మనస్సు కలిగి ఉండాలని పౌలు చెప్పాడు?

మనం క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉండాలని పౌలు చెప్పాడు.

క్రీస్తు యేసు ఏ రూపంలో ఉన్నాడు?

క్రీస్తు యేసు దేవుని రూపంలో ఉన్నాడు.

Philippians 2:7

అప్పుడు క్రీస్తు యేసు ఏ రూపాన్ని తీసుకున్నాడు?

అప్పుడు క్రీస్తు యేసు మనిషి రూపంలో ఒక సేవకుని రూపాన్ని ధరించాడు,.

Philippians 2:8

యేసు తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు?

యేసు సిలువ మరణానికి లోబడి తనను తాను తగ్గించుకున్నాడు.

Philippians 2:9-10

అప్పుడు దేవుడు యేసు కోసం ఏమి చేసాడు?

దేవుడు యేసును ఉన్నతంగా హెచ్చించాడు మరియు ప్రతీ నామానికి పై నామాన్ని అనుగ్రహించాడు.

Philippians 2:11

ప్రతి నాలుక ఏమి ఒప్పుకుంటుంది?

ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటుంది.

Philippians 2:12

ఫిలిప్పీయులు తమ రక్షణ విషయంలో ఏమి చెయ్యాలని పిలువబడ్డారు?

ఫిలిప్పీయులు భయంతోనూ మరియు వణుకుతోనూ తమ రక్షణ కొనసాగించాలి.

Philippians 2:13

విశ్వాసులలో దేవుడు ఏమి చేయడానికి క్రియ చేస్తాడు?

దేవుడు తన సంతోషం కోసం ఇచ్చయించడానికీ క్రియ జరిగించడానికీ విశ్వాసులలో క్రియ జరిగిస్తాడు.

Philippians 2:14-16

ప్రతిదీ ఏమి లేకుండా చేయాలి?

ఫిర్యాదులు మరియు వాదనలు లేకుండా ప్రతిదీ జరగాలి.

Philippians 2:17-19

పౌలు ఏ ఉద్దేశం కోసం తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు?

ఫిలిప్పీయుల విశ్వాసం యొక్క త్యాగం మరియు సేవలో పౌలు తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు.

Philippians 2:20-23

తిమోతి ఎందుకు పౌలుకు ప్రత్యేకమైన సహాయకుడుగా ఉన్నాడు?

తిమోతి ప్రత్యేకమైన వాడు ఎందుకంటే అతడు నిజంగా ఫిలిప్పీయుల పట్ల శ్రద్ధ వహిస్తాడు.

Philippians 2:24-29

పౌలు ఫిలిప్పీయులను చూడాలని ఆశిస్తున్నాడా?

అవును, పౌలు త్వరలో ఫిలిప్పీయులను చూడాలని ఆశిస్తున్నాడు.

Philippians 2:30

ఎపఫ్రొదితు దాదాపు దేని కోసం చనిపోయాడు?

ఎపఫ్రొదితు దాదాపు క్రీస్తు పని చేస్తూ, పౌలుకు సేవ చేస్తూ, పౌలు అవసరాలను తీరుస్తూ మరణించాడు.

Philippians 3

Philippians 3:2

ఎవరి కోసం పౌలు విశ్వాసులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు?

కుక్కలు, దుష్టకార్యాలు చేసేవారు, మరియు చేదన ఆచరించు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పౌలు విశ్వాసులను హెచ్చరించాడు.

Philippians 3:3-5

నిజమైన సున్నతి ఎవరు ఆచరిస్తారు అని పౌలు చెప్పాడు?

దేవుని ఆత్మలో ఆరాధించేవారు, క్రీస్తు యేసులో అతిఅశయించు వారు మరియు శరీరాన్ని విశ్వసించని వారు నిజమైన సున్నతి పొందినవారు అని పౌలు చెప్పాడు.

Philippians 3:6

ధర్మశాస్త్రం యొక్క నీతి విషయంలో పౌలు తన మునుపటి ప్రవర్తనను ఏ విధంగా వివరించాడు?

