Hebrews
Hebrews 1
Hebrews 1:1-3
చాలా కాలం క్రితం దేవుడు ఎలా మాట్లాడాడు?
చాలా కాలం క్రితం దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు[1:1].
ఈ చివరి రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడాడు?
దేవుడు ఈ చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు[1:2].
ఎవరి ద్వారా విశ్వం సృజించడం జరిగింది?
కుమారుని ద్వారానే దేవుడు ఈ విశ్వాన్ని సృజించాడు[1:22].
సమస్తం ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది?
ఆయన బలప్రభావాలు గల తన వాక్కు చేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు[1:3].
దేవుని మహిమను, స్వభావాన్ని కుమారుడు ఏ విధంగా కనుపరుస్తున్నాడు?
కుమారుడే దేవుని మహిమతేజస్సు , దేవుని స్వభావ స్వరూపం[1:3].
Hebrews 1:4-5
దేవుని కుమారునికి దేవదూతలతో పోలిక ఏమిటి?
దేవుని కుమారుడు దేవదూతలకంటే శ్రేష్టుడు[1:4].
Hebrews 1:6-7
కుమారుణ్ణి లోకంలోకి రప్పించినప్పుడు దేవదూతలను ఏమి చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించాడు?
కుమారుణ్ణి లోకంలోకి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనను ఆరాధించాలని దేవుడు ఆజ్ఞాపించాడు[1:6].
Hebrews 1:8-9
కుమారుడు రాజుగా ఎంతకాలం పరిపాలన చేస్తాడు?
కుమారుడు రాజుగా శాశ్వతకాలం పరిపాలన చేస్తాడు[1:8].
కుమారుడు దేన్ని ప్రేమిస్తాడు, దేన్ని ద్వేషిస్తాడు?
కుమారుడు నీతిని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు[1:9].
Hebrews 1:10-12
కాలం గతించిన తరువాత భూమికి, ఆకాశానికి ఏమి జరుగుతుంది?
ఆకాశం, భూమి వస్త్రం లాగా పాతబడిపోతాయి[1:10-11].
Hebrews 1:13-14
ఏమి జరిగేంత వరకు దేవుడు కుమారుని తన కుడివైపున కూర్చుండమని చెప్పాడు?
కుమారుని శత్రువులను తన పాదాల క్రింద పీఠంగా దేవుడు చేసే వరకు కుమారుని తన కుడి వైపున కూర్చోమని దేవుడు చెప్పాడు [1:13].
దేవదూతలకు శారీరక దేహాలుంటాయా?
లేదు. దేవదూతలు ఆత్మలు[1:7,14].
ఎవరి గురించి దేవదూతలు శ్రద్ధ తీసుకుంటారు?
రక్షణ అనే స్వాస్థ్యాన్నిపొందబోయే వారి గురించి దేవదూతలు శ్రద్ధ తీసుకుంటారు[1:14].
Hebrews 2
Hebrews 2:1
ఎందుకు విశ్వాసులు తాము విన్నదాని గురించి శ్రద్ధ తీసుకోవాలి?
విశ్వాసులు తాము విన్న సంగతులనుంచి కొట్టుకు పోకుండా శ్రద్ధ తీసుకోవాలి[2:1].
Hebrews 2:2-4
ప్రతీ అతిక్రమం, అవిధేయత ఏమి పొందుతాయి?
ప్రతీ అతిక్రమం, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతాయి[2:2].
ప్రభువు ప్రకటించిన సువార్తకు దేవుడు ఎలా సాక్ష్యం ఇచ్చాడు?
దేవుడు సూచకక్రియలూ వింతలూ శక్తివంతమైన క్రియలూ పరిశుద్ధాత్మ వరాల చేత సువార్తకు సాక్ష్యం ఇచ్చాడు[2:4].
Hebrews 2:5-6
రానున్న లోకాన్ని ఎవరు పాలించరు?
రానున్న లోకాన్నిదేవదూతలు పాలించరు[2:5].
Hebrews 2:7-8
రానున్న లోకాన్ని ఎవరు పాలిస్తారు?
నరపుత్రుడు రానున్న లోకాన్ని పాలిస్తాడు[2:6-8].
Hebrews 2:9-10
ఎవరి నిమిత్తం యేసు మరణాన్ని రుచి చూసాడు?
ప్రతిఒక్కరి నిమిత్తం యేసు మరణాన్ని రుచి చూసాడు[2:9].
ఎవరిని మహిమలోకి తేవాలని దేవుడు తలంచాడు?
అనేకమంది కుమారులను మహిమలోకి తేవాలని దేవుడు తలంచాడు[2:10].
Hebrews 2:11-12
ఏ ఇద్దరు ఒకే ఆధారం, దేవుని నుంచి వస్తారు?
పరిశుద్ధ పరచేవాడు, పరిశుద్ధత పొందేవారు ఒకే ఆధారం, దేవుని నుంచి వస్తారు [2:11].
Hebrews 2:13-15
యేసు మరణం ద్వారా ఎవరు శక్తిహీనుడయ్యాడు?
యేసు మరణం ద్వారా సాతాను శక్తిహీనుడయ్యాడు[2:14].
యేసు మరణం ద్వారా ఎలాంటి బానిసత్వం నుంచి మనుషులు విడుదల పొందారు?
యేసు మరణం ద్వారా మరణభయం నుంచి మనుషులు విడుదల పొందారు[2:15].
Hebrews 2:16-18
ఎందుకు యేసు అన్నింటిలో తన సోదరులలాంటివాడుగా ఉండవలసి వచ్చింది?
ఆయన దేవుని విషయాలలో జాలిగల నమ్మకమైన యాజకుడయ్యే నిమిత్తం, ప్రజల పాపాలకు క్షమాపణ కలగజేయాలని యేసు అన్నింటిలో తన సోదరులలాంటివాడుగా ఉండవలసి వచ్చింది[2:17].
శోధనలకు గురి అయిన వారికి యేసు సాయం చెయ్యగలిగినవాడు ఎలా అయ్యాడు?
యేసు శోధనలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక శోధనలకు గురి అయినవారికి సాయం చెయ్యగలిగినవాడు అయ్యాడు[2:18].
Hebrews 3
Hebrews 3:1-4
హెబ్రీ గ్రంథకర్త యేసుకు ఇచ్చిన రెండు బిరుదులేంటి?
అపొస్తలుడు, ప్రధానయజకుడు అని గ్రంధకర్త యేసుకు బిరుదులు ఇచ్చాడు[3:1].
