Jude
Jude 1
Jude 1:1
యూదా ఎవరికి సేవకుడు?
యూదా యేసుక్రీస్తు సేవకుడు.
యూదా సోదరుడు ఎవరు?
యూదా యాకోబు సోదరుడు.
యూదా ఎవరికి వ్రాసాడు?
పిలవబడిన, తండ్రియైన దేవునిలో ప్రియులు, మరియు యేసుక్రీస్తు కోసం దాచబడిన వారికి అతడు వ్రాసాడు.
Jude 1:2
యూదా తాను వ్రాసిన వారికి ఏమి విస్తరించబడాలని యూదా కోరుకున్నాడు?
కరుణ, సమాధానం మరియు ప్రేమ విస్తరించబడాలని యూదా కోరుకున్నాడు.
Jude 1:3
యూదా మొదట దేని గురించి రాయాలనుకున్నాడు?
వారి ఉమ్మడి రక్షణ గురించి యూదా మొదట వ్రాయాలనుకున్నాడు.
వాస్తవానికి యూదా దేని గురించి రాశాడు?
వాస్తవానికి పరిశుద్ధుల యొక్క విశ్వాసం కోసం పోరాడవలసిన అవసరాన్ని గురించి వ్రాసాడు.
Jude 1:4
ఖండించబడిన మరియు భక్తిహీనులైన కొందరు మనుష్యులు ఏవిధంగా వచ్చారు?
ఖండించబడిన మరియు భక్తిహీనులైన కొందరు మనుష్యులు దొంగతనంగా వచ్చారు.
ఖండించబడిన మరియు భక్తిహీనులు ఏమి చేసారు?
వారు దేవుని కృపను లైంగిక దుర్నీతిగా మార్చారు మరియు యేసుక్రీస్తును తిరస్కరించారు.
Jude 1:5
ప్రభువు ఒకప్పుడు మనుష్యులను ఎక్కడ నుండి రక్షించాడు?
ఐగుప్తు దేశం నుండి ప్రభువు వారిని రక్షించాడు.
విశ్వసించని మనుష్యులకు ప్రభువు ఏమి చేసాడు?
విశ్వసించని మనుష్యులను ప్రభువు నాశనం చేశాడు
Jude 1:6
సరైన స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలను ప్రభువు ఏమి చేసాడు?
తీర్పు కోసం ప్రభువు వారిని చీకటిలో బంధించాడు.
Jude 1:7
సొదొమ, గొమొర్రా, వాటి చుట్టుపక్కల నగరాలు ఏమి చేశాయి?
వారు వ్యభిచారం చేసారు మరియు అసహజమైన కోరికలను అనుసరించారు.
Jude 1:8
సొదొమ, గొమొర్రా, వాటి చుట్టుపక్కల నగరాలవలె, ఖండించబడిన మరియు భక్తిహీనులు ఏమి చేస్తారు?
వారు తమ కలలలో తమ శరీరాలను కలుషితం చేసుకొంటారు, అధికారాన్ని తిరస్కరిస్తారు మరియు దుష్ట సంగతులు చెపుతారు.
Jude 1:9-11
ప్రధాన దేవదూత మిఖాయేలు సాతానుతో ఏమి చెప్పాడు?
ప్రధాన దేవదూత మిఖాయేలు, "ప్రభువు నిన్ను గద్దించును గాక" అన్నాడు.
Jude 1:12-13
ఖండించబడిన మరియు భక్తిహీనులు ఎవరి కోసం సిగ్గు లేకుండా పట్టించుకొంటారు?
వారు సిగ్గు లేకుండా తమను తాము పట్టించుకొంటారు
Jude 1:14
హనోకు ఆదాము నుండి ఏ ప్రదేశంలో ఉన్నాడు?
హనోకు ఆదాము నుండి ఏడవ వరుసలో ఉన్నాడు.
Jude 1:15
ప్రభువు ఎవరి మీద తీర్పును అమలు చేస్తాడు?
ప్రజలందరి మీద తీర్పును ప్రభువు అమలు చేస్తాడు.
Jude 1:16
దోషులుగా నిర్ధారించబడే భక్తిహీనులు ఎవరు?
గుసగుసలాడేవారు, ఫిర్యాదులు చేసేవారు, తమ చెడు కోరికలను అనుసరించే వారు, బిగ్గరగా ప్రగల్భాలు పలికేవారు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొగిడే వారు దోషులుగా నిర్ధారించబడతారు.
Jude 1:17-18
అపహాసకులను గురించి గతంలో ఎవరు మాట్లాడారు?
ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు అపహాసకులను గురించి గతంలో మాటలు చెప్పారు.
Jude 1:19
తమ సొంత భక్తి హీన మోహపు కోరికలను అనుసరించి, విభజనలు కలిగించి మరియు కామాతురముగా ఉన్న అపహాసకుల విషయంలో వాస్తవం ఏమిటి?
వారు పరిశుద్ధాత్మను కలిగి యుండలేదు.
Jude 1:20
ప్రియులైన వారు తమను తాము ఎలా నిర్మించుకొని ప్రార్థిస్తున్నారు?
ప్రియులైన వారు తమ అత్యంత పరిశుద్ధమైన విశ్వాసంలో తమను తాము నిర్మించుకున్నారు మరియు పవిత్రాత్మలో ప్రార్థించారు.
Jude 1:21
ప్రియులైన వారు తమను తాము దేనిలో ఉంచుకొంటారు మరియు దేని కోసం వెదకుతారు?
ప్రియులైన వారు దేవుని ప్రేమలో మరియు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కరుణలో తమలో తాము ఉంచుకొంటారు, వాటిని వెదకుతారు.
Jude 1:22
ప్రియులైన వారు ఎవరి మీద కరుణ కలిగి యుండాలి, ఎవరిని రక్షించాలీ?
సందేహంలో ఉన్నవారిని లేదా శరీరం చేత మచ్చలు పడిన దుస్తులు కలవారు, మరియు అగ్నిలో ఉన్నవారిని కరునించాలి మరియు రక్షించవలసి ఉంది.
Jude 1:23
ప్రియులైన వారు ఎవరి మీద కరుణ కలిగి యుండాలి, ఎవరిని రక్షించాలీ?
సందేహంలో ఉన్నవారిని లేదా శరీరం చేత మచ్చలు పడిన దుస్తులు కలవారు, మరియు అగ్నిలో ఉన్నవారిని కరుణించి మరియు రక్షించవలసి ఉంది.
Jude 1:24
వారి రక్షకుడైన దేవుడు, వారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేయగలిగాడు?
దేవుడు వారిని తొట్రుపడకుండా కాపాడగలిగాడు మరియు కళంకం లేకుండా తన మహిమ సన్నిధికి వారిని ఉంచగలిగాడు.
Jude 1:25
వారి రక్షకుడైన దేవుడు, వారి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేయగలిగాడు?
దేవుడు వారిని తొట్రుపడకుండా కాపాడగలిగాడు మరియు కళంకం లేకుండా తన మహిమ సన్నిధికి వారిని ఉంచగలిగాడు.
దేవుడు మహిమను ఎప్పుడు కలిగియున్నాడు?
సమస్త కాలాలకు ముందు మరియు ఎప్పటికీ దేవుడు మహిమను కలిగి ఉన్నాడు