ధర్మశాస్త్రం యొక్క నీతికి సంబంధించి పౌలు తన మునుపటి ప్రవర్తనను నిర్దోషిగా వివరించాడు.

Philippians 3:7

పౌలు ఇప్పుడు శరీరం మీద తన మునుపటి నమ్మకాన్ని ఏ విధంగా పరిగణించాడు?

పౌలు ఇప్పుడు క్రీస్తు కారణంగా శరీరము మీద తన మునుపటి విశ్వాసం అంతా పనికిరానిదిగా పరిగణించాడు.

Philippians 3:8

పౌలు ఇప్పుడు ఏ ప్రయోజనం కోసం మునుపటి వస్తువులన్నింటినీ చెత్తగా పరిగణించాడు?

పౌలు క్రీస్తును పొందేలా మునుపటి విషయాలన్నింటినీ చెత్తగా పరిగణించాడు.

Philippians 3:9

పౌలుకు ఇప్పుడు ఎలాంటి నీతి ఉంది?

పౌలు ఇప్పుడు దేవుని నుండి నీతిని కలిగి ఉన్నాడు, అది క్రీస్తులో విశ్వాసం ద్వారా.

Philippians 3:10-11

పౌలుకు క్రీస్తుతో సహవాసం దేనిలో ఉంది?

పౌలుకు క్రీస్తు శ్రమల సహవాసం ఉంది.

Philippians 3:12-13

అతడు ఇంకా సంపూర్ణుడు కానప్పటికీ, పౌలు ఏమి చేస్తూనే ఉన్నాడు?

యేసు తనను ఏ కారణం కోసం పట్టుకొన్నాడో ఆ కారణాన్ని గ్రహించడానికి పౌలు పరిపూర్ణతను వెంబడించాడు.

Philippians 3:14-16

పౌలు ఏ లక్ష్యం వైపు పరుగెడుతూ ఉన్నాడు?

క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు యొక్క బహుమానాన్ని గెలవడానికి గురి వైపుకు పరుగెడుతూ ఉన్నాడు.

Philippians 3:17-18

పౌలు తన ప్రవర్తన యొక్క ఉదాహరణ విషయంలో ఫిలిప్పీయులు ఏమి చేయమని పౌలు చెప్పాడు?

ఫిలిప్పీయులు తన ప్రవర్తననలో చేరాలని మరియు అనుకరించాలని పౌలు చెప్పాడు.

Philippians 3:19

కడుపే వారి దేవుడుగా కలిగి యుండి భూసంబంధమైన సంగతులను గురించి ఆలోచించే వారి గమ్యం ఏమిటి?

కడుపే వారి దేవుడుగా కలిగి యుండి భూసంబంధమైన సంగతులను గురించి ఆలోచించే వారు నాశనానికి నిర్దేషించబడ్డారు.

Philippians 3:20

విశ్వాసుల పౌరసత్వం ఎక్కడ ఉందని పౌలు చెప్పాడు?

విశ్వాసుల పౌరసత్వం పరలోకంలో ఉందని పౌలు చెప్పాడు.

Philippians 3:21

క్రీస్తు పరలోకం నుండి వచ్చినప్పుడు విశ్వాసుల శరీరాలకు ఏమి చేస్తాడు?

క్రీస్తు విశ్వాసుల దీన శరీరాలను తన మహిమాన్వితమైన దేహానికి సమ రూపం గల దేహాలుగా మారుస్తాడు.

Philippians 4

Philippians 4:1

ఫిలిప్పీలోని తన ప్రియమైన స్నేహితులు ఏమి చేయాలని పౌలు కోరుకుంటున్నాడు?

ఫిలిప్పీయులు ప్రభువులో స్థిరంగా నిలబడాలని పౌలు కోరుతున్నాడు.

Philippians 4:2-3

యువొదియ మరియు సుంటుకేలో ఏమి జరగాలని పౌలు కోరుకుంటున్నాడు?