మోషే కంటే యేసు ఎక్కువ గౌరవానికి తగినవాడుగా ఎందుకు లెక్కకు వచ్చాడు?
మోషే దేవుని యిల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, యేసు యింటిని నిర్మించాడు కనుక యేసు మోషే కంటే ఎక్కువ గౌరవానికి తగినవాడుగా లెక్కకు వచ్చాడు[3:2-3].
Hebrews 3:5-6
దేవుని ఇంటిలో మోషే పాత్ర ఏమిటి?
దేవుని ఇంటిలో మోషే ఒక సేవకుడు[3:5].
మోషే దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు?
మోషే తరువాత చెప్పబోతున్నదాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు[3:5].
దేవుని ఇంటిలో యేసు పాత్ర ఏమిటి?
యేసు దేవుని ఇంటిమీద అధికారి[3:6].
దేవుని ఇల్లు ఎవరు?
విశ్వాసులు అంతం వరకు తమ ధైర్యాన్నిగట్టిగా పట్టుకొన్నారంటే వారే ఆయన ఇల్లు[3:6].
Hebrews 3:7-8
అరణ్యంలో దేవుని స్వరాన్ని వినినపుడు ఇశ్రాయేలీయులు ఏమి చేసారు?
ఇశ్రాయేలీయులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు[3:7-8].
Hebrews 3:9-11
ఇశ్రాయేలీయులు తమ హృదయాలలో తప్పిపోయిన వారి విషయం దేవుడు ఏమని ప్రమాణం చేసాడు?
వారు విశ్రాంతిలో ప్రవేసించరని దేవుడు ప్రమాణం చేసాడు[3:10-11].
Hebrews 3:12-13
దేని విషయం సోదరులకు హెచ్చరిక ఇవ్వటం జరిగింది?
నమ్మకంలేని హృదయం ద్వారా దేవుని నుండి తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని సోదరులకు హెచ్చరిక ఇవ్వటం జరిగింది[3:12].
పాపం ద్వారా కలిగే మోసం చేత కఠినులు కాకుండా ఉండటానికి సోదరులు ఏమి చెయ్యాలి?
అనుదినం సోదరులు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొంటూ ఉండాలి[3:13].
Hebrews 3:14-15
క్రీస్తులో పాలిభాగస్తులుగా విశ్వాసులు ఏమి చెయ్యాలి?
క్రీస్తులో పాలిభాగస్తులుగా విశ్వాసులు మొదట వారికున్న ధైర్యాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టాలి[3:14].
Hebrews 3:16-19
ఎవరి విషయం దేవుడు నలభై సంవత్సరాలు కోపగించుకున్నాడు?
అరణ్యంలో పాపం చేసినవారి విషయం దేవుడు నలభై సంవత్సరాలు కోపగించుకున్నాడు[3:17].
దేవుడు కోపపడిన వారికి ఏమి జరిగింది?
వారి మృత దేహాలు అరణ్యంలో కూలిపోయాయి[3:17].
అవిధేయులైన ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించలేక పోయారు?
అవిధేయులైన ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసం కారణంగా దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేక పోయారు[3:19].
Hebrews 4
Hebrews 4:1-2
విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ వినిన శుభవార్త ఏమిటి?
విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త విన్నారు[4:2].
దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త ఇశ్రాయేలీయులకు ఎందుకు ప్రయోజనకరంగా లేదు?
ఇశ్రాయేలీయులకు అ శుభవార్త మీద నమ్మకం కుదరలేదు కనుక వారికి ప్రయోజనకరంగా లేదు[4:2].
Hebrews 4:3-5
దేవుని విశ్రాంతిలో ప్రవేశించేదెవరు?
శుభవార్తను విని దానిని విశ్వసించినవారు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు [4:2-3].
దేవుడు తాను సృష్టించిన వాటిని ఎప్పుడు సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు?
దేవుడు తాను సృష్టించిన వాటిని జగత్తుకు పునాది వేయబడినప్పుడే సంపూర్తి చేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు[4:3-4].
దేవుడు ఇశ్రాయేలీయుల గురించి తన విశ్రాంతి గురించి ఏమిచెప్పాడు?
ఇశ్రాయేలీయులు తన విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు[4:5].
Hebrews 4:6-7
తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు ఏ దినం నిర్ణయించాడు?
తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు "ఈ రోజు" నిర్ణయించాడు(4:7).
దేవుని విశ్రాంతిలోకి ప్రవేసించడానికి ఎవరైనా ఏమి చేయాలి?
దేవుని స్వరం విని హృదయం కఠినం చేసుకోకుండా ఉండాలి.
Hebrews 4:8-11
దేవుని ప్రజలకు నిలిచియున్న దేమిటి?
దేవుని ప్రజలకు సబ్బాతు విశ్రాంతి నిలిచి ఉంది[4:9].
దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు దేనినుండి విశ్రాంతి పొందుతాడు?
దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు తన కార్యాలనుండి విశ్రాంతి పొందుతాడు[4:10].
దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి విశ్వాసులు ఎందుకు ఆతురపడాలి?
ఇశ్రాయేలీయులు చేసినట్టు పడిపోకుండా దేవుని విశ్రాంతిలో ప్రవేశించదానికి విశ్వాసులు ఆశపడాలి[4:11].
Hebrews 4:12-13
దేవుని వాక్యం దేనికంటే వాడిగలది?
దేవుని వాక్యం ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడిగలది[4:12].
దేవుని వాక్యం దేన్ని విభజించటానికి శక్తి కలది?
దేవుని వాక్యం ప్రాణాన్నీ, ఆత్మనూ విభజిస్తూ, కీళ్ళనూ మూలుగునూ వేరు చేస్తుంది[4:12].
దేవుని వాక్యం వేటిని శోధించ గలదు?
దేవుని వాక్యం తలంపులను ఆలోచనలను శోధించగలదు[4:12].
దేవుని దృష్టికి కనిపించనిది ఏది?
సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు[4:13].
Hebrews 4:14-16
విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు ఎవరు?
దేవుని కుమారుడైన యేసు విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు[4:14].
విశ్వాసుసుల బలహీనతలలో యేసు ఎందుకు సానుభూతి చూపుతున్నాడు?
అన్నివిషయాలలో ఆయన శోధనలకు గురి అయ్యాడు కనుక విశ్వాసుసుల బలహీనతలలో యేసు సానుభూతి చూపుతున్నాడు[4:15].
యేసు ఎన్ని సార్లు పాపం చేసాడు?
ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు[4:15].
అవసర సమయాలలో కరుణ, కృప పొందటానికి విశ్వాసులు ఏమి చెయ్యాలి?
అవసర సమయాలలో విశ్వాసులు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి చేరాలి[4:16].
Hebrews 5
Hebrews 5:1-3
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల పక్షంగా ఏమి చేస్తాడు?
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం అర్పణలు, బలులు అర్పిస్తాడు[5:1].
ప్రజలకు కోసం అర్పించటానికి అదనంగా ప్రధాన యాజకుడు ఎవరి కోసం అర్పణలు అర్పిస్తాడు ?
ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం కూడా బలులు అర్పిస్తాడు[5:3].
Hebrews 5:4-5
దేవుని ప్రదానయాజకుని ఘనత ఒక వ్యక్తి ఎలా తీసుకుంటాడు?
అతడు ప్రదానయాజకునిగా ఉండుటకు దేవుని పిలుపు పొందినవాడై ఉండాలి [5:4].
ప్రధాన యాజకునిగా క్రీస్తును ఎవరు ప్రకటించారు?
క్రీస్తును ప్రధానయాజకునిగా దేవుడు ప్రకటించాడు[5:5,10].
Hebrews 5:6
క్రీస్తు దేవుని ప్రధానయాజకునిగా ఎంతకాలముంటాడు?
క్రీస్తు దేవుని ప్రధానయాజకునిగా నిరంతరం ఉంటాడు[5:6].
ఏ వరుస క్రమం చొప్పున క్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు?
మెల్కీసెదెకు వరుస ప్రకారం క్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు[5:6,10].
Hebrews 5:7-8
క్రీస్తు ప్రార్ధనలను దేవుడు ఎందుకు విన్నాడు?
క్రీస్తుకున్న భయభక్తులను బట్టి ఆయన ప్రార్ధనలను దేవుడు విన్నాడు[5:7].
క్రీస్తు విధేయత ఎలా నేర్చుకున్నాడు?
తాను పొందిన శ్రమల వలన క్రీస్తు విధేయతను నేర్చుకున్నాడు[5:8].
Hebrews 5:9-11
ఎవరి కోసం క్రీస్తు శాశ్విత రక్షణకు కారకుడయ్యాడు?
తనకు విధేయత చూపిన వారికోసం క్రీస్తు శాశ్విత రక్షణకు కారకుడయ్యాడు[5:9].
ఈ లేఖను పొందినవారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది?
ఈ లేఖను పొందినవారు వినడంలో మందబుద్దులయ్యారు, దేవోక్తులలో ఉన్న మొదటి పాఠాలు నేర్చుకొనవలసిన వారుగా ఉన్నారు[5:11-12].
Hebrews 5:12-14
విశ్వాసులు ఆత్మీయంగా పసిపిల్లలు నుండి ఎదిగిన పెద్దల వలె ఎలా ఎదుగుతారని పత్రిక రచయిత చెపుతున్నాడు?
విశ్వాసులు మంచిచెడ్డలు గుర్తించడం సాధన చెయ్యడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతారు[5:14].
Hebrews 6
Hebrews 6:1-3
హెబ్రీ గ్రంధకర్త విశ్వాసులను ఏవిషయంలో ముందుకు సాగాలని కోరుతున్నాడు?
హెబ్రీ గ్రంధకర్త విశ్వాసులను సంపూర్ణతకు ముందుకు సాగాలని కోరుతున్నాడు[6:1].
క్రీస్తు సందేశానికి ఆధారంగా హెబ్రీ గ్రంధకర్త చూపుతున్న బోధల జాబితా ఏది?
నిర్జీవక్రియల విషయం పశ్చాత్తాపం, దేవునిమీద నమ్మకం, బాప్తిస్మం, చేతులుంచడం, చనిపోయినవారు లేవడమూ, శాశ్వతమైన తీర్పులు మొదలైనవి పునాది బోధలు[6:1-2].
Hebrews 6:4-6
ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారు ఏమి కావడం అసాధ్యం?
ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం[6:4-6].
వెలుగొందిన ఈ ప్రజలు ఏమి రుచి చూసారు?
వెలుగొందిన ఈ ప్రజలు పరలోక వరాన్ని, దేవుని వాక్కును, రానున్న యుగప్రభావాలను రుచి చూసారు[6:4-5].
ఈ ప్రజలు పశ్చాత్తాపడేలా ఎందుకు సాధ్యం కావడం లేదు?
వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసారు కాబట్టి వారు పశ్చాత్తాపడేలా సాధ్యం కావడం లేదు[6:6].
Hebrews 6:7-8
రచయిత సాదృశ్యంలో వర్షాన్ని పొంది, ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే ఆ భూమికి ఏమి జరుగుతుంది?
వర్షాన్ని పొంది, ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే ఆ భూమి కాల్చివేయడం జరుగుతుంది[6:7-8].
Hebrews 6:9-10
తాను రాస్తున్న విశ్వాసుల విషయం రచయిత ఏమి కోరుతున్నాడు?
ఈ విశ్వాసులనుండి రక్షణ గురించిన శ్రేష్టమైన విషయాలకోసం రచయత ఎదురుచూస్తున్నాడు[6:9].
ఈ విశ్వాసుల విషయంలో దేవుడు ఏమి మరచిపోడు?
వారు చేసిన పనిని, వారి ప్రేమను, పరిశుద్ధులకు వారు చేసిన సేవను దేవుడు మరచిపోడు[6:10].
Hebrews 6:11-12
దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విషయంలో విశ్వాసులు దేన్ని అనుకరించాలి?
దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విశ్వాసంను, ఓర్పును విశ్వాసులు అనుకరించాలి[6:12].
Hebrews 6:13-15
దేవుడు తనకు చేసిన వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఏమి చేయాలి?
దేవుడు తనకు వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఓపికతో ఎదురుచూడాలి[6:13-15].
Hebrews 6:16-18
దేవుడు తన వాగ్దానాన్నిఎందుకు ప్రమాణం ద్వారా స్థిరపరచాడు?
మార్పుచెందని తన ఉద్దేశాన్ని చూపించటానికి దేవుడు తన వాగ్దానాన్ని ప్రమాణం ద్వారా స్థిరపరచాడు[6:17].
దేవునికి ఏది అసాధ్యం?
దేవుడు అబద్ధమాడటం అసాధ్యం[6:18].