ప్రభువులో యువొదియ మరియు సుంటుకే ఏక మనస్సు కలిగి ఉండాలని పౌలు కోరుకున్నాడు.

Philippians 4:4-5

ఫిలిప్పీయులకు ఎల్లప్పుడూ ఏమి చేయమని పౌలు చెప్పాడు?

ఎల్లప్పుడు ప్రభువునందు సంతోషించుమని పౌలు వారికి చెప్పాడు.

Philippians 4:6

చింతించే బదులు, ఏమి చేయమని పౌలు చెప్పాడు?

చింతతో ఉండకుండా, మనకు అవసరమైన వాటిని గురించి ప్రార్థనలో దేవునికి చెప్పాలి మరియు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని పౌలు చెప్పాడు.

Philippians 4:7

మనం ఈ విధంగా చేసిన యెడల, మన హృదయాలను మరియు ఆలోచనలను ఏది కాపాడుతుంది?

మనం ఈ విధంగా చేసిన యెడల, దేవుని సమాధానం మన హృదయాలను మరియు ఆలోచనలను కాపాడుతుంది

Philippians 4:8-9

పౌలు ఎలాంటి విషయాలను గురించి ఆలోచించమని చెప్పాడు?

ఘనమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, మనోహరమైనవి, మంచి పేరు గలిగినవి, శ్రేష్టమైనవి మరియు ప్రశంసనీయమైన వాటి గురించి ఆలోచించమని పౌలు చెప్పాడు.

Philippians 4:10

ఫిలిప్పీయులు ఇప్పుడు ఏమి పునరుద్ధరించగలిగారు?

ఫిలిప్పీయులు ఇప్పుడు పౌలు పట్ల తమ ఆందోళనను పునరుద్ధరించుకోగలిగారు.

Philippians 4:11

విభిన్న పరిస్థితులలో జీవించడం గురించి పౌలు ఏ రహస్యాలను నేర్చుకున్నాడు?

సమృద్ధి మరియు అవసరం రెండింటిలోనూ సంతృప్తిగా జీవించే రహస్యాన్ని పౌలు నేర్చుకున్నాడు.

Philippians 4:12

విభిన్న పరిస్థితులలో జీవించడం గురించి పౌలు ఏ రహస్యాలను నేర్చుకున్నాడు?

సమృద్ధి మరియు అవసరం రెండింటిలోనూ సంతృప్తిగా జీవించే రహస్యాన్ని పౌలు నేర్చుకున్నాడు.

Philippians 4:13-16

పౌలు ఏ శక్తితో సంతృప్తిగా జీవించగలడు?

పౌలు తనను బలపరిచే క్రీస్తు ద్వారా అన్ని పరిస్థితులలో సంతృప్తిగా జీవించగలడు.

Philippians 4:17

పౌలు తన అవసరాలను తీర్చడానికి ఫిలిప్పీయుల కోసం ఏమి కోరుకుంటాడు?

పౌలు ఫిలిప్పీయుల ఖాతాకు వృద్ధి చెందే ఫలాన్ని వెదకుతున్నాడు.

Philippians 4:18

పౌలుకు ఫిలిప్పీయులు చేసిన బహుమానాన్ని దేవుడు ఏ విధంగా చూస్తాడు?

ఫిలిప్పీయులు పౌలుకు చేసిన బహుమానం పట్ల దేవుడు సంతోషించాడు.

Philippians 4:19-21

ఫిలిప్పీయుల కోసం దేవుడు ఏమి చేస్తాడని పౌలు చెప్పాడు?

దేవుడు క్రీస్తు యేసు నందు మహిమలో తన ఐశ్వర్యమును బట్టి ఫిలిప్పీయుల ప్రతి అవసరతను తీర్చునని పౌలు చెప్పాడు.

Philippians 4:22-23

ఏ ఇంటివారు ఫిలిప్పీయులకు శుభాకాంక్షలు చెప్పారని పౌలు చెప్పాడు?

కైసరు ఇంటివారు ఫిలిప్పీయులకు శుభములు చెప్పారు.