Hebrews 6:19-20
దేవునిలో విశ్వాసి నమ్మకం అతని ఆత్మకు ఏమి చేస్తుంది?
దేవునిలో విశ్వాసి నమ్మకం అతని ఆత్మకు భద్రమైనది, సుస్థిరమైన లంగరు వంటిది[6:19].
విశ్వాసులకు ముందుగా వెళ్ళిన వాడుగా యేసు ఎక్కడ ప్రవేశించాడు?
యేసు విశ్వాసుల కోసం ముందుగా తెర వెనుకకు ప్రవేశించాడు[6:20].
Hebrews 7
Hebrews 7:1-3
మెల్కీసెదెక్ కు ఇచ్చిన రెండు బిరుదులేంటి?
మెల్కీసెదెక్ కు షాలేం పట్టణ రాజు, మహోన్నతుడైన దేవుని యాజకుడు అని పేర్లు [7:1].
అబ్రాహాము మెల్కీసెదెక్ కు ఏమి ఇచ్చాడు?
అబ్రాహాము మెల్కీసెదెక్ కు అన్నింటిలో పదవ వంతు ఇచ్చాడు[7:2].
మెల్కీసెదెక్ అనే పేరుకు అర్ధమేమిటి?
మెల్కీసెదెక్ అనే పేరుకు "నీతికి రాజు" అని "శాంతి రాజు" అని అర్ధం[7:2].
మెల్కీసెదెక్ పితరులు ఎవరు, అతను ఎప్పుడు చనిపోయాడు?
మెల్కీసెదెక్ పితరులు లేనివాడు, తన జీవానికి అంతము లేనివాడు[7:3].
Hebrews 7:4-6
ఎవరి సంతానంలో నుంచి యాజకులు వచ్చారు, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు ఎవరు. ప్రజలనుంచి పదవ వంతు ఎవరు పోగు చేస్తారు?
ధర్మశాస్త్ర యాజకులు లేవి, అబ్రాహాము సంతానం నుంచి వచ్చారు[7:5].
Hebrews 7:7-10
అబ్రాహాము, మెల్కీసెదెక్ లలో ఎవరు గొప్పవారు?
మెల్కీసెదెక్ గొప్పవాడు ఎందుకంటే అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు[7:7].
ఏవిధంగా లేవి కూడా మెల్కీసెదెక్ దశమ భాగాన్ని ఇచ్చాడు?
లేవి మెల్కీసెదెక్ దశమ భాగాన్ని చెల్లించాడు, ఎలాగంటే అబ్రాహాము మెల్కీసెదెక్ దశమ భాగాన్ని ఇచ్చినపుడు లేవి అబ్రాహాము గర్భంలోనే ఉన్నాడు[7:9-10].
Hebrews 7:11-12
మెల్కీసెదెకు వరుసక్రమంలో మరొక యాజకుడు ఎందుకు కావలసి వచ్చింది?
మెల్కీసెదెకు వరుసక్రమంలో మరొక యాజకుడు కావలసి వచ్చింది ఎందుకంటే లేవియాజక ధర్మం ద్వారా సంపూర్ణత సాధ్యం కాలేదు[7:11].
యాజక ధర్మం మారినపుడు ఏమి మార్పుచెందాలి?
యాజక ధర్మం మారినపుడు ధర్మశాస్త్రం కూడా మారడం అవసరం[7:12].
Hebrews 7:13-14
ఏ గోత్రం నుండి యేసు వచ్చాడు, అతని గోత్రం బలిపీఠం వద్ద ఇంతకు ముందు యాజక ధర్మం చేసారా?
యూదా గోత్రం నుండి యేసు వచ్చాడు, యూదా గోత్రం బలిపీఠం వద్ద ఇంతకు ముందు యాజక ధర్మం చేయలేదు[7:14].
Hebrews 7:15-17
దేనిప్రకారం యేసు మెల్కీసెదెక్ వరుసక్రమంలో యాజకుడయ్యాడు?
అంతం లేని జీవానికున్న బలం ప్రకారమే యేసు మెల్కీసెదెక్ వరుసక్రమంలో యాజకుడయ్యాడు[7:16].
Hebrews 7:18-19
బలహీనమైనది, పనికిమాలినిది అయిన ఏది ప్రక్కన పెట్టడం జరిగింది?
బలహీనమైనది, పనికిమాలినిది అయిన ధర్మశాస్త్రం, మునుపు ఉన్న ఆజ్ఞ ప్రక్కన పెట్టడం జరిగింది[7:18-19].
Hebrews 7:20-21
క్రీస్తులో విశ్వాసులకున్న దానిని దేవుడెలా శ్రేష్టమైన విశ్వాసంగా స్థిరపరచాడు?
యేసు శాశ్వతం యాజకుడిగా ఉంటాడనే ప్రమాణం చెయ్యటం ద్వారా క్రీస్తులో విశ్వాసులకున్న దానిని దేవుడు శ్రేష్టమైన విశ్వాసంగా స్థిరపరచాడు[7:19-21].
Hebrews 7:22-24
యేసు దేన్ని ఖాయం చేసాడు?
శ్రేష్టమైన నిబంధనను యేసు ఖాయపరచాడు[7:22].
Hebrews 7:25-26
తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు ఏవిధంగా శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు?
తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనలు చెయ్యడానికి ఆయన ఎప్పటికి జీవిస్తూ ఉన్నాడు[7:25].
యేసు విశ్వాసులకు తగిన యాజకుడిగా ఉండటానికి ఉన్న నాలుగు లక్షణాలు ఏమిటి?
యేసు పాపం లేనివాడు, నిర్దోషి, కళంకం లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు[7:26].
Hebrews 7:27-28
ప్రజల పాపం కోసం యేసు ఏమి అర్పించాడు?
ప్రజల పాపం కోసం యేసు తనను తాను ఒక్కసారే అర్పించుకొన్నాడు[7:27].
యేసు తనకు తాను ఎలాంటి అర్పణ అర్పించుకోవాల్సి వచ్చింది?
యేసు పాపం లేనివాడు కనుక తనకు తాను ఎలాంటి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదు[7:26-27].
ధర్మశాస్త్రం ద్వారా నియమితులైన యాజకులకు యేసు ఏవిధంగా భిన్నమైనవాడు?
ధర్మశాస్త్రం ద్వారా నియమితులైన యాజకులు బలహీనులు, అయితే యేసు శాశ్వితంగా సంపూర్ణసిద్ధి పొందినవాడు[7:28].
Hebrews 8
Hebrews 8:1-2
విశ్వాసుల ప్రధానయాజకుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు?
విశ్వాసుల ప్రధానయాజకుడు పరలోకంలో ఉన్న మహాఘనుడైన దేవుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు[8:1].
నిజమైన గుడారం ఎక్కడ ఉంది?
నిజమైన గుడారం పరలోకంలో ఉంది[8:2].
Hebrews 8:3-5
ప్రతీ యాజకునికి ఏమి ఉండాలి?
ప్రతీ యజకునికి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి[8:3].
ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు ఎక్కడ ఉన్నారు?
ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు భూమి మీద ఉన్నారు[8:4].
భూమి మీద ఉన్న యాజకులు దేనికి సేవ చేయాలి?
భూమి మీద ఉన్న యాజకులు పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న ఆరాధనా గుడారంలో సేవ చేయాలి[8:5].
ఏ పద్ధతి ప్రకారం భూసంబంధమైన గుడారం నిర్మాణం జరిగింది?
దేవుడు మోషేకు పర్వతం మీద చెప్పిన పద్ధతి ప్రకారం భూసంబంధమైన గుడారం నిర్మాణం జరిగింది[8:5].
Hebrews 8:6-7
క్రీస్తుకు శ్రేష్టమైన యాజక సేవ ఎందుకు దొరికింది?
క్రీస్తుకు శ్రేష్టమైన సేవ దొరికింది ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాగ్దనాల మీద స్థాపితమైన శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు[8:6].
Hebrews 8:8-9
మొదటి నిబంధన క్రింద ఉన్న ప్రజలు లోపంలో ఉన్నప్పుడు దేవుడు వారికేం వాగ్దానం చేసాడు?
ఇశ్రాయేలు ఇంటితోను, యూదా ఇంటితోను దేవుడు నూతన నిబంధనను వాగ్దానం చేసాడు[8:8].
Hebrews 8:10
నూతన నిబంధనలో దేవుడు ఏమి చేస్తానని చెప్పాడు?
ఆయన తన శాసనాలను వారి మనసులలో రాస్తానని చెప్పాడు, వారి హృదయాలలో రాస్తానని చెప్పాడు[8:10].
Hebrews 8:11-12
నూతన నిబంధనలో ప్రభువును ఎవరు తెలుసుకుంటారు?
నూతన నిబంధనలో అల్పులైనా, ఘనులైనా వారు ప్రభువును తెలుసుకుంటారు[8:11].
నూతన నిబంధనలో ప్రజల పాపం విషయం దేవుడు ఏమిచేస్తాడని చెప్పాడు?
నూతన నిబంధనలో ప్రజల పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడని చెప్పాడు [8:11].
Hebrews 8:13
క్రొత్త నిబంధనను ప్రకటించడం చేత దేవుడు మొదటి నిబంధనను ఏమి చేసాడు?
క్రొత్త నిబంధనను ప్రకటించడం చేత దేవుడు మొదటి నిబంధనను పాతదిగా, అంతర్దానం కావడానికి సిద్ధమైనదిగా చేసాడు[8:13].
Hebrews 9
Hebrews 9:1-2
మొదటి నిబంధనకు ఆరాధన స్థలం ఏది?
మొదటి నిబంధనకు ఆరాధన స్థలం భూమి మీద గుడారం[9:1-2].
భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఏవి ఉంచారు?
భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి[9:2].
Hebrews 9:3-5
భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో ఏమి ఉన్నాయి?
భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో బంగారు ధూపార్తి, నిబంధన మందసం ఉన్నాయి[9:4].
Hebrews 9:6-7
అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఎన్ని సార్లు వెళ్తాడు, దానిలోకి ప్రవేశించటానికి ముందు ఏమి చేస్తాడు?
తన కోసం, ఇతరుల కోసం బలులు అర్పించిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే ప్రవేశిస్తాడు[9:7].
Hebrews 9:8-10
ఈ ఉత్తరాన్ని ప్రస్తుతకాలం చదివే వారికి ఇది ఏ విషయం ఉదాహరణగా ఉంది?
భూసంబంధమైన గుడారం, అర్పించిన అర్పణలు, బలులూ ప్రస్తుత కాలానికి ఉదాహరణగా ఉంది[9:9].
భూసంబంధమైన గుడారం బలులు ఏమి చెయ్యలేవు?
భూసంబంధమైన గుడారం బలులు ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు[9:9].
భూసంబంధమైన గుడారం విధులు ఎప్పటి వరకు వర్తిస్తాయి?
భూసంబంధమైన గుడారం విధులు నూతన క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి[9:10].
Hebrews 9:11-12
క్రీస్తు సేవ చేసే పవిత్ర గుడారం గురించిన ప్రత్యేకత ఏమిటి?
క్రీస్తు సేవ చేసే పవిత్ర గుడారం మరింత పరిపూర్ణమైనది, చేతులతో చేసినది కాదు, ఈ సృష్టి సంబంధమైనది కాదు[9:11].
పవిత్రమైన గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో క్రీస్తు ఏబలిని అర్పించాడు?
క్రీస్తు తన సొంత రక్తంతోనే పవిత్రమైన గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు[9:12,14].
క్రీస్తు అర్పణ ఏ కార్యాన్ని పూర్తి చేసింది?
క్రీస్తు అర్పణ ప్రతి ఒక్కరికి శాశ్వత విమోచనను అనుగ్రహించింది [9:12].
Hebrews 9:13-15
క్రీస్తు రక్తం విశ్వాసికి ఏమిచేస్తుంది?
జీవంగల దేవుని సేవకోసం విశ్వాసి మనస్సాక్షిని నిర్జీవ క్రియలనుండి శుద్ది చేస్తుంది[9:14].
క్రీస్తు దేని విషయం మధ్యవర్తి?
క్రీస్తు నూతన నిబంధనకు మధ్యవర్తి [9:15].
Hebrews 9:16-17
మరణ శాసనం చెల్లుబాటు కావడానికి ఏది అవసరం?
మరణ శాసనం చెల్లుబాటు కావడానికి మరణం అవసరం[9:17].
Hebrews 9:18-20
మొదటి నిబంధనకు ఎలాటి మరణం అవసరం?
మొదటి నిబంధనకు కోడెదూడల మరణం, మేకల మరణం అవసరం[9:18-19].
Hebrews 9:21-22
రక్తం చిందనిదే ఏమి జరగదు?
రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు[9:22].
Hebrews 9:23-24
క్రీస్తు మన పక్షంగా ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు?
ఇప్పుడు క్రీస్తు దేవుని సముఖంలో మన కోసం కనబడడానికి ఆయన పరలోకంలో ఉన్నాడు[9:24].
Hebrews 9:25-26
పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు తనను తాను ఎన్ని సార్లు అర్పించుకోవాలి?
పాపాన్ని తీసివేయడానికి యుగాల అంతంలో ఒకేసారి క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు[9:26].
Hebrews 9:27-28
ప్రతీవ్యక్తి మరణం తరువాత ఏమి జరుగుతుంది?
ప్రతీవ్యక్తి చనిపోయిన తరువాత వారు తీర్పును ఎదుర్కొంటారు[9:27].
ఏ ఉద్దేశ్యం కోసం క్రీస్తు రెండవ సారి ప్రత్యక్షమవుతాడు?
తన కోసం ఎదురు చూచేవారికి విముక్తి ప్రసాదించడానికి క్రీస్తు రెండవ సారి కనిపిస్తాడు[9:28].
Hebrews 10
Hebrews 10:1-4
క్రీస్తులోని నిజస్వరూపంతో ధర్మశాస్త్రం పోలిక ఏమిటి?
క్రీస్తులోని నిజస్వరూపానికి ధర్మశాస్త్రం ఒక నీడ మాత్రమే[10:1].
ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి?
ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు వారి పాపలను జ్ఞాపకం చేస్తున్నాయి[10:3].
ఎద్దుల రక్తం, మేకల రక్తం ఏమి చెయ్యడం అసాధ్యం?
ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం[10:4].
Hebrews 10:5-7
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఆయన కోసం ఏమిసిద్ధపరచాడు?
దేవుడు ఆయన కోసం ఒక శరీరాన్ని సిద్ధపరచాడు[10:5].
Hebrews 10:8-10
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఏఅభ్యాసాన్ని ప్రక్కన పెట్టాడు?
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించవలసిన అభ్యాసాన్ని ప్రక్కన పెట్టాడు[10:8].
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ఏ అభ్యాసాన్ని స్థిరపరచాడు?
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు క్రీస్తు శరీరాన్ని అందరికోసం అర్పించే అభ్యాసాన్ని స్థిరపరచాడు[10:10].
Hebrews 10:11-16
దేవుని కుడి వైపున కూర్చుని క్రీస్తు దేనికోసం ఎదురు చూస్తున్నాడు?
తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు[10:12-13].
క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారికి క్రీస్తు ఏమి చేసాడు?
క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారిని క్రీస్తు శాశ్వతంగా పరిపూర్ణులను చేసాడు[10:14].
Hebrews 10:17-18
పాపాలకు క్షమాపణ లేని పక్షంలో ఏది అవసరం లేదు?
పాపాలకు క్షమాపణ లేని పక్షంలో అదనపు బలులు అవసరం లేదు[10:18].
Hebrews 10:19-22
యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించగలరు?
యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలం లోకి ప్రవేశించగలరు[10:19].
విశ్వాసిలో దేని మీద ప్రోక్షణ జరిగింది, ఏది శుద్ధి అయ్యింది?
విశ్వాసి హృదయం నేరారోపణ చేయకుండా దాని మీద ప్రోక్షణ జరిగింది, శరీరం శుద్ధజలంతో శుద్ధి అయ్యింది[10:22].
Hebrews 10:23-25
విశ్వాసులు దేన్ని గట్టిగా పట్టుకోవాలి?
విశ్వాసులు తమ నిరీక్షణ విషయం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోవాలి[10:23].
ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఏమిచెయ్యాలి?
ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకొంటూ ఉండాలి[10:25].
Hebrews 10:26-27
సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతని విషయం ఏమి చేయాలి?
సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతనికి తీర్పు, దేవుని శత్రువులను దహించి వేసే అగ్ని ఉంటుంది[10:26-27].
Hebrews 10:28-29
ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే అతడు ఏమి పొందుతాడు?
ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే ఎలాంటి కరుణ లేకుండ మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న శిక్షకు మించిన శిక్షకు అతడు పాత్రుడవుతాడు[10:28-29].
Hebrews 10:30-31
పగ తీర్చటం ఎవరి వంతు?
పగ తీర్చుట దేవుని వంతు[10:30].
Hebrews 10:32-34
వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా ఈ ఉత్తరాన్ని పొందినపుడు వారు స్పందన ఎలాఉంది?
వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా దానికంటే శ్రేష్టమైన ఆస్తి పరలోకంలో వారికుందని తెలిసికొని విశ్వాసులు సంతోషంతో అంగీకరించారు[10:34].
Hebrews 10:35-37
దేవుడు వాగ్దానం చేసినది పొందేలా విశ్వాసి ఏమి చెయ్యాలి?
దేవుడు వాగ్దానం చేసినది పొందేలా విశ్వాసికి ధైర్యం, ఓర్పు అవసరం[10:35-36].
Hebrews 10:38-39
నీతిమంతుడు ఏవిధంగా జీవిస్తాడు?
నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు[10:38].
వెనుకకు తీసిన వ్యక్తి విషయం దేవుడు ఏమని తలుస్తాడు?
వెనుకకు తీసిన వ్యక్తి విషయం దేవుడు సంతోషించడు[10:38].
ఈ ఉత్తరాన్ని స్వీకరించిన వారి విషయం రచయిత ఏమి కోరుకుంటున్నాడు?
ఈ ఉత్తరాన్ని స్వీకరించిన వారు వారి ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగినవారై ఉండాలని రచయిత కోరుకుంటున్నాడు [10:39].
Hebrews 11
Hebrews 11:1-3
ఇంకా సంపూర్తి కాని దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఎలాంటి వైఖరి కలిగిఉండాలి?
ఇంకా సంపూర్తి కాని దేవుని వాగ్దానాలను విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ధైర్యంతో ఎదురు చూస్తాడు, వాటి పట్ల ఖచ్చితమైన వైఖరి కలిగి ఉంటాడు[11:1].
ప్రపంచాల్లో కనిపించే వస్తువులు దేనివలన నిర్మాణం అయ్యాయి?
ప్రపంచాల్లో కనిపించే వస్తువులు కనిపించే వస్తువులతో నిర్మాణం కాలేదు[11:3].
Hebrews 11:4
నీతిమంతుడిగా ఉన్నందుకు హెబెలును దేవుడు ఎందుకు గొప్పగా చెప్పాడు?
విశ్వాసం ద్వారా హెబెలు కయీను అర్పించిన దానికంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక దేవుడు హెబెలు విషయం గొప్పగా చెప్పాడు[11:4].
Hebrews 11:5-6
దేవుని దగ్గరకు వచ్చే వాడు దేవుని విషయం ఏమని విశ్వశించాలి?
దేవుని దగ్గరకు వచ్చే వాడు దేవుడు ఉన్నాడని, ఆయనను హృదయపూర్వకంగా వెదికే వారికి ప్రతిఫలమిస్తాడని నమ్మాలి [11:6].
Hebrews 11:7-10
నోవహు తన విశ్వాసాన్ని ఏవిధంగా కనుపరచాడు?
దేవుని హెచ్చరిక ప్రకారం తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఓడను నిర్మించడం ద్వారా నోవహు తన విశ్వాసాన్ని కనుపరచాడు[11:7].
Hebrews 11:11-12
విశ్వాసం ద్వారా అబ్రాహాము, శారాలు పొందిన వాగ్దానం ఏమిటి?
విశ్వాసం ద్వారా అబ్రాహాము, శారాలు వయసు ఉడిగినా గర్భం ధరించడానికి వాగ్దానం పొందారు[11:11].
Hebrews 11:13-14
విశ్వాసం కలిగిన పితరులందరూ దూరం నుంచి ఏమి చూసారు?
విశ్వాసం కలిగిన పితరులందరూ దూరం నుంచి దేవుని వాగ్దానాలను స్వాగతించారు [11:13].
విశ్వాసం కలిగిన పితరులందరూ తమను తాము భూమి మీద ఎలా ఎంచుకున్నారు?
విశ్వాసం కలిగిన పితరులందరూ భూమి మీద పరదేశులం, యాత్రికులం అని తమను తాము ఎంచుకున్నారు[11:13].
Hebrews 11:15-16
విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడేం సిద్ధం చేసాడు?
విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడు ఒక పరలోక నగరాన్ని సిద్ధం చేసాడు[11:16].
Hebrews 11:17
అబ్రాహాము తన ఒక్కడైయున్న కుమారుని బలి ఇచ్చినప్పటికీ, దేవుడు ఏమి చేస్తాడని నమ్మాడు?
మృతులలోనుండి తన కుమారుని లేపుతాడని అబ్రాహాము దేవుని నమ్మాడు[11:17-19].
Hebrews 11:18-19
దేవుడు మాట్లాడిన పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులు దేనికోసం బతిమాలుకొన్నారు?
మరే మాట వారితో చెప్పవద్దని ఇశ్రాయేలీయులు బతిమాలుకున్నారు [12:19].
Hebrews 11:20-22
తన అంతం సమీపంగా ఉందని యోసేపు విశ్వాసం ద్వారా ఏమని ప్రవచించాడు?
తన అంతం సమీపంగా ఉన్నప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు సంతానం నిర్గమనం గురించి యోసేపు విశ్వాసం ద్వారా ప్రవచించాడు[11:22].
Hebrews 11:23-26
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం ద్వారా ఏమిచెయ్యాలని ఎంపిక చేసుకున్నాడు?
విశ్వాసం ద్వారా మోషే పాపంతో కూడిన సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికి కోరుకున్నాడు[11:24-26].
Hebrews 11:27-28
ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని కాపాడడంకోసం విశ్వాసం ద్వారా మోషే ఏమిచేసాడు?
ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని కాపాడడంకోసం విశ్వాసం ద్వారా మోషే పస్కాను, రక్త ప్రోక్షణను ఆచరించాడు[11:28].
Hebrews 11:29-31
నశించిపోకుండా విశ్వాసం ద్వారా రాహాబు ఏమి చేసింది?
తాను నశించిపోకుండా విశ్వాసం ద్వారా రాహాబు వేగులను భద్రంగా దాచిపెట్టింది[11:31].
Hebrews 11:32-34
కొందరు పితరులు విశ్వాసం ద్వారా యుద్ధంలో ఏమి సాధించారు?
కొందరు పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, కత్తివాత పడకుండా తప్పించుకున్నారు, యుద్ధంలో వీరులయ్యారు, విదేశీసైన్యాలను పరుగులెత్తించారు[11:33-34].
Hebrews 11:35-38
కొందరు విశ్వాసవీరులు ఏ విధంగా హింసకు గురి అయ్యారు?
విశ్వాసవీరులు కొందరు హింసకు గురి అయ్యారు, వెక్కిరింపులకు, కొరడా దెబ్బలకు, సంకెళ్ళు, ఖైదులూ అనుభవించారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, రంపాలతో రెండుగా కోయడం, మరణం, పేదరికానికి గురి అయ్యారు[11:35-38].
Hebrews 11:39-40
ఈ పితరులు విశ్వాసం కలిగినావారైనప్పటికి, వారు ఈ లోక జీవితంలో ఏమి అనుభవించలేదు?
ఈ పితరులు విశ్వాసం కలిగినావారైనప్పటికి, దేవుడు వారికి చేసిన వాగ్దానాల నేరవేర్పును అనుభవించలేదు[11:39].
ఈ విశ్వాసవీరులు ఎవరితో కలిసి దేవుని వాగ్దానాలను పొందుతారు, సంపూర్ణసిద్ధి పొందుతారు?
ఈ విశ్వాసవీరులు క్రీస్తులోని నూతన నిబంధన విశ్వాసులతో కలిసి దేవుని వాగ్దానాలను పొందుతారు, సంపూర్ణ సిద్ధి పొందుతారు[11:40].
Hebrews 12
Hebrews 12:1-3
సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను ఎందుకు విశ్వాసి త్రోసిపుచ్చాలి?
ఇంత గొప్ప సాక్షి సమూహం మనచుట్టూ ఆవరించి ఉన్నందువలన సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విశ్వాసి త్రోసిపుచ్చాలి[12:1].
ఎందుకు యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు?
తనముందున్న ఆనందం కోసం యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు[12:2].
విశ్వాసి విసుకకుండా, అలసి పోకుండా ఎలా ఉండగలడు?
పాపులు తనకు వ్యతిరేకంగా చేసిన ఎదిరింపులు ఓర్చుకున్న యేసును తలపోయడం ద్వారా విశ్వాసి విసుకకుండ, అలసిపోకుండా ఉండగలడు [12:3].
Hebrews 12:4-6
తాను ప్రేమించి, స్వీకరించే వారికి ప్రభువు ఏమి చేస్తాడు?
తాను ప్రేమించి, స్వీకరించే వారిని ప్రభువు శిక్షిస్తాడు[12:6].
Hebrews 12:7-8
ప్రభువు శిక్ష లేనివారు ఎలాంటివారు?
ప్రభువు శిక్ష లేనివారు కుమారులు కాదు గాని వారు అక్రమ సంతానం[12:8].
Hebrews 12:9-13
దేవుడు తన పిల్లలను ఎందుకు శిక్షిస్తాడు?
దేవుడు తన పిల్లలు తన పవిత్రతలో పాల్గొనాలని మేలుకే శిక్షిస్తాడు[12:10].
శిక్ష ఏ ఫలాలను ఇస్తుంది?
శిక్ష నీతి అనే ఫలాలను ఇస్తుంది[12:11].
Hebrews 12:14-21
విశ్వాసులు అందరితో కలిసి దేని కోసం ప్రయత్నించాలి?
విశ్వాసులు అందరితో కలిసి సమాధానం కోసం ప్రయత్నించాలి [12:14].
ఏది ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి?
చెడు వేరు ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి[12:15].
ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు ఏమిజరిగింది?
ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు అతడు నిరాకరణకు గురి అయ్యాడు[12:17].
Hebrews 12:22-24
ఇశ్రాయేలీయులు దేవుని స్వరం వినిన పర్వతం దగ్గరకు కాక క్రీస్తునందున్న విశ్వాసులు ఎక్కడికి రావాలి?
క్రీస్తునందున్న విశ్వాసులు సీయోను పర్వతానికి, సజీవుడైన దేవుని నగరానికి రావాలి[12:22].
క్రీస్తులో ఉన్న విశ్వాసులు ఏ సంఘానికి రావాలి?
క్రీస్తులో ఉన్న విశ్వాసులు పరలోకంలో రాసి ఉన్న జ్యేష్టుల సంఘానికి రావాలి[12:23].
క్రీస్తులో ఉన్న విశ్వాసులు ఎవరి దగ్గరకు రావాలి?
క్రీస్తులో ఉన్న విశ్వాసులు అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు , న్యాయవంతుల ఆత్మల దగ్గరకు , యేసు దగ్గరకు రావాలి[12:23-24].
Hebrews 12:25-26
పరలోకంనుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగిపోయిన వాడికి ఏమి జరుగుతుంది?
పరలోకం నుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగి పోయిన వారు దేవుని నుండి తప్పించుకోలేరు[12:25].
కదిలించడానికి, తొలగించడానికి దేవుడు చేసిన వాగ్దానం ఏమిటి?
సృష్టించిన వాటిని కదిలించడానికి, తొలగించడానికి దేవుడు వాగ్దానం చేశాడు[12:26-27].
Hebrews 12:27-29
కదిలించడానికి అవకాశం ఉన్న వాటికి బదులు విశ్వాసులు ఏమి పొందుతారు?
విశ్వాసులు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతారు[12:28].
విశ్వాసులు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి?
విశ్వాసులు దేవుణ్ణి వినయ భయభక్తులు కలిగి ఆరాధించాలి[12:28].
విశ్వాసులు ఎందుకు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి?
దేవుడు దహించే అగ్ని కనుక విశ్వాసులు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి[12:29].
Hebrews 13
Hebrews 13:1-2
తెలియని వారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కొందరు ఏమి చేసారు?
కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు [13:2].
Hebrews 13:3-4
విశ్వాసులు ఖైదులో ఉన్నవారిని ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి?
ఖైదులో ఉన్నవారితో కూడా వారునూ ఖైదీలై ఉన్నట్టే, వారు దౌర్జన్యానికి గురి అయిన వారిగా విశ్వాసులు వారిని జ్ఞాపకముంచుకోవాలి[13:3].
దేన్ని అందరూ ఘనపరచాలి?
వివాహం అంటే అందరికి గౌరవముండాలి[13:4].
జారత్వం, వ్యభిచారం చేసేవారిని దేవుడు ఏమిచేస్తాడు?
జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[13:4].
Hebrews 13:5-6
ధనాశనుండి విశ్వాసి ఏ విధంగా విముక్తుడు కాగలడు?
ధనాశనుండి విశ్వాసి విముక్తుడు ఎలా కాగలడంటే తనను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని దేవుడు చెప్పాడు[13:14].
Hebrews 13:7-8
ఎవరి విశ్వాసాన్ని విశ్వాసులు అనుకరించాలి?
దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని విశ్వాసులు అనుకరించాలి [13:7].
Hebrews 13:9-11
ఎలాంటి కొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు?
ఆహారం గురించి నియమాలు ఉన్న క్రొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు[13:9].
బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను ఎక్కడ కాల్చివేస్తారు?
బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు[13:11].
Hebrews 13:12-14
యేసు ఎక్కడ బాధలను అనుభవించాడు?
యేసు నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు[13:12].
విశ్వాసులు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు?
విశ్వాసులు యేసు నిందను భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళాలి [13:13].
ఈ భూమి మీద విశ్వాసులకున్న శాశ్విత నగరం ఏది?
ఈ భూమి మీద విశ్వాసులకు శాశ్విత నగరం ఏదీ లేదు [13:14].
దానికి బదులు విశ్వాసులు దేన్ని వెదకుతున్నారు?
రానున్న నగరం కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు [13:14].
Hebrews 13:15-19
విశ్వాసులు నిరంతరం దేవునికి అర్పించవలసిన అర్పణలేవి?
విశ్వాసులు దేవునికి స్తుతి యాగం ఎప్పుడూ అర్పిస్తూ ఉండాలి[13:15].
నాయకుల యెడల విశ్వాసులకు ఎలాంటి వైఖరి ఉండాలి?
విశ్వాసులు తమ నాయకుల మాట వినాలి, వారికి లోబడాలి[13:17].
Hebrews 13:20-21
విశ్వాసి జీవితంలో దేవుడు ఏమి చేస్తాడు?
దేవుని దృష్టికి ప్రీతికరమైన దానిని విశ్వాసి జీవితంలో జరిగిస్తాడు[13:21].
Hebrews 13:22-25
విశ్వాసులను దర్శించడానికి రచయిత ఎవరితో కలిసి వస్తాడు?
విశ్వాసులను దర్శించడానికి రచయిత తిమోతితో కలిసి వస్తాడు[13:23].